యోగాసనములు/ముద్రలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


లము శుద్ధి పొందిన యడల స్థూల నాడులు అనుబంధము వలన శుద్ధి పొంది దేహము లాగవమగును, తేజో వంతమగను ఉండును. శరీరమున వున్న రోగ పదార్థములు నాశన మగును.

కనుక ఈ మూడు బంధములు బాగుగా అభ్యసించుట అలవరచుకొన వలయును.


ముద్రలు

ప్రాణాయామాభ్యాసమునకు త్రిబంధములతో పాటు ముద్రలను కూడ అభ్యసించుట అవసరము. ముద్రలు పది. 1. మహాముద్ర, 2. మహాబంధ, 3. మహావేధ, 4. భేచరి, 5. ఉడ్యాన, 6. మూలబంధ, 7. జలాంధరబంధ, 8. విపరీత కరణి ముద్ర, 9. వజ్రోలి, 10. శక్తి చాలన ముద్ర అను నవి పది ముఖ్యంగా చెప్పబడినవి. ఇందులోని జాలంధర బంధ, ఉడ్యాఅ బంధ, మూల బంధములు త్రిబంధములుగా పైన వివరఈచ బడినవి. మిగిలిన ఏడింటి గూర్చి తెలిసి కొనెదము.

1. మహా ముద్ర

రెండు కాళ్ళను ముందుకు చాచి కూర్చొనుము. కుడికాలి మడమను యోని ప్రదేశమున హత్తించి పాదమును తొడకు తాకునట్లు వుంచుము. రెండు చేతులు వ్రేళ్ళను ఒకదాని యందు మరొకటి గొలుసు వేసి రెండు చేతులను పైకెత్తి కుడి నాడి చేత శ్వాసను పీల్చి కుంభించి జాలంధరబంధ, మూల బంధ, ఉడ్యాన

బంధములన వేసి రెండు చేతులతోను ఎడమకాలి (మోకాలును వంచకుండ) వ్రేళ్ళను పట్టుకొని ముఖమును ఎడమ మోకాలిని ఆనించి ఎడమ రొమ్మును, ఎడస్మ ప్రక్కటెముకలను ఏడమ కాలికి ఆను నట్లు కష్టము కల్గు వరకు వుంచి లేచి రేచించ వలయును. పూరక, కుంభక, రేచకములు 1: 4 : 2 నిష్పత్తిలో జరుగ వలయును. మరల రెండ ప్రక్క కూడ అటులనే చేయుము. దీని వలన ప్రాణాపానములు సంయోగము పొంది నాడీ మండలము శోధింపబడి శుద్ధ మగును. ప్రాణము సుషుమ్న మందు ప్రవేశించును. కనుక ఇది యోగ సిద్ధికి దోహద కారి. దీని వలన జీర్ణ కోశమునను, మలాశయమునను వున్న రోగములు, క్షయ, మూల వ్యాధి, గుల్మములు, కష్టములు, పంచ మహా క్లేశములు అవిద్య, అభినవ అస్తిగత, రాగ, ద్వేషములు) నశించును. మహా సిద్దులను ప్రసాదించు సామర్థ్యము గలది మహాముద్ర. ఇది చాల రహస్యమైనది యోగుల చేత చెప్పబడినది.

2. మహాబంధము

కూర్చొని ఎడమ కాలి మడమను యోని స్థానమున చేర్చి ఎడమ తొడ మూల మీద కుడి పాదమును వుంచి రెండు నాసిక రంధ్రములచేత వేగముగను, పొడవుగను, ఘర్షణ శ్వాసల కొన్నింటిని చేసి తరువాత వామనాడిలో ధీర్ఘముగా వాయువును పూరించి జలంధర బంధము చేసి అనగా గడ్డమును రొమ్ము మూలమందు గట్టిగా హత్తించి మూల బంధము చేసి అనగా గుదమును గట్టిగా పీడించ వలయును. (కొందరు రెండు చేతులలోను కుడి మోకాలిని పట్టుకొనవలయునని కొందరు మార్షులు చెప్పిరి)

యధావిధి 1 : 4 : 2 నిష్పత్తిలో పూర్ఫక, కుంభక, రేచకములను సలుపవలయును. రెండ వైపు కూడా అటులనే చేయ వలయును. మహా సిద్ధులను ప్రసాదింప సమర్థవంత మైనది.

