కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-పదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదవ వ్రకరణము

శోభనాద్రిరాజుతొ మైత్రి– సీత వివాహ ప్రయత్నము– రామమూర్తి గారి మరణ వార్త—–విరొధము –––రాజశేఖరుడుగారిని చరసా బెట్టుట––సీత నెత్తుకొనిపొవుట.

ఒక యదివారమునాఁడు నాలుగుగడియల ప్రొద్దెక్కినతరు వాత రాజశేఖరుఁడుగారు పెద్దాపురమునకుఁబోవుచునడగ ,శోభనాద్రిరాజు వీధియరుగుమిదనున యున్నతాసవముఁబోవు చున బ్రహ్మణూని దిసికొని రమ్మని చెపెను వాఁడును మహావేగముగాఁబోయి“ రాజగారి సెలవయినది రమ్మని పిలిచెను”రాజశేఖరుఁడుగా ఱేట్లయిన నాతని యనుగ్రహము సంపదించుకొవలె ననియే కోరుచునవరు గనుక పిలిచినదే చాలునని వేళ్ళ అతడు చుపిన బల్ల మిద కూరుచుండీరి .

శోభ—ఈనడుమ బీమవరమువచ్చి సోమభట్లుగారిలోపల కాపురము న్న వారు మిరే కాదా!

శోభ— జ్ఞపకమున్నది . మేమప్పుడు మిక్కిలి తోందరపనిలొ నుండి మిమీఁద కోపపడినము. అంతే కాకుండ అ వచ్చిన వారు మీ రని మాకప్పుడు తెలియలెదు . మీ పోష్యవర్గములో చేరిన వారెంత మంది యెన్నరు ? పెండ్లికెదిగిన కొమా ర్తె కూడ ఉన్నదఁటకాదా?

రాజా— ఇపుడున్నది వివాహము కావసిన యాకూతురొక్కతయే , నా పెద్దకూమర్తె మొన్న త్రొవలొ దోంగలు కొట్టినప్పుడు చనిపొయినది. ఏదయిన నొక యుద్యొగమును సంపాదించుట

రాజశేఖర చరిత్రము

కయి నాకుమారుని ఇక్కడ వచ్చిన తరువాతనే పిఠాపురమునకు పంపినాను

ఈప్రకారము సంభాషణము జరుగుచుండఁగా కొంతమంది పెద మనుష్యులు వచ్చి ఆరుగుమీఁదనున్న బల్ల మీఁద గూరుచుండిరి. అప్పుడు రాజుగారు వారితో తాను చేసిన యద్భుతచర్యలను గురించి బహువిధముల ప్రశంసించిరి. చెప్పిన మాటలలో నేమియు చమత్కరము లేకపొయిన, అక్కడ నున్నవా రాగోపమును నవ్వుతో మాత్రము పూర్తిచేసిరి. వారందఱు నవ్వినపుడు తామొక్కరు నూరకున్న బాగుండదని నిజముగా నవ్వురాకపోయినను తెచ్చుకొని వారునవ్వినప్పుడెల్లను రాజశేఖరుఁడుగారును నవ్వుచు వచ్చరి. ఆరాజు తన్ను రాజశేఖరుఁడుగారు తెలిసినవాఁడనుకొట కయి ప్రతివిషయంలోను గొంచెము కొంచెముగా మాట్లాడి యన్నియు దెలిసిన వానివలె నటింపసాగెను. తన కేమియుఁ జెప్పుటకు తోచనప్పుడు అక్కడ నున్నవారి మొగములవంకఁ జూచి నవ్వుచువచ్చెను. అప్పుడాయన పాండిత్యమును సభవారందఱు నూరక పొగుడు చుండిరి.! ఇంతలోఁగొందరు గాయకులు వచ్చి సంగీతము
పాడుట కారంభింపని యెడల, వారిపొగడ్తలు సభ చాలించువరకు నుండుననుటకు సందేహములేదు. వారు పాట నారంభింపఁగానే యెల్లవారికిని ఇండ్లమీఁద ధ్యానము పాఱనారంభించినది. అయినను రాజుగా రేమనుకొందురో యని యందఱును కొంతసేపు శ్రమచేసి మాటలు చెప్పుకొనుచి నచటనే కూరుచుండిరి. ఆపాట వినివిని తాళలేక కడపట నొక పెద్దమనుష్యుడు చొరవచేసి, "వారు మంచివాఅని యదేపనిగా శ్రమయిచ్చుట న్యాయముకాదు. కాఁబట్టి యీపాటిలి పాట చాలింప ననుఙ యియ్యవచ్చు"నని చెప్పెను. సభవారందరును అది యుక్తమని యేకవాక్య ముగాఁ పలికిరి. అంతట సభచాలించి యంద~ఋఊణూ సెలవు పుచ్చుకొని

       పదవ ప్రకరణ

వెళ్ళఁబొవునపుడు రాజగారు రాజశేఖరుఁడు గారిని ‘అప్పుడప్పుడు వచ్చి దర్శన మిచ్చుచుండెదఱుకాదా‽’యని యడిగిరి, ‘ముఖ్యముగా వచ్చిదర్శనము చేసికొనుచుండెద’నని చేప్పి , ఆ యన నాటీకి పెద్దాపురము ప్రయాణము మానుకొని పదిగడియల ప్రొద్దెక్కువఱ కిల్లుచేరిరి.

