రాజస్థాన కథావళి/చిత్తూరు రెండవముట్టడి

వికీసోర్స్ నుండి

చిత్తూరు రెండవముట్టడి.


కణ్వాహా యుద్ధమైన తరువాత పాడుపడినస్థలములు బాగుచేసి కొనుటకును మరల ఫూటుపడుటకును రాజస్థానమునకుఁ గొంత విశ్రాంతి కలిగినది, ఎవఁడో యొక వీరుఁడు మృతినొందని కుటుంబము గాని గృహము కాని లేకపోవుటచే రాజస్థానమం దంతట శోకదేవత విహారము చేయుచున్నట్టు కనఁబడెను. ఆదారుణ యుద్ధమైన తరువాత గలిగిన విశ్రాంతిచే రాజపుత్ర స్త్రీలు తమ మగవారలకు జరిగిన పరాభవపు మచ్చను దుడిచి వేయఁగల శూరులగు కుమారులను గని పెంచుచుండిరి.

రాణాసంగుఁడు పోయిన రెండు సంవత్సరములకే బేబరు చక్రవర్తియుఁ గాలధర్మము నొందుటచేఁ గ్రోత్తగా జయించిన భూములన్నిటిని గలియఁ గట్టుకొని సంరక్షించు కొనుభారము వాని కుమారుఁడగు హుమాయూను పైఁ బడెను. హుమాయూను ధైర్యశాలియు సౌదార్యవంతుఁడు నై స్వగౌరవముఁ గాపాడుకొను విషయమున రాజపుత్రు లెంత తీవరముగా నుందురో యంత తీవ్రముగ నుండి దయాళువై సర్వజనులచేతఁ బ్రేమింపఁబడుచు వచ్చెను. రాచరికమున కుండవలసిన కాఠిన్యము మనో ధైర్యము చిత్త నైర్మల్యము మొదలగు గుణములు లేకపోవుటయేగాక తొల్లి వానితండ్రి 'కభ్యాసములైన నల్లమందు మద్దతు మొదలగునవి వాని కలవడెను. అందుచే నతఁడు స్థిరబుద్ధి లేనివాఁడై బేబరువలె నలుదెసలం జెదిరియున్న రాజ్యమును కూడగట్టుకోని పాలింప లేకపోయెను.

అదియటుండ రాణాసంగుని జ్యేష్ఠపుత్రుఁడు రత్నసింగు రాజపుత్రకులజులవద్ద నుండు శౌర్యగాంభీర్యాది సమస్త లక్షణములు గలిగి తండ్రి పరోక్షమున రాజ్యమునకు వచ్చెను. గద్దె యెక్కినతోడనే యతఁడు కోటకావలి వాండ్రం బిలిచి "తొల్లి మాతండ్రియగు " రాణాసంగుఁడు తెరచియుంచు మనిన తలుపులు తెరచియే యుంచవలయును; కాని మరల మూయవద్దు. వాని నాలాగుననే యుండనిండు. ఢిల్లీ మండూరు పట్టణములే చిత్తూరునగర ద్వారములగు గాక" యని నొక్కి చెప్పెను. కాని యతఁ డెన్నో కష్టము లనుభవింపవలసివచ్చెను. ఆకష్టములలోఁ గొన్ని స్వయముగ దెచ్చుకొన్నవియుఁ గొన్ని వాని యనుచరుల బుద్ధిహీనత చేతను ద్రోహబుద్ధి చేతను దెచ్చినవియునై యుండె. మొట్టమొదట నతఁను నిగ్రహింపవలసిన ప్రబలశత్రువు వాని సవతితల్లి యగు జవాహీరు భాయి. ఆమె నూరువారు రావుల యాఁడుబడుచు. తనకుఁదోచినంతయెగాని యొకరు చెప్పినట్లు వినక పోవుటయు దురాశచే నెప్పుడు కుట్రల జేయుటయు నామె చేయు ప్రధాన కార్యములై యుండెను. భత౯యగు రాణా సంగుఁడు మృతినొందినతోడనే జవాహీరుభాయి సవతికొడుకును రాజ్యభ్రష్టునిఁ జేయఁదలంచి తనకుమారుఁడు విక్రమజిత్తును చిత్తూరుసింహాసనమునందు నిలుపు మనియు నట్లు చేసిన పక్షమున మున్ను మాళవ దేశపు రాజగు మహమ్మదు చిత్తూరులో విడిచిపోయిన కిరీటమును రంతంబార్ అను కోండకోటను బహుమానములుగ, నిత్తుననియు జేబరు చక్రవతి౯కి రహస్యముగ వత౯మాన మంపెను. బేబరు పనితొందరలోనుండి తెలివి లేక యామెకు బ్రత్యుత్తరమునైన నొసంగక పోవుటచే నామె సంకల్ప మంతరించెను.

