Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4/మణిప్రవాళము/అనుబంధము

వికీసోర్స్ నుండి


కాని హాస్యమునకు శృంగారముతో నున్నంత సన్నిహితసంబంధము తక్కిన రసములతో నున్నట్లు కన్పింపదు. శృంగారము రసరాట్టు. ఇది సమస్తవస్తు సమన్వయ మొనర్పఁ గలిగినది. ప్రకృతి పురుషుల యేకత్వము నీ రసమే నిరూపింపఁ గలుగుచున్నది. హాస్యము దానికి వైరూప్యము. పృథగ్భావము నాశ్రయించి యీ రసము సచ్చిదానందునైన విమర్శింపఁగలదు. 'హాస్యరస దృష్టితోఁ బరికించిన నుత్తమ విజ్ఞాననిలయములైన యుపనిషద్వాక్యములు సహితము పరిహాసపాత్రములు కావచ్చును. విమర్శ హాస్యమునకు జన్మభూమి. అందువలననే మహాకవి మిల్టన్ హాస్యము 'జ్ఞానప్రదాత్రి' యనినాఁడు.



అనుబంధము

పుష్పలోకము



1. అతని సరస - కవిర్హి మధుహస్తయః అని శ్రుతి.

2. సత్యరథమునకు - కవి ఋతస్య పద్మభిః అని ప్రమాణము, బుద్ధత్వము
    బౌద్ధులకు నిర్యాణము చరమసిద్ధి. ఇదియే బుద్ధత్వము.

3. సాత్మ్యములు : సహజలక్షణములు; శతపత్రములపై కాళిదాసు మేఘ. సం.
    1, శ్లో. 22.

4. నిఋతి దిగ్వాయువతి - శ్రీ విశ్వనాథ ఋతుసంహారము బ్రహ్మ విష్ణు
   మహేశ్వరులు - మహాకవి భర్తృహరి శతకత్రయిలోని శృంగార శతకమును
   "శంభు స్వయంభు హరయో హరిణేక్షణానాం, యేనా క్రియంత సతతం గృహ
   కుంభదాసాః, వాచామగోచర చరిత్ర విచిత్రితాయ తస్మై నమో భగవతే
   కుసుమాయుధాయ” అను శ్లోకముతో నారంభించినాఁడు.

5. శంకరపూజ్యపాదులు : అద్వైతమతస్థాపనాచార్యుఁడైన యాదిశంకరుఁడు

6. నిర్భిర్త్సిత - కాళిదాసు కుమార, సం. 3, శ్లో. 53

7. ప్రౌఢభావ ప్రపూర్ణలౌ' - ఒకకూరా కాకుజా (జపాన్ రచయిత) Book of Tea
   నుండి గృహీతము

8. వినఁబడెను సంగీతము : Heard Melodies are sweet and those unheard off
   are sweeter still - Keats 'ode to a Grecian Urn' ఒక యాంగ్లకవి - వర్డ్సు వర్తు
   (క్రీ.శ. 1770-1850). సుప్రసిద్ధాంగ్ల ప్రకృతి కవి; త్సిన్ చక్రవర్తి: చైనా
   సార్వభౌముఁడు

9. పరిపూఁదోటలు : వసుచరిత్ర ఆ.1, ప. 108

10. తను ధరణీతటిద్విహృతి - ప్రభా. ప్రద్యు. ఆ. 1, ప. 66

11. వృషభగతి రగడ - ప్రబంధములఁ బుష్పాచయముల నీ రగడలఁ గవులు వర్ణించినారు. ఇట వృషభగతి నడకను గూడ సూచించును

12. 'దూసిన నాగమల్లికల' - శ్రీ విశ్వనాథ 'మూగనోము' నుండి

13. వారు లీలాకమల - కాళిదాసు మేఘసం. సర్గ 2, శ్లో. 2

14. భవభూతి (క్రీ.శ. 730 ప్రాంతము) మాలతీమాధవము, ఉత్తరరామచరిత్ర, మహావీరచరిత్ర లనెడి నాటకత్రయమునకుఁ గర్త; పదవాక్యప్రమాణజ్ఞుఁడు

