షోడశకుమారచరిత్రము/సప్తమాశ్వాసము
శ్రీరస్తు
షోడశకుమారచరిత్రము
సప్తమాశ్వాసము
క. | శ్రీభార్గవకామందక | 1 |
చ. | ఎదురుగ వచ్చి కాంచు ధరణీశుల రాజ్యము లిచ్చి నిల్పుచు | 2 |
గీ. | పుత్రవర్ధన మనియెడు పురమురాజు | 3 |
క. | అరదంబు లెక్కి యిద్దఱుఁ | 4 |
వ. | అయ్యిరువురం బరాజితులం చేసి పట్టితెం డని చుడబలు లగుతనమంత్రులం బంచినం బని పూని వారు సన్నద్ధు లై తేరులు దోలుకొని యాశూరులం జేర నరిగి చూచి యయ్యిరువురును దమదృఢముష్టియు దీర్ఘబాహుండును నైనం బరమానందంబు నొందునంత నాభీమభటాదులుం గని యుల్లంబున నుల్లసిల్లి. | 5 |
దృఢముష్టిదీర్ఘబాహులకథ
క. | వా రిరువురు సంభ్రమమునం | 6 |
వ. | భూపాలుపాలికిం గొని చనిన నవ్విభుండు దవ్వులనే యామంత్రులం గని యామోదంబున నెదురు చని తత్ప్రణామంబు లాదరించి యెత్తి యిరువుర నొక్కకౌఁగిటం జేర్చి గారవించి యుచితాసనంబుల నుండ నియోగించి సింహాసనాసీనుండై తదీయవదనంబులం జూడ్కి నిలిపి మీ రెచ్చటం జరియించి యిప్పురంబున కరుగుదెంచితి రని యడిగిన దీర్ఘబాహుండు కరకమలంబులు మొగిడ్చి. | 7 |
గీ. | వింధ్యమున నేను మి మ్మటు వెదకఁ బూని | 8 |
వ. | ఆయింటి ముదుసలి శోకవ్యాకుల యై యుండి నన్ను నాలోకించి. | 9 |
శా. | ఓయన్నా! జమువీటికిం బయన మై యున్నాఁడు నాపట్టి నా | 10 |
వ. | తత్పుత్రమరణోద్యోగంబునకుం గారణం బేమి యని యని యడిగిన. | 11 |
సీ. | ఈవీటిరా జగుదేవసేనుతనూజ | 12 |
క. | నీకొడుకుఁ గాచి యీరే | 13 |
క. | ఓహో యి ట్లనఁ దగునే | 14 |
ఉ. | ఎవ్వరి నేమి చేసితినొ యేఁ దొలుబామున నాకుమారకుం | 15 |
క. | లావును వెరవును గలుగుదు | 16 |
వ. | అని యూఱడం బలికి నాఁటి నిశాసమయంబున రాజకన్యకాసదసంబున కరిగి రత్నదీపప్రఖాశోభితం బైన తదంతరంబున నాకాంత హంసతూలికాతల్పంబున నున్నంత. | 17 |
క. | తొలుకారుమెఱుఁగు కైవడిఁ | 18 |
వ. | అయ్యింతితోడనె ఘోరాకారుం డగు నొక్క రక్కసుం డరుగుదెంచె నయ్యవసరంబున. | 19 |
చ. | జలదము పొంతఁ గ్రొమ్మెఱుఁగుచాడ్పున శైలముఁ జేరియున్న పు | |
| య్యలఘునిశాటుమ్రోలఁ జెలువారెడు నాసతిఁ జూచి వానిదో | 20 |
క. | తప్పక చూచుచు నుండఁగ | 21 |
క. | సురవైరిఁ జూచి యేనును | 22 |
గీ. | అనిన దైత్యుండు తనయాగ్రహంబు విడిచి | 23 |
క. | ఏమిత్రుమామ ననుటయు | 24 |
వ. | అతం డేమికతంబున నీకు నల్లుం డయ్యె నిప్పు డెచ్చట నున్నవాఁడు చెప్పవయ్య యని యడిగినఁ దద్వృత్తాంతం బతనిచేత నేవిన్నదియు నేనుం గన్నదియును వివరించెద నాకర్ణింపుము. | 25 |