ఇది యటుండ రత్నసింగు అంబరుదేశపురాజు కూఁతును వివాహ మాడఁదలఁచి తనకత్తి యక్కడకుఁ బంపి యామెను పెండ్లి చేసికొనెను. వివాహమాడియు నెంత కాలమునకు నామెను దనవద్దకుదీసికోనిరాకపోవుటచే బూందీ సంస్థానాధీపతియగు సురాజమల్లుఁ డా బాలికను వివాహమాడి తన యంతః పురమునకుఁ దీసికొని పోయెను. ఈ కార్యము చేత సురాజమల్లునకును రత్నసింగునకును మనసులలోఁ గ్రోధాగ్నులు పొడమి రవులుచుండెను. అట్లుండ రత్నసింగొక సాగి వసంత కాలమున నొక యడివిలో వేఁటాడుటకు వచ్చిన సురాజమల్లును నిష్కారణముగఁ బొడిచి యాతని చేత మరల నొకపోటు తిని పగతుని చంపిన సంతోషము లేకుండ తానును జచ్చెను. రత్న సింగు స్వయంకృతాపరాధమునఁ దెగుటచే జవాహీరుభాయియొక్క చిరమనోరధము ప్రయత్న మక్కర లేకయే సిద్ధించెను. విక్రమజిత్తు చిత్తూరు సింహాసన మెక్కెను. విక్రమజి త్తిట్టివాఁడని నిర్ణయించి వ్రాయుటకు వీలు లేదు. రాజస్థానచరిత్ర కారులు వాని యోద్ధ సద్గుణము లేవియు లేవని వ్రాసిరి, బంధువులయెడను సామంతులయెడను నిరాదరణము చూపుటయే గాక యతఁడు నీచులతో సహవాసము చేయుచు రాణా సంగుని కొడు కైనందుకుఁ బ్రజలవలనఁ బొందవలసిన గౌరమును బొందక నిరసింపఁబడుచు వచ్చె. రాజ్య వ్యవహారములను జూడక వస్తాదులను పందెగాండ్రను గలిసి యతఁడు కాలమంతయు 'నేల వ్యథ౯ము చేసినో తెలియదు. ఇట్లు దుస్సహవాసములు చేసి పాడగు చున్నను విక్రమజిత్తు సహజముగ తెలివిగలవాఁ డని యీక్రింది కథ వలనఁ దెలియవచ్చును. ఆతని కాలము వఱకు రాజపుత్ర వీరులు గుఱ్ఱ ముల నెక్కి- కత్తులు బల్లెములు పూని యుద్ధములు చేయుచుండిరి. రాజపుత్రుల శత్రువులు తుపాకులను ఫిరంగులను బూని యుద్ధము సేయుచు వచ్చిరి. అందుచేత రాజపుత్రులు తరుచుగ నోడిపోవుటయు మహమ్మదీయులు గెల్చుటయు సంభవించెను.

విక్రమజిత్తు బుద్ధిశాలి యగుటచే రాజపుత్రు లెంతశూరులైనను నిప్పులఁ జిమ్ము ఫిరంగులు మొదలగు నాయుధములు లేక వట్టి కత్తులు కఠారులు బూని గుఱ్ఱముల పై నెక్కి యుద్ధము చేసినంత మాత్రమున గెలువఁజాల రని నమ్మి ప్రాత పద్ధతిని విడిచి క్రోత్త పద్ధతిప్రకారము నూతనాయుథములను బూనవలసినదని 'తన వారి నందఱిని బురికోల్పెను. క్రోత్త పద్ధతి యనఁగా రాజపుత్రశూరులు యుద్ధరం గమున కొందఱు గుఱ్ఱములు దిగి ఫిరంగులు కాల్చుటయు మణికొందఱు నేలనేయుండి కాల్బలమై తుపాకులతో యుద్ధము చేయుటయు నని దెలిసికొనవలయును. విక్రమజిత్తు చెప్పిన మాటలు రాజపుత్రులకు మిక్కిలి గౌరవ భంగమని దోఁచుటఁ జేసి వారందఱు బుఱ్ఱపోయినను గుఱ్ఱములు దిగి కత్తివిడిచి యుద్ధము చేయమని వాదించిరి. అట్టి మోట యుద్ధమువలనఁ గలుగు నష్టమును తుపాకి యుద్ధమువలనఁగలుగు లాభమును జూపి రాజు వారి నెంత వేఁడుకొన్నను వినక వారు “గుఱ్ఱములమీఁద నుండియే శత్రువుల ఫిరంగులం బాలుపడి ప్రాణములనై నను విడుతుము; కాని నేల దిగి తుపాకి చేతఁబట్టుకొని పరువు ప్రతిష్టలు బంపుకొనము సుమీ" యని ప్రత్యుత్తర మిచ్చిరి. అట్టి వారితో వాదించుట నిరుపయోగ మని గ్రహించి రాణా వారియెడల నాస వదలుకోని జీతములనిచ్చి కొందఱు సిపాయిల నేర్పఱచి వారికి నూతన పద్ధతి ప్రకారము యుద్ధము చేయుట నేర్పించెను.

ఈ పనివలన రాజపుత్రులకు మనసులలో రాణా పై క్రోధము నిలిచెను. దానికిఁ దోడు విక్రమజిత్తు కొత్త సిపాయిలకు బహుమానములిచ్చి వారిని గౌరవించి వారితో గలిసి మెలిసి యుండుటచే రాజపుత్రులు తమ క్రోధమును లోలోపల నణచుకొనఁజాలక పైకి వెడలి రాణాతోఁ గలహమునకు డీకొనిరి. రాజ్యమున ప్రతిస్థలమందు ప్రజలు రాణాయొక్క, యధి కారముఁ దిరస్కరించి రాజశాసనముల నతిక్రమించి యుద్యోగస్థులను బరిహసించి యథేచ్ఛముగఁ దిరుగఁ జొచ్చిరి కొండలలోనుండు మన్నె గాండ్రు గుంపులు గుంపులుగఁ జిత్తూరు నగరమువఱకు వచ్చి రాణాకన్నులయెదుటనుండియే పక్క పల్లియల దోచుకొని పశులమందలను దోలుకొనిపోవఁజొచ్చిరి విక్రమజిత్తు కొండదొంగలను దరిమి కొట్టిరండని తన గుఱ్ఱపుదళముల కాజ్ఞాపింప రౌతులందఱు నవ్వుచు జీతబత్తెము లిచ్చి నిల్పిన కొత్తకాల్బలమును బంపుఁడు. మేమేమి చేయగల" మని పలికిరి, చిత్తూరు రాజ్య మట్టిదుస్థితిలో నుండుటచే శత్రువులు తమతమ ప్రాంతపగలు దీర్చుకొనుట కదియే సందని విజృంభించిరి. గుజరాతు దేశ ప్రభువగు మహమ్మదుషా యనుతుఱక కొంత కాలము క్రిందట బేబరు చేత జయింపఁబడి ఢిల్లీ రాజ్యముతోఁ గల్పఁబడిన మాళవ దేశము నాక్రమించుకొనెను. అప్పటికి జేబరు చనిపోవుటయుఁ బరమసాధువగు హుమాయూను సోదరులచేతను బంధువుల చేతను పలుచిక్కులంబడి మనస్థిమితము లేక యుండుటయు బహుదూరుషాకు మాళ్వాను బుచ్చుకొనుటకు మంచివీలు కలిగించెను.

