సత్ప్రవర్తనము/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నవ్వలికిఁ బొండని తిట్టికొట్టి తోసివైచిరి. మణికొందఱు వారిని ద్వరితముగ గెంటుఁడని పురికొలిపిరి, అంతియకాని యిట్టి మంచితరుణమున వారలకు సాయపడుఁడని ప్రోత్సహించువాఁ డొక్కఁడైన లేకుండెను.

పాఠశాలం బ్రవేశించినతోడ నే యెల్లరు 'బాలకుని తోడి బాలురలోఁ గూరుచుండఁ జేసి వాడుక చొప్పున 'నేదో యొక పొఠము బోధించినట్లు నటించిరి. ఒక యర్ధ ఘటికలో నెల్లరకు బుష్పఫలాదు లీయఁబడియెను. పన్నీరు చల్లఁబడియెను, ఎల్లరు బాలుని దీవించిరి, ఆనాఁటికి మధుసూదనరాజు నకు మర్యాద గనఁబఱచుటకుగాఁ బాఠశాల మూయఁ బడియెను. బాలురత్యుత్సాహమునఁ గేకలు వేయుచు నిండ్లకుఁ బోయిరి.


రెండవ ప్రకరణము.


సీతారామ రాజు పండ్రెండు వత్సరముల వయస్సు 'వచ్చునపు డుత్తమకక్ష్యలోఁ జదువుచుండెను. దానిపై కక్ష్యయే యా పాఠశాలయందు హెచ్చుది. దానీ పరీక్షలో గృతార్జుఁడైనచో విద్యావంతుఁడను పేరుఁ గాంచును. ఆ పేరు గలవారలలోఁ దాను బ్రథమగణ్యుఁడు కావలయునన్న యుత్సాహ కాబోలుని మనస్సున దినదినాభివృద్ధిని గాంచు చుండెను. ఉత్సాహమే మానవునకు బలము, ఉత్సాహమే శక్తి ఉత్సాహమే సంపద. అది లేకున్న వృద్ధి నెవ్వండును గాంచఁజూలఁడు, అదృష్టమున్నఁ దనకుదానే విద్య లభించునని కొంద ఱందురు. అది మిగులం బొరపాటు. దైవ పొరుషము లనఁబడునని రెండును శక్తిమంతములే. పౌరుషమనంగా బురుష ప్రయత్నమని యర్థము దైవమనఁగా నదృష్టము. పురుష ప్రయత్నము లేక దైవము ఫలింగదు. దైవము నే నమ్మి ప్రయత్నము చేయని వాడు కాపురుషు (మూర్జుఁడు) డనంబడును. దైవము తోడ్పడక పౌరుషము ఫలింపదు.

క. విను పురుషుడు కావింసని
పనులను జైషముడి యెట్లు ఫల మొనగించున్
జనములు కార్యము నడపంగ
సనుకూలత నిచ్చుంగాక యయ్యెఫలముల్ .

తే. పౌరుషము దైవముతో డ్పాటు లేక
ఫలము పొందంగ నేరడు పార్టీ వేంద్ర,
విత్తు సహకారి కాకున్న రిత్త నేల
వంధ్యయగుగాక తా ఫలవంతముగునె??

తే.మేలు రెండు లోకంబుల మేల తెచ్చు.
గీడు చేసిన తప్పుదు కీడ యగుట
గాన పురుషవర్తనముస కానుకూల్య'
శీలమగు 'దైవమది ఫలసిద్ధిం జేయు,

క. విను పౌరుషమును దైవము
ననరెండును గార్యఫలము నందింపగనె
ట్టన కారణములు గావున
జన నాయక సదృశములు విచారింపంగస్

,

అని మహా భారతము బోధించుచున్నయది. అట్టి యుత్సాహబల మూఁతగాఁగా నావి ధ్యార్తియు యుపాధ్యాయులమన్ననలకు 'బాత్రుండై సుంతయు గౌవము లేక విద్యఁగఱచుచుండెను. ఆతనింగని మీరు ప్రవర్తనము బాగు చేసికొనుఁడని గురువులు విద్యార్థులకుఁ దెలుపుచుండిరి. ఒక్క దినమైన నా సీతారామరాజు వేళకు రాక యాలసించిన పాపమునఁ బోయినవాఁడువాడు. ఎప్పుడైన రెండు మూడు నిమేషము లాలస్యముగా నచ్చినచో నా ప్రథమోపాధ్యాయుఁడు ఘటి కాయంత్రమును సవరించును. పరికించిన దానియం దే లోపము కనఁబడుచుండును,


వేళకు వచ్చి యూరక కాలమును బుచ్చక పాఠములం జూచుకొనుటయు, నితరులు మాటలాడించిన నది యనవసర ప్రసంగమయ్యె నేని బదులిడక పుస్తకము నే చూచుచుండుటయుఁ, దన సాయమును గోరిన 'బాలురకుఁ దనకుఁ దెలిసిన 'పాఠముల సారమును దెలుపుటయు, నవ్వుచు నెల్లరతో మాటలాడుటయు, నసూయ నొందక యుండుటయు, సుసాధ్యాయులం గాంచినంతన లేచి 'వారి యనుమతిని గూరుచుండుటయుఁ, 'చారము సరిగాఁ దెలియకయున్న వినయము మీఱ నుపా ధ్యాయుల నడిగి, తెలిసికొనుటయు, వారు ముఖ్య భాగము లివి యని తెలిపిన వెంటనే వానికి గురుతులువైచి వేతొక చోట వ్రాసిని వానిని శ్రద్దగా మనస్సుస నిముడునట్లు చేసికొనుటయు, విశ్లేషించి యందఱితో మాటలాడకుండుటయు నాసీతారామరాజునకుం గల యల వాటులు. మఱియు నతఁడు దీనాంధక బధిరకుబ్జుంలుగాంచినపుడు కన్నీ కువదలిభగవంతుఁడు వీరిని గా పాడుఁగాకయని ప్రార్థించును. తసకుఁ బెద్దలిచ్చిన విత్త

మున నుచితరీతి నట్టివారికే కొంత యిచ్చును. ఇచ్చునపు డితరులకుఁ దెలియక యుండవలయునని జూతనియాశయము. ముఖ స్తుతుల కుబ్బడు. విశ్లేషించి యితరులను భూషిండు. ఆ యలవాటు మంచిది కాదని యావిద్యార్థి నిశ్చితము. ఇత రులు తనకడ "వేఱొకరిని నిందించిన దానట నుండి లేచి పోవును. అట్లు చేయ నవకాశము లేదేనీ మనస్సును "వేఱొక పనియందు నియుమించును ఇతరుల దూషించు వారు తనను గూడఁ బరోక్షమున దూషింతురనియు, నట్టి వారి పొందు మంచిది కాదనియు నతని యభిప్రాయము. ఎవ్వరికడ నేంత మూత్రమేలాగు మాటలాడవలయునో యతనికి. దెలిసినట్లితరులకుఁ దెలియదని యెల్ల వారును కొందురు.


