సమర్థ రామదాసు/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము

నారాయణుడు రామదాసు డగుట.

పెండ్లిపందిరిలోనుండి నారాయణుడు తిన్నగా నూరి బయటికి బోయి యొక చెట్టు తొఱ్ఱలో మూడు దినములు దాగుకొనెను. అక్కడ నతడా మూడు దినము లన్నపానములు లేక యెవరికి గనబడక యుండెను. అక్కడనుండి యతడు కృష్ణానదిగట్టు దారిబట్టి నాసిక పంచవటికి బయనమై పోయెను. అక్కడ నతడు శ్రీరామ దేవాలయమున కరిగి యా దేవుని దర్శించి యటనుండి తకిలీ యను నొక చిన్న గ్రామమునకు బోయెను. అచ్చట నతడు ఘోరమగు తపమాచరించి బహుకష్టముల బడజొచ్చెను. అతని నిత్య జీవిత మీలాగున నుండెను. పెందలకడ నిద్రలేచి గోదావరినదికి బోయి నడుములోతు నీళ్ళలో నిలిచి స్నానము చేసి సంధ్యావందనము చేసి మంత్రములు చదివి పరమధ్యాననిష్ఠుడై యుండును. ఈవిధముగ నతడు క్రమము దప్పక ప్రతిదినము ప్రొద్దు నెత్తిమీదికి వచ్చు వఱకు జేయుచుండును. ఆ సమయమున మత్స్యములు మొదలయిన జలచరములు వానికాళ్ళు కొఱికి పుండ్లు చేయుచుండును. నిరంతరము నీటిలో నుండుటచే నడుము క్రింది భాగము తెల్లబడి యుండెను. రెండు జాముల తరువాత నతడు తన బసకు సమీపమున నున్న కొన్ని యిండ్లకు మాత్రమే పోయి మాధుకరము చేసికొని దేవునకు నైవేద్యము పెట్టి, యది దినమున కొక్కసారి మాత్రమే భుజించును. తన గుహలో గూర్చుండి భోజనానంతరమున నతడు రాత్రి ప్రొద్దుపోవువఱకు ధ్యానశ్లోకములను గట్టిగ జదువు చుండును. ఆయన పదిమందితో గలసి మెలసి యుండక సంఘ జీవితమును బరిత్యజించి యేకాంతముగ నుండుటకే యిష్టపడెను. రామదాసుడు చేసిన ఘోరతపస్సుచేత నతని శక్తి యుడిగెను. మేను శుష్కించెను. అప్పటికతడు ద్వాదశవర్షప్రాయుడు మాత్రమేయని పాఠ కమహాశయులు గ్రహింపవలయును. ఈ బాలకుని తపస్సు చూడ భాగవతములో చెప్పబడిన ధ్రువుని తపస్సు జ్ఞప్తికి వచ్చును. అట్టి మహాతపస్సు చేసినవారిలో చాలమంది జీవింపక నశింతురు. మహోత్సాహము, మనోనిశ్చయము, ధైర్యముగలవానికి నేదియు నసాధ్యము గాదు. ఈ తపస్సు వల్లను నేర్చిన మంత్రశక్తి వల్లను రామదాసుడు క్రమక్రమముగ యోగి యయ్యెను. అతని మొగమున బ్రహ్మవర్చస్సు తాండవమాడజొచ్చెను. లోపలనున్న దివ్యజ్ఞానము శరీరమంతట బ్రతిఫలింప జొచ్చెను. ఆతని కద్భుత శక్తులలవడెను. సంభాషణము - గంభీరమయ్యెను. చేత నొక దండమును చంక నొక జోలెయు మొలకొక లంగోటియు నతడు ధరించు చుండెను. అతడు రెండు గ్రంథముల రచియించెను. ఒకటి మానసిక శ్లోకములు. రెండవది దాసబోధ. అతడా గ్రంథములలో ముట్టని విషయము లేదు. ఆనాడు నేటివలె గొప్ప విద్యాభ్యాసములకు నవకాశములు లేవు. లేక పోయినను నేటికాలపు వారికి మహాశ్చర్యము గలిగించు విషయములు భావములు నాగ్రంథములలో నున్నవి. రామదాసుకడ గూడ నద్భుతశక్తులు కలవందురు గాని యా యద్భుతశక్తులను నతడెప్పుడు నుపయోగింప లేదు. ఉపయోగించుటకు నిష్టములేదు. అయినను తప్పినది కాదు. ఆతడు తకిలీ గ్రామములో నొక గుహలో దపస్సు జేయుచున్న కాలమున నచట నొక యువకుడు క్షయరోగ పీడితుడై మృతినొందెను. ఆతని భార్య సహగమనము చేయదలంచి శ్మశానమునకు బోయెను. కాడు పేర్చబడెను. అంతయు సిద్ధమయ్యెను. అప్పుడా యిల్లాలు సమీపమున నొక గుహలో మహాపురుషు డొకడు తపస్సు చేయుచున్నా డని విని యాతని దర్శనము చేయుటకై పోయి రామదాసునకు నమస్కరించెను. ఆమె నతడు దీవించి "ఎనమండుగురు బిడ్డలు నీకు గలుగుదురుగాక" యని యాశీర్వదించెను. స్వామీ! యీ జన్మముననా? మఱియొక జన్మముననా?" యని యామె యడిగెను. "మఱియొక జన్మ మేల? ఈ జన్మమునన" యని యతడు బదులు చెప్పెను. అంతకు ముందే తన భర్త కాలధర్మము నొందె నని మనవి చేసెను. భయము లే దని రామదాసు డభయ మిచ్చిలేచి శ్మశానమునకు బోయి శవమును జూచి రామ నామము స్మరించుచు ---మీద కమండలూదకము చల్లి లెమ్మని యానతిచ్చెను. చూడ---దఱు మహాశ్చర్య నిమగ్నులగునట్లు చనిపోయిన మనుష్యుడు రామదాసునకు నమస్కరించి యతడే తన్ను బ్రతికించె నని చూపి---తట రామదాసుడు మరి యుద్దరు కుమారులు కూడ వారికి--- దీవించి వెడలి పోయెను. ఆ పతివ్రత మొదటి కుమా---దాసునకు శిష్యునిగ నర్పింతు నని ప్రతిజ్ఞ చేసెను. అట్లే యా---ప్రథమపుత్రుని రామదాసునకు సమర్పించిరి. రామదాసుడు---వు" డని పేరుపెట్టెను. అతడే రామదాసుని శిష్యగణములో----. క్రమక్రమముగ నామెకు పదిమంది బిడ్డలు గలిగిరి. ఆ---కుటుంబమునకు 'దశపుత్ర' వారని యింటి పేరు గలిగెను. ఆ---ప్పటికి నా కుటుంబమున జరుగుచున్నది.


_______