షోడశకుమారచరిత్రము/అష్టమాశ్వాసము
శ్రీరస్తు
షోడశకుమారచరిత్రము
అష్టమాశ్వాసము
క. | శ్రీభాసమాననానా | 1 |
వ. | .........మంబులు గడపి విరహతాపోపశమనార్థంబు మహీతలనాథుండు శీతలచ్ఛాయ నొక్కరుండును నాసీనుండై యుండి యశోకకలిక సచ్చటికిం బిలువం బంచి సమీపంబున నునిచికొని హంసావళి యే మయ్యె..... | 2 |
క. | భూనాథ కమలమంజరి | 3 |
వ. | సకలలోకాభిరామం బగునారామారత్నం బొక్కనాఁడు నర్తనాగారంబున కరిగి తదీయమణికుడ్యభాగంబునందు. | 4 |
చ. | నరవరముఖ్య నీ దయిన నవ్యమనోహర మైనరూపు చి | |
| నరులున ఱెప్పవెట్టక చలాకృతిగుం........నేపుదానుజి | 5 |
వ. | అప్పుడు. | 6 |
సీ. | సుదతి యారూపంబు చూచినయట్లైన | 7 |
వ. | ఇట్లత్యంతసుందరం బగు నచ్చిత్రరూపంబుఁ జూచి యిచ్చట నీరూపం బెవ్వరు వ్రాసి రని యడిగిన సకలవిద్యావిశారదత్వంబు.............. | 8 |
చ. | ............................................................ | 9 |
క. | చిలుకఁ బిలిపించి రసవ | 10 |
క. | ఆర్యనుతిపాత్ర మగున | 11 |
వ. | అని పలికి సముచితప్రకారంబున వీడుకొని రాజశుకంబు చనుటయు నది యవశ్యంబు నిన్నుఁ దెచ్చు ననునాస నూఱడి యనేకదివసంబు లెదురుచూచి రాక తడసిన నొక్కనాఁ డమ్మంజువాణి కమలమంజరి దెసఁ గనుంగొని. | 12 |
క. | ఆచిత్రాకృతి పతి దృ | 13 |
క. | మెచ్చు నొకొ యార్య యిచ్చకు | 14 |
వ. | అనినఁ గమలమంజరి యిట్లనియె. | 15 |
క. | నీచెలువము రసికాగ్రణి | |
| నీచిత్తమువాఁడే పతి | 16 |
చ. | అనిన నమ్మాటకు నెమ్మనమున నమ్మిక జనింపకున్న నచ్చెలువ నెచ్చెలి నాలోకించి. | 17 |
ఉ. | ఓజలజాక్షి, నీవు నను నూఱడఁ బల్కెదు గాక వచ్చునే | 18 |
క. | అని పలుమఱుఁ దలపోయఁగ | 19 |
మ. | ప్రిదిలెం జేతులకంకణంబులు సఖీబృందంబుపై మచ్చికల్ | 20 |
వ. | అవ్విధంబు గనుంగొని కమలమంజరి చిత్తంబునఁ జలింప నెచ్చెలి నవలోకించి. | 21 |
గీ. | చిలుక వెంటన వలరాచచిచ్చు దగిలి | 22 |
గీ. | ఇందులోన నెవ్వారికి నెఱుకలేద | 23 |
వ. | అని యయ్యింతివలవంత సూచి నెచ్చెలులు పలుమాటల వలరాజు నుద్దేశించి. | 24 |
గీ. | పద్మభవునిమీఁదఁ బంకజోదరుమీఁద | 25 |
వ. | అని పలికి యేమిట సమ్మగువమేన నుద్దీపించిన మదనతాపంబు వాయకున్న నిట్లనియె. | 26 |
చ. | హరునిటలాగ్ని రూ పఱియు నంగజుఁ డప్పుడ పుట్టె రాఘవే | 27 |
వ. | అని పలికి యిందువదనకు మనసేయు చలిమందుల మదనతాపంబు దీపించె నింక నివి వలదని శిశిరోపచారంబుల పనిచాలించి చింతింపం దొడంగిస నక్కమలమంజరిం జేరం జని. | 28 |
మ. | తరుణీ నే నొకసిద్ధపుంగవుని నత్యంతంబు సేవించి యే | 29 |
