రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/పదునొకండవ ప్రకరణము
పదునొకండవ ప్రకరణము
గుణవిశేషములు.
రెడ్డిగారు ప్రతి దినమును ప్రాతః కాలమున 5 గంటలలోపలనే నిద్రనుండి మేల్కొని పత్రికలు, ముఖ్యమగు కాగితములు, గ్రంథములు చదువుకొందురు. వారు చదువదలచిన పత్రికాదులన్నియు వారి మంచము ప్రక్కననే యుంచుకొని యుందురు. 2 గంటలు కొట్టువర కీప్రకారము చదువుకొనిన తర్వాత కాల్యకృత్యములు తీర్చుకొని స్నానముచేసి ఏకాంత ములో పరమేశ్వర ధ్యానము చేసికొందురు. 8 గంటలవరకు పూర్తి చేసికొని తేనీరు ఫలాహారముకు తీసుకొందురు. ఆ సమయమున బయట తమ కొరకై యెరిగిన వారెవరైన వచ్చినారా చూడుమని ప్రతిదినము మరువకుండ సేవకులకు చెప్పుచుందురు. వారితో విశేషముగా వచ్చి కలిసిపోవు వారిని తమతోకూడ తేనీరు త్రాగుటకు పిలుతురు. వారిభోజనము రాజభోజనము, సాధారణముగా నానావిధముల మధుర పదార్థములును వివిధ ఫలములును ఇతరలోభనీయ భోజ్య
వస్తువులును వారి బల్లపై నిండియుండును. తమతో కూడ కూర్చున్న వారికి కడుపునిండుగా భుజించుటకై స్వయముగా ప్రోద్బలము చేయుచుందురు. నాజూకు వారు అజీర్ల బాధను పొంచక మానరు. సుమారు ఎనిమిదిన్నర గంటల కాలముప్పుడు బట్టలు వేసికొనిబయటికి వత్తురు
బయటి పెద్దహాలులో జనులు క్రిక్కిరిసియుందురు. సిఫారసులకు వచ్చినవారు, ఊరక కలిసిపోవుటకు వచ్చిన వారు, రాజులు, నవాబులు, రాజకీయములలో ఆలోచనలు చేయుటకై వచ్చినవారు, ధనసహా మార్గము వచ్చిన బీద వారు, చేతి క్రింది ఉద్యోగులు, చందాలకై వచ్చిన వారు, బ్రిటిషిండియానుండి కార్యార్ధులై వచ్చినవారు, రెడ్డి గారి పాలనలోనుండు వివిధ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు, హిందువులు, ముసల్మానులు, అన్ని విధములవారును అచ్చట చేరియుందురు. వారందరితోను ఒక అర్ధగంట లేక గంటకాలము మాట్లాడి పంపి వేసి తమ యితర వ్యవహారములను చూచుకొందరు. ఏయే కమిటీ పనులుండునో అవి 11 గంటలలోపల ముగించు కొందురు. తర్వాత కొత్వాలీ పనికాలములో 11 గంటలవరకు కచ్చేరీకి వెళ్ళి
మధ్యాహానంతరము 2 గంటలవరలో 3 కొట్టువరకో కచ్చేరీ పనులు చూచుకొందురు. మూడు గంటలకింటికి వచ్చి భోజనము చేయుదురు.
