సాక్షి మూడవ సంపుటం/సాక్షి సంఘ పునరుద్ధారణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2. సాక్షి సంఘ పునరుద్ధారణము

జంఘాలశాస్త్రి సాక్షి సంఘం మళ్లీ ప్రారంభమైందని చెప్పి తొలి ఉపన్యాసం ఇద్దామని వస్తే శ్రోతలు లేక గతంలో ఊరుకున్నాడు. ఇప్పుడు, అదలా జరగడం ఒక విధంగా మంచిదైందని సంతోషిస్తూ తొలి ఉపన్యాసం చెప్పడానికీరోజు మంచిదన్నాడు. -- వినాయకచవితి. శివ ప్రీతికరమైన రోజు. 1920 నాటి సాక్షి సంఘం శివరాత్రి రోజున స్థాపన జరిగిందట.

జంఘాలశాస్త్రి తన ఉపన్యాసం ప్రారంభించాడు. ధర్మశాలలు, దేవాల యాలు, వైద్యాలయాలు, సారస్వతసంఘాలు, మనకి చాలావున్నాయి. వాటని పునరుద్దరణ చెయ్యడంగాని, అటువంటివాటిని కొత్తగా స్థాపించడంగాని, మన పెద్దలు నిర్ణయించిన పవిత్రదినాలలో జరిపించడం మంచిది.

అవతారపురుషుల జన్మదినాలు, మరణించిన దినాలు, సంస్కర్తలజ యంతులు, వర్ధంతులు, దేవీనవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతినవ రాత్రులు, ఇటువంటి కార్యకలాపాలకు శ్రేష్టాలు. అలాచేస్తే ఆయా ధర్మకార్యా లలో, ఆరోజులకు అధిష్టాతలైన మహాపురుషులు, దేవతలుకూడా మనసభల్లో కూర్చుంటారు. ఆశీర్వదిస్తారు.

ఇలా అంటూ జంఘాలశాస్త్రి ఒక మహా ఆవేశానికి, భక్తిపారవశ్యానికి లోనై పురాణదంపతులను-పార్వతీపరమేశ్వరులను-స్పురింపిచే ఒక దివ్వతే జస్సును ఎదుటచూసిన అనుభవం పొందాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

ఆంధ్రపత్రికారాజములోని ప్రకటనమును గాంచి క్రిందటిసారియమావాస్యాదినమున నుపన్యాసమునువినుట కెవరైన వత్తురేమోయని కొంతసేపు నిరీక్షించితిని. ఎవ్వరును రాలేదు. రాకపోవుటయే మంచిదయ్యెను. ఈదినము వినాయకచతుర్థి శివప్రీతికరమైన దినము. మంగళకరమైన దినము. సర్వమంగళామోదకరమైన దినము. సర్వవిఘ్ననాశకు డైన శాంభవీపుత్రుని పూజాదినము. ఈపవిత్రదినమున సాక్షి సంఘపునరుద్దారణ మాచరించి ప్రథమోపన్యాస మీయవలయునని తలంచి విఘ్ననాయకుని మనఃపూర్వకముగ నారాధించి, కొందఱు మిత్రులతోఁ బక్వాన్నములభుజించి సోదరులారా! మీకొరకు వేచియుంటిని. సాక్షి సంఘ పునరుద్ధారణము 5

మీరందఱు విచ్చేసితిరి. చాలా సంతోషమైనది. క్రిందటిసారి సాక్షి సంఘము శివరాత్రియందు స్థాపింపcబడినది. ఈసారి శివపుత్రరాత్రియందు స్థాపింపఁ బడినది.

నాయనలారా! ధర్మాన్నశాలలు, ధర్మవైద్యశాలలు, దేవాలయములు, గ్రంథాలయ ములు, సారస్వతసంఘములు, భజనమందిరములు మొదలగుపవిత్రసంస్థ లనేకములు మన కున్నవి. ఇట్టివానిని నింక స్థాపింప వలసివచ్చినప్పడు కాని, పురుద్దారణ మొనర్చవలసివచ్చిన ప్పడు కాని మన పెద్ద లేదినములు పవిత్రములుగా గణించినారో యాదినములందే యాకార్య ములు జరిగింపవలయును. మనకెన్ని యె పవత్రదినములున్నవి. అవతారపురుషులు జన్మించినదినములు మనకుఁ బవిత్రదినములు, మన భారతమహావీరులు జన్మించినదిన ములు, మరణించినదినములు, మనలో మతకర్తలు వేదాంతులు సంస్కర్తలు జన్మించినదిన ములు, మరణించిన దినములు మనకుఁ బవిత్రదినములు. ఇవికాక, దేవీనవరాత్రము లని, వినాయకనవరాత్రము లని, వసంతపూజాదినము లని యనేకములైన పవిత్రదినములు మాకున్నవి. ధర్మనిర్వహణమునకై జ్ఞానప్రదానమునకై యేర్పాటు కాబడుసంస్థల స్థాప నము, పునరుద్దారణము మొదలగు లోకోపకారకకార్యము లిట్టి పవిత్రదినములందే మన పెద్ద లచే మనభారతదేశముచే, మనదేవతలచేఁ బావనములని యెంచcబడిన యిట్టి మహాదినము లందే జరిగింపవలయును.

