శ్రీనివాసవిలాససేవధి/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీనివాసవిలాససేవధి

తృతీయాశ్వాసము


శ్రీ నగరీవాస శ్రీ కరోల్లాస
మానితదరహాస మాంజిష్ఠవాస
భాషావధూకాంత భావితోదంత
శేషాంగమృదుతల్ప సిద్ధసంకల్ప
కరసముద్ధృతచక్ర ఖండితనక్ర
కరుణారససముద్ర ఘనయోగనిద్ర
శ్రీవత్సకౌస్తుభ శ్రీ రంజితాభ
కోవిదసురభూజ గోవిందరాజ
అవధరింపుము సూతు నమ్మునీశ్వరులు
సవినయప్రేమఁ బ్రశంసించి మిగుల10.
పౌరాణికేంద్ర! శ్రీపతి పంపుచక్ర
మేరీతి రాజత్వ మేర్పడ వెడలె
నెవ్వారి ఖండించె నెటుల యుద్ధంబు
నివ్వటిల్లెను నీవు నిఖిలంబు మాకు
వివరింపు మని వేడ వెస వారి కతఁడు
సువిశదంబుగ భవ్యసూక్తి నిట్లనియె

హరిచక్రముచేసిన శత్రుసంహారక్రమము.అంతట హరిచక్ర మద్భుతలీల
నెంతయు మణిహారహారకిరీట


కంకణకుండలాంగద తులాకోటి
కింకిణీగణముల ఘృణులు దళ్కొత్త20
శ్రీగంధములపూత చెలఁగురొమ్మునను
బాగుగాఁ గుంకుమపట్టెలు దీర్చి
దట్టపు బంగారుతగిటీల ధట్టి
పట్టెసంబు ఘటించు పడదలా గట్టి
యొగవంక బలువంకి యొనరఁగీలించి
సొగసువీకను బాకుఁ జొనిపి డావంక
వన్నెలచెంగావి వలెవాటు వైచి
తిన్నఁగాఁ గస్తూరి తిలకంబు దిద్ది
యరుణదీప్తి వహించు నరసహస్రంబు
కరసహస్రంబుగా ఘనత రంజిల్ల30
కెందమ్మి రేకులక్రియ జేవురించు
కందోయి మిక్కిలి కన్ను చెన్నొంద
తొగలరాయని మేని తున్కలపగిది
ధగధగదృచి మించి దంష్ట్రలు మెఱయ
తేటిరెక్కలచాలు దీటుగాఁ గొనిన
నీటందు మీసంబు నిగ్గగ్గళింప
రాజసం బెసఁగంగ రాజిల్లు నైజ
రాజభావంబు స్వారాజు నుతింప
జ్వాలాముఖుండును బడబాముఖుండు
జ్వాలాకరాళుండు సైన్యపాలురయి40
కెలనఁ గొల్వఁగ యక్షకిన్నరగరుడ
కులజు లౌ కింకరుల్ కుంతానిశార్ఙ
పరశు ముద్గర గదా పట్టెస ముసల


శరచాపతోమరాస్త్రంబులు బూని
సందడింపఁగ రథసామజతురగ
బృందంబులును నిండి బెట్టుగా నడర
భేరినిస్సాణగంభీరఢక్కాది
భూరివాద్యంబులు భోరున మొరయ
దిక్కు లాకసము ప్రతిధ్వను లీనఁ
బిక్కటిల్లుచు లోకభీకరంబుగను50.
చండాంశుమండలసదృశ మౌ రథము
నిండువైఖరి నెక్కి నిష్ఠురోద్ధతుల
సన్నద్ధుఁడై యుద్ధసాహసబుద్ధి
మున్నుగాఁ బూర్వదిఙ్ముఖమున వెడలె

చక్రుండు తూర్పుదిక్కున రక్కసులఁ జెండాడుట.


వెడలినచక్రుండు వీరదశ్యునకుఁ
గడుసురక్కసున కా గహనగోచరులు
వినుము రాక్షసముఖ్య వింతకార్యంబు
జనియించె నద్భుతసన్నాహ మెసఁగ
జనపాలుఁ డెవ్వఁడో చతురంగబలము
దలరంగ నివ్వనాంతరమునఁ జొచ్చి60.
వచ్చెను వేటాడవలసియో మోస
మెచ్చి మనలమీఁది కేతెంచువిధమొ
తెలియఁజెప్పుడు నిందు తేరిజూడంగ
బలవైరి మొదలుగా భయపడుచుండు
నిదియేమొ యుత్పాత మిట నిర్భయముగ
కదిసి భేరి మృదంగ కాహళుల్ మొరయఁ


జను దెంచుటను మాకు శంక యయ్యెడిని
యన విని రక్కసుఁ డత్యాగ్రహంబు
నెగడంగఁ గన్గవ నిప్పుకల్ గురియ
భుగభుగ నూర్పులఁ బొగలు బె ట్టెగయఁ 70
జెంత నమ్మంత్రుల జీరి క్రూరోక్తి
నెంతయు గర్జిల్లి యిట్లని పలికె
వినుఁ డిందు మనుజుండు వెర పింత లేక
చనుదేరఁగలఁడె యా శతమఖప్రముఖు
లెవరొ వచ్చిరి వీరి నీక్షణంబుననె
భువిఁ గూల మొత్తి బెబ్బులి మృగంబులను
బొదివి కోరలఁ జీల్చి భూరిరక్తములు
మెదడు గ్రోలెడుమాడ్కి మిక్కిలి డొక్క
లుక్కున వ్రక్కలిం చుష్ణాస్రధార
లక్కజంబుగఁ ద్రావి యార్చెద నిపుడె80
తే రాయితము చేసి తెప్పించు డెల్ల
వీరసైనికులను వెడలించు డనికి
ననుడు మంత్రులు వేగ నఖిలసైనికుల
మునుగూర్చి వేసడంబులు బూన్చి రథము
బేర్పించి సన్నాహభేరి వేయించి
యేర్పరించి బలంబు నెదుట ము న్బనిచి
దుర్గస్థలంబులఁ దొలఁగక నాప్త
వర్గంబు నిల్పి య వ్వార్తలు విభుని
కెరుగింప నతఁడు తే రెక్కి సారథిని
త్వరసేయుచుఁ గడంగి తరలంగ భటులు90
ధళధళుక్కున నాయుధమ్ములు మెఱయ


ఝళిపించి యట్టహాసములు సేయుచును
మొనలకుఁ జేరి యా మూఁకపై దూరి
కినుకఁ బంతము మీఱి కినిసి తాకినను
చల మొప్పఁగా సుదర్శనరాజు సేన
లలర వైరిబలంబు లాక్రమించుకొని
చక్కుచక్కునఁ జెక్కి సమితి బల్ డొక్క
లక్కులు పిక్కలు నల కాళ్లు వేళ్లు
సిరములు కరములు చెక్కులు ముక్కు
లురవడి తునియలై యుర్విపైఁ బర్వ100.
జొత్తుల యేరు లెచ్చోటుల నెగడ
హత్తుల మొత్తంబు లత్తఱిఁ గూలఁ
దుత్తుమురై రథతురగముల్ మ్రగ్గఁ
దత్తరంబున దైత్యతతులు నూటాడ
కోలాహలంబుగా ఘోరవైఖరుల
నాలంబు సల్పి రత్యద్భుతంబుగను
అట్టి కయ్యంబున హతశేషులైన
కట్టడిరక్కసుల్ కడువడి నురికి
మన బలంబుల నెల్ల మ్రగ్గించి పరగ
నినుమడించిన కిన్క హెచ్చి వచ్చి రని110.
వీరదస్యునిచెంత వివరింప నతఁడు
ఘోరాగ్రహంబున ఘూర్ణిల్ల గ్రుడ్లు
వేఁడి వేఁడిగఁ గూర్చి వెస నౌడుగఱచి
వాఁడికోరలు దీడి వాలు చేఁబూని
తనచుట్టములు తాను తాఁకి బె ట్టార్చి
యని సుదర్శనసైన్య మంతయుఁ గలచ


