సత్ప్రవర్తనము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ

సత్ప్రవర్తనము.


మొదటి ప్రకరణము

సంపదల కునికిపట్టు జంబూద్వీపము. దానివంటి దదే యని యెల్లరు గొనియాడుదురు. హిమాలయమునకు దక్షిణ భాగమున నాద్వీప ముండును. నాలుగుదెసల సముద్రము లుండిన ద్వీపమందురు. ఈయది ద్వీపకల్ప మనంబడును. ఉత్తరపుదిక్కున సముద్రము లేదు. కాని హిమాలయమున్నది. జంబూవృక్షము (నేరేడుచెట్టు) ఉత్తరభాగమున సీమగా నున్నందున జంబూద్వీపమను పేరు కలిగెనందురు. ఏకారణమున నైననేమి లోకప్రఖ్యాతి నీపేరు గాంచెననుట నిర్వివాదము. ఈద్వీపమున ననేకదేశములు గలవు. అందు నాంధ్రదేశ మొక్కడు. ఆంధ్రదేశమునకు సంధ్రదేశమను నామాంతరము కలదు. అది కటకమను నగర ముత్తరపుటెల్లగా, శ్రీశైలమను మహాక్షేత్రము దక్షిణపు టెల్లగా గలది. అందు గౌతమీ కృష్ణానదులు ప్రవహించుచు సాగరమునఁ గలియుచున్నవి. ఈయవియే ప్రధాన పుణ్యనదులు, గౌతమీనది యేడుభాగములు సాగరమున సంగమించును. ఆభాగము సప్తగోదావరీ తీర మనఁబడుచున్నది.


గౌతమీనది బొంబాయి రాజధానిం గల త్వంబక క్షేత్రమున బుట్టినది, ఆ క్షేత్రము నాసిక యనంబడు ప్రసిద్ధ పురమునకు రెండు యోజనముల దూరమున పడమర భాగమున నున్నది. త్ర్యంబకము శివ క్షేత్రమని యా వేరే చెప్పక చెప్పుచున్నది. ఆ గ్రామమునకుఁ బడమర దెశ దాసం గోశమాత్ర దూరమున నొక పర్వతము గలదు. అది దక్షిణము నుండి ఉత్తరమునకు సాగియుండును. దక్షిణపు దిక్కున నించుక తూర్పునకు సాగియుండును. దానికి బెక్కండ్రు, యాత్రా పరులు ప్రదక్షిణము చేయుదురు. ఒక్క యోజనము మాత్రము దాని చుట్టుకొలత కలదు, దాని పొడ నించుమించుగా రెండు గోశములుండు ననవచ్చును. తూర్పు నుండి పడమరకు సాగి యుత్తరమునకుఁ బెరిగిన యాచోట ననంగా నైఋతి మూల యందు గౌతమి పుట్టును, అందొకచోట నందివక్త్ర ముండును. దాని నోటినుండి బిందు రూపమున నీ నదీజలముప డుచుండును, అదియే దాని పుట్టుక వందురు. సగరము నడుమ గుశస్థలి యను నొక సరస్సు గలదు. గౌతమముని యందు నదిని బార్లించెనందురు. అందుండి నది సాగినట్లగపడదు. దీన్ని కాలువ నిర్జలముగాఁ గవబడును, నాలుగు కోశముల దూరమున ఇవవిదిక్కునందుఁ ఒక తీర్థము కలదు. గౌతమముని చక్రముచే భూమిని "భేదింపఁగా నది కనఁబడి ప్రవహింతునని చెప్పి నట్లు పలుకుదురు, అటునుండి స్వల్ప ప్రవాహముగా నదీ ప్రవహించును. ఆంధ్ర దేశమును బ్రవేశించు నప్పటి కిది య నే కోపనదుల మూలమున వృద్ధినొంది మహానదియగు. దీని మహత్త్వ మపారమందురు, పురాణముటయందు దీని మహత్వము విశేషముగఁ జెప్పఁబడినది.


మహానది యనఁగా జలములమూలమున మానవులకు మహోపకార "మొనర్చునది యనియే మనము విశ్వసింప వలయును. స్నానపానములకు సుస్వములకు నది యుపయో గించును. స్నానమారోగ్యము నిచ్చును. జలపానము పుష్టిని మేథాశక్తి నొసంగును. ఇంతకంటె గావలసిన దేమి? నదీ స్నానమునఁ బాపములు తొలగునని పెద్దలందురు, ఆరోగ్యము గలిగి మేథాశక్తి వృద్ధినొందిన మంచియూహలు గలుగును. ఆ యూహలు మంచి యలవాటులు గలుగఁ జేయును. మంచి నడవడి కలిగిసం బాపకార్యములు చేయఁడు, ఇక నాతఁడే పుణ్యాతుఁ డనఁబడును. ఇన్ని యుపకారములు చేసిన నది పూజింపఁదగిన దనుటయుక్తము కాదా!

