యోగాసనములు/ప్రాణాయామము

వికీసోర్స్ నుండి

అశ్వనీముద్ర యని మరియొక ముద్రను కూడ వెలిసి కొనవలయును. గుర్రము మల విసర్జనానంతరము గుదమును ఒత్తుచు పీడించును. అట్లు చేయుట వలన సాధకుని అపాన వాయువు పీడింప బడుట వలన పైకి పోయి ప్రాణవాయువుతో సంయోగము పొందును. అందువలన బిందువు ఊర్ధ్వ ముఖముగా పయనించును. యోగి ఉర్ద్వ రేతస్కుడగును.

ఉన్మనీముద్ర:


స్థిరమైన మనసు కలవాడై సాధకుడు అరమోడ్పు కన్నులతో నాసికాగ్రమున దృష్టి వుంచి మనసును నిరోధించి అనగా ప్రాణ వాయువు యొక్క మననమును నిలిపి యింద్రియములను నిరోధించి స్వ స్వారూపమందు కా యేంద్రియ మనసున నియమించిన వాడే ఉన్మనీముద్ర యందున్న యోగి. ఈ ఉన్మనీ ముద్ర సాధకునికి ఉత్తమ స్థితిని కల్పించి సమాధి స్థితికి చేరువ చేయు చున్నది.


ప్రాణాయామము


ఆసనములు, బంధములు, ముద్రలు తెలిసి కొనిన పిదప మనస్సును లయము చేయుటకు సాధనమయిన ప్రాణాయామము గురించి తెలిసి కొన వలయును. ప్రాణమును నిరోధించుటయే ప్రాణాయామము. ఈ విశ్వమున సర్వమును ఉత్పత్తి నందుట, వృద్ధి చెందుట, లయమగుటయు ప్రాణ శక్తి వలననే జరుగు చున్నది. అందు వలన ఈ జత్తున జరుగు

సర్వ కార్యములు, ప్రాణమనెడు సూక్ష్మరూపమునకు స్థూల రూపములు. అనగా మానసిక శక్తులు, భౌతిక శక్తులు, రసాయిన శక్తులు వాని వాని స్థూల రూపమున వుండి సూక్ష్మ రూపములో నున్నపుడు ప్రాణ మనబడును. ఇట్టి ప్రాణ శక్తి మానవ శరీరమున శ్వాసను కల్గించుచున్నదే కాని శ్వాస మాత్రము ప్రాణము కాదు. ఊపిరి తిత్తులు ప్రాణ శక్తి వలన ఉచ్చ్వాస నిశ్వాసములు జరుపు చున్నది అట్టి స్వాస క్రియకు కారణ రూపమగు శక్తియే ప్రాణము. ప్రాణము వలన శ్వాస , శ్వాస వలన మనస్సు చలించు చున్నవి. కనుక ప్రాణము చలించని యడల శ్వాసయు మనస్సు ఈ రెండునూ స్థంభించును. కనుక మనస్సును నియమించుటకు ప్రాణ నిరోధము అనగా ప్రాణయామము అవసరము. శాస్త్రీయ మగు పద్దతిని ప్రాణాయామము అభ్యసించుట కర్తవ్యము.

అనగా మన శరీరమును సూక్ష్మ రూపముగా గ్రహించిన యడల కారణ రూపము ప్రాణమయి వుండగా స్థూల రూపములో కార్య రూమందినది. శ్వాస క్రియ అవ్యక్తమగు సూక్ష్మము, స్థూలముగా వ్యక్తమగను. అవ్యక్తమగు కారణ రూపమున వున్న ప్రాణము స్థూల రూపమున శ్వాసగా వ్వక్తమగు చున్నది. ప్రాణమునకు శ్వాసకును ఇట్టి సంబంధముడుట వలన శ్వాసను నిరోధించిన యడల ప్రాణ నిరోధము కల్గు చున్నది. శరీరమున ఉన్న మనస్సు ప్రాణ శక్తి వలన చలించుట చేత ప్రాణశక్తిని నిరోధించి వశము చేసికొనుట వలన మనసు నిరోధించ బడి వశమగును. కనుక శ్వాస కార్యమును నిరోధించిన యడల మనసు నిరోధించ బడి వశమగును.

సృష్టిలో ఉన్న సర్వ శక్ల్తులు వాయు శక్తి, విద్యుశ్చక్తి, అయస్కాంత శక్తి అన్నియు ప్రాణ శక్ల్తి యొక్క రూపాందరములగుట వలన ప్రాణ్శ శక్తిని వసము చేసుకొనుట వలన ప్రకృతి యందలి సర్వ శక్తులు వశమగుచున్నవి. ప్రపంచమున భౌతిక, రసాయనిక పద్ధతుల వలన ఆవిరి శక్తి, విద్యుశ్చక్తి, కాంతి శక్ల్తి, ఉష్ణ శక్తి, అణుశక్తి, వాయు శక్ల్తి, జల శక్తి, మొదలగు శక్తులను వశము చేసి కొనుట కూడ ఒక విధమయిన ప్రాణాజ్యామమని చెప్ప వచ్చును. శరీరమున ప్రాణమును వశపరచు కొనుట వలన మనస్సు వశమగుచున్నది. మనసు యొక్క వ్యాపారము సంకల్ప వికల్పములు; సామాన్య మానవుని శరీరమున మనస్సు పూర్తిగా విశ్రాంతి పొందినపుడు సుషుప్తి అనగా గాడ నిద్రలో నున్నట్లు గ్రహించ వలయును. శరీరము డస్సి విశ్రాంతిని కోరి నిదురించుటకు ప్రయత్నించగా మనో వ్యాపారములైన సంకల్ప వికల్పములు ఇంకను కొనసాగు చుండుట వల స్వప్నములు కలుగు చున్నవి. ఇది స్వప్నావస్థ. మనస్సు కూడ సంపూర్ణ విశ్రాంతి పొందినపుడు సుషుప్తి యనబడును. శరీరములోని ఇంద్రియము లన్నియు ప్రాణము శ్వాస కూడ ఉన్నప్పటికి మనస్సు విశ్రాంతి పొందినందున నిద్ర కల్గి శరీరము చేత ఈ ప్రపంచమును అనుభవింపచేయ లేదు.

సాధారణముగా ఉన్న సూర్య రస్మిని గాజు కటకము సహాయమున కేంద్రీకరింప గల్గిన యడల ఎక్కువ వెలుతురు, వేడియు కలుగునని భైతిక శాస్త్రమున తెలిసి కొంటి కదా. అటులనే మనస్సును కేంద్రీకరింప చేసిన యడల అమితమైన శక్తి

వంతమగును. అటుల శక్తి వంతమగు మనసు చేత బలహీన మగు మనస్సులను (అనగా కేంద్రీకరింప లేని మనస్సును) జయించి శాసింప వచ్చును. ఒకడు నిద్రలో నున్నపుడు వానికి మెలుకువ రాకుండా నెమ్మదిగా వాని కన్నులు తెరచి ఒక వస్తువును కంటి యందు ఉంచును. వానికి నిద్రలో మనసు విశ్రాంతికి పోయి స్తబ్ధముగా ఉన్నందున ఆ వస్తువును ఆ శరీరము చూడజాలక పోవు చున్నది. అతనికి మెలకువ వచ్చు నట్లు చేసినపుడు అనగా మనస్సును ప్రసరింప చేయు నపుడు అతడు ఆ వస్తువును చూడ గల్గు చున్నాడు. ఇంద్రియములు మనస్సు చేతనే శక్తిని పొందు చున్నది. కేంద్రీకృతము చేసి కొన శక్తిని సంపాదించు కొన్న మనస్సు మరియొక మనస్సును వసీకరణస్ము చేసుకొని తన చెప్పు చేతలలో త్రిప్పుకొనగలడు. సమ్మోహన మనెడి (హిప్నాటిసము) విద్య మనోశక్తి చేత ఎదుట వానికి నిద్ర కలిగించ గల్గు చున్నాడు. అటుల సమ్మోహనము చేత ఎదుట నున్న వస్తువులను గ్రహించ లేకుండునట్లు చేయ వచ్చును. ఇట్లు చేయుటను అదృశ్యకరణి అందురు. ఇది కేంద్రీకరించి శక్ల్తి వంతమయిన తన మనస్సుతో బలహీన మయిన మనస్సును శాసించి భ్రాంతి కల్గించుట యన్నమాట. ఏకాగ్రతతో ఒక వస్తువు నందు మనస్సును లయము చేయుటను సంయమనము చేయుట అందురు. చిత్తమును ఆయా వస్తువులపై ఏకాగ్రతతో లయము చేయుట వలన ఆయా వస్తువుల స్వభావములను పొంద వచ్చును. మానవుని సంకల్ప శక్తికి పరిమితి లేదు. చిత్రైకాగ్రత వలన అట్టి శక్తిని పొంద వచ్చును. తన మనస్సును ఏనుగు యొక్క బలముపై నుండి

