Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అయస్కాంత శాస్త్రము

వికీసోర్స్ నుండి

అయస్కాంత శాస్త్రము  :- కొన్ని ఇనుప ముడి ఖనిజములయందు తొలుత కనుగొనబడిన ఒక వింతయగు గుణమును అయస్కాంతత్వ మందురు. క్రీ. పూ. 470సం. దాపులో, ఏషియామైనరు దేశములో నొక భాగమగు మాగ్నిషియా అను ప్రదేశములో 'మాగ్ని టైటు' (స్కాంతాయితము) అను ఖనిజము కనుగొనబడినట్లు ఊహింపబడుచున్నది. స్వేచ్ఛగా వ్రేలాడతీయబడిన ఈ ఖనిజపు ముక్క. ఎల్లప్పుడును సామాన్య ఉత్తర దక్షిణ దిశలను చూపుచుండుట పరిశీలించిరి. ఒకేకొన ఎల్లప్పుడు ఉత్తర దిశను చూపుచుండుట వలన అది 'దిక్సూచిక శిల ' (Lode Stone) అని పిలువబడినది. ఉత్తర దక్షిణ దిశలను చూపుకొనలు 'ఉత్తర ధ్రువము' అనియు 'దక్షిణ ధ్రువము' అనియు పిలువబడుచున్నవి. ఈ విషయ మెప్పు డావిష్కరింపబడినదో చెప్పుట కష్టముకాని, 1600 సం.లో డాక్టర్ గిల్బరు అను వైద్య శాస్త్రజ్ఞుడు ప్రచురించిన డిమాగ్నెట్ (Demagnete) అను గ్రంథము ప్రాచీనగ్రంథ ములలో నుత్కృష్టమైనది. స్వాభావికముగా అయస్కాం తత్వము కలిగియుండనీ పదార్థములు, ఏదైన ప్రత్యేక విధానము వలన ఆధర్మమును పొందినచో అట్టి పదార్థము లను కృత్రిమఅయస్కాంతము లందురు, అయస్కాంతత్వము, ఇనుములో గాని, ఉక్కులో గాని వివిధ పద్ధతుల వలన ఉత్పత్తిచేయవచ్చును. ఉదా: 293 అయస్కాంత శాస్త్రము ఈ రెండు లోహపు కడ్డీలలో దేనినైనను శక్తిమంతమగు అయస్కాంతముతో రుద్దినపుడు, అది అయస్కాంతీకర ణము చేయబడును. ఒక ఇనుప ముక్కకు, విద్యుత్ప్రవా హము గలిగి విద్యుద్బంధముచేయబడిన తీగ చుట్టుటవలన దానిని అయస్కాంతముగా చేయవచ్చును. అప్పుడు ఇనుపముక్కను 'విద్యుదయస్కాంత' మందురు. పదార్థ ములు, అయస్కాంతీకరణము చేయబడినపుడు వానికిగల ప్రవేశ్యతను, అయస్తాంతత్వ ధారణ శక్తిని బట్టి అవి వివిధ ములుగా నుండును. ఉదా: మెత్తని ఇనుము ఎంత సులభ ముగా అయస్కాంతీకరణము నొందునో అంత సులభ ముగా దానిని కోల్పోవును. కొన్ని ఉక్కులు, అట్లుకాక అతి కష్టముతో అయస్కాంతీకరణము చేయబడి, ఆధర్మ మును చాల కాలము నిలువ బెట్టుకొనగలవు. అట్టి ఉక్కుతో తయారుచేయబడిన అయస్కాంతములు 'శాశ్వతాయ స్కాంతము'లని పిలువబడును. సామాన్యముగా అట్టివి కడ్డీరూపమున గాని, లేక గుఱ్ఱపునాడ ఆకారమున గాని, పట్టీరూపములో గాని చేయబడును. ఒక కడ్డీ అయస్కాం తము, ఇనుప రజములో ముంచబడినప్పుడు, దాని కొనల చుట్టును చాల ఇనుపరజము అంటుకొనును. కాని మధ్యభాగము నందు అట్లుగాక చాల కొద్ది అయస్కాంత చర్య మాత్రమే కనబడును. దీనిని బట్టి అయస్కాంతము యొక్క కొనలు ‘అయస్కాంత ధ్రువములు' అని నామ కరణము చేయబడినవి. అవి ఉత్తర దక్షిణ దిశలను చూపు టచే ఉత్తర దక్షిణ ధ్రువము అనియు పిలువ బడును. ప్రయోగముల ఫలితముగా ఈ క్రింది విషయములు తెలియును : 1. '1' పొడవుగల అయస్కాంతపు కడ్డీలో రెండు ధ్రువముల మధ్య దూరము దాదాపు శ్రీ / ఉండును. 2. సజాతి ధ్రువములు (రెండు ఉత్తర ధ్రువములు, మరియు రెండు దక్షిణ ధ్రువములు) ఒక దానిని ఇంకొకటి వికర్షించును. విజాతి ధ్రువములు (అనగా ఉత్తర దక్షిణ ధ్రువములు) ఒకదానిని ఇంకొకటి ఆకర్షించును. దిక్సూచిసూదివంటి అయస్కాంతీకరణము చేయబడిన వస్తువును ఒక శక్తిమంతమగు దండాయస్కాంతము దాపులో నుంచిన, 1 వ పటమునందువలె ఒక ప్రత్యేక దిశకు మరలును, దిక్సూచి యొక్క స్థానము మార్చినచో అది చూపు దిశ కూడా మారుచుండును (ప. 1) అట్లు దానిని త్రిప్పు