నాఁడు మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుఁడు గారు ప్రాత్మకాలమునను సాయంకాలమున గూడఁబొయిశొభనద్రిరాజ గారి దర్శనము చేయుచుండిరి.ఆతాజగారును మిక్కిలి దయతోనాతని నదరించి మంచిమాటలతోసంతొషపేట్టుచుఁడిరి. ఆయన రాజకార్య విషయమైన పనిని జూచుచుండు నపుడు సహితము రాజశేఖరుఁడు గారువద్దనె యుండీ సంగతి కనుగొనుచుందురు; గ్రామాదులలొని ప్రజలు వ్రాసికొన్నావిజపన పత్రికలను కొలువుకాండ్రుచదువునపుడు వ్రాసినకొన్నామనవి కడపట రెండుమూడు పంక్తులలో మాత్రమే యున్నను బిరుదాపళిమాత్రము మొదటి రెండు పత్రముల లొను పూర్ణముగానిండియుండుట తెలిసికొని రాజుగరికి గ్రమములొని కాపులకనాబిరుదు వేళ్ళేవిశేషముగా నుండుట కానందించుచు వచ్చిరి రాజకార్యపుఁబని యైనతోడెనే రాజూగరు సబవారితోముచ్చత కారంబింతురు.ఆతఁడెంతసిపు చెప్పినను తన ప్రతాపమునే చెప్పుచుండును;ఆకధ లన్నియు నావఱకు పదిసారులు విన్నవే అయినను మొదటిసారి సవ్వినట్టె ప్రతిపర్యాయమును సభలోని వారందఱును నవ్వుచుందురు; ఆందులోఁ గొందఱు స్తొత్రపాఠములను జదిని రాజుగారిమనుస్సును సంతోషపెట్టుచుందురు; అందఱును ముఖస్తుతులు చేయుచుండఁగా తా యొక్కరునుమాత్ర మూరకుండుట న్యాయము కాదని యెంచి, రాజశేఖరుఁడుగారు స్తుతివిద్యయందు పాండిత్యము చాలనివారు గావున నసత్యమునకు

రాజశేఖర చరిత్రము

భయపడి యాఁతడిమఱి యేవషయమునందును స్తోత్రార్హుఁడు కానందున మంచి బట్టలను కట్టుకొనుటకు కొంత శ్లాఘించిరి. ఇట్లు తరుచుగా రాజశేఖరుఁడుగారు రాజస్ధానమునందు మెలఁగుచు వచ్చుటచేత వే ఱులాభమును పొందకపోయినను సభలో పదిమందిని నవ్వించు మార్గమును మాత్రము నేర్చుకొనిరి; కాఁబట్టి యప్పటి నుండియుఁ దా మొకమాటను చెప్పుచు ముందుగాఁదామే నవ్వదువచ్చిరి. అదిచూచి యందఱును నవ్వుచుండిరి. రాజుగారప్పుడప్పుడు ధర్మోపన్యాసముల సహితము చేయుచుందురు. లోకములోనెవ్వరెన్నిపాట్లుపడినను భోజనమునిమిత్తమే కాఁబట్టి, ఆవిషయమున నేమిచేసి ననుదోషములేదని వాదించుచుండిరి. ఈసిద్ధాంతము మనస్సుననాఁటియుండుట చేతనేకాఁబోలును రాజుగారుప్రతిదినమును లేచినదిమొదలుకొని పదిగడియలవఱకు ప్రాతర్భోజనమునకు వలయుసంభారములనిమిత్తమే ప్రయత్నము చేయుచుందురు; భోజనమయినది మొదలుకొని మధ్యాహ్నము ఫలహార మేమిదొరకునాయని చింతించుచుందురు; ఫలహారమయి నప్పటినుండియు రాత్రిభోజనమునకు వ్యంజనము లేవికలవని యాలోచించుచుందురు.

ఈ రాకపోకల చేత రాజశేఖరుఁడు గారికి రాజుగారివద్ద మిక్కిలి చనువుగలిగెను. ఆ సంగతినెఱిఁగి బ్రాహ్మణులు రాజశేఖరుఁడుగారి యింటికిఁ బోయి పలువిషయములు ముచ్చట్ంచుచు, వారిలోఁ గొందఱుసీత నెవ్వరికిచ్చి వివాహము చేయఁదలఁచినారని మాటవెంబడి నదుగుచుందురు;ఇప్పుడు చేతిలో డబ్బులేనందున, ఎవరికిచ్చి వివాహముచేయుటకు తలపెట్టుకోలేదని యాయన బదులు చెప్పుచుండును. ఒకనాఁడురాజశేఖరుఁడుగారు భోజనముచేసి కూరిచుండియుండఁగా బొమ్మగంటిసుబ్బారాయఁడను సిద్ధాంతి వచ్చిజ్యోతి పడవ ప్రకరణము 113

శాస్త్రమునందలి తన యఖండ పాండిత్యమును దానివలన దనకు గలిగిన గౌరవమును పొగడుకొని ఆంధ్రదేశమునందలి గొప్పవా రందఱును జాతకములను తనకుబంపిన ఫలములను దెలిపిసి కొనుచుందురని చెప్పి దానికి నిదర్శనముగా బెక్కు జాతక చక్రములను విజయనగరాది దూర ప్రదేశముల నుండి ప్రభువులు వ్రాసినట్టున్న జాబులను జూపి,ఫలము జెప్పుట కయి ఆయనయొక్క జన్మపక్షత్రము నుకూడ తెమ్మని యడి గెను.


