శృంగారనైషధము/పంచమాశ్వాసము
శ్రీరస్తు
శృంగారనైషధము
పంచమాశ్వాసము
| శ్రీపాదాంభోరుహసం | 1 |
వ. | ఆకర్ణింపుము. | 2 |
తే. | అట్లు సాక్షాత్కరించిన యఖిలజనని | 3 |
వ. | అప్పుడు భోజరాజు తత్కాలవేద్యంబులగు శకునస్వరాదులయానుకూల్యం బెఱింగి నిజతనూజ నమ్మహాదేవికి నప్పగించువాఁడై యంతఃపురపరిచారికాజనంబుల నియోగించిన. | 4 |
దమయంతి స్వయంవరాస్థానమున కేతెంచుట
సీ. | అఖిలదిగ్దేశరాజాకర్షణక్రియా | |
తే. | బహువిరోధిమణిప్రభాపల్లవాగ్ర | 5 |
తే. | అతివపీతాపదారుణాసితమణి | 6 |
సీ. | కర్పూరకస్తూరికాప్రవాహంబులు | |
| మహనీయలావణ్యమధువు నెమ్మనముల | |
తే. | నలుఁ బ్రసూనచాపంబున గెలువలేని | 7 |
మహాస్రగ్ధర. | చతురత్వం బొప్పఁగా నప్సరస లుభయపార్శ్వంబుల బాడుచున్ రాఁ | 8 |
రాజులు దమయంతిసౌందర్యమున కచ్చెరు వందుట
సీ. | దవ్వుదవ్వులఁ గన్ను తనివి పోవఁగఁ జూచి | |
తే. | లలనసౌందర్యరేఖావిలాసమునకు | 9 |
వ. | ఇట్లు రాజులు పరమాశ్చర్యంబు నొందుచు నంతర్గతంబున. | 10 |
తే. | తరుణివదనంబు సాక్షాత్సుధాకరుండు | 11 |
చ. | మడవక ముష్టియోగ్య మగుమధ్యముతో నెలవంక యైన య | 12 |
తే. | మగువ తాటంకయుగ్మంబు మన్మథునకు | 13 |
క. | రతిపంచబాణజాయా | 14 |
క. | ఈసుదతి శిరీషకుసుమ | |
| జేసె నొకో నలువ కుశా | 15 |
క. | చనుఁగవ ఘనమో జఘనము | 16 |
సరస్వతి దమయంతికి వరణీయుల వర్ణించుట
వ. | అని ప్రస్తుతించుచుండ ఘంటాపథంబున నేగుదెంచి యమ్మచ్చెకంటి తండ్రిపంపునఁ జతురంతయానంబు డిగ్గి భారతీదేవికిం బ్రణామంబు సేసిన. | 17 |
క. | ఆశాస్యము లైనయనే | 18 |
వ. | ఇట్లు దీవించి చతురంతయానం బెక్క ననుజ్ఞ ప్రసాదించి. | 19 |
తే. | అవనిపతికన్యచతురంతయానమునకు | 20 |
దేవతలు
ఉ. | తొయ్యలి! వీరె వేలుపులు తూర్పున ముప్పదిమూఁడుకోటు లీ | |
| దయ్యమునెత్తికోలు తుది దాఁకుట గాదె సరోజలోచనా! | 21 |
క. | సంతానవాటికలునుం | 22 |
క. | అనిమిషత నిన్నుఁ జూడఁగ | 23 |
వ. | అనిన విని యబ్బాల కేలుదోయి మొగిడ్చి ఫాలంబునం గీలు గొలిపి వేలుపులకు వందనం బాచరించె, నప్పుడు శిబికాధరస్థు లగుపురుషులు సమాసన్ననాయకముఖవిషాదానుమేయం బగుదమయంతిమనోవిరాగం బెఱిఁగి ప్రావృషేణ్య పయోవాహంబులు రాజహంసావలిం బల్వలాంతరంబులవలనం బాపి మానససరోవరంబునుంబోలె మాంజిష్ఠమంజిమవిగాహిపదోష్ఠలక్ష్మి యగునయ్యంగన భుజంగపుంగవు గదియం గొనివచ్చిరి. కంజభవుభామయు నప్పద్మదళాక్షికిం బన్నగాధ్యక్షునిం జూపి యి ట్లనియె. | 24 |
వాసుకి
క. | పరిరంభలగ్నగిరిజా | 25 |
తే. | పాణికంకణమై యోగపట్ట మయ్యు | 26 |
తే. | హరజటాజూటచంద్రరేఖామృతంబు | 27 |
ఉ. | భావజకేళివైభవముపట్టున నీచిగురాకుమోవి యా | 28 |
చ. | ఫణఫలకంబు విచ్చి కడుఁ బ్రన్ననిమే నెగయంగఁ జేయుచు | 29 |
తే. | తమ్ము వరియింప కునికి దీర్ఘమ్మురోఁజు | 30 |
తే. | ప్రకటమందాక్షసంకుచత్ఫణము లైన | |
