స్వీయ చరిత్రము - ప్రథమ భాగము/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవప్రకరణము.

స్త్రీపునర్వివాహ సంస్కారప్రయాసదశ.

క్రీస్తుశకము 1880 వ సంవత్సరము మొదలుకొని 1890 వ సంవత్సరమువఱకు.

మావివేకవర్ధని సంఘదురాచారసంస్కారకరణమునిమిత్తము మొదటి నుండియు పాటుపడుచుండినట్టు మాచదువరు లీవఱకే తెలిసికొని యుండ వచ్చును. అతిబాల్య వివాహములు, అతివృద్ధవివాహములు, కన్యాశుల్కము మొదలయినవానివలనియనర్థములను బోధించుటకయి బ్రాహ్మవివాహము ప్రకటింపఁ బడినది. అది చదువుకొనువారి యొక్క వేడుక కొఱకు మాత్రమే యుపయోగపడెను గాని యంతకంటె నెక్కువ ప్రయోజనము దానివలనఁ గలుగలేదు. ఒకరు తా నుపదేశించినదాని ననుష్ఠించి చూపినంగాని కేవలశుష్కోప వ్యాసమువలనను పుస్తకప్రకటనమువలనను కార్యముండదు సంస్కారకరణమునం దత్యంతాభినివేశముగల మే మిద్దఱుముగ్గురము మొట్టమొదట చిన్న చిన్న సంస్కారముల నారంభించి పనిచేసి చూపవలెనని యుద్దేశించుకొంటిమి కాని దానికి మాకు మార్గము కనఁబడలేదు. బాల్యవివాహములను మాన్పవలె నందుమా మేముపనిచేసి చూపుటయెట్లు ? మాలోఁ గొమార్తెలున్న వా రొకవేళఁ దమకొమార్తెలకు పదిపండ్రెండేండ్ల ప్రాయమువఱకును పెండ్లిచేయక యట్టెయుంచినను, అది సంస్కారమెట్లగును ? రెండుమూడు నాలుగేండ్లపిల్లలకు వివాహములు మాన్పుటకది మార్గదర్శక మెట్లగును ? కన్యావిక్రయ పరాయణు లనేకు లెక్కువధనము వచ్చునని తమకూఁతులను పదుమూడు పదునాలుగేండ్లు వచ్చువఱకు నుంచుచుండ లేదా ? రెండుమూడేండ్ల బాలికలకు వివాహము చేసినవారిని, శుల్కమును గ్రహించి తమకొమారితలను వృద్ధులకును వికలాంగులకును కట్టిపెట్టినవారిని, బహిష్కరించెదమని కులమువారు పనిపూనినం గాని నిజమయిన సంస్కారముజరగదు. కులమువారికిఁగాని జగుద్గురులమనియు ధర్మస్థాపన కర్తలమనియుఁ జెప్పుకొనెడు పీఠాధిపతులకుఁగాని యంతటిమగ తనము లేదు. రజస్వల లయినతరువాతనే బాలికలకు వివాహములు చేయుట నిజమయిన సంస్కారమును పరులకు మార్గప్రదర్శకము నగును. అప్పుడది చిన్న సంస్కారము గాక పెద్దసంస్కారమేయగును. నాపుత్రికకు రజస్వల యయయినతరువాతనే వివాహము చేయుచున్నాని చెప్పి చేయువానిని సహించి యూరకుండక కులమువారు కులమునుండి వెలివేయుదురు. నామిత్రులైన బసవరాజు గవర్రాజుగారు తమకూఁతునకు పదునాఱేండ్లు నిండుటకుముందు పరిణయము చేయనని పలుకుచుండెడివారు గాని తమప్రతిజ్ఞను నెఱపి యితరులకు దారిచూపుటకు వారి కాయువు లేకపోయినది. ఆయనయే తగినంతకాలము జీవించియుండుట తటస్థించియుండినపక్షమున, చెప్పినంతపనియు తప్పక చేసితీఱెడువాఁడు. జాతినుండి బహిష్కారముండదుగనుక, శాఖాభేదములేక యొక్కొక్కవర్ణములోనివా రొండొరులతో వివాహసంబంధములు చేసికొనునట్లు చేయుదమన్నను, మాకదియు ససాధ్యముగానే కనఁబడెను. అట్లు చేయుట కర్తవ్యమని యెల్లవారును జెప్పువారేకాని చేయ సాహసించువారు కానరాలేదు. చేసెదమనువారున్నప్పుడు చేసికొనెడువారు దొరకలేదు; చేసికొనెద మనువా రున్నప్పుడు చేసెడివారు దొరకలేదు ; ఉభయులును దొరకినప్పుడు కార్యము కాలేదు. నామిత్రుఁడును నియోగియునైన యొక సంస్కారప్రియుఁడు తనకొమారితలలో నొకతెను పాఠశాలలో విద్యాభ్యాసము చేయుచున్న యొకవైదికబాలున కిచ్చెదనని చెప్పెను; చదువునందు తెలివిగలవాఁడును బుద్ధిమంతుఁడు నైనయాబాలకునితండ్రియు తా నాచిన్న దానిని తనకుమారునకు చేసికొనెదమని చెప్పెను. ఇట్లు మాటలలో కొంతకాలము గడచినతరువాత నామిత్రుఁడు స్వశాఖబాలున కిచ్చియే యాచిన్న దానికి వివాహము చేసెను. ఇది యేమని యడుగఁగా నతఁ డన్యశాఖవరున కిచ్చుట తన కిష్టమే యైనను తనభార్య కిష్టము లేకపోవుటచేత స్వశాఖవానికే యియ్యవలసి వచ్చినదనియు, బీదవారిలో నెవ్వరయిన నొకశాఖవారితో నింకొకశాఖవారు వియ్యమందెడుపక్షమున తాను ధన సాహాయ్యమును జేసెదననియు, చెప్పెను. ఈప్రకారముగానే వివాహాదులయందు భూరిసంభావనలు మొదలయిన దుర్వ్యయముల నొకానొకఁడు సంస్కారప్రియత్వము చేతనే మానివేసినను జను లాతనిని లోభియనియే భావించి గేలి చేయుదురుగాని సంస్కారప్రియుఁడని యెంచి శ్లాఘనచేయరు. ఆకాలమునందు రాజమహేంద్రవరమునను తత్ప్రాంతములయందును వివాహాదిశుభకార్యములయందు బంధుమిత్రాదులను భోజనములకుఁ బిలుచునప్పు డందఱిని యజమానుఁడు స్వయముగాఁ బోయి పిలిచి రావలెను. ఒక్కఁడు ప్రతిగృహమునకును బోవుట మిక్కిలికష్టముగా నుండుచు వచ్చెను. స్వయముగాఁ బోయిపిలువక యెవ్వరినైనను బంపి పిలిపించినపక్షమున నెవ్వరును భోజనములకురారు. ఈకష్టమును వారించుటకయి మేము రెండు సభలుచేసి, భోజనములకుఁ బిలుచుటకయి స్వయముగాఁ బోవుటకుమాఱుగా నాహ్వానపత్రికలను బంచుట యుచితమనియు తన్మూలమున కాలహరణమును కష్టమును తొలఁగుటయే కాక యనేకవిధముల సౌలభ్యము కలుగుననియు బోధించితిమిగాని, అట్లు పూర్వాచారవిరుద్ధమైనపని చేసి చాకలవానిచేతను మంగలివానిచేతను చీట్లుపంచి దొరలవలె భోజనములకు పిలిపించినయెడల బ్రాహ్మణజాతిగౌరవమే పోవు నని పూర్వనాగరికులు వాదించి మాప్రయత్నము సాగనీయక పోయిరి. ఇఁక నట్టివారితో వాదముచేసి యుక్తిబలము చేత వారి నొప్పించుట యసాధ్యమని యెంచి యీనూతనపద్ధతి కనుకూలముగా నున్న వాఱమందఱమును జేరి మాలోమేము పత్రికల మూలముననే భోజనములకు పిలుచుకొనుట కేర్పాటు చేసికొని యట్లుచేయఁ జొచ్చితిమి.

మనదేశములో శవములను స్మశానములకుఁ గొనిపోయెడువిధమును, శవములను ఖననము చేసెడువిధమును, నాగరికులచే గర్హింపఁ దగినవిగానున్నవి. ఎంతగౌరవము కలవారినైనను, ఎంతధనముగలవారినైనను, మరణము కలుగఁ గానే రెండు వెదురు కఱ్ఱలమీఁదవేసి కట్టి పిల్లలును స్త్రీలును జడిసికొను నట్లుగా వీధులలోనుండి తల లల్లల నాడుచుండఁగాఁ గొనిపోవుటయు, మరణ సమయములయందు బంధువులు తోడుపడి శవములను మోయక ప్రేతపత్నుల నగలఁ దెగనమ్మించి యైన డబ్బిచ్చి పనికిమాలిన యపవిత్రులచేత మోయించిటయు, దహనముగాక ఖననముచేయువారిని తరువాత నక్కలును కుక్కలును పైకీడ్చునట్లుగా కొంచెము లోఁతునఁ బాతి పైని మన్ను వేసి యూరకుండుటయు, బ్రాహ్మణులలోని యవశ్యసంస్కరణీయములైన దురాచారములు. పట్టణములో నెవ్వరియింటనైన మరణాపద తటస్థించినప్పుడు లౌక్యులు వైదికులు నన్న భేదములేక యెల్లవారును వెంటఁబోవుటకును ప్రేతమును రుద్రభూమికిఁ గొనిపోయి తోడ్పడుటకును నియమము చేసికొనుటకయి కొన్ని సభలుచేసితిమి. మొదట సభకు విజయంచేసిన లౌక్యులలోఁ గొందఱు తమ కది గౌరవావహమయినపనికాదని కొంతయాక్షేపించి వ్యాఘాతము కలిగింపఁజూచిరిగాని మా వాదము సావధానముగా విన్న మీఁదట ప్రాతికూల్యమునుమాని యట్లుచేయుట కర్తవ్యమని సిద్ధాంత మొనర్చిరి. ఈపని నాచరణమునకుఁ దెచ్చి కొంతమార్పు చేసియుందుముగాని యింతలో మేము వేఱొక గొప్పసంస్కారములోఁ దిగి యుండుటచేత దీనిని సాధారణముగా వ్యవహారమునకుఁ దెచ్చుట కవకాశము కలుగలేదు. ఈవిషయమయి 1888 వ సంవత్సరములో గవర్రాజుగారి మరణానంతరమున నేను సభలోఁ జెప్పిన యొక చిన్న యంశము నిందుదాహరించు చున్నాను. -

"మనలో శవములను రుద్రభూమికిఁ దీసికొనిపోవు విధమునుగూర్చియు పూడ్చెడు విధమునుగూర్చియు, మాలో మే మనేక పర్యాయములు చర్చించి యావిషయములో నేదైన మంచిమార్పు కలుగఁజేయుట కర్తవ్యమని మే మిద్దఱమును నిశ్చయించుకొన్నాము. ఇట్లు జరగిన కొంతకాలమున కనఁగా 1881 వ సంవత్సరము నవంబరునెలలో, ఆయనకు ప్రథమమునఁ బుట్టిన పురుషశిశువు మూడుమాసములు పెరిగి పోవుట సంభవించెను. అప్పు డందఱును మృతశిశువును వాడుకప్రకారముగా పీనుఁగులను మోచు బ్రాహ్మణునిచేతి కిచ్చిపంపి గోదావరియొడ్డున నిసుకలో పాతిపెట్టింపఁ దలఁచిరి, కాని యట్లు పాతిపెట్టఁ బడిన శిశువులను కుక్కలును నక్కలును పెల్లగించి పయికీడ్చి తినుచుండఁగా సాధారణముగా చూచుచుండుటచేతను, శవవహనాదుల విషయమయిన యాచారమును మార్చుట యుచితమని యావఱకే తలఁచి యుండుటచేతను, ఆశిశువువిషయముననే క్రొత్తమార్పును జేయవలెనని నిశ్చయించుకొని శిశువు పట్టఁదగిన కొయ్యపెట్టెను చేయించి శిశుకళేబరము నందుంచి మూఁతకు మేకులు బిగించి దానిని తీసికొనిపోవు నిమిత్తమయి బండికొఱకు పాఠశాలలో సహోపాధ్యాయుఁడుగా నున్న యొక మిత్రునకు చీటివ్రాయఁగా నతఁడు తనబండి నిచ్చుటకు వలనుపడదని రాత్రి చీఁకటి పడినతరువాత ప్రత్యుత్తరము పంపెను. అప్పు డద్దెబండి నొకదానిని కుదుర్చుకొని, రాత్రివేళ గవర్రాజుగారును నేనును మఱియిద్దఱుమిత్రులును గలిసి యాపెట్టెను బండిలో పెట్టుకొని పోయి వారితోటలోనే యొకచోటఁ బూడ్చివచ్చితిమి. ఆపనిని చేసినందున కాయన నప్పుడు బంధువు లెందఱో యెన్ని విధములనో దూషించిరి; మిత్రులనఁబడువారు సహితము కొందఱు పరిహసించిరి; బంధుకోటిలోఁ జేరిన యొకతగుమనుష్యుఁడు స్మశానవాటికగా నేర్పఱిచినస్థలమును దప్పించి మఱియొకచోట శవమును పూడ్చినందుకయి పారిశుద్ధ్యశాసనము ననుసరించి మనపురపారిశుద్ధ్య విచారణసంఘము వారియుద్యోగస్థులచేత దండవిధాయకుని యొద్ద నభియోగమును తెప్పించుటకు సహితము పాటుపడెను. తాము కన్న శిశువును కాకులును గ్రద్దలును నక్కలును కుక్కలును పీకుచుండఁగా చూడ లేక వానికి స్వాధీనము కాకుండునట్లు పాతి పెట్టించుకొన్నప్పుడు లోకులింతద్వేషమును వహించుటకు వారి దేమి పడిపోయినదో విచారింపుడు."

ఈ ప్రకారముగా చిన్న చిన్న మార్పులను జేయఁ బ్రయత్నించుచుఁ గ్రమక్రమముగా వితంతువివాహము మొదలైన గొప్పసంస్కారములకుఁ బూనవలె ననియే నే నుద్దేశించియుంటిని గాని యింతలో నొకమిత్రుని ప్రోత్సాహమువలన ముందుగానే యత్యంతదుఃఖనివారకము నవశ్యాచరణీయమునైన వితంతువివాహ సంస్కారభారమును పైని వేసికొనవలసినవాఁడనైతిని. 1874 వ సంవత్సరమునందు చెన్న పురిలోని ప్రముఖులు స్త్రీ పునర్వివాహమును బ్రోత్సాహపఱుచుటకయి సమాజ మొకటి స్థాపించి పనిచేయ నారంభించి యన్ని మండలములకును బ్రకటనపత్రికలను బంపిరి. ఆసమాజమునకు శ్రీపళ్లె చెంచ--రావు పంతులుగారు కార్యదర్శి. నే నప్పుడు నలువదినాలుగు రూపాయల జీతముగల యుపాధ్యాయుఁడనయి యనామకుఁడనై యుండుటచేత వారి ప్రకటనపత్రికలు నావఱకును జేరలేదు. ఆసమాజము రెండుసంవత్సరములకాలము కోలాహలముచేసి విశ్రమించినతరువాత మరల దానిపేరే వినఁబడలేదు. అది సందడి చేయుచుండిన కాలములో విశాఖపట్టణములోని ప్రముఖులప్రార్థన ననుసరించి శ్రీమహామహోపాధ్యాయ పరవస్తు వేంకటరంగాచార్యుల వారు పునర్వివాహసంగ్రహ మను పేరితో స్త్రీపునర్వివాహము శాస్త్రసమ్మతమని 1875 వ సంవత్సరమునం దొక చిన్న పుస్తకమును వ్రాసి ప్రకటించిరి. ఆపుస్తకము ప్రకటింపఁబడినప్పుడు బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారు నా పేర నిట్లు వ్రాసిరి. -

"విశాఖపట్టణములో నుండెడు శ్రీపరవస్తు వేంకటారంగాచార్యు లయ్యవారులుంగారు నవనాగరికాధీనులై వితంతువివాహము కర్తవ్యమని యొక చిన్న పొత్తముం బ్రకటించిరిగదా. తద్విషయమున మనము మిన్నకుండవచ్చునా ? తమకుఁ దోఁచినట్లు ఖండన వ్రాసిపంపుఁడీ. నేను నిందస్మత్సభాసదులతోఁ దత్ఖండనపరాయణుండనై యున్నాఁడను. నాస్తికతాహర్మ్యసోపాన నివిష్టపరు లైనవారు దుష్టులుగాక శిష్టు లగుదురా. మనవారి స్వాచారానాదరమును దురాచారనిషేధకరణోపేక్షయు నిట్టిదశకుఁదెచ్చె. మనము నిట్టియెడ మౌన మూనుట మానుగాదు. నవనాగరికుల కున్న స్వాతంత్ర్యము మనకును గలదు. జంక నేల ? తోఁచినధర్మము నిక్కముగా వక్కాణించుట కెల్లరును స్వతంత్రులు కాఁబట్టి తాము దురాచారమర్దనమునకు నడుగిడుఁడు. దైవము మనకుఁ దోడ్పడుఁగాక. మనము కించిజ్ఞులమని శంకింపంబని లేదు. సర్వజ్ఞుఁడు భగవంతుఁ డొక్కఁడే. కానఁబ్రాచీనాచారదూషకులగు నవనాగరికులు మనకు జయ్యులు గాఁ దగుదురు. ఎందువల్లననఁగా వారు స్వోక్తియుక్తి ప్రమాణవాదులు. మనమో ప్రాచీనమహానుభావనివిష్టకార్యభారులము. కావున మన మన్యులచేతను జయ్యులమైనను, పరాజయము మనకేనాఁడును గలుగ నేరదు. ఒక వేళ మనకంటె విధవావివాహవాదులు బలవంతులైనను మనము భీష్మాను యాయుల మగుదుముగాక. మనప్రతిపక్షులు భార్గవప్రతిభు లగుదురుగాక. ధర్మమే జయము. చింతయేల ? మన మందఱము గూడుకొన్నఁ బ్రతివాదులు విత్తమత్తు లైనను మత్తగజంబులు శృంఖలాబద్ధంబులై కందికుందు చందంబున నగుట సిద్ధము. "శ్లొ. బహూనా మల్పసారాణాం సమవాయోదురత్యయః| తృణైర్విరచ్యతే రజ్జు ర్బధ్యంతే తేన దంతినః." అని యుండుట జగత్ప్రసిద్ధము గద. తమసదుత్తరము ప్రతిక్షణము ప్రతీక్ష్యమాణంబు."

ఈవిషయమున నటుతరువాత చెన్న పట్టణములో స ద్దడఁగినను, బందరులోఁ బ్రకటింపఁబడెడు పురుషార్థప్రదాయినీ పత్రికలో నెవ్వరో యప్పుడప్పుడు వ్రాయుచుండెడువారు. పురుషార్థప్రదాయినిలో సౌఖ్యార్థి యను నామముతో నెవ్వరో వితంతూద్వాహమునుగూర్చి వ్రాసినదానిని నేను వ్రాసినట్టు భ్రమపడి చిత్రనళీయాది బహునాటకకర్తలగు బ్రహ్మశ్రీ ధర్మవరపు రామకృష్ణమాచార్యులవారు యువనామ సంవత్సరములో బళ్లారినుండి నా కిట్లు వ్రాసిరి. -

"మఱియొకటి విన్న వించెద. డిసెంబరుమాసపు పురుషార్థప్రదాయినిలో నుండఁబోలు, "సౌఖ్యార్థి" యనుపేర విధవోద్వాహము సమంచిత కార్యమని వ్రాసినది మీరేయైయుందురని యూహించుచున్నాను. ఆవిధవోద్వాహము గుణవంత మెయైనను కాకున్నను, ఇప్పటికిని బహుజనులచే ననాదృతమైయున్నది. మీ రట్టిపని గుణవంతమని వాదింపఁ బూనుకొందురేని క్రియాసాధన మేమియు లేకున్నను కొందఱచే నేని నిందింపఁబడుట యొకటిప్రాప్తించు. జ్ఞానహీనులగువారు నిందించిన నేకొఱంతయు పాటి ల్లదుగావున నేను వారినిందనమును సరకుఁగొన నందురేమో మీరు, పోనిండు. అట్టినిందనేనిం బొంది మీరు సాధించునర్థ మేమి ? వలదు. "దేశాభివృద్ధికై లేశమయినఁ బ్రాలుమాలక పాటుపడ నిచ్చఁగలవాఁడ" ననియున్నారుగాన దానివలన మఱేమియు సాధించునది లేకున్నను మనము చేయునదియేమో చేయక మనఁగూడదందురా? జనసామాన్యము సమాధానముం బొందియేకదా మీరు దేశాభివృద్ధికిఁ బాటుపడుట. అది లేకున్న నది పాటులోన గణనచేయఁ దగినదియే కాదు. మీ రిట్టివాదమునకుం బూనుకొనుటవలన నందఱకుఁ గాకున్నఁ గొందఱకేని యనిష్టమయియుండునని మున్నె విన్న వించితిఁగదా. అట్లు కొందఱచేనైనను నిందింపఁబడి ఫలసిద్ధిం బొందలేనికార్యమున కేల పూనవలయునో యెఱుంగ. అవధరింపుఁడు. కొన్నాళ్ళకుముందు చెన్న పురి నుండి యెల్లెడలకు జాబులువచ్చి విధవోద్వాహమున కనుకూలురగు వారెవ్వరో వారి నందఱినిఁజేర్చి యొక సమాజమువలె నేర్పడఁజేసినది మీ రెఱుఁగుదురుకదా? దానిలోఁ జేరినవారి నందఱంగాంచితిరా ? కొందఱినిమాత్రము విడిచిన మిగిలినయందఱును ధనికులును మహాధికారసము పేతులును నగుదురు. అట్టిసమాజ మేర్పడి దాదాపున రెండేండ్లగుచు వచ్చెఁగదా. ఏదీ యెందఱు బాలవిధవలు వారిచే వివాహితలైరి ? ఈ హిందువు లెట్టివారోకాని ఎట్టి నూతనాచారమునకును నెడమీయరు. కావున నిప్పటి మీవాదముజ్జగించుట సమంచిత కార్యమని యెన్ను చున్నాను. మంచిది. స్త్రీవిద్యయు నిట్టిదేకదా. ఆ స్త్రీ విద్యకు వ్యతిరిక్తముగ వాదించినను గొందఱు దూరెదరుగదా, అట్టి దానికేల నీవు పూనుకొనియుంటివని యనియెదరేమో నన్ను మీరు ? స్త్రీవిద్యకును విధవావివాహమునకును నెంతయంతరముండుటయు, అని రెండింటిని నే యేవిధమున జనసామాన్య మెన్నుటయు నెఱింగినమీకు విశేషము విన్న వింపలేను."

వ్యభిచారభ్రూణహత్యాదుల కవకాశము లేక బాలవితంతువులు తమ ద్వితీయ వల్లభులతో నిరంతరసౌఖ్య మనుభవించుచుండఁ గాఁ గన్నులపండువగాఁ గనుఁగొనఁ గలిగెడుభాగ్య మెప్పుడు లభించునా యని హృదయము లో నే నెంత యభిలషించుచుండినను, స్త్రీ పునర్వివాహములు వ్యాపించుటకుఁ దగినకాల మింకను రాలేదని తలఁచి యుండుటచేత నింతటిగొప్పమార్పున కయి కృషి చేయుటకు నాకు సాహసము పుట్టలేదు. ఇట్లు కొంతకాలము నడవఁగా నొకనాఁడు నాసహపాఠియు దేశాభిమానియు నాప్రియమిత్రుఁడు నైన చల్లపల్లి బాపయ్య పంతులుగారు మనము స్త్రీ పునర్వివాహము విషయము కృషిచేయవలెనని నాతో నత్యంతాసక్తితోఁజెప్పెను. నాయశక్తతను విచారించి నావంటివాఁడిట్టి మహాకార్యము తల పెట్టిన ప్రయోజనము లేదని యధైర్యముతోఁచి, నేనాయన నంతగాఁ బ్రోత్సాహపఱుపక చూతమని చెప్పి యు పేక్షింపఁ జొచ్చితిని. ఆయన రెండుమూడు తడవలు మరలమరల నాతో నీవిషయమయి మాటాడి, ఒకసారి వైదికులను గొందఱను దనవెంటఁ గొనివచ్చి యీకార్యమునిమిత్తము ప్రయత్నము చేయఁ దగినకాలము వచ్చినదని వారిచేతఁ జెప్పించి, ప్రోత్సాహకరములయినమాటలు చెప్పి నన్నుఁ బురికొల్పుచుండెను. ఇట్లు రెండుసారులు ప్రస్తావము జరగిన మీఁదట మూడవసారి నామిత్రునివంకఁ జూచి "నిన్ను మీయన్నలు విడిచి పెట్టినను బంధువులు బాధపెట్టినను నన్ను విడువక కడవఱకును నాతో నుండి పనిచేసెదవా ?" అని ధీరవృత్తితో నడిగితిని. అతఁడణుమాత్రమును సంశయింపక "ఎన్ని కష్టములువచ్చినను తొలఁగక నిలిచి పనిచేసెదను" అని తత్క్షణమే యుత్తరముచెప్పెను. అప్పుడిది యీశ్వరప్రేరితమైన యాజ్ఞయని నామనస్సునకు పొడకట్టఁగా, ఇఁక నేను వేఱుమాటాడక "సభాహ్వాన పత్రికను వ్రాసితెమ్ము. నేను వ్రాలుచేసి ప్రకటించెదను" అని చెప్పిపంపితిని. అతఁ డాహ్వానపత్రికను వ్రాసితీసికొనిరాఁగానే దానిమీద సంతకము చేసి పట్టణములోని వారికందఱికిని బంపితిని. విశేషపాండిత్యమును విత్తమును లౌకికాధికారమును లేనివాఁడను దుర్బలశరీరుఁడను నగునే నీమహాకార్యమును నిర్వహింపఁ గలుగుదునని నేనిందులో నడుగిడలేదు. ఇది యీశ్వర ప్రేరితమును నీశ్వరప్రీతికరమును నందుచే నాకుఁ బరమధర్మమును నన్న దృఢవిశ్వా సముతోనే సాధ్యాసాధ్యవిచారమును తలపెట్టక నే నీపనిలోఁ బ్రవేశించితిని. తనకు ధర్మమయినపనిలో శక్తివంచన లేక కృషిచేయుట యొక్కటి యే మనుష్యుని పని ; దాని ఫలాఫలముల నియ్యవలసినవాఁ డీశ్వరుఁడుగాన తద్విచారము మనుష్యునిది కాదు. ఈశ్వర ప్రీతికరమయిన సత్కార్యమునందు యధాశక్తిని గృషిచేసినను ఫలము గలుగకపోయిన పక్షమున మనుష్యుని లోప మేదియులేదు. మనుష్యుఁడు చేయవలసినపనిని జేసిన వాఁడగుటచేత నంతవఱకే యతఁడు శ్లాఘార్హుఁడు. నాయాహ్వానపత్రిక వెలువడఁగానే మా పట్టణములోని వైదికవృత్తిలో నున్న పండితులందఱును నామీఁద ధ్వజమెత్తి కత్తులు నూఱుట కారంభించిరి ; పూర్వాచార పరాయణులయిన లౌకికశిఖామణులును వైదికోత్తములును వారికి సహాయులయి నామీఁద దాడివెడలిరి. అప్పుడు విధవావివాహ మన్న శబ్దమే కర్ణకఠోరమై దుస్సహమై యెల్లవారికిని హృదయశూలముగా నుండెను. అప్పుడు నాకు స్త్రీ పునర్వివాహవిషయమయి యేమేమి గ్రంథము లున్నవో తెలియవు. ఈశ్వరచంద్ర విద్యాసాగరులవారి గ్రంథమున్నట్టు తెలియును గాని నా కప్పు డది లభించినది కాదు. మనుస్మృతియు, యాజ్ఞవల్క్యస్మృతియు, పరాశరస్మృతియుమాత్రము నాయొద్దనున్నవి. ఈవిషయమయి తత్త్వబోధినిలోఁ బ్రకటింపఁబడిన యుపన్యాస మొకటియు, పురుషార్థప్రదాయినిలోఁ బ్రకటింపఁ బడిన యుపన్యాస మొకటియు,నాకు లభ్యములయినవి. ఈగ్రంధసాహాయ్యముతో నాబుద్ధికిఁ దోచినయుక్తులను శాస్త్రప్రమాణములను గూర్చి, యుపన్యాసము నిమిత్త మేర్పఱుపఁబడిన దినము నాఁటికి నాశక్తికొలఁది నొక యుపన్యాసము వ్రాసి, శ్రీవిజయనగరపు మహారాజుగారి బాలికాపాఠశాలామందిరమున జరగిన మహాసభలో 1879 వ సంవత్సరము ఆగష్టు నెల 3 వ తేదిని మొట్ట మొదటఁ జదివితిని. బాలవితంతువుల దురవస్థనుగూర్చి జాలిపుట్టునట్టుగా వ్రాయఁబడిన, నాయుపన్యాసభాగము బహుజనుల మనస్సులను కరఁగింప గలిగినను, చిరకాలాచారబలముచేత శిలాకఠినహృదయులైన పండితులకోపాగ్ని కది యా జ్యధార యయి వారిని మఱింత మండిపడునట్లు చేసినది. ఆదినమున వాద మెట్లు జరగునో వినవలెననియు, పండితుల విజయమును చూడవలెననియు, బాలవితంతువుల దుర్దశానివారణమునకు గతి యే మైన నేర్పడెడియాశ కలుగునేమో కనవలెననియు, వివిధాభిప్రాయములతో గుంపులుగుంపులుగా వేడుక చూడవచ్చిన జనులతో నిండి యయిదాఱువందల జనులు పట్టఁదగిన సభా భవన మంతయు క్రిక్కిఱిసిపోయినది. నాయుపన్యాసము ముగియఁగానే వృషభముమీఁదికిఁ గుప్పించు వ్యాఘ్రములవలె నామహాసభలోనుండి పండితులనేకులు లేచి భయంకరారావములతో నన్నుఁగవిసిరి. వారిలో శ్రీశంకరాచార్యస్వాములవారియొద్ద పండితులుగాఁ గొంతకాల ముండిన యద్దేపల్లి కృష్ణశాస్త్రులుగారు మొదలయినవారు తమ పాండిత్య ప్రభావమును గనఁబఱచి నన్ను బహువిధముల దూషించి, నష్టేమృతేత్యాదిపరాశర స్మృతివచనమున కనేక విపరీతార్థములు కల్పించి నాయర్థమును పరిహసించి, ప్రత్యుత్తరము చెప్పుటకు నాకవకాశ మియ్యక, పయివారము నీయుపన్యాసము మీఁద ఖండనోపన్యాసములు వ్రాసి చదివెదమని చెప్పి, నాటికి సభనుండి వెడలిపోయిరి. ఆదినముమొదలుకొని పట్టణములోని ప్రతిగృహమునందును స్త్రీ పునర్వివాహవిషయమయిన చర్చలే జరగ నారంభించినవి ; జను లేవీధిని జూచినను స్త్రీ పునర్వివాహవిషయక ప్రసంగములనే చేయఁజొచ్చిరి. ఆవఱ కితరవిషయములయందు భూషించువారును నన్నీ విషయమునందు దూషింప నారంభించిరి; నామిత్రులు సహితము నన్ను నిరుత్సాహ పఱుపసాగిరి ; వాదము నిమిత్తమయి నే నేగ్రంధము నడిగినను పండితులు నాకొక్కసారి యెరవియ్యక పోవుటయేకాక గ్రంథ నామములయినను నాకు తెలుపక మఱుఁగుపఱుచుచువచ్చిరి. నాపక్షమునఁ గొందఱు మిత్రులున్నను వారప్పుడు నాకుఁ జేయఁగలిగినసాయ మత్యల్పమయియుండెను. మొదటినుండియు నాకత్యంత ప్రోత్సాహకులుగా నుండి నన్నీ కార్యమునందుఁ ప్రవేశపెట్టి పురికొల్పుచున్న బాపయ్యపంతులుగారు మాత్రము సంస్కృతమునఁ గొంత పాండిత్యము గలవా రగుటచేత నాకు బహు విధముల తోడుపాటుగా నుండిరి. నాకింతలో కాశీ పట్టణమునుండియు కాళీఘట్టము నుండియు బొంబాయినుండియు కావలసిన పుస్తకములన్నియు వచ్చినవి. నేనప్పుడు ముప్పది స్మృతులకంటె నెక్కువగాఁ గొని తెప్పించినాఁడను. అవియన్నియు పూర్ణముగా చదువుటకు నా కప్పుడవకాశము లేక పోయినను, ఈశ్వరుఁడు మాత్రము నాకు సహాయుఁడయియుండుటచేత నే నక్కడక్కడఁ జూచిన భాగములలోనే నా వాదమున కనుకూలమైన ప్రమాణవచనము లనేకము లప్రయత్నముగా నాకు దొరకెను. ఈప్రకారముగా సత్యబలమును దైవబలమును నాపక్షమందుండినట్లు కనఁబడుటచేత ధైర్యము హెచ్చి నేనుత్సాహముతోఁ బనిచేయఁగా, పండితు లుపన్యాసములుచేసిన సభ నాఁడు నాప్రతివాదమును విన్న మీఁదట వివేకులకందఱకును పండితులవాద మసార మైనదనియు స్త్రీ పునర్వివాహము శాస్త్రసమ్మతమనియు నభిప్రాయము కలిగెను. పండితులు నన్ను బహిరంగముగా సభలయం దోడింపలేక బహువిధమాయోపాయములు ప్రయోగింపఁ జొచ్చిరి. కొందఱింటింటికిని వీధివీధికిని దిరిగి శాస్త్రజ్ఞానములేని పెద్దమనుష్యులయొద్దను మూఢ జనుల యొద్దను నేను జేసిన వపార్థములనియు శాస్త్రము స్త్రీ పునర్వివాహ మంగీకరింపదనియు, "కలౌపంచసహస్రాణిజాయంతే వర్ణసంకరాః" అన్న యార్యోక్తినిబట్టి వర్ణసాంకర్యము కలిగి లోకము చెడిపోవుననియు, చాట మొదలు పెట్టిరి. కొందఱు మంచిమాటలు చెప్పియు బహుజనద్వేష మశుభదాయక మని భయ పెట్టియు నయమున భయమున నన్ను మరలింపఁజూచిరి. కొందఱు నన్నకస్మాత్తుగాఁ బిలిపించి వాదములో నోడించి శాస్త్రవిషయమున జనులకుఁ గలుగుచున్న యభిప్రాయమును జెడఁగొట్టఁ బ్రయత్నించిరి. అక్కడిపండితులు తాము వాదమునందు నిర్వహింపలేక యితరస్థలములనుండి పండితులను బిలిపించుటకయి ప్రయత్నించి, ఆవిషయమునను లబ్ధమనోరథులుగాక విశాఘపట్టణ మండలమునుండి దంతులూరి నారాయణ గజపతి రాజుగారిచేత నొక ఖండన గ్రంథమును వ్రాయించి తెప్పించి పండితులందఱును దానియందు తమకు తోఁచినవిషయములనుగూడఁ జొప్పించి పుస్తకములోని సంగతులు మాపక్షమువారి కెవ్వరికిని దెలియకుండ రహస్యముగానుంచి, కాశ్యాది ప్రదేశములయందు చిరకాలము వాసముచేసి మంత్రశాస్త్రప్రవీణుఁడని ప్రసిద్ధినొంది మహాతంత్రజ్ఞుఁడైన జోస్యుల పేరిచయనులగారిలోపల నొకసభచేసి, ఆసభకు స్త్రీపునర్వివాహ ప్రతిపక్షులనుమాత్రమే యాహ్వానముచేసి యందఱునువచ్చి కూర్చున్న తరువాత నన్నచటి కాకస్మికముగా నొకపెద్దమనుష్యునిఁ బంపి పిలుచుకొని పోయి, పైగ్రంథమును జదివి యందలియంశముల కాక్షణముననే యుత్తరము చెప్పవలయునని యడిగి నన్ను పరాజితునిఁ జేయఁజూచిరికాని యీశ్వరానుగ్రహమువలన నేను సమయోచితములైన ప్రత్యుత్తరములను జెప్ప నారంభింపఁగా ప్రజలకు తమమాటల యందు విశ్వాసము చెడుననిభావించి యాపండితులు నాయుత్తరములను వినక కడుపునొప్పియని యొకఁడును కాలునొప్పి యని యొకఁడును లేచి పోవఁదొడఁగిరి. అప్పు డాసభామధ్యముననుండి యొక వైష్ణవుఁడు లేచి ముందుకువచ్చి తాను పూర్వాచార పరాయణుఁ డయ్యును దమపక్షమువారు చేయుచుండినయన్యాయమునుజూచి సహింపలేని వాఁడయి "మీప్రతివాదమును వినియెదమని ప్రతిపక్షినిబిలిపించి చెప్పనారంభింపఁగానే వినక కడుపునొప్పి యని కాలునొప్పి యని సాకులుచెప్పి తొలఁగఁజూచుట యేమి న్యాయము ? ఇదియేమిసభ ?" యని యఱచుచు సభనుండి వెడలిపోయెను. సభ్యులందఱు నంతర్ధానము నొందినతరువాత పరమతాంత్రికుఁడైన యాచయనులుగారు నన్నొంటిగాఁబిలిచి నన్నును నాపూర్వులను స్తుతిపాఠములతో శ్లాఘించి పూనినకార్యమునుండి నన్ను మరలింపఁ జూచెనుగాని యాపండిత సత్తమునికోరిక సఫలము గాక, విధవావివాహవృక్షమును మూలచ్ఛేదము చేయుటకయి దీక్షవహించినసభల కాలయమయి బ్రాహ్మణశ్రేణిలో శుద్ధశోత్రియులయిండ్లనడుమ నున్న యీగృహమే తరువాత దైవికముగా విధవావివాహప్రవర్తకసమాజమువారి యధీనమయి పునర్వివాహములు చేసికొన్ననూతన దంపతులకాపురము కాలయమయి యిప్పటికి నట్లేయున్నది. నేను మొట్ట మొదట నిచ్చిన యుపన్యాసము ప్రకటింపఁబడఁగానే తెలుఁగుదేశమునం దంతటను స్త్రీ పునర్వివాహవిషయమైన వాదములే ప్రబలి మండనవాదులు నాపుస్తకము నాధారపఱుచుకొని శాస్త్రమును యుక్తులను జెప్పఁబూనుటయు ఖండనవాదులు బహువిధములఁ బూర్వపక్షములుచేయఁ బూనుటయు కొంతకాలము జరగెను. గుంటూరినుండి భువనగిరి పరదేశి సోమయాజులు గారును, బందరునుండి శ్రౌతము కోటీశ్వరశాస్త్రులుగారును, చెన్నపురినుండి కొక్కొండ వేంకటరత్నము పంతులుగారును వర్తమాన రత్నాకరవిలేఖకులును, కాకినాడనుండి మందారమంజరీ పత్రికాధిపతియైన యోగిరాల జగన్నాధముగారును, రాజమహేంద్రవరమునుండి వేదము వేంకటరాయ శాస్త్రులుగారును, విశాఘపట్టణమునుండి దంతులూరి నారాయణ గజపతిరావుగారును, అల్లూరినుండి దాసు శ్రీరాములు పంతులుగారును, ఇంకను ననేకులును నాప్రథమోపన్యాసముమీఁద ఖండన గ్రంథములనువ్రాసిరి. ఈఖండన గ్రంథములయందలి ముఖ్యాంశములకును రాజమహేంద్రవరమునందలి పండితులు చెప్పిన యంశములకును సమాధానముగా శ్రీవిజయనగరముమహారాజు గారిబాలికాపాఠశాలలో అక్టోబరు నెల 12 వ తేదిని జరిగినమహాసభలో నేను నాద్వితీయవిజ్ఞాపనమునుపన్యసించి ప్రకటించితిని. ఇదిగాక బహుస్థలములయం దీవిషయమయి వ్రాయుచువచ్చిన ప్రతివాదులవాదముల కెల్లనుత్తరములను వివేకవర్ధనిలోఁ బ్రకటించుచు వచ్చితిని. తీఱిక యున్నప్పుడితర స్థలములకుఁబోయి యుపన్యాసము లిచ్చుటకును బ్రయత్నించుచు వచ్చితిని. నేను మొట్ట మొదటఁ గాకినాడ కొకభానువారమునాఁడుపోయి స్త్రీపునర్వివాహము శాస్త్రసమ్మతమని హిందూ శాస్త్ర పాఠశాలా భవనములో నొక యుపన్యాసముచేసితిని. నాటిసభకు వందలకొలఁది జనులు వచ్చి విని యానందించిరి. విధవావివాహమునకుఁ బ్రతిపక్షులుగా నున్న తత్పురవాసులగు పండితులు మొదలగువారు తమకు వారముదినములు గడువిచ్చినపక్షమునఁ దా మాపయిభానువారమునాఁడు ఖండనోపన్యాసము నిచ్చెద మని సెలవిచ్చిరి. వారు చేసెడు పూర్వపక్షములనువిని నాకు తోఁచిన సమాధానములను జెప్పుటకయి యాయాదిత్యవారమునాఁడు రాజమహేంద్రవరమునుండి నేనక్కడకుఁ బోయితిని. ఆహ్వానపత్రికల ననుసరించి స్త్రీపునర్వివాహ విధాయకపక్ష వాదులు యుక్తసమయమునకే పాఠశాలామందిరమునకుఁ బోయి యుండినను, పండితులు మొదలగువారు తామక్కడకు రామనియు దేవాలయములో సభ చేసెడుపక్షమున వత్తుమనియు వర్తమానము పంపినందున వారి యిష్టానుసారముగా నేనును నాసహాయులును విష్ణ్వాలయమునకుఁ బోయితిమి. ఆహ్వాన పత్రిక ననుసరించి పలువురు పాఠశాలామందిరమునకుఁ బోయిరికాని యచ్చట సభలేనందున వారిలోఁ గొందఱుమాత్రమే యచ్చటనుండి మరల దేవాలయమునకు రాఁగలిగిరి. అటుతరువాత మిక్కిలియాలస్యముగా సభయారంభింపఁ బడఁగా, విధవావివాహనిషేధవాదులు నేను జేసిన యుపన్యాసమునకు ఖండన మని నాచేఁ జెప్పఁబడనివియుఁ జెప్పఁబడినవియునైన కొన్ని విషయములకుఁ బ్రత్యుత్తరముగా నొకగ్రంథమును జదువ నారంభించిరి. వేదార్థవిచారము ముగియునప్పటికే ప్రొద్దుగ్రుంకినందునస్మృతిభాగమును మఱునాఁడు ప్రాతఃకాలమునఁ జదువవచ్చునని నాఁటికి సభచాలింపఁ బడినది. మఱునాటియుదయమునఁగూడ వారు మిక్కిలి యాలస్యముగానే వచ్చినందున స్మృతిభాగము యొక్క యర్థమునుగూర్చి వారు గ్రంథమును ముగించునప్పటికి పదిగడియల ప్రొద్దెక్కినది. నిషేధవాదము ముగిసినతరువాత విధాయక వాదులయుత్తరమును వినవలెనని మొదటనే నిశ్చయింపఁ బడినను, విధవా వివాహనిషేధ వాదులు తమ ఖండనగ్రంథముమీఁద విధాయకవాదు లేమియుఁ జెప్పఁగూడదని వాదింప మొదలు పెట్టిరి. అప్పుడు సభలో వారిమాట చెల్లనందున తాము మధ్యాహ్నమున జరుగఁబోవు సభకురామని వారందఱును వెడలిపోయిరి. వారు మధ్యాహ్నము సభకు రామని నిరాకరించుటచేతనే వారివాదము దుర్బలమయినదని యచ్చటనున్నవా రనేకు లభిప్రాయపడిరి. మరల మధ్యా హ్నము సభకూడినపిమ్మట స్త్రీపునర్వివాహవిధాయకవాదులు తమపక్షమును స్థాపించుకొనుటకయి యుపన్యసింపఁ బోవుచుండఁగా బ్రహ్మశ్రీమల్లాది అచ్చన్న శాస్త్రిగా రను మహాపురుషు లక్కడకు విజయంచేసి, తమన్యాయైక దృష్టి వెల్లడియగునట్లుగా సభాధ్యక్షులతో కొంత ధర్మోపన్యాసము చేసి, మధ్యవర్తి లేక వాదప్రతివాదములయొక్క బలాబలములు తేలి సిద్ధాంత మేర్పడదనియు నుభయపక్షములతోను జేరక భగవన్ముఖమునుజూచి నిష్పక్ష పాతముగా న్యాయమును దెలుపుటకు సమర్థులయిన తాము మాధ్యస్థ్యము చేయుట కంగీకరించెదమనియు సభలో నున్న వారి కందఱికిని భ్రమపుట్టునట్లు కొన్ని తేనెమాటలను జెప్పిరి. నిషేధవాదులవాదము నీవఱకే వినియున్నారు గనుక విధాయకవాదులు చెప్పఁబోయెడియుత్తరముకూడ విని మీకు తోఁచిన యభిప్రాయము నియ్యవచ్చునని సభాసదులు పలుకఁగా, పూర్వోక్త మహాపండితులవారు ప్రతిపక్షులు లేకుండ తగవు చెప్పుటయుచితము కాదనియు వారినిగూడ పిలిపింపవలయుననియు పట్టుదలతో సెలవిచ్చిరి. వారు సభకురామని నాటిప్రాతఃకాలమున స్పష్టముగాఁ జెప్పిపోయిరని సభాధ్యక్షులు శాస్త్రులవారితో మనవిచేయఁగా, వారిని పిలిపించుభారమును దాము వహించెదమనిచెప్పి శాస్త్రులవారు తమశిష్యుని నొక్కనిఁ బంచిరి. ఆశిష్యుఁడు వారందఱును బైలుదేఱివచ్చుచున్నారని పదినిమిషములలోనే తిరిగివచ్చి వర్తమానముచేసినను, ప్రతిపక్షులు మాత్రము గంటకులోపల రాలేదు. ఈ లోపుగా విధాయక వాదుల యుపన్యాసమును వినవలెనని పలువురు తొందర పడుచు వచ్చిరి. ప్రతినిషేధవాదులకు వర్తమాన మంపి వారు వచ్చెదమని ప్రత్యుత్తరము పంపిన మీఁదట వారి రాకకయి నిరీక్షింపక తొందరపడి యుపన్యసింపఁ బూనుట యుచితము కాదని యచ్చన్న శాస్త్రులవారు బహుదూరము నొక్కి చెప్పి వారువచ్చువఱకును నాయుపన్యాసము నాపిరి. వారు వచ్చినమీఁదట నేను శ్రుతిభాగముయొక్క యర్థవివరణము చేయఁగానే శాస్త్రులవారు నిష్పాక్షికమైన తమ యభిప్రాయము నిచ్చుటకయి వచ్చు నప్పు డింటికడ వ్రాసి తెచ్చుకొన్న తమ యభిప్రాయము జదువుటకయి రొండిని బెట్టుకొని తెచ్చిన కాగితమును బయికిఁదీసి మడత విప్పి నిషేధవాదుల కనుకూలముగా తమ యాశయమును జదువ నారంభించిరి. అంతట సభ్యుల కామధ్యస్థునియొక్క న్యాయపక్షావలంబమును సత్యశీలతయు యోగ్యతయుఁ దెలిసి యిఁక నభిప్రాయము నీయవలదని వారించిరి. మనలో పండితు లనఁబడువారే నీతిమాలి యెంతటి మోసములకును నన్యాయములకును లోఁబడుదురో ! అప్పుడు ప్రతిపక్షులు తా మేమో చెప్పరాఁగా నుపన్యాసము ముగియువఱకును జెప్పఁగూడదని సభాధ్యక్షులు వారిని వారించిరి. అప్పుడు కప్పగంతుల రామశాస్త్రిగారు తాను సభలో నుండి విననని లేచి పోయెను ; ఆయనవెంట నోగిరాల జగన్నాథముగారును మఱి యిద్దఱుముగ్గురును లేచివెళ్ళిరి. తాను జేసిన మోసముచేత సభలో నుండలేక యచ్చన్న శాస్త్రిగారును సంధ్యాసమయమయినదని మిష పెట్టి లేచిపోయెను. అంతటఁ బ్రతిపక్షులైన బ్రాహ్మణులు కొంద ఱల్లరిచేయవలెనన్న యుద్దేశముతో దేవాలయద్వారముకడ తోపులాట కారంభింపఁగా, కావలి యున్న యారక్షక భటులు వారిని వారించిరి. ఇంతలోఁ జీఁకటిపడినందున మఱి కొందఱులోపలఁ బ్రవేశించి యల్లరిచేయ నారంభించిరి. రాజమహేంద్రవరమునుండి కొందఱు విద్యార్థులు నా కంగరక్షకులుగా వచ్చియుండిరి. ప్రతిపక్షులు రాళ్ళు రువ్వుట కారంభించి నన్ను మర్దింప యత్నించుచుండఁగా, నాతోడవచ్చిన విద్యార్థులు దొమ్ములాటకయి వచ్చినయల్లరిమూకతో దలపడి వారికి నాయకుఁడై యుండిన బ్రాహ్మణుని దిట్టముగాఁ గొట్టుటచేతను తత్పట్టణారక్షక భటాధికారియు నామిత్రుఁడునైన గుమ్మిడిదల మనోహరము పంతులుగారు వచ్చి యాయల్లరిమూఁకను కొట్టులోఁ బెట్టింపఁజూచుటచేతను వేగముగానే యాదుండగపు బాపనగుంపు చెదరి పలాయనమయ్యెను. ఈ యల్లరిచేత నాటి కుపన్యాసము ముగియకుండనే సభ చాలింపఁబడినది. ఎదుటివాదము వినకుండ నల్లరిచేసినందువలన వారిదౌష్ట్యము వెల్లడియగుటతప్ప వారిపక్షమునకు వేఱులా భము కలుగలేదు. ఇట్లుదౌర్జన్యముచూపి ప్రతిపక్షులు నన్ను మర్దింప యత్నించుట యొక్క కాకినాడలోనే కాదు. నాస్వస్థల మయిన రాజమహేంద్రవరములో సహిత మట్టిప్రయత్న మొకసారి జరగినది. చెన్న పట్టణమువంటి రాజధానీనగరములోనే స్త్రీ పునర్వివాహమునుగూర్చి చాకలిపేటలో నేనుపన్యాసమిచ్చుచున్న సమయమునం దచ్చటి వైష్ణవబ్రాహ్మణులు దొమ్మిచేసి నాపయిని బడఁబోఁగా రావుబహద్దూరు శ్రీపనప్పాకము అనంతాచార్యులవారు నన్ను తప్పించి తమబండిలో నెక్కించుకొని తీసికొనిరావలసి వచ్చినప్పుడు చిన్న పట్టణములలో మూఢులిట్టి దౌర్జన్యమునకుఁ గడఁగుట యొకవింత గాదు.

మొట్టమొదట స్త్రీ పునర్వివాహసమాజ మని పేరు పెట్టుకొని పనిచేయ నారంభించినవారము నేనును నామిత్రులగు చల్లపల్లి బాపయ్యపంతులు గారును బసవరాజు గవర్రాజుగారును ఏలూరి లక్ష్మీనరసింహముగారును బయపునేడి వేంకటజోగయ్యగారును కన్నమురెడ్డి పార్థసారథినాయఁడుగారును ; చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రిగారు కాజ రామకృష్ణారావుగారు కొమ్ము రామలింగశాస్త్రిగారు మొదలైనవారుకూడఁ గొందఱు మాలో నటుతరువాత జేరిరి. ఈవిషయమయి తఱుచుగా వాదప్రతివాదములు జరగుచు వచ్చుట చేత విధవావివాహ మన్న శబ్ద మారంభదశయందువలె శ్రుతికటువుగానుండక కొంతకాలములో జనుల కది పరిచితపదమయి సహ్యమయినది. అనేకులకు విధవావివాహములు శాస్త్రసమ్మతము లనియు, అవశ్యా చరణీయములనియు, అభిప్రాయము కలుగసాగెను. బాలవితంతువులసంరక్షకు లనేకులు తమవితంతుకన్యలకు పునర్వివాహములు చేయ నుద్దేశించుకొన మొదలుపెట్టిరి. వితంతు కన్యలు దొరకినపక్షమున తాము వివాహమాడెద మని మాశాస్త్రపాఠశాలలోని విధ్యార్థు లనేకులు బైలుదేఱిరి. నేనును నామిత్రులగు బాపయ్యపంతులుగారును బోయి యింటింటికిని దిరిగియడుగఁగా లౌక్యులయిన బ్రాహ్మణ గృహస్థులు ముప్పదిమందికంటె నెక్కువసంఖ్యగలవారు వివాహసమయము నందు తాము భోజనములకు వచ్చెదమని వాగ్దానములు చేసి సమాఖ్యపత్రము
మీఁద వ్రాళ్ళు చేసిరి. ఇట్లు కాలక్రమమున శుభసూచకము లనేకములు కాన వచ్చినను, మే మీపని కారంభించినప్పుడు మాయొద్ద నొకకాసును నిధిగా లేదు ; ఎవరైన పెద్దమొత్తమిత్తు రన్న యాశయు మాకపుడులేదు. ఐనను గొన్ని వారములలోపలనే నాకు పరిచితులయిన శ్రీబారు రాజారావుపంతులు గారు శ్రీపైడా రామకృష్ణయ్యగారు రాజమహేంద్రవరమునకు వచ్చినప్పుడు నాకు వారితోడి మైత్రిని గలిగింపఁగా, వారప్పు డీపనినిమిత్తమయి ముప్పది వేలరూపాయల నిచ్చెదమని వాగ్దానము చేసిరి. ఈ వాగ్దానమువలన మాకు మఱింత యుత్సాహము గలిగి ద్విగుణధైర్యముతోఁ బనికి పూనినను, రెండు సంవత్సరములకు పిమ్మట ప్రథమవితంతువివాహ మగువఱకును పట్టిన సమస్త వ్యయములను నేనే వహించినాఁడను. "నేను చేసినయుపన్యాసములను ముద్రింపించి కొన్ని ప్రతులను విక్రయించినను విశేషభాగ మూరక పంచి పెట్టినాను; వాదమునిమిత్తమయి ముప్పదినలువదిస్మృతులను, ఇతరపుస్తకములను గొని కృషిచేసినాను ; బహు స్థలములయందున్న వారితో నుత్తరప్రత్యుత్తరములను జరపుచు, వలసినప్పుడితర స్థలములకుఁ గూడఁబోయి యుపన్యసించుచు వచ్చినాను; వివాహములు చేసికొనెదమని వాగ్దానములు చేసినవిద్యార్థులకుఁ గొందఱకు పాఠశాల జీతములకు సాహాయ్యముచేయుచు వచ్చినాను; బాలవితంతువు లున్న స్థలములను విచారించి సమాచారములు చెప్పుటకును కృషి చేయుటకును మనుష్యులకు సొమ్మిచ్చుచు వచ్చినాను; బాలవితంతువుల సంరక్షకులతో మాటాడుటకయి, అమలాపురము, మండపేట, తాళ్లపూడి, కాకినాడ, దొడ్డిపట్ల, విఝ్ఘేశ్వరము, రామచంద్రపురము, పాలకొల్లు మొదలైన స్థలములకు మనుష్యులను పంపుటయేకాక వీనిలో నొకటిరెండు స్థలములకు నేనును బోవుచు వచ్చినాను ; ఈప్రయాణములలో నొకసారి యొకపల్లెలో శీతకాలపురాత్రియం దొకమిత్రుఁడును నేనును పశువులపాకలోనిపశువులతోఁ గలిసి రొచ్చుకంపులో పరుండి నిద్రింపవలసి వచ్చినది. ఈకృషిలో నాకిక్కడి రాజకీయపాఠశాలలోని విద్యార్థులు మొదటినుండియు ముఖ్య సహాయులుగా నుండిరని చెప్పవలసి యున్నది. ఇప్పుడు వివాహములు చేసికొన్నవారిలో పులవర్తి శేషయ్యగారును నల్లగొండ కోదండరామయ్యగారును పైని జెప్పిన గ్రామములలో గొన్నిటికిఁబోయి కృషి చేసినందునకై నాకృతజ్ఞత నిక్కడఁ దెలుపుచున్నాను." [1]

మహారాజులు సహితము పూని నిర్వహింప లేకపోయిన యీమహా కార్యభారమును ధనవిద్యాధికారబలము లేని పిన్న వాండ్రము నలుగురైదుగురము పైని వ్రేసికొని శ్రమపడుచుండఁగా, ఇంతలో లోకానుభవమును విద్యాధికారములను నెక్కువగాఁ గలవారయి యీవిషయమున నత్యంతాదరము గలవారు సాయపడి మాకు చేయూఁతయయి నిలిచిరి. రాజమహేంద్రవరమునకుఁ గ్రొత్తగా న్యాయవాదిగా వచ్చిన న్యాపతి సుబ్బారావుపంతులుగారు మాలోఁజేరిరి. కాకినాడకు సబుజడ్జిగావచ్చిన శ్రీ కంచికృష్ణస్వామిరావు పంతులుగారు వాక్సహాయమునుజూపి మాకత్యంతప్రోత్సాహము కలిగింపఁ జొచ్చిరి. మొదటివివాహ మైదాఱుమాసములకు జరగుననఁగా ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు రాజమహేంద్రవరమునకు డిస్ట్రిక్టుమునసబుగావచ్చి మాకనేక విధముల తోడుపడఁ దొడఁగిరి ; చెన్న పట్టణమునకు చదువునిమిత్తమై పోయి యుండిన సోమంచి భీమశంకరముగారు మరలవచ్చి మమ్ముఁ జేరిరి. ఈప్రకారముగా మేము కొంతబలపడి రెండుసంవత్సరములు వాదప్రతివాదరూపమైన వాగ్యుద్ధమును నడపినతరువాత క్రియలేని నిరర్థకవాదములవలనఁ బ్రయోజనము లేదని తెలిసికొని, కష్టపడి యేలాగుననైనఁ గొన్ని వివాహములను జరపవలెనని నిస్ఛయించుకొని, ఆత్మూరి లక్ష్మీ నరసింహముగారును న్యాపతి సుబ్బారావు పంతులుగారును కొమ్ము రామలింగశాస్త్రిగారును బసవరాజు గవర్రాజుగారును నేనును జేరి యైదుగుర మొకయాంతరంగికసమాజముగా నేర్పడి, మాప్రయత్నముల నితరులతో మాప్రాణమిత్రులతో నైనను జెప్పకుండు నట్లు మాలో మేము ప్రమాణములు చేసికొని, రహస్యముగా కార్యాలోచనము చేయుట కారంభించితిమి. మేమీప్రకారముగా కార్యములు జరపుటకు కృతనిశ్చయులమయి గూఢముగా పనిచేయుచుండుటయు, వివాహసమయమున భోజనముల కెవ్వరు వచ్చెదరో తాంబూలముల కెవ్వరు వచ్చెదరో ప్రతిపక్షము పూనక సహాయులుగా నెవ్వరుందురో తెలిసికొనుటకు లక్ష్మీ నరసింహముగారిలోపల రెండు సభలు చేయుటయు, తెలిసికొని స్త్రీ పునర్వివాహనిషేధపక్షమువారు భయపడి, మాప్రయత్నములు మాటలతోఁ బోక కార్యములకు వచ్చునట్లున్నవని సంచలించి తొందరపడి తమమాంద్యమును విడిచి చుఱుకుఁదనము వహించి తామును సభలుచేసి మాప్రయత్నములకు విఘ్నములు కలుగఁ జేయుటకయి యుపాయముల నాలోచింప మొదలు పెట్టిరి. ఒకదినమునఁ బూర్వాచార పరాయణులయిన లౌక్యులును వైదికులును మార్కండేయ స్వామియాలయములో సభచేరి నన్ను వర్ణమునుండి బహిష్కారము చేయుటకును విధవావివాహముల కేవిధమయిన తోడ్పాటు చూపెదమన్నను వారినందఱిని వెలివేసెదమని వెఱపించుటకును ముందే నిశ్చయించుకొని వచ్చి, తగుమనుష్యుని నొక్కనిఁ బంపి నన్నా దేవాలయమునకు రప్పించిరి. ఆసభా నాయకుల యనుమతితో మూర్ఖులైన యాపక్షపు బ్రాహ్మణులు కొందఱు సభావసానమునఁ బోవునప్పుడు సందడిలో నన్నుఁ గొట్టవలెనని యుద్దేశించుకొని వచ్చిరఁట ! ఈవార్త యెట్లో విద్యార్థులలో నొకరిద్దఱి చెవిసోఁకఁగానే సభ యారంభమయిన యరగంటలోపల దేవాలయమంతయు రెండువందల విద్యార్థులతో నిండిపోయినది. వారిలో ననేకులచేతులలో కఱ్ఱలుండినవి. కొందఱు విద్యార్థులు ముందుకు తోసికొనివచ్చి పెద్దమనుష్యుల నీవలావలలకుఁ దోసి నడుమను నాచుట్టును గూర్చుండిరి. ప్రతిపక్షుల దురాలోచన నాకప్పుడు తెలిసియుండక పోవుటచేత విద్యార్థులప్రవర్తనము నా కప్పు డవినయముగా తోఁచినది. నావిషయమయి దౌర్జన్యము జరగింపఁ దలఁచుకొని వచ్చిన యాదుష్టవిప్రులు విద్యార్థుల సంఖ్యనుజూచి భయపడి తమకేమి పరాభవము వచ్చునోయని ప్రొద్దుగ్రుంకకముందే మెల్లఁగా నావలికి జాఱిరి. సభవారును మొదట నుద్దేశించుకొని వచ్చినపనిని జరప నేరక తమ యిండ్లకుఁ బోవలసినవా రయిరి. దేవాలయమున కెదురుగానుండిన పత్రికా వహనకార్యస్థానములో నుద్యోగములో నుండినవారును నామిత్రులును నగు కొచ్చెర్లకోట సుందరరామయ్య గారు మేడమీఁద నిలుచుండి దేవాలయములో నడచుచున్న దంతయుఁ జూచుచుండి, నేను వీధిలోనికి రాఁగానే మేడదిగి వచ్చి నన్నుఁ గలిసికొని బ్రాహ్మణులు నావిషయమయి చేయఁదలఁచుకొన్న దుష్టప్రయత్నము తనకుఁ దెలియరాఁగా సమయము వచ్చినప్పుడు పంపి వారిని మర్దింపించుటకయి టపాలు మోచువారిని పదుగురను సిద్ధముగా నుంచియుంటినని నాతోఁ జెప్పిరి. ఆదినము మొదలుకొని పట్టణములో సంక్షోభమును కక్షా వేశములును మఱింత ప్రబలసాగెను,

1880, 1881 వ సంవత్సరములలో మావివేకవర్ధనియు ప్రార్థానాసమాజమును విద్యార్థుల సంఘసంస్కరణసమాజమునుగూడ మహోత్సాహముతో మిక్కిలి చుఱుకుగాఁ బనిచేయుచుండెను. విరూపాక్షపీఠస్థులైన మాశంకరాచార్యస్వాములవారు విజయనగరమునుండి బైలుదేఱి దారిపొడుగునను భిక్షలును పాదపూజలును గైకొనుచు మాగోదావరీమండలమునకు వచ్చుచుండిరి. ఇట్టి యాచార్యస్వాములవారు భిక్షలని పాదపూజలని పేరులు చెప్ప ధనాకర్షణము చేయుచుండుటయేకాని సాధారణముగా శిష్యులకు మతబోధ చేయవలెనన్న చింతయే వారికుండదు. వారిలోఁ గొందఱికి మతగ్రంథముల పేరుల కంటె భక్ష్యముల పేరులే యెక్కువగాఁ దెలియును. ఇందునుగూర్చిన పూర్వ కథ యొకటిగలదు. ఒక స్వాములవారొకగృహస్థునియింటికి భిక్షకు దయచేసిరఁట. భిక్షానంతరమున స్వాములవారు వేదాంతగ్రంథపారాయణము చేసి కొందురేమో యని తలఁచి యాయింటిగృహిణి యతీశ్వరునికడకు వచ్చి "స్వామీ ! భగవద్గీతలు తెత్తునా ?" యని యడిగెనఁట ! ఆపే రాస్వాములవారెన్నఁడును విన్నది కాకపోవుటచేతఁ గొంతసేపాలోచించి యదియు నేమో భక్ష్యవిశేషమని భావించి "అమ్మా ! ఇప్పుడు కడుపునిండుగానున్నది. మఱి రెండుగడియలసేపు తాళి తీసికొని రమ్ము." అని యుత్తరము చెప్పెనఁట ! యతీశ్వరులలో ననేకులకు మతవిషయకజ్ఞాన మీరీతిగానేయుండును. రాజమహేంద్రవరమున జరుగుచున్న విధవావివాహప్రయత్నమునుగూర్చి తునియొద్ద నున్న ప్పుడే మాస్వాములవారు విని తా మచ్చటకు విజయంచేసి నప్పు డాపనిలోఁ బ్రవేశించినవారి నందఱిని వెలివేసేదమని యానతిచ్చిరఁట ! పీఠాధిపతుల యర్హ కృత్యములనుగూర్చియు, వారు విత్తాపహరణమునిమిత్తము చేయుచున్న యకృత్యములనుగూర్చియు, వారిని స్వకృత్యమునకు మరల్చుటకు శిష్యులు చేయవలసిన కర్తవ్యమునుగూర్చియు, మా వివేకవర్ధని బహువిధముల వ్రాసి ప్రజలకన్నులు తెఱపుట కారంభించినది. ఈస్వాములవారు మగనినివిడిచి లేచిపోయి బహిరంగముగా జగన్నాధపురములో వ్యభిచరించు చుండిన యొక బ్రాహ్మణకులటవలన ధనస్వీకారమునుజేసి యా యిల్లాలివలన భిక్ష గైకొని భార్యను విడిచి పెట్టినందునకయి దానిమగనికి బహిష్కారపత్రికను బంపి యాతనికి శుద్ధపత్రిక నిచ్చుటకయి యధికవిత్తమును లాగఁజూచిరి; రాజమహేంద్రవరమునందు మండలన్యాయసభలో క్రిమినల్ రికార్డుకీపరుగా నుండి యుద్యోగమును బోఁగొట్టుకొని యేఁబదియేండ్లు దాఁటియున్న బొల్లాప్రగడ వెంకన్న గారను వృద్ధగృహస్థు చిరకాలముక్రిందటనే ముట్లుడిగినయేఁబదియేండ్ల వృద్ధాంగనతో వ్యభిచరించినట్లు నేరము మోపి యాయనకు బహిష్కారపత్రికను బంపి విశేషవిత్తము నాకర్షించుటకయి ప్రయత్నించిరి, చిరకాలముక్రిందటనే కులము విడిచి లేచిపోయి తురక పేటలోఁ గాపురముండి బిడ్డలనుగన్న యొక బ్రాహ్మణకులటయొక్క పుత్రుని తమపీఠమువద్ద శిష్యునిగా స్వీకరించిరి. ఇవి యన్నియు వివేకవర్ధని వెల్లడించుటచేత రాజమహేంద్రపుర వాసులు స్వాములవారియెడ గౌరవము లేనివారయి మాపురమునకు వచ్చినప్పుడు వారికి భిక్షలు చేయకుండిరి. ఈప్రకారముగా నెవ్వ రెవ్వరినో వెలివేసెదమని వేంచేసిన స్వాములవారు మాపురమున భిక్షలుగానక తామే వెలిపడవలసినవారయిరి. నేనే మధ్యవర్తినిగానున్న సభలో జరపఁబడినయేర్పాటునుబట్టి స్వాములవారు కులటాపుత్రుఁడైన తమశిష్యునిఁ బీఠమునుండి పంపి వేసినతరువాతనే పట్టణములో వారికి భిక్షలుజరగినవి. స్త్రీ పునర్వివాహవిషయమైన శాస్త్రమునుగూర్చి సిద్ధాంతనిర్ణయము చేయవలసినదని నేనును న్యాపతి సుబ్బారావు పంతులుగారును కాజ రామకృష్ణారావుగారును వ్రాళ్లు చేసి స్త్రీపునర్వివాహ ప్రవర్తక సమాజమువారి పక్షమునఁ బంపిన విజ్ఞాపనపత్రము ననుసరించి జరగినసభలో స్వాములవారిపక్షమునఁ వచ్చినప్రతినిధి యయిన యద్దేపల్లి కృష్ణశాస్త్రులవారు "స్వాములవారు బహుజనులయిష్టానుసారముగా నడవవలసినవారుగనుక బహుజనులు చేరి స్త్రీపునర్వివాహము తమకిష్టమని సంఘవిజ్ఞాపనమును వ్రాసి కొన్నచో వారాలోచింతురనియు, శాస్త్ర మెట్లున్నను పూర్వకాలములయందు సహితము దేశకాలానుగుణముగా నిబంధనముల నేర్పఱుచుకొనుచుండుట గలదనియు, బహుజనాభిప్రాయమునుబట్టియు దేశమునఁ గలుగుచున్న నష్టములనుబట్టియు నాలోచించి ప్రస్తుతకాలమునకుఁ దగినట్టుగా నిప్పుడు క్రొత్త నిబంధనముల నేర్పఱుచుకొనుట కేయాక్షేపమును లేదనియు," చెప్పి యప్పటికి తప్పించుకొనవలసిన వారయిరి.

1880, 1881 వ సంవత్సరములలో మాప్రార్థనాసమాజముకూడ మహోచ్చదశయం దుండినది. నేనే దానికి నియతధర్మోపన్యాసకుఁడనుగా నుండెడివాఁడను. నాధర్మోపదేశములను వినుటకు వందలకొలఁదిజనులు వచ్చెడువారు. ఇతరసామాజికులును మహోత్సాహముతోఁ బనిచేసెడువారు. ఏలూరి లక్ష్మీనరసింహము గారు మాయందఱికంటెను నప్పు డధికోత్సాహమును శ్రద్ధాళుత్వమును భక్తియుఁ గనఁబఱచెడివారు. అప్పటి యాయన వ్యగ్రతను జూచి యాయనవలన దేశమున కెంతో మేలు కలుగునని నే ననుకొనెడివాఁడను. పరిశుద్ధాస్తికమత వ్యాపనమునిమిత్తమయి యాయన యాస్తిక పాఠశాల యను పేరితో నొకపాఠశాలను స్థాపించెను. పాఠశాలాస్థాపనమునందు మే మందఱము నేకీభవించియే పనిచేసితిమికాని దానిని నడుపువిషయమయి మాలో నభిప్రా


యభేదము కలిగినది. ఆస్తికపాఠశాలయని పేరు పెట్టినప్పుడు సొమ్మునిమిత్తము చూడక ప్రథమోద్దేశానుసారముగా దానిలో మొదటినుండియు పరిశుద్ధాస్తిక మతసిద్ధాంతములను బాలురకు నేర్పవలయునని నాయభిప్రాయము. మొదట నే యట్టిపనికిఁ బూనినయెడల పాఠశాలకు బాలురంతగా రారుగనుక పాఠశాల బలపడిన తరువాత క్రమక్రమముగా పరిశుద్ధాస్తిక మతసిద్ధాంతముల నందుఁ జొప్పింపవలయు నని లక్ష్మీనరసింహముగారి యభిప్రాయము. కొందఱు నాయభిప్రాయముతోను కొందఱాయన యభిప్రాయముతోను నేకీభవించిరి. ఆపాఠశాలాభవనములోనే విద్యార్థులకును తదితరులకును నుపయోగపడుట కయి యాస్తికమతపుస్తకములను జదివి బోధించుటకయి యొకతరగతి పెట్టఁబడినది. మా వితంతూద్వాహసమాజమును ప్రార్థనాసమాజమును ప్రబలు చుండుట చూచి పూర్వాచారపరాయణులయిన బాలికాపాఠశాలకార్య నిర్వాహకులు మాసభలకు బాలికాపాఠశాలామందిరము నియ్యక పోవుటచేత ప్రార్థనాసమాజము నాయాస్తికపాఠశాలలోనే పెట్టితిమి. 1881 వ సంవత్సరము మార్చి నెలలో పండిత శివనాథశాస్త్రిగారు రాజమహేంద్రవరమునకు వచ్చి హృదయోత్తేజకము లయిన యుపన్యాసముల నిచ్చిపోయిరి. ఆయుపన్యాసములవలన నింగ్లీషు చదువుకొన్న వారిలోను విద్యార్థులలోను సత్కార్యోత్సాహము హెచ్చినది. విద్యార్థులు తమలోఁ దాము ప్రత్యేకముగా ప్రార్థనాసమాజముల నేర్పఱుచుకొని యేకేశ్వరారాధనము చేయసాగిరి. విద్యార్థులు బీదల యుపయోగమునిమిత్తమయి రాత్రిపాఠశాలలను స్థాపించి వంతులు వేసికొని రాత్రులుపోయి పనివాండ్రకు పాఠములుచెప్పుచు వచ్చిరి. ఈపాఠశాలలవిషయమయి రబ్బాప్రగడ పాపయ్యగారు, తాయి సూర్యప్రకాశరావుగారు, పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు మొదలయిన విద్యార్థు లనేకులు మహోత్సాహముతో పని చేయుచుండిరి. రాత్రిపాఠశాల విషయమయి విద్యార్థులకును మఱికొందఱు పెద్దమనుష్యులకును కొన్ని తగవులువచ్చి విద్యార్థులు తాము క్రొత్తగా వేఱొకపాఠశాలను స్థాపింపవలసివచ్చి నను, తుదకు


విద్యార్థులపాఠశాలయొక్కటియే యిప్పటికిని నిలిచి నగరపారిశుద్ధ్యవిచారణ సంఘమువారి పరిపాలనము లోనున్నది. తమమరణమువఱకును బసవరాజు గవర్రాజుగా రారాత్రిపాఠశాలకు కార్యనిర్వహకులుగా నుండి యెంతో శ్రద్ధతోఁ బని చేయుచుండెడివారు. నేనును నామిత్రులును విద్యార్థుల నిట్టి సత్కార్యములకు పురికొల్పి ప్రోత్సాహపఱుచు చుండెడివారము. రబ్బాప్రగడ పాపయ్యగారు, పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు మొదలైన విద్యార్థులు ప్రార్థనసమాజ కార్యములలోను శ్రద్ధాభక్తులు కనఁబఱచి బీదలకన్న దానము చేయుట మొదలగు సమస్తసత్కార్యములలోను మిక్కిలి శ్రమపడుచుండెడి వారు. ఆస్తికపాఠశాలనుబట్టి ప్రార్థనాసమాజము రెండుశాఖలయినదిగాని యాక్రొత్తశాఖ యప్పుడే యంతరించి మాసమాజముమాత్రమే నేటికిని నిలిచి యున్నది. ఆస్తికపాఠశాల స్థాపింపఁ బడినయుద్దేశ మటుతరువాత సహిత మెప్పుడును నెఱ వేఱనే లేదు.

మాశాస్త్రపాఠశాలలోనివిద్యార్థులు ఇన్నీసు పేటలో నొకబాలికాపాఠశాలను సహితము స్థాపింప నుద్దేశించిరి. అట్లుద్దేశించినవారిలో పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు మొదలయినవారు ముఖ్యులు. విద్యార్థులు పగలు బాలికా పాఠశాలలో పని చేయుటకు వలనుపడనందునను, ధనవ్యయము చేయుటకు శక్తులు కానందునను, వారిపక్షమున నేనాపనికిఁ బూని మిత్రులచేత చందాలు వేయించి యిన్నీసుపేటలో 1881 వ సంవత్సరమున నొకబాలికాపాఠశాలను స్థాపించితిని. మాశాస్త్రపాఠశాలాధ్యక్షులయిన మెట్కాపుదొరగారు వ్రాయుటచేతఁ గొంతకాలము శ్రీ పిఠాపురపురాజుగా రాబాలికాపాఠశాల నుంచుటకయి తమసత్రము నిచ్చిరి. నేను దానికిఁ గార్యనిర్వాహకుఁడనయి యుండి నేను నగరపారిశుధ్యవిచారణసంఘములో సభ్యుఁడ నగుటచేత మొదటిసంవత్సరము నెలకు పదేసిరూపాయలచొప్పునను, రెండవ సంవత్సరము పదునై దేసి రూపాయలచొప్పునను, మూడవసంవత్సరము మిరువదేసిరూపాయలచొప్పునను, సహాయద్రవ్యము నిప్పించుచు వచ్చితిని. దొరతనమువారును


వేఱుగ దానికి సహాయధనము నిచ్చుచుండిరి. దానికి విఘాతము కలిగించుట కయి యోర్వలేనివారు కొందఱు ప్రయత్నము చేసినను వారికృషి సఫలము గాక తరువాత నది దొరతనమువారిచేఁ గైకొనఁబడి స్థిరపడి బాలికా విద్యాభ్యాసమున కత్యంతోపయుక్తమై యున్నది.

కులాచారవిషయములలోను రాజకీయవ్యహారములలోను గల యనేక దురాచారములను వినోదకరముగా సంభాషణరూపమున వెల్ల డిచేసి తన్మూలమున దురాచారములను మాన్పుటకయి వివేకవర్ధని కంతర్భాగముగా హాస్య సంజీవని ప్రకటింపఁబడుచుండెను. ఇందుఁ బ్రకటింపఁబడినవానిలో నొకటియగు వ్యవహారధర్మబోధినిని నామిత్రులు కొందఱును విద్యార్థులు కొందఱును జేరి 1880 వ సంవత్సరమున శ్రీవిజయనగరము మహారాజుగారి బాలికా పాఠశాలలో మొదటఁ బ్రయోగించిరి. అందు న్యాయాధికారుల యొక్కయు న్యాయవాదులయొక్కయు దుశ్చర్యలు పరిహాసరూపమునఁ బ్రకటింపఁబడినవి. వానిని బ్రదర్శించుటవలన నం దభివర్ణింపఁబడిన దోషములు గలవారిమనస్సులకుఁ గొంత నొప్పి గలిగినను, ఇటువంటిరూపకములను బ్రదర్శించుట కదియే మొదలయినందున నూఱులకొలఁదిజనులు వచ్చి చూచి యానందించిరి. ఇట్టినాటకప్రదర్శనమువలన జనులకు వినోదము కలుగుటయేకాక యక్రమములు చేయువారు సిగ్గుపడి తమప్రవర్తనమును దిద్దుకొనుటయు నందువలన నీతివర్ధిల్లుటయుఁ గలుగునుగానఁ గ్రొత్తనాటకములను జేసి నాటకసమాజము నొకదానిని స్థాపింపవలసినదని నామిత్రు లనేకులు నన్నుఁ గోరిరి. వారికోరిక ననుసరించి 1881 వ సంవత్సరములో కడపటి భాగమున నొక నాటకసమాజమును స్థాపించి, ధార్వాడనాటకులు వచ్చి నాటకములాడి విడిచిపోయిన పాకలోనే "చమత్కారరత్నావళి" "రత్నా వళి" యను రెండునాటకములు చేసి యాడించితిని. అట్టినాటకము లాడుట కదియే ప్రథమప్రయత్న మైనను, మొత్తముమీఁద నవి జయప్రదముగానే జరగినవని యెల్లవారు నభిప్రాయపడిరి. ఈనాటకప్రయోగమువలన సహితము పట్టణములో సంక్షోభము కలు


గకపోలేదు. ఆనాటకములయందలి పాత్రములు విస్తారముగా పాఠశాలలోని విద్యార్థులు. నాటకములలో వేషములు వేయుట గౌరవహానికర మని యనేకులయభిప్రాయ మగుటచేత విద్యార్థులసంరక్షకులు తమబాలురచేత వేషములు వేయించినందునకయి నామీఁద నభియోగము తెచ్చెదమని నన్ను బెదరించిరి. నాటక ప్రదర్శనమువలన విశేషలాభము కలుగు ననియు నీతి వృద్ధియగుననియు నేను దలఁచి యుండినను, విద్యార్థులు నాటకము లాడుటయందలి యుత్సాహముచేతఁ దమపాఠములయం దశ్రద్ధను జూపునట్లు కనఁబడి నందున నాటకసమాజములయం దటుతరువాత నే నంతగా నాదరము చూపుచు రాలేదు.