పటము 1. అయస్కాంతక్షేత్రము, అయస్కాంత శక్తి రేఖలు. N S= శ క్తిమంతమగు దండాయస్కాంతము N S= దిక్సూచియొక్క సూది ఉండు దిశ.

శక్తిగల ప్రదేశమును 'అయస్కాంత క్షేత్రము' అందురు. ఆవిధముగా అయస్కాంతము చుట్టును అయస్కాంత క్షేత్రము ఉండును. దాని యొక్క గాఢత, వైశాల్యము, NS అను దండాయస్కాంతము యొక్క బలముపై ఆధారపడియుండును. స్వేచ్ఛగా తిరుగు అయస్కాంతపు సూది ప్రతిబిందువుదగ్గర తిరిగినదిక్కుగా గీతలను గీసినచో ఆ గీతలు ‘అయస్కాంత శక్తిరేఖ' లనబడును. ఈ గీతలు వాస్తవముగ లేనప్పటికి అవి నిజమైనవనియు, అవి కొన్ని ధర్మములను కలిగియున్న వనియు ఊహించుకొనుట మంచిది. ఉత్తర ధ్రువమునుండి దక్షిణధ్రువము వైపు అవి ఎల్లప్పుడును వచ్చుచున్నట్లుగా ఊహింపబడుచున్నవి. ఆ రేఖలకు ఒక విధమగు బిగువు కలదనియు, అవి ఒక దానినొకటి వికర్షించు శక్తికలవనియు భావించుట అనుకూలముగా నుండును. ఒక బిందువు దగ్గర ఉంచబడిన ప్రమాణ ధ్రువముపై గల శక్తి చర్యను, ఆ క్షేత్రమునకు లంబముగా ఉండు ఉపరితలముపై ఒక చదరపు సెంటిమీటరులో గీయబడిన రేఖల సంఖ్య వలన, కనుగొనుట ఆచారముగా నున్నది. ఒక ప్రమాణపు అయస్కాంత క్షేత్రమును, ఒక ప్రమాణధ్రువముపై దాదాపు ఒక మిల్లీగ్రాము బరువుగల ఒక 'డైను' శక్తి చూపునట్టి క్షేత్రముగా నిర్వచింతురు.