రాజ----నాకిప్పుడు జ్యొతిష శాస్త్రమునందలి నమ్మకముపోయి నది; నావద్ద కొల్లగా ధనము పుచ్చుకొని వ్రాసిన మావాండ్ర జన్మ పత్రికలలో ఫలము లేవియు నిజమయినవి కావు ;మేము కాశీయాత్రకు బయలుదేరు నపుడు మంచి ముహూర్తము పెట్టుకొని యిల్లు బయలు దేరెనను త్రోవలో గొప్ప యాపదలు వచ్చినవి ; కాబట్టియే మొన్న పెదాపురమునుండి యిక్కడకు వచ్చునపుడు ముహూర్తము చూచు కొనకయే బయలు దేఱినను.


సుబ్బ---నాది అందఱి జ్యౌతిషముల వంటిది కాదు ; నేను చెప్పిన బ్రశ్న కాని పెట్టిన ముహూర్తముకాని యీ వర కాదు;నేను చ్చెపిన బ్రశ్న కాని పెట్టిన ముహూర్తముకాని యీవర కెన్నడును తప్పి పోలేదు; నేను జాతకములో నెన్ని యక్షరములు వ్రాయుదునో యన్ని యక్జ్షరములును జరిగి తీరవలెను.


రాజ---మిరు చెప్పెడు ఫలము నిజమ్యెనను నాకక్కరలేదు.నాకు ముందు మేలుకలుగుననెడి పక్షమున ,వచ్చెడుననుకొన్నది రాకపొయెనని మిక్కిలి వ్యసమునగా నుండును ;నిజముగా వచ్చెనేని, ఆవఱ కేదాని నెదురు చూచియుండటంజేసి వచ్చినప్పు డధిక సంతోషము కలుగదు.కీడు గలుగునని చెప్పెడు పక్షమున నిజముగా వచ్చి నప్పుడు దు:ఖపడుట యటుండగా ఇప్పటినుండియు విచారపడవలసి వచ్చును; ఒక వేళ రాకపోయెడుపక్షమున వ్యర్థముగా లేనిపోని చింత పడవలసివచ్చును; ఆవట్టి విచారముచేతనే కీడు గలిగినను గలుగ వచ్చునుగాని, సంతోషపడుటచేత మేలుమాత్రము కలుగనేరదు.

సుబ్బ - పండితులై యుండియు మీ రాలాగున చెలవిచ్చుట బావ్యముకాదు. పెద్దలుచెప్పిన శాస్త్రములయందు మన మెప్పుడు గుఱియుంచవలెను. ఆమాట పోనిండి; మీకుమార్తెకు పెండ్లియీడు వచ్చిన ట్టున్నది; ఇంకను వివాహప్రయత్నము చేయక యశ్రద్ధగా నున్నారేమి?

రాజ - ఆవిషయ మైయే నేనును విచారించుచున్నాను. అనుకూల మయిన సంబంధము కనబడలేదు; చేతిలో సొమ్ము సహితము కనబడదు. మీఎఱుక నెక్కడనైనను మంచిసంబంధము లేదుగదా?

సుబ్బ - సం-బం-ధమా? ఉన్నదికాని, వారు గొప్పవారు! మీకు సర్వవిధముల ననుకూలముగా నుండును.

రాజ - వారిదేయూరు? మన మేమిప్రయత్నముచేసిన ఆసంబంధము లభ్యమగును.

సుబ్బ - వారిది పెద్దాపురము. వారియింటిపేరు మంచిరాజు వారు; వారికి సంవత్సరమునకు రెండువేలరూపాయలు వచ్చు మాన్యము లున్నవి; ఇవిగాక వారియొద్ద రొక్కముగూడ విస్తారముగా నున్నదని వాడుక. చిన్నవాడు ప్రథమవరుడు; స్ఫురద్రూపి, అతనికొక్క యన్నగా రున్నారుగాని, ఆయనకు సంతానములేదు. ముందు సమస్తమునకును ఈచిన్నవాడే కర్తయగును. పెండ్లికొమారునిపేరు పద్మరాజుగారు. ఆసంబంధము మన శోభనాద్రిరాజుగారు ప్రయత్నముచేసినపక్షమున మీయదృష్టబలమువలన రావలెను గాని మఱియొకవిధముగా మీకు లభింపదు. పదవ ప్రకరణము

రాజ-ఆలా గయినపక్షమున, ఈసంగతిని ముందుగా మీ రొకసారి రాజుగారితో ప్రసంగించి వారిభిప్రయము తెలిసి కొనెదరా?

సుబ్బ-నేను ముందు వెళ్ళికూర్చుండెవను, తరువత మీరు కూడ రండి. మీరుఁడఁగానే మాటప్రస్తావమున మీకొమార్తె వివాహవు సంగతిని తెచ్చిచూచెదను. దానిమీఁదకొని రాజగరితొ నొక్కి మనివి చేయవలెను.

అనిచెప్పి సుబ్బరాయఁడుసిద్ధాంతి బయలుదేఱితిన్నగాశోభ నాద్రిరాజుగారియింతికిఁబోయికూరుచుండెను. తరువత మఱినాలుగు నిమిషములకు రాజశేఖరుఁడుగారును వెళ్ళిచేరిరి. అప్పుడు కొంత సేపు పలువిధముల ప్రసంగములుజరిగినమీఁదట రాజశేఖరుఁడు గారు కొమా ర్తెసంగతి సిద్ధాంతి మెల్లగాఁ దెచ్చెను.