క. | వంధ్యోద్యమఖిన్నతమై | 26 |
వ. | విస్తారోదారం బైన యయ్యగారంబున నొక్క దిక్కున నర్ధరాత్రసమయంబున. | 27 |
క. | సాధకుఁ డొకరుం డొకబిం | 28 |
క. | కరవాల మెత్తుటయు మదిఁ | 29 |
క. | ఆవనితకట్టు లూడిచి | 30 |
వ. | భయసంభ్రమంబులు మనంబున ముప్పిరిగొన నప్పయోరుహలోచన నేను మాణిక్యపురాధీశ్వరుం డైన రత్నకేతుని తనూభవను రత్నప్రభ యనుదానను నేఁటి సంధ్యాసమయంబున మహోత్సేధం బగు సౌథాగ్రతలంబున నిద్రింప నిద్దురాత్ముండు నన్ను నెత్తికొనితెచ్చి యచ్చట ని ట్లొనర్పనిడికొనియున్నవాఁ డింతలో నీవు నాపాలిభాగ్యదేవతవు | |
| వోలె వచ్చి నాప్రాణంబులు గాచితివి, నీయధీనంబ నైతి నీచిత్తంబుకొలఁది నడవంగలదాన నని విన్నవించిన నతండు. | 31 |
క. | నిను దోడుకొనుచుఁ జని నీ | 32 |
వ. | అరిగి రాజమందిరద్వారంబున నిలిచి యాకాంత నంతఃపురంబులోపలికిం బనిచిన శోకవేగంబున బలవించుచున్న తజ్జననీజనకుల పాలికిం జని తన వృత్తాంతం బంతయు నెఱింగించిన సంభ్రమించి. | 33 |
క. | మనమున నత్యద్భుతమును | 34 |
వ. | తద్వృత్తాంతం బడిగి యతండు చెప్ప నంతయు నాకర్ణించి కులపౌరుషంబుల నధికుంగా నెఱింగి యుల్లంబున నుల్లసిల్లి. | 35 |
గీ. | ప్రాణదానం బొనంగితి వట్లుగాన | 36 |
వ. | కావున నీరాజవదన వరియింఛి నారాజ్యలక్ష్మి కధ్యక్షుండవై యుండు మని యత్యంతప్రియపూర్వకముగాఁ బ్రార్థించిన. | 37 |
చ. | సమయము గాదు నా కిపుడు శాశ్వతభోగము లంద మామహీ | 38 |
క. | నానాదేశములకుఁ దగు | 39 |
వ. | అని సమ్మతంబుగాఁ బలికి పలికినయట్ల వెరవరు లగు భృత్యుల నానాదేశంబులకుం నరయం బనిచి యొక్క శుభలగ్నఁబున నత్యంతవిభవంబునం దన కన్నియ వివాహం బొనరించి సకలసంపదలు నిచ్చిన నచ్చెలువతో నభిమతక్రీడావినోదంబులం దేలుచుండి యొక్కనాఁటి నిశాసమయంబునం దత్పురోపకంఠంబున నొక్కయార్తనాదంబు వీతెంచిన. | 40 |
క. | దృఢముష్టి వెడలె ఖడ్గము | 41 |
వ. | ఇట్లు వెడలి చని యయ్యార్తనాదంబు చక్కటికి నరుగు నప్పుడు. | 42 |
క. | అలఘుతరదివ్యభూషలు | |
| బలుమాఱును నెలుఁగడరఁగఁ | 43 |
మ. | నెఱిలే కోర్వనివారిమాటలకునై నేఁ డారెకు ల్మత్పతిం | 44 |
గీ. | నాభుజం బెక్కి నీ ప్రాణనాయకునకు | 45 |
గీ. | కొఱితిపై నున్న చోరుని విఱిచినమలఁ | 46 |
చ. | సురుచిరదివ్యరత్నపరిశోభితనూపురరమ్య మైన త | 47 |
క. | మనుజులకు బ్రాఁతియగు న | 48 |
