యోగాసనములు/షట్క్రియలు లేక షట్కర్మలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

షట్క్రియలు లేక షట్కర్మలు

శరీరము ఆరోగ్యముగా లున్నపుడు శరీరమందలి వాత, పిత్త, శ్లేష్యములు సరిగా వుండి త్రిగుణములు వర్థిల్లును. అవి భేదించి ఉండవలసిన దాని కంటె ఎక్కువ తక్కువలుగా ఉన్నప్పుడు త్రిదోషములుగా పరిగణించ బడెను. ఆ దోషములు శస్రీరమునకు రోగ దాయక మగును. శరీరమున వాతము, కఫము, క్రొవ్వు ఎక్కువగా లున్న వారు వాని నివారణము కొరకు శరీరమును శుద్ధి చేయుట అవసరము. దీని నివారణము కొరకు వైద్యము చేయించు కొనవలయును. వైద్యుని పై అధార పడనవసరము లేకుండ సూక్ష్మ దేహమును శుద్ధి చేయుటకకు ప్రాణాయామమును. స్థూల దేహమును శుద్ధి చేయుటకు షట్కర్మలును అనుసరించ వలయును. 1)ద్రౌతి, 2)భస్తి, 3)నేతి, 4)త్రాటకము,,5) నౌళి, 6.)కపాలభాతి అను ఆరును ఈ షట్కర్మలు. దౌతి వలన అహారము అన్నకోశమును భస్తి క్రియ వలన మలాశయమును, నేతి వలన ముక్కును, త్రాటకము వలన కండ్లు, నౌళి వలన ప్రేవులును, కపాల భాతి వలన శిరస్సు నందలి అన్ని భాగములు శుభ్రమందును.

ఈ షట్కర్మలను నిత్యము చేయ రాదు. అవసరమును బట్టి మాత్రమే చేసిన ప్రయోజన ముండును.

షట్కర్మలను చేయు విధానము

ధౌతి

నాలుగు అంగుళముల వెడల్పు పదునైదు మూరల పొడవును వున్న పలుచని వస్త్రమును ప్రక్కల యందు దారములు పైకి రానీయ కుండ అంచులు ఏర్పాటు చేసుకొని దానిని వేడి నీళ్ళతో తడిపి ఒక కొనను తీసుకొని నెమ్మది నెమ్మదిగా కడుపులోనికి నోటి ద్వారా మ్రింగుము. మొదటి రోజున ఒక మూరెడు సుమారుగా మాత్రము మింగి నెమ్మదిగా పైకి తీయ వలయును. దీనిని మ్రింగుటకు ఉపక్రమించు నపుడు కడుపు ఖాళీగా వుండ వలయును. మెదటలో ప్రయత్నము చేయు నపుడు కడుపు లోనికి పోక వాంతి వచ్చు నట్లుండును. రెండవ దినమున సుమారు రెండు మూడు మూరల వస్త్రమును మింగి నెమ్మదిగ పైకి తీయ వలయును. అటులనే క్రమముగా వృద్ధి చేయుచు పది లేక పధి హేను దినములలో వస్త్ర మంతయు మింగి నెమ్మదిగా పైకి తీయ వలయును. వస్త్రమును పూర్తిగా మింగిన తరువాత నౌళి క్రియను చేసి కొంచెము వుంచి నెమ్మది నెమ్మదిగా పైకి తీయ వలెను. అది అన్నాశయము ప్రవేశింపగనే అందు నిల్వ యుండిన పైత్యము, శ్లేషము అంటుకొని వచ్చును. ఆ వస్త్రమును కడిగి వేడి నీళ్ళ యందు ఉడికించి నీళ్ళను పిండి ఆర బెట్టి మరియొక సారి చేయుటకు సిద్దము చేసి వుంచు కొనవలయును.

ధౌతి కర్మ వలన శ్వాస కోసలు, కఫ రోగములు, ప్లీహ వ్యాధులు కుష్టములు నివారించ బడును.