1881 వ సంవత్సరమునందు మావిద్యార్థుల సంఘసంస్కరణసమాజము సహితము మిక్కిలి యుత్సాహముతోఁ బని చేయుచుండెను. నేను విద్యార్థిని గాకపోయినను సామాజికులలో నొకఁడనుగాఁ జేరి వారు చేసెడి ప్రతిసభకును బోయి ప్రోత్సాహపఱుచుచుండెడివాఁడను. ఈసమాజమునకుఁ గార్యదర్శి పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు. ఆయనయప్పుడు పట్టపరీక్షతరగతిలోఁ జదువు కొనుచుండెడివారు. ఆసమాజములోఁ జేరినవారు తాము చుట్టలు త్రాగుట పొడుముపీల్చుట మొదలయిన దురాచారములు మానుటకును బోగము మేళముల యాటపాటలకుఁబోవ కుండుటకును సమస్తసంఘసంస్కరణముల యందును తోడుపడుటకును ప్రతిజ్ఞలను గైకొనిరి. వారితో నేను సహిత మాప్రతిజ్ఞలనుగైకొంటిని. అప్పుడు విద్యార్థులుగానుండి ప్రతిజ్ఞలు గైకొన్న పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు మొదలయినవారు క్రమక్రమముగా తామున్నత స్థితికివచ్చి లౌక్యాథికారధూర్వహులయినతరువాత సహితము బాల్యము నందుఁ జేకొన్నప్రతిజ్ఞల నతిక్రమింపక మరణపర్యంతమును పాలించుచు వచ్చిరి. అట్లు ప్రతిజ్ఞాపాలనము చేయుచున్నవారిలో నేనొక్కఁడను. నేను బాల్యమునుండియు ప్రబలమైన ---చేత బాధపడుచున్న వాఁడను. చుట్ట


కాల్చుటవలన దగ్గుపోవునని యాశపెట్టి నామిత్రులును బంధువులును వైద్యులు కొందఱును నాచేత చుట్టలు కాల్పింపవలెనని బహువిధముల ప్రయత్నము చేసిరికాని యీశ్వరానుగ్రహమువలనను స్వాభావికమైన నా దృఢనిశ్చయత్వమువలనను వారిహిత బోధనలకు లోఁబడినవాఁడను గాను.[2]

మార్కండేయస్వామి యాలయములో సభజరిగినదినము మొదలుకొని మాపట్టణములోని పూర్వాచారపరాయణులలో సంక్షోభము హెచ్చుటకు మఱికొన్ని కారణములు కూడ తటస్థించెను. నాయుపన్యాసములవలనను బోధనలవలనను కలిగిన యుత్సాహముచేత విద్యార్థుల నేకులు తాము వితంతు కన్యలను వివాహమాడి లోకమునకు దారిచూపెదమని నిశ్శంకముగా ఘోషింపమొదలు పెట్టిరి; వితంతుకన్యలు సహితముకొందఱు తమ డెందములలో నంకురించిన సుఖాశాబీజములు మొలకలెత్తి పయికిలేచి యుత్సాహపఱుపఁగా సంతోషచిహ్నములను కనఁబఱుపసాగిరి. ఈ సంబంధమున రాజమహేంద్రవరమున నడచినయొక చిన్నవృత్తాంతము నిందుదాహరించెదను. జ్యోతిశ్శాస్త్ర విదుఁడయి వైదికమార్గోపజీవియయిన యొక శిష్టబ్రాహ్మణగృహస్థుఁ డుండెను. పినతండ్రి కూఁతురగు పదునాఱేండ్ల ప్రాయముగల యనాధబాల వితంతు వొకతె యాయనయొద్దనుండెను. పిన్న వయస్సుగలదగుటచే నాబాల వితంతువు చీరలు కట్టుచు, రవికలు తొడుగుచు, నగలు ధరించుచు బొట్టు లేక పోవుటచేఁ దక్క నితరవిషయములయం దించుమించుగా సువాసినివలెనే యుండెను. అప్పటివితంతు వివాహప్రయత్న జనిత సంక్షోభభీతిచేత సంరక్షకులు బ్రహ్మచారి బాలురకు బలాత్కార వివాహమహోత్సవములు జరప వేగిరపడునట్లే బాలవితంతు బ్రహ్మచారిణులకు వస్త్రాలంకారములను తొలఁగించి కేశఖండనమహోత్సవములునడప త్వరపడుచుండిరి. ఈసందడిలో మన దవజ్ఞ శిఖామణి తనవిధవచెల్లెలికి చీరలుమాన్పి వితంతువులుకట్టెడి యంచులేనిముతుకబట్ట కట్టింపనెంచి యంగళ్లవాడకుఁబోయి యొకముతుకబట్ట కొని


తెచ్చి "అమ్మాయీ! నీనిమిత్త మీబట్టతెచ్చితి" నని చెల్లెలిచేతికీయఁ బోయెను. ఆవితంతుబాల దానిని గైకొనక "అన్నయ్యా ! నా కిప్పుడు చీరలున్నవి. ఈ బట్టలు వదినెకిమ్ము" అని బదులుచెప్పెను. ఆమాటల కతఁడు మండిపడి "ఇదేమి చేటుకాలమే? విధవలుకట్టుకోవలసిన యీబట్టను ముత్తైదువకిమ్మ నెదవు ?" అని మందలించెను. "అన్నయ్యా ! కోపకడకు. నీభార్యవలెనే ముత్తైదువను కాఁబోయెడు నాకుమాత్ర మీబట్టపనికివచ్చునా?" అని సంశయింపక యాగడుసరిపడుచు ప్రత్యుత్తరముచెప్పెను. ఆమాటల కతఁడు విస్మయపడి గుండెలు బాదుకొనుచు సభాపతులవద్దకు కొంపమునిఁగిపోయినట్టు పరుగెత్తిపోయి తనయింటనడచిన వైపరీత్యమును విన్న వించి యంగలార్చెను. వారాతని నూఱడించి తగిన ప్రతిక్రియ నాలోచించెదమని చెప్పి యప్పటి కింటికిఁ బంపివేసిరి. ఆ చిన్న దానికి పుట్టు వెండ్రుకలు తీయించఁ బడెనో వివాహముచేయించఁబడెనో యేమిజరగెనో వినవలెనని దీనింజదువు వారికి కుతూహలము కలుగవచ్చును. ఈ రెంటిలో నేపనియు జరగ లేదు. ఆ బాలవితంతువు బలవంతముగా శిరోజములు తీయించుటకు లోఁబడునది కాకుండెను. అందుచేత బంధుబృందమును శిష్టవర్గమును నాలోచించి నడిమిమార్గము నొకదానిని కనిపెట్టి తమకుల గౌరవమును కాపాడుకొనిరి. మనవారు పూర్వాచార పరాయణులగుటచేత నీతిబాహ్యమైన గూఢ వ్యభిచారము నైన నంగీకరింతురుగాని యాచారవిరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు. ఇంట నేయుండి వివాహముతోఁ బనిలేక నీమనసునచ్చినవానితో స్వేచ్ఛముగా విహరింపవచ్చుననియు, నీస్వైరిణీవ్యవహారమున కెవ్వరును నడ్డురాఁ గలవారుకారనియు, నమ్మఁబలికి కావలసినవా రాయనాధబాలను వివాహ ప్రయత్నమునుండి విముఖురాలిని జేసిరి. ఱంకుసాగినపెండ్లి యక్కఱలేదను సామెతను ప్రమాణముగాఁ గైకొని యాయభాగ్యురాలిప్పటికిని కులములోనే యుండి దుర్వృత్తియందు కాలముగడపుచు బహిష్కారబాధలేక కులమును పావనము చేయుచున్నది. మా ప్రతిపక్షు లనాధబాలికాకేశ ఖండనాదులయందు పాటుపడుచుండఁగా మేము తద్రక్షణోపాయా న్వేషణమునందు నిరంతర కృషిచేయుచుంటిమి. ఇంచుక విద్యాగంథముగల వితంతువులు కొందఱు తమ్ము నిరంతర వైధవ్య దుఃఖమునుండి తప్పించి కాపాడవలసినదని నాకుత్తరములు వ్రాసిరి. అప్పుడు నేనును నాతోఁజేరినవారును స్త్రీపునర్వివాహసంస్కారము యుక్తవయస్సురాని వితంతుకన్యల వివాహముతో నారంభించిన పక్షమున బహు జనరంజకముగానుండి యత్యంత శీఘ్రకాలములో వ్యాప్తికాంచఁ గలుగునని భావించియుంటిమి. ఇట్టి వితంతుకన్యలకు వివాహములు చేసెదమని బైలుదేఱినవారుసహితము కొంద ఱేర్పడిరిగాని తామిందులో ముందుగా నడుగిడుదు మనువారుమాత్రము కానఁబడలేదు. ఎల్లవారును ముందొక వివాహమైనయెడల తాము రెండవవారముగా నుందుమనెడువారేకాని తామే మొదటివారముగా నుందుమను ధైర్యశాలులు బైలుదేఱలేదు. ముందుగా నెవ్వరైన నీ కార్యమునందు ప్రవేశించుటచూచి వారికి కష్టములు వచ్చినపక్షమున తాము తప్పించుకొని దూరముగా తొలఁగుటకును వారికి కష్టములు రానిపక్షమున తామును ప్రవేశించి సుఖమనుభవించుటకును గోరుచుండుట లోకస్వభావము కదా ! ఈసాహసిక కార్యమునందు ముందంజెవేయుట కెవ్వరినైన నొక్కరిని సమ్మతిపఱుచుటకు స్వయము గామాటాడియు, మిత్రులచే మాటాడించియు, మనసుకరఁగునట్లుగా రహస్య లేఖలనువ్రాసియు, నానాముఖముల కృషిచేయుచునే యుంటిమి. అప్పుడు విద్యార్థిగానుండి సర్వవిధముల మాకు సాయపడు చుండినట్టియు, తరువాత మా గోదావరీమండలములో, మండల కరగ్రాహి సిరస్తాదారు పదవియందుండి యిప్పుడు కీర్తి శేషులయినట్టియు, పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు పట్టపరీక్షార్థము చెన్న పట్టణమునకుఁబోవుచు పొగయోడ నెక్కుటకయి కాకినాడకువెళ్లి యచ్చటినుండి 1881 వ సం. నవంబరునెల నాలవ తేదిని నాపేర వ్రాసినలేఖలోనుండి యొక భాగమును మాయప్పటి కృషిని దెలుపుటకయి యిందుఁ బొందుపఱుచుచున్నాను. "గౌరవనీయుఁడవైన మిత్రుఁడా ! .............. నేను పెద్దిభట్ల యజ్జన్నగారితో మాటాడినాను. అతఁడు తనవితంతుసోదరిని స్వశాఖవాఁడయి వృద్ధికి రాఁదగిన చిన్నవాని కెవ్వనికైననిచ్చి వివాహము చేయుటకు సంసిద్ధుఁడయి యున్నాఁడు. నాలుగయిదు మిధునములనుమాత్రము గలదయిన పక్షమున మొదటిగణములోనే చేరుటకు సహితమతఁడు సంసిద్ధుఁడయి యున్నాఁడు. అతఁడు వెనుకతీయఁడని మీరు నమ్మియుండవచ్చును. ఆతని మేనమామలును తక్కినపెద్దలును పయికిమాత్ర మసమ్మతిని కనఁబఱచునట్లుందురుగాని కడపట మనపక్షమువారుగానే యుందురని నాకు రహస్యసమాచారము తెలిసినది. ఈయుత్తరము చేరినతత్క్షణమే మీవద్దకు రావలసినదని యజ్ఞన్న గారికి వ్రాయుఁడు మీ యొద్దనుండి యుత్తరము వచ్చినతరువాత మిమ్ముపోయి కలిసికొని యావశ్యకములైన యేర్పాటులన్నియు చేయుటకీతఁడు వాగ్దానము చేసియున్నాఁడు.

నేనొకవ్యాపారి (మాధ్వ) మనుష్యుని భద్రపఱుచుటకుఁగూడ శక్తుఁడ నయినాను. అతఁడు వితంతువును వివాహమాడును. అతఁడు సుమారిరువది రెండుసంవత్సరముల ప్రాయమువాఁడు ; సామాన్య పరీక్షయందు తేఱినవాఁడు; ఇప్పుడు ప్రాథమికపాఠశాలలో పదునేనురూపాయల జీతముగల యుపాధ్యాయుఁడుగానున్నాఁడు. మీరు వ్రాసెడుపక్షమున, అతఁడుకూడ మీ వద్దకువెళ్లి యేనియమముల నతఁడు నెఱవేర్పవలసియుండునో ప్రస్తావించును. అతఁడు బీదస్థితియందున్న వాఁడని నేనెఱుఁగుదును.

నేటి యుదయకాలమున రామకృష్ణయ్యగారిని కలిసికొంటిని. మీతో చేసినవాగ్దానములనే యతఁడు చేసెను. దృఢముగానుండి పట్టుదలచూపుఁడని యతఁడు మనలఁగోరుచున్నాఁడు. ఆయనవిషయమయి యిక్కడ వ్యాపించియున్న వాడికనుబట్టి విచారింపఁగా, ఆయన మిక్కిలి యుత్సాహము కలవాఁడుగానున్నాఁడు. ఈ స్థలములోని యాతని కులజనులయొక్కయు నితరుల

యొక్కయు ద్వేషయుక్తములైన దూషణలను సరకుగొనక యతఁడు తనపట్టును వదలకుండును. అప్పుడప్పుడొక ప్రోత్సాహకరమైన యుత్తరముతో నాతనిని తాఁకి పైకిలేపుచుండుఁడు.

ఇంచుమించుగా నొకగంటకాలములో మేము ధూమనౌక నెక్కుదుము. [3]

మిత్రులలేఖ లిటువంటివి పెక్కులున్నను, ముందుపనికయి దీనిని మాత్ర మిచటఁ బ్రచురించుచున్నాను. ఇది యిట్లుండఁగా కృష్ణామండలములోని తిరువూరు డిప్యూటీ తహస్సీలుదారుగా నుండిన బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందముగారు తమతాలూకాలోని యొకగ్రామములో పండ్రెండేండ్ల యీడుగల యొకవితంతు బ్రాహ్మణకన్యయున్న దనియు, తగుమనుష్యులను పంపఁగలిగినయెడల తల్లిని సమ్మతిపఱచి యాచిన్న దానిని వారివెంటఁ బంపునట్లు ప్రయత్నముచేసెదమనియు, నాకొకలేఖను వ్రాసిరి. ఈ విషయమయి కొంతయుత్తరప్రత్యుత్తరములు జరగినతరువాత నామిత్రుఁడు తిరువూరినుండి 1881 వ సంవత్సరము నవంబరు నెల యైదవ తేదిని నాకిట్లువ్రాసెను.

"మీ యుత్తరములు యుక్తకాలములోనే నాకు చేరినవి. ఆబాల వితంతువుయొక్కతల్లి తనగ్రామమునువిడిచి బంధువులనుజూచుటకయి పోయినందున, ఆమెతో మాటాడి యింతకంటె ముందుగా మీకు ప్రత్యుత్తరము పంపలేక పోయితిని. ఆమెతో నేనిప్పుడేమాటాడితిని. అక్కడకుఁ దీసికొని పోవుటకు మీ రిక్కడకు మీ మనుష్యులను బంపినతోడనే తన కొమారితను మీవద్దకుఁ బంపెదనని యామె వాగ్దానముచేసినది. ఆచిన్న దానిని వెంటఁ బెట్టుకొనిపోవుటకు నమ్మఁదగినవారును ఋజువర్తనులును దృఢచిత్తులునయిన మనుష్యులను బంపుఁడు. వారు విషయము నత్యంతరహస్యముగా నుంచవలెను. వారు కపటవేషధారులైనపక్షమున, వారుమనకార్యమునకు భంగము కలిగించుట నిశ్చయము. వారిని నిజముగా మనపక్షావలంబులను గాఁ జూడుఁడు. వివాహము నిజముగా జరగువఱకును వారెందునిముత్తము వచ్చిరో యాపని యిక్కడ నెవ్వరికిని దెలియకుండవలెను. ఈపనినిమిత్తమయి యిద్దఱికంటె నెక్కువమనుష్యులను పంపవలదని సీతమ్మ (బాలవితంతువు తల్లి) మిమ్ముకోరుచున్నది. మనప్రయత్నములు కడపట మరల సంపూర్ణభగ్నతను పొందవచ్చునని యామెకూడ తలఁచుచున్నది. వివాహము నిమిత్తమయి తన లిఖితానుజ్ఞను మీకిచ్చుటకుకూడ నామె యొప్పుకొనియున్నది. మా మను


ష్యులు మీ యొద్దినుండి యుత్తరముతో మార్గస్థులవలె నిక్కడకువచ్చి, యీ విషయమయినవాసన యిక్కడ నెవ్వరికి నెంతమాత్రమును సోఁకకుండ నన్ను కలిసికొననిండు. బాలికయొక్క గ్రామమైన రేపూడికి వారీస్థలమునుండి సహితము పోవచ్చును. మీ మనుష్యులువచ్చి యామెకూతును తీసికొనిపోవు పర్యంతమును గ్రామమునువిడిచి పోవలదని నేను సీతమ్మకు చెప్పితిని. మీ యచింతమమైన యనుకూల్యము ననుసరించి మీ మనుష్యులను బంపుడు. [4]


పయియుత్తరము నాకానెల యెనిమిదవతేదిని చేరినది. మనుష్యులను నాలుగైదు దినములలోఁ బంపుచున్నానని 10 వ తేదిని బ్రహ్మానందముగారికి లేఖవ్రాసి, నేనావిషయమైన కృషిలోనేయుంటిని. ఈవిషయమయి విశేష శ్రద్ధనువహించి తాము రాజమహేంద్రవరమునకు వచ్చినప్పటినుండియు ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు నాకు సర్వవిధముల సహాయులుగానుండిరి. పంపవలసిన మనుష్యులవిషయమున నేనాయనతో నాలోచించి, ఆయన తన కార్యస్థానమునందు కొలువులో నుండి మిక్కిలి తెలివిగలవాఁడును పరమ విశ్వాసియు నయిన యొకభటునికి సెలవిచ్చి నేను పంపఁదలఁచుకొన్న నా మిత్రునికి తోడుగా వెళ్లుటకయి యాభటుని దయాపూర్వకముగా నావశము చేయఁగా, ఈ కార్యములయం దత్యంతాదరముకలిగి ప్రథమశాస్త్ర పరీక్ష యందు కృతార్థుఁడయి మొదటినుండియు మాతో పనిచేయుచుండిన సోమంచి భీమశంకరముగారిని నాలేఖతో బ్రహ్మానందముగారియొద్ద కానెల 15 వ తేదిని బంపితిని. ఇటువంటి కార్యములలో పేరు వెల్లడియైనచో కార్యభంగము కలుగును గనుక, ఆచిన్నది యేగ్రామమునందుండెనో, ఆచిన్న దానితల్లి పేరేదో, మేము పంపినమిత్రునకుసహితము చెప్పక రహస్యముగానేయుంచి బ్రహ్మానందముగారిని కలిసికొన్న తరువాత కర్తవ్యమును సమస్తమును వారే చేసెదరనిమాత్ర మాయనతో చెప్పితిని. నామిత్రుఁడు రాజమహేంద్రవరమునువిడిచిన రెండుదినములకు బ్రహ్మానందముగారు వ్రాసిన యుత్తర మొకటి నాకు చేరినది. ఆయన తిరువూరినుండి 14 వ తేదిని వ్రాయఁగా 17 వ తేదిని నాకందిన యాలేఖలో నిట్లు వ్రాయఁబడియుండెను : -

"పదవతేదిగల మీయుత్తరలాభమును వందనములతో నంగీకరించుటకు నేను మిక్కిలి యానందము నొందుచున్నాను. కాని, వెంటనేపోయి తహశ్శీలుదారుగా వినుకొండతాలూకా నొప్పగించుకోవలసినదని యాజ్ఞాపించుచు నిన్నటిదిన మాకస్మికముగా నాకుత్తరువు వచ్చినదని మీకుచెప్పుటకు నేనెంతయు చింతనొందుచున్నాను. నేనక్కడ నలువదిదినము లుండవలసి యుం


డును. ఈ గడువుతరువాత నేనిక్కడకు మరల వచ్చుట సంభావ్యము కావచ్చును. నేను రేపటిదినము వినుకొండకుపోవుటకయి యీస్థలమును విడుచుచున్నాను. ఆశాభంగముపొందక రేపూడికివెళ్లి బాలికతల్లితో మాటాడి యామెను తీసికొనిపోవలసినదని మీమనుష్యులతో చెప్పుఁడు." [5]

ఈ యుత్తరము నాకు చేరుటకు రెండుదినములుముందే మామనుష్యులు బైలు దేఱిపోయి నడిదారిలోనుండిరి. మామిత్రుడు పోవలసిన గ్రామము మా పట్టణమునకు నూఁటయేఁబది మైళ్లదూరములోనున్నది. అక్కడ కయో మార్గములు లేవు ; తంతిసమాచార మందదు. అట్టి స్థితిలో నేను నామిత్రులతోడ నాలోచించి, ఆచిన్నది వాసముచేయుగ్రామమును తల్లియింటి పేరును జరపవలసిన కృత్యమును వివరముగాఁదెలుపుచు మామిత్రున కొకలేఖవ్రాసి, దానికి లక్కముద్రలువైచి, లక్ష్మీనరసింహముగారే మరల ననుగ్రహించి యిచ్చిన విశ్వాసపాత్రుఁడైన మఱియొకభటునిచేతికిచ్చి పంపితిమి. ఈజాబు చేరులోపల మామిత్రుఁడు గమ్యస్థానముచేరి విచారింపఁగా బ్రహ్మానందముగా రావఱకే గ్రామమువిడిచి యుద్యోగాంతరముమీఁద దూరగ్రామమునకుపోయినట్టు తెలియవచ్చినది. తాము పోవలసిన గ్రామమేదో, తీసికొనిరావలసిన చిన్న దెవరో, వారికితెలియదు; తాము వచ్చినకార్యమునైనను వేఱొకరితో చెప్పవల్ల కాదు; తుదకు తా మెవ్వరో తెలుపనయినను తెలుపవలనుపడదు. ఈస్థితియందేమి చేయుటకును ఆలోచనపాలుపోక బుద్ధిమంతుఁడును కార్య


దక్షుఁడును నగుటచేత తొందరపడి గ్రామము విడిచిరాక మాయుత్తరము నపేక్షించి మామిత్రుఁ డా గ్రామములోనే వేచియుండఁగా, మేము పంపిన మనుష్యుఁడు పోయికలిసికొని 22 వ తేదిని మాలేఖనిచ్చెను. తత్క్షణమే పోవలసినగ్రామమునకు వారు మువ్వురును బైలుదేఱిపోయిరి. ఆచిన్న దాని తల్లి దండ్రులు ధనికులయి గ్రామాధికారులయిన గొప్పవంశమువారు ; ఈకార్యము తల్లికొక్కతెకుతప్ప బంధువర్గములో నెవ్వరికిని ఇష్టములేదు ; ఆచుట్టుపట్టుల నున్న గ్రామములన్నియు వారిబంధువులతో నిండియున్నవి ; ఈ సమాచారము కొంచెము పైకిపొక్కినపక్షమున మోటుగ్రామములవా రెంత దౌర్జన్యమునకు తెగింతురో యెల్లవారు నెఱిఁగియుందురు ; ఆ చుట్టుప్రక్కల మా మిత్రునకు సాయముచేయువా రొక్కరునులేరు. ఇటువంటి విషమస్థితిలో నామిత్రుఁడు కర్తవ్యమును చక్కఁగా నాలోచించి తామెక్కడకుఁ బోవుచున్నారో బండివాండ్రకు సహితము చెప్పక రాత్రి రెండుయామముల కా గ్రామముచేరి ప్రయాసము మీఁద వారియిల్లు తెలిసికొని చిన్న దానితల్లిని లేపి రహస్యముగా తామువచ్చినపని తెలుపఁగా, ఆమె బ్రహ్మానందముగారు రానిదే తాను పిల్లను పంపననిచెప్పెను. నామిత్రుఁడారాత్రి యామె నేలాగుననో బతిమాలి యేమేమోచెప్పియొప్పించి పిల్ల దానిని తమవెంట నొంటిగా వచ్చునట్లొడఁబఱచి తెల్ల వాఱకమునుపే యాచిన్న దానినితీసికొని బైలుదేఱి యాదిన మేగ్రామములోనుదిగి వంటచేసికొని భోజనముచేయక యటుకులే తినియుండి, వెనుకనుండి యెవ్వరువచ్చి పట్టుకొందురోయను భీతిచేత శీఘ్ర ప్రయాణములుచేసి కొన్ని దినములలో తామా చిన్న దానిని సురక్షితముగా రాజమహేంద్రవరమునకుఁ గొనివచ్చి యిరువదియేడవ తేదిని మాయింటివద్ద చేర్చెను. ఆమఱునాఁడే యీవార్త యూరంతయు పొక్కి యాచిన్న దానిని చూచుటకయి జనులు తీర్థప్రజవలె మాయింటికి రాసాగిరి. అందుచేత కొన్ని దినములు మాయిల్లు తిరుమల వేంకటేశ్వరుని యాలయమువలె వచ్చెడి వారితోను పోయెడివారితోను సందడిగానుండెను. అప్పుడు మేము వరాన్వేషణ


మున కుపక్రమించితిమి. ఈవఱకు చెప్పినట్లు మేము వితంతు కన్యానయ ప్రయత్న మారంభించినది మొదలుకొని తల్లిదండ్రులు భయపడి సమస్తప్రయత్న ములునుచేసి బ్రహ్మచారులైన విద్యార్థులకు బలవంతపెట్టి వివాహములు చేయనారంభించిరి. అందుచేత నావఱకు వివాహమాడ నిశ్చయించుకొన్న విద్యార్థులకు కొందఱికి వివాహములయిపోయినవి. ఉన్న వారిలో కొందఱన్య శాఖవారగుటచేత పనికిరాకపోయిరి. మిగిలినవారిలోనుండి మంచివాని నొక్కని నేర్పఱుచుట కాలోచించుచుండఁగా, ఆవఱకు బహు సంవత్సరములు మాయింట నేయుండి విద్య నేర్చుకొని సర్వకళాశాలాప్రవేశపరీక్షయందు తేఱి, అప్పుడు విశాఖపట్టణములో నారాక్షకశాఖయం దిరువదిరూపాయల పనిలో నున్న యిరువదిరెండు సంవత్సరముల ప్రాయముగల యొకచిన్న వానిభార్య యాకస్మికముగా మరణమునొందుట తటస్థించెను. అతఁడు చిరకాలము నా శిక్షలోనుండి పెరిగినవాఁడగుటచేత వితంతు వివాహములు మొదలైన క్రొత్త మార్పులయందాసక్తియు నుత్సాహమును గలవాఁడు. నేనాతని కీవిషయమున జాబువ్రాయఁగా తా నీచిన్న దానిని వివాహమాడుట కంగీకరించెను. అతఁడు చిన్న వాఁడగుటచేతను విద్యగలవాఁడగుటచేతను వృద్ధికాఁదగిన దొరతనము వారి కొలువునందున్న వాఁడగుటచేతను పలువురాతనికి కన్యనిచ్చెదమని తిరుగుచున్నను వారినందఱిని నిరాకరించి వితంతువును వివాహముచేసికొని బుద్ధి పూర్వకముగా ననేకకష్టములు పొందుటకు సాహసించిన యాతని ధైర్యమును పరోపకార చింతయు నత్యంత శ్లాఘ్యములు. వివాహదినము నిశ్చయింపఁ బడినది. వివాహవ్యయముల నిమిత్తమయి పైడా రామకృష్ణయ్యగారు వేయి రూపాయలు మాకిమ్మని నాళము కామరాజుగారికి వ్రాయఁగా వారా మొత్తమును మాకిచ్చిరి. వివాహమునకుఁగావలసిన పరికరములన్నియు సమకూర్పఁ బడినవి. అయినను విశాఖపుర మండలారాక్షక శాఖాధ్యక్షుఁడు వరునకు సెలవీయుటకు నిరాకరించినందున వివాహమునకు విఘ్నము సంభవించునట్లు కానఁబడెను. కాని యనాథరక్షకుఁడైన యీశ్వరుఁడు మా పక్ష


మునందుండుటచేత కడపట సర్వమును సానుకూలమయి ముగిసెను. కొంతకాలము మా గోదావరీ మండలారక్షక శాఖాధ్యక్షుఁడయి నాయందు మంచి యభిప్రాయము కలిగియుండిన కర్నల్ పోర్చిస్ దొరగారప్పుడు చెన్న పురి రాజధానిలోని యారక్షకశాఖ కంతకును నధికారి (Inspector General of Police) గా నుండుట తటస్థించెను. నేనాయనకు వ్రాయఁగా నా దొరగారు నాయందనుగ్రహించి వరునకు సెలవిచ్చి వెంటనే పంపవలసినదని విశాఖపట్టణ మండలారక్షక శాఖాధ్యక్షునకు తంత్రీవార్తను బంపుటయేకాక గోదావరీ మండలారక్షక శాఖాధ్యక్షునకు (Police Superintendent) వివాహ సంబంధమున నేను గోరిన సర్వసాహాయ్యములును జేయవలసినదని యాంతరంగిక లేఖను సహితము వ్రాసిరి. విశాఖపట్టణ మండలారక్షక శాఖా ప్రధానకార్యస్థానావేక్షకుఁడు (Police Head Quarters' Inspector) ను నామిత్రుఁడును బ్రహ్మానందముగారి తమ్ముఁడును వితంతువివాహ విషయమున వరుని ప్రోత్సాహపఱచినవాఁడును నయిన దర్భా వేంకటశాస్త్రిగారు వరుని వెంటఁబెట్టుకొనివచ్చి యుక్తకాలములో రాజమహేంద్రవరము చేరిరి. అంతవఱకును జనులు పరిపరిలాగుల నూహలుచేయుటయేకాని వరుఁడెవ్వరో నిశ్చయముగా తెలిసికోఁగలిగిన వారుకారు. వరుఁడు గోగులపాటి శ్రీరాములుగారని తెలిసినతోడనే మాపట్టణములోని యాతని బంధువులు మొదలైనవారువచ్చి వివాహము చేసికోవలదని హితోపదేశములుచేసి కార్యము గానక మరలిపోవుచు వచ్చిరి. వివాహము జరగునని నిశ్చయముగా తెలిసిన తరువాత మా పట్టణమునందు పుట్టిన సంక్షోభ మింతంతయని చెప్పుటకు శక్యముకాదు. ఆవఱకు నిశ్శబ్దముగానుండిన మా పట్టణమంతయును మహా వాయువుచేత సంక్షోభమునొందిన మహాసముద్రమువలె కలఁగ నారంభించినది. ఎక్కడఁజూచినను సభలే ; ఎక్కడఁజూచినను వీధులలో గుంపులుకూడి గుజగుజలాడుచుండుటలే ; ఎక్కడఁజూచినను కోపవాక్యములే ; ఎక్కడఁజూచినను బెదరింపులే. ఈయాకస్మికసంక్షోభములో తామంతకుముందు పేరులేక మూలఁ బడియున్న యనామధేయు లనేకులు సుప్రసిద్ధు లయినారు ; వివాహములలో తోరణములు త్రెంపి పెనఁగులాడి చేతులువిఱిచి సంభావనలు గొను మహాపురుషులు పెద్దసభాపతులయినారు ; ఇచ్చకములాడి యింటింటఁదిరిగి బిచ్చ మెత్తుకొను తుచ్ఛలు సందడిగాతిరిగి సమాచారములు తెచ్చుట కెంతో పెద్దలయినారు. వీరి యాటోపమునుజూచి నామిత్రులు సహితము కొందఱు నాతో మాటాడుటకే భయపడిరి ; స్త్రీ పునర్వివాహ విషయమయి తమ ప్రాణములనైన నిచ్చెదమని దంభములు పలికి యితరులకు లేఖలు వ్రాసిన వారును, ఆంతరంగిక సమాజములో చేరియున్న వారును సహితము పెండ్లికి వచ్చుటమాటయటుండఁగా మావీధిని నడుచుటకే జంకుపడి కార్యస్థానాదులకుఁ బోవునప్పుడు చుట్టుతిరిగి వేఱుదారులఁ బోవువారైరి. పామరులవలని భయముచేత మాయింట వంటచేయు బాపనపనికత్తె మమ్మావఱకే విడిచిపెట్టెను ; పురోహితుఁడు మాయింట శుభకర్మలు చేయించుటకయి రాక మానుకొనెను ; బంధువులందఱును నన్ను బహువిధముల నిందించుచు జాతిభ్రష్టునివలె చూడసాగిరి ; వివాహదినమున మాయింటమాత్రమేకాక మాయింటిచుట్టును మావీధి పొడుగునను రక్షకభటులు కావలి కావవలసివచ్చినది. ఇటువంటి మహాసంక్షోభములో 1881 వ సంవత్సరము డిసెంబరు 11 వ తేదినిరాత్రి రాజమహేంద్రవరములో మొదటి స్త్రీపునర్వివాహము జరగినది.

ఆవివాహమునకు మొదటినుండియు నాతో నుండి పనిచేసి ప్రప్రథమమున నన్నీ కార్యమునకుఁ బురికొల్పిన మిత్రుఁడు చల్లపల్లి - బాపయ్యగారు రానేలేదు. ఆయన పామరజన దూషణమునకు భయపడిగాని యీకార్యమునం దాదరము తగ్గి గాని వివాహ సమయమున వచ్చుటకు మానుకోలేదు. ఆయనయన్న లిద్దఱును నాటిరాత్రి యాయనను బలవంతముగా నొక గదిలో పెట్టి తాళమువేసి నిర్బంధించి యీవలకు రానీయకపోయిరి. పెద్దన్న గారయిన రామబ్రహ్మము గారు పూర్వాచార్ర పరాయణుఁడును వితంతు వివాహ


విపక్షుఁడునయినను, రెండవ యన్న గారైన రంగయ్యపంతులు గారు నాకు చిరకాల మిత్రుఁడును సంస్కార పక్షానుకూలుఁడును నయినవాఁడే. అయినను బహుజన సంక్షోభసమయమునందు బంధుజన బహిష్కారమునకు భయపడ కుండుట సామాన్యులకు సాధ్యముకాదుగదా ! బాపయ్యగారివలెనే నాకు పరమమిత్రుఁడును మాయాంతరంగిక సామాజికులలో నొక్కరును వితంతు వివాహపక్షమునంద సమానాదాదరముగలవారునునయిన న్యాపతి సుబ్బారావు పంతులుగా రారాత్రి వివాహమునకు రావలెనని యెంతో ప్రయత్నము చేసిరి కాని వారుకాపురముండిన యింటివారారాత్రి పెండ్లికిఁబోయినయెడల మరల నింట నడుగిడనియ్యమని స్పష్టముగాఁ జెప్పినందున రాలేక పోయిరి. ఆయన కప్పుడు స్వగృహముండినయెడలను, ఉండిన యింటివారైన బంధువు లంత నిర్బంధ పఱుపకపోయినను, అప్పుడుండిన యుత్సాహమునుబట్టి వారు తప్పక వివాహమునకు వచ్చియుందురు. కొందఱీ ప్రకారముగా ననివార్య ప్రతిబంధములచేతను, కొందఱు స్వాభావిక భీరుత్వముచేతను, రాలేకపోయినను, దైర్యశాలులును దేశాభిమానులునయిన నామిత్రులనేకులు వివాహదినములలో తాంబూలములకు మాత్రమేకాక భోజనములకు సహితము వచ్చిరి. అట్టి యమూల్యసాహాయ్యముచేసి నాకుతోడుపడి పెక్కుకష్టములకు లోనైన వారియెడల నే నత్యంతకృతజ్ఞత గలవాఁడనయి యున్నాను. ఇట్టివారిలో నగ్రగణ్యులయిన యొక్కరినిగూర్చి నేను చెన్న పురిలో 1885 వ సంవత్సర మధ్యమున నేనిచ్చిన రాజమహేంద్రవర స్త్రీ పునర్వివాహ చరిత్రమునుగూర్చిన యుపన్యాసములో నిట్లుచెప్పితిని : -

"వారిలో నాకు మొదటినుండియు పరమాప్తుఁడయి, ఒక్క యీ కార్యమునందు మాత్రమేకాక దేశక్షేమము నిమిత్తమయి నేను చేయతలపెట్టిన మంచికార్యములలో నెల్లను నాకు కుడిభుజమయియుండి, పయికి పేరు నాదియైనను చాటున నాకంటెను బహుగుణములధికముగా పనిచేయుచు వచ్చు చున్న బసవరాజు గవర్రాజుగారి సాహస చరిత్రము నిచ్చట ముఖ్య


ఆనరబిల్ న్యాపతి సుబ్బారావు పంతులుగారు.

(ఈపటముమాకొసంగిన ఆంధ్రపత్రికా సంపాదకులకు మేము కృతజ్ఞులము.)


ముగా శ్లాఘింపవలసియున్నది. పదిమంది యొక్కసారిగా లోకాంతరగతులయినప్పుడు పుట్టునంత సంక్షోభము ఈ వివాహదినమున వార్తియింటపుట్టినది. భార్యవంకవారును తన వంకవారునయిన బంధువులొక్కసారిగా గొల్లున గోలపెట్టి మధ్యాహ్న సమయమున మృతునినిమిత్తమయి యేడ్చునట్లేడ్చుచు శపించుచు లేచిపోయిరి. తల్లిదండ్రులు చిన్న తనములో పోయినప్పటినుండియు పెంచి పెద్దవానినిజేసిన పెద్దతల్లి తన్ను విడిచిపోయినను వెనుకతీయక, లోకోపకారము నిమిత్తమయి యెన్నికష్టములు వచ్చినను సహించుకొని యుండి, భార్య దీర్ఘ వ్యాధిచేత బహుమాసములు మంచమెక్కియుండి బంధువులురాక బహు బాధలు తటస్థించినను ప్రాయశ్చిత్తమన్న పేరునైనను తలపెట్టక, ఈ దినమువఱకును పరోపకారమయిన యీ కార్యమునిమిత్తము వ్యయప్రయాసములను సంతోష పూర్వకముగా వహించుచున్న యా నామిత్రుని నెట్లుశ్లాఘింపవలయునో నేనెఱుఁగకున్నాను."

1888 వ సంవత్సరము జూలయి నెలలో నిట్టి మిత్రరత్నము గోలుపోయిన యభాగ్యము నాకుసంప్రాప్తమయినది. మరణపర్యంతమును నన్ను ను నేను పూనిన వితంతువివాహపక్షమును విడువక ప్రాయశ్చిత్తమునకు లోఁబడకయుండిన మహాపురుషుఁ డీయనయొక్కఁడే. నాకింతటి సహాయుఁడయి యుండియు మాయిరువురివిషయమునను డాక్టరు సత్యనాథముగారు 1885 వ సంవత్సరాంతమున మెయిలు పత్రికకు వ్రాసినప్పుడు తనదినచర్యయందు విధేయత తేటపడునట్లుగా నిట్లువ్రాసికొనిరి : -

"వితంతు వివాహసంబంధమున నాపేరును వీరేశలింగముగారిపేరును ఉదాహరించుటచే మాయందాయనకెంతో దయకలదని భావించెదను. కాని యీగొప్పకులాచార సంస్కారకార్యమునందు నేనుచేసినపని యత్యల్పమయినదని సిగ్గుపడుచున్నాను. నాసరియైనస్థితి సత్యనాథముగారి కొక వేళ తెలియకుండ వచ్చును. నేను చేసినదంతయు ఈ పక్షము వారితో భోజనము చేయుటయు వీరేశలింగముగారిని ఇతరవిధముగా ప్రోత్సాహపఱుచుటయునే. నేనులేకుండ


వీరేశలింగముగా రింతపనియు తాము చేసియుందురనియు, ఆయన లేకుండ నాయంతట నేనేమియు చేయలేకుందుననియు, ఆయనతోఁ గలిసికూడ పయిని చెప్పినదానికంటె నధికముగా నిశ్చయముగా నేనేమియు చేసియుండలేదనియు, నామనోనిశ్చయము."

గవర్రాజుగారివలెనే యీపక్షమునఁజేరి వివాహసమయమున భోజనములు చేసినవారందఱును కొంచెముగానో గొప్పగానో యీవిధమైన శ్రమల కోర్చినవారే. పలువురు మార్గాంతరములేక ప్రాయశ్చిత్తములు చేయించుకొని మమ్ము విడువవలసిన వారైనను వారిమనస్సులు మాత్రము మాపక్షముననే యుండెను. ఒకరు రాజకార్యముమీఁద గుంటూరు వెళ్ళవలసిన వారయి యక్కడ నీళ్ళబ్రాహ్మణులు దొరకకయు కాపురముండుట కిండ్లు దొరకకయు బహు బాధలుపొంది. యిష్టములేకయే ప్రాయశ్చిత్తమునకు లోను గావలసినవారైరి ; ఆయన బావమఱఁది మఱియొక రారంభదశయందలికష్టముల కన్నిటికి తాళి కొంతకాలము మాలోనేయుండి యెదిగి యీడేఱి కాపురమునకు సిద్ధము గానుండిన తన తోడఁబుట్టినపడుచును అత్తవారు తీసికొని పోనొల్లకుండినందున ప్రాయశ్చిత్త మంగీకరింపవలసిన వారయిరి ; ఇంకొకరు పెద్ద కుటుంబముగల వారగుటచేత తనకొడుకులను కొమారితలకును సంబంధములు దొరకవన్న భీతిచేత ప్రాయశ్చిత్తము చేసికొనిరి ; దూరదేశముపోయి కన్యను తీసికొనివచ్చిన నామిత్రుఁడు సహితము తనమేనమామ కాలముచేసినప్పుడు గత్యంతరములేక ప్రాయశ్చిత్తమున కొప్పుకొనవలసిన వాఁడయ్యెను. కొందఱు తొందరపడి భయ భ్రాంతులయి యారంభ దశలోనే ప్రాయశ్చిత్తములు చేసికొన్నను, ఇటువంటి భయంకరసమయములో ధైర్యము నిలుపలేక పోయినందుకు నేను వారిని నిందింపను. వివాహములకు బహు సహస్రరూప్యములు గవ్వలవలె వ్యయముచేసి, వివాహములాడిన దంపతుల కాపురముల కిండ్లిచ్చి, మరణసమయమునందు పదివేల రూపాయలిచ్చిన శ్రీపైడా రామకృష్ణయ్య


గారి యంతటి ధైర్యౌదార్యశాలి సహిత మీసంక్షోభములో మనస్థ్సైర్యము నిలుపలేక ప్రాయశ్చిత్తము చేసికోవలసి వచ్చినప్పుడు, బయలమిత్రులును బంధు జనులును కులమువారును బహువిధములదూషించి వెఱపించుచుండఁగా, ఇంట భార్యలును తల్లులును బహువిధముల విలపించుచు మనస్సు కలంచు చుండఁగా, మతగురువులు బహిష్కారపత్రికలు పంపి భీతికొలుపుచుండఁగా, సామాన్య జనులు ధైర్యము నిలుపఁగలుగుదురా ? ఇఁక మరల మనవివాహకథకు వత్తము.

ఈ యనర్థమునకంతకును మూలమయిన నాప్రాణములకు సహితము కొందఱు దుష్టులెగ్గుతలఁచిరికాని విద్యార్థులును రక్షకభటులును నాకంగరక్షకులుగా నుండుటచేతను, ప్రభువుల కెల్లను ప్రభువయిన యీశ్వరుఁడే నన్ను కాపాడువాఁడయి యుండుటచేతను, దుష్టులవలన నాకేవిధమైన యపాయమును గలుగలేదు. ఈకార్యములయందు మాకారక్షక శాఖవారివలనఁ గలిగిన సాయ మింతయంతయని చెప్పతరముకాదు. హిందువులయిన రక్షకభటులు సహితము మాకు ప్రతిపక్షులుగానుందురని విన్న వింపఁగా, మామండలారక్షకభటాధికారికరుణించి మాకు తోడుచూపుటకై పయిస్థలములనుండి మహమ్మదీయులను క్రైస్తవులను తగినంతమందిని తాత్కాలికముగా రాజమహేంద్రవరమునకుఁ బిలిపించెను ; మాయింటిచుట్టును తగినంతమంది భటులను కావలి యుంచెను ; ఏదైన అల్లరిజరగినపక్షమున నాయకులను పట్టుకొనెదమని ప్రతిపక్షుల నాయకులకు ప్రకటనపత్రికలను బంపెను. అందుచేత మాప్రతిపక్షులు భయపడి శిక్షాస్మృతినిబట్టి నేరములగు దౌర్జన్యములు చేయుటకు సాహసింప లేక యితరవిధములచేత మాకార్యభంగముచేయ పాటుపడిరి. ఆవఱకు పని లేక సోమరులుగా తిరుగు బ్రాహ్మణవేషధారుల కందఱకును మా మూలమున పుష్కలముగా చేతులనిండ కావలసినంత పనిదొరకినది. కొందఱు మేము కుదుర్చుకొన్న వంటబ్రాహ్మణుల యిండ్లకుఁబోయి వాండ్రను బెదరించియు లంచములిచ్చియు రాకుండఁజేయుచు వచ్చిరి ; కొందఱు వివాహతంత్రము నడుప నిర్ణయించుకొన్న పురోహితులనుపట్టుకొని తిట్టియు భయపెట్టియు


మొగము చాటువేయించుచువచ్చిరి ; కొందఱు వీధులమూలలను మా యింటి యెదుటను గూరుచుండి మా యింటికి వచ్చువారిని మాత్రమేకాక మా వీధిని నడచువారిని సహితము పేరులువ్రాసికొని బహిష్కారపత్రికలు తెప్పించి వెలివేసెదమని బెదరించుచువచ్చిరి. ఇటువంటి దుష్ప్రయత్నములలో విద్యా విహీనులయి వైదికవృత్తియందున్న పూర్వాచారావలంబకులు మాత్రమేకాక యింగ్లీషునందు పాండిత్యముకలిగి పట్టపరీక్షయందును ప్రథమశాస్త్ర పరీక్షయందును కృతార్థులయి మావద్ద విధవావివాహముల కనుకూలముగా మాటాడుచు స్త్రీపునర్వివాహములను తామామోదించినట్లు చేవ్రాళ్లుచేసిన మహానుభావులుకూడ కొందఱుకూడి తామే ప్రధాననాయకులయి తాము చదువుకొన్న విద్యకును పొందిన యున్నతస్థితికినిగూడ నగౌరవము తెచ్చినందున కెంతయు చింతిల్ల వలసియున్నది. ఇట్టి మహానుభావులయిన మా పురములోని బ్రాహ్మణ ప్రభువుల యాలోచనచేత కొందఱు వివాహసమయమున కాగడాలువేయు చాకలివాండ్రను వాద్యములువాయించు మంగలివాండ్రను కూడ రాకుండజేయుటకయి బహువిధముల ప్రయాసపడిరి. వీరివారి నననేల? తుదకు పెండ్లిలో మేళమునకువచ్చిన వేశ్యలనుగూడ వెఱపించి వారియొద్ద నుండి ధనముతీసికొనిరి.

వేశ్యలనఁగానే సంస్కారపరాయణులు చేసెడు వితంతు వివాహములకుఁగూడ బోగముమేళముల నుంచిరాయని సంస్కారప్రియులకు సందేహము కలుగవచ్చును. వితంతు వివాహపక్షము వారికికార్యదర్శినయి వేశ్యల మేళములకు వెళ్లనని ప్రతిజ్ఞను గైకొన్న నే నీవిషయమునఁ గొంచెము సమాధానము చెప్పవలసియున్నది. వివాహవ్యయముల నిమిత్తమయ్యి రామకృష్ణయ్యగారు పంపిన వేయిరూపాయలు మాచేతిలోనున్నవి. తెలుఁగుదేశములో మొదటిదైన యీ వితంతువివాహమును మహావైభవముతో జరపవలెనని మా పక్షమువారి యభిప్రాయము. భోగముమేళములేక వివాహమునకు శోభరాదని రామకృష్ణయ్యగారు మొదలయిన వారందఱును తలఁచియుండిరి.


నేనును గవర్రాజుగారును మాత్రము భిన్నాభిప్రాయులమయి యుంటిమి. అయినను మాపక్షమువారిలోని యెక్కువ సంఖ్యగల వారి యభిప్రాయమును బట్టి భోగముమేళముపెట్టుటకు నిశ్చయింపఁబడి ముందుగా కొంతసొమ్మీయఁబడినది. వివాహము జరగవలసినస్థలము మాయిల్లు ; నృత్య గానములు సలుపుటకయి వేశ్యాంగనలను మాయింటిలోపలి కడుగిడనియ్యనని నేను పట్టు పట్టితిని. మాయింటిలోపల నాదిసర్వాధికారము. అందుచేత మావా రూరేగింపు సమయమున బోగముమేళమును పెండ్లిపల్లకిముందు పెట్టుటకు నిశ్చయించి యట్లు గావించిరి. అప్పుడు సహితము నేను పెద్దమనుష్యులకు ముందు వేశ్యలాడుచోటికిఁబోక చూడవచ్చిన గుంపులోఁగలిసి జనులాడుకొను మాటలువినుచు వేడుక ననుభవించు చుంటిని.

ప్రతిపక్షుల ప్రయత్నములను సరకుగొనక మేమును విచ్చలవిడిగా ధనవ్యయముచేసి వారిక్రియలకు ప్రతిక్రియలు చేయుచుంటిమి. వాద్యములు వాయించుటకై వచ్చుటకు కొందఱుమంగలివాండ్రు తమకులమువారికి భయపడుచుండినట్లు కనఁబడఁగా ధనవ్యయమునకు వెనుకతీయక మా పట్టణములోని వాద్యములు వాయించు మంగలివాండ్రనెల్ల మేము పెండ్లిలో మేళమునకు కుదిర్చితిమి. వీరినందఱిని వెలివేసి తమయిండ్లకు రాకుండఁజేసిన పక్షమున క్షురకర్మచేయువారులేకయు శుభకార్యములయందు వాద్యములు వాయించు వారులేకయు మాకంటె తామే యెక్కువకష్టము పొందవలసివచ్చును గనుక మాప్రతిపక్షులు బుద్ధిమంతులయి యట్టిప్రయత్నమును మానుకొనిరి. పిచ్చుక పయి బ్రహ్మాస్త్రముతొడిగినట్లు మాయూరి ప్రముఖులింతమంది యబలలయిన యనాధబాలలమీఁద ధ్వజమెత్తినను, ఈశ్వరుఁడు వారిపట్ల నుండుటచేత ప్రబలులయిన మాయూరిశూరుల యభిమత మీడేఱినదికాదు. నూఱేసి రూపాయలప్పిచ్చియు, భోజనములుగాక నెలకేడేసిరూపాయల చొప్పున జీతమిచ్చి సంవత్సరమువఱకు పనిచేయించుకొనుట కొడంబడికలు వ్రాసియిచ్చియు, వివాహదినములలో దినమునకు నాలుగేసి రూపాయల చొప్పున నియ్య


నొప్పుకొనియు, మేము నలుగురు వంటబ్రాహ్మణులను నీళ్లబ్రాహ్మణులనుసంపాదించుకోఁ గలిగినారము ; ఎంతమంది యాజకులను బెదిళ్లుపెట్టి సాగనంపినను, కట్టకడపట ధైర్యముచేసి వారిమాటవినక వచ్చిన పురోహితునిభార్యను గోదావరిలో పడుటకయి పరుగెత్తించి మరలించినను, నూఱు రూపాయలిచ్చి యావివాహములో మంత్రములు చెప్పుటకొక యాజకుని సంపాదింపఁ గలిగినారము. ఈవివాహ మహోత్సవమును జూచుటకయి యారాత్రి మాపట్టణములోని యూరపియనులు సహిత మందఱును దయ చేసిరి. అల్లరిజరగకుండ వారించుటకయి మాయింటిచుట్టును రక్షక భటు లఱువదిమంది నిలిచి జాగరూకులయి కావలి గాచుచుండిరి ; మండలరక్షకభటశాఖాధ్యక్షుఁడే (District Police Superintendent) స్వయముగా నుండి తగిన యేర్పాటులు చేయుచుండెను ; సంయుక్త దండవిధాయకుఁడే (Joint Magistrate) స్వయముగా రక్షణ క్రమమును విచారించుచుండెను. అందుచేత నాటివివాహము జయప్రదముగా జరగెను. మావంటబ్రాహ్మణులలో నొకఁడు మఱునాఁడు పాఱిపోఁగా పోలీసువారతనిని పట్టితెచ్చి పెండ్లి నాలుగుదినములును వంటయు భోజనములును కాఁగానే వారిని తమయధీనములో నుంచుకొని మరల సాయంకాలము వంటవేళకు తీసికొనివచ్చుచు మాకెంతో తోడుపడిరి.

ఇట్లు ప్రథమ వివాహము నిర్విఘ్నముగా నడచుటయు, అనేకులు తాంబూలములకును భోజనములకును దక్షిణలకును వచ్చుటయు, వాయువేగ మనోవేగములతో మామండలమంతయు వ్యాపింపఁగా తమ వితంతు బాలికలకు వివాహము చేయఁదలఁచుకొన్న వారనేకులు మాపట్టణమునకు రాసాగిరి. అందుచేత మొదటివివాహమయిన నాలవ దినముననే రెండవవివాహముకూడ జరగినది. ఇంకను ననేకవివాహములు జరగునని యనేకు లెదురుచూచుచుండిరి. వివాహమయిన మఱునాటి యుదయమున వార్తాపత్రికలకును మిత్రులకును మేమీ శుభవార్తనుదెలుపుచు బహుస్థలములకు తంత్రీవార్తలను బంపితిమి.


దంపతుల నాశీర్వదించుచు మమ్మభినందించుచు మఱునాటినుండియు నానా ముఖముల తంత్రీవార్తలును లేఖలును రాఁదొడఁగినవి. చెన్న పురినుండివచ్చిన రెండు లేఖలలోని భాగములను మాత్రమీ సందర్భమున నిందుఁ బొందుపఱుచు చున్నాను : -


"తిరువల్లికేణి - 13 వ డిసెంబరు 1881.


[6]మీ తంతిసమాచారము మమ్మందఱిని అత్యంత సంతోషవంతులనుగాఁ జేసినది. మిమ్మును దంపతులను ఈశ్వరుఁడాశీర్వదించునుగాక ! మీయొక్క యవ్యాజమైనట్టియు నుత్సాహవంతమయినట్టియు ప్రయత్నములను సఫలము చేయుట కిప్పటికాయనకు దయవచ్చినది. రాజమహేంద్రవర మిప్పటినుండి జీవవంతమయిన దయినట్టు చెప్పఁబడవచ్చును. మనరాజధానియొక్క చరిత్రములో డిసెంబరు 11 వ తేదిని మిక్కిలి ప్రసిద్ధదినమునుగా మీరు చేసి యు


న్నారు. మీరనివార్యముగా పొందిన వారయి యుండవలసిన సంతోషమును శ్రమను మీతోడఁగూడ పంచుకొనుట కక్కడనుండనందుకు నేను మిక్కిలి చింతనొందుచున్నాను...............

శీఘ్రముగా మనము మఱికొన్ని వివాహములను జరుపుదుమా ? ఈవేఁడిలోమఱికొన్ని వివాహములు చేయఁబడిననేతప్ప, ఒకవివాహమువలన నెక్కువ మేలుకలుగఁబోదు. మీరీవిజయము ననుసరించి నాలుగైదు వివాహములను శీఘ్రముగా చేసినయెడల, కొందఱు నన్ను నమ్మింపఁజూచునట్లు చెన్నపురి రాజమహేంద్రవరముయొక్క మెలఁకువ ననుసరించును. ఈవారములో మఱి నాలుగు వివాహములు జరగనున్నట్టు అవధాని (వావిలాల వేంకట శివావధానిగారు) తన సోదరునివలన విన్నట్టు నేను వినియున్నాను. ఈవర్తమానమును నాకు శీఘ్రముగా మీరు తంత్రీముఖమున తెలుపునట్లు చేయుటకయి దేవునకు నేను హృదయపూర్వకములైన ప్రార్థనలను సమర్పించుచున్నాను. -

పెద్దిభట్ల వెంకటప్పయ్య."

"చెన్న పట్టణము - 12 వ డిసెంబరు 1881.

కొన్ని నిమిషములక్రిందట నాకు చేరిన మీతంత్రీవార్తను చదివి నేను మిక్కిలి సంతోషించితిని. క్రొత్తవివాహదంపతులకు నామనపూర్వకములైన యాశీర్వచనములను మీవిరామములేని ప్రయత్నమువలనఁ గలిగిన జయమునకయి మీకు నాయభినందనములను బంపుచున్నాను. మీతంతిసమాచారమును డేవిడ్సన్ దొరగారికిని మేష్టరు దొరగారికిని చూపఁగా వారీ విశేషమును విని యెంతో సంతోషించిరి. ఒకటి తరువాత నొకటి వేవేగముగా అథమపక్ష నూఱువివాహములైనను జరగవలెనని నేను కోరుచున్నాను. ఈ యుద్రేకముచల్లాఱనియ్యకూడదు. ఇనుము వేఁడిగా నుండఁగానే సాగకొట్టి వేగముగా ననేక వివాహములను చేయింపుఁడు. మీతంత్రివార్తనిచ్చటి స్వదేశపు పెద్దమనుష్యులలో త్రిప్పుచున్నాను. వివాహములకు విరోధమైనసమాజ


మొకటి యిచ్చట నిప్పుడే కాలూనుచున్నది. అది మీకేమియు హానిచేయఁజాలదు. [7] వల్లూరి జగన్నాధరావు.

వీనిలో మొదటి యుత్తరము వ్రాసిన వేంకటప్పయ్యగారు వితంతువివాహప్రయత్నములో మాకత్యంత సహాయుఁడయి, వివేకవర్ధనిలోని యింగ్లీషుభాగమును వ్రాయుటలో గవర్రాజుగారివలెనే నాకు తోడుపడుచు, ప్రస్తుతము పట్టపరీక్షార్థము చెన్న పురికి పోయియుండి, యెప్పుడువచ్చి మాతో చేరుదునాయని తహతహ పడుచుండినవాఁడు. ఆయన యనుకొన్నట్లు బహువివాహము లొకటి తరువాత నొకటిగానగునని ప్రతీక్షించితిమిగాని మాప్రతిపక్షుల యుపద్రవమున కంతరంగములు సంచలింప ననేకులు ముందుకురాలేక వెనుకంజె వేయఁజూచుచుండిరి. రెండవవారమున బ్రహ్మశ్రీ దివాన్ బహద్దూరు వల్లూరి జగన్నాధరావు పంతులుగారు వ్రాసినట్టు చెన్న పురిలోవలె మాపట్టణములో వితంతువివాహ నిషేధక సమాజము క్రొత్తగా నేర్పడక పోయినను మునుపున్న సమాజమే ప్రతిపక్షులమయిన మావిజయమువలన కోప ఘూర్ణితమయి యపజయావమానలజ్జాప్రేరితమయి యుద్రేకించి ద్విగుణోత్సాహముతో సంస్కారపక్షనిర్మూలనదీక్ష వహించి పాటుపడఁజొచ్చెను. మొదటి వివాహమయిన నాలవదినమున పండ్రెండేండ్ల ప్రాయముగల యొక బాలవితంతువును వెంటఁబెట్టుకొనివచ్చి యామెతల్లి తనభర్త యాచిన్న దానిని వివాహమునిమిత్తము మాయొద్దకుఁబంపెననిచెప్పెను. మేమామెమాటలు నమ్మి భోజనముచేసి సకలకలాశాలా ప్రవేశపరీక్షనిమిత్తమయి పరీక్షాస్థలమునకు పోఁబోవుచున్న యొకవిద్యార్థిని తత్క్షణమేరప్పించి వధువునుజూపి యాతఁడొప్పుకొన్న మీఁదట వివాహము సిద్ధముచేసితిమి. పెండ్లికొమారుఁడు మంగళస్నానమునకుఁ గూరుచుండు వఱకును మాపురజను లీ వివాహము జరుగనన్న సంగతియే యెవ్వరునెఱుఁగరు. ప్రతిపక్షులవారు లతఁడు మంగళస్నానమునకుఁ గూరుచుండఁగా చూచి పరుగెత్తుకొనిపోయి పిడుగువంటి యీవార్త నతనితండ్రితోఁజెప్పిరి. అతఁడును రోదనముచేయుచు పెద్దపెట్టున కేకలువేయుచు వివాహసమయమున వధూవరులు పెండ్లి పీటలమీఁద కూరుచుండి యున్నప్పుడు పరుగెత్తుకొనివచ్చి పెండ్లికుమారుని లేవఁదీసి లాగుకొనిపోవుట కయి ప్రయత్నించెను. కాని, మాలోనివారు కొందఱాయనను కౌఁగిటఁ బట్టుకొని యొకగదిలోనికి తీసికొనిపోయి కూరుచుండఁబెట్టి శతమానము ముడిపడువఱకును మంచిమాటలుచెప్పియోదార్చుచు సమాధానపఱిచి తరువాత మెల్లఁగా నావలకు పంపివేసిరి. ఆమఱునాటిరాత్రి యీయిద్దఱు పెండ్లి దంపతులను మహావైభవముతో పెండ్లిపల్లకులలో నూరేగించితిమి. ఆరాత్రిజరిగిన యూరేగింపు మహోత్సవవైభవము సంస్థానాధిపతుల వివాహముల యందుకూడ జరిగి యుండదు. అఱువదిమంది పోలీసుభటులతో పోలీసు స్యూపరింటెండెంటే పల్లకులను జనుల యెత్తుడునుండి సంరక్షించుచు పురవీధులలో వెంటనడిచెను. హిందువులలోని తగుమనుష్యులు మాత్రమేకాక మండలన్యాయాధిపతి (District Judge) సంయుక్తదండ విధాయకుఁడు (Joint magistrate) శాస్త్రపాఠశాలాప్రధానోపాధ్యాయుఁడు (College principal) మొదలయిన యూరపియనులు సహితము మహోత్సాహముతో పల్లకులవెంట నడిచిరి. వేలకొలఁదిజను లావేడుకను చూడవచ్చుటచేత వీధు లొకకొననుండి


రెండవకొనవఱకును మనుష్యులతో నిండిపోయి యొకవీధివా రింకొకవీధికి నడుచుట దుర్లభమాయెను. నేనుపల్లకివెంట నడవక వచ్చినమూకలోఁజేరి వారేమి చెప్పుకొందురో వినుచుంటిని. చిరకాల దురాచారవాసనచేతను ద్వేషైక ప్రధానులైన ఛాందసశిరోమణులవలని భీతిచేతను పల్లకులు వీధులవెంటఁబోవునప్పుడు కొందఱు తలుపులుమూసికొన్నను, ఆవధూవరులను జూచిన సామాన్యజనులందఱును సంతోషించి యెక్కడఁజూచినను ఆకార్యములను శ్లాఘించుచునే వచ్చిరి.

రెండవపెండ్లికొమార్తెను తండ్రియనుమతిలేకయే తల్లితీసికొని వచ్చినదని మాప్రతిపక్షు లేలాగుననోతెలిసికొని, అతనిచేత మామీఁద దండవిధాయకునియొద్ద నేరముమోపించి మమ్ము శిక్షింపఁజేయవలెనని ప్రయత్నముచేసిరి. కాని వారిదుష్ప్రయత్నములను మేముయుక్తసమయములోనే తెలిసికొని కష్టముమీఁద తల్లివలన సత్యమునుగ్రహించి మెలఁకువపడి ముందుగా మే మే పెండ్లికొమారితతల్లిని పినతల్లినిపంపి యామెభర్తను మాయొద్దకు రప్పించుకొని సభల కెక్కకుండ తప్పించుకొంటిమి. ఈవివాహమయిన మఱునాటినుండియు మూర్ఖజనుల వలనిబాధ లంతకంతకు ప్రబలసాగినవి. ఈవివాహములను చేయించినవారిని చేసికొన్న వారిని వారితోఁగలిసి భోజనములు చేసినవారినిమాత్రమే కాక వేడుక చూడఁబోయినవారిని సహితము పలువిధముల బాధపెట్ట నారంభించిరి ; ఈ శుభకార్యములయందు కొంచెము సంబంధమున్న వారినందఱిని వారు కాపురమున్న యద్దెయిండ్లలోనుండి లేవఁగొట్టిరి ; కాపురముండుట కెవ్వరు నిండ్లనియ్యకుండిరి ; నూతులలో నీళ్ళుతోడుకోనియ్యకపోయిరి ; నీళ్ళు తెచ్చు బ్రాహ్మణులను తేకుండఁజేసిరి ; శుభాశుభకార్యములకు పురోహితులను బ్రాహ్మణులను రాకుండఁజేసిరి ; దేవాలయములకు పోనియ్యక పోయిరి ; బంధువులు మొదలైనవారిని వారియిండ్లకు పోకుండఁజేసిరి. కనఁబడినచోట్ల మొగముముందఱనే తిట్టసాగిరి ; మఱియు నింక నెన్ని విధముల దుండగములు చేయఁగలుదురో యెన్ని విధముల నాయాసపెట్టఁగలుగుదురో యన్ని విధము


లను వారు శ్రమకలుగఁ జేయసాగిరి. అంతేకాక తాముబాధించి యెదురు తమ్మేబాధించుచున్నారని యల్లరిచేసి దొంగయభియోగములు చేయసాగిరి. అల్లరిమూకమాట యటుండఁగా మండలన్యాయసభలో న్యాయవాదిగానున్న యొకబ్రాహ్మణోత్తముఁడే యొకదినమున బొట్టుగోఁకివేసికొని భోజనముచేయనట్టు నటించుచు తనవెంట కొంతబ్రాహ్మణుల మూకను జేర్చుకొని యొకవిజ్ఞాపనపత్రికతో దండవిధాయకునియొద్దకుపోయి వితంతువివాహ విధాయక పక్షమువారినాయకులు దేవాలయములు దూరి తమ కనేకవిధముల తొందరలు కలుగఁజేయుచున్నారని యేడ్చుచు మొఱపెట్టుకొను నంతటినై చ్యమునకు లోఁబడెను. ఈపక్షములో చేరినవారు రాజకీయోద్యోగములలో నున్న యెడల వారిమీఁద లేనిపోని దోషములనారోపించి వారిని పనినుండి తొలఁగింప వలయుననియు మఱియొకచోటికి మార్పవలయుననియు పయియధికారుల కాకాశరామన్న విన్నపములను పంప మొదలుపెట్టిరి. పాఠాశాలలో నుపాధ్యాయులుగా నున్నయెడల వారినాకొలువలనుండి తొలఁగింపవలయునని విశ్వప్రయత్నములుచేసిరి.

ఈప్రకారముగా పూర్వాచార పరాయణులలోని ధూర్తులుచేయు దుండగములకును పెట్టుబాధలకును తాళఁజాలక పిఱికిగుండెకలవా రనేకులు ప్రాయశ్చిత్తములు చేసికొని ప్రతిపక్షులలోఁజేరిరి. కొంతధైర్యముకలిగి నిలిచిన వారిలో స్వగృహములుగల వారికిని పరగృహములనుండి వెడలఁగొట్టఁబడని బలవంతులకును గాక మిగిలినవారికి నేను మాగృహమునిచ్చితిని. కొటికలపూడి రామేశ్వరరావుగారికి గవర్రాజుగారు తమ గృహమునిచ్చిరి. వివాహములయిన పెండ్లికొమారితలును పెండ్లికొమాళ్ళును రెండవపెండ్లికొమారితయొక్క తల్లి దండ్రులును తమ్ములిద్దఱును పినతల్లియు మాతామహుఁడును వంటబ్రాహ్మణులు నలుగురును వివాహములలో భోజనములకువచ్చి మాలోఁజేరి ప్రాతశ్చిత్తములుచేసికోక నిలిచిన మంజులూరి వెంకట్రామయ్యగారును భార్యయు కుమారుఁడును తమ్మఁడయిన గోపాలముగారును నల్ల గొండ కోదండరామయ్య


గారును మాయింటనే యుండవలసినవారయిరి. ఈవివాహములలో నితరుల మాట యటుండఁగా నాపితామహిసహితము నన్నువిడిచి మాయింటినుండిలేచి పొరుగింటికి కాపురమునకువెళ్లెను. నేనామెకుఁగావలసిన సమస్తమును సమకూర్చుచుంటిని. ఆరంభదశలో విధవావివాహములకు బద్ధశత్రువుగానుండిన వృద్ధురాలయిన యామె కొన్నిదినములలో కొంతమాఱి నామీఁది స్వాభావిక ప్రేమచేత నేనుజేసినపని మంచిదేయని నన్ను దూషించెడివారితో వాదింప మొదలుపెట్టెను. తరువాత నొకగది ప్రత్యేకముగానిచ్చినపక్షమున వేఱుగవంట చేసికొని భుజించెదనని వచ్చి మాయింటనే ప్రవేశించెను ; కడపట నాతోఁ గలిసి మాతోనే భోజనముచేయుచు 1884 వ సంవత్సరమున మృతినొందువఱకును వివాహములు చేసికొన్నదంపతుల నత్యంతప్రేమతో నాదరించుచు వచ్చెను. వివాహములయిన కొన్ని దినములలోనే ముప్పదిమందికి శ్రీశంకరాచార్యస్వాముల వారియొద్దనుండి బహిష్కార పత్రికలుకూడ వచ్చినవి. మా యూరిసభాపతులు మొదలైన వారాపత్రికలనుజూచి పరమానందభరితులయి వానినిప్రకటించుటకు శ్రీవిజయనగరము మహారాజుగారి బాలికాపాఠశాలలో సభచేసిరి. ఆసభలో నావఱకిచ్చకములాడుచు చిత్తముచిత్తమని యను గ్రహమును వేచి తిరుగుచుండిన యనామధేయులుకూడ పెద్దలయి తమకంటె నెక్కువ వారిపేరులను గౌరవసూచకమైన "గార"నుమాటయైన చేర్పకుండ నుచ్చరించి వారిని వెలివేసితిమనియు శుభాశుభకార్యములయందు వారియిండ్ల కెవ్వరుము పోఁగూడదనియు వారి నెవ్వరియిండ్లకు బిలువఁగూడదనియు వారిని దేవాలయములకు పోనియ్యఁగూడదనియు మహాజనమధ్యమున కేకలు వేయుచు బల్లలమీఁదనెక్కి గంతులువేసి యఱచిరి. ఈ కోలాహలమునకు జడిసి యావఱకు దృఢచిత్తులుకాక యిటునటు నూగులాడుచున్న వారనేకులు ప్రాయశ్చిత్తములు చేయించుకొనిరి.

ఈబాధలిక్కడ నిట్లుండఁగా నాకు బహుస్థలములనుండి ప్రోత్సాహకరములైన యుత్తరములును నభినందన పత్రికలును రాఁదొడఁగినవి. చెన్న ప


ట్టణమునుండి యనేకమిత్రులు వేంటనే చెన్న పట్టణము రావలసినదనియు వచ్చి యచ్చట నీవేఁడిచల్లాఱక మునుపే కొన్ని యుపన్యాసములుచేసినపక్షమున తప్పక కొన్ని వివాహములగుననియు నన్నా హ్వానముచేసిరి. వారికోరిక చెల్లించుట కర్తవ్యమనియు తన్మూలమున వితంతువివాహపక్షము బలపడుననియు నాకు తోఁచినందున, ఇక్కడనెవ్వరికి నేవిధమైన యిబ్బందులును గలుగకుండ తగినయేర్పాటులుచేసి, యొకవంటబ్రాహ్మణుని వెంటఁగొని చెన్నపట్టణమునకుఁ బోయి యక్కడకొంతపనిచేసి శీతకాలపు సెలవుల కడపట జనేవరు 16 వ తేదిని పాఠశాల తెఱచులోపల మరల రాజమహేంద్రవరమునకు రానిశ్చయించు కొంటిని. అప్పుడు నల్లగొండ-కోదండరామయ్యగారు తానా వఱకు చెన్నపట్టణము చూచియుండక పోవుటచేత చూడవలెనన్న యభిలాష తనకు విశేషముగాఁగలదనియు, వంటబ్రాహ్మణునకు బదులుగా తన్ను తీసికొనిపోయెడు పక్షమున తానే నాకు వంటచేసిపెట్టెదననియు, నన్నడుగఁగా నేనది యనుగ్రహముగా నెంచుకొని యాయనకోరిక నంగీకరించితిని. అప్పుడు చెన్న పురికిఁబోవ నావిరిబండ్లును నినుపదారులునులేవు. పడవమీఁద కాలువపయి నొక్కదినము ప్రయాణముచేసి కాకినాడచేరి, అక్కడనుండి వారమున కొక్కసారిపోయెడు పొగయోడలమీఁద సముద్రముపైని రెండుదినములు ప్రయాణముచేసి చెన్న పురిచేరవలెను. కోదండరామయ్యగారిని వెంటఁబెట్టుకొని బైలుదేఱి డిసెంబరు నెల 29 వ తేదిని కాకినాడలోఁ బ్రవేశించితిని. పొగయోడ బైలుదేఱెడు 30 వ తేదిని గాలివాన యారంభమయ్యెను. అటువంటి సమయమున సముద్రముమీఁద పోవలదని పైడా రామకృష్ణయ్యగారు మొదలైనవారు నన్ను బహువిధముల ప్రార్థించిరి. ఒక్కసారి నిశ్చయముచేసి కొన్నతరువాత పట్టినపట్టును విడిచెడుస్వభావము కలవాఁడను కాకపోవుటచేత నామిత్రుల హితవాక్యములు వినక మౌర్ఖ్యముతో నాటిమధ్యాహ్న మాగాలి వానలోనే పడవయెక్కి నాసహచరుని తోడఁ గూడ పొగయోడయొద్దకు పోవబైలుదేఱితిని. అప్పుడు జంఝామారుతము ప్రచండముగా వీచుచు సంతత


ధారగా వర్షముకురియుచు సముద్రతరంగములు పర్వతోపమానములుగా నుండెను. అట్టిభయంకరస్థితిలోనే సముద్రమునం దైదుమైళ్ళు ప్రయాణము చేసి యెంతోకష్టముమీఁద పొగయోడ సమీపమునకుఁ బోఁగలిగినను, పడవ యోడను తారసించుట యపాయకరమని యెంచి ధూమనౌకాధికారి మమ్మెక్కించుకోక నిరాకరించినందున మేముభయులమును ఆశాభంగమునొందిన వారమయి తడిసిముద్దయయి రాత్రి యెనిమిది తొమ్మిది గంటలకు తీరము చేరవలసిన వారమయితిమి. ఈ సమయమున జనేవరు నెల 8 వ తేదిని పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు చెన్న పట్టణమునుండి వ్రాసిన యీక్రింది యుత్తర మీ విషయమును గొంత సూచించును.

"వై-ఎల్-నరసింహముగారి యుత్తరమునుబట్టి 30 వ డిసెంబరు స్టీమరుమీఁద మీరిక్కడకు వత్తురని మే మెదురుచూచితిమి. సముద్రము తరంగాకులముగా నుండుటచేత మీరు మరల రాజమహేంద్రవరమునకు పోయినట్టు జయంతి రామయ్యగారి కిప్పుడే యుత్తరము వచ్చినది.

పూర్వాచార పరాయణ సంఘముయొక్క సభలనుగూర్చియు వారి చర్యలనుగూర్చియు ఆచార్యుని (శంకరాచార్యుని) యొద్దనుండి శాస్త్రపమాణావలంబక సంఘముయొక్క ప్రతినిధియైన పుణ్యాత్ముఁడగు నాగవరపు రామమూర్తిచేత తీసికొని రాఁబడినతరువాతి బహిష్కార పత్రికలనుగూర్చియు సంపూర్ణసమాచారము నాకు వచ్చియున్నది. వివాహసమయమున నూరక వచ్చినవారిని సహితము చేర్చుకొని సుమారు 31 కుటుంబములు బహిష్కరింపఁ బడినవని తెలిసికొనుటకు నాకానందము కలుగుచున్నది...................పరీక్ష యయనతరువాత నేను తత్క్షణమే బైలుదేఱెదను." <ref> "According to a letter from Mr. Y. L. Narasimham we expected you would come down here by the thirtieth December steamer. Mr. Jayanti Ramayya has just received a letter to say that you went back to Rajahmundry finding the sea rough.


I have received full information about the meetings of the orthodox community and their proceedings as also about the subsequent writ of excommunication brought from the Achari by the pious Nagavarapu Ramamurti, delegate of the orthodox community ǃ I am delighted to learn that about 31 families are excommunicated including even those that attended the marriage simply..........................I shall start immediately after examination."/ref> చిత్రపుకామరాజుగారి వ్యవహారములో వేశ్యాంగనాసంభోగ సౌఖ్యమున కాశపడి కాగితపుముక్కల నిచ్చి వేసిన న్యాయవాది యిందుదాహరింపఁబడిన నాగవరపు-రామమూర్తియను మహాపురుషుఁడే.

ఆపదలు వచ్చినప్పుడు మేము ధైర్యముతో నిలుతుమో పిఱికి పందలమయి ధర్మపక్షమును విడిచి తొలఁగుదుమో శోధించుటకయి యీశ్వరుఁడు పంపిన శోధనలోయనునట్లుగా మమ్మన్ని ప్రక్కలను కష్టములే యెదుర్కొన నారంభించెను. స్వాములవారు పంపిన బహిష్కారపత్రికలు పెద్దపులులవలె బెదరింపఁగా నావఱకు ముందంజెవేయు వారందఱును వెనుకంజెవేసి మా ధైర్యవచనములను చెవినిబెట్టక మాకు విముఖులయి పూర్వాచారాపరాయణుల మఱుఁగునకు పలాయితులుకాఁజొచ్చిరి. భయకంపితులయియున్న యిట్టి వారి భయముడిపి వారికి మరల ధైర్యముపుట్టించి వారిని సుముఖులనుజేసి మరల మనవంక కాకర్షించుటకుఁ దగినప్రతిక్రియను కార్యము మించకముందే యాలోచించి ప్రయోగించుట కర్తవ్యమని మాలోనివారు నిశ్చయించి, శంకరాచార్యస్వాములవారిమీఁద మాననష్టమునకయి యభియోగము తెచ్చుటయే దానికి తగినమందని నన్నా పనికి పురికొల్పిరి. మనుష్యమాత్రు లెవ్వ రెంతమంది శత్రువులయి యెన్ని విఘాతములుచేయఁ బాటుపడినను మనముపూనినకార్యము మంచిదియు నీశ్వరప్రీతికరమయినదియు నయినపక్షమున ధర్మబలముచేతను దైవబలముచేతను కడపట కార్యసాఫల్యము కాకమానదనియు, విరోధులయపకృతికి ప్రత్యప్రకృతి యక్కఱలేకయే విజయమునొందవచ్చుననియు, నమ్మిన


వాఁడనగుటచేత స్వాములవారిపై నభియోగము తెచ్చుటకు నేనొప్పుకొనలేదు. ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు స్వాములవారిపై నభియోగము తెచ్చిరికాని యది కొట్టుపడిపోయినది. ఇది యిట్లుండఁగా విశాఖపట్టణములో ప్రధమ వివాహముచేసికొన్న గోగులపాటి శ్రీరాములుగారి నీవిషయమున దూషించినారని కొందఱిప్రముఖులమీఁద దర్భా వేంకటశాస్త్రిగారు మొదలైనవా రాయనచేత మాననష్టమున కభియోగము తెప్పించి యోడిపోయినందున గొప్పవారితో వైరము సంపాదించుకొనుటతప్ప వేఱు ప్రయోజనము కలుగకపోయెను. సభలకెక్కక యుపేక్షచేసి యూరకుండుటకు మాఱుగా సభలకెక్కి యోడిపోవుట మాపక్షమున కధికానర్థదాయకమయినందున క్రొత్తగా వచ్చిన యనర్థమువలని దుష్ఫలములను తొలఁగించు విషయమున నేనును పనిచేసి యుపర్యభియోగాదుల విషయమయి పాటుపడవలసినవాఁడనైతిని. స్వాములవారిపైతేఁబడిన యభియోగము కొట్టుపడిపోవుటచేత మాప్రతిపక్షులు విజయ గర్వితులయి మాపక్షమువారిని మఱింతలోకువచేసి గేలిచేయసాగిరి. ఏవంకఁ జూచినను కష్టమేఘములును విద్వేషాకాలవాయువులును చుట్టుకొని యంధకార బంధురములయి యాదినములు స్త్రీ పునర్వివాహ విధాయకపక్షమువారికి దుర్దినములుగానుండెను. ఆవఱకు వితంతువివాహములు చేసెదమని ముందుకు వచ్చినవా రిప్పుడాపేరునైన తలపెట్టక పిలిచిననుపలుకక పలాయితు లైరి. అభియోగము కొట్టుపడినతరువాత ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు వైష్ణవమత ప్రవిష్టులయి ప్రాయశ్చిత్తముచేసికొనఁగా, వారు వితంతు వివాహపక్షమున పనిచేసినందుకే ప్రాయశ్చిత్తము చేసికొనిరని ప్రతిపక్షులును పామరులును పలుకఁ జొచ్చిరి. వైష్ణవమతప్రవేశమున కావశ్యకమయినందుననే ప్రాయశ్చిత్తమును జేసికొంటిమికాని యదియిందుతో నెంతమాత్రమును సంబంధించినది కాదనియు, తాము వెనుకటివలెనే వితంతువివాహముల విషయమున శ్రద్ధవహించెదమనియు, వారు వివేకవర్థనికి లేఖవ్రాసిరికాని తరువాత వివాహములు జరగునప్పుడుమాత్ర మెప్పుడునురాలేదు. అయినను వివాహములతో సంబం ధించిన సమస్త విషయములయందును యధాపూర్వముగా శ్రద్ధవహించుచునే యుండిరి. వితంతువివాహలత కవలంబస్తంభమని చెప్పఁదగిన పైడా రామకృష్ణయ్యగారే వితంతువివాహ పక్షమును విడిచిపెట్టి ప్రాయశ్చిత్తము చేయించుకొనఁబోవుచున్నారని యొక ప్రబలప్రవాద మెల్ల యెడలను వ్యాపించెను. అట్టివైపరీత్యము కలుగకుండుటకయి నేను సర్వవిథములఁ బ్రయత్నము చేసితిని. ఈవిషయమునుగూర్చి మాకత్యంతసహాయులయి కాకినాడ యనుగత న్యాయాధిపతి (Sub Judge) గా నుండిన కృష్ణస్వామిరావు పంతులుగారి పేరవ్రాయఁగా వారిట్లు ప్రత్యుత్తరమిచ్చిరి -

"కాకినాడ - 21-8-82.

మీయుత్తరము నాకంది నేను దానిని పై-రా-కృ గారికి చూపితిని. ఆయన మీకు రు. 100 లు పంపినట్టును ఇంకను కొంత యొకటిరెండు దినములలో పంపునట్టును చెప్పిరి. శ్రీరాములువిషయమై తగిన శ్రద్ధ పుచ్చుకొనఁబడును

పైడా రామకృష్ణయ్యగారు ఆచార్యునియొక్క యధికారమునకు లోఁబడుటకయి తనమనస్సును దృఢముచేసికొన్నాఁడు విధింపఁబడునట్టియు, నంగీకరింపఁ బడినట్టియు షరతులు మీరు పైనివేసికొన్న యుత్తమకార్యమున కత్యంత హానికరములైనవిగానున్నవి. వితంతు వివాహనిధికొఱకు జనులకు విన్నపము పంపుటకయి మీకాలోచన చెప్పుచున్నాను. ఆవిన్న పమన్ని పత్రికలయందును ప్రకటింపఁబడవలెను. మీచేవ్రాలు చేయఁబడిన విన్నపము యొక్క ప్రతినొకదానిని మీరు నాకు పంపినయెడల నేను దానిని హిందూపత్రికకుపంపి దానిని తనవ్రాతతో బలపఱుచుచు ప్రకటింపుమని పత్రికాధిపతిని గోరెదను. సొమ్ముపోగుచేయుటకయి ప్రయత్నము చేయవలసినదనియు, పైడా రామకృష్ణయ్యగారింతవఱకును జేసినట్టుగా ముందంత సాహాయ్యమును చేయఁజాలరు గనుక లేకపోయిన యెడల కార్యమునకు భంగముకలుగుననియు నేను చెంచలరావుగారికి వ్రాసియున్నాను. ఆయన కొంతపని చేయునని నమ్ము

చున్నాను. చెంచలరావుగారి ప్రకటనకు బదులుగావచ్చిన యుత్తరములను బట్టిచూడఁగా దేశమింకను ఈ సంస్కారమునకు సంసిద్ధముకానట్టు కనఁబడు చున్నది. రాజమహేంద్రవరమునుండి వచ్చిన యొక పెద్దమనుష్యుఁడు మీ యారోగ్యము సరిగాలేదని నాతో చెప్పినాఁడు. దీనిప్రధానకారణము మీ యతిమనస్తాప మని నేననుకొనుచున్నాను. మీ దేహస్థితి చెడునట్లుగా మీమేదస్సున కతివిస్తారముగా పనిపెట్టఁగూడదు. మీది మిక్కిలి విలువగల యాత్మ. ఈ సంస్కారము పూర్ణముగా మీయొక్కరి కృషిమీఁదనే నిలిచి యున్నది. సర్వశక్తుఁడు మీజీవితమును దీర్ఘముగాఁజేసి, మీకు మీరేర్పఱుచు కొన్న యుత్తమకార్యములో జయమును ప్రసాదించి, అన్ని కష్టములను శోధనలను ప్రతిఘటించుటకు మిమ్ము శక్తులనుగాఁ జేయునుగాక యని మీ క్షేమమును గోరెడు మిత్రుఁడైన కే. కృష్ణస్వామిరావుయొక్క సోత్సాహప్రార్థనయయియున్నది."[8] పయియుత్తరములో విధింపఁబడి యంగీకరింపఁబడినట్టు చెప్పఁబడిన షరతులలో ప్రధానమైనది రామకృష్ణయ్యగారిఁకముందు వితంతువివాహముల నిమిత్తమయి ధనసాహాయ్యము చేయకుండుట. శ్రీరాములనుగూర్చి చెప్పఁబడినయంశము ముందు వివరింపఁబడును. ఇటువంటి కష్టకాలములయందు సహితము మమ్ము చేయివిడువక రహస్యముగా మాకు బహువిధముల తోడుపడినవారుసహితము కొందఱుండిరి. అట్టివారిలో ప్రథమగణ్యులయి న్యాపతి సుబ్బారావుపంతులుగారు మాకారంభదశనుండియు నాలోచనచెప్పుచు సర్వవిధముల సాయముచేయుచుండిరి. అట్టి సుబ్బారావు పంతులుగారు రామకృష్ణయ్యగారిని ప్రాయశ్చిత్త కర్మమునుండి మరలించు సందేశమును వహించి మాపక్షమున కాకినాడకుఁ బోయి వారితో మాటాడి మాకిట్లు వ్రాసిరి -

"రామకృష్ణయ్యగారీ రాత్రి బైలుదేఱుచున్నారు. రేపు పెద్దాపురములో నిలిచి మఱునాఁడు రాజమహేంద్రవరములో నుండెదనని యాయన చెప్పుచున్నాఁడు. ప్రాయశ్చిత్తము చేయించుకొనుటకుముందు మిమ్మిద్దఱిని చూడవలెనని నేనాయనయొద్దనుండి యొక్క వాగ్దానమును గైకొన్నాను.


