Jump to content

రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/పదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదవ ప్రకరణము

సంఘసేవ

ఎందరో భారత దేశములోను, ఈ రాష్ట్రము లోను గొప్ప గొప్ప ఉద్యోగములను జేసినారు. ద్రవ్యము బాగుగా గిడించినారు. గొప్ప గొప్ప బిరుదములను పొందినారు. కాని నారి యనంతరము మాట యటుండ వారి కాలములోనే వారు పేరుగాని, ఊరుగాని, గుర్తు లేనట్లుగా ఏస్మృతులై పోయినారు. కారణ మేమున ఎంత ధనికులైనను, ఎంత అధికారులైనను, ఎంత పలుకుబకి కలవారైనను, వారు సంఘ సేవ చేయకుండిన, తమద్రవ్యమలో ఒక అంశము నైనను సమాజోస్నతికి వ్యయము చేయకుండిన, తమ పలుకు బడిని, దేశాభిశృద్ధికి : నియోగించ కుండిన, తమ అధికార బలమును ప్రజా ప్రబోధము నకు అర్పించకండిన వారికి ప్రజల హృడయములలో కొంచమైసను స్థానమ లేదు. వారిని ఎవ్వరును ఎప్పుడును మరిచి యైనను స్మరింప నొల్లరు. రాజా బహద్దరు వేంకట రామా రెడ్డి గారు శక్తి వంతమైన గొప్ప ఉద్యోగమును తమ బుద్ధి శ్రద్ధలచేతనే సంపాదించుకొని నారు. తద్ద్వారా మంచి వేతనమును పొందుచు ధనికి లైనారు. అన్ని స:ఘములంఘును మంచి పలుకుబడిని సంపాదించు కొసినారు. నవాబులు, రాజులు, మహా రాజులు, కోటీశ్వరులు, మార్వాడీలు, వకీళ్లు, ఉద్యోగులు, బీదవారు, రైతులు, సర్వవిధముల జనులును వారికి వశపరులైనవారు. వారాంద్రులైను కేవలాధ్రులలో నే కాక కర్ణాటక మహారాష్ట్రలు, ముసల్మాన లలోను కైస్తవుల లోను మంచి పలుకుబడి కలవారు. వారు ఇంచు మించు రాష్ట్రములోని అన్ని జిల్లాలలోను ఉద్యోగము చేసి నారు. ఉర్దూగానట్టి బీద రైతులు తమ కచ్చేరికి వచ్చినప్పుడు వారి భాషలలో మాట్లాడువారు. వారికీ తెనుగే గాక, కర్ణాట కన్నడ, మహారాష్ట్రము. ఉర్దూ, ఫార్సి, భాషలు బాగుగా పచ్చును. ఇంగ్లీషు బాగుగా మాట్లాడుటకు నేర్చినట్టి వారు. ఇట్లు అనేక భాషలను నేర్పి, లోకానుభనను అపారముగా గడించిన రెడ్డి గారు ఇత రులవలె గాక తము ధనమును, తమశక్తిని, తమ బలమును, తమ పలుకు బడిని, ప్రజాభ్యుదయమునకు బాగుగా వినియోగించినారు. భావి కాలములో రెడ్డి గారి ఉద్యోగ చరిత్రను ప్రజలు మరచిపోయిన మరచి పోవచ్చును. కాని వారి సాంఘిక సేవ మాత్రము అజరామరముగా కీర్తింపబడును. రెడ్డిగారు ప్రజా సేవ చేయుటలో రెడ్డి విద్యార్థులకు వసతి గృహమును స్థాపించుట ముఖ్య మైనట్టిది. ఇరువదేను సంవత్సరములకు పూర్వము హైద్రాబాదు నగరములో ఒకే హిందూ హోటలుండెను. అందును భోజన వసతుల సౌకర్యములు సరిగా లేకుండెను. రెడ్డి విద్యార్థులకు అందువలన చాల యిబ్బందిగా నుండెను. విద్యార్థుల సంఖ్యయు చాల తక్కువ గానే నుండెను. ఏపదిమందియో చదువుకొను చుండిరి. ఇట్లుండ వనపర్తి మహారాజా గారగు రాజా రామేశ్వర రావు బహద్దరు గారి చిన్న కుమార్తె గారిని సీర్నపల్లి రాజుగారికిచ్చి : వివాహముచేయు సందర్బములో గొప్ప గొప్ప వారందరును సమకూడిరి. ఆ సందర్బమున వేంకట రామారెడ్డిగారును దయ చేసియుండిరి. రెడ్లలో వివాహాదు లందు వెనుక ముందు చూడక వ్యయము చేయుదురనియు, ఇంతమంది రెడ్డి రాజులు, జమీందారులు, ధనికులు, ఉండియు రెడ్డి విద్యార్థులకే విద్యాసౌకర్యములు చేయక పోయిరనియు అచ్చట సమకూడిన వారితో రెడ్డిగారు ప్రసంగించిరి. “ఎవరైన బాధ్యత వహించిట్లైన మేముందరము సహాయము చేయుదుము " అని అచ్చటి పెద్దలు పలికినారు. " నేను సర్వదా ఈ వ్యవస్థను నిర్వహించుటకు బాధ్యత వహింతును". అని వేకట రామా రెడ్డిగారు పూని పలికినారు. ' ఈ వాక్యము వినినంతనే అందరికన్న ముందే శ్రీయుత పింగిలి వేంకట రామారెడ్డిగారు మహౌదార్యముతో 20,000 రూపాయీలు చందా వేసినారు. వారిని జూచి రాజులందరును పెద్దయెత్తులోనే పోవలసివచ్చెను. ననపర్తి మహా రాజుగారు -25000 రూపాయిను గద్వాల మహా రాజు గారు 30,000 రూపొయిలును పింగిలి కోదండ రామా రెడ్డిగారు 4000 ను, గోపాలు పేట రాణీగారు 4000 ను రాజా రాజేశ్వర రావు బహద్దరు దోమకొండ సంస్థానా ధీశ్వరులు 4000 ను, రాజా సురభి వేంకట లక్ష్మారావు బహద్దరు జటప్రోలు రాజు గారు l000 కూపాయీలును, చందాలు వేసినారు. ఇతర మహాశయులగు దేశముఖులు , జాగీర్దారులును, ధనికులగు పటేండ్లుడు, మున్నగు వారందరును తమ శక్తి కొలది ఉదారముగా చందాలు వేసినారు.