3. మాహావేధ

మహా బంధముద్ర యందుండి వాయువును పూరించి జలంధర బంధమును ధరించి శరీరమునకు యిరు ప్రక్కల యందు భూమి మీద చేతులు ఆనించి శరీరమును కొంచెము పైకి లేపి పిరుదులను భూమి మీద కొట్ట వలయును. ఈ విధముగా పిరుదులను నేలపై కొట్టుటను రేచకమునకు ముందునను, కుంభకమునకు వెనుకను చేయ వలయును. దీని వలన ప్రాణము సుషుమ్న యందు ప్రవేశించుటకు అనుకూల పడును. ఇది సిద్ధులను ప్రసాధించ సమర్థత గలది.

.4. ఖేచరీ ముద్ర

ఇడ, పింగళ నాడుల నిరోధము వలన ప్రాణ వాయువు సుషుమ్న యందు చేరుచున్నది. ఆ విధముగా సుషుమ్న యొక్క ఒక కొననుండి ప్రాణ వాయువు చేత నింపి, మరియొక కొనను నాలుక చేత బంధించ వలయును. అదియే ఖేచరీ ముద్ర స్వభావము. అందున ప్రాణము లయము కాగా మనస్సు లయమగు చున్నది. అందుల కొరకు నాలుకను కొండ నాలుక ఆవలనున్న పాలకుహరమున ప్రవేశ పెట్ట వలయును. అపుడు దృష్టిని అజ్ఞా క్రమందు నిలిపి వుంచ వలయును. అటుల చేసిన దానిని ఖేచరీ ముద్ర అందురు. నాలుక కపాలకుహరమున ప్రవేశింప వలెనన్న

అంత తేలిక పని కాదు. నాలుక క్రిందనున్న నరముల పట్టు సడల వలయును. మరియు నాలుక పొడవుగా సాగగల శక్తి పొంద వలయును. దాని కొరకు కొంత దోహద క్రియ చేయ వలయును. నాలుక ఆవుపాలు పిండునపుడు చనుకట్టూ పట్టుకొనునట్టుగా పట్టుకొని ఆ ప్రక్కకు, ఈ ప్రక్కకు, ముందునకు లాగుచు సాగ దీయ వలయును. మరియు వాడి యగు కత్తిని తీసుకొని నాలుక క్రింద దౌడను కలియు స్థానమూ ఒక వెంట్రుక వాసి ఛేదించ వలయును. ఆ చేదించ బడిన ప్రదేశమున వ్రణము కాక ఉండుటకు గాను కరక్కాయపొడిలో సైంధవలవణ చూర్ణమును చేర్చి అంటించ వలయును. అటుల ప్రతి వారము దినములకు ఒక పర్యాయము చేయ వలయును. అట్లు ఆరునెలల చేసిన జిహ్వను బంధించిన నరములు పట్లు విడిచి నాలుకను కపాల కుహరమును చేరు సామర్థ్యమును కల్గించు చున్నది. కపాల కుహరముమందు ఇడ, పింగళ, సుషుమ్న అను నాడులు కలియు చోటున "వ్యోమచక్రము" న ప్రవేశ పెట్టి అరక్షణము అనాగా 12 నిముషముల కాలము ఉంచ వలయును. ఇట్లు చేయుట వలన సాధకుడు చంద్ర స్థానము నుండి స్రవించు అమృతమును ఆస్వాదించి మృత్యువును జయించ గల్గునని ఋషుల చేత చెప్ప బడినది. దీనినే ఈ సందర్భముననే, గోమాంస భక్షణము, అమృత హరుణి సేవయు మానవుని పవిత్రము చేయునని చెప్పబడినది. ఈ వాక్యము నకు ఆవు మాంసము తిని, కల్లు త్రాగినయెడల మానవుడు పవిత్రమగునని బాహ్యముగ కనపట్టు చున్నది. గో శబ్ధమునకు కొండనాలుక యని అర్థము. గోమాంస బక్షణ అనగా నాలుకతో కొండ నాలుకను తాకుట అమర వారుణ అనగా అమృతము. చంద్ర స్థానము నుండి నిత్యము అమృతము స్రరించునని గదా తెలుప బడినది. ఇది కంఠ స్థానమున ఉన్నదని తెలిసికొంటిమి కదా: కనుక కొండ నాలుకను నాలుకతో తాకి కంఠమున వున్న అమృతమును అనుభవించమని ఆర్థము. అందు చేత విపరీతార్థములకు ఇచట తావు లేదు.

