Jump to content

సత్ప్రవర్తనము/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

గాక అని పలుకంగా నెల్లరు సమ్మతించిరి. ఏ సభ ముగింప బడంగా నెల్లను తమతము యిరవుల కరిగిరి.

మూడవ ప్రకరణము.

కుముదవల్లికి దూర్పు భాగమున రెండు క్రోశముల యంతదవ్వున నొకయడవి గలదు. దానిపొడవు యోజనము, "వెడల్పు గప్యూతమాత్రమునై యుండెను. అందు గ్రామములు లేవు. అడవియను పేరు దానికేం జెల్లునా యని "పెక్కండ్రు సంశయించి యెందఱునో ప్రశ్నింతురు, కాని పెదవి విజచుటయే మందులకు సమాధానము వచ్చుచుండును, అందు విశేషించి సహాకారతరువులు (తియ్య మామిడి చెట్లు, గొబ్బెన చెట్లుండును. ఎన్ని ఫలపక్షములు లోకమునఁగలవో యన్నియు సందున్న వని వారకులు సమ్మవలయును. ఒక్కొక్క తావున నెన్ని యో పేరులుగల యరటి చెట్లుండును. అందొక్క జూతిది పొట్టిగా నుండును. దాని గెలమా త్రము దానికంటే మూరెడు పొడవు మిక్కిలిగా సుండును. కావున దాని మూలమున ద్రవ్వియుందురు. 'ఆగెల యాబొరియలోనికి దిగి యుండును, ఆగెలయందు లెక్కించిన మూడువందల పండ్లుండును. వానికి వామన కేళులని పేరు. చిటికెన వేలంత పరి మాణముగలవి కొన్ని గలవు. అవి భక్షింపఁ దనివితీఱదనుట నిక్కము. వానిని గిన్ని పండ్లుదురు. ఇట్టివెన్నియో పేరులు గలవి యందుఁ బొడసూపును. విశేషించి 'పెంచి వ్రాయ నేల? భూగోళమున "నేయే భాగముల నేయఫలము లుండునో అవియెల్ల నందుండుననుట వాస్తవము, పుష్పవృక్షము లట్లే యందుండును. లతాకుడుంగములు గలవు. ఛాయామహీరు హములు కూడ నందుఁ గలవు. అవి నాలుగు పక్కల విశే షించి యుండును. అందందును గానఁబడును.


ఇట్టులుండియు సయ్యది యడవియను పేరునుమా తము పోఁగొట్టుకొనఁ బ్రయత్నిం పడయ్యెను. నందనవనమనియో, ఖాండవమనియో, చైత్ర రథమనియో, మఱియు సుందరా రామమనియో పేరు పెట్టఁదగియుండెను. ఆవనముననొక యోగి యాశ్రమమును గల్పించుకొని యుండెను, దానినడుమ పార్ణశాలయుండెను. దానికి దక్షిణపుఁ బక్కన నొక జలాశయము గలదు. దానికించుక యగ్ని మూల నొకకుండిక కలదు, ఆకుండి కకు మార్కండేయ తీర్థమని పేరు. అర్ధచంద్రాకారముగా వయ్యది యమరియుండుట చేత గుండిక యనంబడియెనని కొందఱందురు. అది యగాథమను ఖ్యాతిగాంచెను. అందు జల జంతువులు విషేషించి కలవుగాని పాములు, మొసళ్లు, కర్కాటకములు మాత్రము కలికమునకుంగూడ లేవు. అదియే మార్కండేయుని యను గ్రహమని కవులు వర్ణింతురు. దూరమాలోచింప - నేదోయొక కారణము గలుగకయవి లేకుండనుండు నవశాశము లేదని పెక్కండ్రూ హింతురు. దానిజలము యమునోదకముం బోలియుండును. లోతుగా నుండుట చే నట్లగుడును గాని జలములకు రంగు లేదని పౌరాణికులు వాకొనుదురు. స్థలము ననుసరించి రంగుగలుగుననుట నిక్కువ మని యెల్లరంగీకరింతురు. తెల్లని రంగుగల భూమిని నీలవర్ణము గల నీరుండఁ గారణ మేమని మఱి కొందజు పైవారిం బ్రశ్నిం

తురు. 'భిన్న రుచిర్హి లోకం ' అనుట ప్రసిద్ధ మే కదా. ఆకుండికకు నాలుగు ప్రక్కలయందును శీతల ద్రుమములు మాత్రమే యుండెను.


