శృంగారనైషధము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
శృంగారనైషధము
చతుర్థాశ్వాసము
| శ్రీమచ్ఛరణాంభోరుహ | 1 |
నలుని రాయబారము
వ. | అవధరింపు మివ్విధంబున విబుధమాయాంధకారంబు దూరం బగుటయుం గట్టెదుర నాజగజెట్టి జవనిక వాయందట్టినం బొడసూపుబహురూపుతెఱంగున, జలధరతిరోధానంబు వాసినం బ్రకాశించు నాహిమధామునిపగిది, నవిద్యావరణంబు విరిసినం దోఁచుపరమాత్మునిప్రకారంబున, దోహదపలాలజాలంబు విరిసినం బ్రేక్షణీయం బగుపుండ్రేక్షుకాండంబుభంగిఁ, బరమాద్భుతాస్తనిమేషముద్రుండును నిర్ణిదరోమప్రరోహుండును నిశ్చలాంగుండును వైశాఖస్థానకలితుండును నిర్వికారుండును నై భీముభూపాలపుత్త్రికకు నేత్రవిషయీభావంబు భజియించె, నప్పు డప్పుడమిఱేనిం గనుం | |
| గొని సంభ్రమంబును భయంబును లజ్జయు మనంబునం బెనంగొనంగ నంగనాజనులు సమయసముత్థానఝళఝుళాయమానమణితులాకోటివాచాటీభవత్సభాభవనాళిందంబుగా నందఱుం బ్రత్యుత్థానంబు సేసిరి. ధీరోదాత్త గావున నయ్యాదిగర్భేశ్వరి సమున్నతకనకాసనంబున మున్నున్నయునికిన యుండి యనిర్వచనీయం బైనయానందంబు డెందంబున ననుభవించుచు ‘నెవ్వండ? వెందుండి యేతెంచి, తెట్టు వచ్చితి?’ వని యడుగనుండి మరలఁ జంద్రుండొ! యుపేంద్రుండో! కంతుండో! జయంతుండో! యని సందియం బందుచు మొదల హంసంబు సరసబిసనీపలాశంబుమీఁదఁ జరణనఖాగ్రంబున లిఖియించి చూపినం జూచినచిత్రరూపంబుతో రూపంబు సంవదించుటం జేసి యీతండు నిషధరాజని యెఱింగియు శుద్ధాంతసదనప్రవేశంబు దుర్లభంబు గావున మిగుల విశ్వసింపక నిమేషనిస్స్పృహంబు లైనవిలోచనంబుల సాద్భుతంబును సకౌతుకంబును సానురాగంబునుంగా విలోకించుచు. | 2 |
తే. | అతివ మిథ్యావలోకనాభ్యాసకలన | 3 |
ఉ. | కేవలసాధ్వసంబున సఖీజను లూరక యుండఁగా మనో | 4 |
సీ. | ప్రణతమౌళిమణిప్రభానికాయంబుతోఁ | |
తే. | యాతిథేయుల కభినవాయాతుఁ డైన | 5 |
తే. | అనఘ! యిదె హేమరత్నసింహాసనంబు | 6 |
తే. | నవశిరీషసుమంబులనవకమునకు | 7 |
సీ. | ఏదేశమున నుండి యెచ్చోటి కేఁగెదు? | |
| ఫల మేమియొక్కొ యీపటుసాహసమునకు | |
తే. | నైలుఁడవొ! యైలబిలుకూర్మి యాత్మజుఁడవొ! | 8 |
క. | ఆరము నీయుదయమునకు | 9 |
తే. | మానవుఁడ వైతివేని యిమ్మహి కృతార్థ | 10 |
ఉ. | వానిఁ బ్రశంససేయఁదగువాఁడు కృతార్థతముండు వానిచే | 11 |
వ. | గుణాద్భుతం బైనపదార్థంబు వర్ణింపకునికి యసహ్యశల్యం బైనవాగ్జన్మవైఫల్యంబు ధూర్జటిజటాకిరీటాలంకారం బైనశశాంకునిసౌకుమార్యంబును నమృతంబునకు నుత్పత్తిస్థానం బగుపయోనిధానంబు గాంభీర్యంబును విశ్వవిశ్వంభరాం | |