ఇట్లు బహాదూరుషా ప్రక్కలో బల్లె మై మునుపు మాళవదేశపు ప్రభువు లగుతురకల నిద్దఱిని చిత్తూరు రాజులు ఖయిదీలుగా దీసికొనిపోయి వానిలో నొకనికిరీట మపహరించి యవమానించిన ప్రాంతవృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుకొని సాటితురకలకు జరిగిన దారుణ పరాభవమునకుఁ దగిన ప్రతీకారముఁ జేయుటకు సమయమును వెదకుచు నెట్టకేలకు విక్రమజిత్తోకసారి బూందీనగరమునకుఁ బోయి యున్నప్పుడు పెద్దసేనం గూర్చుకొని చిత్తూరుపై దండు విడిసెను.

విక్రమజిత్తు సహజముగ తొందరగలవాఁ డగుటచేఁ దన ప్రతి కక్షులు తన సేనకన్న నథికసంఖ్య గలవారై యున్నను సరకుగొనక మహమ్మదీయ సైన్యములం దాఁక నిశ్చయించుకొనెను. విక్రమజిత్తు తత్సమయమున నేమి సేయుటకుం దోఁచక మనోవేదన నందవలసి వచ్చె. కూలికి వచ్చిన సిపాయిలు శత్రువుల గొప్ప సేనం జూచి భయపడి పోరుటకు సాహసింప రైరి. రాజపుత్ర సైనికులం బోరు మని రాణా యడుగ తమ్మవమానించి జీతగాండ్రఁ బిలిపించిన రాజుపక్షమున నిలిచి పోర నొల్ల రైరి. అటు పోరకపోవుట యేగాక యారాజపుత్రులు యుద్ధభూమిని విడిచి పోయి రాణాసంగునకు నొక బూందీ రాజపుత్రిక వలనఁ బుట్టిన యొక చిన్న కుమారుని రాణాగా జేయఁ దలంచి కోట శత్రువుల బారిఁ బడకుండఁ గాపాడుటకుఁ జిత్తూరు బ్రవేశించిరి. ఈనగరమును గాపాడుట కామీవారు రాజపుత్రులకు రాజ స్థానమందున్న రాజు లందఱు సాయపడిరి. కణ్వాహాయుద్ధమున దమవా రనేకులు నిహతు లయినను, హతశేషు లగుచందావతువంశస్థులు చిత్తూరు సంరక్షణమునకు మరల సిద్ధపడిరి. ఆబూపర్వతము వద్ద నుండి యా ప్రాంతముల నేలుచుండిన రావు వచ్చి మీవారునకుఁ దోడు సూపెను, అట్లే మఱి యిదువురు రాజులును దమ ప్రాంతపగల మరచి యీయదనున వచ్చి మీవారునకు బాసటయై నిలిచిరి. వెనుకటిరాణా యగు రత్నసింగు బూందీసంస్థాన ప్రభువగు వెనుకటి రావును వేటాఁడు వేళ జంపెను. అతని వెనుక సింహాసకమునకు వచ్చిన యర్జునరావు మనసులో నామాట నుంచుకొనక మెరియలవంటి తన సైనికుల నైదు వందల మందినిఁ దోడ్కొని చిత్తూరునకు వచ్చెను. పృథివిరాజునకును వాని పినతండ్రి యగు సురేశమల్లునకును నెంతెంత మహాయుద్ధములు జరిగినవో పృథివి రాజు సాహసములఁ జదివిన వారంద ఱెఱుంగుదురు. ఆసురేశ మల్లునికొడుకు భాగ్జీ యనునతఁడు గతించిన కార్యముల దల పక తనతండ్రిని చిత్తూరు రాణాలు 'దేశమునుండి వెడలఁ గొట్టిరని క్రోధమునైన నిలుపక దేవలకోటనుండి కొంత బలముం దోడ్కొని వచ్చెను. ఈపైన పేర్కొనఁబడిన శూరులేగాక మఱియు ననేక ప్రభువులు కత్తిఁగట్టుకొని వచ్చి చిత్తూరును సంరక్షించు చున్న యా దేవత యూపత్కాలమున రాజవంశస్థులను గాపాడక పోదని నమ్మి యుత్సాహముతో రణోన్ముఖులైరి కాని ప్రపంచయిలో నున్న శౌర్యమంతయు ముద్ద చేసి యొక చోటికి చేర్చినను బహదూరుషా యొక్క ఫిరంగులముందట నెందుకుం గొరకాదు.