ఇరువదియవ శతాబ్దమందు జీవించియున్న మనకు-నాంగ్లేయభాషాజ్ఞాన మేకొల దియో సంపాదించినమనకు-కాల మనంగా Sequence of Events వలన మనస్సులోం గలిగిన impression కంటె మరియేదియు కాదని యాంగ్లేయగ్రంథములు చెప్పచుండcగా వినినను నకు నింకనుదర్శ దుర్దినమని, ఏకాదశి సుదినమని గూఢమైన మౌఢ్యముండనేలయని పైవారధిక్షేపింతురా? ఊc, అధిక్షేపింపనిండు. ఎందులకయిన సరే, యెవనినైనసరే, యుధితే పింపకూరకుండిన దెవఁడు? పవిత్రదినములు లేనిజాతి ప్రపంచమందున్నదా? ఉండుట కవకాశ మున్నదా? మనమహ్మదీయసోదరులకు బక్రీత్, రమ్జాను, మొహరము మొదలగు పవిత్రములు లేవా? మన యాంగ్లేయసోదరులకు క్రిస్మసుపండుగలు, మేయుత్సవములు మొదలగునవి లేవా? ఇదికాక వారికిఁ బ్రత్యాదివారముకూడ బవిత్రదినమేకాదా? ఒకదినము మంచిది వేలకొకటి జబ్బేకానియెడల Good Friday కర్ధమున్నదా? దానిపవిత్రత యెఱిఁగియే దాని నట్టు పిలిచినారు. ఇది కాక వర్ణభేదము మిథ్య యని, వేదములు కృత్రిమము లని, జీవాత్మలెండమావులని, భగవంతునిగూర్చి విచారింపఁ దగదని బోధించి నబుద్దుcడు సైతము పెద్దలుగతించిన దినములనుబవిత్రములుగాఁ జూచుకొనుమని బోధింప లేదా? అందఱుకూడ నీవిషయ మంగీకరించినదే అడగినప్పడు మాత్ర మొప్ప కొనుటకు గొంత జంకుచున్నారు. కాని మన కాభయమీక్కర లేదు. పెద్దలు నడచిన త్రోవను నడుచుచున్నంతకాలము మనమెవ్వరికి భయపడవలసినపని లేదు.

మనపనిత్రదినములందే మన ధర్మసంస్థల సంబంధములగు నుత్సవములను జరిగిం చుకొనవలయును. ఆదినములు పావనము లగుటచే జనుల మనస్సులం దొక మంచిమార్పు కలుగక తప్పదు. శివరాత్రిదినమునఁ జేయవలసిన పవిత్రవిధు లన్నియు యథావిధిగ జేయనివాఁడైనను జేయలేకుంటమని రవంతవంతకైనఁ బాల్పడక తీరcడు. ప్రతిదినమును క్షురకర్మ మొనరించుకొనువాఁడైనను భీప్మైకాదశీదినమున గడ్డము తడిపించుకొనుటకుఁ గాసంత తటపటాయించును. పవిత్రదినములం దెట్టిపాపశీలుని మనస్సునందైన రవంత పశ్చాత్తాపము తాత్కాలికముగనైనఁ గలుగక మానదు. అట్టిపవిత్రాంతఃకరణములతో జనులెల్లరు మనయుత్సవముల బాల్గొందురు. వారితో మన మాయుత్సవములందు వివిధ భక్యభోజ్యాదులతో నసాధారణమైన విం దారగింతుము. పెద్దలేర్పఱచిన యట్టిపవిత్రదిన ములందే యట్టిపక్వాన్నములఁ దినవలయునుగాని మనయిష్టానుసారముగ నేదోయొక్కటి కల్పించి, యాదినమున నసామాన్యములయిన పిండివంటలతోఁ జిత్రాన్నదధ్యోదనము లతో, బరమాన్నములతో నుదరపూరణ మొనర్పఁదగదు. చేత సొమ్మున్నదికదా; అంగ డిలో ఘృతపిష్టాదివస్తువు లున్నవికదా; పడమటింటి బానిసతనముకుc బరిపూర్ణవితంతు వగు వదినెయున్నదికదా; ఒడల దారఢ్యమున్నదికదా; ఉదరమున కుత్తున్నదికదా; యని నీ కిష్టమైన దినమున నకారణముగ పాకపుగారెలు; పలావు తినవచ్చునా? తగదు. పెద్దలను దలఁచుకొనుచు, పూర్వమహావీరుల సంస్మరించుకొనుచు, నవతారపురుషులలో వారినారా ధించుచుఁ గాలమును గడపవలసినపవిత్రదినములందే యిట్టి యారగింపు లాచరింపవల యును. అంతేకాని రుచివైవిధ్యముకొఱకు, కండల పుష్టికొఱకు, నైహికసుఖముకొఱకు, రక్తపటిష్టతకొఆకు, నరముల యుద్రేకమునకై యిష్టానుసారముగ మనము బలాహారముల నేమియుc దినఁదగదు.

"యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిపై,
తే త్వఘం భుంజతే పాపాయే పచంత్యాత్మకారణాత్."

ఆత్మ కారణముగ వండుకొనువారు భుజించునది అఘము కానియన్నము కాదని శ్రీకృష్ణభగవానులు సెలవిచ్చినారు. అట్టివారు తమకొఆకై వండుకొనుటయే పాపము. భుజించుటవఆ కక్కఆయేలేదు. శరీరపుష్టికై యైహికసుఖమునకై భోజనప్రయత్న మొన ర్చువారు పాపులని స్పష్టపడినదికదా.

ఐహికనుఖదినములయిన వివాహదినములందు నిరంకుశముగ మన మన్నిపిండి వంటలు తినుటలేదా యని యందురేమో? అదేమిమాట? మన కులదేవతలు కాక ముప్పదిమూడుకోట్ల దేవతలు వివాహవేదికపై నాహ్వానింపఁబడియున్నారు. వివాహమైహిక నుఖమునకుఁ గానేకాదు. మన పెద్దలు దాని నట్టు గణింపనేలేదు. స్వర్లోకవాసులకు పెద్దలకు నివాపవారి నిచ్చి వారియుత్తమగతుల సంరక్షించుటకు, నిత్యదేవతాపూజాకార్యమునకు, నతిథిసత్కారమునకు, స్వార్దపరిత్యాగియై పరోపకారముకొఱకు పాటుపడుటకును బనికి వచ్చు వంశపావనుడైన కొడుకును దెచ్చుకొనుటకు నేర్పఆుపcబడిన వివాహతంత్ర మైహిక సుఖతంత్రమా? ధర్మమందే చరించుట కీయాశ్రమము తీసికొనుచున్నామని యగ్నిసాగఁ బ్రమాణము లొనర్చుకొన్న భార్యభర్తల ప్రథమసమావేశోత్సవములో నైహికగ్రంథలేశమైన నున్నదా?

పర్యవసానమునఁ జెప్పన దే మనంగా మనము తీసికొనుచున్న యాహార మున్నదే, అది యైహికమార్గమందు బల మిచ్చుటకుఁగాదు; ఆముష్మికకార్యములందు దీక్ష నిచ్చు టకు. లాంపట్యవృద్దికొఱకుఁగాదు; వైరాగ్యివృద్దికొఱకు. రక్తికొఱకుఁ గాదు; భక్తికొఱకు స్వసేవకొఱకుఁగాదు; పరసేవకొఱకు. శరీరముకొఱకుఁగాదు; ఆత్మకొరకు. ఇంతింత వ్వల్పాంశములందుఁగూడ మన పెద్దలు మన కహంభావము రాకుండ, దేహమత్తత కలుగ కుండ, ప్వార్డలోలత పెరుంగకుండc, బశుత్వము వృద్దికాకుండ, జాగ్రత్తపెట్టుటకు బ్రయత్నించినారు. దేవతా నివేదితాన్నమే కాని తినగూడ దనంగ నర్థమేమి? తిన్న యాహారమంతయు దేవసేవకొఱకే యని యన్నముతోఁ బ్రమాణముచేయుటయే కాదా?