మనము చేసిన ఏనుగంత బలమును పొంద వచ్చును. తేలికయగు వస్తువులపై సంయమనము చేసిన ఆ విధముగా తన వరువును కోల్పోయి తేలిక యగును. దూది వంటి వస్తువులపై సంయమనము చేసిన గాలిలో తేల వచ్చును. సూక్ష్మమగు వస్తువులపై సంయమనము చేసిన సూక్ష్మ మయిన శరీరమును పొంద వచ్చును. శ్రీ మద్రామాయణమున వాల్మీకి మహర్షి, ఆంజనేయ స్వామి యొక్క యోగ శక్తులను సముద్ర లంగన సమయమున లంకా ప్రవేశకాలమునను, లంకను కాల్చి రావణుని ఎదుటకు వచ్చి నపుడు మరి కొన్ని ఇతర సన్నివేశముల యందు వర్ణించిన విశేషములన్నియు యోగ శాస్త్రము నందు తెల్పిన సంయమనము వలన కల్గు అణిమాది సిద్ధులే. అట్లు మనస్సును కేంద్రీకరింప చేయుటకు నిర్ణయించు కొన్న వస్తువులపై లయము చేయ గల్గుటకు ప్రాణాయామము అభ్యసించి అందు ఉత్తీర్ణత పొందవలయును. ఈ ప్రాణాయామము వలన హృదయ స్థానమున నున్న ప్రాణవాయువు మూలాధారమున వున్న అపాన వాయువుతో సంయోగ పరచిన యడల కల్గు యోగాన్ని చేత శరీరమందలి అనగా సూక్ష్మ స్థూల నాడీ మండలము నందలి మలము లన్నియు శోషించి, దహింప బడి నాడి మార్గము పరిశుద్ధమై ప్రతి బంధరహితమగును. సుషుమ్న నాడీ ముఖమున కుండలిని యను శక్తి స్వరూపిణి నిద్రావస్థలో సర్పాకృతిని చుట్టలు చుట్టలుగా చుట్టుకొని యున్నదిని చెప్పబడినది. ఆ కుండలినీ శక్తి ప్రాణాయా మాభ్యాసము వలన కల్గు ఉష్ణము వలన మేల్కాంచి ప్రతి భంధకములు లేక పరిశుద్ధమైన సుషుమ్న నాడీ మార్గమున ప్రవేశించి అందలి 175

చక్రములను గ్రంధులను ఛేదించుకొని సహస్రారమును చేరు చున్నది. ఇట్టి స్థితిని పొండుటయే యోగము య్ ఒక్క పరమావధి. కుండలిని ఇట్లు ఊర్థ్వ గామియగు నపుడు అణిమాది మహిమ, గరమ., లఘిమ, అష్ట సిద్ధులు కల్గుచున్నవి. షట్చక్రములను అధిగమించి సహస్త్రారమున వున్న పరమ శివుని, శక్తి స్వరూపిణి యగు కుండలిని చేరునపుడు యోగి నిర్వికల్ప సమాధిని పొందును. ఇదియో యోగమునకు వరమ లక్ష్యము. యోగి అతీంద్రీయ జ్ఞానమును పొంది తన కన్నా పూర్వము యోగ సిద్ధి నందిన యోగులను, దివ్య పురుషులను దేవతలను సందర్శించు శక్తి కలవాడగును. సృష్టి మర్మము లన్నియు కరతాలమలకము లగును. తనను పరమాత్మతో సారూప్యమును పొందవేసుకొనును.

ప్రాణాయామము వలన నాడీశోధనము జరుగు చున్నది. నాడీ శుద్ధి జరిగి యోగాగ్నిచే మేల్కాంచిన కుండలిని నివుగా సాగి బ్రహ్మనాడి ద్వారా సహస్త్రారమున చేరును. కుంభక సహిత ప్రాణాయమములు చేయుచు కుంభక పూరకములు లేని కేవల కుంభకము అలవరచుకొను వరకు కుంభక ప్రాణాయామమును అభ్యసించి అటు పైన సాధారణ ప్రాణాయామము ఆపి చేయ వచ్చును. కుంధక, పూరక, రేచకములు లేని స్థితి యందు శరీరమున వాయువు చలించని కారణమున మనస్సు నిశ్చలత పొందనగగును. చలే విత్త చలే వాతం"" అను సూత్రము యొక్క విపధ్యయము ప్రకారము మనస్సు స్థిర మను చున్నది. మనస్సును దీపము తోనూ నీటి మీద నావ తోను పోల్చబడినది. ఇది వాయువు వలన సంచలనము పొందును.

వాయువు లేని అనగా చలించని చోట నివి నిశ్చలముగా నుండును. మరియు అపుడు కుండలినీ శక్తి ప్రేరేపింబ బడును. సాధకుడు అనిర్వచినీ యానందము నంది యోగ సిద్ధిని పొందును. ప్రాణాయామము అభ్యసించిన యడల సదా చంచల స్వభావము గల్గి సంకల్ప వికల్పములే పనిగా గల మనస్సును స్వాధీన పరచు కొనవలయునన్న మనస్సు చలించుటకు కారణమగు ప్రాణమును స్వాధీన పరచు కొనవలయును. సూక్ష్మ రూపమున వున్న ప్రాణము శరీరమున లుచ్చ్వాస నిశ్వాసములుగా శరీరమున కనబడు చుండుట వలన స్వాసను వశ పరచు కొనిన మనస్సు వశమగును. అందు కొరకు ప్రాణాయామము నభ్యసించ వలయును. శ్వాసను వశ పరచుట కొరకు పూరక, కుంభక, రేచకములను క్రమ బద్ధము చేసిరి. పూరకమనగా శ్వాసకోశముల ల్యందు వాయువును పూరించుట. కుంబక మనగా వాయువును భరించుట, రేచకమనగా వాయువును విడచి పెట్టుట, పూరకము 15 సెకనుల కాలము చేసిన దసనికి (ఆ కాలమునకు) నాలుగింతల కాలము అనాగా సెకనుల కాలము కుంభించి పూరించిన కాలమునకు రెండింతలు కాలము అనగా 30 సెకనుల కాలమున రేచించ వలయునను నియమము నేర్పరచిరి. పూరక, కుంబక, రేచకములతో కూడిన శ్వాస క్రియ సహిత కుంభక ము లనిరి. పూరక కుంభక, రేచకములు లేని స్థితిని కేవల కుంభకమ ని చెప్పబడినది. కేవల కుంభక మందు శరీరమున వాయువు కొంచెము వుండును. కేవల కుంభకానంతరము అట్టి శ్వాసను రేచింపనూ వచ్చును. లేదా శ్వాసను పూరింపనూ వచ్చును. సహిత

కు భకములను బాగుగా అభ్యసించిన పిదప కేవల కుంభకము ప్రాప్తించును. ప్రాణాయామము కేవల కుంభకము సిద్ధించునంత వరకు సాధన చేయ వలయును.