ఆతురక రాజు తన గొప్పఫిరంగులను కోటబురుజుల సమీపమునకు లాగించుకొనిపోయి వాని సేనలో బనిఁ జేయుచున్న పోర్చుగీసు వారి చేతఁ గడు నిపుణముగఁ బని జేయింపఁ జొచ్చెను. ఒక మూల నుండి దారుణము లగుఫిరంగి గుండ్లు కోటలోనున్న మనుష్యులమీద బడి నాశనము చేయుచుండ రెండవమూలనుండి మఱికొన్ని గుండ్లు వచ్చి కోటగోడలను గుభాలు గుభాలు మని పడఁగొట్టఁ జొచ్చెను. పూర్వ మలాయుద్దీను ముట్టడించినప్పుడువలెనే యిప్పుడును దక్షిణ దిక్కున నున్న కోటభాగము బలహీనమై యుండెను. ఆవైపు బురుజు మీఁద బూందీప్రభు వగు నర్జున రావు తనయైదువందలమంది సైనికులతో నిలిచెను. తురకసేనలో నున్న పోర్చుగీసు దొర యాబురుజుల కెదురుగా నేల సొరంగము ద్రవ్వి యందు తుపాకిమందు కూరి దాని నంటించెను. ఆగని బ్రహ్మాండము గడగడ వడఁకునంతటి ధ్వనితోఁ బగిలి దక్షిణ దిక్కున నున్న కోటగోడను నలువదియై దుమూళ్ల పొడుగున గుభాలున కూల్చెను. అతి ధైర్యముతో నాభాగమును గాపాడుచున్న యర్జునరావును వాని జోదులును పేలిపోయి యానవాలైన లేకుండ నశించిరి. ఈరంధ్రమునుండి మహమ్మదీయులు కోటలోఁ బ్రవేశింపఁ జూచుచుండ వీర రసావతారు లగుచందావతువంశస్థు లక్కడకు వచ్చి శత్రువులు లోనఁ బ్రవేశింపకుండఁ బోరిరి. ఎక్కడనుండి యైనమఱి కొంతసేన దోడు వచ్చినఁగాని చిత్తూరుకోట నిలువదని యందఱు గ్రహించిరి. అప్పుడు ముఖ్య సేనానాయకు లందఱు గూడి సభ , జేసి యాయాపద గడువంబెట్టుట కుపాయము 'వెదుకఁ జొచ్చిరి. వారికి మొట్టమొదట యాలోచన చెప్పినది విక్రమజిత్తు తల్లి యగు జవా హీరుభాయి. ఆమెమగఁడు పోయిన స్వల్ప కాలములోనే తన సవతికొడుకును 'రాజృభ్రష్టునిఁ జేసి తనకుమారుని 'రాజుని జేయుమని తురక చక్రవతి౯ని బ్రతిమాలినందుకు నిటీవలఁ జాల పశ్చాత్తాపము నొంది యాసమయమున తనకుమారుని లాభమునుగాని తనలాభమునుగాని జూచుకొనక మీవారు యొక్క జిత్తూరుయొక్కయు గౌరవమును గాపాడుకొనుటకు సమస్తవిధములఁ బాటువకి తాను యుద్ధమునకుఁ బోవుదు నని సేనానాయకులతోఁ జెప్పి వారి నొప్పించి తనమందిరమును తనగోషాను విడిచి కవచము దోడుగుకోని యా యుధముల ధరించి కొంత సేన నడపించుకొని పోయి యొడలు దాఁచుకొనక కయ్యము చేసి స్వర్గస్థురా లయ్యెను.

ఈజవాహీరుభాయి గాక రాణా సంగునకు మఱియొక భార్యయుండెను. ఆమె పేరు కర్ణాపతి విక్రమజిత్తును రాజుగా నంగీకరింపక యీమెకొడు కగు నుడయసింగునే రాణాగాఁ జేయఁ దలంచి రాజపుత్రవీరులు నాభాగములనుండి వచ్చి చిత్తూరులోఁ బ్రాణములు విడుచుచుండిరి. వీరస్వర్గమును జూర గొన్న యగ్జునరా వీదేవి సోదరుఁడే. మరణమునకు జంకని శూరుని గర్భమునఁబుట్టి శూరాగ్రేసరుఁడగు రాణాసంగుని చెట్టఁబట్టిన యీ దేవియు భయమెట్టిదో యెఱుఁగని సాహసికురాలేయై తన ప్రాణములు విడువఁదలంచెను; కాని చిన్న కుమారుని ప్రాణములు సంరక్షించుట కత౯వ్య మని యూర కొనెను వీరందఱు గోటసంరక్షణమునకై యుపాయములు వెదకు చుండ కుమారరక్షణమునకై యామె యుపొయములు వెదకి తుదకొకటి కనిపెట్టెను.

రాజపుత్రులలో నొక చిత్రమైన యాచారముఁ గలదు, రాజపుత్ర స్త్రీ తన 'కేదేని యాపద వచ్చినప్పుడా యాపద దీర్పగల సమర్దుఁ డని తనకుఁదోఁచిన పురుషుని శరణు వేడి వానికి రత్నఖచితమైన కంకణమును గాని పట్టుతోరమునుగాని పంపుచుండును. ఆపురుషుఁడు రాజపుత్రుఁడు గావచ్చును లేక తురకగావచ్చును. ఆస్త్రీ వాని నెఱింగియుండ నక్కఱ లేదు. వానిపేరు విని శరణు వేఁడవచ్చును. ఆపురుషుఁ డా స్త్రీనిఁ జూడవలసిన యావశ్యకమును లేదు. ఆ స్త్రీ పంపిన బహుమానము నా పురుషుఁడు ముంజేతికిం గట్టుకొని యామెను రక్షించుటకుఁ గంకణము కట్టుకొన్న శూరుఁడై యానాడు మొద లామెకు పెంపుఁడు సోదరుఁడై యామెయేదిగోరిన నది చేయునట్లు ప్రమాణము చేయును. ఒక వేళ నా స్త్రీ యీపురుషునకుఁ బ్రాణహాని కలుగు పనులు చేయుమన్న నతఁడు చేసి తీరవలయును. ఆపత్సమయమునం దున్న స్త్రీ లీవిధముగఁ గంకణమును బంపుట తను కెంతో గౌరవమని మహమ్మదీయ చక్రవర్తులు హిందూరాజులుం గూడఁ దలంచిరి.