| యానధుర్యులు గదియించి రవనిభుజులఁ | 31 |
పుష్కరద్వీపాధిపతి
వ. | అప్పుడు పలుకుబోటి వరాటరాజకన్యకం గనుంకొని. | 32 |
ఉ. | ధీరతఁ బుష్కరాదు లగుదీవుల నన్నిటనుండి వచ్చియు | 33 |
తే. | తరుణి! నిస్తంద్రపుష్కరదళనిభాక్షి! | 34 |
క. | భౌమ మగునాకభువనము | 35 |
శా. | అందుండున్ హిమవారిశీతలతలన్యగ్రోధవీథిన్ శతా | 36 |
క. | ఆవటమహీరుహం బా | 37 |
వ. | అని పలికి భ్రూవల్లరీవేల్లనవికారంబు చూచి యప్పల్లవాధర యతనినొల్లమి | 38 |
తే. | లలన! పొ మ్మవ్వలికి నంచుఁ బలుకుటయును | 39 |
శాకద్వీపాధిపతి
క. | రాజాంతరాభిముఖ మా | 40 |
వ. | ఒక్కరాజుం జూపి యి ట్లనియె. | 41 |
క. | ఏకాతపవారణముగ | 42 |
క. | రమణి! రమణీయతనుతా | 43 |
తే. | వీనిఁ గులశీలశాలి శాలీనతాన | 44 |
సీ. | అతినిర్జరేశ్వరంబై యనశ్వర మైన | |
తే. | లలఘుసైనికసంఖ్యసంఖ్యాగ్రవిజిత | 45 |
ఉ. | వావిరి దుగ్ధవారిధి యవశ్యము నీవిలసత్కటాక్షవీ | 46 |
తే. | అమృతమధురంబు లగుగాడ్పు లాని యాని | 47 |
తే. | లలితకాశ్మీరభవసమాలంభకర్మ | 48 |
క. | లీలాసంక్రమవేళం | 49 |
వ. | అని పలికి యప్పుడు గంధవాహులుంబోలె విమానవాహులు లబ్ధగుణప్రసిద్ధియగు నాలలనాలలాము బరిమళలక్ష్మినిం బోలెఁ బ్రదేశాంతరంబునకుం దోడ్తేర నవ్వాఙ్మయదేవత హేమోపమేయతనుకాంతియుం గురువిందసకాంతిదంతియు నగునయ్యింతి కి ట్లనియె. | 50 |
క్రౌంచద్వీపాధిపతి
క. | మహిళాలలామ! బాహా | 51 |
తే. | మండలాకారవేష్టనాఖండవితత | 52 |
క. | దర్భదళపూజనంబుల | 53 |
తే. | అబల! పాదార్పణానుగ్రహమున నిన్నుఁ | |
| పటుతరస్కందబాణసంపాతవివర | 54 |
క. | ఘటియింపు మచట హాటక | 55 |
చ. | పొలఁతి! లలి న్మలిమ్లుచులపోలిక నీరతికేళిజన్మని | 56 |
తే. | జాలపాదవేషంబు వేశంతజాల | 57 |
వ. | అనిన విని యాగంధగజగామిని నిజహృదయానుబంధం బవ్వసుంధరాధిపునియందు సంధింప దయ్యె, నది దైవవశం, బప్పు డంసావతంసశిబికాంశు లగుపురుషు లప్పురుషప్రకాండునిసమీపంబువలన రత్నాకరంబువలనం దుషారమయూఖలేఖలేఖానుజీవి పురుషులుంబోలెఁ గొని చని గిరీశప్రభావుం డగునొకమహానుభావుం గదియించిరి. తత్సమయంబున నఖిలజగదంచితపాదపద్మ యగు నప్పద్మసంభవుగేహిని యవ్వరారోహ కి ట్లనియె. | 58 |
కుశద్వీపాధిపతి
చ. | నవవిదళత్కుశేశయసనాభిశయద్వయ! యివ్వసుంధరా | 59 |
మ. | పటువాతూలతరంగడోలనచలత్పత్త్రాసిధారాపరి | 60 |
శా. | ఆనందంబునఁ బొందు మిందునిభవక్త్రా! మందరక్షోణిభృ | 61 |
తే. | కనకకేతకదళగోత్రగాత్రయష్టి | 62 |
తే. | ప్రకటఫణివేష్టిఘృష్టిమార్గములు డిగ్గి | 63 |
ఉ. | నీవదనంబుచేత రజనీపతి నీచనుదోయిచేత నై | |
| ళావళి నీకరాంఘ్రియుగళాధరపల్లవరాగలక్ష్మిచే | 64 |
వ. | అనిన విని యక్కలహంసగమన మీమాంస శిశిరకరావతంసునింబోలె నవ్విపులాంసుని భజియింప నాసింప దయ్యె, నవ్వైదర్భితలం పెఱింగి యాచతుర్భుజునికోడలు గనుసన్న సేయ జన్యజనం బక్కన్య నన్యరాజన్యసమీపంబు నొందించె, నప్పుడు భారతీదేవి దమయంతి కి ట్లనియె. | 65 |