| భోజకర్ణికాయమానం బగుసువర్ణాహార్యంబు ధైర్యంబును విభ్రమభ్రూలతాభంగలీలావిజితసుమనస్సాయకవిలాసరేఖాసారం బై నిర్వికారం బైనయాకారం బెవ్వరియందునుం గలదె! యేము కృతార్థల మైతిమి. మాజన్మంబులు సఫలంబు లయ్యె. మావిలోచనంబులు భాగ్యంబులు సేసె. వీనులు భవదుదంతశ్రవణకుతూహలాధీనంబు లయియున్నయవి. వాగమృతంబు వానికిం బ్రసాదింపు మనుటయు. | 12 |
ఉ. | అంకిలి లేక యప్పు డరుణాధరపల్లవనిర్గతంబు లై | 13 |
వ. | అనంతరంబ దమయంతీశాసనంబున సఖీజనంబు కనకాసనంబు వెట్టిన. | 14 |
ఆ. | అవ్వరాసనంబునందు నాసీనుఁడై | 15 |
వ. | ఇట్లు సంభావితుండై యంభోరుహాక్షులు తన్ను వీక్షించుచు సంజాతకౌతుకంబున వింజమా కిడినభంగి నూరకుండ సప్పుణ్యశ్లోకుండు ప్రావృషేణ్యపయోధరధ్వానగంభీరం బైనయెలుంగున దమయంతి నుద్దేశించి. | 16 |
సీ. | ఏను దిక్పతులయాస్థానంబునం దుండి | |
| బ్రాణంబులును బోలె నంతరంగమునందుఁ | |
తే. | నుల్ల మిప్పు డేకాగ్రమై యున్నయదియె? | 17 |
క. | నాకౌకఃప్రవరులు ని | 18 |
వ. | పాకశాసన పావక పరేతరాజ పాశపాణులు పుత్తేరఁ బని పూని వచ్చితిఁ, జిత్తగించి యక్కార్యంబు విను, మప్పరమపురుషులు పరిషన్మధ్యంబునం బంకజాసను తనూభవునివలన ద్రిభువనమోహనంబు లైన నీరూపలావణ్యవిలాసవిభ్రమాదిగుణంబులు విని వినుకలి వలవంత నెంతయుఁ జలించి పంచేషు లుంఠితధైర్యవిత్తంబు లగు తమచిత్తంబులం గలవృత్తాంతంబు లంతయుం దెలియం జెప్పి, రిప్పు డయ్యాశాపతు లాశాపాశంబులఁ గట్టువడినారు. వారియందును సంక్రందనుండు. | 19 |
తే. | నందనోద్యానవీథికాంతరములందుఁ | 20 |
తే. | పరమ మగుకోటి కెక్కె నోపద్మనయన! | 21 |
ఉ. | ఆరసి చూచి తాపమునయందును రూపమునందుఁ బూర్ణిమా | 22 |
తే. | మూఁడుకన్నులవేల్పుతో మోహరించి | 23 |
చ.* | చిలుకలు వల్కునో చెవులు చిల్లులు వోవఁగ నంచు నెన్నఁడున్ | 24 |
తే.* | స్మరశిలీముఖకుసుమకేసరపరాగ | 25 |
తే. | విరహతాపప్రశాంతికై విబుధపతికి | 26 |
మ. | విను వైదర్భి! భవద్వియోగదవధూద్వేగంబు వారించుచున్ | 27 |
ఉ. | పుష్పధనుర్లతామధుపపుంజగుణక్వణనం బొనర్చి వా | 28 |
తే. | చెలువ! జంభారియాసకుఁ గొలఁది యేది? | 29 |
క. | ఏవేల్పు సోమపీథులు | 30 |
ఉ. | స్థాణునిలోచనాంచలము దాపుఁగఁ దీవ్ర తరార్చున్ల నిజ | |
| బాణదశార్ధపాతమునఁ బావకుభూరిమనోభిమానమున్. | 31 |
తే. | ఉవిద! సోమరసం బన్న నోకిలించు | 32 |
తే. | తరుణి! యాత్మప్రతాపసంతప్తుఁ జేసి | 33 |
క. | కుసుమాయుధబాణంబులఁ | 34 |
ఉ. | బాలిక! నీవు హేతువుగ భానుకులాభరణంబు దక్షిణం | 35 |
క. | చండజ్వరజర్జరమును | 36 |
క. | బిసరుహలోచన! సంధ్యా | |
| వ్యసనసముజ్జృంభిత యగు | 37 |
క. | మదిరాక్షి! జలధి నశ్వా | 38 |
తే. | తరుణి! తద్భుజమధ్యమధ్యంబునందు | 39 |
