వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/కందర్పుఁడు రతీదేవికి తా నరిగిన వృత్తాంతంబు చెప్పుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కందర్పుఁడు రతీదేవికి తా నరిగిన వృత్తాంతంబు చెప్పుట

67-క.
తన నాథుఁడు వచ్చుట గని
వినయంబున నెదురు వచ్చి విభుచిహ్నముఁ దాఁ
గనుఁగొని పెదవులు దడపుచుఁ
దన పతికి రతీలతాంగి దా ని ట్లనియె.
68-సీ.
“చిత్తసంభవ! నీదు శృంగార వారశిమూఁగి యున్నది గాని మ్రోఁత లేదు;
కందర్ప! నీ ముఖకమలము కళ యెల్లనెక్కడఁ జొచ్చెనో యెఱుఁగరాదు;
మదన! నీ తియ్యని మాటలు చెలరేఁగివింతలై పలుమాఱు వినఁగరావు;
అంగజ! నీ లోచనారవిందంబులుసురిఁగి యున్నవి గాని సొంపు లేదు;
ఆ. ఎట్టి పనికిఁ దలఁచె నే మని పంపెనో
భూధరారి నిన్ను బుజ్జగించి
విబుధు లెల్ల బంప వెఱ్ఱివై యే పనుల్
సేయ నియ్యకొంటి చెప్పవయ్య.”
69-వ.
అని పలికినఁ బ్రాణవల్లభ వదనం బాలోకించి పంచబాణుం డి ట్లనియె.
70-సీ.
“నాతి! యిక్కడ నుండి నాకంబుకుం బోయియమరావతీపురం బమరఁ జేరి
దేవకాంతలు రెండుదెసలఁ జూచుచు నుండదేవేంద్రు మొగసాలఁ దేరు డిగ్గి
పోయి నే మ్రొక్కినఁ బొలుపార మన్నించినాకాధినాథుండు నన్నుఁ జూచి
బాలేందుమౌళికిఁ బార్వతికన్నియఁగూర్పంగఁ బుట్టెడు కొమరుచేత
ఆ. దారుణాత్ముండు తారకదైత్యుండు
వేఁగు ననుచుఁ జెప్పి వీడుకొలిపె
వనిత పంపు పూని వచ్చితి నింక దం
డెత్తి పోవలయు నీశుమీఁద.”