సాక్షి మూడవ సంపుటం/శ్రీమతి సు.స. గారికి బహిరంగ లేఖ

వికీసోర్స్ నుండి

32. శ్రీమతి సు.స. గారికి బహిరంగ లేఖ

డవేషాలు వేసే మగవారి గురించి దుమ్మెత్తి పోసిన సు.స. గారికి - కొన్ని విషయాల గురించి- సమాధానంగా పానుగంటివారు ఈ వ్యాసం వ్రాశారు.

ఉపన్యాసం స్త్రీలను ఉద్దేశించినదే అయినా, పురుషుల్ని ఉద్దేశించి పుంఖాను పుంఖాలుగా అందులో తిట్లున్నాయి. భర్తమీద కోపంతో వెల్లడించిన అభిప్రాయాలకు, భారతీయ జాతి పరిశుద్దితో లంకె ఉండడం వల్ల స్త్రీపురుషులంతా చదవాలని పానుగంటి వారు భారతిలో ప్రకటించారు.

సు.స. గారి వ్యాసంలో నాలుగు భాగాలున్నాయి. నాలుగింటా ఒకటే సంకల్పం, పురుష జాతిని తిట్టడం. స్త్రీపాత్రధారణం చేసే మగవారి మూలంగా కలిగే పిల్లలు సంకర స్వరూపులై ఉంటారనే వాదం సరైంది కాదు. కాదని చెప్పడానికి దృష్టాంతాలున్నాయి.

HERIDITY మూలంగా కన్ను, ముక్క, మూతి వంటి పోలికలు రావచ్చును గాని- గుణగణాలు రావాలని లేదు. మహాపండితుడి కొడుకు శుంఠ కావచ్చు. నిరక్షరకుక్షి వంశంలో మహామేధావంతుడు పుట్టవచ్చు. బహుపత్నీకుడైన దశరథుడికి- శ్రీరాముడి వంటి ఏకపత్నీవ్రతుడు కొడుకు కావడం, విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపునికి హరిభక్తుడైన ప్రహ్లాదుడు పుట్టడం గమనించలేదా!-జీవుడి పూర్వజన్మ సుకృత దుష్టాంతాలే ఈ జన్మలో గుణగణాలకు కారణా లవుతాయి. మగవాడు ఎలాంటివాడైనా, స్త్రీ భావన, బిడ్డల్ని కనడంలో ప్రముఖం. స్త్రీల భావన లోపం వల్లనే జాతిలో బానిసతనం ఎక్కువవుతుంది. ఆడవాళ్లు స్త్రీపాత్రల్ని ధరించడంలో గృహిణులైన వారికి చాలా సాధక బాధకాలున్నాయి. వేశ్యల్ని తెచ్చి వేషాలు వేయిస్తే ప్రమాద పరంపర ఇంకా హెచ్చు. స్త్రీ పాత్రధారణ చేసే పురుషులు బాగానే చేస్తున్నారు. ఈ సందర్భంలో, కొత్త సంస్కరణ లేమీవద్దని, సు.స. గారికి సలహా ఇచ్చారు.

మ్మా! శ్రద్దతో వ్రాసి యశ్రద్దతో విడిచిపెట్టిన నీయుపన్యాసము దైవవశమున నాకు దొరకుటచే దానిని సంతోషమునఁ జదివి విమర్శింప వలసివచ్చెనని విచారించితిని. ఆ యుపన్యాసము స్త్రీలకై యుద్దేశింపఁ బడినదైనను, దానిలోఁ బురుషులకుఁ బుంఖానుపుం ఖముగాఁ దిట్లుండుటవలనను, భర్తపై గోపమున వెల్లడించిన యభిప్రాయములకు భారతీయజాతి పరిశుద్దితో లంకె యుండుట వలనను దానిని స్త్రీపురుషులందఱు చదువలవల సినదని యెంచి భారతిలోఁ బ్రకటింపించితిని. అట్లు ప్రకటించుటకు మీ సెలవులేదని యెఱుఁగుదును. కాని మీ రెవ్వరో నే నెఱుఁగనప్పడు మీ సెలవు నొందకపోవుట లోపము కాకపోవచ్చును. అదికాక జాత్యుపద్రవ మేదో వచ్చినదని మీరు భావించుచు మహాందోళన మొందుచుండ నట్టి యాపత్కాలములో ననుజ్ఞ యక్కఱలేదని యనుకొనుట కూడ లోపము కాకపోవచ్చును. ఎటులైనను భారతీసేవకై సంకల్పింప బడినది భారతినే చేరినది.

