యోగాసనములు/యోగాసనములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యోగాసనములు

(ప్రారంభం)

ఆసనమనగా స్థిరసుఖమ్‌ అని పతంజలి మహర్షుల వారు వివరించిరి. ఆసనము శరీరమునకు స్థిరత్వమును, సుఖమును ఇచ్చునదై యుండును. ప్రపంచముపై ఎన్ని జీవ రాసులున్నవో అన్ని ఆసనములు ఉన్నవి. కాని విజ్ఞానులైన ఋషులు 84 లక్షల ఆసనములకు బదులు 84 ఆసనములను మాత్రమే ముఖ్యమైనవిగా పేర్కొనిరి. ఆ ఎనుబది నాలుగింటిని కూడ కుదించి ముప్పది రెండు మాత్రము అతి ముఖ్యమైనవిగా మానవ శరీరమునకు ఉపకరించునని నిర్థారణ చేసిరి. ఆసనములు కొన్ని బోరగిల పడుండి చేయునవి. కొన్ని వెలకిల పరుండి చేయునవి. కొన్ని నిలబడి చేయునవి. మరి కొన్ని కూర్చొని చేయునవి. ఇలా నాలుగు విధములుగా వర్గీకరింపవచ్చును. అందు కూర్చొని చేయు ఆసనములు సిద్ధ, పద్మ, స్వస్తిక, సుఖ అను నాలుగు ఆసనములు. అప్రయత్నముగా శుక్రమును బహిష్కరింపబడనీయదు. శుక్రము బహిష్కరింపబడక ఓజస్సుగా మారి సుషుమ్న గుండా ఊర్ద్వ ముఖముగా ప్రసరించి శరీరమంతను వ్యాపించును. అందుచేత సిద్ధుడైన యోగిని ఊర్థ్వ రేతస్కుడని యందురు.

ఆసనము చేయు పద్ధతి: సాధకుడు కాళ్ళు రెండును ముందునకు చాచి కూర్చొని ఎడమ కాలిని మోకాలి వద్ద నుంచి మడమను లింగస్థానమునకునూ గుదస్థానమునకునూ మధ్య ఉంచి కుడికాలి మడమను లింగస్థానము మీద ఉంచి గడ్డమును రొమ్మున హత్తించి వెన్నెను మేదను శిరస్సునకు తిన్నగా ఉంచవలయును. అపుడు దృష్టి భ్రూమధ్యమున అర్థనిమాలితముగా ఉంచవలయును.

సిద్ధాసనమును పలు విధములుగా కూడ ఆచరించు చున్నారు:

మతాంతర సిద్ధాసనము:

ఎడమకాలి మడనును లింగస్థానమున వుంచి కుడికాలి మడమను ఎడమకాలి మడము పైనుంచి నాసికాగ్రమున దృష్టి నిలుపునది.

వజ్రాసనము

Yogasanamulu.djvu

కుడికాలి మడమను సీవనీ నాడిస్థానమునను ఎడమకాలి మడమను లింగ స్థానమునను ఉంచిన వజ్రాసనములని పిలిచిరి. ఈ పద్ధతి కాక సిద్ధాసనమును మరొక పద్ధతిగా చేయుదురు. దానిని ముందు వివరించెదను.

4. ముక్తాసనము:

Yogasanamulu.djvu

కాళ్ళ మడమల రెండింటిని ఒకదానిపై నొకటి లింగస్థానమున ఉంచునది.

5. ఎడమకాలి మడమను లింగస్థానమున చేర్చి కుడికాలి మడమను ఎడమకాలి మడమ క్రింద ఉంచునదియు ముక్తాసనమే.

6. కాలి మడమలను క్రింది మీదులుగా ఒకదానిపై ఒకటి చేర్చి లింగస్థానమున ఉంచునది గుప్తాసనము.

7. పద్మాసనము

Yogasanamulu.djvu
జపము, ధ్యానము చేయుటకు చాల ఉపయుక్తమయినది. యోగాసనముల యందు పద్మాసనము ఒక ప్రత్యేకతను సంతరించు కొనినది. స్త్రీలు, బాలురు, వృద్ధులు కూడా ఆచరించ దగినది.

పద్మాసనము చేయు పద్ధతి:

రెండు కాళ్ళను ముందుకు చాచి కూర్చుండవలయును. కుడికాలి మడమను క్రిందనుండి పట్టుకొని ఎడమ తొడ మూలమందు పైన ఉంచవలయును. అటులనే ఎడమ పాదమును కుడికాలి తొడ మూలమందు పై భాగమున ఉంచ వలయును. రెండు చేతులను ఆయా ప్రక్కలనున్న మోకాళ్ళ మీద ఉంచ వలయును. మోకాళ్ళు నేలకు తాకునట్లు ఉంచ వలయును. శిరస్సు, మెడ, తల ఈ మూడును తిన్నగా ఉంచవలయును. శ్వాసను స్వేచ్చగా పీల్చుచు విడుచుచు ఉండవచ్చును. అటులనే చాలసేపు శరీరమును బాధ కలుగకుండా ఉండునట్లు కూర్చొనుట అలవరచుకొన వలయును. ప్రారంభమున కొన్ని దినముల వరకు ఎక్కువసేపు కూర్చొనిన యడల పాదముల యందు తిమ్మెరలు వచ్చును. కాలక్రమమున అలవాటు పడిన కొలది సుఖముగా ఉండును. దృష్టిని నాసికాగ్రమున గాని, భ్రూమధ్యమున గాని ఉంచవచ్చును.

8. స్వస్తికాసనము:

కూర్చొని కుడికాలి పాదమును ఎడమ తొడ ప్రక్కగా నేలను ఆన్చియు ఎడమకాలి పాదమును కుడికాలి తొడకును పిక్కకును నడుమ నుంచి వెన్ను, మెడ, శిరస్సు ఒకే సరళ రేఖలో ఉన్నట్లు నిలువుగా ఉంచవలయును. చేతులను రెండింటిని ఆయా వైపున వున్న మోకాలి పైనగాని లేదా నాభి స్థానమునకు దిగువను ఒక చేతిపై మరియొకటి వుంచి కూర్చొనునది. దృష్టిని నాసికాగ్రమునగాని భ్రూమధ్యమున


గాని నిలువ వలయును. ఇది ధ్యానము చేయుటకు చక్కగా ఉపయోగ పడును.

9. సుఖ ఆసనము

Yogasanamulu.djvu

కీళ్లు సరిగా వంగక లేదా మోకాళ్ళ యందు నీరు, వాయువు చేరుట వలన పద్మ, సిద్ధ ఆసనములు కొందరు చేయ లేరు. అట్టివారు నేలపై కూర్చొని ఒక పాదమును దాని కెదురుగ నున్న తొడక్రిందను, మరియొక పాదమును దాని కెదురుగ నున్న తొడ క్రిందను ఉంచి వెన్నును, మెడ, శిరస్సు తిన్నగా వుంచి దృష్టిని నాసికాగ్రమున గాని భ్రూ మధ్యన గాని ఉంచిన అది సుఖాసనమనబడును. ఇదికూడ ధ్యానము చేయుటకు ఉపయుక్తమయినది.

10 సమాసనము:

Yogasanamulu.djvu

కూర్చొని ఒక పాదము మడమను తొడ యొక్క మూలమునందును, మరియొక పాదమును మడమను లింగ స్థానము మీదను ఉంచి పాదములు తొడకు పిక్కకు మధ్య ఉండునట్లు చేయునది. ఇందు శిరస్సు, మెడ, వెన్నుపూస తిన్నగా వుంచవలయును. ఇదియు ధ్యానమునకు ఉపకరించును.

పైన చెప్పబడిన 5 ఆసనములు ధ్యానము చేయుటకు ఉపయుక్తములని చెప్పగా మిగిలినవి శరీరము నందలి రోగములను నిర్మూలించుటకున్నూ, అంగములు బలపడుటకున్నూ ఉపయోగపడునవియై ఉన్నవి.

పద్మాసనముపై వివిధములైన భంగిమలు:

బద్ధ పద్మాసనము

Yogasanamulu.djvu

పద్మాసనమున కూర్చొని కుడిచేతితో వీపు వెనుక నుండి కుడిపాదమును గాని బొటన వ్రేలిని గాని పట్తుకొని అటులనే ఎడమ చేతితో వీపు వెనుక నుండి ఎడమ పాదము గాని బొటనవ్రేలినిగాని పట్టుకొనవలయును. వెన్ను కొంచము ముందునకు వంచి ఉంచవలసి వచ్చును. మొదటలో శ్వాసను స్వేచ్చగా పీల్చుకొనుచు రాను, రాను శ్వాసను కుంభించి సాధన చేయవలయును.

ఉపయోగములు

ఈ ఆసనము వలన ఊరః పంజరము బాగుగా వృద్ధి పొంది అందులోని అవయవలులను అనగా శ్వాస కోశములు, కాలేయము, హృదయము బలముగాను ఆరోగ్యముగాను ఉండును. జీర్ణశక్తిని వృద్ధి పరచును. మలబద్ధకమును నివారించును. ఆసనము నందలి, భగందము వంటి వ్వాధులు నశించును. కాని వయసు మీరి క్రొత్తగా నేర్చుకొను వారికి చాల కష్టముమీదగాని ఈ ఆసనము రాదు.

ఉత్తిట పద్మాసనము

Yogasanamulu.djvu

పైన చెప్పిన విధముగా పద్మాసనముపై కూర్చొని రెండు చేతులను ఆయా ప్రక్కల యందుంచి భూమిపై చేతి వ్రేళ్లను ఆనించి మోకాళ్ళు పిరుదులు భూమి నుండి సమాతరముగా పైకి ఎత్తి కొంతసేపు ఉంచవలయును. శిరస్సు, మెడ, వెన్ను తిన్నగా ఉండవలయును.

ఉపయోగములు

చేతివ్రేళ్ళు, ముంజేయి, దండలో ద్విశిర, త్రిశిర కండరములు, భుజములోని కండరములు, కడుపు నందలి కండరములు బలపడును. అజీర్ణ వ్వాధులు నయమగును.

12. (ఎ) జామబద్ధ ఉత్తిడ పద్మాసనము:

Yogasanamulu.djvu

పద్మాసనము వేసి కూర్చొని రెండు చేతులను కాళ్ళకు ముందు నేలపై ఆన్చి మోకాళ్ళను పద్మాసనములో ఉండియే పైకి ఎత్తి రెండు పిరుదులను కూడ పైకి ఎత్తి ఉంచ వలయును.