వ. | ఆతరుణీరత్నంబు కోరికి పారంబు నొందించుతలంపున నమ్మఱునాఁటియర్ధరాత్రసమయంబున నీసభుండు ఖడ్గకసహాయుండై పరేతసదనంబున కరిగి తదంతరంబున నల్లనల్లన నసియించుచు. | 49 |
క. | వినుతాహారంబులఁ గ్రొ | 50 |
క. | అందియ గోల్పడిపోయిన | 51 |
వ. | అన్నెలవునకు వినోదార్థంబు వచ్చి యొక్కయెడనున్న నాకడకుం బఱతెంచి. | 52 |
క. | మారాకారుఁడు మిక్కిలి | 53 |
వ. | ఏను నిన్న నతనిపౌరుషం బంతయుం జూచితి నని తద్వృత్తాంతంబు వివరించి నేఁడును నన్ను బ్రమయించి పట్టి తోడియందియం బుచ్చుకొని పోవుతలంపున వచ్చి తిరుగుచున్నవాఁ డని చెప్పిన నతనిం జేరనరిగి. | 54 |
శా. | భూతప్రేతపిశాచరాక్షసగణస్ఫూర్తిన్ జనశ్రేణికిన్ | |
| న్వీతాతంకత నీవు ద్రిమ్మరుటకున్ డెందంబున న్మెచ్చి సం | 55 |
గీ. | నిన్న నొకయందె చేకుఱె నిన్నెలవున | 56 |
క. | వెనుకదెస నున్నదానవిఁ | 57 |
వ. | ఏ నడుగం దనబాల్యంబు మొదలుకొని నిన్నుఁ గన్నది తుదిగా నిజవృత్తాంతం బంతయు నెఱింగించిన నీ చెలిమాటలకు మోదించి మమ్ముఁ జూచి యరుగుదు గాని రమ్మని మత్పురంబునకుం దోడ్కొనిపోయి మదీయంబు లగుసకలసంపద్విభవంబులుం జూపి వివిధసంభావనంబు లొనరించి. | 58 |
చ. | అవిరళకాంతికాంతనవయౌవనరూపవిలాసభాసురన్ | 59 |
వ. | అచ్చట నచ్చపలనయన నిష్టోపభోగంబులం దేల్చి క్రమ్మఱ మత్పురంబున కరుదెంచి మిమ్ముం బొడగను నుపాయంబు చింతింపుచుండ నొక్కనాడు శుక్రశిష్యుండు మహామతి యనువిప్రుండు మాసదనంబున కరుగుదెంచిన నితండు త్రికాల | |
| వేది యని యేనుం జెప్ప నీసఖుఁ డెఱింగి యతనికిం బ్రణమిల్లి మీతెఱం గడిగిన నామహానుభావుండు నావదనం బవలోకించి. | 60 |
సీ. | పుత్రవర్ధననామపురము నేలెడురాజు | 61 |
వ. | ఆతండు కేవలపురుషుండు గాఁడు గావున నీభావంబుం గనుంగొని పేరువాఁడి నీమీఁదం గవియునప్పుడు నీవృత్తాంతంబుఁ జెప్పి యిరువురం గూర్పుము నీవు గూర్చినవెనుకఁ గతిపయదినంబుల వీరుం దమరాజును జెలులం గలసెద రని పలికి నిజేచ్ఛ నరిగె నతనివచనప్రకారంబున నిన్నుం బొడగాంచి కృతార్థుండ నైతి నెల్లి నీనెచ్చెలి నిచ్చటికిం దోకొని వచ్చెద ననినం బరమానందభరితమానసుండ నై యాదనుజుపుంగవుం గవుంగిలించుకొని యతిరయంబునం దోడ్కొని రమ్మని పనిచిన నతండును నతిత్వరితగతిం జని తద్వృత్తాం | |
| తం బంతయు దృఢముష్టికిం జెప్పిన నద్భుతప్రమోదరసాయత్తచిత్తుం డై నీకతంబున నానెచ్చెలివృత్తాంతం బంతయు నెఱింగితి నని యతని వినుతించి వివిధవస్తువాహనంబులతో నారక్కసుండు దోడ్కొనిపోవఁ బత్నీసమేతుఁ డై పుత్రవర్ధననామనగరంబునకు వచ్చి నన్నుం గాంచి యన్యోన్యస్నేహపూర్వకంబుగా నాలింగనశలప్రశ్నాదివిధానంబు లొనరించి దాని వరించి యభిమతక్రీడావినోదంబులసుఖం బనుభవించుచుఁ గొన్ని నా ళ్ళుండునంత. | 62 |