5. విపరీత కరణి ముద్ర

సూర్య స్థానము నాభి స్థానమున ఉన్న మణి పూరక చక్రమందు గలదు. అగ్నికి సూర్యుడు స్థానము. చంద్ర స్థానము కఠ స్థానమునందు గలదు. అందుండి నిత్యము అమృతము స్రవించును . కాని అట్లు ఉద్భవించిన అమృతము దాని క్రింది భాగములో వున్న అగ్ని యందు పడి నాశానమందు చున్నది. అమృతము అనుభవించ లేని మానవుడు జరత్వము పొందు చున్నాడు. ఆ స్థితిని నిరోదించుటకు సూర్య చంద్ర స్థానములను విపరీతము చేయుట అనగా మీదిది క్రిందుగను, క్రిందిది మీదుగను ఉంచుట వలన జరుగునని తెలిసికొని మహర్షులు విపరీత కారణిని సాధనము చేసిరి. ఆసనములో కొన్ని ఇట్టి విపరీతము చేయునవి వున్నవి. సర్వాంగాసనము, శిరసాసనము ఇట్టివి. నేలమీద వీపు తగులు నట్లు పండుకొని రెండు చేతులను రెండు ప్రక్కలయందు నడుము క్రింద భాగమును చేర్చి తొడలను 45 డిగ్రీలు పైకి ఎత్తి ఉంచునది విపరీత కరణి ముద్ర. దీని వలన శరీరమున వున్న రోగ పదార్థములు నశించును. అయువృద్ధి యగును.

6.వజ్రోలి ముద్ర

దీనికి సూక్ష్మ నాడీ మందలము పైన చాల ప్రభావము కలదు. భారతీయ (ఆయుర్వేద) వైద్య శాస్త్రముననుసరించి శుక్రము సూక్ష్మమై ఓజస్సుగా మారి, ఊర్త్వముగా మజనుండి ప్రసరించును. దానినే ఊర్ద్వ రేతస్కమనిరి. ఈ ఓజస్సు శరీరమున వృద్ధియగు కొలది దివ్యమగు తేజస్సు శరీరమంట వ్యాపించును. ఇందు వలన ముఖము చుట్టు గుండ్రని తేజస్సు విరజిమ్ము చుండును. అటులనే శరీరమంతటను కూడా కాంతి విరాజిల్లు చుండును. ఒక విశేష శక్తి మంతయయిన చాయాగ్రహక యంత్రము ద్వారా ఆధునిక శాస్త్రజౣలు కొందరు ఈ కాంతి వలయము యొక్క ఛాయను చిత్ర పటములయందు తీయ గల్గిరి. ఈ విషయమును యోగులు తమ దివ్య శక్తి చేత ఎనాడో గ్రహించ గల్గి యుండిరి. ఈ సందర్భమున ఆలోపతి వైద్య శాస్త్రము ఒప్పుకొనక భేదించు చున్నది. శుక్రము శరీరమున యిమడదని అది అప్రయత్నముగా గాని ప్రయత్న పూరకముగా గాని బహిష్కరింప బడవలసినదే యని చెప్పుదురు. కాని యోగ శాస్త్రము దీనిని ఒప్పు కొనలేదు. ఇపుడిపుడు యోగ సిద్దాంతమే సత్యమగు చున్నది. ఈ శుక్రము అనారోగ్య కారణముల చేతను, సంభోగ సమయమునను, కలల యందును శరీరము నుండి బయటకు పోవు చుండును. ఈ పదార్థము యొక్క నిగ్గు బటకు పోవు చుండుట వలన శరీరము నిస్తేజమగు చున్నది. దీని వలన జ్ఞాపక శక్తి, అలోచనా శక్తియు సన్నగిల్లు చున్నది. శరీర పాటవముకూడ తగ్గి పోవు చున్నది. కావున శరీరమున ఉత్పత్తి

యగు శుక్రమును భద్ర పరచుటకు భారతీయ ఋషులచే ప్రసాదింప బడినది వజ్రోలి. దీనినే హిందిలో వతన్ మే రతన్ జతన్ కరో అని చెప్పి యున్నారు. ఈ శుక్రము యవ్వనముననే ఎక్కువగా ఉత్పత్తి యగు చుండును. ఆ కాలములో రత్నము వంటి దానిని దుర్వినియోగము కానీయ కుండా భద్ర పరచుకొనమని దాని అర్థము.