క. | ఈపొలఁతికిఁ గమలాకర | 30 |
క. | ఆచెలువుని చిత్రాకృతి | 31 |
క. | అనునంతటఁ గమలాకరుఁ | 32 |
క. | నీ వరుగుదెంచి తని హం | 33 |
గీ. | అడుగఁ బుత్తెంచుటయుఁ గమలాకరునకుఁ | 34 |
క. | ఆకీరము చెప్పిన కమ | 35 |
క. | కమలాక్షికి బ్రాణము ప్రా | 36 |
క. | నీవిడిసియున్నయది హం | 37 |
సీ. | ఈ చంపకముపొంత నీమావి క్రీనీడ | 38 |
సీ. | ఈహంసయానంబు నింతయొప్పయి యున్నె | |
| యీచిలుకలమాట లింతయిం పయి యున్నె | 39 |
వ. | అనినమాటలు విని యనురాగంబు నివ్వటిల్ల. | 40 |
సీ. | పొలఁతి కౌఁగిటఁ జేర్పఁ బూచి నెత్తావుల | 41 |
క. | అని యంత మదనతాపము | |
| ర్చినయింద్రజాలవిద్యను | 42 |
వ. | తనవిద్యాప్రభావంబున రాజకన్యమోహనాకారంబు దృగ్గోచరంబు గావించిన. | 43 |
క. | వనజాస్యమోహనాకృతి | 44 |
చ. | తళతళఁ బర్వుక్రొమ్మెఱుఁగుఁదండములం బురణించు మేనినుం | 45 |
సీ. | నెత్తమ్మిరేకుల నెచ్చెలు లై యొప్పు | |
| తీపుమిగులఁ బువ్వుఁదేనియ గ్రోలి మ | 46 |
వ. | ఇవ్విధంబున నంగజాధీనుం డైన యమ్మానవేంద్రుండు. | 47 |
సీ. | వనజాక్షికెంగేలుఁ దనకేలుఁ గీలించి | 48 |
వ. | ఆయింద్రజాలకలితమాయారూపం బని యెఱుంగనేరక మదనావేశంబుకతంబున హంసావళియ కా నిశ్చయించి యారమణి నన్ను గారవింపంగాఁ దలంచి యవ్వనంబునం దాఁగెనని యూహించి పూఁబొదల నోలఁబుల వెదకి వెదకి యున్మాదంబుం బొంది. | 49 |
సీ. | అది నాకు నెలుఁ గిచ్చె నంగన యని యేగి | |
| నదె తల చూపె నీలాలక యని డాసి | 50 |
వ. | ఇవ్విధంబున మన్మథోన్మాదబాణవిదారితమానసుండగుచుఁ గొంతతడ వవ్వనాంతరంబున జరించినంత నత్యంతసంభ్రమంబున వసంతకుం డచ్చటికిం బఱతెంచి హంసావళీకన్య యున్నది యనుపలుకు మున్నుగా నన్నరనాథునితో నిట్లనియె. | 51 |
సీ. | అధిప హంసావళి యాబూరుగున నుండ | 52 |
గీ. | కన్ను నీరు దుడిచి కన్నియ నూరార్చి | 53 |
వ. | ఆనందకందళితమానస యయ్యె నప్పు డమ్మేఖమాలనరేంద్రుండు విభవంబున నక్కమలాననం దోకొని చని. | 54 |
క. | తొడవులు తనులత నునిచినఁ | 55 |
వ. | ఇవ్విధంబున నచ్చెలు లచ్చెలువకు శృంగారంబు చేసి రయ్యవసరంబున నక్కడ. | 56 |
సీ. | వాహననికురుంబవల్లరీజృంభిత | 57 |
ఉ. | అంతఁ జిరంటికాజనము లల్లన వచ్చిరి రాజు ముందటం | 58 |
సీ. | ధమ్మిల్లములఁ బువుదండలచెలువంబు | 59 |
వ. | ఇవ్విధంబున విభవంబులు మెఱయఁ బురంబుం బ్రవేశించిన వైభవసురేంద్రుం డైన మాళవేంద్రుండు మించిన వేడ్క నెదురు చనుదెంచి తోడ్కొని పోవం దదీయమందిరంబు ప్రవేశించిన యనంతరంబున సప్తజనంబు లయ్యెలనాఁగ వివాహవేదికాతలంబున నునిచి గండవడం బెత్తించి యయ్యెడకు నక్కుమారుం దోడ్కొని యరిగిన. | 60 |