క. | పుత్రకులు లేమి నపుడా | 63 |
వ. | మేమును భవద్దర్శనఁబు గోరుచు నిందుండ మాభాగ్యవశంబున దేవరం బొడగని కృతార్థుల మైతి మని విన్నవించుటయు నమ్మహీవల్లభుండు సంతసిల్లి వారల నుచితప్రకారంబున సంభావించి హంసావళియందలి యనురాగంబునకు ననుగుణోద్యోగంబుగా దిగ్విజయయాత్ర నెపంబున విదిశాపురంబున కరిగి తత్పురోద్యానంబున వేత్రవతీతీరంబున విడిసి మేఘమాలమహీపాలునకుం దమరాక యెఱింగించి పుత్తెంచిన. | 64 |
గీ. | అతఁడు సకలవస్తువితతులు కాన్కగాఁ | 65 |
వ. | ఇష్టగోష్ఠీవినోదంబున నున్నయంత నమ్మహీకాంతునకు సంతసం బొదవఁ దేజోవిభాకరుం డగు ప్రభాకరుం డిట్లనియె. | 66 |
క. | నీతనయను సర్వశుభా | 67 |
వ. | సంతుష్టాంతరంగుం డై యెంతయుం దెలి వొంది వినయంబునం గరకమలంబులు ముకుళించి యంచితప్రియపూర్వకంబుగా నమ్మహీవల్లభున కి ట్లనియె. | 68 |
క. | హంసావళిలో నెల్లను | 69 |
క. | ఆకన్యారత్నంబును | 70 |
వ. | అని పలుకుటయుం బుడమిఱేనికొలువున నున్న మౌహూర్తికు లెల్లింటినిశాసమయంబున విశేషలగ్నంబు గల దని విన్నవించుటయు నుల్లసిల్లి మేఘమాలధరణీవల్లభుండు నత్తెఱంగున కియ్యకొని సముచితప్రకారంబున వీడ్కొని యరిగి యమ్మహోత్సవంబున కుత్సహించిన. | 71 |
క. | తనరాలెడు నవ్వార్తలు | |
| రినకమలాకరుఁడో య | 72 |
వ. | తన చెలి యగుకమలమంజరి కేకతంబున ని ట్లనియె. | 73 |
క. | మనభూపతి కమలాకరుఁ | 74 |
సీ. | తావులు వెదచల్లు పూవు లన్నియుఁ బుచ్చి | 75 |
వ. | వేత్రవతీతీరంబున నత్యంతవిస్తారోదారం బగు కమలాకరస్కంధావారంబు దరియం జొచ్చి పేరోలగంబున సింహాసనాసీనుండును సేవాగతానేకభూవల్లభకిరీటరత్నదీపికావిరాజితపదారవిందుండును జామరగ్రాహిణీకరచామీకరచామ | |
| రసంచలనచలితకుంతలుండును నై యొప్పారు నమ్మహీవల్లభు నల్లనఁ జేరం జని. | 76 |
క. | అగణితవిలాసుఁ డగు నా | 77 |
గీ. | భూతి యిచ్చునపుడు భూపాలనందను | 78 |
క. | చెలువ యిటు పుష్పసాయక | 79 |
వ. | అవ్విభుం డాభూతిఁ బుచ్చుకొని సముచితాసీనం గావించి యెచ్చటినుండి వచ్చితని యడిగిన నది క్రమ్మఱ దీవించి. | 80 |
క. | ఏను బహుదేశచారిణి | 81 |
క. | అనవుడు నాదరమున నా | 82 |
వ. | చనుదెంచునప్పుడు దన యంతరంగంబున. | 83 |
ఉ. | ఈసరసోక్తు లీమహిమ యీయవికారత యీవిలాస మీ | 84 |