భస్తి కర్మ

ఆరు అంగుళముల పొడవు ముప్పాతిక అంగుళము లావు రంద్రము గల గొట్టమును తీసుకొన వలయును. ఈ గొట్టము బొప్పాయి గొట్టముగాని ప్లాస్టికు గొత్తము గాని అల్యూమినియం గొట్టము గాని వాడుట మంచిది. ఆ గొట్టమునకు ఒక కొనను ఆముదమును గాని గ్లిసరీనును గాని పూయవలయును. బొడ్డు లోతు ప్రవహించు చున్న నీటి యందు ప్రవేశించ వలయును. లేదా స్నానపు తొట్టిలో వెచ్చటి నీటి యందు ప్రవేశించ వలయును. ఆ నాళమును 4 అంగుళములు గుద ద్వారము గుండ లోనికి ప్రవేశ పెట్ట వలయును. ఉత్కటాసనమున వుండి నీటిని పైకి లాగ వలయును. జలము మలాశయమున ప్రవేశించును. తరువాత నాళమును వెలికి తీసి నౌళి కర్మను చేసి ఆ జలమును విసర్జించ వలయును. జలమును ఆకర్షించుటకు ఉడ్డియానమును నాళము లేసిన, వెనుక మూల బంధమును చేసిన సులువుగా వుండును (ఉడ్డి యాన, మూల బంధములను ముందు చెప్పబోవు చున్నాను.

భస్తికర్మ వలన మలాశయము శుద్ధి యగును. మరియు వాత, పిత్త దోషములు, ప్లీహ, గుల్మ వ్వాధులు నివారించ బడును.)

నేతి కర్మ

మూరెడు పొడవు కొంచెము లావైన నూలు దారమును తీసుకొని వేడి నీటి యందు శుభ్రపరచి ఒక ముక్కు రంధ్రమును మూసి మరియొక ముక్కు రంధ్రములో దారమును ప్రవేశ పెట్టి పైకి శ్వాసను గట్టిగా పీల్చ వలయును. ఇట్లు నాలుగు సార్లు చేయ

భస్తి కర్మ.

ఆరు అంగుళముల పొడవు ముప్పాతిక అంఘుళము లావు రంధ్రము గల గొట్టమును తీసుకొన వలయును. ఈ గొట్టము బొప్పాయి గొట్టము గాని ప్లాస్టికు గొట్తము గాని అల్యూమినియం గొట్టము గాని వాడుట మంచిది. అ గొట్టమునకు ఒక కొనను ఆముదమును గాని గ్లిసరీను గాని పూయ వలయును. బొడ్డు లోతు ప్రవహిస్తున్న నీటి యందు ప్రవేశించ వలయును. లేదా స్నానపు తొట్టిలో వెచ్చటి నీటి యందు ప్రవేశించ వలయును. ఆ నాళమును 4 అంగుళములు గుద ద్వారము గుండ లోనికి ప్రవేశ పెట్టవలయును. ఉత్కటాసనమున వుండి నీటిని పైకి లాగవలయును. జలము మలాశయమున ప్రవేశించును. తరువాత నళమును వెలికి తీసి మౌళి కర్మ చేసి ఆ జలమును విసర్జించ వలయును. జలమును ఆకర్షించుటకు ఉడ్డియానమును నాళము లేసిన, వెనుక మూల బంధమును చేసిన సులువుగా వుండును. (ఉడ్డియాన, మూల బంధములను ముందు చెప్ప బోవు చున్నాను.

భస్తి కర్మ వలన మలాశయము శుద్ధియగును. మరియు వాత, పిత్త దోషములు, ప్లీహ గుల్మ వ్యాధులు నిరారించ బడును.

నేతి కర్మ
...

మూరెడు పొడవు కొంచెము లావైన నూలు దారమును తీసుకొని వేడి నీటియందు శుబ్రపరచి ఒక ముక్కు రంధ్రమును మూసి మరియొక ముక్కు రంధ్రములో దారమును ప్రవేశ పెట్టి పైకి శ్వాసను గట్టిగా పీల్చ వలయును. ఇట్లు 4 సారులు చేయ ఇట్లు నాసిగాగ్రమున చేయుట వలన మానసిక శక్తులు వృద్ధి యగును. కూర్మ వాయువు జయింప బడును. తంద్రిత్ నిద్రమత్తు) తొలగి పోవును. నేత్ర వ్యాధులు తొలగి దృష్టి బాగుగా వుండును. దృష్టిని నాసికాగ్రముననే గాక శరీరము నందలి చక్రములలో ఎదో ఒక దానిపై కేంద్రీకరించ వచ్చును. ఇది ప్రతీ దినము చేయవచ్చును.