ఈ ప్రకారముగా సుమారు 50 వేలరూపాయీల చందాలు వేయబడెను. ఇందు విశేష భాగము కొలవి కాలము లోనే వసూలయ్యెను. అటుపిమ్మట వేంకట రామా రెడ్డిగారు కాళయుక్తి సంవత్సర జేష్ఠ శు. 5 గురువారము, ( అర్దాదు (1327 ఫసలీ) నాడు హైద్రాబాదు నగరములో 'రెడ్డి హాస్టల్ అను పేర నొక విద్యావ్యాసంస్థను ఒక బాడుగ ఇంటిలో స్థాపించినారు. దాని ప్రారంభోత్సవమును కీ. శే. రాజా మురళీ ధరుగారు గావించినారు. సంవత్సరాంతము లోపలనే 54 గురు విద్యార్థులు వచ్చిచేరిరి. అంతలోననే ఉల్లాసమ్మెక్కువగటచే " రెడ్డి హైస్కూలు"ను కూడ స్థాపించి రెండేండ్ల వరకు నడిపి నారు, కాని దానివలన నష్టమే కలుగుట చేతను ప్రభుత్వ పాఠశాలలే విరివిగా నుండుట చేత ఈ నష్టవ్యవహారముతో నవసరము లేదని తోచినందుసను ఆపాఠశాలను తీసి వేసి కేవలము 'రెడ్డి హాస్ట సందే శ్రద్ధ కేంద్రీకరించిరి. స్థాపితమైన నాటి నుండి నేటి వరరకును దానికి రెడ్డిగారె ప్రధాన కార్యదర్శిగా నున్నారు. ఇతరు లెందరున్నను ఈ హాస్టలు సంపూర్ణము గా వారిచేతనే వృద్ధికి వచ్చినది. వారే ప్రతి ధనికుని వద్ద చందా లెత్తినారు. ప్రతి వివాహములో విరాళములు ప్రోగుచేసినారు. 1333 ఫసలీలో సుమారు 52000, రూసాయిలకు 9000 చదరపు గజముల వైశాల్యముగల యొక పెద్దస్థలమును బంగ్లా యుక్తముగా హాస్టలునకు గాను కొనినారు. అందే యిప్పటికిని రెడ్డి హాస్టలు దినదినాభివృద్ధి నొందుచున్నది. 1334 లో భోజనశాలయు దానిపై ఒక పెద్ద హాలును వంట శాలయు సుమారు 25,000 రూపాయీలు వ్యయము చేసి కట్టించినారు. 1335 లో గ్రంథాలయ భవనమును 4880 రూపాయలకు పైగా వ్యయముచేసి కట్టించినారు. అందిప్పుడు సుమారు 20000 గ్రంథములున్నవి. తర్వాత దాని ప్రక్కన నే మరొక బంగ్లాను 2 జూన్ 1927 సం!లో 20,000 రూపాయీలకు కొనినారు. 1346, ఫసలీలో రూ 10,000 వరకు ఖర్చు పెట్టి వైద్యశాలయు, ఆతిధి గృహమును కట్టించినారు. విద్యార్థుల సంఖ్య 160 వరకు హెచ్చెను.


ఈ ప్రకారము రెడ్డిహాస్టలు దినదినాభివృద్ధి నొందు చుండ కొందరు ఓర్వలేని వారు దాని పై లేనిపోని అపోహములు కల్పించిరి. రెడ్డిగారు రెడ్డిహాస్టలులో బండ్లకొలది ఆయుధములను తెప్పించి యుంచినారనియు విద్యార్థులకు వాటితో యుద్ధములు చేయుటకు నేర్పించి నారనియు ఇట్టివిచిత్ర కథలనుకొందరు మతావేశపరులు వ్యాపింప జేసినారు. ముసల్మానులలో పేరు పొందినట్టి హజరత్ ఖాజాహసన్ నిజామా అనువారు ఒకతడవ రెడ్డిగారి ఆహ్వానము సంగీకరించి హాస్టలును దర్శించినారు. వారు ప్రతివస్తువును పరిశీలించి చూచినారు. భూగృహములు శోధించినారు. “అది పొయఖానా? అని చెప్పిసను దానినికూడ చూచినారు. "అవిస్నానపుగదులు అని చెప్పగా గదులనన్నింటిని పరిశోధించినారు. ఆ కొట్టిడీలో ప్రాతసామాను వేసినారు.. అనినంతనే సామానుల నన్నింటిని తొంగితొంగి చూచినారు. "ఆగదులందు విద్యార్డులు దేహపరిశ్రమచేయుదురు" అని పలికీ పలుకక మునుపే ఆ గదులను ప్రత్యేకముగా తెరిపించి చూచినారు. ఇట్లు సూక్ష్మ పరిశీలనము చేసి వెళ్లిపోయిన తర్వాత నిజామిగారు తాము ప్రచురించునట్టి ఉర్దూ వార పత్రికలోనిట్లు వ్రాసినారు. “నాకు రెడ్డిహాస్టలు విషయమై చిత్ర విచిత్ర వార్తలు తెలిసియుండెను. ఎన్ని యో కత్తులను తెప్పించి బాలురను సిద్ధము చేయుచున్నా రనికొందరు తెలిపినారు. నాకాహ్వానము వేంకట రామా రెడ్డి గారు చేసినప్పుడు అచ్చటికి వెళ్లి పొయఖానాలు, భూగృహము, ప్రాతగదులు, మూలమూలలో గదులు ఏదియును విడువ కుండ చూచినాను. వేకట రామా గెడ్డిగారు నా పరిశోధనలోని యర్దమేమో తెయక ఆశ్చర్యపడు చుండిరి. నాకిప్పుడు సంపూర్ణముగా తృప్తి కలిగినది. అట్టి అబద్ధ ప్రచారమును సరిపడని వారు గెడ్డిగారి విషయమునను వారి హాస్టలువిషయమును చేసి నారని దృశపడి "


శ్రీ రెడ్డి గారికి గ్రంధములందు అత్యంత ప్రీతి. వారిశ్రద్ధ వలననే రెడ్డిహాస్టలులో 11,000 గ్రంథాలు సేకరింపబడెను. అందనే కములు అపురూపమైనవిగాను, విలువగలవిగాను నున్నవి . హైద్రాబాదునగరములో ప్రభుశ్వము వారి ఆసఫియా గ్రంధా లయములో 15,000 గ్రంధాలకన్న ఎక్కువగా లేవు. ఒక ప్ర జాసంస్థలో 11,000 గ్రంథములు ఉండుట ఎంతయో గొప్ప విషయము. సర్కారీ గ్రంథాలయమును, కాలేజీల గ్రంథాలయ ములును తప్పిన , రాష్ట్రములో ఈ రెడ్డి గ్రంథాలయమును
రాజా సర్ కిషన్ ప్రసాదు బహద్దరుగారు. 2. వేంకటరామారెడ్డిగారు. 3. ప్రస్తుతపు కొత్వాలు వ. రహ్మాను యార్సింగు.
హైదరాబాదు రెడ్డిహాస్టలు స్కౌటు సంఘమువారితో రాజా బహద్దరు వేంకటరామారెడ్డిగారు.