నదుల సాయము ప్రధానముగా గల్గియున్న భూమి. నదీమాతృక యనంబడును. బాలునకుఁ దల్లివలె నది యా భూమీకి బయోదానము చేయును. శిశువునలె దాన నదీ వృద్ధి నొందును. నదుల సమీపముననున్న దేశము ధనసంపన్నమగు. వ్యాసారము సాగును, సమృద్ధిగా ధాన్యముండును. మాసవు లాఁకటఁ గృశింపక యున్న నాయుస్సు నశింపదు. వయస్సు త్వరగా సడలదు. వార్ధకము చిన్న తనముననేరాదు. విశేషించి బుద్ది వృద్ధియై సూక్ష్మ విషయములను గ్రహింపఁజూలును. దాన విద్యాభివృద్ధి గలుగును. అద్దాని మూలమున విఖ్యాతి యెల్ల కడల వ్యాపించును. ఇన్నింటికి మూలము నదియే కదా! కావున నదులపలని యుపకారము లసంఖ్యాకములు, వానీ నెల్ల వర్ణింప నిది చోటుగాదు .

గోదావరి యొడ్డున ననేక పురములు, గ్రామములు, పల్లియలు గలవు. ఆందోక యగ్రహారము మనోహరముగ సుండెను, దానిపేరు కనక పల్లియని, తొలుత నది పల్లీయే. కొని క్రమక్రమమున నది గ్రామమయ్యెను. ఐదువందలగృహములు గల గ్రామ మనఁబడుననియు, వేయి గేహములుగలది మహా గామ మనబడుననియుఁ బెద్దల యభిప్రాయను. గోదావరికి దక్కినపుదెస నాకనకవల్లి యుండును, పానోదక మా గోదావరీ నుండియే వారికి లభించును. గ్రామమున నూతులు కలవు. కాని యవి క్షారోదక సంభృతములు, స్నానమున కుపయోగించును, "వేసవి కాలమున నవి యించుక 'బాగుండును. వంటకుఁ కూడ నపుడవ్వాని సందలి యాడువారు యోగింతురు. కానీ తెల్లని బియ్యము పండిన పిదకు నన్న మెఱగనుండును. క్రొత్తరంగు తెచ్చి పెట్టు సానుమర్థ్య మాజలమునకుఁ గలుగుటయే యొక గొప్పయని గొందఱు వినుతింతురు. అకాలమునందును ద్రాగవలెనన్న వారు శక్కరఁ జేర్చే త్రాగుదురు. జలగుణ మప్పుడుకూడ నించుక గానఁబడును.

కనకవల్లియందు నాలుగు జూతులవారు నివసింతురు, ఒక్కొక్క భాగమున నొక్కొక్కబోతివారిండ్లు కట్టుకొనిరి. అందు దక్షిణ భాగమున క్షత్రియులు, నుత్తరభాగమున వైశ్యులు నుండిరి. క్షత్రియులు దారస్వభావులు, వారికి ధనము కంటే మర్యాదయే యమూల్యధనము, మరియాద కించుక యపాయము గల్గినఁ బ్రాణములం దాల్పఁజాలనంత పట్టుదల వారలకుఁ గలదు. అది మొండి పట్టుదలచుని కొందరందురు. జూతి ప్రతిష్ఠ, యమూల్యము. దానం గాపొడుకొనిన సర్వము మేలగు, అది పోయిన సర్వ శ్రేయస్సులు పోపును. మర్యాదయే భూషణము. అది ముత్తమ పురుషార్థము నొసంగఁజాలును. తక్కిన పురుషార్థముల నిచ్చునని వేఱుగాఁ జెప్పషలయునా ? దాని లెక్క చేసుకున్న సౌదర్యము శూన్యమగును. "కావున జాతిగౌరామును గా పొడుకోనుటకంటే గర్తవ్యము వేరొకఁడు కానరాదు. ఈవిషయ మా గ్రామమున నుండు భూపులకుఁ జక్కగా దెలియును, ధనము గల్గిననే గౌరవము నిల్చునన్న యూహ మంచిది కాదని వారలనిచ్చితము. కావున వారు యదృచ్ఛాలాభ సంతుష్టులై యుండిరి. వైశ్యులు ధన పంతులు కులవృత్తి జీవించువారు, దేశాంతరములకుంబోయి బేహారము సాగించి యపొకథనము నార్జించిన వారందు 'బెక్కండ్రు గలరు. ఉన్న తావుననే వ్యాపారము చేసి కొంత ధనము సముపార్జించిన వారు కొందఱుం గలరు. మొత్తము మీఁద వా రెల్ల "ధనసంతులనియే ప్రసిద్ధిని గాంచిననుటకు శంకయే లేదు. అత్యల్పసంఖ్యాకులు దరిద్రులున్నను వారును ధనవంతులవరుసలోఁ బరిగణించ బడుచుండిరి.