వానిముందర దానవస్తోమ మడరి
పూని పచారించి పొదలు రోసమున
మండలాగ్రముల తోమరముల గదల
భిండివాలంబుల బెట్టుగాఁ గొట్టి120.
తలలు డుల్లఁగ బహుదండముల్ దునియ
బలు మొండెములు ద్రెళ్ల పదములు చిదియ
కరములు తునియ వక్షంబులు నలియ
కరులు నెగ్గగ తురంగంబులు మ్రగ్గ
రథములు చెదర వీరభటాళి బెదర
రథికులు నుదర సారథులు బెట్టదర
సిడములు నెఱఁగ చేసింగిణిల్ విఱుగ
నడిదముల్ తునుగ నస్త్రాస్త్రముల్ బెనఁగ
నతిఘోరరణమున నాత్మసైన్యంబు
ప్రతిరుద్ధ మగుట చక్రప్రభుం డరిగి130.
జ్వాలాముఖుని బంప వడి నాతఁ డట్టి
యాలంబు జొక్కి చెక్కాడె వైరులను
అచ్చట చండజంఝానిలంబునకు
విచ్చిపోయెడు మేఘవితతిచందమునఁ
గడకమై తూరు సింగంబు ఢాకకును
కడుభీతి నుఱుకు మృగంబులపగిది
వడి బెల్లడరు సాళువంబును గాంచి
పడి మూర్ఛఁజెందెడి బకములమాడ్కి
కడిది చుట్టుకవచ్చు కార్చిచ్చుశిఖల
నడుగంట మాడు కారాకులకరణి140.
దురమున నాతని దోర్విక్రమమున


పురివిచ్చి వీగియు పొలసి రూపరియు
తనదుసైనికు లెల్ల తలఁగఁగఁ జూచి
కినుక రక్కసుఁ డొక్కగిరిశృంగ మతని
తేరుకై వైచిన దృఢశక్తి దాని
వారించి మించి యా జ్వాలాముఖుండు
ఘోరవిక్రమము గైకొని తనహేతి
చే రాక్షసేంద్రుని శిరము ఖండించె
అప్పుడు మింటిపై యమరదుందుభుల
చప్పుడు నెగడఁ బుష్పంబులవాన150.
గురిసె ఖేచరతతి కొండాడి పొగడె
ధరణీసురాదు లౌ తద్దేశజనులు
సంతసించిరి సుదర్శనరాజవరుని
అంతట నా విభుం డాదేశమునకు
బరిపాలనమొనర్పఁ బటుబుద్ధి నొకని
ధరణీశుఁ గావించి తరలి యాక్షణమె
కడగి యాగ్నేయదిక్తటమున కరిగి

ఆగ్నేయదిక్కున మాయాక్షుఁడను దానపుని సంహరించుట.


తొడిబడ విజయదుందుభులు మ్రోయించె
అక్కడ మాయాక్షుఁ డను దానవుండు
పెక్కండ్రు దైత్యులు పెంపునఁ గొల్వ 160.
క్షత్రియాకృతిఁ బూని సకలలోకులకు
విత్రాసమొసఁగ గర్వించి గ్రామములు
ననుపమమఠములు నగ్రహారములు
జనపదంబులు మౌనిజనుల యాశ్రమము


లుటజముల్ చెఱిచి బహూపద్రవంబు
లటు చేయుచుండువాఁ డా భేరిరవము
విని యాగ్రహించి నావిపినంబునందు
మనమున జడియ కే మహిపాలుఁ డిట్లు
మదమున వచ్చె నా మాయచే వాని
చదిచి డమాము లశ్వములు నేనుంగు
లన్నియు హరియించి యరుదెంతు నంచు
సన్నద్ధుఁడై బంధుసంఘంబుతోడ
ననికిఁ జేరఁగ వాని నస్త్రశస్త్రముల
నినిచి తూలించె నా నృపసైన్య మపుడు
ఆరీతి ప్రహారంబు లంటిన నట్టి
క్రూరదానవుల మార్కొనలేక తూలి
మాయచేఁ దమయున్కి మరుపెట్టి డాగి
పోయిన నవ్వనభూమి యంతయును
వెతకి గానక వారి విడిదిపట్లెల్ల
నిరోషమునఁ జిచ్చు లంటించి మరలి
సైన్యపతికిఁ దెల్ప చాల నతండు
వన్యాంతరము లంటి వరుస శోధించి
మాయ సేసినవారి మాయఁజేయంగ
పాయని కిన్కను బాణంబు బూని
మరియు నాగ్నేయాస్త్ర మహిమ యం దుంచి
వరభుజాశక్తి నుర్వడిఁ బ్రయోగించె
నంతట నా పావకాస్త్రంబు మంట
లెంతయు నెగయంగ లేచి యావనము


లంటుగ దహియించి యచట నాలోక
కంటకులను భూతిగాఁ గాల్చి మగుడ190.
నతని యమ్ములదోన నణకువఁ జొరఁగ
నతని శౌర్యము మెచ్చి రఖిల దేవతలు
అటుల నా సైన్యేశుఁడసురులఁ గూల్చి
చటులత వారుణాస్త్రంబున వర్ష
ధారలు గురియించి ధర చల్లఁజేసి
శూరునొక్కరుని నచ్చో ఠాణె మునిచి
ప్రజలను గరుణించి రావించి యచట
నిజపరాక్రమమున నిర్భయంబుగను
నెమ్మది నుంచి యా నృపతి చెంగటను
సమ్మదమునఁ జేరి చతురుఁడై నిలిచె200.
నిలిచిన నా చక్రనృపతి సంతసిలి
చెలిమి మన్నించి యా సేనాధినాథుఁ
బొగడుచుఁ గదలి యద్భుతవిక్రమంబు

చక్రనృపతి దక్షిణదిశను జయించుట.


నెగడ దక్షిణదిశ నిష్ఠురధాటి
నడరి సంగరభేరి కార్భటుల్ మెఱయ
తడయక సింహనాదములు సేయుచును
భటకదంబంబు లుద్భటసాహసముల
చటులత నడచి యచ్చటఁ బేర్చి యార్చి
యుక్కళంబుల డాసి యొనరు ఠాణెంబు
లుక్కణంగించి బెట్టుబికి పాళెములు.210.
చొచ్చి చుట్టుక ముట్టి చూరలుబట్టి
మచ్చరంబుస దైత్యమండలిఁ దాకి


అంపవానల ముంచి యద్రులార్భటులఁ
గంపింప చెలరేగి కదనంబు సల్ప
సత్తఱి దైత్యు లాహళహళిఁ గలఁగి
ఉత్తలపాటుతో నుఱుకంగ గడఁగి
అంకవంకపుళిందు లనుదైత్యవరులు
పంకజభవుఁ డిచ్చు బహుళోగ్రవరము
లందుట గర్వించి యందు బిడాలు
ముందుగ రావించి మూర్ఖుబాలకుని220.
హెచ్చరింపుచు వార లేవురు సేన
విచ్చి పోవఁగనీక వెసఁ బురిగొల్పి
పరిఘతోమరగదాప్రాసాసిపరశు
వరచాపశార్ఙాది శస్త్రముల్ బూని
యరదంబు లెక్కి గజాశ్వరధాళి
యిరువంక బారులై యిల సందడింప
వేరువేరుగ మొనల్ విభజించికోనుచు
చేరి జ్వాలాముఖసేనలఁ గొట్టి
గోరించి చెండిన ఘూర్ణిల్ల విఱిగి
తారిన తనసైన్యతతి నాదరించి230.
యా సుదర్శనుఁడు నేత్రాంచలదృష్టి
నీసునఁ గోపాగ్ని యెగయ వీక్షించె
నా లోచనాగ్నియం దాక్షణంబుననె
జ్వాలకేశుఁడు మహాసటుఁడు రణఘ్నుఁ
డల స్ఫులింగాక్షకాలాంతకు లనెడి
బలవంతు లేవురు ప్రభవించి వెడలి
కత్తులు కేడెముల్ కరములఁ దాల్చి


మొత్తి దైత్యులశిరంబుల డుర్లగొట్టి
యేవురు నసురుల నేవురుఁ దొలఁగి
పోవనీయక పొలియించి రపుడు240.
ఇటుల వైరులఁ ద్రుంచి యేవురుచక్ర
భటు లేలికకు మ్రొక్కి భక్తితో నిలువ
గనుఁగొని వారిఁజక్రప్రభుం డెలమి
వినుతించి యచ్చటి వివిధలోకులను
పిలుపించి యభయంబు ప్రియమున నొసఁగి
బలియు నొక్కని మహీపతిగా ఘటించి
మునివరుల్ దీవింప ముదమునఁ దరలి
చని పశ్చిమంబున జయభేరు లులియ

చక్రరాజు పశ్చిమ దిగ్విజయము.


