కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తొమ్మిదవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారు పెద్దపురము చేరుట- రుక్మిణి దేహమును వెదకి వచ్చి కానక దుఃఖించుట - పెద్ద్దాపురములోని వార్తలు - భీమవరమునకు ఁ బోవుట - అక్కడి విశేషములు - సుబ్రహ్నణ్యమును పిఠాపురము పంపుట.

రామరాజు నాఁటిరాత్రి మెల్లగా రాజశేఖరుఁడుగారిని కుటుంబసహితముగాఁ గొనిపోయి పెద్దాపురము చేర్చి , తిరుపతి రాజు చెఱువునకు సమీపముగనున్న సత్రములోదింపి, కాశీ ప్రయాణము మాని భీమవరములో నుండుడని బహువిధములఁజేప్పి , యొప్పించి తన దారిని బోయెను. ఒక్కనాఁటి ప్రయాణములోనే కూఁతురుపోవుటయు తక్కిన వారు బ్రాణములు దప్పించుకొని బయలఁబడినను కాళ్ళన్నియు వాచి యడుగు తీసి యడుగు పెట్టలేనంత దుస్థ్సితిలో నుండుటయుందలఁచుకొని యాత్రపేరన్న భయపడీ రాజశేఖరుఁడుగారు కొన్ని దినములలో భీమవరము చేరి యందుండి సమయమయినప్పుడు రాజు గారిని చూచుటకు నిశ్చయించుకొనిరి. రుక్మిణిపోయినదన్న విచారముచేతను మర్గాయాసమున బడలియుందుటచేతను వారారాత్రి వంటలు చేసుకొని భోజనము చేసినవారుకారు. వారికెవ్వరికిని కంటికి నిద్రయును పట్టలేదు. ఆరాత్రి నొకయుగముగా వేగించి రాజశేఖరుండుగారు కోడికూసినతోడనే లేచి తామొక్కరును బయలుదేఱి రుక్మిణిని వెదకుటకయి వేఁడిమంగలపు మార్గమున నడిచిరి.

అట్లు కొంతదూరము నడిచి రాజశేఖరుఁడుగారు పసులకాపరి బాలుర నడిగి మార్గమును గనుఁగొనుచు అడవిలోఁ బ్రవేశించి నాలుగు గడియల పొద్ద్దెక్కువఱకు దొంగలు కొట్టిన స్థలము చేరి యక్కడ రుక్మిణి దేహమును గానక యిసుకలో నెత్తురు చుక్కలను మాత్రము


</poem>

చూచి దుఃఖముతో నలుప్రక్కలను రుక్మిణిని వెదకికొనుచు దిరిగి యెందు నేమియుఁగానక మరల నెప్పటి చోటునకు వచ్చి, అచ్చటఁ గొంత సేపు పచ్చిక బయలును గూరుచుండి యాపచ్చికను తనకన్నీటితో దడిసి రుక్మిణి దేహము నేమృగములో యీడ్చుకొనిపోయి యుండునని నిశ్చియము చేసుకొని యీదుర్వార్తను గొనిపోయి యొట్లు భార్యతోను బిడ్డలతోను జెప్పుదునా యని కొంతసేపు దుఃఖించి మెల్లఁగా లేచి కాళ్లు తడఁబడ నడచుచు త్రోవ పొడుగునను రుక్మిణి యొక్క సౌందర్యమును సుగుణసంపదలను దలఁచు కొని కన్నుల నీరు నించుచు మధ్యాహ్నాము రెండు జాముల కేలాగుననో యింటికి దేహమునుచేర్చి నడవలో చాపమీఁద చతికిలఁబడి యేమో చెప్పఁబోయి మాటరాక పెదవులు నాలుకతో తడుపుకొనుచ నూరుకుండిరి. అప్పుడు మణిక్యాంబ తొందరపడి లోపలికి పరుగెత్తుకొనిపోయి కంచుచెంబుతో మంచితీర్థము తెచ్చి నోటి కందిచ్చి పయిటచెఱఁగుతో మొగముమీఁది జెమ్మటతడిచి విసనకఱ్ఱతో విసరుచు మగని మార్గాయాసమును కొంతవఱకు పోఁగొట్టెను. అంత నతఁడును కొంత ధైర్యమును నవలంవించి , కన్ను కొలుకులనుండి నీరు కాలువలు కట్టి గడియకొకమాట చొప్పున దుఃఖమును మింగు కొనుచు రుక్మిణి వార్తను జెప్పెను .అప్పుడందఱును పెద్దబెట్టున గొల్లుమని రోదనము చేయునారంభించిరి. అది విని సత్రపు బ్రాహ్మణుఁడును చుట్టుపట్ల వారు వచ్చి , వారికి యాపదను దెలిసుకొని నహు విధముల వారి నూరార్చి భోజనమునకు లేవఁదీసిరి . వారును విస్తళ్ళయొద్ద కూరు చుండి తినఁబోయిన మెతుకులు లోపలికి పోన కొంత సేపు కూరుచుండి విచారముతో విస్తళ్ళను వదిలి పెట్టి లేచిరి. అప్పుడు నూతి పెరటిలోనికిఁ బోయి వారు చేతులు కడుగుకొనుచుండగా కేకలు


