Jump to content

రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము

ఇతర ప్రభుత్వశాఖలలోని సేవ.


కొత్వాలీ పదివిలోనే రెడ్డిగారి కాలమంత యువినియోగిం పబడుచుండెను. పలుమారు సగము రాత్రి వేళలందును వారి పడక పక్కననుండు టెలిఫోనుతో క్రింది అధికారులేకాక సగరమందలి గొప్పగొప్ప వారును అవసరముకొలది వారిని లేపి మాట్లాడివారు. రాత్రు లందును ప్రాతః కాలమందును ఇంటివద్దనుకూడ జనులు దరఖాస్తులు పట్టుకొని పోవుచుండిరి. ఇట్లు విరామము లేనివారైయుండినను రెడ్డిగారు నగరము లోని అనేక శాఖలలో ఏదోయొక గౌరవోద్యోగ కార్యమును నిర్వహించుచు వచ్చినారు. అవన్నియు విపులముగా వ్రాయ బూనిన గ్రంధము పెరిగిపోవును. అందుచేత సంగ్రహముగానూచన మాత్రము చేయబడును.


(1) 1329 ఫసలీలో వీరు నగర పురపాలక సంఘ ములో సభ్యులైరి. మరియు 1336. ఫసలీనుండి 1339 ఫసలీవరకు పురపాలక సంఘము యొక్క ఉపాధ్యక్షులుగా నియుక్తులై చాల దక్షతతో పనుల నెర వేర్చిరి. (2) నగరము యొక్క మురికినీటి కాలువల పునర్నిర్మాణము ప్రారంభ మయ్యెను. (Drainage Scheme) దాని కార్యవర్గములోను వీరు సభ్యులై సలహా లిచ్చుచుండిరి.


(3) నగరములో ప్లేగు విశేష వ్యాప్తి నొందగా ప్రజల కనేక సౌకర్యములు కలిగించి చికిత్సలు చేయించి ఐసొలేషణ ఆస్పత్రికి పంపించియు, సగరమును వదలిన వారికి స్థలములు చూపించియు సహాయపడిరి. ప్లేగు నివారణ సంఘములో బహుకాలము సభ్యులుగాను నుండిరి.


(4) విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్ (అనాథ శరణాలయము) యొక్క కార్యనిర్వాహక వర్గములో వీరొక ముఖ్య సభ్యులై యుండిరి.


(5) కొలతలను తూకములను సంస్కరించు సంఘములో సభ్యులై ( 1333 ఫసలీనుండి 1341 ఫసలీ వరకు పని చేసిరి.


(6) శాసనసభలో సభ్యులుగా నేటివరకును పనిచే యుచున్నారు. అందు ప్రవేశ పెట్టబడు ప్రతి శాసనమును శ్రద్దగా చూచి ఏమర్శించి మంచిసలహా లిచ్చుటలో ముఖ్యులని ప్రసిద్ధిగాంచినారు.


(7) నగరాభివృద్ధిశాఖ, (ఆరాయి షెబల్ద) లో సభ్యు లై పనిచేసినారు. ఈ శాఖవారు వీధులను విశాలపరచిన

ప్పుడు ఇండ్లను పడగొట్టవలసివచ్చెను. అప్పుడు ఇండ్ల యజమా సులతో ప్రతిఫల పరిష్కారార్థము ఒక న్యాయస్థానమునే ప్రత్యేకించి యుంచిరి. అందు విచారణ లై తీర్పులగువరకు చాల కాలము పట్టుచుండెను. రెడ్డిగారు ఇండ్ల యజమానులతో మాట్లాడి వారిని ఏదోవిధముగా తృప్తిపడునట్లు చేసి తొందర తొందరగా పరిష్కారములు చేయించి సహాయపడినారు.


(8) సర్ఫెఖాస్ గౌరవ కమిటీలో వీరు ఒక ముఖ్య సభ్యులు. ప్రతి కమిటీలోను వీరు కేసుల పరిష్కారములలో చాల సహాయ పడుచున్నారు.