సహిత కుంభకములు ఎనిమిది. అవి. 1. సూర్య బేధ, 2. ఉజ్జాయి, 3. సీత్కారి, 4. తేతలి, 5. భస్తిక, 6. భ్రామరి, 7. మూర్ఫ్చ, 8. ప్లావిని, అని ఎనిమిది విధములు. ప్రాణాయామమునకు ఉపక్రమించుటకు ముందుగా సుఖముగను, భద్రమముగ నుండు స్థలము నేర్పాటు చేసుకొని, అనగా మిక్కిలి ఎత్తుగా గాని, మిక్కిలి పల్లముగా కాని లేని ఒక ప్రదేశమున ఎక్కువ గాలి, ఎక్కువ వెలుగురు లేని స్థల మందు దర్భతో చేసిన చిన్న చాపను పరచి, దానిపై లేడి లేక పులి లేక చిరుతపులి చర్మములతో నేదైన లభించినట్లయిన దానిని పరచి ( లేని యడల అవసరము లేదు) దానిపై ఒక మెత్తని వస్త్రమును పరచి ఎక్కువ వెలుగురు లేని ఒక గదిలో సుగంధ ద్రవ్యముల నుంచి ప్రశాంత మైన మనసుతో అలవాటు పడిన యోగ్యమైన ఒక స్థిరాసనమున అనగా పద్మ, సిద్ధ, స్వస్తిక సుఖాసనుమలో నేదైన ఒక దానియందు కూర్చుండి ప్రాణాయామము చేయుటకు సిద్ధపడ వలయును. భగవద్గీత యందలి ధ్యాన యోగము ఆరవ ఆధ్యామమున 11 వ శ్లోకమున నిట్లు చెప్పబడినది.

శ్లో: శుచౌ తేశే ప్రతిష్ఠాప్య స్థిర మానస మాత్మనంః
నాత్యస్ఛ్ర్తం నాతినీచం చేలాజినకు శోత్తరం
తత్రై కాగ్రం మనః కృత్వాయతచిత్తేంద్రియ క్రియః
ఉపవిశ్వాసనే యం జ్యాద్యోగమాత్మ విశుద్ధయే.||

ఆసీనుడైన పిదప

సమం కాయ శిరోగ్రీవ ధారయన్న చలంస్థిరః
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వందిశశ్చానవ లోకయన్
ప్రశాంతతామ విగత భీర్బ్రహ్మచారి వ్రతేస్థితంః
మనః స్ంయమ్య మచ్చిత్తోయుక్త ఆసీత మత్చరః

అర్థము:

శుచియైన స్థానమున మనస్సుతో మిక్కిలి ఎత్తు, మిక్కిలి పల్లము లేకుండు నట్లుగా చేసుకొని ధర్భ, చర్మము వస్త్రములను పరచుకొని మనస్సుని ఏకాగ్ర పరచుకొని అందాసీనుడై వెన్ను, కంఠము శిరస్సు తిన్నగా వుంచి నాసిగాగ్రమున దృష్టి నిల్పి దిక్కులు చూడక భయము లేని ప్రశాంతత మనస్కుడై వుండవలయును.

నాడీ శోధనము కొరకు ప్రాణయామము చేయు పద్ధతి:....

పద్మాసనమున స్థిరముగా కూర్చొని ఎడమ నాసికా రంధ్రముతో అనగా ఇడా నాడితో వాయువును పూర్తిగా పూరించి మూల బంధ, జలధర బంఢ, ఉడ్వాన బంధములను వేసి పూరించిన కాలమునకు నాల్గు రెట్ల కాలము కుంభించి పూరించిన కాలమునకు రెండింతల కాలముతో నెమ్మది నెమ్మదిగా కుడి నాడీ చేత రేచించ వలయును. తిరిగి రేచించిన నాడి చేతనే వాయువును పూరించి పైవిధముగా 1: 4: 2 నిష్పత్తులతో చంద్ర నాడీ చేత రేచించ వలయును. ఇట్లు పలు మారులు మూడు మాసములపైన చేయుట వలన శరీరమున సూక్ష్మ, స్థూల నాడులన్నియు శుద్ది పొంది మలరహితమగును.

ప్రాణాయామమున పూరించిన నాడీ చేత వేచించ రాదు. కాని రేచించిన నాడి చేతనే పూరించ వలయనని నియమము.

1. సూర్య భేద ప్రాణాయామము:....

ఒక ఆసనమున (సిద్ధ, పద్మ, స్వస్తిక, సుఖ) కూర్చొని శిరస్సు, మెడ, వెన్ను తిన్నగా వుంచి కూర్చొని 'కుడి ' నాసికా ద్వారమున బయట నున్న వాయువును నెమ్మదిగా పూరించి జలాధార బంధము చేసి అనగా గడ్డమును రొమ్మునకు గుచ్చి మూల బంధము చేసి వాయువు పూరించిన కాలమునకు నాలుగింతల కాలము సేపు కుంభించి కుంభ కాంతమున ఉడ్వాన బంధమును అనగా గర్భ కుహరమును వెన్నుపైపు లాగి కొనుట చేసి పూరించిన కాలమునకు రెండింతల కాలము సేపు ఎడమ నాసికా రంధ్రమున నెమ్మది నెమ్మదిగా రేచించ వలయును. వాయువును రేచించునపుడు అనగా విడుచు నపుడు ఎల్లపుడు నెమ్మదిగానె విడువ వలయును. తొందరగా విడిచిన యడల శరీరమున నిస్సత్తువ ఏర్పడును. వాయువును తొందరగా పూరించ వచ్చును గానీ తొందరగా రేచింప రాదు.

సూర్య భేదము వలన వివిధములగు వాత రోగములు నశించును. క్రిమి దోషములు తొలగును. ఈ సూర్య భేదను ఇటిలనే తిరిగి తిరిగి చేయు చుండ వలయును. శరీరమున ఎక్కువ ఉష్ణము ఉత్పత్తి చేయును కనుక పిత్తాధిక్యత కల వారు చేయరాదు.

ఇటులనే ఎడమ నాశికా రంధ్రమున పూరించి కుంభించి కుడి నాసికా రంధ్రము చేత రేచించిన యెడల దానిని చంద్ర భేదమై చెప్ప బడినది. ఇది శరీరమున చల్ల దనము కలు

చేయును కనుక జలుబు చేసిన వారును శీతాకాలమందు కఫ వాత తత్వములు కలవారును చేయ రాదు. వీరు సూర్య బేధనములు చేయ వలయును. ఉష్ణాధిక్యత వలన కల్గిన రోగములు చంద్ర బేధనము నివారించును.

2. ఉజ్జాయి ప్రాణయామము:.....

నోటిని మూసుకొని నాసిక యొక్క రెండు రంధ్రముల చేత వాయువును పూరించి కొంచెము శర్మయగు వరకు అనగా పూరించిన కాలమునకు నాల్గు రెట్లు సమయము కుంభించి ఎడమ నాడి చేత రేచింప వలయును. దీని వలన శిరోగత రోగములు నశించును. కంఠ, గత, కఫ, శ్లేష్మ దోషములు హరించును. ధాతువు చక్క బడును. జఠరాగ్ని వృద్ధి యగును. ఈ ఉజ్జాయి ప్రాణామము నిలబడి నపుడు, నడుచునపుడు కూడ అభ్యసింప దగినది.

3. సీత్కారి ప్రాణాయామము:

నాలుకను పైకి మడచి నాలుక చివర పై దవడకు తాకు నట్లుగా వుంచి నోటి ద్వారా వాయువును శబ్ధము వచ్చి నట్లుగా గట్టిగా లోనికి పీల్చ వలయును. పూర్తిగా నిండుగా పూరించి పూరించిన కాలమునకు నాలుగు రెట్ల కాలము సేపు కుంభించి రెండు నాసికా రంధ్రముల చేతను వాయువును రేచించ వలయును. పూరించిన కాలమునకు రెండింతల కాలము రేచకము చేయ వలయును.