వేయుచు వీధిలోనుండి పరుగులెత్తుచున్న మనుష్యుల యొక్క కలకలములు వినవచ్చెను. ఆ సందడియేమో చూతమని వచ్చునప్పటికి తూర్పు వయిపున దూరముగా మంటయును మిన్నుముట్టు పొగయును గనఁబడెను. ఇంతలో సత్రపు బ్రాహ్మణుఁడు వచ్చి కుమ్మరి వీధి తగులఁబడుచున్నది. చూచి వత్తుము రమ్మని రాజశేఖరుఁడు గారిని పిలిచెను. కాని యాతఁడెంత దయార్ద్ర హ్రదయండయినను కొండంత దుఃఖముతో మునిగియున్నవాఁడు గనుక, నిల్లు కదలుటకు మనసు గొలపక యూరకుండెను. సుబ్రహ్మణ్య మావఱకెన్నడు నాపదలు ననుభవించి యెఱుఁగని పసివాఁడగుటచే పరుల కాపద వచ్చినదన్నమాట వినినతోడనే తనయాపద మఱచి పోయి చేతనయిన యెడల వారికి సహాయ్యము చేయవలెనను నుద్దేశముతో తానా బ్రాహ్మణునితోఁగూడ బయలుదేఱి పోయెను. వారక్కడకు బోయి చేరునప్పటికి వేల కొలది జనులు వచ్చి వేడుక చూచుండిరి. కాని వారిలో నొక్కరయినను ఆర్పుటకు ప్రయత్న పడుచుండలేదు. ఇండ్లకు వేసిన వెదురు బొంగులు కణుపులయొద్ద పగిలి పెటపెటధ్వనులతో తుపాకులు మోగినట్టు మోగుచుండెను. ప్రాతతాటాకులు పయికి లేచి గాలిలో తారాచువ్వలను తలఁపించు చుండెను. ఎండల వేడిమిచేత సమీపమునున్న చెఱు వెండి పోయినందున ఇంకిపోఁగా మిగిలిన నూతలలోని నీళ్ళు చేదము నుగుటకయిన వీలులేక అంటుకొన్న యిండ్ల వాండ్రు పెణకలను లాగుటకు ప్రయత్నపడుచుండిరి. ఆ చేరువ యిండ్ల వారు తమ యింటి మీఁద తాటాకుల నయినఁదీసిన మరల వేసికొనుటకు కయి శ్రమ పడవలసివచ్చునని వానిని ముట్టుకోక, కాలుచున్న యిండ్లవారు వేఁడుకొన్నను ఇయ్యక దాచి పెట్టుకొన్న


కడివెడు నీళ్ళను బట్టుకొని నడికప్పలమీఁదికెక్కి తమయిల్లంటుకొను వఱలును నుండి నీళ్లకుండ నఖ్కడనే దిగవిడిచి రోదనముచేయుచు దిగుచుండిరి. మఱికొందరు తమ యిండ్లలోని సామానులు కాలిపోవునను భయముచేత వెలుపలికిఁ దెచ్చి వీధిలోఁ బెట్టుచుండిరి. వారొక వస్తువును దెచ్చి రెండవ వస్తువు కొరకు వెళ్ళునప్పటికి పరోపకారపారీణులయిన మహాత్ములు కొందఱు చూచువారు లేక వీధిలో పడియున్న వస్తువులను దీసి తమయింట జాగ్రత్త చేసికొనుచుండిరి.

ఇట్లు కుమ్మరపేట పరసురామప్రీతి యగుచుండఁ సత్రపు బ్రాహ్మణుఁడు సుబ్రహ్మణ్యమును దూరముగా నున్న యొక చెట్టు నీడకుఁదీసికొని వచ్చి యిండ్లు కాలుటనుగుఱించి ప్రసంగింప నారంభించెను.

సత్ర - ఈ ప్రకారముగా రెండు జాములవేళ ఇండ్లెందుకు కాలినవో కారణము మీకుఁదెలిసినదా?


సుబ్ర - కమ్మరావములు కాల్చునప్పుడు ప్రమాదవశమున నిప్పంటుకొని తాటాకులయిండ్లు గనుక కాలియుండవచ్చును. లేదా యెవ్వరయినను పోట్లాడి యిండ్లకు నిప్పు పెట్టియుందురు.
సత్ర-మీరు చెప్పిన రెండుకారణములను సరియయినవి కావు. ఈ గ్రామమున కేదో క్రొత్తగా నొక గ్రహము వచ్చి యీ ప్రకారము గా తగుల బెట్టునదికాని వేఱుకాదు.