15. పొన్నపూవొడి - వసుచరిత్ర ఆ. 1, ప. 109

16. సరసులనర్మ - ఆముక్తమా. ఆ. 2, ప. 20

17. కలపములఁగూర్ప - తిక్కన విరాటపర్వము ఆ. 1, ప. 320

18. వావాత : మహిషి, పరివృక్త, వావాత, పాలాగలి బత్నీచతుష్టయము. వావాత రాజప్రణయమును జూఱఁగొనినది ప్రాచీన రాజన్యులకుఁ

19. ఈ సుమజన్మ - శ్రీ వేదుల 'కాంక్ష' నుండి

20. లగ్నద్విరేఫ - కాళిదాసు కుమారసం. సర్గ. 3, శ్లో. 30-54.

21. మురారి : అనర్ఘ రాఘవకర్త (క్రీ.శ. 790-840) ఈ భావమునకు మూలము

"ఏక ద్వి త్రి చతుః క్రమేణ గణనా మేషామివాస్తం యతాం
 కుర్వాణా సుమకోచయద్దశశతా న్యంభోజ సంవర్తికాః
 భూయోశ క్రమశః ప్రసారయతీతా స్సం ప్రత్య మానుద్యత
 స్సంఖ్యాతుం సకుతూహ లేవ నళినీ భానో స్సహస్రం కరాన్"

22. తనకుం గౌఁగిలి - విజయవిలాసము ఆ. 1, ప. 130 చేమకూర తంజావూరు రఘునాథరాయల యాస్థానకవి నానాసూన - వసుచరిత్ర ఆ. 2, ప. 47

23. విజ్జికాదేవి - క్రీ.శ. 6, 7 శతాబ్దుల మధ్యకాలము. కౌముదీమహోత్సవ నాటకకర్త్రి - ఇందలి భాగమునకు మూలము : దీర్ఘ దిగంతవిటపేషు కరైరసంఖ్యై నక్షత్ర పుష్పతరణేషు నభోద్రుమస్య, స్నాతో స్థితో జలనిధేరయ మంశుమాలీ, సంధ్యార్చనాయ కుసుమాపచయం కరోతి.

24. చక్షుర్గోచరమగు పుష్పము: సమీక్ష - శ్రీ ముట్నూరి కృష్ణరావు పుట 84.

చంద్రుడు - చంద్రిక

25. తిమిరభూతము సోకు - ప్రబంధ రత్నావళి -557

26. ఫిలిప్పైన్ జాతి : ఫిలిప్పైన్ ద్వీపముల నివసించు నాదిమవాసులు

27. రెడ్ ఇండియనులు - కొలంబస్ ఇండియా యను భ్రాంతితోఁ గనుగొన్న యమెరికా ద్వీపములందలి యాదిమనివాసులు

28. షింటోలు - జపానీయులు 'Shintoism is the pure land school of Japan in its extreme form of Salvation by pure faith'

29. ఒక వేయి తలలతో - పోతన భాగవతము

30. రాజయక్ష్మము - కుమార్తెలు మొఱవిని క్రుద్ధుఁడైన దక్షునకుఁ జంద్రునకు సంధికుదిర్చి శివుఁడర్ధభాగమును శిరముపై ధరించినట్లు బ్రహ్మవైవర్తపురాణము

31. ఉత్క్రాంతివేళ : మరణవేళ

32. శశినర్ధించినాఁడు'; శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 'శశిదూతము' కావ్యమున జెప్పినారు.

33. మేఘవిజయకవి (క్రీ.శ. 1660 ప్రాంతము) హైమకౌముది యనునితని వ్యాకరణ గ్రంథమును భట్టోజి దీక్షితు లనుకరించినారని కొందఱు, భట్టోజి (క్రీ.శ. 1640 ప్రాంతము) అద్వైతాగమ, తంత్రధర్మజ్యోతిషాదికములు ముప్పది రెండు గ్రంథములు రచించిన మహాపండితుఁడు.) సిద్ధాంత కౌముది సంస్కృత వ్యాకరణమును శబ్దరూప నిష్పత్తి క్రమమున మార్చి వ్రాసిన పన్నెండువేల గ్రంథము.

