రాజస్థాన కథావళి/ఉదయసింగుని కథ
విశ్రాంతకీతి౯యు నగు పృథివిరాజునకొక కుమారుఁడు గలఁడు. వాని పేరు వనవీరుఁడు. హిందీ భాషలో వానిని బన్బీరు డందురు. అతనిని చిత్తూరు రాజ్యసంరక్షకునిగా నేర్పఱచు టుచిత మని వారు నిశ్చయించిరి. అతఁడు బలసంపన్నుఁడును సింహవిక్రముఁడు నగుపృథివి రాజునకుఁ గుమారుఁడు నగును గాని దాసిపుత్రుఁ డగుటచేత వానివి వారు రాణాగాఁ జేసికొనఁజాలక కొన్ని సంవత్సరములపాటు చిత్తూరు రాజ్యమున కతఁడు సంరక్షకుఁడు గా నుండి దానిని గ్రమస్థితిలోనికిఁ దెచ్చినపక్షమున నింతలో నుదయసింగు యుక్తవయస్కుడై పరి పాలనకుఁ దగినవాఁ డగునో కాఁడో తెలిసికొనుటకు వీలు గలుగునని నిశ్చయించిరి.
వనవీరుఁడు తోలుదొల్త సందేహించి సూర్యవంశ ప్రదీపకులు మహాసాహసులు నగు చిత్తూరు రాజులు పాలించిన రాజ్యమును తనవంటి హీనకులజుఁడు పాలింపఁదగదనియుఁ గావున తన కదిష్టము లేదనియు వారిం భ్రార్ధించెను. కాని రాజపుత్రవీరుల దఱు జిత్తూరురాజ్యము యొక్క దురవస్థను వర్ణించిచెప్ప రాజ్యలక్ష్మీ నట్టిదురవస్థనుండి తప్పింపఁగల సమర్ధు డతఁ డుతక్క వేరొకఁడు లేడని నొక్కి పలికి బ్రతిమాలుటచే వారిమాటం దోసిపుచ్చలేక యెట్ట కేల కతఁ డంగీకరించెను.
కార్యగతు లిట్లుండ విక్రమజిత్తుని సవతితమ్ముఁడగు నుదయసింగు పసిబాలుఁడగుటచే రాజపుత్ర ప్రభువులు చేయు కుట్రలెఱుఁగక యాఁకలి యగునప్పుడు భుజించుటయు వేడుక గలిగినప్పు డాడు కొనుటయు నిద్రవచ్చినప్పుడు పవ్వళించుటయు వ్యాపారములుగ నంతి పురమున బెఱుగు చుండెను. తల్లిదండ్రులు చిన్న తనమందే గతించుటచే పున్న యను నొకదాసి వానికిఁ దల్లియై పెనుచుచుండె అది
తల్లిగా తనయీడు వాఁడగు దాని కోడుకు తనకుం, జెలికాఁడుగా నుదయసింగు క్రమక్రమముగా నభివృద్ధి పొందుచుండె. ఉదయసింగుని కథ.
107
ఒక నాఁడు సాయంకాల మెప్పటియ ట్లంతఃపుర సేవకుండగు మంగలిఁ డుదయసింగునకు నన్నముదెచ్చి పెట్టి యారగింపఁ జేసెను. రాజపుత్రగ్రహములలో మంగలివాండ్రు తక్కిన పతిలకుఁ దోడుగ వంటలుగూడ చేయుదురు. ఉదయసింగు భోజనము చేసియొక పాన్పుపై నిద్రపోయెను. వానిమంచముప్రక్కనే దాసీపుత్రుఁడును పండుకోని నిద్రించెను. పున్నయుఁ దన కన్న కుమారునికన్న నెక్కుడు ప్రేమం బెనుచుకోనుచున్న రాజకుమారుని గాపాడుకొనుచు నించుక మేలుకొని యుండె. అట్లుండ నాకస్మికముగ నంతఃపురములనుండి గోలయు రోద నము డనవచ్చె. పున్న తొందరపడి యది యేమో తెలిసికొనుటకు లేచి చెవియొగ్గి వినఁ జొచ్చెను. సాధారణముగ నంతఁపురములో దప్పు చేసిన బానిసలను శిక్షించునప్పుడును నందకత్తి యలగు సవతు లోండొరులతో కలహించునప్పుచును నాత౯ నాదములు వినఁబడుటకలదు కాని యానాటి ధ్వను లట్టివిగా నుండవయ్యె. శ్రడణదారుణమై గర్భ నిర్వేదకమైవినఁబడిన యారోదనము మరణసంబంధమైనదిగా గ్రహించి పున్న యేదో యపాయము వాటిల్లెనని తలంచి తాను తనజాగ్రత్త మీఁదనుండెను.
