Jump to content

విభూతి పాదము

వికీసోర్స్ నుండి
పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (విభూతి పాదము)
జ్ఞానము. :


1. దేశబంధశ్చిత్తస్య ధారణా

[మార్చు]

(దేశ బంధః చిత్తస్య ధారణా) - చిత్తమును ఒకే ఒక్క స్థానములో నిశ్చలంగా ఉంచడం ధారణ.


2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్

[మార్చు]

(తత్ర ప్రత్యయ ఏకతానతా ధ్యానమ్) - ధ్యానానికి కేంద్రమైన వస్తువుమీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలపడం ధ్యానము.


3. తదేవార్థమాత్రానిర్భాసమ్ స్వరూపశూన్యమివ సమాధిః

[మార్చు]

(తత్ ఏవ అర్థ మాత్రా నిర్భాసమ్ స్వరూప శూన్యమ్ ఇవ సమాధిః) - ధ్యానం సాఫల్యమైతే సాధకునికి స్థూలశరీరానికీ సమస్త ప్రపంచానికీ అతీతమైనదీ, తనలో అంతర్లీనంగా ఉన్నదీ అయిన అంతర్జ్యోతి కనిపిస్తుంది. అదే సమాధి.


4. త్రయమేకత్ర సంయమః

[మార్చు]

(త్రయమ్ ఏకత్ర సంయమః) - ఈ మూడింటినీ కలిసికట్టుగా (ధారణ, ధ్యానము, సమాధి) సంయమము అంటారు.


5. తజ్జయాత్ ప్రజ్ఞాఽఽలోకః

[మార్చు]

(తత్ జయాత్ ప్రజ్ఞా ఆలోకః) - సంయమము చేస్తే ప్రజ్ఞ కలుగుతుంది.


6. తస్య భూమిషు వినియోగః

[మార్చు]

- ఆ ప్రజ్ఞను క్రమపద్ధతిలో వినియోగించుకోవాలి.


7. త్రయమంతరంగమ్ పూర్వేభ్యః

[మార్చు]

(త్రయమ్ అంతరంగమ్ పూర్వేభ్యః) - సాధన పాదం 29వ సూత్రంలో ప్రస్తావించిన ఐదు విధాలకి (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారము) భిన్నంగా ఈ మూడూ (ధ్యానం, ధారణ, సమాధి) అంతరంగానికి సంబంధించినవి.


8. తదపి బహిరంగమ్ నిర్బీజస్య

[మార్చు]

(తత్ అపి బహిరంగమ్ నిర్బీజస్య) - అష్టాంగాలలో యమ, నియమ మొదలైన ఐదు స్థితులకంటె సంయమం ఉత్తమమే అయినా అది ప్రాథమిక దశలో బహిరంగ సాధనగా ఉంటుంది.


9. వ్యుత్థాననిరోధసంస్కారయోరభిభవప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః

[మార్చు]

(వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభవ ప్రాదుర్భావౌ నిరోధ క్షమ చిత్త అన్వయః నిరోధ పరిణామః) - ప్రారంభదశలో కింది స్థాయిలో చిత్తవృత్తులను అదుపులో ఉంచడానికి నిరోధక చిత్తవృత్తులు పుడతాయి. సాధకుడు వాటిని కూడా తొలగించుకోవాలి. ఈ చిత్తవృత్తులు పుట్టడం, వాటిని నిరోధించడం – ఈ నిరోధకపరిణామాన్ని సాధకుడు గుర్తించడం సాధనలో ఒక పరిణామదశ.


10. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్

[మార్చు]

(తస్య ప్రశాంత వాహితా సంస్కారాత్) - ఆ సాధనతో ధ్యానం ఏకోన్ముఖంగా సాగి ఆధ్యాత్మికమైన ప్రశాంతత లభిస్తుంది సాధకునికి.


11. సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః

[మార్చు]

(సర్వార్థతః ఏకాగ్రతయోః క్షయ ఉదయౌ చిత్తస్య సమాధి పరిణామః) - చిత్తవృత్తులు కలగడం, వాటిని నిరోధించడం, నిరోధిస్తున్నానన్న స్పృహ సాధకునికి కలగడంచేత ఇతర ఆలోచనలన్నీ తొలగి ఏకాగ్రత సాధిస్తాడు. చిత్తము సమాధిస్థితి చేరువ అవుతుంది.


12. తతః పునః శాంతోదితౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతాపరిణామః

[మార్చు]

(తతః పునః శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రతా పరిణామః) - ఆవిధంగా చిత్తవృత్తులు పుట్టడం గిట్టడం సమాన స్థాయిలో (హెచ్చుతగ్గులు లేకుండా) జరిగినప్పుడు ఆ స్థితికి ఏకాగ్రతా పరిణామం అని పేరు.


13. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖ్యాతాః

[మార్చు]

(ఏతేన భూత ఇంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః) - చిత్తము యొక్క పరిణామము వివరించినతరవాత, ఆ పరిమాణానికి ఇంద్రియముల ధర్మము (తత్వము), లక్షణములు, అవస్థలతో (పరిస్థితి) గల సంబంధాన్ని వివరిస్తున్నారు.


14. శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ

[మార్చు]

(శాంత ఉదిత అవ్యపదేశ్య ధర్మ అనుపాతీ ధర్మీ) - ధర్మము అంతర్లీనంగానో అవ్యక్తంగానో వ్యక్తంగానో ప్రతి జీవిలోనూ ఉండడం సర్వసాధారణం.


15. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః

[మార్చు]

(క్రమ అన్యత్వం పరిణామ అన్యత్వే హేతుః) - పరిణామంలో తేడాలకి కారణం పరిణామ క్రమం (చిత్తము ఒక దశనుండి మరొక దశకి పరిణమించే క్రమం)


16. పరిణామత్రయసంయమాదతీతానాగతజ్ఞానమ్

[మార్చు]

(పరిణామ త్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానమ్) - ఈ ధర్మ, లక్షణ, అవస్థలను (పరిణామత్రయం) స్వాధీనం చేసుకున్న సాధకునికి గత, భావి జన్మలగురించిన జ్ఞానం కలుగుతుంది.


17. శబ్దార్థప్రత్యాయానామితరేతరాధ్యాసాత్సంకరః

[మార్చు]

తత్ప్రవిభాగ సంయమాత్సర్వభూత రుతజ్ఞానమ్

[మార్చు]

(శబ్ద అర్థ ప్రత్యాయానామ్ ఇతర ఇతర అధ్యాసాత్ సంకరః తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వ భూత రుత జ్ఞానమ్) - శబ్దం (పదము), అర్థం, వాటికి మూలమైన వస్తువు – సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి అయోమయం కలిగిస్తాయి. సంయమంతో వీటిని విడదీసి స్వాధీనం చేసుకుంటే సమస్త జీవుల భాషను అర్థం చేసుకోడం సాధ్యం.

18. సంస్కారసాక్షాత్కరణాత్పూర్వజాతిజ్ఞానమ్

[మార్చు]

(సంస్కార సాక్షాత్ కరణాత్ పూర్వ జాతి జ్ఞానమ్) - సంస్కారంమూలంగా (పైన వివరించిన మూడు స్థాయీభావాలను అర్థం చేసుకోడంవలన) పూర్వజన్మగురించిన జ్ఞానము కలుగుతుంది.


19. ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్

[మార్చు]

(ప్రత్యయస్య పర చిత్త జ్ఞానమ్) - ఇతరచిత్తములతో సంయమంద్వారా వారి చిత్తముయొక్క స్వభావం గ్రహించగలరు.