వేసవి కాలములం జాచెంత గ్రామములయం దుండువారచ్చటికిం బోయి పదిదినము లుండి స్నానము మూఁడు వేళలఁ జేయుచు నావృక్షముల, కింద పంట చేసికొని భుజించుచు యోగిని దర్శించుచు పోవు నుందురు. ఆ యోగిని భగీరథ దాసని యెల్లరుం బిలుతురు. ఎవడేని తమ పేరేమని యడిగిన చిఱునవ్వునే సమాధానముగా నామముని చెప్పు చుండును. పలుసారులు ప్రశ్నించి యాతనినోటినుండి యొక మాటను బలికింప నెవ్వరును ప్రయత్నించరైరి. ఆముని మిత భాషణుఁడు, సర్వకాలము భగవద్ధ్యా సమున నిదుగ్ను డై యుండును. ఎప్పుడో యించుక మాటలాడును. ఆకొలది గడియలు సంశయముల నడుగఁదలచువారందురు కాని కాక దంతపరీక్షగా సనవసరముగాఁ బశ్నించువా రెవ్వరుందురు? ఒకప్పు డెవ్వండైనం బశ్నించునే నా యోగి యూరకుండును. ఎవ్వరు నా యోగికి ధనమిచ్చు నలవాటు గలిగించుకొన రైరి. అప్రతిగ్రహీతయని యాయనకుఁ బ్రఖ్యాతి కలదు. ఫలముల నిత్తుమన్న నన్నియు నావనమున నున్నవియే. కొందఱు దాన కర్ణులు మహాభక్తి మెజియించుచు నాలుగుపండ్లు కోసి తెచ్చి యిచ్చుచుందురు. ఆముని వాని నెవరి కే నిచ్చునుగాని తానార గింపఁడు. తానే పోయి మధ్యాహ్న మునఁ జేయఁదగు క్రియల నొనరించిన పిదకు ఫలములను గోసికొనివచ్చి భుజించుసు. ఇతరులకు శమము గలిగింపవలయునన్న యూహాయే యాయోగికి లేదని యిందువలన మనకుఁ దెలియవచ్చును. కొందఱు యోగులమనియో దాసులమనియో సన్యాసులమని యో మాంత్రికులమనియో పేరు పెట్టుకొని మఠములు కట్టింతుమని యో దేవాలయముల నుద్దరింతుమని యో వేదాంత పాఠశాల స్థాపన మొనర్తుమనియో పర దేవీ ప్రీతిగా యజ్ఞము నొనరింతుమనియో కారణమును దెల్పి ద్రవ్యయమును సేకరింతురు. వీరివలన జీవించువారు కొందఱుందురు. వీరికిని వారికి నేనో యాంతరంగి గానుబంధము లుండును. ఆ సంబంధములు పాశములవలె వీరి కర్వురకును మైత్రిని బంధించి యుంచును. వానికి లోనై పలుశ్రమములకు లోనై సేకరించిన యాధనముచే వారింబోషింతురు, దానిచే స్వార్థము నశించునని వారెఱుంగరు. పామరులు వారి వేషములం జూచీ భ్రమించి ధన మొసంగుదురు. ఇట్టి యాచారము లోకమునఁ బ్రసిద్ధమే కొని కొ త్తది కాదు. భగీరథ దాసు నివారిలోఁ జేర్పఁదగినవాడు కాడు, ప్రతిగ్రహ మేఱుంగని నియతుఁడు, అసత్యమాడని పవిత్ర, నచనుఁడు. పరోపకారమే తపఃఫలమని భావించు జ్ఞాని కావున నాతనియందెవ్వరికి గాని యీర్యలేదు, విశేషించి భక్తియుండెను. సాధారణముగాఁ బ్రతిదిన మాతని కుటీరము కడం గ్రొత్తవారగపడుదురు. మధ్యాహ్నముదనుక నా చెంత మాటలాడరాదని మెల్ల రెఱుంగుదురు. ఆపల నాయోగి సమాధి మానిరాఁగా ఫలాహారానంతరము వారిని దర్శింతురు. "రెండు మూడు గడియలా యోగి మాటలాడును. మంచి మాటలు నాలుగు తెలుపును. తమ కష్టములం దెల్సి వానిఁ దొలఁగించుకొను నుపాయమడుగ భగవంతుని సమ్ముడను మాటయే బదులు వచ్చును. ఇంకను బ్రశ్నించినఁ బెద్దలనడుగుఁ  డసును, సుజల వదలక యడిగిన మౌనము సమాధానముగా సుండును, ఇట్టి నియమము గలవాడు కావున నా యోగి వర్యుని దర్శించి సంసార సాగరము నుత్తరించు సుపాయము నడు గుదురు, వారి వారి యోగ్యతలకుందగి నట్లుపాయము తెల్పును కపట భక్తులు ప్రశ్నించినచో వారి కనుకూలముగా సమాధానము వచ్చును. కావున నింగితజ్ఞుడని యమహాత్ముని భావించుచుండిరి. మధుసూదనరాజు కుమారుని దుర్ణయము లందలపోసీ వానిని సుశీలుం గాఁ జేయుమార్గ మరయుదమని నిశ్చయించు కొని యాభగీరథ దాసుకడ కొక నాడు పోయెను. భార్యయం. గూడ నేగెను. ఉచిత కాలమున దర్శించి నమస్కరించి తదసుమతిఁ గూరుచుండెను. భార్వయు నొక పక్క కూరు చుండెను. కుశల ప్రశ్నము చేయుచు నానడుమ,

"అజాశనుృతమూత్రాణాం వరమాచ్యౌస సారి సుః,
సకృష్ణుఃఖకరా వాద్యావం తీసుస్తు పడేవటే."