శాల్మలిద్వీపాధిపతి
తే. | చపలలోచన, వైరినిష్కృపకృపాణ | 66 |
క. | ఆసవజలనిధినాయకు | 67 |
ఉ. | ఈసున నేకహేలన మహీసురుఁ డొక్కరుఁ డొక్కవార్ధి యా | 68 |
క. | ఏలాలతాగృహంబుల | |
| హాలారసమయసాగర | 69 |
వ. | శాల్మలిగుల్మవాంఛితం బైనయమ్మహాద్వీపంబునకు దీపంబునుంబోలె నోషధీలతాజ్వాలాకలాపదీపితనభఃక్రోడంబును జూడామిళజ్జలదకజ్జాలంబునకు ద్రోణాచలంబు నీకు విహారస్థానం బగుంగాక సరససారసకోశమృద్వి యీతని నుద్వాహము గమ్ము. | 70 |
ప్లక్షద్వీపాధిపతి
ఉ. | నావుడు లోచనాంతముల నవ్వె విదర్భతనూజ దాన ను | 71 |
వ. | ఇట్లు నడిపించి కాశ్మీరపంకనిభలగ్నజనానురాగుండును శ్రీఖండలేపనైపథ్యమయదిగ్విజయకీర్తిరాజిరాజద్భుజుండు నగునమ్మహీభుజునిం జూపి. | 72 |
క. | వీక్షింపు సరోజేక్షణ! | 73 |
ఉ. | పొంపిరివోవుభక్తి నిరుపూఁటలు రాత్రులు శీతభాను ద | 74 |
వ. | ఇక్షురసోదధివేలావనవిహారంబును బ్లక్షశాఖాప్రేంఖోళనక్రీడావినోదంబును విపాశాపులినవేదికాప్రదేశపర్యటనంబును మనంబున కింపు పుట్టింపంగలయవి, యితని పరిగ్రహింపు మనిన నాసరోజాక్షి వైరాగ్యరూక్షంబు లగునీక్షణంబుల నతని వీక్షించె వాణీగుణోదయతృణీకృతపాణివీణానిక్వాణ యగువాణి యన్నీలవేణితలం పెఱింగి యంపస్థలస్థితసమానవిమానదండు లగుపురుషప్రకాండులం బదండు పదం డని నడిపించి జంబూద్వీపభూపాలలోకంబు గదియించి. | 75 |
జంబూద్వీపరాజులు
ఉ. | నేరెటిదీవి యేలుధరణీవరముఖ్యులు వీరె కంటె యు | 76 |
క. | సుందరి! జంబూద్వీపము | 77 |
తే. | దీవు లాఱును తనుఁ జుట్టుఁ దిరిగి కొలువ | 78 |
ఉ. | ఓవనితాలలామ! లవణోదధిచక్రపరీత మైన యా | |
| ఖావలి వ్రేలియాడెడుమహాఫలముల్ గని వారణంబు లౌఁ | 79 |
వ. | కంబుకంఠి! జగదలంకారం బగుజాంబూనదంబు తనకు జంబాలజాలంబుగా జాంబవద్రవభవంభై సుధామధురాంబుపూరం బగుజంబూసరిత్ప్రవాహంబు జంబూద్వీపంబునందుఁ బ్రవహించు నీద్వీపంబున నంతరాంతరంబుల నెంతయుం బ్రసిద్ధులగు వసుధాకాంతులు ని న్నంతరంబులం గోరి వీరె సభాభ్యంతరంబున నున్నవారు. విమతయౌవతమౌళివతంసతమాలమాలికోన్మీలన్నీలతమఃప్రకరతస్కరభాస్కరు లగువీరియం దొక్కరునియందు నీడెందంబు కందళితానందం బయ్యెనేని వానిఁ జూపు మాభూపాలకుని కులబలాచారశూరతావివేకవైభవంబు లభివర్ణించెద, ననిన నబ్బాల శాలీనతావశంవదయై వదనారవిందంబు వంచి యూరకుండె. నట్లున్నఁ గాంచి విరించిపట్టపుదేవి బుజ్జగించి యాలజ్జావతికి నుజ్జయినీవల్లభుం జూపి యి ట్లనియె. | 80 |
ఉజ్జయినీపతి
తే. | సవిధలీలావనీస్థాయిశంభుమౌళి | 81 |
ఉ. | తామరసాక్షి! శంకరుఁడు తత్పురి నాత్మకిరీటచంద్రరే | 82 |
తే. | వెలఁది! వీఁ డేలునుజ్జనివీటియందు | 83 |
ఉ. | యాచకకోటి యీతనియుదారతపేర్మి సమృద్ధి నొంది యా | 84 |
శా. | క్షోణీనాథుఁ డితండు దానగుణవిస్ఫూర్తిం బ్రవర్తిల్లఁ గా | 85 |