ఉత్తిడ పద్మాసనము నందు చేతులు ప్రక్కలకు పెట్టి శరీరమును పైకి ఎత్తగా ఈ ఆసనమందు చేతులు ముందు పెట్టి శరీరమును ఎత్తుటయు మోకాళ్ళు కూడ పైకి ఎత్తుటయు జరుగుచున్నది.

ఉపయోగములు

చేతి వ్రేళ్ళు, ముంజేయి, దండలోని ద్విశిర, త్రిశిర కండరములు, భుజములోని కండరములు, కడుపు నందలి కండరములు బలపడును. అజీర్ణ వ్యాధులు నయమగును.

13. కుక్కుటాసనము :

Yogasanamulu.djvu

పద్మాసనమున కూర్చుండి మోకాళ్ళకు పాదములకు మధ్యగా ఆయా చేతులను జొనిపి నేలపై చేతివ్రేళ్ళను ఆనించి లేదా చేతినంతనూ ఆనించి భూమిపైనుండి పిరుదులను, మోకాళ్ళను సమాంతరముగా పైకి ఎత్తవలయును. ఇది కోడివలె వుండుట చేత కుక్కుటాసనమని పిలువబడెను.

ఉపయోగములు

చేతులు బలపడును, గర్భ కుహరము నందలి వాయు దోషములు నశించును. జీర్ణశక్తి వృద్ధి పొంది మలబద్ధమును నివారించును.


14. హస్తబద్ధ పద్మాసనము:

Yogasanamulu.djvu

పద్మాసనము వేసి మోకాళ్ళను పైకి తేల్చి రెండు చేతులను మోకాళ్ళ క్రిందనుండి నడుము చుట్టూ త్రిప్పి ఒక చేతితో మరియొక చేతిని పట్టుకొనవలయును.

ఉపయోగములు

గర్భము నందలి వాయు దోషములను నివారించును. జీర్ణశక్తి వృద్ధియగును, మలబద్ధ ముండదు.

15. వజ్రాసనము:

Yogasanamulu.djvu

రెండు కాళ్ళ యొక్క మోకాళ్ళను నేలకు ఆనించి పాదములు మోకాళ్ళ వరకు నేలమీద ఆనించి కూర్చొని చేతుల రెండింటిని మోకాళ్ళపై ఉంచవలయును. ముసల్మానులు మజీదుల యందు ప్రార్థన చేయు సమయమున ఈ భంగిమలోనే కూర్చొని యుందురు.

ఉపయోగములు

స్థిరత్వమును కలిగించు భంగిమ కావున వజ్రాసనమనిరి. ఈ ఆసనములో వుండి ప్రాణాయామము చేయుటకు ఉపకరించును. మోకాళ్ళ యందలి కీళ్ళవాపులు, స్నాయువుల వాపులు, వాయు రోగములు నశించును. మనస్సును చలింపకుండగ ఉంచగల శక్తిగలది.

16. ముఖాసనము:

Yogasanamulu.djvu

కుడికాలి మడమను ఎడమ పిరుదు క్రిందను ఎడమ మోకాలిని కుడి మోకాలిపై వుంచి మడమను కుడి తొడకు ప్రక్కగా నేల మీద ఆనించి కుడి మోచేతిని పైకి ఎత్తి ఎడమ మోచేతిని క్రిందుగా వీపు వెనుక భాగమునుండి ఒక చేతి వ్రేళ్ళను మరియొక చేతి వ్రేళ్ళతో పట్టుకొని వుంచునది. ఆ విధముగానే మరియొక ప్రక్కను కూడ చేయవలయును.


ఉపయోగములు

మోకాళ్ళు, మోచేతులు, చేతుల యందలి బంతిగిన్నె కీలు బలపడును. అండ వృద్ధిని నిరోధించును.

17. వీరాసనము:

Yogasanamulu.djvu

కుడి పాదమును ఎడమ తొడ మూలమునందును ఎడమ పాదమును కుడితొడ మూలమునందు పిరుదును తాకు నట్ట్లుగా క్రింద భాగమున వుంచవలయును. చేతులు రెండింటిని చాచి మోకాళ్ళ మీద వుంచవలయును. వెన్ను, మెడ, శిరస్సు తిన్నగా వుంచవలయును.

ఉపయోగములు

స్థూలకాయము గలవారికి, పద్మాసనము వేయలేనివారికి ఇది వేయుట సులభము, సుఖదము.

18. హస్తపాద గుప్తాసనము :

వజ్రాసనమున కూర్చొని మోకాళ్ళు రెండింటిని విడదీసి ఎడముగా వుంచి రెండు పాదముల మడమలను వెనుక నుండి పట్టుకొని వుండునది.

ఉపయోగములు

వజ్రాససనమునందలి ఉపయోగములు ఇందున కూడ పొందనగును.

19. గుప్తాసనము :


ఇది సుఖాసనము వంటిదే. కుడికాలి మడమను ఎడమ తొడ క్రిందనను, ఎడమ పాదమును కుడి తొడకు పిక్కలకు మధ్యన వుంచి మడమను వృషణముల పైన వుంచి చేతుల రెండింటిని రెండు మోకాళ్ళపై వుంచి శిరస్సు, మెడ, వీపు తిన్నగా వుంచవలయును.

ఉపయోగములు

బ్రహ్మచర్యమునకు ఉపకరించును. ధ్యానము చేయుటకు సుఖమగు ఆసనము.

20. గోరక్షాసనము :

చాపమీదగాని దుప్పటిమీదగాని కూర్చొని కాళ్ళను మోకాళ్ళవద్ద వంచి మడమలు రెండు, రెండు వృషణములకు క్రిందుగా అరికాళ్ళు ఒకదాని నొకటి ఎదురెదురుగా వుంచి రెండు చేతులను రెండు మోకాళ్ళమీద వుంచి శిరస్సు, మెడ, వెన్ను నిట్టనిలువుగా వుంచవలయును.

ఉపయోగములు

దీనివలన ఇంద్రియము భద్రపరచబడును. బ్రహ్మచర్యమును కాపాడును. మోకాళ్ళు బలముగా వుండును. ఈ ఆసనముతో మూలబంధము (తరువాత పువిలీకరించబడును) తో కలిపి చేసిన సాధకుడు ఊర్ద్వరేతస్కుడై తేజోవంతుడగును.

21. పర్వతాసనము :

Yogasanamulu.djvu

పద్మాసనమున కూర్చొని రెండు మోకాళ్ళపై నిలబడి రెండు చేతులను పైకి ఎత్తి వుంచవలయును:

ఉపయోగములు

మోకాళ్ళ యందలి కీళ్ళు, స్నాయువులు బలపడి అచ్చటి వాత రోగము నశించును.

22. సుప్త వజ్రాసనము :

వజ్రాసనమున వుండి వెన్ను, మెడ, శిరస్సు నేల ఆనునట్లుగా వెనకకు పరుండి రెండు చేతులతోను రెండు పాదములను పట్టుకొనవలయును లేదా రెండు చేతులను మీద శిరసు పైగా దండలను పట్టుకొని వుండవలయును.

ఉపయోగములు

వజ్రాసనము నందలి ఉపయోగములే దీనికి కూడ వర్తించును.

22. (ఎ) పూర్ణసుప్త వజ్రాసనము :

Yogasanamulu.djvu

సుప్త వజ్రాసనము చేసి పాదములు, మోకాళ్ళు, శిరస్సు మూడు నేలకు ఆనించి నడుమును పైకి విల్లువలె ఎత్తవలెను. చేతులు ప్రక్కలకు ఆనించి తొడల మీద వుంచ వలయును.

ఉపయోగములు

సుప్త వజ్రాసనము నందలి ఫలితములే వచ్చును.

23. అర్ధ చంద్రాసనము :

Yogasanamulu.djvu

సుప్త వజ్రాసనమున వుండి రెండు చేతులతోను రెండు పాదముల బొటన వ్రేళ్ళను పట్టుకొని మోకాళ్ళ దగ్గర నుండి శిరస్సు వరకు శరీరము అర్థచంద్రాకృతిగా పైకి వంచవల యును. పాదముల నుండి మోకాళ్ళ వరకు నేల మీద ఆని వుండును. అటులనే రెండు చేతులు నేలపై ఆని వుండును.

ఉపయోగములు

మోకాళ్ళు బలముగా వుండును. వెన్ను బిరుసుతనము లేక చక్కగా వెనుకకు వంగును.

24. కూర్మాసనము :

Yogasanamulu.djvu

తిన్నగా కూర్చుని మోకాళ్ళు వంచి రెండు పాదములను రెండు తొడలకు ప్రక్కగా మడమలు పిరుదులు క్రింద ఉండునట్లు వుంచుము. ముందునకు వంగి చేతులు రెండు, రెండు మోకాళ్ళకు ఇరుప్రక్కల వుంచి మోచేతులు వంచుము. ఎదురుగా చూడవలయును.

రెండవ పద్దతి: మూలాధారము (గుదము)నకు ఇరువైపుల రెండు కాలి మడమలను ఒక దానికి అడ్డముగా ఒకటి గట్టిగా అదిమి వుంచి మోకాళ్ళను భూమి మీద ఆనించి కూర్చొనవలయును.

ఉపయోగములు

దీనివలన సమస్త వాతరోగములు నివారించబడును. మరియు ప్రాణము ఊర్ద్వగతి చెందును. సాధకుడు ఊర్ధ్వరేతస్కుడగును.

25. ఉత్తాన కూర్మాసనము :

పైన చెప్పినట్లు కూర్మాసనము వేసి మోకాళ్ళను పైకి ఎత్తవలయును.

ఉపయోగములు
కూర్మాసనములోని ఉపయోగములే వర్తించును.


ఒకటి గట్టిగా అదిమి వుంచి మోకాళ్ళను భూమి మీద ఆనించి కూర్చొన వలయును.

ఉపయోగములు
దీని వలన సమస్త వాత రోగములు నివారించ బడును. మరియు ప్రాణము ఊర్ద్వ గతి చెందును. సాధకుడు ఊర్థ్వ రేతస్కుడగును.

25. ఉత్తాన కూర్మాసనము :

పైన చెప్పినట్లు కూర్మాసనము వేసి మోకాళ్ళను పైకి ఎత్తవలయును.

ఉపయోగములు
కూర్మాసనములోని ఉపయోగములే వర్తించును.