కర్ణావతి యీయాచారము నడపి తనకుమారుని సంరక్షించు కొనవలయునని సంకల్పించి యంతఃపురమున మెత్తని పట్టుదారములతోఁ గడువిన్నాణముగ నొక పట్టుతోరము నల్లి నమ్మిక గల యొక బంటును బిలిచి యిట్లనియె. "శత్రు సేనల బారిఁ బడకుండ తప్పించు కొని యెట్లయిన హుమాయూను చక్రవతి౯ వద్దకుఁ బోయి యీతోరమును వానికిచ్చి యీతోరమునలన మీవారు రాణీయగు కర్ణావతికి నతఁ డిప్పుడు సోదరుఁ డయ్యెం గావున యాపడ గడువంబెట్ట వలయునని చెప్పుము. " ఆతరముఁ దీసికోని యాబంటు నిరంతర ప్రయాణంబుల ఢిల్లీ పురమునకుఁ జేరి యాసమయంబున నక్కడ చక్రవతి౯ లేమింజేసి యాశాభంగ మొంది యాగ్రా నగరమున బేబరు వేయిం చిన గులాబిపూలతోటలో నతఁడు విహారమును జేయుచుండు నని నిశ్చయించి కాళ్ళీడ్చు కొనుచు నచ్చటికిఁబోయి యచ్చటను వానింగానక నిర్విణ్ణహృదయుఁ డై హుమాయూ నాసమయమున పితూరీల నడఁచుచు రాజద్రోహుల శిక్షించుచు బంగాళా దేశమం దున్నవాఁడని విని చిత్తూ రెక్కడ శత్రువుల పాలైపోవునో యను భయము తన కాళ్ళకింతిం తనరాని సత్తువ గలిగింప నెట్టకేల కచ్చటకుం బోయి హుమాయూనుని సందర్శించి యా దేవి యిచ్చిన పారితోషిక మతనికి సమర్పించెను. సమర్పించుటయు హుమాయూను మహానంద భరితుఁడై దానిం గ్రహించి యాతోరము ముంజేతికిఁ గట్టుకొని రాజపుత్ర స్త్రీరక్షణకుఁ దీక్ష వహించి "కర్ణావతి కేమి కావలయును. యేమడిగిన నది యిచ్చెద. చెప్పు” మని యడిగెను. "స్వామీ ! ఆమె కేమియు నక్కఱ లేదు. ఆమె మీతోబుట్టు వగుటచే చిన్నవాఁడగు మీ మేనల్లుని రక్షింపుఁడు. ఇదియే యామె కోరిక !" యని యాసేవకుఁడు ప్రత్యుత్తర మిచ్చెను ఆపలుకులు విని వల్లేయని హుమాయూను బంగాళమునం దింకను దాను చేయవలసిన పని యున్నను దానిని గట్టిపెట్టి విపత్సముద్రమునం దున్న స్త్రీని సముద్ధరించుట ప్రథమకత౯వ్యమని నిశ్చయించి మహా సేనాసమేతుఁడై రాజస్థానమునకుఁ బోవఁ బయన మయ్యేను.

అప్పటికీ బహదూరుషా యింకనుఁ జిత్తూరుకోటలోఁ బ్రవేశింపలేదు. హుమాయూ నించుక త్వరపడినపక్షమున పట్టణము పరులచేతం బడక యుండును. యెందుచేతనో పట్టణసమీపమునకు వచ్చియు బహదూరుషా పయిం బడక కాలహరణము చేసి యుదాసీనుఁ డయ్యెను. మహమ్మదీయ మతద్వేషులగు హిందువులను గెలుచుచున్న సాటితురక మీఁద గత్తికట్టి పోరుట తనవంటితురక కనుచితమనియు మత విరుద్ధ మనియుఁ దలంచి హుమాయూనుఁ డట్లు పేక్షించెనని కొందఱు చెప్పుదురు. రాజపుత్రులకుఁ బ్రత్యక్షముగ సహాయము సేయకున్నను ఢిల్లీ చక్రవతి౯ యిట్టియకార్యములు చేసినందుకు బహుదూరుషాను మిక్కిలి చీవాట్లు పెట్టి యధిక్షేపించెనందురు.