20. న చ తత్సాలంబనమ్ తస్యావిషయీభూతత్వాత్వ్

[మార్చు]

(న చ తత్ సాలంబనమ్ తస్య అవిషయీ భూతత్వాత్) - అయితే ఆ జ్ఞానము కేవలము చిత్తస్వభావానికి సంబంధించినదే కానీ ఆ స్వభావానికి మూలమయిన చిత్తవృత్తులను, తెలుసుకోవడం సాధ్యం కాదు. వేరు వేరు జీవులలో చిత్తవృత్తులు వేరు వేరుగా ఉంటాయి కనక. పైగా సంయమంయొక్క ధ్యేయం అది కాదు. (గమనిక: సూత్రాల వరస 22-24 కొన్ని పుస్తకాలలో భిన్నంగా ఉంది. 22వ సూత్రం నేను అనుసరిస్తున్న పుస్తకంలో లేదుకానీ మిగతా పుస్తకాలలో ఉండడంచేత చేర్చేను). అందుచేత ఇక్కడినుండి సూత్రములసంఖ్య మారవచ్చు.)

21. కాయరూపసంయమాత్ తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షుష్ప్రకాశాసంప్రయోగేఽన్తర్ధానమ్

[మార్చు]

(కాయ రూప సంయమాత్ తత్ గ్రాహ్య శక్తి స్తంభే చక్షుః ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానమ్) - శరీరాన్ని కేంద్రము చేసుకుని సంయమం ఆచరించడంద్వారా ఆ దేహానికీ, దానిని చూచే కళ్ళకీ మధ్య గల సంబంధం తెగిపోతుంది. తద్వారా ఆ దేహం ఇతరులకి అగోచరము అవుతుంది.


22. ఏతేన శబ్దాద్యంతర్ధానముక్తమ్.

[మార్చు]

(ఏతేన శబ్ద ఆది అంతర్ధానమ్ ఉక్తమ్) - అదేవిధంగా శబ్దము మొదలైనవి కూడా ఎదుటివారికి అనుభవము కావు.


23. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్

[మార్చు]

అపరాంత జ్ఞానమరిష్టేభ్యః వా

[మార్చు]

(సః ఉపక్రమమ్ నిరుపక్రమమ్ చ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానమ్ అరిష్టేభ్యః వా) - కర్మ ఫలితాలు రెండు విధాలు. వెంటనే కనిపించేవీ, కొంతం సమయం గడిచేక కనిపించేవి. ఈ రెండు రకాల కర్మలను సంయమంద్వారా స్వాధీనం చేసుకుంటే శకునములద్వారా మృత్యువు గురించి తెలుసుకోగలడు.

24. మైత్ర్యాదిషు బలాని.

[మార్చు]

(మైత్రీ ఆదిషు బలాని) - అలాగే మైత్రివంటి గుణములు (మొదటి పాదం సూ. 33లో చెప్పిన కరుణ, ఆనందము, ఉపేక్ష) సంయమనంద్వారా వృద్ధి పొందుతాయి.


25. బలేషు హస్తిబలాదీని.

[మార్చు]

(బలేషు హస్తి బల ఆదీని) - ఏనుగుగురించి సంయమం చేస్తే ఏనుగుబలం పొందుతాడు.


26. ప్రవృత్త్యాలోకన్యాసాత్సూక్ష్మవ్యవహితవిప్రకృష్టజ్ఞానమ్

[మార్చు]

(ప్రవృత్తి ఆలోక న్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానమ్) - హృదయకమలంలో ప్రతిష్ఠమైన అంతర్జ్యోతిని సంయమం చేస్తే సూక్ష్మ విషయాలూ, కంటికి కనిపించనవీ, బహుదూరంలో ఉన్నవీఅన్నిటి గూర్చిన జ్ఞానము కలుగుతుంది.

27. భువనజ్ఞానమ్ సూర్యే సంయమాత్.

[మార్చు]

- సూర్యునిగూర్చి సంయమువలన సూర్యమండలం గురించిన జ్ఞానము కలుగుతుంది.


28. చంద్రే తారావ్యూహజ్ఞానమ్.

[మార్చు]

(చంద్రే తారా వ్యూహ జ్ఞానమ్) - చంద్రుని గూర్చి సంయము చేస్తే చంద్ర, నక్షత్రమండలానికి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది.