(9) రాజా శివరాజబహద్దరు ఎస్టేటు చాల ప్రసిద్ధమై నట్టి సంస్థానము. దాని సంవత్స రాదాయము సుమారు 12 లక్షలు. ఆ సంస్థాన ప్రభువగు రాజా శివ రాజ బహద్దరు గారు “ధర్మవంత". అనుబిరుదము కలవారుగా నుండిరి. బిరుదమునకు తగినట్లే దానధర్మాలు చేసినవారు. తత్ఫలితముగా సంస్థానము సుమారు 20 లక్షల రూపాయీ లవరకు అప్పుల పొలయ్యెను. రాజా శివరాజ బహద్దరు పుత్రసంతానము లేక చనిపోగా వారిసంస్థానమునకు మరల వారసుల నిర్ణయమగు వరకు సంస్థాన పరిపాలనమును ఒక కమిటీ అధీనములో శ్రీపభువుగారుంచిరి. అకమిటీకి అధ్యక్షులై శ్రీ 'వేంకట రామా రెడ్డిగారు 1345 ఫసలీ నుండి 1349 ఫసలీవరకు సంస్టా 16 నమును ధర్మదృష్టితో పరిపాలించిరి. అప్పులన్నియు చెల్లించి తానా పదవిని వదలుకొనువరకు సుమారు 5 లక్షలు సంస్థాన గోశములో నిలువయుంచి పోయిరి. సంస్థానము లోని బీదరైతులకు సదా సహాయము చేసిరి. “ధర్మవంతు ఉన్నత పాఠశా లను" స్థాపించి సంస్థానపక్షమున నడిపించి, మగియు అనేక గ్రామములలో ప్రైమరీ పాఠశాలలను నెలకొలిపి విద్యావ్యాప్తి కనుకూలపడిరి. ఆ సంస్థానములో కేవలము భూమ్యాదాయశాఖా వ్యవహారములను పరిష్కరించుటయే కాక, ఆ సంస్థానపు పోలీసుశాఖకును అధ్యక్షులై (నాజిం) పోలీసుశాఖను సంస్కరించిరి. ఆ సుస్థాన వ్యవహారములను ప్రతి, బుధవారమునను, ప్రతి శనివారమునను సాయంకాలము 1 గంట లనుండి రాత్రి 9 గంటలనరకు విచారించుచుండిరి. ఈ ఉద్యోగమునకు గాను గౌరవార్థము నెలకు 110 రూపాయలు మాత్రమే అల వెన్సుగా వీరికి ఇయ్యబడుచుండెను.


(10) సహకారసంఘము (కోఆప రేటివ్ సొ సైటీ) లో వీరు 1334 ఫసలీలో చేరిరి . 1339 ఫసలీలో జరిగిన సంఘమహాసభలో పాల్గొనిరి. ఉపసంఘములో అధ్యక్షులుగా నియమింప బడిరి. సహకార సంఘపక్షమున 'వెలువడు మాసపత్రికలు నాలుగు భాషలలో వీరి అధీనమునుండి యే వెలువడుచుండెను. బెంగాలులోని శాంతి ని కేతనమునుండి ఖాళీ మోహన్ ఘోష్ అను వారిని పిలిపించి వారిచే కొన్ని గ్రామములలో ఆర్థిక విచారణలు గావించి మెదకు తాలూకాలోని బర్డుపల్లియను గ్రామములో గ్రామ పునర్నిర్మాణ కార్యమారంభించిరి. 1335 లోను 1336 లోను సహకార మహాసభలు జరిగినప్పుడు "రెడ్డిగారు ఆహ్వాన సంఘాధ్యక్షులై ఉపన్యాసములు గావించి మహాసభలను జయప్రదముగా నడి పించిరి.


(11) ఉన్మాద వైద్యశాల యుక్క పాలక వర్గములో వీరొక మఖ్యసభ్యులుగా నుండిరి.


(12) కుష్ఠురోగుల ఆశ్రయము యొక్క పాలక వర్గము లోను సభ్యులుగనుండిరి.


(13) నజంజమాయత్ (సైన్య శాఖ) లో విచారణ సంఘములో సభ్యులుగా నుండిరి.


(14) దిక్కు లేని పిల్లల (లావారస్) విచారణ సంఘము యొక్క సభ్యులును నై యుండిరి.


(15) జూడిషియల్, రెవిన్యూ , మునిసిపల్ , మరియు పోలీసు ట్రైయినింగున్కూలు అభ్యర్థులను పరీక్షించు పరీక్షకులుగా నుండిరి.


(16) సీతారాం బాగు దేవాలయము నగరములో చాల గొప్పది. దీనివ్యవస్థ చాల చెడిపోగా వీరందు పాల్గొని దా నిని మంచి స్థితిలోకి దెచ్చిరి. ఇప్పుడది ఒక పాలక వర్గముచే పరిపా లింప బడుచున్నది.

(17) శ్రీ ప్రభువుగారి బంధువర్గములో చేసినట్టి పూర్వ నిజాముల సంతతివారు చాలమంది అప్పులపాలైరి. వారి అప్పులను తీర్చుచేయుటకై సాహెబ్జాదాల అప్పుల విచారణ సంఘమునొక దానిని శ్రీ ప్రభువు గారుఏర్పాటు చేసిరి.