34. సుషుమ్న- సూర్యుని సప్తకిరణముల నొకటియని శ్రుతి

35. శతపథ బ్రాహ్మణము - యజుర్వేదీయ గ్రంథము

36.కెరలి చీఁకటిమ్రాను - తిమ్మన పారిజా. ఆ. 2, ప. 36

37. మన్మథ దివ్యాగమమున – మహాకవి పెద్దపాఁటి యెఱ్ఱన కుమార నైషధములోనిది (ప్రబంధ రత్నా. 84).

38. విరహుల కెల్ల సంధ్యవతి - ప్రబంధ రత్నా. 581

39. అద్యతనాంధ్ర కవి కుమారుఁడు - శ్రీ శ్రీ

40. దినపరిణామలక్ష్మి - పారిజా. ఆ. 2, ప. 44

41. కాల మనియెడి పారిజా. ఆ. 2. ప. 43 - 42. ఉదయగ్రావము - ధూర్జటి కాళహస్తీ... ఆ. 2. ప. 232

43. కడక న్రేచలి గట్టుపట్టి - పారిజా. ఆ. 2. ప. 45

44. అనలాక్షు - మనుచరిత్ర వంశావతార వర్ణనమున 'కలశపాథోరాశి' నుండి

45. పొందుగఁ బశ్చిమాబ్దితట - పారిజా. ఆ. 2, ప. 42

46. పనుపడ వేణునా - సూరన ప్రభా. ప్రద్యు. ఆ. 4. 124

47. తుహినకర మండ - పారిజా. ఆ. 2, ప. 53

48. ఋణ మపరిహార్యమైన - శ్రీకృష్ణరాయలు ఆముక్త ఆ. 4. ప. 158

49. పొలపాల - విశ్వనాథ ఋతుసంహారము

50. సాంద్రచంద్రికలు - మూలము - ప్రభావతీ ప్రద్యు, ఆ. 4, ప. 125

51. అమృతం బాసవ - పారిజా. ఆ. 2, ప. 47

52. నునులేఁత - అనంతామాత్యుని భోజరాజీయము

53. విరహుల మైసోకి - పారిజా. ఆ. 2. ప. 49

54. చరమక్ష్మాధర - శ్రీనాథ యుగమందలి మఱియొక కవిసార్వభౌముఁడు రావిపాటి త్రిపురాంతకుని 'చంద్రతారావళి' నుండి (ప్రబంధరత్నాకరము 173)

55. రతి నాథుండను - పూర్వోదాహృతము 175

56. అనంత రత్న ప్రభవుఁడు కాళిదాసు కుమార సం. సర్గ 1, శ్లో 3

57. ఒక నాయకుఁడు - బిల్హణయామినీపూర్ణతిలకల సంభాషణము

58. కేవల పరోపకార బుద్ధితో - భవభూతి కృతమైనట్లు గదాధరభట్టు రసిక జీవనమున నుదాహరించిన “కిం చంద్రమాః ప్రత్యుపకార లిప్సయా, కరోతి గోభిః కుముదావ బోధనమ్, స్వభావ ఏవోన్నతచేతసాం సతాం, పరోపకార వ్యసనం హి జీవితమ్"

59. తామరసలక్ష్ము - ప్రభావతీ ప్రద్యు. ఆ. 4, ప. 123

60. ఈ వబ్జుండవు - వసు చరిత్ర ఆ. 4, ప. 34

61. శ్యామకంఠ - ప్రభా. ప్రద్యు. ఆ. 4, ప. 153

62. కురంగము నీయందు, త్రిపురసంహార - మనుచరిత్ర

63. వెన్నెల పేరిదారముల - శ్రీ విశ్వనాథ 'శశిదూతము' నుండి.

