సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అశోకుడు
Appearance
అశోకుడు - క్రీ. శ. 273-232:- అశోకుడు మౌర్యచక్రవర్తులలో అగ్రగణ్యుడు. సుమారు క్రీ. పూ.804 వ సంవత్సరమున రెండవ మౌర్యచక్రవర్తి యగు బిందుసారునకును, సుభద్రాంగికిని జన్మించెను. ఇతడు తండ్రి జీవిత కాలములో తక్షశిల రాజధానిగాగల ఉత్తరా పథమునకు రాజప్రతినిధిగా నుండి క్రీ. పూ. 278 లో తండ్రి మరణాంతరము చక్రవర్తి యయ్యెను. కాని క్రీ. పూ. 289 వరకు అనగా తండ్రి మరణించిన నాలుగు సంవత్సరముల వరకు పట్టాభిషిక్తుడు కాలేకపోయెను. ఈ మధ్యకాలములో అతనిపై కత్తిగట్టిన అతని సోదరులతో యుద్ధము చేయవలసివచ్చుట ఈవ్యవధికి కారణము కావచ్చును. అతని మంత్రియగు రాధాగుప్తుడు అతడు చక్రవర్తి యగుటకు చాల సహాయపడెను.
యుద్ధముపై ద్వేషమును జనింపజేసెను. యుద్ధమువలన పెక్కుమందు సైనికులు మరణించుటయో' గాయపడుటయో. శత్రువులచే జిక్కుటయో తటస్థించును. వారి కుటుంబములకు మిక్కిలి కష్టనష్టములు కలుగును. ఇవి వారి సన్నిహితులను కలచివైచి పెక్కు విషాదములకు దారితీయును. ప్రజానీకమును ఇట్టి కష్టములపాలు చేయుట అశోకుని కెంతమాత్రమును ఇష్టములేదు. కావున కళింగ యుద్ధానంతరము ఆతడు రణభేరికి బదులు ధర్మభేరిని మ్రోగించెను. కొన్ని ఆధారములనుబట్టి కళింగ యుద్ధానంతరము బౌద్ధసన్యాసి ఐన ఉపగుప్తుడు అశోకునకు చేసిన బౌద్ధ మతోపదేశము ఈ పరివర్తనమునకు చాలవరకు తోడ్పడేనని తెలియుచున్నది. తత్ఫలితముగా నతడు జీవిత శేషమున రణరంగమున కాలిడ నని ప్రతినపట్టుట యేగాక మానవకల్యాణమునకు మార్గమును చూపునట్టి అహింసను, నిగ్రహమును, సచ్ఛీలమును ప్రజలందరి అలవరుచుటకు పూనుకొనెను, ఈ విధముగ తన జన్మమును సార్థకము చేసికొని,"దేవనాం ప్రియ” "ప్రియదర్శి" అను బిరుదములను పొందెను. అశోకుడు క్రీ. పూ. 282 సంవత్సరమున మరణించెను.
అశోకుని పరిపాలనము: అశోకుని రాజ్యము మిక్కిలి విస్త్రీర్ణము కలిగియుండెను. దక్షిణమున కొంతగథాము తప్ప భారత దేశమునంతను ఆతడు పరిపాలించెను. మన దేశముతో పాటు ఆరియా, ఆరోకోషియా, గెడ్రోషియా పారోపానీసా దై రాష్ట్రములుకూడ అతని అధీనమున నుండెను. వెషావర్ లోని మనసహోరా షాలజ్ గర్హా, లోను, డేరాడూను దగ్గరనున్న ఆశోకుడు లోని సోపారాలోను, కథియవాడులో నున్న గిర్నారు లోను, పూరీ జిల్లాలోని ధేలీలోను, గంజాములోని జౌగడలోను, మైసూరులోని చితల్ దుర్గములోను, జబ్బల్ పూరు దగ్గరనున్న రూవ్ నాథ్ లోను, బీహారులోని సహస్రనామ్ లోను, తదితర ప్రదేశములలోను ఉన్న అశోకుని శాసనముల ఆధారముగా అతని రాజ్య విస్తీర్ణము నిర్ణయించుటకు వీలై యున్నది. కాని కళింగ దేశముతప్ప మిగతాసామ్రాజ్య మంతయు అశోకుని తండ్రి యగు బిందుసారుడును, తాతయగు చంద్రగుప్తుడును జయించినదే.