మునుకొని సేన లిమ్ముల సాగి నడువ
వనములు గిరులు గహ్వరములు నడరి250.
చతురంగబలములు సందడింపంగ
ప్రతిలేక చక్రభూపతి వచ్చుతఱిని
అచట కానకకర్త యను రక్కసుండు
సుచిరతపశ్శక్తి శూలిచే వరముఁ
జెంది యింద్రాదులఁ జెనకుచు మునుల
నెందు బాధింపుచు నెసఁగు రక్కసుఁడు
వాఁ డట్టి పటహానిధ్వానంబు చెవుల
వాడిమి వినినంత వడి పెట్టుబడిన
యురగంబుకైవడి యూర్చి కోపించి
యరదంబులు గజంబు లశ్వముల్ భటులు260.


వీరసేనాపతుల్ వేగ నాయిత్తు
మీరి రాఁబంచి గంభీరదుందుభులు
తాడించుఁడని వేత్రధారులఁ బలికి
వీడనికినుకతో వేగరి నొకని
పరసేనలతెఱంగు బరికించఁ బనిచి
పురము వెల్వడి దుర్గభూమికై నడచె
నంతలోన సుదర్శనాధిపసైన్య
మంతటంతటఁ జేరి యార్చి రక్కసుల
నఱికి యచ్చటి తోరణంబులఁ బెరికి
విఱిచి డాలులు కోట వెసఁ గూలఁజెఱచి270
వ్రాల్చి తేరుల హయవారముల్ గూల్చి
గ్రాల్చి పురము లందు కరిఘటల్ వ్రేల్చి
ముంచి తూపుల ఖడ్గముల తలల్ ద్రుంచి
దంచిభటుల మత్తదైత్యుల నొంచి
తరిమి సేనల నడిదమ్ముల మెరిమి
యురిమినట్టుల నార్చి యుబికి పైఁదార్చె
అటుల నార్చినఁ జూచి యా రాక్షసుండు
నిటలాక్షుఁ డిచ్చిననిష్ఠురవరము
బడయుటను మదించి భయ మింత లేక
వెడలి రథతురంగవేదండఘటలు280
సుభటసంఘము నిండి చుట్టుల నడర
రభసంబునను సింధురమ్ముపై నెక్కి
సవరణ గాజిరా సంధించి మేన
వివిధాస్త్రశస్త్రముల్ వేగ ధరించి


యుద్ధవర్ణనము.


బెట్టుగా సంగ్రామభేరి వేయించి
యట్టిమొనం దాఁకఁగా నిరుదళము
లంటి సంకులకలహంబునఁ గినిసి
యొంటరి యొంటరి యోధయు యోధ
రథమును రథము సారథిని సారథియు
రథికుండు రథికుండు రౌతును రౌతు290
తురగంబు తురగంబు దొరయును దొరయు
కరియును కరియు గింకరుఁడు గింకరుఁడు
నొండొంటి కైదువు లొరయుచు మెఱయ
మెండుభండన మంట మింట నచ్చరులు
తనవల్లభుఁడు వీఁడు తనవిటు డితఁడు
తననాయకుఁడు వీడు తనపతి యితఁడు
తన భుజంగుఁడు వీఁడు తన విభు డితఁడు
తనపల్లవుఁడు వీఁడు తన ప్రియుఁ డితఁడు
తనరమణుఁడు వీఁడు తన కాంతుఁ డితఁడు
ననుచుఁ గోర్కొనుచు న య్యని జూచుచుండ300
కత్తి నొక్కఁడు కచాకచి వైరిశిరము
మొత్తి డొల్లించు నా మొండెంబు తనదు
చేతివాలున వాని శిరము ఖండించు
చాతురి నొకఁ డీటె సరిగట్టె బడఁగఁ
బగతురఁ బొడుచు నొపగర యయ్యీటె
తెగ డుస్సీపో నెక్కి తెగటార్చు నతని
నొకఁ డర్థచంద్రబాణోద్ధతి నహితు
వికలమస్తకుఁ జేయ వెస నట్ల వాని


శిరమూడ నా తూపుచే వేయు లూన
శిరుడయ్యు మదిలోన చెలఁగు రోసమున310.
నొక్కరుండ లకోరి నుచ్చిపో రిపుని
యుక్కున వేయ వాఁ డొకనిమిషమున
నుర మాతనికి నట్ల నుచ్చిపో నేయు
పరుపడి నిటు పరస్పర మంట జోడు
లుద్దులై యొండొరు లొరసి పోరాడి
పద్దున సరిగాఁగ పడుదురు వొలిసి
ఇవ్విధంబున రణం బిరుదళములకు
నివ్వటిల్లగ దైత్యనివహంబు మ్రగ్గి
రహిచెడి యురికిన రక్కసుం డలిగి
కహకహ నార్చుచు కదిసీ యంపరలు320.
జడి బట్టినట్టుల సమకట్టి కురిసి
పుడమి నింగియు నిండ పొదివి బల్ మాయ

శివభక్తుఁడగు రక్కసుని మాయాయుద్దము.


గప్పిన నిబిడాంధకారంబు గ్రమ్మ
నొప్పుచొ ప్పెఱఁగక నిలిచి యా చక్ర
సైన్య మంధంబయి జడియుచుఁ దమరె
యన్యోన్యశస్త్రఘాతాహతులగుచు
నలయగ రక్కసుఁ డవ్వారిమీఁద
శిలలవర్షమునించి చెండుచుండుటయు
నివ్విధం బరసి చక్రాధిపుఁ డపుడు
రవ్వయౌ జ్వాలాకరాళుఁ బంపంగ330.
నతఁడు సూర్యాస్త్రంబు నడరించి వాని
వితతమాయ లడంచి వెస దండహతిని


దండించి వాని వేదండంబు గూల్చి
ఖండించె నట్టి రక్కసుశిరం బవని
అంతటను సుదర్శనాధిపుఁ డటులం
బంతంబున సురారిఁ బరిమార్చి జగతి
నిహతకంటకఁ జేసి నిజతేజమునను
మిహిరుకైవడి మించి మిగుల నాదేశ
జనములఁబాలింప జనపాలునొకని

చక్రరాజు నుత్తర దిగ్విజయముయునిచి వాహినితోడ నుత్తరదిశకు340
గదలి వేగిరమె యక్కడ నొక్కయెడను
కదళీక్షువనముల కరమొప్పు ధరణి
నిలిచి సురారాతినేతను వెదుక
బలములఁ బంపించి పటహభాాంకృతులు
భోనభోంతరముల బోరున నెగడ
నానోగ్రభటసింహనాదముల్ రిపుల
గుండియల్ వ్రేలించఁ గుంభిని నిండి
దండిగాఁ దనసేన దనరంగనుండె

శివునివలన వరములఁ బడసిన భేరుండను రక్కసుఁడుఆచోట భేరుండుఁ డను దానవుండు
ఖేచరాజు [1]సుతుండు గిరిసమానుండు350
యోజనత్రితయసమున్నతగాత్రుఁ
డాజి మత్తేభసహస్రబలుండు
మున్ను శ్రీశైలాగ్రమున నుగ్రనిష్ఠ
సన్నంపుసూది చరణాగ్ర మూని


భుజదండములు రెండు పొడవుగా సాచి
నిజదృష్టి రవియందె నిల్పి కన్ రెప్ప
వేయక శ్వాసంబు వెడలనీ కడచి
రేయును బగలు నిద్రించ కాహార
మేమియుఁ గొనక యట్టిటు చలింపకయె
హామిక నిల్చి పంచాగ్నిమధ్యమున360.
గండకత్తెరఁ బూన్చి కంఠనాళమున
మండలాగ్రములు మర్మములఁ గీలించి
భూతంబులు దలంక భూరివృక్షములు
ధాతను గురియించి తపము సల్పంగ
వారిజభవుఁ డేగి వాని నీక్షించి
ఘోరతపం బేమిగోరి చేసెదవు
వేఁడు కోరిన దిత్తు వేగమే యనిన
వాఁడు నాయుధముల వరశిలాధార
గరళంబులను దేవగంధర్వదనుజ
గరుడమనుష్యరాక్షసయక్షజనుల370.
వలన వధ్యుఁడుగాక వలయురూపమునఁ
జెలఁగునట్టుగ దయచేయవే యనుడు
వనజసంభవుఁ డట్టివరముల నొసఁగి
కనరాక భయమునఁ గదలె నక్షణమె
ఆ దైత్యుఁ డత్తరి నఖిలలోకముల
సాధు లౌ మౌనుల సకల దేవతలఁ
జాల బాధింపుచు జనపదనగర
జాలముల్ చెరుపుచు శకకిరాతాంగ