శరీరమందలి సూక్ష్మ నాడీ మండలములో ఇడ, పింగళ యను రెండు నాడులు ముక్కు రంధ్రముల నుండి వృషణముల వరకు ప్రసరించి యుండును. రెండు వృషణముల నుండి రెండు వాహికలు లింగమందు చేరును. ఇవియే సీవనీ నాడులు లేక శుక్ర వాహికలు. ఉద్రేకము కల్గుట చేత బహిష్కరింప బడుటకు సిద్ధముగా నున్న శుక్రము వాని చుట్టునున్న కండరములను బిగియ పట్టుట వలన బహిషృతము కాక తిరోగమించును. వజ్రోలి ముద్ర సాధనా పాటనము చేత శుక్రము బహిర్గతము కానీయకుండుటయు లింగము చేత దాని బయడ నున్న చిక్కని ద్రవములను లోనికి ఆకర్షించు కొనుటయు చేయ వచ్చును.

వజ్రోలి సాధన క్రమము

ప్రాతః కాలమున మల మూత్రములను విసర్జించిన తరువాత ఇరువది నాలుగు అంగుళముల పొడవుగల రబ్బరు లేక ప్రాస్టిక్ నాళమును తీసుకొని (ఇవి లేని కాలములో లోహపు గొట్టమును వాడండి) దానిని వేడి నీళ్ళ యందు కొంచెము సేపు వుంచి శుభ్రపరచి లింగము ద్వారమునుండి లింగమున ప్రవేశ పెట్టుము. మొదటి దినమున ఒక అంగుళము రెండవ దినమున రెండు అంగుళములు నిట్లు క్రమ క్రమముగా పది దిన

ములలో పది అంగుళములు పొడవున ప్రవేశ పెట్ట వలయును. ఆ నాళము ముఖమున గ్లిసరిన్ గాని నేతిని గాని లేదా నూనెలను గాని పూసినట్లయితే సులభముగా నాళము లింగమున ప్రవేశించును. మొరటుగా ప్రయత్నము చేయ రాదు. మొరటుగా ప్రయత్నించుట వలన రక్తము వచ్చుటకు అవకాశము కలదు. నాళము 10 అంగుళముల పొడవున ప్రవేశించిన తరువాత శరీర మందలి వాయువును పూర్తిగా రేచించ (బయటకు విడువ) వలయును. రబ్బరు గొట్టము రెండవ చివరను ఒక గళ్ళాను అమర్చ వలయును. ఆ గళ్ళాలో నీరు పోసి నోటితో ఊదిన యెడల నీరు మూత్రాశయమున ప్రవేశించును. మూత్ర కోశము నిండు వరకు ఈ విధముగ నీరు పోసి ఊదుము. ఈ నీరు శుభ్రముగా మరిగించి గోరు వెచ్చగా చల్లార్చినదై ఉండవలయును. తరువాత పొత్తి కడుపును సంకోచించిన యెడల ఆ నీరంతయు బయటకు వచ్చును. నెమ్మదిగా గాక చాల వేగముతో గళ్ళామీద ఒక అంగుళము పైన వచ్చు నట్లు వత్తిడి చేసి పొత్తి కడుపు నందలి కండరములని బిగియ పెట్టవలయును. దీని వలన మూత్ర నాళము దానిని ఆవరించిన కండరములు బలమగును. ఇట్లు ఇరువది దినములు చేసిన తరువాత వరుసగా గాలిని,నీటీ, నూనెను, ద్రవ స్థితిలోనున్ననేతిని తేనెను, తరువాత పాదరసమును మూత్రాశాములోనికి లాగుట చేయ వలయును. మూత్రాశయమున ద్రవమును ప్రవేశ పెట్టిన తరువాత లింగమునందు జొనిపిన నాళమును ఈవలకు తీసి వేయుము. ఆతర్వాత కొంచెము సేపు ద్రవమును మూత్రాశయము నందుంచి బయటకు విడువ వలెను. వజ్రోలి ముద్ర సాధనకు ఉద్యానమును చక్కగా నేర్చుకొన వలయును. కొన్ని దినములిట్లు నోటితో నీటిని లోనికి ఊదిన తరువాత గళ్ళ అవసరము లేకుండ బయట నున్న నాళము (గొట్టము) కొనను గోరు వెచ్చని నీటిలో ఉంచి ఉద్వానము చేసినట్లయిన నీరు లోపలికి ప్రవేశించును. అట్లు నీటిని లోపలి లాగెడు శక్తి వృద్ధి చేసుకొన వలయును. ప్రారంభములో నీటిలో వున్న పాత్రను లింగమున్న ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తులో వుండి ఉడ్యానము చేసిన తేలికగా నీలు లోపలకు ప్రవేశించును. ఆ ఎత్తును నిమ్మది నెమ్మదిగా తగ్గించి లింగ మున్న స్థానముకన్నా తక్కువ ఎత్తులో వుంచి నీటిని పైకి లాగు నట్టి శక్తిని పొందవలెను. ఇది ఉద్యానము యొక్క శక్తి పై ఆధార పడి యుండును. ఉద్వానములు చేయు విధమును త్రిబంధములను గూర్చి చెప్పినపుడు వివరించ బడినది. నీటిలో అభ్యసించిన వెనుక నూనె, తేనెలతో సాధనము చేయ వలెను. దీని వలన రతస్సు బహిర్గతము కానేరదు. ఇంద్రియము శరీరమున నీరు ఆవిరియై సూక్ష్మ ఫూపమూ ధరించిన రీతి ఓజస్సుగా మారును. అపుడు యోగి ఉర్ద్వ రేతస్కుడగును. అతిశయించిన వజ్రోలి సామర్థ్యము వలన పతన మయిన రేతస్సును సయితము పైకి తీసుకొన గల్గును. ఈ వజ్రోలి పురుషులే కాక స్త్రీలు కూడ చేయ వచ్చును. దీనిని స్త్రీ వజ్రోలి అనిరి. దీని వలన అనగా వజ్రోలి వలన యోగులు అవివాహితులు కాదనియు యోగులు వివాహిలై పత్నులతో సంసారము చేయు చుండినట్లు తెలియు చున్నది.