అనుశ్లోకమును జదివెను. (పుట్టనివాడు, పుట్టీ చచ్చిన "వాడు, మూర్జుఁడు నను నీ మూవురిలోఁ దొలియిరువు రుత్తములు. మూడవవాడు కాఁడు. ఏలయన నేపుడో యొకసారి "మొదటి యిరువురు స్మృతికిఁ దగులుదురు మూఁడవ వాండట్లు గాక ప్రతినిముసమునందును స్మృతి కిందగులుచుండును.) అశ్లో కమును విని యించుక దేన భాషాపరిచయము కలవాఁడగుట రాజు దానియర్ల మెఱింగి మనసున వగచుచు సడుగ రాదని, యెఱింగియు “మహాత్మా! పుత్రరూప దుష్కర్మఫలము తొలంగుమార్గ ముపదేశింపుమా" యని దీనాననుండై ప్రార్థించెను. అదేమి కాలమాహాత్యమో కానీ దాసు సుస్మితముఖుండై “రాజా! చింతింపకుము నీకొడుకు దుడుకుదనము తొలంగును. క్రమముగా మతిమంతుఁడై వంశకర్తయగును. కాని యాతని నాకడకుఁ దోడి తెచ్చి విడిపించి నీవరుగుము " అని పలుకఁగనే యా మధుసూదనరాజు పరమానంద వార్లితరంగముల నోల లాడుచు నిది నాయదృష్టమే యనుకొనుచు "మహాత్మా! నన్ను ధన్యుని జేపితిరి. నాకులము పావనమయ్యెను. నానోములపంట యా యొక్క డే. అతఁడు దుర్వినీతుఁడగుటం జేసి వెతలం గుడుచు చుంటిని. తమ యమోఘవాక్కు నన్ను దరించెను.” అని "మొక్కి సెలవంది కనకవల్లీకిం బోయెను. మధుసూదనరాజిల్లు చేరఁగనే యెల్లరు వచ్చి యా తొలిదినమున సాగిన పాఠశాలోపన్యాసమును దెలిపిరి. దాస నాతనిచిత్తము వ్రయ్యలయ్యెను. నిశ్చేష్టుఁడై కొంత సేపుండెను. విచారసాగరమున మునింగినట్లాతని మోము తెల్పుచుండెను. కొంత సేపు మాటాడఁజాలక యుండి యోగి 'వర్యుని మాట తలంపునకు రాఁగాఁ గొంత మదిని దీటవు పాదుకొల్పి కొడుకు దుర్లయముల సడిగి తెలిసికొని యెట్లో యోపికఁబూనుఁడు. వానిని మంచి మార్గమునకుఁ దిప్పువారు కలరు. నా పైఁగల విశ్వాసమున నీపు డోర్చియులడంఁడని యెన్ని యోభంగులం బార్ధించి వారిని సాగనం పెను

, ఇంతలో నొక. బేహారి యరుదెంచి మధుసూదన రాజు 'గారూ! మీకొడుకు మాకడం గొన్ని సరకులం దీసికొని కొన్ని నెలలాయె. సొమ్మియ్యక యదిగోయిదిగో యనీ కొలముఁ ద్రోయుచున్న వాఁడని లెక్కలఁజూపెను. 'పరిమళ వస్తు వ్రాత మదినమునకు వృద్ధితో మూఁడువందలు పైఁ బందొమ్మిది రజత ముద్రికలని తేలెను. ప్రతిసారియు సంతకము చేసియే యుండుట నంద న్యాయమేమియు సాగ లేదని యెఱింగి లేని సంతోషమును దెచ్చుకొని రేపు వచ్చి సొమ్మిత్తుసు అని 'మెల్లగా వారిని సాగనంపెను. ఈవిషయమును భార్య కెఱింగించుచుండ నింకొక వర్తకుఁడే తెంచి ఫలాహార వస్తువులు దీసికొన్న పద్దులం జూపెను, ప్రతిదినము పది రూక్ష్యములకు దక్కువగాకయుండ నవి యుండెను మిత్రులతో వచ్చి పుచ్చుకొన్నయట్లు వారు తెల్పిరి. ఆ మొత్తము సుంత తక్కువగా నేడు వందలపై ముప్పదియాఱు రజతముద్రికలుగా నుండెను. అచ్చెరువందుచుండఁగా నొకరి వెంట నొకరు వచ్చి కొన్ని యప్పులను దెల్పిరి. ఆనాటికి వారు తెలిపిన ప్రకారము 'రెండు వేలు నాఱువందలు డెబ్బది యెనిమిది రూప్యములు ఋణము తేలెను. ఇంత ధనమగువఱకు నా కేల తెలుపు వైతిరని పశ్చించిన యారాజునకు మీకుమారుఁడని మారాడక యిచ్చితిమను బదులు వచ్చెను. ఇక మాటాడ రాదని త్వరగా బంపుదునని చెప్పి వారిని సాగనంపి సాధ్యితో నీవిషయము తెల్పి యోగిమాటలు తప్ప నూఱటఁ జెందఁదగు విషయమే లేదని నిశ్చయించు కొనియుండెను.