అందుచే మతకర్తల సంబంధముచే, మహావీరుల సంబంధముచే, దేవతల సంబంధ ముచే, దేవతల సంబంధముచే, నవతారపురుషులసంబంధముచేఁ బవిత్రములగు దినము లందు మన ధర్మసంస్థల యుత్సవము లన్నియు జరిగించుకొనుట సర్వవిధముల శ్రేయము. ఆదినముల కధిష్టాతలగు మహాపురుషులుకూడ, మహాత్ములుకూడ, దేవతలుకూడ, మనతో పాటు సభలలోఁ గూరుచుందురు; మనకు మంచియూహలఁ గలిగింతురు; మనకు సత్కార్యదీక్షను బుట్టింతురు; వారివారి యాత్మలలోని విద్యుచ్చక్తిని మనము సహింపఁదగి నంతవఱకు మనకుఁ బ్రసాదింతురు; మనకు సర్వకార్యసాఫల్యమును జేయుదురు; మనసం స్థలు శాశ్వతముగ వర్ధిల్లవలయునని యాశీర్వదింతురు; దేవతలస్మరింపకుండ మనమేదియు సంకల్పించుకొనఁదగదు. దేవతల నాహ్వానించి యారాధింపకుండ మన మే ప్రయత్నముcజేయcదగదు. వినాయకదేవు నిచ్చట బ్రతిష్ఠించి, పత్రపల్లవప్రసవాదులచేఁ బూజించి, ఫలమోదకాదిభక్యములు నివేదించి, భక్తితోఁ బాదములకుఁ బ్రణమిల్లి, యేతత్పా దపద్మ సన్నిధానమున సాక్షి సంఘపునర్నిర్మాణ మొనర్చుటచేత, సాక్షిసభలో నిప్పడు వేంచేసియున్నావా రెవరో యెఱుఁగుదురా?

నాయనలారా! సంసారచింతల కొక్క క్షణము శాంతిఁ జెప్పి, కప్పదాటులు వేయుము నస్సును గట్టిగcబట్టి, శ్రద్ధావంతులై యీశ్వర ధ్యానతత్పరులై రవంతసే వుండcగలరా? అదిగో, ఏమి కానవచ్చుచున్నదో? నిశ్చలదీక్షతో, నిర్మలమనస్సుతో నీరంధ్రదృష్టితో జూచెదరా! ఆహా! చీమకుత్తుకలో సింహము ప్రవేశించినదే సముద్రసప్తకము చౌటిపడియలో నింకికనదే పరమాణువులలోఁ బర్వతమిమిడినదే కాసులేనివానిగుడిసెలోఁగైలాసమవతరిం చినదే ఆహా! చూచితిరా! రజతాద్రియెట్లు వెలిఁగిపోవుచున్నదో ఉదయమార్తాండుని కిరణజాలమాకొండపై బ్రసరింపఁగఁగొండ యేమియఖండతేజోమండితమై ప్రకాశించుచు న్నది! కుడిప్రక్కను గాంచితిరా? లక్షలు, కోటు లగునింద్రధనస్సులు పడుగు పేకగా నల్లుకొనిపోయి చిత్రవిచిత్రాతి విచిత్రమహా విచిత్రవర్ధములను వర్షించుచున్నవికదా! ఆతేజ స్సంఘాత మొకప్పడుపాము మెలికలుగఁ బ్రవహించుచున్నది, చూచితిరా! ఇప్పడు తరంఘ ఫక్కిగ ఠవణించుచున్నది. ఇప్పడదిగో జలయంత్రములోని నీటిసోనవలె బైకెగసి రంగురంగులపూవుల నీనుచున్నది. అదిగో, ఇంతలో సుడిగుండములో వలె గిరగిరc దిరిగి క్రిందికిఁ గ్రుంకిపోవుచున్నది. కన్నులు చెదరుచున్నవి. ఒక్కనిముసము కన్నులుమూసికొ నుట మంచిది. ‘శంకర భగవానుcడా! కన్నులు చెదరిపోకుండc గటాక్షింపుము. తలతిరుగ కుండునట్టు దయసేయుము. త్వదీయవైభవమును జూచి తరింతుము. తండ్రీ! తండ్రీ! ఓహో! అనిర్వర్ధ్యమైన యాయద్బుత తేజమునుండి యంతకంటె ననిర్వర్యమైన యొకలేజో రాశి బయలువెడలుచున్నదే ఆతేజోరాశి యొకత్రుటిలోఁ గుడివైపు శుద్దస్పటికసహస్ర కాంతితో, నెడమప్రక్కనింద్రనీలకోటికాంతితో, రెండుపాయలుగా విడిపోయియుఁగలసియే యున్నదే వారే పురాణదంపతులగు పార్వతీపరమేశ్వరులు! ధన్యోస్మి! ధన్యోస్మి! శంకరా! అఘనాశంకరా! దుర్గా సంరక్షితభక్తవర్గా! నమస్కారములు. నమస్కారసహస్రములు. నమ స్కారకోటులు.

ఓమ్ శాంతి శ్శాంతిః.