అంతలో వంటలవాఁడగు మంగలి పరుగుపరుగున వగర్పు కొనుచువచ్చి యాకళవళమునకుఁ గారణ మేనుని పున్న యడుగ నిట్లనియె. “నీ వెఱుగనేయెఱుఁగవా? ఈమూల నుండుటచే నీ కేదియు దెలియ లేదు గాబోలు ! మనదొరలందఱు విక్రమజిత్తును సింహాసనభష్ణుని జేసి వనవీరుని చిత్తూరునకు సంరక్షకుఁ డుగా నేర్పఱచిరి. ఆవన వీరుఁడు రాజ్యము స్వాధీనము చేసికొని విక్రమజిత్తును వధించినాఁడు. ఆ రాజు నిమిత్తము వాని భార్యలు చుట్టములు నేచ్చుచున్నారు.ఈరోదనమది."
ఆ పలుకులువిని పున్న నిశ్చేష్టయై యేమియుఁదోచక పండుఁ కొనియున్న రాజపుత్రుని జూచి తనలో "విక్రమజిత్తును జంపినవా విశ్రాంతకీతి౯యు నగుపృథివి రాజున కొక కుమారుఁడు గలఁడు. వాని పేరు వనవీరుఁడు. హిందీ భాషలో వానిని బన్బీరుఁ డందురు. అతనిని చిత్తూరు రాజ్యసంరక్షకునిగా నేర్పఱచు టుచిత మని వారు నిశ్చయించిరి. అతఁడు బలసంపన్నుఁడును సింహవిక్రముఁడు నగుపృథివి రాజునకుఁ గుమారుఁడు నగును గాని దాసిపుత్రుఁ డగుటచేత వానిని వారు రాణాగాఁ జేసికొనఁజాలక కొన్ని సంవత్సరములపాటు చిత్తూరు రాజ్యమున కతఁడు సంరక్షకుఁడు గా నుండి దానిని గ్రమస్థితిలోనికిఁ దెచ్చినపక్షమున నింతలో నుదయసింగు యుక్తవయస్కుడై పరిపాలనకుఁ దగినవాఁ డగునో కాఁడో తెలిసికొనుటకు వీలు గలుగునని నిశ్చయించిరి.
వనవీరుఁడు తొలుదొ ల్త సందేహించి సూర్యవంశ ప్రదీపకులు మహాసాహసులు నగు చిత్తూరు రాజులు పాలించిన రాజ్యమును తనవంటి హీనకులజుఁడు పాలింపఁదగదనియుఁ గావున తన కదిష్టము లేదనియు వారిం బ్రార్థించెను. "కాని రాజపుత్రవీరు లందఱుఁ జిత్తూరు రాజ్యము యొక్క దురవస్థను వర్ణించి చెప్ప రాజ్యలక్ష్మి నట్టిదురవస్థనుండి తప్పింపఁగల సమర్థు డతఁడు తక్క. వేరొకఁడు లేఁడని నొక్కి పలికి బ్రతిమాలుటచే వారిమాటం దోసిపుచ్చలేక యెట్టకేల కతఁ డంగీకరించెను.
కార్యగతు లిట్లుండ విక్రమజిత్తుని సవతితమ్ముఁడగు నుదయసింగు పసి బాలుఁడగుటచే రాజపుత్ర ప్రభువులు చేయు కుట్రలెఱుఁగక యాకలి యగునప్పుడు భుజించుటయు వేడుక గలిగినప్పు డాడు కొనుటయు నిద్రవచ్చినప్పుడు పవ్వళించుటయు వ్యాపారములుగ నంతి పురమున బెణుగు చుండెను. తల్లిదండ్రులు చిన్న తనమందే గతించుటచే పున్న యను నొకదాసి వానికిఁ దల్లియై పెనుచుచుండె అది తల్లిగా తన యీడువాడగు దాని కోడుకు తనకుం జెలి కాఁడుగా నుదయసింగు క్రమక్రమముగా నభివృద్ధి పొందుచుండె. ఒకనాఁడు సాయంకాల మెప్పటియ ట్లంతఃపుర సేవకుండగు మంగలిఁ డుదయ సింగునకు నన్నము దెచ్చి పెట్టి యారగింపఁ జేసెను. రాజపుత్రగ్రహములలో మం్వలివాండు తక్కిన పతిలకుఁ దోడుగ పంటలుగూడ చేయుదురు. ఇదయసితగు భోజనము చేసియొక పాన్పుపై నిదపోయెను. వానిమంచముప్రక్క- నే దాసీపుతు. తను పంచుకొని నిదించెను. పున్నయుఁ దన కన్న కుమారునికి న్న నెక్కుడు పేమం బెమచుకొనుచున్న రాజకుమారుని గౌపాడుకొనుచు మించుక మేలుకొని యుండె. అట్లుండ నాకస్మికముగ నంతఃపు 5 ములనుండి గోలయు రోద నము డనవ చ్చె. పున్న తొందర పడి యది యేమో తెలిసికొనుటకు లేచి చెవియొగ్గి వినఁ జొచ్చెను. సాధారణముగ నంతఃపురములో దప్పు