Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

వికీసోర్స్ నుండి
Vavilala Somayajulu Saahityam- 4

VYAASAALU వావిలాల సోమయాజులు సాహిత్యం - 4 వ్యాసాలు సంపాదకులు: డా. డి. చంద్రశేఖర రెడ్డి ముద్రణ: మార్చి, 2018 మూల్యం: రూ. 500/- ISBN: 978-93-86763-69-3 ముఖచిత్రం: స్టార్ మీడియా సర్వీసెస్, హైదరాబాద్ టైటిల్ డిజైన్: జి. పురుషోత్త్ కుమార్ ప్రింటర్స్ : రైతునేస్తం ప్రెస్, హైదరాబాదు. ప్రచురణ ఎమెస్కో బుక్స్ 1-2-7, బానూకాలనీ, గగనమహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్ - 500029, తెలంగాణ. e-mail : emescobooks@yahoo.com, www.emescobooks.com బ్రాంచ్ ఆఫీసు ఎమెస్కో బుక్స్ 33-22-2, చంద్రం బిల్డింగ్స్ సి.ఆర్. రోడ్, చుట్టుగుంట విజయవాడ-520004, ఆంధ్రప్రదేశ్. ఫోన్ : 0866-2436643 e-mail : emescovja@gmail.com

ముందుమాట

శ్రీ వావిలాల సోమయాజులు (19.1.1918 - 9.1.1992) గుంటూరు జిల్లా విప్రులవల్లె అగ్రహారంలో జన్మించారు. తండ్రి సింగరావధానులుగారు, తల్లి మాణిక్యాంబ గారు. నరసరావుపేట, గుంటూరులో వారి విద్యాభ్యాసం జరిగింది. భార్య కైకమ్మగారు.

సోమయాజులుగారు 1940-46 మధ్య గుంటూరులోని శ్రీ శారదానికేతన ప్రాచ్య కళాశాలలో ప్రధానాచార్యులుగా పనిచేశారు. ఆ తర్వాత 1976లో పదవీవిరమణ పొందేవరకు గుంటూరు హిందూ కళాశాలలో అంధ్రభాషోపన్యాసకులుగా పనిచేశారు.

సోమయాజులుగారి జీవితం పూర్తిగా సాహిత్య రచనకు, సాహిత్య ప్రచారానికే అంకితమై పోయింది. తనకు ఇరవయ్యేళ్లు నిండీ నిండకముందే సాహిత్య నంస్థలలో సభ్యుడిగా సాహిత్య సేవ ప్రారంభించారు. 1939 నుండి సాహితీ సమితి సభ్యులు. ఈ సమితికి సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా వ్యవహరించారు. నవ్యసాహిత్య పరిషత్తుకు సహాయ కార్యదర్శి. “ప్రతిభా పత్రికకు రచనలను ఎంపిక చేసే నిర్జాయక సంఘంలో సభ్యుడు. 1963-78 మధ్య ఒక దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులు.

సోమయాజులుగారు సంస్కృతాంధ్రాంగ్లాలలోను, హిందీలోను గొప్ప పండితులు. ఒక భాష నుండి మరొక భాషలోనికి అనువాదం చేయగలిగిన సమర్థత కలిగినవారు. వచనాన్నే కాదు పద్యాన్ని పద్యరూపంలోనే అనువదించడంలో సిద్ధహస్తులు. ఆయన సహజంగానే కవి కావడంవల్ల అనువాదంలోనూ మూలకావ్యం లోని కవిత్వాంశను నంపూర్ణంగా ప్రదర్శించగలిగిన కవితా హృదయాన్ని సొంతం చేసుకున్నారు. సోమయాజులుగారి సాహిత్య సృజనా జీవితం బహువిపులమైంది. ఇరవై ఏళ్ల వయస్సులోనే ప్రారంభమైన వారి సాహిత్య సేవ జీవితాంతం కొనసాగింది. ఇంత బహుళంగా రచనలు చేసిన వారి సంఖ్య చాలా తక్కువ. అందులోనూ ఇన్ని ప్రక్రియలలో రచనలు చేసినవారు మరీ అరుదు. ఆయన కవిత్వం రాశారు. అందులో పద్యరచనలూ ఉన్నాయి, గేయ రచనలూ ఉన్నాయి. అతిసాధారణ వచనాన్ని కూడా అటు పద్యంలోనూ, ఇటు గేయంలోనూ ఇమిడ్చి మనోహరంగా రచింపగలిగిన శక్తి వారిది. నాటకాలు రాశారు, నాటికలు రాశారు. పద్య నాటికలు రాశారు, గేయనాటికలు రాశారు, సంగీత రూపకాలు రచించారు. శ్రవ్య నాటికలు రాశారు. నవలలు రాశారు. ఆంగ్లం నుండి నాటకాలూ, నవలలూ అనువదించారు. వీటిలో షేక్సియర్‌ నాటకానువాదాలు తెలుగులో వావిలాల వారివే బహుజనాదరణ పొందాయి. హిందీ నుండి మహాకవి జయశంకర ప్రసాద్‌ కావ్యాలు 'కామాయని , 'ఆంసూ” లను అతిమధురంగా పద్యకావ్య రూపంలో అనువదించారు.