అశోకుని సామ్రాజ్యమునకు పాటలీపుత్రము రాజధానిగా నుండెను. అశోకుడు తన రాజ్యమును నిరంకుశముగా పరిపాలించినను తన ప్రజలను తండ్రి వలె నాదరించెను. స్మృతులను గమనించి, శిష్టాచార పరాయణుడై, పెద్దల సలహాలను మన్నించుచు. తన ప్రభుత్వమును మంచి పునాదులపై నిలిపెను. కాల్సీలోను. ధారో రాష్ట్రము మరియు హిందూరాజ్య సంప్రదాయము ననుసరించి అశోకుడు ప్రజల యోగ క్షేమములను తెలిసికొనుటకు వివిధ ప్రాంతములకు యాత్రలు వెడలుచుండెను. అతనిక్రిందనున్న సామంతులు ప్రజలను కష్ట పెట్టుకుండ, వారికి క్షేమకరములగు పనులు చేయుటయందు అలసతను వహింపకుండ, కనిపెట్టుటకు గూఢచారులను నియమించెను. ఇన్ని ఏర్పాట్లు గావించినను ఒక్క ప్రభువు రాజ్యమంతయు స్వయముగా పరిపాలించుటకు వీలు కాదని యెరిగి అశోకుడు తన రాజ్యమును అనేక రాష్ట్రములుగా విభజించి సరిహద్దు రాష్ట్రములలో తన రాజకుటుంబములోని వారిని రాజప్రతినిధులుగ నెలకొల్పి తక్కిన రాష్ట్రముల పరిపాలనకై బిరుదుగల
రాజప్రతినిధులను ఏ ర్పాటు చేసెను. తక్షశిల, ఉజ్జయిని, తోసాలి, సువర్ణగిరి అను ఈ నాలుగు పరగణాలును సరిహద్దు రాష్ట్రములుగా పేర్కొనబడినట్లు కళింగ శాసనముల మూలమున తెలియుచున్నది.
ఆశోకుని మతము: అశోకుడు కళింగ యుద్ధానంతరము బౌద్ధమతము నవలంబించె నని తెలియుచున్నది.అతడు ఒక శాసనములో తాను బౌద్ధశాక్యుడ నని చెప్పుకొని యున్నాడు. అంతేకాక క్రీ. పూ. 258 వ. సంవత్సరమున బౌద్ధధర్మముల నన్నింటిని సదుద్దేశముతో విమర్శించుటకు మొగలిపుత్ర టిస్సా యొక్క అధ్యక్షతలో మూడవ బౌద్ధ సమావేశమును ఏర్పాటు చేసెను. బౌద్ధులకు పవిత్రస్థలములైన బుద్ధగయ, లుంబినీవనము, కపిలవస్తు, సారనాథ్, శ్రావస్తి, కుశీనగరము మొదలగు స్థలములకు యాత్ర వెళ్లెను. బౌద్ధధర్మవ్యాప్తికై ధర్మమహా మాత్రులను నియమించెను. జంతువులను బలియిచ్చుట మొదలగు అలవాటులను మాన్పించెను. బౌద్దులకు ముఖ్యమైన దినములను ఉత్సవదినములుగా పరిగణించెను. ఇట్టి ప్రమాణములవలన అశోకుడు బౌద్ధమతాభిమాని యని ఘంటాపథముగా చెప్పవచ్చును.
అశోకుడు బౌద్ధమతాభిమాని అయినను, పరమతముల యెడ ద్వేషభావము లేనివాడై అన్నిటిని సమభావముతో చూచెను. ఈ విధముగ అశోకుడు ధర్మ సంస్థాపనార్థము తన సర్వస్వము త్యాగము చేసి విజయముగాంచి ప్రపంచచరిత్రలో అద్వితీయ స్థానమును పొందెను.