చేసిన బానిసలను శిక్షించునప్పుడును సందకత్తి యలగు సవతు లో) డొరులతో కలహించునప్పుముసు నాతణ నాదములు వినఁబడుటకలదు కాని యానాటిధ్వను లట్టివిగా ను కవయ్యె. శ్రడం దారుణమై గర్భ ని ర్వేదళ మైవినఁబడిన యారోదనము మరణసంబంధ మైనదిగా గ్రహించి పున్న 'యేదో యజయము వాటి లైనని తలంచి తాను తనజాగ్రత్త మీదనుండెను. అంతలో వంటలవాఁడగు మంగలి పరుగుపరుగున వగర్చు కొనుచువచ్చి యాకళవళమునకుఁ గారణ 'మేనుని పున్న యుగ నిట్లనియె, నీ వేఱుగ సేయెఱుఁగవా? ఈమూల నుండుటచే నీ కేదియు దెలియ లేదు గాబోలు! మనదోరలుదఱు విక్రమజిత్తును సింహాసన భష్ణుని జేసి వనవీరుని చిత్తూరునకు సంరక్షకుఁ నుగా నేర్పఱచిరి. ఆవన వీరుఁడు రాజ్యము స్వాధీనము చేసికొని విక్రమజిత్తును వధించి నాఁడు. ఆ రాజు నిమిత్తము వానిభార్యలు చుట్టములు నేచ్చుచున్నారు ఈరోదనమది." ఆ పలుకులు విని పున్న నిశ్చేష్టయై యేమియుఁదోచక పుడుఁ కొనియున్న రాజపుత్రుని జూచి తనలో నిక మజిత్తును చంపిన నా డుదయసింగును బ్రతుక నిచ్చునా? రాచపురుగేది మిగిలినను వనవీరునకు క్షేమకరము గాదుగదా" యనుకొని చప్పుచప్పున రాజపుత్రుని మేననున్న విలువగల బట్టలు నగలు నొలిచివైచి వానినొక పండ్ల గంపలో పండుకొనఁబెట్టి మీద కొన్ని యాకులను పండ్లను గప్పి యది యొరులకంటఁబడకుండ జాగరూకతతోఁ దీసికొనిపొమ్మని మంగలి వాని కప్పగించి "నీవీక్షణమే యిచ్చటినుండి పోయి నదిలో నిసుక తిప్పమీఁద నీగంప పెట్టుకొని కూర్చుండుము. నేనుం ద్వరలోవచ్చి మిమ్ముం గలిసికొనియెద" నని చెప్పి వానిని సాగఁదోలెను.
మఁగలి యాగంపెత్తుకొని కావలి వాండ్ర యెదుటనుండియే యనేక కవాటములు దాఁటిదాఁటి కోటవెలుపలికిం జనియెదు. రాజభటులు వానింజూచియు రాజులు తినఁగా మిగిలిన కూరలు నన్నము మంగలి తన యాలుబిడ్డల నిమిత్తము పట్టుకొనిపోవుట నిత్యము జరుగుచుండుటచే నాదినమును గూడ నట్లే మంగలి గొనిపోవుచుండఁ బోలునని గంప బరీక్షించి చూడకయే వానిని విడిచివచ్చిరి. పున్న యింకను గొంతపని చేయవలసినది, రాజపుత్రుని మీఁదనుండి తీసిన విలువబట్టలు తనకొడుకునకుఁ దోడుగవలసి యుండెను.
ఆబట్టలు నిద్రించియున్న తన కొడుకునకు విసవిసందొడిగి రాఁబోవు దురవస్థ కెదురుచూచుచు నామె గూర్చుండెను. అంతట యచిరకాలములోనే యామేకు మనుష్యుని యడుగుల చప్పుడు వినఁబడియె, వనవీరుఁడు తలుపులు దీసికొని ఖడ్గపాణియై యామె యెట్ట యెదుట నిలిచి "అమ్మీ ! నీయధీనమునందున్న రాజకుమారుఁ డేడీ ? ఉదయసింగును నాకుఁ జూపుమని గంభీర ధ్వనితోఁ బలికెను. కన్నకడుపగుటచే యాదాసిహృదయము నీరై పోయినందున నేమియుం బలుక జాలక యొక్క నిముస మూరకుండి పిమ్మట ధైర్యముఁ దెచ్చికొని యతఁడే రాజకుమారుఁ డని చేతితో నిదురించు చున్న తన కొడుకుం జూపెను. క్రూరకర్ముఁడగు వనవీరుఁడు ఖడ్గముతో వానితల రెండు ముక్కలుగ లరికెను. నిదురించుచున్న దాసిపుత్రుఁడు నిదురించుచుండగనే కన్నతల్లికన్నులు ముందట యొక్క కేక వేసి ప్రాణములు విడి చెను, వన వీరుఁడును రాజ్యము నిష్కంటకమైనదని నమ్మి తాను రాణా నైతినని సంతసించి సంతుష్టితో సంతఃపురము విడిచిపోయెను.