యవనులు మొదలగు నతిపాపజనులు
భువిఁ దనుగొలువ నెప్పుడునుండు నాతఁ380.
డీ సుదర్శనురాక కెంతయుఁ గనలి
యీసునఁ దనసేన నెదురుగాఁ బనిచె
బనిిచిన నాసేన పాథోధిచయము
పెనుపొంది యుబికి యాభీలతరంగ
రంగత్తిమింగలరాజితో వచ్చు
సంగతి కంఖాణసంఘమాతంగ
భరముతో నడరిన ప్రళయకాలోగ్ర
తరబాడబాగ్ని బృందంబు చందమున
ధగధగమెఱయు నస్త్రప్రకాండములు
ధిగధిగజ్వాలలై దీపించ మించి390.
హరిచక్రరాజసైన్యంబు తేజమునఁ
బరవాహినుల గ్రాచి బల్మి నింకించ
కోలాహలంబుగా ఘూర్ణిల్లి తెరలి
యాలంబునం దుభయదళంబు లొరసి
పోరఁగను కబంధములు నటియించె
వారణంబులు డుర్లె వాజులు ద్రెళ్లె
నటు తేర్లు చదిసె రథ్యంబులు చిదిసె
భటతతి మిడిసె సుపర్వాళి జడిసె
అప్పుడు దైత్యసంహతి తన సేన
నొప్పించి నంతఁ గన్గొని చాల కడగి400.
యని చక్రవిభుఁడుు క్రోధాగ్ని హుంకార
ముస వెడలింప నద్భుతముగా నదియ
తరలి పావకసంజ్ఞఁ దగఁ జిక్కుపఱచు


పరచమూవీరులపై మోహనాస్త్ర
మేయంగ వార లయ్యెడ మాయఁ దగిలి
భూయస్తరాయుధంబులఁ బారవైచి
మూఢులై యంబరంబులు విడ్చిపుచ్చి
గాఢవిభ్రాంతి బొంగఁగ నిల్చి రంత
అదిచూచి నగి పావకాఖ్యుండు వారి
పదరి చంపకుఁ డని భటుల వారించి410
యొనర నయ్యస్త్రంబు నుపసంహరించి
యనువుగా క్రౌంచాస్త్ర మపుడె సంధించె
శత్రుల కర్ణనాసములు ద్రుంచంగ
విత్రస్తులై వారు వెసదంతములను
కరచి గోళ్లను వ్రచ్చి కలఁచగా సేన
ఉరివిచ్చినన్ జూచి పొలి పిశాచాస్త్ర
మపుడు ప్రయోగించి యసురులఁ ద్రుంపఁ
గపటరాక్షససేన కలగి పారుటయు
భేరుండు నలుకచే బెట్టుగాఁ దాకి
ఘోరముద్గరమునఁ గొట్టి యార్చుటయు420
వానిపై నలిగి పావకుఁడు వాయవ్య
మానితాస్త్రంబేసె మంత్రయుక్తముగ
అది యట్టిభేరుండు నవలీల నెత్తి
ౘదలనే వేంకటాచలశృంగమునకు
వడిగ సురాళించి వైచిన యట్ల
కడగి ప్రదక్షిణాకారంబు గాఁగ
బిరబిర ద్రిచ్చి యాబిస మింటినుండి
ధరణిపై లాగించ దబ్బున వాఁడు


శిరము క్రిందుగఁ బడి చిదిశి వ్రక్కలుగ
మురిగిన కూశ్మాండమున్ వలె పొలిసె430.
అటుల నా దానవు నిలఁ గూల్చి గెల్చి
పటహార్భటులు మీఱ పావకాఖ్యుండు
చక్రప్రభునిఁ జేరఁ జయ్యన వచ్చి
వీక్రమంబున దైత్యు విదళించుతెఱఁగు
వివరించి కేల్మోడ్చి వినతుఁడై చెంత
సవినయంబుగ నిల్వఁ జక్రప్రభుండు
నతని కౌఁగిటఁ జేర్చి యనునయింపుచును
స్తుతియించి బహుమతి శోభిల్లఁదనదు
కంకణమ్ము లొసంగి కరుణించి మరియు
కింకరావళి నెల్ల కెలన రాఁ బిల్చి440.
వరుస భూషణములు వస్త్రంబు లొసంగి
పరులచే మృతిబొందు భటులఁ గ్రమ్మరను
బ్రతికించి యా దిశాభాగంబునందు
క్షితిసురాదిజనంబుఁ జెలిమి రావించి
యభయమిచ్చి కుదిర్చి యచట నొక్కరుని
ప్రభువుగా నుండంగఁ బట్టంబుగట్టి
జయభేరి పటహనిస్సాణఢక్కాది
మయతూర్యభాంకృతుల్ మట్టుమీఱంగ
గీర్వాణగంధర్వకిన్నరగరుడ
ధూర్వహనుతులబంధురనాదమెసఁగ450.
నమరదుందుభిబృందమార్భటి మొరయ
సుమవర్షధార లచ్చో జడిగొనఁగ
నచ్చరల్ నర్తించ నామోదభరము


లెచ్చిన తెమ్మెర లింపుగా విసర
గంధర్వభామినుల్ గానంబు సేయ
బంధురమాగధప్రకరంబు వొగడ
మణిమయం బైన విమానంబు నెక్కి
మృణిమీరు చామరల్ కెలన శోభిల్ల

{{Center|దిగ్విజయముచేసి చక్రరాజు వేంకటాద్రికి వచ్చుట.}

మగుడి యాక్షణమె శ్రీ మద్వేంకటాద్రి
తగనధిరోహించి దాపున రాఁగఁ460
బక్షీంద్రుఁ డా చక్రపతి రాకమున్నె
లక్షించి వడిఁజేరి లక్ష్మీసహాయు
ప్రణుతించి దేవ ! పరాకు హెచ్చరికె
రణమున మన చక్రరాజసింహంబు
విక్రమం బొప్ప దిగ్విజయంబు చేసి
యా క్రూరదైత్యుల యాతుధానులను
దేవర సెలవిచ్చు తీరునఁ ద్రుంచి
ఠీవి బిరుదులు బట్టించుక వచ్చు
చున్నాఁ డనుచుఁ దెల్పుచుండంగ నపుడె
పన్నుగా నాక్షేత్రపాలుఁ డుర్వడిగ470.
నురుకుచు దూరాన నుండియు భక్తి
సిరమున సంజలి చెలఁగ ధరించి
ధరణి జాగిలి మ్రొక్కి తగ్గి వాతెరకు
కరము చాటుగఁ బూన్చి కరుణాపయోధి!
దేవదేవ ! పరాకు దేవరవారి
సేవకుఁ డగునట్టి శ్రీ చక్రరాజు
భేరిసహస్రగంభీరనాదంబు


భోరున నెరయ తుంబురుకోనదాఁటి
వచ్చినాఁ డిటు శలవా సామి యనుచు
హెచ్చరింపుచునుండు నీలోనె చండుఁ480.
డతిరయంబున వచ్చి యందందు నుతులు
నతులు సేయుచును నెంతయు నమ్రుఁడగుచు
బెత్తమూనుక నిల్చి బెట్టుగా దేవ !
చిత్తజజనక! లక్ష్మీప్రాణనాథ !
జగదాశ్రయాధారజఠర ! పరాకు
జగదీశ్వర! పరాకు స్వామి మేల్ బంటు

చక్రరాజు రాకను జయవిజయులు స్వామికెఱింగించుట.


చక్రరాజాధిరాజప్రభుం డితఁడు
విక్రమంబున లోకవిజయంబుఁ జెంది
ప్రతిహారమహి సమీపమున నేగిడిని
పతియాజ్ఞ యిఁక నంచు పలుకు నాలోన490.
జయవిజయులు దండఁ జని కేలు మోడ్చి
జయజయ విజ యాజిజయద పరాకు
జయ కమలాలయాజాని పరాకు
జయ కమలజ కామజనక పరాకు
జయ గర్భధృతజగజ్జాత పరాకు
జయ భక్తజనపారిజాత ! పరాకు
స్వామి యిం దిదె సుదర్శనచక్రవర్తిఁ
బ్రేమఁ గటాక్షించు శ్రీ కరాలోక
దేవ ! యీ యస్త్రరాజేశ్వరుఁ డిదిగొ
సేవ సల్పెడిని వీక్షింపు మబ్జాక్ష500.


