వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/శివుఁడు భూసమత్వంబునకై యగస్త్యుని దక్షిణదిక్కునకుఁ బంపుట

వికీసోర్స్ నుండి


శివుఁడు భూసమత్వంబునకై యగస్త్యుని దక్షిణదిక్కునకుఁ బంపుట.

139-వ.
అనవుడు సర్వేశ్వరుండు.
140-త.
వరమునీశ్వర పద్మజాసన వర్ణనీయు మహాత్మునిన్,
శరధు లెల్లను లీలఁ ద్రావిన చండకోపునిఁ గోటి భా
స్కర సమాన విభున్, ధరాసమసత్త్వుఁ, గుంభజుఁ బంపె సు
స్ధిరతమై సమ మయ్యె దక్షిణదిక్కు ధారుణి చెచ్చెరన్.
141-వ.
అంత.
142-మ.
వెలయన్ శంభుఁడు శైలరాజుపురికిన్ వేంచేసె నమ్మూకతో
నలి నవ్వేళఁ బురాంగనాజనము లానందంబుతో నందఱున్
జెలులుం దామును నుత్సవం బొదవఁగా శృంగారముం జేసి త
త్కలధౌతాచలనాధుఁ జూడ మదిలోఁ గాంక్షించి యోర్తోర్తుతోన్.