మలయానిలుఁడు

64. లలనాజనాపాంగ వసుచరిత్ర ఆ. 1. ప. 121

65. కించి దుషః పూర్వ - శ్రీ విశ్వనాథ ఋతుసంహారము - పుట 2

66. ప్రత్యగ్ర సాలాగ్ర - వసు చరి. ఆ. 1, ప. 132

67 . ప్రబంధ పరమేశ్వరుఁడు - ఎఱ్ఱన నృసింహపురాణము ఆ. 2 ప. 60

68 . ఒనర హిమావకుంఠనము - వసుచరి. ఆ. 1, ప. 127

69. దక్షిణాశావధూ - ప్రాచీన కవిప్రోక్తము

70. గండాభోగ ప్రతిఫలిత - ఆచార్య శంకరుని సౌందర్య లహరిలోని యీ శ్లోకము మూలము: “స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవముఖ మిదం మన్మథరథమ్ | యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం మహావీరోమారః ప్రమథపతయే సజ్జితవతే ॥”

71. మలయ కటకో - ఆముక్త ఆ. 5

72. అదికాదే చెలి - మదీయము

73. అనిలకుమారకుండు - వసుచరిత్ర ఆ. 3, ప. 139

భ్రమరాన్వేషణము

74. శివతపోభంగ సమయము - ఇటనుండి 42వ పుట 1వ పంక్తి వరకు మహాకవి కాళిదాసు కుమారసంభవమునందలి 3 సర్గలోని శ్లోకములు విరివిగ గ్రహించితిని

75. అట పాదపములు - మేఘసందే. సర్గ 2, శ్లో 3

76. గగనస్రవంతిలో ప్రభా. ప్రద్యుమ్నము అ. 2

77. శ్రీహర్షచక్రవర్తి - నాగానందాది నాటకకర్త - ఇట నున్న భావమునకు మూలము ప్రియదర్శికలోని

“సంజాతసాంద్ర మకరందరసాం క్రమేణ
పాతుం గతశ్చ కళికాం కమలస్య భృంగః
దగ్ధా నిపత్య సహసైన హిమేన చైషా
వామే విధౌ నహి ఫలం త్యభివాంచితాని ॥"

78. బిల్హణభట్టు (క్రీ.శ. శతాబ్ది) కర్ణ సుందరీ, విక్రమాంక దేవచరిత్రాది గ్రంథకర్త

79. వనపాలక మత్త - నిర్వ. ఉత్త. రామా. ఆ. 8, ప. 25

80. తుమ్మెదపిండు - పూర్వోదాహృతము ఆ. 8, ప. 52

81. చైత్రారూఢిం - ప్రబంధ పరమేశ్వరుని హరివంశము ఉత్తరభాగం ఆ. 7 ప. 68

82. తరుణి ననన్యకాంత - మనుచరిత్ర ఆ. 3

83. “నాకుగాదులు” - శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి - కృష్ణపక్షము 84. ఒక భృంగంబు పారిజా ఆ. 2, ప. 33


85. ఎలఁదేటుల్ పారిజా ఆ. 4. ప. 14

86. ప్రతివర్ష వసంతోదయ - పారిజా ఆ 1 ప 130

87. వేవిన మేడపై - ఆముక్త. ఆ. 1, ప. 62

88. నానాసూన వితాన - వసు. ఆ. 2, ప. 47

89. శ్రీహర్షుని నైషధమున పద్మము తపమొనర్చి దమయంతీపాదరూపమునొందినది. ఈ భావమునే గ్రహించి భట్టుమూర్తి యీ రచన కావించి యుండునని విజ్ఞుల యూహ

90. నిజాన్వయ శత్రువు ప్రభావతి ఆ. 2, ప. 70 తత్కారణవీచికా కళాపూర్ణోదయము ఆ. 6

91. జిజ్ఞాసువు - మారిస్ మేటర్ లింక్, భ్రమరజీవితమును గూర్చి ప్రత్యేక గ్రంథరచన మొనర్చినాడు

92. ఇది యొక కన్నెపూవు - మదీయము

93. హ్రస్వతరమ్ము - శ్రీ పాటిబండ మాధవశర్మ "మధువ్రత” నుండి

94. భ్రమరా దుర్జనమిత్ర - పోతనకృత భాగవతము - దశమస్కంధము - పూర్వ భాగము

95. (పుట 69) ఏమిటి కేడ్చెద - నైషధము ఆ. 4, ప. 89 కాంతయు బిందుచ్యుతి - పూర్వోదాహృతము ఆ. 4, ప. 90