27. మూఢ గర్భాసనము :

Yogasanamulu.djvu

పద్మాసనమున కూర్చుండి కుక్కుటాసనమునకు వలె రెండు చేతులను మోకాళ్ళ వద్ద తొడలకు పిక్కలకు మధ్యగా మోచేతుల వరకు జొనిపి చేతులతో చెవులను పట్టు కొనునది. కొందరు ఈ ఆసనములో మోకాళ్ళు, తల నేల మీదవుంచినపుడు కూర్మాసనమని పిలిచిరి.

ఉపయోగములు

గర్భాసనము నందలి ఫలితములు ఇందు చేకూరును.

28. భగాసనము :

Yogasanamulu.djvu


కూర్చొని మోకాళ్ళు రెండింటిని ప్రక్కలకు చాచి పాదములు రెండు ఒకదాని కొకటి ఎదురెదురుగా తాకి వుండు నట్లు, మడమలు నాభి స్థానమునకు కొంచెము క్రిందుగా, లింగ స్థానముపై రెండు పాదములు వుండు నట్లు చేయ వలయును.


ఉపయోగములు

పాదముల యందలి కీళ్లు కండరములు మరియు మోకాళ్ళ నందలి కీళ్లు బిరుసు తనమును కోల్పోయి బలముగా నగును. మరియు అచ్చట చేరిన వాత దోషములు నివారణ మగును.

29. ఉష్ట్రాసనము :

Yogasanamulu.djvu


వజ్రాసనమున కూర్చొని కాలి మడమలను ఆయా ప్రక్కల నున్న తన చేతులతో పట్టుకొని మోకాళ్ళపై లేచి నడుమును పైకెత్తి చేతులను నిగిడ్చి తలను వెనుకకు వంచి వుంచవలయును.

ఉపయోగములు
నడుము నందు పొత్తి కడుపు నందు


పేరుకొన్న క్రొవ్వు కరిగి పోవును. మెడ కండరములు బలముగా నగును. జీర్ణ శక్తి వృద్ధి పొందును.

30. మత్స్యాసనము :

Yogasanamulu.djvu


వెల్లికిల పారుండి, పద్మాసనము వేసుకొని తలను నేలకు ఆనించి మెడనుండి నడుము వరకు వెన్నును పైకి ఎత్తవలయును. చేతులు రెండింతిని తల క్రింద ఒక చేతితో మరియొక చేతి దండను పట్టుకొన వలయును. లేదా రెండు చేతులతోను రెండు కాళ్ళ బొటన వ్రేళ్ళను పట్తుకొని వుండవలయును. సాధారణముగా ఈ ఆసనమును సర్వాంగ ఆసనము తరువాత చేయ నగును. అందు వలన మెడ యందున్న పారాధయిరాయిడు గ్రంధులు బాగుగా పని చేసి శరీర నిర్మాణములో సహకరించును.

ఉపయోగములు

కంఠ భాగమున గల ల్ధాయిరాయిడు గ్రందులకు వెనుక నున్న పారాధయిరాయిడ్ గ్రంధులు


ఒత్తిడి పొంది చక్కగా పని చేయుటకు ప్రారంభించి హార్మోనులను సృష్టించి శరీర నిర్మాణమునకు ఉపయోగ పడును.

మత్స్యాసనమున నీటిపై పరుండుటకు అనుకూలమయినది. ప్లావినీ పద్ధతి ప్రాణాయామము ఈ ఆసనము పై చేయ నగును.

31. మండూకాసనము :

Yogasanamulu.djvu

వజ్రాసనము వలెనే మోకాళ్ళపై కూర్చొని మోకాళ్ళు రెండింటిని కొంచెము ఎడమగా వుంచి అరికాళ్ళ (పాదముల క్రిందిభాగము) పై పిరుదులను ఆనించి కూర్చొని రెండు చేతులను మోకాళ్ళపై వుంచి గాని లేదా రెండు చేతులను భుజములకు క్రిందుగా అనించి ముందుకు వంగి వుండవలయును.

ఉపయోగములు
దీనివలన కడుపులో నున్న అపాన వాయువు నెట్టబడి మలమూత్రములు ఆయా కోశములందు చేరి ఒత్తిడి చేత బహిష్కరణ చెందును.

32. పవన ముక్తాసనము :

వెల్లికిల వీపు నేలనునట్లు పరుండి ఒక మోకాలిని ముద్దిడునట్లుగా ముఖము చేత స్పృసించునది. మోకాలిని రెండు చేతులతోను పట్టుకొని గర్భ కుహరమునకు ఒత్తి వుడవలయును. దీనిని రెండు మోకాళ్ళ తోను ఒకే సారి కూడ చేయ వచ్చును.

ఉపయోగములు
కొందరికి అపాన వాయువు బంధించ బడి కడుపులో నెప్పిని కలుగ చేయును. దీని వలన అపాన వాయువు బహిష్కరించ బడును. మలబద్ధముండదు. జీర్ణ శక్తి వృద్ధి యగును.

33. అర్థ మత్స్యాంద్రాసనము :


Yogasanamulu.djvu


రెండు కాళ్ళను ముందుకు చాచి కూర్చొని ఎడమ పాదమును రెండు పిరుదుల మధ్య వుంచి కుడి కాలిని ఎడమ మోకాలికి ఆవల వుంచి కుడి మోకాలిని ఉదర కుహరమునకు ఆనించి వుంచి నడుమును మెలి త్రిప్పి ఎడమ చేతిని కుడి మోకాలి ముందు నుండి ఎడమ మోకాలిని పట్టుకొని కుడి చేతిని క్రింద నుండి వీపు వెనుకగా త్రిప్పి కుడి చేతి వ్రేళ్ళతో తొడ

మూలమును పట్తుకొనవలయును. అదే విధముగా మరల రెండు కాళ్లను ముందుకు చాచి కుడి పాదమును రెండు పిరుదుల మధ్య వుంచి ఎడమ కాలిని కుడి మోకాలికి ఆవల నుంచి ఎడమ మోకాలిని ఉదర కుహరమునకు ఆనించి వుంచి నడుమును ఎడమ చేతి వైపునకు మెలి త్రిప్పి కుడి చేతిని ఎడమ మోకాలి ముందు నుండి కుడి మోకాలిని పట్టుకొని, ఎడమ చేతిని క్రింద నుండి వీపు వెనుకగా త్రిప్పి ఎడమ చేతి వ్రేళ్ళతో కుడి తొడ మూలమును పట్టుకొన వలయును. ఇది రెండవ కాలిపై చేయు పద్దతి.

ఉపయోగములు
ఇది స్త్రీలకు చాల ఉపయోగకరము. ఈ ఆసనము వలన నడుము చాల సన్నముగా నగును. పొత్తికడుపు ముందు భాగమునను ప్రక్కల యందును వున్న క్రొవ్వు కరిగి పలాయనము చిత్తగించును. మలబద్ధ ముండదు. జీర్ణ శక్తి వృద్ధి యగును.

34. మత్స్యేంద్రాసనము :

Yogasanamulu.djvu


అర్థ మత్స్యేంద్రాసనమున కాలి మడమను రెండు పిరుదుల మధ్య గుద రంధ్రమును మూయునట్లు వుంచెదరు. కాని దీని యందు పద్మాసనము నందు వలె ఒక కాలి మడమను తొడమీద మూలము నందు వుంచి మరియొక కాలి పాదమును నేల మీద నున్న మోకాలి ఆవల వుంచి మోకాలిని ఉదర కుహరమున తాకునట్లు నిలబెట్టి వుంచ వలయును. అర్థ మత్స్యేంద్రాసనం వలెనే చేతులు త్రిప్పి వుంచ వలయును. ఈ ఆసనము


కొంచెము శ్రమతో కూడినది. అయినప్పటికి సాధన చేత చక్కగా వచ్చును.

ఉపయోగములు

అర్థ మత్స్యేంద్రాసనము కన్న ఎక్కువ చురుకుగా అవే ఫలితములను ఇచ్చును.

35. పాద ప్రసరణ కూర్మాసనము :

Yogasanamulu.djvu


రెండు కాళ్లను ఎడముగా చాచి కూర్చొని రెండు చేతులను ముందునకు వంచి ఆయా ప్రక్కలనున్న తొడల క్రింద నుండి లోపలనిండి బయటకు తీసి వుంచ వలయును. తల ఎత్తి పైకి చూడ వలయును.

ఉపయోగములు:

దీని వలన సమస్త వాత రోగములు నివారించ బడును. మరియు ప్రాణము ఊర్ధ్వగతి చెందును. సాధకుడు ఊర్థ్వ రేతస్కుడగును.

36. విరాగాసనము లేక విశ్రమాసనము :

Yogasanamulu.djvu

కూర్చొని రెండు కాళ్ళు ముందునకు చాచ వలయును. కుడి పాదమును ఎత్తి దాని మడమనందు కుడి చంకను ఆనించి కుడి చేతిని మడిచి చెవిని అరచేతితో మూసి వుంచి రెండవ కాలిని మడిచి ఎత్తి మోకాలి పైన ఏడమ చేతిని వుంచ వలయును.

ఉపయోగములు
ఈ ఆసనము వలన యోగులు అలసిపోరు. ఆసనము వేయుటకు ముందుగా అలసిన వారు విశ్రాంతి పొందుదురు.

37. (1) యోగముద్ర :

Yogasanamulu.djvu


దీనిని చాల విధములుగా వేయుదురు. సామాన్యముగా పద్మాసనముపై కూర్చొని రెండు చేతులతోను ఎదురుగాను ముందున వున్న కాలి బ్రొటన వేళ్ళను పట్టుకొని ముందునకు వంగి నేలను ముఖము తాకు నట్లు వుంచ వలయును.

ఉపయోగములు

నడుము, వెన్నెముక బాగుగా సాగి మెత్తగా వుండి బిరుసు తనమును కోల్పోవును. జఠరాగ్ని వృద్ధి పొంది జీర్ణశక్తి పెంపొందును. మల మూత్ర విసర్జన క్రమముగా జరుగును.

37.(2). యోగముద్ర

ఈ ఆసనమునే బద్ధ పద్మాసనమున వుండి ముందుకు నేలమీదికి ముఖము తాకు నట్లుగా వంగి వుంచవలయును.

ఉపయోగములు
పై విధముగానే వుండును.

37.( 3.).

చేతులు రెండును వీపు వెనుకగా కట్టుకొని పద్మాసనము పై వుండి నేల మీదికి ముందుకు వంగి ముఖము నేలకు తాకు నట్లు వుంచ వలయును.

37..( 4.)