దానికి అధ్యక్షులుగా శ్రీ రాజా మేకటరామారెడ్డి గారు నియమింపబడిరి. ప్రభు బంధువుల అప్పులను సుమారు నాలుగు లక్ష లవరకు పరిష్కరించి గొప్ప సహాయముచేసిరి.


(18). అవసరము కొలది ప్రత్యేకమగు కొన్ని కేసులను . విచారించుటకు రెడ్డిగారు పలుమారు స్పెషల్ కమిషనులలో నియుక్తులై పనిచేసిరి.


(19) మూడు నాలు గేండ్ల క్రిందట మద్యపాన నిషేధ సంఘమును ప్రభుత్వము వా రేర్పాటు చేసిరి. ఈ సంఘమునకు సవాబు మిర్జాయార్జంగు బహద్దరుగారు అధ్యక్షులు. ఈ సంఘములో శ్రీ రెడ్డిగారు ముఖ్యసభ్యులు.


(20) వ్యవసాయాభివృద్ధి సంఘములో సభ్యులై మంచికోళ్ళు పెంచిన వారికిని, మంచి ఫలముల పండించిన పొరికిని బహుమతు లిప్పించుటలో శ్రద్ధవహించినారు.

ఇదిగాక శ్రీ ప్రభువుగారు రెడ్డిగారిని ఈ క్రింది ముఖ్య విషయములను విచారించుటకు సంపూర్ణాధికారమును ప్రసాదించి (కమిషనరు) నిర్ణయకర్తగా నియమించిరి.


(21) నగరాభివృద్ధి శాఖ వారు వీధులను విశాలముగా చేయు సందర్భములో కొందరుద్యోగులు గోరీలకవమాన ముకలిగించినారను అభియోగమును విచారించుటకును,


(22) కెప్టన్ మొహియుద్దీన్ అలీఖాను అనునతనిపై కావింపబడిన ఆరోపణములను విచారించుటకును,


(23, ఫయ్యా జున్నిసా బేగం అనునామె అబ్బాస్ హుసేన్! అనుపోలీసు అమాను పై మోపిన నేరములు విచారించు టకును,


(24) సెంట్రల్ జైలు హైద్రాబాదు నుండి కొందరు ఖైదీలు పారి పోయినప్పుడు ఆ కారణములను విచారించుటకును,


(25) అఫజలున్నిసా బేగం అనునామె మిర్ ఖాజి మలీ సాహెబ్జాదాపై చేసిన ఆరోపణములను విచారించు టకును,


(26) నూరుద్దీన్ షా ఖాదిరీ అనునతని జాగీర్లను కోర్టు అధీనమునుండి విడుదల చేయు విషయమున విచారించుట కును,

(27) నవ్వాబ్ అబ్దుర్ జబ్బార్ ఖాన్ జమాదారు యొక్క యెస్టేటును విడుదల చేయు విషయమున విచారించుటకును,


రాజాబహద్దరు వేంకటరామా రెడ్డిగారిని శ్రీ ప్రభువు కారు ప్రత్యేకాధి కారములిచ్చి కమిషనర్ గా ఏర్పాటు చేసిరి.


(28) యువరాజులు యూరోపులో వివాహితులై నగరము వచ్చినప్పుడు వారిని గౌరవించుటకు ఆహ్వాన సంఘ మేర్చడెను. దాని అధ్యక్షులుగా' ఫర్మానుద్వారా రెడ్డిగారు నియక్తులైరి.


(29 ) ప్రభువు గారి సిల్వర్ జూబిలీ మహోత్సవకాల మందు రెడ్డిగారుచేసిన కృషి, ఆపారముగా నుండెను.


(30) ప్రభువుగారు డిల్లీ నుండి తిరిగివచ్చినప్పుడు నగరములో అపూర్వమైన వేడుకలు కావింపబడెను. ఆ సందర్భమునందును రెడ్డిగారే ముఖ్య బ్యాత :హించినవారై యుండిరి,