ఆయనను నిరుత్సాహ పఱుచుటకు నా యావచ్ఛక్తిని ప్రయత్నించినాను. (ఇక్కడ కొంతభాగము శిధిలమయినది).........మనశ్శాంతి లేకున్నాఁడు. ఆయన ప్రాయశ్చిత్తము చేసికొనవలెను ; చేసికొనుట కిష్టములేదు. ఈకార్యమునుండి దేవుఁడాయనను రక్షించునుగాక ! ఈశ్వరుని మార్గములు దుర్గ్రాహ్యములు. ఇవి వితంతువివాహపక్షమువారికి శోధనదినములు. ఈ పక్షము యొక్క దృఢసహాయులు విడిపోవుచుండఁగా నేను చూచునప్పుడు, మిమ్ములనుండి నన్ను వేఱుగానుంచుచున్న యా సన్న దారమును త్రెంపివేసి మీపక్షమునఁ జేరుటకు దేవుఁడు నన్ను మఱిమఱి పురికొల్పుచున్నాఁడు...... " [9]

పంతులుగారు వ్రాసినట్టుగా రామకృష్ణయ్యగారు ప్రాయశ్చిత్తము చేయించుకొనుటకయి రాజమహేంద్రవరమువచ్చి నన్ను చూచిరి. ప్రాయశ్చిత్తముచేసికొనకుండ మరలించుటకయి యాయనకు నేను చెప్పవలసినంత చెప్పితిని. ఆయన యేమిచేయుటకును తోఁచనివాఁడయి చిత్తము డోలాదోళనమునొంద, ఇఁకముందు వివాహములు జరగవనియు జరగెడుపక్షమున తాను వాగ్దానముచేసినట్టు సాహాయ్యముచేసెదననియు నాతోచెప్పెను. వివాహములు తప్పక జరగుననియు, అధమమొక్క సంవత్సరకాలమువేచి చూడవల


సినదనియు, అప్పటికి వివాహములయ్యెడు చిహ్నములు కనఁబడకపోయిన యెడల ప్రాయశ్చిత్తము చేయించుకో వచ్చుననియు, నేను చెప్పితిని. మోమోటముచేత నాముందు ప్రాయశ్చిత్తమును నిలుపుచేసెదనని పలికి నన్ను వీడ్కొని వెడలిపోయెను. అటుతరువాత గంటసేపటికి కొందఱు విద్యార్థులు నావద్దకువచ్చి రామకృష్ణయ్యగారు ప్రాయశ్చిత్తము చేయించుకొనఁ బోవుచున్నారని చెప్పిరి. నేను వెంటనే వారియింటికిఁబోయితిని. నేను పోవునప్పటికి ప్రాయశ్చిత్తమునకై యేర్పాటుచేసిన మాప్రతిపక్షనాయకులును కొందఱు వైదికులును రామకృష్ణయ్యగారిని పరివేష్టించియుండిరి. రామకృష్ణయ్యగారానాయకులతో మాటాడిపంపివేసి, నేను మాయింటికి వచ్చిన తరువాత గోదావరిమీఁద పడవయెక్కిపోయి బొబ్బర్లంకలో ప్రాయశ్చిత్తము చేసికొని వచ్చి నాఁడే కాకినాడకు వెడలిపోయిరి. ప్రాయశ్చిత్తము చేసికొన్న తరువాత రామకృష్ణయ్యగారు మాసవ్యయముల నిమిత్తము సొమ్ము పంప మానివేసిరి. నేనీసంగతి నెవ్వరికిని దెలియనీయక వారు సొమ్ము పంపుచుండి నప్పటివలెనే యధాపూర్వముగా సేవకులజీతములు మొదలైనవిచ్చుచు పనులు జరుపుచుంటిని.

ఇప్పుడు కేష్ణస్వామిరావు పంతులుగారి యుత్తరములో సూచింపఁబడిన గోగులపాటి శ్రీరాములుగారి వృత్తాంతమునకు వత్తము.ఆయన వివాహచేసికొని మరల విశాఘపట్టణమునకు వెళ్లిన యల్పకాలములోనే యాయనకు రక్తగ్రహిణి పట్టుకొని యంతకంతకు హెచ్చయ్యెను. జనేవరునెల మూడవవారములో నతఁడు ప్రాణసంశయదశలో నున్నూఁడని మిత్రులు నా కుత్తరములువ్రాసి తంత్రీవార్తను బంపిరి. ఆసమయములోనే మాలో చేరియున్న దర్భా వేంకటశాస్త్రిగారక్కడలేక సెలవుమీఁద స్వస్థలమయిన బందరు (Masulipatnam)నకు వెళ్లుట తటస్థించెను. అప్పుడు నాకు కలిగిన మనోవ్యాకులతకు పరిమితిలేదు. వివాహమైన నెలదినములలోనే మొదట వివాహముచేసికొన్న పురుషునకేమైన తటస్థించినపక్షమున జనులు దాని


నీవివాహమున కారోపింతురు ; అందుచేత ముందెవ్వరును వితంతువులను వివాహముచేసికొన సాహసించుటకే సంశయింతురు. తన్మూలమున నేను పూనిన సంస్కారమునకే విఘాతము కలుగవచ్చును. నాకు తంత్రీవార్తయందఁగానే యాతని విషయమయి యధికశ్రద్ధ చేయవలసినదని మిత్రులక నేకులకు లేఖలను వ్రాసి తంతివార్తలనుబంపి, పథ్యపానము లమర్చుటకయి మాపురోహితుఁడైన శ్రీపాద రామసోమయాజులను ముందుగా కాకినాడమీఁదుగా పొగయోడమీఁదఁబంపి, తరువాత నుపాధ్యాయపదమునందుండి మాలోఁజేరి మాయింటనే యున్న నల్లగొండ కోదండరామయ్యగారిని పయివారపు స్టీమరుమీఁద విశాఖపట్టణమునకుఁ బంపితిని. నేను ప్రతిదినమును తంత్రీవార్తలను బంపి యెప్పటి స్థితి యప్పుడు తెలిసికొనుచుంటిని. కోదండరామయ్యగారు జనేవరు నెల 29 వ తేదిని విశాఘపట్టణముచేరునప్పటికే యతని వ్యాధి యీశ్వరానుగ్రహమువలన మరలి యతఁడు స్వస్థతకు వచ్చుచుండెను. విశాఖపట్టణముచేరిన 1882 వ సంవత్సరము జనేవరు 29 వ తేదిని కోదండరామయ్యగారు నాకిట్లు వ్రాసిరి.

"సుమారు పదిగంటలకు నేటియుదయమున నేనిక్కడ సురక్షితముగా ప్రవేశించితిని. మొన్నటిదినము తంత్రీవార్తవలన తెలిసికొనిన దానికంటె శ్రీరాములు గారిప్పుడు మిక్కిలి వాసిగానున్నట్లు నేను కనుగొంటిని. ఆతని యారోగ్యవిషయమై మీకీవఱకే తంతిసమాచారము పంపఁబడినందున నారాకనుగూర్చి తంతియియ్యలేదు. రక్తగ్రహిణి యించుమించుగా నివారణమైనది...................... నిన్నటి మీతంతివార్త శ్రీరాములకు మిక్కిలి ధైర్యము కలిగించినది. అప్పటినుండి చాలమార్పుగలిగినదని నేను వినుచున్నాను." [10]


శ్రీరాములుగారు కొంత స్వస్థపడినతరువాత జనేవరు 31 వ తేదిని బైలుదేఱి ముందుగా రామసోమయాజులు వచ్చి వేసెను ; వేంకటశాస్త్రిగారు వచ్చు వఱకునునుండి కోదండరామయ్యగారు తిరిగివచ్చిరి. ఆయనరోగము మళ్లి కుదురుముఖమునకు వచ్చు చున్నదను వఱకును నాగుండె కుదుటఁబడలేదు. మిత్రవిషయమయి యెంతో కష్టపడినందుకు కోదండరామయ్యగారికి నాకృతజ్ఞతను దెలుపుచున్నాను.

మాప్రతిపక్షులు మాకొత్తుడు కలుగఁజేయుటకును మాయుద్యమములకు విఘ్నములు కలిగించుటకును ఏయే సాధనములున్నవో వానినెల్ల మాయెడల ప్రయోగింపక విడువలేదు. ఆకాలమునందలి రాజకీయోద్యోగులలోని లంచములు మొదలైనయకృత్యముల నణఁచుటకును కులములోని దురాచారములను మాన్పుటకును సంఘసంస్కారములను దేశమునందంతటను వ్యాపింపఁజేయుటకును మాచేతిలో వివేకవర్ధనీపత్రిక యమూల్యాయుధముగానుండెను. దానిని రూపుమాపినఁగాని మాపక్షము దుర్బలముకాదని మాప్రతిపక్షులు తలఁచి, పత్రికా ప్రకటనమునకు మూలమయిన ముద్రాశాలభాగస్థులను ప్రేరేచి ముద్రాయంత్రము పనిని నిలుపునట్లుచేసిరి. భాగస్థులలో నే నొకఁడను ; రెండవవాఁడయిన నామిత్రుఁడు రాజామంత్రిప్రెగడ దుర్గామల్లికార్జున ప్రసాదరావు బహదూరుగారు కాలధర్మము నొందుట తటస్థించెను ; తక్కిన నలుగురును సంస్కారవిషయమున నాప్రతిపక్షకోటిలోనివారు ; వారిలో సరిపల్లె గోపాలకృష్ణమ్మగారు వితంతు వివాహవిపక్షయోధులకు ప్రధాననాయకుఁడు. పూర్వాచార పరాయణుఁడైన చల్లపల్లి రామబ్రహ్మముగారు నాతోడఁగూడి పనిచేసిన బాపయ్యగారి జ్యేష్ఠభ్రాత ; నాళము కామరాజుగారును పందిరి మహాదేవుఁడుగారును రామ బ్రహ్మముగారి చేతిలోనుండి యాయన నడిపించినట్లు నడుచువారు. ఈకడపటివారు నలుగురునుజేరి పని మానిపించిరిగాని ముద్రాశాలను నాయొద్దనుండి తొలఁగించుటకు శక్తులు కాకపోయిరి. వారు ముద్రాయంత్రమును విక్రయింపవలెనని తమ యభిప్రాయమును దెలుపఁగా


రు. 1250 లను వారికిచ్చి ముద్రాయంత్రమును నేనే కొని పని నెప్పటివలె సాగింపంసాగితిని. నేను వితంతువివాహోద్యమములో మునిఁగియున్నప్పుడు సహితము మిత్రసాహాయ్యమున నిర్భయముగా నితరుల దౌష్ట్యములను వెల్లడించి ధర్మస్థాపనముచేయఁ బాటుపడుచునేయుంటిని. ఈవిషయమున శ్రీ పైడా రామకృష్ణయ్యగారి లేఖలలోని కొన్ని వాక్యము లిందుదాహరించెదను.

1. "కాకినాడ. 1 - 10 - 81.

గొప్పవారికి విరోధముగ మీరువ్రాసిన వ్యాసములలో కొన్నిటిని చదివినప్పు డెల్లను నేనత్యంతకంపమును బొందుచున్నాను. ఈయంశములలో దేనిలోనైనను మీరు చిక్కులలో పడుదురేమోయని భయపడుచున్నాను. మీకనేక శత్రువులున్నారు............ మీకడపటిదానిలో జాన్‌సన్ గారి విషయమునను పురపారిశుద్ధ్యసంఘము విషయమునను స్మిత్తుగారి విషయమునను మీవ్యాఖ్యానములను విచారముతో చదివినాను. ఎవరైనను మేము లక్ష్యము చేయమని మీరంటిరి. ఇది జాన్‌సన్‌గారి నుద్దేశింపఁబడినది. దండవిధాయులతోను దండశాఖాధికారులతోను తగవు పెట్టుకొనవలదని నేను మీకు హితముచెప్పుచున్నాను............... దీని యంతవలనను నేను చెప్పఁదలఁచుకొన్న దేమనఁగా - ఏదినముననైన మీరు శ్రమలోనికి వచ్చెడు పక్షమున, వితంతుపక్షములో నొక గొప్ప పోషకుని నేను పోఁగొట్టుకొనవలసివచ్చును. ఆవేఁడి మీతో పడిపోవును."[11] ఇందు పేర్కనఁబడిన దండవిధాయకులైన జాన్‌సన్ దొరగారే రెండుమాసముల తరువాత జరగిన వితంతు వివాహసమయమున తాము స్వయముగావచ్చి యూరేగింపువేడుకను నడపి నాకెంతో సాయముచేసిరి ; డాక్టర్ స్మిత్తు దొరగారిప్పటికిని నాకు మిత్రులయి రాజమహేంద్రవరమువచ్చి నప్పుడెల్లను నన్ను చూచి పోవకమానరు.

2. "కాకినాడ. 26 - 3 - 84

"మీక్షేమమును గోరెడు మిత్రుఁడనుగాను, మీరు అశరణ్యలైబాధింపఁబడు జాతికి గొప్పయనుగ్రహమును జేయుచున్న గొప్ప సంస్కర్తలయి నందునను కెల్సాల్ గారి విషయమైన మీవ్యాఖ్యానములు రుచ్యమైనవికావని మీకు వ్రాసి తెలుపఁగోరుచున్నాను. మీకు రహస్యమైనట్టికాని బహిరంగమైనట్టి కాని శత్రువు కావచ్చునని నేను భయపడుచున్నాను.............. మీరు ప్రజలకు మిక్కిలి విలువ గలవారు. కాఁబట్టి యిటువంటి గొప్పవారును బలవంతులునైన వారినిగూర్చి వ్రాయకుఁడు. మేము మిమ్ము పోఁగొట్టుకొన్న పక్షమున, మేము సమస్తమును పోఁగొట్టుకొందుము. నన్ను క్షమింపుఁడు." [12]

మండల న్యాయాధిపతియైన యీకెల్సాల్ దొరగారు నాకు పరమమిత్రులయి రాజమహేంద్రవరములోనున్నప్పుడు మాయింటికి వచ్చుచుండుటయేకాక యుపకారవేతనమునుబడసి యింగ్లండునకుఁబోయిన తరువాత సహిత మప్పుడప్పుడిప్పటికిని నాపేరలేఖలు వ్రాయుచున్నారు. ఈయంశము నిచ్చటవిడిచి మరల మనవెనుకటి కథకు పోవుదము. లక్ష్మీనరసింహముగారు తెచ్చిన యభియోగము పోయినతరువాత ప్రతిపక్షులు తమకు సంపూర్ణజయము కలిగినదని విఱ్ఱవీఁగుచు విధవావివాహపక్షము మరల నెప్పటికిని తలయెత్తలేకుండ స్థిరముగాచెడినదని పరమానంద హృదయార విందులయి మిన్నందియుండిరి. మాలోని మహాధైర్యవంతులు సహితము మరల వివాహములు కావని యధైర్యపడి నిరుత్సాహులయిరి. ఈ సమయములో మాకు పాఠశాలలోని విద్యార్థులనేకులు పెట్టనికోటగానుండి చేతనయిన సర్వవిధముల తోడుపడినారు ; కొందఱెక్కడకు పొమ్మన్నను పోయి చేయుమన్న పనిని రెండవవారెఱుఁగకుండ చేయుచువచ్చిరి. విద్యార్థులకు మాయందెంత యభిమానముండెనో, వారెంతటి ధైర్యోత్సాహములును విశ్వాసమును కార్యనిర్వహణాసక్తియు లోకోపకార చింతయు కలవారయి యుండిరో, యీక్రింది సంగతివలనఁ గొంతతేట పడవచ్చును -

లక్ష్మీనరసింహముగారి యభియోగము పోయినతరువాత శ్రీశంకరాచార్యులవారును వారిని పురస్కరించుకొనియున్న మాపురమువారును మహోచ్ఛ్రాయదశ యందుండి విజయగర్వముచేత మిన్నును మన్నును గానకుండిరి. ఆయభియోగము పోయినమఱునాఁడు శంకరాచార్యస్వాములవారిని మహావైభవముతో మావీధిని మాగుమ్మముముందఱినుండి గొనిపోయి రాత్రి కరదీపికాసహస్రములతో రాజమహేంద్రపురవీధులలో నూరేగించిరి ; కాని మాయింటిముందఱ నల్లరి యేమాత్రమునుచేయక నిశ్శబ్దముగా సాగిపోయిరి. నాఁడే యావార్తను తంత్రీముఖమున కాకినాడకు పంపఁగా నాలేఖను కాకినాడ పురజనులు పల్లికిలోఁబెట్టి యారాత్రియే యూరేగించి గొప్పయుత్సవముచేసి పయిడా రామకృష్ణయ్యగారి యింటిముందునిలిచి యంతటిధనికుని చెల్లుబడి కలిగినవానిని సహితము లక్ష్యముచేయక, ఆయనగుమ్మమువద్ద చప్పటలుగొట్టి కేకలువేసి చేయఁగలిగినంత యల్లరిచేసిరి. ఈయల్లరియే రామకృష్ణయ్యగారి ధైర్యమును చలింపఁజేసి యాయనను ప్రాయశ్చిత్తమునకు లోఁబడునట్లు చేసి


నది. ఇటువంటి సంతోషదినములలో స్వాములవారు రాజమహేంద్రవరమును విడువక మాపక్షమువారికి మఱింత యవమానముకలుగుటకయి ప్రతిదినమును వాద్యములతో వీధులగుండ నూరేగుచు భిక్షలుచేయుచు కొన్ని మాసములక్కడనే నిలిచియుండిరి. ఆకాలములో స్వాములవారు విధవావివాహముల నెంతనిషేధించుచు వచ్చినను ఘోటక బ్రహ్మచారులైన వారి శిష్యులుమాత్రము రండలతోడ రాత్రు లమంత్రకములైన వివాహములను రహస్యముగా జరుపుచునే వచ్చిరి. పాఠశాలలోని విద్యార్థులు కొందఱీరహస్యమునుకనిపెట్టి యొకనాటిరాత్రి కాచియుండి యొకబ్రాహ్మణ వితంతువుతో సంసారముచేయుచున్న బ్రహ్మచారిశిష్యుని పట్టుకొని, ఆయపూర్వ దంపతులను వీధిలోనికీడ్చుకొనివచ్చి యెల్లవారికినిజూపి యవమానపఱిచిరి. అందుచేత స్వాములవారి శిష్యులకందఱికిని పాఠశాలలోని విద్యార్థులమీఁద విద్వేషముపుట్టి వారీ బాలురమీఁద నేలాగుననైన పగతీర్చుకోవలెనని నిశ్చయము చేసికొనియుండిరి. ఇట్లుండఁగా వారికి సమయము సహితము వెంటనే దొరకినది. రెండుదినములయినతరువాత పగలు పండ్రెండుగంటలవేళ స్వాములవారి శిష్యులు గోదావరిలో స్నానముచేయుచుండఁగా, పాఠశాల విడిచినతరువాత విద్యార్థు లిద్ద ఱక్కడకు స్నానమునకు పోయిరి. వారినిచూచి యాస్వాముల వారిశిష్యులు పాఠశాలంజదువుకొను విద్యార్థుల నందఱినికలిసి తిట్టఁగా, ఎవరు తప్పిదముచేసిరో వారినే తిట్టవలయునుగాని మొత్తముమీఁద తిట్టుట న్యాయముకాదని యొకవిద్యార్థి మందలించినందున వాక్కలహము ముదిరి పిండి వంటలు నిత్యమును తిని బలిసియున్న యా శిష్యు లాచిన్న వానిని పట్టుకొని నిష్కరుణులయి క్రూరముగా కొట్టిరి. అప్పుడక్కడనున్న రెండవ విద్యార్థి పాఱిపోయి యీ సమాచారమును పట్టణములో చెప్పఁగా, పాఠశాలలోని విద్యార్థు లనేకులు కూడుకొని తమతోడిబాలకుని క్రూరముగా ప్రహరించి నందునకయి యాదుండగపు శిష్యులను దండింపవలయునని ప్రతిజ్ఞ చేసికొని గుంపులుకూడి కోపముతో స్వాములవారున్న గృహముముందు వీదిలో తిరుగ


సాగిరి. విద్యార్థుల యాగ్రహమునుజూచి భయపడి యాశిష్యులు వీధిలోనికి రాక యింటిలో నడఁగియుండుటయేకాక యిద్దఱా రక్షకభటులను సహాయులనుగా తెచ్చుకొని వాకిటిలో కావలియుంచుకొనిరి. విద్యార్థులాప్రకారముగా రాత్రిజామువఱకును తిరిగి స్వాములవారిశిష్యు లిల్లువెడలివచ్చు జాడ కానక విసిగి నాఁటి కిండ్లకుపోయిరి. శిష్యులటుతరువాత సహితము వీధి మొగము చూచుటకు సాహసింపలేక తమకు కావలసిన వస్తువులను గోడచాటుననుండి పొరుగువారిని బతిమాలుకొని తెప్పించుకొని, దాహశాంతికయి మంచినీరు కావలసిరాఁగా రాత్రి రెండుజాములవేళ నందఱును కఱ్ఱలుగట్టుకొని గుంపుగా బైలుదేఱి యారక్షకభటులను వెంటనుంచుకొని గోదావరికి పోయి నీరుతెచ్చుకొనిరి. మఱునాఁటి యుదయమున యథాప్రకారముగా విద్యార్థులు పాఠశాలకుపోయిరి. ఆమధ్యాహ్నమున వీధులలో విద్యార్థుల సందడి యంతగా కానరాకపోయినందున కొంత ధైర్యము తెచ్చుకొని యా శిష్యులు వీధిత్రొక్క సాహసించి యయిదాఱుగు రొక్కకూటమిగాచేరి బహిర్భూమికి పోవునిమిత్తమయి రెండుమూఁడుగడియల ప్రొద్దుండఁగా గోదావరియొడ్డుననున్న యిసుకతిప్పకేసినడిచిరి. ఈసంగతి యేలాగుననో యొక విద్యార్థికనిపెట్టి తక్కినవారికి సమాచారము పంపెను. ఆశిష్యులును బాహ్యభూమికిపోయి మరలివచ్చుచు గోదావరియొడ్డుననున్న ధాన్యపు పాకలను సమీపించునప్పటికి, వారియెదుట దండధరులవలె కొందఱు విద్యార్థులు కనఁబడిరి. వారు కంటఁబడఁగానే గుండెలు పగిలిపోయి బెదరి ముందుకునడువ కాళ్లురాక బెదరిబెదరిచూచుచు నలుప్రక్కలను చూపునిగిడింపఁగా నానా ముఖముల విద్యార్థులు గుంపులుగుంపులుగా వచ్చు చుండిరి. ఆ సంఖ్యను చూడఁగానే శిష్యులకు మునుపున్న ధైర్యముకూడ మూలముట్టుగ నశింపఁగా నెదిరించుటకు ప్రయత్నముచేయక పిక్కబలముచూపి పాఱిపోవుటకు కాళ్లకు బుద్ధిచెప్పిరి. విద్యార్థులు ముందుకువచ్చి వారిని పట్టుకొని పాదరక్షప్రయోగములచేత బుద్ధిచెప్పి దాసులమనిపించుకొని యా శిష్యూలను విడిచిపెట్టిరి.


ముందుపరుగెత్తినవారి యవస్థనుజూచి వెనుకటివారు తాము వారిదాడి పట్టక ప్రాణరక్షణార్థమయి గోదావరిలోదిగి కంఠములోఁతువఱకును పాఱిపోయిరి. విద్యార్థులు కొందఱు వారిని వెంబడించిపట్టుకొని నీటిలోముంచి లేవనెత్తి కొన్నినిమిషములు వారి తలలను మద్దెలలనుగాఁజేసి వినోదించి తమతోడి విద్యార్థి నన్యాయముగాకొట్టిన ఋణమును వడ్డితోడఁగూడ తీర్చుకొనిరి. మొట్టమొదట దెబ్బలుతిని తప్పించుకొనిపోయిన యిద్దఱుశిష్యులును వాయువేగమున పరుగెత్తి స్వాములవారి సన్నిధానముచేరి కన్నీటితో పాదములు కడుగుచు హూణవిద్యాశాలలోని బాలురవలన జగద్గురువుయొక్క శిష్యులకు సంప్రాప్తమయిన కష్టపాటును విన్న వించుకొని, అక్కడనున్న రక్షకభటుల తోడ కొన్ని నిమిషములలో మరల యుద్ధభూమినిచేరిరి. రక్షకభటు లా శూరులతో రణరంగమును చేరునప్పటి కక్కడ నిన్నూఱుగురు విద్యార్థులకంటె నధికముగాచేరియుండిరి. నీటిలోనున్న విద్యార్థు లా రక్షకభటులను జూచి శిష్యులనువిడిచిపెట్టి తాము నీటిలోమునిఁగి యీఁది మఱియొక రేవున తేలి యింటికిపోయిరి. చేతిలోనిపాత్రలను నీటిలో పోఁగొట్టుకొని యపాత్రులయి యున్న యాశిష్యులను వెంటఁబెట్టుకొనిపోయి రక్షకభటులు వారిని స్వాముల వారితోఁ జేర్చిరి. స్వాములవారు శిఖాయజ్ఞోపవీతములను విసర్జించినను రాగద్వేషాదులను మాత్రము విసర్జింపనందున శిష్యులకు సంభవించిన దుర్దశ నిమిత్తమయి కొంతసేపువిలపించి యావిద్యార్థులను శపించి యూరివారు తమ్మువచ్చి ప్రార్థించి యలుకతీర్చెదరేమోయని పీఠమునువిడిచి లేచిపోయెదమని వారికిని వీరికిని సమాచారములు పంపిరి. ఆరాత్రి బడిపిల్లలు స్వాములవారి శిష్యులను కొట్టి చంపిరనియే పట్టణములో ప్రవాదముపుట్టెను. అందుచేత విధవా వివాహములకు ప్రతిపక్షులు గానున్న వారు వీధులలో మొగము చూపుటకే తెగింప లేకపోయిరి. నేనాసమయమున చల్లగాలి ననుభవించుచు మారేవున గోదావరిలోని యొకపడవమీఁదఁ గూరుచుండియుండుటచే ప్రొద్దుపోయి యింటికి పోవువఱకును నాకీవార్తయే తెలిసినదికాదు. ప్రథమశాస్త్ర పరీక్షనిచ్చి


న్యాయవాదిగానుండి మొట్టమొదట మాలోఁజేరియుండినను ఇప్పుడు స్త్రీ పునర్వివాహ నిషేధవాదులకు నాయకుఁడుగానుండిన యొక ప్రబల గృహస్థా సమయమున చల్ల గాలికై నేను కూరుచుండినతావున కనతిదూరముననే గోదావరియొడ్డున కూరుచుండియుండి యెవ్వరోవచ్చి యాశిష్యులవార్తను చెవిలో చెప్పఁగానే యధైర్యముపుట్టి తనసేవకునిచేతిలోని దీపమునారిపించి తలనిండ ముసుఁగువేసికొని రాజమార్గముననడువక ప్రాణము లఱచేతిలో పెట్టుకొని సందులగుండపోయి యిల్లుచేరి తిరిగిచూచెను. అటువంటిస్థితిలో స్వాముల వారికి ముఖ్యబలముగానున్న వారొక్కరును వారినూరార్చుటకయిన ఆరాత్రి పీఠదర్శనమునకురాక, తత్క్షణ మూరువిడిచిపొండని దూరమునుండి లోక గురువులకు సందేశమును బంపిరి. వారియాలోచనప్రకారముగా మఱునాటి యుదయమున విద్యార్థులు తమ విద్యాశాలనుండి రాకమునుపే స్వాములవారు తమ పీఠమును మాపట్టణమునుండి తరలించి పొగయోడకుకట్టిన పడవలో శిష్యబృందముతో తాము నదినితరించి భిక్షలుచేయింపలేక శ్రమపడుచున్న మాపురమువారినికూడ తరింపఁజేసిరి. స్వాములవారు మాపురములో నట్టేయుండిన యెడల విద్యార్థులు వారిపీఠమును గొనిపోయి గోదావరిలో పడవేసెదరనికూడ నొకప్రవాదము పుట్టెను. మొట్టమొదట దెబ్బలుపడిన విద్యార్థి స్వాములవారి శిష్యులమీఁదను, స్వాములవారి శిష్యులు విద్యార్థులమీఁదను ధర్మసభలలో నభియోగములు తెచ్చిరికాని దండవిధాయకుఁడు జహద్గురుల శిష్యుల కై దేసిరూపాయలు ధనదండనము విధించి ఋజువులేనందున విద్యార్థులను విడిచిపెట్టెను. స్వాములవారికి సంభవించిన యీవిపత్తువలన మా ప్రతిపక్షులకు కొంతగర్వభంగము కాఁగా కొంతకాలము వారు మమ్మధికముగా బాధింపకుండిరి.

ఇక్కడమేము మాపాట్లుపడుచుండఁగా చెన్న పట్టణములోని మా స్నేహితులూరకుండినవారుకారు. శ్రీపల్లె చెంచలరావుపంతులుగారును దివాన్ బహదూర్ రఘునాధరావుగారును మాపక్షమునుబలపఱుపవలెనని యెవ్వరెవ్వరు


మాతో భోజనములుచేసి యేవిధమున తోడుపడుదురో తెలిసికొనుటకయి పత్రికలలో ప్రకటనలు ప్రచురింపఁగా పేరుగలవా రిరువదిముప్పదిమంది భోజనములు చేయుటకు సంసిద్ధులయియున్న ట్టుత్తరములు వ్రాసిరి. హిందూ పత్రికలో ప్రతిదినము మూడునాలుగేసి యుత్తరములు ప్రకటింపఁబడుచు వచ్చినవి. ప్రకటింపఁబడిన యుత్తరములలో నధిక సంఖ్యవి యంతగా ప్రోత్సాహకరములుగా నుండకపోయినను, ప్రోత్సాహకరములుగానున్న వే యప్పటి మా పనికి చాలియుండునట్లు కనఁబడెను. మాతో సహభోజనమున కేర్పాటుచేసి మాకు ప్రోత్సాహముకలిగించుటకయి చెంచలరావు పంతులుగారు మమ్మచ్చటకురండని యాహ్వానముచేసిరి. నేనాయాహ్వానము నంగీకరించి యీస్టరు సెలవులలో కుటుంబసహితముగా నచటికిఁబోవ నిశ్చయించి నాయభిప్రాయమును వారికిఁదెలిపితిని. తమయుత్తరమును జూచువఱకును బైలుదేఱవలదని తంతిసమాచారమును బంపి 12 వ మార్చి తేదిని మైలాపురమునుండి వారు నాకిట్లు వ్రాసిరి -

"నా ప్రియమిత్రుఁడా !

మీయుత్తరమునకు ప్రత్యుత్తరమైన నాతంత్రీవార్త మీకాశాభంగము కలిగింపదని నమ్ముచున్నాను. మనము పూనినపక్షమునందు గొప్పయాదరము పూనుచున్నట్టు మీరెఱిఁగిన రఘునాధరావు వారిసహాయ్యమునుగోరుచు తన మిత్రులకందఱికిని విజ్ఞాపనమును బంపియున్నాఁడు కార్యములలో మనము తొందరపడినపక్షమున ఎవరిసాయము మనకుముఖ్యమో యటువంటి యనేకుల యొక్క సాహాయ్యమును మనము పోఁగొట్టుకోవచ్చునని ఆయన తలఁచు చున్నాఁడు. అందుచేత నాతఁడు వచ్చెడు ఏప్రిల్ 30 వ తేది వఱకును మీ ప్రయాణము నిలుపవలసినట్టు మిమ్ము ప్రార్థింపుమని నన్ను కోరెను. మావర్తమానము నన్యధాగ్రహించి, మీకు సహాయముచేయుటకు మేముచేసిన వాగ్దానమును కొంతవఱకు మరలించుకొంటగా మీరు భావింపరని నేను నమ్ముచున్నాను. అయినను మీరు వెంటనేరావలెనని నిశ్చయించుకొన్న పక్షమున


మీరట్లు చేయవచ్చును. నేను మిమ్ము మాయింటనైనను పెట్టుకొనెదను ; లేదా మీ నిమిత్తమయి ప్రత్యేకముగా నొక యిల్లయినను కుదిర్చెదను. ఎట్లయినను నేను మీతో భోజనముచేసి మిమ్ము బ్రాహ్మణునిగా నంగీకరించుటకు నాకాక్షేపణయుండదు." [13]

మాకప్పుడు వేసవికాలపు సెలవులారంభ మగును గనుకను, అప్పుడు పోయినయెడల మఱికొంతకాల మధికముగానుండి యుపన్యాసము లియ్యవచ్చును గనుకను, నేనును మెయినెలలో పోవుటయే మంచిదనియెంచి యానెలమొదట ప్రథమవివాహ దంపతులతోడఁ గూడవచ్చెదనని వ్రాసితిని. దానికి మరల 1882 వ సంవత్సరము ఏప్రిల్ నెల 26 వ తేదిని పంతులుగా రిట్లు బదులువ్రాసిరి -

"ప్రియమిత్రుఁడా !

రఘునాధరావుగారేదో యుపనయనము నిమిత్తము మెయి మూఁడవ తేదిని స్వగ్రామమునకువెళ్లి, ఆనెల 20 వ తేదివఱకును తిరిగిరారు. మీసెలవు


లెప్పుడు ముగియునో నేనెఱుఁగను. ఆయన లేకుండ నేనేమియు చేయఁజాలనుగనుక, మీరెట్లయినను మెయి 20 వ తేది తరువాత కొంతకాల మిక్కడ నుండునట్లేర్పాటు చేసికొనవలెను. అయినను మీయానుకూల్యమునుబట్టి మీరిక్కడకు ముందుగానే రావచ్చును. రఘునాధరావుగారిక్కడ లేకపోవలచి వచ్చినదని చింతిల్లుచున్నానుకాని యాయన స్థానాంతరగమన మనివార్యమయినట్టు కనఁబడుచున్నది." [14]

ఈ పక్షమునకు మిత్రుఁడయి విశాఘపట్టణములో మిక్కిలి ప్రబలుఁడుగానుండిన యొక సంపన్నగృహస్థునిమీఁద నొకమిత్రునిప్రేరణచేత గోగులపాటి శ్రీరాములుగా రనాలోచితముగఁ దెచ్చిన యొక యభియోగములో సంధిచేయవలెనన్న తలంపుతో ముందుగానే నచ్చటికిపోయి మాటాడవలసి వారితో మాటాడి, తరువాత ప్రథమవివాహ దంపతులను వెంటఁబెట్టుకొని భార్యాసహితముగా నొక వంటబ్రాహ్మణునితోడ బైలుదేఱి, ముందు మారాకను తంత్రీముఖమున చెంచలరావు పంతులుగారికిఁదెలిపి, విశాఘ రేవులో పొగయోడనెక్కి నాలవదినమున చెన్న పట్టణపు రేవుచేరఁగా చెంచలరావుపంతులుగా రోడమీఁదికే మనుష్యులను బంపి, మమ్ము పడవమీఁద ఒడ్డునకుఁగొనివచ్చి యక్కడినుండి బండ్లమీఁద తీసికొనిపోయి


మైలాపురములో కచ్ఛపేశ్వరుని యాలయసమీపమున మాకయి యేర్పఱిచిన విశాలగృహమునందు ప్రవేశపెట్టిరి. మాకేవిధమైన లోపమును లేకుండ సమస్తమును సమకూర్చుచు పంతులుగారు మాయెడల నత్యంతాదరము చూపిరి. నేనును సుఖభోజనముచేయుచు పంతులుగారు పంపిన గుఱ్ఱపు బండ్లమీఁద పోయి యక్కడ నుపన్యాసములిచ్చుచు రఘునాధరావుగారి రాకను ప్రతీక్షించుచుంటిని. నేనొకసారి చాకలిపేటలో వితంతు వివాహమునుగూర్చి యుపన్యసించు చుండఁగా మూర్ఖులయిన వైష్ణవబ్రాహ్మణులు చుట్టుముట్టి నన్ను మర్దింపఁజూచిరిగాని నా మిత్రులైన పనప్పాకము ఆనందాచార్యులు గారు యుక్తసమయములో కనిపెట్టి నన్నక్కడనుండి తొలఁగించి తమబండిలోనెక్కించుకొని దూరముగాఁ గొనిపోవుటచేత వారిబారినుండి తప్పించుకొంటిని. ఇంకొక్కసారి నేను పెద్దినాయనిపేటలో(Blacktown) నుపన్యసించుచుండఁగా పండితు ల నేకులుచేరి యుపన్యాసాంతమున ప్రశ్నలు వేసి నన్ను పరాభవింపనెంచి, వితంతువు వివాహముచేసికొన్నచో దాని పూర్వభర్తయొక్క శ్రాద్ధము లెవ్వరు పెట్టుదురనియు, ఆశౌచమెట్లు పట్టవలయుననియు, ఇట్టివే యనేక ప్రశ్నములు వేసిరి. నేను వానికన్నిటికిని శాస్త్రోక్తములయిన సమాధానములను చెప్పితిని. ఈ విధముగా నన్నోడింప లేక భగ్న మనోరథులయి కడపట "మీకు శాస్త్రములయందు విశ్వాసమున్నదా?" యని ప్రశ్న వేసిరి. "లేదు. ఆత్మసంరక్షణార్థమును శాస్త్ర విశ్వాసముగలవారి నిమిత్తమును నేను శాస్త్ర ప్రమాణములను జూపుచున్నాను." అనిచెప్పి, పూర్వమొక గ్రుడ్డివాఁడు దీపము చేతఁబట్టుకొని దారినిబోవుచు నీకదియేమి యుపయోగమని దారినిపోవువా రడిగినప్పుడు మీకు దారికనఁ బఱుచుటకును చీఁకటిలో కనఁబడక మీరు నామీఁదఁబడి యపాయము కలిగింపకుండ నన్ను కాపాడుకొనుటకును దీనిని వహించుచున్నానని యుత్తరము చెప్పిన కథను దృష్టాంతము చూపితిని. ఇంకొకసారి తిరువళ్లికేణిలో గంగనామంటపముమీఁద జరిగిన పండితసభలో కంచి సుబ్బారావుపంతులు


ముగా ముగిసినతరువాత చెంచలరావుపంతులుగారు మాందఱకు క్రొత్త బట్టలను కట్టనిచ్చి, ప్రయాణవ్యయములకయి నూఱురూపాయల రొక్కమిచ్చి, మమ్ము వీడుకొల్పఁగా జూన్ నెల నడుమను సుఖముగా మరల రాజమహేంద్రవరము చేరితిమి. శ్రీరాములుగారికి గర్భాధానముచేసి యాయపత్నీసహితముగా విశాఖపట్టణమునకు మరలఁ బంపివేసితిని.

ఇట్లు మిత్రద్రవ్యముతో మూడుపక్షములు విందులారగించి స్వేచ్ఛావిహారముచేసివచ్చి స్వస్థలముచేరి మాయెప్పటి వ్యవహారములలో మరల మేము ప్రవేశించితిమి. పలుచోట్లనుండి వచ్చి బహువిధాభిప్రాయములను గలిగినవా రెక్కువమంది యొక్కచోట కూడినప్పుడు వారిలో నైకమత్యముండుట యరుదుగదా ! అట్టివారిలోఁ గొందఱిని వేఱుచేయవలసిన యావశ్యకము శీఘ్రకాలములోనే సంభవించెను. ఈపక్షములోఁ జేరినవారి కితరులు కాపురముండుట కిండ్లియ్యరు. రామకృష్ణయ్యగారిక్కడకు వచ్చినప్పుడీచిక్కు వారితో చెప్పఁగా, వివాహము లాడినవారును తత్సంబంధులును కాపురము లుండుటకయి యిన్నీసుపేటలో వారొకగృహమును కొనియిచ్చిరి. నెల కెనిమిదేసి రూపాయలు జీతము లేర్పఱిచి ముందుగా రెండవపెండ్లికొమారిత పుట్టినింటివారిని, తరువాత రెండవ పెండ్లి దంపతులను, ఆయింటికిఁ బంపితిని. రామకృష్ణయ్యగారు ప్రాయశ్చిత్త మంగీకరించినతరువాత మంజులూరి వెంకట్రామయ్యగారు తనతమ్ముని మాయింటదిగ విడిచి, ప్రాయశ్చిత్తము చేయించుకొని భార్యతోను కుమారునితోను మాయింటినుండి వెడలిపోయిరి. నల్లగొండ కోదండరామయ్యగారు తమతల్లికి జబ్బుచేసినందున జూలయినెలలో ప్రాయశ్చిత్తము చేయించుకొనిపోయి బంధుజనములోఁ గలిసిరి. వంటబ్రాహ్మణులలో నిద్దఱుకూడ మాయిల్లు విడువవలసినవారయిరి. వారిరువురిలో నొకఁడు హస్తలాఘవ విద్యయందు నిపుణుఁడు; ఆతనిశక్తిచేత మాయింట నే వస్తువును పెట్టి కొంచెమేమఱి యుండినను, ఆవస్తువు నిమిషములో నదృశ్యమగుచు వచ్చెను ; మొదటి పెండ్లిదినములలోనే మొదటి వధువునకుపెట్టిన బంగారు


పట్టెడ మాయమయినది ; మాయింటఁగల చిన్న వస్తువులును నేను ధరించెడు వస్త్రములును పెక్కులు మాయింటినుండి తరలిపోవుచువచ్చినవి. ఇంటిదొంగను పట్టుకొనుటకష్టముగదా ! అనుమానపడి యేమయిననన్న పక్షమున మేము ముందులిచ్చిన నూఱురూపాయలును పోవునేమోయన్న భయమొకటి, వాఁడు పాఱిపోయిన వంటబ్రాహ్మణుఁడు దొరకఁడన్న భయమొకటి, సంవత్సరము జీతమిచ్చెదమని వ్రాసియిచ్చి చేసినప్రతిజ్ఞను నడుమను మీఱకూడదన్న భయమొకటి, మమ్ముబాధింపఁగా ప్రత్యక్షమయిన రుజువు దొరకువఱకును చూడవలెనని మేమప్పటిస్థితినిబట్టి వానినుపేక్షించుచువచ్చితిమి. ఆబ్రాహ్మణుఁడు మేము చెన్నపట్టణములో నున్నప్పుడు మా ముద్రాక్షరశాలలో పనిలోనున్న మునిసామి యనువాని కత్తెర మొదలయినవానిని తస్కరింపఁగా, అతఁడు గదిలోపెట్టి దిట్టముగా కొట్టినందున వంటబ్రాహ్మణుఁడు భయపడి మునిసామిని తనవెంట తానుంచుకొన్న ముండయింటికి తీసికొనిపోయి యాతని వస్తువుల నిచ్చివేసెను. ఆవస్తువులతోడిపాటుగా పోయినవస్తువులు మావిసహితము కొన్ని దొరకినవి. మునిసామికిజడిసి యాబ్రాహ్మణుఁడు మమ్మువిడిచి పాఱిపోయెను. వివాహములుచేయించి విశాఘపట్టణమువెళ్లిన పురోహితుఁడును ప్రాయశ్చిత్తము చేయించుకొని స్వజనమునుచేరెను. ఈ ప్రకారముగా మాయింటనున్న పైజనమంతకంతకు తగ్గిపోయి పలుచఁబడినది. నేను చెన్నపట్టణము వెళ్లఁదలఁచుకొన్నప్పుడు ఏప్రిల్ నెలలో ప్రయాణవ్యయముల నిమిత్తము రామకృష్ణయ్యగారునాకిచ్చిన నూఱురూపాయలను ఆమాస వ్యయములక్రింద కర్చు చేసితిని. ఆమాసమునకయిన వ్యయముల నిందు క్రిందఁజూపుచున్నాను -

రామచంద్రరావు(రెండవపెండ్లికొడుకు)నకు భోజనమునిమిత్తము రు. 7-0-0

రామచంద్రరావుకు పుస్తకములు రు. 2-0-0

రామచంద్రరావుకు స్కుల్లుఫీజు రు. 6-1-0

రామచంద్రరావుకు జంపుఖానా రు. 1-10-0

రామచంద్రరావుకు కట్టుబట్టలు రు. 5-1-6


రామచంద్రరావుకు గర్భాధానపుకర్చు రు. 5-0-0

రామచంద్రరావుకు గర్భాధానమునకు బట్టలు రు. 8-10-0

వంటబ్రాహ్మణుఁడు శేషయ్యజీతము రు. 7-0-0

వంటబ్రాహ్మణుఁడు శీతయ్యకుజీతము రు. 4-0-0

వంటబ్రాహ్మణుఁడు విస్సయ్యకుజీతము రు. 4-0-0

వంటబ్రాహ్మణుఁడు శీతయ్యతల్లి తద్దినమునకు రు. 1-0-0

పెమ్మరాజువారి (రెండవపెండ్లికొమార్తెపుట్టినింటివారి)కి నెలజీతము రు. 8-0-0

పెమ్మరాజువారి (రెండవపెండ్లికొమార్తెపుట్టినింటివారి)కి బట్టలు, జాకినెట్టుతాను రు. 3-0-0

రామచంద్రరావుమామగారి కాయిలానిమిత్తము, పెమ్మరాజువారికి రు. 5-0-0

పెమ్మరాజువారినిమిత్తము వైద్యునికి (4 విజిట్లకు) రు. 2-0-0

ఔషధములు రు. 9-0-0

రామచంద్రరావు మామగారి దహనవ్యయము రు. 11-0-0

వైద్యునికి నాలుగుసార్లు బండికూలి రు. 1-6-0

నారాయణమూర్తి నెలజీతము రు. 6-0-0

శూద్రనౌకరు లక్ష్మయ్యకు రు. 1-0-0

అప్పారావు (రెండవకొమార్తె తమ్ముఁడు) స్కూలుజీతము 0-6-0

మొత్తము రు. 98-2-6


ఇప్పటికి మా సమాజమునకు నిధిగా ధనమేదియులేదు ; నెల చందాలు లేవు ; మాసవ్యయములకయినను రామకృష్ణయ్య గారిత్తురో లేదో సందేహము. ఈస్థితినంతను శ్రీకంచికృష్ణస్వామిరావు పంతులు గారితో మొఱ్ఱపెట్టుకోఁగా వారు పరమదయాళురయి తమ యావచ్ఛక్తిని ధారపోసి రామకృష్ణయ్యగారిని ప్రోత్సాహపఱిచి దివాన్ బహదరు రఘునాథరావుగారిని పళ్లెచంచలరావు పంతులుగారిని ట్రస్టీలనుగా నేర్పఱిపించి జూన్ నెల కడపట పదివేల రూపాయలను చెన్న పట్టణమునకుఁ బంపునట్లుచేసిరి. ఈయేర్పాటువలన పైడా రామకృష్ణయ్యగారి రెండుప్రతిజ్ఞలును నెఱవేఱినవి. ప్రాయశ్చిత్త కాలము


నందు తానిఁకముందు రాజమహేంద్రవర వితంతు వివాహసమాజము వారికి సొమ్ము పంపననిచేసిన రెండవ ప్రతిజ్ఞయు చెల్లినది. - ఎట్లనఁగా మాకుచెన్నపట్టణమువారుపంపుదురుగాని రామకృష్ణయ్యగారు స్వయముగా సొమ్మియ్యరు; వితంతు వివాహముల నిమిత్తమయి సొమ్మిచ్చెదనన్న మొదటిప్రతిజ్ఞయు చెల్లినది. - ఎట్లనఁగాసొమ్మును మాకు చెన్నపురివారే పంపినను సొమ్ము రామకృష్ణయ్యగారిచ్చినదే. ఈవిషయములో మాకు కృష్ణస్వామిరావు పంతులుగారుచేసిన మహోపకారమును మేమెప్పుడును మఱవఁజాలము. ఈపదివేల రూపాయలును పంపినకాలములో మరల వివాహములు జరుగునన్న నమ్మకము రామకృష్ణయ్యగారి కెంతమాత్రమునులేదు. సొమ్మును చెన్నపట్టణము పంపినప్పుడు రామకృష్ణయ్యగారు చెంచలరావు పంతులుగారిపేరను రఘునాధరావుగారిపేరను వ్రాసిన యుత్తరములో రెండుసంవత్సరములలోపల వివాహములు జరగనిపక్షమున తమసొమ్ము తమకు మరల పంపివేయునట్లును, వివాహములయ్యెడు పక్షమున చెన్న పట్టణపు సమాజమువారు రెండువివాహములకు రెండువేలరూపాయలను వ్యయపఱుచు కొనునట్లును వ్రాసి, వివాహములు జరగెడిపక్షమున వివాహమొక్కంటికి వేయేసిరూపాయలచొప్పున నాయొద్దకు పంపుచుండవలసినదనియు వ్యయములక్రింద జూన్ నెల మొదలుకొని నెలకు డెబ్బదియైదు రూపాయలచొప్పున నాకుఁ బంపుచుండవలసినదనియు వ్రాసిరి.

ఏప్రక్కనుజూచినను కష్టములే కనఁబడుచు, మరల వితంతు వివాహము లగు నన్న యాశ కవకాశములేక, పూనినకార్య మకాలనాశనము నొందునట్ల గపడుచున్న యాకాలములో ఏలాగునైన కొన్ని వివాహములుచేసి యిటువంటి సత్కార్యవృక్షము మనుష్యకుటిలప్రయత్నములవలన నిర్మూలము కానేరదని లోకమునకు చూపవలెనని మేము మఱింత ధైర్యోత్సాహములతో బహుప్రయాసములకోర్చి పనిచేయసాగితిమికాని మొట్టమొదట మాకృషిసఫలమగునట్లు కనఁబడలేదు. ఆవఱకు తమవితంతు కన్యలకు వరులను విచారించి వివాహముచేయుఁడని మమ్ము బతిమాలుకొన్న వారి కడకు పోయి మేమే బతి


మాలుకోఁగా మాతో మనసిచ్చి మాటాడక పోవుటయేకాక మామీఁద కోపపడి యట్టియనుచిత ప్రసంగమును చేసినందుకు మమ్ము తిట్టసాగిరి; మఱికొందఱు మమ్ము తమయిండ్లలోనికే రానీయకపోయిరి. వేంకటప్పయ్యగారు చెన్నపట్టణమునకు పోవుచు కాకినాడనుండి వ్రాసినయుత్తరములో నుదాహరింపఁబడిన పెద్దిభట్ల యజ్ఞన్న గారును ప్రాధమికపాఠశాలలో నుపాధ్యాయుఁడైన తాడూరి రామారావుగారును నేను వ్రాసినమీఁదట రాజమహేంద్రవరమువచ్చి నాతోమాటాడి మొదటివారు తమచెల్లెలిని స్వశాఖవాఁడయిన వైదికవరునకిచ్చి వివాహము చేయుటకును, రెండవవారు స్వశాఖదియైన మాధ్వవితంతువును వివాహమాడుటకును, అంగీకరించిరి. కాఁబట్టి యిప్పుడొక వైదికవరుఁడును, ఒకమాధ్వవధువును గావలసియుండిరి. వైదికవరుఁడు మా పాఠశాలలోని విద్యార్థులలో నొకఁడు సంసిద్ధుఁడయియే యుండెను; మాధ్వ వధువు సహితము లభించినట్లేయుండెను. ఉమ్మెత్తాల వేంకటపతిరావను మాధ్వగృహస్థుఁ డొకఁడు నాతో నావఱకు పలుమాఱుమాటాడి 1882 వ సంవత్సరము జూన్ నెల 24 వ తేది నాకీక్రిందియుత్తరము వ్రాసియిచ్చెను.

"మీరు యిదివరలో వితంతువివాహములు చేయించినారని యిట్టి శాస్త్రోక్తమయ్ని లోకోపకారం జరిగించినందుకు చాలాసంతోషంగా వున్నది. నాకుమార్తె అయిన శనగవరపు లక్ష్మీబాయమ్మకు భర్తచనిపోయినాడు. దానికి సుమారు 16 సంవత్సరములు వయస్సుకలిగియున్నది. తిర్గీవివాహంచేతామని ఆలోచిస్తే నాకు ద్రవ్యోపపత్తిలేదు. నీరసుణ్ని. దానికిముఖ్యంగా వివాహం చేసుకోవలెనని వుద్దేశంవున్నది. మామతస్తుడయ్ని చిన్నవాడు యెవరైనా మీకుకనిపించి యింద్కు అంగీకరించ్చిన పక్షముకు అతనికి సదరు లక్ష్మీబాయమ్మను వివాహంచేశి మీరు నాకు కర్చు లేకుండా జరిగించినపక్షమున నేను చాలాసంతోషిస్తున్నాను గన్కు విశదంని|| వ్రాశినాను. చిత్తగించవలెను. తేది 24 జూన్ 1882 సం|| వుమ్మెత్తాల వెంకటపతిరావు." సరిగా కార్యముకావలసి వచ్చునప్పటికి బంధువులకు తెలియుటచేత వేంకటపతిరావుగారును, యజ్ఞన్న గారును, కూడభయపడి యిద్దఱును వెనుక తీసిరి. వేంకటపతిరావుగారి కూఁతురును, యజ్ఞన్న గారి చెల్లెలును, ఇద్దఱును చదువుకొన్న వారయి నాకావఱకే యుత్తరములు వ్రాసియుండిరి. అందుచేత సంరక్షకులను విడిచిపెట్టి యిఁకస్వయముగా నాబాలవితంతువులతోనే యుత్తర ప్రత్యుత్తరములను జరపి కార్యమును సాధింపవలెనని నేను నిశ్చయించు కొంటిని. ఇద్దఱిలో నొకచిన్నది పెద్దాపురములోనున్నది; ఇంకొకచిన్నది కాకినాడలోనున్నది. నేను వారిపేరనే యుత్తరములు వ్రాసెడుపక్షమున, రహస్యము వెల్లడియయి కార్యభంగము కాకమానదు. వితంతువివాహ సంస్కారవ్యాపనమునం దవ్యాజాదరము గలవా రయి నిపుణులై కార్యదక్షులయిన యిద్దఱుమిత్రులీవిషయమున గూఢముగా పనిచేయుటకయి పెద్దాపురమునందొకరును కాకినాడయందొకరును గావలసియుండిరి. ఆకాలమునందు రాజమహేంద్రవరనివాసులయి కార్యదక్షులయి వితంతువివాహ పక్షావలంబులయి మాకత్యంతాప్తులయిన గుమ్మడిదల మనోహరము పంతులుగారు పెద్దాపురమునందు పోలీసు ఇన్‌స్పెక్టరుగా నుండిరి; మాపక్షమున శ్రద్ధాళువులయి పనిచేయుచుండిన పెండెకట్ల లచ్చిరాజుగారు కాకినాడ జగన్నాధపురములో నుండిరిగాని పనిచేయవలసిన స్థలమునకు వారియిల్లెంతో దూరమున నుండెను. అయినను ఈయుభయమిత్రులవలనను కార్యముసాధింపవలెనని నేను నిశ్చయించుకొంటిని. ఇంతలో మాపక్షమునం దభిమానముగలవాఁడయి మేము కృషిచేయవలసిన చిన్న దాని యింటియెదుటనే కాపురముండిన తంజావూరి వేంకటచలపతిరావుగారు లభింపఁగా కాకినాడలో ఆయనవలన కార్యసాఫల్యమును బడయుట కేర్పఱుచుకొంటిని. స్టేట్యూటరీ సివిల్ సర్విస్ సంబంధమున గవర్రాజుగారుచెన్న పురికి పోవలసిన యావశ్యకము తటస్థింపఁగా, ఈ విషయమయి కాకినాడలో పనిచేయుటకును, కొట్టుపడిపోయిన లక్ష్మీనరసింహముగారి యభియోగ సంబంధమైన యుపర్యభియోగ విషయమయి చెన్న


పట్టణములో పనిచేయుటకును, వితంతువివాహపక్షమున నేనాయనను నియమించితిని. ఆయన చెన్నపురికి పోవుచు దారిలో కాకినాడనుండి 1882 సం|| ఆగస్టు 24 వ తేదిని నాకిట్లువ్రాసిరి : -

"నాప్రియగౌరవనీయమిత్రుఁడా !

"ఎల్లోరా పొగయోడ నేఁడిక్కడ ప్రతీక్షింపఁబడుచున్నది. అందుచే నేను వెళ్ళిపోవుచున్నాను. పై-రా-గారిని, జడ్జినిచూచితిని. నేను డర్హాము గారినికూడ దర్శించితిని. పై-రా-గారిని కార్మెకల్, చెంచలరావు మొదలైన వారికి తంత్రీవార్తలు పంపునట్లుచేసితిని. సబుజడ్జి అప్పీలులేదని తలఁచుచున్నాఁడు. ముందుముందు మనము సివిల్ వ్యాజ్యము తీసికొనిరావచ్చును. డర్హాముగారును సబుజడ్జియు నాకావిషయమున దీర్ఘోపన్యాసములనుచేసిరి. లచ్చిరాజుగారు, రామారావు మొదలయినవారిని చూచితిని. తన్ను స్వశాఖవాని కెవ్వనికైన వివాహము చేయుమని కోరుచు స్వహస్తముతో ఆచిన్నది మీపేర వ్రాసినయుత్తర మొకటి వారియొద్దనున్నది. వివాహమీ నెలలో జరుపఁబడవచ్చునని నేను తలఁచుచున్నాను. రేపుగాని పయి శనివారమునాఁడుగాని మీయొద్దకు పోవలసినదని నేను పెండ్లికుమారునితోఁ జెప్పితిని. ఆచిన్నది యొక్కపర్యాయము తల్లిదండ్రుల యొద్దనుండి తొలఁగింపఁబడిన పక్షమున అప్పుడు తల్లిదండ్రులవద్దకు మరల పోవలెనన్న మోహమునంతను ఆమె మరల్చుకోఁగలదు. ఈ వివాహమును గూర్చి నేను సబుజడ్జితో మాటాడలేక పోయినందుకు విచారించుచున్నాను. మరల నొక్కవివాహము జరిగింపఁబడిన పక్షమున, అప్పుడు మఱి-కొన్ని జరిగించుట కాశయున్నది. ఈసంగతులు నాతోచెప్పఁబడినవి.

మంచిది. ఈప్రయాణమువలనఁ గలిగిన ధనకాలనష్టము లటుండఁగాను, శ్రమయటుండఁగాను, ఒక్కవిషయమయి నేను రాజమహేంద్రవరమునువిడిచి నందుకు చింతనొందుచున్నాను. మిక్కిలి విలువగలవని నేను తలంపవలసినవి యిప్పుడు రాజమహేంద్రవరములో రెండు ఆత్మలున్నవి. అతి శ్రమపడుచు


న్నారు గనుక, మీయారోగ్య విషయమయి నేను ముఖ్యముగా భయపడుచున్నాను. మీకోసమును, నాకోపమును, మనదేశముకోసమును, దేవునికోసమును, దయచేసి మీమేదస్సునకు భారముపెట్టకుఁడు. ఈ పుస్తకము ఆపుస్తకమును భాషాంతరీకరింపవలెనన్న తలంపును అధమము కొంత కాలమువఱకైనను కట్టిపెట్టుఁడు. మఱియెవ్వరైనను వివేకవర్ధనిని జరపనిండు. రాత్రి పాఠశాల విషయమైన యల్పవివాదములలో తగులుకొనకుఁడు. అతఁడు మంచిదారికి రానేరనివాఁడైన, పోనిండు.

సంబంధములను కుదిర్చి యావశ్యకమైన పనిచేయుటకు సంపర వెంకన్న గారిని మనము పనిలో పెట్టవలెనని తలఁచుచున్నాను. దీనినిగూర్చి నేను పై-రా గారితో మాటాడినాను. ఆయనకు మీరుకూడ వ్రాయుఁడు. మీరు చెప్పిన యింకొక మనుష్యుని కనుఁగొనుటకు నేను శక్తుఁడను కాలేదు. లచ్చిరాజుగారి కాతని పేరిచ్చినాను."[15] పయి యుత్తరములో పేర్కొనఁబడిన చిన్నది పెద్దాపురపుచిన్నది. మా ప్రయత్నములచేత దొరతనమువారు కొట్టుపడిపోయిన లక్ష్మీనరసింహముగారి యభియోగముపైని ఉన్నత న్యాయసభలో ఉపర్యభియోగమును పెట్టించిరి. ఆయుపర్యభియోగములో న్యాయమూర్తి ముత్తుసామయ్యగారు శిష్యులకు బహిష్కారపత్రికలను పంపుటకు శంకరాచార్య స్వాములవారి కధికారమున్నదనియు, ఆయన తన శిష్యులకుమాత్రమేకాక యితరులకుకూడ తెలియునట్లుగా బహిష్కార పత్రికలను పోస్టుకార్డులమీఁదవ్రాసి పంపుట తప్పిదమనియు, నిర్ధారణముచేసి యాయపరాధమునకయి జగద్గురువులయిన యాచా


ర్య స్వాములవారి కిన్నూఱు రూపాయలు ధనదండనమును విధించిరి. నా మిత్రుఁడు వ్రాసినట్టు నేననారోగ్యదశలో నుండుటయు నతికష్టపడుచుండుటయు సత్యమేకాని నాకప్పుడుండిన కార్యోత్సాహమే నాచేత ననేకకార్యములను చేయింపఁగలిగినది. వితంతువివాహ ప్రయత్న మటుండఁగా, నేను క్రొత్తగ్రంథములను రచించుచుంటిని; వివేకవర్ధనియను వారపత్రికను నడుపుచుంటిని; నగరపారిశుద్ధ్యవిచారణ సంఘమునం దెంతో చుఱుకుగా పనిచేయు చుంటిని. శాస్త్రపాఠశాలలోని విద్యార్థులు చందాలువేసికొని పుస్తకములను పలకలనుగొని, పగ లెల్ల పాటుపడివచ్చెడు బీదవాండ్ర విద్యాభివృద్ధి నిమిత్తమయి యొక విద్యాశాలలో రాత్రిపాఠశాలనుబెట్టి పాటుపడుచుండఁగా ఆ విద్యాశాలాధికారి రాత్రిపాఠశాల తనదేయని పుస్తకములు మొదలయినవానిని స్వాధీనము చేసికొనెను. గవర్రాజుగారు వ్రాసినమీఁదట పోయినపుస్తకములను మరల రాఁబట్టెడు ప్రయత్నమునుమాని, నామిత్రులు మొదలైనవారిచేత చందాలువేయించి పుస్తకాది పరికరములను కొనియిచ్చి, విద్యార్థులు మఱియొకచోట రాత్రిపాఠశాలను సాగించెడి యేర్పాటునుచేసితిని. గవర్రాజు గారు తమయుత్తరములో వ్రాసిన సంపర వెంకన్న గారిని వెంటనే పిలిపించి, నాసొంతమునుండి నెల కెనిమిదిరూపాయలు జీతమిచ్చునట్లేర్పఱచి, గ్రామముల వెంట తిరిగిపనిచేయ నియమించితిని. పట్టపరీక్షయందును ఇతర పరీక్షలయందును కృతార్థుఁడయి, మండలన్యాయసభ (District Court) యందు సిరస్తాదారు పదమునొంది, కడపట న్యాయావాదియయి, మరణపర్యంతము నన్ను విడువకుండిన దీ గవర్రాజుగా రొక్కరే.

పెద్దాపురమునందు నామిత్రులయిన మనోహరము పంతులు గారుండిరని చెప్పియుంటినిగదా ? వితంతు వివాహపక్షమునం దత్యంతాభిమానము కలిగి యుత్సాహముతో పనిచేయుచుండిన యాయన తమ్ముడైన గుమ్మడిదల సాంబశివరావుగారు రాజమహేంద్రవరమునుండి యాచిన్న దాని నిమిత్తము పనిచేయుటకు తఱుచుగా నన్న గారియొద్దకు వెళ్ళుచు, నాయుత్తరముల నాచిన్న


దానికందఁజేయుచు, ఆచిన్న దానియుత్తరములు నాకుచేరునట్లుచేయుచు, నాకెంతో సహాయుఁడుగానుండెను. ఈయనయే యొకసారి యాచిన్న దానిని చామర్లకోటలో పడవయెక్కించి తీసికొనివచ్చు నట్లేర్పాటుచేసి పడవనంతను కుదిర్చి యుంచితిమికాని యా ప్రయత్నము కొనసాగినదికాదు. ఆచిన్నదాని యింట పనిచేసెడి యొకకుఱ్ఱది యాచిన్నది వ్రాసిన యుత్తరములను నాకు పంపుటకయి రహస్యముగా మనోహరము పంతులుగారి యింటనిచ్చుచు, నేను వ్రాసి మనోహరము పంతులుగారి యొద్దకు పంపినయుత్తరములను గొనిపోయి రెండవ కంటివాఱెఁగకుండ నాచిన్న దాని కందిచ్చుచు, ఉండెను. లేత వయస్సులోనున్న జవ్వనులకు నిరంతర వైధవ్యదుఃఖమునకంటె మరణమే మేలుగా నగపడునుగనుక, తా నేలాగుననైన దుస్సహవైధవ్య బాధనుండి బయలఁబడి సుఖింపఁగోరి యాచిన్నదే తన్నుఁగొనిపోవుటకుఁగల వివిధమార్గములను మాకుపదేశించినది. ఆమెచెప్పినయుపాయము ననుసరించి తగినంతమందిని పల్లకి మోచువారిని నియమించి, లక్ష్మీనరసింహముగారు దయాపూర్వకముగా నిచ్చిన యిద్దఱు భటులను తోడిచ్చి మామిత్రులయిన నల్లగొండ-కోదండరామయ్య గారిని మనోహరము పంతులుగారికి వ్రాసియిచ్చిన యుత్తరముతో పెద్దాపురము పల్లకిలోపంపి, ఆచిన్న దానిని రాత్రివేళ సంకేతస్థలములో కలిసికొని పల్లకిలో నెక్కించుకొని తెల్లవారునప్పటికి రాజమహేంద్రవరము తీసికొనివచ్చి మాయింటవిడుచునట్లు తగినయేర్పాటులన్నియు చేసితిమి. వివాహమగునన్న నిశ్చయముతో నేనావఱకే చెన్న పట్టణమునుండి వేయిరూపాయలను తెప్పించి యాత్మూరి లక్ష్మీనరసింహముగారియొద్ద నుంచితిని. ఈ సందేశమునకయిన వ్యయములను వారే యాసొమ్ములోనుండి చేసి నాకు లెక్క వ్రాసియిచ్చిరి. కొందఱు వెళ్ళినచోట నేర్పుతో కార్యములను సాధించుకొనివత్తురు; కొందఱు బుద్ధిమంతులయ్యును నుపాయప్రయోగ నైపుణ్యము చాలక కార్యసాఫల్యమును బొందరు. ఈ సంగతి యేలాగుననో కొంచెము పొక్కి ఆచిన్న దానిబంధువులకు ముందుగా తెలియఁగా వారు జాగరూకులయి


యుండుటచేతను, అక్కడకుపోయిన మామనుష్యుల తెలివి తక్కువచేతను; ఆయేర్పాటులేవియు సరిగా జరగక వ్యయప్రయాసములకులోనయి మావారు పోయినదారినే వట్టిచేతులతో మరలి రావలసినవారయిరి. నాయుత్తరమునకు బదులుగా మనోహరము పంతులుగా రిట్లువ్రాసిరి.

"My dear friend,

మీరువ్రాయించినవుత్తరం అంది అందులసంగతులు విశదపర్చుకున్నాను. యీసారి అయినా మనముతలుచుకున్న కార్యంసఫలంకానందుకు మిక్కిలి విచారించుచున్నాను. యీకాకపోవుట ముఖ్యముగా మీరుపంపిన మనుష్యుల తెలివితక్కువ నడవడికచేతనే అయినట్టు నేను స్పష్టముగా చెప్పగలను. వాళ్ళనడవడిక మీనోటీసులోకి తీస్కునిరావడపు వుద్దేశ్యమేమనఁగా యిటు మీదట యెప్పటికీ యిట్టివాళ్ళను వుపయోగపర్చకుందురని తలస్తాను. రాత్రి 10 గంటలవరకు కోదండ్రామయ్య వగైరాలను మాయింట్లోవుంచుకుని పిమ్మట సవారీ బోయీలను వూరిబైట సిద్ధంగావుంచి ఒకరుమాత్రం చిన్న దాని అరుగుమీద పరుండవలసినదనిన్నీ ఒకరాత్రివేళ ఆచిన్న దేవచ్చి లేపుతున్న దనిన్నీ చెప్పివున్నందుకు ఆప్రకారంచేయక యిద్దరు మనుష్యులు వాళ్ళగుమ్మంవద్దకు వెళ్ళి వాళ్ళగుమ్మంయెదట యిటూ అటూ టలాయిస్తూ తలుపుకొట్టినారు. యెక్కడినుంచో తమరు తీసుకునివచ్చిన రెండువుత్తరాలు వాళ్ళగుమ్మంలో పారవేశినారు. యీసంగతులు అన్నీ ఆగుమ్మం యెదుటవున్న వెంకటనరసన్న వగైరాలుచూచి యెవళ్ళో యీలాగునచేసినట్టు నాతో చెప్పినారు. అందుపై వాళ్ళు మేలుకుని వెలుపలికివచ్చి వీళ్ళ వెంట మనుష్యులను పంపినారు. అదివరకే అనగా ఆదివారంనాటికే మనవుద్దేశం కాకినాడలో తెలిశినది. ఒకదుర్మార్గుడు ఆదివారం రాత్రి మేము చిన్న దాన్ని రాజమంద్రి తీస్కుని వెళ్ళుతాము జాగ్రత్తగా వుండవలసినదని చిన్నదాని తండ్రిపేర వుత్తరంవ్రాసినారు. ఆలాగున వ్రాశినా చిన్నది యేలాగునైనా ఒక రాత్రివేళ వస్తాననిన్నీ ఒకమనిషిమాత్రం అరుగుమీద పరుండ పెట్టవలసిందనిన్నీ చెప్పి


నది. ఆప్రకారంజరగలేదు. కాకినాడనుంచి వచ్చినవుత్తరంలో వున్నప్రకారం మనుష్యులు వచ్చినందున యింటివాళ్ళు తెల్లవార్లు నిద్రపోలేదు. పైగా ఆ రాత్రి యిక్కడికివచ్చినబంట్రోతులు తాగివున్నట్టు కనపడుతున్నది. ఈ పైన వ్రాసిన సంగతులకు నిదర్శనంగా చిన్నదివ్రాసిన వుత్తరాలు జతపర్చినాను. యేలాగుననైతే నేమి యీపని మేముచేయించినట్టు యింటివాళ్ళు అనుకోకుండా వాళ్ళకు విరోధిగా వున్నటువంటిన్నీ కాకినాడనుంచి వుత్తరం వ్రాసినటువంటిన్నీ మనుష్యుడు తనవుత్తరపుసంగతులు నిజంగావున్నట్టు యేర్పడేనిమిత్తం ఆదివారంనాటిరాత్రి యెవరో మనుష్యులచేత అల్లరిచేయించినట్టు అనుకునేలాగున చేయడమైనది. మేముమాత్రము యవరివల్లనున్ను యిదివర్కు అనుమానింపబడలేదు. చిన్న దానికి మాకువుత్తరప్రత్యుత్తరములు జరుగుతూ వున్నవి. చీకటిరాత్రిళ్ళుగాచుచ్చి ఒక మాసంరోజులు పోయినపిమ్మట ముహూర్తం యేర్పర్చి ఒకమనిషిని మీరు నాయొద్దకు పంపినయెడల చిన్న దాన్ని పంపగలనని తోచుచున్నది. నాకు వీలైనప్పుడు పంపినపక్షమున ముహూర్తంకుదిరేవరకూ చిన్న దాన్ని దాచగలరా ? ఒకవేళ పట్టుపడినయెడల యుక్తమయిన వయస్సు వచ్చినట్టు స్థిరపరచ గలుగుదురా ? వ్రాయించవలెను. కోదండ్రామయ్య వగైరాలను చివాట్లు పెట్టకోరుతాను. ఆచిన్న దానికి యివ్వవలసిన వుత్తరములు యేమైనా వున్న యెడల ఆసంగతి నాతో చెపిత నేను Medium ద్వారా అందచేతును. వీళ్ళు గుమ్మంలో పారవేశినవుత్తరములు చిన్నదానికి చిక్కినవి. ఆవుత్తరములు 1-2 రోజులలోనే సంగ్రహించి తమ తావుకు పంపించుచున్నాను. యీచిన్నదిగాక 4 గురు చిన్న వాళ్ళువున్నారు. వాళ్ళుకూడా నింపాదిమీద సందర్భించగలరని తోచుచున్నది..............."

ఈప్రయాణమునకు లక్ష్మీనరసింహముగారి పరిజనుఁడు పట్టాభి రామస్వామిగారిచ్చిన యీక్రింది లెక్కప్రకారము ముప్పదిమూడు రూపాయల ఆఱణాలయినవి.


జనం 1 కి రు. 1-12-0ల చొ|| 13 బోయీలకు రు. 22-12-0


బంట్రోతులకు రు. 4-0-0

కోదండ రాయ్యగారికి రు. 5-0-0

కాగడా రు. 0-8-0

చమురు రు. 1-2-0

అందుమీఁద మేము చేసినప్రయత్నమును చిన్నదానిపేరును సమస్తజమకును వెల్లడి యయిపోయినవి. ఎల్లవారును ఈవివాహమునకు విఘ్నము కలుగఁ జేయుటకై చేయవలసిన ప్రయత్నముల నన్నిటినిజేసిరి. అయినను మాయుత్తర ప్రత్యుత్తరముల సంగతిమాత్ర మెవ్వరికిని తెలియక రహస్యముగానే యుండినది. అందుచేత మేము మఱియొక యుపాయము నాలోచించి మా వర్తన మెవ్వరికిని భేద్యముకాకుండునట్లు గోప్యముగా నిర్వహించి పరమ నిపుణుఁడును మాకు పరమవిశ్వాసియునయి మాముద్రాశాలలో పనిలోనుండిన మునిసామిని పెద్దాపురమునకుఁ బంపితిమి. ఆతఁడెవ్వరికిని ననుమానము కలుగకుండ మార్గస్థునివలె నటించి రాత్రి వారి వీధియరుగుమీఁదనే పరుండి తన సందేశము నాచిన్న దానికి తెలిపి నేర్పుతో పనిచేసెను. అమావాస్యనాఁడు రాత్రి రెండుజాములవేళ మబ్బుపట్టి చినుకులు పడుచుండఁగా తనతండ్రికి తలనొప్పి వచ్చుటచేత నుపచారములు చేయుచున్న తల్లి మొదలైనవారి నేమఱించి లఘుశంకకుపోవు మిషమీఁద వీధిలోనికివచ్చి యాచిన్నది మామనుష్యునితో తాను వచ్చుటకు సిద్ధముగానున్న సంగతిని తెలిపెను. అతఁడు వెంటనే యాచిన్న దానిని వెంటఁగొని బైలుదేఱి, కొంతదూరము పోయినతరువాత తానావఱకు తీసికొనిపోయిన బట్ట లాచిన్న దానికికట్టి పురుషవేషమువేసి, పగలు చూచుకొనివచ్చిన మాఱు మూలదారిని గాఢాంధకారములో వానలో తడియుచు పరుగెత్తి, కొంతదూర మాచిన్న దానిని నడిపించియు కొంతదూర మెత్తుకొని మోచియు తెల్లవాఱునప్పటికి రెండామడలు నడచి, అక్కడ బండిచేసికొని మఱునాఁడు పగలు రెండుజాములవేళ నామెను మాయింటికిఁ జేర్చెను.

ఆచిన్నది యిల్లుదాటిన నాలుగైదునిమిషముల కెల్లను తల్లిమొదలైనవా రామెతరలిన సంగతి కనిపెట్టి చుట్టుపట్ల వెదక నారంభించిరి. ఆమె యిందు నిమిత్తమే పోయినదని వారు గ్రహించి బంధువులతోడను పొరుగువారితోడను పరుగెత్తి యన్ని దారులను వెదకి యెందునుగానక తిరిగివచ్చిరి. అప్పుడు వారందఱును న్యాయవాదులతో నాలోచించి తమ నగలెత్తుకొని పాఱిపోయినదని దొంగతనపు నేరము నారోపించి యాచిన్న దానిమీఁద పోలీసువారి వద్ద ఫిర్యాదుచేసి యామెను పట్టుకొనుటకయి యారాత్రియే వారంటు పుట్టించిరి. ఆవారంటు నిచ్చినది మామిత్రుఁడైన గుమ్మడిదల మనోహరముపంతులు గారే. ఆయన వారంటు పట్టుకొనిపోయెడుభటునితో ముందుగా కాకినాడకు పోయి నాలుగైదుదినము లక్కడనుండి రామకృష్ణయ్యగారి యిండ్లలో దేనిలోనైన నాచిన్నది దాచఁబడినదేమో విచారించి యక్కడలేదని రూఢిగా తెలిసినపిమ్మటనే రాజమహేంద్రవరమునకు పోవలసినదని చెప్పి, రహస్యముగా నాకాదినముననె తెలియునట్లు మనుష్యునిఁబంపెను. నాకీవర్తమానము పాఠశాలలో నుండఁగా మఱునాటి మధ్యాహ్నము తెలియవచ్చినది. ఆసమాచారము తెలియరాఁగానే నేను సెలవుగైకొని వారంటు తప్పించుటకయి పోలీసు స్యూపరింటెండెంటుగారి కార్యస్థానమునకు పోఁగా, ఆయన కాకినాడకు పోయినట్టు తెలిసినది. అప్పుడింటికివచ్చి చిన్న దానిని భద్రపఱిచి, పోలీసిన్స్పెక్టరును గలిసికొని నేను మరలవచ్చు పర్యంతమును చిన్న దానిని వారంటుమీఁద పట్టుకొనకుండునట్టు దిట్టపఱిచి, వెంటనే బండిమీఁద ధవళేశ్వరము పోయి పడవయెక్కి మఱునాటి మధ్యాహ్నమునకు కాకినాడచేరితిని. అక్కడ విచారింపఁగా స్యూపరింటెండెంటు ఉప్పుకొటారులను పరీక్షించుటకయి పెనుగుదురు గ్రామమునకుపోయినట్టు తెలిసినది. అప్పుడు చింతమఱింత యెక్కువయయి భోజనము లేని విచారమును మఱచి పెనుగుదురు పోవుటకయి ప్రయత్నించుచుండఁగా, పోలీసు స్యూపరింటెండెం టంతకుముందే మరల వచ్చి కాలువలోని తమ పడవలోన్నున్నట్టును, గంటసేపటిలో చామర్లకో


టకు పోవనున్నట్టును, వర్తమానము తెలిసినందున, ఆయెండలో పరుగెత్తుకొని పోయి సాయంకాలము నాలుగుగంటలవేళ కాలువమీఁదిపడవలో దొరగారిని సందర్శించి సంగతి విన్నపించితిని. అతఁడాచిన్న దానిని పట్టుకొనకుండ పోలీసు యుద్యోగస్థుల కుత్తరువు పంపెదనని చెప్పి నన్ను పంపివేసెను. ఇఁక పెండ్లి కొమారుని తీసికొని పోవలసినపని యొకటిమిగిలియున్నది. అందుచేత నే నాయనవద్దనుండి తిన్నగా హిందూపాఠశాలకు పోయి యక్కడ నుపాధ్యాయుఁడు గానున్న యాతనిని కలిసికొని నావెంటరమ్మని పిలువఁగా అతఁడీ యభియోగవార్తను వినుటవలనను జనులవలని భీతివలనను కొంతజడిసి నా వెంట రాకుండుటకయి కొన్ని సాకులు చెప్ప మొదలు పెట్టెను. కాని, నేనన్ని టికిని తగిన పరిహారములుచెప్పి, పాఠశాలనుండియే తిన్నఁగా నే నాతనిని పడవవద్దకు బలవంతముగా తీసికొనిపోయి నాగదిలో కూరుచుండఁ బెట్టుకొనఁగా, తన్న ప్పుడు విడిచి పెట్ట వలసినదని నతఁడనేకవిధముల ప్రార్థించియు నేను పూనికను విడువనందున నామాట తీసివేయలేక నాతోవచ్చి మఱునాఁడు తెల్లవాఱిన తరువాత తాను తొడుగుకొన్న యంగీయు తలగుడ్డయు నుత్తరీయమును నా గదిలోనేయుంచి గురుశంకకు పోయివచ్చెదనని నాతోచెప్పి మేడపాడు దగ్గఱ పడవదిగి వెనుకకు పాఱిపోయెను. నేనుమాత్రము నాఁడు మధ్యాహ్నము రెండుగంటలకు రాజమహేంద్రవరముచేరి, ముందుగా తంతివృత్తాంత కార్యస్థానమునకుపోయి పెండ్లికొమారుని చర్యను కాకినాడలోని లచ్చిరాజుగారు మొదలైన మిత్రులకు తంత్రీముఖమునఁదెలిపి యింటికిఁబోయి మూడవనాఁడు అపరాహ్న మయిన తరువాత మూడుగంటలకు భోజనముచేసి, అప్పుడే రామకృష్ణయ్యగారు మొదలైన మిత్రులకందఱికిని వరునిమరలఁ బంపుటను గూర్చి యుత్తరములు వ్రాసితిని. పెండ్లికొమార్తెమీఁది యభియోగ మామె వివాహము చేసికొనఁబోవుచున్నదన్న ద్వేషముచేత తెచ్చినదయినట్టు కనఁబడుచున్నందున, ఆమెనుపట్టుకొనవలదని పోలీసువారికి స్యూపరింటెండెంటు వద్దనుండి వెంటనే యుత్తరువువచ్చెను. తరువాత కాకినాడకు మనుష్యులను


బంపి పెండ్లిజరగకుండఁ జేయుటకయి వివిధమాయోపాయములను పన్ను చున్న విరోధుల ప్రయత్నముల కన్నిటికిని ప్రతిక్రియలుచేసి యిదేసమయమని పెండ్లి కొమారుని బాధింపనెంచిన ఋణప్రదాతల చేతులనుండి యాతని విముక్తునిఁ జేసి పెండ్లికొమారితను జూచి మాటాడిపోవుటకయి తుదకాతనిని రాజమహేంద్రవరమునకు మరల రప్పించితిమి. ఈతనిని ఋణవిముక్తునిఁ జేయుటకయి యప్పుడిచ్చినవి యిన్నూఱురూపాయలు. పెండ్లికొమార్తె యిల్లువిడిచిన మఱునాఁడు పెద్దాపురములోనివారు మేము యుక్తవయస్సు రానిపిల్లను సంరక్షకులో వశములోనుండి దొంగిలించుకొని పోతిమని నేరము మోపి యనుగత దండవిధాయకుని యొద్ద మామీఁద నభియోగముతెచ్చిరి. ఆదండవిధాయి యీయభియోగము వితంతువివాహ సంబంధమున వచ్చినట్లు కనఁబడుచున్నదని మండల దండవిధాయకునకుఁ దెలుపఁగా నతఁ డా యభియోగమును తనయొద్దకు రప్పించుకొని విమర్శకయి సంయుక్తదండ విధాయకునియొద్దకు రాజమహేంద్రవరము పంపెను. నేను రాజకీయవైద్యుని (Doctor) మా యింటికి పిలిపించి యాయనచేత వధువును పరీక్షించి యాయనవలన వధువు పదునాఱేండ్లు దాటినదని నిర్ణయపత్రమును (Certificate) పుచ్చుకొంటిని. పెండ్లికొమార్తెతల్లి మొదలగు బంధువులు మాయింటికివచ్చి యేడ్చియు కేకలు వేసియు బెదరించియు బతిమాలియు బుద్ధులుచెప్పియు వాగ్దానములుచేసియు వధువును మరలఁ దీసికొనిపోవుటకయి నానావిధముల పాటుపడిరిగాని వారి ప్రయత్నములన్నియు విఫలము లైనందున వారు నిరాశులయి వెనుక మరల వలసినవారయిరి.