రాజకుమారుఁడు బ్రతికియుండిన పక్షమునఁ దనవంటి దీనుల ననేకుల నన్నవస్త్రములిచ్చి పోషింపఁగలడని యెంచి దాసియగు పున్న తనజుం జిత్తూరు రాజకుటుంబము వారు చేసిన మేలు మరువక కృతజ్ఞతగలిగి రాజపుత్రుని ప్రాణములు గాపాడుటకై తనకుమారుని ప్రాణముల నర్పించి యుత్తమచరిత్ర గలదై యెల్లర చేతం గొనియాడ బడుచున్నది. రాజకుమారునకు దహనక్రియలు వాని ఠీవికిదగినంత గొప్పగా జరుపఁ బడెను. అవి ముగియువఱకు పున్న కన్నీరు సంతత ధారగాఁ గారు నట్లేడ్చి యనంతరమున కొత్త రాణా వద్దకు దక్కిన రాజు బంధువుల వద్దను సెలవు గైకొని రాచనగరుఁ బాసి యావలకుం బోయెను. పోయి పురము వెలుపల నేటిలో నిసుక తిప్పమీద గంపతో దనరాక కెదురుచూచుచున్న మంగలిం గనుగొనియెను. నల్ల మందు పెద్దమోతాదు ప్రయోగించుట చేతనో మఱి యేకారణము చేతనో యుదయసింగు గంపలోనుండి యంతవఱకును మేలుకొనలేదు. మారుమూల త్రొవలంబడి నొరులకంటఁ బడకుండ నడచి యాపున్న మెల్ల మెల్లగ దేవలనగరము జేరెను. ఆనగరమును జిత్తూరు రాజ్యము నిమిత్తము తన ప్రాణములు విడిచిన బాగ్జీ యను శూరశిఖామణి కుమారుఁడు పాలించుచుండెను. ఆతనివలన రాజపుత్రునతు సంరక్షణము జరుగునని దాసి ఫుట్టెడాస పెట్టుకొని యరిగెను. ఆరాజును రాజకుమారుని దాసిని సత్కరించి యాదరించెను. కాని చండ శాసనుఁడు వనవీరునకు జడిసి తనతన రాజ్యమునందా రాజకుమారుని నిలిపిన పక్షమున దేవలకోట చిత్తూరునకు సమీపమున నుండుటచే నావాత౯ వేగుల వాండ్రవలనఁగాని మఱియొకరివలనఁగాని వనవీరునకుఁ దెలియకపో దనియుఁ దెలిసినచో నతఁడు తన కెగ్గు సేయుననియుఁ జెప్పి వారిం దన రాజ్యమున నుండనీయక వేఱోక తావునకుం బంచె దాదియు, మంగలియు మఱల గంప నెత్తుకొని పయనమై యిట్టటుఁ దిరిగి దంజరుపురమను గ్రామము చేరిరి.
ఆయూరి రాజు నుదయసింగునకు దగ్గరచుట్టమే కాని తాను బలవంతుఁడను కాననియు బాలకునకు శరణమిచ్చినట్లుఁ దెలిసినచో వనవీరుఁడు తన ప్రాణముల దక్కనీయఁడనియుఁ గావున దాను సహాయము చేయఁజాలననియుఁ జెప్పి యతఁడు వారి నక్కడ నిలువ నీయక పయనము చేసి వేరొక తావునకుఁ బంపెను.
ఇట్లిరువురు చేత నిరాకరింపఁబడియుఁ బున్న మనో ధైర్యము విడువదయ్యె. మున్ను పృథివిరాజు కొంతకాలము వసియించిన కమలమియరుకోటలో నాకాలమున జైనుమతస్థుఁ డగునొకవత౯కుఁడు కొంత సేనం గూర్చుకొని వాసము జేయుచుండెను శూరుల మని వీరుల మని చెప్పుకోనుచు సమయమగునపుడు రాజపుత్రునకు శరణ మొసంగలేని యాక్షత్రియుల నాశయించుటకన్న మతాంతరుఁ డగు నీకోమటి నాశ్రయించుటయే యుక్త మని తలంచి పున్న బాలుని, మంగలిని వెంటఁ బెట్టుకొని కమలమియరుకోటకుఁ బయన మయ్యె.