(31) రెడ్డిగారికి స్కౌటింగులో (బాలభటః ర్గములో) చాల అభిమావము. రెడ్డి హాస్టలులోని 150 మంది విద్యా ర్డులలో నించు మించు 50-60 మంది విద్యార్థులు వీరిప్రోద్బలము చేతనే స్కౌటింగులోచేరి" రెడ్డి ట్రూవు" అను పేరుతో ఒక సంఘముగా నేర్పడినారు. వీరికి డెస్సును తామే తెప్పించి యిచ్చినారు. వీరి శిక్షణకై చాల శ్రద్ద వహించినందు చేతనే రెడ్డి ట్రూపు వారు వివిధ సంఘముల పోటీపరీక్షలో ఉత్తమ ములుగా నిర్ణయింపబడి లెక్కలేనన్ని బహుమానములు పొందినారు.“స్కౌటు రాలీ"లో రెడ్డిగారే ముఖ్యశ్రద్ధ వహించినట్టి వారు. వీరి యీ సేవనుగుర్తించి స్కౌటుసంఘమున కొన్ని సంవత్సరములకు పూర్వము ఛాడర్ ఘాట్ హైస్కూలులో గొప్ప సభచేసి వీరికి గౌరవ పతక మర్పించి మంచి సమ్మానము గావించినారు. అనేక స్కాటు సభలలో ప్రస్తుత ప్రధానా మాత్యులగు రై. ఆ. సర్ అక్బర్ హైదరీ గారు రెడ్డిగారి స్కౌటు సేవను బహు విధముల ప్రశంసించియున్నారు.


ఈ విధముగా రెడ్డి గారు నిరంతరముకు కృషి చేసి ప్రభుత్వము నకు అపారమైన సేవ చేసినారు. పై విధులలోనే కాక ఇట్టి మరియితర ముఖ్య సందర్భము లందును సంఘాధ్యక్షులు గానో సభ్యులుగానో పని చేసి తమ దేశ సేవానురక్తిని వెల్లడించినారు.


రా. బ• వేంకట రామా రెడ్డి గారు 26 అమర్గాదు 1343 ఫసలినాడు కొత్వాలీ పదవినుండి ఉపశార వేతనమంది విశ్రాంతినొందినారు. కాని మరునాడే వారియేలిక వారికిం కొక పదవినిచ్చిరి. కొత్వాలీ పదవిలో వీరుండినప్పుడు సుమారు 13 సంవతములవరకు ఉద్యోగకాలమును


హెచ్చింపు చేయచు వచ్చిరి. ఇట్లుండ సర్. ట్రెంచిగారు అప్పుడు తాలూకుదారు పదవిలోనుండిన నవాబ్ రహమత్ యార్జంగుగారిని గొత్యాలుగా నియమింప అభిలాషకలవారై యుండిరి. వారిని నియామకము చేయుటకును ఆజ్ఞలుపొందిరి కాని మరి రెండేండ్లు వారు అనుభవము పొందవలెననియు ఇట్లెన్నియో గౌరణాలనుబట్టి రహమతుయార్జంగుగారికి కొత్వాలు పదవి దొరకక పోయెను. దీనికి ముఖ్య కారణము శ్రీ ప్రభు వుగారికి రెడ్డి గారి పై ననే అభిమానము మొడుగా నుండుటయే. తుదకు రెడ్డిగారు "కొత్వాలీ పదవినుండి విరమింప వలసినప్పుడు శ్రీ ప్రభువు గారు వారితో “నీకంతకంటే గొప్ప పదవి నిత్తునులే" యని సెలవిచ్చిరట. మరునాడు రెడ్డిగారు తమయేలిక వద్దకు వెళ్లి నజరానా (కానుక) అర్పించుకొనినారు. ఎందుకని విచారించగా "నాకు తలపై నుండి మహాభారము వదలిపోయినది. ఆ సంతోషముతో నజరానా చెల్లించు కొనుచున్నాను" అని మనవి చేసికొనినారు. “నిన్ను వదలుటలేదు. అంతకంటే ఎక్కువ భారము మోపుచున్నాను" అని వారిని తమ సర్ఫెఖాసు మండలమునకు స్పెషల్ అధికారిగా నియమించిరి. వారి కన్న పై అధికారులున్నను వారికి నేరుగా శ్రీ ప్రభువుగారి తోనే సంబంధముండుననియు శాసించినారు. 13 వివిధ శాఖలపై వారిని ముల్యాధి కారిగా నిర్ణయించిరి. ఇతరులకు ప్రత్యేక
పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/159

నియమిత కాలములందే ప్రభుదర్శనము. “నీవుమాత్రము ఎప్పుడు బుద్ధిపుట్టిన అప్పుడు నాతో వచ్చి కలసి పోవలసినది. నీ కొక దినముకాని సమయముకాని నిర్ణయము లేదు" అని ప్రభువుగారు సెలవిచ్చినారు. స్పెషల్ ఆఫీసర్ పదివికి గాను రెడ్డిగారికి నెలకు 700 రూపాయిలు వేతనమిచ్చుచున్నాడు.