సుబ్ర - నీవు నాతోనే యిప్పుడిక్కడకు వచ్చితివిగదా? ఎవ్వరిని అడిగి తెలుసుకోకుండ గ్రహమే యిండ్లు తగులబెట్టినదని నీవెట్లు రూఢిగా జెప్పఁగలవు?

సత్ర - మా గ్రామము సంగతి నాకుఁ దెలియదా? ఈ గ్రామమేటేట వేసవికాలములో నాలుగుసారులు తగులుపడును. ప్రతి పర్యా


యమును గ్రహమునకు జాతరచేసి యూరివారు దానిని సాగ నంపుచుందురు.ఇది గ్రహముచేతనే కాకపోయినపక్షమునకు వర్షకాలములో నేల తగులపడకూడదు?

సుబ్ర-యిండ్లుకాలుట గ్రహము చేతనే యయినయెడల, ఒక సారి జాతరచేసిబంపిన గ్రహము మరలవచ్చుటకుఁ గారణమేమి? వర్షకాలములో ఇండ్ల కప్పులు వానతో నానియుండును కనుక-

సత్ర-గారణములు గీరణములు నాకు ఁ నాదెలియవు. నాకెప్పుడును యుపయుక్తులన్నఁదలనొప్పి; కాబట్టి నేను జెప్పిన మాటల కడ్డమాడక సత్యమని నమ్ము. ఇప్పుడు నమ్మకపోయినను రేపు జాతరగు చుండఁగా కన్నులారా చూచినప్పుడయినను నమ్మెదవు.

ఈ ప్రకారము సంభాషణముగా జరుగుచుండఁగా అగ్నిహోత్రుడు తన చెలికాఁడగు వాయు దేవుని సాయముచే కుమ్మరపేటను సంప్ణూముగా దహనము చేసి త్రప్తి పొంది ప్రశాంతి నొందెను. ఇండ్లు కాలినవారును సొత్తుపోయినవరును విచారించుచుండగాఁ కొందఱు చుట్టు కాల్చుకొనుటకు కావలిసినంత నిప్పు దొరకినదనియు రేపు బొగ్గులు చవుకగా దొరకగలవనియు సంతోషించుచుఁబోయిరి. వారి వెనుకనే సుబ్రహ్మణ్యమును సత్రపుబ్రాహ్మణునితోఁ గూడ బయలు దేఱి సత్రమును జేరెను. ఈ లోపల నెవ్వరో రుక్మిణి యత్తవారియూరికిఁ బోవుచున్న బ్రాహ్మణుఁడొకడు సత్రములోనికి భోజనమునకు రాఁగా ఆమె దుర్మరణ కథను జాబు వ్రాసి యుత్త్తరక్రియ లను వేగిరము జరిగించుటకయి యాజాబునతనిచేతికిచ్చి రాజశేఖరుఁడుగారు వియ్యంకునకుం బంపిరి.

ఆమఱునాడు పగలు రెండుజాములవేళ రాజశేఖరుఁడుగారు భోజనము చేసి వీధియరుగుమీఁద గూరుచుండియుండఁగా,ఆ దారిని

తుడుములు డప్పులు మోగుచుండఁగాకొందఱు బండి మీఁద కుంభమును బెట్టుకొని త్రాగి కేకలు వేయుచు నడుచుచుండిరి; వారి వెనుకను జనసంఘము మూఁకలు కట్టి తమ చేతులలోని కఱ్ఱలతో త్రోవపొడుగునను ఇండ్ల మీఁద కొట్టుచుఁబోవుచుండిరి. ఆమూఁకలలో నుండి సత్రపుఁ బ్రాహ్మణుడు నడుమునకు బట్ట బిగించుకొని చేతిలో పెద్దకఱ్ఱ పెట్టుకొని దేహమంతటను జెమ్మటకాలువలు గట్టి వచ్చి సుబ్రహ్మణ్యము చేయిపట్టుకొని ." నిన్న నేను జేప్పునప్పుడు డబద్ధమంటివే, ఇప్పుడయిన నామాట నమ్మెదవా?" యని క్రిందకి లాగెను.

సుబ్ర--- ఉండు; నేను వచ్చెదను. ఈ యుత్సవ మెవ్వరిది?

సత్ర--- నిన్న చేప్పలేదా? ఇండ్లు కాల్చుగ్రహము గ్రామమునకు వచ్చినప్పుడు ఈ ప్రకారము చేయుదురు. ఒక చేతిలో వేపమండయు రెండవచేతితో వేపబెత్తమును పట్టుకొని ముందునదుచుచున్న యతనిని జూచునావా?

సత్ర---పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొన్నతఁడు కాఁడా? చూచినాను. అతఁడెవరు?