మఱి కొంత సేపటికాత్రోవన సీరామరాజు పోవు చుండెను. పాఠశాలనుండి వచ్చుచు నింటి కేగుచున్నయట్లగపడియెను. ఆవఱకెన్నండు నాతనింబిలిచి మాటలాడినవాడు కాడు. కావున నించుక సంశయించుచు విధిలేక లేచి వచ్చి నాయనా ! సీతా రామరాజు ! అని పిలిచెను ఆపిలుపు చెవులం బడిన తోడనే నిలువుబడి నమస్కారము చేసి మెల్లగా వచ్చి నిలువంబడియెను. అతని వినయము మనస్సున కెంతయో యానందమును గల్గింప రమ్మని కూరుచుండుమని పలికి యిరు వురును గూరుచుండి కుశలప్రశ్నము కాఁగా వత్సా! నా కుమారుని వృత్తాంతమును సాంతముగా నెఱింగింపుము. ఇంచుకంతయు దాఁచి పెట్టకు మనఁగా నాబాలుడు తానేఱింగిన దంతయుఁ దెలిపెను. భార్యయు వినుచుండ దాన నించుక శ్రమము తనకుఁ దగ్గెనని యూహించుచు విని ముక్కుపై వేలిడుకొని చేయునది యేముని యోజింపసాగెను. సీతారామరాజు సెలవంది తనయింటికి బోయెను.


ఆ బాలుని యడఁకువ, మాటలపొంకము, సమ యోచితముగా మాటలాడు నేర్పు మధుసూదనరాజు మనస్సును గరగింపు జాలెను, ఒక్కొక్కటియు నుత్తముని జేయఁజాలును. అన్నియు గుదిరినఁ జెప్పవలసిన దేమను కొనుచుఁ దనకొడుకుం దలంచుకొని యతని యవినీతిం దలంచుకొని చింతాసాగర నిమగ్నుఁ డయ్యెను. సాధ్వీమణి యనందగు నిందిరాంబ "నాథా! విచారించిన లాభము లేదు, భగీరథదాసుగారినుడు లెప్పుడును వ్యర్థములు కావు గదా! మనపిల్ల వాని నెట్లో యింటికి బిలిపించుకోని బుద్ది చెప్పి కారణాంతరమున నా యోగికడకుఁ బిలుచుకొని 'పోవుదము, ఆమహనీయుని దర్శనమున నవినీతియెల్ల నశింప వినీతుఁడగును. ఊరక విచారమునకు మీమనస్సునం జోటీయ కుఁడు పెద్దలమాటలు వృథ గావు.” అని మృదుమధురోక్తుల హితముఁ గర్తవ్యమును దెలుఁగా సంతసించి "ప్రేయసీ !. అనుకూలవతియగు కళత్రము వూర్వపుణ్యమున నే లభించును.

చ. 'జనమని బూజలంగడు: బ్రసన్నుని జేయునతండుపుత్రుడే
పనికమెలంగు భర్తృవశపర్తినియై యది సత్కళత్ర, మే
జనుఁడువిపత్తిసౌఖ్య సదృశ క్రియఁడాకండు మిత్రుండీ త్రయం
బునుజగలిన్ లభించుఁ గడుఁబుణ్యము చేసిన యట్టి వారికిన్..'