వ. | ఈచందంబునం ద్రిలోకతిలకులగు నాదిశావల్లభులు భవదాయల్లకభరం బను వెల్లి మునుగంబాఱు నెల్లి నీస్వయంవరమహోత్సవం బని విని తపనసంకాశంబు లైనవిమానంబు లెక్కి యేతదర్థంబున నిజశుద్ధాంతకాంతాజనంబు విరహసంతాపభాజనంబుగా నిశితనిస్త్రింశనీకాశం బగునాకాశంబు డిగ్గి పాదార్పణానుగ్రహంబున మహీమండలంబు గృతార్థంబుగా నిప్పు డిప్పురంబున కనతిదూరంబుననున్నవారు. యదృచ్ఛాగతుం డైననన్నుం గనుంగొని నామనంబున సందేశాక్షరంబులు వ్రాసి జంగమలేఖంబు గావించి నీసకాశంబునకుం బుత్తెంచిరి. కుసుమశరభిల్లశరశల్యవిశల్యౌషధీవల్లి వగునిన్నుం బరిష్వంగంబు సేయను, ననంగలీలాలహరీతుషారం బగునీశరీరంబుసోకున నంతరంగపరితాపం బపనయింపను, నిష్పీతపీతాదర్పంబులగు నీయంగంబు లపాంగంబులకు లేపం బొనర్పను, బ్రసవనారాచశరాసనాతివిభ్రమభ్రూవిలాసం బగునీముఖశ్రీసముల్లా | |
| సంబునకు నుల్లసిల్లను, సుమనగకోదండచండాలసంస్పృష్టిదోషదూషితు లగుతమ్ము నీకటాక్షవిశేషసాంద్రచంద్రాతపాలోకంబుల నభిషేకింపను, భవచ్చరణకమలసేవాహితమహత్త్వంబున మదనాపమృత్యుదేవతవలన నిజప్రాణంబులకుఁ బరిత్రాణంబుఁ గావింపనుం దలంచుచున్నవారు. కుశలప్రశ్నపూర్వకంబుగా నాగీర్వాణులు నీకుం జెప్పుమనినపలుకులు గొన్ని గలవు వాని నాకర్ణింపుము. | 40 |
క. | ఆదిత్యుల మగుమాకును | 41 |
శా. | ఔదాసీన్యము నుజ్జగించి విను వాక్యం బస్మదీయంబు మి | 42 |
శా. | మాదివ్యత్వము నీకు నిత్తు మని సంభావింప సి గ్గయ్యెడిన్ | 43 |
మహాస్రగ్ధర. | త్వదరాళభ్రూలతాద్వం | |
| ద్వదుదంచన్మందహాసో | 44 |
భా. | నీలావణ్యపయోధియందు నలరు న్నేత్రాబ్జముల్ నీమనో | 45 |
వ. | అని బృందారకచతుష్టయంబు నీతోఁ జెప్పు మనెం గావున. | 46 |
క. | సురసార్థవాచిక స్ర | 47 |
చ.* | అమరపతి న్వరించెదవొ! హవ్యవహున్ చరణంబు ద్రొక్కెదో! | 48 |
వ. | అనిన విని యయ్యంబుజాక్షి యక్షిభ్రువవిశేషవిశ్రమంబున ననాదరంబు దెల్పుచు నలవోకగా దిగీశసందేశం బాకర్ణించి యారాజకుమారున కి ట్లనియె. | 49 |
తే. | ప్రశ్న మొక్కటి యొక్కటి ప్రతివచనము | 50 |
క. | ఒకచోటఁ బ్రకాశించియు | 51 |
తే. | అధికతరు లై సఁ గాని దిశాధిపతులు | 52 |
వ. | ఏను జేసినప్రశ్నంబునకు నుత్తరంబు నీమీఁద నప్పై యున్నయది యిప్పుడైన నాఋణంబుఁ దీర్చుకొనుము. భవాదృశం బైననాయకరత్నంబు నేవంశంబు భరించె? నేవర్ణంబులు నీపుణ్యనామంబునకుం బ్రకాశకంబు లైనయవి? యని పరిమితంబుగాఁ బలికి కుండిననరేంద్రనందన యూరకుండుటయు నన్నిషధమండలాధీశ్వరుండు. | 53 |
ఉ. | తామరసా! వంశకథ దవ్వుల నుండఁగ నిమ్ము చెప్పఁగా | 54 |
తే. | ఇంతమాత్రంబు సెప్పెద నెఱిఁగికొనుము | |