మించినట్టిది వేరెందును, లేదు. ఇంతేకాక రెడ్డి బాలురకు వ్యవసాయవిద్యయందు శ్రద్ధ కలుగుటకును, రెడ్డి హాస్టలునకు కూరగాయలు సప్లై అగుటకును 5 ఎకరముల తోటను, ఒక చిన్న, బంగ్లా యుక్తముగా రూ, 6 000 లకు ఖరీదు చేసినారు. అది హుసేను సాగరు చెరువు క్రిందకలదు. దానికి "రెడ్డి బాగ్ అని నామకరణము చేసినారు. ఇప్పుడు రెడ్డిహాస్టలునకు నెలకు సుమారు 100 రూపాయీల కూరగాయలు ఖర్చగుచుండును. అందు సగమువరకు క్రయముచేయు కూరగాయలు ఈ బాగునుండియేవచ్చు చుండును. రెడ్డి విద్యార్థులు సెలవు దినములలో అచ్చటికి వెళ్ళి తోటపనులలో పాల్గొనుచుందురు.


రెడ్డి హాస్టలులలో బాలురకు వ్యాయాయములందు శ్రద్ధగల గుటకై మంచిస్థలము ఏర్పాటుచేసి బంతి ఆటలను, క్రికెటు హాకీ మున్నగువాని నే కాక, ముగ్దర్లు, మొదలగు కస్రశు వస్తువులుకూడ ఏర్పాట్లు కావించి ప్రత్యేకముగా వ్యాయామశాలలను కట్టించినారు.


హాస్టలులో స్కౌటుశాఖను కూడ ఏర్పాటు చేసినారు. 40 - 50 మంది విద్యార్థులు స్కౌట్లుగా ఏర్పడి పోటీలలో అనేక బహుమతులంది ప్రసిద్ధి గాంచినారు.


ఈ రెడ్డిహాస్టలులో వందలకొలది బీద విద్యార్థులకు ఉచితముగా భోజనము లభించుచున్నది. ఎందరో ఉత్తమ తర - గతులలో పరీక్షలంచుత్తీర్ణులై మంచి ఉద్యోగములు పొందినారు. పేరు రెడ్డి హాస్ట లేకాని ఇందు 'రెడ్డి బాలు రేకాక వెలమ, కమ్మ విద్యార్థులు ను ఎందరో చేరి లాభము పొంది నారు. మరియు నాయుడు, మొదలియార్ . పిళ్ళై, ముసల్మాను మున్నగువర్గము వారును చేరినారు. ఇటీవల అదే రెడ్డి హాస్టలులో బీద బాలురకుగాను " అనాథాలయము" అను పేరుతో ఒక శాఖ యేర్సా టుచేసి ఉచిత భోజనవసతు లేగ్పాటు చేసినాము.


ఈ రెడ్డిహాస్టలు అభివృద్ధి చరిత్రలో వేంకటరామా రెడ్డి గారి సిద్ధహస్తము అంతటను సువ్యక్తమగుచున్నది. వారు హాస్టలు భసనముల ఖరీదు చేసిన తర్వాత నిలువ ధనమంతయు వ్యయమైపోయెను. భోజనశాలను కట్టించుటకు చేతిలో ద్రవ్యము లేదు. కాని దానికై 25,0000 రూపాయలు పట్టినను దానిని పూర్తి గావించిరి. మొట్ట మొదలు విద్యార్థులే ఒక చిన్న గ్రంథాలయమును "శారదా నికేతనము" అను పేరుతో ఏ నాలుగైదు వందల పుస్తకములతోనో ప్రారంభించిరి. కాని రెడ్డిగారి శ్రద్ధచే రెండు మూడేండ్లలోనే గ్రంథములసంఖ్య పెరుగుచు పెరుగుచు క్రమక్రమముగా 11000 వరకు వృద్ధి నొందగా దానికొక ప్రత్యేక భవసమే అవసరమయ్యెను. కాని చేతిలో ఏమియు ద్రవ్యము లేకుండెను. గ్రంధాలయ భవనము ప్రారంబమేమో అయ్యెను. ఒక సంవత్సరములోగా పూర్తి కూడ నయ్యెను. దానికి 85,000 రూపాయలకు పైగా పట్టెనని తెలిపియే యున్నాము. ఇట్లే యితగ విషయములందును జరుగుచు వచ్చినది. రెడ్డి గారి యీ విజయముల రహస్యమేమి యని విచారిం చవచ్చును. ప్రచండమైన సంస్థలను నడిపించు వారిపధ్ధతులు మనోహరముగా నుండును. రెడ్డి గారిదొక సిద్ధాంతము ముఖ్యమైన దిగానున్నది. “మనమే మెనమేమైన ప్రజాహితకార్యము చేయదలచిన ఏమియును ప్రారంభిపక ముందే ప్రజలను ద్రవ్య సహాయము చేయుమని విచారించిన అందు మనకు విజయము లభిపదు. మసమాపనిని ప్రారంభించి ప్రజలకు మనము చేయుచున్న పనిని చూపించి సహాయము చేయుటకై విచారించిన అప్పుడు అనాయాసముగా ద్రవ్యము లభింపగలదు'. అని శ్రీ రెడ్డి గారు పలుమారు చెప్పెడి వారు. అదే పద్ధతిపై వారె బంగ్లాను ప్రారంభించినను సరే దాని శంఖుస్థాపస మొక పెద్ద మనుష్యునితో వేయింతురు. ఆట్లు గౌరవింపబడిన వ్యక్తి కొంత ద్రవ్యమును ఇచ్చును. దానితో పొదులు పూర్తి అయినట్లే! తర్వాత ప్రతి ధనికుని గూడ “మానూతన భవన నిర్మాణమును తిలకించి ఆశీర్వదించ రండి” అని వారి కాస్థలమును చూపించుచుందురు. వచ్చినవా రందరును ఏదో కొంత సహాయము చేసి పోవు చుందురు. ఈ ప్రకారముగా పనిసాగుచు పూర్తియగును. ఇట్టి చాకచక్య ముచేతను, నిరంతర శ్రద్ధ చేతను, ఎడ తెగని పరిశ్రమ చేతను, అత్యంత మైన ఓపిక చేతను శ్రీ రెడ్డిగారు సుమారు మూడులక్షల విలువగల నొక ప్రచండమైన రెడ్డి సంస్థను స్థాపించి చిరస్థాయిగా నడుచునట్టి పద్ధతులపై ఏర్పాటు చేయగలిగినారు.