ఇది శరీరమునకు కాంతిని వృద్ధి జేయును. ఆకలిని దాహమును, మగతను, నిద్రను నివారించును. దాహముతో వున్నపుడు చేసిన యెడల దాహం తగ్గి పోవును.

4. సీతలి ప్రాణాయామము:....

పెదవుల వెలుపలికి నాలుకను చాచి గుండ్రముగా పక్షి ముక్కు వలె చేసి నాలుకతో (నోటితో) వాయువును పూరించి జలాంధర బంధనమును చేసి మూల భంధమును పూరించిన కాలమునకు నాలుగు రెట్లు కాలము కుంభించి కుంభాకాంతమున ఉడ్యాన భంధము చేసి నెమ్మది నెమ్మదిగా పూరించిన కాలమునకు రెట్టింపు కాలములో రేచించ బలయును. రేచకమును నాసిక యొక్క రెండు రంధ్రముల చేత (ఇడ, పింగళ) రేచించ వలయును.

దీని వలన గుల్మము, ప్లీహము, స్వస్రములు, విషములు హరించును. దీనిని పద్మాసనమున గాని సిద్ధాసనమున గాని ఉదయ సాయం సమయముల యందు చేయ వచ్చును. ఇది రక్తమును శుభ్రపరచును. దాహమును, ఆకలిని అణచును. శరీరమునకు చల్లదనము కల్గించును. ఇది విషములను హరించును.

5.భస్తికా ప్రాణాయామము:.....

కమ్మరి వారి తోలు తిత్తిని సంస్కృతమున భస్త్రిక అని అందురు. ఆ తోలు తిత్తీ బలముగా పూరించుచు బలముతో వదులు నట్లుగా పోలి వుండుట చేత భస్త్రికా ప్రాణయామమనిరి. సుఖముగ ఆసనమున కూర్చుని కుడి తొడపై ఎడ పాదమును ఎడమ తొడపై కుడి పాదమున కూర్చుని అనగా పద్మాసనమున కూర్చొని శిరస్సు, వెన్ను తిన్నగా వుంచి నాసిక యొక్క కుడి రంద్రముచేత (పింగళా నాడి చేత) ధ్వని యుక్తముగా రేచకము చేయ వలయును. మరియు

ఆ రేచించిన నాడి చేతనే వేగముగా పూరక రేచకములను చేసి కుడి నాసికా రంధ్రము చేత (పింగళా నాడి చేత) నే నిండుగా పూరించి పూరించిన కాలమునకు నాలుగు రెట్ల కాలము పాటు కుంభించి ఇడా నాడి చేత (ఎడమ నాడి) పూరించిన కాలమునకు రెండు రెట్ల కాలపు సేపు రేచించ వలయును. తరువాత ఇదే విధముగా ఎడమ నాడి చేత పూరించి ఘర్షణ చేసి అనగా త్వ్ర త్వ్రగా పూరక రేచకములను చేసి యధావిధి కుంభించి రేచించ వలయును. పూరకము చేసిన తర్వాత జలాధార బంధమును, మూల బంధస్మును చేసి కుంభ కాంతమందు రేచకమునకు ముందు ఉడ్వాణ బంధమును చేసి కుంభ కాంత మందు రేచకమునకు ముందు ఉడ్వాణ బంధమును వేసి కొంత సేపు ఉడ్వాన బంధము వుంచిన తరువాత నియమము ప్రకారము రేచింప నగును.

దీనినే మరియొక పద్ధతిన చేయవచ్చును. రెండు నాసికల చేతను ఒకే సారి పీల్చుచు, విడుచుచు కొన్ని పర్యాయములు అట్లు ఘర్షణ చేసిన తరువాత, ముక్కు రెండు రంధ్రముల చేతను పూరించి, పూరించిన కాలమునకు నాలుగు రెట్ల కాలము కుంభించి, పూరకము తరువాత జాలంధర బంధము మూల బంధములను చేసి కుంభ కాంతమున రేచకమునకు ముందుగాను ఉడ్వాన బంధమును చేసి ముక్కు రెండు రంధ్రముల చేతను నెమ్మది నెమ్మదిగా విధి యుక్తముగా రేచించ వలయును. దీని వలన శరీరమునకు ఎక్కువ శ్రమ కల్ల్గును. మరియొక సారి చేయుటకు ముందుగా కొన్ని సామాన్యమగు శ్వాస నిస్వాసములు చేసి తరువాత మరియొక పర్యాయము చేయ వలయును.

భస్త్రిక గొంతులోని శ్లేషమును, హరించును. జఠరాగ్నిని వృద్ధి చేయును. రొమ్ము, గొంతు వ్వాధులను నివారించును. ఆకలిని వృద్ధి చేయును. గ్రంధి త్రయమును అనగా బ్రహ్మ గ్రంధి విష్ణు గ్రంధి రుద్ర గ్రంధులను చేధించుటలో సహకరించును. సుషుమ్న నాడి ముఖ ద్వారమున నున్న మలమును నాశనము చేయును. శరీరమునకు ఎక్కువ ఉష్ణము నిచ్చును. అందు వలన చల్లని సమయములోనే దీనిని చేయ వలయును. శరీరమునకు బలమును కలుగ జేయును. రక్తమును శుద్ధి చేయును. శరీరమున అనవసరమగు చోట్ల నిలువ నున్న క్రొవ్వును కరిగించి శరీరమును లాఘవముగా నుంచును.

6.బ్రామరీ కుంభకము

బ్రమరమనాగా తుమ్మెద. భ్రామరీ ప్రాణాయామమును చేయునపుడు తుమ్మెద నాదము వంటి శబ్ధము వచ్చుట చేత ఈ విధమగు ప్రాణాయామమును బ్రామరి అనిరి. పద్మాసన, సిద్ధాసనములలో నొకదాని మీదకూర్చొని ముక్కు యొక్క రెండు రంధ్రములతోను శబ్ధముతో కూడిన పూరకము చేసి పూరకమునకు పట్టిన సమయమునకు 4 రెట్లు కాలమును కుంభించి రేచక కాలమును రెట్టింపు కాలములో రెండు రంధ్రములతోను శబ్దముతో కూడిన పూర్ఫకము చేసి పూరకమునకు పట్టిన సమయమునకు 4 రెట్లు కాలమును కుంభించి రేచక కాలమును రెట్టింపు కాలములో రెండు రంధ్రములతోను శబ్ధముతో రేచించ వలయును. పూరకము తర్వాత జాలంధర మూల బంధములను కుంభ కాంతమందును రేచకమునకు కొంచెము ముందుగను ఉడ్యాన బంధము చేయ వలయును. పూరకము చేయుటకు ముందు కొన్ని సార్లు రెండు నాసికా రంధ్రములతో త్వరత్వరగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయ

వలయును. తరువాత పూరకము చేయ వలయును. దీని వలన కుండలీ ప్రబోధము జరుగును.

7.మూర్చా కుంభకము
....

పద్మ, సిద్ధ ఆసనములలో ఒక దానిపై కూర్చొని బయట నున్న వాయువును రెండు నాసికా రంద్రముల చేతను పూరించిన వెనుక జాలంధర మూల బంధములను చేసి యధావిధి కుంభించి (అనగా 1: 4: 2: నిష్పత్తి గల కాలమున) కుంభ కాంతమందును రేచకమునకు కొంచెము ముందుగను ఉడ్యాన బంధమును చేసి శ్రమయగు వరకు కుంభించి మూర్చ వచ్చు నట్లు తోచగనే రేచకము చేయ వలయును.

మనస్సును సృహ తప్పినట్లు ఉంచునట్టు శక్తి గలది మనసుకు ఆనందముగా వుండును.

