వాడుకరి చర్చ:Krittivaas

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Krittivaas గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీసోర్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   అర్జున (చర్చ) 15:42, 5 మే 2016 (UTC)

తెలుగు పాటలు[మార్చు]

మీ కృషికి ధన్యవాదాలు. మీరు చాలా లలితగీతాల్ని, కీర్తనలను, సినిమా పాటల్ని చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. వీటిని వికీపీడియాలో చేర్చవద్దని మనవి. అక్కడా పాటల గురించిన వ్యాసాల్ని మాత్రమే చేర్చాలి. దయచేసి గమనించండి. నా ఫోన్ 9246376622 కి పోను చేయండి. చర్చిద్దాము.Rajasekhar1961 (చర్చ) 03:58, 6 ఆగష్టు 2014 (UTC)

మీ మార్పులు[మార్చు]

మీరు నేరుగా ప్రధాన పేరుబరి పేజీలలో పాఠ్యం చేరుస్తున్నట్లుగా గమనించాను (ఉదా). ఇది చాలా పాత పద్ధతి. తెలుగు వికీసోర్స్ పుస్తకాలను యూనికోడ్లో భద్రపరచడానికి కృషి చేస్తున్నది. విడిపేజీలలో పాఠ్యం ఎక్కిస్తే దాని నాణ్యత నిర్ధారించుట కుదరదు కనుక, స్వేచ్ఛా నకలుహక్కులు గల పుస్తకాలు వికీసోర్స్ లో ఎక్కించండి, వాటిని యూనికోడ్ పాఠ్యీకరణం చేయడానికి తోడ్పడండి. ఇప్పటికే జరుగుతున్న కృషిలో పాల్గొంటే మరిన్ని వివరాలు తెలుస్తాయి. సందేహాలుంటే అడగండి.--అర్జున (చర్చ) 22:53, 29 ఏప్రిల్ 2016 (UTC)

కానీ అర్జున్ గారు - ఇవి పుస్తకం నించి రాస్తున్నవి కాదు. ఇవి కీర్తనలు. చాలామటుకు గురువుల దగ్గర నేర్చినవి. ఎవరైన పాడగా వినినవి. అన్నమాచార్య, త్యాగరాజ కీర్తనలు కూడా ఇటువంటివే. అందరూ రాగిరేకులు చూసి వికి లో పెట్టలేరు కదా. --2016-05-04T06:40:54‎ Krittivaas
మీ స్పందనకు ధన్యవాదాలు. అర్ధమైంది. కాని పుస్తక ముద్రణా యుగం అంతమవుతుందేమో అని అందరూ అనే పరిస్థితులలో, ఇంకా ముద్రితం కాని కీర్తనలు అందునా ప్రముఖమైనవి వున్నాయంటే ఆశ్చర్యంగా వుంది. ఒకవేళ మీ గురువుగారిని అడిగిచూశారా?--అర్జున (చర్చ) 15:41, 5 మే 2016 (UTC)
en:w:Mysore_Vasudevachar చూశారా? వారి కృతులు నకలుహక్కుల సమస్య లేదని నిర్ధారించుకున్నాకే వికీసోర్స్ లో చేర్చాలి. వారి పుస్తకం డిఎల్ఐలో ఏమైనా వున్నదేమో పరిశీలించండి. అలా లేకపోతే మీ కృషి నిరుపయోగం అయ్యే అవకాశం వుందని గమనించండి.--అర్జున (చర్చ) 23:49, 5 మే 2016 (UTC)
అర్ధమైంది. నాకు తెలిసి ఈ కీర్తనలని ఎవరూ కాపిరైట్ క్లైం చెయ్యలేరు. మన దేశంలో పాటలు, సినిమా పాటలు, భక్తిగీతాలు, లలితగీతాలు వీటిని వికీలో ఎక్కించినంత మాత్రాన అది కాపీరైట్ ఉల్లంఘన కాదు. పశ్చిమదేశాలలో సంగీతం లిరిక్స్ సంగతి వేరే. వాటిని ఎవరైనా ప్రదర్శించాలన్నా కాపీరైట్ ఎవరిదో పేర్కొనాలి. మన సంగీతకారులు అలా అనుకోరు. వారు కీర్తనలు, గీతాలు రచించేదే ప్రజలు అవి తెలుసుకుని పాడుకోడానికి. నేను ఇది కేవలం గీతాల పాఠం (లిరిక్స్) గురించే పేర్కొంటున్నను. సినీగీతాలు కూడా అంతే. వేటూరి వారి గీతాల్ని సేకరించి ఒక పుస్తకం వెలువరిస్తే ఆ గీతాల మీద ఆ రచయితకి కాపీరైట్ ఉన్నట్తు కాదు. ఈ సందర్చంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నది ఏమిటి అంటే ఇలా పాటలు, సినీగీతాలు వికీలో పొందుపరుసున్నవారిని ఇలా కాపీరైట్ ఉండొచ్చునేమొ అని నిరుత్సాహపరచవద్దు. వాటికి నిజంగా ఎవరన్నా కాపీరైటు ఉంది అని వస్తే అప్పుడు తొలగించండి. తప్పులు ఉంటే క్షమించండి. అన్యధా భావించొద్దు.-- 2016-05-09T06:18:28‎ Krittivaas
వాడుకరి:Krittivaas నేను దాదాపు 9 సంవత్సరాలు వికీలో పనిచేస్తున్నాను. వికీ ఇతర బ్లాగులు, వెబ్సైట్ల వంటిది కాదు. నకలుహక్కులపై స్పష్టమైన విధానం కలిగివుంది. కృషి చేసిన తరువాత ఎప్పుడో అటువంటి కృషి ఉల్లంఘన అని చెప్పడం కంటే ముందలే హెచ్చరించితే వారి కృషి మరింత ఉపయోగకరమైన దిశగా మళ్లించవచ్చు. అమెరికాకు మనకు దాదాపు నకలుహక్కుల చట్టం ప్రాధమిక సూత్రాల ప్రకారం ఒకటే కాని మనదేశంలో ఉల్లంఘించినవారికి చట్టంప్రకారం చర్యతీసుకొనుట అంత త్వరగా కాదు. మీరు మీ కృషి కొనసాగించాలంటే ఏ బ్లాగులోనో మీ సొంత పూచికత్తుపై కృషి చేసుకోవచ్చు. --అర్జున (చర్చ) 12:33, 9 మే 2016 (UTC)