ఇదే రెడ్డిహాస్టలులో బాలుర ఆరోగ్య విచారణ రకై ఒక 'వైద్యాలయమునే స్థాపించినారు. ఈ వైద్యాలయము లో అన్ని విధములగు మందులను తెప్పించి యుంచినారు. ప్రతి దినము సాయంకాలము5 గంటలనుండి 8 గంటల వరకు రంగా రెడ్డిగారుఅను డాక్టరుగారు (వీరు రెడ్డి హాస్టలు యొక్క ప్రాతవిద్యార్థియే) అత్యంత శ్రద్ధతో ఓపికతో విద్యార్థుల ఆరోగ్యమును విచారించుకొని ఉపచారములు చేయుచుందురు.


మరియు విద్యార్థుల వక్తృత్వ ధోరణియు, చర్చా సామర్థ్యము అభివృద్ధి నొందుట కై హాస్టలులో నొక విద్యార్తి యువజన సంఘముసు స్థాపించి దాని ద్వారా ప్రతి వారమును చర్చాసభలు (Debates) చేయి౦చి వారిని వృద్ధికి దెచ్చు చున్నారు.


రెడ్డిగారు గావించిన సాంఘిక సేవలో నీ రెడ్డిహాస్టలు కొరకై వారుచేసిన సేవలో నిప్పుడు శతాంశముకూడ తెలుపుకొన లేదనిన అది అతిశయోక్తి కాదని హైద్రాబాదు లోని ప్రతి విద్యావంతుడును ఒప్పుకొనమాసడు,

బాలికల ఉన్నత పొఠశాల


మొత్తము హైద్రాబాదు రాష్ట్రములో మన బాలికల మాతృభాషలో విద్య చెప్పించునట్టి ప్రభుత్వోన్నత పాఠశాల లేక పోవుట దేశీయుల దురదృష్ట విశేషమని యైనను చెప్పవలసి యుండును. ఈ లోపమును నివారించుట చాల యవసరమనిపించెను. ప్రభుత్వము వారు స్థాపించిన ఉన్నత పాఠశాలలో ఉర్దూకో, ఇంగ్లీషకో ప్రాధాన్యత ఇయ్యబడినది. ఈ రాష్ట్రములోని ప్రత్యేక పరిస్థితులలో విద్యా సమస్య చాలచిక్కులతో గూడినదైనది. అందులో బాలికల విద్య మరింత ఆశ్చర్యకరమైనట్టిది. ఉర్దూభాషలో ప్రధానముగా ఉన్నత విద్యాభ్యాసము కాక్షించుటచే ఉర్దూ మాతృభాష కాని బాలికలకు గొప్ప కష్టముగా నున్నది. ఆకారణము చేత హైదరాబాదు నగరములోనై నను ఒక బాలికల ఉన్న తపాఠశాలను మనబాలికల కొరకేర్పాటు చేసిన బాగుండునని స్త్రీ విద్యాభిమానులగు శ్రీ మాడపాటి హనుమంత రావుగారికిని మరయితర ప్రముఖులకుమ తోచినది. అట్టి దృక్పథముతో వారొక బాలికల పాఠశాలను స్థాపించిరి.మొదటి ఫారము తరగతితో నారంభమై కొన్ని యేండ్లలో క్రమ క్రమముగా ఉన్నత పాఠశాల అయినది. ఉస్మానియా విద్యాపీఠము వారు ఇంగ్లీషునకు మారుగా ఒక దేశీయభా షకు ప్రాధాన్యతనిచ్చి యుండినందున బాలికల మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్థాపించిన కారణమున విద్యాపీఠాధికారులు ఆ పాఠశాలకు తమ విద్యాపీఠ మందు స్థానమిచ్చి అంగీకంతురని నమ్మి పాఠశాల కార్యనిర్వాహక వర్గము వారు విజ్ఞప్తి సమర్పించుకొని నారు. కాని ఉస్మానియా విద్యా పీఠము వారు బాలికల ఉన్నత పాఠశాలలో ఉర్దూభాష ద్వారా పాఠములు నేర్పుటలేదను కారణము చేత అంగీకారమును ( Recognition ) ఇచ్చుటకును నిరాకరించినారు. అదేకారణము చేత ద్రవ్య సహాయముకూడ చేయుటకు వీలు లేదనిరి. పునర్విజ్ఞప్తు లంపుకొన్నను ప్రభుత్వము వారి ద్రవ్యసహాయము లభించి యుండ లేదు. తుదకు బాలికల ఉన్నత పాఠశాలను బొంబాయి రాజధానిలోని పూనా నగరములో కర్వే మహా శయులచే స్థాపింపబడిన మహిళా విద్యా పీఠము, జతచేసి అచట అంగీకారమును పొంది వారిచే మెట్రికు పరీక్షా పట్ట ములను బాలిక లకిప్పించి ఈ పాఠశాలను నడుపుచున్నారు,ఇట్టి పాఠశాల యొక్క పాలక వర్గమునకు శ్రీ వేంకటరామా రెడ్డి గారు అధ్యక్షులైరి. వారు ప్రతి విషయమునను మంచిశ్రద్ధను వహించి మంచి సలహానిచ్చుటయేకాక స్వయ ముగా ద్రవ్యహాయము చేసియున్నారు. బహుకాలమా పాఠశాల ఒక అద్దెంటిలో సడుపబడుచుండెను. కానిఅట్లు ఎంత కాలము నడిపినను పాఠశాలకు స్థిరత్వ మేర్చడదని గ్రహించి శ్రీ రాజా బహద్దరుగారు దానికొక మంచి భవనము కట్టించుటలో శ్రద్ధాళు లైరి. బాలికల ఉన్నత పాఠశాల కై రెడ్డి గారి ప్రయత్నములచేత సుమారు 35,000 రూపాయిల చందాలు వసూలయ్యెను. గత సంవత్సరము నారాయణ గూడాలో రెడ్డి గారి బంగ్లా వెనుక భాగములోనే ఒక విశాలమైన ప్రదేశములో నూత్న భవనము పూర్తియై యిప్పుడం దే పాఠశాల నడిపింపబడు చున్నది. పాఠశాలలో ఇప్పుడు దాదాపు 400 బాలికలు విద్య నభ్యసించు చున్నారు. మెట్రిను తరగతి వరకు విద్య గరిపి పరీక్షలకు పంపు చున్నారు. ఇంతేకాక బి. ఏ. తుగతి వరకును చదువు నుత్సాహము కల బాలికలకు ప్రైవేటు విద్య చెప్పించి వారిని పరీక్షల కంపుచున్నారు. ఈ రీతిగా కొందరు యువతులు బీ. ఏ. పరీక్షలో కడ తేరినారు.