8. ప్లావినీ కుంభక ప్రాణాయామము:

ప్లవ మనగా పడవ. శరీరమును పూర్తిగా వాయువు పూరించిన శరీరము పడవ వలె నీటిపై తేలును. రొమ్ము లోతు నీటి యందు దిగి నీళ్ళు త్రాగు రీతిని వాయువును నీటితో కడుపు లోనికి మింగవలయును (శ్వాస కోశములలోనికి కాదు) కడుపు లోనికి గాలి ప్రవేశించి రబ్బరు తిత్తి వలె పైకి ఉబుకును. అట్లు ఎక్కువ గాలిని కడుపు లోనికి పట్టుట అలవరచుకొని అనుభవజ్ఞడగు శిక్షకుని వద్ద నుండి నీటి లోనికి దిగి కాళ్ళు నిగిడ్చి నీటిపై పరుండ వలయును. శస్రీర మంతయు శవము వలె నీటి మీద తేలును. చేతులు రెండింటిని తలకు పైగా తిన్నగా నీటిపై వుంచ వలయును. శరీరమున ప్రవేశించిన వాయువు ప్రభావము వలన పూర్తిగా శరీరము నీటిపై తేలును.

గాలిని విడువగనే శరీరమును నీట మునుగ ప్రారంభించును. కొన్ని దినములు ఇట్లు నీతి మీద తేలుట అభ్యసించిన తరువాత మత్స్యాసనమును వేసి కూడ నీటిపై తేలి వుండ వచ్చును. సామాన్యముగా ఉచ్చ్వాస నిశ్వాసములు జరుపవచ్చును. ఎంత కాలమైనను సుఖముగా కడుపులో గాలిని పట్టి పుంచ గల్గు వరకు నీటి మేద వుండవచ్చును. సముద్ర మధ్య నందసిన నీటియందు నిర్భయముగా తేలి యుండ వచ్చును.

దీని సహాయమున సాధకుడు పవన భక్షణమును అలవరచు కొనవచ్చును.

మనము వాయువును శరీరము లోపల ధరించిన అంతర కుంభకములను గురించి తెలిసికొంటిమి. వాయువును శరీరములో ధరించిన పద్దతికి భిన్నముగా వాయువును సంపూర్ణముగా రేచించి యుండుటను బహిర్కుంభకము లనిరి. ఈ బహిర్కుంభకము పరకాయ ప్రవేశమునకు ఉపయుక్తమని చెప్పబడినది. నేపాల్, టిబెట్టు ప్రాంతాములలో ఈ బాహ్య కుంభకములు చేయు వారు కొంత కాలము క్రితము చాల మంది వుండేవారట. ఈ పరకాయ ప్రవేశమును దుర్వినియోగపరచు చుండుట చేత ఈ విద్యను గురువులు చెప్పుట మాని వైచిరి.

అంతర కుంభకములను సహిత కుంభకములనియు బహిర్కుంభకమును విహ్యిత కుంభకము లనియు రేచక పూరకము లేని అవస్థను కేవల కుంభకమని చెప్పబడినది. కేవల కుంభకము సిద్దించు నంతవరకు సహిత కుంభకముల నభ్యసించ వలయును. శరీరము నుండి నీటితో నిండిన కుండను పోలిన

శబ్దము వచ్చునపుడు కేవల కుంభకము సిద్ధించినట్లు తెలియ వలయును. షణ్ముఖీ ముద్రను ధరించి విన ప్రయత్నించి శరీరములోని శబ్ధములను విన వచ్చును. కేవల కుంభకము సిద్దించిన తరువాత సహిత కుంభకములు సాధన చేయ వలసిన పని లేదు. పర్యాయమునకు 20 నుండి 80 య దినమున 4 పర్యాయములు అనగా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం, అర్థ రాఅత్రి చేయ వలయును. కేవల కుంభకము సిద్ధి పొందు వారు రాజయోగి అనబడుచున్నారు. రాజయోగ సిద్దించుట కొరకు హఠ యోగము సాధనమై నందున హఠ యోగమునకు రాజ యోగము రాజ యోగమునకు హఠ యోగము పరస్పరము అవశ్యకములు. హఠ యోగము సిద్ధీంచిన వ్యయందు శరీర లాఘవము. నాదస్పుటము నాడీ శుద్ధి జటర బల ఆయురారోగ్యములు వృద్ధి చెందును. శరీర లావణ్యము పెంపొందును. నిజమునకు హఠ యోగము ఎచ్చట నిలిచిపోవునో అచ్చటి నుండి రాజయోగము ప్రారంభమగుచున్నదని తెలియనగును.

ప్రాణాయామమును కనిష్టమని, మధ్యమమని, ఉత్తమమని మూడు విధములుగా విభజించిరి. కనిష్ట ప్రాణాయాయమున స్వేదము వచ్చును. ఆ చమటను తుడిచి వేయక అభ్యాస మధ్యలోగాక అభ్యాసానంతరము ఆ చమటను శరీరమునకు రుద్దు కొనుట మంచిది. అట్టి చమటలో చర్మము పైన సూక్ష్మ జీవులను చంపెడి శక్తి యుండును. మరియు కొన్ని రసాయినక పదార్థములు ఉండుట చేత అవి చర్మమునకు లావణ్యమును గూర్చును. చమట శరీరములో ఉద్బవించిన

మును శరీరమునకు కావలసిన విధముగా సరిపెట్టి వుంచును. మధ్యమ ప్రాణాయామమున శరీరము కంపమును పొందును. ఉత్తమ ప్రాణాయామమున శరీరము ఎగురుట (ఎత్తుట) జరుగును. ఇటుల ఎత్తుటను మండూకావస్థ యందురు. ఇది అప్రయత్నముగానే ఎగురుట జరుగును. కొంత మంది ప్రయత్న పూరకముగా కప్పవలె ఎగురుటకు ప్రయత్నము చేయుదురు. కాని వాయువు శ్వాస కోశములందు నింపబడి కుంభించిన పిదప కొంత సేపటికి బహిర్గత మగుటకు ప్ర్యత్నించి మూల బంధము చేత ద్వారమున అవరోధము కల్గుట వలన ఉద్వాసము చేత ఎత్తబడుట వలనను వాయువు మాటి మాటికి ఎగురు చుండును. అది ఉత్తమ ప్రాణాయామము. అట్లు ఎగిరి ఎగిరి అలవాటు పడి ప్రాణము శాంతించి లొంగి పోవును. అనగా వేగము అడగి పోవును. శ్వాస వేగము అణగుట వలన మనోవేగము అణగును.

ప్రాణాయామము అభ్యసించు విధమున సంక్షిప్తముగా చెప్పబడు చున్నది:

సాధకుడు యమ నియమములను అందు ఆహార నియమములను పాటించు నట్టి వాడై ప్రాతః కాలముననే నిద్రనుండి మేల్కాంచి తన యిష్ట దేవతను ప్రార్థించి కొంతసేపు ద్యానించి తదుపరి కాల కృత్యములను తీర్చుకొని చేతనైన వారు కొంచెము అలసట వచ్చు పర్యంతము శరీర వ్యాయామును చేసి (ఇచట కొంచెము అలసట వచ్చునట్లు అని చెప్పబడినది ఎందుకనగా శక్తికి మించిన వ్యాయామము పనికి రాదు అని) అనంతరము ఆససములను అభ్యసించి శరీరముపై

వచ్చిన చమటను తుడిచి వేయక శరీరములోని (చర్మములోనికి) రుద్ది అలసట పూర్తిగా తగ్గిన వెనుక అనగా అలసటకి శరీరములో కల్గిన ఉష్ణము చల్లారిన పిదప నులి వెచ్చని నీటితో స్నానము చేసి యోగాభ్యాసము చేయుటకు ఏర్పరుచు కొన్న గదిలో సువాసన ద్రవ్యములతో పరిమళించునట్లు అగర వత్తులు వంటివి వుంచి అతి ఎత్తును అతి పల్లమును గాకుండ నుండు నట్లు ఒక చక్క పీటను వేసుకొని దానిపై దర్భాసనము వేసి దానిపైన లభ్యమయినట్లయిన జింక లేక చిరుత పులి చర్మము పరచి లభించిన యడల అవసరము లేదు. దానిపై మెత్తగా నుండు గుడ్డను పరచి గది లోనికి ఎక్కువ వెలుతురు, శబ్దములు రాకుండ చేసి అట్టి స్థలములో ముందుగా సర్వాంగాసనము,శీర్ష్య, లేక విపరీత రకణీ ముద్రలలో ఒక దానిని చేసి తరువాత సరస్వతీ చాలనము చేయ వలయును.