నౌళి కర్మ.

నిలబడి ముందుకు వంగి ఉడ్డి యానము అనగా ఉదరమూ లోనికి లాగి చేతులను తొడలమీద ఆనించి కడుపును ముందుకు జొనిపిన గొట్టము వలే ఏర్పడూ. అపుడు కడుపును కుడి ఎడమలకు త్రిప్ప వలయును. ఇది కొంచెము కష్టమయినను అభ్యాసము చేత బాగుగా చేయ వచ్చును.

నౌళి కర్మ వలన జఠరాగ్ని ప్రజ్వరిల్లి జీర్ణ క్రియను క్రమముగా వుండు నట్లు చేయును. మలబద్దమును నివారించును వాత, పిద్ద, శ్లేష్మ రోగములు నశించును. నౌశికర్మను పద్మాసనమున గాని, సిద్ధ, వజ్రాసనములలో ఎదో ఒక ఆసనమున కూర్చుండి చేయ వచ్చును.

కపాల భాతి.

స్థిరముగా ఒక ఆసనమున కూర్చొని బలముగాను, పొడవుగాను ముక్కు రెండు రంధ్రముల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయుటయే కపాల భాతి. శక్తి వున్నంత వరకు పొడవుగాను బలము గాను ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయ వలయును.

దీని వలన శ్వాస కోశములు బలమగును. భుజములకు పైగా వున్న అవయవములు అనగా మెడ, చెవులు, కండ్లు, మస్తిష్కము, స్థూల నాడీ మండలము బలమును పుంజు కొనును.

ఈ షట్కర్మల చేత శరీరమును శుభ్రపరచు కొనుచూ సాధన చేసిన యోగము సులభముగా సాధించ వచ్చును.

ప్రాణాయామము అభ్యసించు నపుడు అవసరమగు త్రి బంధములను గూర్చితెలిసి కొందము. త్రి బంధములనగా మూల బంధము, ఉడ్వాన బంధము జాలంధర బందము అనునవి. ఈ త్రి బంధములను ప్రాణమును శరీరములో కుంభించు నపుడు అది వెలికి పోకుండా అపాయము లేకుండగను సుఖముగను నిరోధించుటకు ఉపయోగ మైనవి. ఈ మూడు బంధములతో వాయువును కుంభించి అప్పుడు ప్రాణము అపానముతో సంయోగము పొంది సుషుమ్న యందు ప్రవేశించుటకు ఉపయోగ పడును.

జలంధర బంధము

గడ్డమును ఉరము యొక్క (రొమ్ము) ఉపరి భాగమున చేర్చి, గట్టిగా అదిమి పట్టుటను జలంధర బంధమని చెప్పబడినది. ప్రాణాయామము సాధనచేయు నపుడు శరీర మందున్న ప్రాణ వాయువును అధో భాగమునకు తిరోగమింప చేయును. మరియు కుంభక సమయమున కంఠమునకు పైనున్న శిరో భాగములకు అనగా మెదడు నందలి నాడీ జాలమునకు ఎంత మాత్రము ఒత్తిడి కలుగ కుండ నిరోధించును. దీని వలన ప్రాణాయామము చాల సుఖముగా సాగును.


నాలుకను దంత మూలములందు గట్టిగా అదిమి పట్టిన జిహ్వ బంధమనిరి.

ఉడ్వాన బంధము

నాభికి చుట్టును వున్నఉదర భాగమును, వెన్నునకు అంటు నట్లు మీదికిని వెనుకకును లాగి వుంచునది ఉడ్డియాన బంధము. ఉడ్డి యాన మనగా పక్షి వలె ఎగురుట. గర్భ కోశమున బంధింపబడిన ప్రాణము సుషుమ్న నాడీ మార్గమున ఎగురునట్లు చేయునది. కావున ఉడ్డీ యానమనిరి. ప్రాణము ప్రాణము సుషుమ్నలో ప్రవేశించి సంచరించుటవలన యోగము యొక్క ఫలము అయిన సమాధిని త్వరిత గతిని పొంద వచ్చును. అందు చేత యోగులు దీనిని చాల ముఖ్యమైన దానినిగ పరిగణించిరి.