ప్రౌఢ కవి అయిఉండీ పిల్లలకోసం సరళవచనంలో నవలలూ, దేశనాయకుల, దేశభక్తుల, చారిత్రక వ్యక్తుల, కవుల జీవిత గాథలూ రచించారు.

ఆయన పద్యరచన ఎంత విపులమో గద్యరచనకూడా అంతే విపులం. కథలు, జీవితగాథలు, నాటకాలు, నవలలను పక్కన బెడితే ఆయన సృష్టించిన వ్యాస సాహిత్యం అపారం. పరిశోధనాత్మక వ్యాసాలెన్నో రచించిన సోమయాజులుగారు సృజనాత్మక వ్యాసాలూ విసృతంగా రాశారు. ఆయన ఎంపిక చేసుకున్న విషయాలే మనల్ని విస్మయ పరుస్తాయి. డజనుకు పైగా వ్యాసాలు వివాహం పైనే అంటే ఆయనకు ప్రజల సాంఘిక జీవనం మీద, ఆచార వ్యవహారాల మీద ఉన్న పట్టును, అవగాహనను మనం అర్థం చేసుకోవచ్చు, మూడుపదుల వయస్సులో ఆయన వాత్స్యాయన కామసూత్రాలపై సాతవాహన సంచికలో రాసిన బృహద్య్యాసం నేటికీ పరిశోధన వ్యాసానికి ఉదాహరణ ప్రాయంగా నిలుస్తుంది. ఆయన ఏమి రాసినా అది ప్రామాణికమే. తాను చెప్పే ప్రతి విషయానికీ ఆయన ఆధారం చూపుతారు. సోమయాజులు గారి రచనలకు మరోపార్శ్వం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా భారతీయ దార్శనికతా ప్రియుడైన ఆయన బహాయీ సాహిత్యాన్ని అనువదించారు. క్రైస్తవ రచనలను అనువదించారు.

సోమయాజులుగారు ఇంగ్లీషులో కూడా కొన్ని వ్యాసాలు రచించారు.

సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్య బంధు, మధురకవి, కవి భూషణ, కుమార ధూర్జటి, పద్యవిద్యాధర వంటి అనేక బిరుదాలతో ఆంధ్ర సాహిత్యలోకం వావిలాల సోమయాజులు గారిని సమ్మానించింది. ఈ బిరుదులు ఆయన రచయితగా ఒకవైపు, సాహిత్య సేవకుడుగా మరోవైపు చేసిన కృషికి అద్దం పడతాయి.

ఐదు దశాబ్దాలకు పైబడిన సాహిత్య జీవితంలో సోమయాజులుగారు చేసిన అసంఖ్యాక రచనల్లో ఎన్నో అలభ్యంగా ఉండిపోయాయి. కొన్ని అముద్రితాలుగా ఉండిపోయాయి. లభించిన రచనల్లో ముద్రితా ముద్రితాలన్నింటిని కలిపి ఇప్పుడు ఆయన లభ్యరచనల సమగ్ర సంపుటాలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ సంపుటులలో ఇది నాల్గవది.