అమ్మా! నీయుపన్యాసము నామూలాగ్రముగ బండిలోనే చదివితిని. అది నాల్గుభాగ ములుగా విభజింపబడినట్టు స్థూలదృష్టికిఁ గానబడుచున్నది. మొదటిభాగము మగవానికిఁ దిట్టు; రెండవ విభాగము మగవానికిఁ దిట్టు; మూడవవిభాగము మగవానికిఁ దిట్టు; నాల్గవ విభాగము మగవానికిఁ దిట్టు; మగవాడు వట్టి వ్యర్డుడని మీ యభివృద్దికిఁ బ్రతిబంధకారుడని, పరమశత్రుడని, ప్రత్యక్షమారకుడని, యాతనిఁ దృణీకరించి స్వప్రయత్నముననే మీ రిట్టిమహోన్నత దశకు వచ్చితిరని, మగవాని నేల నడఁచిత్రోక్కినను బాపములేదని మొదలగు ప్రారంభ శాపవాక్యములు మొదటి యధ్యాయమునందుఁ బ్రకాశించుచున్నవి. మీ బుద్దిచేత మీకర్ణములని యుపయోగ కరములని మీరెంచిన బాహ్యవేషములను ధరించుచు నభినవశోభావి రాజమానలై యార్యావర్తకల్యాణ దేవతలై యలరారు చుండంగ, బాహ్యవేషధార ణమునఁ దన్నేమో మీ రనుకరించుచున్నారని బ్రాంతిపడి మగవాఁడు మి మ్మెంతయో యల్లరిపెట్టినాఁ డను కోపమున మీ రాతనిని జెడమడ దిట్టినతిట్టు రెండవ యధ్యామున నేర్చిన రత్నాలవలె భాసిల్లుచున్నవి. మగవాఁడు కోక కట్టుకొని, కాటుక పెట్టుకొని, సవరపుబుట్ట నెత్తిని గట్టుకొని, బూడిద మొగమునఁ గొట్టుకొని కోడె పెయ్యయై రంగమున నవతరించి నందులకు కాతని కడ్డమైన. తిట్లు— మాయదారిచూపులు-మంగళపు టారతిచూ పులు-చూడలేకపోయెనని మఱిమఱితిట్లు–ఆడుది నిలువఁ బడినట్లు నిలువబడనైన లేకపోయినాఁడని నిలువెల్లఁ దిట్టు-మానినీ తత్త్వము ననుకరింపలేక పోయెను. గాని మగయొు డలి పొంకములు, మనస్తత్త్వము కూడ మన్ను చేసికొనినాడని-ఓ-హద్దుపద్దు లేనిత్తిట్టు -మూడవయధ్యాయమునఁ బ్రచండధాటీ పరిపాటితో విజృంభించుచున్నవి. సంకర రూపన మార్దనమున సంసారకృత్యమున కర్జుఁడు కాని యాతడా నాటకరంగమందే పడియుండి మగవాఁడు కాకుండ, నాడుది కాకుండ నేదో మధ్యమమార్ గగామియై దేహము చాలించు కొనక, సిగ్గులేక, యిల్లుచేరి, తగుదునమ్మా యని తనవంటి మందభాగ్యుల నింక నవతరించ పజేయుటకుఁ బ్రయత్నించుచున్నాండని, దేశద్రోహియని, జాతి ద్రోహియని తిట్టినతిట్టు -హరిహరీ!- తురీయాధ్యాయమున నప్రతిహతములై యనిర్వర్ట్యము లైయున్నవి. వేదోచ్చారణమును వదలి చతుర్ముఖుఁ డగు బ్రహ్మదేవుడు తిట్టకు లంకించుకొన్నయెడల నింతకంటె నెక్కువ తిట్టలేఁడేమో యనుసందేహమును గలుగఁజేసితివి. ఈనాలు గధ్యాయములలో నాలుగు వర్ణములవారికి, నాలుగాశ్రమముల వారికి, నాలుగు యుగములవారికిఁ దలమున్కలైన తిట్లు ప్రసాదించితివి; తల్లీ శాపాలాపశారదావ తారమవు!

వెఱ్ఱితిట్టకు విమర్శన మేమున్నది? స్వరమగునెడల గాంధారమా మధ్యమమా మఱి యొకటియా యను పరీక్షకాని, యపస్వరమునకుఁ గైశికియా కాకలియా యను విచికిత్స యుండునా? ఉపేక్షకంటె నుత్తమ విమర్శనము వేఱొకటి లేదు కావుఁ దిట్లటసంగతి యింకఁ దలపెట్టక విమర్శింప వలసిన యంశము లేవో కొలదిగా విమర్శింతును.

