యోగాసనములు/పరిచయం

వికీసోర్స్ నుండి

యోగాసనాలు

అష్టాంగయోగము షడ్దర్శనములలో ఒకటి. సాంఖ్యాశాస్త్రము, యోగశాస్త్రము, అనునవి ఒక జంటయని పండితులు నిర్ణయించిరి. సాంఖ్యాశాస్త్రమున ప్రకృతి సృష్టికి మూలమన్న ప్రవచించినందున అద్దానిని నీరీశ్వర శాస్త్రమని చెప్పగా యోగ శాస్త్రము ప్రకృతి నిక్కడ భగవంతుడే సృష్టి చేసెనని తెలియజేయును. సాంఖ్యశాస్త్రమునకు కపిల మహర్షి మూలము. పాతంజలి మహర్షీ యోగశాస్త్రమును సూత్రీకరించుచు ఈ శాస్త్రము ప్రాచీన మయినది అని చెప్పుటచేతను వేదముల యందును, చాల ఉపనిషత్తుల యందును వివరింపబడి యుండుట చేతను, అతి సనాతనమయినదనుట నిర్వివాదము. దీని ఆవిర్భావకాలమును నిర్ణయించుట అతి సాహసము మాత్రమే.

జీవులు శరీరములను పొంది సత్వరజస్తమో గుణ ప్రభావములచేత కర్మములనుచేయుచు కర్మలబ్ది ప్రతిఫలమును దాని శేషమును అనుభవించుటకు జన్మలను తిరిగి తిరిగి పొందుచుండును. జీవుడు యాతనా యుతమైన జన్మలను దుఃఖములను పొందుటకన్నా తను విడివడి వచ్చిన పరమాత్మను చేరుటయే పరమలక్ష్యము. ప్రపంచమున ఉన్న జీవులన్నిటిలోను మానవులు ఉత్కృష్ట జీవులు. మిగిలిన అన్ని జీవులకన్న వికసించిన జ్ఞానము కలవాడు మానవుడు. అట్టి జ్ఞానమును సద్వినియోగము చేసికొనగలుగుటయే మానవ జన్మకు పరమావధి మరియు తనకన్న ఉత్తమ మయిన స్థితిని పొందుటకు అనగా మానవత్వము నుండి పైమెట్టు అయిన దివ్యత్వమును పొందుటకు సాధన చేయవలయునే గాని తనకన్నా హీన స్థితి పొందిన మృగ, పక్షి, వృక్ష, పర్వతముల వంటి జ్ఞానరహిత జీవరాశుల స్థితిని పొందుటకు సాధన చేయుట అజ్ఞానమునకు నిదర్శనము. మానవుడు సహజముగా తన చుట్టూ ఉన్న ప్రకృతి ప్రభావమునకు లోబడి తన్నుతాను పూర్తిగా మరచి సంసార మనెడు సుడిగుండములోబడి బయటకు రాలేకపోగా తానున్న ఆ అజ్ఞాన స్థితియే నిజమగు సుఖమని నమ్మి మోసపోవు చున్నాడు. అజ్ఞాన తిమిరము జ్ఞానకాంతితో తొలగినపుడు తన పొరపాటును గుర్తెరిగి జన్మ రాహిత్యమును పొంది భగవదైక్యమును పొందుటకు సాధనము చేయుచున్నాడు. ఆ స్థితిని సాధించుట కొరకు భక్తి, కర్మ, జ్ఞాన యోగములను సాధనములను ఉపకరణములుగా ప్రసాదించబడియున్నవి. భక్తి, కర్మ, జ్ఞాన యోగముల చేత భగవత్సాక్షాత్కారమును బడయుటకు చాల కాలము అనగా ఒక్కొక్కప్పుడు జన్మ పరంపరలు కావలసి వచ్చును. కాని మార్గము సుఖతరమైనట్టిది. అదే లక్ష్యసాధనకు యోగము అనగా రాజయోగము. మరి యొక మార్గము. ఈ మార్గము కష్టతరముగా తోచినను త్వరగా భగవదైక్యము సాధించవచ్చును. యోగాభ్యాసము వలన కర్మ శేషమును దహింపజేసి జన్మ పరపరలు అవసరము లేకుండా మరియు సర్ప, వ్వాఘ్రములవంటి క్రూర జంతువులను మచ్చికతో వశపరుచుకొనిన రీతిని శాస్త్రవిహితములైన పద్ధతులను అనుసరించి, మార్గమును సుఖమైనదిగా చేసుకుని గమ్యమును సాధించవచ్చును. ఇట్టి రాజయోగసాధనకు హఠ యోగము ప్రథమ సోపానము.


తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దేహికం
యత తేచ తతో భూయః సంసిద్దౌ కురునందన||
పూర్వాభ్యాసేనతేనైవ హ్రియతే వ్యావసో పీవా
జిజ్ఞా సురపి యోగస్య శబ్ద బ్రహ్మతో వర్తతే ||

.......................... భగవద్గీత ...అ ఆ || 4 | 44 శ్లో.||

యోగ భ్రష్టుడైన ఒక సాధకుడు యజ్ఞము వంటి పుణ్య కార్యము లొనర్చు వారికి ప్రాప్తించు సుఖములతో గూడిన పుణ్య లోకములు ప్రాప్తించును. తరువాత (అనగా పుణ్యము క్షీణించిన పిదప) శుచి వంతులు శ్రీ మంతులయిన వారి ఇంట జన్మించును. లేదా యోగులయినట్టి ధీమంతులయిన వారింట జన్మించును. అప్పుడు తాను ఇచ్చగించక పోయినను యోగము వైపునకు ఆకర్షింప బడి ఎక్కువగా కృషి చేసి బ్రహ్మైక్యము పొందును.

ప్రాణ అపానముల సంయోగమే యోగమనియు అట్టి స్థితిలో చిత్త వృత్తులు నిర్మూలింప పడుననియు చిత్తము ఏకాగ్రతను పొంది పరిణితి చెంది సమాధి స్థితిని ప్రాప్తింప జేయుననియు సమాధి యందు జీవుడు పరబ్రహ్మమున లయమంది అనిర్వచనీయమైన ఆనందమును పొందుననియు శాస్త్రము లందు చెప్పబడినది. అట్టి ఆనందమయ స్థితిని విడిచి వచ్చుటకే సాధకుడు ఇచ్చగింపడు. ఇట్లు ప్రాణాపాయములు చిత్తమున లయమగుట చేత దీనిని లయ యోగమని కూడ అందురు. ఆంధ్ర దేశమున మహా మహిమోపేతుడయి విరాట్ శ్రీ వీర బ్రహ్మేంద్రులు యోగ శాస్త్ర రహస్యములన్నియు సత్యములని నిరూపించి శాస్వత సమాధి నిష్టులైనారు. 13 త్రిలింగ స్వామియును తెలుగు స్వామి కాశీ పట్టణమున యోగ శాస్త్ర విషయములన్నియు సత్యములని నిరూపించినారు. సాధారణముగా ఈ విద్యను నిగూఢముగా ఉంచుటకు ప్రయత్నించ బడెను. కేవలము ఈ విద్య యొక్క పవిత్రతను పరి రక్షించుట కొరకు మాత్రమే రహస్యముగా ఉంచ బడెను. యోగ విద్యను అన్ని వర్ణముల వారును, స్త్రీలు గూడ అభ్యసించ వచ్చునని మతంగ మహర్షి చేత చెప్పబడెను.