సూర్యనారాయణ రాజు కూడ సితారామరాజు చదువు కక్ష్యయందే చదువుచుండెను. ప్రతీవత్సర మాతని కింటియొద్దం జదువు చెప్పిన యుపాధ్యాయులకు పడరాని కష్టములఁబడి యందఱి నాశ్రయించి యెట్లో పై కక్షలోని కితనిఁ జేర్చు చుండుసు, విశేష బుద్ధిమంతుఁడు, అనారోగ్యమున నీనడుమఁ జదువజాలక పోయెననియు, నీవత్సర మందరకన్న మిన్నగాఁ గృపౌర్ణుఁడగుననియు నాయుపాధ్యాయుడు చెప్పుచుండువాఁడు. ఆతని దీనాలాపములకు మనస్సులు కరఁగి యెట్లో యిత రోపాధ్యాయు లౌదల లూపువారు. అంతియెకాని సూర్య నారాయణ రాజు చదువునందు శ్రద్ధకలవాడు కాక వ్యర్ణముగా గాలమును బుచ్చుచుండెను. వేళకుఁ 'బాఠశాలకు బోవక, చెప్పెడు విషయములపై బుద్ధినిలుపక యిరు ప్రక్కల సున్న బాలకులతో గుసగుసలాడుచు వారిపొత్తములందీసియొకరికిచ్చి యాయిరువురుసు గలహింపఁ దాఁ జూచి యానం, దించుచు, వేళయెప్పుడగునాయని ఘటికాయంత మునే పలు సారులు చూచుచు నీలవేయుచు నెగురుచు దుముకుచునుండుట యాతని యలవాటులు, అంతీయ కాక పాఠశాల వదలంగానే దేహపరిశ్రమము చేయుచోటికి బోవక యందందుఁ దిరుగుచుఁ బొద్దుపోయిన పిదప నింటికిం బోవును. బీద బాలురు గొందఱు వాని తండ్రి, తమకు సొయపడుచున్నందున నెట్లో యాతని వెంటనుండి యింటికిఁ బిలుచుకొని పోవుచుండిరి.


ఉత్తమ కక్ష్యలలోనికిఁ జొచ్చిన పిదప దలిదండ్రులు మాటల గలలో నైన లెక్కింషక యిష్టమువచ్చినట్లు మెలంగ సాగెను. విద్యకన్న వ్యాయామ క్రీడలయందే యతనికి నభి రుచి హెచ్చఁజొచ్చెను. ప్రథమోపాధ్యాయుఁడు కూడఁ బలు సారులు హెచ్చరించెసు, కానియాతని గావిద్యయందు వాంఛా పరివృద్ధియే కలుగఁజోచ్చెను. పాఠశాలకుఁ బోవుటయు, పచ్చి నట్లు 'పుస్తకముసం జిహ్నము పడఁగనేఱొక తాపునకుం బోయి కాలముపుచ్చుటో లేక పడుకొని నిదురించుటో లేక యందందుఁ దిరుగుచుండుటో జరగుచుండెను. ధనవంతుని కుమాపుఁడని కొన్ని దినములు బుద్ది రాకపోవునా యని కొన్ని దినము లుపాధ్యాయులుదాసీనత వహించిరి. కాని పూట పూటకు సూర్యనారాయణ రాజు నవినీతి హెచ్చుచు నితరులం గూడ నాకర్షించు చుండుటంబట్టి పొరోపికల విడనాడిరి మధు సూదన రాజునకు నెఱింగించిరి. ఆతఁ డంతకుముందే కొడుకు దుడుకుతనములకు నేవగించుచునే యుండు వాఁడు. కావున వారితో మర్మముగా మాటలాడక బాహాటముగాఁ దన తనయుని యత్యాచారములందెలిపి భయ పెట్టుఁడని వారిని వేఁడు కొనియెను. మీరు చేయు దండనము తీక్షమైన నాతఁడు పాఱి పోవునేమో, లేక లేక కలిగిన సంతానము కాన నామనవి సంగీకరించి బుద్దివచ్చునట్లు చేయుఁడని స్వాభిప్రాయమును వెల్లడించెను. ఇంటియందును విద్యాలయందు నొక రీతిగా నాతని ప్రవృత్తి యున్నదని వారెఱింగిరి, నిర్బంధించి పాఠములు చెప్పసాగిరి. తోడి బాలురుకూడ నేపగింపసాగిరి. ఈ గురుతు లన్నియు "వారి కనురాగము మున్నున్నయట్లు లేని యాత నికీం దెలియఁ జేసెను. సూర్యనారాయణ రాజు బుద్ధిమంతుఁడు కావున సచిర కాలములోనే వాని నెల్ల గ్రహీంచెను. ప్రతి ప్రాయచేయుటట్టని యాలో చింపసాగెను.

ఆపాఠశాలయందు వ్యాయామక్రీడాసంఘ మొకడు కలదు. వానియం దుపాధ్యాయులు కొందఱు విద్యార్థులు కొందఱు నుండిరి. పద్దతుల నిట్టివని తెలుపు వారుపాధ్యాయులు. వాని నాచరింపజేయువారు, నాచరించు వారు 'బాలురు. ప్రధానో పాధ్యాయుడు సర్వాధికార సంకున్నుఁడుగాన సద్దానికిం గూడఁ బైయధికారిగా నుండెను. కాలిబంతియాట, {Foot-ball) సుఖ కందుకడ, (Tennis) విలాస కందుక క్రీడ (Badminton) లోనగు వ్యాయాము. క్రీడలందుఁ గలవు.. 'వానికిం గావలసిన పరికరములఁ దెప్పించి బాలుర కొసంగుట యుపాధ్యాయులని. వానీని జాగ్రత్తగా నునిచి యుక్త సమయములయందుకు యోగించుట బాలురపని పతి దినము సాయంకాల మొక గంట యాయాటలకు సమయము. పాఠశాలకుం జేరిన విశాల భూభాగ మద్దానికిగా నియమింపఁ బడియుండెను. దాని చుట్టును మూడుకోణములుగా నుండు నట్లు 'తాళ దుమములు . వేయఁబడియుండెను. అవి వృద్దియై పశువులుకూడఁ 'జోర రాని యట్లుండెను. అన్ని యాటలకు


నందు వేఱువేఱు భాగములు గలవు. ప్రేక్షకులకు సుచిత స్థానములు గూడఁ గలవు. వారా వేదికలపైఁ గూరుచుండి యా వినోదములం జూచుచుందురు. నెలకొక్కసారి పందెములు పెట్టి పొరాడుదురు, ఇరు దెఱులుగా నప్పుడుందురు. గెలిచిన వారలకు బహుమాసము లీఁబడు. అంచులకు వలయు ద్రవ్యము ధనవంతుల కడకరిగి సేక రించు బార ముపాధ్యాయు లదిగనే యుండెను. దానిని వ్వయించుభారము ద్యార్తులదిగా నుండెను. ఈసంఘము చక్కఁగాఁ బనిచేయుచుఁ ప్రేక్షకులకు సుల్లాసముఁ గల్గించుచు బాలుర కుత్సాహశక్తిని పెంపొం దించుచు నుండెను. కావున దానిఁ గావలసిన ధనము నెల్ల వారు నడిగిన తోడనే యిచ్చుచుండిరి. బాలురు ముచ్చట మీఱ నందుఁ "జృరి యుక్తప్రవర్లనము నేర్చుకొనుచుండిరి,