రెడ్డి బాలిక ఆ వసతిమందిరము

రాజాబహద్దరుగారు బాలికల ఉన్నత పాఠశాల యొక్క పాలక వర్గములో అధ్యక్షు లైనత ర్వాత వారిదృష్టి బాలికల వసతి మందిరము విషయమున ప్రసరించెను. జిల్లాల లోని గ్రామాలనుండి కొందరు బాలికలు ఉన్న తవిద్య నభ్య సించుటకై నగరమునకు రాగోరిరి. కాని వారి భోజనవసతుల కిబ్బంది యుండెను. ఈ లోపమును నివారించుటకై శ్రీరెడ్డిగారు రమారమి 2 సంవత్సరముల క్రిందట రెడ్డి బాలికల హాస్టలు నొక దానిని స్థాపించిరి. స్థాపనోత్సవమునాడే నగరపు ముఖ్యులు సుమారు 3000 రూపాయిల విరాళముల నిచ్చిరి. ఈ ద్రవ్యసహయముచే మంచిబంగ్లా అద్దెకు తీసుకొని హాస్టలు కార్యమారంభించిరి. కొన్ని మాసములలోనే సుమారు 125 మంది బాలికలు అందులో చేరిరి,. ఆ వసతి మందిరములో మంచి సౌకర్యముల నేర్పాటు చేసినారు. కేవలము రెడ్డి బాలికలే కాక వెలమ నాయుడు మున్నగు కులముల బాలికలును అందుచే లాభమందుచున్నారు. బాలికలను పాఠశాలకు బండ్లలో తీసుకొను పోవుటకు వారిని విచారించు కొనుటకొక ఆంగ్లో ఇండియఁ స్త్రీని, ఏర్పాట్లు చేసినారు. బీద బాలికలకు ఉచితముగా భోజనము నిచ్చుచున్నారు. ఈ బాలికల హాస్టలునకు కూడ నొక సొంత భవన మవసరమని తలచి బాలికల ఉన్నత పాఠశాలా భవనముప్రక్కననే నొక విశాల భాగమును 5,000 రూపాయీలకు కొని పెట్టియుంచి నారు. అందు భవనము నిర్మించు ప్రయత్నములో నున్నారు. రెడ్డిగారు చేసిన యితర కార్యముల వలెనే ఇదియు త్వరలో సాధింపబడు ననుటలో సందేహము లేదు. పరోపకారణీ బాలికా పాఠశాల.

హైద్రాబాదు నగరములో ఈ బాలికా పాఠశాల ప్రైమరీ తరగతి వరకు స్థాపించినారు. దాని పాలక వర్గమునకు అధ్యక్షులు శ్రీ రెడ్డిగారే. ఇదియు మంచి స్థితిలో సడుప బడుచున్నది. ఈ పాఠశాలలో నిప్పుడు సుమారు 60 , 70 బాలికలు తెనుగులో విద్య నేర్చుకోనుచున్నారు.


ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల

ఈ పాఠశాలలో విశేషముగా తెనుగు బాలురే చదు వుచున్నారు. దీని పాలక వర్గమునకు అధ్యక్షులు శ్రీ రెడ్డి గారే. వారి అధీనములో ఈ పాఠ శాలయు నడుపబడుచున్నది. ఈ పాఠశాలా విషయముస స్థానికాంధ్రులు ఎక్కువ, అభిమానము చూపని కొరత యొక టిగలదు, ఆంధ్రులీ పాఠశాల పై మంచి అభిమానము చూపినట్లైన కొన్ని సంవత్స రములలో ఇది హైస్కూలుగా మారి మంచి ఆంధ్ర సంస్థగా నుండగలదు.


స్త్రీలక్లబ్బు. (శాస్మ పొలిటన్ క్లబ్బు)

నగరములో బొగ్గులకుంట సమీపమున మహిళా సంఘము పేర నొక గొప్ప బంగ్లా కట్టబడియున్నది. దాని నిర్మాణమునకుగాను రాజబహద్దరుగారు రాజసర్ బన్సీలాలు గారిని ప్రోత్సహించి వారివలన సుమారు రూ 15,000 ను మని యితరులవలన మరికొంత ద్రవ్యమును ప్రోగుచేసి మంచి భవనమును కట్టించినారు. ఈ క్లబ్బులో రాణీలు మున్నగు పెద్ద పెద్ద వారు. సభ్యులుగ నున్నారు.


రిఫాహోఅం పాఠశాల.


నగరములో రిఫా హో అం అను మాధ్యమిక పాఠశాలను కొందరు విద్యా ప్రియు లైన ప్రజానాయకులు నడుపుచున్నారు. ఈ పాఠశాల యొక్క పాలక వర్గములో ఈ రెడ్డిగారు అధ్యక్షులై పాఠశాలను నడిపించుచున్నారు, ఈ పాఠశాలలో నిప్పుడు సుమారు 250 వరకు విద్యార్థులు చదువు నేర్చుకొనుచున్నారు.


బాలికా పాఠశాల (గొల్లఖడి )

హైద రాబాదు నగరములో గొల్లఖడ్కీలో నొక ఆంధ్ర బాలికా ప్రాథమిక పాఠశాలను ప్రజా సేవకులు కొందరు కలసి స్థాపించి నడిపించుచున్నారు. ఈ బాలికా పాఠశాలకును శ్రీ రెడ్డిగారే అధ్యక్షులు- ఈ పాఠశాల నగరములోని గొల్ల ఖడ్కీ చుట్టుపట్టులలో నుండు ఆంధ్ర బాలికలకు తమ మాతృభాషా ద్వారా విద్యను నేర్చికొనుటకు చాల సహాయ పడుచున్నది


పరోపకారిణీ బాలికా పాఠశాల (సికింద్రాబాదు)


సికింద్రాబాదు నగరములో శ్రీ కే. సీతమ్మగారు స్వార్థ త్యాగముతో తమ జీవితమునఁతయు ధారపోసి ఒక మాథ్యమిక పాఠశాలను స్థాపించి నడుపుచుండిరి. శ్రీమతి సీతమ్మగారు గతసంవత్సరము చనిపోయాయి.. ఇప్పుడా పాఠ శాల సీతమ్మగా కుమారుని చేతను, మనుమరాలిచేతను నడుప బడుచున్నది- ఆపాఠశాలకు శ్రీ రెడ్డిగారు చాల సహా యముచేసి యితరులచే చేయించి దాని అభివృద్ధికి కారకు లైనారు. ఇటీవలనే శ్రీ రెడ్డిగారి అధ్యక్షతలో ఆ పాఠశాల యొక్క వార్షికోతృపము అతి వైభవముతో జరుపబడెను.


