వీరభద్ర విజయము/షష్ఠ్యంతములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


షష్ఠ్యంతములు[మార్చు]

42-వ.
కరుణాంచితగుణమణికిని
సురుచిరబాలేందుబింబచూడామణికిన్
వరదైవశిఖామణికిని
జిరతరధీమణికి భక్తచింతామణికిన్.
43-క.
హాలాహలభక్షునకును
శైలాదిప్రముఖదేవజనరక్షునకున్
ఫాలానలచక్షునకున్
శ్రీలలితవిచక్షుణుకును జితదక్షునకున్.
44-క.
ముకుళితకరసురపతికిని
సకలబ్రహ్మాండభాండచయమాయానా
టకతంత్రసూత్రధారికిఁ
బ్రకటితవిస్ఫారమతికిఁ బార్వతీపతికిన్.