వ. | దమయంతి! శాంతీదాంత్యాదిగుణసంతానంబులకు విశ్రాంతిధామం బైనయీయవంతిపతియందు నీయంతరంగం బనురాగవంతం బయ్యెనేని శిప్రానదీసలిలకేళియు మహాకాళస్థితవృషభధ్వజభజనంబును విశాలానగరీసౌధసింహాసనాధిరోహణంబును నీకు సంభవింపఁగలయది, యని పలికి పలుకుందొయ్యలి యూరకుండెఁ, గుండినావనిపురందరప్రియనందనయును దూష్ణీంభావంబున నవ్విశ్వంభరాభర్తమీఁదఁ గటాక్షవీక్షణం బావర్తింపదయ్యె నప్పుడు. | 86 |
తే. | మాళవాధీశమకుటాగ్రమణులయందు | 87 |
తే. | గోతి గాంగేయపీతవక్షోజకుంభ | 88 |
వ. | అప్పుడు మత్స్యలాంఛనచాపరేఖాజితభ్రూవిలాస యగునారాజుకన్యకతోడ వాగ్దేవి యిట్లనియె. | 89 |
గౌడరాజు
క. | వ్రీడావతి! యీభూపతి | 90 |
ఉ. | పంకజనేత్ర! వీనిపరిపాండురకీర్తిభరంబుచేఁ గురం | 91 |
తే. | కువలయశ్యాముఁ డైనయీయవనివిభుని | 92 |
చ. | లలన! యితండు సమ్ముఖమిళద్రిపుకుంజరకుంభమౌక్తిక | 93 |
తే. | అతివ! యాజానుదీర్ఘబాహాప్రతాప | 94 |
వ. | అనిన విని యయ్యరవిందాస్య యౌదాస్యసంవిదవలంబితశూన్యముద్రాముద్రితం బైనచూపునం జూచి యాభూపాలునిం బ్రతిషేధించె నాక న్నెఱింగి ద్రుహిణగృహిణి విమానవాహవ్యూహంబునకుం గనుసన్న సేసి వేఱొక్కరునిం జేరం బోవ నియమించి యారాజన్యుం జూపి విదర్భరాజకన్యక కిట్లనియె. | 95 |
మథురాధిపతి
సీ. | తెఱవ! ప్రత్యర్థిపార్థివసార్థపాథోధి | |
తే. | వైరిధరణీశవంశసంభారమునకు | 96 |
చ. | అలికులవేణి! కాళియమహాహ్రదమన్ కమనీయనాభితో | 97 |
క. | గోవర్ధనాద్రితటములఁ | 98 |
ఉ. | పూవులభూరిసౌరభము వూని భరంపడి యేఁగుదెంచుబృం | 99 |
క. | పాటించి యితని వేఁడిన | 100 |
తే. | అనిన వినియును వ్రాల్చెఁ బక్ష్మాంచలములు | 101 |
కాశీరాజు
వ. | మత్తకాశిని! యితండు కాశీరా, జితని రాజధాని ముక్తిక్షేత్రం బగువారణాసి, యితని కులదైవతం బఖిలభువనస్థుం డగు ధూర్జటి, యితని విహారదీర్ఘిక త్రిలోకసంతా | |
| నిర్వాపణి యగు గీర్వాణతటిని, యితనిసత్రశాల విశాలాక్షీకేలిభవనం, బితనిభుజాస్తంభదంభోళి రిపునృపాలబాలానయనాంబువృష్టిధారాసమేధితంబు. | 102 |
చ. | సకియ! యితండు నీవలుఁదచన్నులక్రేవల నొత్తుఁ గాతఁ గింశుకముకుళాభిరామములు సుంకముపట్టు నఖాంకురాంకముల్ ప్రకుపితశాంకరీచరణపంకజకుంకుమపంకసంకర ప్రకటనిరంకశంకరకపర్దశశాంకకళాంకకారముల్. | 103 |
తే. | అతివ! సంగ్రామరంగసంగతవిరోధి | 104 |
క. | దశశతదృగర్వగర్వ | 105 |
వ. | అని వర్ణించుచుండ దమయంతి నిజమహోత్సవాగతానేకలోకశోభావలోకనకుతూహలంబునం బరాకు వహించియుండె, నవ్విధం బక్కాశీరాజునకుం గ్లేశావహంబయ్యె సరస్వతీదేవియు వేఱొక్కనరదేవోత్తముం జూపి యి ట్లనియె. | 106 |
అయోధ్యాధిపతి
తే. | ఈనృపాలుఁ డయోధ్యాపురీశ్వరుండు | 107 |
ఉ. | వారివిహారవేళఁ జెలువా! వెలువారెడునీచనుంగవన్ | 108 |
తే. | ఇతని తాత భగీరథుం డతులమహిమ | 109 |
చ. | కవివచనంబు లీతనియగాధయశఃకలశాంబురాశిలో | 110 |
శా. | అంభోజానన! వీని నెట్లు నుతి సేయ న్వచ్చు? నేతత్తనూ | 111 |