ఆపున్న తానింత రాజపుత్ర స్త్రీయైనను ఉక్కు సరములునిండు పౌరుషముఁ గలమగవానికన్న తా నెంత ధైర్యముగల దైనను నొరు లెఱుఁగకుండ నామహారణ్య మధ్యమున నాకొండలమీఁద కనుమలం గడచి శిఖరంబుల నెక్కి దిగి సెలయేళ్ళ దాఁటి ఘాతుక మృగంబుల బారినుండి తప్పి యెట్లు కమలమియరుకోటఁ జేరినదాయని యాచిక్కు మార్గముల నెఱిఁగిన వారంద రాశ్చర్యపడకపోరు. ఆమె యసహాయయై యావన మధ్యమునం బో పునప్పుడు ఘాతుక మృగంబుకన్న నెక్కుఁడు ఘాతుకు లగుభిల్లులు మొదలగు నడవి మనుష్యులు సహిత మామె కథను విని జాలిపడీ యామెకుం దోడు పడిరి. పూర్వకాలమున బప్పరావులకు భిల్లుఁ డొకఁడు మొగమున టీకా వేసి యనగా నెఱ్ఱని చిహ్నము వేసి నజాతికతఁడు రాజని చెప్పి వానికి లోఁబడియెను. అట్లే యాభిల్లులందఱు నుదయసింగు తనుకు రాజని యంగీకరించి వానికిం దోడ్పడుదు మని వాగ్దానము చేసిరి. కమలమియరుకోట లో జైనుమతస్థు: డగుకోమటి యసాసా యనునతఁ డొకనాఁడు తల్లియుం దానును కూరుచుండి మాటలాడుచుండఁగా తననిమిత్త మొక యాఁడుది వచ్చి వేచియున్న దని విని యామెను లోపలికి రమ్మని యానతిచ్చెను. అప్పుడు, మేలిముసుంగు వేసికొని యున్న యొక రాజపుత్ర స్త్రీ వానియెట్టయెదుట నిలిచెను, నావల్ల నీ కేమి కావలయు నని యసాసా యడుగ నామె తన పక్కనున్న రాజకుమారు నెత్తుకొని "యితఁడు నీరాజు ఈ బాలకుని రక్షింపుమని యాబిడ్డను వాని పాదములపైఁ బడ వైచెను. అసాసా కొన్ని ప్రశ్న లడిగి పున్నవలన బాలకునివృత్తాంత మంత యు నెఱిఁగి యేమి చేయుటకుఁ దోఁచక కళవళపడఁజొచ్చెను. స్వామిభ క్తినిబట్టి చూచినను మతమునుబట్టి చూచినను గౌరవమును జూచినను బాలకుని రక్షించితీరవలయు నని యతనికిఁ దోఁచెను. కాని దుర్జనుఁ డగు వనవీరునితోఁ గయ్యము నకుఁ గాలు డ్రవ్వుట కిష్టము లేదు. జైనుమతస్థునకు రాజపుత్రున కున్నంత సమరోత్సాహము లేదు. అదిగాక రాఁదలంచిన యవస్థ తనస్వ విషయము కాకపోవుటచే నసాసా యుద్ధమునకు మొదలే సమ్మతింపడయ్యె. అందుచేత నతఁడు సందేహించుచు దీర్ఘాలోచనము చేయుచు ననేక కష్టములు పడిపడి వచ్చినపున్న కేసి చూచుచు తనకు రాఁగల యిక్కట్టులనెల్లఁ జెప్పుచుఁ గాలయాపనము చేయుచుండ నంతలో నతనితల్లి కుమారుని పిలిచి నాయనా! యేల సందేహించి భయపడెదవు? స్వామిభ క్తిగలవారు కష్టముల గణియింపరుగదా. ఇతఁడు నీ రాజగు సంగునికుమారుఁడు. మనయదృష్టము బాగున్నచో మనకే జయము కలుగఁగూడదా' యని పలికి వాని కుత్సాహము గలిగించెను. అసాసాతల్లి పలుకులచే రోషముఁ దెచ్చుకొని వారి కభయ మిచ్చెను. కాని మహాసాసికురా లగునాస్త్రీ యింత కంటే నెక్కువ కష్ట మగుపని యొకటి చేయవలసియుండెను. ఉదయసింగు నాఁడు మొదలుకొని యసాసాయొక్క మేనల్లుఁ డని చెప్పుటకు వారు నిశ్చయించిరి. అసొసా కోమటి యగుట చేత నతనివద్ద రాజపుత్రస్త్రీ, పరిచారికగా నుండిన లోకు లనుమానింతురు. అది కారణ ముగా తన కొడుకునై నం జంపుకొని వానినే నమ్ముకొని యున్నయా దాదీ యాబిడ్డను విడిచి పోవలసివచ్చెను. బాలకుని విడువలేక విడువ లేక పున్న యెట్టెటో విడిచికన్నులు వాచిపోవున ట్లేడ్చి యెక్కడ నైనం బాలుఁడు బాగున్న చాలునని యధేచ్ఛం జనియెను.
ఆకొండలలో నుదయసింగు పెరుగు చుండ బందుగులందఱు నతఁడు వనవీరుని చేతిలో మృతినొందినాఁ డని యొక్క యేడు పేడ్చి యూరకోనిరి. వనవీరుఁడును రాజకుటుంబములో వారినందఱఁ గడతేర్చి తనపదవి దిట్టపరచుకొని తాసు దాసిపుత్రుఁడనుమాట మరచి రాజపుత్ర ప్రభువుల యనుగ్రహము చేతఁ దన కింత మహైశ్వర్యము పట్టిన దని తలంపక తా నాగర్భశ్రీమంతుఁడే యనుకొని గర్పించి తిరుగఁజొచ్చెను. అతని రాజ్యసంరక్షుకునిగా నేర్పఱచిన రాజపుత్ర ప్రభువు లందఱుఁ దమచేసిన లోపమునకు పశ్చాత్తాపము నొంది రాజపుత్ర వంశమెల్ల నిర్మూలిక పఁబడిన దనుకొని చేయునది లేక యెట్టెటో యేడుసంవత్సరములు వానిపాలనకు లోఁబడి యుండిరి.