సుబ్బ-రాజశేఖరుఁడు గారికి పెండ్లికావలసిన కొమా ర్తెయున్న సంగతి దేవరవా రెఱుగుదురా?

శోభ-ఎఱుఁగుదుము;ఈమధ్య విన్నాము. ఆచిన్నదానికిఁబెండ్లి యీడు వచ్చినదా?

సుబ్బ-ఈమధ్యాహ్నమే నేను చూచినాను.ఇక చిన్న దానిని నలిపి యుంచరాదు; మొన్న మాబంధువుల గ్రామములో నింతకంటె చిన్నపిల్ల సమర్తాడినది.

శోభ-ఎక్కడనైన సంబంధము వచారించినారా?

సుబ్బ-పెద్దపురములో మంచిరాజు పద్మరాజుగా రున్నారు. తమరు ప్రయత్నముచేసెడిక్షమున, ఆ సంబంధ మనుకూల పడ వచ్చును.

శోభ-అవును. అది దివ్యమయిన సంబంధమే కాని, వారీ చిన్నాదానిని చేసికొనుట కంగీకరింతురా? రాజశేఖర చరిత్రము

రాజ-తమ రేగునము ప్రయత్నముచేసి మాకీమేలు చేయకతప్పదు. తమరు సెలవిచ్చిన తరువాత వారు మఱియొక విధముగాఁ దలఁచుకోరు.

శోభ-ఈపూట పద్మరాజుగా రిక్కడకే వచ్చినారు. మీ యెదుటనే వారితో చెప్పెదము. ఓరీ! స్వామిగా! మనబావరితో మంచిరాజు పద్మ రాజుగారు వచ్చి మాటాడుచున్నట్టున్నారు. వెళ్ళఁబోవునప్పుడొక్కసారి యవశ్యముగా దర్శనమిచ్చి మఱి వెళ్లుమన్నావని మనవిచేసి రా.

లంపతావాఁడు వెళ్లిన కొంతసేపటికి ముప్పదియేండ్ల యీడుగల నల్లని యొక పెద్దమనుష్యుఁడు చలువచేసిన తల్ల బట్టలు కట్టుకొని పది వ్రేళ్ళను ఉంగరములును, చేతులను మురుగులను, మొలను బంగారపు మొలత్రాడును పెట్టుకొని వచ్చెను. శోభనాద్రిరాజుగారు దయచేయుఁడని మర్యాదచేసి యాయనను యదావునఁ గూర్చుండ బెట్టుకొనిరి.

పద్మ-తమ సెల వయినదని సామిగాడు వర్తమానిము చెప్పి నందుకు, వెళ్లుచున్నవాడను మరలి నచ్చినాను. నాతో నేమయిన సెలవియ్య వలసినది యున్నదా?

శోభ-వీరు కొంతకాలమునుండి మనగ్రామములో నివసించి యున్నారు. మిక్కిలి దొడ్దవారు. వీరిపేరు రాజశేఖరుఁడుగారు. మీరు సంబంధముకొరకు విచారించుచున్నారని దెలిసినది. వీరి కొమార్తె యున్నది చేసికోరాదా? పిల్ల మిక్కిలి లక్షణపతి. వీరిది మొదటి నుండియు మంచి సంప్రదాయసిద్ధమైన వంశము.

పద్మ-పలువురు పిల్లనిచ్చెదమమి తిరుగుచున్నారు. నాకీవఱకును వివాహము చేసికోవలెనని యిచ్చ లేకపోయినది; ఆలాగే కాని యెడల, నాకు చిన్నతనములోనే వివాహమయి యీపాటి సంతాన పదవ ప్రకరణము

యోగముకూడ కలుగదా? మీవంటివా రందరును మెదలు విఱచుట చేత విధి లేక యొప్పుకోవలసి వచ్చినది. అయినను తమరీలాగున సెలవిచ్చినారని మానాన్నగారితో మనవిచేసి యేమాటయు రేపు విశద పఱిచెదను.

శోభ-ఈసారి నామాట వినకపోయినయెడల, మీస్నేహమునకును మాస్నేహమునకును ఇదే యపసానామ్ని మీయన్నగారితో నేను మనవి చేయు చున్నానని ముఖ్యముగా చెప్పవలెను.

పద్మ-చిత్తము. ఆయనమీయాజ్ఞను మీఱి నడవరు. సెలవు పుచ్చుకొనెను.

బద్మరాజు వెళ్ళిపోయినతరువాత సంబంధమును గురించి గట్టి ప్రయత్నము చేయవలయునని రాజశేఖరుఁడుగారు శోభద్రిరాజు గారిని బహూవిదములఁ బ్రార్ధించిరి. ఆతఁడును తన యావచ్చక్తిని వినియోగించి యీసంబంధమును సమకూర్చెద నని వాగ్దానము చేయుటయే గాక, ఆసంబంధము దొరికినయెడల రాజశేఖరుఁడుగారికి మునుపటికంటెను విశేష గౌరవమును బ్రసిద్ధియు గలుగఁ గలదని దృఢముగాఁ జెప్పెను. అంతటప్రొద్దుక్రుంకినందున రాజుగారు భొజనము నిమిత్తమయిలేచిరి. తక్కినవీ రందరును సెలవు పుచ్చుకొని యెవరియిండ్లకు వారు పోయిరి.