భోజనము కూడ మంచి రాజభోజనము. నానావిధముల కూరలు, రుచ్య పదార్దములు, మున్నగునవి సదా నారిభోజనములో చేరియుండును. తర్వాత అర్ధగంట విశేషించి ఒక గట విశ్రమింతరు. మరల లేచి నాలుగు నాలుగున్నరగంటలసమయములో శ్రీ నిజాం ప్రభువు గారి దర్శనార్ధము వెళ్ళుదురు. అచ్చట అర్ధగంటయో గంటయో ఒక్కొక్కప్పుడు రెండుగంటలో తమ ఏలిక సన్నిధిలో నుండి తెలుప వలసినవి తెలిపి పొంద నలసిన ఆజ్ఞలు పొంది, అభిప్రాయములడిగిన తమకు తోచిన మనవిని గావించి కొని తిరిగి వత్తురు.సాయంత్రము 6 లేక 7 కొట్టిన తర్వాత రెడ్డి విద్యార్థి వసతిగృహమో, బాలికల పాఠశాలా కార్యములో లేక ప్రజాహిత సంస్థల కార్య నిర్వాహక వర్గమందు క్యావిచారణయో చూచుకొని రాత్రి 8 లేక 9 కొట్టు వరకు ఇల్లు చేరుకొందురు. సాధారణముగా, సాయం కాలమలందు నగరము లోని పోలీసునాకాలను పరిశీలించచు వాహ్యాళి వెళ్లదరు. రాత్రి 9 గంటలకు భోజనము పగటివలెనే . తర్వాత పడక గదికి వెళ్ళుదురు కాని అప్పుడే నిద్రపోరు. ప్రత్యేకముగ మఖ్య విషయముల గురించి అవకాశముతో వారితో ముచ్చటించ దల చినవారి కది మంచి సమయము. కొన్ని సమయములలో అనేకుల దేప్రకార మాలోచించుకొని వాటయిఁటివద్ద గుమికూడి
యుందురు. వారందరితోను తీరికతో మాట్లాడుదురు. 12 గంటలసగము రాత్రి వేళ వరకీ ప్రకారముగా ముచ్చటించిన తర్వాత అందరిని పంపి వేసి నిద్రపోదురు. 12 నుండి తెల్లవార 5 గంటలు కొట్టువరకు అనగా అయిదు గంటల కాలము మాత్రమే నిద్ర పోవుదురు. ఇది వారి దినచర్య. దీనిని బట్టి వారు ఎంతటి విరామము లేని వారో, ఎంతటి పరిశ్రమ చేయువారో, యెంతటి ఓర్చుకల వారో బోధపడగలదు. కార్య బా హుళ్య మెక్కువైనప్పుడు అనేకులకు చీదరింపులును, కసరు కొనుటలును, కోపము తెచ్చుకొనుటలును కలుగుట సహజము. కాని శ్రీ రెడ్డి గారు నిండుకుండవలె తొణకని వారై, శాంత మూర్తులై యెవ్వరెవ్వరి నెట్లెట్లు తృప్తి పరచవలయునో ఆ ప్రకారము చేసిపంపుచుందురు. నారికీ కోపము చాల అరుదుగా కలుగును, కాని ఆకోపము విచిత్రమైన కోపమే. చాల మందికి దాని రహస్యము తెలియదన్న మాట. వారు కార్య సాధనకై కొన్ని సమయములలో ఉగ్ర భైరవరూపము దాల్తురు. వారు కోపించు కొనిరా ఎదుటి వారు గడగడలాడి పోదురు. అంతటితో కార్యసాధనమైనట్లే! తప్పు చేసిన వా రింకొక మారుచేసి ఆ ఉగ్రస్వరూపమునకు గురికానొల్లరు. కాని లోపలి రహస్య మేమన ఆ లోపములోనే ప్రేమ యిమిడి యున్నది. తప్పు చేసిన వాడు సవరించుకొని బాగుపడ వలెనను
సభిలాషయే వారిలోనుండును. అట్టి వారిని సుస్కరించు వారే కాని, ఎన్నడును ఎవ్వరిని చేతులార, మససార, శక్తి సామర్ద్యములపారముగా నుండియు జెడగొట్టిన పాపాన పోయిన వారు కారు.
వారికి ప్రభువు గారివద్ద ఆజ్ఞలు పొంది ఆచరించుటలో ఎంతశ్రద్ధయో రెడ్డిహాస్టలులో ఊరుగాయకు కావలసిన సాయిగ్రి సరిగా వచ్చిన దాలేదా? పిల్లలు ఉర్దూ సరిగా చదువు చున్నారాలేదా? బాలికల పాఠశాలకు సరి యైనట్టి ఆగ్గువయైనట్టి ఇటికెలు వచ్చిన వాలేదా? అను చిన్న విషయములలోను అంతటి శ్రద్దయే యుండును.