కోటలో నున్న రాజపుత్రులు లోపలి బలము క్రమక్రమముగ క్షీణమగుటయు పయిసహాయము రాకుండుటయుఁ జూచి చిత్తూరునకంత్య కాల మాసన్నమయిన దని గ్రహించి సర్వము సిద్ధము చేసికొనిరి. బాలుఁ డగు నుదయసింగును విశ్వాసముగల యొక సేవకున కప్పగించి పగతుర చేతఁ జిక్కకండ నావలకుఁ దాఁటించి తొల్లి లక్ష్మణసింగునకుఁ గలిగిన దేవతాసాక్షాత్కారమును జ్ఞప్తికిఁ దెచ్చుకొని తమకు రాజుండవలయునని రాజపుత్ర సేనాపతు లెవ్వని రాజుం జేయుద మని యోచింపుచుండ దేవలకోటనుండి వచ్చినసు రేశ మల్లుని కుమారుఁడు భాగ్జే యనునతఁడు ముందఱికి వచ్చి నేను చిత్తూరురాజులకు రక్తస్పర్శగల జ్ఞాతివర్గములోనివాఁడను. నేను నాయకుఁడనై మిమ్ము నడపెద, నన్ను రాజుం జేయుఁడని కోరగా నప్పుడు యథా విధిగా పట్టాభిషేకము చేయుటకు వీలులేక వారండఱు వానిని రాణాగా నేర్పఱచిరి. కోటగోడ లొక్కటొక్కటిగా నేలం గూలఁ జొచ్చెను. చిత్తూరు నలు మొగంబులును శత్రువులు చుట్టుముట్టిరి. ఒక్క గడియలో కఱకుతురకలు బెబ్బులులవలే వచ్చి కోటలోఁ బడుటకు సిద్ధముగ నుండిరి. అప్పుడు స్త్రీలు ప్రత్యేకముగా చితుల నేర్పఱచుకొని యందుఁ బడి చచ్చుటకు వీలు లేదు. అందుచే పుట్లకొలఁది యెండుపుల్ల లొక్కటే కాడుగా పరికించి దానిపై బారువుల కొలఁది తుపాకిమందు పోయించి రాణీ కర్ణానతి పదమూఁడు వేల రాజపుత్ర స్త్రీలతోఁ గూడి యాకాడుం బ్రవేశించి చిచ్చు పెట్టుకొని యగ్ని హోత్రున కేకాహుతి సమర్పించెను. మిగిలిన స్త్రీలు కొందఱు విసముదినియుఁ గొందఱు ఖడ్గములతోఁ బొడుచుకొనియు కర్ణావతి మార్గము ననుసరించిరి.

ఇట్లు నిశ్శేషషఃగ నంతఃపుర కాంత లందఱుఁ గులాచారమును నడపి గౌరవంబును నిలుపుకొన్న పిదప హతశేషు లగు రాజపుత్రవీరులు నిర్విచారముగ రక్తాంబరములు ధరించి యాయుధపాణు లై మృత్యు దేవతం దృణీకరించి కోటతలుపులం దీయించి ముట్టడివేయు మ్లేచ్ఛ సైన్యముపయిం బడిరి. ఆదినము ముప్పది రెండు వేల రాజపుత్రులు దేశాభిమానమునిమిత్తము ప్రాణములు విడిచిరి. రాజస్థానమునం దున్నశూరు లంద ఱానాఁడు పంచత్వము నొందిరి.

అనంతరము బహదూరుషా చచ్చినవారితోడను చచ్చుచున్న వారితోడను నిండియున్న చిత్తూరుకోటలో పదునైదుదినముల వఱకు కొలువుఁ దీర్చియుండెను. అట్లుండ హుమాయూను దండెత్తి వచ్చుచున్న వాఁడను వాత౯ విని దానికిం దగిన ప్రయత్నములఁ జేయ నారంభించెను. బహదూరుషాయొక్క సేనలో పోర్చుగీసువారు కొందఱుండి ఫిరంగులను మిక్కిలి నైపుణితోఁ బ్రయోగించి కోటలోఁ బరుచుకొనిరి. అందుచే నతనికి పోర్చుగీసు వారిమీఁదను వారి ఫిరంగుల మీఁదను గడువిశ్వాస ముదయింప నతఁడు వారెంత చెప్పిన నంత సేయుచుండెను, ఆపోర్చుగీసువారీ సహాయమున హుమాయూను రాక నడ్డగింపగల శిబిర మొక దానిని నిర్మించి దడులు గట్టించి కందకములఁ ద్రవ్వి యాశిబిరము దుర్భేద్యముగఁ జేసిరి. దాని బలముఁ జూచుకొని బహదూరుషా యింక తాను సురక్షితుఁడ ననుకొని నిర్భయముగ నందు గూర్చుండెను.

ఆవ్యూహము పన్నిన నేర్పరులు మిక్కిలి బుద్ధిమంతులే యగుదురు.కాని శత్రువులు లోపలికి వచ్చుట యెంత కష్టమో లోపలి వారు బై టికిఁ బోవుటయు నంతియే కష్టమనుమాట వారు మరచిరి. వ్యూహము పన్నినయతఁడు పరాజయము గలిగినప్పుడు సేన బారి పోవుటకుఁ దగినవీ లుండునట్లు పన్నవలయును. పోర్చుగీసువారు బహదూరుషా సేన కట్టివీలును కలుగఁ జేయరైరి. హుమాయూను సేనలు నాలుగు దెసలం జుట్టుముట్టి యెక్కడచూచిన దామెయై కనఁబడు చుండెను. తన సేనకు తిండి సరకు లంతకంతకు తరిగిపోవుటయు వానిని దెప్పించు కొనుటకు మరల వీలు లేక పోవుటయు సేన యావలకుం బారి పోవుటకు దుస్సాధ్య మగుటయు శత్రు సేనను జయించుట స్వప్న వార్త యగుటయు నెఱిఁగి బహదూరుషా తనయవస్థకుఁ దానే సిగ్గుపడి యైదుగురుబంట్లను సాయము దీసికొని మారు వేసము వేసికొని యర్ధ రాత్రమున నావలఁబడి ప్రాణములు దక్కించుకొని సేనకర్మము సేన దని యూరకోనెను. సేన మేలుకొని ప్రభువును గానక వానకుఁ గఱిగిపోయిన యుప్పులాగున నదృశ్య మయ్యెను. బహదూరుషా కష్టపడి జయించిన చిత్తూరుకోట హుమాయూనుని స్వాధీణ మయ్యెను.