ఈసమయమునందు మాకు సహాయులయి యుండిన లక్ష్మీనరసింహము గారు సెలవుమీఁద బందరులోనుండిరి; గవర్రాజుగారు చెన్న పురినుండివచ్చి విశాఘపట్టణమునకు మాపనిమీఁదనే పోవలసినవారయిరి. లోకములో కష్టములమీఁదనే కష్టములు సంప్రాప్తములగును. ప్రథమ వివాహముచేసికొన్న గోగులపాటి శ్రీరాములు గారికిని భార్యకును సరిపడలేదనియు, తల్లి యా


చిన్న దానిని తనతోడఁ దీసికొనిపోవ సిద్ధముగా నున్నదనియు, ఆపుటకయి వెంటనే సాధనము లాలోచింపవలసినదనియు, పెద్దాపురపువధువును తీసికొని వచ్చుటకయి మేము చేసిన కృషి విఫలమయిన కాలములో విశాఖపట్టణములోని మిత్రులయొద్దనుండి నాకుత్తరములును తంత్రీవార్తలును వచ్చినవి. వరుఁడు మొదటినుండియు పట్టణములోనుండి నాచేత శిక్షితుఁడయి యింగ్లీషు విద్యాభ్యాసముచేసిన నవనాగరికుఁడు ; వధువు మొదటినుండియు పల్లెలలో గ్రామ్యజనులలో నుండి విద్యాగంధములేక మోటుదేశములో పెరిగిన మృగప్రాయురాలు. ఇట్టి యీయుభయులకును ప్రతివిషయములోను భిన్నాభిప్రాయము కలిగి యైకమత్యము లేకపోవుచుండఁగా నింతలో తల్లి కూతురివద్దకువెళ్లి యామెపక్షమయి యల్లునిఁ దమకు దాసునిగాఁ జేసికొనవలెనని వివాదము లాడుటచేత తగవు లంతకంతకు హెచ్చి కాపురము చెడిపోవునంతటి దుస్థ్సితికివచ్చెను. విద్యాధికుఁడైన వరునకిచ్చి వివాహముచేయుటవలన నీప్రథమ దంపతు లెంతో సుఖవంతులగుదురని నేను భావించితిని. తానొకటి తలఁచినదైవమొకటి తలఁచును. నేను మొట్టమొదటనే యీచిన్న దానిని వివాహమునిమిత్తమయి నావద్దకువచ్చు చుండిన యొక మోటు వానికిచ్చి వివాహము చేసియుండినపక్షమున, ఆదాంపత్యము నిజముగానే సుఖవంతమయి యుండి యుండును. విశాఘపట్టణమునుండి తంత్రీవార్తలు వచ్చిన సమయమునందే చెన్న పట్టణమునుండి తాము బైలు బైలుదేఱుచున్నామని గవర్రాజుగారు నాకు తంత్రీవార్తను బంపిరి. నేను వెంటనే కాకినాడకుఁబోయి యాయనయోడ దిగెడు దినమున వంతెనవద్ద వేచియుంటిని. ఆదినమున పొగయోడ కాకినాడ చేరుటకు మిక్కిలి యాలస్యమయినది. మధ్యాహ్నము రెండుగంటల కాయన యోడదిగి పడవలో తీరముచేరునప్పటికి, నేనొడ్డుననుండి యాయనను కలిసికొని విశాఖపట్టణమునుండి వచ్చిన లేఖలను తంత్రీవార్తలనుజూపి శ్రీరాములుగారికిని భార్యకును పొందుపఱుచుటకయి విశాఖపట్టణము వెళ్లవలసి యున్నదని చెప్పితిని. చిరకాలము భార్య మొదలయినవారిని విడిచియుండి


యిల్లెప్పుడుచూచి బంధుమిత్రాదులతో నెప్పుడు సల్లాపసౌఖ్యము ననుభవింపఁగలుగుదునాయను నాత్రముతోనుండియు, ఆవఱకు రెండుదినములనుండి భోజనములేక క్షుధార్తుఁడై యుండియు, నామాటకు మాఱుపలకక తాను తెచ్చినవస్తువులను నాకప్పగించి, మరల పడవనెక్కి యోడదగ్గఱ కైదు మైళ్లు సముద్రముమీఁదపోయి వచ్చినయోడలోనే విశాఖపట్టణమున కాయన వెళ్లెను. పరార్థమయి స్వసుఖత్యాగమిట్లుగదా చేయవలయును ! విశాఘపట్టణముచేరి దంపతులను సమాధాన పఱుచుటకయి తా మక్కడనుండి యెప్పటి సమాచారములప్పుడు నాకు తెలుపుచుండిరి.

ఇచ్చట పెండ్లికొమారుఁడు మామీఁద వచ్చియున్న వ్యవహారము యొక్క పర్యవసానము తేలువఱకును వివాహమును నిలుపవలసినదని నన్ను కోరుచుండెను. అంతట వరునియొక్క యన్న గారు రాజమహేంద్రవరము వచ్చి మంచిమాటలచేత నాతనిని తీసికొని పోవలెనని యెన్నో యుపాయములు చేసెనుగాని నాముందఱ నాతనియుపాయములు సఫలములయినవికావు. అటుతరువాత వివాహమగు వఱకును మరల పాఱిపోకుండ పెండ్లికుమారునిని కంటికి ఱెప్పవలె నొకరు విడిచి యొకరముకాచి, 1882 వ సంవత్సరము అక్టోబరునెల 22 వ తేదిని బహు కష్టముమీఁద మూడవ వితంతు వివాహమునుచేసి యీశ్వరానుగ్రహముచేత నిర్వహింపఁగలిగితిమి. ఈ వివాహమునకు మాకు మొదటి వివాహమునకంటెను పదిరెట్లు ప్రయాస మెక్కువయయినది. మొదటివలెనే యిప్పుడును రక్షకభటులు మాయిల్లు కావలికావవలసివచ్చెను. విశేషవ్యయముచేసి యా వివాహమును మొదటి దానికంటెను నధికవైభవముతో జరపితిమి. అంతధనవ్యయముచేసినను, ఇంతమంది రక్షక భటులు కావలికాచినను, ఊరేగింపు ఉత్సవసమయమునం దాయుథపాణులయి యా రక్షక భటులు పల్లకిచుట్టును నిండియున్నను దుష్టులు కొందఱు పెండ్లిపల్లకిమీఁద రాళ్లువిసరిరి. పిమ్మట మాప్రతిపక్షులు తెచ్చిన యభియోగము విమర్శమీఁద డిసెంబరునెలలో కొట్టుపడిపోయినది. విమర్శసమయమునందు పెండ్లి


కొమారితతండ్రి మాకావఱకు వ్రాసియిచ్చిన యుత్తరమును జూపఁగా, తన్ను గదిలోపెట్టి కొట్టెదమని బెదరించి యాయుత్తరమును బలవంతముగా వ్రాయించి పుచ్చుకొంటిమని చెప్పెను. అభియోగము కొట్టుపడిపోయిన తరువాత నతఁడు మాయింటికివచ్చి క్షమార్పణముచేసి, యీవ్యవహార నిమిత్తమయి రాజమహేంద్రవరములో నుండవలసివచ్చుటచేత తనకు పదిరూపాయ లప్పయ్యెనని చెప్పఁగా నేనాపదిరూపాయలు నిచ్చివేసితిని. వివాహనిర్వర్తన విషయమయిన యేర్పాటులుచేసిన మిత్రులు మొదటి వివాహమునకు వలెనే బోగముమేళమును కుదిర్చి నాకు తెలియకుండ ముందుగా రెండురూపాయ లిచ్చిరికాని యీవివాహకార్యనిర్వహణమంతయు పూర్ణముగా నాచేతిలోనే యున్నందున ఊరేగింపు సమయమునందు సహితము బోగముమేళము లేకుండఁ జేసితిని. ఈ వివాహముతోనే ప్రతిపక్షులగర్వము సగమడఁగేను గాని తరువాత జరిగిన నాలవ వివాహముతో వారికి పూర్ణముగా గర్వభంగమయినది. ఈవివాహవార్తను మిత్రులకును పత్రికలకును తంత్రీ ముఖమునఁ దెలుపుట కయి నేను పెండ్లినాటిరాత్రి 15 రూపాయలు వ్యయపెట్టితిని. ఈశుభవార్త తెలియఁగానే 24 వ తేదిని గవర్రాజుగారు విశాఖపట్టణము నుండి నాకిట్లు వ్రాసిరి. -

"ప్రియమిత్రుఁడా !

ప్రార్థించుచున్నాను. నాహృదయపూర్వకములైన సస్నేహాభినందనముల నంగీకరింపుఁడు. చక్కగా చేయఁబడినది ! ఈశ్వరునకు వందనములు. నాసంతోష మనిర్వాచ్యమైనదిగానున్నది. ఓర్పు, సమస్తకష్టములను గట్టెక్కించునుగదా ! కొందఱు మిత్రులు నొరాశనుపొందిరి. వారు మఱివివాహములు జరగవని తలఁచిరి. వారిఁకముందు వివాహములు జరగుట యసాధ్యమని భావించిరి. వారికందఱికిని మీరిప్పు డాశాభంగము ననుకూలముగా కలింగించినారు. సంస్కారప్రియులని చెప్పఁబడువారియొక్క నిష్కాపట్యమును పరీక్షించుటకయి మఱియొక శోధనవచ్చినది. ఈయవకాశమువలని


లాభమును పొందుటకయి మీరు తప్పిపోరని కోరుచున్నాను. అథమ మందఱిని తాంబూలములకైనను పిలువుఁడు. వారిని మీరీవఱకే పిలిచియుండని పక్షమున, వివాహానంతరమునైనను చేయవేఁడుచున్నాను. పయియాదివారమున నిర్ణయింపుఁడు. మనబలమును మరల కుదురుపఱుచుటకు మనశక్తిలో నున్న సమస్త సాధనములను మనము ప్రయోగించి చూడవలెను. మనము సంగీత సభను పెట్టవలెను. ఆదివారమునాఁడునుగాని యంతకుముందుగాని యీశ్వరేచ్ఛ యున్నయెడల నేను మీతో నుండెదను. పయి బుధవారము నాఁడిక్కడి కొక పొగయోడ వచ్చునని నే ననుకొనెదను. ఆదినమున కాకపోయినను గురువారము నాఁడది యిక్కడనుండును. సర్వదయాళుఁడైన యీశ్వరుఁడు మీప్రయత్నములకు జయముకలిగించునుగాక ! ఏది వ్యతిరేకముగానున్నను, ఈపక్షమీశ్వరునిచేత నంగీకరింపఁబడిన పక్షమున విజయమునొందునని మనమ దృఢముగా నమ్మియుండవచ్చును." [16] ఈవివాహమయినతరువాత అక్టోబరు 24 వ తేదిని కలకత్తానుండి యీశ్వరచంద్రవిద్యాసాగరులవా రిట్లువ్రాసిరి.

"దేశముయొక్క మీభాగములో మూడవ బ్రాహ్మణ వితంతువు యొక్క వివాహనిర్వహణమును గూర్చిన సమాచారమునకై నేను మీకెంతయు నుపకార స్మృతి కలవాఁడనై యున్నాను. ఇక్కడి వితంతు వివాహ విహితులు ఈశుభవర్తమానమువలన మిక్కిలి సంతోషమును పొందియున్నారు. అదృష్టహీనలైన దుఃఖభాగినుల పక్షమున మీయొక్క పరోపకార ప్రయత్నములకు నిరంతరవిజయము కలుగునుగాక యనుట

మీసుహృదుఁడైన యీశ్వరచంద్రశర్మయొక్క సమాహిత ప్రార్థన." [17]

కలకత్తానుండి యీశ్వర చంద్ర విద్యాసాగరులవారును, బొంబాయినుండి మహాదేవగోవిందరానెడిగారును, నాతోడనప్పుడప్పుడుత్త్రరప్రత్యుత్తరములను జరపుచు శాస్త్రవిచార విషయమున నాసందేహములను దీర్చుచు నాకెంతో సాయముచేయుచుండెడివారు.

ఈవఱకు జరగిన వివాహములు మూఁడును లౌక్యులుగానుండు నియోగి బ్రాహ్మణులలోను మాధ్వబ్రాహ్మణులలోను జరగినవి. వైదికులలో మాత్ర మింతవఱకు జరగనందున వారది గొప్పప్రతిష్ఠగాఁ జెప్పుకొనుచు తమవారిలో


నట్టి వివాహములు చేయించుట యసాధ్యమని దంభములు పలుకుచువచ్చిరి. కాకినాడలో నుత్తమవైదికకుటుంబమునందు జననమొంది చదువుకొన్న యొక బాలవితంతువుండెను. వెంకటప్పయ్యగారు వెనుకమాటాడినది యీచిన్న దాని యన్న గారితోనే. ఈచిన్నది వివాహములు జరుచుండుట విని తానుగూడ వివాహముచేసికొనవలెనని మనస్సులో నెంతో యభిలాషపడుచుండెను. ఆ చిన్న దాని యింటియెదుట నున్నయింటిలో తంజావూరి చెలపతిరావుగారను నొక పెద్దమనుష్యుఁడు కాపురముండెను. ఆయనకు మండలకరగ్రాహికార్యస్థానములో లేఖకోద్యోగము. ఆయన వితంతు వివాహములయందు విశేషాభిమానము కలవాఁడగుటచే జాలిపడి యాచిన్నది యొంటిగా తమయింటికివచ్చినప్పుడు వివాహవిషయమైన ప్రసంగము తీసికొనిరాఁగా నామె తనయభీష్టమును దెలియఁ బఱిచెను. ఆచిన్న దాని విషయమై పనిచేయవలెనని యీయననే మేమును గోరితిమి. ఆయన యావఱకే తాను పనిచేయుచున్నట్టు చెప్పి మా ప్రార్థన నంగీకరించెను. ఆచిన్నదియొకనాటి ప్రాతఃకాలమునం దొంటిగా నున్నప్పుడాయనను కలిసికొని, ఆరాత్రిపెండ్లివారు తమవీధినుండి యూరేగునప్పుడు తనకీవలకు వచ్చుట కవకాశముకలుగుననియు, అప్పుడు తన్ను తీసికొని పోవునట్లేర్పాటు చేసినపక్షమున రాజమహేంద్రవరము వెళ్లుదుననియు, చెప్పెను. ఆయన యట్లే చేసెదననిచెప్పి యప్పుడే మూడవ వివాహముచేసికొన్న మామిత్రునితోఁగలిసికొని పల్లకినిబోయీలను సిద్ధముచేసి, చీఁకటిపడ్డ తరువాత పల్లకినొక సంకేతస్థలమునందుంచునట్లేర్పాటుచేసి, చిన్న దానిని పల్లకి వద్దకు తీసికొని పోవనియమించిన మనుష్యునిని ముందుగా నాచిన్న దానికి చూపెను. ఆరాత్రి తొమ్మిదిగంటల కొకచోట నద్భుతమైన గారడివిద్య (Magic) చూపఁబడునని ప్రకటనపత్రికలురాఁగా, చెలపతిరావుగారు దానిని పొగడి ప్రోత్సాహపఱిచి యాచిన్న దానియన్నను మేనమామలను దానినిపోయి చూచుట కొడఁబఱిచెను. ఆయన తాను ముందుగా భోజనముచేసి వారియింటికిఁ బోయి తొందరపెట్టి యెనిమిదిగంటలకే భోజనముచేయించి వారిని తనవెంటఁ


గొని గారిడీవిద్య ప్రదర్శించు స్థలమునకుఁబోయెను. నాటివివాహము శ్రీపైడా రామకృష్ణయ్యగారి యింటనే. సుమారు రాత్రి పదిగంటలవేళ పెండ్లియూరేగింపు వారియింటిముందునుండి సాగెను. నియమింపఁబడిన మనుష్యుఁడును పెండ్లి పల్లకితో నూరేగింపునకు ముందే నడుచుచుండెను. పల్లకియు సంకేతస్థలమున సిద్ధముగా నుంచఁబడెను. పెండ్లిపల్లకి తమయింటిముందుకు రాఁగానే లోపలివారు గుమ్మముముందఱ నిలుచుండి వేశ్యలనృత్యగానములను చూచుచుండఁగా, ఆచిన్నది సందడిలో వెలుపలికివచ్చి తనరాకకయి యెదురుచూచుచుండిన మనుష్యునివెంట నడిచి పల్లకిలోఁగూరుచుండెను. తత్క్షణమే పల్లకిమోచువా రా చిన్న దానినిగొని బైలుదేఱిరి. తెల్లవాఱునప్పటికాకస్మికముగా పల్లకివచ్చి మాగుమ్మములోదిగఁగా మేమాచిన్న దానిని లోపలికి తీసికొనిపోయి భద్రముగా నుంచితిమి. చిన్నది కాకినాడ విడువఁగానే తృతీయవివాహవరుఁడైన రామారావుగారు నాకు తంత్రీవార్తను పంపిరి. పెండ్లిపల్లకి తమ గుమ్మము దాటి దూరముగా పోయినతరువాత నా చిన్న దాని తల్లి మొదలయినవారు లోపలికిఁబోయి చిన్నది కనఁబడకపోఁగా పేరుపెట్టిపిలిచి యిందునందువెదకి తొందర పడసాగిరి. కొంతసేపటికి మగవారు గారిడివిద్యనుచూచి యింటికి వచ్చి స్త్రీలవలన జరగినసంగతివిని యాచిన్నది రాజమహేంద్రవరమే పోయినదని నిశ్చయించిరి. ఆచిన్న దాని యన్న గారును మేనమామలును కొందఱు బంధువులును లౌక్యోద్యోగములలోనుండి ప్రబలులుగానున్న వారు; పినతండ్రులు మొదలైనవారు కొందఱు యజ్ఞాదిక్రతువులుచేసి పండితు లనిపించు కొనుచున్న శిష్టసంప్రదాయములోని వారుగానున్నారు. ఆచిన్న దాని మేనమామలారాత్రియే రాజమహేంద్రవరములో తహశ్శీలుదారుగానున్న తమ బంధువైన తణికెళ్ళ జగాన్నాధముగారికిని పోలీసువారికిని తంత్రీవార్తలు పంపిరికాని వారెవ్వరును జోక్యము కలిగించుకొనక యూరకుండిరి. మఱునాఁడు పడవమీఁద బైలుదేఱి చిన్న దానియన్నయు తల్లియు మేనమామలలో నొకరును రాజమహేంద్రవరమునకు వచ్చి బంధువులయింటదిగి మూడవనాటి మధ్యాహ్నము మాయింటికివచ్చిరి. నిన్న దానితల్లి యింతసేపు రోదనముచేసి


కొమారితను తమ వెంటరమ్మని బహువిధముల బతిమాలుకొనెనుగాని చిన్నది వారికోరిక చెల్లింపక స్థిరచిత్తురాలయి నిరాకరించెను. అన్న గారేమియు మాటాడక తలవంచుకొని నిలుచుండెను. మేనమామ నన్ను చాటునకుపిలిచి మంచి వరుని విచారించి వివాహము చేయవలసినదని చెప్పి, అంతమూర్ఖముగా నిరాకరించుచున్న దానితో సిగ్గులేక యేలమాటాడెదవని యప్పగారిపైని కేకలువేసి, యప్పను మేనల్లునిని వెంటఁగొని మాయిల్లు వెడలిపోయెను. ఈ చిన్న దానికి వివాహముచేయ నుద్దేశించి యామె యన్న గారావఱకు నాతో ననేక పర్యాయములు మాటాడి యుత్తరములువ్రాసిన వాఁడేయైనను, బహిష్కారపత్రికలు వచ్చినతరువాత జడిసి వెనుకతీసి తాను కార్యముచేయుటకు సాహసింప లేక పోయెను. పులవర్తి శేషయ్యయను నొకవైదిక విద్యార్థియుండెను. అతఁడా సంవత్సరము సర్వకలాశాలాప్రవేశపరీక్షకు పోయియుండెనుగాని ఫలితమింకను తెలియలేదు. అతఁడు పరీక్షానంతరమున నన్న గారియొద్దకు గ్రామాంతరము పోయియుండఁగా మనుష్యునిబంపి యాతనిని పిలిపించి యీచిన్న దాని నాతనికి 1883 వ సంవత్సరము జనవరినెల 3 వ తేదిని వివాహముచేసితిమి. ఈ వివాహమునాటికి లక్ష్మినరసింహముగారు బందరునుండి తిరిగి వచ్చినవారయి సహాయులయిరి. ఈవరుఁడు శుద్ధశ్రోతియ వంశమునందు పుట్టి వైదికవృత్తి యందున్న యన్నలను తండ్రినికలఁవాఁడు. దేశాభిమానము కలవారయి యిట్టి ప్రజాక్షేమ కరములైన కార్యములయం దుత్సాహముకలిగి సర్వవిధముల నాకు సహాయులుగానుండిన విద్యార్థులలో నితఁడొకఁడు; తరువాత పదవవితంతు వివాహముచేసికొన్న నల్లగొండ కోదండరామయ్యగా రింకొకఁడు. ఇటువంటి విద్యార్థుల కనేకులకు పాఠశాల జీతములు మొదలయినవిచ్చి యనేక విధముల సాయము చేయుచుండెడి వాఁడను. ఈ యిరువురను తల్లిదండ్రులు స్వజాతి కన్యలను కుదిర్చి వివాహములుచేయఁ బ్రయత్నించినప్పుడు చేసికోక నిరాకరించిన ధైర్యశాలులు. ఇట్టివారనేకులుండిరికాని వారిలో నెవ్వరును తరువాత వితంతువివాహములను చేసికొన్న వారు కాక పోవుటచేత వారినామము లిందుదా హరించుట యనావశ్యకము. ఆకాలమునందు విద్యార్థులు మాకుచేసిన


సాయమును నేనెట్టికి మఱవఁ. ఈవిద్యార్థులలో కొందఱు లోకోపకార కార్యార్థమయి యగ్ని హోత్రములో దూకుమన్నను దూకుటకు వెనుకతీయని వారుండిరి ; వా రేయర్థరాత్రమున నెంతదూరముననున్న యేగ్రామమునకుఁ బోయి యెవ్వరితో మాటాడి యేకార్యమును చేసికొని రమ్మన్నను మాఱుమాటాడక చెప్పినట్లు చేసికొనివచ్చుచుండిరి. ఇటువంటివారి తోడ్పాటువలననే మేమనేక కార్యములు నిర్విఘ్నముగా నిర్వహింపఁగలిగితిమి. ఇట్లుకష్టముమీఁద నిర్వహింపఁబడిన యీ రెండువివాహములకు నత్యాశ్చర్యపడి పైడా రామకృష్ణయ్యగారు మొదలైనమిత్రులు మాకనేకాభినందన పత్రికలనుబంపిరి. రామకృష్ణయ్యగారి యభినందన లేఖలలో నొకదానినుండి కొన్ని పంక్తులిచ్చట నుదాహరించుచున్నాను. -"ఈయభినందనపంక్తులనుమీకు రాత్రి 11 గంటలకు వ్రాయుచున్నాను ......... .....(చిన్న మనుష్యులైన) మీరును గవర్రాజుగారును మనయద్భుత సాహసికమిత్రుఁడైన బీ. యే, బీ. యల్. లక్ష్మీనరసింహముగారి సాహాయ్యమను డాలుతో ప్రవాహమునకు విరోధముగా పోరాడుచు బ్రహ్మాండమైన పనిలో విజయ మొందినారు. దేవునకు వందనములు. దేవుడు మీకందఱకు తోడుపడును. నాహృదయవాంఛలకొన్నిటితో మీ కొఱకీలేఖవ్రాసితిని. ఓవీరేశలింగముగారూ ! మీపేరును స్థాపించి యీప్రపంచములో ముందుకు దానిని శాశ్వతము చేసియున్నారు. దేవుఁడు మీకు మంచి యారోగ్యమునియ్య ప్రార్థించుచున్నాను."[18]


ఈనాలవవివాహమయినపిమ్మట ప్రతిపక్షులు తమప్రయత్నములవలన కార్యము లేదని తెలిసికొని నిరుత్సాహులయి ప్రత్యక్షముగా బాధించుటకును కార్యవిఘాతముచేయ పాటుపడుటకును మానుకొని యుపేక్షాపరులు కాసాగిరి. ఆవఱకు వీరు నాప్రాణములకు సహిత మెగ్గు తలఁచిరి. పిండిబొమ్మలు చేసి వాని కీళ్ళలో ముళ్లుగ్రుచ్చి పసుపుతోను పిండితోను మ్రుగ్గులుపెట్టి రాత్రులు మా వీధి గుమ్మముముందు పెట్టుచుండిరి. వీధిలో చేసిన యీప్రయోగముల వలన ప్రయోజనము కలుగకపోఁగా రాత్రులు నిచ్చెనలువేసికొని మాదొడ్డిలోనికే దుమికివచ్చి దొడ్డిలోనున్న దానిమ్మచెట్టునకే యీపిండిబొమ్మలను కొబ్బరికాయ ముక్కలను కట్టఁదొడఁగిరి. తెల్లవాఱినతరువాత మాముద్రాయంత్రములోని పనివాండ్రా కొబ్బరిముక్కలను తినుచువచ్చిరి. శత్రువు లెన్నిమారణ కర్మలుచేసినను భగవదనుగ్రహమువలన నేను సిగపువ్వువాడక యధాప్రకారముగానే తిరుగుచుంటిని. నాకును గవర్రాజుగారికిని బాల్య మిత్రుఁడయిన గాడేపల్లి సుబ్బయ్యగారు కొన్ని మాసములక్రిందట నన్ను చూచుటకయి మాతోటకు వచ్చినప్పుడు వెనుకటి సంగతులు ముచ్చటించుచు పగలు సహితము నేనొంటిగా వీధిలోనికిపోయి మసలినప్పుడు నేను తిరిగి యింటికివచ్చు వఱకును నాకేమియపాయము సంభవించెనోయని భయపడు చుండెడివారమని చెప్పిరి.

బాలవితంతువులతోను వితంతువుల సంరక్షకులతోను మాటాడి వారిని ప్రోత్సాహపఱిచి సంస్కార వ్యాపనముచేయు నిమిత్తమయి నెల కెనిమిది రూపాయలు జీతమేర్పఱిచి సంపర వెంకన్న గారిని నియమించితినని చెప్పితిని గదా! ఆయన యీవితంతువుతో మాటాడితిననియు, ఆవితంతువుతో మాటాడితిననియు, ఈ సంరక్షకుని ప్రోత్సాహ పఱిచి యొప్పించితిననియు, ఆసంరక్షకుని ప్రోత్సాహపఱిచి యొప్పించితిననియు, చెప్పుచు అక్టోబరు నెలనుండి నావద్దమూడునెలలుజీతము పుచ్చుకొనెను. ఆవితంతువుమాట యీవితంతువుమాట యటుండఁగా పదునెనిమిదేండ్ల ప్రాయముగల యాయనకూతు


రైన తనయింటి వితంతువే నాలవ నెలలో మాయింటికి పరుగెత్తుకొనివచ్చి తనకు పతిభిక్ష పెట్టుమని నన్ను వేఁడుకొనెను. తండ్రియైన సంపర వేంకన్నగారు కొమారిత వెంటనే మాయింటికి పరుగెత్తుకొనివచ్చి విలపించుచు, మరల తన కొమారితను తనవెంటఁ బంపివేయవలసినదనియు తనకు వంటచేసి పెట్టుటకు వేఱు దిక్కు లేదనియు నన్ను వేఁడుకొనెను. వంటచేసి పెట్టుటకు వేఱొక పనికత్తెనైనను కుదుర్చుకోవలసినదనియు లేకపోయినయెడల నుద్యోగములో నున్న కొడుకువద్దను కోడలివద్దను నుండవలసినదనియు హితముచెప్పి పనినుండి తొలఁగించి కొమారితను మాయింటనే యుంచుకొని యాయన నొక్కనిని మాత్రమే పంపి వేసితిని. మంజులూరి వెంకట్రామయ్యగారు ప్రాయశ్చిత్తము చేసికొని కుటుంబసహితముగా వెడలిపోవునప్పు డిరువదియేండ్లవయస్సుగల తన తమ్ముని మాయింట దిగవిడిచిపోయిరి. నేనాతనిని మాముద్రాక్షరశాలలో నక్షరములుకూర్చుపనిలోపెట్టి నెలకాఱురూపాయ లిచ్చుచుంటిని. గోపాలమను పేరుగలయీతఁడు తనకు వివాహము చేయవలసినదని పలుమాఱు నన్ను తొందర పెట్టుచుండెను. అతని కెనిమిదిరూపాయలు జీతముచేసి, నాలుగవ వివాహమయిన యిరువదియేడు దినములకనఁగా 1883 వ సంవత్సరము జనేవరు నెల 30 వ తేదిని క్రొత్తగావచ్చిన వితంతువు నాతనికి పెండ్లిచేసితిని. ఆసంవత్సరము గోదావరి పుష్కరసంవత్సరము. ఆవఱకు తలవెండ్రుకలున్న బాల వితంతువులను సంరక్షకులు రాజమహేంద్రవరము తీసికొనివచ్చి గోదావరీ తీరమున శిరోజములు తీయించి విరూపిణులను జేయుదురు. ఆయాచారమును బట్టి పదు నేడేండ్ల యీడుగల యొకవైదిక వితంతువును తల్లియు నన్న గారును రాజమహేంద్రవరమునకు తీసికొనివచ్చి గోదావరియొడ్డుననున్న సత్రములోదిగి యుండిరి. ఇఁక తెల్లవాఱిన శిరోజములు తీయింతురనఁగా నారాత్రి యెట్లో యాచిన్నది తనవారి నేమఱిచి తప్పించుకొనివచ్చి నన్ను శరణుఁజొచ్చెను. పూర్వభర్తయుపాధ్యాయోద్యోగములో నుండినవాఁడేయయినను, తన ప్రస్తుతావస్థనుబట్టి తానెంత బీదవాఁడుగానుండిన వానినైనను వివాహము చేసికొన


సంసిద్ధురాలనయి యున్న దాననని యాచిన్నది నన్ను దీనముగావేఁడుకొనెను. మా ప్రాతపురోహితుఁడైన రామసోమయాజులు ప్రాయశ్చిత్తము చేయించుకొని పాఱిపోఁగా, విధురుఁడైన చెఱుకూరి నారాయణమూర్తియను నతని పురోహితునిగా నేర్పఱుచుకొంటిమి. అతఁడు తిన్న గా మంత్రములువచ్చినవాఁడు కాకపోయినను మేమతనితోడనే గడపుకొనుచుంటిమి. ఆదినమున 23 సంవత్సరముల ప్రాయముగల యాతనిమేనల్లుఁడొకఁడు అమలాపురము నుండి రాజమహేంద్రవరము మీఁదుగా కాకినాడకుపోవుచు మేనమామనుచూడఁబోయెను. మేనమామ మేనల్లుని వితంతువివాహము చేసికొమ్మని ప్రోత్సాహపఱుపఁగా నతఁడందునకంగీకరించెను. క్రొత్తగా నొకవితంతువు వచ్చినదని విని మాపురోహితుఁడామెను తానైనను వివాహముచేసికొనవచ్చుననియు, తనకు సహాయుఁడుగానుండునుగాన మేనల్లునికైనను వివాహము చేయవచ్చుననియు ఆలోచించి తన మేనల్లుని వెంటఁబెట్టుకొని మధ్యాహ్నము నావద్దకువచ్చి తన యభిమతమును దెలుపఁగా, నేనాచిన్న దానికి వారి నిరువురనుజూపి, యితఁడు పురోహితుఁడు రెండవ యతఁడు వంటబ్రాహ్మణుఁడు వీరిలో నెవ్వరియైన పెండ్లిచేసికొనుట కిష్టమున్న దాయని యడిగితిని. పడుచు వాఁడైనందున రెండవ యతనినే వివాహము చేసికొనెదనని యామెచెప్పెను. నేను వెంటనే శతమానములుచేయించి యారాత్రియే వారికి వివాహముచేసితిని. వివాహమాడిన యతనిపేరు చేబోలు వెంకయ్య. ఆఱవదియైన యీవివాహము 1883 వ సంవత్సరము మార్చినెల 13 వ తేదిని నడచినది. వరుఁడావఱకు అమలాపురములో న్యాయవాదిగానున్న పేరివిస్సయ్యగారివద్ద వంటబ్రాహ్మణుఁడుగా నుండెను. ఆన్యాయవాది స్థలనిధిసంఘములో నభికుఁడుగానుండి రెండుదినములలో కాకినాడలో జరగఁబోయెడు సభకు తాను వెళ్లునప్పటికి వంటచేసి సిద్ధముగా నుంచుటకయి యొకదినము ముందుగా తనబ్రాహ్మణునిఁ బంపెను. ఆబ్రాహ్మణుఁడు నాటియుదయమున పగలు పదిగంటలకు రాజమహేంద్రవరములో పడవదిగి మేనమామను చూచి సాయంకాలము కాకినాడపడవకు పోవలెనని


తలఁచుకొని వచ్చెనుగాని యింతలో కళ్యాణముతోసికొని వచ్చినందున గోదావరీక్షేత్ర మహిమనుబట్టి బ్రహ్మచారిగా వచ్చినవాఁడు గృహస్థుఁడుగా మాఱుట తటస్థించెను. విస్సయ్యగారు కాకినాడ మఱునాఁడుచేరి యింట వంట ప్రయత్నము లేకపోఁగా మా వంటబ్రాహ్మణుఁడు రాలేదాయని యచ్చటి వారిని విచారించెను. వారు గతరాత్రియే రాజమహేంద్రవరములో మీబ్రాహ్మణుని పెండ్లియైనదని చెప్పఁగా నద్భుతపడి, సభముగిసి స్వగ్రామమునకుఁ బోవునప్పుడు మాయింటికివచ్చి నన్ను చూచి వధూవరుల నాశీర్వదించిపోయెను. అయిదవ వివాహమునకు వంటబ్రాహ్మణుడు లేచిపోఁగా నాభార్యయే గోదావరినుండి నీళ్లు మోచుకొనివచ్చి వంట మొదలైన పనులెల్లను స్వయముగా చేసియెంతోకష్టపడవలసినదయ్యెను. ఈకార్యములయందు నావలెనే నాభార్యయు బద్ధాదరముకలదయి సర్వకష్టములను సంతోషపూర్వకముగా సహించి నన్ననుసరించుచు సహధర్మచారిణి యన్న పేరన్వర్థము చేయుచుండెను. నా భార్యయొక్క యానుకూల్యమే లేక యుండినయెడల నేనిన్ని కార్యములను నిరంతరాయముగా నిర్వహింప లేక యుందునేమో ! ఈవివాహము వంటలు మొదలైనవి చేయఁగలిగిన శ్రోత్రియబ్రాహ్మణునకే చేసి వంటబ్రాహ్మణుల వలని బెదరింపులను తప్పించుకోఁగలిగితిమి. బ్రాహ్మణులలో వివాహములు తఱచుగా జరగుచుండుటవిని యొక వైశ్యవితంతువు తనకొమార్తెయైన పదేండ్ల యీడుగల బాలవితంతువును దీసికొనివచ్చి పరిణయము చేయవలసినదని నా పాదములమీఁదఁ బడవైచెను. వివాహము చేసికొనెదమని యావఱకే నావద్ద తిరుగుచున్న యిరువదియేండ్ల యీడుగల బోడా శ్రీరాము లనుకోమటిచిన్న వానికిచ్చి యాచిన్న దానిని 1883 వ సంవత్సరము ఏప్రిల్ నెల 11 వ తేదిని వివావహముచేసితిని. ఏడవదియైన యిదియే మొదటివైశ్య వితంతువివాహము. మూడవదియైనమాధ్వ వివాహము జరిగినప్పుడు పల్లకిచుట్టును రక్షకభటులు కావలి యున్నను రాళ్ళురువ్విన కాలము పోయి, ఏడవదియైన యీకోమటి వివాహము జరగునప్పటికి ఒక్క విద్యార్థుల యొక్క సాయముతక్క రక్షకభటుల


యొక్క సాహాయ్యమక్కఱలేకయే దంపతులను రాత్రివేళ వీధులగుండ నిర్భయముగా నూరేగింపఁగలిగిన కాలమువచ్చినది.

ఈ ప్రకారముగా నెలకును రెండేసి నెలలకును రాజమహేంద్రవరములో వెంబడి వెంబడిగా వివాహములు జరుగుచుండుటచూచి, చెన్న పురములోనిమిత్రులు పళ్లె చెంచలరావు పంతులుగారును దివాన్ బహుదూరు రఘునాధరావుగారును వివాహము లెల్ల రాజధానిలో నొకమూల నున్న రాజమహేంద్రవరములో జరగుటకంటె కొన్నియైనను రాజధానిలోనే జరగుట యధికాభ్యర్థనీయమగుటచేత నొకటి రెండు వివాహములను చెన్న పట్టణములో జరప వలసినదని నన్నును రామకృష్ణయ్యగారిని కోరిరి. నేను వారి యాజ్ఞను శిరసావహించి వారి యభీష్టమును చెల్లించుటకు కృతనిశ్చయుఁడనై సాధ్యమైనయెడల నొక రిద్దఱు వధూవరులను సమకూర్చి చెన్న పట్టణములో వివాహము చేయుటకు ప్రయత్నించెదనని వారిపేర వ్రాసితిని. రాజమహేంద్రవరములోని బ్రాహ్మణవిద్యార్థి యొకఁడు క్రొత్తగా పెండ్లి చేసికొని కాలధర్మము నొందెను. అతని యప్పగారు మాయింటి సమీపముననే కాపురముండి, యప్పుడప్పుడు మాయింటికి వచ్చుచుండెను. ఆమె నొకసారి మీ తమ్మునిభార్య యెక్కడనున్నదని యడుగఁగా గుంటూరు మండలములోని యొకపల్లె యందున్నదని చెప్పి, తనమఱదలుమాత్రమే కాక మఱదలి చెల్లెలు సహితము విధవయయ్యెనని చెప్పెను. వారికి వివాహము చేయింపరాదాయని నేనడుగఁగా తనకు ప్రయాణవ్యయములను కొంత బహుమానమును ఇచ్చెడు పక్షమున పిల్లల తల్లితో మాటాడి యామె నిచ్చటికి తీసికొనివచ్చెదనని చెప్పెను. నేనందున కంగీకరించి దారిబత్తెమున కియ్యఁగా నామె నాతో చెప్పినట్టు తల్లిని గొనివచ్చెను. తల్లితో మాటాడి యామె యంగీకారమును బడసి యామెను మరల గుంటూరు సమీపముననున్న వల్లూరికి పంపి యిద్దఱు వితంతు కన్యలను బిలిపించితిని. రెండుసారులు వెళ్లినందుకును తల్లి వారిని వెంటఁబెట్టుకొనివచ్చి నందుకును నలువది రూపాయలయినవి. వితంతువులను


తీసికొనివచ్చుటకయి ప్రయాసపడిన యామెకు దారిబత్తెముతోడ కూడ నలువది రూపాయలనిచ్చితిని. తణుకు చలపతిరావను నతఁడొకఁడును, బేతపూడి ప్రకాశరావను నతఁడొకఁడును ఇద్దఱు వరులావఱకే మాయింటనుండిరి. ఈ బాలవితంతువులలో పెద్ద చిన్న దాని వయస్సు పండ్రెండేండ్లు ; ఆమెచెల్లెలి వయస్సు పదేండ్లు. ఈ వధువుల నిద్దఱిని నాయొద్దనున్న వరులకిచ్చి చెన్న పట్టణములో వివాహముచేయ నిశ్చయించి అక్కడి మామిత్రద్వయమునకు నీశుభవార్తను దెలిపి, యిద్దఱు వరులు వధువులు పురోహితుఁడు వంటబ్రాహ్మణుఁడు మొదలైనవారిని వెంటఁబెట్టుకొని భార్యా సహితముగా పొగయోడ నెక్కుటకు నేను కాకినాడకు వెళ్లితిని. రఘునాధరావుగా రావఱకే తమ స్వశాఖవారు వంటచేసినఁగాని తాను భోజనముచేయనని నా పేరవ్రాసిరి. అందుచేత వంటచేయుటకయి నేను కాకినాడలో నున్న మాధ్వదంపతులను గూడఁ బ్రయాణముచేసితిని. నాయుత్తరమందఁగానే చెంచలరావు పంతులుగారు రఘునాథరావుగారియుత్తర మందు వఱకును రావలదని కాకినాడకు తంత్రీవార్తను బంపిరి. అందుచేత మేము నాటి పొగయోడను విడిచిపెట్టి వారము దినములు కాకినాడలో నిలువవలసి వచ్చినది. రఘునాథరావుగారి యొద్దినుండి వచ్చిన యుత్తరమిది. -

"మైలాపురము, 28 వ మెయి 1883. నాప్రియమైన అయ్యా !

మీ యుత్తరములందిన మీఁదట సమాజ సభ్యులయొక్క విశేషసభను మేము సమకూర్చితిమి. సభకువచ్చిన 30 సభ్యులలో 18 బ్రాహ్మణులుగా నుండిరి. వారందఱును వివాహమునకువచ్చి తాంబూలములు పుచ్చుకొనుట కిష్టముగా నున్నారు. భోజన విషయమయి నిశ్చయముగా శూద్రసభ్యుల కాక్షేపణ లేదు గాని, అది మనకంత యుపయోగముకాదు. బ్రాహ్మణ సభ్యులలో నెఱవేర్ప సులభముగాని షరతులమీఁద తప్ప భోజనముచేయుట కిష్టులుగా నున్న వా రత్యల్పసంఖ్యాకులు. ఈసంగతులనుబట్టి మద్రాసులో వివా


హము జరపుట అవివేకమయినట్టు మాకు కనఁబడుచున్నది. అయినప్పటికిని కొంచెముమంది వచ్చుటతో పనిలేదని మీరు తలఁచెడు పక్షమున, మీరు రావచ్చును. మేమిల్లుసులభముగా కుదుర్పఁగలము." [19]

ఈ యుత్తరమురాఁగానే నేనీ వివాహములను చెన్న పట్టణములోనే చేయ నిశ్చయించుకొనియున్నాను గనుక వెంటనే యిల్లు కుదుర్పవలసినదని ప్రత్యుత్తరమువ్రాసి, జూన్ నెల 2 వ తేదిని "పదుముగ్గురము నేటి ధూమ నౌకలో బైలుదేఱుచున్నాము. ఇల్లుకుదుర్పుఁడు" అని తంత్రీవార్తనంపి, మేము పదుముగ్గురమును నాటిసాయంకాలమున పోయెడి పొగయోడలోనే చెన్న పట్టణమునకు బైలుదేఱితిమి. దారిలో గాలివానవచ్చుటవలనను, ప్రతికూల వాయువులవలనను, 4 వ తేది ప్రాతఃకాలమున నాఱేడు గంటలకు చెన్నపురి రేవు చేరవలసిన ధూమనౌక మధ్యాహ్నము రెండు గంటలకు చేరెను. మా


కొఱ కోడలోని కెవ్వరును రాలేదు ; మేమే పడవ మాటాడుకొని యొడ్డున దిగితిమికాని యక్కడ సహితము మానిమిత్త మెవ్వరును వేచియుండలేదు. ఇల్లు కుదుర్చిరో లేదో, మేమేమి చేయవలెనో, ఎక్కడకు పోవలెనో, తెలిసినదికాదు. అందుచేత మావారినందఱిని అక్కడనే నిలిపి నేనొక్కఁడను దాని సమీపముననే యున్న చెంచలరావు పంతులుగారి కార్యస్థానమునకు పోయి మాయస్థను దెలిపితిని. ఆయన యద్భుతపడి రఘునాధరావుగారు తీరమున మీ నిమిత్తము మనుష్యుల నుంచలేదాయని యడిగి, జరిగినపనికి మిక్కిలి నొచ్చుకొని, క్షమార్పణముచేసి, రఘునాథరావుగారి యింటిప్రక్కనే యిల్లు కుదుర్పఁబడెనని చెప్పి, ఆయింటికి మమ్ముఁ గొనిపోవుటకయి యొక భటుని నిచ్చెను. మేము గుఱ్ఱపుబండ్లు మాటాడుకొని మైలాపురము చేరితిమికాని యిల్లు చేరునప్పటికి కాయింటికి బైట తాళము వేయఁబడి యుండినది. పంతులుగారు పంపిన భటుఁడుపోయి బీగము తీసికొనివచ్చి వీధి తలుపు తెఱచెను. ఆయిల్లు విశాలమైనదేకాని యింటివారిలో నెవ్వరో చెడ్డ నక్షత్రమందు మృతినొందుటనుబట్టి కొన్ని నెలలనుండి పాడుపఱుపఁబడి యుండిన దగుటచేత గబ్బిలముల పెంటతోను ఎలుకలు త్రవ్వినమంటి రాసులతోను వాసార్హముకాకుండెను. మేమంగడికి పంపి వస్తుసామగ్రిని తెప్పించుకొని యిల్లు బాగుచేసికొని వంటచేసికొని భోజనములు చేయునప్పటికి రాత్రి యెనిమిదిగంటలయినది. చెంచలరావు పంతులుగారు తమ కార్యస్థానమునుండి తిన్నగా మాయింటికేవచ్చి మాక్షేమసమాచారము విచారించి యరగంట సేపు నాతో మాటాడుచుఁ గూరుచుండి తమయింటికిఁబోయిరి. నా రాకవిని మఱునాటినుండి నన్ను చూచుటకయి మిత్రులు మొదలైనవారు రాఁదొడఁగిరి. వారు వివాహమెప్పుడని యాత్రముతో నడుగుచు రాఁగా నెనిమిదవ తేదిని జరగవచ్చునని చెప్పుచు వచ్చితిని. వచ్చిననాఁడు రఘునాథరావుగారి దర్శనము కాలేదు. మఱునాటి ప్రొద్దున వారి దర్శనము చేయుటకయి పోయితినిగాని వాకిటనున్న భటులు సమయముకాదని చెప్పినందున వెనుక మరల


వలసినవాఁడనయితిని. రెండవనాఁడు మరల చూడఁబోయినప్పుడు వారి భటులు, రాయలవారు జపములో నున్నారనియు చూచుటకు సమయము కాదనియు నన్ను లోపలికిపోకుండ వారించినందున నాఁడును వచ్చినదారినే మరల మాయింటికిఁబోయితిని. ఇట్లు రెండు దినములు వృధాకాలహరణ మయ్యెను. మూఁడవనాటి ప్రాతఃకాలమున ననఁగా 7 వ తేదిని నేనెప్పటియట్లు వారి దర్శనార్థమరుగఁగా కావలిభటులు వెనుకటి సాకులనే చెప్పిరికాని యీసారి తప్పక చూచి మాటాడి మఱిరావలెనని నిశ్చయించుకొని వచ్చితిని గనుక వారి మాటలను గణనచేయక తిన్నగా లోపలికిపోయి మేడయెక్కి వారు కూరుచుండు స్థలముచేరితిని. వారు నన్ను చూచి తమ పీఠమునుండిలేచి యెదురుగావచ్చి నన్నుఁగొనిపోయి యుచితాసనమునందుఁ గూరుచుండఁబెట్టి నా క్షేమము విచారించి గౌరవించిరి. వారు నారాకను తాము వింటిమనియు తొందరపనులచేత మూడు దినములనుండియు నన్ను చూడలేక పోయినందుకు చింతిల్లుచుంటిమనియు నుపచారవాక్యములు పలికి క్షమార్పణముచేసిరి. నే నామాటలయందు దృష్టియుంచక వచ్చిన కార్యవిషయమునందుకొని రేపటి దినము వివాహముజరపుటకు నేను నిశ్చయించుకొంటిననియు ఆహ్వానపత్రికలను వారిపేరఁబంపుట కిష్టపడనియెడల నాపేరనే పంపెదననియు, స్పష్టముగాఁ జెప్పితిని. వారించుక సేపాలోచించి కాకితమును కలమును గైకొని యాహ్వానపత్రికను వ్రాసి క్రింద తమ చేవ్రాలుచేసి నాకుచూపి నేనుండఁగానే దానిని ముద్రింపించుటకయి పొరుగున నున్న తమ ముద్రాయంత్రమునకుఁ బంపిరి. పోయినపని యగుటచేత నేనువారిని వీడ్కొని యింటికి వచ్చితిని. చెంచలరావు పంతులుగారు మాయింటికి మైలుదూరములోనుండినను ప్రతిదినమును మాయింటికివచ్చి నాతో మాటాడిపోవుచునే వచ్చిరి. రఘనాథరావుగారు ముద్రింపఁబడిన యాహ్వానపత్రికలను గొన్నిటిని నాయొద్దకుఁబంపిరి. వానిని చూడఁగా క్రింద వారిపేరు కానఁబడలేదు ; ఆపత్రిక వివాహమునకు విజయం చేయుటకు సమాజమువారిచే నెల్లవారును గోరఁబడుచున్నారని పేరులేకుండఁ


బ్రకటింపఁబడినది. పట్టణములోని వృత్తాంతపత్రికలకును మిత్రులకును తగు మనుష్యులకును వారే యాహ్వానపత్రికలను బంపిరి. పందిళ్లు వేయించుట, కదళీ స్తంభములను తోరణములను కట్టించుట, పెండ్లికిఁ గావలసిన సమస్తసంభారములను సమకూర్చుట, మొదలైనవాని నన్నిటిని రఘునాథరావుగారే తమ మనుష్యులచేత చేయించిరి ; వంటకుఁ గావలసిన పాత్రసామగ్రిని భోజన పదార్థములను పుష్కలముగా సమకూర్పించిరి. చెన్న పురి చేరినతరువాత పెండ్లికూఁతుల తల్లి తన రెండవకొమారితను ప్రకాశరావుగారికిచ్చి పెండ్లిచేయుట కంగీకరింపనందున నొక్క వివాహము మాత్రమే చెన్న పట్టణములో జరగినది. వితంతువివాహము జరగుటకు చెన్న పట్టణములో నిదియే ప్రథమమగుటచేతను, ముందుగానే వార్తాపత్రికలలో నెల్లఁ బ్రకటింపఁబడి యుండుటచేతను, ఈవివాహమునకు జను లపరిమితముగా వేడుక చూడవచ్చిరి. పట్టణములోని పెద్ద మనుష్యులు సహిత మెవ్వరు నెదురుచూడనంత విశేషముగా దయచేసి, యమితోత్సాహమును గనఁబఱిచిరి ; అనేకులు వధూవరులకు కట్నములు చదివించిరి. లగ్న సమయమున కట్నములక్రిందవచ్చినవి పదునేడుబట్టలు. నాటిరాత్రి జయప్రదముగాను ప్రోత్సాహకరముగాను లగ్నము నడచినందుకు సంతోషించి రఘునాథరావుగారు వృద్ధు లయినను మరల యౌవనము పొడచూపిన వారివలె నపరిమితోత్సాహముతో సందడించుచు నాలుగుదినములును శుభకార్యము నత్యంత జయప్రదముగా జరపించిరి. మహా వైభవముతో దంపతుల నొక రాత్రి యూరేగించిరి ; ఒక దినము వధూవరులను కచ్ఛాలేశ్వరుని యాలయమునకుఁ గొనిపోయి వారిచేత నభిషేకము చేయించిరి. కావలసిన యేర్పాటులన్నియు దివ్యముగా చేయఁబడినందున కెల్ల వారును నానందభరితులైరి. భోజనములకు సహితము విద్యార్థులనేకులును సంస్కార పక్షావలంబులైన యితరులు కొందఱును వచ్చిరికాని రఘునాథరావుగారు మొదలైన ప్రముఖు లెవ్వరును రాలేదు. వంటచేయుటకయి మాధ్వదంపతులనే తీసికొనివచ్చితిని గాన భోజనమునకు రావచ్చునని రఘునాథరావుగారితో విన్న వించితినిగాని


వారు తాము తమబంధువుల యిండ్లసహితము భోజనములు చేయుచుండ లేదనియు భోజనములు చేసినంతమాత్రముచేత కలిగెడు ప్రయోజన మేదియు లేదనియు సెలవిచ్చి నాప్రార్థనను మన్నింపరైరి. దీనిని పత్రికలలోఁ బ్రకటింపవలసినదని యుత్సాహవంతులైన సంస్కారోత్సుక తరుణవయోవంతులు నన్ను బలవంతపెట్టిరిగాని వారికోరికకు నేనంగీకరింప లేదు. ఈ వివాహమునకు చెన్న పురిలోనైన రు 850 రూపాయలునుగాక వేయింటిలో మిగిలిన 150 ర్య్య్పాయలును రఘునాధరావుగారు నాకిచ్చిరి. ఈప్రకారముగా 1883 వ సంవత్సరము జూన్ నెల 8 వ తేది నారంభింపఁబడిన యీవివాహమహోత్సవము పండ్రెండవతేదితో సంతోషకరముగా సమాప్తమయినది. వివాహమునకు దయచేసిన రావుబహద్దరు ఆర్కాటు నారాయణస్వామి మొదల్యారిగారు బెంగుళూరుకు రావలసినదని నన్నాహ్వానము చేయఁగా నేనొక్కఁడను వెళ్లి దండులో నుపాధ్యాయులుగానున్న గోపాలస్వామయ్యగారింట దిగి దండులో నొకటియు పట్టణములోనొకటియు వితంతువివాహమునుగూర్చి రెండుపన్యాసములు చేసితిని. అప్పుడు బెంగుళూరిలో నుండిన యాఱువేల నియోగులందఱును నొకచోటఁగూడి నన్నుఁబిలుచుకొనిపోయి చందన తాంబూల పుష్ప మాలాదులతో నన్ను సత్కరించిరి. నేనక్కడ రెండుదినములుండి మిత్రులను వీడ్కొని మరల చెన్న పట్టణమునకువచ్చి మావారల నందఱిని వెంటఁబెట్టుకొని ధూమనౌక మీఁదపోయి స్వస్థానమును సురక్షితముగాఁ జేరితిని. ఈవఱకు జరగిన వివాహము లన్నిటిలో దీనికే యధిక వ్యయమయినది. చెన్న పట్టణములో వ్యయపడిన రు 850 లుగాక రాకపోకలకు ప్రయాణముక్రింద రు 331 లయినవి ; తరువాత పెండ్లికొమారితకు మాన్యము విడిపించియిచ్చుట కిన్నూఱు రూపాయలయినవి ; గుంటూరికావలనున్న వల్లూరునకు వెళ్లి యీసంబంధమును కుదిర్చిన యామెకు రు 40 లిచ్చితిమి ; పెండ్లికొమారితతల్లి రెండుసారులు వల్లూరు వెళ్లి వచ్చినందునకును పెండ్లికూతులను తెచ్చినందునకును రు 40 లయినవి ; పెండ్లి


కొమారితకు పెట్టిననగల కిన్నూఱు రూపాయలయినవి. అన్నియుఁగలిసి యీ వివాహమునకు మొత్తముమీఁద 1671 లు కర్చుపడినవి.

మేము రాజమహేంద్రవరములో చేరిన రెండు మాసములలోపల ననఁగా 1883 వ సం|| ఆగష్టు నెల 13 వ తేదిని రెండవకోమటి వివాహము జరగినది. ఈవివాహము చేసికొన్న యతఁడు లక్ష్మీనరసింహముగారి కాశ్రితుఁడయి యాయన సభ(Court)లో బత్తెపు బంట్రౌతు (Batta peon)గా నుండుట చేత, ఆయనకోరిక ననుసరించియే యీతనికీవివాహము చేయఁబడినది. ఇది తొమ్మిదవ వివాహవము. మఱి నాలుగునెలలలోపల ననఁగా 1884 వ సంవత్సరము జనేవరు నెల 5 వ తేదిని నల్లగొండ కోదండరామయ్యగారిదయిన పదవ వివాహము జరగినది. ఈకోదండరామయ్యగారును, నాలవ వివాహచేసికొన్న పులవర్తి శేషయ్యగారును, దేశాభిమానమును ధైర్యోత్సాహములను పరోపకారచింతయుఁ గలవారయి నాకు తోడుపడిన విద్యార్థులలోనివారని నేను వీరినొక్కసారికంటె నెక్కువగా శ్లాఘించియుంటినిగదా ! పులవర్త శేషయ్యగారు వివాహమయిన సంవత్సరమునందే ప్రవేశపరీక్షయందు తేఱుటచేత నే నాతనికి నెలకు పండ్రెండేసి రూపాయలచొప్పున జీతమిచ్చుచు బట్టలు పుస్తకములు మొదలైనవి వేఱుగా నిచ్చుచు నిప్పటికి సంవత్సరమునుండి ప్రథమ శాస్త్ర పరీక్షకు చదివించుచుంటిని. 1883 వ సంవత్సరము డిసెంబరునెల యందొక వృద్ధవైదిక వితంతువు నావద్దకు వచ్చి తనసంరక్షణములో పదుమూడేండ్లప్రాయముగల వితంతువైన మనుమరాలున్నదనియు, తల్లిదండ్రులు లేని యాచిన్నదానికి వివాహముచేయుటకయి తనకభిలాషయున్నదనియు, వివాహానంతతరమున తానుగూడ మనుమరాలియొద్దనే యుండెదననియు, నాతోఁజెప్పెను. నేను పులవర్తి శేషయ్యగారిని వెంటనిచ్చి ప్రయాణవ్యయములకు కొంత సొమ్మిచ్చి యామెతోఁగూడ తాటిపాకకు పంపితిని. పిల్లను ముత్తవతల్లిని రాత్రివేళ నొరులెఱుఁగకుండ తీసికొని రావలసి వచ్చినందునను ఇతరులకు వెల్లడికాకుండ వారివస్తువులను మోచుకొనివచ్చుటకై యాకుగ్రామ


ములో కూలివానిని సంపాదించుట కష్టమైనందునను, లేశమైనను సంశయింపక దురభిమానమునువిడిచి కార్యసాధనమే ముఖ్యప్రయోజనముగా చూచుకొని తానే కావడిని కొన్ని క్రోసులదూరము మోచుకొనివచ్చి యీ శేషయ్యగారే వారిని మాయింటికిఁదెచ్చి యొప్పగించెను. ఇప్పుడు కోదండరామయ్యగారికిచ్చి వివాహము చేయఁబడినది యీచిన్నదే. వరుఁడైన కోదండరామయ్య ప్రథమశాఖవాఁడు ; వధువు వైదికశాఖాసంభవ. శాఖాభేదము విచారింపకచేసిన వివాహములలో నిదియే మొదటిది. ఇంతవఱకును జరగిన వివాహములన్నియు నియోగులలో నియోగులకును, మాధ్వులలో మాధ్వులకును, వైదికులలో వైదికులకును, కోమట్లోలో కోమట్లకును, శాఖాభేద మతిక్రమింపక జరుపఁబడుచువచ్చినవి. ప్రథమవివాహము చేసికొన్న దంపతుల కొక్కరికిఁ దక్కతక్కిన వారికందఱికి కాపురములుండుటకు గృహము లీయఁబడుచు వచ్చినవి. మొట్టమొదట నిన్నీసుపేటలో కొనబడిన యింటిలో దక్షిణభాగము రెండవ వివాహముచేసికొన్న రాచర్ల రామచంద్రరావుగారికిని, ఉత్తరభాగము నాలవ వివాహముచేసికొన్న పులవర్తి శేషయ్యగారికిని, ఇయ్యఁబడినవి. మూఁడవ వివాహముచేసికొన్న తాడూరి రామారావుగారికి సూర్యరావుపేటలో నొక గృహముకట్టించి రామకృష్ణయ్యగా రిచ్చిరి. అయిదవ వివాహముచేసికొన్న మంజులూరి గోపాలకృష్ణయ్యగారికి శేషయ్యగారియింటిప్రక్కను క్రొత్తగా కట్టింపఁబడిన యిల్లియ్యఁబడినది. ఇన్నీసుపేటలో మంజులూరి వారివద్ద స్థలముకొని కట్టించిన యింటిలోని దక్షిణభాగ మెనిమిదవ వివాహచేసికొన్న తణుకు చెలపతిరావుగారి కియ్యఁబడినది ; ఉత్తరభాగ మాతని మఱదలికి వివాహమైనప్పుడిచ్చుటకు నిలువయుంచఁబడినది. మా యింటిసమీపమున కొనఁబడిన పేరిచయనులుగారి యింటిలోని యుత్తరభాగ మాఱవ వివాహముచేసికొన్న చేబోలు వెంకయ్యగారికిని, దక్షిణభాగము పదవ వివాహముచేసికొన్న నల్లగొండ కోదండరామయ్యగారికిని, ఇయ్యఁబడినవి. ఏడవ వివాహము చేసికొన్న బోడా శ్రీరాములుగారికి రామకృష్ణయ్యగారు


కాకినాడలోని తమయిండ్లలో నొకదానినినిచ్చిరి. తొమ్మిదవ వివాహచేసికొన్న సలాది రామయ్యగారికి రామకృష్ణయ్యగారు కాకినాడలో నొకతాటాకుల యిల్లిచ్చిరి. కోదండరామయ్యగారప్పు డిరువదిరూపాయల జీతముగల యుపాధ్యాయ పదమునందుండి నందున సమాజమునుండి ధనసహాయ్యమును కోర నక్కఱలేనిస్థితిలోనుండెను. అయినను వివాహమయిన నెలదినముల కాయన క్రిందితరగతిలో చదవుకొనుచున్న తనపెద్దతమ్ముని నావద్దకుఁ దీసికొనివచ్చి విద్యనిమిత్తము సాయము చేయవలెనని కోరెను. నేను ఫిబ్రవరు నెలలో నాలుగురూపాయ లిచ్చితిని ; అతఁడు మరల మార్చినెలలో వచ్చి యడుగఁగా వెనుకటివలెనే నాలుగురూపాయ లిచ్చితిని ; మూడవనెలలోవచ్చి నాలుగు రూపాయలు చాలుచుండలేదనియు నెక్కువ యియ్యవలసినదనియుఁ గోరెను. అప్పుడు నేనేప్రిల్ నెల కయిదురూపాయలిచ్చి, యాయనయెదుటనే పుస్తకములో పద్దువ్రాసితిని. అదిచూచి యాయన నాతమ్మునికిచ్చినట్టు వ్రాయక నాకిచ్చు చున్నట్టు వ్రాయుచున్నా రేమని యడిగెను. మీచేతికిచ్చుచున్నాను గనుక నేనట్లు వ్రాయుచున్నాను. మీతమ్మున కెందునకనియిచ్చినట్టు వ్రాయను ? అని యడిగితిని. మీరు వివాహముచేసికోనివారికి వారి కియ్యలేదా వీరికియ్య లేదాయని కొన్ని పేరులుచెప్పెను. అప్పుడు వివాహనిధిలేదుగనుక నాసొంతములో నుండి యిచ్చుచుంటిని. ఇప్పుడట్లిచ్చుటకు వీలులేదని బదులు చెప్పితిని. అట్లయిన నిప్పుడు మంగళగిరి కృష్ణమూర్తికేల యిచ్చుచున్నారని యాయన యడిగెను. చెలపతిరావు మఱదలిని వివాహముచేసికొనట కతడొప్పుకొన్నందునను, ప్రవేశపరీక్షతరగతిలో చదువుకొను చున్నందునను, అతనికిచ్చుచున్నానని బదులుచెప్పితిని. మీయిష్టము వచ్చినవారికిచ్చి మీ యిష్టమువచ్చినట్లు చెప్పుదురని యాయన గొణుగుకొనుచు వెడలి పోయెను.

అతి కష్టపడుచుండుటవలనను, స్వాభావిక శరీరదౌర్బల్యమువలనను, నాదేహస్థితి కొంతచెడి యప్పుడు విశ్రాంతిని కోరునదిగానుండెను. అందుచేత నేను నరసాపురమునకుఁ బోవఁదలఁచుకొని యక్కడ డిస్ట్రిక్టు మునసబుగా


నుండిన కొమ్ము రామలింగశాస్త్రి గారికి వ్రాసి యిల్లొకటి యద్దెకుపుచ్చుకొని, మాపాఠశాల కేప్రిల్ నెల 20 వ తేదినుండి వేసవికాలపు సెలవు లియ్యఁగానే యియ్యవలసిన వారికందఱికిని మెయి నెల జీతములు సహితము ముందుగానే యిచ్చివేసి నాభార్యతోను మేము పెంచుచుండిన శ్రీరాములుగారి శిశువుతోను బైలుదేఱి నరసాపురము వెళ్లితిని. గోగులపాటి శ్రీరాములుగారు వితంతు వివాహము చేసికొనునప్పటికి ప్రధమకళత్రమువలన నాలుగుమాసముల పురుష శిశువుండెను. నాయందలిగౌరవముచేత తండ్రి యాబాలునకు నా పేరెపెట్టెను. ఆశిశువును మాయొద్దనుంచుకొని పెంచి పట్టపరీక్షయందు కృతార్థుఁడగు వఱకును నే నే విద్య చెప్పించితిని. నాదెప్పుడును పనిలేక యూరకకూరుచుండెడు స్వభావము గాదు కనుక నరసాపురములో నున్నప్పుడు సహితము వితంతు వివాహపక్షమున పనిచేయుచు నక్కడి సెంట్రల్ హైస్కూలులో వితంతు వివాహమునుగూర్చి యొక యుపన్యాసమువ్రాసి మెయి నెల 28 వ తేదిని చదివితిని. నేను నరసాపురము వెళ్లఁగానే బందరునుండి రాజమహేంద్రవరము వెళ్లి తిరిగివచ్చిన యీక్రింది యుత్తరము నాకందెను. -

"ఆంతరంగికము.

మశూలా.

16 వ ఏప్రిల్ 84.

నాప్రియమైన అయ్యా !

ఏవిషయమునుగూర్చియైనను మీపేర వ్రాయుటకు నేను కలముపట్టిన దిదియే మొదటిసారియైనను మనయసహాయలైనవితంతువులకు దుఃఖమోచనము చేయుటకయి మీరు పూనినపదమునం దాదరము కలవాఁడనన్న చిన్న హేతువుచేత మిమ్ము "ప్రియమైన" యను విశేషణముతో సంబోధించెడు స్వాతంత్ర్యమును వహించుచున్నాను.

నాయాదరము నింతకుముందే తెలుపనందుకు మీరు నన్ను క్షమింతురని కోరుచున్నాను. ఈపట్టణములో నేదైన వితంతువివాహము జరపఁ


బడెడు పక్షమున, వివాహము చేసికొన్నవారికి ఘనమైన ధనసాహాయ్యముతో తోడుపడెడు స్థితియందు మూరున్నారా ? ఉన్న పక్షమున నెంతవఱకు ? పయి ప్రశ్న కుత్తరమును నాకు తెలిపినయెడల, ఈప్రశ్నను నేను మిమ్మేల యడుగ వలసెనో యందును గూర్చిన యధికవివరములను మీకుఁ దెలిపెదను. నేనీ మండలములోని మండలన్యాయసభ న్యాయవాదిని.

నాపేరు

చెరువు - సుబ్రహ్మణ్యశాస్త్రి,

డిస్ట్రిక్టుకోర్టు వకీలు, మచిలీపట్టణము.

నాయొద్దనుండి ముందుగా నంగీకారమును బడయువఱకును దయచేసి మీరీలేఖలోని సంగతుల నెవ్వరికిని దెలుపకుఁడు. మీరు నాస్థితి నెఱుఁగ కోరెడు పక్షమున రాజమండ్రీ డిస్ట్రిక్టుమునసబును అక్కడ వకీలుగానున్న శిష్టు జగన్నాధశాస్త్రిగారిని అంతకంటె నధికముగాక నేనెవరో తెలిసికొనుటకు మాత్ర మడుగవచ్చును. ఈయుత్తరములోని సంగతు లితరులకు తెలియఁజేయకుండ నాపరిచితుఁడని మీరు తలఁచిన యేమనుష్యునివలన నైనను నన్ను గూర్చి యేవృత్తాంతమునైనను మీరు పోగుచేయుటకు నాకాక్షేపము లేదు. ఇప్పుడు పడవల సంచారముండి యుండినపక్షమున, స్వయముగా మాటాడుటకు నేను మీవద్దకు వచ్చి యుందును. అది లేకపోయినందున, నేను మీతో లేఖాముఖమున నుత్తరములు జరుపవలసినవాఁడనయినాను." [20] వివాహవ్యయములను భరించి వధువున కిన్నూఱురూపాయలు నగలు పెట్టెదమనియు, దంపతులు కాపుర ముండుటకయి మున్నూఱురూపాయల వెలచేసెడి యింటినిగాని యారొక్కమునుగాని యిచ్చెదమనియు నేను వ్రాసితిని. ఈప్రకారముగా కొన్ని యుత్తరప్రత్యుత్తరములు జరగినమీఁదట తాను వితంతువివాహమును చేసికొనుటకు సంసిద్ధుఁడనయి యున్నాఁడననియు తన బంధువురాలయి ధనికురాలయి యున్న యొకతరుణవితంతువును వివాహమాడుటకు తామేర్పాటు చేసికొంటిమనియు, తనకు ధనసాయాయ్య మక్క


ఱలేదనియు, వివాహముచేసికొనుటకు సంసిద్ధులయియున్న మఱియొక వధూవరులకు ధనసాహాయ్యము కావలసియున్న దనియు, ఆయన వ్రాసెను. అందుమీఁదట మచిలీపట్టణములో నొకటిరెండు వివాహములు జరగు సూచనలు కానఁబడుచున్నవనియు, అక్కడివారు నన్నాహ్వానముచేసిరనియు, నేనచ్చటికి వెళ్లవలసినదని మీయభిప్రాయమేమో తెలుపవలసినదనియు, ఆలోచన యడుగుచు నేను పైడా రామకృష్ణయ్యగారికి వ్రాసితిని. ఆయన నా లేఖకు ప్రత్యుత్తరముగా 1884 వ సం|| మే నెల 20 వ తేదిని కాకినాడనుండి నా లిట్లు వ్రాసిరి.

"కాకినాడ, 20-5-84.

నాప్రియమిత్రుఁడా !

ఆరొగ్యము నిమిత్తము మీరు వెళ్లియుండిన నరసాపురమునుండి వ్రాయఁబడిన మీయుత్తరము నందుకొంటిని. మీరు కొంతమేలుగా నున్నారని నమ్ముచున్నాను. ఒకటి రెండు వివాహములనిమిత్తము మీరు కోరఁబడి నందున మీరు మశూలాకు వెళ్లవచ్చు నేమో యాలోచన చెప్పవలసినదని మీరు నన్నడిగియున్నారు. అక్కడ పక్షవిద్వేషము విస్తారముగా నున్నందును అక్కడి పరార్థపరురులు కష్టములపాలు చేయఁ బడుదు రని భయపడుచున్నాను. సొమ్ముతో సహితము తగినంత సాయము చేయువారు మీకక్కడ నెవ్వరునులేరు. ఇటువంటి స్థితులనుబట్టి మీయారోగ్యము వచ్చుట కనుకూలముగా లేదని మీరు వారికి వ్రాసి తెలుపవలెను. వారు తమకు చేతనైనది శక్తికొలఁదిని తామే చేసికొందురు. వేఁడి భయంకరముగానుండి నాకు చెఱుపుచేయుచున్నది. నేను నిర్వేదపడుచున్నట్టున్నాను. కడచిన రెండుమూడు దినములనుండి యది 110 డిగ్రీలున్నది. కాఁబట్టి యేమి చేయవలసినది మీరెఱుఁగుదురు. నామట్టుకు నేను మీయారోగ్యమునుబట్టి మీరు వెళ్లవలసినది.


కాదని తలఁచుచున్నాను. మీచర్య యేమో దయచేసినాకు తెలుపఁడు. మీహితుఁడు - పీ. రామకృష్ణయ్య.[21]

ఈప్రకారముగా మిత్రులుపోవలదని హితబోధచేయుచుండినను, వ్యాధొ బాధచేత దుర్బల శరీరుఁడనై యుండియున్నను, ఎండలు దుస్సహములయి యతితీక్ష్ణముగా నుండినను, సంస్కారబీజము నితర స్థలములయందునాటుట కవకాశము కలిగినప్పుడు కృతవ్యవసాయుఁడనయి ఫలము పొంద నపేక్షింపకయుపేక్షించుట ధర్మముకాదని భావించి, రాజమహేంద్రవరమువ్రాసి పురోహితుని రప్పించి, వచ్చుచున్నాని సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి వ్రాసి, బందరుపురమునందలి మిత్రబృందసాహాయ్యముచేత నేను వసించుట కనుకూలమైన యిల్లు కుదుర్చుకొని, మండువేసవికాలములో నిసుక దారిని మోటుబండ్లమీఁద కుటుంబ సహితముగా బైలుదేఱి జూన్‌నెల ప్రారంభమున బందరునకు ప్రయాణమైతిని. త్రోవపొడుగునను జనులు నాయెడల నేననుకొన్నట్లు ద్వేష


మునుజూపక యనుకూలురుగానే కనఁబడుచువచ్చిరి. మేము నరసాపురము బైలుదేఱి మధ్యాహ్న మొక యూరిసత్రముచేరునప్పటికి మాకంటె ముందుగా బండ్లుదిగి వంటచేసికొన్న బ్రాహ్మణకుటుంబమువారు మాచిన్న వాని నన్నము పెట్టుటకయి తీసికొనఁబోవవచ్చిరి. నేను మాస్థితిని దెలుపఁగోరి మేమెవ్వరమో యెఱుఁగుదురాయని యడిగితిని. "ఎఱిఁగియే పిలువవచ్చితిమి ; మేమును మీకంటె కొంచెము ముందుగా బైలుదేఱి నరసాపురమునుండియే వచ్చుచున్నాము" అని వారు బదులుచెప్పిరి. ఆరాత్రి మేము గొల్లపాలెము చేరఁగా పలువురు నన్ను చూడవచ్చుటయేకాక యొక పెండ్లివారు మమ్ము వంటచేసికోనియ్యక మాకు పిండివంటలతో సమస్త భోజనపదార్థములను బ్రాహ్మణులచేత పళ్లెములతోఁబంపిరి. త్రోవలో నెట్లుండినను బందరుపురము మేము చేరునప్పటికి నారాకయంతకుముందే తెలియుటచేత మహావాయువుచేత కలఁత నొందింపఁబడిన మహాసముద్రమువలె పౌరజనవారిధి యంతయు కలఁగి యల్లకల్లోలముగా నుండెను. తనపట్టణములో గతభర్తృకాపాణిగ్రహణమునకు తాను ప్రథముఁడనుగా నుండెదనని నాపేరవ్రాసిన బ్రాహ్మణధీరుఁ డాసంక్షోభమునకు సంత్రస్తుఁడయి బాలవితంతు పరిణయముమాట యటుండఁగా నేను వెదకుకొనుచు తమయింటికిఁబోయినప్పు డీవిషయమయి నాతో బహిరంగముగా మాటాడుటకే భయపడి నన్నొంటిగా చాటునకుఁ గొనిపోయి తానప్పుడు రోగపీడితుఁడయి యుండుటచేత వివాహప్రయత్న మప్పటికి విడిచితిననియు తాను స్వస్థపడి పునఃప్రయత్నము చేసినప్పుడు నాపేర వ్రాసెదననియుఁ జెప్పెను. నేనంతటితో నిరుత్సాహుఁడనయి యాశాభంగము చెందక పట్టణమునకు వచ్చినందుకు కొంత పనిచేసి పోవలెనని వివాహ విషయమునఁ గొన్ని యుపన్యాసముల నిచ్చుటకు నిశ్చయించితిని. నా మొదటి యుపన్యాసమును నేను బసచేసిన శ్రీవల్లూరు జమీందారుగారి విశాలసభాభవనమునందే చేసితిని. అది యచ్చటి నాప్రథమోపన్యాసమగుటచేత దానిని వినవలెనన్న కుతూహలముచేతను, నామొగ మెట్లుండునో చూడవలెనన్న యభిలాషచేతను.


మఱికొన్ని హేతువులచేతను, ఉపన్యాస సమయమునకు ముందే వందలకొలఁది జనులు వచ్చుటచేత సభాభవనమంతయు మనుష్యులతో క్రిక్కిఱిసిపోయినది. సభాపతులైన నిష్ఠల నరసయ్యగారు మొదలైన బ్రాహ్మణులలోని ప్రసిద్ధపురుషులు కొందఱు తమ శిష్యబృందముతోఁ గూడ వేంచేసి, నాయుపన్యాసమును సాగనీయక చప్పటలుగొట్టి యల్లరిచేయ నిశ్చయించుకొనివచ్చి యున్నారని నామిత్రులుకొందఱు నాకామహాపురుషులను జూపిరి. అటువంటి సభలో శాస్త్రప్రసంగమును చేయఁబూనుట యవివేకమనియెంచి నేనట్టిపనికి పూనక క్రొత్తగా నరసాపురములో నుపన్యసించి వచ్చుటచేత నందలియంశములనే విశేషముగాఁగొని నిర్బంధవైధవ్యమువలనఁ గలుగుచున్న వివిధానర్థములనుగూర్చియు తత్సాంకర్యనివారణ సాధనములనుగూర్చియు వారు కనియు వినియు నున్న దృష్టాంతములతో తలవంచుకొని నాస్వభావధోరణిని రెండు గంటలసే పుపన్యసించి వారి హృదయములకు తాఁకునట్లుగా ననన్యగతికలైన యనాధకాంతావనపుణ్యకార్యమునందు దీక్ష వహింపవలసినదని ప్రార్థించితిని. మొదట నూహించినట్లెవ్వరును నల్లరిచేయక యెల్లవారును కడవఱకును, నాయుపన్యాసమును నిశ్శబ్దముగా వినిరి. జనసమ్మర్దముచేతను, ఆతప తాపముచేతను, నాదేహమంతయు చెమర్చి యాయాసము కలుగఁగా క్రొత్తగాలిలో తిరిగి బడలిక తీర్చుకొనుటకయి నేను మేడమీఁదికెక్కి వీధివైపున పచారు చేయుచుంటిని. అల్లరిచేయఁ దలఁచుకొనివచ్చి నారాన్న బ్రహ్మణోత్తములు తమలో తామావిషయమయియే మాటాడుకొనుచు నడచిపోవుచు నాకంటఁబడిరి. వారిలోనొకరు లోపలినుండి వీధిలోనికి మెట్లు దిగుచు "ఈ యుపన్యాస మెట్లున్నదిరా ?" అని రెండవవారినడిగెను. "ఇటువంటిపాడు సభలకు మనము రాకూడదు. ఇటువంటిమాటలు వినుచు వచ్చినయెడల మన బుద్ధికూడ చెడిపోవును" అని యాయన బదులుచెప్పెను. నాఁడు భగవదనుగ్రహమువలన పామరులవలని పరాభవమునుండి తప్పించుకొని బయలఁబడఁ గాంచితిని. డిప్యూటీకలెక్టరుపని చేసి యుపకారవేతనమునొంది కర్మిష్ఠులయి యుండిన వడ్లమన్నాటి వేంకటాచలము పంతులుగా రాపట్టణములో వితంతు వివాహ ప్రతిపక్షులకు ప్రధాననాయకులు. వారు బృందావనపురములో మిక్కిలి పేరుపొంది యెల్లరచే గౌరవింపఁబడుచుండిన యొక గొప్ప పండితునిచేత నావితంతు వివాహవిషయక విజ్ఞాపనములమీఁద నొక ఖండన గ్రంథమును వ్రాయించిరి. ఆఖండనగ్రంథములోని యుక్తులకు ప్రతియుక్తులు చెప్పుటగాని, చూపిన ప్రమాణములను ఖండించుటగాని, చేసినసిద్ధాంతములను పూర్వపక్షముచేయుటగాని, సాథ్యముకాదని వారు నమ్మియుండిరి. నేను వేంకటాచలము పంతులుగారి దర్శనార్థమయి యొకనాటి ప్రాతఃకాలమున వారి యింటికి వెళ్ళినప్పుడు వారు లోపల జపము చేసికొనుచుండి నన్ను లోపలికి రప్పించుకొని తమ సరసను పీటమీఁద కూర్చుండఁబెట్టి నాతో చాలసేపు మాటాడిరి. ఆసంభాషణలో వారు శాస్త్రప్రమాణరహితములైన పొడిమాటలతో ప్రయోజనము లేదనియు, శాస్త్రప్రమాణ బద్ధులైన హిందువులకు శాస్త్రార్థ విచారమావశ్యకమనియు, ఆవిషయమయి యొక పండిత సభ జరగుట కర్తవ్య మనియు, సెలవిచ్చిరి. నేనును వారితో నేకీభవించి, పామరజన బహుళమైన సభలో శాస్త్ర చర్చచేయుట నిష్ప్రయోజనమనియు, పండితులును గుణగ్రహణ పారీణులైన పెద్దమనుష్యులును మాత్రము చేరిన చిన్న సభలో శాస్త్రవిషయక వాద ప్రతివాదములు జరపుటయే లాభకరమనియుఁ, జెప్పితిని. వా రందున కొప్పుకొని మఱునాటి మధ్యాహ్నమున తమ చావడిలోనే సభ జరపుట కేర్పఱిచి, ఉభయపక్షములలోను జేరిన పెద్ద మనుష్యులకుఁ గొందఱికిని విద్వాంసులకుఁ గొందఱికిని, ఆహ్వానములు పంపిరి. నేనును యుక్తసమయమునఁబోయి సభలోఁ గూరుచుంటిని ; నాగ్రంథముపై ఖండన గ్రంథముచేసిన శాస్త్రులవారు పండితపక్షమున తత్ప్రతినిధిగా నాతో వాదము చేయుటకయి నాయెదుటను గూరుచుండిరి. ధర్మార్థ విచారమునకు ప్రమాణగ్రంథములేవో, వాని గౌరవతారతమ్య మెట్టిదో, అర్థనిర్ణయమెట్లు


చేయవలెనో, అటువంటి ప్రాథమికనిబంధనములనుగూర్చి శాస్త్రులవారును నేనును నేకాభిప్రాయూమునకు వచ్చినపిమ్మట మేము శాస్త్రచర్చ కుపక్రమించితిమి. కలియుగమునకు పరాశారస్మృతి యొక్కటియే పరమప్రమాణమయి నందున తద్విరుద్ధ స్మృతులన్నియు నప్రమాణములనియు, పరాశర సంహితలోని "నష్టేమృతే" యను శ్లోకముయొక్క యర్థనిర్ణయ మొక్కటియే ప్రథమకర్తవ్యమనియు, నేను చెప్పఁగా శాస్త్రులవారును నాతో నేకీభవించి ఆశ్లోకమునకర్థము చెప్ప నారంభించిరి. వారు చెప్పఁ బూనిన యర్థము ప్రథమమునఁ జేసికొన్న నియమములకు విరుద్ధమనియు, తన స్మృతిలో పరాశరుఁడు చెప్పిన నిర్వచన మీయర్థమును బాధించుననియు, నేను వారు చేసెడి యర్థములను పూర్వపక్షముచేయ నారంభించితిని. ఇట్లు పావు గంటసేపు శాస్త్రార్థవిచారము నడచినపిమ్మట శాస్త్రులవారు క్షణకాల మూరకుండి సభవారి వంకఁదిరిగి, "అయ్యా! వీరు తమ జీవితము నిందులో ధారపోసి యీవిషయమయి విశేషకృషి చేసినారు. నాకు కొంతకాలము గడువిచ్చినఁగాని వీరితో వాదము చేయఁజాలను," అని యూరకుండిరి. ఆకాలమునం దనేక పండితులతో ననేకస్థలములయం దీవిషయమయి నేను వాదములు చేసితినిగాని తాము యుక్తి చెప్పలేక పోయినప్పుడు తమయశక్తి నొప్పుకొని సత్యమునందాదరము చూపినవారని వీరి నొక్కరిని దక్క మఱియెవ్వరిని నేను చూడలేదు. సాధారణముగా పండితులు వాదములో తాము పరాజయమునొందినను తమయోటమి నొప్పుకొనక "శేషంకోపేన పూరయేత్" అను న్యాయము నవలంబించి క్రిందఁబడినను తామే గెలిచితిమని కేకలువేయుదురు. ఈశాస్త్రి గారి పేరిప్పుడే నాకు స్మరణకు రాలేదు. సూర్యనారాయణశాస్త్రిగారు కాఁబోలును ! ఈసభానంతరమున వేంకటాచలము పంతులుగారు తాంబూలాది సత్కారముచేసి నన్ను వీడుకొల్పిరి. అక్కడి ప్రముఖులవద్ద సెలవుగైకొని సకుటుంబముగా నేను రాజమహేంద్రవరమునకుఁ బోయితిని. స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమానస్థితులను గూర్చి 1887 వ సంవత్సరము జనేవరు నెలలో సమాజముయొక్క సంవత్సర సభయందు నేను చదివినదానిలో "1884 వ సంవత్సరము మెయి నెలలో నేను నరసాపురము వెళ్లియుండినప్పుడు నేనెప్పుడు నెదురుచూడని తావునుండి నాకొకయుత్తరము వచ్చి నాకాశ్చర్యము పుట్టించినది. నేనీపనిమీఁద నరసాపురమునుండి బందరుపోయి తిరిగి రాఁగానే జూన్ నెలలో సభచేసి యిప్పుడున్న రీతి సమాజ మేర్పఱుచుటకుఁ బ్రయత్నించినాను. ఇప్పుడున్న రీతిగా మన యీసమాజ మప్పుడేర్పడినదే." అని చెప్పితిని. ఇందుఁ జెప్పఁబడిన యుత్తరము వ్రాసినతఁడు పులవర్తి శేషయ్యగారు. నాకాశ్చర్యము పుట్టించుటకు కారణము నేను నరసాపురమునకు బైలుదేఱు దినమువఱకును నా యెడల వినయభక్తులు కనఁబఱుచుచు నాకుపరమభృత్యుఁడుగానుండి యాదినమున సహితమువచ్చి పయినెల జీతమును పాఠశాల జీతమును పుచ్చుకొని నన్నూరికి సాగనంపినతఁడు నేను లేనిసమయములో నాకస్మికముగా మాఱి నేను మొదటపెక్కు సామాజికులతో నిండియుండిన వితంతువివాహ సమాజములో నాసామార్థ్యమువలన సామాజికులు లేకుండఁజేసితిననియు, నేనేదారిని బోవుచున్నానో యెవ్వరికిని దెలియకుండ పాటుపడుచుంటిననియు, మిధ్యా దోషా రోపణములుచేయుచు నుత్తరమువ్రాయుట. ఆయుత్తరములోని కడపటి ప్రార్థనము తమకు నిరంకుశప్రభుత్వముగాక ప్రతినిధిప్రభుత్వము కావలెననుట. అతఁడు బుద్ధిహీనుఁడయి దుష్టులప్రోత్సాహముచేత ననాలోచితముగా నిట్లు వ్రాసినందుకు చింతనొందుచున్నాననియు, నేనుజేసినపని యెల్లరకును తెల్లమే గాన నిఁకముందేర్పడు సమాజములోఁ జేరి మీరు నాకంటె నెక్కువ పనిచేయుచుండఁగా చూచి సంతోషించెదననియు, నేను రాజమహేంద్రవరమునకు తిరిగి రాఁగానే సమాజము నేర్పఱిచి వివాహవ్యవహారము వారి కొప్పగించెదననియు, బదులువ్రాసి బందరుకుపోతిని. బందరునుండి నేను మరలిరాఁగానే న్యాపతి సుబ్బారావుపంతులుగారు ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు


మొదలైన మిత్రులతో నాలోచించి, సభాహ్వానపత్రికను బంపి స్త్రీ పునర్వివాహ పక్షాభిమానులయిన నామిత్రులను వారిమిత్రులను సమకూర్చి 1884 వ సంవత్సరము జూన్ నెల 22 వ తేదిని క్రొత్తసమాజము నొకదాని నేర్పాటు చేసితిని. ఈ నూతనసమాజము రామకృష్ణయ్యగారును నేనును గవర్రాజు గారును ఆత్మూరి లక్ష్మీనరసింహ గారును న్యాపతి సుబ్బారావు పంతులుగారునుజేరి పదునాఱుగురు సామాన్యసామాజకులతో నారంభమయినది. ఇది పూర్వసమాజముయొక్క యనుబంధమే యయినట్టును సమాజమువారి యాదరణక్రింద వివాహము చేసికొన్న వారందఱును నిందు సామాజికులయినట్టు పరిగణింపఁబడునట్టును నేర్పఱుపఁబడినది. సమాజములో నేడుగురు కార్యనిర్వహక సంఘముగానుండుటకును, వారిలో నాఱుగురు సామాజికులచేతను ఒకరు వివాహములుచేసికొన్న వారచేతను ఏటేట ఎన్నుగొనఁబడుటకును, నిర్ణయముజరిగి, శ్రీపైడా రామకృష్ణయ్యగారును నేనును బసవరాజు గచర్రాజుగారును ఆత్మూరి లక్ష్మీనరసింహము గారును న్యాపతి సుబ్బారావు పంతులుగారును ఆచంట లింగరాజుగారును సామాన్య సామాజికులచేతను సోమంచి భీమశంకరముగారు పెండ్లికుమారులచేతను ప్రథమకార్య నిర్వాహక సంఘముగా కోరుకొనఁబడితిమి. మొదటినుండియు నున్నట్లు నన్ను సమాజ కార్యదర్శినిగాను, లక్ష్మీనరసింహముగారిని కోశాధిపతినిగాను, గవర్రాజుగారిని గణకునిగాను, సుబ్బారావు పంతులుగారిని కార్యనిర్వాహక సంఘ కార్యదర్శినిగాను, భీమశంకరముగారిని సహాయ కార్యదర్శినిగాను, ఏర్పఱిచిరి. సమాజమేర్పడిన యాదినముననే సకుటుంబముగా ఒక సేవకునితోను సమాజ పురోహితునితోను వివాహపక్ష వ్యాపనముచేయుటకయి చుట్టుపట్ల మండలములలో సంచారముచేయుమని నన్ను గోరుటకును, నాప్రయాణ వ్యయములను సమాజమువారే భరించుటకును, ఒక నిర్ణయము చేయబడినది.