వ్యాయామ క్రీడలు దేహబలము నొసంగ నేర్పఱువుల బడినవని కొందఱూహింతురు. కేవల మా కార్వమున లేవని నిపుణుల మతము. ఆయాటలయందుఁ దగిలియుండుట వలన నైకమత్యము పెంపొందును. ఒకప్పు డోడుచు నొకప్పుడు గెల్చుచు నుందురుగానఁ బరస్పర విజిగీష యంతరించును, వేడుకకై యాడుచున్న వారమను భావము కలుగుటయే యద్దానికి గారణము, మయు సంఘముగాఁ జేరినఁ గాని గొప్ప కార్వ మును దేనిని సాధింపఁజాలమును సువారస్వభావము కలుగును.. అదిక లిగిన వారు సాధారణముగా నితరులయం దసూయ గల వారుగానుండరు. ఆంతీయగాక యొరులకు సాయము చేయుట. మానవుని ధరమను సద్దుణము పట్టుబడును. చిల్లరగుణము లెన్ని యేని నశించును. దేశ సేవయు రాజభ క్తియు రెండును త్తమగుణములను నిశ్చయము కలుగును. ఒరులు శ్రమం. పడుచున్న చానూరక యుండరాదని తోచును. ఒక్కరికి గల్గినది 'మేలు కాదనియు, పిల్లలకు గలగినదే 'మేలనియం భావించు శక్తి కలుగును. అది కొంత కాలము ఎల్లరియందు సోదరత్వమును గల్గించును. ఈ గుణములు కట్టుబటిన యెడల నితర సద్గుణము లేన్నియో తమంతన యూవాలు నాశ్రయించును. వీని కన్నీటీకిని సత్ప్రవర్తనమును "పేరొక్కఁడు ప్రసిద్ధంబయ్యెనని యెరులుగవలయు. \

ఇట్టియూహలతో నేఱపటుచీన యావ్యాయామ క్రీడా సంఘమునందు సూర్య నారాయణరాజు కూడ నొక సభ్యుండుగా నంగీకరింప బడియెను, ధనవంతుని కొడుకనియు, నందుఁ జేరినయెడల దురభ్యాసములు పోవుననియు నూహించియే యందాతనిం జేర్చుకొనిరి. కొలదినెలలు గడచుదనుక నతండే వారికిఁ జిక్కులు కలిగించక తనపనిని దాఁజూచుకొనుచుండెను. రాను రాను దన పైనుపాధ్యాయులు సచ్చావముగల వారు కాక తన వస్పత్తిని మార్చుకొనవలయునని యెపుడు శాసింప నారం భించిరో, దానిచే తోడి బాలురు తనయందు మున్నున్న యాదరమును విడనాడిరో యది మొదలుకొని యందంతగికలహములు కలుగఁ జేయ నుంకించెను. ఏయుపొయముచే నది శక్యమాయని యాలోచించ సాగెను కొలఁది దినముల కొక యూహతోచి యది మదికి సరిపడినందున నద్దాని నాశ్రయించి యుపొధ్యాయులకు బాలురకుగల చక్కని సంబంధమును బాఱదోల బద్దకంకణుండయ్యెను.

ఒక్క నాఁడోక్క యాట 'వేఱొకజట్టుతో నాడవలసి నట్లు నిర్ణయింపఁబడియెను. విద్యార్థులలో నిందఱాడవలయు సనియు "నేర్పఱుపబడియే. ఆయాటకై యువ్విళ్ళూరుచున్న నిరుపు రాదినమున నేన్ను కొనఁబడిన వారి పేరులలోఁ దగులక పోయింది. వారించుక త్వరపడు నలవాటుగలవారు. ఆవార్త సూర్యనారాయణ రాజు చెవులఁబడియెను, మంచి సమయము దొరకేనని సంతోషించి యారేయి యింటికిం బోవక "యేదో యుక కారణమున నిలిచితినని దలి దండ్రులకుఁ దెలియం జేసి తనవంటి వారిఁ గొందఱు బిబుచుకొని వారికడకేగి యేవో కొన్ని మాటలతో గాలము కొంత పుచ్చి ఫలహారములలో దెప్పించి వారును మిత్రులుఁ దానును భుజించి తాంబూలము నమలచు మూఁడవదినమున బందెపుటాటగదా, దానింజూగాడ మాబంధువులు వత్తుమని వ్రాసిన నొక్కి. ఫల్కి యందులకు వారుత్సాహమును జూగకయుండుటెఱింగి మీ పంతముల వాడుకదా చూడవలయునని యొక మాటను వదలి యద్దానికి బదులేమి వచ్చునో యని వేచియుండెను.

ఆయిరువురు మాఱుపలుకరైరి, సూర్యనారాయణరాజు పరిహాసముగాఁ గార్యము తఱి నెఱ మగంటిమిల జూపుదుము. కాని ముందు పలుక నేల యనియా మీరూరకున్న వారని నుడివెను, ఆయాటకు మాకును గాశికి “రామేశ్వరమునకు నున్నంత ధూరము కలదని విచారమును వెలిపుచ్చిరి. సందు దొరకెగదా యని యెంచి మీమాటల చ్చెరువుగా నున్నవి. "నేఁడు తెలుపకయున్న నానాడు తెలియక పోవునా? విదియనాడు కనఁబడని చంద్రుడు తదియనాఁడు తనకుదానే కనఁబడును గదా, చెప్పక మున్న మానే మిత్రులముకదా యని యడిగితీనని యేమో గొణుగుకొనుచు నూరకుండెను. 'వా రాతని మోముం గాంచి మిత్రమా! మాగ్రహచార మెల్ల యెడల న్యాపించినది, ఎవ్వరికని మా పైన గోపము కలుగుచున్నది .  మమ్ము నిరువుర నాయాటనుండి పొఱద్రోలిరి. ఆచింతతో దపించుచున్న వారము. మేమేమో" దాచిపెట్టి మాటలాడినట్లు నీ వూహించివి. ఇది మాదురద్రుష్టము కాదా యని వారు తమ యాశయముల వెల్లడించిరి.


ఆమాటలు చెవులబడిన తోడనే మండిపడుచు లేచి యేమీ! మీపేరు ఎన్నుకొన బడలేదా. చీ చీ: ఏమియాట! ఏమి పక్ష పాత్రను ? ఏల ఇట్లు జగినదో తెలిసికొన పలము. ఊర్కవిడువరాదు. నేడు గోరంతకు వచ్చినది. "రేపు కొండంతకు వచ్చును. ప్రతిక్రియ యూహింపక కున్న మించి పోవును. పిదప మనకందుఁ బ్రవేశమే పోవును. గుట్టిప్రయత్నము చేయవలయు. మీరూరకుండుడు.. నేను నిలువంబడి కార్యము నడుపుదును. మిత్రులందరని ప్రోత్సాహించి యక్కార్యమును నిర్వహించి యా సభ్యులు 'మొగములకు మసిపూయించెద. చూ ముచుండుడు, అని వారి మోముల చిహ్నము లెట్లుండునో యని గుఱితించి తనమాటలయందాదరము చూపిన జాడలాని యప్పుడే యచ్చటు వాసిపోయెను. వారు సీతఁడు ధనవంతుని కోడుకనియు పలువురు వంచకుల సూక్తి యుండు వాఁడనియు నమ్మి కార్య మెట్టులైన దమ కనుకూలముగా నెఱవేఱునని సమ్మిరి.