సుమారు 53 సంవత్సరముల (అర్ధశతాబ్దము) కాలము ఉద్యోగము చేసినందునను, అందుకు పోలీసు ఉద్యోగము వేసి నానా విధములగు మనుష్యులను వారి చర్యలను గమనించినందునను వారు మనిషిని చూచినంతనే వాని గుణ విశేషముల సగము గ్రహించినారో యేమో అనుసట్లుండును. వచ్చిన వ్యక్తి యొక్క లక్షణములను బట్టియే గుర్తింతుకు, మరియు నతడు కొంత మాట్లాడువరకే పర్యవసానము గ్రహించుకోందురు. తమతో మాట్లాడువాడు సత్యము చెప్పుకున్నాడా అబద్ధము చెప్పుచున్నాడా అను అంచెనా వేసికొందురు.
ఒకని పై మంచి అభిప్రాయము కలిగిన సాధారణముగా దానికి విరుద్దముగా ప్రబల కారణములు వారికి గోచరించిన నేతప్ప తమ అభిప్రాయముసు మార్చుకొనరు.
సాధారణముగా ఇంతయో అంతయో విద్యాసంస్కారముకల నవనాగరిగలును, ఇటులో అటులో ద్రవ్యమును సంపాదించుకొన్న ధనికులును, చిన్నదో పెద్దదో ప్రభుత్వో ద్యోగమును ముస్పతిప్పులు పడి సంసాదించుకున్న ఉద్యోగులును, నైనట్టిజనులు విద్యాగంధ రహితులను, పేదవారిని, పల్లెటూరివారిని, మోటు వారిని చూచి వారనాగరికులని భావించి దగ్గరకైనను రానీయరు. వారితో మాట్లాడిన గౌరవము పోవునేమోయని యనుకొందురు. కాని వేఁకటరామా రెడ్డిగారు కొత్వాలీ పవవిముకటి గొప్ప ఉద్యోగము నందుండియు, ఎట్టివారు వచ్చినను ప్రీతితో ఆదరించి దగ్గరకుతీసి బుద్దులు చెప్పి, సహాయముచేసి పంపుదురు, తమతో చిన్న నాడు తెనుగు బడిలో చదువుకున్న ఒక బీద కాపు వార్ధక్యదశలో వచ్చికలి సెను. అకడు కడుబీద వాడైనను, ఎన్ని యో
యేండ్ల యనంతరము అనగా అర్ధశతాజ్ఞానంతరము వచ్చినను అతని నాదరించి, తన పంక్తి లో దిసము భోజనము చేయించి, మంచిబట్టలిచ్చి, ఒక మాసము వరకు తనవద్ద నుంచుకొని సెలవు తీసికొని పోవునప్పుడు కొత్త బట్టలు కట్టించి కొంత ద్రవ్యమిచ్చి
పంపినారు. తమతల్లి గారి గ్రామమగు రాయణి పేటనుండి వచ్చిన పేద వారిని సత్కరించు చుందురు. తనకన్న వృద్ధుడైన యొక బీద కాపొక మారు వచ్చినప్పుడు అతనిని అత్యంతముగా గౌరవించి పంపినారు. తమతండ్రిగారి జన్మభూమి యగు గద్యాలలో రెడ్డి కొంత స్థిరాస్తి యుండెను. వీరితడ్రిగారగు కేశవ రెడ్డిగారు కొన్ని
గ్రామములకు పటేలును గొప్ప ధనికులునై యుండిరి . కాని వారు చాల ఉధారు లగుటచేత గోపాలు పేట సంస్థానము వారికి 40,000 రూపాయీల అప్పుడు ఇతరులకు వేకొలదిగా అప్పును ఇచ్చి యుండి అవన్నియు వసూలుకాక ములిగియే పోయెను. పటేలు గిరీలపై రెడ్డిగారు కభిమాసము లేనందున అవియు నూడిపోయెను. కొంత పట్టా భూమియు ఇనాములును మిగిలి యుండగా ఆ శేషమునుగూడ రెడ్డి గారు తమ దాయాదులును, గద్యాలలో పోలీసు, మాలు, పటేలిగిరి చేయునట్టివారును : గువారికి ఉచితముగా పంచియిచ్చినారు. మరియు తమ జన్మభూమియగు రాయణి పేట లోని బంధువర్గములోచేరిన బీద బాలురకనేకులకు వీరు స్వయముగా భుక్తికి బట్టలకును ద్రవ్య మిచ్చి అనేక సంవత్సరములు సగరములో చదివించినారు. ముఖ్యముగా విలియం వహబు గారి మనుమలపై వీరికి చాల ప్రీతి. వారందరికిని చాల సహాయము చేయుచు వచ్చినారు. విలియం వహబుగారి వంశము వారిని తన వారికన్న హెచ్చుగా చూచుకొనుచు వచ్చినారు.