సత్ర-అతఁడే యీతంతు నడిపించుచున్న మంత్రజుడు; క్రొత్తగా వచ్చి యిండ్లు కాల్చుచున్న దేవతను కొంచెము సేపటికి వెళ్ళగొట్టును. అతని పేరు వీరదాసు.

సత్ర- ఇంటి కొకటి రెండేసి చేరల బియ్యము చొప్పున ఏడిండ్లలో అడిగి పుచ్చుకొని, క్రొత్త కుండ తెప్పించి గ్రామము న డుము వీధిలో పొయ్యిపెట్టి ఆకుండతో అడిగిపుచ్చుకున్న బియ్యము, మునగకూర, తెలగపిండి కలిపి జాము వరకు వంట చేసి , ఆకుండను దిగువ దించితుంచి నవీధి నలికి యెఱ్ఱముగు. తెల్ల ముగ్గు ,నల్లముగ్గు

రాజశేఖర చరిత్రము

పచ్చమ్రుగ్గు, ఆకుపసరు మ్రుగు తెచ్చి వానితో భేతాళుని స్వరూపము వ్రాసి భేతాళ యంత్రము వేసి పూజచేసి ధూపదీప ఫలనైవేద్యములు సమర్పించి ఏడేసి రావియాకులతో కుట్టిన యేడువిస్తళ్ళలో వండిన కుంభమును వడ్డించి, నడివీధిలో నొక కొయ్యనుపాతి దానికి భేతాళ యంత్రమునకు గ్రహమును వ్రాసిన యాఙనుగట్టి, ఈయన జరిగించవలసినవి యంతము జరిపినాడు. తరువాత మేము కుంభమును బండిలో నెత్తించుకొని యీకఱ్ఱలతో గృహలమీఁద కొట్టుచు ఊరేగుచున్నాము. ఇఁక గ్రామదేవత గుడివద్దకు వెళ్ళినతరువాత చిత్రము జరుగును.

సుబ్ర-ఆలాగయిన నేనుమి వచ్చెదను.
అని సుబ్రహ్మణ్యము వారివెంటఁ బయదెఱెను. అందఱును గ్రామ దేవత గుడిచేరినతరువాత యంత్రఙఁడు బిగ్గరగా గ్రామదేవత పేర వ్రాసిన యాఙను ఈప్రకారముగా జదివెను.

     యంత్రఙఁడైన వీరదాసుగారు ఒఎద్దాపురము గ్రామదేవత అయిన మరీడిమహలక్ష్మికి చేసుసినయాఙ-ఈగ్రామములో ఏదో గ్రహముచేరి యిండ్లు కాల్చుండఁగా ఈగ్రామమునకు దేవత వయియుండియు నీ వూరికే చూచుచుండుటకు నిమిత్తములేదు. ఆగ్రహమునకు నీతరపున కుంభము కట్టుబడి చేయించినాము. ఆ కుంభము ఆగ్రహమునకిచ్చి మఱుమన్యమయిన కొండలమీఁదికి దానిని పంపివేయవలసినది. ఆలాగున పంపించని పక్షమున, శ్రీభేతాళుని చేతఁగాని శ్రీహనుమానుల చేతగాని కఠినమనయినతాఖీదును పొందఁగలవు.

                  "శ్లో|| యక్షరాక్షస దుష్టానాం మూషగా శ్శలభాశ్శుకా
                             క్రిమికీట పంతగానా మాఙాసిద్ధిర్విభీషణ."

తొమ్మిదవ ప్రకరణము

అని చదివిన తరువాత, యంత్రఙఁడు వీడువిస్తళ్ళను వీడుచోట్ల వేయించి ఆయేడింట్లలోను కుభము పోయించి, బండితోలుకొనివచ్చిన వానిచేత నల్లకోడి నొకదానిని కోయించి దానిర క్తమును కుంభము మీఁద పోయించి,"ఓగ్రహమా! నీకుంభము పుచ్చుకొని కొండల మీఁదికి పో" అని యాజ్ఞాపించెను. అక్కడకు వెళ్ళిన వారందఱును చెఱువులో స్నానముచేసి యిండ్లకు వెళ్లిరి. సుబ్రహ్మణ్యమును బ్రాహ్మణునితో సత్రమునకు వచ్చెను.