సూర్యనారాయణనవర్మయు నెందో యారాత్రి, శేషము గడపి మఱు దినమున పాఠశాలలోని విద్యార్థులను ఫలాహారము లిప్పించియు నిందుక ధనమిచ్చియుం దనకు ననుకూలురుగాఁ జేసికొని వారలతో నీయుదంతము తెల్పివారు తనయట్టి యభిప్రాయము గలవారు కాగా నపుడే వారందఱ నొక కట్టుగా నుండఁ జేసీ వ్యాయామ క్రీడా కల్పిత స్థలమునకుఁ. బోకుండఁ జేసెను వీరింజూచి మరికొందరు , వారింజూచి మణికొందఱు నీతిగాఁ బెక్కండ్రుపోవమానిరి. అంతీయ కాక "కేకలు వేయుచు “సిగ్గు, సిగ్లు, సిగ్గు" అనుచుఁ దమయిండ్లకుఁ బోయిరి ఉపాధ్యాయులకిదేల కలిగెనో తెలియదు. అందున్న వారినడిగిన వారును జెప్పరు. యేమో తెలియదనిరి. ఆనాఁడు వ్యాయామ కల్పితస్థల మేయల్ప సంఖ్యాకుల చేతనో, సువృతమయ్యెను, దానింగాంచి యందఱిది యేమి విపరీతమాయని వెచ్చమార్చిరి. తదధికారి విచారంచెసు. కాని నిజమిది యని తేల లేదు.

ఆరాత్రి, ప్రధానోపాధ్యాయుఁ డందలి సభ్యలుగొందబింబిలువనంపి బాలకులలో గొందరసంత్సవులై యున్నవార. కతమేముని ప్రశ్నించెను. వారు గుటకలు మింగుచు నాడు విద్యార్థులనిరువుర రేపటి ఖేలనమునకు నెన్నీ కొనరైరి, వారా యాటలో మేటులు, 'నారియాటంజూడఁ గొందఱు రాఁదలంచి యుండిరి, వారు హతాశులైరి. వారిమిత్రులందఱు నొకజట్టుగాఁ గూడి వ్యాయామ క్రీడాపరత్వమును విడనాడవలయునని తీర్మానించుకొన్న యట్లు పొడకట్టడిని ఈపద్దతి మసపాఠశాల యందీపఱికెన్నఁడును "లేదు. అని ఊరూరకుండిరి, వారి వాగ్దోరణింబట్టి యందుఁ గొంద ఱాసంఘమునఁ జేరినట్లు కనుంగొని వారికి నించుక తద్విషయమున నభిమానమున్న చంద మూహించి యేమియు దండింపక వారిని బోవంబనిచి యుపా ధ్యాయుల నందు సభ్యులుగా నున్నవారలం బిలువనంపి వారితో రహస్యాలోచనము చేయసాగెను

ఉపాధ్యాయులకు సాధారణముగా లోక జ్ఞానము తక్కున. నిరంతరము బాలకులతో వారికి ప్రసంగము. వారల, బుద్ధిమంతులఁ జేయుటయందే వారిచిత్తములు బద్ధకంకములై యుండును కావున వారు లోకప్రవృత్తమును ప్రధానముగాఁ బాటింటింపరు. విద్యార్థులను విద్యావంతులుగా చేయుట యంచే మనోవృత్తులల నెలకొనియందరు దానింగాంచి లోక జ్ఞాన ముపాధ్యాయులకు దక్కుననియున భావింతురు. అవియొక స్తుతియనియేతలంకవలయు నిరంతర మేకాగ్ర మనస్కులై బాలికుల విద్యాంసుల జేయ: బాటుపడుటకంటేనుత్తమ 'కార్య మేది కలదు. చానీని మించిన లోకజ్ఞాన మేది యుండును? ఇతరులను కుంచించు నృత్తముషాధ్యయులకు లేని తన లోక జనరహితు లందురే నయ్యదివారి కలంకారమే యగును. అట్టి యలంకారమే వారికి గాన తయశము నొసంగు: గౌక, సర్వవిషయముల నెంగి యుండ్సు మంచిదియే కాని వీరికట్టి యవకాశ ముద్దాని కోఱకు: గృషి చేయ లభింపరు, కావున లోక వృత్తాంతజ్ఞాన శూన్యులే యగుదురు గాక , మూడులు బండితులను గాఁ జేయుచు వాని లోకజ్ఞాన సంపన్నులను జేయుచుముందురు గాక.

వ్యాయామ క్రీ.డాసంఘసభ్యులగు నుపాధ్యాయులందఱతో బ్రధానోపాధ్యాయుఁ డాలోచించు చుండఁగాఁ గొందఱందుఁ బొరుషమును జూపగవలయునని. కొందఱు సామముకూడ దాని కనుగుణముగా నుండవలయుననిరి. సామమున మనము వారితో ముచ్చటించిన మన గౌరవము చెడునని మఱికొందబుసన్యసించిరి, వీరికితనమున వారిట్లు కట్టుకట్టిన నిది యితర ఖాలుకకుంగూడ నుదాహరణమై తుదకు మనయధి భారమునకే మోసమువచ్చునని యింకను గొందఱు పట్టుపట్టి వాదించిరి, తుదకు దండోపాయమున వారి లోఁబఱచుకొసం బ్రయత్నించుట లగ్గనుటయే సిద్ధాంతమయ్యెను. మఱుదినమ వ్యారీని బాఠశాలనుండి తఱిమి వేయవలయు నసుమాట యంగీ కృతమయ్యెను. సభ చాలించి యెవరీండ్లకు వారు పోయిరి.