అన విందుము గదా. నీమాటలచే నూఱట నొందగల్లి తిని. మనమింక సుతుని బిలిపించుకొను ప్రయత్నము చేయనలయును. నాకొక్కటి తోఁచుచున్నది. ఇప్పటి స్థితినిబట్టి చూడఁగా వాడు దేశాంతరమునకుం బాఱిపోవునని తో చెడు. ఋణము లిచ్చిన వారు నాకడకరు దెంచి యడిగిరన్న వార్త వాడు వినియుండును. తనదుర్లయమునఁ బాఠశాలలోని బాలురు తిరుగుబాటొనర్చుట, యది తుదకుఁ దన యవినీతి చే సొగినట్లు స్పష్టముగుట, బాలు తెల్లరు తనమాటలకు లోఁబడ కుండుట, సీతారామవర్త తననీతి మహిమమున బాలుర దుచ్చేష్టలఁ దొలఁగించుటయు, మహాసభలోఁ దన ప్రవృత్తి సెల్లరు ఖండించుటయు, నుపాధ్యాయులు కూడ సీతారామరాజు గుణములఁ బొగడుటయు మనకుమారున కేవఱకే తెలిసియుండును. కావునఁ దన ప్రయత్నములు విఫలముల గుటయేగాక తోడి బాలురు తనతోఁ జెలిమి చేయనీయ కోనక యుండుటయు నెఱింగి యుపాయాంతరము లేక పొఱిపోవుననియే తోచుచున్నది. కావున మన మీతరుణమున జాగు చేయుట పొడి గాదు, కుముదవల్లి కింబోయి వానినెట్లయినంగనుంగొని పిలుచుకొని రావలయును. ఈ కార్యమున నాకంటే నీకే యెక్కుడు శక్తి కలదు. నన్నుం జూచి వాఁడించుక జంకును, తల్లివి గాన నీకడ వానికి జనువు మెండు. కాఁబట్టి నీవిప్పుడే పోయి పిలుచుకొని రాలయును, ఎన్నఁడు పరగృహముల కరుగ నెఱుఁగని. నిన్ను బర గ్రామమునకే పంచుఁజూచుచున్నాఁడను. అనివార్య కార్యమగుట దప్పిన పిదప మనకు భరింపరాని దుఃఖము లభించుటయను నీ రెండు కార్వములం దలంచుకొని మన మించుక త్వరపడ వలసియున్నది. కుముదవల్లీ లో 'నామిత్రులు పెక్కండ్రు గలరు. నిడుదవోలు రామరాజు మనయింటికి వచ్చుచుండువాఁడు కదా, ఆతని భార్య నీయందు విశేషించిప్రీతి గౌరవములు గలదనుటయు నీ వెఱుంగుదువు కాదే? వారి యింటి కిప్పుడే పొమ్ము. అతఁడు వేదకీ యెందున్నను సూర్య నారాయణను ఫిలుచుకొని వచ్చును, నీదగ్గరకు రాఁగా నెట్లో మంచిమాటలు చెప్పి పిలుచుకొని రమ్ము, ఎంత ప్రొద్దు పోయినను రావలయును. అంతదనుక మేలుకొనియుందును. నిద్ర, పట్టు కాలమా యిది? కుపుత్రుడు పూర్వదుష్కర్త ఫలము. మన మీరువురము తొలిజన్మమున నేదుష్కరమును సమానముగా నొనరించితిమో, దానిఫలమును సమానముగా సనుభ వించుచున్నాము. ఏధీగతి దప్పించున మనకు శక్యమా? సాధ్వీ! తడవు చేయవలదు. నాభోజనవిషయము తలంచు గోనకుము. ఈవిచారమునఁ గడుపునిండియే యున్నది. ఆహా రమునకుఁ జోటు కౌనరాదు. పూర్వదుష్కృతమును సంతోషమున ననుభవింపవలయునని పెద్దలు విశ్లేషించి భగీరథ దాసు గారును జెప్పఁగా , నిన్నాఁడను గావునఁ బ్రాణేశ్వరీ! తడవు చేయక పయనము చేయు' మనఁగా నాయమయు భర్త కెదురాడ నోడి కార్యభంగిం దలంచుకొని సమ్మతించెను.