సంఘసంస్కారము


రెడ్డిగారు పూర్వకాలపువారైనను మంచి సంఘసంస్కారులు. బాల్యవివాహములు కూడవనియు, వితంతూ ద్వాహములు చేయవలయుననియు, శాసనసభలో కీ! శే!! పండిత కేశవరావు గారు. రెండు చిత్తు శాసనములను ప్రవేశ పెట్టినప్పుడు వీరు ఆశాససములకు అనుకూలముగా చాల ప్రయత్నములు చేసిరి. వితంతూ ద్వాహశాసనమును విమర్శించి అభిప్రాయ మిచ్చుట కొక ఉపసంఘమును శాసనసభవారు నియమించిరి. అందు రెడ్డి గారు ముఖ్యులు. ఈ యుపసంఘము వారి అభిప్రాయము ననుసరించి తుదకు వితంతూద్వాహ శాసనమును ప్రభుత్వమువా రంగీకరిచిరి. రెడ్డిహాస్టలులో ఒక విద్యార్థి సుమారు 12 సంవత్సరముల క్రిందట వితంతూ ద్వాహము చేసికొనెను. దానికి వేంకట రామారెడ్డిగారు మంచి ప్రోత్సాహము కలిగించిరి. రెడ్లలో ఎన్నియో అంత శ్శాఖలున్నవి. ఒకే శాఖ లోనే కులము తప్పులు పొందిన ఉప శాఖలను కలవు. ఈ మూర్జాచారములను పోగొట్టవ లెనని సుమారు 25 సంవ త్సరముల క్రిందటనే వేంకట రామారెడ్డి గారు ప్రారంభించి నారు. గద్వాల మహా రాజులగు శ్రీమంతు శ్రీసీతారామభూపాలరావు బహద్దరు గారి వివాహ కాలమునాడే వీరు మోటాటి పాకనాటి మున్నగు రెడ్లలోని ఉప శాఖలను అన్నంటిని ఏకము చేయవలెనను ప్రబోధముచేసి రాజుల యొక్కయు దొరలయొక్కయు, కుల ప్రముఖు, యొక్కయు, అంగీకారపు సంతకములు గైకొనిరి. వసపర్తి, దోమకొండ రాజులు, ఇందుకు సంపూర్ణముగా నంగీ కామిచ్చిరి. నాటినుండి యెన్నియో మారు లీవిషయమున ప్రబోధము జరుగుచు వచ్చెను. తత్ఫలితముగా మునగాల వారును, పింగిలివారును, ఇదిగాల వారును, మరి యిట్టివారెందరో అంతశ్శాఖావివాహములు చేసిరి. ఇప్పుడు గోనె, మోటాటి, పాకనాటి, గుడాటి, పంట అను రెడ్డికులశాఖలు కలిసి పోయినవి.


రాజు బహద్దరుగారిలో కుల భేదముల పట్టింపుగాని, మూర్ఖాచారాభిమానము కాని, మూఢ విశ్వాసములుగాని, (Orthodoxy and Superstition) ఏ మాత్రమునులేవు. 'వారు అన్నికులములవారితో, అన్ని మతముల వారితో భుజంతురు.
విలియం వహాబ్ గారు.
(వేంకట రామారెడ్డిగారి మేనమామ)

హిందువులకు సముద్ర ప్రయాణమును మధ్యకాలములో నిషిద్ధము చేసినట్టి కొన్ని సూత్రములు బయలు దేరెను. ప్రాచీన కాలములో హిందువులు, అందు ప్రధానముగా ఆంధ్రులు ఖండఖండాంతరములకు సమగ్రముపై ప్రయాణముచేసి వ్యాపారము చేయుచుండిరి, మరియు నానా ద్వీపములలో వేదమత వ్యాప్తిని గావించి వలస రాజ్యములు స్థానించిరి. కులకట్టు బాటు విపరీతముగా ముదిరిరిన తర్వాత సముద్ర ప్రయాణము చేయగూడదని కొన్ని తప్పుడు శాస్త్రములు బయలు దేరెను. నిజాం రాష్ట్రములో రెడ్లును ఈ శాస్త్రబీతిచే తమపిల్లలను యూరోపు, అమెరికా ఖండములకు పంపుటకై జంకుచుండిరి. ఆ సందర్భములో నిజాం రాష్ట్రము లోని 'రెడ్లలో ప్రధమమున సముద్ర ప్రయాణమున కను కూలించిన వారు శ్రీ రెడ్డిగారును శ్రీయుత పింగిలి వేంకట రామా రెడ్డిగారును నైయున్నారు. శ్రీ రెడ్డి గారి కుమారులగు వేంకట లక్ష్మణ రెడ్డి గారును, పింగిలి వేంకట రామారెడ్డిగారి తమ్ములగు (శ్రీకృష్ణా రెడ్డిగారును. మరియు రాజగోపాల రెడ్డి ( బ్యాజిష్టరుగారను) మొట్టమొదట ఇంగ్లాండు దేశము సకు బారిస్టరీ చదువుటకుగాను సముద్ర ప్రయాణము చేసి వెళ్ళిరి.


వక్తృత్వ సామర్థ్యము


అనేక మంది అధికారులు తామెంత గొప్పవారైనను సభారంగము పై నిలిచినప్పుడు నోట తడిలేక మాటలేక ఉక్కిరిబిక్కిరిగా స్థబ్దులై నిలిచిపోవుదురు.వేంకట రామారెడ్డి గారు అట్టి శ్రేణిలోనివారు కారు. వారియందు హిందువులకే కాక మహమ్మదీయులను సంపూర్ణమగు గౌరవము కలదు. వారుసభలో ప్రవేశించగానే అందరును లేచనిలుచుకొని కొని గౌరవింతురు. ఈ విశేషమును విశ్వనాధ సత్యనారాయణ గారను సుప్రసిద్దాంధ్రకవులు హైదరాబాదు నగరములో ఉపన్యసించు చున్నప్పుడు తాము స్వయముగా చూచి చాల ఆశ్చర్యపడి పోయినారు.

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఎం. ఏ. గారు 28 సెప్టెంబరు 1936 నాడు గోలకొండ పత్రికలో “ హైదరా బాదులో పక్షముదినములు" అను వ్యాసమందు రాజా బహ ద్దరుగారిని గురించి యీ విధముగా వ్రాసినారు.