గదిలో ఏర్పటు చేసుకొనిన పీట మీద తూర్పునకు గాని ఉత్తరమునకు గాని అభిముఖముగా పద్మ, సిద్ధ, స్వస్తిక, సుఖాసనములలో నొకదాని యందు కూర్చొని మనస్సును ఇస్ట దైవ మందు లగ్నము చేసి తరువాత కపాల భాతిని చేసి ముందుగా అష్ట కుంభకములను లేదా అందు ఒక దానిని గాని పూరక, కుంభక, రేచకములు 1: 4: 2 నిష్పత్తిలో నుండు నట్లు ఆచరించ వలయును. పర్యామమునకు ఇడా, పింగళ నాడులలో (కుడి, ఎడమ నాసికా రంద్రములలో ) 10 కుంభకముల చొప్పున ఒక వారము దినములు దినమునకు నాలుగు పర్యాయములు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అర్థ రాత్రిల యందు సాధన చేసి కుంభక కాలమును సంఖ్య

లను క్రమ క్రమముగా పెంచు చుండ వలయును. ముందుగా చేయు చున్న కపాల భాతి యందు ఘర్షణ జరుగు చున్నది. ఘర్షణ అనగా ఉస్ఛ్వాస, నిశ్వాసములను శబ్దముతో కూడిన వేగముగా చేయుట. వాయువును పూరించగనే ఒక గ్రుక్క వేసి (అనగా మింగుట) జాలంధర బంధమును, మూల బంధమును వేయవలయును. కుంభకము సగ భాగము వున్నదనగా ఉడ్డి యాన బంధము చేసి పరీధాన యుక్తి పరీచాల క్రిదులను చేసి తాడన క్రియను సల్పి తరువాత మహా ముద్రను వేసి క్రమము చొప్పున రేచకమును నెమ్మది నెమ్మదిగా చేయ వలయును. ప్రారంభ దశలో ఒక కుంభకమునకు మరియొక కుంభకమునకు నడుమ కొంచము సేపు ఒకటి రెండు ధీర్ఘ ఉచ్చ్వాస నిశ్వాసములు చేయ వచ్చును. సాధన అభివృద్ధి పొందిన తరువాత కుంభకము వెంట మరియొక కుంభకము చొప్పున 80 ఎనుబది కుంభకములు చేయు చుండ వలయును. ఇట్లు చేయుట వలన యోగ నాడీ మండలము శుద్ధి యగును. సుషుమ్న నాడి యందలి మల పదార్థములు అన్నియు ఇరిగి పోయి సన్నని ఖాళీ గొట్టము వలె నుండును. నాడీ మండలము శుద్ధి యగుట వలన అనాహత శబ్ధములు శుద్దముగా వినబడును. మనస్సును ఒక చోట లగ్న పరచి దృష్టిని నాసికాగ్రమున గాని భ్రూమధ్యమున గాని లేక అనాహత, మణి పూరక చక్రములలో ఒక దాని యందు నిలిపి వుంచి కొంత సేపు కేవల కుంభకమును సాధనము చేయ వలయును. కేవల కుంభకమనగా పూరక రేచకములు లేని యవస్థ. ఇట్లు సాధన చేయు అవస్థయందు మనస్సు లయమగును. అదే విధముగా నాదమున

లయము చేయును. శరీరము లాఘవముగను కాంతి మంతేముగను వుండును. క్రొవ్వు తగ్గి పోవును. శ్రీరము శక్తి వంతముగను మనస్సు ఉత్సాహవంతముగ నుండును. తొందరపాటు లేక దినమునకు నాల్గు పర్యాయముల చొప్పునచేసిన ఉష్ణము (యోగాగ్ని) ఉత్పత్తి యగును. ఆ ఉష్ణమునకు నిద్రించుచున్న కుండలిని మేల్కాంచి చుట్ట చుట్టలుగా చుట్టుకొనిన తన దేహమును నిడివిగా చాచుకొనును. తన ముఖము సుషుమ్నా నాడి యొక్క ద్వారముననే వున్నది. కనుక ఇది సాగి నపుడు సుషుమ్నలో ప్రవేశించును. చెరకు గడలో కణుపుల వలె. సుషుమ్నలో ఆరు చక్రములు మూడు గ్రంధులు యున్నవి (1. మూలాధార, 2. స్వాదిష్టాన, 3. మణి పూరక, 4. అనాయిత, 5. విశుద్ధ, 6. అజ్ఞా చక్రములు (ఏడవది సహస్రారము) అను చక్రములు. బ్రహ్మ గ్రంది విష్ణు గ్రంధి. రుద్ర గ్రంధులు మూడును గ్రంధి త్రయము లనబడినవి. ఈ నాడీ కూడలులు కఠినముగా వుండుట వలన అయా చక్ర గ్రంధి భేదనము జరిగి కాని కుండలిని ముందునకు సాగలేదు. అవి భేదింప బడగా మహా మాతయైన శక్తి సహస్త్రారమున పరమేశ్వరుని చేరును. అపుడు యోగి నిర్వికల్ప సమాధి నందగా ఆస్థితిని చెప్పుటకు మాటలు లేవు. ఆయానందము అనిర్వచనీయము. శరీరమున వున్న అత్మ పరమాత్మను పొందును. కుండలిని సుషుమ్న యందు ప్రవేశింపగా యోగి అణిమాది అష్ట సిద్ధులను పొందును. సిద్దులను తిరస్కరించి పరమావధి యగు సమాధి నభిలషించి సాధనను కొన సాగించ వలయును. ఈ సాధన నిర్వికల్ప సమాధిని పొందు వరకు

జరుగుచుండిన ఇట్టి యోగి తన ఇష్ట ప్రకారము అన్ని కార్యములను తుదకు శరీర త్యాగము కూడ కోరినపుడు చేయ గలడు.

సాధన సందర్భములో సాధకుడు జాగ్రత్త పడవలసిన విషయములు:....

సాధకుడు స్థిర సంకల్పముతో నిర్వికల్ప సమాధిని ధ్యేయముగా నిడుకొని భయమును విడిచి, సాహసముతో గురువుల సన్నిధిని గాని ఈ విషయమూ బాగుగా తెలిసిన వారి వద్ద గాని చేయవలయును. మొదట నాడీ మార్గమును పరి శుద్ధము చేసుకొన వలయును. స్థూల శరీరము నందు కల్గు లాఘవము తేజస్సుల చేత దీనిని గుర్తించ వలయును. అత్యాశతో తొందరపడి ఏదో ఒకటి తేళ్చుకొనవలయునని ప్రత్నించ రాదు. నాడి మార్గము శుద్ధి కాక ముందే క్రమము తప్పి చేసి నట్లయిన నాడులలో వున్న మలము చేత అవరోధము కల్గి ప్రాణము అచట నిలిచి పోవును. అట్టి సమయమందు విషయ పరిజ్ఞానము గలవారు చెంత నున్న యడల వారు నాడీ మార్గము, శరీరము బాగుగా మర్ధించిన ప్రాణము తిరిగి చలించును. ఒకొక్కపుడు చెవినందు గట్టిగా ఓం కారము ద్వని చేసినట్లయినను తిరిగి మెలకువ వచ్చును. అందుకనియే గురువుల యొక్క పర్యవేక్షణ అవసరమని శాస్త్రము శాసించినది.

ప్రత్యాహారము
...