| మైత్రి కఱ సేయఁ దగ దేను మసుజవిభుఁడ | 55 |
ఉ. | పే రడుగం దలంచెదవొ? భీమతనూభవ! యావిచారముం | 56 |
వ. | అదియునుం గాక. | 57 |
క. | కువలయనేత్ర! సమక్ష | 58 |
సీ. | అని శారదం బైనవనమయూరము వోలె | |
తే. | యనఘ? మము నీవు వంచింప నభిలషించె | 59 |
తే. | అన్యపురుషులతోడ నెయ్యంపుగోష్ఠి | 60 |
క. | తగవే కులకన్యలకును | 61 |
వ. | అనిన విని ప్రతిబంధరచనాచాతుర్యంబును మనంబునం దభినందించుచుఁ బ్రత్యుత్తరంబు వేఱొండు వెదకి పొడగానలేక యాలోకోత్తరచరిత్రుండు విదర్భరాజపుత్త్రిం గనుంగొని నేత్రాంచలంబుల నలంతినవ్వు దొలంకాడ ని ట్లనియె. | 62 |
సీ. | వామాక్షి! మాక్షికస్వాదుపేశల మైన | |
తే. | వెలఁది! నామీఁదఁ గడుఁగృపావిలసనంబు | 63 |
తే. | ఇందుబింబాస్య! నారాక కెదురుచూచు | 64 |
చ.* | హరిహయుఁ డేమి యయ్యె నొకఁడా! మదనానలతాపవేదనన్? | 65 |
వ. | అనిన విదర్భరాజకన్యక యా రాజకుమారున కి ట్లనియె. | 66 |
తే. | [1]అలఁతినవ్వు ప్రగల్భతాహంకరణము | 67 |
సీ. | అమరాంగనాసంగమాభిశోభితుఁ డైన | |
తే. | నలపతివ్రతయైన యేఁ దలఁప నొరునిఁ | 68 |
చ. | అటు దగునే సురేశ్వరునియంతటివాఁ డఖిలాప్సరోంగనా | 69 |
మ. | వినుమా నాదుప్రతిజ్ఞ తత్పరత నుర్వీనాథ! యే నైషధేం | 70 |
తే. | అనుచుఁ దీక్ష్ణంబుగా భీమతనయ పలుక | 71 |
వ. | వెండియు దమయంతి నుద్దేశించి. | 72 |
క. | నిఱుపేదయింటి కేటికిఁ | 73 |
సీ. | ముగ్ధత్వమునఁ జంద్రముఖి పరాఙ్ముఖి వయ్యె | |
| నమృతాంధసుల నొల్లనను మానవియుఁ గల్గె | |
తే. | యకటకట! సర్వగీర్వాణమకుటఘటిత | 74 |
సీ. | రజ్జువల్లరిమీఁదఁ బ్రణయంబు గల దేని | |
తే. | ఘట్టకుటికాప్రభాతంబు క్రమము నంది | 75 |
తే. | ఒల్ల ననుమాట కర్థమో యుత్పలాక్షి! | |
| విధి నిషేధరూపంబు భావించియున్న | 76 |
వ. | ఇవ్విధం బగునేని. | 77 |
సీ. | వెలఁది! యైరావతద్వీపకుంభకుచకుంభ | |
తే. | వైభవం బిచ్చగించి పావనతఁ గోరి | 78 |
తే. | అని నృపాలుండు వలుక హస్తాంకసుప్త | 79 |
వ. | చింతాక్రాంత యయి యొక్కింతతడవు తలవంచికొని విచారించి పదంపడి నిట్టూర్పు నిగిడించి యాయిందువదన యారాజకందర్పునిం గనుంగొని సవిషాదంబుగా నిట్లనియె. | 80 |
ఉ. | నీచరితంబు చూడ నతినిష్ఠుర మయ్యెడు లోకపాలదు | |
| నా చెవులందు నీకుఁ దగునా యిటు సేయఁగఁ? దప్పనంటి బా | 81 |
సీ. | ఇదె యెల్లి కల్యాణ మేతెంచుచున్నది | |
తే. | హస్తములు మోడ్చి వేఁడెద ననఘ! నిన్ను | 82 |
క. | ఈరీతి నాతలోదరి | 83 |
ఉ. | మైత్రియుఁ బ్రేమయు న్మనసు మచ్చికయు న్మెఱయ న్వరాటరా | 84 |
సీ. | హరి కల్పవృక్షంబుఁ బ్రార్థించి నినుఁ గోరి | |