ఈవఱ కిదియంతయు సరిగానేయున్నదిగాని దీనిని నిర్వహించుటకు ధనము కావలెను. 1882 వ సంవత్సరము జూన్ నెలలో శ్రీపైడా రామ


కృష్ణయ్యగా రనుగ్రహించి పదివేల రూపాయలిచ్చిరి. ఆయిచ్చినప్పుడు మరల వివాహములగునన్న నమ్మక మాయనకు లేకపోవుటచేత రెండు సంవత్సరముల లోపల వివాహములు జరగనియెడల తమసొమ్ము తమకు మరల పంపివేయ వలసినదనియు, జరిగెడుపక్షమున వివాహ మొకటికి వేయేసి రూపాయలను మాసవ్యయములకు నెలకు డెబ్బదియైదేసి రూపాయలును నాకు పంపుచుండ వలసినదనియు, ఆయన యేర్పాటుచేసిరి. మితిపెట్టిన రెండు సంవత్సరములలోపలనే నేనిమిది వివాహములు చేయఁగలిగితిని. ఆయనయిచ్చిన యధికారప్రకారము నేను వ్యయముచేసి యుండినయెడల, జరిగిన యెనిమిది వివాహములకు నెనిమిదివేల రూపాయలును, 1882 వ సంవత్సరము ఏప్రిల్ నెల మొదలుకొని మాసమునకు డెబ్బదియైదేసి రూపాయల చొప్పున 27 మాసములకును రెండువేలపదునేను రూపాయలును, మొత్తము పదివేల పదునేను రూపాయలు కర్చుపెట్టి యీసమాజమువారికి నేను పదునేనురూపాయల ఋణము చూపియుందును. అట్లు చేయక నేను మితముగావాడి చెన్న పట్టణపు వివాహమున కొక్కదానికే 1671 రూపాయలు కర్చు పెట్టినను మొత్తముమీఁద నెనిమిదివివాహములకును 5668 రూపాయలు మాత్రమే వ్యయముచేసి మాసవ్యయములకు 1768 రూపాయలుమాత్రమే కర్చుపెట్టి, గృహములు కొనుటకయి వ్యయపఱిచిన 1166 రూపాయలును పాత్రసామానులు వైద్యపుకర్చులు మొదలైన వానిక్రిందనయిన 320 రూపాయలును కలుపుకొని యించుమించుగా 8921 రూపాయలు మాత్రమే కర్చు పెట్టి వేయి రూపాయలకంటె నెక్కువగా నిలువచూపితిని. సమాజము క్రొత్తదగుటను బట్టి చందాలు మొదలైనవి యేర్పడక పోవుటచేత కొన్ని మాసములవఱకు యథాపూర్వకముగా నేనే మాసవ్యయాదులు జరపుచుంటిని. నరసాపురమునుండి నేనువ్రాసిన యుత్తరమువలన రోషము వచ్చినవాఁడయి సంవత్సరమునర ప్రథమ శాస్త్రపరీక్ష తరగతిలో చదివిన తరువాత పాఠశాలకు పోవుట మానుకొని పులవర్తి శేషయ్యగారు మండల న్యాయసభలో లేఖకోద్యోగమునందు ప్రవేశించెను. రఘునాధరావుగారును చెంచలరావుగారును పెండ్లిలోభోజనములు చేయకపోయినను కులమువారయిన మాధ్వులు చెన్న పురిలోని యెనిమిదవ వివాహానంతరమున వారిని కొంతబాధింప నారంభించిరి. వారి యాచార్యుఁడైన యుత్తరాది మఠస్వామి చెన్న పురికివచ్చి కొంతకాలమచ్చట వాస మేర్పఱుచుకొనిరి. వృద్ధురాలైన తల్లియొక్క దీనాలాపములుచేతను...........రావుగారి ప్రోత్సాహముచేతను తామొక దుర్బల నిమిషములో ప్రాయశ్చిత్తమునకు లోను గావలసివచ్చినదనియు, తాము యథాపూర్వముగానే వితంతూద్వాహ పక్షమునకు సాయము చేయుచుండెదమనియు, నా పేర చెంచలరావుపంతులుగారు తమ నిర్వేదమును దెలుపుచు లేఖవ్రాసిరి. ఈవిషయమయి నేను రఘునాథరావుగారిపేర వ్రాసితినిగాని వారు ప్రత్యుత్తరమియ్య ననుగ్రహించిన వారు కారు. ఆసంవత్సరాంతమున శీతకాలపు సెలవులలో నేనీపనిమీఁద మరల చెన్న పట్టణమునకుపోయి రఘునాథరావుగారి దర్శనముచేసితిని. వారు నన్ను చూచి "నేను ప్రాయశ్చిత్తముచేసికొంటినని మీకువ్రాసిన బుద్ధిహీనుఁడెవ్వఁడు?" అనిపలికి, వీరావేశముకలిగినట్లు దేహము పెంచి తలయాడించి సోత్సాహమైన గంభీరోచ్చైస్వనముతో "మాస్వామి యిప్పుడిక్కడనే యున్నాఁడు. ఈసమయమునందొక్క పెండ్లివారుకుదిరిరా, వాని యింటియెదుటనే పెండ్లిచేసి వానికి బుద్ధివచ్చునట్లు చేసియుందును" అనిపండ్లుగీటుచు పిడుగులు పడుచునట్లు వీరాలాపములు పలికిరి. శూరత్వము మూర్తీభవించినట్లున్న వారి యాకారమునుజూచి వారి వాక్సారము వినునప్పుడు నాహృదయములో నొకవిధమైన వికారము పొడమి మేను గగురుపొడువ వీరికున్న యుత్సాహములో నాకు నాలవవంతుండినపక్షమున నే నెంతో పనిచేసి యుండవచ్చునుగదా యని నాలో నాకే లజ్జవొడమఁ దొడఁగెను. ఈసంభాషణము ముగిసిన తరువాతనే నాయనను వీడ్కొని నాలోనే నీవిషయమునే యాలోచించికొనుచు చెంచలరావు పంతులుగారి యింటికివెళ్లి వారిదర్శనముచేసి రఘునాథరావుగారి యింటనడచిన సంభాషణమును విన్న వించితిని. ఆయన యనాదరము సూచించు ముఖ


భావముతో "ఆయనమాటలకేమి లెండి?" అనిపలికి, నాతో నితరవిషయములను గూర్చి కొంతసేపు ముచ్చటించిరి. ఆయనవద్ద సెలవుగైకొని నేనింటికి వచ్చునప్పటికి కొందఱు విద్యార్థులు నన్ను చూడవచ్చి, మీరు పట్టణము వచ్చెదరని విని యొక వృద్ధ బ్రాహ్మణుఁడు నాలుగైదుదినములనుండి మీకొఱకు తిరుగుచున్నాఁడని చెప్పిరి. ఆయనను నావద్దకు తీసికొనిరండని నేను వారితోఁజెపితిని. మఱునాటియుదయమున వారావృద్ధుని నాయొద్దకుఁగొనివచ్చిరి. నానిమిత్తమయి విచారించుచున్న కార్యమేమని నేనాయన నడిగితిని. చిత్తూరు జిల్లాలో నొక గ్రామమున నిద్దఱు బాలవితంతువులుగలరనియు, వారికి వివాహముచేయుటకు తల్లి దండ్రులొప్పుకొని యున్నారనియు, ఆయన నాతో చెప్పెను. వారిని వివాహము చేసికొనుటకు వరులున్నా రాయని యడిగితిని. వరులును సంసిద్ధులయియే యున్నారని యతఁడు పలికెను. "అట్లయినచో నిఁక నాలస్య మెందుకు? చెంచలరావుగారివద్దకును రఘునాథరావుగారి యొద్దకునుపోయి వివాహము చేయింపరాదా?" అని నేనంటిని. "వారు మాటలవారేకాని కార్యములవారుకారు" అని యాయన నుడివెను. ఇందులో మీకింత శ్రద్ధయెందుకు? వితంతుకన్యలు మీకేమైన చుట్టములా ? అని మరల నడిగితిని. "వారిదుస్థ్సితి చూచి జాలినొంది మీరు చేయుచున్నది మంచికార్యమనియెంచి లోకోపకారముగా వాక్సహాయము చేయవచ్చితిని" అని యాయన పరోపకార చింతఁగల వానివలె పలికెను. "అట్లయినచో మీకు నావలన కావలసిన పనియేమున్నది?" అని నేనడుగఁగా, అయోమార్గవ్యయముల నిమిత్త మిరువదియైదు రూపాయలిచ్చిన పక్షమున తానుపోయి యిద్దఱు పెండ్లికూఁతులను వారి తల్లిదండ్రులను వరుల నిరువురను గొనివచ్చెదననియు తరువాత వారికి వివాహములు చేయవచ్చు ననియుఁజెప్పెను. ఆతనిమాటల ధోరణిని ముఖచిహ్నములును చూడఁగా నతఁడు మోసగాఁడు కానట్టు కనఁబడఁగా, మంచిది రమ్మని యాయనను నాబండిలో నెక్కించుకొని చెంచలరావు పంతులుగారియింటికి తీసికొనిపోయి జరగిన కథనుజెప్పి యిరువదియైదురూపాయలిమ్మని కోరితిని. ఇట్టివాండ్రు మోసము


చేసి సొమ్మపహరింతురని యాయన చెప్పెనుగాని సొమ్మపహరించిన యెడల ఆనష్టమును నేను భరించెదనని పలికి సొమ్మిప్పించి యావృద్ధబ్రాహ్మణు నక్కడి నుండియే పంపివేసితిని. చెంచలరావు పంతులుగారితో కొంతసేపు సంభాషించినతరువాత నాయనను వీడ్కొని బైలుదేఱి, తిన్నఁగా, రఘునాథరావుగారి యింటికిఁబోయి యాయనను సందర్శించి "మీరు నిన్నటిదినమున వధూవరులు దొరకినపక్షమున స్వాములవారి యింటియెదుటనే వివాహము జరపించెదమని సెలవిచ్చితిరి. ఈశ్వరుఁడు మీయభీష్టమును శీఘ్రముగానే సిద్ధింపఁజేయునట్లున్నాఁడు. వధూవరులను గొనివచ్చుటకయి ప్రయాణవ్యయములకిచ్చి యొక మనుష్యుని నేనిప్పుడేపంపించితిని." అని చెప్పితిని. ఈ కడపటి వాక్యమును ముగించునప్పటి కాయన ముఖము కళావిహీనమయి వైవర్ణ్యము నొందెను. ఆయనచేతులు జోడించి నాకు నమస్కారముచేసి, "ఈపక్షమున పనిచేసినందునకు నేనీవఱకే బహుబాధలుపొందితిని. నేనిఁక దీనిలో సంబంధము కలిగించుకొనఁజాలను. క్షమింపుఁడు" అని స్పష్టముగాఁబలికిరి. నేనప్పటికాయనను వీడ్కొని బండిలో నింటికిఁబోయితిని. నాతోఁ జెప్పినట్లా ముసలాయన నాలుగైదుదినములలో వధువులనిద్దఱిని వారి జననీజనకులను వరులనిద్దఱును తీసికొనివచ్చి నాకప్పగించి తనదారినిపోయెను. ఆయన మరల నాకంటఁ బడలేదు. తరువాత విచారింపఁగా నావృద్ధవిప్రుడు వధువుల మాతామహుఁడయినట్లు తెలియవచ్చెను. వెనుకటివలె నంతవిజృంభణముగాచేయక మాచేతనున్న వేయి రూపాయలనుమాత్ర మీరెండు వివాహములకును వ్యయ పెట్ట నిశ్చయించుకొని ఆవధూవరుల కుటుంబమును బ్రహ్మసమాజ మందిరమునందుంచి, నామిత్రున కావిషయమును దెలిపితిని. చెంచలరావు పంతులుగారును రఘునాథరావుగారును నావద్దకువచ్చి యీవివాహములను చెన్న పట్టణములో జరపవలదనియు, తాము రాకపోయినయెడల తమ పేరుచెడుటయేకాని వివాహపక్షమునకేమియు లాభము కలుగదనియు, అంతేకాక తామీపక్షమును విడనాడినట్టు జనులకు తెలిసినపక్షమున ముఖ్యులు విడిచిరని యీపక్షమునకు నష్టమే కలు


గుననియు, అందుచేత తమగుట్టు బైలఁబడకుండ వివాహములను స్థాలాంతరమునఁజేసి తమ్మవమానమునుండి కాపాడవలసినదనియు, ప్రయాణ వ్యయములను తాము వహించెదమనియు నన్ను బహువిధములఁబ్రార్థించిరి. నాకప్పటికి వారి కోరిక చెల్లించి వివాహపక్షము నపవాదమునుండి తప్పించుటయే యుచితమని తోఁచినది. ఈ యాలోచనలలో బహుదినములు గడచిపోయినవి. సెలవులంతముకావచ్చు చున్నందున నేను పోవలసిన దినములు సమీపించుచుండెను. వివాహము లొక్కస్థలములోనే జరపుచుండుటకంటె వేఱు వేఱు తావులలో జరపించుట యధిక లాభకరము గనుక మీస్థలములో జరపబూనుకొనెదరా యని మేము స్త్రీ పునర్వివాహ పక్షాభిమానుల కనేకులకు వ్రాసితిమి. వారిలో బళ్లారి నుండి రావుబహద్దరు సభాపతి ముదల్యారిగారు సమస్తవ్యయములను వహించి తమ పట్టణములో వివాహములను తాము చేయఁబూనుకొనెదమని వ్రాసిరి. నా సెలవులయి పోవచ్చినందున బళ్లారికివెళ్ళి వివాహములు చేయించి తిరిగి రాజమహేంద్రవరమువచ్చుట కవకాశముచాలక, వధూవరులు మొదలైనవారిని బళ్లారికిఁగొనిపోయివివాహములు జరపివచ్చుటకు నామిత్రులయిన మన్నవ బుచ్చయ్య పంతులుగారి కొప్పగించి, వేయిరూపాయలను బుచ్చయ్యపంతులుగారి చేతి కిచ్చునట్లు చెంచలరావు పంతులుగారితో మాటాడి యేర్పాటుచేసి, నేను మరలివచ్చితిని. ఈప్రయాణమువలన మా క్రొత్తసమాజమునకు ధనముకూర్చి చెన్న పట్టణమునుండి పట్టుకొనిపోవుటకు బదులుగా చెన్న పట్టణములో నున్న వేయి రూపాయలనుకూడ వ్యయముచేసి వట్టిచేతులతో మాయూరుచేరితిని. 1885 వ సంవత్సరము పిబ్రవరి నెల 6 వ తేదిని బుచ్చయ్యపంతులుగారు పెండ్లివారితో బళ్ళారికివెళ్ళినట్టు శ్రీ రఘుపతి వేంకటరత్నమునాయఁడుగారు నాకు తంతివర్తమానమును బంపిరి. [22] ఆనెల 12 వ తేదిని 15 ఏండ్లు ప్రాయము గల పెద్దవధువును చిత్తూరి సుబ్బారావుగారును, 12 ఏండ్లు ప్రాయముగల చిన్న వధువును జటప్రోలు రామారావుగారును బళ్ళారిలో వివాహమాడిరి.


ఇవి రామకృష్ణయ్యగారి ధనముతో మాచే జరగింపఁబడిన పదునొకండవ పండ్రెండవ వితంతు వివాహములు.

ఇప్పుడు వివాహములుచేయుటకుమాత్రమే కాక ప్రతిమాసమును చేయ వలసినట్టి వ్యయములకు సహితము సొమ్ము కావలసియున్నది. న్యాపతి సుబ్బారావు పంతులుగారును, సీ. నాగోజీరావుగారును, ఆత్మూరి లక్ష్మీనరసింహముచెట్టిగారును, ఇతర సామాజికులును చందాలనొసఁగి సాయము చేయుచున్నను, మావ్యయములకు వారౌదార్యముతో నిచ్చెడు ధనము చాల కుండెను. అందుచేత చందాలు దయచేయుటకయి మహాజనుల వేఁడుట యావశ్యకమయి నందున, మాసమాజమువారు ధనసాహాయ్యార్థమైన తమ విజ్ఞాపన పత్రముతో నన్ను చెన్న పురి మొదలైన ప్రదేశములకుఁ బంప నిశ్చయించిరి. మాపాఠశాలకు వేసవికాలపు సెలవులియ్యఁబడిన పిమ్మట మాసమాజము వారిచే సమకూర్చఁబడిన యీక్రింది విజ్ఞాపన పత్రముతో చందాలు వేయించుటకయి నేను సకుటుంబముగా చెన్నపురికి ప్రయాణమయి పోయితిని. -

"స్త్రీ! పునర్వివాహము.

ఈక్రింద చేవ్రాలుచేసిన మేము రాజమహేంద్రవర వితంతు వివాహ సమాజపక్షమున మావేఁడికోలు వ్యర్థముకాదన్న సంపూర్ణ విశ్వాసముతో ధనసాహాయ్య నిమిత్తమైన యీప్రార్థనను హిందూదేశముయొక్క జ్ఞానసంపన్నులయిన మహాజనుల ముందుంచుట కనుజ్ఞ వేఁడుచున్నాము.

హిందువులలో నిర్బంధ వైధవ్యము వలనియనర్థములు చెన్న పురిరాజధానియందును హిందూదేశముయొక్క యితర ప్రదేశములయందును గూడ సర్వపక్షములను అత్యంతోత్సాహముతోను సమర్థతతోను ఈ నడుమనే విమర్శింపఁబడినందున వానినిక్కడ మరల ననువదించుట మా కనావశ్యకము. హిందూసుందరులయొక్క పునర్వివాహమును శాస్త్ర మంగీకరించుచున్నదని మహా


జనులకు విశ్వాసము కలిగించుటకయి మాచేతనైన దంతయు చేసియున్నాము. ఈశ్వరాశీర్వాదమువలన మేము కడచిన మూఁడుసంవత్సరములలోపల బాలవితంతువులయొక్క పండ్రెండువివాహములను చేయునంత కార్యసాఫల్యము నింతవఱకు పొందియున్నాము ; సాంఘికక్రౌర్యమునకు తాళుటకయి శక్తులనుగాఁజేయుటకొఱకు కొంత ధనసాహాయ్యముచేయఁబడెడు పక్షమున, వివాహములు చేసికొనుట కనేక బాలవితంతువులును యౌవనపురుషులును నున్నారని చెప్పుటకు మేము సంతసించుచున్నాము. హిందూస్త్రీల పునర్వివాహమును ప్రోత్సాహపఱుచుటకయి లంచములిచ్చు పద్ధతిని దేనిని అవలంబించుటకు మేము ప్రతికూలురముగా నున్నాముకాని సంఘముయొక్క ప్రస్తుతస్థితిని బట్టి కొంత ధనసాహాయ్యమత్యంతావశ్యకమయినట్టు కనఁబడుచున్నది. ఈ కార్యములకు విరోధముగా దురాగ్రహము బలముగా నున్నందున, ఈ వివాహములు చేసికొన్న వారు సర్వవిధములైన బాధలకును లోఁబఱుపఁబడుచున్నారు. వారు తల్లిదండ్రుల యిండ్లనుండి వెడలఁగొట్టఁబడుచున్నారు ; బంధువులచేత విడిచి పెట్టఁబడుచున్నారు ; సేవకులు వారిని విడిచి పోవుచున్నారు ; జనులవద్ద పనిలోనుండుట తటస్థించినపక్షమున, వారు పనులలో నుండి తీసివేయఁబడుచున్నారు. కాఁబట్టి యట్టివారిని మరల సంసారయాత్ర యందు నిలువఁబెట్టుటకయి కొంత ధనసాహాయ్య మావశ్యకముగా నున్నది. మేము కొన్ని సమయములయందు వారికి కాపురములుండుటకయి యిండ్లియ్య వలెను ; రోగసమయములయందు సాయము చేయవలెను ; విద్య చెప్పింప వలెను ; స్వయముగా సంపాదించుకొనుటకు శక్తులగువఱకును వారి జీవనమున కాధారములు కల్పింపవలెను. ఇవిగాక, మేము వివాహవ్యయములను భరింప వలెను. అపరిమితమయిన జీతములిచ్చి సేవకులను పెట్టవలెను ; పెండ్లి తంతును నడుపుటకయి పురోహితునికియ్యవలెను. ఇంతవఱకు మేమీవ్యయముల నన్నిటిని అత్యంత దేశాభిమానియు పరోపకార బుద్దియు కాకినాడనివాసియు నయిన పైడా రామకృష్ణయ్య సెట్టిగారు మావశములోనుంచిన దనము (సుమారు


రు 10,000 లు) నుండియు, ఇతరోదారపురుషులిచ్చిన సహాయధనమునుండియు, భరింపఁ గలిగినారము. మాయధీనములోనుంచఁబడిన ధనమంతయు నించుమించుగా వ్యయపడిపోయినది. ఇఁక మాపురోవృద్ధియంతయు మహాజనులవలన మేము పొందెడు ధనసాహాయ్యముమీఁద పూర్ణముగా నాధారపడియుండును. రాజాసర్. టీ. మాధవరావుగారు మాకు దయాపూర్వకముగా రు 500 లిచ్చి, యింకను సాయము చేయుటకయి వాగ్దానము చేసియున్నారు. ఈసంకటసమయమునందు మాకు తమ యుదారహస్తము నొసఁగి మేము పూనియున్న కార్యమును సాగించుటకయి మమ్ము శక్తులనుగాఁ జేయుట కొఱకు దేశక్షేమమును గోరువారి నందఱిని మేము వినయముతో వేఁడు చున్నాము.

చందాలును దానధనములును ఆర్బత్ నట్ కంపెనీవారిచేతఁగాని, ఈ క్రింద చేవ్రాళ్లుచేసిన యెవ్వరిచేతనైననుగాని స్వీకరింపఁబడి, సంవత్సరమున కొక్కపర్యాయము చందాదారులకు పూర్ణమైన లెక్క చూపఁబడును.[23]

వితరితువివాహ సమాజము. రాజమహేంద్రవరము. మేయి 1885.

సీ. నాగోజీరావు, బీ. యే.

కే. వీరేశలింగము.

ఏ. యల్. నరసింహము, బీ. యే., బీ. యల్.

యస్. సుబ్బారావు, బీ, యే., బీ. యల్

నేను చెన్న పురిచేరినతరువాత చందాల నిమిత్తము గొప్పవారియిండ్లకు బండ్లమీఁద తిరుగుచు వచ్చుటయేకాక 1885 వ సంవత్సరము జూన్ నెల 29 వ తేదిని బాబుగారి బాలికాపాఠశాలలో సభచేసి రాజమహేంద్రవర స్త్రీ పునర్వివాహ చరిత్రమునుగూర్చి యుపన్యసించి యుపన్యాసావసానమున చందాలు వేయించుటకై ప్రయత్నించితిని. ఇది చందాల సభయగుటచే పెద్ద మనుష్యులనేకులాసభకు రాలేదు. వచ్చి నాయుపన్యాసమును విన్నవారు


నూఱులకొలఁది యున్నను చందాల పుస్తకమును పయికి తీయఁగానే యొక్క రొక్కరే యావలికిదాటి నూఱులకొలఁది నున్నవారు పదులకొలఁదియయిరి. ఆయున్న వారిలో కొందఱు కొన్ని చందాలను వేసిరి. నేను చదువుకొన్న యుపాధ్యాయులకందఱికిని నాయందత్యంతప్రేమ కలిగియుండెను. నేను ప్రవేశ పరీక్ష తరగతిలో చదువుకొను చుండినప్పుడు ప్రధానోపాధ్యాయుఁడుగానుండిన శ్రీ చెంగల్వ కుప్పుస్వామిశాస్త్రిగా రుపకారవేతనము నొంది యప్పుడు చెన్న పట్టణములోనుండి, నేను పట్టణమునకు వచ్చుట విని


నన్ను చూడ నభిలషించి నే నెక్కడనుంటినో తెలియక నాటిదినమున నే నుపన్యసింపఁ బోవుచున్నానని పత్రికాముఖమున నెఱిఁగి యుపన్యాసభవనమునకు నన్ను వెదకుకొనుచు వచ్చిచూచి యాలింగనముచేసికొని ప్రియశిష్యునితోడి సుఖసల్లాపమునందు కొంచెముసేపుగడపి, అయిదు రూపాయలు చందా నిచ్చిపోయిరి. నేనీప్రకరణమునందు వ్రాసినదానిలో విశేషభాగమీదినమునఁ జేసిన యుపన్యాసమునుండి కైకొనఁబడినదే. అప్పు డీయుపన్యాసమునందు పైడా రామకృష్ణయ్యగారినిగూర్చి యిట్లు చెప్పితిని. -

"ఈ వ్యయములన్నియు శ్రీ పైడా రామకృష్ణయ్యగారు మహౌదార్యముతో మాసమాజమునకు దయచేసిన పదివేలరూపాయలతోనే జరపఁబడినవి. ఈయన సాహాయ్యమే లేక యుండినయెడల మేమిందులో నొక్క వివాహమైనను జేయుటకు సమర్థులమై యుండము. కాఁబట్టి యీవివాహములకంతకును మూలాధార మీ మహాపురుషుఁడేయని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఈయన కీమధ్య లక్షయేఁబదివేల రూపాయలు నష్టము వచ్చినను, ఇప్పటికిని బహువిధముల నీమహాకార్యమునకు తోడుపడుచు నేయున్నాఁడు. ఈ పదివేలరూపాయలునుగాక మొదటి రెండు వివాహములకు నయిన సమస్తవ్యయములను వహించుటయేకాక, ఈయనయే కొన్ని గృహములను సహితము పునర్వివాహదంపతులు కాపురముండుటకయి సమాజము వారివశమున నుంచి యున్నాఁడు. పరోపకారశీలుఁడైన యీదయా శాలియొక్క యీ యోగ్యదానమును నేను వర్ణింపవలసినపనిలేదు. ఈయిచ్చిన ధనముపోయినను, తనువులుపోయినను, మఱియేమిపోయినను, ఈయనకీర్తి యీ భూమండలములో స్థిరముగా నుండకపోదు. నావంటివారు కొందఱు పనిముట్లవలె కొంత యుపయోగపడినను, ఈకార్యవ్యాపనమున కీఘనుఁడే ముఖ్యకారణుఁడు."

ఈయుత్తమపురుషుని దృష్టాంతమునుజూపి సభవారిని సత్కార్యమునకుఁ బురికొల్పి "ఎవ్వరికిని భారముగానుండని యీ యుత్తమకార్యమునకు మీరు తోడుపడెడు పక్షమున, ఇంతవఱకును కాయ కష్టపడి శ్రీ పైడా రామకృష్ణయ్యగారి ధనముతో చేసినపనినే నేఁటినుండి మీధనముతో చేసి చేతనయినంత కృషిచేసి మీధనము సార్థకపడునట్లు సాధ్యమయినన్ని వివాహములను జేయింపఁ బ్రయత్నించెదను."

అని వాగ్దానము చేసితిని. తరువాత బండ్లు చేసికొనిపోయి చందాల నిమిత్తము గొప్పవారి గృహములకు తిరుగ నారంభించితిని. శ్రీపిఠాపురపురాజుగారి దత్తపుత్రు లిన్నూఱు రూపాయలిచ్చిరి. చెంచలరావు పంతులుగారును రఘునాథరావుగారును చెఱి నూఱేసి రూపాయలును చందాలు వేసిరిగాని తరువాత వారియ్య ననుగ్రహింపలేదు. సాంబయ్యసెట్టిగారును, రాజరత్నము మొదలియారుగారును, రంగయ్యసెట్టిగారును, నంబెరుమాళ్ల సెట్టిగారును, ఒకరొకరు ఇరువదియైదేసి రూపాయలు చందాలువేసిరి. ఇరువది, పదినేను, పది రూపాయలు ముగ్గురిచ్చిరి. బండి చేసికొని యొక గొప్ప గృహస్థినియింటికి చందా నిమిత్తము పోయితిని. మహాధనికుఁడై వితంతువివాహములయం దత్యంతాదరము చూపుచు నేను పోయినప్పు డెల్ల ప్రత్యు స్థానముచేసి నన్నధిక గౌరవముతోఁ జూచుచుండెడి యాగృహస్థుఁడు చందా నిమిత్తము నేను పోయిన యాదినమునందు నాపేరుగలచీటి లోపలికిపోయిన యరగంటసేపునకు వెలుపలికివచ్చి తాను తొందర పనిమీఁద నున్నట్లు నిలుచుండియే రెండుమాటలుచెప్పి మరల లోపలికిఁబోయెను. ఆయనకు నిజముగా తొందరపనియే యుండి యుండవచ్చును గాని నేను మాత్ర మది గొప్ప యవమానముగా భావించుకొని కోపముతో వెనుక మరలితిని. బాల్యము నుండియు నాది శీఘ్ర కోపోద్రేకమునొందెడు స్వభావము. కార్యార్థమయి యొరుల వేఁడు వారికుండవలసిన యోర్పుగాని వారి ననుసరించి తిరుగవలసిన యడఁకువగాని నాయొద్దలేదు. మొదటినుండియు నేను శాసించుటకేకాని యాచించుట కలవాటుపడిన వాఁడనుగాను. ఏహేతువుచేతనోకాని యీ


శ్వరుఁడు నన్ను కార్యవాదినిగాఁగాక ఖడ్గవాదినిగా సృజియించియున్నాఁడు. ఈయవమానము యాచింపఁబోయినందువలనఁ గలిగిన ఫలముగదా యని మనస్సులో పరితాపమునొంది, యిఁక ముందెవ్వరిని యాచింపఁబోఁగూడదని నిశ్చయము చేసికొని, మఱియెవ్వరియింటికినిబోక యోడనెక్కి రాజమహేంద్రవరమున మాయింటికే పోయితిని. ఈసారి యైనప్రయాణవ్యయములను మాత్రము నేను పోగుచేసిన చందా సొమ్ములోనుండి పుచ్చుకొని, శేషమును సమాజము వారికిచ్చితిని. రాజమహేంద్రమువరములోని మాసామాజికులు నెల చందాల నిచ్చుచుండుటయేకాక వారిలో ననేకులు పెద్ద మొత్తములను సహితము దయచేసిరి. న్యాపతి సుబ్బారావు పంతులుగారు మున్నూఱు రూపాయలిచ్చిరి ; వాడ్రేవు చలమయ్యగారిన్నూఱు రూపాయలిచ్చిరి ; కంచి కృష్ణస్వామిరావు పంతులుగారును, సీ. నాగోజీరావు పంతులుగారును, ఆత్మూరి లక్ష్మీనరసింహము సెట్టిగారును, నూఱేసి రూపాయలిచ్చిరి. ఏఁబదిరూపాయలిచ్చిన వారొక్కరును, ఇరువదియైదేసి రూపాయ లిచ్చినవారు ముగ్గురును, పదునైదేసి రూపాయలిచ్చిన వారిద్దఱును, పదేసి రూపాయలిచ్చిన వారునలుగురును, ఉండిరి. మావిజ్ఞాపనపత్రికను జదివి సహాయులైన వారిలో బెంగుళూరులోని యున్నత న్యాయసభలోని న్యాయాధిపతి (Judge) యైన ఏ. రామచంద్ర అయ్యరుగారు వివాహమొకటికి నూఱేసి రూపాయలు పంపుచుండుటయేకాక, ఆఱేసి నెలలకు నూఱురూపాయలు చందా నిచ్చు చుండిరి; ఇటీవల రావుబహదూరు ఏ. సభాపతి ముదల్యారిగారు వివాహ మొకటికి నూఱేసిరూపాయలచొప్పున బళ్లారినుండి పంపు చుండిరి. ఇట్లు సేకరించిన ధనముతో సమాజమువారు నెలజీతము లియ్యవలసినవారికిచ్చుచు, వివాహములు చేసికొన్నవారికి కావలసిన సహాయముచేయుచు, మిగిలినదానితో వివాహములు చేయుచుండిరి. ఈ సంవత్సరము డిసెంబరునెల 20 వ తేదిని జరగిన 13 వ వివాహమునకయిన మున్నూఱు రూపాయలును రామకృష్ణయ్యగారు రహస్యముగా నాయొద్దకుఁబంపిరి. ఈవివాహమునందు వరుఁడు పటా


నేని వెంకయ్యగారు; ఇతఁడు మొదట చిన్న యుపాధ్యాయుఁడుగానుండి పిదప కరణమయ్యెను.

వివాహనిమిత్తము చెన్నపురికిఁగొనిపోఁబడి వివాహము జరగక మరల తీసికొని రాఁబడిన తణుకు చలపతిరావుగారి మఱదలొకతె యింకను వివాహముకాక నిలిచియుండెను. ఆచిన్న దానినిచ్చి వివాహముచేయుటకయి మంగళగిరి కృష్ణమూర్తియను మాధ్వబ్రాహ్మణబాలుని విద్యచెప్పించుచు నేను సంసిద్ధుని చేసియుంచితిని. అతఁడు మాయింట నేయుండి ప్రవేశపరీక్షతరగతిలో చదువుచుండఁగా, ఆఱు నెలలకు పదుమూడేసి రూపాయల చొప్పున రెండుసారులు పాఠశాలజీతమిచ్చి, బట్టలు పుస్తకములు మొదలైన విచ్చి, స్ఫోటకము వచ్చినప్పు డిరువది రూపాయలు కర్చు పెట్టి, వివాహమున కేర్పాటుచేసినప్పుడు చిన్న దానితల్లి స్మార్తురాలయిన తన కొమారితను మాధ్వునకియ్యనని యాసంబంధమును నిరాకరించెను. తరువాత నాచిన్నవాఁడు ప్రవేశపరీక్షలో మొదటి తరగతియందు కృతార్థుఁడయి, పిలిచి పిల్లనిచ్చిన స్వజాతి కన్యను పరిణయమయ్యెను.

చిన్న దానితల్లి తన కొమారితకు వరునిగా కొమ్మరాజు గోపాలమను పేరుగల స్వశాఖవాఁడైన యొక నియోగిబ్రాహ్మణబాలుని నావద్దకు తీసికొనివచ్చి వివాహముచేయుమని యడిగినది. అతఁడు చదువుకొన్న వాఁడు కాఁడు; అల్లరిగాతిరిగి తల్లిదండ్రుల మాటవినక లేచివచ్చినవాఁడు. ఈ హేతువులను బట్టి నేనాతనికి వివాహముచేయనని నిరాకరించితిని. అందుపైనామె ఆత్మూరి లక్ష్మీనరసింహముగారియొద్దకు వెళ్లి, ఆయన యొద్దనుండి శ్రీపైడా రామకృష్ణయ్యగారి కుత్తరము పుచ్చుకొని వరునితోడఁగూడ కాకినాడకు వెళ్లెను. అప్పుడు రామకృష్ణయ్యగారు నాకిట్లువ్రాసిరి, -

"చిన్నపిల్లతల్లి నాయొద్దకువచ్చెను. వివాహము జరుపుటకు నేనుకూడ వొప్పుకొన్నాను. ఇందునిమిత్తమయి మిక్కిలి ఆవశ్యకముగాను అని వార్యమముగా కావలసిన సాధ్యమైనంత తక్కువసొమ్మును దయచేసి నాకు తెలు


పుఁడు" ఇది అయినతరువాత మనముప్రస్తుతము వివాహములుచేయుట నిలుపవలెను.............................................

మనమిత్రుఁడు బీ. ఏ., బీ. యల్ నాకువ్రాసిన యుత్తర మీమె తెచ్చినది. ఈ పెండ్లి మశూలీలోచేయుట కాయనచెప్పెను. మనమాలాగున చేసినయెడల మనకు విస్తారము సొమ్ముకావలెను. ఒక వేళ అక్కడ తిరిగి చిక్కులుండును. ఇది రాజమహేంద్రవరములోనే చేయవలెనని నేనాలోచన చెప్పుచున్నాను. పిల్లవాఁడును అత్తగారునుకలిసి మాటాడిరి; ఇద్దఱు ఒప్పుకొన్నారు. మీరెప్పుడు ముహూర్త మేర్పఱిచినను వెళ్లుటకతఁడు సిద్ధముగానున్నాఁడు. మెట్రిక్యులేషన్ వఱకుఁగాని మిడిల్ స్కూలు పరీక్షవఱకుఁగాని చదువుటకు మనమీ కుటుంబమును సంరంక్షింపవలెను. అతఁడీవఱకే కొంచెము చదివినవాఁడగుట చేత కడపటిదాని కొక్క సంవత్సరముచాలును................ ఈవ్యయములకు నేనిచ్చు చున్నానని మావివేకవర్థనిలో వ్రాయకుఁడు. దయచేసి నాపేరు రహస్యముగానుంచుఁడు."[24] ఆయన యుత్తరమునకు బదులుగా మున్నూఱు రూపాయలు కావలసి యుండునని నేను వ్రాసితిని. అందుమీఁద 24 వ పిబ్రవరి 1886 వ సం|| కాకినాడనుండి వారు నాకిట్లువ్రాసిరి. -

"వివాహ విషయమైన మీయుత్తరము నాకందినది. నేను రు 300 లు మీకి పంపెదను. కాఁబట్టి వివాహ మారంభించి నాకు తంతివార్త పంపుఁడు. నేను సొమ్ము పమెదను." [25]

ఈ నడుమను పెండ్లిచేసికొన్న కొందఱివలన కలిగిన కొన్ని చిక్కులను బట్టి యీక్రొత్తపెండ్లికొడుకును పిలిపించి, సంవత్సరకాలము చదువునిమిత్తమయి నెల కెనిమిదేసిరూపాయల చొప్పున నిచ్చెడిదితప్ప మావలన ధనముగాని యిండ్లుగాని నగలుకాని మఱియేదికాని యపేక్షింపఁగూడదని స్పష్టముగా చెప్పి, యతఁడందున కొప్పుకొన్న మీఁదట నతనిచేత నుత్తరమువ్రాయించి పుచ్చుకొని, మార్చి నెల మూడవతేదిరాత్రి వివాహ మేర్పఱిచి, మండల న్యాయాధిపతి మొదలైన వారి కందఱికి నాహ్వానములు పంపితిని. వారందఱును వచ్చి వేచియుండిరికాని పెండ్లికొమారుఁడు రాకపోవుటచేత పెండ్లి నిలిచిపోయినది. ఈ సంగతులను దెలుపుచు నేను వ్రాసినలేఖ కుత్తరముగా మార్చినెల 5 వ తేది రామకృష్ణయ్యగారు నాకిట్లువ్రాసిరి. -

"పెండ్లికి లిస్టరుదొరగారు మొదలైనవారిని పిలిచితినిగాని పెండ్లికొడుకు రానందున పెండ్లి జరగలేదని తెలుపుచు మీరువ్రాసిన యుత్తర మందినది. అటువంటి యాశాభంగములు కలుగునని నేనెఱుఁగుదును. ఇల్లు కోరఁగలవాఁడను కానన్న షరతులో నతని వద్దినుండి మీరుత్తరము పుచ్చుకొన్నట్టు మీయుత్తరములో చెప్పితిరి. మన మిల్లీయక పోయినయెడల,


వారెక్కఁడనుందురు ? మనమతనికేదో యిల్లియ్యవలెనుగాని, మనకువా రవిధేయులుగా నున్న పక్షమున వారు దానిహక్కును కలిగియుండరు. అటువంటి షరతుమీఁద నియ్యవలెను. నాయుద్దేశమిది. అట్లు చేయుఁడు. అతనిని మరలపిలిపించి వివాహమున కేర్పాటుచేయుఁడు. ఈ పెండ్లికూఁతురు కొఱకును తల్లికొఱకును మనము విశేషవ్యయము చేసితిమి. ఇది మనముచేసినయెడల ముందు వివాహముల నిమిత్తమయి మనము శ్రమపడ నక్కఱలేదు. ఇష్టమున్న యెడల మనము మానివేయవచ్చును. ఇందునుబట్టి యీవిషయమై పెండ్లికొమారుని ఉత్తరమిమ్మని యడుగుటకూడ ఆవశ్యకముకాదు. అయినను మీరీవఱకే యట్లుచేసితిరికాన పోనిండు." [26]

సిద్ధమయిన వివాహమునకు భంగముకలుగుట కిదియే ప్రథమముకాదు. చెన్న పట్టణమున కొకసాఐ నేను వెళ్ళియుండినప్పు డక్కడకూడ నొకవివాహమున కీలాగుననే భంగముకలిగెను. చెంచలరావు పంతులుగారి ముద్రాపత్ర


కార్యస్థానము (Stamp office) లో నొకవైష్ణవుఁ డుద్యోగములోనుండెను; ఆయనకు పురుషసంతానము లేక యొక్క తెయే కూఁతురుండెను; ఆయొక్క కూతురును పతివిహీనమయ్యెను. ఆతనియొద్ద నిరువది వేల రూపాయల సొత్తుండెను. చెంచలరావు పంతులవారి ప్రోత్సాహముచేత ఆవైష్ణవుఁడు బాలవితంతువైన తన కొమారితకు పునర్వివాహము చేయుట కంగీకరించెను. ఇఁక తగిన వరుఁడు కావలసియుండెను. నావద్దకు వచ్చు చుండెడు విద్యార్థులతో నే నీవిషయము ముచ్చటింపఁగా వారిద్దఱు వైష్ణవవిద్యార్థుల నన్నదమ్ములను నా యొద్దకుఁ గొనివచ్చిరి. వారిలో పెద్దవాఁడు పట్టపరీక్ష తరగతిలోను, రెండవవాఁడు ప్రథమశాస్త్రపరీక్ష తరగతిలోను, క్రైస్తవ కలాశాలలో చదువు చుండిరి. వారిలో పెద్దాతనికివివాహమయ్యెను గాని చిన్నతఁడు బ్రహ్మచారిగానే యుండెను. అతఁడన్న గారియనుమతిమీఁద నాబాలవితంతువును వివాహ మాడుట కంగీకరించెను. నేనాతనినిగొనిపోయి చెంచలరావు పంతులు గారికిచూపి వధువుతండ్రిని పిలిపించి యాతనికికూడ చూపినపిమ్మట నతఁడు తనకొమారిత నాచిన్న వానికిచ్చుట కొప్పుకొనెను. కొన్ని దినములలోనే ముహూర్త నిశ్చయము చేయఁబడినందున నాటిసాయంకాలము నేనును చెంచలరావుపంతులుగారును వధువుగృహమునకు పోయి, వివాహసన్నాహ మంతయు చేసి, మంత్రములు చెప్పుటకు యాజకుని నొప్పగించి, వరునావఱకే వారిగృహమునఁబెట్టి, వివాహమగునన్న నిశ్చయముతో మేమిరువురమును మా గృహములకుఁ బోయితిమి. నేను పరుండి నిద్రపోవుచుండఁగా రాత్రి పదిగంటలు దాటినతరువాత నొకమనుష్యుఁడు మాయింటికివచ్చి కేకలు వేసి నన్ను లేపి చెంచలరావు పంతులుగారు పంపిన్యుత్తరము నాచేతికిచ్చెను. ఈవివాహవార్తను దెలిసికొని ముందుగా నెవ్వరో కుంభకోణములో నున్న వరుని మేనమామలకు తంత్రీవార్త పంపిరనియు, వారాచిన్నవానిమీఁద నేదో యభియోగము తెచ్చి పోలీసువారిని వెంటఁగొనివచ్చి పెండ్లి పీటమీఁదఁ గూరుచుండియున్న వరుని బలవంతముగా నీడ్చుకొనిపోయిరనియు, తెల్లవాఱుజామున వారువెళ్లెడు పొగబండి


లోనేయెక్కి కుంభకోణమునకుపోయి గోపాలరావుగారు మొదలైనవారితో మాటాడి వరునివిడిపించి తీసికొని రావలసినదనియు, ఆయుత్తరములోనుండెను. నేనప్పుడు మన్నవ బుచ్చయ్యపంతులుగారియింట బసచేసియుంటిని. కుంభకోణముపోయి యచ్చటివారితో మాటాడి కార్యసాఫల్యము చేసికొనివచ్చుటకు నాకాదేశభాషయైన యఱవముతెలియదు. అందుచేత బుచ్చయ్య పంతులుగారిని ప్రయాణముచేసి, గోపాలరావుగారిపేర నుత్తరము వ్రాసియిచ్చి, ఆయన నారాత్రియే కుంభకోణమునకుఁ బంపితిని. ఆయన రెండు దినములలో పెండ్లికుమారుని విడిపించి తనవెంటఁ దీసికొని వచ్చెను. ఇంత కష్టపడి తీసికొని వచ్చినతరువాత వధువుతండ్రి తనకొమారితకు పెండ్లియోగము లేదనియు, ఉండినపక్షమున నాఁటి రాత్రి సిద్ధమైన పెండ్లిపీటలమీఁది వివాహము తప్పి పోయియుండదనియు, చెప్పి, నేనును చెంచలరావు పంతులుగారును ఎంత చెప్పినను మామాటవినక వివాహము మానివేసెను.

ఈచెన్న పట్టణపు వివాహమువలె పూర్తిగాచెడిపోక మారాజమహేంద్రవర వివాహము తరువాత జరగినను రామకృష్ణయ్య గారి జీవితకాలములో జరగలేదు. మార్చి నెల 17 వ తేదిని కొంత యింగ్లీషుతోను కొంతతెలుఁగుతోను రామకృష్ణయ్యగారు నాకీయుత్తరమును వ్రాసిరి. -

"Cocanada, 17th March 1886.

My dear friend,

I am suffering by a boil on the neck for the last 15 days. I have seen our A. L. Narasimham Gar and spoke to him every thing. Please see him. Dont lose lose Ravi Guruvavadhany's money. I got a letter from him. This correspondence made through Pari Vissayya Gar, pleader at Amulapur - the contents of which are a request to grant time to pay the money for the bond he executed. Please get a copy of the document and send me or please send to Pari Vissayya Gar to complain (కడచిన 15 దినములనుండి మెడమీఁద కురుపుచేత నేను బాధపడుచున్నాను. నేను మన ఏ. ఎల్. నరసింహముగారిని చూచి సమస్తమును ఆయనతో మాటాడినాను. దయచేసి ఆయనను చూడుఁడు. రావి గురువావధాని సొమ్ము పోఁగొట్టకుఁడు. అతనివద్దనుండి నాకుత్తరమువచ్చినది. ఈయుత్తర ప్రత్యుత్తరములు అమలాపురములో ప్లీడరైన పేరి విస్సయ్యగారిద్వారమున జరగినవి - దానిలోని సంగతులు వ్రాసియిచ్చిన పత్రపుసొమ్ము చెల్లించుటకు గడువిమ్మని ప్రార్థన. పత్రమునకు నకలు వ్రాయించి నాకుపంపుఁడు, లేదా వ్యాజ్యము వేయుటకు పేరి విస్సయ్యగారికి పంపుఁడు - ఇక్కడినుండి తెలుఁగు.)

యీవ్యవహారం విషయమయి విస్సయ్యగారు గురువావాధానులు గారిని పిలిపించి కూకలువేశినంద్ను గురువావాధానులుగారు నావద్దకువచ్చి కొంచం వాయిదా యివ్వవలశ్నిది రూపాయలు యిస్తాననికోరి యీహంశములే గురువావాధానులుగారు ఉత్తరంవ్రాశి నాకు యిచ్చినారు. అది కావలశియుంటే మీకుపంపుతాను. దస్తావేజుకు కాపీ తయారుచేయించి విస్సయ్యగారివద్దకు పంపి కంప్లయింటు చేయవలెను.

గవర్రాజుగారు నాకు రు. 100 లు నూరురూపాయలు యివ్వవలశియున్నది. ఆరూపాయలు ఆయనకు వీలు అయినప్పుడు W. M. Association కు యిమ్మని చెప్పకోరుతాను. సుబ్బారావు పంతులు గార్కీ గవర్రాజు గారికీ నా Compliments చెప్పకోరుతాను. ఆయనకు తొందరయిచ్చి పుచ్చుకో వద్దు. యెప్పుడు యిష్టంవచ్చియిస్తే అప్పుడు పుచ్చుకొండి.

Yours truly

P. Ramakistiah."

ఈ యుత్తరము వచ్చువఱకును రామకృష్ణయ్యగారికి కురుపు వేసినట్టే నాకు తెలియదు. రావి గురువావాధానుల పత్రముయొక్క నకలు వ్యాజ్యము వేయించు నిమిత్తము తనకు పంపవలసినదని కోరుటచేత, ఈయుత్తరమందిన తరువాత సహితము కురుపపాయకరమైనదని నేను భావింపలేదు. తమ బంధువులను చూచుటకయి యానాము వెళ్లితిరిగి వచ్చునప్పుడు మూడుదినములుండి,


ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు కాకినాడలో రామకృష్ణయ్యగారిని చూచుట తటస్థించెను. లక్ష్మీనరసింహముగారితో మాటాడితినన్న విషయము నాతో నావఱకు పదివేల రూపాయలనిచ్చుటను గూర్చి మాటాడిన విషయమే ఈవిషయమయి మఱునాఁడాయన మరణశాసనమే వ్రాసియిచ్చెను. ఈవిషయమునుగూర్చి 1887 వ సంవత్సరారంభమున నేను సమాజసావంత్సరికసభ యందు "స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమానస్థితు" లను గుఱించి వ్రాసిచదివిదానిలో నిట్లు చెప్పితిని. -

"అటుపిమ్మట రామకృష్ణయ్యగారిక్కడకు వచ్చినప్పుడు తాము తరువాత నిచ్చిన పదివేల రూపాయలును మొదటి రెండు వివాహములకు ప్రత్యేకముగా చేసిన వ్యయములను కట్టించిన యిండ్లును స్త్రీ పునర్వివాహాభివృద్ధి నిమిత్తమయిచేసిన యితర వ్యయములును కలుపుకొని యిరువదివేల రూపాయ లయ్యెననియు, మొట్ట మొదట వాగ్దానముచేసిన మొత్తములో అవిపోఁగా మిగిలిన పదివేల రూపాయలును వేగిరమిచ్చెదననియుఁ జెప్పి మూలధనము వ్యయపడక వృద్ధివలన సమాజమునకు తోడుపడునట్లుగాఁ జేయుటకై యేమి చేయుట యుచితముగా నుండునని నన్నాలోచన యడిగిరి. అప్పుడు నేనొక సారి నాగోజీరావు పంతులవారియొద్దకును, ఇంకొకసారి ఆచంట లింగరాజు గారియొద్దకును వారితోఁగలిసిపోయి యాలోచించితిమిగాని యప్పుడెట్లుచేయుటకును నిశ్చయింపలేదు. దేశముయొక్క యభాగ్యముచేత నింతలో వారి కవసానదశ సంప్రాప్తమయినందున, ఉద్దేశించిన పదివేల రూపాయలును మరణ శాసనమూలమున నిచ్చి, చేసిన వాగ్దానమును చెల్లించుకొన్నారు."

రామకృష్ణయ్యగారు వ్రాసినయుత్తరము నాకందిన రెండుమూడు దినములలోనే యాయన కాలధర్మమునొందుట తటస్థించినది. వారు నాకువ్రాసిన యుత్తరములలో నిదియే కడపటిది. ఈ యుత్తరమునం దుదాహరింపఁబడిన రావి గురువావాధానులకథ నిచ్చట కొంత తెలుపవలసియున్నది. ఆకాలము నందు వితంతు కన్యలను తెచ్చెదమనియు, దారిబత్తెములకుఁ గావలయుననియు


చెప్పి, యనేకులు నావద్ద రెండును మూఁడును రూపాయలుపుచ్చుకొనీ మోసము చేయుచుండెడివారు. ఈరావి గురువావాధనులు నాయొద్దకువచ్చి, అమలాపురము తాలూకాలోని యొకగ్రామములో అక్క చెల్లెండ్రిద్దఱు బాల వితంతువులుగలరనియు నూఱు రూపాయలు బదులిచ్చినపక్షమున వారితండ్రి ఋణవిముక్తుఁడయి యాపిల్లలను తనవెంట నాయొద్దకుఁబంపుననియు నమ్మకము పుట్ట చెప్పెను. అప్పుడు నేను కోరిన నూఱు రూపాయలను నాలవవివాహము చేసికొన్న పులవర్తి శేషయ్యగారిచేతి కిచ్చి, ఈయనవెంట కోనసీమలోని యా గ్రామమునకువెళ్ళి యీనూఱు రూపాయలును తండ్రి పిల్లలను తీసికొని వచ్చి యొప్పగించిన తరువాతనిచ్చి యీ బ్రాహ్మణుని తోడఁగూడ నిరువురు బాలవితంతువులను తీసికొని రావలసినదని చెప్పి పంపితిని. గురువావాధానులు శేషయ్యగారిని చెప్పిన గ్రామమునకుఁ గొనిపోయి చెఱువుగట్టుమీఁద కూరుచుండఁబెట్టి, మీరు గ్రామములోనికి వచ్చినజను లనుమాన పడుదురనియు, అందువలన కార్యవిఘాతము కలుగుననియు, రూపాయలు తనచేతి కిచ్చిన పక్షమున తండ్రికిచ్చి యరగంటలోపల పిల్లలతోవచ్చి కలిసికొనెదననియు, చెప్పి నమ్మించి తొంబదిరూపాయలు పుచ్చుకొని గ్రామమువంకనడిచి యదృశ్యుఁడయ్యెను. నామిత్రుఁ డాచెఱువుగట్టుమీఁద గంటలకొలఁది వేచియుండి యాతని రాకకానక, గ్రామములోనికిపోయి విచారించి యచ్చట సహిత మతనిజాడ తెలియక, నిరాశచేసికొని యొక్కఁడును మరలి నాయొద్దకువచ్చెను. తరువాత గురువావాధానులను పిలిపించి బెదరించి యామొత్తమున కాతనివలన పత్రము వ్రాయించి పుచ్చుకొంటిమికాని యతఁడు సొత్తేమియులేని నిర్ధనుఁడగుటవలన రామకృష్ణయ్యగారువ్రాసినట్టు వ్యాజ్యమునకు సొమ్ముదండుగ పెట్టక యసలుసొమ్మును వదలుకొని యూరకుంటిమి. ఒక్క యీగురువావధానులు మాత్రమే కాక యితరులుకూడ మమ్ము మోసముచేసినవారును మోసముచేయఁ బ్రయత్నించినవారును పలువురుండిరి. "విశాఘపట్టణమునుండి యొక బ్రాహ్మణుఁడు వితంతుకన్యలను తీసికొని వచ్చెదననిచెప్పి మునిస్వామిని విశాఘప (షణ్ముఖరాముగా రెక్కడనున్నారో తంతియిమ్ము. ఆయన కలకత్తాలోనున్నాఁడా? ప్రత్యుత్తరమున కెనిమిదణాలు కట్టఁబడినవి.)

అనివిశాఘపట్టణమునకు నవంబరు మొదటితేదిని గోగులపాటి శ్రీరాములుగారికి తంత్రీవార్తనంపి, ఆదినముననే కలకత్తాకుకూడ నీక్రింది తంత్రీ వార్తను బంపితిని. -

"From

K. Veerasalingam

Rajahmundry

To

L. Shanmukharam Garu

46 Burtola, Barabasar

CALCUTTA.

Write the caste and country of the couple.

(వధూవరుల కులమును దేశమును తంత్రీముఖమున తెలుపుము)

విశాఘపట్టణము గోగులపాటి శ్రీరాములుగారికి పంపిన తంత్రీవార్తకు రెండవ తేది నిట్లు బదులువచ్చెను. -

From

Gogulapati Sriraamulu.

Visagapatnam.

To

Viresalingam Garu.

Gov. College, Rajahmundry.

Your Telegram Just to hand - Shanmukharam at Vizagapatnam."


(మీతంతివార్త యిప్పుడేయందినది. షణ్ముఖరాము విశాఖపట్టణములో నున్నాఁడు.)

ఆదినముననే కలకత్తానుండియు తంత్రీముఖమున నిట్లు ప్రత్యుత్తరము వచ్చినది.

From

L. Shanmukharam

Calcutta.

"To

K. Veeresalingam Pantulu Garu

Rajahmundry.

Vidikas X Kristnapuram Vizagpatnam District X preferable send urgently X Address 48 Burtola. Reply Ordinary.

(వైదికులు X విశాఘపట్టణ మండలములోని కృష్ణపురము X

ముఖ్యముగా శీఘ్రముగా పంపుఁడు X నావిలాసము

48 బర్టోలా X సామాన్య ప్రత్యుత్తరమిండు)

ఇప్పుడు మోసము స్పష్టముగా తెలిసినది. అయిదవతేదిని సొమ్ముపంపుచున్నానని మోసగానికి తంత్రీవార్తపంపి, ఈలోపల కలకత్తాలోని మిత్రులకును పోలీసువారికిని తంత్రీవార్తలుపంపి, యావంచకుని పట్టించి దండింపఁ జేయవలెనని మొదట నాలోచించితినిగాని ముందు వ్యయప్రయాస ములకు కారణమగునని తలఁచి యాప్రయత్నమును మానివేసితిని.

"పదిమంది చేరినతరువాత కొన్ని మనస్తాపములును చిక్కులును కలుగక మానవుగాని చేసిన మహాకార్యమును తలఁచుకోఁగా, అవి యెంతమాత్రమును గణనకు తేఁ దగినవిగానుండవు. కొందఱు ధనాశాపరులుగానుండి పలు మిషలమీఁద తొందరలు కలుగఁజేయవచ్చును; కొంద ఱవివేకముచేతను కొందఱు దుస్స్వభావముచేతను తగవులాడవచ్చును."

అని 1885 వ సంవత్సర మధ్యమున స్త్రీ పునర్వివాహచరిత్రమునుగూర్చి నేనిచ్చినయుపన్యాసములో వ్రాసియుంటిని. అవివేకముచేత చేయఁబడినవి క్షమింపఁ దగినవిగానుండును; దుస్స్వభావముచేత చేయఁబడినవియు కొంతవఱకు క్షమింపఁదగినవిగా నుండవచ్చును. కాని లోకోపకారధురీణుల మనియు స్వార్థత్యాగులమనియు చెప్పుకొనుచు ధనాశాపరత్వముచేత పలుమిషలమీఁద బుద్ధిపూర్వకముగా చేసెడివారి యకార్యములు మాత్రము క్షంతవ్యములుగావు.

1887 వ సంవత్సరారంభమున సమాజమువారిముందు స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమాన స్థితులనుగూర్చి చదివిన యుపన్యాసములో నిట్లు వ్రాసితిని. -

"1884 వ సంవత్సరము జనేవరు నెలలో నల్లగొండ కోదండరామయ్యగారి వివాహమగువఱకును సామాజికులకును వివాహములు చేసికొన్న వారికిని


ఐకమత్యమున కేమియు కొఱఁతరాలేదు. కోదండ రామయ్యగారి వీవాహము నిమిత్తమయి కన్యను తీసికొని రావలసినదని నేను పులవర్తి శేషయ్యగారిని పంపినప్పు డాయన సంకోచింపక పెండ్లికూఁతురువారి వస్తువులను సహితము కొంతదూరము సంతోషపూర్వకముగా మోచుకొనివచ్చుట యీ యైక మత్యమున కొక నిదర్శనముగా చెప్పవచ్చును.............................................................................. కోదండ రామయ్యగారి వివాహమయిన రెండుమూడు మాసములలో కొన్ని కలహకారణములు గలిగినవి. లోకములో వైరమునకును నేరములకును ఏవికారణములు గానుండునో తెలిసినవారికీ వైరమునకుఁ గల కారణమును తెలుపవలసిన పనియుండదు."

ఈ కారణము ధనాశయని నాయాశయము. ఈవితంతువివాహ ప్రయత్నమునకు నేను పూనినప్పుడు పామరులును పూర్వాచారపరాయణులు నయిన విపక్షులవలనిదూషణములకును బాధలకును నేను సంసిద్ధుఁడ నయితినిగాని స్వపక్షములోనివారు నాకు తొందరలిచ్చి నన్ను బాధింతురని స్వప్నా వస్థయందును దలఁపలేదు. అందులోను ముఖ్యముగా నావలన బహులాభములనుపొంది లోకోపకారార్థమే తాము సర్వకష్టములకును లోనుగా నున్నట్టు పలుమాఱు పలుకుచుండువారు నా కాయాసము కలిగింతురని నేను బొత్తిగానే తలఁప లేదు. అన్నియు మనము తలఁచుకొన్నట్టు జరగవు. మనుష్యుఁడు తానొకటి తలఁచిన దైవమింకొకటి తలఁచును. నేను నరసాపురము వెళ్లియుండినప్పుడు 1884 వ సంవత్సరము మెయినెల 6 వ తేదిని పులవర్తి శేషయ్యగారు నాకు వ్రాసిన యుత్తరమునకు 8 వ తేదిని నేనిచ్చినప్రత్యుత్తరములో నతఁడు వ్రాసిన యుత్తరము స్వబుద్ధిచేతఁగాక పరుల ప్రోత్సాహముచేత వ్రాయఁబడినదని నేను వ్రాసితిని. (అతని యుత్తరమును నాప్రత్యుత్తరమును ఏలూరి లక్ష్మీనరసింహముగారు నామీఁద తెచ్చిన మాననష్టపు వ్యాజ్యములో దాఖలు చేయఁబడి నాయొద్దకు మరల రాలేదు.) ఆతని నాయుత్తరము వ్రాయునట్లు ప్రోత్సాహపఱచినవారు కోదండరామయ్యగారని నేను నమ్మితిని. అయినను


నేనది మనస్సులో నుంచుకొని నే నాయనకపకారము చేయుటకుఁగాని సమయమువచ్చినప్పుడు చేతనైన సాయము చేయకుండుటకుఁగాని యెప్పుడును తలఁచుకోలేదు. ఇది జరగిన రెండుమూఁడు మాసములలోనే క్రొత్త సమాజమును స్థాపించిన యిరువది దినములలోపల నీయన కప్పుడుండిన (యిరువది రూపాయల జీతముగల) యుపాధ్యాయపదము పిల్లలతో నెప్పుడు నఱచుచు విశేషవాగ్వ్యయము చేయవలసినదగుట చేత నీయన శ్వాసకోశములకు సరిపడ లేదన్నప్పుడు నేనీయనకు మాముద్రాశాలలో కార్యనిర్వాహకోద్యోగమియ్యవలెనని సహిత మెంచితిని. 1884 వ సంవత్సరము జూలయి నెల 11 వ తేదిని కోదండరామయ్యగారు నాకిట్లువ్రాసిరి. -

"ఈనడుమ మీరు నన్ను ముద్రాశాల కార్యనిర్వహకునిగా నియమింప నుద్దేశించినట్టు యన్. సుబ్బారావుగారు నాతో చెప్పుచున్నారు. రేపటి మధ్యాహ్నము నుండి నాసేవ నర్పించుటకు నాకాక్షేపణలేదు. ఉద్యోగము నిచ్చి, పనిచేయవలసిన గంటలను జీతమును నిర్ణయింప దయచేయుదురని కోరుచున్నాను. (Mr. N. Subbarao tells me that you the other day proposed to employ me as the manager of the Press. I have no objection to offer my services from tomorrow after noon. I hope you will be good enough to make the appointment and fix the working hours and pay.")

ఈయన కీయవలసిన జీతముకాని, పనిచేసెడు గంటలుకాని, మాపని కనుకూలపడనందున నేనీయన కీయుద్యోగమీయలేదు. మావీధినినున్న చయనులుగారి యిల్లు కొన్నప్పుడు నేనందు మూడు కుటుంబముల నుంచఁదలఁచి ముందుగా నీయన కోరుకొన్న భాగముననఁగా వంటయిల్లును భోజనముల యిల్లును పడకగదియు నున్న భాగము నీయనకిచ్చి, యొకభాగములో తణుకు చెలపతిరావుగారి కుటుంబమును, చావడి భాగములో చేబోలు వెంకయ్యగారి కుటుంబమును, కాపురముంచితిని. కోదండరామయ్యగారు తానున్న యిల్లు బాగుచేయించుటకయి కావలెనని కోరుచురాఁగా మార్చి నెలలో 6 రూపా


యలును, క్రొత్తసమాజము స్థాపింపఁబడిన తరువాత జూలయి నెలలో రు. 5-5-0 లును, సెప్టెంబరు నెలలో రు. 25-0-0లును, అక్టోబరు నెలలో రు. 15-0-0లును, మొత్తము రు. 51-5-0 లిచ్చితిని. ఈయనయొక్క యింటికి తక్క సరిపఱుచుకొనుటకయి మఱియెవ్వరియింటికిని నే నేమియు నియ్యలేదు. బీదవాఁడయ్యును చేబోలు వెంకయ్య తనకిచ్చినచావడి భాగమును తానును భార్యయు కష్టపడి బాగుచేసికొని గదు లేర్పఱుచుకొని స్వయముగానే వాసార్హముగా చేసికొనెను. ఇట్లయ్యును నల్లగొండ కోదండరామయ్యగారు దీనినంతను మఱచిపోయి, 1886 వ సంవత్సరమునందును 1887 వ సంవత్సరమునందును గోదావరి వఱదలు విశేషముగావచ్చి ప్రవాహము వీధులలో ప్రవేశించి యిండ్లకు కొంత నష్టము కలుగఁజేసినప్పుడు యుక్తసమయములో కొంచెము బాగుచేసికొనకపోవుటచేత కోదండరామయ్యగారున్న యింటివీధిగోడ కొంతకూలఁగా తాను సమాజముయొక్క కార్యనిర్వాహక సంఘమునకు సహాయకార్యదర్శిగా వచ్చినతరువాత నేను తనయందుఁగల ద్వేషముచేత తనయిల్లు బాగుచేయింపక పోవుటనుబట్టి యది చెడినని నామీఁద దోషారోపణము చేయుచు నన్ను దూషించుచు 1888 వ సంవత్సరము ఫిబ్రవరు నెల 15 వ తేదిని కార్యనిర్వాహక సంఘమున కొక విజ్ఞాపనము పంపెను. ఆవిన్నపమా నెల 28 తేదిని విచారణకు వచ్చినప్పుడు నేనాయనయింటి మరమ్మతు నిమిత్తమయి యిచ్చినసొమ్ము లెక్కలను, సొమ్ముచేకొన్నందున కాయన నాకిచ్చిన స్వీకార పత్రములను సభవారి ముందు పెట్టఁగా వారీక్రింది నిర్ణయముచేసిరి.-

"Read Mr. Kothandaramiah's letter of 15th February 1888. The managing committee records its regret at the tone of his letter. Mr. Kothandaramiah has been heard and it is resolved that he has not proved that Mr. Viresalingam neglected to repair his house." (1888 వ సంవత్సరము ఫిబ్రవరి నెల 15 వ తేది గల కోదండరామయ్యగారి లేఖచదువఁ బడినది. కార్యనిర్వాహకసంఘ మాయన లేఖ యొక్క భాషనుగూర్చి తన చింతను తెలుపుచున్నది. కోదండరామయ్య


గారు చెప్పినదివిని, తనయింటిని మరమ్మతు చేయుటకు వీరేశలింగముగా రశ్రద్ధ చూపినట్టాయన ఋజువు చేయలేదని నిర్ధారణ చేయఁబడుచున్నది.)

P. Srinivasa Rao, (పి. శ్రీనివాసరావు) Chairman.

K. Viresalingam, (కె. వీరేశలింగము)

N. Kothandaramiah, (ఎన్. కోదండరామయ్య)

B. V. Jogayya (బీ. వీ. జోగయ్య)

B. Gavarraju, (బీ. గవర్రాజు)


చేసిన నిర్ధారణముల క్రింద నప్పుడున్న కార్యనిర్వాహక సంఘమువారందఱును వ్రాళ్లుచేయుచుండుట యాచారమగుటనుబట్టి యీ నిర్ధారణములో కోదండరామయ్యగారు సహితము వ్రాలుచేసిరి. ఈగృహవిషయమైన కోదండరామయ్యగారి చర్య ముందు కొంతచూపఁబడును. ఆరెండుసంవత్సరములలోను గోదావరి ప్రవాహము వెనుకనున్న కోదండరామయ్యగారి యింటిలోనికి వచ్చినట్లే ముందువైపుననున్న చేబోలు వెంకయ్యగారియింటిలోపలికిని వచ్చెను. వెంకయ్య యుక్తసమయములో తగిన బాగుచేసికొనుచు వచ్చినందున నాతనియింటికంత యపాయము కలుగలేదు. ఇన్నీసుపేటలో నేనుకొన్న స్థలమునం దిల్లుకట్టఁబడిన తరువాత తణుకు చెలపతిరావుగారి కుటుంబము నచ్చటికి పంపివేసి, యానడిమియింటిలో పదుమూఁడవ వివాహము చేసికొన్న పటా నేని వెంకయ్యగారి కుటుంబము నుంచితిమి. రామకృష్ణయ్యగా రొకసారి రాజమహేంద్రవరమునకు వచ్చినప్పుడు కోదండరామయ్యగారు తనకా యిల్లుచాలదని యాయనతో మొఱ్ఱపెట్టుకోఁగా రామకృష్ణయ్యగారును నేనును గలిసిపోయి చూచినప్పు డాయిల్లిద్దఱికే యిచ్చిన పక్షమున విశాలముగా నుండునని యాయన నాతోఁ జెప్పిరి. మంగళవారపు పేటలో కొన్న స్థలములో నిల్లుకట్టిన తరువాత పటా నేని వెంకయ్యగారి నచ్చటికిపంపివేసి యా యిల్లిద్దఱికే యిచ్చెదనని నేను చెప్పితిని. విద్యలేని మూఢులు పలువురుచేరి చేయుదానికంటె విద్యాధికుఁ డొక్కఁడు చేయుహాని శతగుణము లధికముగానుండును. మనదేశములో యాచ్నావృత్తి హేయముగా నెంచఁబడకుండుటయు పాటుపడక కూరుచుండుట గొప్పయని తలఁపఁబడు చుండుటయు, చిరకాలాగతాచారము లగుటచేత కాయకష్టపడక నిరుద్యోగముగా కూరుచుండి స్వోదరపోషణార్థ మితరులను వేఁడి ధనార్జనముచేయుట లాఘవమని యెవ్వరును భావింపకున్నారు. అందుచేత నెల్లవారును ధనాకర్షణమునకు వెరవున్న పక్షమున నేయుపాయముచేతనైనను సాధ్యమైనంత డబ్బు లాగవలయుననియే యత్నించుచుందురు. వికాలాంగులుగాక యవయవపటుత్వముగల వారందఱును పాటుపడవలసిన వారే యనియు పాటుపడ నొల్లనివారికి ధనదానముచేసి సోమరితనమును ప్రోత్సాహపఱచుట పాపమనియు నామతము. నేను పాటుపడెడివాఁడను; ఇతరులు పాటుపడవలసినవారని తలఁచెడివాఁడను. కాయకష్టమువలనిగౌరవము నెఱుఁగని ముంజులూరి గోపాలము గారు (పంచమ వివాహవరుఁడు) జూని^నెల జీతము పుచ్చుకొన్నతరువాత తాను ముద్రాశాలలో పనిచేయననియు, (ద్వితీయ వివాహవరుఁడు) రామచంద్రరావునకునుఁ (చతుర్థవివాహవరుఁడు) శేషయ్యకును ఇచ్చు చున్నట్లే తనకును నెల కెనిమిదేసి రూపాయలచొప్పున నియ్యవలె ననియు నన్నడిగెను. వారి రువురును చదువుకొనుచున్నారు గనుక నిచ్చు చున్నాననియు, చదువులేక దృఢకాయుఁడవై యుండియు కష్టపడనొల్లని నీ కూరక యియ్యననియు నేను దృఢముగాఁ జెప్పితిని. ఎట్లియ్యరో చూతమని యతఁడును బండతనముచేసెను; దేవుఁడిచ్చిన యవయవముల నుపయోగింప నొల్లక యొడలు దాఁచుకొనఁదలఁచినవాఁడు తత్ఫలమనుభవింపవలసినవాఁడే యని నేనును సొమ్మియ్యకుంటిని. తాను పుచ్చు కొన్న జీతపుసొమ్మయిపోయిన తరువాత తిండికి లేక రామకృష్ణయ్యగారి యొద్దకు కాకినాడకు పోయి యతఁడు తన యవస్థను చెప్పుకొనెను. ఆయనయతనికి కొన్ని రూపాయలిచ్చి పంపివేసి, తరువాత నన్ను రాజమహేంద్రవరములో కలిసికొన్నప్పుడు మన


లో చేరినవారు చెప్పినమాటవిననివారయినను కష్టపడుచున్న యెడల సాయము చేయు చుండ వలెనని చెప్పెను. కాయకష్టపడఁగల దృఢశరీరు లుద్యోగము చెప్పినను చేయక సోమరితనమున కాలము గడప నిశ్చయించుకొన్నప్పు డట్టివారికి ధనదానముచేత సంతుష్టి కలిగింపఁ జూచుట నానియమములకు విరోధమయినందున మీరుచెప్పినను మీధనములోనుండియైనను నేనియ్యనని మో మోటములేక ఖండితముగాఁ జెప్పితిని. ఈవిషయమున 1883 వ సంవత్సరము సెప్టెంబరు నెల 9 వ తేదిని ఆయన నాకిట్లు వ్రాసిరి. -

(ఆముంజులూరి చిన్నవాఁడు మీరు కోరినట్టు యుక్తముగా నడుచుకోక పోయినయెడల, నెమ్మదిగా మీరతఁడు దానిని చేయునట్టు చేయవలెను. అతఁడు విధేయుఁడయి మిమ్ము ప్రీతునిఁజేయవలయును. అప్పుడు మీ శక్తిలో నున్నదంతయు నతనికి మీరే చేయుదురనుటకంటె ఎక్కువగా నేదియు నేను వాగ్దానము చేయలేదు. వారుమిమ్మెట్లు బాధించుచుందురో నేనెఱుఁగుదును. వారికి మీరు మీచేతనైనంతచేయుదురనియు మీస్థితిని పిత్రుచితమైన దానినిగాచేసికొంటిరనియు నేనెఱుఁగుదును. నేను సంబంధము కలిగించుకోను). [27]

ఇట్లు వ్రాసినను రామకృష్ణయ్యగా రతనికి రహస్యముగా సొమ్మిచ్చు చుండిరి. వారు వ్రాసినట్ల నేకులప్పుడప్పుడు సొమ్మునుగూర్చి నాకు తొందరకలుగఁజేయు చుండుట వాస్తవమే. అడిగినదెల్ల నిచ్చుటకు నేను రామకృష్ణయ్యగారివలె ధనికుఁడనుగాను; ఒకవేళ నేనియ్యఁగలిగినను వారికోరిక యనుచితమని నేననుకొన్నప్పు డిచ్చెడువాఁడునుగాను. నాదగ్గఱ నొక్కగొప్ప లోపముగూడఁగలదు. ఇతరులడుగునది న్యాయమైనదికాదని నేను భావించి


నప్పుడు నెమ్మదితో వారిని సమాధానపఱుపఁజూడక పెద్దగొంతుకతో వారు దురాశాపరులనియు వారడిగినదియనుచితమైనదనియు నామనసులో నున్న దానిని మొగమోటలేక మొగముమీఁదనే స్పష్టముగా ననివేయుట. నేనీ ప్రకారము నిర్దాక్షిణ్యముతో పలుకువాఁడనైనను, ఎవ్వరికైనను నిజమైన కష్టము వచ్చినప్పుడు వారడుగకయే వారికి నాచేతనైనసాయమంతయుఁ జేసెడివాఁడను. కొన్ని మాసములైనతరువాత ఈగోపాలముగారిభార్యకే మసూరి (పోటకము) రోగమువచ్చెను. అప్పుడతనియసహాయస్థితిని కని పెట్టి వెంటనే యతని యింటికిపోయి, పథ్యపానములుచేసి పెట్టుటకు నాలుగు రూపాయలిచ్చి యొకబ్రాహ్మణస్త్రీని నియమించి, అయిదురూపాయలిచ్చి రాత్రిందివములు రోగియొద్ద కనిపెట్టుకొనియుండుటకయి యొకశూద్ర స్త్రీనిపెట్టి, కావలసిన పదార్థములు కొనియిచ్చి, ఆరోగ్యస్నానముచేయువఱకును నేను ప్రతిదినమును పోయి చూచుచుంటిని. గోపాలము వర్తించినవిధము కేవలమూఢత్వముచేతనే కలిగినదగుట చేత నాతనిదిక్షక్షమింపఁదగినదే. రాజమహేంద్రవరములో నున్న వారు నాకు తొందర కలుగఁజేయుచు వచ్చినట్లే కాకినాడలో నున్నవారు రామకృష్ణయ్యగారికి తొందర కలుగఁజేయుచువచ్చిరి. నామీఁద నేరములు చెప్పుటకయి యిచ్చటివారు రామకృష్ణయ్యగారి యొద్దకు వెళ్లునట్లే, రామకృష్ణయ్యగారిమీఁద నేరములు చెప్పుటకయి యచ్చటివారు నాయొద్దకు వచ్చుచుండిరి. నేను సొమ్మియ్యక వారిని తృప్తిపొందింపలేదు; ఆయన సొమ్మిచ్చియు వారిని తృప్తి పొందింపలేదు. ఏడవవితంతువివాహము చేసికొని కాకినాడలోనున్న బోడా శ్రీరాములు రామకృష్ణయ్యగారు తాను కోరిన విత్తమియ్యక పోవుటచేత భార్య నక్కడ విడిచి నాయొద్దకు పరుగెత్తుకొనివచ్చి రామకృష్ణయ్యగారి మీఁదనేమేమోచెప్పెను. నేనితని విషయమయి యాయనకువ్రాయగా 1885 వ సంవత్సరము జూలయి నెల 2 వ తేదిని వారు నాకిట్లు వ్రాసిరి. "I have got your letter about Sreeramulu. What he said is all lie. So you must tell him to go to Cocanada back & there is no use of threatening by running away like this and also tell him to come to me and ask me." (శ్రీరాములనుగూర్చి మీయుత్తరము చేరినది. అతఁడు చెప్పినదంతయు అబద్ధము. కాఁబట్టి కాకినాడకు తిరిగి వెళ్లవలసినదనియు, ఈలాగున పాఱిపోవుటవలన బెదరించిన ప్రయోజనములేదనియు, మీరతనితో చెప్పవలెను. నావద్దకువచ్చి నన్నడుగుమని కూడచెప్పుఁడు). రామకృష్ణయ్యగారిని బెదరించినప్పుడాయన మంచి మాటలతో వారి నాదరించి ధనమిచ్చెడువాఁడు; నన్ను బెదరించినప్పుడు నేను కోపవాక్యములుపలికి యనాదరముచూపి యేమియు నియ్యకుండెడి వాఁడను. మాయిరువుర స్వభావములలోను గలభేదమిది.