మఱుదిన ముదయముననే పాఠశాల వాకిటయందే యొక ప్రకటన పత్రము దృగ్గోచర మయ్యెను. "బాలకుల శాంతిం జెఱుపబూనిన కొందరు బాలురను పాఠశాలనుండి త్రోసి వేయుచున్నాము. ప్రవృత్తి మంచిది గాకుండుటయే వారి కీయిడుము రాగారణము.. వారివలన నెల్లరకు దురుద్దేశములు పట్టువుడునని తోచినందున నీ కార్యము చేయవలసి వచ్చెను, వారును దమయపరాధముల నివేదించి క్షమింపుఁడని వేడిన నాలోచింపఁ బడును, పాఠశాలాధికారి,” అని యందుండెసు. ఒక్కరొక్కరుగా పచ్చి బాలకు లాప్రకటనము గాంచి భయంపడు వారును, కానీ చూతమును వారును, మఱింత పట్టుదలఁ జూపవలసినదే కాని లొంగరాదను వారును, ధమ తప్పులు నుపాధ్యాయు లొక్పుకొన్న గానీ మరల నీ పాఠశాల మొగముకూడఁ జూడరాదనువారును, అందరెట్లో మనచుట్టే పవర్తింతమను వారునుగా బాలురెల్లరు వచ్చుచుంబోవుచు గుస గుసలాడుచు నొకరి నొకరు హెచ్చరించుచు నాగ్రహించుచు 'బండ్లు గీటుచు మోము చిట్లించుచు నుపన్యసించుచు నీదినము 'పొఠశాల , కేవ్వరు పోవరాదని ప్రమాణములు చేయించు కొనుచుఁ గలవరపడుచుండిరి. గ్రామమునఁగల 'పెద్ద లెల్ల నేమియు ననజాలక కొందరుపాధ్యాయులను మణికొందఱు 'బాలుకను నిందించుచుండిరి. ఆదినము వేళ కొక్కడైనా 'రాగూడదని బాలురు చాటుచుండిరి. గ్రామమంతయు నీవారలతో నిండియుండెను. సితారామరాజువార్ల నాలించి యిట్టు లాలోచించెను. ఉపాధ్యాయులు పట్టుదల వహించిన, బాలకులు మొండికట్టు పట్టియున్నారు. ఇరువురు బాలుక నెన్నుకున్నంత మాత్రమున గొప్పలోపమేవియు లేదు. ఈ యాటలు నెలకొక్క పర్యాయము సాగునవియే. వారంత ముచ్చట పడినపు డుపా ధ్యాయులాలోచించి వారిని పిలుంబరచి మంచిమాటల నూఱడించిన వాకంగీకరించి యుందుఱు. నాయెఱిగినంత వరకాయిరువురు బాలకులు మంచి ప్రవర్తనము కలవారే. వారిచిత్తముల కంత యాగ్రహము కలగలజేసినవారెవరో తెలియరాదు. తొలుతనే వారి నీపర్యాయము విూరు మానుఁడు, ఇంకొక తడవ మిమ్ము తక్పక యెన్నుకుందుమని వారికిం దెలిపియున్న బాగుండేడిది. బాలకులెవ్వరు నాపనికి గడంగరైరి. ఇట్టి కలహము లూరకే కలగవు. సూత్రధారుల డొకందుండినంగాని యీ నాటక మింతగా సాగదు. పాఠశాల యందుఁ బఠించు బాలురలోఁ గలహ్మాస్పియులు నామదికిందట్ట లేదు. సూర్యనారాయణరాజొడొక్కఁడె యట్టివాడని తలంచి యుంటిని, అతఁడు నీనడుమ దుర్వినీతుఁడై యిచ్చకు వచ్చినట్లు మెలంగు చున్న వాఁడని మిత్రులు సెక్కండ్రు, నాతోడ మందలించిరి, మనకేల యాతనిజోలి యని వారికి బదులు చెప్పితిని. ద్రవ్యము, వయస్సు, వీనికిందోడుగా నవివేకత్వము, కొలఁదిగనొ గొప్పగనొ ప్రభుత్వమునను నీనాల్గింటిలో నొక్క డొక్కఁడే యనర్దమును బుట్టించు ననఁగా నీనాలుగు కూడియున్న జెప్పవలసిన దేమని పెద్దల పలుకఁగా వినియున్నాడను. సూర్యనారాయణవర్మ తండ్రి, ధనవంతుడు. ఇతడాతని "కేక పుత్తుఁడు. ఇతనికి వయస్సంకురించినది కోలఁది గ్రామము లున్నందున 'నేమాత్రమో యధికార మున్నదనవచ్చును. ధనము వలసినయంత కలదు. అవివేకిత్య సంపదయుఁ గలదనుట కేశంకయు లేదు. కావున నీతఁడు చేయరాని దుష్కార్యము లుండవు. ఈనడుము నీతఁ డింటికింగూడ కాక కుముదవల్లిలోనే యున్నట్లు విన్నాఁడను, . ఈవిషయమునఁ గృషి చేయుట కొఱకే కాబోలు ఇప్పటి దుష్టబాలురందరూ నతని మిత్ర, మండలమునఁ జేరినవారే ఈతనివలని ధనము సంపాదించువారలే ఈకుతంత్ర మెల్ల నీతనిదే యని యిపుడు దృఢపడు చున్నది. ఇంతటితోఁ దీఱదు. ఎన్నియో యనర్ణములను గల్పించును. ఇట్టి దురభ్యాసములు పట్టుపడరాదు. పట్టుపడునేని వదలవనుట సత్యము, వీని నెల్ల దొలఁగించు సుపాయము "నేనేమైనఁ జేచుఁగలనా? కుయత్నము చేసినఁగాని యది తేలదు. ప్రయత్నము ఫలింపకున్న నొక చింత మనస్సునఁ 'బాదు కొనును. అది నిరంతరము నన్ను బాధించుచునే యుండును. అట్టులని యూరక యుండరాదు, ఊరకయుండుట కాపురుష లక్షణము.

శా.ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాసంత్రుప్తులై
మారంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్నునిహన్య మానులగుచున్ దృత్యున్నతో త్సాహులై
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్నానీధుల్ గావునన్ .

అన్న సూక్తి సర్వసమ్మతమే యగుఁగదా. కావున నా యోపి నంత నట్టు ప్రయత్నించి చూచెదను.

కృతనిశ్చయండై యప్పుడ జనకునానతిం గైకొని కుముదవల్లికిం బోయి యందుఁ దనమాట నాదరించు బాలుర గలిసికొని యథోచితముగ మాటలాడి వారి మనస్థితిఁ దెలిసి కొని దుప్పటివారికోపము కల్పితకుని యెఱింగి మెలమెల్లన గురుశిష్యన్యాయము బోధపడునట్లు మాటలాడఁ బూనెను, మిత్రములారా ! పెద్దలమాటల నాలకించి నాని యనుమతి చొప్పున మెలఁగుట బాలుర ధర్మము. దాన నెంతయో మేలు చేకూరును. అనేక విషయముల ననుభవపూర్వకముగ నెఱింగినవారుపాధ్యాయులు. మనకట్టి యనుభవములు లేవు. వారికిఁ గొందఱయందుఁ బక్ష పాతము గలుగ నలసిన యక్కఱయే లేదు, మన మింత కాలము నుండి మాచుచున్నాము. ఒక్క కార్యమునఁ బెక్కండ్రు. ప్రవృత్తులైన నొక్కనికే ఫలము కలుగును. తక్కినవారు దుఃఖపడవలయునా? ఆ ఫల మాతని "కేల కల్పించితిరని యుపాధ్యాయుల నాక్షేపించవచ్చునా? ఇం దేదియు యుక్తము కాదు. ఇప్పటిస్థితి యట్టి దేకచా. ఈ స్వల్ప విషయమున కిట్టి దుష్ప్రయత్నము చేయఁదగునా యోజింపుఁడు. తుదకు శాంతికి లోపమే కాని గాదగిన ఫలమేమియు లేదు, ఆయిరువుర విషయమై యుపాధ్యాయులకుఁ బక్షపాత మున్నదని యెట్లు చెప్పవచ్చును? ఎన్ను కొను వారు విద్యార్థులే కదా? ఉపాధ్యాయులు పురికొలుప వారిని దోసి వేసిననుట వ్యర్థాలాపము. ఆపుడు విద్యార్థుల బుద్దు లేమాయె! మీరునీవిషయమై యించుక మనశ్శాంతిగలిగి యూహింపుఁడు. ఇట్టి కట్టుపాటు మంచిదా కాదా యనియు నాలోచింపుఁడు. లోకులు మనలఁ జూచి యేవగింతుకు తల్లిదండులు చింతింతురు. బేల తనమున మనమిట్టి జోలికింబోయితిమని యెల్లరు పల్కుదురు. లోకాపవాదము నకు భయంపడవలదా ! "లోకాపవాదాద్భయ” మ్మన వినమే. సత్కీర్తిని సంపాదింపంగోరికదా మన పూర్వులు సర్వస్వము వదలుకొనిరి. మనము నిన్న గాక మొన్న నేకదా యట్టి పాఠములఁ జదివితమి. ఇంతలో మఱచితిరా? మీరును సావధానముగా యోజింపుడని చక్కగా నుపన్యసించెను.తమమిత్రుని వాఖ్యముల వారాలకించు కొలదిని వారికం బట్టుపడియున్న ముచ్చకము పట్టుదలయుఁ దగ్గఁ జొచ్చెడు. సితా రామరామవర్మ యుపన్యాసము మానిన కొలది నిముసములకే వారిమోములు కలంక దేఱినట్లయ్యెను. వారెల్ల నొక్క మాటగా నాపట్టుదలను మానితమనిరి. నీవంటి మిత్రుడు మాకు వేఱొక్కడు దొరకునే యనిరి. అందొక రిద్దరు 'మేమిపుడ పోయి తొలుత విషాదము నొందిన విద్యార్థులకు దెలుపుదుమనియు వారిని బ్రసస్ను లగునట్టు లొనరించి కాని రామనియు శపథము చేసిరి, మీ కార్యము చేయుఁడని వర్మ మఱింత గట్టిగాఁ జెప్పెను. వారుసు బద్ధకంకణులై బయలువెడలిరి.