పతంజలి మహర్షి తన యోగ సూత్రముల యందు కుండలిని గురించి ప్రస్తావించ లేదు. కాని హఠయోగ ప్రదీపిక కుండలిలోపనిషత్తు వంటి గ్రంధముల యందు దీనిని గురించి ప్రత్యేకముగా విపులీకరింప బడినది. కుండలిని అనునది శక్తి యొక్క రూపము. ఇది సర్పాకృతిని పొంది చుట్టలుగా చుట్టుకొని నాభి యందు గల కంద స్థానమున ఉన్నది. ఈ కంద స్థానము నుండియే సూక్ష్మ నాడీ మండలము ప్రసరించు చున్నది. ఇది నాబ్ హికిని లింగ స్థాఅమునకు వధ్యగా వున్నది. ఇచటనున్న శక్తి చుట్టలుగా చుట్టుకొని ఉన్నందున కుండలని యని పిలువ బడెను. ఆకుండలిని మూలాధారమున ఉన్న సుషమ్న నాడీ యొక్క ఒక చివర యందు ముఖము వుంచి నిద్రించు చుండును. యోగులు తమ సూక్ష్మ నాడీ మండలమును ప్రాణాయామము ద్వారా ఎట్టి అడ్డంకులు లేకుండా శుద్ధి చేసుకొని యోగాగ్నిని రగుల్కొల్పి నిద్రలోనున్న కుండలిని నిద్ర నుండి లేపి శుద్ధిగా ఉన్న సుషమ్న గుండా షడ్చక్రములను గ్రంధి త్రయమును చేదించుకొని సహస్రారమున వున్న పరమ శివుని పొందునని శ్రీ శంకర భగవత్పాదులు తెలిపి యున్నారు. పిండాండమున నున్న ఈ మహా శక్తియే బ్రంహ్మాండమున ఎన్నొ విధముల రూపమును ధరించి సృష్టికి తోడ్పడుచున్నది. విద్యుచ్చక్తి, అయస్కాంత శక్తి, పీడన శక్తి , అణు శక్తి ఇత్యాది రూపములు ఎన్నో తెలుపుటకు లెక్కకు మీరి యున్నవి. పిండాండమున నిద్రలో ఉన్న ఆకుండలిని మేల్కొల్పుటకు కొన్ని ఉపాయములను మన మహర్షులు చెప్పియున్నారు. అందున 1. సరస్వతీ చాలనము. 2. ప్రాణాయామమను రెండు సాధనములను పూనికతో అభ్యసింప వలయునని చెప్పిరి.