"ఒక రోజు పొద్దున ప్రతాప రెడ్డి గారు శ్రీ శ్రీ రాజా సాహేబు కొత్వాల్ వేంకట రామారెడ్డి బహద్దరుగారి సన్నిధికి తీసుక వెళ్లారు. రాజా వేంకటరామారెడ్డి గారు వృద్ధులు. వార్దక్య ము వారి శరీరమందున్న దేమోకాని ఆ మొగములో యవ్వనమే తాండవిస్తుంది.ఠీవి, దర్జా, ప్రసన్నత్వం ఆయన ముఖంలో కొట్టవస్తున్నవి. వారి యిద్దరుకుమారులు, శ్రీ దోమకొండ రాజుగారు, మేమున్ను పాతః కాల ఫలాహారము లకు కూర్చున్నాము. రకరకాలైన పండ్లును, మిఠాయీలు, బల్లమీదనున్నవి. రాజ సాహేబు గారు అప్పుడు చేసిన ఆదరము, బెట్టు లేనిచనువు నెరపడముచూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మహా పురుషుణ్ణి గూర్చి ఒక్కమాట చెబితే అంతా చెప్పిన ట్లౌతుంది. అది యేమిటంటే నేనొకరోజున రెడ్డి హాస్టలులో ఉపన్యాసమిస్తూ ఉండగా, వారు లోనికి వచ్చారు. సభలో అయిదారు వందలమంది జనమున్నారు. వారు వచ్చినంతనే ఆరువందలమంది ఒక్కసారి లేచి నిలుచున్నారు. ఇటువంటి గౌరవము మా దేశములో ఎవ్వరికీ జరుగదు. నేను ఒక్క నిముసం దిగ్ర్భాంతుడనై పోయి మళ్ళీ ఉన్యాస మారంభించు కొన్నాను. వారు నేనిచ్చిన రెండుమూడు ఉపన్యాసములకు దయచేశారు. చాలా సేపు కూర్చున్నారు కూడాను. అంత సేపు కూర్చోరని యెవరో చెప్పగ విన్నాను. దానికి నేను కృతజ్ఞుడను. "


రాజాబహద్దకు రెడ్డిగారు సభలో మాట్లాడుటకు నిలిచినారనిన సభయంతయు ఆనందముతో నిరీక్షించుచుండును. వారు ఉర్దూలో అనర్గళధారతో జంకుకొంకు లేక మంచి ధారాశుద్ధితో సుపన్యసింతురు. ఎటువంటి సమస్యావిషయ ముననైనను హాస్యరస ముట్టిపడునట్లుగా మాట్లాడుదురు. వారు గ్రంథ పరిశోధనములు చేసిన వారుకారు. ఉద్యోగ ధర్మములో ది; పత్రికలు చదువుటయు, ప్రభుత్వ నివేదికలను చదువుటయు, వారికి అలవాటు- అట్లు విజ్ఞాన సంబంధమగు గ్రంథములు బహుళముగా చూచుటకు వారి కవకాశము లభింప కుండినను వారికి విశాలమైనట్టి లోకానుభవము లభించినది. మద్యపానము గురించి మాట్లాడుదురు. విద్యార్థులకు ఉపదేశములు చేయుదురు. బాలికలకు బుద్దులు చెప్పుదురు. సహకారమును గురించి ముచ్చటింతురు. అస్పృశ్యతా దోష నివారణనుగుంచి బోధింతురు. వ్యాయామములను గురించియు ఆరోగ్య సాధనమును గురించియు ఉపన్యసింతురు. సంగీతమును గురించికూడ మంచి పరిశోధనతో కూడిన ఉపన్యాసమిత్తురు.


ఒక తడవ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయములో మనోహరబర్వే అనుసుప్రసిద్ధ బాలగాయకుని సమ్మానించిన సందర్భములో రాజాబహద్దరుగారు అధ్యక్షులుగా నుండిరి. పోలీసువారి కేమి సంగీత సంబంధ మేమి? అని యందరకును విచిత్రము గానే యుండెను. కాని వారు సంగీత ప్రాశస్త్యమును గురించి ఒక గంట కాలము మనోహరముగా నుపన్యసించిరి. ఎద్దులు వడిగా నిరాయాసముగా నడుచుటకై గజ్జెలు గంటలు కట్టుటలోను సంగీత ప్రాధాన్యతయే యున్నదనియు "బాలురను తల్లిజోకొట్టు నప్పుడును గానమే చేయుననియ, పసుల బాలురు శాలహరణార్ధము పిల్లనగ్రోవిపై పొడుదురనియు, దేవుడు కూడ సంగీతముతో కూడిన భజనచే పశీకృతుడగుననియు, ఇంకను. నెన్నియో యిట్టి యుపమానములనిచ్చి తను అఖండ లోకానుభవమును ప్రకటించి అందరిని ఆశ్చర్యములో తన్మయులగునట్లు గాచేసిరి.


వీరి యుపన్యాసములలో మంచి ఉత్తమమైన హాస్యరసముందును, వీరు తమ ప్రజాహిత కార్యములలో సహాయపడిన వారి నెవ్వరిని మరచిపోరు. సభా వేదికలపై వారికి సుకుమారముగా తమకృతజ్ఞతను వెల్లడింతురు. ఎట్టి క్లిష్టనమస్య లైనను సరే, చర్చించి, ప్రతి పక్షులలో నిండి యుండిన అనుమానము లను, ద్వేషములను సహితము పటాపంచలగునట్లుగా వివరించి విమర్శించి సమర్థించి మెప్పింతురు. వీరివక్తృత్వమును గురించి ఖాజూహసన్ నిజామీగారు ఒక మారు ఇట్లు మిత్రులతో సెల విచ్చివారు " నేను హిందూస్థాన మంతటను వేలకొలది ఉపన్యాసములను వినినాను. రాజాబహద్దరువలె సర్వపక్షముల వారిని మెప్పించునట్లుగాను చమత్కారము గాను ఉత్తమ శ్రేణిలో నుపన్యసించు వ్యక్తులనేను చాల అరుదుగా చూచినాను. ఈతడు అసాధారణ ప్రజ్ఞావంతుడు " ఆనాధులపై ప్రేమ


రాజా బహద్దరుగారికి అనాథ బాలబాలికల పైనను, వృద్దుల పైనను, రోగ పీడితుల పైనను, తుదకు జంతువుల పైనను చాల ప్రేమ. వీరు జంతు హింసా నివారణ సంఘములో ముఖ్యులుగా చేరి చాల సేవచేసినారు. కొత్యాలుగా నుండిన కాలములో అనాథ శిశువుల కేసులను విశేషముగా విచారించుట తటస్థించెను. హైద్రాబాదు రాష్ట్రములో " పెంపుడు పిల్లలు (పర్వర్గాల)ను ధనికులును, నవాబులను, రాజులును. తమ సేవలోనుంచుకొనుట ఆచారమైపోయినది. ఆ పిల్లలు శాశ్వత ముగా వారి బానిసలు గానుదురు. వారిని చాల కష్ట పెట్టుటయు సహజ మైయుండెను. ఈ విషయములను అప్పుడు పోలిసు శాఖా మంత్రిగా నుండిన సర్ - ట్రెంచి గారికి చెప్పి శాసన సభలో “శిశువుల సంరక్షక శాసనము"ను కావించుటలో ముఖ్య కారకు లైరి.