పద్మాసనముపై కూర్చొని రెండు చేతులు ప్రక్కలకు చాచి ముందుకు వంగి నేలకు ముఖము తాకునట్లు వుంచ వలయును.

37.(5).

పద్మాసనము పై కూర్చొని రెండు అరచేతు8లు బిగించి పిడికిలులను తొడల మూలమున వుంచి ముందునకు వంగి నేలకు ముఖము తాకు నట్లు వుంచవలయును.

37 (6)

వజ్రాసనము పై కూర్చొని ముందుకు నేలకు ముఖము తాకునట్లు వంచి ఉంచవలయును.

37. (7).

గోముఖాసనముపై కూర్చున్నట్లుగా కూర్చుని ముందునకు నేల మీద ముఖము తాకు నట్లును చేతులు రెండు పిరుదుల పై వెనుకగా వుంచ వలయును.

ఉపయోగములు
ఈ పైన చెప్పిన ఆరు రకముల యోగ ముద్ర భంగిమలయందు ప్రయోజనము ఒక్కటియే.

38. హస్త సృష్ట బద్ధపాద ప్రసరణాసనము :

Yogasanamulu.djvu
కూర్చుని రెండు కాళ్ళస్ను ఇరు ప్రక్కలకు సరళ రేఖలో ఉండు నట్లు చాచి చేతులు రెంటిని వీపు వెనుక కట్టు కొని ముందునకు వంగి నేల మీద రెండు భుజములు, గడ్డము తాకు నట్లు వుంచ వలెను.

ఉపయోగములు

దీని వలన పొత్తి కడుపులో నున్న అవయవములు ఒత్తిడి పొంది ఎక్కువ రక్తమును గ్రహించును. అందువలన జఠరాగ్ని వృద్ధి చెందును. మలాశయము మూత్రాశయము మరియు ప్రోస్టేట గ్రంధులు బాగుగా పని చేయును. మరియు తొడల మూలమందున్న బంతి గిన్నె కీలు చుట్టు నున్న సంధి బంధములు స్నాయువులు బలపడును. అచ్చట వాత దోషములు తొలగును.

39. పాద ప్రసరణ ఉత్తిష్టానసనము :

Yogasanamulu.djvu


కూర్చుని, రెండు కాళ్ళను ముందుకు చాచి రెండు చేతులను ఇరు ప్రక్కల నేల మీద ఆనించి పాదములు, మోకాళ్ళు, పిరుదులు మూడింటిని భూమికి సమానంతరముగా 4 లేక 5 అంగుళములు ఎత్తి కొంత సేపు ఉంచ వలయును.

ఉపయోగములు

మోకాళ్ళు, తొడలు, చేతులు చాల బలమును పొందును. గర్భ కోశము నందలి గోడ కండరములు బలమును పుంజుకొనును. జీర్ణ శక్తి వృద్ధి యగును. మలమూత్ర విసర్జన క్రమ పడును.

40. భుజంగాసనము :

Yogasanamulu.djvu


ఇది నాగరాజు పడక విప్పి మెడ ఎత్తి చూచుచున్నట్లుండును. బోరగిల పరుండి రెండుచేతులను రెండు భుజముల ప్రక్కల యందుంచి బొడ్డు (నాభి) దగ్గర నుంది పాదముల వ్రేళ్ళవరకు నేలను ఆనించి మిగిలిన శరీరమంతా అనగా తల, మెడ, భుజములు, చాతి పైకి ఎత్తవలయును. చేతులపై బరువు అంతా వుంచ రాదు. నామ మాత్రముగా మాత్రమే బరువు వుంచవలయును.

ఉపయోగములు
నడుము, వెన్ను, మెడ యందలి కండరములు కీళ్ళు బిరుసు తనము వీడి మెత్తగా వంగును.


అందువలన ఆయా కీళ్ల యందు చేరిన వాయువు శరీరమందు ప్రసరించి కీళ్ళ వాత నొప్పులు హరించును. ఊపిరి బిగబట్టి అనగా కుంభకమందు ఉండి ఈ ఆసనము చేసిన యడల శ్వాస కోశముల యందలి జిగురు తగ్గును. అందున్న నున్నితమైన పొర వాపు తగ్గి గొంతులో నుని తగ్గును. కంఠము శుద్ధిగా వుండి స్వరము శ్రావ్యంగాను జీర లేకుండను వుండును.

41. (ఎ) విపరీత పాద శిర స్పర్శనాసనము

Yogasanamulu.djvu


ఉదరముపై బోరగిల పరుండి చేతులు రెండు రెండు భుజములకు ఇరు ప్రక్కల నేల మీద ఆనించి శిరస్సును, రొమ్మును (చాతీ) బాగుగా ఎత్తి మోకాళ్ళను వంచి పాదములను పైకి ఎత్తి శిరస్సు పాదములు ఒక దాని నొకటి తాకునట్లుగా ఉంచవలయును.

ఉపయోగములు

వెన్ను పూస యందలి కండరములు మెత్తబడి వెన్ను చక్కగా వంగును. కంఠస్వరము మృధువుగా నగును. థయిరాయిడు పేరా ధయిరాయిడ్ గ్రంధులు చురుకుగా పని చేసి శరీర నిర్మాణములో సహకరించును.

శలభాసనము

Yogasanamulu.djvu


ఇది మిడత వంటి భంగిమ. బోర గిల కడుపు నేలకానించి పరుండి రెండు కాళ్ళు చాచి చేతులను ప్రక్కలకు అరచేతులు నేలపై ఆనించి అరచేతులను నేలపై గట్టిగా అదిమి పొరుదులను రెండిండిని గట్టిగా బిగించి తుంటి వద్ద నుండి పాదముల వరకు కాళ్ళను నిగిడ్చి (బిగించి) భూమి నుండి పైకి ఎత్తవలయును.

ఉపయోగములు

రెండు పిరుదుల మధ్యనున శుక్ర వాహికలు వాటికి చుట్టూనున్న కండరములు బలపడును. అందు వలన శుక్ల నష్టము శీఘ్ర స్కలనము నివారణమగును. కాళ్ళ యందలి వాత రోగములు నివరించును.


42. (ఎ) ధనురాసనము

Yogasanamulu.djvu


విల్లు వంటి భంగిమ. బోరగిల పరుండి రెండు చేతుల తోను రెండు పాదములకు పైన వున్న గుత్తిలను పట్టుకొని శరీరము నిగిడ్చవలయును.

ఉపయోగములు

మెడ, వెన్ను, గర్భాశయము ఆరోగ్య వంతమై బలపడును. వెన్ను నందలి వాయువు తొలగును. వెన్ను బిరుసుతనము తగ్గి మెత్తగా వంగును.


నాభి ఆసనము

Yogasanamulu.djvu


బోరగిల పరుండి రెండు చేతులను చాతీని కాళ్ళను రెంటిని పైకి ఎత్తి బొడ్డు (నాభి) మాత్రము నేలకు ఆనుకొనునటల వుంచ వలయును.

ఉపయోగములు

నాభి స్థానమందు కందము గలదు. ఈ స్థానము నుండి శరీరమునకు వాయువు ప్రసరించ శక్తి గల


72 వేల యోగ నాడులు శరీరమంతట ప్రరించును. ఈ ఆసనము వలన యోగ నాడీ కేంద్రము బలమును పొందుటతో స్థూల నాడీ మండలము బలపడును.

44. విపరీగ్త పాదాంగుష్ట శిరస్పర్శనాసనము

Yogasanamulu.djvu


బోరగిల పరుండి తొడను మూలము నుండి ఎత్తి కాలు, మోచేతులను ఎదుట నుండి ముఖము మీదుగా కాలి బ్రొటన వ్రేళ్ళను పట్టి శరీరమును నిగిడి ఉంఛ వలయును. శరీరము ఎక్కు పెట్టిన ధనస్సు వలె వంగి వుండును. ఇది కొంచెము కష్టముగ కనబడును. కాని తేలికగా చేయ వచ్చును. .

ఫలితములు
ధనురాసనము లోవలె వుండును. నాడీ మండలము బలపడును.


34. విస్తరిత హస్త పాద్యశిరస్పర్శనాసనము

Yogasanamulu.djvuకడుపు, భుజములు, గడ్డము నేల కానించి రెండు చేతులను రెండు ప్రక్కల యందుంచి శరీరమంతటిని భుజముల వరకు పైకి ఎత్తి మోకాళ్ళను వంచి శిరస్సుకు తాకు నట్లుగా వుంచవలయును. ఇది కష్టము మీద సాధింప నగునది. ఆకర్షణీయముగా ఉండుట చేత శలబాసనమునకు బదులుగా దీనినే శలభాసనమని పరదర్శించు చున్నారు. కాని శలభాసనము కాదు.

ఉపయోగములు
మెడ, ధయిరాయిడు, పారా ధయి


రాయిడు గ్రంధులు బాగుగా పని చేయును. వెన్ను వెనుకకు చక్రము వలె వంచ బడును. కాళ్ళు పైకి రేచు వరకు భుజములు అర చేతులు చాల గట్టిగా భూమికి ఒత్తవలసి వున్నందున అవి కూడ చాల బలమును పొందును. వెన్ను బిరుసు తనము వీడి వెన్ను పూస నడుమ నున్న సంధి బంధములు మెత్తబడును. నడుము నొప్పి, వాత రోగములు తగ్గును. మూత్ర గ్రంధులు చక్కగా పని చేయును.

45.1. ఆకర్షణ్య ధనురాసనము

Yogasanamulu.djvu
కూర్చొని రెండు కాళ్ళను ముందుకు చాచి చేతులు రెండింటిని ఒకదానికి ఒకటి అడ్డముగా వుంచి కుడి చేతితో ఎడమ కాలి బొటన వ్రేలిని ఎడమ చేతితో కుడికాలి బొటన


వ్రేలిని పట్టుకొని రెండు చేతుల యందలి అడుగున వున్న చేతిని చెవుల వరకు లాగి పట్టుకొని తల పైకి ఎత్తి వుంచ వలయును. ఈ భంగిమ ఆకర్షించిన ఎక్కుపెట్టిన విల్లు వలె కనబడును.

ఉపయోగములు
ధనురాసనము యందలి ఫలితములనే ఇచ్చును.