వ. | అని యభినందించి యొక్క కపటోపాయంబుఁ జింతించి హంసావళీకన్యకు నతనిమీఁద నరుచి పుట్టునట్లుగాఁ బలికి మాయోపాయంబున నివ్విభుని నేన వరియించెద రాత్రి లగ్నం బగుట నా కవ్విధంబు సిద్ధించు నని నిశ్చయించి యబ్బాలికపాలికిం జని యేకతంబున నిట్లనియె. | 85 |
క. | కమలాక్షీ భవన్మానస | 86 |
గీ. | వికృతవేషి మఱియు వృద్ధు క్రూరాత్ముండు | 87 |
క. | కడవతల గొగ్గిపండ్లును | 88 |
శా. | చెల్లంబో నిను వీని కీ దలఁచె లక్ష్మీహాని కోర్వంగ లే | |
| త్ఫుల్లాంభోరుహనేత్రకు న్మగఁడె యీదుర్భావుఁ డేమందునో | 89 |
క. | తగుమగనికి నీనుచితము | 90 |
క. | గారా మైనతనూభవ | 91 |
గీ. | ఏమి చేయుదాన నెక్కడఁ జొత్తు నే | 92 |
వ. | ఇట్లు మూర్ఛ మునిగి హంసావళి యజ్జరభి తన్నుఁ దెలుపఁ దెలిసి యిట్లనియె. | 93 |
ఉ. | కామిని యట్టిరూపుఁ బొడగాంచినఁ బ్రాణము విడ్తు నప్డు నా | 94 |
క. | తనతలఁచినట్ల యగుటకు | |
| బునఁ దోఁపఁగ నేటికి నిటు | 95 |
క. | కూరిమిచెలికిం దానొక | 96 |
క. | అనుటయును మాయ దెలియక | 97 |
వ. | నన్ను నెక్కడ దాఁచె దనుటయు సంధ్యాసమయానంతరంబ యంధకారంబున నయ్యుత్పలగంధిం బురంబువెలికిం గొనిచని యొక్కపూఁదోఁటలోపల నత్యంతవిస్తారం బై తనరు బూరువుమ్రానికోటరంబున నునిచి వేగుజూమునప్పు డాకమలాకరు వంచించి నీపాలికిం జనుదెంచెద వెఱవకుండు మని యూఱడించె. | 98 |
సీ. | .............యక్షణాలంకృతం బైన | |
| జారుతరదీపికాసహస్రములు వెలుఁగఁ | 99 |
వ. | అయ్యవసరంబున. | 100 |
క. | మదగజఘోటకములతో | 101 |
వ. | ఇ ట్లెదురుకొని తోడ్కొని చని దైవయోగంబున హంసావళీభావంబు గలిగి కా దని యెఱుంగరాని కమలమంజరిని మహావైభవంబున వివాహంబు గావించుటయు నాడ విశేషశుభదినం బగుట నశోకకళికతోడ నయ్యిందువదనం దోడ్కొని కరదీపికాసహస్రంబులు ప్రజ్వరిల్లం గమలాకరుండు శిబిరంబున కరుగునప్పుడు కుంజరంబుమీఁద నన్నరేంద్రకుంజరు వెనుక నున్న కృతకహంసావళి తాను రాజనందన నునిచి వచ్చిన శాల్మలీపాదపంబుఁ గనుంగొని యత్తరుణి తా నతరువు దహించునుపాయం బూహించి యొడలికి వడంకు దెచ్చుకొని పతిం గౌఁగిలించిన. | 102 |
క. | మలఁగి కనుంగొని ధరణీ | 103 |
వ. | కన్ను లొకించుక దెఱచి, యీ రెలుంగున నతనికి వినవచ్చునట్లుగా నిట్లనియె. | 104 |
మ. | అలభూజంబుననుండి దైత్యపతి యత్యాభీలభంగిన్ దృగం | 105 |
ఉ. | ఇక్కుజ మగ్నిదేవునకు నిప్పుడ యాహుతి చేయఁ ద్రుంగు నీ | 106 |
క. | నావుడు నే నవ్విధమును | 107 |
క. | భటకోటిఁ జూచి మీ రీ | 108 |
సీ. | అంతకముంద యయ్యగకోటరంబున | |