అమ్మా! స్త్రీపాత్ర ధారణము తఱచుగజేయు మగవానిమూలమునఁ గలుగుపిల్లలు సంకరస్వరూపులై యుందురని మీవాదము. ఇది మీభావన కాని ప్రకృతి సత్యము కాదు. ఆడారివారెందఱో ప్రపంచమున నున్నారు. నే ననేకుల నెఱుఁగుదును. వారి యాండారితన మింత యంతయని చెప్పవీలులేదు. మూటలో, జూపులో, రూపులో, నడకలో దలంపులో, జర్యలో సంపూర్తిగా నాడువారి వంటివారేకారు –ఆఁడు వారే? అంతయో యింతయో దుష్టత్వ మాడంగితనమున కంటియే యుండును. ఆఁడారివాఁడు గుమ్మము నొద్ద నిలువ బడియుండగ వీథిలో నెవఁడైన సుందరుడు పోవుచుఁ దనవంక జూడకుండిన యెడలఁ గనపుట్టి యేమి మునిఁగిపోయినది? తన స్త్రీత్వము నాతండవమాన పఱచినాఁడని యాతం డ ట్టుడికిన ట్లుడికిపోయెను! ఆసుందరుఁడు మఱియొక యాండు దానినిఁ జూచి మందహాస మొనర్చునెడల నాడారివాఁడసూయచేఁ దలనేలఁగొట్టు కొనుటకు సిద్దపడును. అట్టి యాడంగివాండైనను బుంస్త్వసహితుడై పతివ్రతయైన తన భార్యయం దిల్లునిండిన బిడ్డల గనుచున్నాఁడు. వారు సంకరస్వరూపులై యున్నారా? అణువంతయాడారి తన మాతని పుత్రులయం దెచ్చటనైనఁ గనబడుచున్నదా? దుర్బలులైనపిల్లల గనుచున్నాఁడా? ఉక్కుతునుకల వంటి వారిని గనుచున్నాఁడు. పౌరుషవిహీనులై వారిని గనుచున్నాఁడా? లేదు, శౌర్యసహితులనే కనుచున్నాడు. ఆడారితండ్రికిఁ బుట్టినవాఁ డెవ్వడుకూడ నాడారి వాఁడు కాలేదని యనేక దృష్టాంతములు చూపవచ్చును. అంతవఱ కిప్పడ వసరము లేదు. స్త్రీపాత్రధారి యైన పురుషుడు దేహ మనస్తత్త్వములం దాడంగివాని కంటె నెక్కువ చెడిపోయినాడా? లేదు ఆడంగివాఁడే యట్టిబిడ్డలను గనుచుండ, స్త్రీపాత్రధారి సంకర స్వరూపులను గనుననుట సత్యదూరము; సాహసము.

వేదవి హితాచారసంపన్నుఁడై స్వచ్చమూర్తియైన వైదికశిఖామణికి, రైల్వేవారి భోజన మఠములందు గొడ్డుమాంసమును బీకుకొని తిను కర్మచండాలుడు జన్మించుచున్నాఁడు. పార్వతీపరమేశ్వరులవలె నపత్రిమాన దాంపత్యసహితులై పరమప్రశస్తులైన భార్యాభర్తలకు వారవనితామాతచేఁ జెప్పదెబ్బలు దిను వంశోద్ధారకుఁ డుదయించు చున్నాఁడు. షట్చా (స్త్రపాండితీ మండితుండై సర్వదిగంత విశ్రాంతకీర్తి యుక్తుఁడైనవానికి శుంఠలలో శుంఠ జన్మించుచున్నాఁడు. అమ్మా! ప్రపంచ చరిత్రమును జూచుచుండుట లేదా? వితరణకళాదీక్ష యందు బలిశిబికర్ణాదులంతటి మహావదాన్యులగర్భమునఁ దండ్రిప్రాణోత్ర్కమణసమయ మున నాతని తలవైపునఁ బెట్టుదీపము దండుగ యని యార్పఁ జేయు లుబ్ధాధమాధముఁడు కలుగుచున్నాఁడు. నవరసమయ నవజగన్నిర్మాత యైన Shakespeare మహాకవి గొడ్డు కోసికొను కటికవానిపుత్రుఁ డని యందురు. ఒక నీగ్రోజాతి యాతండు మహావిద్వాంసుడై మహాసభయం దొకమహోపన్యాస మిచ్చుచుండగా విని మహాశ్చర్యభరితుఁడై నట్టు శ్రీవివేకానందస్వామి సెలవిచ్చినారు. ఆ నీగ్రోపండితుని తండ్రితాతలు వట్టి మూఢులైయుండ, నట్టి విద్వాంసుఁడు వారివంశమునఁ బుట్టుట చూడగా Hrediry యనుననది కల్లకాని వేఱుకాదని యాస్వామి స్పష్ట పఱచినారు. ఏడడుగులయెత్తు దాఁటినవానిని Giant అని యందురు. అట్టివారెందరో యిదివఱకు జన్మించిరి. కాని వారి తల్లిదండ్రులు సామాన్యాకృతి కలవారేకాని తద్భిన్నులు కారని పరిశోధనమువలనఁ దెలిసియనంశమే కదా! ఏడడుగుల యెత్తుగల తండ్రికి మూడడుగుల వామను డుద్బవించుట లేదా? ఇంతయేల? ముగ్గుఱు భార్యలు చాలక దినమున కొకతె చొప్పన మూఁడువందల యఱువదుగురుంపుడు కత్తెలను జేరఁదీసిన దశరథ మహారాజునకు-పరశురాముడు కాబోలు యుద్ద వార్తనంపఁగాఁ జేతులకు గాజులు తొడిగించుకొని యూడువారి గుడారము లలో దూఱిన దశరథమహారాజుకేకదా -ఏకపత్నీవ్రతుండైన జానకీనాథుడు-జగదేకవీరుఁడైన శ్రీరామచంద్రమూర్తి జన్మిం చినాఁడు; అమ్మా! ఇంకను Heredity ని నమ్మెదవా? Heredity యనుదాని వలన దండ్రిసంబంధమైన ముక్కుపొడుగో, తల్లి సంబంధమైన కన్నుసోగయో, మేనమామసంబంధ మగు మూతివంకరయో పిల్లవానియందు గాదా చిత్కముగ సంక్రమింపవచ్చును గాని, జగత్తు నేలుటకు సామర్ధ్యము గలయట్టియుఁ గాక జగత్తునకు బానిస యగునంతటి తుచ్చత్వము గలయట్టియు, మనస్సులోని శౌర్యము, గాంభీర్యము, త్యాగము, నాపత్సహనము, భూత దయ, దైవభక్తి మొదలగు సద్గుణపరంపర కాని, కాతరత, లాఘవము, లోభము, శాంతిరాహి త్యము, తామసను, నాస్తికత మొదలగు దుర్గుణ పరంపర కాని, Heredity వలనఁ గలుగుట కవకాశము లేదు. అయవకాశమే యుండు నెడలఁ బ్రహ్లాదు డంతటి వాఁడు హిరణ్యకశిపు నంతటివానికిఁ బుట్టుట సంభవించునా? అనూచానత కారణము కానియెడలఁ గారణ మేదని యడుగుదు వేమో? జీవుని పూర్వజన్మ సుకృత దుష్కృతములే జన్మములోని గుణాగుణ ములకు కారణములు కాని వేఱుకాదు. అమ్మా! నమ్ముటకు నీ కిష్టమైన యెడల నమ్ముము; కాని యెడల మానివేయుము. నీనమ్మకము వలన నార్యమతమునకు బలము లేదు. నీతిరస్కా రమువలన నీరసతయు లేదు. మహాబుద్ దిశాలులైన పెద్దలు నిర్వచించిన మాటలను నాకు దెలిసినంవఱకు నా యత్యల్పశక్తి ననుసరించి చెప్పచున్నాను. వేదరుల యందలి విశ్వాసము చేనైనను నీనూతన సిద్ధాంతమును ద్యజింపఁ దగును.