1.సరస్వతీ చాలనము

సూక్ష్మ నాడీ మండల కేంద్రమగు కంద స్థానమునుండి 72,000 డెబ్బది రెండు వేల యోగ నాడులు శరీర మంతటను ప్రసరించి యున్నవి. ఆ కందమున స్థానముగా చేసికొని సుషుమ్నా మార్గమున తలనిడి నిద్రావస్థలో నున్న శక్తిని మేల్కొలుపుటకు సరస్వతీ నాడిని చలింప చేయ వలయును. ఈ సరస్వతీ నాడినే ఆరుంధతీయని కూడ పిలువబడును.

చేతుల నాలుగు వ్రేళ్ళను, ఒక ప్రక్కను, బొటన వ్రేలిని మరియొక ప్రక్కను ఉంచుకొని, రెండు ప్రక్కలయందు రెండు చేతులు వుంచి నడుమును గట్టిగా అదిమి పట్టి, కుడి ప్రక్క నుండి ఎడమ ప్రక్కకు నడుమును తోము నట్లుగా చేతులతో తోమ వలయును. అట్లు చేయుట వలన సరస్వతీ నాడి ధ్వనితో కూడి చలించి కుండలిని మేల్కొల్పును. మేల్కొనిన కుండలిని ఊర్థ్వముగా పయనింప ప్రారంబించును. ప్రతి పర్యాయము ప్రాణాయామము చేయు గడంగుటకు ముందుగాచేయ వలయును. ప్రాణాయామానతరము చేయుట వలన ఫలిత ముండదు.

సరస్వతీ చాలనము కొరకు కుండల్లోపనిషత్తునందు మరియొక విధము చెప్పబడినది. సాధకుడు దృడముగా పద్మాసనమున కూర్చుండి, మొదట కుడి నాడి చేత 12 అంగుళముల పొడవు గల వాయువును లోనికి పీల్చి, తర్వాత మరి యింకను నాలుగు అంగుళముల ప్రాణవాయువును లోనికి విస్తరింప చేసి, కుండలినిని ఊర్ద్వ ముఖముగా ఆకర్షింప వలెను. అటుల కొంత సేపు కుడి నాడి చేతను, కొంత సేపు ఎదమ నాడి

చేతను అరగంట సేపు సాధనము చేయవలయును. దీని వలన కుండలిని సుషుమ్నా మార్గము పొందును. ఏ యోగి చేత కుండలిని శక్తి చక్క సాధనము చేయబడుచున్నదో ఆ యోగికి అణిమాది అష్ట సిద్ధులు కరతలామలకము. బ్రహ్మ చర్యము పాటించి యింద్రియములను వశపరచుకొని పద్యముతో కూడి ఆహారమును భుజించుచు కుండలిని మేల్కొలుపు ప్రయత్నము చేయు సాధకునికి నలుబది దినములలో ప్రాణాయామ సిద్ధి కలుగును. శక్తి చాలనము కొరకు మారియొక పద్ధతి కూడ చెప్పబడినది. సిద్ధాసనమున కూర్చొని మరియొక పద్ధతి కూడా చెప్పబడినది. సిద్ధాసనమున కూర్చొని తన రెండు పాదములను పట్టుకొని పైకెత్తి కంద స్థానమును గట్టిగా తాడించ వలయును. మరియు నాభి స్థానమును ఉద్వానము చేయవలయును అనగా పైకి లాగ వలయును. అందు వలన శక్తి చలించు చున్నది. శక్తి చాలనము చేయుటకు రౌడన క్రియ యని మరియొక విధానమును కూడా చెప్పి యున్నారు. సిద్ధాసనమున కూర్చొని విధి పూర్వకముగా వాయువును పూరించి పూరించిన కాలమునకు నాలుగు రెట్లు సమయము కుంభించి కుంభ కాంతమందు సిద్ధాసనములో పైనున్న కాలి మడమను పట్టుకొని, మడమతో నాభికి క్రిందుగా, లింగ స్స్థానమునకు పైగా నెమ్మదిగా తాడించ వలయును. దీనినే తాడన క్రియ అందురు. తరువాత పూరించు కాలమునకు రెండింతల కాలములో నెమ్మదిగా రేచించ వలయును.