అటులుండ నొకమా రొక పండుగకు కమలమియరుకోట కనేక బంధువులు వచ్చి యసాసా చేత సత్కరింపబడి విందులనారగించిరి. వచ్చిన రాజపుత్రుల కందఱకు లోపల మందిరమునను తన వర్ణమువా రగువత౯కులకు మఱియొక మందిరమునను నతఁడు' వడ్డనలఁ జేయించెను. భోజనముల వేళ నసాసా మేనల్లుఁడు రాజపుత్రుల బంతిలోనికి బోయి యచ్చట నొకకంచములో పెరుగన్నము తిన నారంభించెను. ఆ బాలుఁడు కోమటి యనుకొని వానిని పంక్తి బాహ్యుఁడుగా నెంచి యాపలకుఁ బొమ్మని రాజపుత్రులు కొందఱు బ్రతిమాలిరి. కొందఱు వేఁడుకొనిరి. కొందఱు బెదరించిరి. బాలుఁడు వేడికోలు వినిపించు కొనఁడయ్యె. బెదరింపులకు బెడరఁడయ్యె. అనాసా యాబండబాలు నేమియు సేయ లేక యూరకొనియె నని కొందఱు తలఁచిరి. అందులో నొక రిద్దఱు బుద్ధిమంతులు బాలుని యొద్ద కోమటిగుణము లేవియు లేకపోవుటచే నతనికి నసాసాకు నేమియు సంబంధము లేదని నిశ్చయించిరి.
అనంతరము కొంత కాలము జరుగ నొకనాడు కమలమియరు మార్గమున నొక రాజపుత్రుఁడు మార్గవశమునఁ బోవుచుఁ దనరాక నసాసాకు దెలియఁబరచెను. వానిని సగౌరవముగాఁ దోడి తెచ్చుట కసాసా తన మేనల్లుని పంపెను. రాజచిహ్నములు ధీరలక్షణములు గలయా బాలునిముఖ వైఖరిఁ జూచి యావచ్చినయతం డాశ్చర్యపడి యతఁ డసాసా కు చుట్టము గాడని నమ్మి వానివృత్తాంతము దెలుపుమని యసాసాను నొక్కి యడిగెను. అసాసాయుఁ దగినపని చేయవలసిన కాలము వచ్చిన దని గ్రహించి యాబాలుఁడు తన మేనల్లుఁడు కాఁ డనియు సంగుని మూడవ పుత్రుఁ డగునుదయసింగనియు జెప్పి నిజము నొప్పుకొనియెను. ఈవచ్చిన రాజపుత వీరుఁడు తొల్లి రాణా హమీరును వితంతువయిన తనకూఁతు నిచ్చి వివాహము చేసి వంచించిన మాల్ దేవుని వంశస్థుఁడు. సోనిగుఱ్ఱయను సంస్థానమునకు ప్రభువు.
ఈకొండగోటలో సంగునికుమారుఁ డగునుదయసింగు వసించుచున్న వాఁడన్న వాత౯లె దేశ మంతటకొలఁది కాలములో నలముకోనెను. ఆమాట నిజమో యబద్ధమో తెలిసికొని రాజపుత్రుని కన్నులార చూచుకొనుటకై మీవారునుండియుఁ దక్కిన సంస్థానములనుండియు రాజపుత ప్రభువులు విరామము లేక కమలమియకునకు రాదొడగిరి.ఇటు లుండ చందావతుకులస్థుఁ డగు రాజపుత్ర ప్రభువు వనవీరునివలన పరాభవము నొంది వానిని విడిచి కమలమియరుకోటకు వచ్చి రాజపుత్రుని కలిసికొనెను. వాని పరాభవ కారణ మిది. పూర్వమునుండి మీవారు రాణా రాజబంధువులను విందులకు పిలిచినప్పుడు తన కెవ్వరి మీఁద నత్యంత గౌరవము గలదో వానిని గౌరవించుటకు తనకంచము లోనుండి కొంచె మెంగిలియన్నము వానికిఁ బంపుట యచారమయి యుండెను. ఈయచారము రాణా సరిగా నడుపనప్పుడు రాజపుత్ర వీరు లనేక పర్యాయములు రాణాపైఁ గోపించుచు వచ్చిరి.