ఇంటికివచ్చి సుబ్ర్ష్మణ్య మాసంగతి యంతయుఁ జెప్పినతరువాత రాజశేఖరుఁడుగారు కొంతసేపు జనుల మూఢత్వమును గుఱించియాలోచించి, ఇంతలో రుక్మిణి తలపునబాఱిన దుఃఖమువచ్చి ధైర్యము తెచ్చుకొవలెనని యెంతసేపు ప్రయత్నము చేసినను చేతఁగాక ఎక్కడకయిన వెళ్ళిన దుఃఖము మఱచిపోవచ్చునని తలంచి పట్టణమును జూచుటకు బయలుదేఱిరి. అతఁడు సత్రమునుదాఁటి నాలుగడుగులు నడచినతోడన యొక యింటివద్ద దంపతులిద్దఱు వాక్కలహామున కారంభించిరి; అంతకంత కాకలహము ముదిరి యొకరీతి యుద్ధము క్రింద మాఱినది భార్య తిట్లెక్కువ చేసినకొలఁది భర్త దెబ్బలెక్కువ చేయుచుండెను. మగని కేకలును భార్య యేడుపును విని వీధివారందఱును గుంపులు గుంపులుగా చూడవచ్చిరి. అంతమంది వచ్చినను వారిలో నొకరును వారిని వారింపనలెనని తలఁచుకొని వచ్చినవారు లేరు గనుక, అందఱును వేడుక చూచుచు మాత్రము నిలుచుండిరి. అంత రాజశేఖరుఁడుగా రాస్థలమును విడిచిపెట్టి ముందుకు సాగిరి. ఆవల మఱి నూరుబారల దూరము వెళ్ళఁగా ఒకచోట వీధియరుగు మీఁద పదిమంది పెద్దమనుష్యులుచేరి సభతీఱి కూరుచుండిరి. వారు నాగరికులు గనుక వారిప్రసంగ మెంత మనోహరముగ నుండునో విని

రాజశేఖ చరిత్రము

యానందింపవలెనని తలంచి రాజశేఖరుఁడుగారు వీధిలోనే నిలువఁబడి వినుచుండిరి. ఆసభికులందఱును తామైనను పొగడుకొనుచుండిరి; లేదా స్నేహితులు పొగడుటకు సంతోషమైనను బొదుచుండిరి; వారందరునట్లానందించుచుండఁగా రాజశేఖరుఁడుగారు తన్నవరును పొగడువారును పొగడుకొన్న వినువారునుగూడ లేనందునఁ జిన్నఁబోయి యిఁక నిందు నిలువఁగూడదనుకొని యక్కడినుండి బయలుదేఱిరి. అటుపిమ్మట నాతఁడు త్రోవపొడుగునను నలుగైదు రమణీయసౌధములను జూచి లోపలికిఁబోయి వానిని చూడవలెనని బుద్ధిపుట్టి గుమ్మమెక్కి తాను పండితుఁడననియు మేడను చూడ వేడుకపడి వచ్చితి ననియుఁ జెప్పి చూచెనుగాని ఆపట్టణస్థులందఱును ధనికులమీఁద మాత్రమే ప్రేమగలవారు గనుక ఆయన పాండిత్యమేమియు పనికిరాని మేడలయొక్క వెలుపటి భాగములను మాత్రము చూచి సూర్యస్తమయము కావచ్చినందున వెనుకకుమరలి తిన్నగ సత్రమువద్దకు చేరవలసివచ్చెను.


అప్పుడు వత్రపు బ్రాహ్మణుఁడు రాత్రివంటలేదు గనుక తీఱుబడిగా వచ్చి కూరుచుండి రాజశేఖరుఁడుగారితొ ముచ్చటలకు మొదలుపెట్టెను.

రాజ-మీపట్టణములో గొప్పపండితులున్నారా?


సత్ర- ఉన్నారు. ఆస్థానపండితుఁడయిన హరిపాపయ్యశాస్త్రులు గారు లేరా? ఆయన యెప్పుడు నెవ్వరితోను బ్రసంగింపఁడు గనుక సత్రములో జరిగిన సంతర్పణమునకు భోజనమునకు వచ్చినప్పుడు విశేషముగా మాట్లడకపోయిననౌ విశేషగా భొజిచినందున, ఆయన గొప్ప పండితుఁడనియే నేను నమ్మినాను.

తొమ్మిదవ ప్రకరణ

రాజ- ఆయనగాక మఱియెవ్వ రయిన నున్నారా?
                    
సత్ర - మా గురువులు భానుమూర్తిగారు వేదాంతశాస్త్రమందు
నిరుపమానమయిన ప్రజ్ఞ గలవాఁడు. నాకు మొన్న రోగము వచ్చినపుడు పుణ్యలోకము వచ్చుటకు తగిన సదుపాయమును చేసి పది రూపాయలను పట్టుకొని పోయినారు. ఆమఱునాఁడే దొంగవస్తు వొకటి ఆయన యధీనములో కనఁబడినంగిన దుర్మార్గులయిన రాజభటు లాయనను నిష్కారణముగా తీసుకొనిపోయి ఠాణాలో పెట్టినారు.

రాజ- గురువు లెప్పుడును శిష్యులకు దమవ్రేలితో స్వర్గమునకు త్రోవ చూపుచుందురు. కాని తాముమాత్రము స్వర్గమార్గము మాట యటుండఁగా దా మ్ను యీ లోకమునే త్రోవఁగానక గోతిలో పడుచుందురు.తార్కికుఁడును నగుట సులభము కాని యోగ్యుఁడగుట యంతసులభము కాదు. ఆమాట యటుండనిచ్చి మీ పట్టణములోని వారి స్థితిగతులను కొంచెము చెప్పుము.