సూర్యనారాయణ రాజు పాఠళాలయందు సాగిన మహాసభ నాలకించి విద్యార్థులు తన కుతంత్రమును దెలిసి కోని తనపొత్తు మానుకొనఁ బట్టుదల కలిగియున్న వారనియు నెఱింగి సోమరులు కొందఱు తన్నుఁ బరివేష్టించి యుండఁగా నొకయింటిలో నేందో కూరుచుండి రహస్యాలోచనము చేయుచుండెను. కొందఱందు మరల విధ్యార్డులకు బోధించి తమవంకఁ దిప్పుకొందుమనిరి. కొందజు "దీన 'సేమగును? మీతండ్రి ధనమీయకున్న నీ పాఠశాలయే నిలిచిపోవును నీ వింటికిఁ బోయి యన్నము మాని పట్టుపట్టిన మీతండ్రి, ధనమీయ మానును. ఉపాధ్యాయులందఱు వచ్చి తుదకు నిన్నే ప్రార్థింతురు, మనమపుడు మరల సభ చేసే సీతారామరాజే దీనికిఁ గారణమని తీర్థానము ప్రతిపాదింప జేయవలయునని. చెప్పుదము, విధి లేక వారంగీక రింతురు. గ్రామమునఁ గల పెద్దల నందలం బిలిపించి నారియెదుట నాతీర్మానమును జేయింతము, అప్పుడెల్లరు నిన్నే శ్లాఘింతురు. బాలురకు సెల్లరకు నీయందే గౌరవము హెచ్చును. నీ సాయము లేక పాఠ శాల సాగదని తోఁచును. మనయి చ్ఛాను సారము ప్రవర్తింతము. ఉపాధ్యాయు లెల్లరు నిన్నును, నీమూలమున మమ్మును జూచి భయంపడుదురు. కరీకులలో మనలఁ గృశార్డులను గాఁ జేయు దురు. మన దే రాజ్యమగును.” అనియు బోధింప నాలకించుచు నవ్వుచు నడుమనడుమఁ గాదపాత్రస్థ లవణ బొప్పోదకమును (Soda Water) ద్రాగుచుఁ బత్ర, ధూమమును (Beedies and Cigarettes)బీల్చుచుఁ దానే మహారాజు సనియుఁ దనవల ననే యెల్లరు బ్రదుకుచున్నవా రనియు సనుకొనుచు నవ్వుచు వారాపత్రికల జూచుచున్నట భినయించుచు సంతోషించు. చుండెను. నిడుదవోలు రామరాజు కొందఱు బాలురసు బిలుచు గోని యందందు వెదకుచుండెను. సుమారు పదునొకండు గంటల వేళ యయ్యెను. దుర్వృత్తు లెల్లరు గ్రామ రాజు వెంట నుండిరి. ఆయాయి గృహములంజూచుచుఁ బోవుచుండి ఒక్క దుండగీడు వచ్చి మాయింటిలో నున్న వారిని సంజ్ఞ చేసెను. అది యొక చిన్న వీథి, అందుండు వారు ప్రాయికముగా వేశ్యలు. వారివంటివారు మఱికొందఱు నంచుందురు. సాధారణముగా బెద్దమనుష్యులు మంచి బాలురు నాసందు వీటికిం బోవరు. ఎవరైనఁ బోవుచుండఁగాఁ జూచిన 'వారు నవ్యుదురు. కొత్త వారెనరనఁ బోవుచున్న ట్లగపడిన బతిమాలి యది పోదగిన వీథి కాదందురు, ఆ వీధియండే యొక వేళ్యాగృహమున సూర్యనారాయణ రాజు నతని మిత్రులు నాలో చించుచుగిడిరి. ఆగృహము చూడగనే రామరా జేపగించుచు వీధి లేక యా ఇంటి ముందు నిలువంబడి యందుం జోరందగినవారల బతిమాలుచు! 'పెడత్రోవను బాఱిపోవక యుండఁజూచుచుండ మఱి కొందఱు నియమించి వారి సుబ్బించుచు బతిమాలుచు నుండెను. నాలుగువైపులం గొందఱు కనిపెట్టియుండిరి. ఒక రిద్దఱు పిలువందగినయట్టు లాయింటి వారిని పిలిచిరి. వారెఱింగిన పొరి కంఠధ్వనియే కావున వచ్చి తలుపు తెఱచిరి, లోనికింబోయిరి. ఒక యీల వినవచ్చెను. ఎల్లరుపరు గెత్తిరి. ఏమిదియని రామరాజు విభ్రాంతుఁడై చూచుచుండ గోడ దాటిపోవుచున్న సూర్యనారాయణవర్మను బట్టి తెచ్చితి మని బాలు రాతని నప్పగించిరి. ఆతని 'మోమున గ్రోధము సాట్యమాడుచుండెను. బరిమళములు 'వెదజల్లుచు దుస్తులు సొగసుగ నుండెను. "ఏల నన్ను - దెచ్చితిరి? చూడుఁడు నాదెబ్బ, మిమ్మేమి చేసెదనో యనమాట లాతని నోటినుండి వెడలుచుండెను. మఱి నాలుగు నిముసములకు మఱికొందఱ బట్టుకొని వచ్చి రాము రాజు మ్రోల నిలిపిరి. వారే యాదుష్ట బాలుని మిత్రులని పాఠకులూహింపఁగలరు, వారం జూడఁగనే రామ రాజు పట్టరాని కోపమున "నేమో యనఁబోయి సమయము కాదని యాగ్రహమాపుకొని "లేనిశాంతము సభినయించుచు 'నెడ నవ్వు కనంబడంజేయుచుల దడబడుమాటలతో “నాయనా! మితల్లిగారు వచ్చి యున్నారు. తండ్రిగారికి మనో వైకల్యము గలిగెనఁట, సంస్థానము చాల చిక్కులలో బడినదఁట, ఋణములిమ్మని యు త్తమర్ణులు (creditors) అడుగు చున్నారంట. మీతల్లి గారు విచార సాగరమున మునింగి దిక్కు దోసమి వచ్చియున్నారు. ఇల్లు వెడలి యాతల్లి నీకై వచ్చినది. 'నాయనా! తల్లిదండ్రుల దుఃఖముల పాలు చేయుట న్యాయమా?” అనుసంతలో నొకశకటము నడుమ నుండి “సూర్య నారాయణా నాయనా! రారా యసుమాటలు వినవచ్చెను, తల్లి యేయని ధ్వనినలన నెఱింగి గబగబ పరుగెత్తెను. బండి నుండి చేయిపట్టుకొన్న జూడ కనఁబడెను. నలుపురను గావలి యుండఁ బంచి రామరాజు తాను నాబండి వెంటఁ బోయెను, ఆశకటనలు కనకపల్లి కేసి పోనపొగెను. రాత్రి మూడవజాము గడువకముందే కనకపల్లి జెల్లరును జేరఁగల్లిరి. అంతలో నాయిందిరాంబ యేమి భోధించెనో తెలియదు కాని సూర్య నారాయణవర్మ మనస్సు మాపోయెను. తనయపరాధముల నంగీక రించి క్షమింపుఁడని కోరఁదగు స్థితియందుండెను.