మఱునాఁడు నాలుగు గడియలప్రొ ద్దెక్కినతరువాత రాజశేఖరుఁడుగారు వెళ్ళినతోడనే, శోభనాద్రిరాజుగారు చిఱునవ్వు నవ్వుచు లోపలి నుండివచ్చి "నిన్న మనముపంపించిన వర్తమానమునకు రాత్రియే ప్రత్యుత్తరము వచ్చినదినుండీ" యని చెప్పెను. "ఏమనివచ్చినది? అని రాజశేఖరుఁడుగా రత్యా తురతతో నడగిరి. "నే సంతఖండితముగా వర్తమానము పంపిన రాజశేఖర చరిత్రము

తరువాత వారు మఱియొకలాగునఁ జెప్పెదరా? చేసికొనియెన మని జాబువ్రాసిపంపివారు" అని యొక తాటాగుచుట్తను చేతి కిచ్చెను. దానిని చదువుకొని రాజశేఖరుఁడుగారు పరమానంద భరితులయిరి. అప్పుడే రాజుగారు సుబ్బారాయఁడుసిద్ధాంతిని పిలిపించి వివాహమునకు ముహూర్తము పెట్టుఁడని నియమించిరి. ఆతఁడు పంచాంగమును జూచి యాలోచించి వైశాఖ బహుళసప్తమి గురువారము రాత్రి 24 ఘటికల 3 విఘటికలమీఁదట పునర్వసు నక్షత్ర మేష లగ్నమును ముహూర్తము నుంచెను. వెటనే పెండ్లిపనులు చేయుట నారంభింపవలసినదని చెప్పి మీకు ఖర్చున కిబ్బందిగా నున్నయెడల ప్రస్తుత మీనూరు రూపాయలను పచ్చుకొని మీచేరిలో నున్నప్పుడు నెమ్మదిగాతిఅర్చవచ్చునని శోభనాద్రిరాజుగారు పెట్టెతీసి రూపాయాలను రాజశేఖరుఁడుగారిచేతిలోఁబెట్టి 'సొమిగా' అని సేవకునోక్కనింబిలిచి "నీవీ వారముదినములును పంతులుగారితోకూడి నుండి వారేపనిచెప్పినను చేయుచుండును". అని చెప్పి యొప్పగించెను. రాజ శేఖరుఁగారు వానినితేసికొని యింటికి బోయిరి.

ఆదినము మొదలుకొని ప్రతిదినమును రాజ శేఖరుఁగారు పెద్దాపురమునకు వెళ్లుచు కందులుమొదలిగాఁ గలన్ వానినెల్ల కొని తెచ్చి ఆదివారపుసంతలో కూరగాయలను దెప్పించచిరి. ఈవిధముగా పెండ్లిపనులను సాగంచుచు పంచమినాఁడు సీతను పెండ్లి కూఁతును గాజేసిరి. ఇఁక రేపు రాత్రి పెండ్లి యనగా షష్ఠినాఁడురాత్రి చేతిలో కఱ్ఱపట్టుకొని గొంగళి మునుగు పెట్టుకొని యొక కూలివాడు చీఁకటిలో వచ్చి రాజమహేంద్రవరమునుండి యుత్తరము తెచ్చినానని యొక తాటాకు చుట్టను సీతచేతికిచ్చెను. ఇంతలో మాణిక్యాంబ లోపలినుండి వచ్చి సీతచేతిలోని యుత్తరమును పుచ్చుకొని రాజ పదవ ప్రకరణము

శేఖరుఁడుగారు పెద్దాపురము వెళ్ళి రాలేదనియు వచ్చెడి సమయ మైనదిగనుక వచ్చినదాఁకవీధిలో నిలుచుండవలసిన దనియుఁ జెప్పి లోపలికిఁబోయెను. రాజశేఖరుఁడు గారు వేగిరము రాఁకపోఁగా కూలి వాఁడు తొందరపడుచుండుటను జూచి మాణిక్యాంబ వానకి తవ్వెడు బియ్యమును డబ్బును ఇచ్చి పంపివేసెను. ఆవెనుక సీత 'నాన్న గారు వచ్చుచున్నారేమో చూచివచ్చెద ' నని వీధి గుమ్మములోనికి వెళ్ళి ఇప్పుడువచ్చిన కూలివాఁడు కఱ్ఱదిగఁ బెట్టి పోయినాఁడని యొక చేతి కఱ్ఱను దెచ్చి వాఁడు మరల వచ్చి యడిగినప్పు డియ్యవచ్చనని పడక గదిలో మూలను బెట్టెను.

కొంత సేపటికి రాజశేఖరుఁడుగారు వచ్చి భార్య రాజమహేంద్ర వరమునుండి యుత్తరము వచ్చిన దని చెప్పి చేతికియ్యఁగానే దీపమువెకుతురునకుఁబోయిసగము చదివి చేతులు పడఁకఁగా జాబును క్రిందపడవయించి కన్నులనీరుపెట్టుకొని నారంభించిరి. జాబులో నేమి విషయములున్నవో వినవలెనని చేరువను నిలువఁబడిఉయున్న మాణిక్యాంబ మగనిచేష్టలు చూచి తొందరపడి యేమియు తోఁచక ఖేదపడియెద రేమని యడిగెను. ఆతఁడు గద్గదస్వరముతో మన రామమూర్తిని శూచి జాడ్యముచేత నిన్న మధ్యాహ్నము కాలముచేసినాఁడని చెప్పెను. అంత వారిద్దరును గొంతసేపు వచారమును పొందిరి.