సికింద్రాబాదులోను హైద్రాబాదులోను“ వృద్ధాశ్రమములు" రెండుకలవు. అచ్చటికి పలుమారు వెళ్ళి దర్శించి ద్రవ్య సహాయముచేసి యితర ధనికులతో చేయించు చుందురు. గొప్ప వారి యిండ్లలో వివాహాది శుభకార్యము లైనప్పుడు వారివలన చందాలు వసూలుచేసి వృద్ధాశ్రమములకు మిఠాయిని కొని పంపించు చుందురు. అదేవిధముగా నగర సమీపమున సరూన గరులో ప్రభుత్వమువారు స్థాపించిన అనాథ బాలుర ఆశ్రమమును పలుమారు దర్శించి బాలురకు మిఠాయిని పంచి పెట్టింతురు. మరియు దీని పాలక సంఘములో వీరొక సభ్యులుగా నున్నారు. డిచ్చల్లిలోని కుష్ఠురోగులకు సహాయము అనేక మారులు చేయించినారు. హైదరాబాదు నగరము లోను కొంత కాలము ఒక కుష్ఠురోగుల చికి త్సాలయమును స్వయముగా స్థాపించి చికిత్సలు చేయించిరి.


నగరములో వివజ్వరాలు వ్యాపించి ప్రతిదినమును వందల కొలది చచ్చు కాలములోను, ప్లేగు తీవ్రరూపమును దాల్చి ప్రజానాశనము చేసిన కాలములోను వీరు బీద వారికి మందులిప్పించి వసతులు కల్పించి, టీకాలను దీయించి సహాయపడిరి. ప్రభుత్వము నారును వీరి సాంఘిక సేవను గుర్తించి ఒక విలువగల గడియారమును బహుమతి - నిచ్చిరి. మరియు ఒక బంగారు పతకమును గూడ నిచ్చినారు.


అనాథుల పై వీరికెట్లు గాఢానురాగము కలదో అదే విధముగా శ్రీ రెడ్డిగారికి హరిజనుల పై నను మంచి అనురాగము కలదు. హిందువుల దురాచారములలో అగ్రస్థానము వహిం చినట్టి అస్పృశ్యతా దోషమును రెడ్డిగారు అత్యంతముగా నిర సించునట్టివారు. హరిజను లెందరో వారి సేవలో నియుక్తులై వృద్ధికి వచ్చినారు. మరియు ఈ రాష్ట్ర హరిజనులందొక విచా రకరమగునాచారముకలదు. కొందరుహరిజనులు తమ బాలికలకు చిన్న తనమందే “ముకళీలు అనియు "బసివి రాండ్రు" అనియు, పేరు పెట్టి వారిని యావజ్జీవ వ్యభిచారిణులనుగా నిర్ణయించుచుందురు. ఈ సంము కళంకమును తుడిచి వేయుటలో హరిజన నాయకులకు శ్రీ రెడ్డి గారివలె మరెవ్వమును సాయపడ లేదు.


రాజా బహద్దరు గారి సంతానము.

రాజూబహద్దరుగారికి మొదటి భార్య వలన శీయుత రంగా రెడ్డిగారు అనువారు కలిగినారు. రంగా రెడ్డి గారు జన్మించిన కొలది దినములలోనే వారి తల్లిగారు గతించినారు. రంగా రెడ్డిగారి కిప్పుడు సుమారు 50 సువత్సరముల వయస్సు. వారు కొంతకాలము పూనా లో విద్యాభ్యాసము చేసినారు. మెట్రికు వరకు చదివినారు. ఉర్దూలో మంచి పాండిత్యముకలదు. వారు సుమారు 99 సంవత్సరముల క్రిందట నిజాం ప్రభుత్వ ఆబ్కారీశాఖలో ఉద్యోగిగా నియమితులైరి. వారిప్పుడు ఆబ్కారీ డిప్టికమిషనరు పదవిలో నున్నారు. నెలకు రూ. 1000 జీతము పొందుచున్నారు. వారికి సంతానము లేదు.


రాజాబహద్దరుగారికి రెండవ భార్యవలన శ్రీయుత లక్ష్మారెడ్డి గారును, (శీమతి నరసమ్మగారు అను పుత్రికయు కలిగినారు. లడ్మారెడ్డి గారు పూనాలో విద్యాభ్యాసము ముగించిన తర్వాత ఇంగ్లాండుసకు వెళ్ళినారు. అచ్చట కొన్ని సంవత్సరములు విద్యాభ్యాసముచేసి బ్యారిష్టరు అయివచ్చి నారు. స్వదేశమునకు తిరిగి వచ్చిన కొంత కాలమునకు వారు మద్రాసులో కొంత కాలము పని నేర్చి హైదరాబాదు 'హైకోర్టులో సర్కారీ వకీలుగా (కౌన్సిల్ గా) నెలకు 200 రూపాయిల జీతము పై నియమితు లైనారు. ఇట్లు కొన్ని సంవత్సరములు గడచిన తర్వాత వారిని ప్రభుత్వము వారు అడిషనల్ సెషంస్ జడ్జి పదవి పై నియోగించినారు. ఈ పదవిని తర్వాత సెష జడ్జి అయిన మూడు నాలుగు సంవశ్చరములు నిర్వహించిన తర్వాత హైకోర్టు జడ్జిపదవి పై నియుక్తులైరి. ఆచ్చట మండి స్వతంత్రులైన న్యాయమూర్తులని పేరుపొందినారు. ఇటీవలనే వారిని జూడిషియల్ కమిటీ రుకున్ గా ఏర్పాటు చేసి యున్నారు.


శ్రీ లక్ష్మారెడ్డి గారు ఇంగ్లాండు నుండి వచ్చు నప్పుడే ఆంగ్లకన్యకను వివాహమాడినారు. వారితో ఇరువది సంవత్స రములు పైగా సంసార సౌఖ్య మనుభవించినారు. ఆమె చాల ఉత్తమ గృహిణిగాను, స్త్రీ జనోద్యయములందు మంచి సేవా సక్తి కలవారు గాను ఉండినారు. సుమారు మూడు సంవత్సరముల క్రిందట ఆయమ్మ మరణించెను. శ్రీ లక్ష్మారెడ్డిగారికి యిద్దరు కుమార్తెలును ముగ్గురు కుమారులును కలరు. చివర బాలుడు నాలుగేండ్ల వాడు. తక్కిన వారందరును విద్యాభ్యాసము చేయుచున్నారు కుమార్తె లిరువురును ఇంగ్లాండులో చదువుచున్నారు. ఒకరు బారిష్టరు వృత్తికిని, ఇంకొకరు వైద్యవృత్తి కిని చదువు చున్నారు.