'కాలము భగవత్స్వరూపము దానియుదంతము నెఱింగిన వారు లోకముల నగుదుగ నుందురు. భగవతత్తం మేఱింగిన వారు కాని కాలతత్వ మెఱుంగఁజాలరు. దానియందిట్టిమార్పు లిప్పుడు కలుగునని యెవ్వరును జెప్పఁజాలరు. 'కాలమే సర్వ "కార్యములకు నాదారము. అట్టి కాలమును గ్రమము తప్పక యారాధించువార లఖండ లక్ష్మీధురంధరులగుదురు. కాలము 'నారాధించుటనఁగాఁ బూవులతోఁ బూజించుట యని కాదు. చేయఁదగుపని సొలసింపక చేయుట యని యర్దము, ఏకాలమున "నేపని చేయఁదగునో యద్దాని నాకాలమునకు శ్రద్ధకలిగి చేయువా "రెవ్వరో వారలే యఖండ లక్ష్మీని 'బడసి సుఖంప " గలరని సారము. కొందఱు వేళకు సరిగాఁ జేయఁదగిన దానిని జేయక యెప్పుడో యొకప్పుడద్దానం జేయుదురు. వారికడ లక్ష్మీ నిలుపదు. మఱికొంద ఱాచార వంతులమని చెప్పుకొనుదురు. వారు దరిద్రులుగనే యుందురు, కారణ మేవనంగా 'వారు ప్రాయశః సశాలమున నాయా కార్యములను జేయరు. ఇట్టి యాచారనంతులను లక్ష్మి యాశ్రయింపక యాచార విహీనుల నా శ్రయించునని పెక్కండ్రా క్షేపింతురు. కాని వారి కద్దానికింగల హేతువిట్టిదని తెలియ లేదనవచ్చును ఆచారము, ' దానము లోసగునవి సత్కార్యములే. అవి భగవంతునకు నిఫ్టములే ఐన నట్టి వారిని వదలి లక్ష్మి, యితరుల నాశ్రయించుటేల యని యడుగుదు రేని యితరులని మీరనువారు కాలము నారాధించు వారు. కాలము నించుకంతయు వృథ చేయక కార్యములను జరుపువారు. కాలము భగవత్స్వరూపమే కాన వారు భగవంతునే యాధించువారలగుట మహాలక్ష్మీ వారియెడల బ్రసన్నులగుకు యొక వింత గాదు. ఆంగ్ల దేశీయులు సంఖ్యా ద్యనుష్టానముల జరుపువారు గాకున్నను కాలమునే ప్రధానముగా భావించు వారు, కాలము మన్నించుటయే భగవంతు నారాధించుటయని యర్థము. కావున భగవంతునిఁ పయి భక్తిగలవారల యెడ మహాలక్ష్మి యనుగ్రహము కలదిగ నుండుట న్యాయమే కదా. అట్టులగుటం జేసి యాంగ్ల దేశీయులు సకల భూభారవహనక్షము లైరి. అదియెఱుంగక కొందఱాక్షేపింతురుగాని వారొనరించు సత్కార్యముల నెఱుంగరు. ఇదియే 'కాలారాధన పద్దతీ,


ఆవిద్యార్థులు సీతారామవర్మ కడ మాటయిచ్చినట్లే పోయి ఖిన్నులై యున్న విద్యార్థులకడకుం బోయిరి. వారు. యథావూర్వముగాఁ జదువుకొనుచుండిరి. వీరింజూడఁగనే యాదరించిరి. నవ్వుచు నేమాటలాడిరి. వీరందుల కచ్చెరువు పడి యిదేమో విచిత్రముగనున్న దేయనిరి. మీ భేదమును దెలియఁ గోరి వచ్చితిమనిరి. మాకు విన్న దనమేమి కలదు? అని వారు ప్రశ్నించిరి. పరస్పర మించుకతడ వీసంభాషణము సాగించిరి. రాయబారుల కిది నడుమ నెవరో కల్పించినదే కాని వాస్తవముగ 'నేమియు నిట లేదని తెలిసెను. మర్మము లేక తముపచ్చినపని వారికెఱింగింప వారు పక్కున నవ్విరి. ఈ చిక్కులు మావలనఁ గలిగినవి కావనిరి, మాకప్పుడు విచారమే లేదనిరి. మమ్మెన్ని కొనక పోయినపుడించుక మనః బేదము కలిగెను, ఉత్తరక్షణమున నడంగెను. విద్యార్తులు కట్టుగా బాఠశాల మానుట 'మేమును వినియే యూరకయున్నారము. అంతీయ కాని 'మేమందులకు గారణభూతులము కాము. అను నీమూటలు వారినోటనుండి వెడలగనే రాయబారు "లింత యో సంతోషము 'మోములఁ గలయపర్వముగా మేమరిగి సీతారామ వర్మకు దెలిపి యనంతర కార్య మొనరింతుమని వారియనుమతి నొంది వెవేగవచ్చి యయ్యుదంతమంతయుఁ దమమిత్రులకుం దెల్పిరి. ఆవార్తయమృత ధారవలె శ్రుతిపుట వేయము "కాఁగా నారినిమఱికొందఱను బిలుచుకొని పాఠశాలాధికారిడకుం బోయెను.