ఆమఱునాఁడు ప్రాతఃకాలముననే రాజశేఖరుఁడుగారు బయలు దేఱి శోభ నాద్రిగారు యింటికిఁబోయి తన పినతండ్రి కొమారుఁడయిన రామమూర్తి గారిమరణమువలన సంభవించిన దురవస్ధనుజెప్పి ముహూర్త మశుచిదినములలోవచ్చుతచేత వివాహకార్యమునను సంభవించిన యాలశ్యమునకును నష్టమునకు కొంత చింతపడి పెండ్లి కుమారుని వారు తరలి రాకుండ వెంటనే వర్తమానము చేయుఁడని రాజశేఖరచరిత్రము

కోరిరి. శోభనాద్రిరాజు గారును ఆయనను గొంచు మూరార్చి తక్షణమే పెద్దాపురమునకు మనుష్యునకు బంపిరి. పిమ్మట రాజశేఖరుఁడు గారింటికిఁబోయిరి.

తరువత వచ్చిన యాదివారమునాఁడు రాజశేఖరుఁడుగారు భోజనముచేసి కూరలకావళ్లను కూలివాండ్రచేత మోపించుకొని వానిని విక్రయించివేయుట కయి పెద్దాపురము సంతకుఁబోయి యొక యంగడి వానికి బేరమిచ్చి నిలువఁడిరి. ఆసమయముననొక గృహస్తు తలగుడ్డ చుట్టుకొని నిలుపుటంగీ తొడుకొని చేరవచ్చి "అన్నయ్యా! యీమయిల బొట్టెక్కడీది?" అని యడిగెను . రాజశేఖరుఁడుగా రాయన మొగము వంకఁజూచి ఱిచ్చపడి మాటతోఁచక యూగకుండిరి. మరల నాపెద్ద మనుష్యుఁడు "గంధముచుక్క పెట్టివారు మనకు మైల యెక్కడ నుండి నచ్చినది?అని యడిగెను.

రాజ-మన రుక్మిణిపోయిన వర్తమానము నిఅకు తెలియఁ జేసినాను గదా? మొన్న గురువారమునాడు సిఅతకు శివాహము ని శ్చయించుకొని పెండ్లి పనులన్నియుఁ దీర్చి సిద్ధముగా నుండగా బుధవారమునాఁడు రాత్రి మెవ్వఁడో దుర్మార్గుడొకఁడు నేను లేనిసమయమున వచ్చి నీవు పోయినట్టు వ్రాసియున్న జాబు నొకదానిని మీవదినె చేతి కిచ్చి పోయినాఁడు.

రామ-ఎవ్వఁడో పెండ్లి కార్యమునకు విఘ్నము కలిగింపవలెనని మూదుస్తంత్రమును చేసియుండును.

రాజ-గిట్టనివాఁడెవఁడోయీపన్నుగడ పన్నినాఁడు. ఇంటికి వచ్చి నీవదినెగారిని సీతను చూచి వత్తువుకాని.

రామ-నాకిప్పుడే రాజుగారిరో మాటాడి మరల నిమిషములమీఁద రాజమహేంద్రవరము వెళ్లవలసిన రాజకార్య మున్నది.నెల పదవప్రకరణము

దినములో మరలనచ్చి మిమ్మందరను జూచి రెండు దినము లుండి పొయెదను.

అని చెప్పి రామమూర్తి గారు తన పనిమీఁద రాజసభకు వెళ్ళిపోయిరి. రాజశేఖరుఁడుగారును తిన్నఁగా భిమవరమునకు వవ్హ్వ్హి భార్యతో రామమూర్తి గాతి వార్తను జెప్పి వివాహ కార్యమునకు భంగము కలిగించినదుర్మార్గుని బహువిధముల దూషింపఁజొచ్చిరి. అప్పుడు కూలివాఁడు దిగఁబెట్టి పోయిన కఱ్ఱను తిసికొని సీత తండ్రికింజూపెను. దాని నాతఁడానవాలుపట్టిఁ, చేతఁబట్టుకొని చూచినాడు రామరాజు చూపిన కత్తి కఱ్ఱయిదియేనని భార్యతోఁజెప్పెను. వారిరువురును ఆలోచించుకొనినిశ్చయముగా నీయుత్తరము తెచ్చినవాఁడువ్ రామారాజేకాని మఱియొకడుకాఁడని దృఢపఱుచుకొనిరి.

రాజ-రామరాజూమవలన నుపకారమును పొందినవాఁడే? యిట్లేలచేసెనో?

మాణి-నాఁటి రాత్రి మన యందరిప్రాణములను గాపాడి మన కెంతప్రత్యుపకారమునుచూపినాఁడు. ఆతఁ డీయపకారము తలఁచుకొనుటకు నాకేమియు కారణము నూహించుటకు తోఁచకున్నది.

రాజ-మన శత్రువులవద్ద ధనము పుచ్చుకొని యీదుర్మార్గ మును కొడికట్టి యుండవచ్చను. సొమ్ము ప్రాణమువంటి మిత్రుల నయినను పగవారినిగాఁ జేయునుగదా?

మణి-నేఁటికాలమునకు ధనాశ యాతని కీదుర్బుద్ధిని పుట్టించెను గాఁబోలును. అదిగో రామ రాజును నచ్చుచున్నాఁడు. ఆతని నడిగిన సమ స్తమును తేటపడును.

రాజ-ఏమయ్యా!రామ రాజుగారూ! మావలన మహోపకారమును పొందియు మాకార్మవిఘాతము చేయుటకు మీకు ధర్మమా?
రాజశేఖర చరిత్రము

రా మ - మీకు నేనేమి కార్యవిఘాతము చేసినాను?