మూల బంధము

నాభికి చుట్టును వున్న ఉదర భాగమూ, వెన్నునకు అంటు నట్లు మీదికిని వెనుకకును లాగి వుంచునది ఉడ్డియానబంధము. ఉడ్డి యాన మనగా పక్షివలె ఎగురుట. గర్భ కోశమున బంధింపబడిన ప్రాణము సుషుమ్న నాడీ మార్గమున ఎగురునట్లు చేయునది. కావున ఉడ్డీ యానమనిరి. ప్రాణము సుషుమ్నలో ప్రవేశించి సంచరించుట వలన యోగము యొక్క ఫహలము అయిన సమాధిని త్వరిత గతిని పొంద వచ్చును. అందు చేత యోగులు దీనిని చాల ముఖ్యమైన దానినిగ పరిగణించిరి.

మూలబంధము

క్రిందికి పోవుటయే అపాన వాయువునకు ముఖ్య లక్షణము. బొడ్డు నుండి క్రింద నున్న వాయువును అపాన మందురు. మూలాధారమున (గుదము) గట్టిగా పీడించి సంకుచపరచి పైకి లాగి కొనిన, క్రిందికి పోవు చున్న ఆపాన వాయువు యొక్క గమనము నిరోధించ బడి ఊర్ద్వ గతి చెందును. అపుడు ఊర్ద్వమందున్న ప్రాణ వాయువుతో సంయోగమును పొందును. ప్రాణ ఆపాన వాయువుల సంయోగమే యోగమని చెప్పబడినది. ఇట్లు ప్రాణాపానములు సంయోగము పొందినపుడు శరీరములో యోగాగ్ని ప్రజ్వరిల్లి యోగ నాడి మండలమున వున్న మలములు శోషక, దాహక క్రియల చేత (అనగా కాల్చి వేయుట, ఆర బెట్టుట) శుద్ధి పొందును. సూక్ష్మ నాడి మండ


లము శుద్ధి పొందిన యడల స్థూల నాడులు అనుబంధము వలన శుద్ధి పొంది దేహము లాగవమగును, తేజో వంతమగను ఉండును. శరీరమున వున్న రోగ పదార్థములు నాశన మగును.

కనుక ఈ మూడు బంధములు బాగుగా అభ్యసించుట అలవరచుకొన వలయును.


ముద్రలు

ప్రాణాయామాభ్యాసమునకు త్రిబంధములతో పాటు ముద్రలను కూడ అభ్యసించుట అవసరము. ముద్రలు పది. 1. మహాముద్ర, 2. మహాబంధ, 3. మహావేధ, 4. భేచరి, 5. ఉడ్యాన, 6. మూలబంధ, 7. జలాంధరబంధ, 8. విపరీత కరణి ముద్ర, 9. వజ్రోలి, 10. శక్తి చాలన ముద్ర అను నవి పది ముఖ్యంగా చెప్పబడినవి. ఇందులోని జాలంధర బంధ, ఉడ్యాఅ బంధ, మూల బంధములు త్రిబంధములుగా పైన వివరఈచ బడినవి. మిగిలిన ఏడింటి గూర్చి తెలిసి కొనెదము.

1. మహా ముద్ర

రెండు కాళ్ళను ముందుకు చాచి కూర్చొనుము. కుడికాలి మడమను యోని ప్రదేశమున హత్తించి పాదమును తొడకు తాకునట్లు వుంచుము. రెండు చేతులు వ్రేళ్ళను ఒకదాని యందు మరొకటి గొలుసు వేసి రెండు చేతులను పైకెత్తి కుడి నాడి చేత శ్వాసను పీల్చి కుంభించి జాలంధరబంధ, మూల బంధ, ఉడ్యాన