క్షత్రియ బాలురు విద్యయు, దానికి సమానముగా ధనుర్విద్యయు నేర్చుకొను వారు. వైశ్య బాలురు వ్యాపారోచిత విద్య నభ్యసించువారు. ఈయాచారము బాల కాలమునుండి వచ్చుచుండెను. అన్న వస్త్రములకుఁ గొఱత లేక తక్కినజాతుల వారును, నెమ్మదిగ నేయుండిరి, విద్యావిహీను లాకనక పల్లి యందు లేరన్న విఖ్యాతి మాత్రము లోకమున వ్యాపించెను. యాచకులు ప్రతిదిన మా గ్రామమునఁ గనఁబడుచుందురు. యథో" చితసత్కారము వారలకు జరుగుచుండునని యూహింప వచ్చును. సత్కారమున కించుక కొఱామ్తగల్గిన వారి రాక కవకాశ మెట్లు! 'పెక్కు వర్షము లిట్లు గడచెను. - కనకపల్లికి దక్కిణ భాగమున నొక పత్తనము గలదు. కుముదవల్లియని దాని పేరు. అందు రాజకీ యోద్యోగులుందురు.. అది యుపమండలమున్నా బ్రఖ్యాతి గాంచెను. ఉపమండల మును గొందఱు తాలూకాయని వాడుదురు. ఉపమండలాధి కారి సభాభవనమందుఁ గ్రోత్తగాఁగట్టఁబడినది, దానింజూచుచు విసుగు లేక యానందించువా రాచుట్టుట్టులఁ గొందఱు గలరు. మిక్కిలి యెత్తుగా నది యుండును. అందొక భాగమునఁ గోశ స్థానము గలదు. రక్షకభటు లద్దానం గాపాడుచుందురు. అందెవ్వరికిని బ్రవేశము దొరకదు. దాని యధి కారియే యుద్దాని చెంత నుచిత పీఠమునఁ గూర్చుండియుండును. ఆ ధనమును జూచుచునే యుండును, విసుగన్నది యాతనికి లేదనుట విచిత్రము కాదు,

కొంత కాలమున కారుముదపల్లి యందు దొరతనమువారొక పాఠశాలను గట్టించిరి. ముందున్న వానికన్న సది మిన్న యని యెన్ని కంగాంచి యున్నతపాఠశాల యను పేరునఁ బ్రసిద్ధమయ్యెను. ఆపాఠశాల పురమునకు సుంతదూరమునఁ గట్టిరి. అది కట్టిన చోటుముందు సుందరోద్యానముగా నుండెను. వేసవి దినములలో బాటసారులు నగరవాసులు నందుఁ గూరు చుండి బడలికలుడుగ హాయి చెందువారు. దాని ముందొక బాటగలదు, నచ్చువారు పోవువారు విరామము లేక యుందురు. ' వారెల్ల రా తోటలో నించుక కాలము గడుపుచుండు వారలే యనవచ్చును. అందుఁ గూరుచున్న సూర్యరశ్మి, దృగ్గోచర మగుట కష్టమే. ఫలవృక్షములు, పుష్పలతలు మెండుగా నండుండును. కక్కూఱితికి లోనై ఫలములు కోసికొనిన సందున్న కొవలివారేమనరు. ఏకాలముననైనను ఫలము లేవో యందు దొరకును, పండ్రెండు నెలలు పొంథులకు: ధృప్తి చేయవలయుననియే ధర్మాత్ము లుద్యానములను మార్గముల

కడ ఫలభరితతరువర సంకులముగా నిశ్చింతురు. వాని వలనం గలుగు లాభముల వారు గోరరు.

ప్రకృతోద్యానముకూడ నావిధముగనే తొలుత నిర్మించబడినది వారి వంశమునఁ బుట్టిన వారు లుబ్దులై రొక్కమునకు దాని నమ్ముకొనిరి, ఫలవృక్షముల ననలీల గుథార ధారల కాహుతి గానిచ్చి యాచోటున నీపాన శాలను గట్టించిరి. విద్యాశాల యెంత పవిత్రమో యూహింపవచ్చును. పాథశాల చుట్టును గొట్టగా మిగిలిన చెట్లు కొన్ని యుండెను. అందొక భాగమున సరోవరము నిర్మింబడి యుండెను. విద్యార్థుల కది యనర్థానహమ్మని భావించి కాబోలు బానింబూడ్చి నూయిగా మార్చిరి. కమలములు ముచ్చటగా నందుండెను. వాని నెందఱొకోసికొని పోయి భగవంతు నారాధనమున కుపయోగపఱుచుచుండిరి. వారీ కార్యము వలదన్నను వినక 'పాఠశాల సంస్థాపక సంఘమువారిట్లు దాని మార్చిరి.