| సర్వకామద మైన సప్తతంతువున ని | |
తే. | గాన విను మేను జెప్పినక్రమము లెస్స | 85 |
వ. | అని పలికిన నప్రతివిధానం బైనప్రియావాప్తివిఘాతంబున హృదయంబు గలంగిన. | 86 |
సీ. | ప్రవిమలాక్షినభోనభస్యాంబుదములకు | |
తే. | వేఁడియశ్రులు నిగుడంగ వెక్కివెక్కి | 87 |
వ. | ఇట్లు గద్గదికానిరుద్ధకంఠనాళయై యబ్బాల యశ్రుకణంబులు కొనగోళ్ల మీటుచుం దల వాల్చి యేడ్చుచున్నం గనుంగొని దివిజోపకారకార్యప్రయోజనసంస్తంభితం బైన విప్రలంభవేదనాభరం బప్పు డుద్దీపితంబై భరింపం గొలఁది కాక విశ్వంభరావల్లభుండు మనంబున సంక్షోభించి విభ్రాంతుండై తన్నునుం దనవచ్చినకార్యంబునుం దన్ను బుత్తెంచిన వేల్పులను మఱచి యవస్థానవశంబున నుచితానుచితవివేకంబు దప్పుటయు భావనానిరూఢంబు లైనప్రియావిలాపంబులు వికల్పించుచు నిట్లనియె. | 88 |
నలుఁడు దమయంతికిఁ దననామాదుల నెఱిఁగించుట
క. | ఏమిటి కేడ్చెద? వానన | 89 |
తే. | కాంత! యశ్రుబిందుచ్యుతికైతవమునఁ | 90 |
వ. | చెలువ! చెక్కుటద్దంబునం జేయిడి యేల చింతించెద? వేటికిం బల్లవపాటలం బైనయధరంబు బీఁట లెగయ వేడినిట్టూర్పుగాడ్పులు నిగిడించెద? వేకతంబున గద్గదిక నొందెద? వేకారణంబున నశ్రుకణంబు లురుల నేడ్చెద? వీసంతాపంబునకు నేది హేతువు? దప్ప నాడంగదా! యాత్మనిహ్నవం బపరాధం బొక్కొ? శుద్ధాంత | |
| ప్రవేశంబు దోసంబొ? దేవదూత్యంబు ప్రత్యవాయంబొ? చెప్పుము. సేవకులకుం దప్పు గలదే? కలదేనియుం గిరీటమాణిక్యమయూఖపుంజంబులఁ జరణకంజంబుల నివాళించెద, ననుగ్రహింపుము. కృపాదృష్టిదానంబునకు బద్ధముష్టివి గాకుము. వదనంబు వికసించుంగాక. హృదయంబు ప్రసన్నంబు గావలయు. సృక్వభాగంబుల మందహాసలవంబులు గందళించుం గావుత. భ్రూలతాంచలంబులు లీలాచంచలంబు లయ్యెడు, నపాంగప్రాంగణంబులం దరంగితంబు లగుకలికిచూపులు నాపయిం బొలయింపుము. బాష్పధారానృష్టివ్యపాయంబున దరహసితచంద్రికాలోకంబు ప్రకాశింపందగు మధురవచోమృతంబు చెవులకుం జవి జూపు, మాలింగనం బపేక్షించెదఁ, జుంబనంబు దయసేయుము. కుచంబులకుం బరిచర్య సేయనిమ్ము. నఖాంకురనవశశాంకరేఖాభ్యుదయంబు పయోధరోత్సేధశిఖరికూటంబున ఘటియింపంజేయ ననుమతింపు మని మన్మథోన్మాదంబునం బలికి యారాజమన్మథుండు. | 91 |
తే. | కొంతదడ వివ్విధంబున భ్రాంతిఁ బొంది | 92 |
దూత్యము నెఱవేరమికి నలుఁడు చింతిల్లుట
క. | ఏమి యని తలఁతురొకొ సు | |
| ర్యాములు దమకార్యం బే | 93 |
క. | పేరు ప్రమాదవశంబునఁ | 94 |
ఉ. | ఆదిఁ బరోపకారపరులై చరియించినయట్టి యాంజనే | 95 |
తే. | వగవ నేటికి? నే మన వచ్చు నిపుడు? | 96 |
తే.* | అని విచారించుచుండె నయ్యవనినాథుఁ | 97 |
క. | ఆనందబాష్పధారల | 98 |