నిత్యజీవితము నందలి ప్రయోగాత్మక విషయములలో అయస్కాంతపు చర్య యొక్క ప్రాముఖ్యము చాలవరకు

విద్యుత్ప్రవాహపు దృగ్విలాసముతో దానికిగల సన్నిహిత సంబంధమును బట్టి యున్నది. ఎట్టి పరిస్థితులలో నైనను, నిజముగా అయస్థాంత క్షేత్రము ఉత్పత్తి కాకుండ ఒక వాహ కమునందు విద్యుత్ప్రవాహమును ప్రవహింపచేయుట సాధ్యముకాదు. విద్యుత్ప్రవాహమును తీసికొనిపోవు పొడుగైన తిన్నని తీగలో అయస్కాంత రేఖలు వలయా కారముగ ఉండి, ఆవృత్తముల యొక్క కేంద్రములు తీగ యొక్క ఇరుసుపై పడుటయు, వాని సమతలములు దానికి లంబముగా నుండుటయు సంభవించును. (ప.2)

పటము 2. విద్యుత్ప్రవాహముకల తీగను చుట్టియుండు అయస్కాంత క్షేత్రము,

తరచుగా నాళాథము (solenoid) అని పిలువబడు తిన్నని స్తూపాకారములో చుట్టలుగా చుట్టబడిన తీగగుండా ప్రవాహమును పంపినపుడు, కడ్డీ అయస్కాంతముతో తయారైన క్షేత్రము యొక్క సాదృశ్యము కల క్షేత్రము ఉత్పత్తియగును. (ప. 3) ఆ శక్తిరేఖలు పూర్తిగా గాలిలో నుండుటయు, ఇనుము యొక్క వింతధర్మములచే మార్చ బడకపోవుటయును మాత్రమే భేదము.

పటము 3. దట్టముగా చుట్టబడిన నాళాభముయొక్క అయస్కాంత క్షేత్రము. విద్యుత్ప్రవాహపు బలమును వృద్ధిచేయుటచేతను, తీగ యొక్క చుట్లసంఖ్య పెంచుటచేతను, బలతరమైన విద్యుత్ క్షేత్రము కేంద్రమునందు ఉత్పత్తి చేయబడును. ఆ తీగ చుట్టలోనికి మెత్తటి ఇనుపముక్కను ప్రవేశ పెట్టినచో అది శక్తిమంతమగు తాత్కాలికాయస్కాంతముగా మారును. పదును చేయబడిన ఇనుప ముక్కలను గాని ఉక్కు ముక్కలనుగాని ఉంచిన, అవి అదేవిధముగా బలమైన శాశ్వతాయస్కాంతములుగా నగును.

నవీన విద్యుత్ - విధానములయొక్క అవసరములను బట్టి విద్యుత్ శక్తి ఉత్పత్తికిని, ప్రచారమునకును సంబంధించి ఇనుము యొక్క అయస్కాంత ప్రవర్తనములు జాగ్రత్తగా పరిశీలింపబడినవి. ప్రధానమగు లక్షణములను గూర్చి సంక్షేపముగా మాత్రమే ఇచట వివరింపబడును. విద్యుత్ ప్రవాహము, పొడుగైన నాళాభము (సాలి నాయుడు) ద్వారా ప్రవహించుచున్నదనుకొనుము. నాళాభము లోపలనుండు అయస్కాంత క్షేత్రము యొక్క బలము, ఆ తీగచుట్టల సంఖ్యలను విద్యుత్ప్రవాహపు విలువనుబట్టి తెలిసికొనవచ్చును. ఇనుపముక్క లేనపుడు ఆ అయస్కాంత క్షేత్రబలమును తెలుపుటకు సాధారణముగా H గుర్తుగా ఉపయోగించబడును. ఇది 0.4 ni కి సమానముగా నుండును. ('n' అనగా 1 సెంటి మీటరునందు తీగచుట్ల యొక్క సంఖ్య. i' అనగా విద్యుత్ప్ర వాహము విలువ అంపియరులలో) ఇప్పుడు ఒక ఇనుపముక్క నాళాభములోనికి ప్రవేశ పెట్టబడినపుడు, అయస్కాంత క్షేత్రము వృద్ధిచెందినట్లు తెలియును. ఇనుప ముక్కగాని, మరియే ఇతర అయస్కాంత పదార్థము యొక్క సమక్షమునగానీ అయస్కాంత క్షేత్రము యొక్క బలము, B చేత గుర్తింపబడును. ఇనుము సమక్షములో H కన్న B అధికముగా నుండును. B, H ల నిష్పత్తి 'u' ప్రవేశ్యత అని పిలువబడును. ఈ ప్రవేశ్యత, ఇనుము యొక్క స్వభావముపైనను, అయస్కాంత క్షేత్రశక్తిపైనను ఆధారపడి మారుచుండునట్టి కారణరాశి. ప్రథమ క్షేత్రమగు H, 'అయస్కాంతీకరణ క్షేత్ర ' మనియు, రెండవదియగు B 'అయస్కాంత ప్రేరణము' అనియు పిలువబడుచున్నవి. అనగా, ఒక చదరపు సెంటి మీటరు వైశాల్య ప్రమాణముగల గాలి యందలి అయస్కాంతశక్తి రేఖల సంఖ్యను H గాను, ఒక్క చదరపు సెంటిమీటరు వైశాల్యముగల ఇనుము లేక మరి ఇతర అయస్కాంతపదార్థములోని అయస్కాంతపు శక్తి రేఖల సంఖ్యను B గాను, వివరింపనగును. H పరిమాణముల సమమగు అయన్కాంత క్షేత్రమునందు ఒక పదార్థము పెట్టబడినపుడు, ఆ పదార్థము అయస్కాంత ప్రేరణము వలన, అయస్కాంతీకరణము చేయబడునని చూపింప నగును. పదార్థముగుండా పోవునట్టి అయస్కాంత శక్తి రేఖల మొత్తపు సంఖ్యను 'B' వలన తెలియనగును. B=H+4nI.