| యమ్మహీజము గాల నడరు పెన్మంటల | 109 |
క. | రాచిలుక మున్ను వ్రాసిన | 110 |
శా. | ఈరా జాశుకరాజు చెప్పినతఁ డౌ నీ చెల్వు చెల్వంబుఁ గ | 111 |
సీ. | ఈవరు మదిఁగోరి యిచటి కేతెంచిన | |
| నిట్టిపాతకిఁ జెలిఁ జేసినట్టి బ్రహ్మ | 112 |
క. | ఈయింతి తలఁచినట్లుగ | 113 |
వ. | అనుచుఁ గన్నీరు పెల్లిగొన నన్నీరజనయన బహుప్రకారంబులం బలవించుచుండె నంత నమ్మహామహీరుహంబు హుతాశనుని కశనంబు చేసినదాన సంతుష్టహృదయ యైన యయ్యింతితో శిబిరంబున కరిగియున్నంత. | 114 |
క. | కమలాకరుమై దైవకృ | 115 |
గీ. | శిరమునందు హంసావళి కరము వెట్ట | 116 |
క. | నా చెలి యశోకకలికయు | 117 |
వ. | అని చింతించి యనంతరంబ యొక్కతెఱంగు గాంచి శూన్యలింగంబున ఛాగరక్తాభిషేకంబును దన్మాంసపూజనంబును నరబలియు నొనర్చిన జ్వరశాంతి యగునఁట మున్నొకజోగిణిచే వింటి నని యశోకకలికతో నరబలిప్రకారంబు చెప్పక తక్కినవిధంబు చెప్పి శివలింగస్థానంబునకుం దోకొని చని యేమఱించి వధియించి యీయాపద నిర్వహించెద నని నిశ్చయించి యప్పొలంతితోడం జెప్పవలయు వార్తలు చెప్పి ప్రతీహారపాలాధ్యక్షుం డగు వృద్ధు రావించి. | 118 |
సీ. | వసుమతీశ్వరునకు జ్వరము మానంగ ర | 119 |
వ. | అశోకకళికయు బెగ్గిలి యగ్గలంపు హాహారవంబు లెసంగ గుడి వెడలి పఱవందొడంగిన. | 120 |
క. | తలయును జీరయు వీడఁగ | |
| దలఁకుచు నశోకకళికయు | 121 |
గీ. | పాడుగుడిలోని భూతము గూడముట్టి | 122 |
వ. | వస్త్రాపవరణయు నాలంబకేశభారయు నాభీలకరవాలహస్తయు నా దానివెంటం బఱతేర వారలు గనుంగొని భూతం బనుచుం బొదివి పలుతునియలు గావించిన. | 123 |
గీ. | అయ్యశోకకళిక యార్తనిర్ముక్త యై | 124 |
వ. | కమలమంజరి చేసిన కపటకృత్యం బెఱింగించిన నరసి వెఱుఁగుపడి హంసావళివలని బలవంతం బైన వలవంత నొందుచు నాక్షణంబున మంత్రుల రావించిన నందఱుం జింతాక్రాంతులై యున్నసమయంబున భీమభటుండు జ్యోతిశ్శాస్త్రపారగుం డైన వసంతకు నాలోకించి ప్రశ్నం బడిగిన. | 125 |
గీ. | అనలనిహతిఁ బడదు హంసావళీకన్య | 126 |
వ. | భీమభటుండు దిగ్గన లేచి మననేర్చువిధంబుస మాళవేంద్ర | |
| కన్య నరయింతము రం డని చెలులం దోడుకొని యత్యంతసంభ్రమంబునం జని. | 127 |
మ. | సరసానందన సత్కళాగమపరీక్షాకృష్ణకందార భా | 128 |
క. | వీణావాదనచలదలి | 129 |
లయగ్రాహి. | చంద్రరుచిరానన మహేంద్రబహుభోగ భుజ | 130 |
గద్యము. | ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబు నందు సప్తమాశ్వాసము. | |