ఆపాఠశాల నిర్మించిన దాదిగా గనక పల్లియందుండు రాజులు, వైశ్యులు తమ తనయులను విద్యాభ్యాసమునకై యచటికిఁ బంపుచుండిరి. విప్లులు శూద్రులు ధనవంతులు గామి ధనవంతులకే యందు విద్య నభ్యసింప శక్యముగాను దమ బాలురఁ బంపక యుండిరి. ఆ పాఠశాలయందు విద్యనభ్యసించి పరీక్షయం దాఱితేఱిన గొప్పయుద్యోగములు దొరకునను ప్రనాదము క్రమక్రమముగాఁ బ్రబలెను. అందలి విద్యా ర్థులకుఁ గన్ని యలీయఁ బలువురు వచ్చుచుంబోవుచున్న వారన్న "వార్తయు నెల్లరకుఁ దెలియనచ్చేను. ఈ రెండు వినఁబడినతోడనే విప్పులు శూదులును దమతమ బాలరులను 'బాఠశాలకు . బంపసాగిరి. ఉన్న మాన్య క్షేత్రముల నాధి పెట్టి కొందఱును, ఏపాటి మూల్యమునకోయమ్మి కొందఱును బాలురఁ జదివింప సాగిరి. ఆవిద్య పూర్తి కాగానే తమబాలు రుద్యోగములలో బ్రవేశించి ధనము కుప్పలుగాఁ దెచ్చి తమయిండ్ల నింపుదురనియుఁ గోటీశ్వరులు వచ్చి తమతనయులకుఁ గన్యకల నిత్తురనియు దన్మూలమున గొప్పమర్యాదయు ధనము చేకూరునని వారూ హీంచిరి, మఱికొందఱు దేశాటనము చేసి ధనమార్షించి తెచ్చి చదివించుచుండిరి. ఈరీతిగా 'నాకనకపల్లింగల బాలుడు పొథశాలకుఁ బోయి చదువుచుండిరి. క్రమక్రమముగా విద్యార్థుల సంఖ్య హెచ్చుచుండెను. దానింబట్టి యుపాధ్యాయుల సంఖ్యయు వృద్ధి నొండసాగెను..


ప్రతివత్సరమందుఁ బరీక్షలు సాగుచుండును. అందాఱితేఱినవారికి బహుమతులియ్యబడును, ఆత్తఱినొక గొప్పసభ సాగును, పెద్దమనుష్యు లచటికీ వచ్చుచుందురు. పాఠశాలా ద్యక్షుడు వారివారి యోగ్యతలం గెలుపును. సభ్యులు కొంద అంతకుముందే నిర్ణయించిన బహుమతుల నా యావిధ్యార్థుల కిత్తురు. బహుమతుల నిచ్చుట కొసభ కోక యధికారి వరింపం బడును, ఆయన య గ్రాసనాధిపతి యని పిలువఁబడును. పాఠ ఖాలాధికారి యోగ్యతలను, సంవత్సరాయ వ్యయములను దెలుప న గ్రాసనాధిపతి యందుఁగల మంచి చెడుగులను డెలుపుచు నుపన్యసించి పిదప విద్యార్థులకు బహుమతుల నిచ్చును. వానింగాంచి తక్కుంగల విద్యార్థులు బహుమతులం బొంద వలయునని యూహించి పట్టుదలతోఁ జదువుదురను తలంపు, ననే యూ కార్యము జరపబడును, ఆపాఠశాలయందు బాలురతోడ బాలికలును జదువ సాగిరి, తొలుదొలుత బాలికలకు విద్యయే 'పనికి రాదనువారు

కూడఁ గొన్ని దినములయుఁ జదివింపఁ దలంచసాగిరి. బాలికల సంఖ్యయు వరుసగా హెచ్చ సాగెను. అది దేశాభివృద్ధికి మూలమనీ యుపొధ్యాయులు నొక్కి చెప్పుచుండిరి. బాలికలకు విద్య కొంచెము వచ్చినను బహుమతులు గొప్పగా దొరకు చుండెను, బహుమతుల వారు " నుతతంగరతాళధ్వను లంబకమును బద్దలు చేయుచుండెను. ఆ బాలికల బంధువులు తల్లిదండ్రులు పరమానందము నొందుచుండిరి. ఆబాలికలకుఁ దగినవరులు విద్యాధికులే కావలయునని తల్లిదండ్రులు వెదకుచుండిరి, వారిం 'బెండ్లియాడఁగోరి కొందఱు చదువుచుండిరి. తఱుచుగా నా పొఠశాలయందే చదువువారలే. వారికి బతులగుచుండిరి. అది చాల వినోదముగా సుండెను. ఈ యలవాటు చుగా నుండ సాగెను.


కనకవల్లి యందుండు రాజకుటుంబములలో సరపతులను నింటి పేరు గలవారు మర్యాదచే జీవించుచుండిరి. విశేష ధనవంతులు గారు. కాని యన్న వస్త్రములకు లోటు లేక వారు కాలముపుచ్చుచుండిరి. రామచంద, రాజు తత్కాలమున నా కుటుంబమున కధికారిగానుండెను. అతనికి సుశీలయను సాధ్వి ధర్మపత్ని గా నుండెను. కొంతకాలముదనుక వారికి సంతతి లేకుండి భగవదసు గృహమున నొక్క కుమారుఁడు కలిగెను, సీతారామరాజును నామ మాతనికిఁ బెట్టఁబడియెను. గారాబు బిడ్డఁడు గాన నతి ప్రీతితో వారు పెంచిరి. శుక్ల పక్షమున విధీయ నాఁటిచంద్ర బింబమువలె వృద్ధినొంది యే డేండ్ల వయసు గలం' పొండయ్యెను. ఆయీడునకుఁ దగినట్లు విద్యవచ్చెను. ఉపనయ నము: బ్రాహణుల యాచార ప్రకార మేడవ యేటఁ జేయఁబడి యెను. అది వారియింటి యాచారమగుటఁ దక్కుంగల రాజు లాక్షేపింపరైరి.