సత్ర- కష్టపడి పనిచేయువారు తాము తెచ్చుకొన్నది అన్న వస్త్రాదులకు చాలక బాధపడుచుందురు; పాటుపడని సోమరిపోతులు పూర్వు లార్జించినమాన్యముల ననుభవించుచు విలువబట్టలను పంచభక్ష్యపరమాన్నములును గలిగి సుఖింపుచుందురు. తాత ముత్తాతల నాటి నుండియు పరువుతో బ్రతికినవారు కొందఱు జీవనము జరగక రాజు గారిని చిరకాలము నుండి యాశ్రయించుచున్నారు; కాని యెంత యనుసరించినను రాజు నిర్దయుఁడై చదువురాదని చెప్పి వారికి కొలువులియ్యకున్నాఁడు.

రాజ- అదృష్టవంతులము కావలెనని చేయు ప్రయత్న మొకటి తప్ప వేఱుప్రయత్నము లేనివా రెప్పుడును భాగ్యవంతులు కారు. భాగ్యదేవత మాఱుపని లేక తనకొఱకే కాచుకొనియున్న వారియొద్ద

 రాజశేఖర చరిత్రము

నుండి పాఱిపోయి, యింటఁగూరుచుండి యొడలు వంచి పనిచేయు వారినే చేరును. దాని కేమిగాని మిగిలిన వృత్తాంతమును చెప్పుము.

సత్ర - మా పట్టణమున ననేకులు రాత్రులు పురాణకాలక్షేపమును జేయుదురు. ఇక్కడకు దగ్గఱనే యొక పెద్దమనుష్యుఁడున్నాడు.ఆయన యెప్పుడును చదువక పోయినను తాటాకుల పుస్తకము నొకదానిని విప్పి సర్వదా ముందు పెట్టుకొని కూరుచుండును. మన పొరుగింట కాపురమున్న సముతుదారుగారి తల్లికి పురాణమన్న నెంతో యపేక్ష; ఆమెకు నిద్ర రానపుడెల్లను పురాణము చదువుమనును; పురాణ మారంభించిన తరువాత మంచి కథపట్టు రాఁగానే గోడను చేరగిలఁబడి హాయిగా నిద్రపోవును.

రాజ- ఇక్కడి వర్తకు లెటువంటివారు?

సత్ర- వర్తకులు తమ సరకులను మాత్రమే కాదు, మాటలను సహితము విశేషలాభమునకు విక్రయింతురు. అయినను వారి కెంతలాభము వచ్చినను, ఆలాభము మాత్రము వారి యాశకుఁదగి యుండదు. ఈ సంగతి నెఱిఁగి యిక్కడి పెద్దమనుష్యులు కొందఱు మొదట వారి వర్తకశాలకుఁ బోయి యొక వస్తువును గొని వారడిగిన వెల నిచ్చివేయుదురు; ఆపయిన చిన్నవస్తువు నొక దానిని అరవు తెచ్చించి, దాని సొమ్మును మఱునాఁడే పంపివేయుదురు; ఆటుపిమ్మట క్రమక్రమముగా పెద్దవస్తువులను దెప్పించి వానివెలలనుగూడ యుక్తసమయముననే యిచ్చివేయుదురు; ఈ ప్రకారముగా నమ్మకము కుదిరిన తరువాత పెండ్లి పేరో మఱియొక శుభకార్యముపేరో చెప్పి విలువవస్తువులను విస్తారముగా దెప్పించి కడపటఁ సొమ్మియక యపహరింతురు.

రాజ- ధనము నిమిత్తము ఈ ప్రకారముగా నక్రమమున కొడి ధట్టిన కీర్తిపోదా?

తొమ్మిదవ ప్రకరణము

సత్ర- కీర్తికేమి? దానిని కొనుట కయి ముందుగా ధనము సంపాదించినయెడల తరువాత నిమిషములో కావలసినంత కీర్తిని కొనవచ్చును;


రాజ- మీరాజుగా రెంతో ధర్మాత్ములనియు ప్రజలను న్యాయ మార్గమున నడిపించువారనియు ఎప్పుడును వినుచుందును. వారి రాజధానియైన యీ పట్టణమునందె యిట్టి ఘోరకృత్యములు జరుపుచుండగా రాజుగారు సహించి యూరుకున్నారా?