ఇంతవరకు రాజాబహద్దరుగారు బీదలయెడ ఆర్త త్రాణపరాయణులని పాఠకులు బాగుగా తెలిసికొనియు న్నారు. ధనికులును వారినాశ్రయించు వారని తెలిపితిమి, వీరివలన ముఖ్యలాభములు పొందిన సంస్థానములు వనపర్తి, గద్యాల, జటప్రోలు, శివరాజ బహద్దరు సంస్థానము, పాపన్నపేట అనునట్టివి. శివరాజ బహద్దరు సంస్థానము విషయమున ఇదివరకే కొంత చర్చించి యుంటిమి. వీరు ఆసంస్థాన పరిపాలలో ధ్యక్షులుగా నుండునంత కాలము బీద రైతులు గొంగళ్లను మెడ మీద వేసికొని గుంపులు గుంపులుగావచ్చి వారి కాళ్లపై బడి వారిని చుట్టికొని తమ మొరల వినిపించెడి వారు. వారిదరఖాస్తులను తీసికొని మొట్ట మొదలు వారిని విచారించి వారికి న్యాయమును ప్రసాదించి తృప్తి పరచి పంపి తర్వాత ఇతర వ్యవహారములను విచారించు కొనుచుండిరి.
వనపర్తి సంస్థానాధీశ్వరులగు స్వర్గీయు లైన రాజా రామేశ్వర రావు బహద్దరుగారును, రెడ్డిగారును చిన్న నాడు సహాధ్యాయులుగా నుండిరి. నాటినుండియే వారిరుపుకిని పరి చయము హెచ్చుచువచ్చెను. కాని వనపర్తి రాజుగారి అపరవయః కాలములో కొంత కాలమువరకు వీరిరువురికిని మనస్తాపములు కలిగెను. సంచెర్ల అను చిన్న సంస్థానమున కొకే బాలిక వారసురాలై నిలిచెను. ఆ బాలికను తమ కుమారుడగు
రంగారెడ్డి గారికి వివాహము చేయులాగున నిశ్చయ మయ్యెను. రెడ్డిగారు తమశక్తిని వినియోగించి ఆమె పేర విరాసతును పొందించెను. అది పూర్తి యైనంతనే వనపర్తి రాజూగారు ఆమెను పెండ్లాడిరి. ఇది మనస్తాపములకు కారణ మయ్యెను. కాని వనపర్తి రాజగారా వివాహమువలన సౌఖ్యమందక పోయిరి. అనూత్న రాణీగారికి సంతానము నిలువక పోయెను. ఆమెయు గతించెను. ఆమె సంస్థానము రాజుగారికి దక్కక ఆమె వంశీయులగు వారసులకు చెందెను. వనపర్తి మహా రాజుగారును క్షయరోగ పీడితులై అవసాన దశకు వచ్చిరి. ఇంకకొన్ని దినములలో చనిపోవుదురనగా శ్రీ మహారాజాగారు వేంకటరామా రెడ్డిగారిని తమ వద్దకు పిలిపించుకొని కంటనీరు పెట్టుకొని జరిగిన అపకార మంతయు మరచి పొమ్మని చెప్పి తన యిద్దరి చిన్న కుమారులను రెడ్డిగారి చేతులలో పెట్టి తనకు మారుగా విచారించు కొనుమని చెప్పిరి. ఉభయులును ఒకరనొకరు పట్టుకొని కన్నీరు కార్చినారు. ద్వేష మంతయు ఆకన్నీటి కాల్వలో కొట్టుకొని పోయెను. మురల యథాపూర్వముగా ప్రసన్ను లైరి.