"నీవు స్త్రీపాత్రధారణ మొనర్చితివి కావున నీతో నేను గాఁపుర మొనర్స"నని నీవు భర్తతో నిరంకుశముగఁ బలికితివే! ఆహా! భారత దేశ సంరక్షక దేవతలు గడగడ వడకునం తటి మాటయంటివే భర్తపైట వేసికొని వంకరగఁ జూచి నంతమాత్రముననే భర్తృభార్యా సంబంధము తెగునని యనుకొంటివా? అదిగాక 'మనకు భర్తలు శాశ్వతులు కారు; వారి యిష్టము లేకున్నఁ బోవుదురు. మన యిష్టము లేకున్నను బోవుదు' రని వ్యాసుఁడు బ్రహ్మసూత్రరచన మొనర్చినట్టు నీవు పరిణయ సూత్రములను గల్పించితివే! అమ్మా, యెంతదానవు! మనవివాహ శాసనము వంటపూటింటి వ్యాపారమువంటిదే యనుకొనుచు న్నావా? రషియావారి మూఁడు సంవత్సరముల “కాంట్రాక్టు' వంటిదే యనుకొనుచు న్నావా? భార్యాభర్తలు తనువులు వాసినను బంధము నీడునది కాదని యెఱుగవా? శరీరయాత్ర చాలించి స్వర్గమున నఖండానందసముద్రమున నోలలాడుచుండు నిల్లాలైనను భూలోకమం దింక జీవించియున్న తనభర్తకై గ్రుడ్లనీరుగ్రుక్కు కొనుచునే యుండును గదా? తనభర్త యన్యకాంతాసక్తుఁడు కాక తనయందే యపేక్షగలవాడై యుండవలయు ననియుదన గృహదేవతలను బూజించుచు, నతిథినత్కార మొనర్చుచు, సదాధర్మమందే చరించుచుఁ గీర్తికాముఁడై యుండ వలయుననియు, బుణ్యరాశియైన యాతండు, భూలోక యాత్రా పరిసమాప్తి యైనపిమ్మట స్వర్గమునఁ దన్నుఁజేర యవ్యయానందము ననుభవింపవ లయు ననియు, నామె భగవంతున కెల్లప్పడు మొక్కుకొనుచునే యుండును గదా! ఇది సత్యమని నిరూపించుటకు నిదర్శనములున్నవి కాని లేకపోలేదే! అట్టిచో నిడ్డెనపాత్రము పొరుగింటి నుండి తెచ్చుకొని యిడ్జెనలు చేసికొన్న పిమ్మట వారిపాత్ర వారికిఁ బాఱవైచినట్టు భర్తతో నవసరము తీఱినవెంటనే యాతనిఁ బైకిఁ బొమ్మనుటకు నీ కధికార మున్నది యనుకొనుట తప్ప కాదా! పట్టరాని కోపముచే నటులంటివి కాని నీమనస్సులో నట్టియుద్దేశము లేదని పెద్దవాఁడనైన నేను గ్రహింపలేనా? అడువేసములు వేసిన పురుషులవలన సంకర స్వరూపులు పుట్టుదురని స్వప్నమందైన ననుకొనకుము.