రాజు- రామమూర్తి పోయినట్టు జాబు స్ర్ర్రష్టించి తనింట లేనప్పుడు మావాండ్రకిచ్చిపోలేదా?

రామ-నేను మీయింటి మొగమ తనము చూడలేదు. ఇటువంటి లేని దోషములు నామీఁద నారోపించిన మీ ------తిన్నగా జరుగదు నుండీ.

రాజ - మీరు మాయింటి మొగమే యెఱుఁగని వారు , మీ చేతి కఱ్ఱ యిది యిక్కడ కేలాగు వచ్చింది?

రామ- అయిదారు దినములనుండి నాచేతికఱ్ఱను గాలించి దాని నిమిత్తమై సకల ప్రయత్నములను జేయు చున్నాను. సరిసరి తెలిసింది. మీరాకఱ్ఱను యెత్తుకొని వచ్చి దానిని తప్పించు కొనుటకయి యెదురు నామీదను దోషారొపణలు చేయుచున్నరా? మీరేమో యింత వరుకును యోగ్యులనుకొనుచున్నాను.

రాజ- నా వద్ద నీవేమి యయోగూతను కనిపేట్టినావు? ఇఁక ముందు నీవెప్పుడును మాయిల్లు త్రొక్కి చూడవద్దు.
రామ-నీవు నీవనఁబోకు నీయింటిజోలికి యెవరికిఁగానలేరు?

అని చివాలున లేచి రామరాజు వెళ్ళిపోయెను.అతని వెనుకనే బయలు దేరి రాజశేఅఖరుఁడుగారు శోభనాద్రిరాజుగారి యింటికిఁ బోయి, జరిగిన యావద్వ్రత్తాఁతమును వినిపించి ; మరలా ముహుర్తము పేట్టుటకయి సిద్ధాంతిని పిలిపించవలెనని చెప్పిరి.

శోభ- మీలోపల ముహుర్తము పెట్టిననాఁటి రాత్రియే సిద్ధాంతికి జ్వరము తగిలి, వ్యాధి ప్రబలమయి జీవితాశంపోయినందున మంగళవారమునాఁడు మధ్యాహ్నమున ఆయనను భూశయనము చేసినరు. అప్పుడాయనబంధువులందఱును జేరి చదువుకున్న బ్రాహ్మ

పదవ ప్రకరణము

ణుల కిటూవంటిచావు యోగ్యమయినది యాతురసన్యాస మిప్పించి నారు. ఆ రాత్రి నుండియు రోగము తిరిగి యిప్పుడు కొంత వ్యాధి కుదిరియే యున్నాఁడట. మీరిప్పుడే పోయి యీమాసములో వివాహముహూర్త యెప్పుడున్నదో వచారించి రండి.

రాజ-చిత్తము. సెలవు పుచ్చుకొనెదను. అని లేచి తిన్నగా సుబ్బారాయుడు సిద్దాంతిగారి యింటికిఁబోయి చావడిలోపీటలమీఁద గోడకుఁజేరగిలఁబడికూరుచుండియున్న యాయనకు నమస్కరించి,దేహము స్వస్ధముగా నున్నదాయని రాజశేఖఁరుడుగారు కుశల ప్రశ్నయు చేసిరి.

సుబ్బ-కొంతవఱకు నెమ్మదిగా నున్నది. నాగోగము ప్రబలముగానుండి నేను తెలివితప్పి యున్నయప్పుడు, నా సొత్తునపహరింపలెనని నాఙ్ఞతు లందఱును జేరి నాకు సన్యాస మిప్పించినారు. నా రెండవ పెండ్లి భార్య కాపురమునకువచ్చి యాఱు నెల లయినది. దానితోపట్టుమని యొక సంవత్సరమైన సౌఖ్య మను భవింపలేదు. నాదేహము బలపడఁగానే యింట సహిత ముండనీయక నన్ను తఱిమి వేయుదురు.

రాజ-జరిగిపోయినదానికి వచారించిన ఫలమేమి? మీరిఁక సంసారసుఖములను మఱచి, మీరున్న యాశ్రమమునకు ముఖ్యముగా గావలసిన ప్రణవమును జపించుకొనుచు ముక్త మార్గమును జూచుకొండి.

సుబ్బ-నేనిప్పుడు సర్వసంగములను విడిచియున్నాను. నేను మీకుఁ జేసిన యపకారమును మఱచి నన్ను మన్నింపవలెను.

రాజ-మీరు నాకేమి యపకారము చేసినారు?

సుబ్బ-చేసినపాపము చెప్పినఁ బోవునని పెద్దలు చెప్పదురు. మీరు మొన్న సీతనిచ్చి వివాహముచేసి నతఁడు ధనవంతుఁడుకాఁడు.

రాజశేఖర చరిత్రము

ఆతఁడు శోభనాద్రి రాజుగారికి ముండలను తార్చువాఁడు. అతఁడు ధరించిన వస్త్రములు, మురుగులు మొదలగునవి రాజుగారివే. రాజుగారీయంత్రమునుపన్నినన్ను మీదగ్గరకు బంపిన నేనువచ్చి కార్యసంఘటనము చేసినాను. ఇంతకును దైవసంకల్ప మట్లున్నది కాబట్టి కార్యము జరిగిపోయినది.మీరన్నట్లు జరగపోయినదానికి విచారించినఫలములేదు.