సీతారామరాజుప సయనానంతర మా పాఠశాల కే పంపం బడియెను. కనకపల్లి కది. కడుదూరమున నుండక యించుక దగ్గఱగా నుడినందున విద్యార్థులు తమయిండ్ల భుజించియే వెళ్లుచుండిరి. సీతారామరాజు సుందరమగు నాకృతిఁ గలిగి యుండువాఁడు, మోము లావణ్యతమముగా నుండును. కన్నులు విశాలములై హరిణనయనముల గేలిచేయుచుండును, తక్కిన దేహ భాగము లన్నియు సాముద్రిక శాస్త్రమునఁ జెప్పఁబడినచందమున నుండుటం జేసి యుత్తమపూరుషుఁడగు నని తెలుపుచుండెను, పెక్కం డాకుమారుం దిలకించి రూప వంతుడే యని యొకరినొకరు తెలుపుకొనుచుండిరి పురంద్రీ మణు లాతనింగని చక్కని బాలిక యీకని బెట్టపట్టవలయునని యాశీర్వదించుచుండిరి. తల్లిదండులు మాపిల్ల వానికి సకలవిధ ములఁ దగిన కన్యక దొరకునా యని యాశీంచుచుండిరి

. సీతారామ రాజు పుస్తకముల దీసికొని పాఠశాలకు, బోవుచు నిటునటు చూడక యేదో యోజించుకొనుచుఁ బోవువాడు కొందఱు బాలురు నలు పక్కలం జూచుచుఁ గుంటివారిని, గుడ్డివారిని, జెవిటివారిని, సంగహీనులను, గుష్టువ్యాధి. బాధితులను గని నవ్వుచు గేలి సేయుచుఁ దొలఁగి పొండని చెప్పుచుందురు. అట్టి దురబ్యాస్యము లీ బాలునకు బట్టుపడ లేదు. పూవుతోడ నే పరిమళ ముదయించి యది వృద్ధి కొందు కొలది నదియుఁ బెరుగును గదా! అట్లే మానవుఁడు జన్మించిన తోడ సే యంకురించిన గుణములు వరుసగా నభివృద్ధి నొందుచుండును. అంతియగానీ తొలుత లేక యుండి నడుము బొడసూపవు.


వాళ్ళత్వం శ్రీయన శృశ్వం కశ్వసంచికతా,
ఆభ్యాసేన న లభ్యం తో చత్వారస్సహ గుణాలు"

అన్న పెద్దలమాట సార్థక మే గదా, దురభ్యాసము లనఁబడు వానిలో నితరుల నాక్షేపించుట, అందు నంగహీనులం గాంచి దూఱుట మఱింత పాపము వృద్ది కొములగు బాలుర కవి యుండవు. మంచి యలవాటులే వారికి బట్టుపడును. సీతా రామరాజుం, జూచి తన బాలురు నవ్వుచుండిరి. 'కానీవారినవ్వుల నతఁడు లెక్కింపక యుండెను. కొలది నెలల కాతనిశీల మా ప్రాంతముల నెల్ల యెడల నల్లుకొనియెను, ముచి బాలుఁడన్న పేరు సర్వజన నిశితమయ్యెను.

పాఠశాలయందు గల యుపాధ్యాయు లావిద్యార్థిని బ్రేమచే జూడసాగిరి.ఏ కారణమున నైన నొక్కనాఁడు పాఠము సరిగా రాకయుండు నేని వత్సా! దేహమారోగ్యము గలది యే కదా, అని యడుగుదురు. అతఁ డొననును. ఆరోగ్యముఁ గలిగి యుండు తఱిఁ బ్రమాదముననైనఁ గాలము వృథపుచ్చ:డని వారెఱుగుదురు. ఒక్క ప్పుడైననే, బాలునకుఁగానీ శ్రమము కలిగింపక యుపాధ్యాయుడు చెప్పిన దెల్ల నేర్చుకొనుచుఁ దెలియని విషయము నడఁకువతోను నడుగుచుఁ బరాకు లేక, 'పాఠముల నభ్యసించుచుండెను, పాఠశాల వదలినతోడనే గురువు 'సనుమతిం కొనియే గ్రామమునకుఁ బయనమగును. వేళతప్పక యిల్లు చేరును. ఏదో కారణమున నించుక యాలస్య , మెనచో నతని తండ్రి వెదకుచు వచ్చువాడు. 'కావున నట్టి T. . . ________________


మనోవ్యాకులము . తనవలనఁ దండ్రికిం గలుగఁగూడదని యాతనియాశయము, వేళకు గొడుకు రాకయుండిన పల్లి యుమలించుచుఁ దల వాకిళిల్లుగా భావించి దారిఁ జూచు చుండును. "లేక లేక కలిగిన సంతానముపట్ల జననీజనకుల కట్టి భావముండుట లోక సామాన్య ధర్త మేకాని కొత్త కాదు.