ఒకమా రొక రాజపుత్ర వీరుఁడు తనకు రాణా పంపవలసిన యన్నము మఱియొకనికి పంపుటచే గోపించి విందారగింపకయే లేచి పోయెను, వనవీరుఁడు తనస్థితిని మఱచి తాను నిజముగా రాణాయే యనుకొని యాయాచారమును సడుపజూచి తన యెంగిలి యన్నము మివారు ప్రభువులగు కొందఱికి పంపఁగా వారాయుచ్ఛిష్టమును గుడువక యూరకొనిరి. అభిమాన ధనుఁడగు చందావతు వంశజుని గారవించుటకు మఱియొక మా రెంగిలి యన్నమును పంప కొపోద్దీపితుఁడై యాకంచముపొత్తును నిరాకరించి మీరు మిక్కిలి యిట్లని వానికి వత౯మాన మంపెను. "బప్పరావుల వంశస్థుని యుచ్ఛిష్టము దినుటయే మాకు గౌరవము కాని దాసీపుత్రుని యెంగిలి కూడు తినుట మాకు గౌరవముకా” దని చందావతువంశస్థుఁడు చివాలున లేచి తనియూరికిఁబోయి వనవీరునకు లోఁబడక వానిని రాజ్యభ్రష్టుని జేయుటకై యోచించుచు సంగునికుమారుఁడు కమలమియరుకోటలో నున్న వాడని విని మహానందభరితుఁడై యచటికిఁ జనియె. ఆమహావీరునితోఁగూడ ననేక రాజపుత్రు లాకోటకుంజని కొలువుదీర్చి కత౯వ్యము విచారింపఁ దొడంగిరి. అప్పుడు పున్న వెనుకటి మంగలిం దోడ్కొనివచ్చి యాకొలువుకూటమున నిల్చి రాజపుత్రుని పూర్వవృత్తాంత మంతయు వానికిం బూసగుచ్చినట్లు చెప్పి వనవీరుఁడు విక్రమజిత్తును వధించిన నాటిరాత్రి చంపఁబడిన బాలుడు తనకుమారుఁడుగాని రాజపుత్రుండు కాడనియుఁ గడుపుదీపియైనను మానుకొని తాను రాజపుత్రుని రక్షించితిననియు నతఁడు సంగుని కుమారుఁడగు నుదయసింగనియు గోమటి మేనల్లుఁడు కాడనియుఁ బ్రమాణము చేసి వానికి నమ్మకము పుట్టునట్లు పలికెను. అక్కడకు వచ్చిన రాజపుత్ర ప్రభువులలో నప్పుడు చోహణవంశస్థుఁడగు వీరుడుండెను. అతఁడు చిత్తూరురాణాలకు దగ్గర చుట్టము కులవృద్ధు. అపాసా యాసభ వారి యెదుటకువచ్చి యాబాలుఁడు తన మేనల్లుఁడు కాఁడని చెప్పి వానిని చోహణవంశస్థుడగు రాజపుత్రులకుఁ జేతిలోఁ జేయివేసి యప్పగించి తనభారము తొలఁగినదని సంతసించెను.
అప్పుడా వ్రుద్ధ రాజు బాలుని గౌఁగిలించుకొని యతఁడు తన యేలినవాఁడని వానితోఁగలిసి వానియెంగిలియన్నము భుజించెను. అప్పు డుదయసింగు మొగమున లత్తుకటీకా యనఁగా రాజచిహ్న ముంచఁబడెను. వెంటనే యచట జేరిన రాజపుత ప్రభువులందఱు నతఁడు తమ రాజని వాని పాదములకు సాగిలఁబడి మొక్కిరి.
ఉదయసింగునకు సహాయముచేయ మిత్రులు వందలకొలఁది వచ్చి వానికిఁ గావలసిన సాధన సామగ్రులన్నియు సమర్పించిరి. అట్లు వచ్చిన వారిలో మొట్ట మొదటివాడు ముందుగా నీ బాలుని వృత్తాంతము బయలు పెట్టిన సోనిగుఱ్ఱ సంస్థాన ప్రభువు. అతఁడు రాణాతోఁ గలయు టయే గాక తనకూఁతును వానికిచ్చి వివాహము చేయఁదలఁచెను. శోని గుఱ్ఱప్రభువువంటి బలవంతునితో సంబంధ బాధవ్యము లుండుట మంచిదని యుదయసింగుయొక్క ముఖ్య బంధువులు దానికంగీకరించిరి కాని యీసోనిగుఱ్ఱ ప్రభువు యొక్క వృద్ధ ప్రపితామహుఁడగు మాలదేవుఁడు తన వితంతుపుత్రికను రాణాహమీరునకు మోసమున వివాహము చేసినప్పుడు హమీరు మహాకోపోద్దీపితుఁడై తన సంతతివా రెవ్వరు మాల దేవుని సంతతివారితో వియ్యమందఁ గూడదని శాశించెను. ఆమాట కొందఱు రాజపుత్ర వృద్ధులు జ్ఞప్తికిఁ దెచ్చుకొని యువ యసింగు సోనిగుఱ్ఱప్రభువు కూఁతును బెండ్లి యాడఁగూడదని పట్టు పట్టిరి. అయిన నుదయసింగుని బంధుమిత్రులు కలిసి యోచించి సోనిగుఱ్ఱ ప్రభువుతో వియ్య మొందుట వలన గలిగెడు ననేక లాభముల నుగ్గడించి హమారుని శాసనము రెండువందల యేండ్ల నాఁటి దనియు దేశ కాల పాత్రములను బట్టి తామది మార్చుకొన వచ్చుననియు నప్పటి స్థితిని జూచిన పక్షమున రాణాహమీరే తన ప్రతిన మార్చుకొను ననియు నొక్కి చెప్పి యాపట్టు పట్టిన వారి నొడంబరచి వివాహము చేసిరి.