I అయస్కాంతీక రణముయొక్క గాఢత్వమును సూచించురాశి, (m అనునది అయస్కాంత ధ్రువము యొక్క శక్తిగాను, 1 అనునది అయస్కాంత ధ్రువముల మధ్యదూరముగాను తీసికొనిన, 'ml' అను గుణిజము అయస్కాంతబిభ్రమిష " (Magnetic moment) గా పరిగణించనగును.) పై సూత్ర మొత్తమును H చేత విభజించిన ఎడల మనకు =1+4 అను నిష్పత్తి ప్రవేశ్యత గాను, అగును. అను నిష్పత్తి గ్రహణశ క్తి 'K' గాను, పిలువబడుచున్నవి. అందువలన అయస్కాంతపు ప్రవేశ్యతకును గ్రహణశక్తికిని గల మధ్య సంబంధము = 1+47K గా నుండును.

అయస్థాంత తటస్థస్థితిలోనుండు ఇనుమును, ఒక నాళాభములో నుంచి, క్రమముగా సున్న నుండి విద్యుత్ ప్రవా హమును వృద్ధిచేసిన ఆ ఇనుము యొక్క అయస్కాంత క్షేత్రము క్రమముగా పెరుగుచుండును. B, H లకు గల విలువల తారతమ్యములను బట్టి కొన్ని చిత్రమైన ఫలితములు వచ్చును. B, H సంబంధమును చూపు గ్రాఫ్ చిత్రమును అయస్కాంతీకరణ లేఖ్యము అందురు (ప.4).

H= సున్నగా నున్నవుడు, B సున్నగాను, H పెరుగు కొలది B విలువ తొలుత క్రమేణ పెరుగుచు, తరువాత అతి త్వరితముగా వృద్ధియగు క్షేత్రముతో, విరివిగా కోబాల్టు (cobalt) కు 30 అగునంతవరకు పెరుగును. 30 వచ్చిన

తరువాత, B యొక్క వృద్ధియందలి వేగము Hతో, త్వరితముగాను, కొలదిగాను పడిపోవుటకు ప్రారంభించి,అంతకంటె ఎక్కువ యగుటకు వీలులేనట్టి విలువను

పటము 4. H. ఆయస్కాంత క్షేత్రబలము - ఓరుస్టెడ్ లలొ సాధారణ ఇనుము, కోబాల్టు, నికెలులయొక్క ఆయస్కాంతీకరణపు రేఖాచిత్రములు.

B పొందును. అప్పుడు ఆ పదార్థము సంతృప్త అయస్కాంతీకరణము నొందినదని చెప్పవచ్చును. అట్టి సంతృప్త స్థానమును పొందిన తరువాత అయస్కాంత క్షేత్రమును తగ్గించినచో B యొక్క విలువలు, H వృద్ధినొందునపుడు ఉన్న దాని విలువలతో సమముగా నుండవు.