శా. | గంభీరప్రతిపక్షరాడపయశఃకాళిందియున్ వీనిదో | 112 |
శా. | తాదృగ్దీర్ఘవిరించివాసరకరత్వంబుం బ్రతిష్ఠించుచున్ | 113 |
క. | అన వినియు విననియ ట్ల | 114 |
వ. | ఇ ట్లనుమతించి. | 115 |
పాండ్యరాజు
ఉ. | అక్కడ నొక్కభూపతి ననంగునికంటెను రూపసంపదం | 116 |
తే. | పాండ్యభూపాలుఁ డీతండు పద్మనయన! | 117 |
ఉ. | ఈసకలావనీతలము నెక్కటిఁ దాన పరిభ్రమించి య | 118 |
తే. | ఇతనిరిపురాజరాజి యేఁటేఁటివరుస | 119 |
స్రగ్ధర. | ఆలోకాలోకమేదిన్యమలమలయజోదారవిస్ఫారకీర్తిన్ | |
| బాలా! వీక్షింపు వీనిం బయుగయుగపత్పాతిభూపాతిభూయ | 120 |
శా. | భంగాకీర్తిమషీమలీమసతమప్రత్యర్థి పృథ్వీపతి | 121 |
శా. | ఏణీలోచన! యేతదుగ్రసమరప్రేక్షోపనమ్రామర | 122 |
శా. | ఆదైత్యాంతకువక్షమన్ గృహము శూన్యత్వైకదోషమ్ఫట | 123 |
మ. | ఘనసిందూరవిముగ్ధమూర్ధము ధృతస్కంధావధిశ్వామికం | 124 |
క. | కీర్తిధనుఁ డైనయీతని | |
| మార్తాండమండలంబున | 125 |
చ. | ఎదిరిచి సమ్ముఖం బయినయింతటిలోనన యేమిచిత్రమో? | 126 |
వ. | అనియె నప్పుడు సమీపంబున డాసి యున్న యంతఃపురదాసి యౌదాసీస్యగర్భంబైన వైదర్భి తలం పెఱింగి వేఱొక్కదెస చూపి, యక్క! యిటు గనుంగొనుము. సౌధాగ్రంబునందు నటియించు కేతనపటాంచలంబునం జలంబు గొని యొక్కకాకి గాహనమునకై కాకారవంబుతోడం గాలూఁదఁ దలంచి యనువుగాక చీకాకుపడుచున్నయది యనుచు నప్రస్తుతభాషణంబులం బరిహాసంబు పుట్టించిన. | 127 |
తే. | దాచేసినయప్పరిహాసమునకు | 128 |
వ. | అప్పుడు. | 129 |
క. | ఆరాజుపట్టు వాసి మ | 130 |
కాళింగుఁడు
వ. | చని మహేంద్రగిరి యేలునన్నరేంద్రునిం జూపి దమయంతి కి ట్లనియె. | 131 |
చ. | నరనుతు నిమ్మహేంద్రగిరినాథు వరింపుము రూపసంపద | 132 |
చ. | గజపతి వచ్చెనంచు నొకగంధగజంబుగుఱించి యొక్కఁ డ | 133 |
తే. | వీనిరిపుకాంత పతిఁ బాసి కానలోనఁ | 134 |
మహాస్రగ్ధర. | రతిఁ గ్రీడాహంసమోహగ్రహిళశిశుభృశప్రార్థితోన్నిద్రదారా | 135 |
ఉ. | యజ్జలదేవతాస్ఫటికహర్మ్యము శేషుఁడు ముజ్జగంబులున్ | 136 |
శా. | ఆమోదాశ్రుభరంబు వెల్లిగొన నెట్లాలించుఁ గర్ణంబులన్? | 137 |
ఆ. | అనిన నల్ల నవ్వె నబ్జాయతాక్షియు | 138 |
వ. | అచ్చోట వేఱొకరాజుం జూపి యారాజవదనకు రాజీవభవునిదేవి యిట్లనియె. | 139 |
నేపాళరాజు
తే. | ఇతఁడు నేపాళభూపాలుఁ డిగురుఁబోణి! | 140 |
తే. | ఉభయపౌలస్త్యవాసైకయోగ్యములును | 141 |
మ. | శరధిప్రోద్ధృతి శింజినీఘటన మాశబ్దగ్రహాకృష్టి యం | 142 |
మహాస్రగ్ధర. | పతితప్రత్యర్థిపృథ్వీపతిముఖకమలోపాశ్రయమ్లానిభృంగ | 143 |
మ. | హరిదంతద్విపదంతకుంతముల కన్వాదేశ మాశీవిషా | 144 |
సీ. | ఇతనిహేతి శతఘ్ని నెబ్భంగి నెదిరించు | |
| సర్వపరచ్ఛిదాశక్తు నీతని నెవ్వి | |
తే. | గాన సంఖ్యాపగమము నొక్కటియ దిక్కు | 145 |
కామరూపాధిపతి
తే. | అనుచు నిబ్బంగి నొత్తి చెప్పినను వినియు | 146 |