ఈ సంపుటిలో వావిలాల సోమయాజులుగారు తమ సుదీర్ఘ రచనా జీవితంలో రచించిన అనేక వ్యాసాలున్నాయి. వ్యాసరచనలో సోమయాజులు గారిది విశిష్టమైన శైలి. ఆయన ప్రామాణికతకు పెద్దపీట వేస్తారు. ఆయన వ్యాసంలో శాస్త్రీయత, ప్రామాణికతతో పాటు సృజనాత్మకత, చక్కగా చదివించే శైలి, సమగ్రతా లక్షణాలుంటాయి. ఒక విషయానికి ప్రామాణికత పూర్వవిద్వాంసులు నిష్కర్షల నుండి వస్తుంది. బహుగ్రంథ పఠనం, ఆ చదివిన విషయాలను తాను చెప్పదలచుకున్న విషయానికి సమన్వయించడం వారి పరిశోధన వ్యాసాలలో అడుగడుగునా గోచరిస్తుంది. శాతవాహన సంచికలో ప్రచురితమైన వాత్స్యాయనుడు - కామ సూత్రాలు అన్న వ్యాసానికి 103 అధోజ్ఞాపికలున్నాయి. అధోజ్ఞాపికలలో వారు ఉటంకించిన గ్రంథాలు, వ్యాసాలు చూసినప్పుడు ఒక్క వ్యాసరచనకు ఆయనెంత శ్రమించిందీ మనకర్థమవుతుంది. 'మణిప్రవాళము' లోని 8 వ్యాసాలకు 151 అధోజ్ఞాపికలున్నాయి. సాహిత్య విద్యార్థులకోసం ఆయనెన్నో వ్యాసాలు రాశారు. ఒక కావ్యఘట్టాన్ని పరిచయం చేసేటప్పుడు కూడ మూలగ్రంథం, మూలరచయిత, అనువాదకుడు, కావ్యతత్వం, కథ, పాత్రచిత్రణ, విశేషాలు వంటి విషయాలతో వ్యాసం సమగ్రంగా ఉంటుంది. పాఠకుడు సమాచారం కోసం మరొక చోటికి పోవలసిన అవసరముండదు. ఒక నాటకం గురించి రాస్తే సంపూర్ణంగా నాటక లక్షణంతో అన్వయించి చెప్తారు.

ఆయన కవి, నాటకకర్త, సహజంగా భావుకుడు కాబట్టే ఆయన హృదయం ఒక రచనను చూడగానే రసార్ద్రం అవుతుంది. దానిపై అపారమైన ఆదరం కలుగుతుంది. ఆ కవి లేదా రచయితపై స్నేహభావం జనిస్తుంది. ఆ రచన లేదా రచయిత గురించి ఆయన రాయడం ప్రారంభించగానే ఈ లక్షణాలన్నీ ఒక్కసారిగా ఆయనను ఆవరిస్తాయి.

వావిలాల సోమయాజులుగారు పుంఖానుపుంఖంగా వ్యాసాలు రచించినా, వారి వ్యాసాల సంపుటి 'మణి ప్రవాళము' ఒక్కటే గ్రంథరూపం ధరించింది. దీనిలోని ఎనిమిది వ్యాసాలూ సృజనాత్మక వ్యాసాలే.

ఈ సంపుటిలోని పది వ్యాసాలు వివాహం గురించేనంటే ఆయన ఏ విషయాన్నయినా ఎంత విపులంగా పరిశీలిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.

వావిలాల సోమయాజులుగారు తమ సాహిత్యవ్యాసాలలో ప్రాచీనాధునిక తెలుగు సాహిత్యాలు రెండింటినీ సమదృష్టితో చూశారు.

సాహిత్యాన్ని, సంస్కృతిని, లోకం తీరును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడడమే కాక వాటిని చూడవలసిన దృష్టిని కూడా మనకు సోమయాజులు గారు అందించారు.

ఈ వ్యాసాలను చదవడం ద్వారా ఆ దృష్టిని అందుకోవడమే పాఠకునికి కలిగే మహోపకారం.

డి. చంద్రశేఖర రెడ్డి

ఇందులో....

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
9

107

425

833

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.