అమ్మా! మఱియొక్క మాట. మీకున్న భావనను బట్టియే మీకుఁ బుత్రులు కలుగు దురు. ఈయంశమునుగూర్చి జంఘాలశాస్త్రి చెప్పియే యున్నాఁడు. ఆతని మాటలనే చెప్పెదను. 'భర్తయందు మీకున్న భావనా గౌరవమును బట్టియే మీకు సంతానము కల్గును. తెలిసినదా? భర్త పర దేవతయని యెంచి మీ రాతనిని సేవింపుడు. మీభావనా బలముననే మహాపురుషులు మీ గర్భమున నవతరింతురు. భర్త మీకు బానిసయని యెంచి యాతనిపై నధికార మొనర్పఁకుడు. మీరు బానిస క్రింద బానిస వంటిపిల్లల గందురు. అది నిశ్చయము. అభిమన్యుని సుభద్రయే కనవలయును. భరతుని శకుంతలయే కనవలయును. ఈ కాలములో నభిమన్యులు, భరతు లెందుకు లేరు? సుభద్రలు, శకుంతలలు లేకపోవుట వలన. భర్తలను దైవములుగ సేవించుటకు భగవత్సము లైన భర్తలిప్పడున్నారా యని తెలివితక్కువ ప్రశ్న మొనర్చకుడు. ఒకప్పడు మాత్రము భగవత్సము లైనవారుండిరా? లేరు. ఇప్ప డింతకంటె లేరు. లేకపోయి నప్పటికి మీ భావన కభ్యంతరమేమి? మగలు కాని మట్టిబొమ్మలు కారే. మట్టి బొమ్మనే ద్రోణాచార్యుండుగ భావించి సేవించిన వాఁడు ధానుష్క శిఖామణి కాలేదా? అంవఱ కెందులకు? గాజులతట్టతోఁ గలుప బడిన గోడిగ యరేబియా గుఱ్ఱమును గనుటలేదా? భావనయే ప్రధానమా? అంతకంటె నేమైన నున్నదా? అట్టి మీ భావనలోపము వలననే జాతిలో బానిసతన మెక్కువ యగుచున్నది. మీయొద్ద మీ భర్తలు గడగడలాడి నప్పడు మీరు కన్నకొడుకు లెలుకలను జూచి, పిల్లులను జూచి యేడ్చినారనగ వింతయేము న్నది? సోదరీమణులారా! బాహుబల సంపన్నులు, ప్రజ్ఞాశాలులు, క్షాత్రవంతులైన పుత్రులఁ గని భారతదేశ ప్రాచీన గౌరవమును గాపాడుదురు గాక!'

విమర్శింపఁ దగినయంశ మింకొక్కటియున్నది. నాగరకతగల యితర దేశములందలి పద్దతి ననుసరించి స్త్రీలకే స్త్రీపాత్రము లిచ్చి నాటక కళను బరిపోషింప వలసినదని మీరు నాటకసంఘాధికారుల కొసంగఁ దలంచిన యాజ్ఞాపత్రములో నున్నది. అమ్మా! అవశ్యకమైన యెడల నన్యదేశీయ పద్దతి నవలంబించ వచ్చును. కాని, దాని నవలంబించుటకు బూర్వము మనదేశ శీతోష్ణస్థితులేమో, సాంఘిక నైతికాది స్థితులేమో, జాతియా దర్శమో, యన్యధేశీయ పద్దతి మన యీ పరిస్థితులకు సరిపోవునో, వికటించునో, మన తత్త్వములకు విరుద్దమైన మందును దీసికొనుటవలన నున్న రోగ మట్టుండ " మఱి యింక నేరోగము కలుగునో రవంత చూచుకొన నక్కఱలేదా? పాశ్చాత్యదేశములలో మిక్కిలి శీతల ప్రదేశము లందలి వారికి శీతోదకస్నానము స్వప్నమందైన లేదు గదా! ఉష్ణోదకస్నానమైన దినమున కెన్నిసారులని యడుగవలదు; వారమున కెన్నిసారులని యడుగవలదు; మాసమున కెన్నిసారులనియైన నడుగవలదు. సంవత్సరమున కయిదాఱు పర్యాయములు లైనంయొడల-ఓ -సమృద్ది పండ్రెండు స్నానము లొనర్చువాఁడు పరిపూర్ణ స్నాననిష్ణాగరిష్టడు. ముంజేతు లకు మొగమునకు మాత్రమే యుష్ణోదకస్పర్శము కాని యొడలి కేది? వారు నాగరికత కలవారు కారా? అట్టని వారి పద్దతి మనమవలంబించు నెడల భారత దేశమంతయు బదిమాసములలో నిర్జన మగుట కేమైన సందేహమా?