46. విపరీత పాద ప్రసరణాసనము


Yogasanamulu.djvu

కూర్చుని రెండు కాళ్ళను ఇరుప్రక్కలకు ఒకే సరళ రేఖమీద ఉండునట్లుగా చాచి రెండు చేతులను రెండు తొడలపైనను వుంచవలయును


ఉపయోగములు

దీని వలన సీవనీ నాడులు అనగా శుక్ర వాహికలు బలమును పొందును. అందు వలన శుక్ల నష్టము, శీఘ్ర స్కలనము ఇత్యాది శుక్ర దోషములు తొలగును.


47. చిలుక ఆసనము

Yogasanamulu.djvu


నాభి నేలకు ఆనునట్లు బోరగిల పరుండి రొమ్ము, శిరస్సు, మోకాళ్ళు వంచి కాళ్ళను పైకి ఎత్తి రెండు చేతులను రెండు ప్రక్కల నున్న పాదములకు మోచేతుల వద్ద తగిలించి శరీరమును నిగిడ్చ వలయును. ఎదురుగా చూడ వలయును.

ఉపయోగములు
భుజములు, మోకాళ్ళు, వెను పూస బాగా బలపడును.


48. పతంగాసనము

Yogasanamulu.djvu


జ్పద్మాసనమును వేసి బోరగిల పరుండి రెండు చేతులను వీపు వెనుకనుండి నమస్కారము చేయునట్లు కలిపి ఉంచి శిరస్సును పైకి ఎత్తి ఉంచవలయును.

ఉపయోగములు
పొట్ట లోపలను పైనను వున్న క్రొవ్వు తొలగి పోవును. కంఠము శ్రావ్యముగాను జీర లేకుండ మృధువుగాను వుండును. మెడ కండరములు ధయిరాయ్ఇడ్, పారా ధయిరాయడ్ గ్రంధులు బాగుగా పని చేసి దేహ నిర్మాణములో సహకరించును. దీనినే (నమస్కారము లేకుండా) ఖదాసనము అందురు

49 వృష్ట బద్ధ పతంగాసనము

పతంగాసనములో వలెనే బోరగిల పద్మాసనమున పరుండి రెండు చేతులతో వీపు మీద నుండి రెండు కాళ్ళను పట్టుకొని మెడ, శిరస్సును పైకి ఎత్తి చూడవలయును.

ఉపయోగములు
పైన చెప్పిన వతంగాసనము ఫలితమునే ఇచ్చును.

50. తిత్తిబాసనము

బోరగిల పరుండి రెండు చేతుల ప్రేళ్ళను వెన్నుకిరుప్రక్కల యందుంచి మోకాళ్ళను పిరుదులకు తాకునట్లుంచి మెడ, ముఖము రొమ్ము పైకి ఎత్తి వుంచవలయును.


ఉపయోగములు
వెన్నెముక బాగుగామెత్తగా వంగును. మెడ కండరములు బలపడును.

51. కపోతాసనము

మోకాళ్ళవద్ద నుండి పాదముల వరకు నేలకు ఆనించి కూర్చుని రెండు చేతులను రెండు తొడల మధ్య నుండి కాళ్ళ బొటన వ్రేళ్లను పట్టుకొని పైకి చూడ వలయును. భుజములు నేలను తాకనవసరము లేదు.

ఉపయోగములు
దీని వలన మోకాళ్ళూ, పాదముల గుత్తిలు మెడ కండరములు బలపడును.


నేలపై పరుండి చేయు ఆసనములు.

.52. హలాసనము

Yogasanamulu.djvuవెల్లకిల వీపు నాల కానునట్లు పరుండి రెండు మడములను ఒక దాని కొకటి కలిపి కాళ్ళను పైకి ఎత్తి నడుమును కూడ పైకి ఎత్తి పాదముల బొటన వ్రేళ్ళతో ముఖము పైనుండి నేలను తాకి వుంచ వలయును. చేతులు ప్రక్కలల యందు గాని లేదా శిరస్సు పైభాగము వైపు గాని వుంచ వలయును.

ఫలితములు
నడుము చుట్టును వున్న కండరములు, గర్భాశయము పై వున్న కండరములు, ప్రేవులు, ధయిరాయిడు


గ్రంధి చురుకుగా పని చేసి జీర్ణ శక్తిని వృద్ధి చేయును. మలమూత్ర విసర్జన క్రమపడును.


'

53. కర్ణ పీడాసనము

Yogasanamulu.djvu


హాలసనము వేసి రెండు మోకాళ్ళతో రెండు మోకాళ్ళతో రెండు చెవులను మూయునట్లు వుంచ వలయును. చెవులను మోకాళ్ళ చేత గట్టిగా నొక్కుట వలన కర్ణపీటనమని పిలిచిరి.

ఉపయోగములు
హలాసనము వల్లెనే ఫలితములను ఇచ్చును.54. సర్వాంగాసనము

Yogasanamulu.djvu


ఆసనము లన్నిట ఇది చాల ముఖ్యమైనది. ఇందు సర్వాంగములు పని చేయునని పేరును బట్టియే తెలియు చున్నది. శరీరమున సూర్య చంద్ర స్థానములు సూక్ష్మ నాడీ మండల మందున్నదని ఇది వరకు చెప్పి యుంటిమి. కంఠ ప్రదేశము

నందున్న చంద్రస్థానము నుండి స్రవించిన అమృతము సూర్య స్థానము (అగ్ని) అయిన నాభి స్థానము పై పడుట వలన అమృతము అగ్ని బడి దగ్దమయి అమృత ప్రయోజనమును పొందలేక పోవు చున్నారు. అందుచేత అట్టి అమృతమును శరీరమందు నివియోగింప బడుటకు ఋషులు ఈ సూర్యచంద్ర స్థానములను విపరీతము చేసి చంద్రస్థానము క్రిందికిని సూర్య స్థానము మీదికి పెట్టి నట్లు ఈ ఆసనమును నిర్మించిరి. శరీరమునందు నిలిచిన అమృతము వలన సాధనకు శరీర మందలి సర్వాంగములు పోషింప బడు చున్నవి.

వెల్లికిల భూమిమీద వీపు ఆనించి పరుండి భుజముల దగ్గర నుండి శరీరమంతటిని భూమికి లంబముగా ఎత్తవలయును. ఇందు గడ్డము రొమ్మున గ్రుచ్చు కొనవలయునను నియమము తప్పక పాటించ వలయును. అప్పుడే ధయిరాయిడు గ్రంధులు బాగుగా పని చేయును. చేతులు, వీపునకు దన్ను పెట్ట వచ్చును. లేదా నేలపై వుంచవలయును.

ఉపయోగములు
శరీర మందలి అన్ని భాగములు దీని మూలమున చక్కగా పోషింప బడి రోగములను విడిచి అరోగ్యమును పొంది బలమును కూర్చు కొనును. ముసలి తనమును దూరముగా వుంచ వచ్చును.


55. విపరీత కరణాసన (ముద్ర)

సర్వాంగాసనము వలెనే పైకి ఎత్త వలయును. కాని భూమికి లంబముగా కాక భూమికి 45 డిగ్రీల కోణములో ఎత్తి వుంచ వలయును. చేతులు వీపుకు దన్ను పెట్టుకొన వచ్చును.

ఉపయోగములు

ప్రాణాయామ ప్రారంభమున తప్పక ఈ ఆసనము చేయ వలయునను నిబంధన ఒకటి కలదు. ఇందు సూర్య చంద్ర స్థానములు విపరీతమగును. ఇందు వలన సర్వాంగాసనము నందలి ఫలితములను పొంద వచ్చును.

56,విపరీత ఏక పాద శిరస్పర్సాసనము

(రాజకపోలలాసనము)
Yogasanamulu.djvu


ఒక కాలి యొక్క మోకాలి పాదము నేలకు తాకు నట్లును మరియొక కాలు వెనుకకు చాచి మోకాలి వద్ద వంచి పైకి ఎత్తి మోచేతులు ముఖముపైగా ఎత్తి చేతులతో పైకి ఎత్తిన కాలి బొటన వ్రేలిని పట్టుకొని శిరస్సును వెనుకకు వంచి పుంచ వలయును.

ఫలితములు
దీని వలన మోకాళ్ళ యందలి కీళ్లు, వెన్నెముక యందలి వాయు దోషములు తొలగును.

57. పర్యంకాసనము

Yogasanamulu.djvu
రెండు కాళ్ళు ముందుకు చాచి వెల్లికిల వీపు మీద పడుకొని ఒక కాలి మడమను ఎత్తి పట్టుకొని చంప ప్రక్కగా శిరస్సునకు ఆనించి ఆ ప్రక్కనున్న చేతితో కాలి చీల మండను పట్టుకొన వలయును. రెండవ చేయి రెండ తొడమీద


ఉంచవలయును. భుజములు శిరస్సు నేల నుండి కొంచెము ఎత్తునకు ఎత్తబడి యుండును.

ఉపయోగములు
దీని వలన మోకాలి యందలి, తుంటి యందలి కీళ్లు బలపడును. ప్రేవులు, కడుపు లోని కండరములు కూడ బలపడును.

58.ద్విపాద గ్రీవాసనము

Yogasanamulu.djvu

రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చొని, కాళ్ళ యొక్క రెండు పాదములను భుజములపై నుండి, మెడమీకికి వేసుకొన వలయును. పాదములు ఒక దానికొకటి అడ్డముగా వుండును. పిరుదులపై కూర్చొని రెండు చేతులతోను నమస్కరించి ఎదురుగా చూడ వలయును.


ఉపయోగములు
మోకాళ్ళు, వెన్ను, మెడ బాగ సాగి, మొత్తగా వంగుట చేత అచటనున్న వాయు దోషములు నివర్తి యగును. జీర్ణ శక్తి వృద్ధి యగును.


.59. వృశ్చికాసనము

Yogasanamulu.djvu

అరచేతులు, మోచేతులు నేలపై ఆనించి, వెన్ను కాళ్ళను పైకి ఎత్తి, పాదములతో శిరస్సును తాక వలయును. శిరస్సు పైకి ఎత్తి ఉంచ వలయును. ఇది తేలువలె నుండుట చేత దీనికి వృశ్చిక (తేలు) ఆసనమనిరి.

ఉపయోగములు
వెన్నెముక యందలి కండరములు, సంధి బంధములు మెత్తనగును. చేతులు బలముగా నగును. జీర్ణశక్తి వృద్ధియగును. కాలేయము మూత్ర పిండములు చురుకుగా పని చేయును.

.60.పాద హస్తాసనము

రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చొని, కాళ్ళను పొట్టకు తాకునట్లు మోకాళ్ళు మడవ కుండ ఎత్తి, కాలి బొటన వ్రేళ్ళు చేతులతో పట్టుకొన వలయును.