యని బరాబరి చేయ నాచక్రరాజు
వనజాక్షు నడుగుల వ్రాలి కేల్మోడ్చి
వినయంబుతో మ్రోల వినతుఁడై నిల్చి
తనసైనికులఁ జూపి తగ నిట్టు లనియె

చక్రరాజు తనసేవకుల పరాక్రమమును స్వామికిఁ దెలుపుట.


చతురాస్యపంచాస్యషణ్ముఖసేవ్య
సతతయోగీశ్వరస్వాంతానుభావ్య !
ఇతఁడె జ్వాలాముఖుం డీశ్వర ! చూడు
మతిపరాక్రమశాలి యగు వీరదస్యు
నొక్కపెట్టునఁ ద్రుంచి యుగ్రదానవుల
చక్కాడె నీతని సైన్యంబు గణితి 510.
మదకరు లైదువేల్ మావులు లక్ష
పదివేలు రథములు భటు లొక్కకోటి
మొనఁ దారసించుచో ముందుంచు నడుగు
వెనుక తియ్యనియట్టి వీరశేఖరులు
కెలన వీఁడిదె జ్వాలకేశుఁ డేవురినిఁ!
గలన దైత్యులఁ గూల్చె ఘడియలో వీని
దళమెంచ మత్తవేదండముల్ వేయి
వెలయుహారుల్ పదివేలు రథంబు
లైదువేల్ భటులు లక్షాయుతం బయ్యె
మాదండ వీఁడెగా మాసటీ డాజి520.
దుర్వారవిక్రమదోర్బలుఁ డరుల
గర్వం బణచువాఁడు గణుతింప సేన
ప్రోవైన యొకలక్ష పుండరీకాక్ష !
యావంక నదె బడబానలాఖ్యుండు


పాశ్చాత్యుఁ డగుదైత్యుఁ బరిమార్చి గెలిచె
నిశ్చయింపగ నీతని చమూభరంబు
తరమె శేషునకై నఁదడని వర్ణింప
శరధుల నింకింపజాలు నొక్కరుఁడె
వీఁడె పావకుఁ డనువీరుండు సమితి
వాఁడిమీఱు ప్రతాపవంతుఁ డౌవాఁడు530
యోజనత్రితయసమున్నతు నసుర
రాజును నిమిషమాత్రమున నీల్గించె
నితని పతాకిని నెంచి లిఖింప
క్షితిఁ దాళపత్రముల్ చిగిరింపఁ గలవె
ఇతఁడు స్ఫులింగాక్షు డితఁడు రణఘ్ను
డితఁడు కాలాంతకుఁ డితఁ డురునేమి
వీరల తేజంబు విక్రమం బసుర
వీరులయెడ నింత విశదమై తోఁచు
వీరె నేఁ గాఁగ భావింపవే కరుణ
సారతేజస్ఫూర్తి ! సర్వజ్ఞమూర్తి !540
అనుచు కైదువులరాయఁడు విన్నవింప
విని కటాక్షించి శ్రీ వేంకటేశ్వరుఁడు
చెంత శ్రీ దేవి నీక్షింప నద్దేవి
యంతనే మణికంకణాంగదమకుట
హారంబులును కాంచనాంబరంబులును
హారమంజీరముల్ హెచ్చుతాళీలు
వారి కందఱికిని వరుస చొప్పునను
బారితోషికములు బహుమతి నొసఁగె


శ్రీనివాసుడు నస్త్రశేఖరుఁ గేలఁ
బూని మచ్చికలు నింపుగ నాదరించె550.

దేవతలు చక్రరాజు విక్రమము పొగడుట.అందుండు నిందుజూ టాంభోజజాత
బృందారకేంద్ర కుబేరాంబునాథ
సమవర్తిసావకశ్వసనరక్షోధి
ప్రముఖ బర్హిర్ముఖ పటలంబు నత్రి
కలశజ కాశ్యప గర్గ వశిష్ట
పులహ కౌశికముఖ్య మునీసమూహంబు
నపు డట్టి చక్రరాజాతిశయంబు
విపులశౌర్యము నెంచి వినుతించి మఱియు
శ్రీ వేంకటాధీశు సేవించి మిగుల
భావించి కేల్మోడ్చి భక్తి నిట్లనిరి560.
పరమకారుణికస్వభావప్రభావ!
కరుణాకటాక్ష! వెంకటనగాధ్యక్ష!
ఈ చక్రవిక్రమం బెంచి చూడంగ
నా చక్రవాళంబు నం దొరుల్ దీటె
ఇతఁ డాజిఁ ద్రుంచిన యీ దైత్యవరులు
ప్రతిలేని బలపరాక్రమధురంధరులు
ఒకఁ డొకఁడే చాలు నుర్వీధరములఁ
బెకలించి బంతులు పేర్చి గోరింప
నొకఁ డొకఁడే చాలు నుడుగక కడలిఁ
గకబికగా వేగం గలఁచి యింకింప570.
నొకఁ డొకఁడే చాలు నుడువీధినంటి
ప్రకటకరాహతిన్ ప్రయ్యలుసేయ


నొకఁ డొకఁడే చాలు నురుబడబాగ్ని
నొక కబళంబుగా నూటుకొనంగ
నట్టి దైత్యుల నతం డవలీల గాగఁ
గొట్టి రణంబునఁ గూల్చెనుగాక
తరమె యన్యులకు నిద్దర వారిఁ జేరి
దురమున నెదిరించి తొడరంగనైన

దేవతలు లంకాధినాధుని దునిమి రక్షింపుమని వేడుట.ఇంక నిం దొక్కరుఁ డింతటివాడు
లంకాధినాధుండు లావున వానిఁ580
దునిమి రక్షింపవే తోయజనేత్ర !
యనిన వారికి వేంకటాధీశుఁ డనియె
వినుఁడు దేవతలార ! వెస దశగ్రీవు
నని నేనె ద్రుంచెద నద్భుతలీల
నటు గాన సుఖముగా నలుకక మీరు
పుటభేదనంబుల భోగింపుఁ డింకఁ
జనుఁడు మీ మీ నివాసములకు వడి
ననుటయుఁ జతురాస్యుఁ డా శ్రీనివాసు
వినుతించి సేవించి విసయ ముప్పొంగ

బ్రహ్మ శ్రీనివాసున కుత్సవముసేయ ననుజ్ఞవేఁడుట.ననుపమభక్తి నిట్లని విన్నవించె590.
శ్రీ వేంకటావాస! శ్రీ శ్రీనివాస!
భావహారాకార! భక్తమందార!
దేవర నొకటి ప్రార్థించెద నిపుడు
నా విన్నపమువిని నన్ను మన్నించు


దేవ యిం దర్చాకృతి వహించు నీకు
నే వెస నుత్సవం బెలమిఁ గావింతు
భువి ధ్వజారోహణపూర్వకంబుగను
హవణికఁ బుష్పయాగాంతంబుగాఁగ
నాగమోక్తక్రమమై ప్రతిదినము
బాగుగా సేవ సల్పఁగ భావమునను600.
గోరుచున్నాఁడ నా కోర్కె ఫలింప
నారూఢి దయచేయు మనుచు ముకుందు

దేవశిల్పి మందిరప్రాకారాదుల నిర్మించుట.