దమయంతిమాఱుగాఁ జెలియ నలునితో ముచ్చటించుట
వ. | ఇత్తెఱంగున నమ్మెఱుంగుఁబోణి తెరమఱుంగున నుండియు లజ్జావశంబునఁ బలుక నేరక సమయోచితంబు లగుభాషణబులు చెలికత్తియకుం గఱపి పుత్తేఱ నబ్బోటి నిషధరాజుం జేరి యి ట్లనియె. | 99 |
తే. | అర్థిసాధారణమునకు నభయ మిత్తు | 100 |
ఆ. | ఆత్మకాండకారుఁ డగువసంతునకు నె | 101 |
మ. | అనుచున్ సారఘసారసాగణికి నెయ్యంపుంజెలిం బోని తి | 102 |
వ. | చెలికత్తెయుం గ్రమ్మఱి దమయంతీసమీపంబునకు వచ్చె నప్పుడు. | 103 |
నలదమయంతులు చింతిల్లుట
ఉ. | 'నిక్కపుదూత గానిధరణీపతిముందట నేమి యంటినో | |
| ‘యక్కట! దేవకార్య మిటు లాఱడిపోవునె’ యంచు నాత్మలోన్. | 104 |
నలదమయంతులకడకు హంస వచ్చుట
ఉ. | ఆసమయంబునం గనకహంసము హంసపథంబు డిగ్గి యు | 105 |
వ. | ఏఁగు దెంచి పూర్వపరిచయంబున నుర్వీకాంతునిచేతను దమయంతిచేతను సంతోషసంభ్రమసహితంబుగా నుపలాలనంబు వడసి యమ్మరాళంబు నలుని కి ట్లనియె. | 106 |
హంస సాంత్వనవాక్యములఁ బలుకుట
శా. | నీయంతఃకరణంబు నిర్మలము వర్ణింపంగ శక్యంబె నీ | 107 |
వ. | అని వైదర్భిం గనుంగొని. | 108 |
తే. | అమ్మ! దమయంతి ! యంతరంగమ్ములోన | 109 |
వ. | అని యయ్యిద్దఱ నుద్దేశించి దంపతులకు మేలు గావలయు, నుత్తరకర్మం బవిఘ్నం బగుం గాక, నాకును సరసిజాసను | |
| ప్రసాదంబున సకలభూతాంతర్వర్తనంబులు దెలివి పడియుండు, నిప్పుడు చింతాభరంబులం గలంగిన మీయంతరంగంబులవిషాదం బపనయింప వచ్చితిఁ బోయివచ్చెద నని సముచితప్రకారంబున నయ్యిరువురిచేత సుజ్ఞాతుండై పతంగపుంగవుం డరిగెఁ దదనంతరంబ. | 110 |
క. | కనకమరాళం బీక్రియ | 111 |
నలుని మనశ్శుద్ధి
వ. | అప్పుడు నృపాలుండు హేమమరాళసాంత్వనాలాపబలంబున నెట్టకేలకు మనంబునం జేవ దెచ్చుకొని దిక్పాలురం దలంచి నమస్కరించి యిట్లనియె. | 112 |
ఉ. | భావములో నదంభ యగుభక్తికి సంతస మందుఁ డొండెనొం | 113 |
వ. | అనంతరంబ తిరస్కరిణీతిరోహితయై యుండి యక్కుండినేంద్రనందన రాజనందనున కిట్లనియె. | 114 |
ఉ. | ఓరజనీకరాన్వయపయోధినిశాకర! యేఁ బతివ్రతన్ | 112 |
తే. | ఎల్లలోకధర్మంబులు నెఱిఁగియుండి | 116 |
నలునిమనశ్శుద్ధికి దేవతలు సంతోషించుట
మ. | అను చన్యోన్యము పెద్దయేనిఁ దడ వేకాంతంబున న్వారు వో | 117 |
తే. | నలునిదూతత్వ మిబ్బంగిఁ దెలియఁ జూచి | 118 |
స్వయంవరాగతవర్ణనము
వ. | అనంతరంబ కామరూపం బగునాసుత్రామాదిచతుష్టయం బుపాయాంతరంబున దమయంతి వరియింపం దలంచి వంచనానైపుణ్యంబున నలరూపంబులు ధరించి స్వయంవరకాలంబు ప్రతీక్షించుచుండిరి. నిషధరాజును భోజరాజాధికారపురుషనిర్దిష్టంబైన రమ్యస్థలంబున సపరివారుండై బృందారకానుమతి వడసి వసియించె. నయ్యవసరంబున. | 119 |