చదువంతగాలేని మూఢులవలన ధనవిషయమయి మాకు చిక్కులు కలుగుచువచ్చినను వారియాశ లత్యధికములయినవి కానివిగాను, అవి యత్యల్పముతోనే తృప్తినొందునవిగాను, ఉన్నవని యొప్పుకొనవలసియున్నది. ఇఁకవిద్య నేర్చినవారిలోనో యివి విపరీతములుగానుండినవి. వారియాశలకు పరిమితిలేదు; సామాన్యలాభముచేత వారికి తృప్తిలేదు. వారిలో కొందఱు స్వప్రయోజన పర్వతమును సహితము పరోపకారార్థమే యయినట్టు చూపఁగల శక్తిమంతులు. రామకృష్ణయ్యగారి వలనను సమాజము వారివలనను ధనస్వీకార మధికముగాచేసినవారును చేయ ప్రయత్నించినవారును చదువులేక సంపాదించుకో శక్తిలేని వారిలోకంటె చదువుకలిగి సంపాదించుకో శక్తిగలవారిలోనే యధికముగానుండిరి. ఇటువంటి విషయములనుగూర్చి చెప్పుట నాకును వినుట యితరులకును హృద్యముకాకపోయినను కొందఱు మహానుభావు లిప్పటికిని విషయములను విపరీతముగా పత్రికలలో తెలుపుచుండుటవలన సత్యము లోకమునకు తెలియుటకయి యొకటిరెండు సంగతుల నిచ్చటఁ బేర్కొనవలసివచ్చి నందుకు చింతిల్లుచున్నాను. మూడవవివాహముచేసికొన్న రామారావుగారికి


మున్నూరురూపాయల యిల్లిచ్చెదనని నేను వాగ్దానముచేసితినిగాని తెప్పించిన సొమ్మంతయు వివాహమునకే వ్యయపడినందున చెప్పినట్లుచేయలేకపోతిని. నేను రామారావుగారి యెదుటనే నాయశక్తతను రామకృష్ణయ్యగారికి తెలుపఁగా నిల్లుతామిచ్చెదమనిచెప్పిరి. 1885 వ సంవత్సరము సెప్టెంబరునెలలో రామారావుగారు మీరు వాగ్దానముచేసి దాదాపుగా మూఁడు సంవత్సరములయినను రామకృష్ణయ్యగారిప్పటికిని చేసిన వాగ్దానము చెల్లింపలేదనియు, ఆయనకు వ్రాసివెంటనే యిల్లిప్పింపవలసినదనియు, నాకు వ్రాసిరి. నేనానెల 13 వ తేదిని ఇతరవిషయములతోడిపాటుగా నీవిషయమునుగూర్చి రామకృష్ణయ్యగారికి వ్రాసితిని. ఆయన నాకు పంపిన ప్రత్యుత్తరము చూడుఁడు.

"Cocanada, 16th September 1885.

My dear Sir,

Yours of 13th Inst was duly to hand; I now reply for the present about T. Rama Row's subject. Though the human creation is alike in this world, yet there is individually ample selfishness; that appetite is much in him. I have done him good & gave him good many things and many times much money than you and I said we would give him. There is nothing due to him in any shape and he was many times overpaid; all that he wishes to ask is not at all due to him; or can it be even met from mercy or charitable side. However, to be asked by one, if possible, to get is not unnatural for any one; So, he does. Here I will state a few of my deeds of him,

1. He with his mother owed me before his marriage as I remember about .... Rs 100-0-0

2. After his marriage, according to his request, gave him a house situated on a large piece of ground, fit for building 2 houses more at at-least, this house is exchanged with another house of mine which cost me above ..... Rs 500-0-0 3. On this request and with that of his mother-in-law, I paid her ... Rs 350-0-0

4. I paid him for his sundry debts nearly ... Rs 30-0-0

5. I think, I paid him several times some sundry moneys and some sundry things ... Rs 50-0-0

6. I lent him a carriage and pony costing ... Rs 125-0-0

7. I gave his mother on his request once may be more than ... Rs 300-0-0

8. I paid him and his mother for some ceremonies ... Rs 50-0-0

Total Rs 1505-0-0

I never promised him another house again. I thought we must give a house, whether it may be you promised or I thought of giving. So I built a house here which cost me nearly Rs. 2,000 and it has a large piece of ground at the time of building this house. I told him the portion I am building to suit for 2 famalies and I told him I would give him portion of it & the other portion, I will make it available for any other W.M Couples and in the yard I will build or houses will be built for these married couples. So I am willing and will be willing to give him the portion, but cannot give him the whole house. If he does not like it, as you say you promised him Rs 300, I will give him this sum and he can buy another house and we should only give him that money, when he actually buys the house with the usual conditions - that the house purchased for the family and with the condition that it cannot be mortgaged or sold. I hope you will see now, we have done very much kindness and he is in every way better off by God's favour than any one else. Please tell him now he must be satisfied for the present and reconcile him with laws of contentment and in every way all the promises are fulfilled and above promises much is done to him and you have not to give him money or a house except as i said above the sum of Rs, 300 for a house, if he buys one separately without wishing to take the portion of the house we offer. We have done our best and more than our best is done to him. I have built this house so conveniently with a wish for the accommodation of the members of this association, because no houses are available here for the members when they come here and go to Madras and other places or come here and go to through this. In such a case, how can I sacrifice my big wish and give this large property to one family alone. I cannot give away things like that. With best wishes,

Yours truly

P. RAMAKISTIAH."

(మీ 13 వ తేది యుత్తరము సరిగా నాచేతికందినది. నేనిప్పుడు ప్రస్తుతము టీ. రామారావు గ్రంధమునుగూర్చి బదులిచ్చుచున్నాను. ఈప్రపంచములో మనుష్యసృష్టి యేకవిధముగానే యున్నను, ఒక్కొక్క మనుష్యునకు విస్తారము స్వార్థపరత్వమున్నది; ఆయాఁకలి యితనియం దధికముగా నున్నది. నేనతనికి మంచిచేసియున్నాను; అనేక వస్తువులను, నేనును మీరును ఇచ్చెదమన్న దానికంటె పెక్కు రెట్లెక్కువసొమ్మును, అతని కిచ్చితిని. ఏరూపమునను అతనికి బాకియున్న దేదియులేదు; అతనికి బహుగుణము లధికముగా నియ్యఁబడెను. అతఁడడుగ కోరునది యంతయు ఎంతమాత్రము అతనికి బాకియున్నదికాదు; దయ, లేక, దానపక్షముచేత సహితము అది యియ్యఁబడతగినదికాదు. అయినను, పొందుట సాధ్యమైనయెడల ఎవరిచేతనైనను అడుగఁబడుట యెవ్వరికిని అస్వాభావికముకాదు; ఆలాగుననే యతఁడుచేయుచున్నాఁడు. అతనికి నేనుచేసిన కార్యములను కొన్నిఁటి నిక్కడ చెప్పుచున్నాను.


1. అతని పెండ్లికిముందు నా జ్ఞాపకమునుబట్టి ఆతఁడును తల్లియు బాకియున్నది సుమారు - రు. 100-0-0

2. పెండ్లితరువాత ఆతని కోరికప్రకారము అధమము మఱి రెండిండ్లు కట్టతగిన పెద్దస్థలములోనున్న ఒక యింటి నతనికిచ్చితిని; ఈస్థలము ఈ మూతమునకంటె నా కెక్కువగా తగులుబడియైన మఱియొక యింటితో మార్చుకొనబడినది - రు. 500-0-0

3. అతని యొక్కయు అత్తగారి యొక్కయు కోరికపైని నేనతని యత్తగారికిచ్చినది. - రు. 350-0-0

4. ఆయన చిల్లర అప్పులకై నేనిచ్చినవి దాదాపుగా - రు. 30-0-0

5. కొంత చిల్లరసొమ్ము చిల్లరవస్తువులు పెక్కుమారులు నేనిచ్చుచువచ్చినవి. - రు. 50-0-0

6. నేనెరువిచ్చినబండి గుఱ్ఱము వెల. - రు. 125-0-0

7. అతని కోరికమీఁద తల్లికొక పర్యాయమిచ్చినది (ఎక్కువేకావచ్చును). - రు. 300-0-0

8. కొన్ని కర్మలనిమిత్తమయి అతనికిని అతని తల్లికిని ఇచ్చినవి. - రు. 50-0-0

మొత్తము - రు. 1505-0-0

అతనికి మఱియొక యిల్లిచ్చెదనని నేనెప్పుడును వాగ్దానము చేయ లేదు. మీరు వాగ్దానముచేసినదైన నేమి నేనియ్యఁదలఁచుకొన్న దైన నేమి మన మొక్క యిల్లియ్యవలెనని నేను తలఁచితిని. అందుచేత రు. 2,000 లు నాకు తగులుబడియైన యిల్లు నేనిక్కడ కట్టితిని; ఈయిల్లు కట్టుసమయమునందు దీనితోచేరి పెద్ద స్థలమున్నది. నేను కట్టుచున్న యీభాగములు రెండుకుటుం


బములకు తగియుండునని నేను చెప్పియుంటిని. దానిలో నొక భాగమీయన కిచ్చెదననియు, రెండవభాగము నెవరైన వేఱొక వితంతువివాహ దంపతుల కుపయోగపడునట్లు చేసెదననియు, ఈవివాహ దంపతుల నిమిత్తము దొడ్డిలో నేను కట్టెదను లేక యిండ్లు కట్టఁబడుననియు, నేనీయనకు చెప్పితిని. అందుచేత ఈభాగము నీయనకిచ్చుటకు నేనిప్పుడిష్టపడుచున్నాను. ముందును ఇష్టపడియెదను కాని యిల్లంతయు నేనీయనకియ్యజాలను. ఈయన కది యిష్టము లేనిపక్షమున, మీరు రు. 300 లిచ్చుటకు వాగ్దానముచేసినట్టు చెప్పుచున్నారు గనుక, ఆసొమ్ము నేనీయనకిచ్చెదను; ఆయన వేఱేయిల్లు కొనుక్కోవచ్చును. మామూలు షరతులతో ననఁగా - తాకట్టు పెట్టుకొనుటకుఁగాని అమ్ముకొనుటకుఁగాని హక్కు లేకుండ కుటుంబనిమిత్తమే యుపయోగ పడునట్లు - ఈయన సరిగా యిల్లు కొన్నప్పుడు మాత్రమే మనమీసొమ్మీయన కియ్యవలెను. మనము మిక్కిలి యెక్కువ యుపకారముచేసి యున్నా మనియు, ఈశ్వరానుగ్రహమువలన ఈయన ప్రతివిధముచేతను ఇతరులందఱికంటెను మంచిస్థితిలో నున్నాఁడనియు, మీరిప్పుడు చూతురని నేను కోరుచున్నాను. ఇప్పటిదానితో ఈయన తృప్తినొంది యుండవలెననియు, సంతుష్టి ధర్మములతో సమాధానపడవలెననియు, ప్రతివిధముచేతను వాగ్దానములన్నియు నెఱవేర్పఁబడినవనియు, వాగ్దానములకంటె నధికముగా నీతనికి చేయఁబడెననియు మన మిచ్చెదమన్న యింటిభాగమును పుచ్చుకొనుట కిష్టములేక వేఱుగా నొక యిల్లు కొనెడు పక్షమున నేను పైని చెప్పినట్లుగా నింటికొఱకు రు. 300 రూపాయలు తప్ప సొమ్ముగాని యిల్లుగాని మీరియ్యవలసిన పనిలేదనియు, దయచేసి మీరీయనతో చెప్పుఁడు. మనచేతనైనదంతయు చేసియున్నాము, మనచేత దానికంటె నెక్కువగా నీయనకు చేయఁబడినది. వారిక్కడకువచ్చి చెన్న పట్టణమునకును ఇతర స్థలములకును పోవునప్పుడుగాని యితర స్థలముల నుండి దీనిగుండపోవుట కిచ్చటికి వచ్చునప్పుడుగాని సామాజికుల కిక్కడ వేఱుగృహములు లభ్యములుకావు గనుక ఈసంఘముయొక్క సామాజికులకు


వసతిపడవలెను కోరికతో నే నీయింటి నెంతో యనుకూలముగా కట్టించి యున్నాను. అట్లయియుండఁగా, ఈ పెద్ద సొత్తు నొక్క కుటుంబమునకు మాత్రమే యిచ్చి నా పెద్ద కోరిక నెట్లు నేను బలిపెట్టఁగలను? ఈప్రకారముగా నేను వస్తువుల నిచ్చివేయఁజాలను."

ఈ యుత్తరము వచ్చువఱకును రామకృష్ణయ్య గారింత సొమ్మీయన నిమిత్తము వ్యయపెట్టిరని నాకు తెలియదు. ఇక్కడ రాజమహేంద్రవరములో నొక్కొక్క వరుని విషయమున నింతింతసొమ్ము వ్యయపెట్టుటకు సమాజము వారొయొద్ద ధనమునులేదు; ఉన్నను ధనమును విచ్చలవిడిగా వ్యయముచేయనుచేయరు. సమాజస్థాపనమయిన 1884 వ సంవత్సరమునం దిచ్చిన యిరువదిరూపాయలునుగాక, 1885 వ సంవత్సరమునందు సమాజమువారు కోదండరామయ్య గారికి భార్య నగల నిమిత్తము రు. 80-0-0లును, భార్య ప్రసవము నిమిత్తము రు. 10-0-0లును, ఏప్రిల్ మెయి నెలలకు నెల కాఱేసి రూపాయల చొప్పున రు. 12-0-0లును, సెలవుమీఁదనున్న ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలకు నెలకు పదేసి రూపాయల చొప్పున రు. 40-0-0 లును మొత్తము నూటనలువదిరెండు రూపాయలు (రు. 142-0-0) సమాజము వారిచ్చిరి. ఈయన వివాహనిమిత్తము వ్యయపడిన రు. 454లలో రు. 110 ల పయి చిల్లరనగలుమాత్రమే యీయనభార్య కప్పుడు పెట్టఁబడినవి. ఇన్నూఱురూపాయల ప్రాప్తికి రావలసిన మిగత మొత్తము నగలనిమిత్త మియ్యఁబడినది గాని యీయన నగలు చేయించి పెట్టినట్టు కనఁబడదు. భార్య యొక్క ప్రసవము నిమిత్తముపోయి కాకినాడలోనుండిన కాలములో నచ్చటి వ్యయములను రామకృష్ణయ్యగారు భరించిరి. కోదండరామయ్యగా రీకాలములో నిరువదిరూపాయలు జీతముగల యుపాధ్యాయపదమునం దుండిరి. ఈవఱకు నేను జెప్పినట్లు కొంచెము వైరకారణము కలుగఁగానే నాకు విరోధులుగా నున్న పెద్దమనుష్యులు కొందఱు తమయొద్ద కాలోచనకు పోయిన యొకరిద్దఱు వరుల సాహాయ్యముతో తక్కినవరులను తమయొద్దకుఁ


బిలిపించుకొని నాపయిని దోషారోపణములు చేయుచు సమాజమువారికి విన్నపములు పంపునట్లు వారిని పురికొల్పఁజొచ్చిరి. రాజమహేంద్రవరములోనున్న వారిలో నొకరిద్దఱు మాత్రము బాల్యమగుటచే యుక్తా యుక్త వివేకము లేక వారిదుర్బోధనలకు లోఁబడి వారు వ్రాయించియిచ్చిన యుత్తరములను సమాజమువారికిఁ బంపిరి. వారిలో నొక్కరైన తణుకు చెలపతిరావుగారు తన వివాహములో నియ్యఁబడిన కట్నములను తనకియ్య లేదు గనుక నాయొద్దనున్న బట్టలను తనకిప్పింపుమని సమాజమున కొక విన్నపమును బంపెను. సమాజమువా రావిన్నపమును వెంటనే నిరాకరించిరిగాని యటుతరువాత నతఁడు తన్ను ప్రోత్సాహపఱిచి విన్నప మిప్పించిన వారి పేరులుచెప్పి క్షమార్పణముచేసిన మీఁదట నాయొద్ద నిలువయున్న నాలుగు బట్టలను అతనికిచ్చి వేసితిని. ఆతని వివాహమునకు చెన్న పట్టణములో 17 బట్టలు కట్నములు చదివింపఁబడినవి. వధూవరులకు మధుపర్కములు మొదలయినవానికి పెండ్లిలో కావలసిన వస్త్రముల నన్నిటిని మేమే యక్కడకొనియిచ్చితిమి. కట్నములిచ్చిన 17 బట్టలలో కొన్ని చీరలు; కొన్ని పంచెలు; కొన్ని యెక్కువ వెలగలవి; కొన్ని తక్కువ వెలగలవి. వీనిలో మంచిబట్టలను రెంటిని చెన్న పట్టణములో వధూవరులకిచ్చితిని. ఒకచీర వరుని మఱదలికిచ్చితిని; ఒకచీర నాభార్యకిచ్చితిని; రెండువస్త్రములను వివాహమునకువచ్చిన రామారావుగారికిని ఆయన భార్యకును (మూడవ వివాహదంపతులు) ఇచ్చితిని; సామాన్యపు బట్టలు రెండు మావెంటవచ్చిన మునిసామికిని అతనిభార్యకును ఇచ్చితిని; ఒకబట్టను చెలపతిరావు మఱదలిని పెండ్లియాడు తలంపున మాతోవచ్చిన ప్రకాశరావుగారికిచ్చితిని; రెండుబట్టలు కాకినాడ వచ్చిన పిమ్మట బోడా శ్రీరాములకును అతనిభార్యకును (ఏడవ వివాహదంపతులు) ఇచ్చితిని; రెండు మంచి వస్త్రములను రాజమహేంద్రవరము వచ్చిన తరువాత గర్భాధానసమయమున వధూవరులకిచ్చితిని. ఇవి పోఁగా మిగిలియున్న నాలుగు బట్టలను సమయము వచ్చినప్పుడు వధూవరులకిచ్చుటకయి నాయొద్ద


నిలువయుంచితిని. ఈకట్నములలోని బట్ట యొకటియైనను నేనుమాత్రము పుచ్చుకొనలేదు. ఈతనిని ప్రేరేచిన పెద్దమనుష్యుల పేరు లిచ్చట పేర్కొనుట యనావశ్యకము. నాకు రెండువిధములుగా శత్రువులనేకులేర్పడి నాకు కీడు వేఁడుచుండెడువారు. అందొక తెగవారు వితంతు వివాహ ప్రతిపక్షులుగానుండి నన్ను ద్వేషించువారు; ఇంకొకతెగవారు వివేకవర్థనిలో నేను తమయకార్యములను బయలఁబెట్టుచు వచ్చుటచేత నంతస్తాపమునొంది వ్రేటుపడ్డ పాములవలె పగతీర్చుకొనుటకు సమయము ప్రతీక్షించుచుండెడివారు. ఈకడపటి తెగవారు మాసామాజికులలో సహిత మొకరిద్దరుండిరి. వీరి చర్యలను సూచించుచు నాస్త్రీపునర్వివాహభూతవర్తమానస్థితులను గూర్చిన యుపన్యాసములలో నిట్లు వ్రాసితిని.

"ఉన్న యైకమత్యమును చెడఁగొట్టుట యెట్టివారికిని సులభముకాని చెడినదానిని మరల కూర్చుట సాధారణముగా సాధ్యముకాదు. అట్లు నాటఁబడిన వైరవిషబీజము మెల్ల మెల్లఁగా నంకురించి వివాహముచేసికొన్న వారికే కాక సామాజికులలో నొకరిద్దఱికిఁగూడ తన విషవాయువును బఱపి యీ మహాకార్యమునకు భంగకరమయిన దుష్ఫలములను కొంతవఱకుఁ గలుఁగజేసి నందునకయి యెంతయు చింతిల్లుచున్నాను. ఒక సత్కార్యమునకు విఘ్నము కలుగఁజేసెడి యవకాశము కొంచెము లభింపఁగానే దానిని సందుచేసికొని గోరంతలు కొండంతలుచేసి ద్వేషాగ్నిని ప్రజ్వలింపఁజేసి కార్యవిఘాతమయి నప్పుడుచూచి సంతోషింపవలెనని కనిపెట్టుకొనియుండు మహానుభావులు లోకములో ననేకులుందురు. అట్టివారి దుర్బోధలు విని చెడిపోక బీటలు వాఱుచున్న యైకమత్య దుర్గమును స్వలాభముకొఱ కెల్లవారును శాంతిసుధతో నతికింపఁ జూతురని నమ్ముచున్నాను. యుక్తకాలములో నట్లుచేయక పోయినయెడల కార్యము మించినతరువాత పశ్చాత్తాపపడిన ప్రయోజనము లేక స్వయంకృతదోషఫలము ననుభవింపవలసివచ్చును."


వివాహములయినవారిలో విద్యాధికులుకాని వారు తమకు కష్టములు కలుగుచున్నవని యితరులతో నంతగా చెప్పుకొనుచుండక పోయినను విద్యాధికులలో కొందరు తమకు కలిగిన యల్పకష్టములను కోటిగుణితముగా చాటుకొనుచు వీరివారియొద్దకు పోయి సదా మొఱ్ఱపెట్టుకొనుచుండెడివారు. వారు పడ్డ కష్టములు వారు ఘోషించుకొనుచుండినంత విశేషమైనవి కావని నేను చెప్పఁగలను. వారికేవిధమయిన కష్టములును కలుగకుండఁజేయుటకయి నేనును నామిత్రులును మా చేతనైనదంతయుఁ జేయుచుంటిమి. ఈవివాహములు చేసికొన్న వారిలో నావఱకెవ్వరికిని సొంతయిండ్లులేవు. అట్టివారికందఱికిని కాపురముండుట కిండ్లీయఁబడినవి; అందుచేత మాయిండ్లలోనుండి లేచి పొండని వీరికి తొందర యిచ్చువా రెవ్వరునులేరు; పనిచేయుటకయి సేవకులియ్యఁ బడిరి: వారు ప్రతిదినమును మంచినీళ్లిచ్చు చుండుటయేకాక కావలసినప్పుడు వంటసహితముచేసి పెట్టుచుండిరి. భోజన వ్యయములుమాత్రమే కాక చదువుకొనువారికి పాఠశాలల జీతములును పుస్తకములును బట్టలును వేఱుగా నీయఁబడుచువచ్చినవి; వ్యాధులు వచ్చినప్పుడు వైద్యపుకర్చులను, శుభాశుభకార్యవ్యయములను, సమాజమువారే భరించుచుండిరి. ఎవ్వరికైనఁ గొంచెము కష్టము వచ్చిన పక్షమున నేనును గవర్రాజుగారును బోయి విచారించుచు కావలసిన సాయమునంతయు జేయుచుంటిమి. అప్పుడు మాతో మాటాడనివారొక రిద్దఱుండినను వారికి కష్టము వచ్చినప్పుడు సహితము మేముపోయి తోడుపడకుండలేదు. ఆకాలమునందు పులవర్తి శేషయ్యగారు మాయింటికిరాక నాతో నంతగా మాటాడకుండిరి. నేనొకదినమున పనిమీఁద నెక్కడికోపోయి పగలు పదునొకండు గంటలకు భోజనము నిమిత్తము నడిచి యింటికిఁ బోవుచుంటిని. బజాఱులో నన్ను దూరమునుండిచూచి యతఁడు తానెక్కివచ్చుచుండిన బండిలోనుండి దిగివచ్చి నాపాదములఁబడి యేడువఁజొచ్చెను. నేనతనిని లేవఁదీసి యేల యేడ్చెదవని యడుగఁగా కొంచెముకాలము క్రిందట ప్రసవమయిన తనభార్యకు సూతిక కనఁబడి జబ్బుగా


నున్నదనియు తాను వైద్యుని నిమిత్తము వెళ్లుచున్నాననియు, నతఁడు చెప్పెను. వైద్యుని నేను తీసికొనివచ్చెదననిచెప్పి, భార్యవద్ద నుండుటకయి వచ్చిన బండిలోనే యతనిని మరల నింటికిఁ బంపివేసి, నేను మిక్కిలి బడలియున్నను వెనుక తిరిగి వైద్యునియింటికి నడిచిపోయి, యాయనను వెంటఁగొని తిన్నగా నిన్నీసుపేటకు శేషయ్యగారి యింటికిఁబోయి తగిన చికిత్సలు చేయించి, పిమ్మట నింటికి భోజనమునకుఁబోయితిని. నేను భోజనముచేయఁగానే గవర్రాజుగారి యింటికిఁబోయి యాయననుగూడఁ దీసికొని మరల నిన్నీసుపేటకుఁబోయితిమి. మేమిరువురమును రాత్రి యెనిమిది గంటలవఱకును శేషయ్యగారియింటియొద్ద నున్నపిమ్మట గవర్రాజుగారు నన్ను మాయింటికి తీసికొనివచ్చి, నాది దుర్బలశరీరముగుటచేత జబ్బు చేయునని భయపడి నన్ను రాత్రి మరల రాకుండునట్లు వేఁడుకొని యొప్పించి, తానింటికిఁబోయి భోజనముచేసి తిరిగి యిన్నీసుపేటకుఁ బోయెను. విధివశముచేత శేషయ్యభార్య కాలవశము నొందెను. అప్పుడు పుట్టిన యాపురుషశిశువును బహుసంవత్సరములకు తరువాత నాతఁడు తాను కాలధర్మము నొందునప్పుడు నాకొప్పగించెను. నేనాపిల్లవానిని నాయొద్ద నుంచుకొని పెంచి విద్య చెప్పించితిని. అతఁడిప్పుడు వివాహముచేసికొని తనకు కలిగిన పురుష శిశువుతో సుఖముగా మాతోటలోనే యున్నాఁడు.

మిత్ర సాహాయ్యముతో కృషిచేసి నేను రాజమహేంద్రవరసు క్షేత్రమున విత్తనమువేసి మొలిపుంచిన విశ్వస్తావివాహనవలతాంకురమునకు పట్టుకొమ్మయయి నానాముఖముల తీగలు సాగించిన శ్రీపైడారామకృష్ణయ్య గారు బాలవితంతువుల యభాగ్యముచేత 1886 వ సంవత్సరము మార్చినెల 28 వ తేదిని ప్రాతఃకాలమున స్వర్గస్థులగుట తటస్థించెను. ఈయన మరణమునుగూర్చి నేను 1887 వ సంవత్సరారంభమున చెప్పినమాటలనే నిచ్చట మరలఁ జెప్పుచున్నాను. "స్త్రీ పునర్వివాహ ప్రయత్నమునకెల్లను రామకృష్ణయ్యగారు ప్రాణముగా నుండెడివారు: అటువంటివారు లోకాంతరగతు


లగటచేత మన సమాజము ప్రాణములేని బొందెవంటిదైనది." ఆయన తనమరణమునకు ముందు కొంచెముకాలము క్రిందట రాజమహేంద్రవరమునకు వచ్చినప్పుడు మొదటి రెండు వివాహములకును ప్రత్యేకముగాచేసిన వ్యయములును తరువాత నిచ్చిన పదివేలరూపాయలును కట్టించిన యిండ్లును స్త్రీ పునర్వివాహాభివృద్ధినిమిత్తము చేసిన యితర వ్యయములును కలుపుకొని యిరువదివేల రూపాయలయ్యెననియు, మొట్టమొదట నిచ్చెదనని వాగ్దానముచేసినముప్పది వేలరూపాయలలో నీయిరువది వేలరూపాయలును పోఁగా మిగిలిన పదివేల రూపాయలును వేగిరమే యిచ్చెదననియు, చెప్పినప్రకారముగా మరణమునకు నాలుగుదినములు ముందు తమ సమ్ముఖముననుండ తటస్థించిన యాత్మూరి లక్ష్మీనరసింహముగారిని సమాజపక్షమున ధర్మకర్తను (trustee) గా నేర్పఱచి యుద్దేశించుకొన్న పదివేలరూపాయలను మరణశాసన మూలమున సమాజమునకిచ్చి చేసినవాగ్దానమును పూర్ణముగా చెల్లించుకొనిరి. ఆయన వ్రాసిన మరణ శాసనములు రెండును నిందుక్రింద పొందుపఱుపఁబడుచున్నవి : -

1.

"I, Pyda Ramakrishniah of Cocanada, son of Pyda chelamayya, do hereby entrust you with two Hundies executed by Rajah Venkatadri Apparow Bahadur Garu on the 2rd March 1886 to the value of Rs. 10,000 (Rupees ten thousand only) and request you to act as trustee for Widow Marriage Association so that you may use the interest to be realised from the above sum in the support of remarried widows and their husbands and their children and for bringing about widow marriages; but not a single pie should be spent from the principal. I further request that you should do this business to the best of your ability and discretion for the improvement of the widow marriage cause and that you should make such arrangements that the object might be carried on is perpetuity even after your demise

P. RAMAKRISHNAYYA."

18th March 1886

Cocanada.

(కాకినాడనివాసియు పైడా చెలమయ్యకుమారుఁడునైన పైడా రామకృష్ణయ్య అనెడి నేను 1886 వ సంవత్సరము మార్చి నెల 3 వ తేదిని రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దరుగారివలన రు. 10,000 (పదివేలరూపాయలు మాత్రము)లకు వ్రాయఁబడిన రెండు హుండీలను మీవశముచేసి పయి మొత్తమువలన వచ్చెడు వడ్డిని వివాహముచేసికొన్న వితంతువులయొక్కయు వారి భర్తలయొక్కయు వారి బిడ్డలయొక్కయు పోషణము నిమిత్తమును వితంతు వివాహములను జరపు నిమిత్తమును మీరుపయోగించుటకయి వితంతు వివాహ సమాజమునకు ధర్మకర్త (Trustee)గా పనిచేయుటకు మిమ్ము వేఁడుచున్నాను; కాని అసలులోనుండి యొక్క దమ్మిడికూడ కర్చుచేయఁబడకూడదు. అంతేకాక వితంతువివాహపక్షాభివృద్ధి నిమిత్తమయి మీయావచ్ఛక్తిని బుద్ధిని వినియోగించి యీపనిచేయవలెననియు మీమరణానంతరము సహితము శాశ్వతముగా నాయుద్దేశము జరగుటకయి తగినయేర్పాటులు చేయవలసినదనియు మిమ్ము వేఁడుచున్నాను.)

ఈమరణశాసనములో వితంతువివాహసమాజ మన్నచోట రాజమహేంద్రవరమనికాని, ధర్మకర్త యన్నచోట ఆత్మూరి లక్ష్మీనరసింహము గారనికాని, వ్రాయఁబడలేదు. వితంతు వివాహసమాజ మొక్కటియే యుండుటచేత వేరుగ రాజమహేంద్రవరమనుట యనావశ్యకము; తమపేరు చేర్పవలసినదని లక్ష్మీనరసింహముగారు రామకృష్ణయ్యగారికి వ్రాసిరికాని లేఖ చేరులోపలనే యాయన మరణమునొందుట తటస్థించెను.

II.

"I, Pyda Ramakristniah, son of Chalamayya Garu, residing at Cocanada Godavery Ditrict, do hereby make a will as regards the property herein below described in the following way.

As I have various properties, I am obliged to make various wills but the wills will not contradict one another and each will have its force. The houses together with sites herein after mentione I and situate at Cocanada and Rajahmundry will be given to the persons named herein in perpetuity to be enjoyed by them from generation to generation without the power of alienation either by sale, mortgage or otherwise and further that the occupants should be liable to be rejected if they behave improperly. The houses that are in my name, the houses and sites that are in the name of Kandukuri Veerasalingam Pantulu Garu, Kotikalapundi Rameswara Row Garu and any other, for the sake of the Widow Marriage Association will be transferred by the Widow Marriage Association to the several persons mentioned below with the conditions above stated.

P. RAMAKRISTNIAH."

18th March 1886.

ఁ (చెలమయ్యగారి కుమారుఁడనై గోదావరిమండలములోని కాకినాడలో నివసించుచున్న పైడా రామకృష్ణయ్య అను నేను ఈక్రింద వివరింపఁబడిన సొత్తు విషయమయి యీక్రిందిరీతిగా నిందువలన మరణశాసనము చేయుచున్నాను.

"నాకు వేఱువేఱు సొత్తులున్నందున, నేఱుపఱు మరణశాసనములను చేయవలసిన వాఁడనగుచున్నాను, కాని మరానశాసనము లొకదాని నొకటి బాధింపక దేని కది తన బలమును కలదయి యుండును.

ఈక్రింద పేర్కొనబడినట్టియు కాకినాడలోను రాజమహేంద్రవరములోను ఉన్నట్టి గృహములు స్థలములతోఁగూడ ఈక్రింద పేర్కొనఁబడిన వారికి విక్రయమువలనఁగాని తాకట్టువలనఁగాని యితర విధముగాఁ గాని యన్యా క్రాంతముచేయుట కధికారము లేకుండ ఒక తరమునుండి యొక తరమునకు శాశ్వతముగా వారనుభవించుటకు ఇయ్యఁబడును; అంతేకాక వారయోగ్యముగా ప్రవర్తించినయెడల వానియందున్న వారు వెడలఁగోట్టఁబడుటకు


తగినవారుగా నుండవలెను. వితంతువివాహ సమాజమువారికొఱకు నాపేరిటనున్న యిండ్లును, కందుకూరి వీరేశలింగము పంతులుగారు కొటికలపూడి రామేశ్వరరావుగారు మొదలైనవారి పేరిటనున్న యిండ్లును స్థలములును వితంతువివాహ సమాజమువారిచేత ఈక్రింద చెప్పఁబడిన వేఱువేఱు మనుష్యులకు పయిని చెప్పఁబడిన షరతులతో సంక్రమింపచేయఁబడును.)

ఈమరణశాసనముతో జత పఱుపఁబడిన 19 వ తేదిగల పట్టికలో నిక్కడ నున్నవారిలో మొదటి వివాహమును కడపటివివాహమునుచేసికొన్న వారి పేరులు తప్ప తక్కిన వివాహములు చేసికొన్న దంపతుల పేరు లుదాహరింపఁబడివారివారి వశములోనున్న యిండ్లు వారికియ్యఁబడునట్లు వ్రాయఁబడెను. నల్లగొండ కోదండరామయ్యగారును చేబోలు వెంకయ్యగారును కాపురమున్న యిల్లు మూడుభాగములుగా భాగింపఁబడి దక్షిణభాగము కోదండరామయ్యగారి యధీనములోను, ఉత్తరభాగము వెంకయ్యగారి యధీనములోను, నడిమిభాగము పటానేని వెంకయ్యగారి యధీనములోను, ఉండినవి. వారివారి కియ్యవలసిన భాగములను వివరించునప్పుడు రామకృష్ణయ్యగారు తమ మరణ శాసనాను బంధపట్టికలో" 7 Nallagonda Kodanda Ramaiah Garu and his wife Subbamma Garu (నల్లగొండ కోదండరామయ్యగారు ఆయనభార్య సుబ్బమ్మగారు) నాసొమ్ముతో కొటికలపూడి రామేశ్వరరావుగారి పేరిటకొన్న చెయినులుగారి సత్రములో దక్షిణవైపు భాగము దానికింద స్తలము అనగా యీ కోదండరామయ్యగారి భుక్తంలోవున్న యిల్లు స్తలము"8. Chobolu Venkiah Garau and his wife Venkamma Garu (చేబోలు వెంకయ్యగారు ఆయనభార్య వెంకమ్మగారు) సదరులోగిటిలో వుత్తరం వైపుభాగము స్తలము అనఁగా యీ వెంకయ్యగారి స్వాధీనములోవున్న ఇల్లు స్తలము." అనివ్రాసి, దానిక్రింద"7, 8 Remarks ఈయిల్లుయావత్తూ రెండు సమభాగములు వకభాగము కోదండరామయ్యగారికిన్ని, రెండవభాగము చేబోలు వెంకయ్యగారికిన్ని యివ్యవలసినది." అని


యొక యనుశాసనమును లిఖించిరి. ఇందువలన నిప్పుడు పదుమూడవ వివాహముచేసికొన్న పటానేని వెంకయ్యగారికిని ఆయనభార్య సుబ్బమ్మగారికిని కాపురముండుట కిల్లు లేకుండపోయినది. ఈపటానేని వెంకయ్యగారు ప్రాథమిక పరీక్ష (Primary Examination) యందు కృతార్థుఁడయి యెనిమిదిరూపాయల జీతముగల యుపాధ్యాయ పదము నందుండెను.

పూర్వోక్తానుబంధ పట్టికలో రామకృష్ణయ్యగారు తాడూరి రామారావుగారి యింటినిగూర్చి "3 Taduri Ramaraow Puntulu Garu and his wife Seetamma Garu (తాడూరి రామారావుపంతులుగారు ఆయన భార్య సీతమ్మగారు) శ్రీపిఠాపురపు రాజాగారివద్ద సూర్యారావు పేటలో నేను కొన్న లోగిలి స్తలము అనగా యీరామారావుగారి స్వాధీనభుక్తంలో వున్న ఇల్లు స్తలంలో కొంతభాగం - యిందునుగురించి రిమార్కుచూచేది" అని వ్రాసి దానిక్రింద "సూర్యారావుపేటలో మేన్‌రోడ్డున చేరివున్న పెంకుటియిల్లు విడోమారేజిస్ కుటుంబములవారు కాపురములు వుండడముకు రెండుభాగములుగ విభజించడమైనది. 1 వుత్తరం వయిపువాటా వక భాగం 1 దక్షిణవయిపువాటా వకభాగం. 1 యీరెండు భాగములలో తాడూరిరామారావుగారికి ఆయనకు యిష్టమయిన వకభాగమున్ను, నడవా నున్న ఆయన కిందను యేర్పర్చడమైనది. ఇదివరలో ఆయనకు రు. 400-0-0 కిమ్మతుగల యిల్లు యిస్తానని వాగ్దత్తంచేసి వుండడమైనది. యెక్కువ కిమ్మతుగలదిన్ని నడవ కలుపుకుని యెక్కువభాగము అయినప్పటికిన్ని రామారావు గారికి వుండడమునకు యేర్పర్చడమయినది............................................

1 పయిన వ్రాసినప్రకారం వకభాగము రామారావుగారు పుచ్చుకోవడముకు యిష్టము లేనియెడలనున్న ఆయన వేరే యిల్లు కొనిక్కుంటానని కోరినయెడలనున్న ఆయనయందు నాకు వుండే దయచేత ఆయన వేరే యిల్లు కొనుక్కోవడపు తరుణం తటస్తమయినప్పుడు నాకుమాళ్లు ఆయనకు


రు. 500-0-0 అయిదువందలరూపాయీలు నగదుయిచ్చి ఆయనకు యిస్తానన్న భాగముకూడా నాకుమాళ్లవశంలో వుండగలందులకు యేర్పర్చడమైనది." అని యనుశాసనమును చేర్చిరి.

రామకృష్ణయ్యగారి మరణానంతరమున వారు వితంతువివాహసమాజమువారి పక్షమున వ్రాసియిచ్చిన మరణశాసనములను రెంటిని ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు తీసికొనివచ్చి సమాజమునకిచ్చిరి. ఆయన సమాజమువారి కోశాధ్యక్షుఁడయినందున తెచ్చిన మరణశాసనములు రెండును లక్ష్మీనరసింహముగారియొద్దనే యుంచఁబడెను. 1886 వ సంవత్సరము ఏప్రిల్ నెల 3 వ తేదిని జరగిన సమాజముయొక్క కార్యనిర్వాహక సంఘమువారి సభలో నీక్రిందినిర్ధారణము చేయఁబడినది.

"5. That the wills executed by late Ramakrishniah Garu in favour of the Association be registered." (సమాజమున కనుకూలముగా గతించిన రామకృష్ణయ్యగారిచే చేయఁబడిన మరణశాసనములు లేఖ్యారూఢములు చేయఁబడవలెను.)

ఈనిర్ధారణముక్రింద నగ్రాసనాసీనుఁడుగానుండిన మాకర్లసుబ్బారావు నాయఁడు బీ. ఏ., బీ. ఎల్., గారిచేతను, ఆత్మూరి లక్ష్మీనరసింహముగారి చేతను, బసవరాజుగవర్రాజుగారిచేతను, నాచేతను, న్యాపతిసుబ్బారావు పంతులుగారిచేతను, వ్రాళ్లుచేయఁబడెను. నాఁడు జరగిన యీకార్యనిర్వాహక సంఘసభలో పయినివ్రాళ్లుచేసినవారు మాత్రమేకాక సోమంచి భీమశంకరము గారును ఆచంట లింగరాజు గారునుకూడ నుండిరి.

మఱియాఱుదినముల కనఁగా 1886 వ సంవత్సరము ఏప్రిల్ 9 వ తేదిని లక్ష్మీనరసింహముగా రగ్రాసనాసీనులుగానుండి జరపిన కార్యనిర్వాహక సంఘ సభయం దీక్రింది నిర్ధారణములు చేయఁబడినవి.

"3. That as soon as funds permit a house be built in the Vacant site bought at Innespeta at a cost of between two and


three hundred rupees for making provision for the residence of pataneni Venkiah at Rajahmundry." (తగినంతసొమ్ము చేతికి రాఁగానే పటానేని వెంకయ్య నివాసముకొఱకు రాజమహేంద్రవరములో ఇన్నీసుపేటలో కొన్న కాలీ స్థలములో ఇన్నూఱురూపాయలకును మున్నూఱు రూపాయలకును మధ్యగానున్న వ్యయముతో ఇల్లు కట్టించవలెను.)

"5. That Mr. B. Gavarraju be authorised to execute a rent deed on behalf of the Association to N. Kodandaramayya at a rent of 6 Rs. a year for his half share of the house in Old Taluq cutchery street with a condition that the house should be under the control of the Assn, for one year at the least and the engagement should thereafter be terminated by two months notice on either side."

(ఇల్లు అధమ మొక సంవత్సరవఱకును సమాజమువారి స్వాధీనములోనుండి తరువాత నీయొడంబడిక యుభయపక్షములలో నెవ్వరిచేతనైనను రెండుమాసముల నివేదన పత్రికతో నంతమయ్యెడు షరతుతో పాతతాలూకాకచేరి వీధిలోనున్న యింటిలోని యాతని యర్థభాగమునకు సంవత్సరమున కాఱురూపాయలిచ్చునట్లు ఎన్. కోదండరామయ్యగారికి సమాజమువారి పక్షమున అద్దె చీటివ్రాసి యిచ్చుటకు బీ. గవర్రాజుగారి కధికారమియ్య బడినది.)

"6. That after the execution of the rent deed, Mr. A. L. Narasimham be authorised to divide the above house according to the will of P. Ramakrishnayya."

(అద్దె చీటివ్రాసిన తరువాత పీ. రామకృష్ణయ్యగారి మరణశాసన ప్రకారముగా పయియింటిని భాగించుటకు ఏ. ఎల్. నరసింహముగారి కధికారమియ్యఁ బడినది.)

రామకృష్ణయ్యగారి మరణశాసనాను సారముగా నిల్లు రెండు భాగములుచేసి యిద్దఱికి యిచ్చినతరువాత వారు పటానేను వెంకయ్యగారి కాపు


రమున కియ్యనిపక్షమున నతఁడిల్లులేక చిక్కులుపడవలసివచ్చుననియు, ఇప్పుడే యిల్లద్దెకియ్య మనెడు పక్షమున మూడవ నిర్ధారణ ప్రకారముగా నతిని కట్టించి యిచ్చువఱకును యథాప్రకారముగా నతనిని నడిమిభాగములోనే యుంచి గృహవిభాగము తరువాత చేయవచ్చు ననియు, ఇల్లిచ్చెదమనెడు పక్షమున సంవత్సరకాలమద్దెకు పుచ్చుకొని యతని నందులో కాపురముపెట్టి యీసంవత్సరములోపల నిల్లుకట్టించి యియ్యవచ్చుననియు, ఉద్దేశించి యీ కడపటి యయిదాఱు నిర్థారణములు రెండును చేయఁబడినవి. వితంతువివాహ పక్షమునం దభిమానముగలవాఁడును పెద్దాపురములో ప్రాడ్వివాకుఁడు (Dt Miff)గా నున్న వాఁడును అయిన మల్హరిరావు పంతులుగారు కోదండరామయ్య గారికి తనకార్యస్థానములో రు. 15 లు జీతముగల లేఖకోద్యోగము నిచ్చినందున ఆయన యక్కడకు పోవునప్పుడు పూర్వోక్త నిర్ధారణానుకూలముగా నిల్లద్దెకిచ్చుట కంగీకరింపఁగా నద్దెచీటివ్రాసిపుచ్చుకొని యథాపూర్వముగా పటానేని వెంకయ్యగారి కుటుంబము నందుంచితిమి. పిమ్మట లక్ష్మీనరసింహముగా రిల్లు రెండుభాగములుచేసి కోదండరామయ్యగారి కర్థభాగమిచ్చిరి.

ఏప్రిల్ నెల 3 వ తేదిని చేయఁబడిన నిర్ధారణ ప్రకారముగా మరణ శాసనములను రెంటిని గొనిపోయి లేఖ్యారూఢము చేయించుటకయి సమాజ సహాయకార్యదర్శియైన సోమంచి భీమశంకరముగారు లక్ష్మీనరసింహము గారి యొద్దకుపోయి యడుగఁగా, పదివేలరూపాయల మరణశాసనమును తన యొద్దనే యుంచుకొని మిగిలిన మరణశాసనము నొక్కదసనినే నరసింహము గారిచ్చినందున భీమశంకరము గా రొక్క మరణశాసనమును మాత్రమే 1886 వ సంవత్సరము మెయినెల 6 వ తేదిని సహాయలేఖ్యారూఢాధికారి (Sub Registrar) యెదుటఁ బెట్టవలసినవాఁడయ్యెను. లక్ష్మీనరసింహముగారు జూన్ నెల 26 వ తేదిని సహాయలేఖ్యారూఢాధికారి కార్యస్థానమునకుపోయి మరణశాసనము రామకృష్ణయ్యగారు వ్రాసి యిచ్చినట్టు సాక్ష్యమిచ్చెను.


ఆమఱునాఁడనఁగా 1886 వ సంవత్సరము జూన్ నెల 27 వ తేదిని జరగిన సమాజకార్యనిర్వాహకసంఘమువారి సభలో-

"4. That the secretary, N. Subbarau Pantulu, be authorized to present the will of P. Ramakrishniah Garu before the Sub Registrar of Rajahmundry." (పీ. రామకృష్ణయ్యగారి మరణ శాసనమును రాజమహేంద్రవర సహాయ లేఖ్యారూఢాధికారి ముందర్పించుటకు కార్యదర్శియైన ఎన్. సుబ్బారావు పంతులుగారి కధికారమియ్యఁబడినది.)

అని మిగిలియున్న రెండవ మరణశాసనమును లేఖ్యారూఢము చేయించుటకై నిర్ధారణము చేయఁబడినది. ఈనిర్ధారణముక్రింద న్యాపతి సుబ్బారావు పంతులుగారును, ఆత్మూరి లక్ష్మీనరసింహముగారును, నేనును, సోమంచి భీమశంకరముగారును, బసవరాజు గవర్రాజుగారును, మాకర్ల వెంకటసుబ్బారావు నాయుఁడుగారును, వ్రాళ్లుచేసితిమి. ఈసభలోనే పెద్దాపురము పోవుటకు ప్రయాణవ్యయముల నిమిత్తము కోదండరామయ్యగారు చేసిన విన్నపము నిరాకరింపఁబడెను. ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు రామకృష్ణయ్యగారి పదివేలరూపాయల మరణశాసనమును లేఖ్యారూఢార్థమియ్యక పోవుటకును, ఇయ్యక పోవలెనని నిశ్చయించుకొన్నను పైకి చెప్పక లేఖ్యారూఢము చేయింపవలసినదని కార్యనిర్వాహక సంఘమువారు చేసిన నిర్ధారణము క్రింద వ్రాలుచేయుటకును గల కారణము కొంత వివరింపవలసియున్నది. సత్య ప్రకటనార్థమయి నే నీవివరములు చెప్పవలసివచ్చినందున కెంతయు చింతిల్లు చున్నాఁడను. నేను నాలవ తరగతియందు చదువుకొనుచుండినప్పుడు రాజమహేంద్రవరమున దొరతనమువారి మండల పాఠశాలలో ద్వితీయోపాధ్యాయుఁడుగా నుండిన యాయనయొద్ద మాపాఠములు కొన్ని జరుగుచుండుట చేత నాకాయన గురువు; ప్రియశిష్యుఁడనగుటచేత నాకాయన బ్రహ్మసమాజ సిద్ధాంతములను బోధించుచు, నేను మాయింట చేసెడి విద్యార్థుల సభలకు వచ్చుచు, నన్ను ప్రోత్సాహపరుచుచుండెడివారు. నాయందాయన కప్పు


డుండిన సదభిప్రాయము తేటపడుటకయి నేనుక్రొత్తగా నారంభించిన వివేకవర్ధనికి చందాను పంపుచు 1875 వ సంవత్సరము నవంబరు 14 వ తేదిని బరంపురమునుండి వ్రాసిన లేఖలోని మొదటి రెండు వాక్యముల నుదాహరించుచున్నాను.

" I am very glad that the sparcles of public spirit which were found in you when I was at Rajahmundry have now taken a flame. Every one that looks to public interest must assist you to the best of his ability in the successful carrying out of your laudable object,"

(నేను రాజమహేంద్రవరములో నుండినప్పుడు మీయందు కనఁబడిన జనహితబుద్ధిజ్వలనకణము లిప్పుడు జ్వాలగా నయినందుకు నేనెంతయు సంతసించుచున్నాను. ప్రజాక్షేమమును గోరెడు ప్రతిమానవుఁడును మీ శ్లాఘ్యమయిన యుద్దేశమును జయప్రదముగా కొనసాగించుటకు తన యావచ్ఛక్తిని మీకు తోడుపడవలయును.)

ఎప్పటివో చిన్నతనమునాటి కథల నటుండ నిచ్చినను, ఈయన నాయందు బాల్యమునందుండిన వాత్సల్యమునే కనఁబఱుచుచు మరల తాను రాజమహేంద్రవరము వచ్చినతరువాతకూడ నేను పూనిన స్త్రీ పునర్వివాహ దీక్షయందు నాకెన్ని విధములనో సాయపడుచుండెను. అయినను నాకు నెయ్యమునకంటె న్యాయము ప్రియతరమైనది. న్యాయమునకు గురువుతో గ్రుద్దులాడవలెనన్న న్యాయము ననుసరించి యిప్పుడాయనతో నేను ప్రతి ఘటింపవలసివచ్చినది. నేనాకాలములో వితంతు వివాహ విషయమున విశేషముగా పాటుపడుచుండినను, పురపారిశుద్ధ్య విచారణసంఘకార్యములలోను, పత్రికా నిర్వహణములోను, గ్రంథరచనలోను, దౌర్జన్య నివారణ ప్రయత్నములోను, ఉపన్యాసకరణములలోను, పూర్వగ్రంథ ప్రకటనములోను, కూడ సమానముగానే పాటుపడుచుండెడి వాఁడను. నేను ప్రకటించుచుండిన వివేకవర్ధని పత్రిక దుష్టవర్తనముగల వారికందఱికిని గర్భనిర్భేద


కముగానుండెను. నేను చెన్నపురికి చందాలు పోగుచేయుటకై వెళ్లియుండినప్పుడు నామిత్రులైన బసవరాజు గవర్రాజుగారు నరసాపురమునుండి 1885 వ సంవత్సరము మెయి నెల 28 వ తేదిని వివేకవర్ధనినిగూర్చి నాకిట్లు వ్రాసిరి.

"I am doing my best for V. I am afraid we must employ a clerk to keep accounts & carry on correspondence. Without a clerk it is impossible for you or any body else to do this petty work. I think with a little system both the paper and the Press may be made to pay themselves at least. The paper is not very regular. But in course of time with another press it is quite possible to make the paper more regular." (వివేకవర్ధనినిగూర్చి నాచేతనైనంత చేయుచున్నాను. లెక్కలుంచుటకును ఉత్తర ప్రత్యుత్తరములను జరపుటకును మనమొక లేఖకుని పెట్టవలెనని నేను భయపడుచున్నాను. లేఖకుఁడు లేక యీచిన్న పనిని చేయుట మీకుఁగాని మఱియే యితరునికిఁగాని సాధ్యముకాదు. కొంచెము క్రమపద్ధతితో పత్రికయు ముద్రాయంత్రమునుకూడ అధమము తమంత పొట్టపోసి కొనునట్లు చేయవచ్చునని నేను తలఁచుచున్నాను. పత్రిక యంతక్రమముగాలేదు. కాని కొంతకాలములో నింకొక ముద్రాయంత్రముతో పత్రిక నిప్పటికంటె నెక్కువ క్రమముగా చేయుట మిక్కిలి సుసాధ్యమే."

ఇతర విషయములకయి ధనము కావలసి యుండుటచేత మితవ్యయము నపేక్షించి రాజమహేంద్రవరములో నున్నప్పుడు లెక్కల పనిని ఉత్తర ప్రత్యుత్తరముల పనినికూడ నేనే చేయుచుండెడివాఁడను. ఇంకొక ముద్రాయంత్రము కావలెనని యాయన వ్రాయఁగానే వెంటనే తగిన యేర్పాటుచేసి క్రొత్త ముద్రాయంత్రము నొకదానినికూడ నప్పుడే (1885 వ సం||) తెప్పించితిని. మా వివేకవర్ధని పేరు చెప్పిన లంచములు పుచ్చుకొనువారును, అక్రమములు చేయువారును, భయకంపితులగుచుండిరి. ఉన్నత న్యాయసభ వారొకసారి


యితర మండలములలో లంచములు పుచ్చుకొనుట కలవాటుపడి యాఱితేఱిన యొక ప్రాడ్వివాకుని మారాజమహేంద్రవరమునకుఁ బంపిరి. ఈయన లంచములు పుచ్చుకొనెడిరీతి పూర్వము పోలూరి శ్రీరాములుగారు పుచ్చుకొను చుండిన దానికంటె భిన్నమైనదిగా నుండెను. ఈయన సాక్ష్యము మొదలైన వానిని క్రమముగా పుచ్చుకొని, తీర్పు చెప్పఁబోవు సమయమున నుభయపక్షములవారినుండియు వారియ్యతగినంత మొత్తమును లంచముగా తెప్పించి తన యొద్ద నుంచుకొని, గ్రంథమునంతను న్యాయదృష్టితో చదివి, ఏదిన్యాయపక్షమో కనుఁగొని యాపక్షమువాఁడు పదిరూపాయల నిచ్చినను దానితోనే తృప్తినొంది వానిపక్షమే తీర్పుచెప్పి, యన్యాయపక్షము వాఁడిన్నూఱు రూపాయలిచ్చినను ఆమొత్తమును తిరిగి యిచ్చివేసెడివాఁడు. అందుచేత నాతని తీర్పును చూచినవాఁడెవ్వఁడును న్యాయముతప్పిన తీర్పని చెప్పఁజాలఁడు. అటువంటి ప్రౌఢుని లంచములను మాన్పవలెనని మావివేకవర్ధని పనిచేయఁ బూనెను. ఇతనివిషయమయి వ్రాయఁబడిన హాస్య సంజీవనిలోని సంభాషణలు చదివి కొన్నాళ్లు లంచములుమానివేసి యాఱునెలలు సెలవుపుచ్చుకొని తనపని మఱియొకచోటికి మార్చుకొనఁ బ్రయత్నించెనుగాని యున్నత న్యాయసభవారాతని ప్రార్థన నంగీకరింపనందున మరల మాపట్టణమునకే రావలసినవాఁడయ్యెను. రెండవసారి వచ్చినపిమ్మట నల్పకాలము శుద్ధవర్తనుఁడయియుండి తనయింటి కెవ్వరిని రాకుండఁజేయుటకయి భటులను కావలి యుంచెను. అయినను లంచములు మరిగి ధనార్జనమున కలవాటుపడిన హస్తము చిరకాలము రిక్తదశలో నుండచాలదు గనుక శీఘ్రకాలములోనే యతఁడు రహస్యముగా నధర్మథన స్వీకారమునకు చేయి చాప నారంభించెను. వెంటనే మావివేకవర్ధని విజృంభించి తనలేఖినీకృపాణోపేతమైన చేతినిచాచి యన్యాపదేశముగా వ్రాయుచు లంచములకయి చాచెడి యాతనిచేతిని ముడిపింప పోరాడఁదొడఁగెను. వివేకవర్ధనిధాటికి తాళఁజాలక యతఁడు మరల సెలవు


గైకొనిపోయి యేమేమో ప్రయత్నములుచేసి మరల మాయూరికి రాకుండ తప్పించుకొనిపోయెను. ఇట్టి వివేకవర్ధని తొంటిలోకహితకార్యశూరత్వమును దౌష్ట్యనివారణదీక్షాపరత్వమును విడిచి శాంతమయి స్వపక్షరక్షణ పరాయణత్వమునకు మాత్రమే కడఁగుచున్నదని యిటీవల నపవాద మొకటి కొంచెము తలయెత్త నారంభించినది. వివేకవర్ధని స్వపక్షమువారి యక్రమములను వెల్లడింపక పక్షపాతము వహించుచున్నదని కొందఱు మిత్రులు నాతో నేయనిరి. మాపత్రిక స్వపక్షము వారన్న హేతువుచేత వారి దుష్కృత్యములను కప్పిపుచ్చుటకయి బుద్ధిపూర్వకముగా నేనెప్పుడును ప్రయత్నింపలేదుగాని బహు జనానర్థదాయకములుకాని యల్పదోషముల నుపేక్షించుచు వచ్చెను. ఒకానొకప్పుడు కొందఱియకార్యములను వెల్లడింపకపోవుట తటస్థించినను, ఆలోప మజ్ఞానముచేత నైనదేకాని మనఃపూర్వకమైనదికాదు. అల్ప దోషముల నుపేక్షించుచు వచ్చుటచేత నొకానొకరు నిర్భయులయి కొంతవఱకు యథేచ్ఛముగా సంచరించుచు వచ్చుటయుఁగలదు. అయినను భ్రమ ప్రమాదాదులు మనుష్య సామాన్యములగుటచేత మావివేకవర్ధని మాత్రము సర్వసామాన్యములైన మానుష దౌర్బల్యములు లేనిదనిచెప్ప నెవ్వరు సాహసింపఁగలరు? ఉండనిండు. దాని తాత్కాలిక విషమావస్థను దలఁచి యుదారచిత్తులగువారు తదపరాధములను క్షమింతురుగాక !

ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు లంచములు పుచ్చుకొనువారు కాక పోయినను, తమన్యాయసభలో పనియున్న వారి యొద్దనుండి న్యాయమైన వెలలకంటె మిక్కిలి తక్కువవెలలకు ధాన్యము మొదలైన తమకుఁ గావలసిన పదార్థములను గైకొనుచుండిరి; తాము పూనినకార్యముల నిమిత్తమయి చందాలువేయించి కక్షిదారులవలన ధనస్వీకారముచేయుచుండిరి; తమయింట పనిచేయు సేవకులకు తమ కార్యస్థానములో పనులిచ్చి వారిన్యాయమయినపని నితరులచేత చేయించు చుండిరి; తాము బంధుమిత్రాదులను చూడ


గ్రామాంతరము పోవలసినప్పుడు దారిలోఁగాని తత్సమీపమునఁగాని యేదైన స్థలవివాదముగల వ్యాజ్యమున్నదేమో విచారించి దానిని స్వయముగా చూడవలెననిచెప్పి తమకును తమ కుటుంబమునకును పల్లకులమీఁద రాక పోకల కయ్యెడు కర్చులను వ్యాజ్యదారులవలన పుచ్చుకొనుచుండిరి. ఆయన మిత్రపక్షానురక్తియు, సత్కార్యసాహాయ్యకరణాసక్తియు, కార్యతంత్ర ప్రయోగశక్తియు, విశేషముగాఁ గలవారే యయినను దాంభిక వర్త నా పేక్షయు సర్వజన ప్రియాచరణకాంక్షయు నాయనయందు ముఖ్యలోపములు గానుండెను. 1886 వ సంవత్సరము మార్చి నెల 31 వ తేదిని ప్రకటింపఁబడిన వివేకవర్ధనిలో దంభాచార్య విలసనమను ప్రహసనముయొక్క ప్రధమ భాగము ప్రచురింపఁబడినది. దానిలోని ముఖ్యపాత్రములు దంభాచార్యులును, మిత్రుఁడు జంబుకేశ్వరశాస్త్రియు, స్వామి శాస్త్రియు. అందు వర్ణింపఁబడిన లక్షణములవంటివి రెండుమూఁడీయనయందుండినవి. అందలిరెండు మూడుభాగముల నిందుఁ జూపుచున్నాను -

"స్వామి - ధాన్యము నాలుగురోజులలో వస్తవి. యిప్పుడు కొత్త ధాన్యము పుట్టి యిరవైరెండు రూపాయల కమ్ముతూవుంటే నేనుపుట్టి పదహారు రూపాయలచొప్పున పదిగరిశల ధాన్యముకు జట్టీయిచ్చినాను. వాళ్లకు మన ఆఫీసులో వ్యవహారంవుండబట్టి ఆధరకు యిచ్చినారు కానండి లేకపోతే యిరవైరెండురూపాయలకు చిల్లిగవ్వ తక్కువ యివ్వరు. మన ధాన్యం చేరే వరకూ మీరు వాళ్లవ్యవహారం పరిష్కరించకూడదు. వాళ్ల జుట్టు మనచేతిలో నుంచి తప్పిపోతే మళ్లీ ధాన్యంరావు. ధాన్యంవచ్చేదాకా మీరు పోస్టుపోను చేసి తిప్పుతూవుండవలెను. మీకన్ని ధాన్యము అక్కరలేకపోతే మనం బజారులో యిరవయిరెండు రూపాయలకాడికి యెవరికైనా అమ్మివేయవచ్చును.

జంబు - స్వామిశాస్త్రులుగారు సప్లయిలు మహా బాగా చేయిస్తారు. మాకుకూడా యీధరకు రెండుగరిశల ధాన్యము యిప్పిస్తురూ. దంభా―మాధాన్యములో మీరు కోరినరెండు గరిశలూ కొన్నధరకు నేను యిప్పిస్తాను లెండి. మాస్వంతవాడుకకు అన్ని ధాన్యం అక్కరలేదు. ఈస్వామి శాస్తుర్లుగారు మనకన్ని వస్తువులూ యీప్రకారం చవకగా యిప్పిస్తారు. మనండబ్బుయిచ్చి కొంటాముగాని లంచాలు పుచ్చుకోము.

*****

దంభా―యేమీపనిలేదండి మేమిప్పుడు వేదాలనుగురించి మాట్లాడుతూవున్నాము. మన వేదాలు దైవదత్తాలను దానికి సందేహములేదు. ఆదరించే ప్రభువులులేకను కిరస్తానీ విద్యచేతనూ వేదశాస్త్రాలు నశిస్తూవున్నవి. భీమరాజు గారూ ! మనంవేదం వ్యాపించే ప్రయత్నం చేయవలెనండీ. మనవేదాలలో చెప్పిన వర్ణాశ్రమాచారాలు యేలాగునయినా నిలువపెట్టవలెను.

భీమ―చిత్తము అలాగేచేతాము. నావంతు చందా నేను యాభయి రూపాయలు యిస్తాను. అధికారులు మీరు తలపెడితే నాలుగు ఘడియలలో వెయ్యి రూపాయలు పోగవుతవి.

*****

దంభా―(లేచి) రాఘవాచార్యులుగారూ ! దయచెయ్యండి. ఆడి యేందాసుణ్ని.―అయ్యా ! మేము కొంచెము రహస్యము మాటడుకోవలెను. లోపలికి వెళుదుమా?―ఆచార్యులుగారూ ! లోపలికి దయచేస్తారా?

రాఘ―అక్కరలేదండి. తమరుచెప్పిన కార్యం మీరన్న ప్రకారం జాగ్రతపెట్టించినాను. ఈకాలములో పరమభాగవతాగ్రేసరులు అధికారంలో వున్నవారిలో మీరొక్కరు కనపడుతూ వున్నారు. మీ ద్వాదశోర్ధ్వ పుండ్రాలు చూచినా తులసితావళాలు చూచినా నాకు బహు సంతోషమవుతున్నది. మీరు తిరుమణి మహత్యము విన్నారు కాదండీ ?

*****

దంభా―అవచ్చే ఆయన రివరెండుకారు దొరగారు. స్వాములవద్ద నేను యేలాగు ప్రవర్తిస్తానో తమరే చిత్తగిస్తారు―హూణుడు వస్తూవు


న్నాఁడు. తమరంతా దయచెయ్యవచ్చును.......(తనలో) ఈముండాకొడుకు కూడా నామాలు కడిగివేయక మునుపేవచ్చినాడే. వీళ్లనందరినీ సాగనంపి వీడి వద్ద యేదో మాయోపాయం పన్ను తాను.

కారు - (ప్రవేశించి) తహశ్శీల్దార్ ! వీరిని యెవరినీ పంపించవద్దు. వీరికి సత్యమతం కొంచెం బోధింతాము. మీవేదాలు సత్యమైనవి కావనిన్నీ బైబిలు వక్కటే సత్య వేదమనిన్నీ; కృష్ణుడు జారత్వమూ చోరత్వమూ చేసిన పాపి అనిన్నీ, రక్షకుడయిన యేసుక్రీస్తును కొలిస్తేనేకాని ముక్తిలేదనిన్నీ, జాతిబేధాలు పనికిమాలినవనిన్నీ, నిన్న మీరు మాయింట్లో చెప్పిన మాటలు వీరితో యెప్పుడయినా చెప్పినారా?"

ఆయన దీనిని చదివినతరువాతఁగూడ యధాప్రకారముగానే నాతో మాటాడుచుండిరి. రామకృష్ణయ్యగారి మరణశాసనములను నాకాయన చూపినప్పుడు మఱి యిద్దఱు ముగ్గురు ట్రస్టీలనుకూడ తమతో చేర్చుకొని పనిచేయుఁడని నేను చెప్పిన హితవచనముల కాయనయామోదించినట్లే మాటాడిరి. రామకృష్ణయ్యగారి మరణమునుగూర్చి యేప్రిల్ నెల 7 వ తేది ప్రకటింపఁబడిన వివేకవర్ధనిలోని వ్యాసములో నే నాయనతో మాటాడిన మాతల యర్థ మిచ్చెడు వాక్యములే యుండినవి. ఇవి ఇట్లుండఁగా మెయినెల మొదటి వారము తుదను సత్యకామియను పేరితో నొకరు వివేకవర్ధని కిట్లువ్రాసిరి -

"మహారాజశ్రీ వివేకవర్ధనీయెడిటరుగారికి.

అయ్యా, పైడా రామకృష్ణయ్యగారి చావునుగురించి వ్రాసిన వివేకవర్ధనిలో ఆయన కొత్తగాయిచ్చిన ఫదివేలరూపాయలనుగురించి యీ మాటలు కనపడుతూవున్నవి.

"అంతేకాక కార్యంతరముమీద మాడిస్ట్రిక్టు మునసపుగారయిన ఆత్మూరి లక్ష్మీనరసింహము గారక్కడకుపోయి యుండఁగా పదివేలరూపాయల ప్రోమెస్సరీ నోట్లను వారిచేతికిచ్చి, ఆసొమ్ము వ్యయపెట్టక దానిమీది


వడ్డిని పునర్వివాహముల నిమిత్తమయి వినియోగ పఱుచుచుండ వలసినదని యేర్పఱిచినారు. అంత సొమ్మొక్కరి వశమున నుండుట క్షేమకరముకాదు గనుక లక్ష్మీనరసింహముగారు తగుమనుష్యులను మఱిముగ్గురు నలుగురినికూడ ట్రస్టీలనుగా తమతో చేర్చుకొని యాధనము స్థిరముగా దాతయుద్దేశ ప్రకారముగా వినియోగపడుటకు తగినమార్గమును సమాజమువారితోఁ గలిసి యాలోచించి యేర్పఱుతురని నమ్ముచున్నాము. అట్లుచేయుట సమాజమువారికి మాత్రమేకాక లక్ష్మీనరసింహముగారికిని మిగుల క్షేమకరము. ఒక్కరెంత మంచియుద్దేశముతో ధనవృద్ధినిమిత్తమయి పనిచేసినను దైవవైపరీత్యము వలన నష్టము సంభవించినయెడల దాతయొక్క మనోరధము విఫలమగుటయేకాక యాపనిచేసినవారికి నిందయువచ్చును. తాము మంచి యుద్దేశము కలవారయినను తమపుత్రులు మొదలైన వారట్టి సచ్చింతగలవారు కాకపోవచ్చును. కాఁబట్టి నిక్షేపధారులు పలువురయి యుండుట యుభయ పక్షముల వారికి సర్వవిధముల శ్రేయస్కరము. విశేషధన మొక్కరి చిత్తవృత్తి ననుసరించి యుండుటకంటె పలువుర యాలోచనకు లోఁబడియుండుట క్షేమకరము కాకపోవునా? కాఁబట్టి బుద్ధిమంతులగు లక్ష్మీనరసింహముగారు మఱియొక విధముగా నాలోచింతురని మేము భావింపము."

అయితే యీవూళ్లోవున్న వక పెద్దమనిషి వీరేశలింగంగారు ఆసొమ్ము తమకు కావలెనంటూవున్నారని వాడుక చేస్తూవున్నాడు. ఆమాటలలో యే మయినా నిజం వున్న దేమో మీపత్రికద్వారా తెలియచెయ్య కోరుతాను. చిత్తగించవలెను.

మీవిధేయుడు, సత్యకామి."

ఈయుత్తరమును నేను దీనికిచ్చిన యీక్రింది ప్రత్యుత్తరమును మెయి 19 వ తేది వివేకవర్ధనిలో ప్రకటింపఁబడినవి. -

"సత్యకామిగారు చెప్పినమాటలను వాడుకచేయుచున్న పెద్దమనుష్యుఁడు కేవల స్వప్రయోజనపరుఁడయి యేదో దురుద్దేశముతో పయి ప్రవా


దమును వేయుచున్నాఁ డేకాని, ఆపెద్దమనుష్యునిమాట లెంతమాత్రమును సత్యములుకావు. వివేకవర్ధనిలో ప్రకటింపఁబడిన అర్థమువచ్చెడు మాటలనే నే నొకసారి మహారాజశ్రీ ఆత్మూరి లక్ష్మీనరసింహముగారితో ఆయన క్షేమమును సమాజముయొక్క వృద్ధియు కోరి చెప్పియున్నాను. ఆయేర్పఱిచెడు ట్రస్టీలలో నాపేరక్కఱలేదని కూడ నేనప్పుడాయనతో చెప్పియున్నాను. ఈవిషయమయి యెవ్వరికైయిన సందేహము కలిగియున్నపక్షమున, ఆలక్ష్మీనరసింహముగారినే అడిగి సత్యమును తెలిసికోవచ్చును. ఆయన యీవిషయమయి అసత్యమాడఁ బోరుగనుక, సత్యమందఱికిని వెల్లడికాక మానదు. ఈ విషయమయి నాయుద్దేశమేమో మాసమాజముయొక్క కార్యనిర్వాహక సభికులకందఱికిని తెలిసియున్నది. ఈధనము తనవశమునందుండవలెనని కోరుట వలన దానిని కాపాడుట మొదలయినదానియందు కష్టములును ఉత్తరవాదిత్వమును కలుగుటయేకాని యెవ్వరికి నేవిధమయిన లాభమును కలుగదు. ఎవ్వరయినను దాతయుద్దేశప్రకారము మూలధనమును ముట్టుకొనక భద్రముగా కాపాడి దాని వృద్ధిని సమాజమువారి కొప్పగింపవలసిన వారేకాని మనసు వచ్చినట్లు వినియోగపఱుపవలసినవారుకారు. ఇంతకంటె నేనిప్పుడధికముగా తెలుపవలసినదిలేదు.

కందుకూరి-వీరేశలింగము."

పయి యుత్తరము వచ్చినతరువాతను, అది నాయభిప్రాయముతో పత్రికలో ప్రచురింపఁబడు లోపలను, 1886 వ సంవత్సరము మెయినెల 9 వ తేదిని ఒక చిత్రకథ నడచినది. లక్ష్మీనరసింహముగారిమిత్రుఁడు సభకుపోయి నప్పుడెల్లతోడిన్యాయవాదులు మొదలైనవారాయనను "జంబుక శాస్త్రిగారు దయచేసినారా? జంబుకశాస్త్రిగారూ! విశేషములేమి?" అని పిలిచి హేళనముచేయ నారంభించిరఁట! ఆయనయు కలహప్రియులైన కొందఱు పెద్ద మనుష్యులును లక్ష్మీనరసింహముగారి యొద్దకుపోయి దంభాచార్యవిలసనము


మిమ్ముద్దేశించియే వ్రాయఁబడినదనియు, చేతకానివారివలె మీరూరకుండుట పౌరుషము కాదనియు, ఆయనను పురికొల్పి ప్రోత్సాహపఱిచిరఁట! వారి మాటలపైని కోపావేశము గలవాఁడయి నెలపైనెనిమిది దినము లూరకున్న తరువాత నాకస్మికముగా దంభాచార్య విలసనమును కలిగియుండిన వివేకవర్ధనిని బుద్ధిమంతులందఱును చేరి యాలోచించిన యద్భుతవిధమున లక్ష్మీనరసింహముగారు దగ్ధముచేయించిరి. రెండవనాఁడు నేను మాపత్రిక ప్రకటన కర్తేచేత వ్రాయించిన లేఖనుబట్టి యాయద్భుతవిధము దీనిం జదువువారికి తేట పడవచ్చును -

"మహారాజశ్రీ ఆత్మూరి లక్ష్మీనరసింహం చెట్టియార్ గారికి. వివేకవర్ధని పత్రిక ప్రింటర్ అండు పబ్లిషరు కూరెళ్ల రామయ్య విన్నపములు.

యీనెల ది 9 తేదిని సాయంత్రము వివేకవర్ధని పత్రికను గడకుకట్టి దానికి పాతచెప్పున్ను చీపురున్ను కట్టి వివేకవర్ధనిలో ప్రచురంచేయించిన వాడినిన్ని చేసినవాడినిన్ని వివేకవర్థనినిన్ని బంగారయ్యమేడ అనే స్థలమందు తగులపెడుతామనిన్ని యిష్టం వున్న వారు వచ్చిచూడవలసినదనిన్నీ మీ కోటున్ ప్రెస్సాఫీసుల నవుకర్లు కొందరున్ను మీయిలాకా మనుష్యులున్నూ అనేలవిధములైన దూషణమాటలు వుపయోగిస్తూ పత్రికకున్ను పబ్లిషరుకున్ను పత్రికాధికారికిన్ని అవమానము (insult) పరువునష్టం (defame)న్ను, చేయడపు వుద్దేశ్యముతో యీబస్తీలో వీధులవెంట టముకు వేయిస్తూ ఆపనిమీవుత్తరువు ప్రకారము జరిగిస్తూవున్నట్టు ప్రచురంచేసినారు. యిందునుగురించి నేను న్యాయశాస్త్రప్రకారము చర్య జరగించతలచినాను గనుక యీవిషయములో మీకు యంతవరకు యిలాకావున్న దిన్ని (నాలుగు) 4 రోజులలోగా తెలియచేయగోరుతాను. చిత్తగించవలెను.

ది 11 మేయి 1886 సం.

రాజమంద్రి

కూరెళ్ల రామయ్య,

ప్రింటర్ అండు పబ్లిషరు."

దానికి లక్ష్మీనరసింహముగా రింగ్లీషున నీక్రింది ప్రత్యుత్తరమును బంపిరి. -

"Sir,

In reply to your registered letter dated 11th Inst and which reached me on the 12th inst. I have to say that on enquiring I find that what is stated in the letter is not true

I have further to inform you that the letter under reply contains libellous and defamatory statement and I learn that yourself and one or two of your men have been making such disparaging statement, and that unless sufficient apology is made within a fortnight from this day, I shall be compelled to proceed against you and your men according to law.

Rajahmundry,

16th may 1886.

I have &c.,

A. L. NARASIMHAM."

(అయ్యా ! 11 వ తేదిగలట్టియు 12 వ తేదిని నాకు చేరినట్టియు మీ రిజిష్టరు ఉత్తరమునకు బదులుగా ఆయుత్తరములో చెప్పఁబడినది నిజముకాదని నేను విచారణమీఁద కనుగొన్నట్టు నేను చెప్పవలసియున్నది. అంతేకాక నేనుబదులిచ్చుచున్న (మీ) యుత్తర మపవాద గర్భితమయినట్టియు మాననష్య కరమయినట్టియు వచనమును కలిగియున్నదని నేను మీకు తెలుపవలసియున్నది. మీరును మీమనుష్యు లొకరిద్దఱును అట్టి పరిభవకరమైన మాటలను చెప్పుచున్నారని నేను వినుచున్నాను. ఈదినము మొదలుకొని పక్షములోపల చాలినంత క్షమార్పణము చేయనిపక్షమున, మీమీదను మీమనుష్యులమీఁదను న్యాయశాస్త్రప్రకారము నేను చర్య జరపవలసిన వాఁడనగుదును. రాజమహేంద్రవరము 16 వ మెయి 1886.

ఏ. ఎల్, నరసింహము.)

పైదాని కింగ్లీషుననే యీక్రింది ప్రత్యుత్తరము పంపఁబడినది. "To

M. R. Ry, A. L. NARASIMHAM GARU, Rajahmundry.

Sir,

In reply to your answer of the 16th instant I beg to inform you that I fail to see that my letter contains any 'libellous and defamatory statement' and that I am not aware, of any 'such disparaging statements' whatever it may mean and that the expression 'one or two of your men' conveys no idea to my mind and that I am not consequently prepared to make an apology and that you may 'proceed according to law' against whomsoever you may please.

20th MAY 1886.

I remain Sir,

YOURS etc

K. RAMAYYA"

(అయ్యా, మీ 16 వ తేది ప్రత్యుత్తరమునకు బదులుగా నాయుత్తరములో 'అపవాదగర్భితమైనట్టియు మాన నష్టకరమయినట్టియు వచనము' ఏదియు నాకు కనఁబడలేదనియు, దాని యర్థమేమయినను 'అట్టి పరిభవకరమైనమాట' లేవియు నాకు తెలియరాకున్నవనియు, 'మీమనుష్యులొకరిద్ద' ఱన్నవచనమునకు నామనస్సున కర్థమగుచుండలేదనియు, మీకిష్టము వచ్చిన యెవరిమీఁదనైనను మీరు 'న్యాయశాస్త్ర ప్రకారము చర్యజరప' వచ్చు ననియు, నేను మీకు తెలుపఁగోరుచున్నాను.

20 వ మెయి 1886.

కే. రామయ్య.)

మా పత్రికా ప్రకటనకర్త వివేకవర్ధనీదహన విషయమయి లక్ష్మీనరసింహముగారి కుత్తరమువ్రాసిన మఱునాఁడు వెలువడిన 12 వ మెయి 1886 వ సంవత్సరపు వివేకవర్ధనిలో దంభాచార్య విలసనముయొక్క ద్వితీయ భాగమును, ఆయన యద్భుతచర్య నొకదానిని తెలుపుచు వ్రాయబడిన


యొక చిన్న వ్యాసమును, ప్రకటింపఁబడినవి. ఆవ్యాసములోని మొదటి భాగము నిందుఁ బొందుపఱచుచున్నాను. -

"మా డిస్ట్రిక్టు మునసపుగారి అద్భుత చర్య - రాజమహేంద్రవరపు డిస్ట్రిక్టు మునసపుగారైన మహారాజశ్రీ ఆత్మూరిలక్ష్మీనరసింహముగారు తమ యింట పనిచేయుచున్న గోలకొండ-అమ్మన యనెడు చాకలివానికి వెనుక తమ కోర్టులో బంట్రోతు పనియిచ్చినారు. వాఁడువారియింట పనిపాటలుచేయుచుండి, గతసంవత్సరముమార్చి నెలలో ఒకనాఁడు లక్ష్మీనరసింహముగారి పడకగదిలో మంచముమీఁదనున్న వెండిమట్టెలజతను ఎత్తుకొనిపోయినాఁడు. అందుమీఁద లక్ష్మీనరసింహముగారు తమబంట్రోతయిన బొలిసెట్టివెంకన్న చేత వానిమీఁద ఫిర్యాదుచేయింపఁగా ఏప్రిల్ నెలలో రాజమహేంద్రవరము రెండవక్లాసు మేజస్ట్రీటుగారువానికి నెలదినములు ఖయిదుశిక్షను విధించినారు. ఆ మఱునాఁడే మునసపుగారు వానినిపనినుండి తొలఁగించి బరతరపుచేసినారు. అటుతరువాతవాఁడు స్వగ్రామమయిన బందరుకువెళ్లి కొన్ని మాసములుండి మరలివచ్చి లక్ష్మీనరసింహముగారి ననుసరించుచు మరలవారియింట పనిపాటలుచేయు చుండెను. ఈప్రకారముండఁగా లక్ష్మీనరసింహముగారు వానికిపూర్వపునామధేయమునుతీసివేసి వీరన్న యనునూతననామకరణముచేసి, ఈక్రొత్తపేరుతో బరతరఫయిన అమ్మన్నకే యేప్రిల్ నెల మధ్యఆక్టింగుగా బంట్రోతుపనిని మరలనిచ్చినారు. అబదిలీపని యీమాసారంభముతోనయిపోయినందున వానికి మరలనొకబదిలీబంట్రోతుపనినిచ్చినారు. దొంగతనము చేసినందునకయి తానే శిక్షవేయించిపనితీసివేసి పయియధికారులకు తెలియఁజేయకుండ మరలపని నిచ్చుటయేకాక, ప్రజలకన్నులుగప్పుటకును పయియధికారులకు భ్రమింపఁ జేయుటకును మునుపున్న పేరునుగూడ వీరన్నయనిమార్చివేసినారు. గొప్ప పరీక్షలయందుఁ గృతార్థులయి దేశోపకారము నిమిత్తముపనిచేయుచున్నట్లందఱికిని తోచునట్లు ప్రవర్తించెడి యిటువంటివారే యిట్టియక్రమములు చేయుచుండఁగా తగినంతవిద్యలేక రాజకీయాధికారములను జేయువారెట్టియక్రమములకు లోఁబడరు?......................" పయిదానితోఁ బ్రకటింపఁబడిన రెండవదంభాచార్యవిలసనములోనుండి కూడరెండుభాగము లిందుఁబొందుపఱుఁబడుచున్నవి. -

"జంబు - ............మొన్న మీయింటిలో జరగినవివాహానికి బోగం వాళ్లకు యిరువైలూముప్ఫయిలూ వసూళ్లువెయ్యమని నిర్బంధపెట్టివేయించి, ఆసొమ్ములోపాయికారీని మీరుపుచ్చుకున్నారని కన్నెర్రగావున్నది గనుక బెంచిమేజస్ట్రీట్లు వాళ్లు నేరస్థులనిచెప్పరు.

దంభా - వసూళ్లువేయించినాను గాని నేను లంచాలుపుచ్చుకోలేదు. బంధువులయింటికి వెళుతూయేదోస్థలంచూస్తా ననిమిష పెట్టి తనకు వక సవారీ తనపెళ్లానికి వకసవారీ తనవెంటసహాయంగావచ్చే బంధువుడికి వకసవారిపెట్టి రానూ పోనూ వందేసిరూపాయలు ప్రయివేటుగా పుచ్చుకుంటూవున్న మునసపులను యేమిచేసినారు? వాళ్లుస్థలంచూడడమ నేవంకలు పెట్టి ప్యార్టీలవద్ద బోలెడేసిరూపాయలు రహస్యంగాపుచ్చుకుంటూవుంటే చూస్తూవూరుకున్నారుకాని నేనుబోగంవాళ్లకు వసూళ్లు వేయించినానని నామీదకక్షకడుతారా?"

దంభా - శాస్తుర్లుగారూ ! నామనస్సులో వక్కసంశయంబాధిస్తూ వున్నది. ఇంతాచేసినా ఆవైష్ణవులునన్ను ప్రాయశ్చిత్తము అనే పేరు లేకుండా తమలోచేర్చుకుంటారో లేదో!

జంబు - మాహారాజులాగుచేర్చుకుంటారు. రాఘవాచార్యులకు మన కచేరిలో పనివున్నదిగదా? అతనివ్యవహారం ఫరిష్కరించకుండా తొక్కి పెడుతూవుందురూ. తరువాత నేనుమాటాడుతాను.

దంభా - రాఘవాచార్యులు మహాచెడ్డవాఁడు. ముందు గాతనకార్యం చేయించుకుని తరువాత వైష్ణవులు కలిసి రాలేదని చెప్పేటట్టుగా వున్నాడు. మనంకార్యంచెయ్యకపోతే దొరకు అర్జీయిస్త్తేడేమో ! మనం ఆనెస్టుమ్యానులము కామనిదొరకు వక వేళ సందేహం కలుగవచ్చును. జంబు - మీరు హానెస్టుమ్యానులుకాక లంచాలు పుచ్చుకుంటారా యేమిటి? కక్షిదార్లవద్దపశువులకు గడ్డీ కూరలూ పాలనిమిత్తంఆవులు వంటచెరకూధాన్యాలూ అపరదినుస్సులూ యీలాగంటివి తెప్పించుకోవడం లంచంకాదుగదా? రొఖ్ఖంగాపుచ్చుకోవడం లంచంగాని వాడుకనిమిత్తం రెండుమంచాలు పుచ్చుకున్నా పెట్టెలు పుచ్చుకున్న లంచంకాదు."