29. ధృవే తద్గతజ్ఞానమ్.

[మార్చు]

(ధృవే తత్ గత జ్ఞానమ్) - ధృవునిగూర్చి చేసిన సంయమువలన ధృవమండలంలోని గ్రహములు, తారలగురించిన జ్ఞానం కలుగుతుంది.


30. నాభిచక్రే కాయవ్యూహజ్ఞానమ్.

[మార్చు]

(నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానమ్) - నాభితో సంయమము చేస్తే నాడీజ్ఞానము గురించిన జ్ఞానము కలుగుతుంది.


31. కంఠకూపే క్షుత్పిపాసానివృత్తిః.

[మార్చు]

(కంఠ కూపే క్షుత్ పిపాసా నివృత్తిః) - కంఠంతో సంయమము చేస్తే ఆకలి దప్పులను అరికట్టగలడు.


32. కూర్మనాడ్యాం స్థైర్యమ్.

[మార్చు]

(కూర్మ నాడ్యాం స్థైర్యమ్) - గొంతులో నాలుకకింద ఉండే కూర్మనాడితో సంయమము చేస్తే శరీర స్థైర్యం కలుగుతుంది.

33. మూర్ధజ్యోతిషి సిద్ధదర్శనమ్.

[మార్చు]

(మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనమ్) - తలతో సంయమము చేస్తే సిద్ధులదర్శనము లభిస్తుంది.


34. ప్రతిభాద్వా సర్వమ్.

[మార్చు]

(ప్రతిభాత్ వా సర్వమ్) - అసాధారణమైన మేధవలన సర్వ విషయాలనూ తెలుసుకోగలుగుతాడు.


35. హృదయే చిత్తసంవిత్.

[మార్చు]

(హృదయే చిత్త సంవిత్) - హృదయంతో సంయమము చేస్తే మనోభావనలకి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది.


36. సత్త్వపురుషయోరత్యంతాసంకీర్ణయోః ప్రత్యయ అవిశేషాత్ భోగః

[మార్చు]

పరార్థత్వాత్ స్వార్థసంయమాత్పురుషజ్ఞానమ్

[మార్చు]

(సత్త్వ పురుషయోః అత్యంత అసంకీర్ణయోః ప్రత్యయ అవిశేషాత్ భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానమ్) - సత్త్వం (చిత్తం), పరమపురుషుడు – ఈరెంటిమధ్య గల విశేషమైన వ్యత్యాసాన్ని గుర్తించలేడు. తద్వారా ప్రాపంచికమైన సౌఖ్యం కలుగుతుంది. ఆ వ్యత్యాసం ఉందని గ్రహించి పరమపురుషునితో సంయమం చేస్తే పరమపురుషని గురించిన జ్ఞానము కలుగుతుంది.

37. తతః ప్రాతిభశ్రావణ వేదనాఽఽదర్శాఽఽస్వాదవార్తా జాయంతే

[మార్చు]

(తతః ప్రాతిభ శ్రావణ వేదనా ఆదర్శా ఆస్వాద వార్తా జాయంతే) - ఆ సంయమంవలన పరమ పురుషునికి సంబంధించిన శ్రవణం, దృష్టి, అవగాహన, రుచి, వాసన సాధకునికి అనుభవం అవుతాయి.


38. తే సమాధావుపసర్గా వ్యుత్థానే సిద్ధయః

[మార్చు]

(తే సమాధౌ ఉపసర్గా వ్యుత్థానే సిద్దయః) - ఆ అనుభవ ప్రభావాలు బాహ్యప్రపంచంలో అలౌకిక శక్తులుగా సాధకుడు పొందుతాడు. అవి సమాధికి ప్రతిబంధకాలు.