ఉపయోగములు
దీని వలన జీర్ణాశయము లోని ప్రేవులు, మోకాళ్ళు బలపడును.


61. హస్త భుజాసనము

Yogasanamulu.djvu

కూర్చొని, రెండు కాళ్ళను భుజము పైనుండి ముందుకు వేసుకొని, చేతులతో పట్టు కొనవలయును.

ఉపయోగములు
వెన్ను ముందునకు చక్కగా వంగును. జఠాగ్ని వృద్ధి యగును.

62. శిలాసనము

బొమ్మ.


కూర్చొని, ముందుకు వంగి చేతి దండలపై నుండి రెండు పాదములను ఒకదానికి ఒకటి అడ్డముగా శిరసు మీద ఉంచ వలయును.

ఉపయోగములు
దీని వలన క్జీర్ణ కోశము శక్తి వంతమగును. మలమూత్రములను సుఖముగా బహిష్కరింప చేయును.

109

53. వావాసనము

Yogasanamulu.djvuవెలికిల పరుండి, గుంతి వద్దనుండి పాదములను నిలువుగా భూమికి 12 అంగుళముల ఎత్తునకును, అదే విధముగా చేతులు, చలను, భూమికి 12 అంగుళములు పైకి ఎత్తి వుంచ వలయును.


ఉపయోగములు: జీర్ణ శక్తి వృద్ధి యగును.


64. చామగదరాసనము

Yogasanamulu.djvu


ముందునకు కాళ్ళు చాచి, కూర్చొని, రెండు కాళ్ళమడమలు ఒకదాని కొకటి ఎదురుగా వుంచి రొమ్ము (చాతిని) కొంచెము ముందుకు వంచి, రెండు చేతులను తొడలను మోకాళ్ళను మధ్యగా జొనిపి, భుజములను మోకాళ్ళతో నొక్కి ఉంచ వలయును. ముఖమును పైకి ఎత్తి ఎదురుగా చూడవలెను.

ఉపయోగములు
జీర్ణ శక్తి వృద్ధి యగును. గర్భాశయమందలి ఎక్కువైన అపాన వాయువు బహిష్కరింప బడును.


65. హస్తస్థిత పాదోద్ధితానాసనము

Yogasanamulu.djvuరెండు చేతులను నేలమీద లుంచి, ఒక మోకాలిని ఆవైపు వున్న మోచేతి మీద లుంచి, ఆకాలి మడమ మీద రెండవ కాలి మోకాలును వుంచి, పాద మును పైకి ఎత్తి వుంచ వలయును.

ఉపయోగములు
చేతులు బలముగా అగును.

66. ఉత్తాన జానుసిర సంయుక్తాసనము

నిలువుగా నిలబడి, చేతులు రెండు పైకి చాచి, రెండు చెవులను తాకునట్లు ఉంచి, ముందునకు పాదములకు దగ్గరగా వంగి, ముఖము మోకాళ్ళను తాకు నట్లుంచ వలయును.


ఉపయోగములు

నడుము నొప్పి తగ్గును. జీర్ణ శక్తి వృద్ధి పరచి, కాల విరేచనము జరుగు నట్లు తోడ్పడును.

బక పాద ప్రసరణాసనము

Yogasanamulu.djvu


నిలువుగా నిలబడి చేతులు రెండూ పైకి చాచి, రెండు చెవులను తాకునట్లు వుంచి, ముందునకు పాదములకు దగ్గరగా వంగి ముఖము మోకాళ్ళను తాకు నట్లుంచ వలయును.

ఉపయోగములు
చేతుల బలమును పెంచును.


68,హస్త బద్ధశిర పాదాసనము

నిలబడి, రెండు పాదములను తాకునట్లు తలను క్రిందికి వంచి చేతులతో తొడల లోపలి నుండిం పాదములను పట్టుకొనవలయును.

ఉపయోగములు
శ్వాస కోశములను బలపరచును. వెన్ను మెత్తబడి బిరుసు తనము తగ్గును. అందు వలన బద్దకము నశించి చురుకుగా నుండును.

69. పాదాంగుష్ట శిఖ స్పర్శాసనము

Yogasanamulu.djvu


నిలబడి, ఒకకాలి బొటన వేలిని ఆ ప్రక్క నున్న లేదా మరియొక ప్రక్కనున్న చేతితొ మోచేయి శిరసు మీదుగా వుండునట్లు పట్టుకొని, రెండవ చేతిని తిన్నగా చాచి ఉంచ వలయును.


ఉపయోగములు
రొమ్మును, వెన్నును, మెడను బలముగా ఉంచును.

70. ఉత్తిట అర్థ చక్రాసనము

Yogasanamulu.djvu

నిలబడి రెండు చేతులను పైకి ఎత్తి, వెనుకకు వంగి వుండవలయును. యిందు చేతులను నేలకు తాకక, పైననే ఉంచ వలయును.

ఉపయోగములు

ఇది చక్రాసనము బాగుగా రాని వారికి స్థూల కాయులకు ఉపయోగ పడును. వెన్ను చక్కగా వెనకకు వంగును.

71. పాద హస్త వృష్ట అర్థచక్రాసనము

మోకాళ్ళు నేలకు తాకునట్లు కూర్చొని, వెనకకు నేల మీదకు వంగి, మోచేతులను శిరస్సును నేల మీద లుంచి, చేతులతో కాలి బొటన వ్రేళ్ళను పట్టుకొని ఉంచ వలయును.

ఉపయోగములు
స్థూల కాయము వలన చక్రాసనము రాని వారికి ఇది ఉపయోగ పడును. నడుము వెన్ను పూసలు బాగుగా వెనకకు వంగి మెత్త బడును.

72. ఉత్తిట శిరసాసనము

బొమ్మ;


రెండు చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి, తలను నేలకు తాకకుండు నట్లు నేల మీద నుండి పైకి ఎత్తి, పైకి చూచుచు, కాళ్ళను తిన్నగా పైకి ఎత్తి వుంచవలయును.

ఉపయోగములు
ఇది రొమ్ము, భుజములు, మెడను బలముగా వుంచును.

విస్తిరిత పాదాసనము

రెండు కాళ్ళను ఒక సరళ రేఖ మీద ఉండు నట్లుగా తిన్నగా చాచి కూర్చొని ముందుకు నేల మీదకు గడ్డము తాకునట్లు వంగి చేతులతో ఆ ప్రక్కనున్న కాలి వ్రేళ్ళను పట్టుకొనవలయును.

ఉపయోగములు

తొడల మూల యందలి బంతి గిన్నె కీలునుబాగుగా తిరుగునట్లును ఆథానమున లున్న కండరములను మెత్త బరచి బాగుగా సాగు నట్లును చేయును. ఇది మలబద్ధమును చేర నీయదు. నడుము నొప్పె కారణమయిన వాత దోషములను హరించును.

74.హస్తస్థిర ఊర్ద్వ శిరః పదాసనము

బొమ్మ


పద్మాసనము వేసి కూర్చొని రెండు చేతులను నేల మీద ఆనించి శిరస్సుకు నేలను, ఆనించి ఎత్తకుండ పద్మాసనమునను పైకి తిన్నగా లేవనెత్తవలయును.

ఉపయోగములు
దీని వలన చేతులు బలపడును. మరియు సూర్య చంద్ర స్థానములు తారుమారైనందున ఆయువృద్ధి జరుగును.


75. సారంగాసనము

అరచేతులు నేల మీద ఆనించి హుజములను, గడ్డమును నేల కానించి కాళ్ళను పైకి ఎత్తి వంచి పాదములను శిరసునకు దగ్గరగా చేర్చ వలయును.


ఉపయోగములు
రక్త ప్రరసరణ బాగుగా జరుగును. శస్రీరముమందలి అన్ని కండరములు బలపడును.
76. జాను వృష్ట బుద్ధ పద్మాసనము==
Yogasanamulu.djvu


పద్మాసనము వేసుకొని వెలికిల వీపు నేలను తాకు నట్లు పరుండి శిరస్సును పైకి ఎత్తి రెండు చేతులతోను పిరుదులను చుట్టి పట్టు కొనవలయును.

ఉపయోగములు
జీర్ణ శక్తి వృద్ధి యగును. మాలాశయము నందు వాయువులను మలమును విసర్జింప చేయును.

77. తులాంగులాసనము

పద్మాసనము వేసుకొని వెలికిల రెండు చేతులను పిరుదుల క్రింద ఉంచి శిరస్సును, భుజములు, రొమ్మును, పైకి ఎత్తి మోఖాళ్ళను కూడ ఎత్తి ఉంచ వలయును.

ఉపయోగములు
పొట్ట యందలి ప్రేవులను బలపరచి జీర్ణ శక్తి వృద్ధి యగును.

78. ద్విహస్థిస్తత ఉత్తిట ద్విపార్శ్వ పాద ప్రసరణాసనము

బొమ్మ.


రెండు చేతులను నేల మీద ఆనించి ఒక కాలును ఆ ప్రక్కనున్న మోకాలి వైపునుండి చేతి మీదుగా మడచి రెండవ కాలి మోకాలిని ఆ ప్రక్క ఉన్న మోచేతి మీద ఉంచి తల నేల మీద నుండి పైకి ఎత్తి ఉంచ వలయును.


ఉపయోగములు

చేతులను బలముగా ఉంచును. ముఖము దీప్తి వంతమగును.

79. అష్ట వక్రాసనము

Yogasanamulu.djvu


రెండు అరచేతులు భూమి మీద ఆనించి పాదములు రెండు చేత్ల మధ్య చేర్చి తరువాత రెండు కాళ్ళు చేతులకి ఇరు ప్రక్కల అనగా రెండు తొడలమధ్య అనగా మోకాళ్ళకు కొంచము పైగా ... ఒక చేయి వుండునట్లు రెండు కాళ్ళను ఒక పక్కకు ఎత్తి రెండు పాదములను ఒకదానిపై నొకటి అడ్డముగా వుంచి ముఖము, భుజములు, తొడలు, పాదములు భూమికి సమాతరముగా ఉంచవలయును. అటులనే మరియొక ప్రక్క కూడ చేయ వలయును.


ఉపయోగములు
గర్భాశయము, జీర్ణ కోశములు చురుకుగా పని చేసి జీర్ణ శక్తిని వృద్ధిచేయును. మరియు మలబద్ధకమును నివారించును. చేతులు కాళ్ళు బలముగా అగును.