అమ్మా! France దేశమునకు బోయి యచ్చటి యొకనటిని నీ వీ వృత్తినేల యవలంబిం చితివని యడుగుము. 'ఈవృత్తిలోఁ జాకచక్య మగపఱచి, ధనము సంపాదించు నెడల మగ డెవ్వఁడైన లభించునేమో యను నాసతో నిందు దిగితి’ నని యామె ప్రత్యుత్తరము చెప్పను. ముప్పది రెండేండ్ల కన్య మొగమునకు బూడిద రాచుకొని యర్దడదిగంబర వేషముతో నాట్యమాడుచు, వలతోఁ జిగురుగండెలతో, పక్షికూతలతో మగలకైవేటాడుచు, నెవ్వనినో యొకని గ్రహించి వానిని కొంత కాలము పరీక్షించి నచ్చనియెడల విడిచిపెట్టుచు, మఱియొుకని గ్రహించి, వాడు చేసిన మోసమువలనఁ గలిగిన ఫలముల కేడ్చుచు, మఱల మఱి యొకనికై ప్రయత్నించుచు, నాందోళన పడుచు, నల్గాడుచు, మిడుక వలసిన స్థితి భారతదేశ స్త్రీ కెన్నఁడైన నేమాత్రమైనఁ గలుగుటకు సాధ్యమగునా? ముప్పది రెండేండ్ల వలకెందులకు? పదునెనిమిదేండ్లు దాఁటిన కన్యను సాధారణముగా భారతదేశమందుఁ జూపఁగలమా? అంతవఱకుఁ గూడ నెందులకు? పదియేండ్లకుఁ బెండ్లి , పదునొకండేండ్లకు సమర్త, పండ్రెండేండ్లకు లొడితెడుబిడ్డయు గల గృహిణి భరతశాస్త్రాభ్యాసము చేయుటెప్పడు? ప్రసన్న యాదవములో నూర్వశియై తాండవించు పెప్పడు? అమ్మా, Germany లో మఱియొక్క నటిని నీ వీవృత్తిలో నేల చేరితి వని యడిగెదవా? ఆమె యేమి ప్రత్యుత్తర మిచ్చుచున్నది. Excitement కొఱకని చెప్పచున్నదా? అమ్మా! అనంగ నేమో నీకర్ణమై నదా? ఉత్సాహమునకు–ఉబికిన యుద్రేకమునకు-నరముల కదలికకు ఆమె యీవృత్తిలో జేరినదంట! ఇంట బండపనిచే, భర్తృసేవచే, బంధువుల యాదరణముచే, నతిథిజన సన్మానముచే, దేవపూజా ద్రవ్య సమార్జనముచే, బిల్లల కొనర్పవలసిన మొదలు తుదిలేని, తెఱపి తెంపులేని యుపచార పరంపరచే నిత్య ముత్సాహతోఁ గదలికతో మెలఁగవలసిన మననారీమణుల కెప్పడైన నట్టి Excitement కావలసి యుండునా? పరదేశనట శిఖామణులు బ్రహ్మచారి ణులగుటచే నేవిధమైన జంజాటము నెఱుఁగని హేతువున వారి కట్టి యుద్రేకస్థితి యావశ్య కము కాని, యూఁపిరి విడుచుటకైన దెఱపిలేని యుద్రేక స్థితిలోఁ దఱచుగా నుండవలసిన మననారీమణుల కది యెట్టన్వయింపఁ గలదు? ఒకవేళ నెప్పడైన నే కారణమునైన రవంత మాంద్యముగా నున్న యెడలఁ దోఁపకుండ నుండునెడలఁ గదలిక కొఱకు గ్రచ్చకాయ లాడుకొందురు; చతురంగ మాడు కొందరు; పాటలు పాడుకొందురు; పదిమంది చేరి యేదైన గ్రంథమును జదువుకొందురు. అంతేకాని యంతకంటె నుద్రేక మిచ్చుపను లొనర్చుటకు మనవారు పాల్పడఁగలరా? పట్టపగలు, భర్తతోనైన రవంత యే కాంతముగ మాటలాడిన యెడల నత్తగారు రొసరొర లాడునే ఆఁడుబిడ్డ మూఁతి విరుచునే పరపురుషుని స్పృశింపఁ దగదు; చూడఁదగదు; తలఁపఁదగదని ముప్పేట యేనుఁగు మెలికలబంధముతో జాతితత్త్వ పరిశుద్దనిమిత్తమై పరమ సంతోష పూర్వకముగ బంధించుకొన్న మన సోదరీమణులు నాటకములలోఁ బర పురుషులచే నాలింగన మొనర్పఁబడుటకుఁ గాని, ముద్దు పెట్టుకొనఁబ డుటకుఁగాని యంగీకరించుట యెన్నఁడైన సాధ్యమగునా? పదవయేఁట గట్టుకొని, యెనిమిదేండ్ల నుండి కాంపురము చేయుచు నల్వురు బిడ్డలను గన్నమగం డింటిలో నుండగా మనదేశమందలి సంసారిణి 'ప్రాణప్రియా' యని ఔరంగజేబు మీఁదఁ జేయి వైవగలదా? పైన హిమాలయము, ప్రక్కను సముద్రము లున్నంతకాలము భారతదేశ స్త్రీల కట్టిదుర్యోగము పట్టదు? ఇతరదేశ స్త్రీలందు మాత్రము నటీవృత్తి వివాహముతో సామాన్యముగ నంతముకాకుండ సాగుచున్నదా? అందుచే సంసారిణుల కది యనర్హమని ప్రపంచ మంతయు నంగీకరించిన విషయము లాగునఁ గనిపించుచున్నది.