మ. | చతురంగధ్వజినీసమేతు లగుచున్ శస్త్రవిద్యానిధుల్ | 120 |
తే. | రాజవంశజుఁ డైయుండి రానివాఁడు | 121 |
క. | కొందఱు తరుణి వరింపం | 122 |
తే. | తిలలు పైనెత్తి చల్లిన దిగువఁబడని | 123 |
క. | తఱ చగుపెనుసందడిలో | 124 |
తే. | వెనుక ముందటిసమ్మర్దమునఁ గరంబు | 125 |
ఉ. | కోటిభుజంగపుంగవులు గొల్వఁగ వందిజనంబు ముందటం | 126 |
మ. | ప్రమథాధీశభుజాంతరస్థలఘనప్రాలంబహారం బద | 127 |
వ. | ఇంద్రాగ్నియమవరుణు లేతెంచిరి. తక్కినదిక్పాలురు రారైరి. యది యెట్టి దనిన. | 128 |
సీ. | రాజునొజ్జలమంత్రరక్షాబలంబున | |
తే. | దాను వహియించుధాత్రి కెవ్వానిఁ బెట్టి | 129 |
తే. | ఇట్లు త్రైలోక్యవాసులు నేఁగుదెంచి | 130 |
వ. | అప్పుడు కనకమయరమ్యహర్మ్యనివేశంబులం గ్రథకైశికాధీశ్వరుండు విడియింప నభినవాభ్యాగతు లగుమూఁడులోకం | |
| బులరాజులును విడిసిరి, యారాజసమాజంబు గుండిననగరంబునందుఁ బుండరీకాక్షుజఠరంబునందు భువనత్రయంబు గుంభసంభవుహస్తాంభోరుహంబునందు నంభోధిచతుష్టయంబును బంచాక్షరంబునందుఁ బరమేశ్వరుండునుం బోలె నసంబాధంబై యుండె. నానావిచిత్రచిత్రంబు లగుపురభవనభిత్తిభాగంబులతోడి ప్రతిస్పర్ధం బోలె నాకాశభాగంబు మూర్థాభిషిక్తమకుటరత్నప్రభాభారంబులచేతఁ గిమ్మీరితం బయ్యె, నమహోత్సవాడంబరం బవలోకింప నంబరంబునఁ బీతాంబరత్ర్యంబకులు దేవతాకదంబంబును గొలువఁ గొల్వుండిరి. కందళితహృదయారవిందం బైనసనకసనందనాదియోగీంద్రబృందంబును మందపాలబకదాల్భ్యరైధ్యకభరద్వాజగౌతమప్రభృతిమహర్షిసందోహంబును దగిననెలవుల నుండి విలోకించుచుండె. సముత్తుంగమంగళమృదుమృదంగనినాదభంగీతరంగితసంగంబై విబుధవారాంగనాజనంబు నభోరంగంబునఁ బ్రవర్తించె. వెండియు. | 131 |
చ. | మగువలు భూమిపాలురకు మాటికిమాటికి వైచుకుంచెల | 132 |
తే. | అల్లనల్లన వీచె మంచాంతరములఁ | 133 |
సీ. | పైపై మహాశ్చర్యపర్యుత్సుకంబు లై | |
తే. | వలపు మిగులఁ బరంపరావరణయోగ్య | 134 |
తే. | కదిసి పరిపాటి మణిమంచకములమీఁద | 135 |
ఉ. | ఈసకలంబునం గలమహీపతివర్గము నున్న నుండనీ | 136 |
వ. | ఇవ్విధంబున సుమేరుభూధరకూటసన్నిభంబు లగుహాటకమంచకంబులమీఁదఁ గర్కోటక వాసుకి ప్రభృతు లగుపాతాళభువనవాసులును మేధాతిథిప్రధాను లగువసుధాలోకవాస్తవ్యులును పాకశాసనపరేతరాజముఖ్యు లగు | |
| త్రివిష్టపనిలయులును సుఖోపవిష్టులై యుండుటఁ గనుంగొని సంతుష్టాంతరంగుండై భీమభూపతి తనడెందంబులోన నీయున్నయందఱు బృందారకసంకీర్తనీయచరిత్రులు వీరికులశీలనృత్తవిభవంబు లెఱింగి వర్ణించి దమయంతికిం జూపి చెప్పం త్రైలోక్యజనని నిత్యప్రగల్భవాచాలభగవతి భారతీదేవిదక్కం దక్కినవారు నేర రని విచారించి యమ్మహాదేవి నిట్లని ప్రస్తుతించె. | 137 |