ఆ బాలుఁడు పాఠశాలకు బోవుచు వచ్చుచుండునపుడా యూరనున్న నారీమణులు చూడ నోచిరేని యేదోయొక మిషచే మాటలాడించి కొని పోనీయరు. నాయనా! చదువుకొను చున్నా "వాయని యడుగువారు కొందఱు, అమ్మ బాగున్నదా.. నాయనగారికి గుశలమాయని ప్రశ్నించువారు కొందరు, ఏక్ష్యలో జదువుచున్నాఁడవు బాబూ అనియడుగువారింకొకరును గొందలు నిట్టే యేదో యడుగుచు నించు కాలము పుచ్చి యాతనిం గాంచి సంతసించి యిఁకఁబోయిరా బాబూ అని సాగు సంపువారు, ఇట్లు చూచినవారెల్ల నాసుశీలుని బ్రీతి పరస్పముగా మాటలాడించుచుండిరి. ఆకాంతామణులం గన్నెత్తి యెనం జూడక తల వంచుకోనియే బదులుపలుకు వాఁడు. ఇట్లు నానాటి కావిద్యార్థి యెల్లరమన్ననకుఁ బాత్రుడయ్యెను.

కనకవల్లియందే నివసించు 'వేరొక రాజకుటుంబము కాకరపర్తి యను 'గృహనామమునఁ బ్రసిద్ధమై యుండెను. సరపతి కుటుంబమునకన్న నీకుటుంబము భాగ్య సంపన్నము. మర్యాదగలదనియే ప్రతీతి. కాకరపర్తి కుటుంబమున కధికారి మధుసూదనరాజు. ఆయన ధర్మపత్ని యిందిరాంబ. వారికొక పుత్రుండు కలిగెను. సూర్యనారాయణవర్మ, యని నామకరణ మొనర్చి యాతనిం 'బెంచుచు మహానందము నొందుచు నా దంపతు లదృష్టవంతులమే యనుకొనుచుండిరి. సీతా రామ

"రాజునకు నీ బాలునకు వయస్సున నించుక భేదము. కొన్ని నెల లితండు చిన్న వాడు. ఒక్క వీదియందే నీ గృహములు "రెండుసు గలవు. రాజగృహములను సాధారణముగా దివాణ మని ప్రజలు పిలుతురు. ఈ రెండుగృహములు దివాణము అనియే పిలువబడుచుండెను. కాకరపర్తివారి యిల్లు. పెద్ద దివాణమనియు, నరపతివాల్లు చిన్న దివాణమనియు వాడుక గాంచెను. ఆశ్రితులు ఆ రెండు నివాములను నమ్ముకొని యెవరి యింటికి బోయినపుడు వారిని బొగడుచు జీవించుచుండిరి. ఈ స్తుతులు హరిహృదయమునం గల ప్రీతిని దెలుపునవి యనియే వారు తలంచిననుట తగద్దతి గాదు, ముఖ స్తుతులకు 'బేలుపోవని వారు లేరనకాదు గాని సామాన్యముగా, లేరన వచ్చును, మోల నుతించువాడు పరోక్షమున దూషించునని నమవచ్చును. మోల దోషముల నేకాంతమునఁ జెలుపువాఁడు పరోకమున వినుతించు ననవచ్చును. ఈ రెండు నియమము లకు సాధారణముగా లోపము రాదు. లోమున వంచకులు ముఖస్తుతులు చేయుదురు. తన పని కాగా లెక్కింపక యిచ్చ వచ్చినట్లు తూలనాడుదురు. శ్రేయస్సు కాండించువాఁడే మిత్రు డనంబడును, ఆతఁ డోంటరిపాటున నీయం దీదోషము లున్నవి. వాని నెట్టెనఁ దొలఁగించుకొనుమని హితోపదేశము "చేయు. ఆతఁడు మన మేలుకాంక్షించిన వాఁడు, మసము లేని తావున మన దోషములఁ గప్పిపుచ్చి యణువులుగా నున్న సుగుణములఁ గొండంతలు చేసి పొగడును,

.• . .. .. .. మిత్ర సమాఖ్యరత్న ముంజ్ . ..
శ్రీకరవర్ణ యుగ ను సృజిం చినయన్న తప్పు : డెన్వండో "

యన్న నూక్తి ప్రథితమేకదా. అట్టులా దివాణములు రెండును నాశ్రీతుల మూలమున విశ్లేషించి పొగడ్తఁగాంచెను.