96. “కవుల సందర్భ - ఓ భగవతీ" - ఆచార్య శంకరుని సౌందర్యలహరిలోని క్రింది శ్లోకములు మూలములు :

    "కవీనాం సందర్భస్తబక మకరందైకరసికః
     కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళం |
     అమునంతా దృష్ట్వా తవనవరసాస్వాద తరళే
     అసూయా సంసర్గా దలికనయనం కించి దరుణమ్ ||"
    "దదానే దీనేభ్యఃశ్రియ మనిశ మాశా సుసదృశీ
     మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి !
     తవాన్ని న్మందారస్తబక సుభగే యాతు చరణే
     నిమజ్జన్మజీవః కరసుచరణైష్షట్చరణతామ్ ॥

97. "శాంకరీపల్కుమీ, ప్రళయావసానమున" - శ్రీ నోరి నరసింహశాస్త్రి "తేనెతెట్టె"

నుండి

నిద్రావైచిత్రి


98. శ్రీ కుప్పయాచార్యులవారు - పూర్వము ఆంధ్ర క్రైస్తవ కళాశాలా సంస్కృతాంధ్ర భాషా పండితులు,

99. ఫిన్నిష్ జాతి - యూరప్ నందలి ఫిన్లాండు దేశవాసులు

100. ఆర్యక్షేమేశ్వరుఁడు (క్రీ.శ. 10వ శతాబ్ది ప్రాంతము) నిద్ర మనోమాలిన్యము -

"చిత్తం ప్రసాదయతీ లాఘవ మాదధాతి
ప్రత్యంగ ముజ్జ్వలయతి ప్రతిభావిశేషమ్ |
దోషా నుదస్యతి కరోతి చ ధాతుసామ్యం
ఆనంమర్పయతీ యోగవిశేష గమ్యం ॥

101. కంటికి నిద్ర - కాశీఖండము ఆ. 1, ప. 108 - 101A. అలుక యెత్తినవానికి - భారతము సౌప్తికపర్వము ఆ.1

102. హెరడోటస్ (క్రీ.పూ. 484 - 424) గ్రీకు చరిత్రకారుఁడు. ఆసియా మైనరులోని కపడోసియాలో జన్మము. గ్రీకులకును పారశీకులకును జరిగిన యుద్ధమును తొమ్మిది సంపుటముల చరిత్రగ అయోనిక్ మాండలిక భాషయందు వ్రాసినాఁడు. ఇతని చరిత్ర ప్రాచీన చరిత్రకొక యుత్తమ సాధనము

103. కేటో - (క్రీ.పూ. 183 ప్రాంతము) రోమను రాజనీతిజ్ఞుఁడు, సేనానాయకుఁడు, రచయిత, వ్యవసాయముపై 'డిరెరెస్టికా' యను గ్రంథమును వ్రాసినవాఁడు.

104. అగస్టస్ సీజరు రోమక సామ్రాజ్య చక్రవర్తి. ఎగ్రిపా - క్రీ.పూ. 63 - జూలియస్ సీజరు వధానంతరము వచ్చిన యుద్ధములఁ బైకివచ్చిన సేనాని

105. వాటర్లూ యుద్ధము - (వాటర్లూ బ్రూసెల్సుకు 11 మైళ్ళదూరమున నున్న నగరము) బ్రిటిష్వారికి ఫ్రెంచివారికి 18 జూన్ 1815న యుద్ధము ప్రారంభమైనది. తుదకు నెపోలియన్ లొంగిపోవుటతో 15 జులై 1815లో నంత మొందినది. నెపోలియన్ హెలీనాద్వీపమున ఖైదీయైనాఁడు. నెపోలియన్ - (క్రీ.శ. 1769 - 1821) ఫ్రెంచి చక్రవర్తి. సామాన్య సేనాధికారి పదవినుండి చక్రవర్తియైనాఁడు. The greatest adventurer in the world.

