సమర్థ రామదాసు/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మూడవ ప్రకరణము

వివాహము

ఉపదేశమైనది మొదలుకొని నారాయణుడు నిరంతర ధ్యానపరుడై విరాగివలె నుండును. అతని నడతవలన నతడు లోకవాంచలమీద నాశ విడచినట్లు సంసారసంభందమైన యురులలో దగులుకొన నిష్టమిలేనట్ట్లు గనపడెను. నారాయణుడు బ్రహ్మచర్యమునందే కాలము గడపదలచెను. గాని వృద్ధురాలైన యతని తల్లి తనకుమారుశడు బ్రహ్మచారియై యుండుటకు యిష్టపడక త్వరగా వానికి వివాహముజేసి యొకయింటివానినిజేయదలచెను. ఆగ్రామ పురోహితులు కూడ వాని తల్లిమాటనే యాడి పెండ్లిచేసుకొమ్మనిరి. సాధారణముగ బురోహితులు పెండ్లియీడుగల మగపిల్లలకు ఆడపిల్లలకు బెండ్లిచేయుటయే పనిగాపెట్టుకొందురు గదా! తల్లియుబంధువులు మిత్రులు నారాయణుని గృహస్తాశ్రమమున బ్రవేశపెట్టుటకు బట్టుపట్టిరి. అతని మనస్సు రెండుతలంపుల నడుమ నియ్యాలలూగ జొచ్చెను. మాతృవాక్య పరిపాలన చేయవలెనా? తనమనోభీష్ట ప్రకారము సంసారపరిత్యాగము చేయవలెనా? యను సంశయ మతని మనస్సును బీడింప జొచ్చెను. అతనికి మాతృదేవతయన్న మిక్కిలి భక్తి. సంసారపరిత్యాగము చేయవలెనన్న మాతృభక్తి బంధము గోసివేయవలెను.అది యతని కిష్టములేదుshy amulet. ఏదిఎట్లైనను నాయణుడు వివాహవిముఖుడౌటకే నిశ్చయించు కొనెను. అది అతని జీవితములో మిక్కిలి సమస్య. అంతకంత కా సమస్య మూతిబిగిసి పోయెను. బంధుమిత్రులు పలుమారు నారాయణుని గలిసికొని వివాహమాడుమని నొక్కి చెప్ప దొడగిరి. ఈబాధపడలేక నారాయణు డొకనాడు గ్రామము వెలుపల్ నున్న యెత్తైన యొక వృక్షమెక్కి దాని కొమ్మల నడుమ గూర్చుండి తన సమీపమునకు వచ్చి వివాహము మాట యెత్తిన వారిమీద రాళ్ళు రువ్వఁ జొచ్చెను. అనేకులు నారాయణుఁడు పిచ్చివాఁడైనాఁడని తలంచి "నీకుఁ బిచ్చియెత్తిన"దని బవానిమొగముమీఁదనే యనఁ జొచ్చిరి. ఈ మాటలచెత నతఁడు విసిగిపోయి కోపోద్రేకము నఁపుకొనలేక చెట్టు క్రిందనున్న లోఁతునూతిలో దుమికెను. అది చూచినవారు నిశ్చేష్టులై వాని బంధువులు తమ్ము నిందింతు రేమో యని భయపడి గబగబ పారిపోయిరి. బాగుగ బనీఁత నేర్చిన కొందఱు నూఁతిలో ఉరికిరి. కాని యతఁడు కనుపింపఁ డాయెను. ఈఁతగాండ్రు నూఁతిలో వెదకి వెదకి వాని జాడఁ గనుగొనలేక విసిగి యతఁడు క్రోధావేశమున నూతిలో బడి చచ్చె నని నిశ్చయించి యా దుర్వార్త సోదరునకును దల్లికిని దెలియఁ జేసిరి. నారాయణునకు నేమియు భయములేదని శ్రేష్ఠుఁడు తల్లికి ధైర్యము చెప్పెను గాని పుత్రశోక జ్వరముచేతఁ గుందుచున్న తల్లిదుఃఖము నతఁడు సహింపలెకపోయెను. శ్రేష్ఠుఁడు తనకు సహజమైన మనోధైర్యముతో నూతికడకుఁ బోయి "నారాయణా! నారాయణా! నేను వచ్చినాను రా!" అని పిలిచేను. వీక్షించు వారందఱు విస్మయము నొందునట్లు నారాయణుఁడు వెంటనే నూతినుండి బయటకు వచ్చి సోదరునితోఁ బోయెను. అన్నగారి యెడల నారాయణునికి నత్యంత భక్తి గలదు. చెట్టుమీదనుండి నూతిలోఁబడినప్పుడు నారాయణుని మొగము మీఁద నొక బొప్పి కట్టెను. అది యతని జీవితాంతము వఱకు మానక యుండెను. ఈవిషయము వలన నారాయణుని వివాహ ప్రయత్నము కొన్ని నాళ్ళాఁగి పోయెను. కాని పూర్తిగ నాఁగిపోలేదు. గ్రామ పురోహితుని మాటమీఁద నారాయణుని తల్లి యతనిని వివాహమాడు మని మాతృ సహజములైన శీతలవాక్యములతో వివాహమున కతఁడొడంబడునట్లు చేయ యత్నించెను. శ్రేష్ఠుని వలె నారాయణుఁడు కూడ గృహస్థుఁడై సంసారముఁ జేయుచుండఁగాఁ జూడవలెనని యామె కెంతో యిష్టము. ఎట్టకేలకు మంచి సమయముఁజూచి యొకనాఁడు రాణూబాయి కుమారుని జేరఁబలిచి తన జన్మము వాని వివాహము వలననే సఫల మగునని, దన కున్న కోరిక యదొక్కటియె యనియు నొక్కి చెప్పి బలవంతపెట్టెను. ఎంత వేఁడినను దల్లిమాట కతఁడిదమిత్థ మని ప్రత్యుత్తర మీయలేదు. తల్లిమాట కెదురా డనని మాత్రము పలికెను. పెండ్లిపీఁటలమీఁద గొంతసేపు గూర్చుండి పెండ్లికూతునకుఁ దనకు నడుమఁ దెఱ పట్టువఱకైనను నుండు మనియామె కోరెను. ఆ మాటలు విని బంధుమిత్రులు నారాయణుఁడు కట్టకడకుఁ దల్లిమాటలకు నంగీకరించె నని సంతోషించిరి. కాని, శ్రేష్ఠుఁడు మొదటినుండియుఁ దమ్ముని తత్వ మెఱిఁగిన వాడగుచే నతని మాటలు విశ్వసింపఁ డయ్యెను. వివాహ ప్రయత్నములు విసవిస జరుగజొచ్చెను. ఎట్టకేలకు వివాహమహోత్సవదినము వచ్చెను. చుట్టములు మిత్రులు చేరిరి. నారాయణునకుఁ బెండ్లికొడుకు సింగార మంతయుఁ జేసిరి. పెండ్లికూతునకు నెదురుగాఁ బెండ్లి పీఁటలమీద నతఁడు కూర్చుండెను. వధూవరుల నడుమ బ్రాహ్మణులు తెఱ పట్టిరి. పురోహితుఁడు బిగ్గరగా మంత్రములు చదువఁ జొచ్చెను. అంతలో సావధానుఁడవై యుండుమని పురోహితులు నారాయణుని హెచ్చరించిరి. ఇంకొక గడియలో వివాహమైపోవును. పెండ్లికూఁతున కెదురుగఁ బీఁటలమీద కూర్చుందునని తల్లితోఁ జెప్పినమాటయతఁడు నిలుపుకొనెను. కాని, పెండ్లికూఁతు యొక్క దురదృష్టము చేతను మహారాష్ట్ర దేశస్థుల యొక్క యదృష్టము చేతను నతఁడు మఱియొక దారి త్రొక్కదలఁచెను. అంతట నతఁ డకస్మాత్తుగాఁ బీఁటలపై నుండి లేచి పెండ్లికూతును బ్రియబంధువులను మాతృదేవతను సోదరుని విడిచి పెండ్లిపందిరిలోనుండి యావలకుఁ బాఱిపోయెను. ఆలోక సామాన్యమైన యీయధ్బుతచరిత్రవల్లఁ బెండ్లిపందిరిలో గొప్ప గొడవ బయలుదేరెను. 'పెండ్లికొడుకు పాఱిపోయెను; పట్టుకొనుఁడు, పట్టుకొనుఁడని కేకలు వినఁబడెను. పెక్కండ్రు నారాయణుని వెంటఁ బఱుగెత్తిరి. కాని యతఁ డెవ్వరికిని జిక్కలేదు. మెఱుపుఁదీవ వలె నతఁడు క్షణములో మాయమయ్యెను. అంవేషింపఁ బోయినవా రాశాభంగ మొంది వెనుకకుఁ దిరిగి వచ్చిరి. ఈ వింతపని పెండ్లికొమారుని యింటను పెండ్లికొమార్తె యింటను విశేషదుఃఖము కలిగించెను. శ్రేష్ఠుఁడు నారాయణుని స్వభావమెఱిఁగి