బాహ్య ప్రపంచముతో మనము సంబంధము పెట్టుకొనుటకు మనకు పంచేంద్రియము (త్వక్, చశు, స్సోత్ర, జిహ్వ, భ్రాణములు) వున్నవి ఆరోగ్యముగా ఉన్నప్పటికి శరీర

మన ప్రాణము వున్నప్పటికి పంచేంద్రియాలతో మనస్సు సంపర్గము లేని యడల మనకు ప్రపంచమందలి విషయములను ఈ ఇంద్రియముల ద్వారా తెలిసికొనలేము. సంపూర్ణముగా నిద్రించు చున్న సమయమున మనస్సు అజ్ఞా చక్రమందు అనగా రెండు కనులకు మధ్యగా కొంచెము పై భాగమున హిందువు తిలక ధారణము చేయు చోటునందు కేంద్రీకరించ బడి విశ్రాంతిని పొందు చున్నది. ఆ సమయమునే గాఢ సుషుప్తి అని అందురు. ఒకొక్క సమయములోను, గాఢ నిద్రకు ముందుగాను శరీరము విశ్రాంతి తీసుకొను చున్నను మనస్సు తన వృత్తియైన సంకల్ప వికల్పములు చేయు చుండుట వలన స్వప్నములు కలుగు చున్నవి. ఇది స్వప్నావస్థ. మనకు మెలకువ వున్నపుడు మన ఇచ్చ అవసరము లేకయో ఈ ఇంద్రియములు మనసుతో సంపర్గము పొందుటచే విషానుభవమును పొందు చున్నాము. మన ప్రయత్నంతో మెలుకువగా వున్నపుడు కూడ మనస్సును నిగ్రహించి ఈ ఇంద్రియములతో సంయోగము చెందనీయక ఉప సంహరించి నిర్వ్యాపారముతో వుండుటయే ప్రత్యాహారము. అనగా యింద్రియ వ్యాపారమును ప్రతి హరించుట అని అర్థము. దీనిని ప్రాణాయామమునందు అధిక ప్రావీణ్యమును సంపాదించ గల్గినట్లయిన సాధించ వచ్చును. అనగా ప్రాణాయామము యొక్క ఫల స్థితి వలన మనస్సు ఇంద్రియముల నుండి విడదీయ గల్గుదుము.

ధారణ
.......

ఇంద్ద్రియముల నుండి ఉప సంహరించ బడిన మనస్సును ఒక ప్రత్యేకించిన కార్య మందు గాని ఒక స్థానమున గాని తన శరీరమందలి షట్చక్రములలో ఒక దాని యందు నియమించుటను ధారణ యని చెప్ప బడు చున్నది. అటుల చేయుట వలన మనస్సు ఒక క్రమ శిక్షణకు అలవడి ఉత్తమ స్థితిలో వర్థిల్లును. వికర్షించబడి వున్న సూర్య కిరణములను భూత అద్దములో కేద్రీకరించి నపుడు ఎక్కువ కాంతియు, వేడిమియు కల్గు చుండుట చేత ఆ కిరణములు కేంద్రీకరించ బడినపుడు బలము అధికంగా అగుచున్నట్లుగనే స్వేచ్చగా బహు వ్యాపకముతో వికర్షింపబడిన మనస్సు కేంద్రీకరించ బడినపుడు బహు గొప్ప శక్తిని పొందును. ఒక స్థానమున నియమించ బడుటకు మనస్సుకు నిర్విరామముగా శిక్షణ నీయవలయును. ఇట్టి వ్యాయామమునకు ఏకాంతము చాల ఉపకరించును. జనుల తోడను లౌకిక విషయంతోను సంబంధము చాల వరకు తగ్గించ వలయును. లేనిచో మనస్సు వికర్షింపబడి ఏకాగ్రతకు చాల కష్టమగు చుండును. యోగము అభ్యసించుట వలన సాధకులకు మనశ్శాంతియు మనో బలము యింద్రియ జయము కల్గునే గాని ఏ విధముగాను హాని చేయదు. యోగమును గూర్చిన సరియగు జ్ఞానము లేని వారు దీనిని గూర్చి తప్పుడు ప్రచారము చేయుట కలదు. బలము పొందిన మనస్సు వలన శరీరమున అరోగ్యము వృద్ధి యగును. సాధన అభివృద్ధియగు కొలది మనశ్శరీరములు సూక్ష్మస్థితికి వచ్చును. అందువలన యింద్రియములకు గ్రహణశక్తి అతి సూక్ష్మమగుచుండును. నేలపై బడిన సూది వలన కల్గిన శబ్దమును కూడ వినగల్గు నట్లుగా చెవి యొక్క గ్రహణ పాటవము పెంపొందును. అటులనే మిగిలిన యింద్రియముల శక్తి కూడ సూక్ష్మ స్థితికి వచ్చును. ప్రాణాయామము చేత శ్వాసయు, ప్రత్యాహరము చేత యింద్రియములను వశపడును.

ప్రాణాయామమును చక్కగా సాధన చేసిన యెడల అనగా ఆహారాదినియమములతోను, బంధములతోను, ముద్రలతోను కలిపి సాధనచేయుచున్న యెడల సాధన విశిష్టత వలన కేవల కుంభకము సిద్ధించును. అనగా శ్వాస ప్రశ్వాసలు నిలిచిపోవును. అందుచేత మనోవేగము అణగిపోవును. ప్రాణాయామము వలన కల్గిన ఉష్ణము వలన దేహము నందలి సూక్ష్మనాడి మండల మంతయు శుద్ధియగును. శుద్ధి పొందిన నాడీ మార్గమున సుషుమ్న యందు ప్రాణము ప్రవేశింపగా మనస్సులయమగును. మనస్సులయమగుట వలన యింద్రియములతో ఎడబాటు కల్గి వానికి విషయమును తెలిసికొను శక్తియుండదు. అనగా యింద్రియ వ్యాపారము ప్రతిహరింపబడును. మరియు నాధాను సంధానము ప్రత్యాహారమునకు, ధారణకు మరియొక సాధనము. షన్ముఖి ముద్రయందు అనగా రెండు చెవుల రంధ్రములను రెండు చేతుల బొటన వేళ్ళతో మూసుకొనుట వలనగాని శరీరము లోపలి నుండి వచ్చు అవ్యక్తమగు ధ్వని వినదగును. మనసును ఆ శబ్దముపై లగ్నము చేసిన మిగిలిన యింద్రియముల నుండియు బాహ్య

విషయముల నుండివిడి వడును. నాధాను సంధానమున తగుల్కొనిన మనస్సు స్థిరమైన ధారణ పొందు చున్నది.

మనస్సు స్థిరమైనపుడు ప్రాణ వాయువు (శరీర మందలి చలన వ్యాపారము) స్థిరమైనది. ప్రాణము స్థిర మగుట చేత బిందువు స్థిర పడి శరీరమునకు బలము, తేజమును వృద్ధి చేయును. సాధనమున మనస్సు కేంద్రీకరించుట వలన నాదమున మనస్సు లయమందినదని తెలియ వలయును. మనస్సును లయము చేయుటకు శాంభవి యును ముద్ర చేత సాధ్యమగును. మనస్సును తక యిస్ట దైవమందు గాని నిర్గుణ బ్రహ్మ యందు గాని స్థిరము చేసిన వానికి కంటి రెప్పలు మూత పడవు. అట్టి స్థితి యందు తన ఎదుట నున్న ప్రపంచమును చూచుచున్నట్లు ఎదుటి వారికి తోచినను, సాధకుడు మాత్రము దృస్టితో దేనిని కూడ గ్రహింప జాలకున్నాడు. అనగా మనస్సును తనతో నున్న ఆత్మయందు లగ్నము చేసి కండ్లు విప్పియుంచియు కూడ దృష్టిని నిరుద్ద పరచుట. దీని వలన చిత్తము లయమందు చున్నది. లయ పరచుటకు ఉన్మనీయను మరియొక ముద్ర గలదు. పైన చెప్పి నట్లుగానె అంతర్లిక్ష్యము బహిదృష్టి అను సాధాముతో కూడు యున్నది. సగము తెరిచిన నేత్రములను అనగా వాయువును సుషుమ్నాగత మొనర్చి అనగా సూర్య చంద్ర నాడులను నిరోధించిన కేపల కుంభక స్థితిలో నున్నపుడు ప్రాణము సుమష్న యందు సంచరించు చున్నది. అపుడు మనస్సు తన యందు (తన ఆత్మయందు) లగ్నము చేసిన యెడల దానిని ఉన్మనీ ముద్రయని చెప్పబడు చున్నది. ప్రాణ

వాయువు సుషుమ్న యందు ప్రవేశించునపుడు ఉన్మన్యవస్థ తప్పక కల్గును.