"ఆమంత్ర ముక్షరం 'నాస్తి, నొ నీ మూలమసౌషధమ్, 
ఆయోగ్యః పురుషో నాస్తి యోజక స్తత్ర దుళ్లుభక. ” 

అన్న సూక్తి యేనాఁడును వ్యర్థము కాదు కదా!

పాఠకమహాశయులారా! లోకమున మంత్రముగాని యక్షరమొక్కటీయు లేదు. మందునకుఁ బనికి రాని మూలము (వేఱు) "లేదు, కుజనుఁడనఁబడు వాడును లేడు. కూర్పు వాఁ డొకఁడే దొరకడు అనఁగా భావమేమి? ఏయేయ క్షరములు కలిపిన మంత్ర మగునో, యేయే వేఱును గూర్చిన మందగునో ఎబ్లెట్లు సంస్కరించిన బాలుఁడు బుద్ధిమంతుఁడగునో యరింగి సంస్కరించు వాఁడొక్కఁడుండిన జాలును. ఈశుక్ర నీతి. 'వాక్యము సూహింపుఁడు. బాలు రెల్లరు తొలుత నవివేకులుగనే యుందురు. చక్కని సంస్కారముల చేత నెల్లరు బుద్ది మంతులగుదురు. ఈనియమ మేకాలమునసు వ్యర్థము కాదు. ఇపుడు దుష్ప్రవర్తకులగు బాలురుండుట సంస్కర్తలు "లేక యే గాని వేఱు కాదు ఎంతటి దుష్ టబాలుడైనను జక్కనిసంస్కర్త యొదవెనేని బాగుపడునని శుక్రనీతి 'తెలుపుచున్నది. ఎంత ప్రయత్నించినను జక్కని పవర్తనము లభింపనివాఁడొకా నొకండుండ వచ్చును. సామాన్యశాస్త్రమున కొకానొక చోటఁ బ్రవృత్తి లేక పోవచ్చును. కానీ సాధారణముగా నది వ్యర్థము కాదనవచ్చును. సంస్కర్త పరిశుద్ధచిత్తుఁ డయ్యెనేని శిష్యునిబుద్ధిని మరల్పఁజాలుననుట సిద్ధాంతము. శ్రీ రామ కృష్ణ పరమహంసయుల దచ్ఛిష్యుఁడగు 'వివేకానంద స్వామియు నిందుల కుదాహరణము. తొలుత వివేకానంద స్వామి యేస్థితి యం దుండెనో పరమహంస యాతని ,నెట్లు మార్చెనో యల్లరకుఁ దెలిసినవిషయము, నా స్థికుడుగా నున్న యావిదారిని గొలంది నెలలలో శ్రీ రామకృష్ణ పరమహంస యాస్తిక శిరో మణినిగా నొనరింపజాలెను. . గురువు చిత్తము పరమపావనము, కరుణారససాంద్రము. కావున బ్రేమరశ్ముల శిష్యుని బంధించి తత్చిత్తకల్మషమును సద్బ్కోథామృత ధారల గడిగి వినిర్మలముగా నొనర్చెను. విగతకల్మషం యాతడు జ్ఞానవంతుఁ డయ్యెను. కావున బోధకులు తమకు పరిశుద్దాంతః కరణులై భోధ్యులను బారిశుద్దత్మకులం జేయఁ జూలుదురు. కేవల వాగాడంబరమున ఫలము లభించనుట స్పస్టము ఇఁకఁ గడకు మరలుదము.

