Jump to content

లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/వ్యాస లేఖన విభాగము

వికీసోర్స్ నుండి

8. వ్యాస లేఖన విభాగము

I. 1. వ్యాసము - వివరణము.

2. వ్యాసము - రకములు

వ్యాసము నాల్గు విధములుగా విభజించవచ్చును. అవి 1) సాహిత్య వ్యాసములు 2) శాస్త్రీయ వ్యాసములు 3) విషయ ప్రధాన వ్యాసములు 4) సమస్యాత్మక వ్యాసములు

వ్యాసములను మరియొక విధముగా విభజించి మూడు భాగములుగా చేయవచ్చును.

1.వృత్తాంతవ్యాసములు Narrative Essays
2. వర్ణన వ్యాసములు Descriptive Essays
3. వివరణ వ్యాసములు Reflective Essays

1. వృత్తాంత వ్యాసములు:- శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గాంధీ మొదలగు మహనీయుల జీవిత వృత్తాంతములును, యుద్ధాదుల వృత్తాంతములును, వివాహాది ధర్మములయు, పండుగలయు, వృత్తాంతములను, నిజమైన కధలును, కల్పనాకధలు ఇందు జేరును.

2.వర్ణన వ్యాసములు:-జంతువులను గాని, చెట్లను గాని,పట్టణములను గాని, దేశములను గాని, దృశ్యములను గాని,ఆనకట్టలు, ఇనుపదారులు, మొదలైన నిర్మీత వస్తువులను గాని,వర్ణించుచు వ్రాసిన వ్యాసములు ఈ వర్ణమునకు చేరును.

3.వివరణ వ్యాసములు:- ఏదియో ఒక అంశమును ఎన్నుకొని, అందలి మంచి చెడ్డలను, సమీక్షించుచు, వ్రాసిన వ్యాసము వివరణ వ్యాసము. సత్యము, రాజకీయాంశములు, సాంఘీక, నైతిక, మత విషయములిందు చేరును. రచనా విధానమును బట్టి యొకప్పుడు వర్ణన వ్యాసము, వివరణ వ్యాసముగను, వివరణ వ్యాసము వృత్తాంతము వ్యాసము గను మార్పు చెందు చుండును. వ్యాసమున శైలియు - క్రమమును ప్రధానాంశములు.

శైలి అనగా ఉచిత వాక్యరచన:

1) వ్యాసమున సాధారణముగ వాడుక భాషయే యుండవలెను. కాని నిఘంటువులలోని మారుమూల పదముల వాడరాదు.

2) వ్యాకరణ విరుద్దమగు భాష ఉపయోగించరాదు. ఈనాడు చెప్పబడు శిష్ట వ్యవహారకమును గాని వాడవచ్చును.

సందర్భమును బట్టి, తమ కున్న అనుభవమును పురస్కరించుకొని, గొప్పవారి సూక్తులు ప్రయోగింప వచ్చును. జాతీయములు వ్యాసమునకు పుష్టినిచ్చును. విషయ విభజనము జాగ్రత్తగా చేయవలెను. వ్యాసమును సాధారణముగా (1) శీర్షిక (2) ఉపోద్ఘాతము (3) వ్యాస చర్చ (4) లాభ నష్టములు (5)ఉపసంహారము అనుభాగములుగా వ్రాయవచ్చును.

శీర్షిక: వ్యాసము పేరు - దానికి సంబంధించిన వివరమ మిందుండును ఉపోద్ఘాతము : వ్యాస విషయమందు ప్రవేశ పెట్టబడును. ఈ వ్యాసమునకు సంబంధించి ప్రసిద్ధ పురుషుల వాక్యములిందు పేర్కొన వచ్చును.

వ్యాసచర్చ : వ్యాసమునకు సంబంధించిన చర్చ యిందుండును. స్వీయానుభవమును జూపించి వ్యాసమును ఇందు విపులీకరించవలెను.

లాభ నష్టములు : వ్యాస చర్చలో తేలిన సారాంశమును క్రమ పద్దతిలో చేర్చి వ్రాయవలెను.

ఉపసంహారము : ఇది వ్యాసమునకు ముగింపు. వ్రాసిన వ్యాసముపై తనకు గల అభిప్రాయమునుగాని, మహాపురుషుల అభిప్రాయములు గాని చేర్చి ముగించవలెను.

వ్యాసము క్రమ పద్దతిలో, నిర్మాణాత్మకముగా నుండి పాఠకులకు అభిరుచిని కల్గించవలెను.


(1) వృత్తాంత వ్యాసములు : 1. భరతుడు 2. శ్రీకృష్ణ దేవరాయలు 3. శివాజి 4 అక్బరు 5. బుద్దుడు.


(2) వర్ణన వ్యాసములు : 1. గోవు 2. ఏనుగు 3. హైదరాబాదు 4. హస్తినాపురము 5. గోదావరి


(3) వివరణ వ్యాసములు :

1. సినిమాలు చూచుట వలన లాభనష్టములు
2. విజ్ఞాన యాత్రలు - ప్రాముఖ్యము
3. గ్రంధాలయములు - ఆవశ్యకత
4. వార్తాపత్రికలు
5. కాలము - విలువ
6. శీలము
7. మితవ్యయము
8. మద్యపాన నిషేదము
9. దేశభక్తి
10. సాంకేతిక విద్య
11. ప్రజాస్వామ్యము - రాచరికము
12. వయోజన విద్య
13. శాస్త్ర విజ్ఞానము
14. యుద్దము - నష్టములు
15. అడవులు - ప్రాముఖ్యము
16. వాతావరణ కాలుష్యము
17. లలిత కళలు
18. విద్యార్ధులు - రాజకీయములు
19. ఆహారసమస్య
20. అణుశక్తి - ప్రయోజనములు
21. ఉగ్రవాదము
22. సాహిత్యము - సమాజము
23. మాతృ భాషలో విద్యా బోధన
24. దేశ సమైక్యత
25. ఆలీనోద్యమము