ననుమతి వడసి య య్యస్వప్న శిల్పి
మును బిల్చి యిటు పురంబు విచిత్రలీల
దీరిచి యిందొక దేవమందిరము
భూరిరత్నావళి పూరితంబుగను
నిర్మించు వడి ననన్ విని యట్టి విశ్వ
కర్మ యాక్షణ మట్ల కావింపఁ దొణఁగె
తోరణగోపురస్థూణాప్రతోళి
వారణశాలికావార మందురలు610.
హరువైన రథశాల లావేశనములు
వరవేశవాటు లవార్యవిపణులు
సంజీవనప్రపాస్థానశాలలును
మంజుల ప్రాసాదమండలంబులును
సౌధోపకారికల్ చప్పరంబులును
వీధికాకుట్టిమవేదికాతతులు
సజ్జలు తగునుబ్బు చప్పరంబులును
సజ్జారములు గోష్ఠశాలాచయములు


సత్రశాలలు కూటజలయంత్రములును
చిత్రశాలలు నభిషేకశాలలును620.
నాటకశాలలు నటనివాసములు
స్ఫాటికాంబుస్థలభ్రమదమంటపము
లున్నతసాలముల్ వ్యోమయానములు
సన్నుతభూవరాసనకదంబములు
గాటంపుకురుజులు కాయమానములు
వాటంబు లైన కవాటపంక్తులును
సోపానమార్గముల్ సోరణగండ్లు
నేపు మీరంగ నయ్యెడ పదావళులు
భవనాగ్రకుంభజృంభత్పతాకికలు
వివిధఘంటాపథోర్వీరథంబులును630.
గొన్ని మౌక్తికములఁ గొన్ని వజ్రములఁ
గొన్ని విద్రుమములఁ గొన్ని కెంపులను
గొన్ని నీలంబులఁ గొన్ని పచ్చలను
గొన్ని వైడూర్యంపుగుంపుల మరియుఁ
గొన్ని గోమేధికోటుల మెఱయఁ
గొన్ని పదార్వన్నెకుందనమ్మునను
గొన్ని దంతంబులఁ గొన్ని రజతములఁ
జెన్నుమించగఁ బన్నిచెక్కడంబులను
చొక్కంబయిన తాళిచొప్పునఁ బురము
నొక్క యామంబున నొనరించి మఱియు640.
గమనీయబహువిధకమలాకరములు
కమలాకరంబుల కడలఁ బూఁదోఁట
లా తోటలను కాంచనాకారతరువు

158 పుట పునరావృతమైనది159 పుట పునరావృతమైనది


లాతరువుల దివ్య మగు పక్షిగణము
గణితికెక్కుడుగాఁగఁ గల్పించి వేగఁ
బ్రణుతుఁడై బ్రహ్మ కాపని విన్నవించె
నంతట చతురాస్యుఁ డమరాధినాధుఁ
జెంతఁబిల్చి సురేంద్ర శీఘ్రంబు నీవు
హరిమహోత్సవమున కమరగంధర్వ
గరుడోరగాప్సరోగణముల నవనిఁ650
గల విప్రమహిపాదికప్రజాతతుల
విలసిల్ల దూతల వేవేగఁ బన్చి
రావించు మని పల్కి రాజరాజునకు
భావితసంభారభరముఁ దెప్పించ
సెలవిచ్చి మౌనులన్ జెలిమి నీక్షించి
తెలివిడి ముందును దెలియ నిట్లనియె
శ్రీనివాసులకు నే శ్రీమహోత్సవముఁ
బూని కావింప నంభోజమిత్రుండు
కన్యఁ జేకొని యుండఁగా శుక్లపక్ష
మాన్యవాసరముల మహనీయసరణి660

వైఖాన సాగమవిధులతో నుత్సవారంభము.నారూఢి వైఖానసాగమనిధుల
నారంభ మొనరించుఁ డనుటయు వారు
శ్రీనివాసులకు నా శ్రీ భూములకును
స్నానార్చనా పరిష్కారాంగరాగ
వివిధాన్నభక్ష్యముల్ వేగఁ గావించి
సవరణ రాజోపచారముల్ సల్పి
వేదికాకుండముల్ వేయించి సకల


వేదమంత్రములను వివిధతంత్రములఁ
గలశప్రతిష్ఠానకంకణాంకురము
లలర నొనర్చి విహంగపుంగవుని670.
యావహింపించి ధ్వజారోహణంబు
గావించి దిగ్బలికర్మపూర్వముగ
తిరువీధు లేగించి దేవాధిదేవు
తిరునాళ్ల సవరింప దేశదేశముల
నుండి కుటుంబసంయుక్తులై తరలి
దండిగాఁ ద్రోవ లెంతయుఁ బిక్కటిల్ల

నానాదేశజనులరాక వారినడకలు


చోళద్రమిళపాండ్యసూరసేనాంధ్ర
మాళవకర్నాటమగధసౌవీర
మళయాళకొంకణ మత్స్యసౌరాష్ట్ర,
తుళువ లాటాంగసింధుకళింగహూణ680.
వంగమహారాష్ట్ర వై దర్భనిషధ
బంగాళ నేపాళ బర్బరయవన
కురుఘూర్జరోత్తర కోసల ప్రముఖ
ధరణీశ్వరులును తత్తద్రాష్ట్రజనులు
వరవాహనతురంగనాగశతాంగ
వరవృషభాదులౌ వాహనమ్ములను
దగ నధిరూఢులై దవ్వని సొలయ
కగణితసంతోష మడరంగ మదిని
తడయ కెంతయు భక్తిఁ దగ వచ్చువారు
కడు వస్తువులు కానుకలు దెచ్చువారు690.


నడ గడుగుకు దండ మటు బెట్టువారు
నెడపక తల బంగ రిల గట్టువారు
నోటితాళములఁ బూనుక వచ్చువారు
వాటమై తాళముల్ వాయించువారు
చప్పిడి భుజియించి జరిగెడువారు
చప్పరంబులు పూని చనుదెంచువారు
తమ్మటంబులు బెట్టు దాటించువారు
ముమ్మరమ్ముగ వాద్యములు మ్రోయువారు
గోవిందబెట్టుచు గునుకు వారలును
ఠీవి స్తోత్రములు పఠించువారలును700
పటుమతి హరికథల్ బలుకువారలును
కథ విని హర్షించి కథ మెచ్చువారు
కథకునకు ధనంబు కర మిచ్చువారు
రథములపై తమ రమణుల నుంచి
పథికులెడల బరాబరి సేయువారు
శకటంపురవణికి జదియుచు నకట
వికటంబుగా త్రుళ్లు వేసడంబులను
కని కరాళించు కంఖాణాళినుండి
వెనక మళ్లుగ ద్రుళ్లు వెలఁదుల నందు
కొని బుజ్జగించి మక్కువ వెస నుంచి710
మొన వాగెబూని యిమ్ముగ నేగువారు
సందడి నొక్క యుష్ట్రంబు కెర్లంగ
నం దళ్కు ప్రియురాండ్ర నలమెడువారు
నడుగుల నొవ్వికై యలయు కొమ్మలను
కడుఁగౌగిటన్ బూని కదలెడువారు


గా ముజ్జగంబులఁ గల జీవులెల్ల
స్వామికి గణుతియ్య చనుదెంచుపగిది
వేగ జీవుల ధాత వెస నారుబోయు
లాగున నెందు తొలఁగ దొబ్బరాక
యరుదెంచి యటుగల యచ్చెరువెంచి720
దరులు కోనలు చరుల్ తరువులు లతలు
ఝరులు తటాకముల్ సరములు దొనలు
గిరిశిఖరంబులు కీచకతరులు
పొదరిండ్లు తుమ్మెదల్ పొదలు పూపొదలు
మృదునాదము లొనర్చు మృగ పక్షిగణముఁ
గనుఁగొంచు నందందు ఘనమంటపముల

చలువపందిళ్లు--ప్రపాపాలికలువనములన్ మేలైన పందిళ్ల నిలువ
నిసుకలో సగమంత యిడి తడివలువ
బొసగించి వేకువ బూరించు కడవ
నేలకుల్ కపురంపు నేనయించువిరులు
జాలనుసీరముల్ సవరింపఁ జల్ల730
దనము తావియు స్వాదుదగు నుదకంబు
ననటిబొందెల యొప్పు లాశొంఠిపొడియు
లికుచసారంబు దొర్లిన నీరుచల్ల
ప్రకటమాధురి మించి పరగు పానకము
వరుసగాఁ గై నేసి వలపు మీఱంగ
మరుని మోహనవిద్యమాడ్కిని నిల్చి
సలిలాధిదేవత చందంబు దాల్చి
జలదంబువలె మించు చల్వపందిలిని


మెరుగులీల వహించి మృగచిహ్న రేఖ
కరణి బాల్పొందుచు కామధేనుమణి 740
తెరగున జనతృష్ణ దీర్చఁగా నేర్పు
బరిఢవిల్లెడు ప్రపాపాలికాతిలక
మరుదారుచూపుల నాదరింపులను
సరసుల వడమాన్పజాలిబెంచంగఁ
బనిబూని తన గుబ్బపాలిండ్లసొగసు
గొనుటనో యన హేమకుంభంబు నీట
ముంచి పాంథులకు నంబువులఁ బోయంగ
చంచలేక్షణము లాజలములఁ దోప
వాలుగ లని యుల్కు వారినిఁ జూచి
చాలునో యన్నని సారె నవ్వుచును750
పానకం బొసఁగ నే పా లొల్ల ననిన
నాని చూడు మటంచు నదలించు నొకని
యొగడుదప్పి యడంగియును తనమోము
సొగసు జూచుచుఁ ద్రావుచొప్పున రిత్త
గుటకలుబెట్టఁ గన్గొని మోవి విఱిచి
వటజటాకృతి ధార వలతియై వ్రాల్చు
నొకఁడు ద్రావఁగ మరియొకఁడు పైఁబడిన
వెకటుగాఁ గొన దింత వేసర దెందు
నడుగకనే పాంథు లర్మిలి నొసఁగు
విడెముల నొడినించు వినయంబుమీఱ760
నిలువుటద్దంబు పందిలివ్రేలఁ బ్రజలు
తిలకించుకొందు రాతెరవ చెక్కులనె
చలువగా నందె వీజనము లూగంగ


చెలి పైఁటగాడ్పుల సేదఁదేరుదురు
తడవుండి ప్రొద్దుబోఁ దడవి వేఁ దరలి
యడుగడుగుకు నట్టివగుచప్పరంబు
లెన్నైన కనుఁగొంచు నెడ మెచ్చికొంచు
తిన్నగా గిరి యెక్కి దిక్కుదిక్కులను
నరవింధ్యముగ నిండి నగరమున్ వనము
నెరసి యిం తెడలేక నిలిచె నాపరిష770.