సూర్యనారాయణరాజు కుముదవల్లి పాఠశాలకుఁ బంపఁ బడియెను. ప్రథమ ప్రవేశము గానఁ దొలుత బాథశాలాధి కారికిం దెలిపి యలంక రింపవలయునని ప్రార్థించి పలయు పరీథరములం బంపి మధుసూదన రాజు తన భాగ్యమునకుఁ దగినట్లుత్సవము చేయింపఁ బూనెను. ఉపాధ్యాయులందఱు ధన వంతుని కొడుకు చదువవచ్చుచున్న వాడనియుఁ దమకపు డపుడు బహుమతులు దొరకుచుండుననియుఁ దలంచి యా యుత్సవమునఁ బాల్గొనిరి. పాఠశాల బహిఎథ్వారము పచ్చని తోరణములచే గై నేయఁబడియెను. ఇరువంకల నరంటికంబ ములునుకులబడియెను, పండ్ల బరువున నని వంగియుండెను. అది మొదలు పాఠశాలవజకు వాళ్లు మార్గ మేర్పఱపబడి యుండెను. దానికి రెండు పక్కల మంచి చెట్లు పెంచఁబడి యుండెను. అవి మిక్కిలి చల్లగా నుండుటే శాక పూల తావుల వెదఁజల్లుచుండెను. పండ్రెండు నెలలు నాపూవులు కొఱఁత లేక యుండును, ఆవృక్షము లమెరికాయను దేశమున దక్షిణ భాగమునఁ గల (బ్రె జిల్) దేశమునుండి తెప్పింపఁబడినవని యెల్లరసుకొనుదురు, భరతఖండ వాసు లవ్యానంగాని పోని బోలిన వృక్షములఁ గాని చూచియే యెఱుంగరు. శీతల ద్రుమ ములనవచ్చును. పుష్పవృక్షము లనవచ్చును. ఆవూవులు నాకుల వలెనే యుండును. కాని వాని పరిమళము విచిత్రము. ముక్కు రంధముల నానందింపఁ జేయుటయే వానిషని. చూడ శృంగా రముగా నుండకయాకుసుమములు ధరింపవలయం నను కోరికను బుట్టింపక యుండును. చెంతనున్న వారికంటె దూరముననున్న వారాపరిమళము నాస్వాదించి సంతృప్తి నొందుదు కనుట నిర్వివాదము. ఆవృక్ష వర్ణములు లేతఁగా నున్నట్లే కసఁబడును. పండుటాకుల నెవ్వరును జూడఁ జూలదు. కింద బడునంత దనుక నవి లేతయాకులవలెనే యుండును. వానియందొక జిగురుండును. అది లేకుండుటయే వానికి జరము దశాయని యూహింపవలయును.


వాని నడుమునున్న మార్గము కన్నుల పండువు చేయఁ జాలును. మధ్యాహ్నమున గ్రీష్మ కాలము నాదారిని నడుచు వారు దాని వదలఁ జాలరు. కడుదూరముగా నీది వ్యాపించి యుండిన యెంత బాగుండునో యని యూహించువారు నేకులు గలదు. ఆతోవన నూటు బాహువులు పోవ నాగ దీప భవనము కనఁబడును. దానిని జూచినంతనే యపూర్వసంతోషము పొడసూసి యందుఁబఠించిన నెంతయో మేలుగలదనియే తోచును. దానిముందొక భాగము పొఠశాలనంటి ముందునకు సాగియుండును. దాని స్థంభము లిష్టకలచే నిండఁ బడినవి. ఎఱగా నవి యుండును. ఆది శకటములు నీలుచు తావు, శకటములపై ఁ జనువా రందు దిగి లోపలికిఁ బ్రోవవలయును. లోనికిం బోపంగనే విశాల సభాస్థల మొక్కటి చక్కఁగంగనం బడును అందుఁ గూరుచుండి యుపన్యాసములను వినుదురు, అది తూర్పు పడమరలకు సాగియుండు. దానికి 'రెండు ప్రక్కల 'బాలురకుఁ 'చాఠములు చెప్పు గదులుండుసు ఒక్కొక్క భాగమున నాఱేసి యవీ కలవు. అందుండి వచ్చు వా రాసభాస్థలమునఁ దమ గదులకడ నుండు మార్గమున వెలికిఁ బోవలయును. సభాస్థలముషం బీఠము లమర్పఁబడియే యుండును, అందుఁ గూరుచుండి వేదిక పై నిలుచుండి చెప్పుచుండునుపన్యాస

మును వినవచ్చును. అతఁడు పడమరమోముగా నిలుచుండును. ఆ పీఠములయందు శ్రమము లేక నాల్గునందలపై డెబ్బది యెదుగురు కూరుచుండవచ్చును ఆ పీఠములకు నిరు పక్కల విద్యార్థులు వేరొక గదికిఁ గొని వెలుపలికి గాని పోవ మార్గము వదలఁబడియుండెను.