వనపర్తి మహా రాజుగారు దివంగతులైరి. వారి సంస్గానము కోర్టు నిగరానీలో చేరెను. వారి పెద్దకుమారులు తము 20 వ ఏటనే మరణించిరి. చిన్నకుమారులగు రాజా రామ
దేవ రావుగారును, పెద్ద కుమారులగు రాజా కృష్ణ దేవరాయలకు కలిగిన ఒక శిశువును మిగిలిరి. కాని శిశువు పక్షము వారికి రాజా రామ దేవరావు బహద్దరుగారికి రాజ్య భాగములో. వివాదమేర్పడెను. రా! బ! వెంకటరామా రెడ్డిగారు తమ వాగ్దాన ప్రకారము రాజారామ దేవ రావు గారి కాశ్రయ భూతులై వారిభాగము వారికి దొరకునట్లు ప్రయత్నించిరి.
గద్వాల సంస్థానము ఈ రాష్ట్రములోని ఆంధ్ర సంస్థానము లలో ప్రాచీన మైనదియ, పెద్దదియునై యున్నది. దాని పరిపాలకులగు శ్రీ మహారాజా సోమ భూపాలరావు గారి కాలములో కొందరు ప్రజలు అల్లరులు చేయగా రెడ్డి గారు వారికి సాయపడిరి. మరియు గద్వాల మహారాజు గారు నిండు వయస్సులో మృత్యువు వాతపడగా గద్వాల సంస్థా సము కోర్టు ఆధీనమయ్యెను. మహా రాజు గారికి పుత్రసంతానము లేదు. ఇద్దరు బిడ్డలు మాత్రముండిరి. అందుచేత సంస్థనము ఖాల్సాలో చేర్చబడునో యేమో అని వదంతులు బయలు దేరెను. అప్పుడును రెడ్డిగారు తమచేత నైన సహాయము చేసి తుదకు శ్రీ ప్రభువుగారికి నచ్చచెప్పిరి. సంస్థానమును మహారాణీగారి వశముచేసి వారి దౌహిత్రునికి రాజ్యాధీకారము కలుగునట్లు ఫర్మాను వెలువడెను.
పాపన్న పేట సంస్థానము రాణీ గారికి సంతానము లేదు. వారు వేంకటరామారెడ్డి గారితో ఆలోచించి ఒక సాధారణ కుటుంబముసకు చెందిన ఒక బాలుని దత్తుగా స్వీకరించిరి. కోర్టు ఆఫు వార్డు ఆజ్ఞా ప్రకారము దత్త పుత్రుని రెడ్డిహాస్టులో రాజా వేంకటరామా రెడ్డిగారి పర్య వేక్షణములో నుంచి ఒకటి రెండు సంవత్సరములు విద్యాబుద్ధులు చెప్పిరి. ఆబాలునికి గద్వాల మహారాణీగా, రెండవకుమార్తె నిచ్చి వివాహము గావించిరి.
కొల్లాపురము సంస్థానమునకు జటప్రోలు సంస్థాన మనియు ప్రతీతి. ఈసంస్థా నాధీశ్వరులకును పుత్రసంతానము లేదు. కుమార్తెలు కలరు. సంస్థానాధీశ్వరులు దత్త స్వీకారము చేసిరి. వామచని పోవునప్పుడు తమదత్త పుత్రునికిని, తమ సంస్థానమునకు శ్రీ రెడ్డిగారిని (గార్డియనుగా) విచారణ కర్తనుగా నియమించి పోయిరి. ఇప్పటికిని ఆదత్తపుత్రుని విద్యాభ్యానము వారి అవసరములు, సంస్థానములోని ప్రతి విషయమును రెడ్డిగారి అభిప్రాయాను సారముగా జరుగుచున్నవి.
మరియు దోమకొండ సంస్థానమువారును, ఆత్మకూరు సంస్థానము వారును, గోపాలు పేట సంస్థానమువారును శ్రీ రెడ్డిగారికి ముఖ్య పరిచితులై వారిసలహాను పలుమారు పొందుచుందురు. వీరు కాక అనేక చిన్న చిన్న జూగీరారులును, ఇతర జమీందారులును వీరివలన ఎన్నియో మారులు లాభము పొందినారు. ఇట్లు వీరు సర్వజన ప్రియులై, పరోప కార పారీణులై, కరుణాసముద్రులై, ప్రజాను రంజకులై , రాష్ట్ర సేవా పరాయణు లై అఖండ కీర్తి గడించియున్నారు.