106. బిస్మార్కు - క్రీ.శ. 1879లో నైరోపాయందు మహత్తర వ్యక్తి. బెర్లిన్ కాంగ్రెస్ అధ్యక్షుడు 'Man of Blood and Iron' రెమిని జెన్సెస్ - ఇతని యుత్తమరచన. హంబోర్డు (క్రీ.శ. 1769-1855) యువకుఁడుగ దేశయాత్రలు చేసి తుదకు ఖనన శాస్త్రప్రవీణుఁడై బహుదేశముల నా శాస్త్రమునకు వృద్ధి కల్పించినవాఁడు. తన యాత్రల చరిత్ర ముప్పది యుద్ధంథములుగ రచించినాడు. చర్చిలు (క్రీ.శ. 30 నవంబరు 1874) క్రీ.శ. 1900లో బ్రిటిష్ పార్లమెంటున బ్రవేశించి నేఁటివరకు నవిచ్ఛిన్నముగ సభ్యుఁడైన యాంగ్ల రాజకీయవేత్త, నేఁటి యాంగ్లేయ ప్రధానమంత్రి

107. నెబ్రాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రములలో నొకటి. లింకన్ దీని ముఖ్య నగరము

108. యోగకుండల్యుపనిషత్తు - కృష్ణయజుర్వేదీయము లైన ముప్పది రెండు ఉపనిషత్తులలో నిది యొకటి

109. సుశ్రుతము - సుశ్రుతాచార్య రచితమైన వైద్యశాస్త్రము

110. అవంతి సుందరి - దండి దశ కుమారచరిత్రమున నొకపాత్ర

111. ఒక దాని వెనుక నొకటి - ఆంగ్లమహాకవి వర్డు వర్తు (క్రీ.శ. 1770-1850) సుప్రసిద్ధ ప్రకృతికవి. క్రీ.శ. 1806లో నిద్రను గూర్చి మూఁడు కావ్యములఁ జెప్పినాఁడు. ఇది యందొక దాని కనువాదము

112.ధ్యానీబుద్ధ - జ్ఞానము నుపదేశించు బుద్ధమూర్తికి బేరు ప్రజ్ఞాపారమిత జగత్ప్రసిద్ధి నొంది నేఁడు జావాయందున్న యొకానొక బుద్ధమూర్తి

113.సంధ్యా సమయ సూర్యు "యాథాగార్గ్య - మరీచయో౽ర్క న్యాస్తం - ఇత్యాది” ప్రశ్నోపనిషద్వాక్యములు మూలము

114. అభినవోన్మేష చిహ్నంబైన - కాశీఖండము ఆ. 3, ప. 22

115. రాయలు క్రీ.శ. 1509-30ల మధ్య విజయనగర సమ్రాట్టు, ఆముక్తమాల్యద కర్త. సాంధ్యరాగలహరి - ఆముక్తమా. ఆ. 4, ప. 139.


స్తోత్రపాఠము

116. షోడశోపచారములు ధ్యానావాహనాదులు

117. సాహిత్యకులందు - బిల్హణీయములోని "నైవ వ్యాకరణజ్ఞమేవ పితరమ్” ఇందుకు మూలము

118. బండి గురవింద పూలు బిల్హణుని విక్రమాంక చరిత్రలోని క్రింది శ్లోకము మూలము :

"కిం చారుచరిత్ర విలాస శూన్యాః
కుర్వంతి భూపాః కవి సంగ్రహేణ |
కింజాతు గుంజాఫల భూషణానామ్
సువర్ణకారేణ వనేచరాణామ్ ||"

119. చౌడప్ప - సుప్రసిద్ధాంధ్ర తిట్టుకవి

120. ఎవ్వాని వాకిట - ఇందు తిక్కన ధర్మరాజును వర్ణించినాఁడు - విరాట పర్వము ఆ. 2 121. సర్వబాధా పరిహారము - ఎట్టి పన్నులు లేనిది

122. అంగవ్రాతములో - పోతన భాగవతము - (ప్రహ్లాదఘట్టము )

123. ఓడిపస్ కాంప్లెక్సు - ఓడిపస్ స్పింక్సు రిడిల్ చదివినవాఁడు, పొరపాటున తల్లిని వివాహమాడినవాఁడు ఓడిపస్ కాంప్లెక్స్ అన Relation between parent and child of opposite sexes held by psycho - analysis to cause repressions.