రాజ- శోభనాద్రిరా జంతటి దుర్మార్గుడా? అతని సంగతినేను మొదట దర్శనమునకు వెళ్ళినప్పుడే తెలిసినది. ఈకపటము తెలియక రూపాయలు చేతిలోఁ బెట్టినప్పుడు నామీఁది యనుగ్రహముచేతనే ఇచ్చుచున్నాఁడనుకొన్నాను.రామరాజు ధర్మమాయని వివాహము కాకపోఁబట్టి సరిపోయినది కాని, లేకపోయినయెడల, నిష్కారణముగా పిల్లదానిగొంతుక కోసినవార మగుదుమే.

సుబ్బ- వివాహముకాలేదని మేలువార్తవిన్నాను.నిశ్చయమైనకార్యమెట్లు తప్పిపోయినది.

రాజ- మాజ్ఞాతియెకఁడు కాలము చేసినట్టుమయిలవర్తమానము వచ్చునందునమీరు పెట్టిన లగ్నమునశుభకార్యముకాలేదు.మరల క్రొత్తముహూర్తమును పెట్టించుకొని రమ్మనియే యాదుర్మార్గుఁడిప్పుడు నన్నుమీవద్దకుఁ బఁపినాఁడు.

సుబ్బ- ఆ పాపకర్ముని మాఁటయిఁక నాతోఁ జెప్పకుండు.ఆపాపాత్ముని ప్రేరణమువలన మీయింటముహూర్తము పెట్టినవాఁడేనాకు రోగ మారంభమైనది.కాఁబట్టిమీయొడలచేసిన మోసమునకుశిక్షగా భగవంతుఁడు నాకీయాపదను దెచ్చిపెట్టినాఁడనుకొని వివాహముకాక మునుపు రోగము కుదిరెనా మీతో నిజముచెప్పి వేసిపాపపరిహారము పొందవలెనని కోటి వేల్పులకు మ్రొక్కుకొన్నాను. అలాగునను కుదిరినది కాదు. అటు తరువాత వారిజాక్షులందు వైవాహిక Insert non-formatted text here
పదవ విక్రయం

ములందుఁ | బ్రౌణవి త్తమాసభంగమందుఁ | జకితగోకులాగ్రజన్మరక్షణ మందు | బొంకవచ్చు సఘము పొందదధిప." అను శుక్రనీతిని దలఁచు కొని వివాహకార్యమునకై కల్లలాడితిని గదాయని కొంతమనస్సమా ధానము చేసికొన్నాను. ఈనీతిని బట్టియే యెవ్వరును మీతోఁ బద్మ రాజు విషయమై ప్రస్తావించినవారు కారు.

రాజ-ఇప్పుడేపోయి యీసంగతి శోభనాద్రిరాజు నడిగి యనవలసిన నాలుగు మాటలును మొగము మీఁదనే యనివేసి వచ్చెదను.
అని వెంటనే పోయి శోభనాద్రిరాజు వీధిగుమ్మములో నిలుచుండియుండఁగా జూచి "మీ రేమో గొప్పవా రనుకొని మీమాటలనమ్మి మోసపోయినాను. మీతో నింతకాలము స్నేహముచేసినందుకు, నాకొమార్తెను నిర్భాగ్యునకిచ్చి వివాహము చేయించు కొఱకా ప్రయత్నము చేసినారు ? అని నిర్భయముగాఁ బలికి రాజ శేఖరుఁడుగారు వెనుకకు మరలిరి. శోభనాద్రిరాజు మరలఁ బిలిచి "మావద్దఁ బుచ్చుకొన్న రూపాయలనిచ్చి మఱిపొమ్ము" అని నిలువఁ బెట్టెను. మీరిచ్చిన రూపాయలును నాయొద్దనున్న రూపాయలునుకూడఁ గలిపి వానితో వివాహమునకు వలయువస్తువుల నెల్ల కొన్నాను. ఇప్పుడు నాయొద్ద రొక్కములేదు; చేతిలోనున్నప్పు డిచ్చెదను." అని వెళ్లిపోవుచుండఁగా, శోభనాద్రిరాజు తనభటులచేత రాజశేఖరుఁడు గారిని పట్టి తెప్పించి చెఱసాలలో బెట్టించెను. ఆసంగతి మాణిక్యాంబకు దెలిసినది మొదలుకొని పెనిమిటికి సంభవించిన యాపదను దలఁచుకొని నిద్రాహారములు మాని స్దా యీశ్వరధ్యానము చేయుచు లోలోపల దు:ఖించి కృశించుచుండెను.
ఈసంగతి జరిగిన మూఁడవనాఁడు సూర్యోదయమయిన తరువాత సీత వీధిగుమ్మములో నిలుచుండగా నెవ్వరో యిద్దరు మను

ష్యులువచ్చి,"మీయన్నగారు పిఠాపురము నుండివచ్చి యావలి వీధిని కరణముగారి యింటిలోఁ గూరుచుండి నిన్నక్కడకు దీసికొని రమ్మన్నాడు" అని చెప్పి సీతను దీసికొని పోయి యూరిబయ నుండి యత్తుకొని పాఱిపోయిరి. ఈదు:ఖవార్త మాణిక్యాంబకుఁ దెలిసిన తోడనే యామె భూమిమీఁదపడి మూర్చపోయి కొంతసేపటికి దెలిసి పెనిమిటి యొక్క వియోగమునకుఁ బుత్రికాశోకము తోడుపడ నెవ్వనెన్ని విధముల జెప్పినను మానక కన్నీరు కాలువలు గట్ట విలపించు చుండెను.