బహదూరుషా తఱుమఁబడి యొక నెలవుననుండి యొక నెలవునకు బరువు లెత్తుచుఁ గొంత కాలమున కెచ్చటఁ గానఁబడఁడయ్యె. హుమా యూను సమయమునకు వచ్చి చిత్తూరునగరమును గాపాడ లేకపోయినను బహదూరుషా యొక్క మంత్రుల తెలివితక్కువ ప్రయత్నమువలన విశ్రాంతకీతి౯యు నగు పృథివిరాజునకొక కుమారుఁడు గలఁడు. వాని పేరు వనవీరుఁడు. హిందీ భాషలో వానిని బన్బీరు డందురు. అతనిని చిత్తూరు రాజ్యసంరక్షకునిగా నేర్పఱచు టుచిత మని వారు నిశ్చయించిరి. అతఁడు బలసంపన్నుఁడును సింహవిక్రముఁడు నగుపృథివి రాజునకుఁ గుమారుఁడు నగును గాని దాసిపుత్రుఁ డగుటచేత వానివి వారు రాణాగాఁ జేసికొనఁజాలక కొన్ని సంవత్సరములపాటు చిత్తూరు రాజ్యమున కతఁడు సంరక్షకుఁడు గా నుండి దానిని గ్రమస్థితిలోనికిఁ దెచ్చినపక్షమున నింతలో నుదయసింగు యుక్తవయస్కుడై పరి పాలనకుఁ దగినవాఁ డగునో కాఁడో తెలిసికొనుటకు వీలు గలుగునని నిశ్చయించిరి.

వనవీరుఁడు తోలుదొల్త సందేహించి సూర్యవంశ ప్రదీపకులు మహాసాహసులు నగు చిత్తూరు రాజులు పాలించిన రాజ్యమును తనవంటి హీనకులజుఁడు పాలింపఁదగదనియుఁ గావున తన కదిష్టము లేదనియు వారిం భ్రార్ధించెను. కాని రాజపుత్రవీరుల దఱు జిత్తూరురాజ్యము యొక్క దురవస్థను వర్ణించిచెప్ప రాజ్యలక్ష్మీ నట్టిదురవస్థనుండి తప్పింపఁగల సమర్ధు డతఁ డుతక్క వేరొకఁడు లేడని నొక్కి పలికి బ్రతిమాలుటచే వారిమాటం దోసిపుచ్చలేక యెట్ట కేల కతఁ డంగీకరించెను.

కార్యగతు లిట్లుండ విక్రమజిత్తుని సవతితమ్ముఁడగు నుదయసింగు పసిబాలుఁడగుటచే రాజపుత్ర ప్రభువులు చేయు కుట్రలెఱుఁగక యాఁకలి యగునప్పుడు భుజించుటయు వేడుక గలిగినప్పు డాడు కొనుటయు నిద్రవచ్చినప్పుడు పవ్వళించుటయు వ్యాపారములుగ నంతి పురమున బెఱుగు చుండెను. తల్లిదండ్రులు చిన్న తనమందే గతించుటచే పున్న యను నొకదాసి వానికిఁ దల్లియై పెనుచుచుండె అది

తల్లిగా తనయీడు వాఁడగు దాని కోడుకు తనకుం, జెలికాఁడుగా నుదయసింగు క్రమక్రమముగా నభివృద్ధి పొందుచుండె.

ఉదయసింగుని కథ.

107

ఒక నాఁడు సాయంకాల మెప్పటియ ట్లంతఃపుర సేవకుండగు మంగలిఁ డుదయసింగునకు నన్నముదెచ్చి పెట్టి యారగింపఁ జేసెను. రాజపుత్రగ్రహములలో మంగలివాండ్రు తక్కిన పతిలకుఁ దోడుగ వంటలుగూడ చేయుదురు. ఉదయసింగు భోజనము చేసియొక పాన్పుపై నిద్రపోయెను. వానిమంచముప్రక్కనే దాసీపుత్రుఁడును పండుకోని నిద్రించెను. పున్నయుఁ దన కన్న కుమారునికన్న నెక్కుడు ప్రేమం బెనుచుకోనుచున్న రాజకుమారుని గాపాడుకొనుచు నించుక మేలుకొని యుండె. అట్లుండ నాకస్మికముగ నంతఃపురములనుండి గోలయు రోద నము డనవచ్చె. పున్న తొందరపడి యది యేమో తెలిసికొనుటకు లేచి చెవియొగ్గి వినఁ జొచ్చెను. సాధారణముగ నంతఁపురములో దప్పు చేసిన బానిసలను శిక్షించునప్పుడును నందకత్తి యలగు సవతు లోండొరులతో కలహించునప్పుచును నాత౯ నాదములు వినఁబడుటకలదు కాని యానాటి ధ్వను లట్టివిగా నుండవయ్యె. శ్రడణదారుణమై గర్భ నిర్వేదకమైవినఁబడిన యారోదనము మరణసంబంధమైనదిగా గ్రహించి పున్న యేదో యపాయము వాటిల్లెనని తలంచి తాను తనజాగ్రత్త మీఁదనుండెను.

అంతలో వంటలవాఁడగు మంగలి పరుగుపరుగున వగర్పు కొనుచువచ్చి యాకళవళమునకుఁ గారణ మేనుని పున్న యడుగ నిట్లనియె. “నీ వెఱుగనేయెఱుఁగవా? ఈమూల నుండుటచే నీ కేదియు దెలియ లేదు గాబోలు ! మనదొరలందఱు విక్రమజిత్తును సింహాసనభష్ణుని జేసి వనవీరుని చిత్తూరునకు సంరక్షకుఁ డుగా నేర్పఱచిరి. ఆవన వీరుఁడు రాజ్యము స్వాధీనము చేసికొని విక్రమజిత్తును వధించినాఁడు. ఆ రాజు నిమిత్తము వాని భార్యలు చుట్టములు నేచ్చుచున్నారు.ఈరోదనమది."