క. | ఉండిరి కాంతయుఁ బతియును | |
| నిండిన వేడ్కలు దనరఁగ | 61 |
వ. | అంతం బురోహితమంగళాచారానంతరంబ మౌహూర్తికదత్తశుభముహూర్తంబునం దెర యెత్తించిన. | 62 |
సీ. | లజ్జఁ గొండొకసేపు లలనదృగ్జాలముల్ | 63 |
సీ. | పళ్ళెరంబుల నున్నప్రాలు దోయిట ముంచి | |
| దాను జయ్యన ధవళాక్షతలు ధరించి | 64 |
క. | తలఁబ్రాలు వోయఁ దత్కర | 65 |
వ. | ఇవ్విధంబున మహోత్సవానందకందళితమానసు లైనయాదంపతులకు హోమానంతరంబ మాళవేశ్వరుం డనేకరితురగరత్నభూషణచీనాంబరాదిమనోహరధనం బరణం బిచ్చి వందిమాగధాదిజనంబుల కభీష్టధనంబు లొసంగి యందఱ నన్నపానాదులం బరితృప్తులం జేసి దంపతుల నర్హమందిరంబుల నునిచె నయ్యవసరంబున. | 66 |
సీ. | అబ్ధీశుసాంధ్యసేవాభిషేకమునకు | |
| వారుణీసక్తులై పెఱవార లెట్లు | 67 |
క. | దినలక్ష్మి యినుఁడు చనుటయు | 68 |
గీ. | మించె నెఱసంజ లడరి యామీఁదఁ దార | 69 |
గీ. | జలరుహములు సూర్యబల మేమియును లేమిఁ | 70 |
సీ. | మధుపసంఘంబులు మట్టి మల్లాడుచుఁ | |
| నధిక తేజస్వి యగునినుఁ డస్తమింప | 71 |
ఉ. | తాంతము లైనతామరలతావులు సేవలు దక్కి పోవఁగా | 72 |
సీ. | ఇది చనుదెంచెనే నేగరా దనియొక్కొ | 73 |
వ. | అయ్యవసరంబున. | 74 |
సీ. | సిరితోడఁబుట్టువు చెంగల్వచెలిపొందు | |
| యుమపాలికన్ను పున్నమఱేఁడు వెన్నుని | 75 |
గీ. | పూర్వగిరి పానవట్టమై పొలుపు మిగులఁ | 76 |
చ. | సలలితలీలఁ బ్రాగ్వనితఁ జాలగ రాగముఁ బొందఁ జేసి యిం | 77 |
(గ్రంథపాతము)
| ..........సంతోషంబు నిగుడుచుండ | 78 |
సీ. | మంజీరమంజులశింజితంబు సెలంగ | |
| నెరుపార నిండువెన్నెలచల్లు చూపుల | 78 |
సీ. | పొగడంగ................... | 79 |
సీ. | .....నొకకొంత మోపి నిక్కుటయును | |
| బూవులకందుపఁబొ.................. | 80 |
ఉ. | సన్నపుఁగౌనుమీఁద వలిచన్నులవ్రేఁగు ఘనంబు నెవ్వడిం | 81 |
సీ. | ఎఱసంజ పర్వె నదేలకో యెఱసంజ | 82 |
క. | డోలాలీల లొనర్చుచుఁ | 83 |
సీ. | (నీకటాక్షంబు నెర)సిన యెడలెల్లఁ | 84 |
గీ. | ............కాలువ ల్దాఁటి దాఁటి | 85 |
ఉ. | ..............కమలాకరుఁ డాననకేళి మాని యు | 86 |
ఉ. | చేరఁగఁ బోయి సొమ్ములును జీరలుఁ దీరమునందుఁ బెట్టి చొ | 87 |
చ. | ............చ్చినిత్యపరిపూర్ణమనోరథుఁ డౌచు వైభవ | 88 |
క. | ఈకథలు వ్రాయఁ జదివిన | 89 |
ఉ. | ............................ప్రతిమానదానవి | 90 |
క. | .......... | 91 |
| ........కౌశల్యవాదా | 92 |
గద్యము. | ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబునందు సర్వంబు నష్టమాశ్వాసము. | |