వ. | ఇవ్విధంబునం గ్రామరూపాధికుం డైనకామరూపాధిపుం జేరంజని వాగధిదేవత యవ్వనితావతంసంబున కి ట్లనియె. | 147 |
తే. | ఇతఁడు ప్రాగ్జ్యోతిషాధీశుఁ డిందువదన! | 148 |
శా. | క్రూరాసిత్రుటితావారణఘటాకుంఖాస్థికూటస్థలీ | 149 |
స్రగ్ధర. | రాజీవాక్షి! ప్రహారస్రవదసృగసుహృతాంశువంశాళి నేత | |
| త్తేజోధూమధ్వజంబుల్ దిరిగి తిరిగి రోధించు దుస్సాధలీలన్ | 150 |
ఉత్కలదేశరాజు
వ. | అనియె నాసమయంబున సమీపవర్తిని యగు తాంబూలకరంకవాహిని దమసహోదరిభావం బెఱింగి భారతీదేవి నుద్దేశించి యోదేవి! యీ వసుధావల్లభునిమీఁద నిప్పల్లవాధరకు నుల్లంబు పల్లవింపదు వచనపరిశ్రమంబు వలదు. వాఁడె యుత్కలదేశాధీశ్వరుం డమ్మహీశ్వరుగుణకలాపంబు లభివర్ణింపు మనుటయు. | 151 |
క. | భారతి రతీశకల్పుని | 152 |
క. | ఇతఁ డుత్కలదేశాధిపుఁ | 153 |
మ. | చెమరించుం దుహినచ్ఛటాచ్ఛలమునన్ శీతాంశుబింబంబు రేఁ | |
| ల్లిమతల్లీనవమాలికాకుసుమముల్ లీలావతీ! వీనిదు | 154 |
స్రగ్ధర. | పైపైఁ దుక్ఖారధట్టాప్రఖరఖురఫుటీపాతవిక్షుద్యమాన | 155 |
మ. | అసమానస్థిరదానవైభవకళాహంకారసింహాసనా | 156 |
మ. | కలుచం గోశబిలంబు వెల్వడి యదఃఖడ్గాహి పైవచ్చుచోఁ | 157 |
కీకటుఁడు
వ. | అని పలికి పలుకుబోటి వరాటరాజకన్యకం గనుంగొని యప్పు డయ్యింతి యంతరంగంబు నిరంతరస్మరణసరణి ధారావాహికజ్ఞానధారాసమారూఢనిషధపరివృఢం బగుట | |
| నెఱింగియు నెఱుంగనిచందంబున భావించుచు బ్రస్తావోచితప్రకారంబునం జతురంతయానధరులం బదండు పదండని యుత్కలాధీశ్వరుం గడచి యసమసమరవిసృమరచమూమదాంధగంధసింధురఘటావమధుశీకరాసారహారినీహారసమయకంపితారాతిహృదయకమలుండును మదవదరిచూడాకురువిందకందళకిరణసందోహసందీపితచరణారవిందుడును గరళకరాళకరవాలధారానికృత్తగళద్రక్తరిపుసుభటనటారబ్ధనాట్యాద్భుతాలోకహృష్టత్రివిష్టపనివాసుండును నగునొక్కరాసుతుం జూపి దేవి! యితండు కీకటాధీశ్వరుం డిమ్మహీపతిపుంగవు నపాంగరంగస్థలలాస్యలంపటంబు లగుకటాక్షవీక్షణంబుల నిరీక్షింపుము. | 158 |
స్రగ్ధర. | లీలం గట్టించె బెక్కుల్నెలవులఁ జెఱువుల్వీఁడుసాంద్రద్రుమాళీ | 159 |
మహాస్రగ్ధర. | మహిళాసీమంతముక్తామణి! యితనియశోమండలీపూర్ణరాకా | |
| మహిగోళచ్ఛాయమాయామయగణితకళామాత్రలక్ష్యాంగకుండై | 160 |
మహాస్రగ్ధర. | తరుణీ! దామోదరీయోదరకుహరదరీస్థాన మీవిశ్వధాత్రీ | 161 |
వ. | అనిన వినియు ననాదరముద్రాముద్రితం బైనహృదయంబుతో నవ్విద్రుమాధర గీకటాధీశ్వరుం గటాక్షింపకుండిన. | 162 |
పంచనళి
ఉ. | వేసట లేక భీమపృథివీపతినందన యాననాంబుజో | 188 |
వ. | అప్పుడు సరస్వతీదేవినిర్దేశంబున యాసధుర్యులు రాజసమాజంబువలనం బాపి భోజరాజకన్యను నిషధరాజపంచకం | |
| బునుం గదియించుటఁ బరిమళంబులు నందనోద్యానతరుషండంబులవలనఁ బాపి మధుపమాలికం గల్పపాదపంచకంబునుం గదియించిన చందంబు దోఁచె, ననంతరంబు నలాకృతిధరు లయినయాలోకపాలురం జూపి క్రమంబున. | 164 |
తే. | వాణి యిట్లను నక్కీరవాణి కెలమి | 165 |