శక్తి చాలనము చేయు నపుడు వరీధానయుక్తి, పరీచాల క్రియ అనునదియు సాధన చేయ వలయును. ఈ సాధనము చేయుట వలన కుండలిని మేల్కొని సుషుమ్నా మార్గమును

పొందును. కుండలిని సుషుమ్నను పొందుటకు మరికొన్ని యుక్తులు చెప్పబడినవి.

పరాధాన యుక్తి, పరీచాలన క్రియ చేయు పద్దతి.

సిద్దాసనమున కూర్చొని రెండు నాసికా రంధ్రముల చేతను కపాల భాతి చేయు విధముగా శ్వాస నిశ్వాసలు జరిపి నిండుగా పూరించి కుంభించిన తరువాత నాభికి యిరు ప్రక్కల యందును రెండు చేతుల బొటన వ్రేళ్ళను ఉంచి మిగిలిన నాలుగు వ్రేళ్ళతోను గట్టిగా కడుపును లోనికి నొక్కవలయును. అపుడు గడ్డమును రొమ్మునకు హత్తునట్లు ముందుకు వెనుకకు వంచ వలయును. ఇట్లు 1 : 4 : 2 నిష్పత్తిలో పూరక, కుంభక, రేచకములు కలుప వలయును. కుంభకములో ఉన్నపుడు మూల భంధములను చేయవలయును. రేచించు నపుడు ఉద్వాన బంధము చేయ వలయును.

శాంభవీ ముద్ర

మనస్సుయు, ప్రాణము ఒకదాని కొకటి మనుగడ చేయలేవు. మనసు లయమందిన ప్రాణము లయమగును. పరబ్రహ్మ యందు మనస్సును నియమించి, బాహ్య ప్రపంచమును చూచు నట్లు కనపడినను, బాహ్య విషయములను గ్రహించని స్థితిలో అనగా ఇంద్రియమును నిరోధించిన యడల, దానిని శాంభవీ ముద్ర యందురు. ఈ విధముగా శాంభవీ ముద్ర యందు మనస్సు లయమందు చున్నది. ఈ ముద్రలో మనసుకు అనాహత చక్రము (హృదయము) నందు మనస్సును నియమించ వలయును. అపుడు ప్రాణము హృదయమున లయమగును. సాధ

కుడు సమాధి స్తితికి చేరువగా చేరుకొనును. కేవలము మనస్సును దీని యందు నియమించ కుండ నిర్లిప్తము చేయుట దుస్సాద్యము. మనసు కళ్ళెము లేని గుఱ్ఱముల వంటిది. అందు వలన ప్రాణాయామము అభ్యసించి కేవల కుంభకము అలవరచు కొన వలయును. ఈ విషయమును గ్రహించక సాధన చేసిన కేవలము ప్రయాస మాత్రము మిగులును.

షణ్ముఖి ముద్ర

సుఖముగా వెన్నును, మెడను శిరస్సును తిన్నగా వుంచి శ్వాసను బాగుగా పూరించి రెండు చేతుల బొటన వ్రేళ్ళతొ రెండు చెవుల రంద్రములను, రెండు చూపుడు వ్రేళ్ళతోను మూయబడిన కండ్ల పై ఉంచి రెండు చేతుల నడిమి వ్రేళ్ళతోను రెండు నాసికా రంధ్రములను మూసి ఉంగరపు వ్రేళ్ళను పై పెదవి మీదను, చిటికెన వ్రేళ్ళను క్రింది పెదవి అంతను ఉంచి రెండు వ్రేళ్ళతోను రెండు పెదవులను అదిమి పెట్టి నిశ్చలముగా కూర్చున్న ఎడల శరీరములో ఒక విధమైన నాదము వినబడును. దానినే అనాహత చక్రము (హృదస్యము) నుండి వచ్చు శబ్దముగా గుర్తించిరి. అది మొదట ఓంకారముగా తెలియబడి ప్రాణాయామము వలన, నాడీ శుద్ధి జరుగు సమయమున దశ విధములగు నాధములుగ వినబడును. కొంత అభ్యాసము జరిపిన పిమ్మట అట్టి నాదమును చెవులు మిగిలిన రంధ్రములు మూయకనే వినబడును. ఇట్టి నాదము నందు మనస్సు లగ్నము చేసిన యడల మనసులయమగును. నాదమును మనసును లయ పరచుటయే లయ యోగమని చెప్పబడెను.

21)