ఇంక మిగిలినవారు వేశ్యలు. అమ్మా! వీరికి స్త్రీపాత్రము లీయవలసిదని నీయభిప్రా యమై యుండవచ్చును; ఇది సమంజస మగునో కాదో చూతము. ఇప్పడు వేశ్యలలో గొప్పసంస్కరణ మారంభమైనది. దైవ కటాక్షమువలన నిది దేశమంతట వ్యాపించును. అత్యంతము న్యాయమైన యీ సంస్కరణమునకు సంపూర్ణ విజయము సిద్దింపవలయును నని మనుష్యమాత్రుండెల్ల గోరదగినది. ఇంక నొక్క పది సంవత్సరములలోఁ బెండ్లికాని వేశ్య కనబడక పోవచ్చును. అంతవఱ కిప్పడున్న వారిని నాటక రంగమునఁ బ్రవేశపెట్టి కాలక్షేప మేలచేయరా దందువా? అమ్మా! అటులే యదికూడఁ జూతము.

చెవికంటె గన్నెక్కువ జ్ఞానేంద్రియ మగుటచే, శ్రవ్యప్రబంధ పఠనమున మనము సంపాదించుకొను విజ్ఞానము కంటె దృశ్యప్రబంధ ప్రదర్శనమున సంపాదించుకొను విజ్ఞాన మెక్కువ-యెక్కువ సుసాధ్యము-యెక్కువ బలీయము-యెక్కువ శాశ్వతము.

నీతికిఁ దావై, ధర్మమునకు నిలయమై, శాంతి కాకరమై, స్వార్ధపరిత్యాగమునకు స్థానమై, దేశభక్తికిఁ దావలమై, దైవభక్తికి మూలమై, మోక్షని శ్రేణికకు మొదటిమెట్టై ప్రకాశించు పవిత్రనాటకరంగమును బ్రత్యక్షపాపవృత్తివలన జీవించు వేశ్యల సమావేశముచేఁ గలుష పఱచుట సమంజసము కాదని భావించుట న్యాయము కాదా? ఇప్ప డున్ననటుకు లందఱు యోగులు, భక్తులు, జ్ఞానులేనా యని యధిక్షేపింకుము. మంచివారున్నారు, చెడ్డవారు న్నారు. పోనీ! నీయభిప్రాయ ప్రకారము చెడ్డవారే హెచ్చుసంఖ్యవా రున్నారని యంగీకరిం తము. ఇదివఱకున్న కీడే ప్రబలమైయుండెనని నీ వొప్పకొనుచున్నప్పడు దాని కంతకంటెఁ బ్రబలమైన కీడును జేర్పం బ్రయత్నింపవచ్చునా? ఉష్ణప్రదేశమగుటచే నుప్పలే కుండ ముప్పందుము త్రాగఁగల యిట్టినటకులతో-సంభాషణములకు, సరాగములకు, సాహచర్యములకు, సమాలింగనములకు- బ్రత్యక్షవేశ్యలనే యంటఁగట్టియెడలఁ గొంపలు నస్టేట వేతో కట్టుకొననక్కఱలేదు. ఇంక నటులలోఁ బరస్పరము కొట్లాటలు, గ్రుద్దులాటలు జరుగుట కేమైన సందేహమా? వారకాంతలను స్త్రీపాత్రములుగఁ జేసికొన్న యొకటి రెండు నాటక సంఘములనే నెఱుఁగుదును. ఆసంఘములు సంవత్సరము జరుగకుండనే యంతరించినవి. ఆ యొక్క సంవత్సరములో జరిగిన హంగామా యింత యంతకాదు -తాతలనాఁటి యీనాముల తనఖాలు, వేశ్యకాంతల బంగారువస్తువుల చౌర్యములు, న్యాయ సభలలో నభియోగములు, బ్రాందిబుడ్డతో నొకరినొకరు కొట్టుకొనుట, ప్రేక్షకులు కొందఱు నాటకరంగమున బలాత్కారమునఁ బ్రవేశించుటలు, రక్షకభటులు నిరోధములు, తెరల యేలములు, పాకకు నిప్పంటించుటలు, సివిల్ ఖైదులు- సుఖ వ్యాధులు.