H సున్నగా చేయబడి, మరల అధికమైన విలువలోనికి తేబడినపుడు B, abcde అను వంపును కలుగజేయును. క్షేత్రము క్షీణింపచేయబడినపుడు ఏర్పడు అయస్కాంత ప్రేరణముయొక్క వింతయగు ఈ మందత్వమును ( వెనుకబడిన తనమును) 'హిస్టెరిసిస్' (Hysteresis)'మందాయనము” అందురు. H ని సున్నగా తగ్గించినపుడు,B సున్నగా కాక, ౦b అను ఒక విలువను కలిగియుండునని స్పష్టముగా తెలియుచున్నది. ఈ విలువను 'శేషాయస్కాంతత్వము' (Residual Magnetism) అందురు (ప.5). ఈ మందాయనముయొక్క చుట్టు వైశాల్యము ఒక పూర్తి పరివర్తనములో అయస్కాంతీ కరణము జరిగినపుడు జనించు ఉష్ణశక్తిని కనుగొనుటకు ఉపయోగించును.ఇది విద్యుమోటారుల నిర్మాణము లందును, విద్యుత్ పరివర్తన యంత్రముల నిర్మాణములకు సంబంధించిన నిర్మాణాత్మక మైన ప్రయోజనములను కలిగియున్నది.

పైన చెప్పబడిన విధముగా విద్యుత్ప్రవాహము ఎల్లప్పుడును అయస్కాంత క్షేత్రముతో కూడుకొని యుండును. అయస్కాంతత్వమునకు విద్యుత్ప్రవాహము నకును ఉండునట్టి సంబంధ దృగ్విషయమును, తొలుత 1819 సం లో విద్యుత్ప్రవాహమును తీసికొనిపోవు తీగకు పరిసరములో లంబముగా నుంచబడిన అయస్కాంతపు సూదికొన విక్షేపమును పరిశీలించినట్టి ఓరుస్టెడ్ అను శాస్త్రజ్ఞుడు కనిపెట్టెను.

1845 సం. పగకు అయస్కాంతముచే ప్రభావము నొందింపబడు పదార్థములు ఇనుము యొక్క జాతికి సంబంధించిన పదార్థములు మాత్రమే యని నమ్మబడు

చుండెడిది.(అనగా ఇనుము,నికెలు, మణిశిల లేక కోబాల్టు.) 1845 సం. లో ఫారడే, వేరొక ఫలితము కొరకు ప్రయో గములు జరుపుచుండగా అయస్కాంత క్షేత్రమునందు ఉంచబడిన గాజు, ఇనుము కనబరుచుచున్నట్టి అయస్కాంత ధర్మములకు వ్యతి రేకముగా నుండు ధర్మములను చూపించుటను కనుగొనెను. బిస్మత్ అను లోహము కూడ ఎక్కువ బలముగా అట్టి ధర్మములనే ప్రదర్శించినది. అతడు ఘన, ద్రవ, వాయు స్థితులలో నుండు చాల పదార్థములను వానికి గల అయస్కాంత ధర్మములకై పరీక్షించి, అన్ని పదార్థములును మూలకములైనను సంయోగములైనను, ఇనుమువంటి లేక గాజువంటి అయస్కాంతత్వములు పొందియున్నవని వివరించుచు, అయస్కాంత రసాయన శాస్త్రమునకు పునాదివేసెను. అతడు ఈ క్రింది విధముగా వర్గీకరించెను.

1. ఇనుము, మణిశిల (కోబాల్టు), నికెలు స్ఫటము (అల్యూమినియం,)క్రుమము(క్రోమియం), పొటాసియం, సోడియం, మగ్నము(మగ్నీషియం), మాంగనము(మాంగనీసు), తగరము, ఆమ్లజని మొదలగు పదార్థములను అయస్కాంత క్షేత్రమునం దుంచిన, అవి క్షేత్రమునకు సమానాంతరముగా నుండునట్లు ఏర్పాటగును. అట్టి పదార్థములను ఏకాధిచుంబక (Paramagnetic) పదార్థములందురు.