చ. | అతివ! యపవ్యపాయుని ననల్పవిలోచనపంకజాతుఁ బ్రీ | 166 |
సీ. | భాస్వరరూపసంపన్నుఁ డుద్ధతిమంతుఁ | |
తే. | తామరసపత్త్రనేత్ర! యీతం డనలుఁడు | 167 |
తే. | పరభయంకరపటుగదప్రహరణుండు | 168 |
క. | ధవళాక్షి! చూడు మాతని | 169 |
వ. | అని యాఖండలు గుఱించియు నగ్ని నుద్దేశించియు నంతకు లక్షించియు నంబుపతింగూర్చియుఁ ద్రిభువనార్చితచరణారవింద యగునరవిందభవుదేవి తదీయమాయారూపంబులకు ననురూపంబుగాఁ బ్రత్యేకంబ యుభయార్థవచనసామర్థ్యంబు లగువర్ణనావాక్యంబులం బ్రబోధించిన విదర్భధాత్రీపతిపుత్త్రి నేత్రశోత్రంబులం జూచియు వినియు నితం డితండని నిర్ణయింపనేరక డెందంబు డోలాందోళనంబు నొంద విధి పజ్జను నిషేధంబుత్రోవనుం బోవనితలంపున నిలింపనిషధరాజులను నలువుర విస్మయస్మేరంబు లగువిలోకనంబుల నవలోకించునది. క్రమంబున భారతినిర్దేశంబున నైసర్గికవిలాసభాసమానుండును ససమానరూపరేఖావిడంబితశంబరారాతియు నగు నిషధభూపతిం జూచె నప్పుడు. | 170 |
క. | శారద మధురాలాపవి | 171 |
తే. | నలిననేత్ర! ప్రత్యర్థిదానవశతాహి | 172 |
వ. | మఱియు నితండు హుతవహుండునుంబోలె బహవిగాఢమఘవదధ్వరాజ్యాభిషేకవికస్వరతేజోవిరాజితుం డీశానమూర్తిభేదంబును దండధరుండుుంబోలే బరప్రాణోత్క్రాంతిదానసమర్థశక్తిసంపన్నుండుసు సంజ్ఞానందకరుండును వరుణుండునుంబోలె ప్రతికూలవాతప్రచారచటులవాహినీసహస్రసంసేవితుండునుం బ్రచేతసుండు, నితనిం గనుంగొను, మిప్పురుషపంచకంబునందు నీకుం గన్నిచ్చకు వచ్చునతని వరియింపు మని పలికి పలుకుందొయ్యలి యూరకుండె, నప్పుడు మాయానిషధరాజకాయచ్ఛాయాంతర్వర్తు లగువిబుధచక్రవర్తుల నలువుర నతిక్రమించి పంచమకోటి యగునలునియందుఁ బురాకృతపరిపాకవాసనావశంబుననో పరమపాతివ్రత్యగుణగౌరవంబుననో జాత్యంతరసంగతిగ్రహణంబుననో యక్కురంగలోచనచూపు నెలవుకొనియె వెండియు. | 173 |
క. | ద్వాపర మపుడు విదర్భ | 174 |
చ. | స్ఫురదవలేపతన్ నిషధభూపతు లేవురు కారణంబుగాఁ | |
| మరుఁడు విదర్భరాజసుతమానసముం గలఁగింపఁ బూనుచున్ | 175 |
చ. | వెలయఁగఁ బంచనైషధి విభేదము నేర్పఱుపంగ లేక యా | 176 |
వ. | శంకాలతావితానం బనేకనలావలంబి యగుచుం బ్రబ్బినం గడునిబ్బరం బగువిభ్రమంబున నావిదర్భసుతాసుభ్రూలలామంబు నెమ్మనంబున ని ట్లని వితర్కించు. | 177 |
సీ. | ద్వివిధచంద్రమతి ప్రతీతియో? కాకతి | |
తే. | కాక యీయేవురందు నొక్కరుఁడు నలుఁడొ? | 178 |
తే. | విబుధవరు లేనిఁ బ్రణమిల్లి వేఁడుకొందు | |
| మదనశోషణబాణసంపాతపీత | 179 |
క. | మంచకమధ్యస్థితమ | 180 |
వ. | అనుచు నేవురం గలయం గనుంగొని యందు. | 181 |
దమయంతి నలుని దెలిసికొనుట
మ. | ధరణిం బొందనికోమలాంఘ్రికమలద్వంద్వంబులున్ ఘర్మశీ | 182 |