సత్ర- ఈపట్టణములో నిప్పుడేమి యక్రమములు జరుగుచున్నవి? మహారాజుగారి తండ్రిగారి కాలములో పూర్వము జరుగుచుండెడి ఘొరకృత్యములలో నిప్పుడు గుమ్మడికాయలో నావగింజంత పాలయిననులేవు. ఆ కాలములోనే మీరీ పట్టణమునకు వచ్చియుండిన యెడల మంచి బట్టలు కట్టుకొని పట్టపగలీప్రకారముగా వీధిలో నిర్భయముగా నడవఁగలిగి యుందురా? మా రాజుగారు సహస్రముఖముల కనుగొని నిత్యమును దుర్మార్గులననేకులను శిక్షించుచుండుటచేతనే యిప్పుడు నరహత్యలు మొదలయిన ఘోపాతకము లేనియు జరగకున్నవి.

రాజ- ఈపట్టణములో వేదవిహిత కర్మానుష్ఠానములు చక్కగా జరుగుచుండునా?

సత్ర- త్రికాలములయందు యధావిధిగా జరుగుచుండును.

రాజ- అట్లయిన, నీవిప్పుడు సంధ్యావందనము చేసినావా?

సత్ర- ఎన్నడో వడుగునాఁడు నేర్చుకొన్న సంధ్యావందనము మరచిపోక యిప్పటిదాఁక ఙాపక ముంచుకొన్న ననుకొన్నారా?

రాజ- పోని; అర్ఘమునయిన విడిచినావా?

సత్ర- ఒక్క అర్ఘమును మాత్రమేకాదు. సంధ్యావందనమంతయు విడిచినాను.

రాజశేఖర చరిత్రము

ఈ సంభాషణము ముగిసిన తరువాత ప్రొద్దుపోయినందున రాజశేఖరుఁడుగారు లేచి వెళ్ళి భొజనము చేసి, తరువాత నొక్కరు పరుండియాలోచించుకొని మోసములకెల్లను పుట్టినిల్లయిన ఈ పట్టణమును సాధ్యమయినంత శీఘ్రముగా విడిచిపెట్ట వలయునని నిశ్చయించుకొనిరి; కాఁబట్టి మఱునాఁడు ప్రాతఃకాలముననే యొకబండిని కుదుర్చుకొని వచ్చి, కుటుంబసహితముగా దానిమీఁదనెక్కి జాముప్రొద్దెక్కువఱకు భీమవరము చేరిరి. బండిమీఁద నెవ్వరో క్రొత్తవారు వచ్చివారిని యూరిలో నెల్లవారును జూడవచ్చి వారినివాసస్థలమును గుఱించియు, ఆగమన కారణమును గుఱించియు ప్రశ్నలు వేయఁజొచ్చిరి; చెప్పిన దానినే మరల నడిగినవారికెల్ల జెప్పలేక రాజశేఖరుఁడుగారును మాణిక్యాంబయు విసిగిపోయిరి. వారందఱు నట్లు పనికట్టుకొని వచ్చి ప్రశ్నలువేయుటకయి ముందడుగిడుచు వచ్చినను, రాజశేఖరుఁడుగారు తమకు బసకావలెనని యడుగఁబోగానే తిన్నగా విపించుకోక లేదని వెనుకంజవేయ నారంభించిరి. అంతట రాజశేఖరుఁడుగారు బండిని వీధిలో నిలిపించి, తాము బయలు దేఱి బసనిమిత్తమయి యెల్లవారి యింటికి బోయి రెండుజాములవఱకును నుడుగుచుండిరి. గాని వారిలో నొక్కరును ఆపూఁట పండుకొని తినుటకయినను స్థలము నిచ్చినవారుకారు. క్రొత్తగా వచ్చినవారు గనుక రాజశేఖరుఁడుగారు బసనిమిత్తమయి తిరుగునప్పుడు వీధులలో నిలువచేయఁబడియున్న పెంటకుప్పలను జూచి యసహ్యపడుచు వచ్చిరిగాని యెరువును కుపయోగించుటకయి పొరుగూళ్ళకు సహితము గొనిపోయి యమ్ముకొనెడి యాయూరివారి కవియే కనుక నున్న సంగతిని తెలిసికొలేకపొయిరి. అట్లాదుర్గంధమునకు ముక్కు మూసికొని నడచి గ్రామకరణము యొక్క యింటికిఁబోయి వారి యింటిపేరడిగి యేదోయొక ప్రతబంధుత్వమును తెలుపుకొని మొగ