ఆనాటి శ్రీకాంతుని యలంకారవర్ణనము.ఆనాఁడు శ్రీకాంతు డందరిమదుల
నానంద ముప్పొంగ నమిత వైభవము
లలరంగా నంగదహారకిరీట
వలయ కుండలమాణవకనికరములు
గ్రైవేయమేఖలాకంకణోర్మికలు
పావనమంజీరపదకింకిణులును
మెఱయంగ ధరియించి మిసిమికడాని
మెఱుఁగులదుప్పటి మెఱుగుఁగాఁ గప్పి
చొక్కపు మంచి కస్తురితిలకంబు
చక్కఁగా దిద్ది వాసనగ్రమ్ము కలవ 780.
మలఁది క్రొవ్విరిదండ లలరంగఁ దాల్చి
కలుముల నీను చక్కనిపూవుఁబోణి
రతనంపుపంటలరమణి నిర్వంక
నతిలీల నుంచుక యఖిలభూభరము
తలపూను ఫణికులాధ్యక్షుపై నెక్కి

శ్రీ కాంతుఁడూరేగుట.తెలివికట్టాణిముత్తియములగొడగు
సురరాజు పట్టంగ స్ఫురదకళంక


హరిణాంక కిరణోత్కరాభములైన
చామరలిరుదండఁ జతురత నమర
సామజయానలు సరిగాఁగ వీవ790
నలరుచు త్రేతాగ్నులగ్రభాగమునఁ
దొలఁగక సామ్రాణిధూపంబు లొసఁగఁ
దొగలరాయండు నా తోయజాప్తుండు
సొగసుమీరిన జగజ్జ్యోతులు దాల్ప
వరుణదేవుఁడు వింతవైఖరి నందు
నెరయ వీధులను పన్నీరుఁ జిల్కించ
కరువలియందెల్ల ఘుమ్మని తావి
వరలు పుప్పొడి గంధవడి వెదజల్ల
విద్యుల్లతిక లెల్ల విడిబడి బాణ
విద్యలు జూపెడు వీక రంజిల్లె800
నురగేంద్రబృందంబు లొడికంబు మీఱ
స్థిరశిరోమణికరదీపికల్ బూన
మహతిచే నారదమౌనివర్యుండు
రహిమించు రాగముల్ రక్తివాయించ
నసమతాళముల లయవ్యాప్తిగతుల
రసికులెంచఁగ నచ్చరల్ నటియింప
సంతరింపుచు కల్పశాఖు లామోద
చుంచు లౌ పూవులసోన వర్షింప
వేదముల్ మాగధవేషమ్ము లొంది
స్వాదూక్తిసరణి కై వారముల్ సేయ810
చాల సంతోష మెంచగఁ బడవాలు
వాలు చేఁబూని యావంకనే నడుచు


భవుఁడు నబ్జభవుండు పసిడిబెత్తముల
రవళిఁ జేబట్టి బరాబరీ సల్ప
ఘనములు భేరికాకారంబులగుచుఁ
గడునినాదంబులం గడుభోరు కలగ
నొరపుసింగారంబు నొక్కరూపైన
తెరగునఁ దసరుచుఁ దిరువీధు లేగి
యావేళఁ దనుఁగొల్చు నఖిలలోకులకు
వేవేగ నిష్టముల్ వేస నొసంగుచును820.
నిజదివ్యరత్నమందిరభద్రపీఠి
విజయంబుసేసి యా వెలఁదుల్ నివాళు
లారతు లెత్తంగ నమృతోపమాన
సారాన్నభోజ్యచోష్యము లారగించి
తదవశేషంబు లందఱకు నొసంగి
మృదుశయ్యం బవళించె మెలతలు గొలువ
నారేయి క్షణదయంచాఖ్య నిక్కముగ
మీరి మహోత్సవోన్మేషం బొనర్చె
హరిదిగ్రమణి నాసికాభరణముగ
ధరియించుముత్యమై తగు వేగుచుక్క830.
మయి నలందిన కుంకుమద్రవసార
మయి విలసిల్లె నయ్యరుణ రాగంబు

సూర్యోదయ వర్ణనము.


తిరునాళ్లఁ గనుటఁ జెందిన ప్రసన్నతను
మురియుచు దిగ్వధూముఖపాళి దనరె
పొడుపుగట్టను సౌధమును కయిసేయ
నిడిన దీపంబన నినుఁ డుదయించె


తిరువేంకటేశ్వరు తిరునాళ్ల కెనయ
నరుణమండల మము నండెచేఁ బూర్వ
హరిదబ్జముఖి కుంకుమాసారములను
ధరణిజవిటపాళిదగుల వసంత840.
మొరపు రంజిల్లె నా నురువనాగ్రముల
నెరయ కెంజాయల నీరెండ యడరె
నరుణాతపచ్యుతి నందు కారాకు
తరుణపల్లవముగాఁ దలఁచి కోయిలలు
నొక్కి త్రుంచఁగలేక నుసివినఁ జూచి
పక్కుననగియెనా పద్మంబు లలరె
కమలావధూటికి కమలనాభునకు
కమలజుఁ డొనరించు కలితోత్సవంబు
కమలినుల్ గనుఁగొను కన్నులనంగ
కమలంబు లలరె భృంగము లుల్లసిల్ల850.
అప్పుడు శ్రీ వేంకటాచలేశ్వరున
కొప్పుగా వైఘానసోక్తక్రమమున
మునులు సపర్య సల్పుచు నలంకార
మొనయఁ గావించి సమృద్ధధధ్యన్న
ముద్గాన్నగౌడాన్నములు నపూపములు
నుద్గళద్ఘృతముగా నొనర నై వేద్య
ములు సమర్పింప నా పురుషోత్తముండు
చెలువంబు రంజిలి చెలగు శ్రీ దేవి
భూదేవియును దాను భూరిలీలను
మోదించి యుత్సవంబునఁ బ్రతిదినము860.


ప్రతిదినము వాహనారోహణము - వీధి విహారము


పవనజమృగరాజపక్షీంద్రహంన
జవనాశ్వగజవరస్యందనప్రముఖ
వాహనారోహణవైఖరిమెఱయ
నాహరబ్రహ్మాదు లై నదేవతలు
నారదాదిమునిగణంబు గంధర్వ
చారణకింపురుష పతగపన్న
గాదులు మేన కాద్యస్సరోజనులు
వైదేశిక ప్రజల్ వరుసఁ గొల్వఁగను
వీధివిహారముల్ వెలయంగ సవము
సాధించి యవబృథస్నానంబు సలిపె870.
అమరులు మునులు ముం దవనిజనములు
క్రమమున స్వామి పుష్కరిణితీర్థమున
నపుడు గ్రుంకిడి వార లందరు దురిత
కపటకర్దమములు గడిగి సౌభాగ్య
రమణీయరమఁ గాంచి రంజిల్లి రంత
కమలసంభవుఁడు శ్రీకమితకుఁ బుష్ప
యాగంబు సవరించి యాగమవిధుల
బాగుగా హవనముల్ పరిపూర్తిచేసి
అమరధ్వజావరోహణము గావించి
అమరులు పొగడఁ గృతార్థుఁడై తనరె880.