ఈప్రకారముగా మావ్యవహారమంతకంతకు ముదురచొచ్చినది. లక్ష్మీనరసింహముగారావఱకు బ్రహ్మసమాజసిద్ధాంతములయందు సంపూర్ణ విశ్వాసము కలదనిచెప్పుచు మాప్రార్థానాసమాజమునకప్పుడప్పుడు వచ్చు చుండెడివారు. శంకరాచార్యస్వాములవారిమీఁద తాముతెచ్చినయభియోగముకొట్టుపడిపోయిన తరువాత స్మార్తులుతమయింటికి కర్మలుచేయించుటకు రాకపోఁగా వైష్ణవులను చేరఁదీసి ప్రాయశ్చిత్తముచేయించుకొని తప్తముద్రాధారణమునొంది మధ్యవైష్ణవునకు నామములు మెండన్నట్లు ద్వాదశోర్ధ్వపుండ్రములను తులసిపూసల తావళములను గండభేరుండంచుబట్టలను ధరింపఁజొచ్చెను; ఈ నడుమనే జాతిభేదమువలని యనర్థములనుదెలుపుచు క్రైస్తవాచార్యప్రేరణమున నొక యుపన్యాసమిచ్చెను; స్మార్తులనుకూడఁగట్టుకొనివచ్చుటకయి యాకస్మికముగా వేదములయందపరిమిత విశ్వాసమునొంది వేదపాఠశాల పెట్టి వితంతువివాహప్రతిపక్షనాయకుల వేదపాఠశాలతో దానినిచేర్చిరి. వైదికముద్రాయంత్రమును వైదిక పుస్తకభాండాగారమును స్థాపించుటకయిచందాలు సమకూర్చినవిధమును వివరింపక నీతిపరులు మెచ్చఁదగినది కాదనిమాత్రమిచ్చట చెప్పుట చాలును. దంభాచార్యవిలసనములోనిందుఁబేర్కొనఁబడినదానిలో విశేషభాగము వాస్తవముగాజరిగినసంగతులే. ఉన్నమాటయన్న నులుకు వేసికొని వచ్చునన్న సామెతనందఱు నెఱుఁగుదురుగదా ? వివేకవర్థనీ దహన సంస్కార విషయమయి జరిగించినపనికభియోగము తెప్పించి తుదముట్టగ్రంథమునడుపుటకు నేను నిశ్చయించుకొని దానికిఁగావలసిన సాక్ష్యమునంతను సేకరించి సాధన సామగ్రితో సంసిద్ధుఁడనయియుంటిని. ఇంతలో మాయుభయుల మిత్రులును


స్వల్పవిషయములను గూర్చి మిత్రులు గానుండినవారు రచ్చ కెక్కితగవులాడుట ధర్మముకాదనియు, ఈయంతఃకలహమువలన ప్రతిపక్షులకు మఱింతలోకు వగుననియు, మేముపూనినమహాకార్యములకు నష్టముకలుగుననియు, అనేకవిధములమాకు హితబోధచేసి మమ్ముసమాధానపఱుపపాటుపడిరి. తానుతొందరపడి చేసినపనికిక్షమార్పణము చేయుట కాయనయొప్పుకొనెను. మిత్రులందఱును నొకచోటసమావేశమయి మిత్రసమక్షమున లక్ష్మీనరసింహముగారి చేత వివేక వర్థనీ దహనవిషయమయి జరిగినదానికి చింతిల్లుచున్నా ననియు దాని నిమిత్తముక్షమార్పణము వేఁడుచున్నాననియు చెప్పించెదమనియు జరగినదానిని మఱచి పోయిదానినంగీకరించి మరల యథాపూర్వముగా మిత్రభావముకలిగి యుండవలసినదనియు మధ్యవర్తులయిన స్నేహితులునాతోఁజెప్పిరి. నేను మొదటినుండియు పట్టినపట్టువిడువని మూర్ఖస్వభావముకలవాఁడనగుటచే లిఖితపూర్వకమైనక్షమార్పణముచేసినఁ గాని సంధిపొసఁగ నేరదని నేను స్పష్టముగాఁ జెప్పితిని. ఇట్లు మమ్ముల నుభయులను సమాధానపఱిచి సంధిచేయపాటుపడిన వారిలో ముఖ్యులు మహారాజశ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు. కొంత కాలమీవిధముగారాయబారములు జరగినపిమ్మట కడపట లక్ష్మీనరసింహముగారు 1886 వ సంవత్సరము 6 వ ఆగస్టు తేదిని ఈ క్రిందక్షమార్పణలేఖను బంపిరి. -

"మహారాజశ్రీ శ్రీవివేకవర్ధని పత్రికాధిపతిగారికి

అయ్యా !

మార్చి నెల 11 తారీఖుగల వివేక వర్థనిలోనిహాశ్యసంజీవనియందునుండు సంగతులు ఒక్కరివిషయమయి ఉద్దేశించివ్రాయబడినట్టునాస్నేహితులు కొందఱునాతో చెప్పినమీదట ఆగ్రహమువచ్చి మెయి నెల 9 తారీఖున సదరు వివేకవర్ధని దగ్ధవిషయమయి జరిగించినపనికి విచారిస్తూవున్నాను. మరిన్ని అప్పుడునానవుకర్లు కొందరు మిమ్మునదూషించినట్టు మీరుతెలియచేసినారు


అట్లాచేయడంయంతమాత్రమూ నాఉద్దేశముకాదు. వారినిమందలించడమైనది. వారుకాని మరియితరులుకాని ఆసమయమునందు మిమ్మునగాని మీపత్రికను గాని దూషించినయెడల అందుకు అపాలజీచేయుచున్నాను. మీవివేకవర్ధనిలో ఆదరిమిలాప్రచురింపబడిన హాశ్యసంజీవనివలె సర్వసామాన్యముగా అందరికి వర్తించునటుల ఉన్న యడలయవరికి బాధకరముగానుండదు గనుక ఆప్రకారముగా ముందునుండునని తలుస్తూవున్నాను.

6 ఆగష్టు 1886 వ సం||

తమ విధేయుడు

ఆ. ల. నరసింహము."

దంభాచార్యవిలసనములోని రెండవభాగమునందుండిన విషయము లెంతసర్వసామాన్యముగానుండినవో మొదటిభాగమునందలివియునంత సర్వ సామాన్యము గానే యుండినవి. రెండుభాగములలోను దంభాచార్యుఁడు మునసబుగాఁగాక తహశ్శీలుదారుగాఁజెప్పఁబడెను. మొదటి భాగములోని వన్నియు తహశ్శీలుదారుఁడుచేసినట్టే చెప్పఁబడినవి; రెండవదానిలొ కొన్ని యెవ్వరో డిస్ట్రిక్టు మునసబుచేసినట్టు తహశ్శీలుదారునిచోట పలికింపఁబడినవి. ఈరెంటికిని గల వ్యత్యాసమింతే. ఈరెంటిలోను విషయములట్టిలోపములు గల వారు తమ్ముద్దేశించియే వ్రాయఁబడినవని భావింపవచ్చును. ఇఁక చేసిన క్షమార్పణను వివేకవర్ధని యంగీకరించి యీ విషయమయి తాను వ్రాయఁదలఁచుకొన్న దానిని వ్రాయవలసియున్నది. వివేకవర్ధని మరల తీవ్రముగా వ్రాయక సౌమ్యముగా వ్రాయవలసిన చిత్తును న్యాపతి సుబ్బారావు పంతులుగారే వ్రాసి దానిని లక్ష్మీనరసింహముగారికి చూపి యాయన సరియన్న మీఁదట మరలఁదెచ్చి నాకిచ్చిరి. ఇదియంతయు జరగుటకుఁ గొంతకాల మాలస్యమయి నందున 1886 వ సంవత్సరము సెప్టెంబరునెల 8 వ తేదివఱకును క్షమార్పణ పత్రము స్వవ్యాఖ్యానముతో వివేకవర్ధనియందు ప్రకటింపఁబడలేదు. అందు చేత నీలోపల సెప్టెంబరునెల 6 వ తేదిని జరగిన స్త్రీ పునర్వివాహ సమాజము


యొక్క కార్యనిర్వాహక సంఘమువారి సభయందు చేయఁబడిన యీక్రింది నిర్ధారణముల కేమియు నాక్షేపణచెప్పక యామోదించి లక్ష్మీనరసింహముగారు వానిక్రింద తమ చేవ్రాలుచేసి సమాజమువారి యధికారము నొప్పుకొనిరి.

"2. That Mr. Pida Ramakrishnayya's allowance of Rs. 2 a month to Prabhala Mahalakshmi be continued to her out of his funds by Mr. A. L. Narasimham. (ప్రభల మహాలక్ష్మికి నెల 2 రూపాయలచొప్పున పైడా రామకృష్ణయ్యగారిచ్చుచుండిన జీతమాయన నిధిలోనుండి యామెకు ఏ. ఎల్. నరసింహముగారిచే నియ్యఁబడుచుండవలెను.)

3. That an additional allowance of Rs. 4 a month as well as Medical charges be paid to Saladi Ramayya for August and September out of Pida Ramahrishnayya's funds. (నెలకు 4 రూపాయలచొప్పున నెక్కువజీతమును వైద్యపు కర్చులను పైడా రామకృష్ణయ్యగారి నిధిలోనుండి శ్రావణ భాద్రపదమాసములకు సలాది రామయ్యకియ్యఁ బడవలెను.)

5. That a grant of Rs. 15 be paid to S. Ramiah in lieu of certain jewels (girdle and vessel) due to him and other matter out of Pida Ramakrishnayya's funds. (అతనికియ్యవలసిన కొన్ని నగలకు (ఒడ్డాణముపాత్ర)ను ఇతర వస్తువులకును బదులుగా పైడా రామకృష్ణయ్యగారి నిధిలోనుండి రు. 15ల సహాయధనము సలాది రామయ్యకియ్యబడవలెను

6. That a grant not excceding Rs. 200 be made to S. Ramiah for building a tiled house at Cocanada on the site given by Pida Ramakrishnayya out of his funds. (పైడా రామకృష్ణయ్యగారిచే కాకినాడలో నియ్యబడిన స్థలమునందు పెంకుటిల్లు కట్టించుకొనుట కాయననిధిలోనుండి సలాది రామయ్యకు రు. 200 లకు మించకుండ సహాయద్రవ్య మియ్యఁబడవలెను.)" పయి నిర్ధారణములనెల్ల నంగీకరించి క్రిందవ్రాలు చేయుటయేకాక లక్ష్మీనరసింహముగారు వీనినెల్లను జరపిరి. తరువాత 1886 వ సంవత్సరము సెప్టెంబరు నెల 8 వ తేదిని లక్ష్మీనరసింహముగారి క్షమార్పణ పత్రమును వివేకవర్ధని యీక్రింద తన వ్యాఖ్యానముతోను మొదటినుండియు జరగిన యుత్తర ప్రత్యుత్తరములతోను ప్రకటించినది. -

"మార్చి 31 వ తేదిని మెయినెల 12 వ తేదిని వివేకవర్ధనియందుఁ బ్రకటింపఁబడిన దంభాచార్యవిలసనమువలన కొందఱికి మనస్సునొచ్చినదని విని చాల విచారించుచున్నాము. హాస్య సంజీవని యుద్దేశమును పలుమాఱు మాపత్రిక యందు వెల్లడించియున్నాము. హాస్య సంజీవనిలోనుండు పురుషులు కల్పితులు; అందులో నొక్కరియందారోపింపఁబడియుండు విషయములు కొందఱివి కొన్ని గాను, మఱికొన్ని మఱికొందఱివిగాను, కొన్ని కేవల కక్పితములుగాను, ఉండును. దానియొక్క యుద్దేశ మెవరియందైన నట్టి లోపము లున్నపక్షమున, అట్టివానిని వారువారు దిద్దుకొనుటకేకాని మఱియొకందునకుఁ గాదు. కాఁబట్టి యెవ్వరును అందులో వ్రాయఁబడినవన్నియు తమ కొక్కరికే చెందుననికాని, తమరి నొక్కరినే యుద్దేశించివ్రాయబడినవనికాని, యెంచకుందురని నమ్ముచున్నాము. ఆప్రకారముగానే మార్చి 31 వ తేదిని మెయి 12 వ తేదిని దంభాచార్యవిలసనమను పేరిట ప్రకటింపఁబడిన హాస్య సంజీవనిలో నొక్కొక్కపురుషునియం దారోపింపఁబడిన విషయములన్నియు నాయొక్క పురుషునకే చెందునని యెంచుటయు న్యాయముకాదు. అట్లవియన్నియు తమయొక్కరి విషయమే యుద్దేశింపఁబడినవని యెవ్వరును తలఁప కుందురనినమ్ముచున్నాము."

ఈ ప్రకారముగా బహుమాసములనుండి రాజుచున్న వివాదాగ్ని పూర్ణముగా చల్లాఱి పోయినందున లక్ష్మీనరసింహముగారిఁక నిర్భయముగా తమ మనసు వచ్చినట్టు వ్యవహారము నడపవచ్చును. తమ తమ దౌర్జన్యములను వివేకవర్థనిలో వెల్లడించుచు వచ్చుటచేత నాకు శత్రువులయిన వారంద


ఱును లక్ష్మీనరసింహముగారి కాలోచనచెప్పుట కిప్పడు మంత్రులయిరి. ఈ యభినవ మిత్రులు కొందఱు వివేకవర్ధనీ దహనవిషయమయి మొట్టమొదట నేమియు నెఱుఁగననిచెప్పి తరువాత నొప్పుకొని క్షమార్పణము వేఁడుకొనుట యవమానకరమని యాయనను పరిహాసముచేసి, పగతీర్చుకోవలెనని పురికొల్పఁ జొచ్చిరి. రామకృష్ణయ్యగారిచ్చిన పదివేల రూపాయలలో నేభాగమును వివాహములకుపయోగపడకుండఁ జేసినపక్షమున ముందు వితంతు వివాహములు జరగవనియు, అట్లు చేయుటయే పగతీర్చుకొని నన్ను సాధించుట యనియు, లక్ష్మీనరసింహ ప్రభృతు లావఱకే యాలోచించిరి! ఆహా ! ఇదియేమి యజ్ఞానము ! వివాహములు నిజముగానే జరగక పోయినయెడల నాకేమి యవమానము? పగతీర్చుకోఁ దలఁచినయెడల నాకపకారము చేయఁజూడవలెనుగాని నేను పూని పనిచేయుచున్నానన్న హేతువుచేత లోకోపకారకమయిన యనాధరక్షణ కార్యమునకు హాని కలుగఁజేయఁ జూచుట యేమి న్యాయము? ఇది యవివేక విలసనమయినను స్వప్రయోజన పరత్వముచేత వితంతు వివాహములు చేసికొన్న వారు కొందఱీ యనాలోచిత వ్యవహారమునకు సహాయులయిరి. కర్తవ్య నిశ్చయము వివేకవర్ధనీ దహనకాలమునకు ముందే చేయఁబడినను తదనంతర వ్యవహారభీతిచేత నింతకాలము కార్యారంభము విలంబము చేయఁబడెను. పదివేలరూపాయలవలన వడ్చెడివడ్డినంతను మీకే పంచిపెట్టుచుండెదనని యాశపెట్టి లక్ష్మీనరసింహముగారు రాజమహేంద్రవరములోనున్న వితంతు వివాహవరులను తనలోఁ జేర్చుకొని, వారిని గుమికూర్చి, రామకృష్ణయ్యగారు వ్రాసియిచ్చిన మరణశాసనములో "వివాహములు చేసికొన్న వితంతువులయొక్కయు వారి భర్తలయొక్కయు వారి బిడ్డలయొక్కయు పోషణము నిమిత్త" మన్న దాని కీవఱకు వివాహములుచేసికొన్నవారికి మాత్రమేయని యొక నూతనార్థము కల్పించి, ఆవఱకు వివాహములు చేసికొన్న వారిలోఁగూడ దూరమునం దుండుటచేత బళ్లారిలోనున్న వారి నిరువురను విడిచిపెట్టి, ఆవఱకు వివాహముకాని వారినికూడ నొకరినిం


దులో చేర్చుకొని, "వితంతు వివాహములను జరుపు నిమిత్త" మని వ్రాసినకథనే బొత్తిగా నెత్తుకోక, ఈవఱకు వివాహములుచేసికొన్నవారి పోషణమునకును చిల్లర వ్యయములకును మాత్రమే వడ్డీని ముఖ్యముగా వ్యయము చేయవలసినదని తనతో రామకృష్ణయ్యగారు రహస్యముగాచెప్పిరన్న నవసృష్టి నొకదానిని బైలుదేఱఁదీసి, వారిచేత కొన్ని నిర్ధారణములు చేయించి, వానిని 5 వ అక్టోబరు తేదిగల తమ ప్రకటన పత్రములో నితర స్థలములయందుండిన వరులకు తరువాతఁ బంపిరి. ఈకూటమిలో నాకు ప్రతిపక్షులయిన కోదండరామయ్యగారును పులవర్తి శేషయ్యగారును చేరుట వింతకాదుగదా! లక్ష్మీనరసింహముగారి చేతిక్రింద పనిలో నుండిన వారగుటచే రాచర్ల రామచంద్రరావుగారును తణుకు వెంకటచలపతిరావుగారును తప్పక చేరవలసినవారే. బీదలగుటచే ధనాశచేత చేబోలు వెంకయ్యగారును పటానేని వెంకయ్యగారును చేరిరి. ఒక్క మంజులూరి గోపాలకృష్ణయ్యగా రందు చేరకపోయిరికాని దానికి కారణము రామకృష్ణయ్యగా రాఱు రూపాయలిచ్చుచుండఁగా నది తగ్గిపోవుననియే, కాని పారమార్థిక చింతకాదు. ఈకాగితములను మొదటి వివాహమాడిన గోగులపాటి శ్రీరాములుగారికి పంపినప్పు డాయన వ్రాసిన యుత్తరముతోడఁ గూడ నిందు ప్రకటించుచున్నాను.

NOTICE.

To

THE ex-officio members of the Widow Marriage

Association Rajahmundry.

Late Mr. Pyda Ramakrishniah at the time of his death appointing me as Trustee for Rs. 10,000 which he left at the time for the benefit of the people married under the auspices of Widow Marriage Association at Rajahmundry clearly expressed in his words to me the interest alone of the said sum should be spent primarily for the support and con


tingencies of the already existing families. In order to carry out the original intention of the Testator, I now desire you all to give your opinion on the subject.

A. L. NARASIMHAM

Trustee to Mr. P. Ramakrishnayya (W. M. Fund)

5th October, 1886,

Rajahmundry.

To

Gogulapati Sriraamulu garu

మహారాజశ్రీ లేటు పైడా రామకృష్ణయ్యగారు తాను చనిపోవు సమయమున రాజమహేంద్రవరం స్త్రీ పునర్వివాహ సమాజములో చేరి వివాహములు చేసికున్న వారికి ఆత్మూరి లక్ష్మీనరసింహముగారిని ట్రస్టీగాయేర్పర్చి యిచ్చిన పదివేలరూపాయలకు వచ్చేవడ్డీకర్చు పెట్టుటకు ముఖ్యమయినవిధులు.

(1) పదివేలరూపాయీల వడ్డి మాత్రము యిదివరలో వున్న పండ్రెండు కుటుంబములవారికి సమానముగా పంచి యియ్యవలసినది.

(2) ఆయా కుటుంబమువారికి వంశ పరంపరా యియ్యవలశినది.

(3) ప్రతి సంవత్సరముగాని అర్థ సంవత్సరముకు వకసారిగాని యియ్యవలశినది.

(4) యీ కుటుంబములలో యేకుటుంబము గాని వకటి నిస్సంతు అయ్యే పక్షముకు ఆ కుటుంబము వంతుకు వచ్చే వడ్డి ధనము యీ పండ్రెండు కుటుంబముల వారిలో తక్కినవారు సమానముగా పంచుకోవలశినది గాని నిస్సంతు అయినకుటుంబముయొక్క వారసులకు చెందకూడదు.

(5) చెరుకూరి నారాయణమూర్తి పురోహిత్యము జరుపుతూ మతవిషయమైన కర్మలు క్రమముగా అన్ని కుటుంబములవారికీ జరుపుతూ వున్నంతకాలము ఆయన జీవితకాలము యావత్తూ మేనేజింగు కమిటీవారువారి ఫండులోనుంచి సహాయము చెయ్యనికాలము సంభవించిన


యెడల ఆకాలములో నెల 1 కి ఆరు రూపాయలచొప్పున సదరు పండ్రెండు కుటుంబములవారి మీద సమానముగా యేర్పర్చి సదరు ఆరు రూపాయీలు యియ్యవలశినది.

1886 వ సంవత్సరంకు వచ్చేవడ్డి ధనములో సలాది రామయ్యకు యిల్లు కట్టుకునేనిమిత్తం రెండువందల రూపాయీలున్ను దేవాలయపు హక్కు నిమిత్తం తణుకు వెంకటచలపతి తెచ్చిన అసలు వ్యాజ్యపు కర్చులకు మాత్రము అయిన ధనమున్ను మినహాయించి తక్కిన ధనము సమముగా పండ్రెండు భాగములుచేసి సదరు కుటుంబములలో యెవరికి అయినా కొంత సొమ్ము యావర్కు కర్చుపడినయెడల సదరు సొమ్ము వారి భాగములో మినహాయించి తక్కినసొమ్ము యియ్యవలసినది. సదరు వ్యాజ్యం గెలిచినయెడల వచ్చే పరిహారము పండ్రెండు కుటుంబములవారూ సమానముగా పంచుకోవలయును.

సదరు పండ్రెండు కుటుంబముల యజమానుల పేరులు (1) గోగులపాటి శ్రీరాములు, (2) రాచర్ల రామచంద్రరావు, (3) తాడూరి రామారావు పంతులు, (4) పులవర్తి శేషయ్య, (5) ముంజులూరి గోపాలకృష్ణయ్య, (6) సలాది రామయ్య, (7) బోడా శ్రీరాములు, (8) చేబోలు వెంకయ్య, (9) తణుకు వెంకట చలపతి, (10) నల్లగొండ కోదండరామయ్య, (11) పఠానేని వెంకయ్య, (12) వల్లూరి ముత్తమగారి కొమార్తె పున్నమ్మకాగల పెనిమిటి.

యీదిగువ వ్రాళ్లుచేసినవారు పైవిధులకు సమ్మతించినారు..

(1) రాచర్ల రామచంద్రరావు.

(2) పులవర్తి శేషయ్య.

(3) తణుకు వెంకటచలపతిరావు.

(4) పున్నమ్మ సంరక్షకురాలు వల్లూరి ముత్తమ్మ.


(5) చేబోలు వెంకయ్య

(6) నల్లగొండ కోదండ రామయ్య

(7) పఠానేని వెంకయ్య

___________

20 - 10 - 86

VIZAGAPATNAM,

To,

A. L. Narasimham Chetty Garu,

Trustee to the Widow Marriage Fund of Mr.

Pyda Ramakrishnayya Garu who is now dead,

Sir,

It is with many thanks I received your notice and the Telugu enclosure yesterday at about 4 P. M. desiring my opinion as to the distribution of the interest that may arise from the principal of Rs. 10,000 left by the above mentioned revered well wisher of the Widow Marriage movement of Rajahmundry at the time of his death, among the already existing married couples equally, in accordance with the original intention of the Testator,

From your notice it appears that there is no evidence between you and the testator when he clearly expressed his words to you to the above effect. It is also quite evident from the notice he has left no will in writing in order to carry out his intention. If you conscientiously say that his intention was such at his death and if you mean to do justice to his intentions bearing in your mind that the Almighty alone is a searcher of your heart and He is a sole witness between you and the testator, I see no reason why you have undertaken the task of collecting opinions from the ex-officio members of the Widow Marriage Association Rajahmundry.


If the intention of the testator was such as you honestly feel to be you should have carried out his intention whether the ex-office members agree or not. Now that you have begun to collect the opinions and the conditions laid down in the Telugu enclosure regarding the equal distribution of interest among the 12 families seem to have been subsequently formed after mature consideration on the basis of pure selfishness, I doubt if the intention of the testator as you or the conditions say, was true. The conditions say that the portion remaining unclaimed by reason of the extinction of issue in any one of the twelve families must be distributed equally among the rest. For instance if half a dozen families are destitute of issue at any time which God in His boundless mercy may forbid, to claim the distribution of the ownerless portions among the rest is a pure selfishness in my opinion. What is it then if you do not call it selfishness? Granting that the opinion of the testator at his death was true, we as well-wishers of the movement are bound to consider whether he formed that opinion in a state of mental peace or agony. It is quite plain he formed the same just before his death when he was in great agony. If we formed that opinion in that painful state, can we give effect to his intention in such a way that the movement should suffer? We should also take into consideration how anxious he was in a state of good health for the welfare and progress of the movement. I hope I will not be contradicted if I say that there is not one at least at present so enthusiastic as he in the list of the so many members. As it is quite evident that he was a sincere well wisher of the movement (of course including the already married couples), we will have to consider whether the movement will suffer or not by carrying out his intention at his death. If the interest should be distributed only among the existing twelve families, can we celebrate any more


marriages in future? I say decidedly no. Because in the first place we have got no funds at the disposal of the Association to perform the marriages. Supposing we get funds after a good deal of difficulty only for the celebration of the marriages don't we naturally except that the future married couples would also raise questions as to the means supplied to the already married couples. If we say there are no such means for them how can we except that they will embrace the movement in the face of so many social sufferings and in the absence of the so many facilities that are being enjoyed by the already married couples. You know that the country is not so far enlightened that the people will take up reform voluntarily. Therefore some means should be provided to all the married couples either before or in future in accordance with the requirements, so far as may be within the power of the association till the movement becomes a general one. Otherwise there is a chance of restricting the cause. The well-wishers of the cause should not depend on the present strength of the members alone. Ultimately these members may become extinct one by one. Therefore we should make our movement a living one and not a dead one.

In conclusion I say that the principal should be lodged in a safe bank in the name of more persons than one, that the interest should be added yearly or half yearly to the principal, that expenditure if necessary should be incurred from the interest and never from the principal. If necessary due help must be given from the interest alone to the married couples reasonably supposed to have been helpless. If there is sufficient accumulated due proportion after proper deduction of expenditure may be spent for marriages.

if extra fund may be secured for the purpose of the association from the outside of the enlightened public by means


of subscriptions and donations, it may be safely added to the accumulated principal of the late Mr. Pyda Ramakrishnayya Garu whose name will be borne in the minds of the future widows relieved from the misery of widowhood with great respect and love. If such a noble object as this were to be realized the movement will be kept continually moving on Whether we all have the fortune of seeing the progress of the movement or not. Let our minds engage in the relief of so many helpless widows whose sufferings I cannot even imagine and let God make us all as unselfish as the late Mr. P. Ramakrishniah who spent away more than Rs. 30,000 for the cause. By this distribution as you propose in accordance with the opinion of the testator as you say, I am sure laziness will be fostered in the married couples. By deprivation of this, they should look up to their own exertion and support. Of course if they reasonably fail due help must be given in time from the fund. I hope you or any one of the agreed members will not take offence for my sincere opinion as a well wisher of the movement. Let us all forget all difference of opinion if sprung up in our minds through our own fault and strive to do our best for the furtherance of the cause. I know how valuable services you and the signatories have rendered to the cause hitherto. Please push on the movement with the same spirit and drive away cheerfully selfishness and malice

Yours truly,

G. SRIRAMULU.

గోగులపాటి శ్రీరాములుగారింగ్లీషులో వ్రాసినదానినంతను తెలుఁగులో భాషాంతరము చేయుటకంటె నందలి సారాంశమును మాత్రము సంక్షేపముగా చెప్పుట మన యిప్పటి కథకు చాలియుండునని యెంచి యట్లు చేయుచున్నాను'దాతయొక్క ప్రథమోద్దేశ ప్రకారముగా పదివేలరూపాయలమీఁది వడ్డిని ఈవఱకు వివాహముచేసికొన్న వారిలో సమానముగా పంచిపెట్టుటను గూర్చి నాయభి ప్రాయమడుగుచు ప్రకటన పంపినందు కనేక వందనములు చేయుచున్నాను. మీప్రకటననుబట్టి దాత మీతో నెప్పుడట్లు స్పష్టముగా చెప్పెనో సాక్ష్యము కనఁబడదు. మరణకాలమునం దాయన యుద్దేశమదియే యని మీరు మనఃపూర్తిగాచెప్పి సర్వసాక్షియైన యీశ్వరుఁడు సాక్షిగా మీరాయుద్దేశమును నెఱవేర్పఁ దలఁచుకొన్న పక్షమున, మీరిప్పుడు వివాహములు చేసికొన్న వారి యభిప్రాయములను పోగుచేయుటకేల పూనుకొన్నారో నాకు కారణము కానరాకున్నది. దాతయొక్క యుద్దేశమదియని మీరాత్మ సాక్షికముగా నమ్మినయెడల, వివాహములు చేసికొన్న వారొప్పుకొన్నను ఒప్పుకొనకున్నను కూడ మీ రాయన యుద్దేశమును నెఱవేర్చి యుండవలెను. వడ్డిని పండ్రెండు కుటుంబములలో సమానముగా పంచుకొనుటను గూర్చి నిబంధనలుగల తెలుఁగు లేఖ ననుసరించి మీరిప్పు డభిప్రాయములను పోగుచేయ నారంభించుటనుబట్టి యది స్వప్రయోజన పరత్వము నాధారము చేసికొని దీర్ఘాలోచనమీఁద తరువాత నేర్పఱుచుకొన్నదైనట్టు కనఁబడుచున్నది; దాతయొక్క యుద్దేశమదియగునాకాదాయని నాకు సందేహము కలుగుచున్నది. ఈపండ్రెండు కుటుంబములలో నైదైన నొకటి నష్టపడినయెడల దాని వంతుకూడ తక్కినవారు సమముగా పంచుకోవలెనని విధులు చెప్పుచున్నవి. ఎప్పుడైనను ఆఱు కుటుంబములు నష్టమగుట తటస్థించిన పక్షమున (సర్వదయాపరమూర్తియైన యీశ్వరుఁడట్టి వైపరీత్యము పుట్టకుండఁజేయును గాక!), వారి భాగములన్నియు మిగిలినవారికి రావలెననుట నా యభిప్రాయములో శుద్ధ స్వప్రయోజన పరత్వము.

వడ్డిని పండ్రెండు కుటుంబములలో మాత్రమే పంచి పెట్టుచువచ్చిన పక్షమున ముందు మనము వివాహములుచేయఁ గలుగుదుమా? వివాహములు చేయుటకు మాత్రము సొమ్ము పోగుచేయఁ గలిగినయెడల, క్రొత్తగా వివాహ


ములు చేసికొన్నవారు వెనుకటివారికున్న సదుపాయములు తమకు కావలెనని కోరరా? మీకు మాత్రము లేవనెడుపక్షమున, కష్టములకోర్చి సాయమేమియు లేకుండ వారు మనపక్ష మవలంబింతు రని యెట్లు ప్రతీక్షింపవచ్చును ? ముందు పెండ్లిచేసికొన్నను వెనుక పెండ్లి చేసికొన్నను తమ శక్తిలో నున్నంత వఱకు సమాజము వారందఱికిని కష్టసమయమునందు సాయము చేయవలెను. ఈ పక్షముయొక్క క్షేమమునుగోరువారు దీని పురోవృద్ధిని చూడవలెనుగాని యిప్పటి సంఖ్యనుమాత్రమే చూడఁగూడదు. ఇప్పుడున్న వారొకరి తరువాత నొకరుగా నశించి పోవచ్చును. కాఁబట్టి మనమీ యుద్యమము జీవించునట్లు చేయవలెనుగాని చచ్చిపోవునట్లు చేయఁగూడదు.

సొమ్ము నొక్కరికంటె నెక్కువమంది పేరిట సురక్షితమైన ధనాగారములోనుంచి, వచ్చినవడ్డి నాఱు నెలలకో సంవత్సరమునకో యొక్క పర్యాయమసలులో చేర్చుచు, ఆవశ్యకమయినప్పుడు నిజముగా రిక్తస్థితిలో నున్న వారికి మాత్రము వడ్డిలోనుండి కావలసిన సాయముచేయుచు, ఈవ్యయములు పోఁగా వడ్డిలో మిగిలినదానితో వివాహములు జరుపుచుండ వలెనని నాయభిప్రాయము.

రామకృష్ణయ్యగారి యభిమతాను సారమని మీరు చెప్పెడు ప్రకారముగా వడ్డిని పంచి పెట్టుటవలన వివాహములు చేసికొన్న వారిలో సోమరి తనము పెంపుచేయఁబడును. వారు స్వకాయకష్టమును నమ్ముకొనియుండవలెను. స్వయంకృషిచేసినను శక్తులు కానప్పుడు మాత్రమే వారికి సాయముచేయ వలెను. స్వప్రయోజన పరత్వమును మాత్సర్యమున, సంతోషపూర్వకముగా మనస్సులనుండి పాఱఁదోలి, దయచేసి యీ యుద్యమమును వెనుకటి సచ్చింతతోనే ముందు నడిపింపుఁడు.'

ఈయనకును తరువాత యచ్చటి మా పెండ్లికొడుకులకును గల తారతమ్యము పైదానివలన తేట పడవచ్చును. తగిన యుద్యోగములలో నున్న కోదండరామయ్యగారు శేషయ్యగారు మొదలైనవారీ నూతనపథక మేర్ప


ఱిచి వివాహములకు లేకుండ వడ్డినంతను తామే పంచుకొని మ్రింగవలెనని విధులేర్పఱుచుకొనుట తాము చదువుకొన్న విద్యకును తాము ఘోషించు కొనుచుండిన స్వార్థ పరిత్యాగ కథనమునకును అవమానకరము. వివాహములు కాకుండఁజేసి నాకృషికంతరాయము కలిగింపవలెనన్న మహోదార చింత తోడనే యీపన్ను గడ పన్నిన మహానుభావులకు పయిరీతి హితవాక్యములు రుచించునా ? ఇంతకు సాహసించినవారు మఱియెంతకు సాహసింపరు? అటు తరువాత లక్ష్మీనరసింహముగారు రామకృష్ణయ్యగారి మరణశాసనములో పేర్కొనఁబడిన వితంతువివాహ సమాజము రాజమహేంద్రవరసమాజమే కాదని చెప్పునంతటి సాహసమునకు కడంగిరి. ఆ మరణశాసనము యొక్క మూలము మాట యటుండఁగా దాని ప్రతిలేఖ (నకలు) సహితము సామాజికులలో నెవ్వరియొద్దను లేదు. అందుచేత కార్యనిర్వాహకసంఘము వారిచే లక్ష్మీనరసింహముగారు కూడ వచ్చి యుండిన డిసెంబరు 19 వ తేది సభలో

"4. That printed copies of P. Ramakrishnayya's Rs. 10,000 instrument be circulated among the members of the managing committee." (పైడా రామకృష్ణయ్యగారి పదివేల రూపాయల లేఖ్యముయొక్క యచ్చు ప్రతులను కార్య నిర్వాహక సంఘముయొక్క సామాజికులలో చూపఁబడవలెను.)

అని నిర్ధారణము చేయఁబడెను. ఈ నిర్ధారణానుసారముగా లక్ష్మీనరసింహముగా రామరణశాసనమును తమ వైదిక ముద్రాశాలలోనే ముద్రింపించి సామాజికులకుఁ బంపిరి. ఆయనకూడ వచ్చియున్న 1887 వ సంవత్సరము జనేవరు 2 వ తేదిని జరగిన కార్యనిర్వాహక సంఘమువారి సభలో నీక్రింది నిర్ధారణములు చేయఁబడినవి. -

"4. That whether the W. M. Assn. referred to in Mr. Pida Ramakrishniah's wills is the Widow Marriage Association whose head quarters is at Rajahmundry be discussed


at a special meeting of the managing committee.(వితంతువివాహ సమాజమని పైడా రామకృష్ణయ్యగారి మరణశాసనములలో చెప్పఁబడినది రాజమహేంద్రవరము ప్రథానస్థానముగాఁగల వితంతువివాహ సమాజమగు నాయని కార్యనిర్వాహక సంఘముయొక్క విశేష సభయందు చర్చింపఁ బడవలెను.)

5. That a special meeting of the managing committee be convened to discuss the question "What is the best way of administering Mr. Pida Ramakrishniah's Widow Marriage Fund. (పైడా రామకృష్ణయ్యగారి వితంతువివాహ నిధి నుపయోగించుట కేదియుత్తమమార్గమన్న ప్రశ్నను చర్చించుటకయి కార్యనిర్వాహక సంఘము యొక్క విశేష సభను సమకూర్పవలెను.)

6. That a special meeting of the managing committee to consider the above two questions be conened at 4 P. M. on the 9th instant at the Innespeta School house, and the members of the Assn. residing in this town be requested to attend this meeting." (పయిరెండు ప్రశ్నలను చర్చించుటకయి 9 వ తేది సాయంకాలము 4 గంటలకు ఇన్నీసుపేట పాఠశాలలో కార్యనిర్వాహక సంఘము యొక్క విశేషసభ సమకూర్పఁబడి, ఈపట్టణములో వాసము చేయుచున్న సమాజము యొక్క సభ్యులు పూర్వోక్త సభకు వచ్చునట్లు ప్రార్థింపఁబడవలెను.)

పయి నిర్ధారణ ప్రకారముగా 9 వ తేదిని సభ సమకూర్పఁ బడెనుగాని నాటిదినము లక్ష్మీనరసింహముగారు రానందున సభ 13 వ తేదికి విలంబింపఁ బడెను. ఆ 13 వ తేదిని సహితము లక్ష్మీనరసింహముగారు సభకు రాలేదు. నాఁడాయన లేకయే సభ జరపఁబడెను. ఆసభకు కార్యనిర్వాహక సంఘము వారుగాక మఱి 19 గురుసామాజికులువచ్చిరి. అందఱి యభిప్రాయములను గైకొన్న మీఁదట నీక్రింది నిర్ధారణులు చేయఁబడినవి


Resolved,

I, that "Widow Marriage Association" referred to in Mr. Pida Ramakrishniah's will relating Rs. 10,000 fund is the Widow Marriage Association whose Head quarters is at Rajahmundry.(పదివేలరూపాయల నిధినిగూర్చి పైడా రామకృష్ణయ్య గారి మరణ శాసనములో చెప్పఁబడిన "వితంతు వివాహసమాజము" రాజమహేంద్రవరము ప్రధానస్థానముగాఁగల వితంతు వివాహ సమాజమే.)

2. That such portion of the interest accuring on the said Fund be spent in affording the already married people, the present priest, Valluri Punnamma, her future husband and children such help as they may severally need and the balance in bringing about and defraying cost of future marriages." (వారివారికివేఱు వేఱుగా కావలసివచ్చెడు పూర్వోక్తనిధినుండివచ్చెడి వడ్డి యొక్క. యటువంటి భాగమును ఈవఱకు వివాహములయినవారికిని, ఇప్పటిపురోహితునకును, వల్లూరిపున్నమ్మకును, ఆమెభావిభర్తకును, బిడ్డలకును, కర్చు పెట్ట మిగిలినదానిని ముందువివాహములునడపి వానివ్యయములకును కర్చు పెట్టవలసినది.)

ఈ సభముగిసినతరువాత నాటిసాయంకాలమే మాపట్టణములోని వితంతువివాహసమాజమిత్రులును క్షేమకాంక్షులును సభచేసి, దానికినన్నగ్రాసనాసీనునిగాఁ జేసి, పాఠశాలలపరీక్షకులైన (Inspector of Schools) సీ. నాగోజిరావు పంతులుగారు కర్తవ్యనిర్దేశముచేయఁగా రాజమహేంద్రవర శాస్త్రపాఠశాల ప్రధమోపన్యాసకులైన (First Lecturer, Rajahmundry College) సి. సుందరరావు పంతులుగారనుమోదింపఁగా నైకకంఠ్యముతో పయినిర్థారణలయర్థమిచ్చెడు నిర్థారణల నేచేసిరి. ఆ సంవత్సరముజరగిన వితంతువివాహ సమాజముయొక్క సామాన్యసభ యొక్కదినమునఁగాక 1887 వ సం|| జనేవరు 15, 16, 22 వ తేదులను మూఁడు దినములుజరగినది. సకల జనాకర్షకమైన వితంతువివాహనిధిసంబంధవిషయతర్కమున్నందున, ఆసభ


లకు పట్టణములోని ప్రముఖులందఱునుదయచేసిరి. మొదటి రెండు దినముల యందును లక్ష్మీనరసింహముగారే యగ్రాసనాసీనులుగాఁజేయఁబడిరి. ఆ సభలలో స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమానస్థితులనుగూర్చి నేనిచ్చినయుపన్యాసమును, ఇతరులిచ్చినయుపన్యాసములును, చదువఁబడిన పిమ్మట క్రొత్తసామాజికులనుచేర్చుకొనుటయు, కార్యనిర్వాహకసంఘము నేర్పఱుచుటయు, కార్యదర్శియొక్క సాంవత్సరిక వృత్తనివేదనమును వినుటయు, సమాజవిధులనుకొన్నిటిని మార్చుటయు, తప్పవిశేషవిషయము లేవియు చర్చింపఁబడలేదు. మూఁడవనాటిసభముఖ్యమైనది. అందు లక్ష్మీనరసింహముగారితో సంబంధించిన యంశములు చర్చింపఁబడవలసియున్నందున దానికి పారసీ-శ్రీనివాసరావు పంతులుగా రగ్రాసనాసీనులుగాచేయఁబడిరి. ఆ సభ యందీక్రిందినిర్ధారణములు చేయఁబడినవి. -

Resolved,

"2. That the trustee Mr. A. L. Narasimham, be requested to associate with him two other trustees for the best administration of late Pida Ramakrishniah's Fund of Rs. 10,000. (కీర్తి శేషులయిన పైడా రామకృష్ణయ్యగారి పదివేలరూపాయల నిధియొక్క యుత్తమ కార్యనిర్వహణముకొఱకు తమతోఁగూడ మఱి యిద్దరు ధర్మకర్తలను జేర్చుకొనుటకు ధర్మకర్తయైన లక్ష్మీనరసింహముగారు కోరఁబడవలెను.)

3. That of the two trustees that are to be associated with him, one be elected by the ex-officio members from among themselves and the other be selected by the present trustee from among the members of the Widow Marriage Association, Rajahmundry, Whether ex-officio or not. (ఆయనతో చేర్చుకోఁబడ వలసిన యిద్దఱు ధర్మకర్తలలో నొకరు వివాహములు చేసికొన్న వారిచేత తమలోనుండి కోరుకొనఁబడవలెను: రెండవవాఁడు వివాహము చేసికొన్న


వాఁడయినను కాకపోయినను రాజమహేంద్రవర వితంతు వివాహ సమాజ సామాజికులలోనుండి ప్రస్తుతధర్మకర్తచేత నేర్పఱుపఁబడవలెను.)

4. That the trustees be requested to communicate their proceedings quarterly to the Secretary, Widow Marriage Association, Rajahmundry. (ధర్మకర్తలు తమ చర్యను మూడుమాసముల కొక పర్యాయము రాజమహేంద్రవర వితంతు వివాహ సమాజకార్యదర్శికి తెలుపుచుండ కోరఁబడవలెను.)

5. That the phrase 'Widow Marriage Association' referred to in Mr. Pida Ramakrishnaiah's will relating to Rs. 10,000 is the Widow Marriage Association whose Head Quarters is at Rajahmundry.(పదివేలరూపాయల నిధినిగూర్చి పైడా రామకృష్ణయ్యగారి మరణశాసనములో చెప్పఁబడిన వితంతు వివాహసమాజ మన్న పదము రాజమహేంద్రవరము ప్రధానస్థానము గాఁగల వితంతు వివాహ సమాజమే.)

6. That such portion of the interest accuring on the said fund as may be necessary in the opinion of trutees be spent in affording already married couples, the present priest, Valluri Punnamma, her future husband and children such help as they may severally need and the balance if any in bringing about and defraying cost of future marriages.(ధర్మకర్తల యభిప్రాయమునుబట్టి యావశ్యకముగా కనఁబడిన పూర్వోక్తనిధినుండి వచ్చెడు వడ్డిలోనియంతభాగమును ఈవఱకు వివాహమయినవారికిని, ప్రస్తుత పురోహితునకును, వల్లూరి పున్నమ్మకును, ఆమెభవిష్యద్భర్తకును, బిడ్డలకును వేరువేరుగా కావలసివచ్చెడు సాయమును చేయుటయందు కర్చు పెట్టి, ఏమైన నున్న యెడల మిగిలినదానిని ముందు వివాహములను నడపి వాని వ్యయములకు కర్చు పెట్టవలెను.) 7. That the trustee or trustees be requested to take the advice of the Widow Marriage Association on all important matters in the disbursements they make out of the sums realized in the way of interest on Mr. Pida Ramakrishnaiah's fund. (పైడా రామకృష్ణయ్యగారి నిధినుండి వడ్డి రూపమున వచ్చెడు సొమ్ములో నుండి వారు చేసెడు వ్యయములలో ముఖ్యమైనవాని విషయము నందెల్లను వితంతు వివాహ సమాజముయొక్క యాలోచన గైకొనుచుండుటకు ధర్మకర్తగాని ధర్మకర్తలుగాని కోరఁబడవలెను.)

8. That the Association record its sense of gratitude for and appreciation of the valuable services by Mr. A. L. Narasimham (now leaving Rajahmundry for Gooty) to promote the widow marriage cause." (ఇప్పుడు గుత్తికి వెళ్లుటకయి రాజమహేంద్రవరమును విడుచుచున్న ఏ. ఎల్. నరసింహముగారు వితంతు వివాహ పక్షాభివృద్ధికయి చేసిన విలువయిన సాహాయ్యమును గుర్తెఱిఁగి తన కృతజ్ఞతా భావమును సమాజము లిఖించుచున్నది.)

పై వానిలోని 1, 3, 4, 5, 6, 7, నిర్ధారణములకు తమయభిప్రాయము నియ్యక లక్ష్మీనరసింహముగారు గోపనముచేసికొనిరి. సభావసానమున లక్ష్మీనరసింహముగారులేచి "సామాజికులారా ! నేను మీయాలోచన నడుగుచుండెదను గాని దానిననుసరించినడుచుకొనుటకు నేనుబద్ధుఁడనుగాను." అనిసెలవిచ్చిరి. ఆయనగుత్తికివెళ్లునప్పుడు రాజమహేంద్రవర సాంగచతుర్వేదసభకని చందాలుచేర్చికొన్న వైదిక ముద్రాయంత్రమును విక్రయించి, రు. 1500 లు చందాలు పోగుచేసి తన్నిమత్తమయికొన్న వైదికపుస్తక భాండాగారమును పురజనులును చందాదారులును కొనిపోవలదని మొఱ్ఱపెట్టుచున్నను వినక తమవెంటఁ గొనిపోయిరి. మాసమాజము మరల క్రొత్తగానేర్పడిన తరువాత జరగిన మొదటి సంవత్సరసభయందే రామకృష్ణయ్యగారిని సమాజమునకు (President) అధ్యక్షునిగాను, నన్ను (Vice-President) ఉపాధ్యక్షునిగాను, యావజ్జీవము


నేర్పఱిచి, ప్రతి సంవత్సరసభయందును తక్కిన కార్యనిర్వాహక సభ్యులను కోరు కొనునట్లు నన్ను వేఱుగకోరనక్కఱలేకయే నేనుశాశ్వతముగా కార్య నిర్వాహక సంఘసభ్యుఁడుగానుండునట్లు నిర్ధారణముచేసిరి. నాకట్టి శాశ్వతాధికారి పదము లేకుండునట్లు చేయవలసినదని లక్ష్మీనరసింహముగారు గుత్తికిపోవుటకు ముందు తామొకవిజ్ఞాపనమును సమాజమునకుఁబంపిపోయిరికాని సమాజము వారాయనకోరికను నిరాకరించిరి. 1887 వ సంవత్సరము నవంబరు నెల 22 వ తేదిని తానుపులవరి శేషయ్యగారిని నల్లగొండ కోదండరామయ్యగారిని అధికధర్మకర్తలను (additional trustees) గా తనతోఁజేర్చుకొన్నట్టు తన నిర్ణయపత్రమునుబంపి, లక్ష్మీనరసింహముగారు రామకృష్ణయ్యగారినిధి ధనమును సంవత్సరమునకు నూటికాఱురూపాయలవడ్డిచొప్పున నీలపల్లిగ్రామముమీఁద బదులిచ్చుటను గూర్చి సమాజమువారినాలోచన యడిగెను. కార్యనిర్వాహక సంఘమువారు 1888 సంవత్సరము జనేవరు నెల 19 వ తేదిని జరగిన తమ సభలో క్రిందినిర్ధారణములుచేసిరి.

"2. That the proceedings of Mr. A. L. Narasimham Garu, trutee of Mr. P. R. W. M. fund, associating with him Messers. Seshiah and Kothanda Ramiah as additional trustees be approved. (శేషయ్యగారిని కోదండరామయ్యగారిని అధిక ధర్మకర్తలనుగా తనతోఁ జేర్చుకొనుచు పైడా రామకృష్ణయ్యగారి వితంతు వివాహనిధి ధర్మకర్తయైన ఏ. ఎల్. నరసింహముగారు చేసినచర్య సమ్మతింపఁబడినది.)

3. That the committee think it is not desirable to invest P.R.W. M Fund on Nilapalli at 6 p. c. they consider it safe it should remain in Govt, securities." (నూటికి ఆఱు వడ్డికి రామకృష్ణయ్యగారి వితంతు వివాహ నిధిని నీలపల్లిమీఁద పెట్టుట కరణీయముకాదని సంఘమువారు తలఁచుచున్నారు; దొరతనమువారి పత్రములలో నుండుటయే క్షేమకరమని వారెంచు చున్నారు.) కొన్ని మాసములయిన తరువాత లక్ష్మీనరసింహముగారు నీలపల్లిమీఁద ఋణమిచ్చుటవలని లాభములను దెలుపుచు సమాజమువారికి మరల వ్రాసిరి. కార్య నిర్వాహక సంఘము వారావిషయమున 1888 వ సంవత్సరము జూన్ నెల 10 వ తేదిని జరగిన తమ సభలో మరల నీక్రిందినిర్ధారణముచేసి యాయనకుఁ బంపిరి.-

"1. Read Mr. A. L. Narasimham chettiar's proposal to invest the late Pida Ramakrishniah's fund on Nilapalli at 6 p. c. - The committee re-affirm the resolution No. 3 passed in their meeting of the 29th January last. The committee do not consider it expedient to invest P. R. W. M. fund on immoveable property in preference to Govt. securities." (నూటి కాఱు రూపాయలవడ్డికి గతించిన పైడా రామకృష్ణయ్యగారి నిధిని నీలపల్లిమీఁదఁ బెట్టుటకయి ఏ. ఎల్. నరసింహముగారుచేసిన కర్తవ్య నిర్దేశము చదువఁబడి సంఘము వారు కడచిన జనెవరు 29 వ తేదిని తమసభయందుచేసినమూఁడవ నిర్ధారణమును మరల దృఢీకరించుచున్నారు. పైడా రామకృష్ణయ్యగారి నిధిని దొరతనమువారి పత్రములనుండి తీసి స్థిర ద్రవ్యముమీఁద పెట్టుట యుచితమని సంఘమువారు భావింపరు.)

లక్ష్మీనరసింహముగారు నీలపల్లిమీఁద నప్పిచ్చు ప్రయత్నము నందుమీఁద మానివేసిరిగాని 1890 వ సంవత్సరము ఫిబ్రవరి 5 వ తేదిని తద్ధనమును సభాపతి ప్రత్తి యంత్రములలో పెట్టుటనుగూర్చి మరల వ్రాసిరి. దానిపైని కార్యనిర్వాహక సంఘమువారు 1890 వ సంవత్సరము ఫిబ్రవరి 10 వ తేదిని జరగిన సభలో నిట్లు నిర్ధారణముచేసిరి. -

"1. Read Mr. A. L. Narasimham Garu's letter dated 5th feb. about investing P. R's fund of Rs. 10,000 in Mills &c., This committee in its resolutions dated 29th January and 10th June 1888 did not approve of the then proposal of Mr. A. L. Narasimham to invest Mr. Pida


Ramakrishniah's fund of 10,000 Rs. on the mortgage of Nilapalli Estate. The committee is of opinion that the present proposal of A. L. Narasimham to invest it in Mr. Sabhapathi Moodaliar's mills on his personal guarantee is less safe than the former and resolves that the investment should remain in government securities as at present.

"The committee notes with regret the form in which Mr. A. L. Narasimham, trustee on behalf of the association and no other , seeka its advice. The committee wishes to be informed why Mr. A. L. Narasimham has chosen the mode of treating it in the face of the resolution passed at the general meeting on the 22nd January 1887 at which he himself was present." (పైడా రామకృష్ణయ్యగారి పదివేలరూపాయల నిధిని యంత్రములమీఁద పెట్టుటనుగూర్చిన 1890 వ సం|| ఫిబ్రవరి 5 వ తేదిగల ఏ. ఎల్. నరసింహముగారి యుత్తరము చదువఁబడినది.

ఈ సభవారు 1888 వ సం|| జనేవరు 29 వ తేదియు జూన్ 10 వ తేదియుఁగల తమ నిర్ధారణములలో రామకృష్ణయ్యగారి రు. 10,000ల నిధిని నీలపల్లిసొత్తుయొక్క ఆధి (తనఖా) మీఁద బదులిచ్చెడి యప్పటి లక్ష్మీనరసింహముగారి కర్తవ్యనిర్దేశమునే సంఘము వారనుమతింపకపోయిరి. దానిని సభాపతిమొదల్యారిగారి స్వీయప్రాతిభావ్యముమీఁద నాతని యంత్రములలోఁ బెట్టుటనుగూర్చిన లక్ష్మీనరసింహముగారి యిప్పటికర్తవ్య నిర్దేశము పూర్వపు దానికంటెను తక్కువ క్షేమకరమని సంఘము వారభిప్రాయపడుచు, ఆనిధి ప్రస్తుతమున్నట్టుగా దొరతనమువారి పత్రములలోనే యట్టే యుండవలెనని నిశ్చయించుచున్నారు.

సమాజ పక్షమున ధర్మకర్తయయి యంతకంటె భిన్నుఁడుకాని ఏ. ఎల్. లక్ష్మీనరసింహముగా రాలోచన యడగిన రీతిని సంఘమువారు చింతతో


నిరూపించుచున్నారు. తానుగూడ స్వయముగా నుండఁగా 1887 వ సం 22 వ జనేవరున జరగిన సామాన్య సభయందు చేయఁబడిన నిర్ధారణముల ననాదరించి లక్ష్మీనరసింహము గారు సమాజముపట్ల నిట్లు వ్యవహరించెడి పద్ధతి నేల చేకొన్నారో సంఘమువారు తెలిసికొనఁ గోరుచున్నారు.)

ఇది యిట్లుండఁగా కార్యనిర్వాహక సంఘమువారొక కోమటి వివాహము జరగ నున్నప్పుడు 1889 వ సంవత్సరము ఫిబ్రవరి 3 వ తేదిని జరగిన సభలోఁ జేయఁబడిన యీక్రింది నిర్ధారణమును,

"2. That the trustees of Mr. Pida Ramakrishniah's fund be requested to contribute Rs. 50 for the celebration of the proposed Banya Marriage." (ఉద్దేశింపఁబడిన కోమటి వివాహమును జరుపుటకు రు. 50 లు సాయముచేయుటకయి పైడా రామకృష్ణయ్య గారినిధిధర్మకర్తలు ప్రార్థింపఁబడుచున్నారు.)

ఆ సంవత్సరమే మెయి నెల 25 వ తేదిని జరగిన తమ సభలో చేయఁబడిన యీక్రిందినిర్ధారణమును,

"5 That the trustees of the P. R. W. M. Fund be requested to pay from the first July the salaries of the priest and cook out of the interest of the said fund, as the association cannot find means to pay them." (వారిజీతము లిచ్చుటకు సమాజమువారు ధనమును బడయఁజాలకున్నారుగనుక, పురోహితునియొక్కయు వంటబ్రాహ్మణునియొక్కయు జీతములను పూర్వోక్తనిధియొక్క వడ్డిలోనుండి జూలయినెల మొదటి తేదినుండి యిచ్చుటకు పైడారామకృష్ణయ్య వితంతువివాహనిధిధర్మకర్తలు కోరఁబడుచున్నారు.)

ఇటువంటి వంటివే మఱికొన్ని నిర్ధారణములను, లక్ష్మీనరసింహముగారికి పంపిరిగాని యాయన దేనిని సమాదరింపలేదు. రామకృష్ణయ్యగారు తన మరణ


శాసనములో తామిచ్చిన ధనముయొక్క వడ్డిని వివాహముల నిమిత్తమయి కూడ వినియోగింపవలసినదని స్పష్టముగ విధించినను, ధర్మకర్తగారు నాలుగు సంవత్సరములనుండి వడ్డి నవ్యవస్థితముగా కలవారికిని లేనివారికిని పంచి పెట్టు చున్నను దానిలోనుండి యొక్క కాసునైనను వివాహములనిమిత్తము వ్యయపెట్ట నొల్లకపోయిరి; వివాహములు చేసికొన్నవారు తమ సమాఖ్య పత్రములో సమాజమువారియ్యనప్పుడు పురోహితుని జీతమును తమ భాగములలో నుండి యిచ్చుకొనునట్లొడంబడిక వ్రాసికొన్నను దానిని సహితము ధర్మకర్త లియ్య నొల్లకుండిరి. సమాజమువారియొక్క ప్రార్థనలనెల్ల లక్ష్మీనరసింహముగారిట్లు గణనకు తేకపోవుచురాఁగా, 1891 వ సంవత్సరము జనేవరు 25 వ తేదిని జరగిన తమ సాంవత్సరిక సామాన్య సభయందు సమాజమువారీ క్రింది నిర్ధారణములను చేసిరి.-

"That this meeting records its regret that the resolutions No. 4, 5, 6, 7, of the General Committee at its annual meeting held on the 22nd January 1887 have not been respected and carried out by the trustee Mr. A. L. Narasimham Chettiar and regrets to find that he continues to distribute the interest of Pida Ramakrishniah's widow marriage fund equally among the remarried couples in spite of the above resolutions and that he has not contributed anything towards the celebration of marriages after the death of Mr. P. Ramakrishniah or towards the pay of the priest and cook. (1887 వ సంవత్సరము జనెవరు 22 వ తేదిని జరగిన సామాన్య సంఘముయొక్క 4, 5, 6, 7, సంఖ్యల నిర్ధారణములు ధర్మకర్తయైన లక్ష్మీనరసింహముగారిచేత గౌరవింపఁబడి జరపఁబడనందుకు ఈ సభవారు తమ విచారమును తెలుపుచున్నారు; పైడారామకృష్ణయ్య వితంతువివాహనిధియొక్క వడ్డిని పయినిర్ధారణలకు విరోధముగా ఆయనయింకను పునర్వివాహ దంపతులకు సమానముగాపంచిపెట్టు


చునేవచ్చు చున్నట్టును రామకృష్ణయ్యగారిమరణానంతరమున వివాహములు జరపునిమిత్తముగాని పురోహితునియొక్కయు వంటబ్రాహ్మణునియొక్కయు జీతమినిమిత్తముగాని యేమియుసాయముచేయకున్నట్టును కనుఁగొనుటకు చింతిల్లుచున్నారు.)

"5. That Mr. A. L. Narasimham Chettiar be addressed on the subject for the last time and further action in the matter be left to the decision of the managing committee." (ఈవిషయమయి కడపటిసారి లక్ష్మీనరసింహముగారికి వ్రాసి, యీవిషయములో ముందుజరిగింపవలసినచర్య కార్యనిర్వాహక సంఘమువారి నిర్ణయమునకు విడిచిపెట్టఁబడుచున్నది.)

ఈకడపటి నిర్ధారణప్రకారముగా కార్యనిర్వాహక సంఘమువారు న్యాయసభలకుఁబోయి యేదోయొకవిధముగా వ్యవహారనిర్ణయమును పొంది యుందురుగాని ధనాభావముచేత నట్టిపనిజరగలేదు. సమాజముదుర్బలస్థితి యందుండుటను గనిపెట్టి లక్ష్మీనరసింహముగారు స్వతంత్రించియానిధిని దొరతనమువారి పత్రములనుండి తొలఁగించి, ముందుగా వాణిజ్యధనాగారమునఁ (Commercial Bank) బెట్టి, తరువాత నాధనమునక్కడనుండి తీసిదానితో చిత్తుర్రుమండలము నందొకగ్రామమునుగొని, 'రాజా' యనుబిరుదు నామముతో తన్నుఁబిలుచుకొనుచు తనమరణపర్యంతమును పదికుటుంబములకు సంవత్సరమునకు మున్నూఱు రూపాయలు పంపుచుండిరి. ప్రథమవివాహముచేసికొన్న గోగులపాటి శ్రీరాములుగారికి మొదటినుండియు భాగమునియ్యమాని వేసిరి. పులవర్తి శేషయ్యగారు కాలముచేసినతరువాత నాతనివంతియ్యమానివేసిరి. శేషయ్యగారికుమారుని నేను చేరఁదీసి విద్యచెప్పించి పెంచుచుండుటను బట్టి యతనిభాగమియ్యనక్కఱలేకపోయినది. ఒకవేళ లక్ష్మీనరసింహముగారాచిన్న వానిభాగమని నెలకు రు. 2-8-0 లు పంపుచుండియుందురనుకొన్నను, అంత చిన్న మొత్తముతో నెవ్వరాయేడేండ్ల శిశువునకన్న వస్త్రములిచ్చి పెంచి విద్య


చెప్పింపఁబూనుకొందురు? మరణకాలమునందు తాముసదుద్దేశముతో నిచ్చిన పదివేలరూపాయల ధనము వివాహకార్యములకుఁగాని తల్లిదండ్రులను గోలుపోయి యగతికులయిన శిశువుల పోషణమునకుఁగాని యుపయోగపడక గడించు భర్తను పోగొట్టుకొని దుఃఖపడు రాచర్ల రత్తమ్మకువలెనే రాజమహేంద్ర వర పురపారిశుద్ధ్యవిచారణసంఘ కార్యనిర్వాహకకుండయి నెలకు నలువది రూపాయలుగడించు, నల్లగొండ కోదండరామయ్య గారికిని నెలకు నెలకు రు. 2-8-0 ల చొప్పున భరణముక్రింద నుపయోగపడునని రామకృష్ణయ్యగారు స్వప్నావస్థయందైనను దలఁచియుందురా? వివాహములకయి కాసయిన నియ్యకవచ్చిన వడ్డినంతను దురాశచే తామే యనుభవింపవలెననుకొన్న పుణ్య పురుషులకా రు 2-8-0 లచొప్పున ననుభవించు భాగ్యము సహితము చిరకాలముండినది కాదు. లక్ష్మీనరసింహముగారి లోకాంతరగతితోనే వడ్డిమాత్రమేకాక యానిధియంతయు సమూలముగా నంతరించి, యీనడుమను నష్టమయిన రెండు కుటుంబముల యంశములనుగూడ పాళ్లువేసి పంచుకొను శ్రమకూడ వారికి తప్పిపోయినది.

ఇఁక మన సమాజవృత్తాంతమునకు వత్తము. 1886, 1887 సంవత్సరములలో సమాజము వారొక్క వివాహమునైనను చేయఁగలిగినవారుకారు. 1887 వ సంవత్సరాంతమున కార్యనిర్వాహక సంఘమువారి కార్యదర్శి శ్రీ న్యాపతి సుబ్బారావుపంతులుగారు తమ కార్యనివేదన పత్రికలోని యాదాయ వ్యయపట్టికలోఁ జూపిన ప్రకారముగా నేను తిరిగి పోగుచేసికొని వచ్చిన రు 742-12-4 లును, సమాజమువారు నెల చందాలమూలమునను దాన ధన రూపమునను పోగుచేసిన రు. 1585-4-0 లును, (మొత్తము 2328-0-4) నెల జీతములక్రిందను వివాహ దంపతులకిచ్చిన ధనదానములక్రిందను (1888 సం|| 1 వ జనేవరున నిలువయుండిన రు. 212-13-4 లుగాక) వ్యయపడినవి. రామకృష్ణయ్యగారు మరణము నొందునప్పటి కాయన మరణశాసననాను సారముగా నిద్దఱిద్దఱికి పంచిపెట్టవలసినవి రాజమహేంద్రవరములో రెండిండ్లుండినవి


ఆయిండ్లను పంచి పెట్టుటకు కార్యనిర్వాహక సంఘమువారు ఆత్మూరి లక్ష్మీనరసింహముగారిని నియమించిరి. ఆవఱకే రెండుభాగములుగానున్న పులవర్తి శేషయ్యగారుండిన యిల్లు పంచిపెట్టవలసివచ్చినప్పుడు చావడి యరుగు తన భాగములోనిదని రాచర్ల రామచంద్రరావుగారును, తన భాగములోనిదని శేషయ్యగారును, తగవుపెట్టఁగా సమాజమువారేఁ బదిరూపాయలు రామచంద్రరావుగారికిచ్చి యరుగు శేషయ్యగారికిప్పించిరి. ఆవఱకు మూడుభాగములుగా నుండిన కోదండరామయ్యగారుండిన యిల్లు కోదండరామయ్య గారును చేబోలు వెంకయ్యగారును కాపురముండిన భాగము లాప్రకారముగానే యుంచఁబడి నడిమిభాగము రెండుగా విభాగింపఁబడి కోదండరామయ్యగారి యింటితోఁగలిసిన దక్షిణభాగము కోదండరామయ్యగారికిని, వెంకయ్యగారి యింటితోఁగలిసిన యుత్తరభాగము వెంకయ్య గారికిని, పంచియియ్యఁబడినవి.

ఈలోపల సమాజమునకు కొన్ని విపత్తులు సంభవించినవి. 1888 వ సంవత్సరము ఏప్రిల్ నెల 19 వ తేదిని ద్వితీయ వివాహవరుఁడైన రామచంద్రరావు లోకాంతరగతుఁడయ్యెను; ఆనెల 28 వ తేదిని చతుర్థవివాహవరుఁడైన శేషయ్య భార్య శేషమ్మ పరలోక గతురాలయ్యెను; ఆమాసమునందే ప్రథమ వివాహవరుఁడైన గోగులపాటి శ్రీరాములు క్రైస్తవమత ప్రవిష్టుఁడయ్యెను. శ్రీములుగారికిని భార్యకును పడక పోయినట్లును తన్ని మిత్తమయి 1882 వ సంవత్సరము సెప్టెంబరునెలలో గవర్రాజుగారిని విశాఘపట్టణము పంపినట్టును వెనుక నే చెప్పఁబడెను గదా ! అప్పుడాయన చేసిన సంధి కొన్ని మాసములే నిలిచినది. శ్రీరాములుగారి భార్యను తీసికొని యామెతల్లి 1883 వ సంవత్సరము జనేవరు నెలలో తనయూరికి కొనిపోవలెనని రాజమహేంద్రవరమునకు వచ్చెను. నేను తల్లిని కూకలువేసి యామెను స్వగ్రామమునకుఁ బంపివేసి కూఁతును నాయొద్దనే యుంచుకొని శ్రీరాములుకు వ్రాసి సమాధానపఱిచి యాచిన్న దానిని మరల గవర్రాజుగారి వెంట భర్తవద్దకు విశాఖపట్టణము పంపితిని. ఆయన కొంతకాల మక్కడనుండి వధూవరు లిద్ద


ఱును అనుకూలముగా నున్నట్టు కనఁబడినపిమ్మట తిరిగి రాజమహేంద్రవరమునకువచ్చెను. ఆతనిభార్య యావత్సరాంతమున భర్తనువిడిచి, మరల రాజమహేంద్రవరమునకు వచ్చెను. నేనామెను కొంతకాలము నాయొద్ద నుంచుకొని బుద్ధులుచెప్పి యొప్పించి 1884 వ సంవత్సరము జనేవరి నెలలో మరల భర్తవద్దకు పంపితిని. ఇట్లెన్ని విధముల ప్రయత్నముచేసినను తుదకీదాంపత్యము పొసఁగుపాటునకు రాలేదు. భార్యాభర్తల కిరువురకును శీఘ్రకాలములోనే మరల స్థిరవియోగము తటస్థించెను. భార్య కడసారి పుట్టినింటికిఁబోయి మరల రాకున్న తరువాత నాతఁడు విశాఘపట్టణములో నొంటిగానుండి వంటచేసికొని భుజించుచు వేళకు కార్యస్థానమునకుఁబోయి పనిచేసి వచ్చుచుండెను. భార్య జీవించి యున్న వానికి మరల వివాహముచేయనని నాప్రతిజ్ఞయగుటచేత నే నాతనికి పునర్వివాహ ప్రయత్నము చేయలేదు. విశాఘపట్టణములో వితంతు వివాహము చేసికొన్నవాఁ డితఁడొక్కఁడేకాని సాయము చేయుటకు వేరు కుటుంబములేదు. ఈతఁడీ ప్రకారముగా బహు సంవత్సరములొంటిగా కష్టపడి కడపట 1888 వ సంవత్సరమునందు క్రైస్తవమత ప్రవిష్టుఁడయ్యెను.

1888 వ సంవత్సరము జూలయినెల 6 వ తేదిని కొమ్మరాజు గోపాలముగారి వివాహము జరగినది. ఈతనికియ్యఁబడిన వధువు వల్లూరి పున్నమ్మ. వివాహము నిమిత్తమయి రామకృష్ణయ్యగారే మున్నూరు రూపాయలు తమ మరణమునకు ముందిచ్చియుండిరి. ఆ మున్నూరు రూపాయలలో నిన్నూరు రూపాయలు వధువు నగలక్రిందను, నూరురూపాయలు వివాహవ్యయముల క్రిందను, కర్చు పెట్టఁబడినవి. రామకృష్ణయ్యగారి మరణశాసన ప్రకారమిల్లా వఱకే యుండినది. నెల కెనిమిదేసి రూపాయలచొప్పున సంవత్సరకాల మిచ్చుట తప్ప మఱేమియు నియ్య వాగ్దానము చేయలేదనియు తాను మఱేమియు నడుగఁగలవాఁడను కాననియు వరునిచేత వ్రాయించి పుచ్చుకొని


దానిని సమాజమువారికి పంపినమీఁదటనే నేనీ వివాహముచేసితిని. రామచంద్రయ్యగారు బెంగుళూరినుండి పంపిన నూఱురూపాయలును నెల కెనిమిదేసి చొప్పున నీవరునకీయఁబడినవి. పయి కష్టములు సంప్రాప్తమయిన తరువాత నేను వ్రాసిన యుత్తరమునకు లక్ష్మీనరసింహముగారు గుత్తినుండి 26-8-88 వ తేదిని నాకిట్లు బదులువ్రాసిరి.

"My dear friend,

Your tender and pathetic appeal to my conscience has almost put me out of my senses. I do not know what to do. Before I reply I ask our Heavenly Father to teach me and instruct me what I shall do in the matter. I am unable to solve the problem. I look up to Him for assistance and guidance. You know I have no interest. I should do what justice requires. But you have tied down my hands. I can only do what my colleagues advice me to do. Any split will leas to unnecessary unpleasantness. Can not you send for Seshayya and kothandaramayya and make any arrangement? Speak to them gently. Show your earnestness. If you then come to any arrangement, I shall gladly accept it, provided it does not touch the principal. as to the management or spending of the interest I leave it to you three. Consider the best arrangement and I shall gladly follow it. To your suggestion I have some remarks to offer.

You say "Make an earnest appeal to your conscience and see whether it tells you to be giving Rs. 3 or 4 every month to those who are not in need of it and who get Rs. 15 or so monthly or expects you to support only those that are really in need of help and to relieve, as far as possible, those wretched creatures whose lives would be made of continued misery if we don't lend our helping hand?" This touches me very much. But how to remedy the evil. It is only Ramayya that is paid Rs. 4-0-0 a month. I think that he deserves it. Now the others are paid at Rs. 2-8-0 a month , Can you draw aline to whom this should be paid and to whom tis need not be continued. Take the other side of the question. No doubt some may not require assistance. But every one wants or pleads for assistance. Sreeramulu of Cocanada sends a telegram for immediate assistance. He sends letter for urgent necessity. How we to determine and who is to determine?He wanted Rs. 50 by wire. Ofcourse I could now easily reply "No more than fifteen you can get." Chalapathi Row sends a number of letters for his wife's medical assistance. His letters, you will see, show that he is in great need and that he would otherwise severely suffer. What reply could I make if there is no rule or system? Now I can say "adjust, no more than Rs. 15-0-0. Venkayya sends letter. Money is required for his child, send more money. Kothandaramayya writes my house is uninhabitable. Unless send some hundred rupees, he says, it will fall down and cause irreparable loss. Dear friend how to reply. Place yourself in that position and see what answers you could make. If you want for one year I shall delegate my powers and see if you can make better arrangement . I do not like to be bothered by their various applications. I want to give my undivided attention to Vedam..."

(నాప్రియమిత్రుఁఁడా ! మృదువుగాను మనసు కరఁగునట్టు గాను నా యంతరాత్మకు చేసిన మీ ప్రార్థన నన్నించుమించుగా మతిలేనివానినిగా చేసినది. ఏమిచేయవలెనో నేనెఱుఁగను. ఈవిషయములో నేనేమిచేయవలెనో నాకు నేర్పి యుపదేశించుటకయి నేను ప్రత్యుత్తరమిచ్చుటకు ముందు మన స్వర్గమునందున్న తండ్రిని (దేవుని) వేఁడుకొనుచున్నాను. ఈసందిగ్ధాంశము నిద


మిద్ధమని నిర్ణయించుటకు నేను శక్తుఁడనుగాకున్నను. సాయముకొఱకును దారి చూపుటకొఱకును నేనాయనకయి చూచుచున్నాను. నాకిందులో లాభములేదని మీరెఱుఁగుదురు. న్యాయమపేక్షించుదానిని నేను చేయవలెను. కాని మీరు నాచేతులను కట్టిపెట్టియున్నారు. నాసహకారులు చేయుమని చెప్పినదానినిమాత్రమే నేనుచేయఁగలను. మాలోనివిభాగ మనావశ్యకమయిన యప్రియమునకు కారణమగును. శేషయ్యను కోదండరామయ్యను పిలిపించి మీరేదైన నేర్పాటు చేయలేరా? వారితో శాంతముగా మాటాడుఁడు; మీయేకాగ్రతను కనఁబఱుపుఁడు అప్పుడు మీరేదైన నేర్పాటునకు వచ్చిన పక్షమున, మూలధనమును ముట్టునది కాదేని నేను దానిని సంతోషపూర్వకముగా నంగీకరించెదను. కార్యనిర్వహణ విషయముగాని వడ్డిని వ్యయపెట్టు విషయముగాని నేను మీ ముగ్గురికి విడిచిపెట్టెదను. ఉత్తమమైన యేర్పాటు నాలోచింపుఁడు, నేను దానిని సంతోషముతో ననుసరించెదను. మీరు చేసి సూచన విషయమయి నేను కొన్ని వ్యాఖ్యానములను చేయవలసియున్నది.

'మీయంతరాత్మ కేకాగ్రమయిన విన్నపముచేసి, అది యావశ్యకము లేనట్టియు నెలకు పదునేను రూపాయలో యెంతో సంపాదించుకొనునట్టియు వారికి ప్రతిమాసమును మూడు నాలుగురూపాయలిచ్చు చుండుమని చెప్పునో నిజముగా సాయము కావలసినవారికి మాత్రమే తోడుచూపి మనము సహాయ హస్తము నియ్యకపోయినయెడల నెవ్వరి జీవితములు నిరంతర దుఃఖభాజనములుగా చేయఁబడునో యటువంటి యగతికులను సాధ్యమైనంతవఱకు దుఃఖ విముక్తులనుగాఁ జేయుటకై మిమ్మెదురు చూచునో చూచుఁడని మీరు చెప్పుచున్నారు.

ఇది నామనస్సును మిక్కిలి విస్తారముగా తాఁకుచున్నది. కాని, యీయనర్థమునకు ప్రతిక్రియ చేయుటయెట్లు? నెలకు నాలుగురూపాయ లిచ్చుట యొక్క రామయ్యకు మాత్రమే. అతఁడు దాని కర్హుఁడని తలఁచుచున్నారు. ఇప్పుడు తక్కినవారికి నెలకు రు. 2-8-0 ల చొప్పున నియ్య


బడుచున్నది. ఇది యెవ్వరికియ్యఁబడవలెనో యెవ్వరికి ముందియ్యఁబడ నక్కఱలేదో మీరొకగీతను గీయఁగలరా ? ఈప్రశ్నముయొక్క రెండవవైపు పుచ్చుకొనుఁడు. నిస్సంశయముగా కొందఱికి సాయమక్కఱలేక పోవచ్చును. కాని ప్రతిపురుషుఁడును సాయము కావలెనని కోరుచున్నాఁడు. వెంటనే సాయముకావలెనని కాకినాడలోని శ్రీరాములు తంత్రీవార్త పంపుచున్నాఁడు. అవిలంబ్యమైన యవశ్యకతకొఱ కతఁ డుత్తరము పంపుచున్నాఁడు. మన మెట్లు నిర్ణయింపవలెను? నిర్ణయించువారెవరు? తంత్రీముఖమున నతఁడేబదిరూపాయలు కావలెననెను. "నీకు రాఁగలిగిన 15 కంటె నెక్కువ రాదు" అని నేనిప్పుడు సులభముగా చెప్పఁగలిగితినిగదా ! తన భార్య యొక్క వైద్యసాహాయ్యముకొఱకు చెలపతిరావెన్నో లేఖలు వ్రాయుచున్నాఁడు. అతఁడు లేని స్థితిలో నున్నాఁడనియు మఱియొక లాగైనచో నతఁడు మిక్కిలి బాధపడుననియు నతని యుత్తరములు చూపుట మీరు కనుఁగొన వచ్చును. విధిగాని పద్ధతిగాని లేనిపక్షమున నేనేమి యుత్తరమియ్యఁ గలుగుదును? "15 రూపాయలకంటె నెక్కువలేదు. సరిపఱుచుకో" అని నేనిప్పుడు చెప్పఁగలను. తన బిడ్డ నిమిత్తము సొమ్ము కావలెను పంపుమని వెంకయ్య వ్రాయుచున్నాఁడు. 'నా యిల్లు వాసయోగ్యము కాకున్నది. నూఱురూపాయలు పంపనియెడల, అది పడిపోయి యప్రతికారమైన నష్టమును కలిగించును' అని కోదండరామయ్య వ్రాయుచున్నాఁడు. ప్రియ మిత్రుఁడా ! ఎట్లు ప్రత్యుత్తరమియ్యవలెను? ఆస్థితియందు మీరుండి మీరేమి ప్రత్యుత్తరము లియ్యఁగలుగుదురో చూడుఁడు. మీరు కోరినయెడల సంవత్సరకాలము నాయధికారములను మీకిచ్చెదను. మీరింతకంటె మంచి యేర్పాటుచేయఁ గలుగుదురేమో చూడుఁడు. వారి వివిధ ప్రార్థనలతో బాధింపఁబడుట నాకిష్టములేదు. నాయవిచ్ఛిన్నమైన యవధానమును వేదమున కియ్యఁ గోరెదను.) లక్ష్మీనరసింహముగారు కోపమువచ్చినప్పుడు తొందరపడి యనాలోచితముగా పనిచేయువారయినను, స్వభావముచేత శాంత సమయమునందు న్యాయముచేయుటయందే దృష్టిగలవారు. ఇప్పు డాయన యెటుచేయుటకును పాలుపోని విషమావస్థయందు తగులుకొనియుండిరి. సమాజమువారి నిర్ధారణానుసారముగా తనతోఁజేర్చుకొన్న ధర్మకర్తలకు వ్యతిరిక్తముగా న్యాయమార్గమునకు మరలు నంతటి ధైర్యము కలవారు కాకుండిరి. ఈ యధిక ధర్మకర్తలన్ననో సామాన్య లాభము నిమిత్తము స్వలాభమును వదలుకొను నంతటి యవివేకులు కానందున వారు సూచింపఁబడిన యేర్పాటునకు వచ్చుట యసాధ్యము.

1888 వ సంవత్సరము అక్టోబరు నెల 17 వ తేదిని కోదండరామయ్య గారి ద్వితీయ వివాహము జరగినది. క్రొత్తగానియ్య నక్కఱలేక యీయన కిల్లీవఱకే యుండెను; నగలును ప్రథమభార్యవే యుండినవి. ఈయన సమాజముతోడి సంబంధములేక తనవివాహమును తాను స్వతంత్రముగా చేసికొనెదనని చెప్పినను, కార్యదర్శియొద్ద బదులని పుచ్చుకొని మరల తీర్పని రు 75 ల సమాజ ధనముతోనే వివాహవ్యయములు నడచినవి; సమాజమువారి వంట బ్రాహ్మణుఁడును పురోహితుఁడును వంటను వివాహతంత్రమును నడపిరి. తన వివాహమును తానే స్వతంత్రముగా చేసికొంటినని వ్రాసి లక్ష్మీనరసింహము గారి ద్వారమున సభాపతి మొదల్యారిగారు పెండ్లియొకటికి సమాజమున కిచ్చెదమని వాగ్దానముచేసిన నూఱురూపాయలును కోదండరామయ్యగారే తెప్పించుకొనెను; రామచంద్రయ్యరు గారిచ్చెడు నూఱు రూపాయలును తనకే పంపుమని వ్రాసెనుగాని యాయన తన సహాయధనమును సమాజమునకే యిచ్చెను.