వ. | కని యైదవవాఁడు నిషధరా జగుట యెఱింగి దేవతాప్రసాదంబు లేక యేకార్యంబు ఫలింపనేరదు. ప్రదక్షిణప్రక్రమణలవాలవిలేపధూపావరణాంబు నేకంబుల ననేకంబు లగుఫలంబు లీఁజాలుటంజేసి వేల్పులు కల్పద్రుమకాననంబులు సుపర్వులకుం జేయు నమస్య సర్వార్థసిద్ధిసంధానసమస్య విబుధసేవ యఖిలాభీష్టప్రదానసురభి యనుచు సభాజనం బెల్ల విస్మయం బంది కనుంగొనుచుండ దివిజసభాజనంబునకుం బ్రారంభించి వైశద్యహృద్యంబు లగు ప్రస్తుతిప్రసూనస్తబకంబుల నింద్రాదిదేవచతుష్టయంబు సంతుష్టి నొందించి తత్ప్రసాదలబ్దం బైనబుద్ధివిభవంబున నమ్మర్త్యవిలక్షణంబు లగుధరణిక్షోదసంస్పర్శనంబును బ్రస్వేదబిందునిష్యందనంబును గుసుమమాల్యమ్లాని యాదిగాఁ గలచిహ్నంబులను | |
| సందేహంబు వాసి మనంబునకుం జూపునకును సంవాదంబు సమకూఱినం గందర్పమందాక్షంబులకు వశంవదయై చంచలం బగుకటాక్షాంచలం బతనిమూర్తిఁ బాయనుం డాయనుం జాలక యఱ్ఱాడ ననంతరంబ. | 183 |
ఉ. | భావములోనికీలు పరిపాటిఁ బరిస్ఫుటతన్ విలాసమున్ | 184 |
వ. | భారతీదేవియు నయ్యంగనయింగితం బెఱింగి తదీయహస్తంబు నిజహస్తంబునం గీలుకొలిపి యుల్లంబు పల్లవింప నిలింపనిషధరాజులం గనుంగొని కనుంగొనల నలంతి నవ్వొలయ ని ట్లను:— నింద్రాగ్నియమవరుణులు కరుణాతరంగితంబు లగునంతరంగంబులతో నీయంతి ననుగ్రహింపవలయు. | 185 |
ఉ. | ఎట్టు వరించు సాధ్వి మిము నిందఱ? దేవచతుష్టయంబునం | 186 |
వ. | అనిన విని లోకపాలచతుష్టయంబు కమలవిష్టరభామినీనిర్దేశంబును నిషధదేశాధీశచిత్తశుపరీక్షణంబునుం దమయంతిపరమపాతివ్రత్యగుణగౌరవంబునుం గారణంబుగా మనంబులం బ్రసాదంబు వహించి నలాకారమాయాకంచుకంబులు దిగఁద్రోచి భీమోద్భవానృపతిసాత్త్వికభావావలోకనాపేక్ష బోలెఁ జక్షుస్సహస్రంబులో సహస్రాక్షుండును గామాంధ | |
| కారగర్వనిర్వాపణదీపికాచక్రవాళంబునుం బోనికీలాజాలంబుతోఁ గీలియును సద్యోనిర్వాణమదనాగ్ని ధూమంబుఁ బోనిధూమ్రదేహచ్ఛాయామండలంబుతో దండధరుండును నిరాశం బైనయాశాపాశంబునుం బోనిపాశంబుతోడ బాశపాణియు నిజరూపంబులు గైకొని, రప్పుడు కందర్పదర్పాపహారపారీణం బైనవీరసేనతనయుమనోహరాకారంబు మాని వైమానికులు దమనిక్కంపురూపులు చేపట్టుట సామ్రాజ్యంబు విడిచి భిక్షాటనంబు పాటించినవిధంబును యౌవనంబుఁ బరిత్యజించి వార్ధకం బంగీకరించినభంగియుం దోఁచెఁ బేరోలగం బున్న భూపాలపాలవర్గంబు గనుంగొనుచుండ రూపాంతరపరిగ్రహం బొనర్చి యింద్రాదు లింద్రజాలవిద్యావిదులచందంబు నొందిరి యనంతరంబ. | 187 |
తే. | క్షీరనీరవిభేదంబు చేసినట్టి | 188 |
వ. | దమయంతి కిట్లనియె. | 189 |
తే. | వీరే యాఖండలాదులు విబుధవరులు | 190 |
వ. | అని యోంకారభద్రపీఠికాశాలంకారం బగుపంకజాసనునిరాణి నియోగింపం గంకణఝణఝణత్కారం బంకురింప నాశశాంకవదన వేల్పులకుం గేలుదోయి యెత్తి నమస్కరించె. | 191 |
ఆశ్వాసాంతము
శా. | సౌందర్యాపరమత్స్యలాంఛన! కళాసర్వజ్ఞ! యర్థార్థిమా | 192 |
క. | వీరావతార! రక్షణ | 193 |
మాలిని. | అవనగుణవిహారా! యంగనాచిత్తచోరా! | 194 |
గద్యము. | ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతంబైన శృంగారనైషధకావ్యంబునందుఁ బంచమాశ్వాసము. | |