సహా యోపాధ్యాయులం గూడి శర్తవ్యమాలో చించుచు సతండుండెను, సీతారామవర్మ, మిత్రులం గూడి వచ్చినాడని సేవకుడు తెలుప బట్టరాని యానందమున “అబ్బాయీ! రమ్మని పిలిచెను. ఎల్లరి లోపలికిం బోయి నాకియనుమతిని గూరుచుండిరి. వీరి రాకచే సుపాధ్యాయుల చిత్తములు సుంత రంజిల్లెను. ప్రధానగురువు వర్మతో నీయాగ మనమున నీచిక్కులు తీఱునని తలంచుచున్నాడను మిగులు బుద్ధిమంతుఁడవు. నీవర్తనమే నీ పేరును బ్ర క టింప జేయు చున్నది అని పలుక వర్మయుఁ జేతులొడ్డి గురువులు శిష్యుల నిట్లుగ్గడించుట న్యాయము కాదు. అనుగ్రహమున నా శీర్వదంప పలయును. అదియే మాకు శ్రేయస్సు అనిపలికి తనప్రవృత్తి నెల్ల నెంఱింగించెను. ఆయుపాధ్యాయు లెల్ల విస్మయంపడుచు నప్పుడ పరత్రులగు రాయబారులంబంపి తొలుతటి విద్యార్డులను రావించెను వారింగూడి మఱికొందఱు వచ్చిరి, విద్యార్డులు పెక్కండ్రు పోవుచున్నారనే యని పెక్కండ్రు వారి వెంటఁబోయిరి. రెండవజాము చివర భాగమునకు మూడు వంతులు విద్యార్థుల సంఖ్య పాఠణాలయం దుండెను. సభాస్థానమున నెల్లరం గూరుచుండ నియోగించి వేదికనెక్కి మాటలాడుమని వర్మను 'బాఠశాల, ప్రధానోపాధ్యాయుడు నియోగించెను. వేదిక పైకి సీతారామరాజు రాగానే కర తాళధ్వనులు మిన్ను =ముట్టెను. అంతనతఁ డిట్లు ప్రసంగించెను.సోదరరత్న ములారా! గురువుల యానతం గొని నాలుగు మాటలు మీయెదుటఁ బల్కెదను. చక్కఁగ నాలకింపుఁడు. మన మీపవిత్ర గృహమునకు వచ్చుట విద్యావంతుల మగుదుమను సూహచేతనే కొని కాలక్షేపమునకుఁ గాదు. తల్లి దండ్రులు మనము విద్యావంతులమై యశస్సునార్జించి తమకు వార్దకమున నుపచరింతుమని యువ్విళ్లూరుచుందురు, సకల కష్టములకు లోనై మనలఁ బెంచిరి. మసము కృతజ్ఞులమై వారిఋణమునఁ గొంతయైనఁ దీర్చుకొనవలయును. అదియే మనకుఁ గర్త వ్యము, దాని నెజు వేఱునట్లు చేయకున్న మన జీవితము వ్యర్థము. ఇది పెద్దలనుండియు మీవంటి బుద్ధిమంతులగు సోదరుల నుండియు 'నేను నేర్చుకొన్న మార్గము. ప్రకృత మనుసుంచెదను. ఒక్క కార్యమునఁ బెక్కండ్రు ప్రవర్తించినచో నందు జయ మొక్క.రికే కలుగును. తక్కినవారు వాని కేల జయము కలిగెనని యసూయపడ రాదు. అట్టి దుష్కార్యమునఁ బ్రవర్తించిన లోక ప్రవృత్తియే సాగదు. ఇది యందఱకుఁ గలుగు నదియే. కావున నీ మార్గమే ప్రబలిన నొక్కరికొక్కరికి సంబంధమే లేక పోవును. అట్లు చేయక జయమందిన వారిని మనము ప్రేమించిన నింకొక్కసారి వీరినతడు ప్రేమించును. దానిచేఁ బనస్పర స్నేహము వర్ధిల్లును. స్నేహలతను అసూయా లవి త్రముచేఁ ద్రెంచివేయుఁ బూన రాదు. దాననేనాఁటికి మేలు చేకూరదు.

మన విషయమున నిట్టీ యసూయాపనర్తన మీపుడు సాగుచున్నది అని నవ్వు పుట్టించుచు: గ్రమక్రమముగా, బెద్దల యను గృహమును మనకు దూరము చేయుచున్నది. గురువుల పై దిగఁబడ నింకొక్కరికిని బురికొలుపుట నింద్యము, స్వలాభనాశనకరము కలకాల మయస్క రము. భీకరలోకోపవాద సంపొదకము. కావున మన మక్కార్యమునల అవర్తింప రాదు. ఇప్పటి యీము కార్వము నింతకంటె నొక్కింతయు విస్తరించి వచింప రాదు అట్లు చేసిన మనల మనము నిందించు కొనినట్లగును. ఈ కొలది గంటల . మన ముత్యాచారము సలువున మనస్సుల "కెక్కినది. నా హృదయ భావము నోళ్ల నుండి వెడలకముంచే మెలకువపడ వలయును. మన తెలివి తేట లిపుడే కనబడును. మీరెల్లలు నాకంటే విశేషించి బుద్ధి ముతులరు. మీకుఁ దెలుపఁదగినంత యోగ్యత నాకు లేదని

యెఱింగియు గురువుల యానతి మీరరాదని యీనాలుగు మాటలు చెప్పితిని. త్వరపడి మనము మేలుపొంచు మార్గము నాలోచింపనలయును.మీరంగీకరింతురని నమ్మి మీయసుమతి కలుగునని నాస్థానమునకుఁ బోవుచున్నాఁడను.


సీతాము రాజు వాక్యమొకొక్కటియు నొకయు మృతబిందువువలె విద్యార్థులకుఁ జెపుల సోఁకెను. అంతటం బ్రధానోపాధ్యాయుఁడు లేచి నిలుపుబడి యిట్లు బాలురకు నుపదేశించెను. .ప్రియ బాలకులారా! మనస్సులు నీవిషయము నందే నిలిచి యుండఁజేసి యాలకింపుడు. పాఠశాలయందుండు నంతదాక మాకు మీకు గురుశిష్య నాయుము కుదురుగ నుండ వలయు. దీనిందాటగనే సఒదర న్వాయము పాదుకోనవలయు, దీనిచే మీకు మిక్కిలి మేలు కలుగును. పూకు మీమేలే పరమలాభము. మాకడం జదుపుకొని బుద్ధిమంతులరై మీ ప్రవర్తించినఁ జూచి మేమానందింతుము .' ఇంత కంటే నెక్కడు లాభమును మేము కోరము, ఈలాభమును మీవలనఁ బొంద. గోరుదుము ఈమాత్రము లాభము మీరు మాకుఁ గలిగింపంగూడదా? దీనికే గురుశిష్య న్యాయమనియుం బేరు, మీరు కూడ మావలనఁ గఱిచిన విద్య పెంపున సర్వజన సమ్మత , ప్రకృతి గాంచిన నదియే లాభము. ఆలాభము మీకుఁ గల్లింప మేము కోరవలయును. ఇట్లుకోరమేని యిరువురము స్వధర్మము నిర్వహించిన వారము కాక యుందుము. అపుడు మన కీరు దెగలవారికిని సుఖము లేదు,

ఒక్క కుటుంబము నందుండు వారు నొక్కరి మాట చొప్పున ,బవర్తించినంగాని పని సాగదు. ఎల్లర వాంఛ లొక్క కార్యమున ఫలించకపోవచ్చును. దాన నాగృహాధిపతికి బక్ష పాతము కలదనవచ్చునా? ఇంటి పెత్తనముఁ బూను వాని కనేక కష్టము లుండును. ఎల్లరను సంతోషపఱు వలసిన భార మాతనిపయి నుండును. దేహమంతయుఁ గనులుగాఁ జూచి నను గొందఱకు మనస్సంతృప్తి లేకుండ సుండవచ్చును. కాని యా యజమానుని మనః క్షేమము విచారించిన 'నేమనుటకు నోరాడక యుండును. ఇది మీరెఱింగిన దేకాని కోత్తది, కాదు, మాకీపాఠశాలయే కుటుంబము. మీక్షేమమేమాక్షే మముగా భావించుచుందుము. ఐన నెల్లరకు కొక్క విషయమున సంతృప్తిని గలిగించుట సాధ్యము కానిపని. మీలోఁ గొందరితరులు ప్రోత్సహింప మూర్కత్వమును వహించిరి. ఇందులకుఁగల కారణ మిదియని యెఱుంగ నేరకయున్నాము. మేము విన్నంతలో నీషతుకూడ మాలోపము కానరాదు. ఒక్క యాటకుఁ బదునొకండుగురు బాలురుండవలయును. తక్కిసవారెల్ల మమ్మేల యెన్ని కొన లేదన్న మేమేమని బదులు చెప్పవచ్చునో మీరేయించుక యోజింపుఁడు, ఆ సంఘమునం దు'పాధ్యాయులు సంఖ్యకంటే విద్యార్థుల సంఖ్యయే యధికము. 'నెలకొక్కసారి యట్టియాట సాగుచుండును. వరుసగా నెల్లరకు వంతు వచ్చును. విద్యార్థులే వీరియాట యాడవలసినదని నిశ్చయించి నపుడుపాధ్యాయులు పక్షపాతమూ నిరన్న బదు లేమని చెప్పువచ్చును? ఈ విషయమున 'మేమును జింతింపవలసిన వార మై తిమి. స్వల్ప విషయములఁ గొండంతలు చేసి యెవ్యరో సోమరులు తెలిసిన దుర్వచనములకు లొంగి బుద్ధిబలములు బోనాడి యిట్టి కట్టడి కార్యముల నవలంబించుట లగ్గు గాదని తెల్ప 'సాహ సింపవలసివచ్చినది. నలువురు విన్న దానిని వేయిమడుంగులు చేసి చెప్పుకొందురు. అందలి సత్యాసత్యములు పామరు. లేఱుంగక వానినెల్ల సమ్ముదురు, దాన వ్యర్దముగ మనకపకీర్తి కలుగును. దీనికి మూలము మన యల్పదృష్టియే కాని 'వేఱు గాదు. కుడిచి కూరుచుండి యకవాదమును భరించుట మన గ్రహచారమే యనగలము. కావున మీరెల్లరు నాలోచించి మాలో పములున్నఁ దెలిపీ మాలోపములు దెలిసికొని వానిని దొలఁగించుకొని ప్రవర్తింపుడని మాయాశయమును దెలుపు చున్న వారము. మోమోటము మాని మీమీ హృదయ భావములఁ దెలియఁ జేయుఁడు. మాకు మీయం దించుకంతయు నాగ్రహము లేదని మాత్రము మఱి యొక్క సారి తెలియఁ జేయుచున్నాము.