తొమ్మిదవ ప్రకరణము

మోటపెట్టఁగా ఆతఁడాపూటకు తమయింట వంట చేసికొనుట కంగీకరించి, పొరుగునున్న యొక వైదిక బ్రాహ్మాణుని పిలిపించి రాజశేఖరుఁడుగారు కాపురముండుటకయి వారిపాత్రల్లిమ్మని చెప్పెను. అతడా యిల్లు బాగుచేయించినం గాని కాపురమున కక్కఱకు రాదనియు, తన భార్య సమ్మతి లేక యియ్య వలదుపడదనియు, పెక్కు ప్రతి బంధములను జెప్పెను; కాని రాజశేఖరుఁడుగా రాతనిని కూరుచుండ బెట్టుకొని పరోపకారమునుగూర్చి రెండుగడియలసేపు వుపన్యాసముచేసి యిల్లు బాగు చేయించుట పేరుచెప్పి రెండు రూపాయలు చేతులోఁబెట్టిరి. చెప్పిన వాక్యము లన్నిటికన్నను చేతిలోఁబెట్టినసొ మ్మాతినిని నిమిషములో సమాధాన పఱిచింది. కాబఁట్టి రాజశేఖరుఁడుగారు వెంటనేబోయి బండిని తోలించుకొని వచ్చి యాపూట కిరణములోపల వంటచేసికొని భోజనముచేసి దీపములవేళ సకుటుంబముగా ఆగ్రామ పురోహితులయింటఁ బ్రవేశించిరి. ఆయిల్లు పల్లపునేలయందు గట్టఁబడి యున్నది; గవాక్షముల బొత్తిగా లేనేలేవు; వాస్తుశాస్త్రప్రకారముగా దూలములు యజమానునిచేతి కందులాగునఁ గట్టబడిన యాయింటి గోడలేపొట్టివి గనుక గుమ్మము లంతకన్న పొట్టివిగానుండెను. కాఁబట్తి యొక్కడను వంగినడవని వారుసహిత మక్కవంగి నడుచుచుందురు; లోపలి గోడలెత్తుగా నుండక పోయినను దొగలభయముచేతఁ గాఁబోలును గాలివచ్చుటకు వలను పడకుండ దొడ్డిచుట్టును నున్న గొడలు మాత్రము మిక్కిలి యెత్తుగాఁబెట్టఁబడినవి! కాని యింటివా రాయిల్లు విడిచి పెట్టి వెళ్ళిన తరువాత చూచువారు లేక కూలి యిప్పుడు మొండిగోడలుగా నున్నందున లోపలికి గాలివచ్చుట కవకాశము కలిగినది. పూర్వమిల్లుగలవా రందున్నప్పుడెవ్వరో యొకరు సదారోగ బాధితులైయుండుచు వచ్చినందునను గృహధిపతియొక్క కూఁతు రందులోనే

రాజశేఖర చరిత్రము

లేదు. నేను మాటాడ మొదలుపెట్టినతోడనే మంచము దగ్గఱనున్న కుక్క యొకటి మొఱగ నారంభించింది. కాఁట్టి దానితోనే నేను మాట్లాడినా ననుకొన్నాను. కాని యది యేమిచేప్పినదో దాని భాష నాకు రానందున గ్రహింపలేక పోయినాను. ఇట్లు దాని యభిప్రాయము తెలియక యనుమానించుచు నిలుచుండ, రాజు తన సేవకుని నొక్కనిఁ బిలిచి నాకు దెలిసిన భాషతొ ఈ బ్రాహ్మణు నావలికిఁబంపివేయు మని యాఙపించెను . జరగఁబోవుసంగతిని గ్రహించి వాడు రాకముందు మృదువుగా నేనే వెనుకకు మరలి తిన్నగా యిటికి వచ్చితిని

అంతటిసన్మానము జరిపించిన రాజుగారిని మరల వెళ్ళి యాశ్రయింప బుద్ధి పుట్టక రాజశేఖరుఁడుగారు ముందు జీవనోపాధి యెట్లు కలుగునా యని యాలోచించి సుబ్రహ్మణ్యము నెక్కడైనను బంపవలెనని తలఁచి మాణిక్యాంబతోఁ జెప్పి యామె యనునుమతిని కొమారునితో నాసంగతి జెప్పిరి. ఆతఁడును పరమ సంతొషముతో నొప్పుకొన్నందున, అందఱును నాలోచించుకొని చివరకతనిని పిఠాపుమునకుఁ బంప నిశ్చయించుకొనిరి ప్రయాణము నిశ్చయించిన దినమున రాజశేఖరుఁడు గారు కుమారుని బిలిచి యనేకవిధముల నీతులు బోధించి బుద్ధులు చెప్పి, న్యాయమార్గమునఁ బ్రవర్తింపవలసిన దని పలుమారులు జెప్పి, నమస్కరించిన కుమారుని నాశీర్వదించి యయిదు రూపాయలను కర్చునిమిత్తమిచ్చిరి; మాణిక్యాంబయు దగ్గరనున్న దానిలో నేమియు లోపము చేయక కావలసిన దీవనలిచ్చెను. సుబ్రహ్మణ్యమును వారినెడబాయవలసిన వచ్చినదిగదా యని కంటఁ దడిపెట్టుకొని చెల్లెలిని ముద్దాడి తనకిచ్చిన రూపాయలలో నొకదానిని చేతిలోఁబెట్టి వారివద్ద సెలవు పుచ్చుకొని వెనుకతిరిగి శూచుచు దారిసాగి నడచెను.