ధ్యానము
.......

మనస్సును ఇంద్రియములలో సంయోగము చెందనీయ కుండుట ప్రత్యాహారమని చెప్పితిమి. అందువలన ఇంద్రియములు వశీకరణము కల్గును. మనసు కూడ వశమగు చున్నది. అట్లు వశీకరణమయిన మనస్సును ఒక ప్రత్యేకించిన వ్యాపారమందుగాని స్థాన మందు గాని నియమించుట ధారణము అని చెప్పితిమి. అట్లు నియమించిబడిన మనస్సును ఏక భావ ప్రవాహ రూపమున నున్న స్థితిని ధ్యానమని చెప్పుదురు. స్వాభావికముగా మనస్సు బహు చఫలమగుట చేత దీనిని పాదరసముతో పోల్చి యున్నారు. నిత్యము సంకల్పములు చేయుచు వికల్పము చేయుచు మరల మరల సంకల్ప వికల్పములను చేయుచునే యుండును. దీనికి కారణము శరీరమున ప్రాణము (శ్వాస) ఎంతవరకు చలించు చుండునో మనస్సు అంత వరకు చలించును. చిత్తమును ఏకాగ్ర స్థితికి రానీయదు. చిత్తమునేకాగ్ర పరచుటకు ప్రాణమును జయించి లయము చేయ వలయును. అపుడు మనస్సు లయమగును. అట్లు లయమయిన మనస్సును ధారణ చేసి అనగా ఒక చోట నియమించి యుంచి దానిని ఏకధార రూపముగా ఎక్కువ కాలముంచుటను ధ్యాన మనబడు చున్నది. యిట్టి స్థితి భక్తితో తన్మయత్వము పొందుట చేతను మరియు యోగము చేత సాధ్యమగు చున్నది. ధ్యాన

స్థితియందు ప్రాణ చలనము నిలచి పోవును. శ్వాసించుచు ధ్యానము చేయు చున్నమనుట సరియైనది కాదు. ధ్యానమున సిద్ధి పొందినపుడు శ్వాస సమసి పోవును. అట్టి స్థితిలో మాత్రమే ధ్యానము పక్వమైనట్లు తెలియ నగును.

ధ్యాన స్థితి యందు దృష్టిని ఎచట నిలుప వలయునని చాల మందికి సందేహము కల్గు చున్నది. దృష్టిని మూడు విధములుగా విభజింప వచ్చును. ఒకటి పూర్ణిమా దృష్టి. రెండు ప్రతిప దృష్టి. మూడు అమవస దృష్టి. పూర్ణిమా దృష్టి అనగా కనులు పూర్తిగా తెరచి భ్రూమధ్యమున లగ్న పరచుట. ప్రతిపద్దృష్టి అనగా రెండు కన్నులను అర్థనిమీలతముగా నాసికాగ్రమున నిల్పుట. అమవస దృష్టి అనగా రెండు కన్నులను పూర్తిగ మూసి మనస్సును షట్ చక్రములలో ఒక దాని యందు లగ్న పరచుట. అట్లు దృష్టిని లగ్నము చేసి మనస్సును శరీరము నుండి వచ్చు నాదమందు అనగా అనాహత శబ్దమందు లయము చేసిన సిద్ధిని పొందనగును.

సమాధి
............

పైన చెప్పిన విధముగా ఏకధారా ప్రవాహ రూపమున ధ్యానము చేయుచు అధ్యానమున రూపమును విడిచి అర్థమును మాత్రము నిలుపునట్టి స్థితియే సమాధి. సమాది ముఖ్యముగా రెండు విధములు. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రాజ్ఞాత సమాధి. ఇది పరిణితిలో భేదము, ఉన్మని, మనోన్మని, శూన్యాశూన్యము, పరమ పధము, అమనస్కము, అమరత్వము, జీవ

న్ముక్తి, సహజము, తుర్యము అనునవి సమాధి అను పదమునకు పర్యాయ పదములు యోగమునకు ఫలము సమాధి.

మేల్కొన జేసిన కుండలిని మణి పూరక చక్రమును అధిగమించగా ప్రకృతి యొక్క సహజ శక్తులను దిక్కరించ గల శక్తులను యోగి పొందగలడు. కుండలిని సుషుమ్నయందు ప్రసరించగా యోగి అష్ట సిద్దులను క్రమముగా పొందు చున్నాడు. ఒక విషయము పై ధారణ చేసి ధ్యానము చేసి సమాధి గతుడైన స్థితిని సంయమ మందురు. (ఇక్కడ సమాధి అసంపజ్ఞాత సమాధి మాత్రము కాదు) ఈ స్థితిలో ఆ విషయము యొక్క రూపము అదృశ్యమై అర్థము మాత్రము మనస్సున భాసించును. సంయమమున ప్రజ్ఞ పొందుటకు ముందుగా స్థూలము యందునను, రాను రాను సూక్ష్మముల యందూ, సంయమము చేయ వలయును. అనగా ముందుగా కార్యమున సంయమనము చేసి రాను రాను కారణములపై సంయమనము చేయుట అని తెలియ నగును. ఇట్టి సంయమన స్థితి యందు యోగి సిద్దులను ప్రదర్శింప గలడు.

సంయమన కాలమున చిత్తమును బహు సూక్ష్మ స్థితిలో నేకాగ్ర పరచు చున్నాము. అనగా చిత్తము నొక విషయమున నియమించి నపుడు మరియొక విషయమును చోరనీయ కుండు స్థితిని చిత్రైకాగ్రత అని చెప్పనగును. ఒకొక్కప్పుడు మనస్సు అత్యంత అభిరుచిగల విషమున దగుల్కొని నపుడు చీమలు

కుట్టినను, పాములు ప్రక్కల నుండి పోయినను గ్రహింప లేని అవస్థ గల్గును. ఒకరు ఒక లెక్కను సాధించుట యందు నిమగ్నుడై నపుడు ఆకలిని కాలమును కూడ మరచును. అట్టి స్థితిని చిత్తయికాగ్రత యని చెప్ప వచ్చును. ఒక యోగి ఇతరుల యింద్రియములపై సంయమము చేసిన యెడల యోగి అభిమతాను సారముగా యితర వ్వక్తి నడచుకొనును. ఆయా విషములపై సంయమనము చేయుట చేత అయా విషయముల శక్తి పొందును. ఏనుగు బలము పైనను, పర్వతము యొక్క బరువు పైనను, దూది రేణువు యొక్క తేలిక స్వభావము పైనను సంయమనము చేసిన యా విషములను ప్రాప్తింప చేసుకొనును. ఇట్టి సిద్ధులు యోగాభివృద్ధికి, అభివృద్ధికి నిరోధకములు. సమాధిని విడిచిన కాలమున వ్వవహార స్థితి యందు యోగి యొక్క సంకల్ప బలమే సిద్ధులుగా వున్నవి. యోగి ఇట్టి సిద్ధులను ప్రకటించి లౌకిక ప్రపంచము లందు ప్రతిష్టా వ్యాపారమున చిక్కి విషయ లోలత్వమునకు గురియై ధ్యేయమును మరచు స్థితి పట్ట వచ్చును. అందు చేత సిద్ధుల జోలికి పోవుట నిరుత్సాహ పరచ బడినది.


ఓం శాంతి, శాంతి, శాంతిః.