2. సీసము, బంగారము, రజతము, కర్బనము, తామ్రము, గంధకము, అంజనము (ఆంటిమొని), బిస్మత్,నీరు మొదలగు పదార్థములు, అయస్కాంత క్షేత్రము నందుంచబడినవుడు, క్షేత్రమునకు లంబముగా ఉండునట్లు ఏర్పాటు కావించుకొనును. (ప. 6) అట్టి పదార్థములను ఏకోనచుంబక (డయామాగ్నెటిక్) పదార్థములందురు. అట్టి పదార్థములు అయస్కాంతముచే వికర్షింపబడును. పేరామాగ్నటిక్ పదార్థములు అయస్కాంతముచేత ఆకర్షింపబడునవి. ఇనుము, కోబాల్టు, నికెలు మొదలగు

పటము - 6. ఆయస్కాంతక్షేత్రమున ద్రవము

నవి అయస్కాంతము చేత గాఢంగా ఆకర్షించబడును. అట్టి పదార్థములను ఫెర్రోమాగ్నటిక్ (ferromagnetic) పదా ర్థములందురు. ఈ విధముగా ఫారడే, ప్రతి పదార్థమును ఏదోఒక రూపములో కొంచెముగనో, ఎక్కువగనో చుంబ

పటము 7 -క్షేక ఇనుప కడియము వలన ఏకరూప 'ఒత్రము చెందుమార్పు

కీయ పదార్థమని చూపించెను. అతడు ఇంకను డయా మాగ్నటిక్, పేరామాగ్నటిక్ పదార్థములు, వాటి అయస్కాంతత్వమును, బయట నుండు క్షేత్రప్రభావము వలననే ఉంచుకొనగలవని నిర్ణయించెను. (ప.7)

అయస్కాంతత్వవిషయములో అతి విజయవంతములగు పరిశోధనలలో నొకటి, మేరీక్యూరీ భర్తయగు పీరీ క్యూరీ చేసినది గలదు. 1895 సం. లో అతడు అధిక సంఖ్యాకములగు పదార్థముల యొక్క అయస్కాంత గ్రహణ శక్తులను, ఉష్ణోగ్రతల వలన వానికి కలుగు మార్పును కొలిచెను. అతడు ఈ పనిని డయా, పేరా, ఫెర్రో మాగ్నటిక్ పదార్థముల పై ఉష్ణోగ్రతా ప్రభావము, వాటియందుండు అయస్కాంతత్వము మూడు రకములా లేక, భౌతికముగా ఒకేరకమా అనువిషయము నిర్ధారణ చేయవలయు నను అభిప్రాయముతో ప్రారంభించేను. క్యూరి యొక్క ప్రాథమిక పరిశోధనలవలన ఈ క్రింది విషయములు సిద్ధాంతీకరింపబడేను.

1. డయామాగ్నటిక్ గ్రహణశక్తులు సామాన్యముగా ఉష్ణోగ్రత పైనను, అయస్కాంత క్షేత్ర బలము పైనను ఆధారపడి యుండవు.

2. పేరామాగ్నటిక్ గ్రహణశక్తులు నిరపేక్షిక ఉష్ణోగ్రత (absolute temperature) తో విలోమముగా నుండును. (దీనినే 'క్యూరీసూత్రము' అందురు.)

3. అధిక ఉష్ణోగ్రతలలో, ఫెర్రోమాగ్నటిక్ పదార్థములతో చేసిన ప్రయోగములవలన, అతడు, ప్రతి ఫెర్రో మాగ్నటిక్ పదార్థమునకు ఒక విధమగు సందిగ్ధ ఉష్ణోగ్రత (critical temperature) కలదనియు, ఆ ఉష్ణోగ్రతయందు అది డయామాగ్నటిక్ గా రూపొందుననియు సిద్ధాంతీకరించెను. ఇంతియేకాక, 5 వ చిత్రములో చూపించబడినట్లు ఫెర్రోమాగ్నటిక్ పదార్థముల యొక్క గ్రహణశక్తులు ఉపయోగించబడిన క్షేత్రముల శక్తులను బట్టి మారుచుండును. మరియు అయస్కాంతీకరణము జరిగిన తరువాత అవి మందాయనము (Hysteresis) అను విశేషమును చూపించును.