80. బకాసనము

Yogasanamulu.djvu


అరచేతులను భూమిమీద గట్టిగా అదిమి వుంచి రెండు చేతులు గట్టిగా తిన్నగా వుంచి రెండు మోకాళ్ళను రెండు చంకలను కలిపి నడుము ఎత్తి పైకి చూడవలయును.


ఉపయోగములు

81. కళ్యాణాసనము

Yogasanamulu.djvu


నిలువుగా నిలబడి రెండు మోకాళ్ళ మధ్యనుండి బుజములు రెండు బయటికి వచ్చునట్లుగా తొడలను అనుకొని వంగి శిరస్సు మోకాళ్ళకు పాదములకు మధ్యగా ఉంచి రెండు చేతులను ఒక దానితో ఒకటి వీపుమీదుగా పట్టుకొన వలెను.


ఉపయోగములు

వెన్ను పూసలు, నడుము లో తొడలయందలి కండరములు, నరములు బాగుగా సాగును. జీర్ణశక్తి వృద్ధి యగును. మలబద్దకము నివారించ బడును. ముఖమున తేజస్సు వృద్ధి యగును.


82. ఏకపాదగ్రీవ ఉత్తిట పాద పరసరణాసనము

Yogasanamulu.djvu

రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చొని ఒక కాలిని భుజము వెనుకనుండి మెడమీద ఉంచుకొని రెండు చేతుల మీద శరీర మును అనగా పాదములు, తొడలు పిరుదులు భూమికి సమాతరముగా పైకి ఎత్తి ఎదురుగా చూడ వలయును.

ఉపయోగములు
చేతులు, మెడ మోకాలి కీళ్ళ నరములు బలముగా నగును. జీర్ణ శక్తి వృద్ధి యగును. మల బద్దకము వాత రోగములు నివారించ బడును.


83. ఏక పాద విపరీత మస్తక స్పర్శనాసనము

ఒక కాలిని ముందుకు మడిచి మోకాలి మీద కోర్చొని మరియొక కాలిని వెనుకను తిన్నగా వుంచి మోకాలు వంచి రెండు మోచేతులు ముఖమునకు పైగా వుండు నట్లుగా వెనుకకు వంచిన కాలి యొక్క పాదమును పట్టి చుంచ వలయును.

ఉపయోగములు
ఈ ఆసనము వలన నడుము చుట్టు నున్న కండరములు బలముగా నగును. అందు వలన మూత్ర పిండములు చక్కగా పని చేయును. మరియు నడుము నందలి వాత దోషములు హరించును. మోకాళ్ళు, తొడలు మెడ బాగుగా సాగి అందలి నరములు, కండరములు చాల బలముగా ఉండును.

84. అర్థ చక్రాసనము

బొమ్మ.


పాదములు మోకాళ్ళు నేల కానించి వెనుకకు వంగి చేతులతో పాదములను పట్టుకొనవలయును.

ఉపయోగములు
గర్భ కోశ మందలి కండరములు బాగుగా పని చేయును. వెన్ను చక్కగా వెనుకకు వంగి వెన్ను పూసలు చుట్టు నున్న కండరములు మెత్తబడును.

85. మృగాసనము

ఇది లేడితల వలె కనుపించును. వజ్రాసనమున రెండు మోకాళ్ళపై కూర్చొనుము, ముందుకు వంగి నేల మీదకు గడ్డము ఆనించి చేతులు రెండింటిని వెనుకకు వీపుమీదుగా తిన్నగా పైకి చాచి ఎత్తవలయును. రొమ్ము మోకాళ్ళకు తొడలకు ఆని యుండును. పిరుదులు కొంచము ఎత్తి ఉంచవలెను.

ఉపయోగములు

భుజములు, మోకాళ్ళు, తొడలు, మెడ బలముగా నగును. పొత్తి కడుపులో వున్న అనవసర మైన వాయువు తొలగి పోవును. జీర్ణ శక్తి వృద్ధియగును. మలబద్దము వుండదు.

పశ్చిమాతాసనము


బొమ్మ.


రెండు కాళ్ళు ముందుకు చాచి పాదములు రెంటిని దగ్గరకు చేర్చి కూర్చొని రెండు చేతులను పైకి ఎత్తి బాగుగా నిండుగా గాలిని పీల్చుకొని (ప్రారంభ దశలో గాలి పీల్చకుండా) ముందుకు వంగి కాలి బొటన వ్రేళ్ళను పట్తుకొని గడ్డమును మోకాళ్ళకు తగులు నట్లు ఉంచ వలయును.

ఉపయోగములు: జీర్ణశక్తి వృద్ధి యగును. మలబద్దము ఉండదు. పశ్చిమతానాసనము పలురకములుగా చేయ వచ్చును. ఫలితములు సమానము.

.87. ఆను బద్ధ పశ్చిమతాసనము

Yogasanamulu.djvu


రెండు కాళ్ళు నిలువుగా ముందుకు చాచి రెండు పాదములు ఒకదానితో ఒకటి చేర్చి రెండు మోకాళ్ళను రెండు చేతులతోను నొక్కించి మోకాళ్ళను కొంచెము పైగా..


గడ్డము ముఖము ఆనించి కడుపుకు తొడలు తగులు నట్లుంచ వలయును.

88. హస్త వృష్ట బద్ద పశ్చిమతాసనము

Yogasanamulu.djvu


కాళ్ళు రెండు ముందుకు చాచి మోకాళ్ళు పాదములు దగ్గరగా వుంచి రెండు చేతులు వీపు మీద కట్టుకొని ముందుకు వంగి కడుపు తొడలను తాకు నట్లు గాను ముఖము మోకాళ్ళకు తాకు నట్లుగాను వుంచునది.


89.ద్విహస్త ప్రసరణ పశ్చిమతానాసనము

Yogasanamulu.djvu


కాళ్ళు రెండు ముందునకు ఒక దాని కొకటి తాకున్నట్లుగా చాచి కూర్చొని ముందునకు వంగి ముఖము మోకాళ్ళకు తాకు నట్లుగా ఉంచవలయును.

90.ముష్టివృష్ట బద్ద పశ్చిమతానాసనము.


రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చొని రెండు చేతులు వీపు వెనుకగా ఒక దానితో ఒకటి పట్టుకొని నిలువుగా చాచి ముఖము మోకాళ్ళను తాకు నట్లుగా ముందునకు వంగి ఉండ వలయును.


.91. ఏక పాదగ్రీవ పశ్చిమానాసనము

Yogasanamulu.djvu


కాళ్ళు రెండు ముందునకు తిన్నగా చాచి కూర్చొని ఒక కాలిని వీపుమీద నుండి మెడమీదకు వేసుకొని, రెండు చేతులతోను పాదములు రెండింటిని పట్టుకొని ముందుకు వంగి, మోకాలిపై ముఖమును ఆనించ వలయును. అతులనే రెండవ కాలొతోను చేయవలయును.

92. ఏక హస్త అర్థ పద్మాసనము. పశ్చిమతానాసనము

రెండు కాళ్ళు ముందుకు చాచి ఒక పాదమును మరియొక తొడ మూలమున ఎక్కించి ఆ ప్రక్కనున్న చేతితో వీపు మీదుగా ఆ పాదమును పట్టుకొని రెండవ చేతితో చాచిన


కాలి పాదమును పట్టుకొని ముందుకు వంగి మోకాలిపై ముఖమును వుంచ వలెను.

93. ఏకజాను వృష్ట బద్ద పశ్చిమతానాసనము

రెండు కాళ్ళు తన్నగా చాచి కూర్చొని ఒక కాలి పాదమును ఆ పిరుదును చేర్చి దాని ముందుంచి రెండు చేతులను వీపునకు నిలబెట్టిన కాలును చుట్టి వెనుకను ఒక దానితో ఒకటి పట్టు కొనవలయును. మరియు ముఖమును మోకాలిపై తాకునట్లు వంగి ఉంచ వలయును.

.94. పాద ప్రసరణ పశ్చిమతానాసనము

Yogasanamulu.djvu

రెండు కాళ్ళు ఇరుప్రక్కల ఒక సరళ రేఖలో చాచి ఎదురుగా నున్న కాలి వ్రేళ్ళను ముందుకు వంచి మోకాలికి ముఖము తాకు నట్లు వుండవలయును.

.95. మయూరాసనము

Yogasanamulu.djvu


మయూరమనగా నెమలి. అట్టి రూపములో నున్న భంగిమ కావున మయూరాసనమనిరి. రెండు పాదముల వ్రేళ్ళపై కూర్చొని రెండు చేతులను చేతి వ్రేళ్ళు పాదముల కెదురెదురుగా ఉండు నట్లు పాదముల ముందు అరచేతులు వుంచి ముందునకు వంగి మోచేతులను రెంటింటిని కలిపి మోచేతులు సరిగా బొడ్డున (నాభి) చేర్చి ముఖము పైకి ఎత్తి రెండు కాళ్ళు వెనుకకు చాపి తిన్నగా ఉంచ వలయును.

ఉపయోగములు
జీర్ణశక్తి వృద్ధి కాగా ఒక మాదిరి విష పదార్థములు కూడ జీర్ణమగునని శాస్త్రములయందు చెప్ప

బడినది. స్థూలమయిన పొట్ట కుంచించుకొని అచట పేరుకొనిన క్రొవ్వు చెదిరి పోవును. గర్భాశమములోనూ, కాలేయము, చేదు కట్టి, హృదయము, మూత్ర పిండముల వంటి అన్ని అవయవములు చాల ఉత్తేజ పడి సక్రముగా పని చేయును.

ఈ ఆసనమును చేతి వ్రేళ్ళు ముందునకు ఉంచియు వ్రేళ్ళను మడిచి గుప్పెటలు నేలను ఆనించి కూడ చేయ వచ్చును.


96. మయూరి (ఆడ నెమలి) ఆసనము :

పద్మాసనము వేసి రెండు అరచేతులను రెండు మోకాళ్ళ మధ్యన ఆనించి, రెండు మోచేతులపైనను బొడ్డున ఉంచి పద్మాసనముతో మయూరాసనము వేయుట.

ఉపయోగములు

మయూరాసనము నందలి ఉప యోగములే ఇందు కూడ చేకూరును.


97.ఉత్కటాసనము

Yogasanamulu.djvu

రెండు పాదముల మీద కూర్చొని మడమలను పైకెత్తి మోకాళ్ళను ముందునకు వంచ వలయును. చేతులు రెండింటిని మోకాళ్ళమీద ఉంచ వలయును.