124.కవి యున్మత్తుఁడు "The poet, the lunatic and the lover are all in imagination compact”.

125. నీవు గంధర్వలోక - శ్రీ దేవులపల్లి కృష్ణపక్షము

126. పాదచిహ్నము - శ్రీ శివశంకరశాస్త్రి విరచితము

127. గడచిన ప్రపంచ మహాయుద్ధమున “The first casuality of war is truth” - Mahatma

128. వ్యాసఘట్టము - వ్యాసుఁడే మఱలవచ్చి వివరింపవలసిన గ్రంథగ్రంథి.

129. కారంధమ = కంచు

130. అడియఁడు = అడియేన్ దాసన్ (నేను నీ సేవకుఁడ) అనువాఁడు

131. నభోగాయ = భోగరహితుఁడు, తిట్టు.

132. త్రిశరణములు = బౌద్ధులు చెప్పు “సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి" అనునవి

133. ఋషభములు = చెవి రంధ్రములు

134. క్షేత్రియోవ్యాధి = ప్రకృతి సహజమైన వ్యాధి

135. దండుగు = దోషములకుఁ బ్రభువులు పుచ్చుకొను నపరాధద్రవ్యము

136. పాలమోర్ = అమెరికాయందలి సుప్రసిద్ధ ఖగోళశాస్త్ర పరిశోధనాలయ ముండుచోటు

137. తురీయ యంత్రము = ప్రాచీన వేదర్షులు దీనిమూలమున గ్రహవేధల నిర్ణయించిరి. రామయంత్రము = క్రీ.శ. 15వ శతాబ్ది భారతదేశమున ఖగోళ విజ్ఞానమున గ్రహింపనున్న యంత్రము.

శత్రువులు - శత్రుత్వము

138. ప్లూటార్కు - (క్రీ.శ. 48-122) గ్రీకు జీవిత చరిత్రకారుఁడు (Biographer) అతని 'Lives’ ప్రముఖ గ్రంథము

139. జేబున్నీసా - ఉరుదు భాషలో కవయిత్రి 140. సౌదీ - పర్షియను కవి

141. మయూరంబవోలె - మడికి సింగన సకల నీతి సమ్మతము

142. ఎరిస్టోఫానిస్ - క్రీ.పూ. 445-385) ఏఁబదినాలుగు సుఖాంతనాటకముల రచించిన గ్రీకు నాటకకర్త - The World's Greatest Comic dramatist;

143. ఒనరన్ - పోతన భాగవతకృత్యాదినిఁ జెప్పిన పద్యము

144. సత్యముతో - మహాత్ముఁడు తన యాత్మకథకు 'My experiments with truth’ అని నామకరణము చేసినాడు.

145. దక్షిణామూర్తి - శ్రుతి శాస్త్రార్థ వ్యాఖ్యాన మొనర్చు శివమూర్తి విభేదము

146. అస్తంగతత్వము - రవితోఁ జేరిన గ్రహముల కస్తంగతత్వదోషము కలుగుట జ్యోతిషశాస్త్ర ప్రసిద్ధము.

నవ్వు

147. క్లియోపాత్రా అంటోనీనిఁ బ్రేమపాశబద్ధునిఁ గావించిన సుందరి

148. పండిత రాయలు - రసగంగాధరాది గ్రంథకర్త; క్రీ.శ. 15వ శతాబ్ది సుప్రసిద్ధ పండితుడు

149. హెర్బర్టు స్పెన్సర్ - (క్రీ.శ. 1820-1903) ఇకానమిస్టు సంపాదకుడు, ప్రత్యేకతత్త్వ నిరూపకుఁడు. His system of philosophy is based upon the principle that all organic development is a change from homogeneity to heterogeneity.'

150. బెర్గసన్ - ఒకానొక యాధునిక యూరప్ దేశ తాత్త్వికుఁడు:

151. భరతాచార్యుఁడు - నాట్యశాస్త్ర కర్త.