అశోకుడు బౌద్ధమతాభిమాని అయినను, పరమతముల యెడ ద్వేషభావము లేనివాడై అన్నిటిని సమభావముతో చూచెను. ఈ విధముగ అశోకుడు ధర్మ సంస్థాపనార్థము తన సర్వస్వము త్యాగము చేసి విజయముగాంచి ప్రపంచచరిత్రలో అద్వితీయ స్థానమును పొందెను.
అశోకుడు - ధర్మము: అశోకుడు బోధించిన ధర్మము ఆచరణ సౌలభ్యము కలదనియు, సర్వజన సమ్మతమైన దనియు చెప్పవచ్చును. తల్లిదండ్రులయందు భక్ తికలిగి యుండుట, పెద్దలను గౌరవించుట, బ్రాహ్మణుల యెడ, శ్రమణులయెడ మర్యాదగా ప్రవర్తించుట, దాసులను దయతోచూచుట, అహింస, సత్యము, శౌచము, దానము దయ, మార్దవము, సాధుత, సంయమనము, భావశుద్ధి, కృతజ్ఞత, దృఢభక్తి, ధర్మరతి మొదలగు అంశములతో కూడిన ధర్మమును అశోకుడు ప్రజలకు బోధించెను. అశో కుడు తాను నమ్మిన ఈ ధర్మములను దేశములోను, దేశాంతరములోను ఉన్న ప్రజానీకమునకు అంద జేయుటకు అనేక మార్గములను, పద్ధతులను అనుసరించెను.
- ప్రప్రథమముగా అశోకుడు తాను నమ్మిన ఆదర్శముల లక్ష్యములను స్వయముగా ఆచరణలో పెట్టెను.రాజులకు ప్రీతికరముగు మృగయావినోదములకు స్వస్తిచెప్పెను. వేటకు మారుగా రాజ్యములోని ప్రజల క్షేమమరియుట, పవిత్రస్థలములను, జనులను సందర్శించుట ధర్మబోధచేయుట, దేశయాత్ర చేయుట, మొదలగు పనులలో కాలము గడపెను. మాంసభక్షణమును మానివేసెను. ఈ ఆదర్శములతోనే అశోకుడు మనుష్యులకు, జంతువులకు వైద్యశాలలు కట్టించేను. ప్రయాణించు వారికి సౌకర్యార్థము బాటలను వేయించెను. దారికి ఇరుప్రక్కల చెట్లు నాటించి బావులను త్రవ్వించి చలి పందిళ్ళను వేయించెను.
- అశోకుడు తన సామంతులు తమ తీరిక వేళలయందు ప్రజలకు ధర్మోపదేశము గావించుచుండవలెనని శాసించుటయేగాక తన ధర్మమును ప్రజలకు సులభముగ అందజేయుటకు ధర్మమహామాత్రులను నియమించెను.
- అశోకుడు తన ధర్మము జగమందంతటను వ్యాపింపజేయుటకై బౌద్ధ ధర్మోపదేశములను కాశ్మీరము, గాంధారము, యవనము, హిమాలయ ప్రదేశము, బర్మా,సింహళము మొదలగు దేశములకు పంపెను. ఈ సందర్భములోనే అశోకుని కుమారుడైన మహేంద్రుడు, కుమార్తె అయిన సంఘమిత్ర సింహళమునకు వెళ్ళినట్లు తెలియుచున్నది.
- అశోకుడు ధర్మాభివృద్ధికై ధర్మశాసనములను చెక్కించి దేశములోని ముఖ్యమయిన ప్రదేశములలోను, సరిహద్దులందును ప్రతిష్ఠించెను. ఈశాసనములు ప్రాకృత భాషలో కొన్ని, ఖరోష్ఠిలిపిలో కొన్ని, మిగిలినవి బ్రాహ్మీ లిపిలోను వ్రాయబడి యున్నవి. అశోకుని శాసనములను ఎనిమిదివిధములుగా విభజింపవచ్చును. పదునాలుగు శిలాశాసనములు, రెండు కళింగశాసనములు, మూడు గుహాశాసనములు, రెండు టిరాయి స్తంభ శాసనములు, ఏడు స్తంభశాసనములు, పరిశిష్ట స్తంభ శాసనములు, లఘుశిలాశాసనములు, భాభ్రాశాసనములు అనునవి.
ఆ.వై.