యుండుటచే నతనికి నిర్బంధ వివాహము చేయుట పొరపాటని చెప్పెను. ఆ కాలపు దేశాచారమునుబట్టి జరుగుచున్న నిర్వ్హంధవివాహ పద్ధతుల నతఁడు నిష్ఠురముగ ఖండించెను. ఈ విధముగ నాశాభంగ పెండ్లికూతును మఱియొకని కిచ్చి వివాహము చేసిరి. ఈ --- 1620 సం||న జరిగెను. అప్పటికి నారాయణునకు బండ్రెండు --- వయస్సు. అంత చిన్నవయస్సులో వైరాగ్యబుద్ధి కలుగుట --- కదా ! నారాయణుడు తల్లికోరినట్లు పెండ్లిపీటలపై ---. కాని పెండ్లిచేసికొనక పాఱిపోయెను. అందుచేత మాతృ --- పాలన చేసిన వాడయ్యెను. తన పట్టు నెఱవేర్చుకొన్నవా --- నారాయణు డేల వివాహము మానెను? పెండ్లి యన్న నతనికి --- యెందులకు? వివాహవిధి పరిత్యజింపవలసినంత నీచవిధియా? --- దీనిని తన వేదాంతగ్రంథములలో నెచ్చటను దూషించి ---. వివాహ మాడదలచిన వారి యెడల వాని కంత ద్వేషము --- పోవుటయే గాక, వివాహవిధిని గుఱించి యతడు ప్రసంగిం --- దాంపత్యము నుత్కృష్టము చేసికొనుటకు మార్గము లుపదేశించు --- తనమట్టుకు దాను సంసారబంధమునుండి విడివడుటయే --- గాని తదితరము గాదు. మానవలోక కల్యాణమునకు --- స్వసుఖము విడిచిపెట్టి కష్టపడుటయే ముఖ్యమని యతడు --- జెప్పెను. పరమార్థము నిమిత్తము పాటుపడిన జన్మమే --- మానవు లనేకులేదో యొకదారి త్రొక్కి వేలకొలది ప్రతిదినము --- నిష్ఫలములు చేసి చనిపోవుచున్నారు. మనముక్తి మనము --- మన ధనము మన సర్వస్వము భగవంతుని పాదముల --- మన జీవితపరమార్ధము. దాసబోధలో జెప్పిన పైమూడు --- నిరసించి జీవించినవాడు తల్లికి గర్భవేదన గలిగించినవాడు --- యగును. ఈ పై వాక్యములును మరి యుటువంటి వాక్య --- దివ్యజ్ఞాన సంపాదనెంత ముఖ్యమని నారాయణు డెంత నొక్కి --- జేయును. మానవు లందఱు సోదరులని వారి సేమము --- పాటుపడడో వాడు బ్రతికి యుండియు మృతి నొంది ---వాని జీవితము వ్యర్థమనియు నతడు బోధించెను. . --- దాసబోధలోనున్న యీ క్రింది మూడు విషయములు --- విశదపఱచుట యుక్తము.

తే. గీ. దేవదేవుడౌ శ్రీరామదేవుని కయి
      యాప్తబంధువులును బరిత్యాజ్యు లవని
      శాశ్వతసుఖంబు గోరెడి జనము లెల్ల
      ప్రబల దు:ఖకారణమైన బంధుజనము
      విడచి శ్రీరామపూజకే గడగవలయు.

తన చిన్న కుటుంబముయొక్క క్షేమమునేగాని విశ్వ మానవకుటుంబ క్షేమము నఱయువాడు స్వార్థత్యాగము తప్పక చేయవలెను. నారాయణు డొక్కడే సంసారసుఖము నపేక్షింపక యట్లు చేసినవాడు. బ్రహ్మచర్యమే యుత్తమోత్తమమని నారాయణుడు గట్టిగ నమ్మెను. అతని భవిష్యజ్జీవిత మంతయు దానిమీదనే యాధారపడెను. గృహస్థాశ్రమమన్న నతడు భయపడలేదు. నిజముగ నతడు గృహస్థుడైన పక్షమున సంసారిక యుద్ధము లతడు మిగుల శౌర్యముతోను మనోబలముతోను జేసి గెలిచి యుండును. కాని తాను తల పెట్టిన కార్యమునకు వైవాహికబంధ మెంత యాటంకమో యతడు తెలిసికొనెను.