  • ||అగ్నిష్టో మాదికాన్ స్ర్వాన్ విహయ ద్విజ సత్తమః
  • యోగాభ్యాస రతః శాంతః పరం బ్రహ్మ ధి గచ్చతి||
  • బ్రాహ్నణ క్షత్రియ విశాం స్త్రీశూద్రౌదాంచ పావనం|
  • సాంతయే కర్మణా మన్యద్దోగాన్నాస్తి విముక్తయే|| అని మరియు యువకులు, వృద్ధులు, రోగులు, ఏడు సంవత్సరముల పైబడిన బాలబాలికలు, స్త్రీ పురుషులు అభ్యసించ వచ్చునని శాస్త్రములు చెప్పినవి. యోగ విద్యకు మతము అడ్డురాదు. ఏ మతస్థులయినను యోగమును అభ్యసించ వచ్చును. యోగము సర్వ కాలములకు సర్వ మతములకు, సర్వ దేశములకు తుదకు నిరీశ్వర వాదులకు కూడ తగినదైనందున ఎల్లరు అభ్యశింప దగిన దనుట శాస్త్ర సమ్మతము. శాస్త్ర విహితమైన రీతిని సాధన చేసిన సత్పలితములను పొంద వచ్చును.

రాజ యోగము హఠ యోగమునకు మెట్టు వంటిది. హఠ యోగము యొక్క పరిణితి పొందిన దశయే రాజ యోగము. హఠ యోగమున యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహారధారణ, ధ్యాన, సమాధి యని (8) ఎని మిది అంగముల కల్గి అష్టాంగ యోగముగా వెలువడినది, యోగాభ్యాసమునకు ప్రారంభమునుండి సాధకుడు బాహ్యము లైనట్టియు, అంతరము లైనట్టియు కొన్ని నియమములను అలవరచు కొనవలయును. యమ నియమములే అట్టికట్టు బాట్లు.

యమము అనగా అహింస, సత్యమునే పల్కుట, దొంగ తనము చేయ కుండుట, బ్రహ్మ చర్యము పాటించుట ఓరిమి కల్గి యుండుట, మనస్సు బాధ పడినపుడు చలింప కుండుట, దయ కల్గి యుండుట, ఋజు ప్రవర్థనము కలిగి యుండుట, మితముగ భుజించుట, పరిశుభ్రముగా ఉండుట, అను పది అంశములు.

నియమ మనగా తపస్సు, సంతోషము, ఆస్తిక్యత, దానము, భగవంతుని పూజించుట, భగవంతుని గూర్చిన సిద్ధాంతములను వినుట, ధర్మ విరుద్దములను కర్మలను ఆచరించుటయందు సిగ్గును పొందుట, సద్భుద్ది, జపము, వ్రతము అను పది అంశములు.

ఇట్టి యా నియమములు ముందుగా అభ్యశింపక యోగాభ్యాసమును ప్రారం భించు వారు పునాది బలము లేకయే (పెద్ద భనములు) హర్మ్యమును నిర్మించిన అది అనతి కాలములోనే నేల కూలినట్లు భంగ పడవలసి వచ్చును. చాల తపస్సుచేసి గొప్ప శక్తులను సంపాదించియు పైన చెప్పిన నీతి నియమములు లేక భగపడిన ఉదంతములు భారతీయ పురాణ, యితిహాసముల యందు లెక్కకు మిక్కుటముగా కాన వచ్చును. పై విషయములలోని యమము నందలి మితాహారమును గూర్చి వివరించుట చాల అవసరము. యోగ సాధకులు యోగా