భీమరాజు సరస్వతీదేవిం బ్రార్థించుట
దండకము. | జయజయ జనయిత్రి! కల్యాణసంధాత్రి! గాన్ధర్వవిద్యాకళాకణ్ఠనాళం, త్రివేదీవళీం సారసాహిత్యసౌహిత్యనిర్వర్తితప్రోల్లసద్దృక్తరఙ్గా, మనేకాభిచారక్రియాహోమధూమావళీమేచాకాథర్వణామ్నాయరోమావళిం; కల్పశిక్షాక్షరాకల్పసాక్షాచ్చరిత్రాం నిరుక్తప్రియోక్తిం, భుజద్వంద్వతా మశ్ను వానేనసంశోభితాంఛన్దసా జాతివృత్తప్రభేదప్రభిన్నేన, విద్యామయీం త్వాం భజే. భగవతి! గుణదీర్ఘభావోద్భవాం సంతతిం సందధానం మహాశబ్దనిష్పాదవాక్యక్రియాశాస్త్రకాజ్చీకలాపం కటీమణ్డలే బిభ్రతీం, జ్యోతిషాహారదణ్డేన తారోదయస్ఫూర్తి విద్యోతమానేన విభ్రాజితా మాత్మ పక్షానురాగాన్వితాభ్యా ముభాభ్యాం పూర్వోత్తరాభ్యాం మహాదర్శనాభ్యాం ప్రతిష్ఠాపితోష్ఠప్రవాళాం, పరబ్రహ్మకర్మార్థభేదా ద్విధాయ ద్విధా స్వం శరీరం ప్రతిష్ఠాం పరాం ప్రాప్తయా చారుమీమాంసయా మాంసలేనోరుయుగ్మేన సమ్యక్పరాచ్ఛాదనంలాలయన్తీం, ముహుఃపత్త్రదానే గుణాన్వీత పూగాసకృత్ఖణ్డనప్రౌఢి మాఢౌకమా | |
| నేన దన్తాత్మనా తర్కతన్త్రేణ కామవ్యభిఖ్యాంముఖే ఖ్యాపయన్తీం, ధ్రువం దేవి! వన్దేతమాం త్వామహమ్. ద్రుహిణగృహిణి! మత్స్యపదాదిసంలక్షితం పాణిపద్మం త్వదీయం పురాణం, శిరస్తావకం నిర్మలం ధర్మశాస్త్రం, దలాభ్యాం భ్రువావోం క్రియామన్త్ర రాజస్య, తద్బిన్దునాచిత్రకం ఫాలభాగేతదర్ధేన్దునా తే విరిఞ్చిర్విపఞ్చీకలక్వాణనాకోణచాపం ప్రణిన్యే స్వయమ్. భవతు మమ సదా శుభం భారతి! త్వత్ప్రసాదాదసాధారణాతృత్కృపాధారభూతం ప్రభూతమ్. నమస్సోమసిద్ధాన్తకాన్తాననాయై, నమశ్శూన్య వాదాత్మ మధ్యాన్వితాయై! సువిజ్ఞానసామస్త్యహృత్పఙ్కజాయై, నమస్తే౽స్తు సాకారతాసిద్ధిభూమ్నే, నమస్తే౽స్తు కైవల్యకల్యాణసీమ్నే, నమస్సర్వగీర్వాణచూడామణిశ్రేణిశోణ ప్రభాజాలబాలాతపన్మేరపాదామ్బుజాయై, నమస్తే శరణ్యే, నమస్తే వరేణ్యే, నమశ్శర్మదాయై, నమశ్శాశ్వతాయై, నమో విశ్రుతాయై, నమశ్శారదాయై, నమస్తే నమస్తే నమః. | 138 |
వ. | అని ప్రస్తుతించిన. | 139 |
సరస్వతీసాక్షాత్కారము
మ. | జగతీనాథుని ముందట న్నిలిచె సాక్షాత్కారముం బొంది యా | 140 |
ఆశ్వాసాంతము
శా. | లాటీచిత్తసరోమరాళ! కుకురీలావణ్యలోలాత్మ! క | |
| భోటీనేత్రచకోరచంద్ర! మగధీపుష్పాస్త్ర! చోళీకుచా | 141 |
క. | మందారమంజరీమక | 142 |
మాలిని. | హరిచరణసరోజధ్యాననిష్ఠాగరిష్ఠా! | 143 |
గద్యము. | ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బయినశృంగారనైషధకావ్యంబునందుఁ జతుర్థాశ్వాసము. | |
- ↑ 'కలికి నవ్వు ప్రగల్భతాకారణంబు' అని పా.