ఇందిరాంబ హస్తస్పర్శముననే కుచూపుండె సూర్య నారాయణుడు. సుమతి యయ్యెను. శకటాంర్భాగమున నాపూజ్యమతి యేమి బోధించెనో యెవ్వ్రరెంరుంగరు. విశ్లేషించి బోధించునంత యవ కాశమామెకు నుండదనియు నామె సద్భావనమే యాతని మరలించే ననియు మన మూహింప వచ్చును. ఇన్ని దినము లేల యామె సద్భావము మరలింపు జాలకపోయెనని యడుగవచ్చును. ఇంతకుముం దామెకు దనయుని దుర్నీతి తెలియదనియు నిన్నమొన్ననే యామె చెవుల నంటి సోఁకెననియు నాయమ తనసద్భాన మాసమయ ముసల గసంబఱ చెననియు మనమూహింపవచ్చును. దీనికే మనశ్శక్తి యనియు నిశ్చయింపవచ్చును. మనశ్శక్తి లేక యేపనియు సొగదని భగవంతుఁడు గీతాశాస్త్రము సందుఁ దెలిపి యున్నాఁడు. చంచలమగు మనస్సును గ్రమ క్రమముగా స్వాధీనము చేసికొనినచో నది లోకాత్రయమును స్వాధీనమున నుంచఁగలదు. యోగశక్తియన్న నదియే.. కనకవల్లి : జేరఁగనే సూర్యనారాయణ పూర్వరీతిగానింట బ్రవేశించి తండ్రికి నమస్కరించెను. అంతియగాక పొదములను గరములం బట్టుకొని విడువక యించుక సేపుండెను, ఎల్లరూరకన చూచుచుండిరి, కన్నీటి ధారలచే గాళ్లు దడియు చున్నట్లు తెలిసికొని మధుసూదనరాజు దయానశికృతహృదయుఁడు గావున జూలి తన్ను ఁ బురికొల్పం గొడుకు లేవనెత్తి చూచునంతలో నాతని హృదయము జలధారలఁ దోగు చుండెను. దానుజూచిన వారలకే మనస్సు కరగెసన నిక దండ్రి, మూటయిట జెప్ప నేటికి కొడుకునకంటెఁ దండ్రియుఁ దండ్రికంటే గొడుకు నేడువసాగిరి వీరిరువురను మించి తల్లి విలాము. వానీని మించి వచ్చిన వారి రోదనము చెలరేగ నాగృహము దుఃఖమయ మయ్యెను. కొలఁది నిమేషములకుఁ దండ్రియు కుమారుఁడు వచ్చిన వారును దల్లియు గ్రమముగా "నేడ్పుడిగిరి. మధుసూదన రాజు కొడుకుఁ జెంతఁ గూరుచుండఁ బెట్టుకొని “నాయనా! పగవకుము, గ్రహచార బలమున నీకిట్టి యపకీర్తి చేకూరినది. ఇంక నైన సత్సహవాసమున మంచి పేరు సంపాదింపుము నన్నును చల్లి నపకీర్తినొందఁ జేయకుము. నలుగురు బంధువులలోఁ దలయెత్తుకొని తిరుగఁ జేసి 'పెద్దల పేరునకు హాని నావలన రాకయుండంబు వర్తింపుము, నీవుద్దరింతువని కొండంత యాపతో నున్నాము. మానోముల పంటగా నీవు జన్మించితివి. ఇంతదనుక మాకు మసశ్చింత కలిగినదే లేదు. రెండుమూడు దినములనుండి యించుకించుకగా నది యంకురించి నేటి యుదయమునుండి వర్దిల్లీనది. జరగిన దానిని స్మరింపవలదు, ద్రవ్యవ్యయమునకుఁ జింతింపకుము. ఋణములకు భయంపడకుము. భగవంతుఁ డించుక యన్న వస్త్ర . ముల నొసంగినాడు. ఋణముల: దీర్చెదను. పాఠశాలలోకి బంధువర్గములో నీపేరు సంతోషము నొదవించునట్లు వర్తింపు '. ' మని యనేక భంగుల బోధించి పొద్దుపోయిు సందున గోడుకును శయనింపుమని పంపెను. రామరాజుం జూచి పుత్రభిక్షము పెట్టిన మహాత్ముడవు.. నీయుపకారమునకుఁ బ్రత్యుపకారము చేయుఁజూలను. నావలన శ్రమం బయ్యెను. మన్నింపు" మని వేడుకొనతండును దగినట్లు మాటలాడి యాతని యనుమతినం శయనించెను. ఎల్లరు శయనించిరి. మటునాఁటియుదయమున వారు పయనము చేయఁగా ఫలాహార పూర్వకముగా సాగనంపిరి. వెంటవచ్చిన బాలురకు: బసదనంబిచ్చి పంపెను.

నాల్గవ ప్రకరణము.

రామచంద్రరాజు సుంత యవకాశము దొరకినపుడెల్ల భగీరథ దాసుగారిని దర్శించుచుండువాడు, మధుసూదన రాజు దర్శించివచ్చిన మఱుదినమే వారి దర్శింపబోయి యుండెను. దాసు ఈ రాజును జూచినఁ బరమానందభరితుఁ డగుచుండు "వాడు. మాటలాడునంత సేపు సత్పుత్త, భాగ్యము నీకు లభించెనని పలుకుచుండుట యా యోగి కలవాటు. ఆన్నాడు. రాజుతో మాటలాడుచు నేను గోరినపుడు నీతనయుని నాకడనుండునట్లు చేయఁగలవా?” అని ప్రశ్నించెను. పట్టరాని