39. బంధకారణశైథిల్యాత్ ప్రచారసంవేదనాచ్ఛ చిత్తస్య పరశరీరావేశః

[మార్చు]

(బంధ కారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాత్ చ చిత్తస్య పర శరీర ఆవేశః) - బంధనాలకి కారణమైన చిత్తవృత్తులను తెంచుకుని, సమాధివైపు సాధన కొనసాగిస్తే, మరొక దేహం ప్రవేశించగల శక్తి లభిస్తుంది.


40. ఉదానజయాజ్జల పంకకంటకాదిష్వసంగ ఉత్క్‌క్రాంతిశ్చ

[మార్చు]

(ఉదాన జయాత్ జల పంక కంటక ఆదిషు అసంగః ఉత్ క్రాంతిః చ) - ఉదానవాయువును స్వాధీనం చేసుకుంటే నీరు, బురద, ముండ్లపైన నడవగల సామర్థ్యము కలుగుతుంది.


41. సమానజయాజ్జ్వలనమ్.

[మార్చు]

(సమాన జయాత్ జ్వలనమ్) - సమానవాయువును జయించినవాని శరీరం ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.


42. శ్రోత్రాఽకాశయోః సంబంధసంయమాద్దివ్యం శ్రోత్రమ్

[మార్చు]

(శ్రోత్రా ఆకాశయోః సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రమ్) - ఆకాశంతో చెవులను సంయమం చేయడంవల్ల దివ్యశ్రవణ శక్తి కలుగుతుంది.


43. కాయాఽకాశయోస్సంబంధసంయమాతే లఘుతూలసమాపత్తేశ్చ ఆకాశగమనం

[మార్చు]

(కాయ ఆకాశయోః సంబంధ సంయమాత్ లఘు తూల సమాపత్తేః చ ఆకాశ గమనమ్) - శరీరమును ఆకాశముతో సంయమం చేయడంవల్ల శరీరము దూదివలె తేలిక అయి ఆకాశ సంచారము చేయగల శక్తి కలుగుతుంది.


44. బహిరకల్పితా వృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః

[మార్చు]

(బహిః అకల్పితా వృత్తిః మహా విదేహా తతః ప్రకాశ ఆవరణ క్షయః) - ఆత్మని పరమాత్మతో సంయమం చేస్తే కలిగే స్థితికి మహావిదేహము (దేహం లేని స్థితి) అని పేరు. ఆ స్థితిలో పరమాత్మని కప్పిన చీకటి తెర తొలగిపోతుంది.


45. స్థూలస్వరూపసూక్ష్మాన్వయార్తవత్ త్వసంయమాద్భూతజయః

[మార్చు]

(స్థూల స్వరూప సూక్ష్మాత్ అన్వయ ఆర్తవత్ త్వ సంయమాత్ భూత జయః) - స్థూలశరీరము, సూక్ష్మ శరీరము, వాటి మూలతత్వాలు, గుణాలతో సంయమం చేస్తే పంచభూతములపై విజయము సాధించగలడు.


46. తతోఽణిమాదిప్రాదుర్భావ కాయసంపత్తద్ధర్మానభిఘాతశ్చ

[మార్చు]

(తతః అణిమ ఆది ప్రాదుర్భావ కాయ సంపత్ తత్ ధర్మ అనభిఘాతః చ) - తద్వారా అణిమాది సిద్ధులు, శరీరసంపద (రూపం, సౌష్ఠవం) పొందగలడు. శరీరానికి సంబంధించిన అవధులను అధిగమించగలడు.


47. రూపలావణ్యబలవజ్రసంహననత్వాని కాసంపత్

[మార్చు]

(రూప లావణ్య బల వజ్ర సంహననత్వాని కాయసంపత్) - దేహానికి రూప, లావణ్యాలు, వజ్రఘాతాన్ని తట్టుకోగల బలము కలుగుతాయి.


48. గ్రహణస్వరూపాస్మితాన్వయార్థవత్త్వసంయమాదింద్రియజయః

[మార్చు]

(గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్థవత్వ సంయమాత్ ఇంద్రియ జయః) - గ్రహణేంద్రియాలను, గ్రహించగలశక్తినీ, వాటి మూలస్థానాలతోనూ, అస్మితతోనూ సంయమం చేస్తే ఇంద్రియాలను జయించగలడు.

49. తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ

[మార్చు]

(తతః మనః జవిత్వమ్ వికరణాభావః ప్రధాన జయః చ) - అప్పుడు స్థూలశరీరంనుండి విడివడగలడు. సాధకుడికి మనోదారుఢ్యం కలుగుతుంది.


50. సత్త్వపురుషాన్యతాఖ్యాతిమాత్రస్య సర్వభావాధిష్ఠాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ

[మార్చు]

(సత్త్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వ భావ అధిష్ఠాతృత్వం సర్వ జ్ఞాతృత్వం చ) - సత్త్వము (చిత్తము) పరమపురుషుడు – ఈ రెంటిమధ్య గల విబేధంతో సంయమము చేసి పొందిన జ్ఞానమువలన అన్నివిధాల శక్తిమంతుడు, సర్వమూ తెలిసినవాడూ కాగలడు.


51. తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్

[మార్చు]

(తత్ వైరాగ్యాత్ అపి దోష బీజ క్షయే కైవల్యమ్) - ఆ వైరాగ్యమువలన చివరలో మిగిలిన బీజము (తాను జ్ఞానిని అన్న భావం) కూడా నశించి కైవల్యం సిద్ధిస్తుంది.


52. స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్టప్రసంగాత్

[మార్చు]

(స్థాని ఉపనిమంత్రణే సంగ స్మయ అకరణమ్ పునః అనిష్ట ప్రసంగాత్) - ఆవిధంగా భగవంతుని సమాదరణ సాధించినప్పుడు మమకార, అహంకారాలకు లోను కారాదు. అలా చేసినట్లయితే, మళ్లీ అవాంఛనీయ విషయాలు తలెత్తుతాయి.


53. క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానమ్

[మార్చు]

(క్షణ తత్ క్రమయోః సంయమాత్ వివేకజం జ్ఞానమ్) - ఆ జ్ఞానము (అంటే భగవంతుని సమాదరణ లభించిందన్న జ్ఞానము) అది పొందడానికి కారణమైన వరుస క్రమం - వీటితో సంయమం చేయడంతో ఆ బీజము కూడా నశించి సంపూర్ణ సమాధి లభిస్తుంది.


54. జాతిలక్షణదేశైరన్యతానవచ్ఛేదాత్తుల్యయోస్తతః ప్రతిపత్తిః

[మార్చు]

(జాతి లక్షణ దేశైః అన్యత అనవచ్ఛేదాత్ తుల్యయోః తతః ప్రతిపత్తిః) - సాధారణదృష్టికి సమంగా కనిపించే వస్తువులలో వస్తువుయొక్క జాతి, లక్షణాలు, అవి ఉన్న స్థానాలనుబట్టి తేడా ఉంటుంది. సాధకుడికి ఈ సంయమంవలన ఆ తేడా గుర్తించగల వివేకం కలుగుతుంది.


55. తారకమ్ సర్వవిషయం సర్వథా విషయమక్రమమ్ చేతి వివేకజం జ్ఞానమ్.

[మార్చు]

(తారకమ్ సర్వ విషయం సర్వథా విషయమ్ అక్రమమ్ చ ఇతి వివేకజం జ్ఞానమ్) - సర్వ విషయాలనూ – స్థల, కాల, సమయాలతో సంబంధం లేకుండా – అవగాహన చేసుకోగల వివేకంతో పొందిన జ్ఞానమే పరమోత్కృష్టమైన జ్ఞానము.

56.సత్వపురుషయోశ్శుధ్ధి సామ్యే కైవల్యం.


పతంజలి యోగ సూత్రములు (విభూతి పాదము)
జ్ఞానము. :


మూస:పతంజలి యోగ సూత్రములు



{{header2

| title    = పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము
| author   = 
| section  = 
| translation = [[కైవల్య పాదము ]

}} మూస:పతంజలి యోగ సూత్రములు