సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అవిసెన్నా
Appearance
అవిసెన్నా - క్రీ.శ. 980-1037 :- ఇతడు పర్షియా దేశస్థుడు, బొఖారాకు సమీపమునగల ఒక ప్రదేశమున జన్మించెను. వైద్యులందు అగ్రేసరు డని పేరు పొందెను. ఇరువది నాలు గేండ్ల లేబ్రాయముననే ఆస్థాన వైద్యపదవిని పొందిన ప్రతిభాశాలి. ఇతనికి సాహిత్యాభిలాష మెండు. యూరపుఖండమునందలి వైద్యశాస్త్రముపై కనపరచిన ఇతని కృషి ప్రాబల్యము మిక్కుటము, 1650 సంవత్సరము వరకు కూడ 'కానకా' అను పేరుగల ఇతని వైద్యశాస్త్ర గ్రంథము వైద్యశాస్త్ర బోధనాలయములందు పాఠ్యగ్రంథమై యుండెను. నీటిసరఫరా, శీతోష్ణస్థితి. ఋతువులు, వీనిఫలితముగ మానవుల ఆరోగ్యమునందు కనబడు మార్పులను ఇతడు గుర్తించెను. ప్రయాణించు వారికి సలహాలు, వృద్ధుల విషయమై వహించవలసిన శ్రద్దగూడ ఈ గ్రంథమున పేర్కొనబడినవి.
డా. వే. రా.