భూమియొక 'పెద్ద ఆయస్కాంతమని చూపు ఊహాచిత్రము. ఈ భౌగోళిక అయస్కాంత క్షేత్రము భూమ్యు పరిభాగమున చాల ఎత్తువరకు వ్యాపించి యుండును,

భౌమాయస్కాంతత్వము  : భౌమాయస్కాంతత్వ శాస్త్రము యొక్క పరిజ్ఞానము, భూమి యొక పెద్ద అయస్కాంత మను అభిప్రాయము మీద ఆధారపడి యున్నది. 'భూమి యొక్క ఉపరితలము పై నుండు దిక్సూచి కొనలు సామాన్యముగా ఉత్తర దక్షిణ దిశలకు ఉండునట్లుగా ఏర్పాటు చేసికొనును. ఆ ధ్రువములు, సరిగా భౌగోళిక ఉత్తరదక్షిణములను చూపించకపోవుట వలన, ఆయస్కాంతిక, భౌగోళిక ధ్రువములు రెండును ఒక దానితో నొకటి కలియవు(ప. 8). ఈ రెండింటికి మధ్యగా నుండు కోణము ‘ది కాృతము' (Declination) అని పిలువబడును. ఒక ఉక్కు సూదిని సన్నని సిల్కు దారముతో మధ్యప్రదేశమున కట్టి గాలిలో వేలాడదీసిన, అది క్షితిజసమాంతరముగా ఆగును. ఆసూదిని అయస్కాంతీకరణము నొందించిన, అది ఇందాకటి స్థితికి ఏటవాలుగా నిలువుగానుండు స్థితిలో అగును, ఆ సూదియొక్క క్షితిజసమాంతరముగా నుండు స్థితికిని, ఏటవాలుగా నిలువుగా నుండు స్థితికిని (దిశలకు) మధ్యనుండు కోణమును 'అవపాతము' (Dip or Inclination) అందురు. ఒక ప్రదేశము నందుందు అవపాతమును, దిక్పాతమును, భూ అయస్కాంతము యొక్క గాఢత (Intensity) ను ప్రదేశమందలి అయస్కాంత మూలకములందురు (Magnetic Elements). నావికాదిక్సూచి ఉపయోగము, అయస్కాంతపు మూలకముల పరిజ్ఞానముపై సంపూర్ణముగ ఆధారపడియుండును. ఆ విషయజ్ఞానము కొరకు క్రమములేని గీతలతో పటములు వ్రాయబడి యున్నవి. ఆ గీతలనుబట్టి భూమిపై ఏయే ప్రదేశములలో ఒకే దిక్పాతముండునో తెలిసికొనవచ్చును. అట్టి గీతలు 'సమ వివత రేఖలు' (Isogonic lines) అని పిలువబడు చున్నవి. "గౌసు' అను శాస్త్రజ్ఞునిచే 18 వ శతాబ్దములో ప్రతి దినము దిక్సూచి యొక్క దిక్పాతము మారుచుండునని కనుగొనబడినది. ఇది దైనందిన మార్పు (Diurnal variation) అని పిలువబడుచున్నది. ఈ అయస్కాంత మూలకములలో హఠాత్తుగాకూడా మార్పు సంభవించును; అట్టివి 'అయస్కాంతపు తుపానులు' (Magnetic Storms) ఆనిపిలువబడును, తరచుగా సంభవించునట్టి ఇట్టి మార్పులు వాతావరణ విద్యుత్ పరిస్థితులు, సూర్యునియందలి మచ్చలు మొదలగు వానితో సంబంధించి యుండును. ఇట్టి క్లిష్టమగు విషయములను గ్రహించుటకు గాను, రాత్రింబవళ్ళు అయస్కాంత శక్తుల యొక్క అసంఖ్యాకములగు ఒడుదుడుకులను రికార్డుచేయునట్టి అతిసున్నితములగు పరికరములతో అయస్కాంతావలోకనశాలలు ఏర్పాటుచేయబడి యున్నవి.

ఏ. యమ్.జ

[[వర్గం:]]