ఆ పలుకులువిని పున్న నిశ్చేష్టయై యేమియుఁదోచక పండుఁ కొనియున్న రాజపుత్రుని జూచి తనలో "విక్రమజిత్తును జంపినవా విశ్రాంతకీతి౯యు నగుపృథివి రాజున కొక కుమారుఁడు గలఁడు. వాని పేరు వనవీరుఁడు. హిందీ భాషలో వానిని బన్బీరుఁ డందురు. అతనిని చిత్తూరు రాజ్యసంరక్షకునిగా నేర్పఱచు టుచిత మని వారు నిశ్చయించిరి. అతఁడు బలసంపన్నుఁడును సింహవిక్రముఁడు నగుపృథివి రాజునకుఁ గుమారుఁడు నగును గాని దాసిపుత్రుఁ డగుటచేత వానిని వారు రాణాగాఁ జేసికొనఁజాలక కొన్ని సంవత్సరములపాటు చిత్తూరు రాజ్యమున కతఁడు సంరక్షకుఁడు గా నుండి దానిని గ్రమస్థితిలోనికిఁ దెచ్చినపక్షమున నింతలో నుదయసింగు యుక్తవయస్కుడై పరిపాలనకుఁ దగినవాఁ డగునో కాఁడో తెలిసికొనుటకు వీలు గలుగునని నిశ్చయించిరి.

వనవీరుఁడు తొలుదొ ల్త సందేహించి సూర్యవంశ ప్రదీపకులు మహాసాహసులు నగు చిత్తూరు రాజులు పాలించిన రాజ్యమును తనవంటి హీనకులజుఁడు పాలింపఁదగదనియుఁ గావున తన కదిష్టము లేదనియు వారిం బ్రార్థించెను. "కాని రాజపుత్రవీరు లందఱుఁ జిత్తూరు రాజ్యము యొక్క దురవస్థను వర్ణించి చెప్ప రాజ్యలక్ష్మి నట్టిదురవస్థనుండి తప్పింపఁగల సమర్థు డతఁడు తక్క. వేరొకఁడు లేఁడని నొక్కి పలికి బ్రతిమాలుటచే వారిమాటం దోసిపుచ్చలేక యెట్టకేల కతఁ డంగీకరించెను.

కార్యగతు లిట్లుండ విక్రమజిత్తుని సవతితమ్ముఁడగు నుదయసింగు పసి బాలుఁడగుటచే రాజపుత్ర ప్రభువులు చేయు కుట్రలెఱుఁగక యాకలి యగునప్పుడు భుజించుటయు వేడుక గలిగినప్పు డాడు కొనుటయు నిద్రవచ్చినప్పుడు పవ్వళించుటయు వ్యాపారములుగ నంతి పురమున బెణుగు చుండెను. తల్లిదండ్రులు చిన్న తనమందే గతించుటచే పున్న యను నొకదాసి వానికిఁ దల్లియై పెనుచుచుండె అది తల్లిగా తన యీడువాడగు దాని కోడుకు తనకుం జెలి కాఁడుగా నుదయసింగు క్రమక్రమముగా నభివృద్ధి పొందుచుండె. ఒకనాఁడు సాయంకాల మెప్పటియ ట్లంతఃపుర సేవకుండగు మంగలిఁ డుదయ సింగునకు నన్నము దెచ్చి పెట్టి యారగింపఁ జేసెను. రాజపుత్రగ్రహములలో మం్వలివాండు తక్కిన పతిలకుఁ దోడుగ పంటలుగూడ చేయుదురు. ఇదయసితగు భోజనము చేసియొక పాన్పుపై నిదపోయెను. వానిమంచముప్రక్క- నే దాసీపుతు. తను పంచుకొని నిదించెను. పున్నయుఁ దన కన్న కుమారునికి న్న నెక్కుడు పేమం బెమచుకొనుచున్న రాజకుమారుని గౌపాడుకొనుచు మించుక మేలుకొని యుండె. అట్లుండ నాకస్మికముగ నంతఃపు 5 ములనుండి గోలయు రోద నము డనవ చ్చె. పున్న తొందర పడి యది యేమో తెలిసికొనుటకు లేచి చెవియొగ్గి వినఁ జొచ్చెను. సాధారణముగ నంతఃపురములో దప్పు చేసిన బానిసలను శిక్షించునప్పుడును సందకత్తి యలగు సవతు లో) డొరులతో కలహించునప్పుముసు నాతణ నాదములు వినఁబడుటకలదు కాని యానాటిధ్వను లట్టివిగా ను కవయ్యె. శ్రడం దారుణమై గర్భ ని ర్వేదళ మైవినఁబడిన యారోదనము మరణసంబంధ మైనదిగా గ్రహించి పున్న 'యేదో యజయము వాటి లైనని తలంచి తాను తనజాగ్రత్త మీదనుండెను. అంతలో వంటలవాఁడగు మంగలి పరుగుపరుగున వగర్చు కొనుచువచ్చి యాకళవళమునకుఁ గారణ 'మేనుని పున్న యుగ నిట్లనియె, నీ వేఱుగ సేయెఱుఁగవా? ఈమూల నుండుటచే నీ కేదియు దెలియ లేదు గాబోలు! మనదోరలుదఱు విక్రమజిత్తును సింహాసన భష్ణుని జేసి వనవీరుని చిత్తూరునకు సంరక్షకుఁ నుగా నేర్పఱచిరి. ఆవన వీరుఁడు రాజ్యము స్వాధీనము చేసికొని విక్రమజిత్తును వధించి నాఁడు. ఆ రాజు నిమిత్తము వానిభార్యలు చుట్టములు నేచ్చుచున్నారు ఈరోదనమది." ఆ పలుకులు విని పున్న నిశ్చేష్టయై యేమియుఁదోచక పుడుఁ కొనియున్న రాజపుత్రుని జూచి తనలో నిక మజిత్తును చంపిన నా