ఉపయోగములు
పాదముల వ్రేళ్ళు, మోకాళ్ళు వాత రోగము లేకుండును.


98.పాదాగుష్టాసనము

పైన చెప్పిన రీతీ ఉత్కటాసనమున కూర్చొని ఒక పాదమును తొడ మీద ఉంచుము. రెండు చేతులను నడుఇము పై ఉంచుకొని ఎదురెదురుగా చూడుము. రెండవ ప్రక్కన కూడ అట్లే చేయుము.

ఉపయోగములు: పాదముల వ్రేళ్ళు బలపడును.

99. త్రికోణాసనము

Yogasanamulu.djvu

రెండు పాదములు ఒకదాని కొకటి బాగుగా ఎడముగా ఉంచి, రెండు చేతులను ప్రక్కలకు చాచి మోకాళ్ళు వంచకుండ వెన్నును ప్రక్కగా వంచి ఆపరక్కనున్న చేతితో పాదమును గుత్తి వద్ద పట్టుకొన వలయును. అటులనే రెండవ ప్రక్క కూడ చేయ వలయును.

ఉపయోగములు
నడుము చుట్టు నున్న క్రొవ్వు కరిగి నడుము సన్నగా నగును.


100. గరుడాసనము

Yogasanamulu.djvu


రెండు పాదములపై తిన్నగా నిలబడి, ఒక కాలిని రెండవ కాలికి ముందు నుండి పెనవేయుము. అటులనే చేతులు కూడ ఒకదానితో మరియొకటి పెనవేయుము. రెండ ప్రక్క కూడ అటులనే చేయవలయును.

ఉపయోగములు
గిలక, వరిబీజము వంటి రుగ్మతలు నివారణ యగును.


101. చక్రాసనము

నిలువుగా నిలబడి చేతులు రెంటిని పైకి ఎత్తి నెమ్మది నెమ్మదిగా చేత్లను తలతో పాటు రెండూ చేతులూ వంచుతూ నేలకు ఆనించ వలయును. ఇది చక్రమును పోలియుండును కావున చక్రాసనమనిరి.

ఉపయోగములు
వెన్ను పూసలు చుట్టునున్న కండరముల సంధి భందములు మెత్తబడి చక్కగా వంగును. నడుములోను వెన్నులోను ఉన్ననొప్పులు నివారించ బడును. జీర్ణ శక్తి వృద్ధి యగును.

102 నిరాలంబ చక్రాసనము

బొమ్మ:


రెండు పాదంకులపై తిన్నగా నిలబడి, చేతుల సహాయము లేకుండా నీలమీదికి వెనుకను వంగి శిరస్సుతో నేలను తాకునట్టిది.

ఉపయోగములు
చక్రాసనము వలెనే సిద్ధించును. అనగా రెండు కాళ్ళతోను చేయ వలయును. దీనిని ముద్రల యందు మహాముద్ర యని చెప్పబడినది.
ఉపయోగములు
జఠరాగ్ని వృద్ధి పొంది తినిన అహారము చాల వరకు రక్తములో కలియునట్లు జీర్మమగును. నడుము నొప్పి తగ్గును.

104. శీరసాసనము

బొమ్మ:

తలను పీఠముగా ఉంచి తల క్రిందులుగా నిలబడుత రెండు అరచేతులను ఒకదాని కొకటి చేర్చి మోచేతుల వరకును నేలకు ఆన్చి కోణము ఏర్పడునట్లు చేసి రెండు ముంజేతులను ఆనించి తలను ఉంచి శరీరమును చేతుల బలము పై పైకి ఎత్తి నిలిచి ఉంచ వలయును. శరీరము ను నిగిడ్చవలెను.

ఉపయోగములు


దీని వలన సూక్ష్మ నాడీ మండలమందలి సూర్య చంద్ర స్థానములు తారు మారగును. సూర్య స్థానము నాభి స్థాన మందును, చంద్ర స్థానము కంఠము నందును ఉన్నవని పైన పేర్కొని యుంటిమి. ఆ విధముగా సూర్య చంద్ర స్థానములు తారుమారగుట వలన చంద్ర స్థానము నుండి ఉత్పత్తి అయిన అమృతమును సాధకుడు అనుభవించుట చేత శరీరమందని అన్ని అవయవములు పోషింప బడి, రోగములను వీడి దీర్ఘాయుష్మంతుడగును. జ్ఞాపక శక్తి పెరుగును. ముఖము తేజో వంత మగును. చల తిరుగుట వంటి దోషములు నివారించ బడును.

కొందరు దీనిని గూర్చి చాల దుష్ప్రచారము చేయు చున్నారు. తిరగబడి రక్తమంతయు శిరస్సు మీద పడుననియు, కండ్ల యందలి నరములకు ప్రమాదము వచ్చుననియు చెప్పుచున్నారు. ఇది సత్యము కాదు. మనము సామాన్యముగా నిలబడినపుడు మన శరీర మందలి రక్తమంతయు పాదముల మీద పడుటలేదు. మన రక్త వాహికలు కవాటములతో కూడి ఉన్నందున రక్తము ఒకచోటికి చేరుకోదు. సామాన్య స్థితిని విపద్యయము చేయుట వలన సరీరము నందలి పీడనములలో తేడా వచ్చును. ఊర్ధ్వ పీడనమున వున్న స్థానమున అధో పీడనము, అతులనే అధో పీడనము ఊర్థ్వ పీడనముగాను మారును. ఇట్టి మార్పునకు అలవాటు పడిన యడల ఎట్టి సంశములు వుండవు. సాధకులు ప్రారంభములో వాయువును కుంభించి చేయ రాదు. కుంభించి నపుడు ఒత్తిడులు ఎక్కువగగును. కనుక సామాన్యముగా శ్వాసించుచు శీర్షాసనము వేయుట చాల మంచిది.

==105. ఊర్థ్వ పద్మాసనము
బొమ్మ.

పద్మాసనము వేసి దానిమీదనే శిరసాసనము వేసి వుండవలయును.

ఉపయోగములు
శీర్షాసన ఉపయోగములే ఇంచుకూడ అనుభవింప వచ్చును.

166.శవాసనము

రెండు కాళ్ళను ముందుకు చాచి చేతులను శరీరమునకు రెండు ప్రక్కల యందు వుంచి వీపుమీద పండు కొనవలయును. అవయములన్నియు వదులుగా వుంచ వలయును శ్వాస వేగము తగ్గించ వలయును.

ఉపయోగములు

శరీరము యెక్క వునికిని కొంత సేపు మరచి వుండ వలయును. అందు వలన మనస్సు శరీరము పూర్తిగా విశ్రాంతి పొంది తిరిగి ఎక్కువ శక్తి వంత మగును. ఇందు సాధకుడు మృతుని వలె చైతన్యమును వీడి యుండుట చేత మృతాసనమని, శవాసనమని అనిరి.

107.జేష్టికాసనము

ఇదియు ఒక విధమయిన శవాసనమే. శవాసనమునకు వాలె వెలికిల వీపు నీల మీద వుండు నట్లు కాళ్ళు రెండును చేర్చి నిలువుగా నేల మీద వుంచి కీళ్లు కండరములు సదలించి వుంచ వల్లెను. శవాసనమునకు చేతులు రెండు శరీరమునకు ఇరు ప్రక్కల నుండును. కాని ఈ ఆసనమున చేతులు రెండు తలకు ఇరుప్రక్కల పైకి నేల మీద వుంచ వలయును.

ఉపయోగములు
శవాసనము వలెనే.

108. అద్వాసనము


ఇది మరియొక విధమగు శవాసనము. శవాసనమునే నేలకు రొమ్ము కడుపు తగులు నట్లు బోరగిల పరుండి, చేతులు ఇరుప్రక్కల, అరచేతులు నేలను తాకు నట్లు వుంచ వలయును. శరీరములోని అన్ని కండరములు కీళ్ళు సడలించి ఉంచ వలయును. శరీరమును ఒక్కొక్క అవయవము అనగా కాళ్ళు, కడుపు, భుజములు, చేతులు, ముఖము ఇటుల ఒకొక్క అవయవము లేదను కొని పూర్తిగా శరీరమే లేదనుకొని కొంత సేపుండుము. ఇట్లు మనసునకు సంపూర్ణమైన విశ్రాంతిని ఇవ్వగలరు. కండరములు, కీళ్లు సడలించుట వలన శరీరము విశ్రాంతి పొందును.

109.మృతాసనము

ఇది బిదిసి పోయి8న శరీరము వలె నుండును. వీపు నేలను తాకునట్లు తిన్నగా పరుండి రెండు చేతులను ఉదరము (రొమ్ము) మీద కట్టి వుంచుము. కండరములు, కీళ్ళు అన్ని బిగించి ఉంచుము. తలను పాట్టుకొని ఎత్తిన యడల పాదముల వరకు వంగక, దేహమంతయు కర్ర వలె నిలువుగా లేప వల

యును. అటులనే పాదముల పట్టి పైకి లేపిన యడల శిరస్సు వరకు తిన్నగా కర్ర వలె లేవ వలయును. పూర్తిగా ఊపిరిని పీల్చి కుంబించి బయటకు పోనీయ కుండ బిగబట్టి కొంత సేపు ఉంచవలయును.

ఉపయోగములు
ఇందు వలన కండరములు కీళ్ళు బలపపడును. ప్రాణములు స్వాధీనములో నుండును.

110. సేతుబంధ ఆసనము

తలను, వీపును నేలకు తాకునాట్లు వెలికిల పరుండి పాదములను పిరుదుల వరకు చేర్చి చేతులను తొడల మూలములందుంచి, తలను నేల మీద లుంచి, తల పాదముల మీద ఉంచి శరీరమునంతను అనగా వెన్నెముకను తొడల పైకి ఎతి ఉంచ వలయును. ఇది బ్రిడ్జి వలె నుండును.

ఉపయోగములు
మెడ విపరీతమగు బలమును పొందును. కడుపు, వెన్ను చక్కగా సాగి బద్ధకమును పోగొట్టును.

111. హస్త స్థిత ఊర్ద్వ పాదాసనము

బొమ్మ.


రెండు చేతులను నేల మీద లుంచి శరీరమునంతను పైకి ఎత్తి నిలబెట్టుము. కాళ్ళు పాదములు, చేతులు తిన్నగా వుంచ వలయును.

ఉపయోగములు: ముఖము వికాస వంతముగా ఉండును. చేతులు బలముగా ఉండును.