అని ప్రధానోపాధ్యాయులుప న్యసించి తమ పీఠమునం కూరుచుండఁగా నెల్లరు నిశ్శబ్దముగా ముహూర్తకాలముండిరి. ఆవల గుసగుస లారంభమయ్యెను. కొలఁది నిమేషముల గయ్యది విచారముగా మా ఱెను, తుదకశ్రుబిందు పతనముగా నయ్యవి చూపట్టెను. ఒక్క విద్యార్థి లేచి డగ్గుత్తికతో మహా శయులారా! యిం డెవరెవలనను దోషము కానరాదు. వ్వర్ల ముగఁ గుత్సితుల మాటలు వినినందున నీయ్యనివార్యాల యశము ప్రాప్తిం చెను. సూర్యనారాయణ రాజు పన్నిన పన్ను గడయే యిది. మేమెల్లరము దానికి దాసులమైతిమి. దీని నాలోచింపఁగా బురుష ప్రయత్నమునకంటే దైవము మహాత్తరమని స్పష్టమయ్యెడిని, జరగినదానిని మరల స్మరింపక యథాపూర్వకముగా బవర్తించుట యిపుడు చేయఁదగినపని.. నేడు విడుమర యనుకొందము మామానసములు పావనము లయ్యెను. కర్తవ్య మెట్లో గురువు లే యుపదేశింప సర్హులు. అనంగనే కరతాళధ్వనులు మిన్ను ముట్టెను. రవంత సే పెవ్వరిమాటలును జొరఁ బాఱఁ జాలపయ్యెను. అంత నుపాధ్యాయ ప్రవరుఁడు లేచి యిట్లు చెప్పెను. ప్రీయ బాలకు లారా! మాయాశయములఁగల తత్త్వము తేటపడియెను. మేమెల్ల నొక్క మాటగా మిము వంచింతుమని మీరును మీరెల్లం బట్టుదలతో మము వంచింతురని 'మేమును బొర పడితిమి, దీన నింతపుట్టే, నలువుర నోళ్లలో మన పేరులు నానుట 'యే ఫలముగా నిక్కార్యము 'చెల్లె. ఈశ్వరానుగ్రహమున నింతటి నైస 'మేలుకొనఁగల్గితిమి. ఈ దుష్కార్యమునకు సూర్య నా రాయణవర్మ ప్రథానుడని స్పష్టమయ్యెను. అతని దుర్బో ధన యింతపని సాగించెనని మీమాటలం బట్టియే యిపుడు తెలిసెను. ఇందెవ్వరి యప రాధ మిసుమంతయుఁ గానరాదు. జరిగిన దాని యిపుడు విచారించి లాభము లేదు. మీరు 'మేమును దీని మఱచిపోవుటయే యిప్పటిపని, రేపు యథా పూర్వముగాఁ 'బాఠశాల పనిచేయును, సకాలమున మీరెల్ల . నిందుఁ గూడఁదగు. ఇకముందిట్టి యిక్కట్టులు గలుగక యుండఁ గట్టుబాటు లొనరించుట న్యాయము. అందుకు క్రీడా సంఘమునం దుపాధ్యాయు లిరువురు విద్యార్థులు పదునాలు గురు సభ్యులుగా నుండవలయు, 'నేనును మీకు సాయపడు చుందును. ఏమాటకుఁ గాని ప్రతినిధుల నెన్ను కొనుట విద్యార్థి సభ్యుల పనియే. ఉపాధ్యాయసభ్యులు వారికి సాయపడుచు గలహములు రాకయుండఁ జూచుచుందురు. ఈ పద్దతి చే నిట్టి యిక్కట్టులు 'రాకయుండఁ గలవని నమ్ముచున్నాఁడను. భగవంతుని సాయము విశ్లేషించి యిక్కార్యమునఁ గలుగుఁ గాక అని పలుకంగా నెల్లరు సమ్మతించిరి. ఏ సభ ముగింప బడంగా నెల్లను తమతము యిరవుల కరిగిరి.

మూడవ ప్రకరణము.

కుముదవల్లికి దూర్పు భాగమున రెండు క్రోశముల యంతదవ్వున నొకయడవి గలదు. దానిపొడవు యోజనము, "వెడల్పు గప్యూతమాత్రమునై యుండెను. అందు గ్రామములు లేవు. అడవియను పేరు దానికేం జెల్లునా యని "పెక్కండ్రు సంశయించి యెందఱునో ప్రశ్నింతురు, కాని పెదవి విజచుటయే మందులకు సమాధానము వచ్చుచుండును, అందు విశేషించి సహాకారతరువులు (తియ్య మామిడి చెట్లు, గొబ్బెన చెట్లుండును. ఎన్ని ఫలపక్షములు లోకమునఁగలవో యన్నియు సందున్న వని వారకులు సమ్మవలయును. ఒక్కొక్క తావున నెన్ని యో పేరులుగల యరటి చెట్లుండును. అందొక్క జూతిది పొట్టిగా నుండును. దాని గెలమా త్రము దానికంటే మూరెడు పొడవు మిక్కిలిగా సుండును. కావున దాని మూలమున ద్రవ్వియుందురు. 'ఆగెల యాబొరియలోనికి దిగి యుండును, ఆగెలయందు లెక్కించిన మూడువందల పండ్లుండును. వానికి వామన కేళులని పేరు. చిటికెన వేలంత పరి మాణముగలవి కొన్ని గలవు. అవి భక్షింపఁ దనివితీఱదనుట నిక్కము. వానిని గిన్ని పండ్లుదురు. ఇట్టివెన్నియో పేరులు గలవి యందుఁ బొడసూపును. విశేషించి 'పెంచి వ్రాయ నేల?