ఆయుత్సవము మంగళవారమున సాగెను. కొందఱు మంగళ వారము విద్యా భ్యాస మొనరింప మొదలు పెట్టఁ బనికి 'రాదనిరి. కానపర్తివారి పురోహితుఁ డన్నంభట్టు. ఆయన తండ్రి, గొప్ప పండితుడని పేరుగాంచెను. ఈయన్నంభట్టు కూడ నిరక్షర కుక్షి గాఁడు కాని తండ్రి పేరు చెప్పుకొని బ్రదుక దగినంత పొండిత్యమును సంపాదించెను. పొండిత్యము గలదో "లేదో దేవుఁడెఱుంగును. కాని "మొండి పట్టుదల యందఱకుఁ బ్రత్యక్షునుగుచుండెను. అతనితో వాదమునకుఁ బూనుట రేగు చెట్టుపై సంగవస్త్రము వేసి దాని నూడఁదీసికొనునట్టిది. "కావున నేవ్వరాతనితో విశ్లేషించి వాదింపక తొలఁగిపోపుదురు. "మొండిపట్టుదలయొకండుగాక దుర్వాసుని స్తరింపఁ జేయు కోపము కూడ నతనికిం గలధు. వాడి బలహీనుఁడైన నొకప్పుడు భగ్నదంతుఁడు కాక తప్పించుకొని 'పోంజాలఁడని యందఱను కొందురు. నలుగురిలో నున్నప్పుడుకాని యతనితో వాదింపరు. ఆముహూర్తము నెవరో మంచిది కాదని మధుసూదన రాజు నకుం దెల్పిరి. అతనికింగూడ నించుకజంకు లేక పోలేదు. అన్నం భట్టు తనకు శరణ్యుఁడని యూరక విడుచువాఁడు కాఁడు. ముంగోపము పుట్టుకతో వచ్చినదే కాని నడుమ రాలేదు. వెనుక నిట్లంటిఁగదాయని పరితపించుటయు నాతని యలవాటులలో నొక్కటి. కోపమునాపుకొనఁ బ్రయత్నించుట - యన్నంభట్టు ప్రయత్నించిన ఫాఆఫామునఁ బోలేదు. రాజు ముహూర్తమును గొంద అనుమానించుచున్న వారన “శస్త్రం కుజే రేభ్య సేత్ ” అని జ్యోతిర్విదాభకణమున నున్నదని యతఁడు బదులు 'చెప్పెను. అప్పుడోక యభ్యాగతుఁడందుండి యా పొత్తమున నాశ్లోకమే లేద నెను. అన్నంభట్టు కన్ను 'లెజ్జ చేసి జ్యోతీర్విదాభరణము మూడు భాగములు. మూడవ భాగ మచ్చుపడ లేదు. మాయింట నున్నది. ప్రతిదినము దానిలోని తాటీయాకు. నొకదానిని దంతధావన జాలమున నాలుక పై గల మలినము వాపుకొన నుపయోగించుచున్న నాఁడను. నా పొత్తము హస్తగతము, అందు లేదేని పది వేల రజిత 'ముద్రికల నిత్తును. నీవిత్తువా ? పందెము కట్టుము. తెచ్చి చూపెదను. అని గద్దించెను. ఆతఁడులికిపడి యీతని బారి నుండి తప్పించుకొన్న సదృష్ట వంతుఁడనే యనుకొని మౌనముద్రను దాల్చెను. రాజు క్షత్రియులకు మంగళవారము శుభప్రద మేమో యనుకొని యట్లే కానిండనెను.

రెండవ యామమున మొదటి విఘటికలో సుత్సవముతో బాఠకాలం బ్ర వేశింప వలయునని మౌహూర్తికుని యానతి. కాన సుత్సవవాద్యములతో గనకవల్లి నుండి, బయలు వెడలి కుముదవల్లిఁ జేరి మధుసూదన రాజు పుత్రుఁడు తన్మిత్ర బాలురు బంధువులు సేవకులు కూడ రాగా సకాలమునం బాఠశాలఁ బ్రవేశించెను, ఉపాధ్యాయులు వారెదు రేగి పిలుచు కొనివచ్చిరి. ఆప్రవేశ కాలమున ద్వారముకడ నిలుచుండిన దీనాంధకబధిక కుబ్జవికలాంగులు “బాబూ భిక్షమిండు, భిక్షు మిండు” అని వేడుకొనుచుండఁగాఁ బిలువని పేరంటమనునట్లు ధర్మాత్ములు కొందఱు తము నెవ్వరు నియమింపకున్నను వారి నవ్వలికిఁ బొండని తిట్టికొట్టి తోసివైచిరి. మణికొందఱు వారిని ద్వరితముగ గెంటుఁడని పురికొలిపిరి, అంతియకాని యిట్టి మంచితరుణమున వారలకు సాయపడుఁడని ప్రోత్సహించువాఁ డొక్కఁడైన లేకుండెను.

పాఠశాలం బ్రవేశించినతోడ నే యెల్లరు 'బాలకుని తోడి బాలురలోఁ గూరుచుండఁ జేసి వాడుక చొప్పున 'నేదో యొక పొఠము బోధించినట్లు నటించిరి. ఒక యర్ధ ఘటికలో నెల్లరకు బుష్పఫలాదు లీయఁబడియెను. పన్నీరు చల్లఁబడియెను, ఎల్లరు బాలుని దీవించిరి, ఆనాఁటికి మధుసూదనరాజు నకు మర్యాద గనఁబఱచుటకుగాఁ బాఠశాల మూయఁ బడియెను. బాలురత్యుత్సాహమునఁ గేకలు వేయుచు నిండ్లకుఁ బోయిరి.


రెండవ ప్రకరణము.


సీతారామ రాజు పండ్రెండు వత్సరముల వయస్సు 'వచ్చునపు డుత్తమకక్ష్యలోఁ జదువుచుండెను. దానిపై కక్ష్యయే యా పాఠశాలయందు హెచ్చుది. దానీ పరీక్షలో గృతార్జుఁడైనచో విద్యావంతుఁడను పేరుఁ గాంచును. ఆ పేరు గలవారలలోఁ దాను బ్రథమగణ్యుఁడు కావలయునన్న యుత్సాహ కాబోలుని మనస్సున దినదినాభివృద్ధిని గాంచు చుండెను. ఉత్సాహమే మానవునకు బలము, ఉత్సాహమే