అమ్మా! క్రొత్తసంస్కరణ మేమియు వలదు. ఏదోశాంతియుక్తముగా జరుగుచున్నదా నిని జరుగనిమ్ము, బాగు చేయదలంచి మఱింత పాడుచేయుట ధర్మముగాదు. స్త్రీపాత్రధారులకు మగతనము మట్టిలోఁ గలిసినదేకాని యిసుమంతయైన స్త్రీత్వము రాలేదని యట్టె పట్టు పట్టకుము. ముంగురులు కత్తిరించుకొని యిజారు తొడికికొని సైకిలెక్కి నందువలన మీ కెంతమగతనము వచ్చినదో యామాత్రపు స్త్రీత్వ మాతనికి రాకపోలేదమ్మా! ఇప్పటి నటులు బాగుగనే యభినయించు చున్నారు. కొంద ఱుత్తమస్థాన మాక్రమింప నున్నారు. నాట్యకళాభివృద్ది కెందఱో పాటు పడు చున్నారు. బుద్దిమంతులైన విమర్శకు లాకళపై గ్రంథముల వ్రాయుచున్నారు. నాటక పరిషత్తు నొకదానిని స్థాపించి తత్కళాభివృద్దికి మార్గములు యోజించు చున్నారు. భరతశాస్త్రాభ్యసమునకై భరతముని బ్బంద మొకటి స్థాపింపబడినది. అమ్మా! ఏకళలోనైన నుత్తమస్థితి త్వరలో లభించునా? పాటుపడగఁ బడక లభింపక మానునా? నాట్యకళకు సుదినములు రాగలవని తోఁచుచున్నది.

అమ్మా! మఱియొకమాట. పాశ్చాత్య వనితలకుఁ గలిగినంత యభివృద్ది దశ మీ కింక రాలేదని చీటికి మాటికి విచారింపవలదు. అట్టు విచారించి వారిపద్దతులను మీ రవలంబింపఁ బ్రయత్నింప వలదు. వారి యభివృద్ధి దశతో వారేమో విసుగు జెందియున్నట్టు కొలఁదిగాఁ గనబడుచున్నదనియు, సర్వసౌఖ్యాకరమైన సమస్త గౌరవవభాజనము సర్వమధుర మైన గృహిణీత్వ పదము నపేక్షించు చున్నట్టగపడు చున్నదనియు నింకొక పదిసంవత్సరములలో వెనుకకు నడచినడచి యథాస్థానమును జేరవచ్చుననియు నొకపాశ్చాత్య గ్రంథకర్త “The Modern Girl nonsense” eyko శీర్షికతో మొన్న మొన్న వచ్చినTitbits లోదన యభిప్రాయ మును వెల్లడించినాడు. దానిని నీవు చూడవచ్చును.

అమ్మా! పురుషులు స్త్రీపాత్రముల ధరించి జాతికంత యప్రతిష్ట తెచ్చుచున్నా రన్నవిషయము జంఘాలశాస్త్రి పక్షపాతబుద్దిచేత విమర్శించుట మానినాఁడని నీ వాతని నిందించితివి. ఈ విషయమున నిన్ని చిక్కులుండుట చేతనే మానివైచి నాఁడు. కాని పక్షపాత బుద్దిచేఁ గాదని నే ననుకొందును. జంఘాలశాస్త్రిని నేను రవంత యొఱిగినవాడ నగుటచే, నాత డిప్పడు బదరీనారాయణమున నుండుటచే నాతని పక్షమున నేను నీకి ప్రత్యుత్తర మీయ వలసివచ్చినది. కాని యాతండు కొలఁది కాలములో మనవైపులకు వచ్చుననికింవదంతి యున్నది. వచ్చుటయే సిద్దించునెడలఁ దిరుగ నేదో యొక సంఘమును స్థాపించి కొంత గడబిడ చేయకమానడు. అమ్మా! సౌభాగ్యవతివై యాయుష్మతివై సంతానవతివై సుఖమున నుండుము.

(భారతినుండి పునర్ముద్రితము)