తన యింటిలోని యొక భాగమునకు గోదావరివఱదచేత కొంతచెఱుపు కలిగిన తరువాత రామకృష్ణయ్యగారి మరణశాసనానుసారముగా మూడు భాగములుగా నుండిన యింటిని రెండుభాగములుగా ఆత్మూరి లక్ష్మీనరసింహము


గారు పంచియిచ్చినను పంచి యియ్యనేలేదనియు, గోదావరివఱదవలన తనయింటి భాగమునకు నష్టము కలుగుటయు వెంకయ్య తన భాగమును వృద్ధి చేసికొనుటయు చూచి కోదండరామయ్య గారిల్లు క్రొత్తగా పంచిపెట్టుఁడని కోరెనేకాని యిల్లు పంచియియ్యలేదనుట వాస్తవము కాదని కార్యనిర్వాహక సంఘమువారు నిర్ధారణము చేసినపిమ్మట తన వ్యవహారమును సామాన్య సంఘమువారి ముందు పెట్టవలసినదని దూషణోక్తులతో నుత్తరము వ్రాసియు, సామాన్య సంఘమువారు కార్యనిర్వాహక సంఘమువారి తీర్పునే స్థిరపఱిచిన తరువాత న్యాయసభలకుఁ బోయెదనని బెదరించియు, తాను బదులు పుచ్చుకొన్న సొమ్ము తీర్పనక్కఱలేదని కారణము చెప్పకయే తగవు పెట్టియు, తనకు ధనమియ్యక పోయినయెడల పునర్వివాహ పక్షమును విడిచి ప్రాయశ్చిత్తముచేయించు కొనెదనని భయపెట్టియు, ఉన్న సమాజమునకు విరోధముగా నత్యల్పకాలములోనే నశించిన యింకొకసమాజమును స్థాపించియు, తనకు ధనసాహాయ్యము చేయనివారిని తన పక్షమున మాటాడని వారిని దూషించుటకయి వార్తాపత్రిక నొకదానిని బైలుదేఱఁదీసియు, కోదండరామయ్య గారును, ప్రతిపక్షుల ప్రేరణముచేత నల్పాంశములనుబట్టి మఱియొకరిద్దఱును అ విచారమూలకములయిన తొందరపనులుచేసి నాకును సమాజమువారికిని కొంత శ్రమ కలుగఁజేయుచు వచ్చిరికాని యట్టివానినెల్ల నిచ్చట వివరించుట యనావశ్యకము. అంతేకాక యవి సువిచారపూర్వకములుకాని బాలవిచేష్టితములగుటచే నుపేక్ష్యములును క్షంతవ్యములునయియున్నవి. కొందఱు ధనాశ చేతనే లబ్ధమనోరథులుకాక యిట్టి తొందరలను చూపుచువచ్చిరి. అట్టివారు తామే స్వార్థపరిత్యాగులయిన పరార్థపరులయినట్టు నటించుచు తామడిగినంత యియ్యకపోవుటచేత తమ నిమిత్తమయి చందాలిచ్చి పాటుపడుచుండిన పుణ్యపురుషులను సహానుభూతిలేనివారని నిందింపఁ దొడఁగిరి. ఇక్కడి యీవితంతువివాహ సమాజములో రాజమహేంద్రవరములో ప్రముఖులుగా నుండినవారు ముక్కాలు మువ్వీసము చేరియుండిరి. ఈయైదు సంవత్సరము


లలో సామాజికులుగా నుండినవారిలో 27 గురు పట్టపరీక్ష (బీ. యే) యందు కృతార్థులయిన వారుండిరి; ఇరువురు శాస్త్రోపాధ్యాయ (యమ్. ఏ) పట్టమునొందినవారు. సామాజికులలో న్యాయవాదులు, రాజకీయోద్యోగులు, వర్తకులు మొదలయినవారుండిరి. ఇంతమంది ఘనులుండినను పూర్వోక్తము లైన రెండునుగాక యైదుసంవత్సరములకాలములో క్రొత్త వివాహమొక్కటియే జరగినది. వెనుకటివానికి వలెనే దీనికిని రామకృష్ణయ్య గారిచ్చిన యిల్లే శరణమయినది. 1889 వ సంవత్సరము మార్చి నెల 29 వ తేదిని జరగిన యీ కోమటివివాహదంపతులకు కాకినాడలోని (తాడూరి రామారావుగారి యింటితోఁజేరిన) రామకృష్ణయ్యగారిచ్చిన యిల్లియ్య నిశ్చయింపఁగా బ్రాహ్మణులున్న యింటిలో కోమటులుండుట యననుకూలమని తాడూరి రామారావు పంతులుగారు మొఱ్ఱపెట్టి సమాజమువారి యనుమతితో నూతనదంపతుల కాపురమునకయి యిల్లు కట్టించుకొనుటకు మున్నూఱు రూపాయలిచ్చి యా యింటి భాగమును తాను స్వాధీనము చేసికొనెను. ఇఁకముందు నూతన దంపతుల కిచ్చుటకు సమాజమువారివద్ద నిండ్లు లేవు; ఇండ్లు కట్టించి యిచ్చుటకయి ధనములేదు. మాసమాసమునకు చందాలిచ్చి కూర్చినధనమును సేవకుల నెలజీతములకును వివాహము లాడినవారికిని నిచ్చు చుండుటవలనిఫల మతృప్తియు దూషణములును తప్ప వేఱులేదని కొందఱి మనస్సులకు తోఁచినందున వారు చందాలిచ్చుట మానుకొనిరి. అందుచేత సంవత్సరమున కాఱు రూపాయలిచ్చుట భారముగానుండునని సామాజికు లియ్యవలసిన చందాధన మాఱు రూపాయలనుండి మూఁడు రూపాయలకు తగ్గింపఁబడినది. ఆమూడురూపాయలిచ్చుట సహితము కష్టముగా కనఁబడినందున మూడొక్కటిగా చేయఁబడినది. ఆయొక్క రూపాయ సహిత మనేకులు క్రమముగా నియ్యకుండిరి. అందుచేత సేవకుల నెలజీతము లిచ్చుటయే సమాజమువారికి దుర్భరమయినందున, వారు పురోహితుని వంటబ్రాహ్మణుని తొలఁగించి వారిదారి వారిని చూచుకొండనిరి. దీనినిబట్టి సమాజమువారికి లెక్కలుంచవలసిన భారమును


తగవులు తీర్పవలసిన భారమును తప్పిపోయినందున, 1892 వ సంవత్సరము మొదలుకొని సమాజమువారు సంవత్సరమున కొక్క పర్యాయము దేశీయసంఘ సంస్కరణ సభకు ప్రతినిధుల నేర్పఱుచుటకయి చేయు సభలుతప్ప వేఱు సభలు లేక విశ్రాంతి సుఖము ననుభవింపఁజొచ్చిరి. వివాహములను నాసొంతసొమ్ముతో నామనసువచ్చినట్లు నేనే సమాజమువారి యాదరణము క్రింద చేయఁజొచ్చితిని. 1892 వ సంవత్సరములో రెండు వివాహములును 1893 వ సంవత్సరములో రెండు వివాహములును, ఈప్రకారముగా 1907 వ సంవత్సరమున నేను చెన్న పట్టణమునకు వెళ్లునప్పటికి పది వివాహములు చేసితిని. ఈవివాహదంపతుల కిండ్లిచ్చు పద్ధతినిగాని నగలుపెట్టు పద్ధతినిగాని నేను పెట్టుకోలేదు. మట్టెలు, మంగళ సూత్రములు, నూతనవస్త్రములు, తాంబూలాదులు, వాద్యములు, భోజనములు మొదలయినవానిక్రింద నూఱురూపాయలకు మించకుండ వ్యయముచేయ నిశ్చయించుకొని యాప్రకారముగా చేయుచుంటిని. నాకు ధనము కావలసి వచ్చినప్పుడెల్లను నామిత్రులయిన న్యాపతి సుబ్బారావు పంతులుగారి ప్రీతి పూర్వకముగా నాకు బదులిచ్చి నేనిచ్చినప్పుడు వడ్డి గైకొనక యసలుమాత్రము పుచ్చుకొనుచుండెడివారు. ఇరువదియేడవ వివాహముచేసి నేనిక్కడనుండి చెన్న పురికిఁబోయితిని. అక్కడ ముప్పదియైదవ వివాహము జరగుచుండగా ఆత్మూరి లక్ష్మీనరసింహము సోమయాజులుగారు నన్ను చూడవచ్చిరి. అప్పుడు నేనాయనతో ప్రసంగవశమున ధనము లేకపోవుటచేత సత్కార్యాములు సాగక నిలిచిపోవనియు, అప్పటికి రామకృష్ణయ్యగారి ధనముతో చేయఁబడినవానికంటె ద్విగుణముగా వారి ధన సాహాయ్యము లేకయే చేయఁబడినవనియు, ప్రస్తావించితిని. ఆయన వధూవరులకు కట్నము చదివించి సంతోషించిపోయెను. తేరగా ధనము వచ్చునన్న యాశ లేక పోవుటచేత నిప్పటివరుల కతృప్తిలేదు. ధనార్థముగా నాకు వారివలన పీడలేదు. రాఁగారాఁగా వివాహవ్యయమును నూటినుండి యేఁబదికిని, ఏఁబది నుండి యిరువదింటికిని, దింపినాను. ఇప్పుడు చేయుచున్న కొన్ని వివాహములకు వ్యయములను వరులు తామే భరించుచున్నారు. ప్రయాస దశయని చెప్పఁబడిన 1881 కిని 1890 కిని నడుమనుండిన యీ పది సంవత్సరములలోను నేనితర విషయములందును చుఱుకుగా పని చేయుచునే యుండెడివాఁడను. ప్రతిదినమును పగలు పదిగంటలకు పాఠశాలకుఁ బోయి సాయంకాల మైదుగంటలవఱకును పనిచేసి వచ్చు చుండెడి వాఁడను. నేను తీవ్రమైన యుబ్బసపు దగ్గుచేత బాధపడుచుండినను పాఠశాలకుపోయి బాలురకు బోధింపని దినము లత్యల్పముగానుండెను. విద్యార్థుల సంఘములకుఁబోయి యుపన్యాసములిచ్చి వారిని సత్కార్యములకు పురికొల్పుచుండెడివాఁడను. ఇన్నీసుపేట పాఠశాలయొక్కయు పట్టణ పాఠశాలయొక్కయు కార్యనిర్వాహక సంఘములలో నొక్కఁడనుగానుండి పనిచేయుచుండెడివాఁడను. మహమ్మదీయ విద్యాసంఘమునకు సహితము మహమ్మదీయుల ప్రార్థనమీఁద నేనేకార్యదర్శిగానుండి వారి విద్యార్థుల భోజనగృహమును నడపుచుండెడివాఁడను. పురపారిశుద్ధ్య విచారణ సంఘములోను (Municipal Council), తాలూకా స్థలనిధి సంఘము (Taluq Board)లోను, మండల స్థలనిధి సంఘము (District Local Fund Board)లోను, సభ్యుఁడనుగా నుండి పనిచేయుచుండెడివాఁడను. పురపారిశుద్ధ్యసంఘ సభ్యుఁడనుగానుండి యాకాలమునందా సంఘములోనుండిన యుత్కోచ గ్రహణాదిదౌష్ట్యముల నడఁచివేయుటకయి సర్వవిధముల ప్రయత్నముచేసితిని. సభ్యులలో లంచములు పుచ్చుకొనువారి నామముల పుటాక్షరములనే పాత్రముల పేరుల మొదట పెట్టి పారిశుద్ధ్య సంఘప్రహసనమును వ్రాసి వివేకవర్ధనిలో బహు పత్రికల యందు ప్రకటించితిని. అప్పటి పారిశుద్ధ్యసంఘ సభ్యులలో కొందఱు వేఱు జీవనాధారము లేనివారయి లంచములవలననే సుఖజీవము చేయుచుండిరి. ఆకాలములో పౌరులయొక్క ప్రతి విజ్ఞాపన పత్రమునకును సభ్యున కియ్యవలసినది యింత, కార్యస్థాన కార్యనిర్వాహకున కియ్యవలసినది యింత, ఆరోగ్య పరీక్షకున కియ్యవలసినదియింత, తుదకుత్తరువును దెచ్చెడి భటున కియ్యవలసినది యింత, అని మూల్యప్రమాణములే యేర్పడియుండెను. సభ్యులు


దీపస్తంభముల నుపయుక్తస్థలములయందుఁ గాక తమ యిండ్లముందఱనే వేయించుకొనుచుండిరి; దీపముల గుత్తదారుఁడు వీధులలోని దీపములలోనుండి తగ్గించి చమురును సభ్యుల కొందఱి యిండ్లలోని దీపములకు పోయవలసి వచ్చుచుండెను. బాటలు బాగుచేయుటకయి యేటేట నియ్యఁబడు ప్రజల సొమ్ములో విశేషభాగ మీదుష్టుల సంచులలోనికే పోవుచుండెను. ప్రబలులైన ప్రజలు నిర్భయముగా తమ వీధియరుగులను పెంచియు, ఇండ్లను ముందుకు జరపికట్టియు, స్థలము నాక్రమించుకొని వీధు లంతకంతకు సన్న మగునట్లు చేయుచుండిరి. పారిశుధ్యశాసనవిధు లొక్క బీదలను మాత్రమే బాధించు చుండెనుగాని ధనికులు శాసన విధులనే బాధించుచుండిరి. పారిశుద్ధ్య విచారణ సంఘమువారి యధికారములోనున్న ధర్మ వైద్యశాలలో ధనము కావలసినంత వ్యయపడుచుండినను రోగులకు పథ్యపానములు తిన్నగా జరగక యాధనములో సగపాలు వైద్యశాలా సహాయులనఁబడెడి యల్పోద్యోగీయుల పాలగుచుండెను. ఈయక్రమములన్నిటిని సాధ్యమైనంతవఱకు మాన్పుటకయి పాటుపడఁ జొచ్చితిని. ఈవిషయములలో జరగిన రెండుమూఁడు కార్యములను మాత్ర మిందుదాహరించెదను.

రోగుల కెట్లు పథ్యపానములు పెట్టుచుండిరో పరీక్షించుటకయి యాసమయమునందు నేనొకదినమున ధర్మవైద్యశాలకుపోయితిని. అప్పుడు రోగులకు లెక్కలలో చూపఁబడినట్లు పాలును రొట్టెయుఁగాక గంజియు మెతుకులును పెట్టఁబడుచుండెను. నేను పరీక్షించి రోగులను ప్రశ్నించుచుండుటచూచి యొక సేవకుఁడు పరుగెత్తుకొనిపోయి వైద్యశాలా ప్రథానసహాయుఁడైన రంగయ్యనాయనిని దీసికొనివచ్చెను. అతఁడువచ్చి తనగుట్టు బయలఁబడునని తలుపులులోపలవేయించి నన్ను, లోపలకురాక వెలుపలనుండ వలసినదని నిషేధించెను. నేను వైద్యశాలను విడిచిపోయి యాతని చర్యను పురపారి శుద్ధ్యసంఘమువారికి తెలియఁ బఱచితిని. అందుచేత నతఁడు నాపైని ద్వేషముపూని యొక నాటిరాత్రి యొక పెద్దమనుష్యునియింట జరగిన సభలో


నావంక కన్ను లెఱ్ఱచేసిచూచుచు నేదో దౌర్జన్యము జరగించుట కుద్యుక్తుఁడయి యుండినట్టు కనఁబడెను. ఆసంగతిని కనిపెట్టి మమ్ము తాంబూలములకు పిలిచిన గృహస్థుని మనుష్యులాతనిని పట్టుకొని బలవంతముగా వెలుపలకు లాగుకొనిపోయిరి. అతఁడారాత్రి మద్యపానమువలని మత్తులోనుండి నట్టు నాకు కనఁబడినది. నాటిరాత్రి జరగిన వృత్తమును సహితము నేను పారిశుద్ధ్య సంఘవారికి తెలియఁజేసితిని. అందుమీఁద వారా వైద్యశాలా సహాయుని మందలించి మఱియొకచోటికి మార్పవలసినదని చెన్న పట్టణము వైద్యశాలా ముఖ్యాధికారికి వ్రాసిరి. మావైద్యశాలాధికారి (Civil Surgeon) తన క్రింది యుద్యోగస్థునికి తోడుపడి యతఁడు నన్ను లోపలికి రాకుండఁజేయుట య యుక్తముకాదని యతని వర్తనమును పోషించెను. అప్పుడు సీ. నాగోజీరావు పంతులుగారు పురపారిశుద్ధ్య సంఘమున కధ్యక్షుఁడుగా నుండెను. నేను చెన్న పట్టణమునకు వితంతువివాహ సమాజపక్షమున చందాలు పోగుచేయుటకయి పోయియుండినప్పుడు నాగోజీరావు పంతులుగారు 1885 వ సంవత్సరము మెయినెల 19 వ తేదిని నాకిట్లు వ్రాసిరి.

"19th May 1885.

Rajahmundry.

My dear Viresalingam Garu,

I am in receipt of your letter from Madras and I am glad to hear that you are all right now. I hope you will succeed in raising money in Madras for the remarriage Association here with or without the help of wigs in Madras........................................................................................

Rangiah Naidu has tendered an unqualified apology now though some were anxious that his apology should be accepted at once and that the Surgeon General should be requested not to transfer him from here, it was resolved at


my instance that the matter should be postponed till the apology was referred to you. A mahajarnama signed by about four hundred people was also presented to me requesting that Rangiah should be retained here. If you are willing to accept the apology tendered now, I shall not insist on his transfer as the man begs very hard to be saved. In reply to the Civil Surgeon's letter, the Surgeon General says you had every right to go and Rangiah Naidu had no business to interfere with you in any way." (మీరు చెన్నపట్టణమునుండి వ్రాసిన యుత్తరము నాకందినది. మీరారోగ్యము కలిగియున్నారని విని సంతోషించుచున్నాను. చెన్నపట్టణములోని గొప్పవారియొక్క సాహాయ్యముతో గాని సాహాయ్యములేక కాని యిక్కడి పునర్వివాహ సమాజముకొఱకు సొమ్ము సమకూర్చుటలో మీరు లబ్దమనోరథులగుదురని నేను కోరుచున్నాను....................

రంగయ్యనాయఁడిప్పుడు నిర్ణియమమైన క్షమార్పణమునుచేసియున్నాఁడు; అతని క్షమార్పణము వెంటనే యంగీకరింపఁ బడవలసినదనియు ఇక్కడి నుండి యతనిని మార్పకుండునట్లు సర్జను జనరల్ ప్రార్థింపఁబడవలెననియు కొంద ఱుత్కంఠులయియుండినను, నాకోరికపైని క్షమార్పణమును మీకు తెలిపెడు వఱకును ఈవిషయము నిలుపుచేయఁబడవలసినదని నిర్ధారణ చేయఁబడినది. రంగయ్య నిచ్చట నుంచవలసినదని కోరుచు సుమారు నన్నూఱుగురు వ్రాళ్లుచేసిన సంఘ విజ్ఞాపన మొకటికూడ నాకు పంపఁబడినది. ఇప్పుడు చేయఁబడిన క్షమార్పణము నంగీకరించుటకు మీరిష్ట పడినపక్షమున, అతఁడు రక్షింపవలసినదని మిక్కిలి ధీనముగా వేఁడుచున్నందున నేనతనిని మార్చు విషయమయి పట్టుపట్టను. సివిల్ సర్జనుయొక్క యుత్తరమునకు బదులుగా సర్జన్ జనరల్ వెళ్లుటకు మీకధికారము కలదనియు మిమ్మాటంక పెట్టుట కేవిధముచేతను రంగయ్యనాయనికి పనిలేదనియు చెప్పుచున్నాఁడు.)

ఈ రంగయ్యనాయఁడు రాజమహేంద్రవరములో నిల్లు కట్టుకొని కుటుంబముతో వాసముచేయుచుండెను. అతని నక్కడనుండి మార్చినయెడల


క్రొత్తగా కట్టుకొన్న యిల్లువిడిచి క్రొత్త స్థలమునకు పోవలెను. నేనాతని క్షమార్పణము నంగీకరించి యాతనిని రాజమహేంద్రవరములోనే యుంచవచ్చునని వ్రాసితినిగాని రాజధానీ వైద్యశాలాధికారి యతని నన్యస్థలమునకు పంపివేసెను.

ఒకదినమున నేను భోజనముచేసి పగలుపదిగంటలవేళ పాఠశాలకు పోవుచుండఁగా పట్నాల వీరేశలింగమను స్వర్ణకారుఁడొకఁడు నాలుగయిదడుగులు రాజవీధిలోని స్థలమాక్రమించుకొని పునాదులు (అస్థిభారము) ముందుకు జరపి గోడ లేవఁదీయుచుండెను. ప్రాతగోడయానవాళ్లింకను స్పష్టముగా కనఁబడు చుండెను. నేనదిచూచి యక్కడనిలిచి లోపలనున్న గృహపతిని పిలిపించి యిట్లక్రమముగా స్థలము నాక్రమింపఁగూడదనియు, పని, నిప్పుడు నిలుపుచేసి స్థలము నిమిత్తము పారిశుద్ధ్య విచారణ సంఘమువారికి విజ్ఞాపనపత్రిక పంపుకొని వారిచ్చినపక్షమున నిప్పుడు కట్టుచున్న రీతిగాను ఇయ్యని పక్షమున మునుపున్న రీతిగాను కట్టుకొనవలసినదనియు, చెప్పితిని. అతఁడు నామాట కొప్పుకొని పనిమానిపి పనివాండ్రనింటికి పంపివేసెను. నేను పాఠశాలలో పనిచేసి సాయంకాల మయిదుగంటలకు మరల నాదారినే యింటికి పోవుచుండు నప్పటి కాయింటిపని మరల నారంభింపఁబడినది. ఇది యేమనియడుగఁ గా నతఁడు తానుపోయి యావిభాగపారిశుద్ధ్యసంఘసభ్యుల నడుగఁగా నిది మీవిభాగములోనిదికానందున దీని నాపుటకు మీకధికారము లేదనియు తమ విభాగములోని దగుటచేత మనసువచ్చినట్టు చేయుటకు తమకే స్వాతంత్ర్యమున్నందున పెట్టుకోవచ్చునని సెలవిచ్చిరనియు చెప్పెను. నేనీవిషయమయి మఱునాఁడు సభవారికి జ్ఞాపిక పంపితిని. ఈజ్ఞాపిక సభలో విచారణకువచ్చుటకు లోపలనే యిల్లు కట్టించి పూర్వపుగుఱుతు లేవియు లేకుండఁజేసిరి. ప్రధానరథ్యలోనే యీవిధముగా నాక్రమణము జరగుటనుగూర్చి నేను సభలో మాటాడునప్పు డాస్వర్ణకారుని కాలోచనచెప్పిన యా విభాగసభ్యులు మాటాడక మౌనముధరించి తామేమియు నెఱుఁగనట్టూరకుండిరి. ఆసభ్యులిరు


వురిలో నొక్కరు మండలసభలో న్యాయవాది. ఆక్రమణము తీసి వేయించుటకు సభలో నిర్ధారణము చేయఁబడినది. ఆనిర్ధారణాను సారముగా సభవారి పక్షమున నేనుపోయి మనుష్యులచేత నాక్రమించుకొన్న పెణకను రంపముతో కోయించివేసి, వీధియరుగులను ఒక యరుగుమీఁదనున్న గదిని గడ్డపాఱలతో త్రవ్వించివేసితిని. స్థలము పోయినదానికంటెను ధననష్టికంటెను నెక్కువగా క్రొత్తగా కట్టించుకొన్న యింట గృహప్రవేశోత్సవము నడపఁబోవుచున్నప్పుడు కట్టినయింటిని పడఁగొట్టించుట యశుభసూచకమని విలపించి, యతఁడాసభ్యులనుతిట్టి మొదటనే నాహితబోధ విననందుకు పశ్చాత్తాపపడెను. ఆ సభ్యులకు తానుముందుగా నిరువదియైదు రూపాయలిచ్చితిననియు, నేనాటంకపెట్టినమీఁదట వారు మరల డెబ్బదియైదు రూపాయలు కైకొనిరనియు, అతఁడప్పుడు నాతో చెప్పుకొని దుఃఖించెను. ఆర్తుల దుఃఖ నివారణచేయు విషయమున సాధారణముగా నాది జాలిగుండియేయయినను, వారు దుర్నీతి పరులయినప్పుడు కఠినమయి దయమాలినదగును. అతని విలాపమును గృహము యొక్క దుస్థ్సితియు చూచినప్పుడు మనస్సులో నాకు నిజముగానే విచారము కలిగెను. ఇప్పుడు త్రవ్వి పడఁగొట్టుటచే నెగుడుదిగుడైన భాగమును తిన్నగా సమసూత్రముగా కట్టించుకొనుటకయి పారిశుద్ధ్య సంఘమువారికి విజ్ఞాపన పత్రమును పెట్టుకొమ్మని యతనితోఁజెప్పితిని. అతఁడు పంపుకొన్న విజ్ఞాపత్రముపైని వారాతని కోరిక నంగీకరించిరి.

ఆకాలమునందు పండామామయ్యయని రాజమహేంద్రవరములో నొక ప్రసిద్ధపురుషుఁడుండెను. అతఁడు పడుచుతనములో నెటువంటి సాహసిక కార్యములకును వెనుకతీయక యెల్ల వారల మనస్సులకును భీతి కొలుపువాఁడయి యుండెనుగాని యిప్పుడు కాలముమాఱినందునను గతవయస్కుఁడయి నందునను తొంటి దుడుకుతనమును మాని సాధువర్తనుఁడయి ముసలి పులివలె నుండెను. అతనికి నంగళ్లవాడయైన ప్రధానరథ్యయందొక యిల్లును కొట్లును నుండెను. అతఁడు తనయింటి యరుగులను పెంచికట్టెను. అదియెఱిఁగియు


కొందఱాతనికి వెఱచి యూరకుండిరి. ఆయింటి సమీపముననే వాసము చేయువారును పారిశుద్ధ్య సంఘములో సభ్యులునయిన నాళము కామరాజు గా రాయాక్రమణమును నాకుఁ జూపఁగా నే నా యాక్రమణమును తీసివేయించుటకయి జ్ఞాపిక పెట్టితిని. మాపట్టణములోని యొక గృహస్థుఁ డాయాక్రమణమును తీసివేయింపవలదని సభ్యులతో ననేకులతో చెప్పినందున వారాక్రమణమే జరగలేదని చెప్పఁదొడఁగిరి. ఈవిషయ మొక నాఁటి ప్రాతఃకాలమున జరగిన సభలో విచారణకు వచ్చెను. నే నాదినమున సభకు కొంచె మాలస్యముగాపోవుట తటస్థించెను. నాఁడధ్యక్షప్రతినిధి (Vice President) సభకు రానందున సభ్యులలో నొక్కరైన మెట్కాపుదొర (శాస్త్రపాఠశాలా ప్రధానోపాధ్యాయులు) గా రగ్రాసీనత్వమును వహించిరి. నేను సభకుపోవునప్పటికీవిషయమే విచారింపఁబడి నిర్ధారణమునకు సిద్ధముగానుండెను. నేను పోవుచునే యప్పుడు చర్చింపఁబడుచున్న విషయమేమని యడుగఁగా, పండామామయ్య యరుగువిషయమనియు సభ్యులలో నధిక సంఖ్యాకులాక్రమణము లేదనుచున్నారనియు దొరగారుచెప్పిరి. నేను లేచి 'యీసభ్యులలో నాక్రమణము లేదన్న వారెవ్వరు?' అని బిగ్గరగా నడిగితిని. సభ్యు లెవ్వరును మాటాడక మూకీభావమును వహించిరి. "ఇది యాక్రమణమయినందుకు సదేహము లేదు. నేను స్పష్టముగా నెఱుఁగుదును. మీరేమిచెప్పెదరు?" అని ఆవఱకా క్రమణము లేదన్న వారి నడిగితిని. వారిలో కొందఱాక్రమణమున్న యెడల తీసివేయింపవచ్చుననిరి; కొందఱేమియు పలుకక మౌనముద్రధరించిరి. అంతట నరుగులు తీయించివేయవలసినదన్న నిర్ధారణమును వ్రాసి చదివి, నీతి లేక యన్యాయపక్షము వహించెడు సభ్యులను గర్హించుచు మెట్కాపుగారు మాటాడిరి; ఆక్రమణమున్నట్టాయన యావఱకే నిశ్చయముగా నెఱుఁగును. వితంతు వివాహాది విషయములలో కొందఱు నాతో నేకీభవింపకపోయినను, లంచములు పుచ్చుకోక న్యాయపక్షావలంబులయిన సభ్యులందఱును నన్ను నాయకునిగా నంగీకరించిరి. ఆక్రమణము తీసివేయవలసినదని నిర్ధారణము జర


గినను, ఆయాక్రమణమును తీసివేయించుట గొప్ప కష్టముగానుండెను. ఆరోగ్యపరీక్షకుఁడు (Sanitary Inspector) మొదలైనపారిశుద్ధ్యసంఘమువారి సేవకులు తామా యాక్రమణమును తీయించివేయ లేమనియు తామా యరుగు ముట్టుకొన్న పక్షమున తల బద్దలు కొట్టెదనని మామయ్య దుడ్డుకఱ్ఱ చేతఁ బట్టుకొని యరుగుమీఁద కూరుచుండి దరిచేరనీయక పోయెననియు సభవారికి విన్నపము పంపుకొనిరి. దానిపైని సభవారా యాక్రమణమును తన సేవకుల సాహాయ్యమున తీసి వేయించుటకు నన్ను నియమించిరి. నేను కొందఱి సేవకులతో గడ్డపాఱలు పాఱలు పట్టించుకొనిపోయి నేనెదుట నిలుచుండి యరుగు త్రవ్వించుట కారంభించితిని. మామయ్య లోపలినుండి వెలుపలికివచ్చి నన్ను చూచి "యధికారులే యిట్లు నిలుచుండి యిల్లు త్రవ్వించుచుండఁగా బక్కవాండ్రము మే మేమిచేయఁగలము?" అని పలికి మరల లోపలికిపోయెను. నేనరుగు త్రవ్వించివేసి యింటికి పోయితిని.

ఈప్రథానరధ్యలోనే పడఁగొట్టఁబడిన యగసాలియింటి కెదుటివైపున కొంచెము దూరములో నొక స్థలమునుగొని దానిలో నిల్లుకట్టించుకొనుటకయి దానికిముందు రథ్యప్రక్కనున్న యేడడుగుల స్థలము తనకిమ్మని గుడిసేవ వెంకటరత్నముగారు పారిశుద్ధ్య సంఘమువారికి విన్నపము పంపిరి. ఆయన ధనవంతుఁడును చెల్లుబడి గలవాఁడును నగుటచేత నాయన విన్నపము విచారణకువచ్చినప్పుడు సభ్యులలో ననేకు లాస్థలము నియ్యఁదలఁచి యెంత స్థలమియ్యవచ్చునో తెలుపుటకు నన్నును మఱి యిద్దఱు సభ్యులను ఉపసంఘముగా నేర్పఱిచిరి. నేనా సభనుండియే వారి నిరువురను వెంటఁగొని యాస్థలమునకువచ్చి చూచి, స్థలము వంకరగానున్నందున వంకర తీరునట్లు దాని కొననుండి సమరేఖగీచినచో రెండవకొన నేర్పడెడి యడుగువరస్థలమును మాత్రమే యియ్య వచ్చుననియు, రథ్యల ప్రక్కల విశాలముగా స్థలముండుట యావశ్యకమనియు, ఈనడుమనే కొంచెముతావు కలుపుకొనెనన్న హేతువుచేత బీదవాఁడైన


కంసాలియిల్లు కోయించి యరుగులుత్రవ్వించిన మనము ధనికుఁడయిన యీయన కే న్యాయమునుబట్టి యిప్పు డధికస్థలము కలుపుకొన ననుజ్ఞ యియ్య వచ్చుననియు, చెప్పఁగా నాతోడిసభ్యులు నాతో నేకీభవించి నేను వ్రాసిన నివేదనపత్రముమీఁద వ్రాళ్లుచేసిరి. అప్పుడు చెంతనున్న వెంకటరత్నమునాయఁడు గారు తాను ముందున్న స్థలము కలుపుకొని రథ్యప్రక్కను మేడ కట్టుటకయి యేర్పాటుచేసికొని తదనుసారముగా నిల్లుకట్ట నారంభించితిననియు, ఆస్థల మియ్యకపోయినయెడల వేయఁబడిన పథకమంతయు చెడిపోయి విశేష నష్టము కలుగుననియు, ఏలాగుననైన ననుగ్రహించి యాస్థలమిప్పింప వలసినదనియు ప్రార్థించిరి. ఆయన వేఁడికోలునకు మొగమోటపడి నాతోడివా రిరువురును కొంచెము మెత్త పడిరిగాని నేనుమాత్రము దృఢముగానుండి స్థలమియ్య వలను పడదనియు, మీస్థలములోనే మేడకట్టుకొనుట కేర్పాటుచేసికోక పైస్థలము నపేక్షించినందువలనఁ గలిగెడు నష్టమును మీరుభరింపవలసిన దేయనియు, మొగమోటపడక చెప్పివేసితిని. అందుమీఁద నాయఁడుగారు పారిశుద్ధ్య సభాధ్యక్షులయిన నాగోజీరావు పంతులుగారి యొద్దకుపోయి జరగిన సంగతి విన్నవించిరి. ఆయన సభనుండి యింటికిపోవుచుండఁగా మార్గమధ్యమున నెక్కిన బండి యొక్క చక్రము విఱిగిపోయినందున, ఇంటికాయన నాయఁడుగారి బండిలోనేయెక్కి పోవలసినవారైరి. నాయఁడుగారి విన్నపమును విన్న మీఁదట దాక్షిణ్యపడి నాగోజీరావు పంతులుగారు నాటి సభవారి యుద్దేశ మాస్థలము నాయఁడుగారి కియ్యవలయుటయేయనియు మీ నివేదనపత్రము సభవారిముందు పెట్టఁబడినప్పుడు వారిచ్చుటకంటె ముందుగా మీరే మాట దక్కించుకొనుట బాగుండుననియు, నాకుత్తరము వ్రాసిరి. సభవారెంత స్థలమియ్యవలెనో నిర్ణయించుటకు మాకధికారమిచ్చిరనియు, ఆనిర్ణయవిషయమున మాతీర్పే సునిశ్చితమైనదిగా నుండవలెననియు, మాతీర్పు సభవారెట్లు మార్చెదరో చూచెదమనియు, నేను ప్రత్యుత్తరమిచ్చితిని. దానిపైని నాగోజీరావు పంతులుగారిఁక పెనఁగులాడిన ప్రయోజనము లేదని నాయఁడుగారితో


చెప్పివేయఁగా, ఆయన వెనుకకు జరపి మేడను తమస్థలములోనే కట్టుకొనిరి. సభవారి యనుమతినిపొంది నాయఁడుగారిప్పు డాస్థలములో మేడముందు పందిరి వేసికొనియున్నారు. న్యాయవిషయమున మొగమోటపడక మిత్రుని మాటనైనను నేను నిరాకరించుచుండెడివాఁడను.

నాగోజీరావు పంతులుగారు పాఠశాలల పరీక్షకులయి రాజమహేంద్రవరము విడిచి నప్పుడప్పటి యుపకరగ్రాహి (Sub-Collector) యయిన హామ్నెట్టు దొరగారు పారిశుద్ధ్య సంఘాధ్యక్షత్వమునకై ప్రయత్నించిరి. మాశాస్త్ర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులైన మెట్కాపు దొరగారును ద్వితీయోపాధ్యాయులైన సుందరరావుగారును, నేనును ముగ్గురము పారిశుద్ధ్య, విచారణ సంఘములో సభ్యులముగా నుండెడివారము. కొంచెము కాలముక్రిందట నిన్నీసుపేట పాఠశాలలోనిచ్చిన యొక యుపన్యాసమునందు సుందరరావుగారు యూరపియనులను మిక్కిలి నిరసించుచు మాటాడిరి. అందుచేత నాతఁడు యూరపియనులను లక్ష్యముచేయని స్వతంత్ర బుద్ధిగలవాఁడని నేను భావించియుంటిని. ఒకనాఁడు మెట్కాపు దొరగారు పారిశుద్ధ్య విచారణ సంఘాధ్యక్షత్వమునకు హామ్నెట్టుగారి పేరు నిర్దేశించుచు నొక కాగితమువ్రాసి దాని కనుమోదించి క్రింద వ్రాలుచేయుటకయి నాయొద్దకు తీసికొనివచ్చిరి దొరతనమువారు స్థానిక స్వప్రభుత్వము నిచ్చుటవలని ప్రయోజనము సభ్యులు స్వతంత్రముగా పనిచేయుటకొఱకనియు, దండనాధికారము గలవా రధ్యక్షులయినప్పుడు సభ్యులు స్వతంత్రులయి నిర్భయముగా వర్తించుట పొసఁగదనియు, అందుచేత సభ్యులు దండనాధికారము లేనివారినె యధ్యక్షునిగా కోరుకొనుట నాయభిమతమనియు, కాఁబట్టి నేనిందులో వ్రాలుచేయక పోవుటయేకాక నియామక దినమునందు నేను వ్యతిరేకముగా మాటాడెదననియు, చెప్పితిని. నేనన్నమాట తిరుగువాఁడను కానని యెఱిఁగినవారయి నన్ను విడిచి దొరగారు కాగితమును సుందరరావుగారి యొద్దకు తీసికొనిపోఁగా, ఆయన తన స్వాతంత్ర్యమును విడనాడి మాఱుమాటాడక వెంటనే దానిమీఁద వ్రాలుచేసెను. అధ్యక్షుని నియమించుకొను దినమువచ్చి


నప్పుడు సభలో దండవిధాయకుఁడైన హామ్నెట్టు దొరగారిని కోరుకొనక యధ్యక్షత్వమునకు వేఱొకనిని కోరుకొనవలసినదని నేను చెప్పితినిగాని సభ్యు లుపకరగ్రాహిగారి యభీష్టమునకు వ్యతిరేకముగా నడచునంతటి ధైర్యశాలులు కానందున వారినే యధ్యక్షునిగాఁ గోరుకొనిరి. కరగ్రాహక కార్యములలోను దండనీతి ప్రయోగకార్యములలోను విశేషకాలము గడపవలసినందునను తఱుచుగా రాజకార్య విషయమున గ్రామాంతర సంచారము చేయవలసినందునను పుర పారిశుద్ధ్య విచారణ సంఘకార్యములలో తగినంత శ్రద్ధచేయుట కవకాశములేనివారయి హామ్నెట్టుదొరగారు పారిశుద్ధ్యసంఘ వ్యవహారములను చక్కఁబెట్టుటకయి తమ పక్షమున నొక్క ప్రతినిధి నేర్పఱుపఁగోరి సభ్యులలో నట్టిపనికెవ్వరు సమర్థులని మెట్కాపు దొరగారి నాలోచనయడిగిరి. వారు సుందరరావుగారిని పేర్కొనక నాపేరు చెప్పిరి. అందుమీఁద హామ్నెట్టు దొరగారు నన్నడుగఁగా నుద్యోగనియామకములు మొదలుగాఁగల సమస్తవిషయములలోను నాకు సర్వస్వాతంత్ర్యముల నిచ్చినఁగాని నేనాపని నంగీకరింపనంటిని. ఆయనయందున కొప్పుకొని సభ్యులయనుమతితో తమయధికారముల నన్నిటిని నాకు సంక్రమింపఁజేసెను. నేను యథాశక్తిని పనిచేసి ముఖ్యవిషయములలో నెల్లదొరగారితో నాలోచించి యాయన యంగీకారమును బడయుచు లంచములు మాన్పుటకును కార్యస్థాన వ్యవహారము లవిలంబముగాను యథాక్రమముగాను జరుపుటకును పన్నులవిషయమున మార్పులుచేసి యాయమును వృద్ధిపఱుచుటకును పాటుపడితిని. అంతకు పూర్వమిండ్ల పన్ను లెక్కువగానుండవలసినవారికి తక్కువగాను తక్కువగా నుండవలసిన వారి కెక్కువగాను కట్టఁబడి యుండెను. నేను ప్రతిగృహమును తిరిగిచూచి తక్కువ పన్నులున్న కొందఱు ధనికులయిండ్లకు హెచ్చుచేసి యెక్కువపన్ను లున్న కొందఱు బీదలయిండ్లకు తగ్గించి యంగడివీధినున్న కొట్లపైని న్యాయమైన పన్నులు విధించి మొత్తముమీఁద పారిశుద్ధ్య సంఘమునకుధనాగమ మెంతో హెచ్చునట్లు చేసితిని. సరిగా నెలకు పదేసిరూపాయలును అంతకంటె నెక్కువ


గాను అద్దెలు వచ్చుచుండిన కొట్ల కావఱకు నెల కెనిమిదణాలద్దె రాఁదగినట్టు నిర్ణయించి కట్టిన పన్నులను పెంపుచేయుటచేత ముఖ్యముగా నీధనాగమము హెచ్చినది. ఈపన్నుల విషయమున మార్పుచేసినతరువాత వితంతు వివాహవిషయమున నాకు ప్రతిపక్షులుగా నుండిన వైదికులు తమకు పన్నులు హెచ్చు చేయఁబడునని భయపడితిమనియు నట్లు జరగక కొన్ని విషయములలో తగ్గింపఁబడి న్యాయము జరగెననియు తమతోచెప్పి నన్ను శ్లాఘించిరని చల్ల పల్లి రంగయ్యపంతులుగారు నాతోఁజెప్పిరి. హామ్నెట్టు దొరగారిచ్చట నుండి మార్పఁబడి వెళ్లనున్న సమయమునందు 1886 సంవత్సరము 17 వ సెప్టెంబరున నాకిట్లు వ్రాసిరి. -

"I must tender you my sincere thanks for the assistance you have given me and the untiring energy you have displayed in connection with the Municipality during the last few months, I am convinced that you are the best man to fill the post of Chairman, but you see a system of fre election by ballot does not always result in the best men being returned." (కడచిన కొన్ని మాసములలోను పారిశుద్ధ్య విచారణసంఘ సంబంధమున మీరు నాకుచేసిన సాహాయ్యమునకును మీరు కనఁబఱచిన విరామములేని శక్తికిని నా హృదయపూర్వకములైన వందనములను మీకు సమర్పింపవలసియున్నది. అధ్యక్షపదమును పొందుటకు మీరు ప్రశస్తములని నేను జాతనిశ్చయుఁడనయి యున్నాను కాని గుళికాపాతముచేత స్వతంత్రవరణము చేయుపద్ధతి యెల్లప్పుడు నుత్తమపురుషులే నియోగింపఁబడుటలో పర్యవసింప దని మీరు కనుఁగొనుచున్నారు.)

ఈప్రకారముగా దొరగారి శ్లాఘనను పడసినంతమాత్రముచేత నెల్ల విషయములయందును నేనాయన యిష్టానుసారముగా వర్తించు చుండినట్లు మీరు తలఁపగూడదు. కొన్ని సమయములయందాయన చెప్పినదానికి ప్రత్యక్షవిరుద్ధముగాచేసి, మీరు చెప్పినది తప్పని నిర్భయముగా మొగముమీఁదనే


యనెడివాఁడను. నావర్తనమువలన ముందురాఁగల ఫలమును లేశమును విచారింపక స్వదేశీయుఁడైనను విదేశీయుఁడైనను హిందువైనను యూరపియనైనను లక్ష్యముచేయక నేను మంచిదనుకొన్న దానిని మొగము ముందఱ ననివేయునట్టియు నిర్భయముగా చేయునట్టియు తొందర స్వభావము నాకుఁగల లోపములలో నొకటి. ఈవేగిరపాటువలన మనవారిలో కొందఱు నాకప్పుడప్పుడు ద్వేషులగుటయు సంభవించుచువచ్చెను. అధ్యక్షులను కోరుకొను స్వాతంత్ర్య మియ్యఁబడుటకు పూర్వము పురపారిశుద్ధ్య విచారణ సంఘములకు మండల కరగ్రాహు లధ్యక్షులుగాను, ఉపకర గ్రాహులు మొదలైనవారధ్యక్ష ప్రతినిధులు గాను, ఉండుచువచ్చిరి. రాజమహేంద్రపుర పరిపాలక సంఘమున కుపకరగ్రాహి యధ్యక్ష ప్రతినిధిగానుండిన కాలములో జరగిన యొక సభలో విచారణీయములైన ముఖ్యాంశము లనేకములుండెను. కొన్ని యంశములు చర్చింపఁబడి నిర్ధారణములు చేయఁబడినతరువాత నప్పటికే కాలాతీతమయి నందున దొరగారు నిర్ధారణములపుస్తకములో వ్రాలుచేసి సభనువిడిచి వెడలిపోయిరి. అప్పుడు మిగిలియున్న కొన్ని యంశములను గూడ నీసభలోనే చర్చించి నిర్ధారణములుచేసి మఱి యిండ్లకు పోదమని నేను సభ్యులతోఁజెప్పితిని. కార్యస్థాన కార్య నిర్వాహకుఁడన్ని నిర్ధారణములను దొరగారు చేసియే పోయిరనిచెప్పెను. మాయభిప్రాయములను గైకొనక తమ మనసువచ్చినట్లు నిర్ధారణములు వ్రాసిపోవుటకు దొరగారికేమియధికారము కలదని నేను పలికితిని. సభ్యులందఱును నేనన్నది న్యాయమని తలఁచినను దొరగారు చేసిన దానిని మార్చుట కెవ్వరికిని చొరవలేకుండెను. సభవారి యనుమతితో నేను సాహసించి యగ్రాసనా సీనత్వమువహించి, దొరగారు కోపపడుదురని కార్యనిర్వాకుఁడు మొఱ్ఱపెట్టుచున్నను వినక మార్పవలసిన నిర్ధారణములనుమార్చి వానిక్రింద నావ్రాలుచేసితిని. సభ ముగియఁగానే కార్యనిర్వాహకుఁడు నిర్ధారణముల పుస్తకమును తీసికొనిపోయి నేనుచేసిన దుండగమును దొరగారికి విన్నవించి పుస్తకమును జూపెను. దొరగా రామార్పులనుజూచి మంచిదనిపలికి


పుస్తకమును మరల నిచ్చివేసెను. ఆయన కాలవిలంబమున కోర్వకయావఱకున్న యాచారమునుబట్టి తమకు తోఁచిన నిర్ధారణములను వ్రాసిపోయిరే కాని యట్లు చేయుటలో వారికి లాభమేదియులేదు. సభ్యులలో ననేకులు దొరగారి యభిప్రాయ మేదో మాయభిప్రాయమదేయని తలయూఁచువారే కాని తమ స్వతంత్రతను చూపువారు కాకుండిరి. సభ్యులే యాలోచించి తమ స్వతంత్రాభిప్రాయము నిచ్చు వారయిరేని, అధికారులు వారిసాయమును సంతోష పూర్వకముగా పొందుచుండెడివారే. స్వతంత్రించి నిర్భయముగా నధికారుల యభిప్రాయమునకు వ్యతిరేకముగా తమ యభిప్రాయమును తెలుపలేని లోపము మనవారియందే విశేషముగానున్నది. దీనికి నిదర్శనముగా నొక్క సంగతిని చూపెదను.

నాదేహ మస్వస్థముగా నున్నందున రాజమహేంద్రవరములోనే జరగిన యొక తాలూకా సంఘ (Taluq Board) సభకు నేను పోలేక పోయితిని. సభ ముగిసినతరువాత కొందఱు సభ్యులు నన్ను చూడవచ్చిరి. ఏమేమి విశేషములు జరగినవని నేనడిగినమీఁదట వారిలోని విద్యాధికులే యొకరు దొరగారు మమ్మడిగి మాయభిప్రాయములను గైకొన్నారా యేమేమి నిర్ధారణములుచేసిరో మాకు తెలియనిచ్చి రా యని నాకుత్తరమిచ్చెను. అట్లు జరగనిచ్చుట మీదేతప్పిదమనిపలికి నేనూరకుంటిని. ఆపయినెలలో జరగిన సభలో వారు మొఱ్ఱపెట్టిన మోబర్లీ దొరగారె యగ్రాసనాసీనులయియుండిరి. ఒక విషయమున దొరగారికిని నాకును నభిప్రాయభేదము కలిగి కొంత వివాదము నడచెను. దొరగారు తమ యభిప్రాయమును సభ్యులకు తెలుఁగులో వివరించి తెలుపవలసినదని సభలోనున్న తహశ్శీలుదార్లతో చెప్పిరి. వారట్లుచేసిన పిమ్మట దొరగారి యభిప్రాయముపైఁ గల యాక్షేపణలను తెలుఁగులో నేను సభ్యులకు తెలిపితిని. దొరగారు నేను చెప్పినదాని కుత్తరముచెప్పిరి; దానికి నేను ప్రత్యుత్తరముచెప్పితిని. ఈప్రకారముగా కొన్ని నిమిషములు నడచిన తరువాత దొరగారు తమపట్టునువిడిచి నాయభిప్రాయ ప్రకారముగానే నిర్ధార


ణముచేసిరి. అటుతరువాత సభ్యులయొక్కయు ముఖ్యముగా నాయొక్కయు నభిప్రాయమును గైకొనకుండ నొక్క నిర్ధారణమునైనను దొరగారుచేయలేదు. ఒక్క పురపారిశుద్ధ్యవిచారణసంఘ వ్యవహారములలోనే కాక తాలూకా సంఘ (Taluq Board) వ్యవహారములలోను మండల సంఘ (District Board) వ్యవహారములలోను కూడ తగినంత శ్రద్ధచేయుచునే యుండెడివాఁడను. సభాధ్యక్షుఁడుగాని యధ్యక్షప్రతినిధిగాని రానప్పుడు నేనగ్రాసనాసీనత్వము వహించుటయుఁగలదు. 1888 వ సంవత్సరము మెయి నెల 29 వ తేదిని జరగిన గోదావరీ మండల సంఘ (District Board, Godavari) సభలో 15 గురు సభ్యులుండి వారిలో నిరువురు తహశ్శిలుదారు లుండినను ఆగ్రాసనాధి పత్యమునకు నన్ను నియమించిరి.

ఈసమయమునందు నేను రెండు పాఠశాలలకు కార్యనిర్వాహక సంఘ సభ్యుఁడనుగాను నుండుటయేకాక యిన్నీసుపేట బాలికా పాఠశాలకు కార్య నిర్వహకుఁడనుగా నుంటిని. బాలకుల పాఠశాలలోవలె బాలికలపాఠశాలలో బాలికలు జీతము లియ్యక పోవుటచేత దానిని భరించుట యెక్కువ కష్టముగా నుండెను. ఈపాఠశాలను నేను చందాలమూలమునను పురపారిశుద్ధ్యసంఘము వారును దొరతనమువారును వేఱు వేఱు గానిచ్చు సహాయద్రవ్యము వలనను భరించుచుంటిని. ఇట్లుండఁగా 1885 వ సంవత్సరము మార్చినెల 3 వ తేదిని రాజమహేంద్రవర పురపరి పాలకాధ్యక్షుని యొద్దనుండి నాకీ క్రిందియుత్తరము వచ్చినది. -

"In their order No. 292 dated 19th February 1885 reviewing the budget of the Rajahmundry municipality for the year 1885-86, the Govt, have disallowed the payment of salary grant to your school for next year from the municipal funds and said that salary grant to Girls' schools will, under G. O. No 206 dated 31 st January 1885, be paid in future from Provincial funds. I have therefore the honor to inform you


that no salary grants will be paid to your School from the commencement of the next offcial year out of the Municipal funds.' (1885-86, సంవత్సరమునకు రాజమహేంద్రపుర పరిపాలక సంఘముయొక్క యాయవ్యయ గణనపట్టికను విమర్శించుచు 1885 వ సం|| 12 వ ఫిబ్రవరి 292 వ సంఖ్యగల తమ యుత్తరవులో దొరతనమువారు మీపాఠశాలకు నగర పారిశుద్ధ్య విచారణసంఘమువారి ధనములోనుండి జీతముల సహాయద్రవ్యమునిచ్చుటను నిషేధించి, బాలికాపాఠశాలలకు జీతముల సహాయధనము 1885 వ సం|| జనవరు 31 వ తేది 206 సంఖ్యగల దొరతనమువారి యుత్తరువునుబట్టి యిఁకముందు రాష్ట్రీయ ధనములోనుండి యియ్యఁబడునని చెప్పియున్నారు. కాఁబట్టి పయి వ్యావహారిక సంవత్సరారంభ మునుండి పురపాలకసంఘ ధనములలోనుండి మీపాఠశాలకు జీతముల సహాయద్రవ్యమియ్యఁబడదని నేను మీకు తెలియఁజేయుచున్నాను.)

ఈయుత్తరము వచ్చిన శీఘ్రకాలములోనే చెన్నపురి రాజధానీ విద్యావిచారణకర్తగారు రాజమహేంద్రవరమునకు వచ్చుట తటస్థింపఁగా, నేనాయనను కలసికొని మాపాఠశాలవిషయమై మాటాడి యాయనచేత బలముగా మాబాలికాపాఠశాల కనుకూలముగా వ్రాయించిన మీఁదట దొరతనమువారు విశేషవిషయముగా మాపురపరిపాలక సంఘ ధనములోనుండి యధాపూర్వముగా సహాయధన మిచ్చునట్లుత్తరువుచేసిరి. నాకు మొదటినుండియు స్త్రీవిద్యయందధికాభిమానము. స్త్రీలస్థితి బాగుపడినఁగాని దేశము బాగుపడదని నానమ్మకము. ఇట్లు బాలికాపాఠశాల స్థిరపడిన పిమ్మట వారవారమును ప్రకటింపఁబడు వివేకవర్ధని తోడిపాటుగా సతీహితబోధినియను స్త్రీల కుపయోగించు మాసపత్రిక నొకదానిని మూడుసంవత్సరములు నడపి స్త్రీల నిమిత్తమయి సత్యవతీ చరిత్రము, చంద్రమతీ చరిత్రము, సత్యసంజీవని, పత్నీహిత సూచని, దేహారోగ్య ధర్మబోధిని మొదలగు పుస్తకములను రచించితిని. ఈసమయమునందు మాయూరి ప్రార్థన సమాజమునందు వారవారమును


జరిగెడు సభలలో నేను తఱుచుగా ధర్మోపన్యాసములు చేయుచుండెడివాఁడను. 1881-90 సంవత్సరములకు నడుమను పయినిజెప్పిన పుస్తకములనుగాక చమత్కార రత్నావళి, రాగమంజరి నాటకముల నింగ్లీషునుండియు రత్నావళీ మాళవికాగ్ని మిత్రనాటకములను సంస్కృతమునుండియు తెలిఁగించి, ప్రహ్లాదనాటకము దక్షిణగోగ్రహణము, సత్య హరిశ్చంద్రనాటకము అను రూపకములను, కొన్ని నాటక కథలను, ప్రహసనములను, ఆంధ్రకవుల చరిత్రమును రచించితిని. ఇవిగాక వితంతువివాహవిషయమునను, ఇతర విషయమునను, పెక్కుపన్యాసములు వ్రాసి ప్రచురించితిని; పూర్వకవిప్రణీత గ్రంథములను కొన్నిటిని సంస్కరించి ప్రకటించితిని.

ఆకాలమునందు మాపట్టణములో బాలురవిద్య యత్యధమస్థితియందుండెను. సునిర్మితములయిన సభలయొక్క పాలనముక్రిందనుండి చక్కగా నడపఁబడుచుండిన రెండు పాఠశాలలకును పోటీగా ధనార్జనాభిలాషచేతను కీర్తికామిత్వముచేతను కొందఱు బుద్ధిమంతులు నీతిమతధర్మబోధన మొనర్చెదమనియు సద్విద్య గఱ పెదమనియు సులభ జ్ఞానదానముచే బీదల కుపకారముచేసెద మనియు పలుమిషలుపెట్టి యాస్తికపాఠశాలయనియు మహారాష్ట్రపాఠశాల యనియు స్వదేశాభిమానిపాఠశాల యనియు పెద్ద పెద్ద పేరులు పెట్టి క్రొత్త క్రొత్త పాఠశాలలను పెట్ట మొదలు పెట్టిరి. ఇట్టి పాఠశాలలకెల్ల మొట్టమొదట దారి చూపినది నేతిబీరకాయవలె సార్థకనామము వహించిన యాస్తికపాఠశాల. ఈనూతన పాఠశాలలపోషణమునకయి నిధిలేదు, చందాలులేవు, దాన ధనములేదు. ఉపాధ్యాయులజీతములకు విద్యార్థు లిచ్చెడు నెలజీతములే యాధారము. ఇతర సుస్థిరపాఠశాలలనుండి విద్యార్థులను సాధ్యమైనంత యెక్కువమందిని తమపాఠశాలకా కర్షించుటకయి పన్నిన యుపాయములు విద్యార్థుల వలన తక్కువజీతములను గ్రహించుట, తోడి బాలుర నెక్కువమందిని తెచ్చిన వారివలన జీతములు గైకొనకుండుట, బాలురను తగనితరగతులలోచేర్చుకొనుట మొదలైనవి. బాలురవలన గ్రహించెడివి క్రమముగాఁ గైకొనవలసిన వానిలో నర్థాంశమును చతుర్థాంశమును అష్టమాంశమును షోడాశాంశమును మాత్రమేయుం


డినను ప్రకటితములగు లెక్కలలో నిండు మొత్తములను, గుప్తములగు లెక్కలలో నిజమైన మొత్తములను, వేసికొని, వచ్చినసొమ్ములో కార్యనిర్వాహకుని భాగముపోఁగా మిగిలిన దాని నుపాధ్యాయులు వంతులవరుసను బంచుకొనుచుండిరి; ఉపాధ్యాయులకు ముట్టెడు మాస వేతనము లెనిమిదులును పదులును పదునైదులును మాత్రమే యయినను, ఇరువదులును ముప్పదులును నలువదులును ఏఁబదులునునైనట్టు లెక్కలలోచూపఁబడి వారివలన నాపెద్ద మొత్తములకాదానికలు గైకొనఁబడుచుండెను; ఈపెద్ద పెద్దజీతముల నిచ్చుటకయి కార్యనిర్వాహకులు తమచేతి సొమ్మును వ్యయపెట్టుచున్నట్టు చూపి దొరతనమువారివలన సహాయ ద్రవ్యముగా విశేషవిత్తము గైకొనఁబడుచుండెను. ఇట్టి యనుచిత కార్యములచేత నుపాధ్యాయులే నీతిమాలిన వారయినప్పుడు వారి శిష్యులైన విద్యార్థు లేమి నీతిమంతులగుదురు? ఇట్టికుతంత్ర ప్రయోగమువలన నీతనిమాత్రమే కాక విద్యను సహితము విద్యార్థులు కోలుపోవుచుండిరి. ఇవియన్నియు సర్వజన విదితములైన బహిరంగ రహస్యములేయైనను వానిని స్థాపించుటమాత్రము దుర్ఘటము. ఈవిధమున విద్యకును నీతికిని నీళ్లు విడుచుచున్న విద్యార్థుల కంటె-వారి సంరక్షకులలో నధిక సంఖ్యాకు లెక్కువవికేలు కాకుండిరి. వారు తమ బాలురను క్రమ శిక్షగల పాఠశాలలకుఁ బంపక యెక్కడతక్కువ జీతములు చేకొనఁబడునో యెక్కడ బాలురెక్కువ తరగతులలో చేర్చుకొనఁబడుదురో యక్కడికే తమ సంరక్ష్యులను బంపుచుండిరి. అందుచేత నప్పుడు మాపట్టణములోని విద్యయొక్కయు విద్యార్థులయొక్కయు స్థితి దుస్థితికి వచ్చి శోచనీయమైనదిగానుండెను. కాఁబట్టి విద్యాభివృద్ధిని గోరువారికిని దేశాభిమానముగలవారికిని బాలుర నీతిపరులఁగావింప కాంక్షించువారికిని విద్య మానదుస్థితిని తొలఁగించి సుస్థితిని నెలకొల్పఁబూనుట యనివార్య ధర్మమయియుండెను. అప్పటి విద్యావిషయకవిధు, లిప్పటివలె కఠినములుగాక యవ్యవస్థితములై యుండినందున విగత ధార్మిక విద్యాలయములను లయము నొందించుట ఋజుమార్గవర్తనులకు శక్యముకాకుండెను. అందుచేత పాఠశాలా కార్యనిర్వాహక సంఘమున కధ్యక్షులయిన మెట్కాపు దొరగారును సంఘ


సభ్యులయిన యస్మదాదులును ఏవిధముచేతనైనను పాఠశాలలనన్నిటి నొక్కటిగాఁజేర్చి యొక్క కార్యనిర్వాహక సంఘముయొక్క యధికారము క్రిందికిఁ దెచ్చి విద్యను బాగుచేయవలెనని నిశ్చయించుకొని, ప్రతిపక్ష పాఠశాలలవారు కోరిన నియమములనే యంగీకరించి, వారు చెప్పిన జీతములమీఁద వారి పాఠశాలలలోని యుపాధ్యాయులఁ దీసికొనుట కొప్పుకొని, వారిపాఠశాలాధికారియైన యేలూరి లక్ష్మీనరసింహముగారినే ప్రధానోపాధ్యాయ పదమునందు నిలిపి, పాఠశాలలు నన్నిటి నొక్కటిగాఁ గలిపి యొక్క సభవారి కార్యనిర్వాహకత్వమునకు లోఁబఱుపఁ గలిగితిమి.

ఇట్లు కలుపఁబడిన యీనూతనోన్నత పాఠశాలనిమిత్తము మందిరము కట్టుటకై పట్టణమధ్యమునందొక విశాల స్థలమును బేరమాడి క్రయనిర్ణయము చేసికొనుటకు సంసిద్ధులమయి యుంటిమి. ఇటువంటి మంచిస్థలము సులభ క్రయమునకు పోవుచున్నదని తెలిసికొని, దానిని తాను సంపాదింపవలెనని నిశ్చయించుకొని, మాసీమకు తహశ్శీలుదారుఁడుగానున్న బుద్ధిమంతుఁడు తత్క్షణమే యాక్షేత్ర స్వామిని తనయొద్దకు పిలిపించుకొని, ఆభూమిని తనవారి పేర వ్రాయించుకొనెను. ఆయన శక్తి సామర్థ్యాదుల నెఱిఁగిన మావారందఱును చేతఁజిక్కినస్థలము పోయినదని విచారించుచు నిరాశులయి, యటువంటి ప్రబుద్ధుని హస్తగతమైన భూమియొక్క పునరావాప్తి యసాధ్యమని భావించి, ఉత్తర కర్తవ్యమును నాకు విడిచిపెట్టి యూరకుండిరి. పోయిన భూమిని మరల రాఁబట్టుటకయి యుపాయము నాలోచించి నే నుపకరగ్రాహిగారి యొద్దకుపోయి మాటాడి యాయనచేత నొత్తుడుకలిగించి పులినోటఁ బడ్డ గోవును విడిపించితెచ్చిన ట్లా నేలను మరల పాఠశాలా కార్యనిర్వాహక సంఘమువారి యధీనమగునట్లు చేసితిని. ఇప్పుడు బోధనకళాశాలా భవనము కట్టఁబడి యున్న స్థలమిదియే.

దుర్బలశరీరుఁడనయ్యు వ్యాధిబాధితుఁడ నయ్యు నప్పుడిన్ని విధముల పాటుపడఁగలిగిన నేనిప్పుడు తొంటి జవసత్వములను గోలుపోయి కోరిక


లెప్పటివలెనే యున్నను కార్యములకు సమర్థముగాకయున్న నాప్రస్తుతావస్థను దలఁచుకోఁగా, పూర్వపు వీరేశలింగముగాక తచ్ఛాయావిగ్రహము మాత్రమే నిలిచియున్న దేమో యన్నట్టు తోఁచుచున్నది. తొల్లిటి క్రియాశక్తిలో కొంతయయినను నాకీశ్వరుఁడు మరల ప్రసాదించునుగాక!

ఇన్ని విషయములలో నే నత్యంతోత్సాహముతో పని చేయుచుండిన కాలములో నాయుత్సాహమునకు భంగకరమైన వైపరీత్య మొకటి తటస్థించెను. మిత్రభావముతోనే కాక గురుభావముతో నేను చెప్పినదాని నెల్ల శిరసావహించి చేయుచు, నాకు కుడిభుజమయి యుండి నేను పూనిన సమస్త సత్కార్యములలోను తోడుపడుచు, స్వభావ దుర్బలుఁడనైన నన్ను శ్రమపడకుండ సదాకంటిని ఱెప్పవలెఁగాచుచు, వాగ్దానములుచేసినవారును ప్రతిజ్ఞలు పలికినవారును అందఱును విడిచినను తానుమాత్రము నన్ను విడువకుండిన బసవరాజు గవర్రాజు గా రాకస్మికముగా 1888 వ సంవత్సరము జూలయి నెల 16 వ తేదిని లోకాంతర గతులయిరి. అటువంటి సుగుణనిధియైన మిత్రరత్నము యొక్క మరణముతో నాకావఱకున్న కార్యోత్సాహము సగము తగ్గిపోయినది. సదారోగ పీడితుఁడనగుచుండిన నేను చిరకాలము జీవింపననియు, నేను పూనిన మహాకార్యమును నాయనంతరమునం దాయన ధైర్యోత్సాహములతో నిర్వహించుననియు, నేను దృఢముగా నమ్మియుంటిని. అట్టి నాయాశ యకాలవినాశము నొందఁగా నేను విరక్తుఁడనయి, పురపరిపాలక సంఘములోను స్థానికనిధి సంఘములలోను నాసభ్యత్వములకు పరిత్యాగ పత్రికలను బంపి తదధ్యక్షులు నన్ను విడువ నొల్లకున్నను వలదని యాపనులనెల్ల నొక్క మాఱుగా మానుకొంటిని. గవర్రాజుగారు తనమరణమునకు నాలుగయిదు మాసములకు ముందొకనాఁడు నాయొద్దకువచ్చి నాజీవచరిత్రమును వ్రాయుటకయి సాధనముల నిమ్మని నన్నడిగెను; నేనాయనను నిరుత్సాహపఱిచి యిప్పుడా ప్రయత్నమును మాని నామరణానంతరమున నేమయిన వ్రాయఁదగియుండినచో వ్రాయవచ్చుననిచెప్పితిని. ఈసంభాషణము జరగిన కొన్ని మాసములలోనే


నాజీవచరిత్రమును వ్రాయనెంచిన మిత్రుని జీవచరిత్రమును నేనే యాయన స్మృతిని శాశ్వతపఱుచుటకయి చేయఁబడిన పురమహాజనుల సభలోవ్రాసి చదువవలసినవాఁడనైతిని. నేను వ్రాసిన సంక్షేప చరిత్రమువలన నీమహాపురుషుని గుణసంపదకొంతవఱకు తేటపడవచ్చును. ఈయనస్మృతి స్థిరీకరణార్థమయి దాదాపుగా మున్నూఱురూపాయలు చందాలు వేయఁబడినవి; వేసినవారిలో కొందఱు తక్క మిగిలిన వారందఱును తాము వేసిన చందాలను సంతోషపూర్వకముగా నిచ్చిరి. వచ్చిన సొమ్ముతో నాది కొంతచేర్చి మున్నూటయేబదిరూపాయలకు నిజరూపపరిమాణముగల చిత్రాకృతిని వ్రాయించి రాజమహేంద్రపురమందిరమునందుఁ బెట్టించితిని. ఎవరివలన మదుద్దిష్ట కార్యనిరంతర వ్యాప్తియు లోకోపకారమును కలుగునని నేనాశపడియుంటినో యట్టి వారిలో నకాలమరణము నొందుట కీయన ప్రథములు; ఈయనయనంతరము నాతరువాత నిరంతరాయముగా నత్యంతోత్సాహముతో లోకోపకారకార్యమును నడుపుదురని నేను ప్రతీక్షించిన రెండవవారయిన సత్తిరాజు మృత్యుంజయరావుగారును వీరివలెనే యకాలమరణమునొంది నాయాశకు భంగము కలిగించిరి; ఆరంభింపఁబడిన సత్కార్యము నవిచ్ఛిన్నముగా జరపి లోకమునకు మేలు చేయుదురని నేనాశపడిన, కడపటివారయిన దేశిరాజు పెద బాపయ్య గారును పయి యిరువురివలెనే యకాలమృత్యుదేవతవాతం బడిరి. వీరు మువ్వురును పట్టపరీక్షాసిద్ధులు; దేశాభిమాన మాననీయులు; సత్కార్యానుష్ఠాన దీక్షాపరులు; స్వార్థపరిత్యాగులు; పరోపకారరతులు; తాము సత్యము లని నమ్మినవాని నాచరణమునకుఁ దెచ్చుటయం దుత్సాహమును ధైర్యసాహసములును కలిగిన కార్యశూరులు. వీరు మువ్వురును యౌవనమధ్యమున స్వకృత్యాచరణారంభదశలో నే స్వర్గస్థులయిరి. ఈలోకములో మంచిపదార్థములు చిరకాలముండవు కాఁబోలును! ఆహా! ఈశ్వరేచ్ఛా విచిత్ర ప్రభావముల నెవ్వరు గ్రహింపఁగలరు!

  1. స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమాన స్థితులు - జనేవరు 1887.
  2. ఇంతవఱకును చెన్న పురిలో 1902 వ సంవత్సరమునందు వ్రాయఁబడెను.
  3. "Respected friend, ...............


    I have spoken to Peddibhotla Yeggenna Garu. He is prepared to give his widowed sister in marriage to any promising youth (of his sect of course). He is also prepared to join the first batch if only it consists of 4 or five matches. You may depend upon it he will not draw back . I have secret information to the effect that his uncles and other elders only put on the appearance of disapprobation, but they will eventually be of our party. Please write immediately on the receipt of this to Mr. Yeggennah to go to you. He has promised to go and meet you and make all necessary arrangements after receiving a letter from you.


    I have also been able to secure a వేపారి (Madhawa) man. He will marry a widow. He is about 22 years of age passed General test, is now a teacher in the Primary School on Rs. 15. If you write to him he will also go to you and propose what conditions he needs to be fulfilled. I know his circumstances are narrow.


    This morning I met Mr. Ramakristniah. He made the same promise that he made with you. He asks us to be steady and persevere. He is very zealous judging from the talk afloat about him here. He holds his ground in spite of the malicious reproaches of his caste people and others of this place. Please be touching him up with an encouraging letter now and then.


    We shall take steamer in an hour or so."

  4. "Your letters have reached me in time. As the mother of the young widow has left her village and gone to see her relatives, I could not talk to her and send you a reply earlier than this. I have just now talked to her. She promised to send her daughter to you as soon as you send your people here to fetch her there. Please send trustworthy, upright and firm-minded people to escort the girl there. They should keep the thing as a profound secrecy. If they are bypocrites, they are sure to frustrate our object. Please see that they really uphold our cause. No body here should know the purpose for which they come here till the marriage actually takes place. Seetamma wants you to send not more than two people for the purpose. She also thinks that our afforts may, at the end, again prove a total failure. She has also agreed to give you her written permisson for the marriage. Let your people come here as travellers with a note from you and meet me without giving the least smell of the matter to any body here. They can go to Repudi, the girl's village, even from this place. I told Sitamma not to leave her village till your men come and take her daughter away. Please send your people at your earliest convenience."
  5. "I feel very glad to acknowledge with thanks the receipt of your letter of 10th instant. But I am very sorry to tell you that on a sudden I received an order yesterday directing me to take charge of Vinukonda Talq, forthwith as the Ag, Tasildar there. I shall have to stay there 40 days. Most likely I may return after this term. I shall leave this tomorrow for Vinukonda. Please tell your people not to be disappointed but to go to Repudi; talk to the mother of tha girl and take her away."
  6. "Your telegram has made us all exceedingly happy. May God bless you and the couple ǃ It has at last pleased Him to crown your earnest and ardent exertions with success. Rajahmundry may henceforth be said to live. You have made the 11th of December a very remarkable day in the history of our Presidency. I feel very sorry for not being on the spot to share with you the joy as well as the trouble you must necessarily have undergone.


    Are we to have any more marriages soon? Unless some more are done in the heat there will not be much good forth-coming from one marriage. If you follow up this success and perform four or five more soon, Madras, as some wish me to believe, will follow in the wake of Rajahmundry. I have heard that Avadhani has heard from his brother to say that there are to come off four more marriages this week. I offer my heartfelt prayers to God to make you to telegraph to me this news soon"

  7. I was quite rejoiced to read your telegram which reached me a few minutes ago. I send my sincere blessings to the newly married couple and congratulations to you for the success your indefatigable exertions have brought about. I have shown the telegram to Messrs. Davidson and Master who are much pleased to hear the news. I only hope that at least half a dozen more marriages will take place in rapid succession. The excitement must not be allowed to cool down. Strike while the iron is hot and have a lot of marriages performed soon. I am circulating your telegram among the Native gentry here. An Anti marriage association is just now on foot here. It can do you no harm."
  8. "Cocanada. 21-8-82. My dear sir,


    I received your letter and showed it to Mr. P.R.K. He told me that he had remitted to you Rs. 100 and that he would remit some money in a day or two. Streeramulu will be taken proper care of.


    Mr. P.R.K. has made up his mind to submit to the authority of the Pontiff. The conditions imposed and accepted, are very injurious to the noble cause you have undertaken. I would advise you to appeal to the public for a widow marriage fund. Let the appeal be published in all the papers. If you send a copy of the appeal signed by you, to me. I will send it to the Hindu and ask the editor to support it by an editorial. I have written to Mr. Chenchal Rao that steps should be taken to raise funds, otherwise the cause will suffer for want of money as Mr. P.R.K. could not hereafter render the same amount of assistance as he did up to this time. I hope he will do something. From the manner in which Chenchal Rao's circular was replied and other circumstances, I see that the country is not yet prepared to accept the reform. A gentleman from Rajamandry told me that your health was indifferent. I believe the sole cause of it is your over anxiety. You must not over work your brains to the injury of your constitution. Yours is a most valuable soul. The reformation solely rests on your individual exertions. May the Almighty prolong your life, bless you with success in the noble task you have set to yourself and enable you to withstand all difficulties and trials, is the fervent prayer of your well wisher and friend K. Krishnaswami Rao."

  9. "Mr. Ramakrishniah is starting tonight. He says he will stay at Peddapur tomorrow and be at Rajahmundry the day after tomorrow. I have taken one promise from him that he should see you both before he takes penance. I have tried all my best to disuade him.........is so uneasy. He wants to do it and at the same time does not want to do it. God save him from the act. God's ways are mysterious. These are the days of trial for the widow marriage party. When I see the staunch advocates of the cause falling off, God is nerving me more and more to join the side, to break asunder that thin thread which is keeping me separate from you........"
  10. "I arrived here safe at about 10 o'clock this morning. I found Sriramulu garu to be much better than he was by the telegram the day before yesterday. I did not telegraph to you about my arrival as you were already telegraphed about his health. Dyssentery is almost cured................ Your yesterday's telegram gave Sriramulu much courage. There has been ever since, I hear much change..............."
  11. " I get very nervous whenever I read some of the articles of your paper when you attack big men. I fear in any one of the occasions you will get into trouble. You have many cnemies............... In your last. I read with sorrow your remarks about Mr. Johnson, the municipality and Mr. Schmidt. You said in it 'we do not care whoever it may be.' It is meant for Mr. Johnson. I do not advise you to get into row with Magitrates anad criminal Judges, ............ By all this I mean to say that one day if you get into trouble, I should lose a great patron in widows' cause. The warmth will fall with you."
  12. "As a friend interested in you and as you are a great reformer confering a great boon to the defencelessly afflicted sex, I wish to write and tell you that your remarks about Mr. Kelsal & c.........are not palatable. I fear, you may find a secret or public enemy..........you are to the public a very valuable one. So don't write about great and powerful men like this. If we lose you, we lose everything. Excuse me."
  13. "My dear friend,


    I hope that my telegram in reply to your letter will not disappoint you. Raghoonadharao who, you know, takes great interest in the cause we have taken up, has issued a circular to all his friends inviting their co-operation.


    He thinks that if we precipitate matters we may lose the support of many whose aid will be importance to us. He therefore asked me to beg you to defer your journey till 30th April next. I hope that you will not misconstrue our policy and regard it as a partial retraction of your promise to support you. If you however are resolved upon coming here at once, you may do so, and I will receive you either at my own house, or find a separate lodging for you, In either case, I shall have no objection to eat with you and recognize you as a brahmin............"

  14. Mylapore, 26-4-82.


    "My dear friend,

    Raghunadha Rao goes to his village for some upanayanam on 3rd May and will not return till the 20th of that month. I do not know when your vacation terminates. Any how you must arrange to stay here for some time after 20th May, a I can do nothing without him. You can come here however before hand according to your convenience. I am sorry that Raghunadha Rao has to be absent, but his abcence seems to be unavoidable."

  15. "Cocanada, 24th August 82.


    My dear and respected Friend,


    The S.S. Ellora is expected here today. So I shall be off. I saw Mr. P. R. and 'Judge.' I also visited Mr. Durham. I caused Mr. P. R. to send telegrams to Mr. Carmichoal, Chenchalrow &c. The Sub Judge thinks that no appeal may be filed. We must bring a civil suit by and bye. Mr. Durham and Sub Judge gave me rather long lectuers on the subjecʈ I saw Mr. Lachiraju, Ramarow &c. They have got a letter in the girl's own writing to you asking you to marry her to some one of her caste. I think the marriage may be preformed this month. I told the bridegroom to go to you tomorrow or next Saturday. If the girl is once removed from her parents, then she can resist the temptation to go back o her parents, I am sorry I have not been able to speak to the subjudge about this marriage. If one marrige is celebrated again, then there is hope for more being preformed. I have been of course told these things.


    Well, apart from the loss of money and time caused by this trip, apart from the trouble, I am sorry to have left Rajahmundry on one account. There are two souls in Rajahmundry whom I should consider most precious. I am particularly afraid of your health, because you overwork yourself. Please don't burden your brain for your sake, for my sake, for our country's sake and for God's sake. Give up for a time at least all idea of translating this and that book. Let some other person conduct the V-. Please do not involve yourself in those shabby quarrels regarding the Night School. If we find him incorrigible never mind.


    I think we must employ సంపర వెంకన్న గారు to engage parties and do the needful. I have spoken about it to Mr.P. R. Please also write to him yourself


    I have not been able to find the other man you spoke of I gave his name to Mr. Lachiraju

    I am yours hastily

    B. GAVARRAJU"

  16. "Vizagapatnam, 23rd October 1882.


    Dear Friend,


    pray , accept my most sincere and warm congratulations. Well done ǃ Thank God ǃ My joy is inexpressible. You see patience surmounts all difficulties. Some friends dispaired. They thought no more marriages would take place. They thought it was impossible to perform any more marriages. Now you have agreeably disappointed all those. Here is another trial to test the sincerety of the so-called sympathisers. I hope you will not fail to make the most of this opportunity. Invite all for betalnut at least. If you have not invited them already pray do so after the marriage. Let next Sunday be the day. You see we must try all the means in our power to recruit our strength. You must have a singing party. On or before next Sunday I shall be with you GOD willing. A steamer is due here next Wednesday I suppose. If not she will be here on Thursday. May the All-Merciful God crown your efforts with successǃ We may rest assured in spite of anything that if the cause is approved by god, it will succeed."

  17. "Calcutta, 24th October, 82.


    My dear sir, I am very much obliged to you for the information respecting the celebration of marriage of the third Brahmana Widow in your part of the country. The friends of the marriage of Hindu Widows here have been exceedingly delighted by this happy news.


    May uniform success attend your benevolent exertions on behalf of the unhappy sufferers is the earnest prayer of

    Yours sincerely,

    ISWARA CHANDRA SARMA.

    K. VIRESALINGAM ESQ.,

    Rajahmandry.

  18. " I am writing you these congratulating lines at 11 o' clock in the Night.


    You and Gavarrazu Garu. (the little men) have succeeded a montrous thing fighting against the current with the aid of the shield of our admirably bold friend B.A, B.L, A. Lakshiminarasimham Garu. Thank God . God will help you all. With a few of my hearts's wishes, I wrote this note for you, You Veerasalingam Garu, you have established your name and immortalized it in this world to come. Pray God give you good health."

  19. "Mylapore, 28th May 1883.


    My dear sir,

    On the receipt of your letters, we convened an extraordinary meeting of the members of the Association. 30 members attended of whom 18 were brahmins. They are all willing to attend the marriage and take betel-nut. As regards dining, of course, Sudra members have no objection Which is not of much use to us. Of the Brahmin members very few are willing to dine but on conditions which it is not easy to secure. Under these circumstances, it seems to us that it would be unwise to celebrate the marriage at Madras. If you however think that the scanty attendance is of no consequence, you are welcome and we can easily arrange for a house.

    Yours truly

    R. RAGOONATH ROW"

  20. My Dear, Sir, Masula, 16th April 1884.


    I take the liberty of addressing you by the epithet "Dear", tho' this is the first time that I took my pen to write you on any subject, on the simple ground that I sympathise with you for the step you took for relieving our help. less widows

    You will excuse me, I hope, for my not expressing my sympathy earlier. If any widow marriage were to be performed in the town, are you in a position to help the party with any substantial pecuniary aid. If so, to what extent? If you let me know the answer to the above question I shall let you know further particulars why I came now to ask of you this question. I am a District Court Vakil of this District.

    My Name, Charuvu subrahmayya Sastri,

    District Court Vakil, Masulipatam.


    Please don't disclose the contents of the letter to any body there before you take my previous permission. If you wish to know my status you may ask the District Moonsiff of Rajahmundry and Sistu Jagannadha Sastri Garu, a Vakil there, simply to know who am I and no further. Without letting others know of the contents of this letter, I have no objection for your collecting any information regarding me from any person whom you think that he is my acquaintance.


    Had there been canal communication, I would have gone up to you to speak in person. As that is now wanting I am obliged to keep letter correspondence with you."

  21. "Cocanada. 20-5-84. My Dear Friend,


    I had duly received your letter from Narsapur to which you went for healthː I hope you are better. You have asked me to advise you if you can go Masuly as you are invited for a marriage or 2. There is such a party feeling there, I fear the philonthrophers there will be put to difficultiesː there are none to support in funds even sufficiently; in all such circumstances you should write and tell them that your health does not permit you. They will do their best for themselves. The weather has been fearful and it is acting upon me. I feel quite dejected. The last 2 or 3 days it is 110 degrees. So you know what to do. As for my part I don't think you should go on account of your health. Please let me know what is your procedure.

    Yours truly

    P. Ramakistiah."

  22. Marriage party Pantulu gone for celebration Bellary to day.
  23. RE-MARRIAGE OF HINDU WOMEN

    We, the undersigned on behalf of the Widow Marriage Association of Rajahmundry, beg leave to lay before the enlightened Public of India the following appeal for pecuniary aid with the full confidence that we shall not be making it in vain.


    The evils of enforced widowhood among Hindus have been of late so warmly and so ably discussed from all points of view both in Madras and other parts of India that it is hardly necessary for us to recapitulate them here. We have done our best to convince the public that the remarriage of Hindu Women is sanctioned by the Sastras, and have, with God's blessing, so far succeeded that within the last three years 12 marriages of young widows have been performed, and we are glad to say that there are several young widows and young men who are willing to marry if some pecuniary help is given them to enable them to withstand social tyranny. We are averse to adopting any system of bribery for encouraging the remarriage of Hindu women, but some pecuniary help seems to be absolutely necessary in the present state of society. The prejudice against the movement is so strong that persons contracting such marriage are subjected to all sorts of annoyance. They are driven out of the house, of their parents, are abandoned by their relations, and deserted by their servants; and if they happen to be in private service, their services are dispensed with. It is therefore, necessary that some pecuniary help should be given to them to start them in life again. We have some times to provide them with house to live in, help them in case of illness, educate them, and provide them with the means of livelihood till they can earn it for themselves. Besides, we have also to incur the Marriage expenses, hire servants at exhorbitant rates and pay the Priest for the performance of the ritual. All these expenses we have hither to been able to bear from the funds(about 10000 Rs) placed at our disposal by that most patriotic and benevolent gentlemen, Paida Rama Krishnaiya Chetty Garu of Cocanada and from the contributions of other liberal gentlemen. But the funds placed at our disposal have been nearly exhausted, and our further progress depends entirely upon the pecuniary aid we can secure from the public. Rajah Sir T Madhava Rao, has kindly contributed Rs 500, has promised more help, and we beseech all the well wishers of the country to give us their helping hand at this juncture and enable us to further the movement we have undertaken.


    Subscriptions and donations will be received by Messrs. Arbuthnot & co., or by any one of the undersigned and full account there of rendered to the subscribers once a year.

    Widow Marriage Association, Rajahmundry May 1885.

    C. NAGOJI ROW, B. A.

    K. VEERASALINGAM;

    A. L. NARASIMHAM, B.A., B. L.

    N. SUBBA RAO, B. A., B. L.

  24. " The mother of the little girl came to me. I also agree to perform the marriage ceremony. Please let me know the lowest amount of money which is most urgently and unavoidably wanting for this. After this we must stop per forming marriages more for the present................ Our friend B. A., B. L, wrote me which letter this woman brought-he said to perform this at Masuly. If we do so we want much money and perhaps there are troubles again. I propose to solemnise it at Rajahmundry only.


    The boy and mother spoke together-they both agreed-he is ready to go over whenever you fix for it. As the boy is young we must support the family for the study up to matriculation or middle school examination for the latter one year is sufficient as he already studied some thing................ Do not write in your వివేకవర్ధని that I have been paying these expenses. Please let my name be secret."

  25. "Cocanada, 24th February 1886. My dear friend,

    I have received your letter about the marriage. I shall send you Rs 300, so please commence the marriage and telegraph me, I shall despatch the money."

  26. "Cocanada, 5th March 1886. My dear friend,


    I have received your letter stating that you have invited Mr.Lister etc., to the marriage, but as the bridegroom disappointed, the marriage did not take place. I know such disappointments will happen. You stated in your letter that you have taken a letter from a man on the condition of not claiming for a house. If we won't give a house, where will they be? We must give him some house, but they will not have possession of it if they be disobedient to us. We must give on such condition. This is my object. Please do so. Please get the man again and arrange for marriage. We have spent much for this bride and her mother. If we do this, we need not take trouble in the future for marriages. We can cease if we wish. Owing to this understanding it is not necessary to ask even the bridegroom to give a letter on the subject. However as you had done it, it is no matter.

    Yours truly,

    P. Ramakistiah"

  27. "If that Moonjoolury boy does not act decently as you wish, you must make him do it quietly. I did not promise any thing more than he should obey and please you and then you will do for him your best. I know how they will be bothering you. I know you will do your best for them and you have made your position a parental one. I shall not interfere"