శ్రీనివాసులు బ్రహ్మాదులను బహూకరించుట.శ్రీనివాసులు బ్రహ్మ చేయించినట్టి
మానితోత్సవమున మది సంతసించి


అరవిందజునకు హేమాంబరాభరణ
వరము లొసంగి యోవనజాతజాత
మెచ్చితి నీభక్తి మిగులఁ గోరినది
యిచ్చెద నడుగు మీ వెల్లయిష్టంబు
లను డా హరికి ధాత యర్మిలి మ్రొక్కి

స్వామి వెంకటాచలమందె వసియించునట్లు బ్రహ్మవరంబు వడయుట.


వినతుఁడై కేల్మోడ్చి వెస నిట్టు లనియె
వేదాంతవేద్య యో విశ్వవిశ్వాద్య
నీదుకైంకర్యంబు నీయందుభక్తి 890
గలిగించితివి యింతకన్న భాగ్యంబు
కలదె యట్లయినను గాంక్షితం బోకటి
దేవ యిందఱికిని దృశ్యండ వగుచు
శ్రీ వేంకటాచలశిఖరంబునందె
ఈలాగు ప్రతివర్ష మిమ్మహోత్సవము
చాలఁ గైకొనుచుఁ బ్రసన్నత మెఱయ
వరదుఁడవై యెల్లవారి రక్షింపఁ
గరుణఁ జేయుచు నుండగావలె నిదియె
వర మని ప్రార్ధించు వనజసంభవుని
హరి యాదరించి యట్లంగీకరించి900
మరియు నాతనికి సమ్మద ముదయింప,
నరుదారగా నిట్టు లని యానతిచ్చె
పంకజాసన నీవు ప్రార్థించునటుల
వేంకటగిరియందె విహరింతు నెపుడు
సకలలోకములకు సాక్షాద్భవించి
ప్రకటితసర్వసంపదల నొసంగు


స్వామి పుష్కరిణిలో స్నానంబు సల్పు
నా మనుజుల కిత్తు సకలభాగ్యములు
వైకుంఠమున నాభవనమన నిదియె
నాకల్పమై యొప్పు నైరమ్మదాఖ్య910
సర మిందు స్వామి పుష్కరిణి నాఁ బ్రబలె
ధరణి గంగాదితీర్థములు నిందుండు
ప్రతివత్సరము నీవు పన్ను నుత్సవము
హితమతిఁ గైకొందు నిక శంక వలదు
సత్యం బగును నీదు సంకల్ప మెల్ల
సత్యలోకమునకు జనుము శంకరుఁడు
కైలాసగిరికేగుగాక నింద్రుండు
స్వాలయంబునఁ జేరు నఖిలదిక్పతులు
మౌనులున్ దమ తమ మందిరంబులకుఁ
బోని మ్మనుచుఁ బల్కి, భూషాంబరములు920
వరము లందఱికిని వరుసగా నొసఁగి
కరుణతో సెలవిచ్చి కడుపడిఁ బనిచె
వారు నప్పుడు శ్రీనివాసుల యాజ్ఞ
మీరక నేగి రవితసంభ్రమమున

కానుకలర్పించుజనులను శ్రీనివాసు లసుగ్రహించుట.


భూలోకజనము లప్పుడు శ్రీనివాసుఁ
జాల సేవించి యాశ్చర్యంబు గదుర
ధనములు మణులు ముక్తాదామములును
ఘనభూషణంబులు గజము లశ్వములు
చీనాంబరంబులు శిభిశెలు ధ్వజము
లా నవఛత్రంబు లాలవట్టికలు930


చామరంబులు ఘనసారకుంకుమము
లొమజ్జసురభికృష్ణాగరుమలయ
జాతంబులున్ పునుగుచట్టంపుగములు
జాతిజవ్వాది నిచ్చలపుకస్తూరి
వీణెలు నవరత్నవిరచితచిత్ర
వీణెలు వల్లకుల్ వివిధవాద్యములు
యేలాలవంగము లింగునల్ ద్వీప
జాలసంభవము లౌ సకలవస్తువులు
కానుకల్ సేయంగఁ గరుణించి వారి
శ్రీనివాసులు సుతశ్రీవైభవాది940
వరములు బాలించి వరుసలాలించి
సరగ నందఱి స్వదేశములకు ననిచె.
అటుల శ్రీ వేంకటాధ్యక్షునికరుణఁ
జటులసంపద లఁది సకలలోకులును
జలజనాభుని మహోత్సవసంభ్రమములు
తలంచితలంచి యెంతయు సంతసమున
పొగడుచు నన్యోన్యములు పల్కుకొనుచు
మగుడంగలేని తన్మయభావములను
మరలి చూచుచును శ్రీ మద్వేంకటాద్రి
దరలిపోయిరి జనస్థానముల్ చేర 950

వేంకటాచలమహిమ.


కావుననట్టి వేంకటధరాధరము
పావన మఖిలసంపత్కారణంబు
వినుఁ డందుఁ గావించు విమలవ్రతంబు
మనుజపంబు తపంబు మఘము దానంబు


పూర్తధర్మము హరిపూజనక్రియలు
కీర్తనంబును యోగకృతి మొద లెట్టి
వైన ననంతఫలావాప్తిసలుపు
శ్రీనివాసుల కతిప్రియము నొనర్చు
సులభమయ్యు ననంతశుభదధర్మంబు
కలదు రహస్య మొక్కటి దెల్పె దిపుడు960.
బృందావనం బందుఁ బెనుపొందఁజేసి
ఇందిరాప్రియపూజ కెనయింతురేని
యొక దళం బర్పించి యుగసహస్రములు
ప్రకటవైభవముతో బ్రహ్మలోకంబు
నను నిచ్చ హరికథాధ్యానపారీణ
ఘనమతి సన్మౌనికలితయోగమున
విహరించి తుద ముక్తి విష్ణుసారూప్య
సహితులై చేకొండ్రు సత్య మెంతయును
అచటఁ దటాకాన ధ్యానాదికములు
రచియించువారికి రహి నందు నెట్టి970.
కారణంబుననైన కాపురంబుగను
వారక నిత్యనివాసంబు సేయు
వారికి వారికిన్ వరధనాద్యోప
కారకారకులైన ఘనులకున్ సమత
శ్రీనివాసు లభీష్టసిద్ధి గావించి
యూనినదయ మోక్ష మొసఁగును తుదను
నానోక్తు లేల నా నారాయణాద్రి
పైనఁ బుట్టిన మృగపక్షికీటాది


తరుతృణాంతమ్ము లౌ తామసజీవు
లరయంగ తుద మోక్షమంది ముకుందు980.
సారూప్యమున్ గని శౌరికైంకర్య
దౌరంధరి వహించుఁ దన్మహత్వంబు
నెంతని వర్ణింతు నెత నుతింతు
నెంతని నుడువుడు నెటుల నూహింతు
నని విచిత్రార్థసమర్ధనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యుపేర
విపులానుభావభావితసంవిధాన
కపటనాటకజగత్కారణు పేర
భాసురాంగశ్రుతిభారతిభవ్య
లాసికాగీతవిలాసునిపేర990.
తారకాంతకపితృద్వంద్వా ద్యతీత
తారకమంత్రాభిధానునిపేర
ప్రత్యాహృతోత్తరాపత్యచైతన్య
సత్యనిత్యబ్రహ్మచర్యునిపేర
క్షీరపారావారసీకరాసార
పూరితనిజముఖాంభోజునిపేర
పావనభక్తాప్తబంధుని పేర
గోవిందరాజముకుందునిపేర
శ్రేష్ఠలూర్యన్వయ శ్రేష్ఠశీలుండు
ప్రేష్ఠమహాయశ శ్రీధురీణుండు1000.
గోత్రభారద్వాజగోత్రపర్థనుడు
సూత్రుఁడాపస్తంభసూత్రానువర్తి
అష్టభాషాకవిత్వార్జితప్రోద్య


దష్టావధానవిఖ్యాత భైరవుఁడు
శ్రీ కృష్ణయార్యలక్ష్మీగర్భవార్థి
రాకాసుధానిధి రాజపూజితుఁడు
వివిధవిద్యాశాలి వేంకటార్యుండు
సవరించు శ్రీనివాసవిలాసమునను
హరువొంద నిది తృతీయాశ్వాసమగుచు
ధరఁ బొల్చు నాచంద్రతారకంబుగను.1010

తృతీయాశ్వాసము, సమాప్తము.


—♦♦♦♦§§♦♦♦♦—

  1. "ఖేచరాజ్యసుతుండు" వ్రా. ప్ర. పాఠము.