ఉదయసింగున కన్నియు శుభసూచకము లే యయ్యెను. ఆదినములలోనే వనవీరుఁడు తనకూఁతునకు వివాహము చేసి యామెకు నైదువందల గుఱ్ఱములను బది వేల యెద్దులపై వేసి యమూల్య వస్తువులను సారె పంపెను. ఉదయసింగుని మిత్రులు కొందఱాసారె నడ్డముగొట్టి యాసరకులను దోఁచుకొని ఉదయసింగు వివాహము నిమిత్త ముపయోగించిరి. ఇరువురుతప్ప పేరుప్రతిష్ఠలుగల రాజపుత్రులందఱు వివాహమునకు వచ్చిరి. వివాహ మహోత్సవములు మహావైభవముతో జరిగినపిదపఁ బెండ్లికి రాని యాయిరువురు దొరలకు బుద్ధి చెప్పుటకై తక్కినరాజపుత్రులు వారిపై దండు వెడలిరి. ఆయిరువురిలో నొకఁడు రణరంగముస వధియింపఁబడెను. రెండవవాఁడు తెలివిగలిగి యుదయసింగునకు లోఁబడియె. వరవీరుఁడు ఇరువురు రాజపుత్రులకు సహాయము చేయఁదలఁచి తన సేనలం గూర్చు కొనిపోయెను. కాని మంచిసమయమున వాని సైనికులే వాని విడిచి పగవారితో గలిసినందున నతఁడు నిర్విణ్ణుఁడై పారిపోయి చిత్తూరు కోటలో దాఁగెను.
రాజపుత్రు లెన్ని ఫిరంగులు తెచ్చి యెన్ని యేండ్లు కోటముట్టడించినను వనవీరుఁడు నిశ్చయముగాఁ గోటలో సురక్షితుఁడై యుండ వచ్చును. కాని వనవీరుని మంత్రి పైకి తనస్వామి కిష్టముగనున్నను లోలోపల నుదయసింగునకే కడుగూర్చును. ఒకమారు చిత్తూరుకోటలోనున్న వనవీరుని సైనికులకు భోపనసామగ్రులు కావలసియుండినందున వేయిబండ్ల మీఁద సరకులు వచ్చుచున్న వని మంత్రి వనవీరునితోఁ జెప్పి తలుపులు పూతి౯గా దీయించెను. వేయిబండ్లును గోటలోఁ బ్రవేశించిన పిదప బండ్లలోనుండి సరకులకుమారు వేయిమంది రాజపుత్రవీరులు వడివడి దిగి కావలివాండ్ర నందఱఁ దెగటార్చిరి.
ఉదయసింగు విజయుఁ డై భేరీ భాంకరణములతో గోటలోఁ బ్రవేశించెను. వనవీరుఁడు వెనుక విక్రమజిత్తును నుదయసింగును జేసినట్లు వాని నప్పుడు రాజపుత్రప్రభువులు చేసినచో బాగుండును. కాని తామే వానిఁ జిత్తూరు సంరక్షుకునిఁగా నేర్పఱచినందున తామే వానిం జంపుట యనుచితమని కరుణించి వానిం గడతేర్పక సకుటుంబ సపరివారముగ కోటవిడిచి యావలకుం బొమ్మని వానిని విడిచిరి. వనవీరుఁడును రాజ్యభ్రష్టుడై బంధువిరోధియై నిర్భాగ్యుఁడై యసహాయుఁడై తనవస్తువులను దాను తీసికొని కోటవిడిచి దక్షిణ హిందూస్థానమునకుం బోయి యచ్చట నొక చిన్న సంస్థానమున కధిపతియై కాలము సుఖముగఁ గడపెను. ఉదయసింగు చిత్తూరు రాణా యయ్యెను. పున్న యనఁగా హిందీ భాషలో వజ్ర మని యర్ధము. ఆశబ్దమునకు నిజముగా పున్న దగినది యగుటచే నామెకీతి౯ యాచంద్రార్కము లోకమున నిలుచుఁగాక!
చిత్తూరు మూడవముట్టడి.
చిత్తూరు దేశములోని సమస్తజనులకు గన్నులు చల్లఁబడున ట్లుదయసింగు రాజ్యపాలన మారంభించెను. అతఁడు చిత్తూరునకు