భ్యాసమునకు ఉచితమైనట్టి ఆహారమును మాత్రమే భుజింప వలయును. పరిమాణమున తిన గల్గినంత ఆహారములో సగము మాత్రమే భుజింప వలయును. మిగిలిన సగభాగములో సగము అనగా నాలుగవ వంతు నీరు త్రాగవలయును. ఆప్పుడు ఆహార కోశము నాల్గింట మూడు వంతులు ఆహారముచే నిండి పాతిక భాగము ఖాళీగా విడిచి పెట్ట వలయును. ఇది వాయువు చేత ఆక్రమించ బడును. ఆ విధముగా భుజించు నెడల తేలికగా జీర్ణమగును. జీర్ణమయిన ఆహారము రక్తమున కలియును. జీర్ణము కాక మిగిలిన పొట్టు పదార్థము మలాశమున చేరి బహిష్కరింప బడును. సాధకుడు తినబోవు ఆహారము మెత్తని దై బాగుగా పచనము చేయబడ వలయును. మధురముగా వుండి శరీరమున వున్న జీవుని కొరకు గ్రహింపబడునది మితాహారము అనబడును. యోగాభ్యాసము చేయు వారు అనతి కాలముననే సత్పలితమును సాధింప గోరుదురేని వారి ఆహార నియమమును తప్పక పాటించ వలయును. అట్టి వారు చేదు, పులుపు, కారము, సముద్రపు ఉప్పు, మాంసము, చేపలు, క్షుద్ర ధాన్యములని చెప్పబడు ఉలవలు, బొబ్బర్లునూ, ఉల్లి, వెల్లుల్లి, యింగువ, నూవులు, ఆవాలు బెల్లము, నూనె మొదలగు అహార పదార్థములను, స్త్రీ సాంగత్యము (స్త్రీ సాధకుకలు పురుష సాంగత్యము) దుర్జన సహ వాసము, ప్రాతః స్నానము చలిమంట కాగుట, శరీరమును అధికముగా శ్రమ పెట్టుట అనునవి వర్జింప వలయును. చెక్కర, పటిక బెల్లము, ఆవుపాలు, ఆవు వెన్న, ఆవు నేయి (దొరకని పక్షమున గేదె పాలు, వెన్న, నేయి) పంచ శాకములు అనగా జీవంతి, వాస్తు 16 మత్స్యాక్షి, మేఘనాధ, పునర్లవ అను ఆకు కూరలను, పెసర పప్పు, గోదుమలు, వరి, శొంటి వంటి పదార్థములను మరియు తీయని పండ్లను తినవచ్చును. ఉప్పు సంపూర్ణముగా వర్జింప లేని యడల అపుడపుడు కొంచెము సైంధవ లవణమును కారమునకు ప్రత్యామ్నాయముగా శొంటిని గాని, మిరియములను గాని వాడవచ్చును. పెసర పప్పునకు బదులు అప్పుడపుడు కంది పప్పును కూడ వాడవచ్చును. ఆహారము కంటికింపైనది గాను, మధురముగాను శరీరమునకు పుష్టి నొసగు నదిగను వుండ వలయును. ఆహారమును నిర్ణయించునపుడు సాత్వికాహారమును ఎన్నుకొన వలయును. ఇది శరీరమున సత్వ గుణమును వృద్ధి చేయునని తెలిసికొన వలయును. ఆహారమున నియమములు పాటింపక మత్స్య మాంసములను అపద్య పదార్థములను తినుట వలన శరీరమున బండతనము, మెదడున మొద్దు తనము ఎక్కువ నిద్ర, విచక్షణా జ్ఞానసూన్యతయు కల్గి రజో గుణ తమో గుణముల ప్రభావము అధికమై సాత్విక గుణము క్షీణించి యోగ నాడీ మార్గము శుద్ధి గాక అభివృద్ది నిరోధకముగా నుండును.

  • యుక్తాహార విహారస్య చేష్టస్య కర్మసు
  • యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా|| భ.గీ. 6వ, అ|| 17 వ శ్లోకము.

నియమిత ఆహార వ్వహవారములు కల్గి నియమితమైన నిద్ర జాగరణ కలిగిన వారికి సంసార దుఃఖము దూరమగునని " గీత యందు ప్రవచింప బడినది.

పైన చెప్పబడిన యమ, నియమములను చక్కగా

పాలన చేయుచు అష్టాంగ యోగమున మూడవది యగు ఆసనములను అభ్యసించ వలయును. అసనమనాగా స్థిర సుఖాసనమ్ అని పతంజలి మహార్షులవారు సూత్రీకరించి యున్నారు. అనగా ఆసనము స్థిరమైన, సుఖ ప్రదమైన ఒక భంగిమ. అది ఎట్టిదైనను కావచ్చును. యోగ సాధన పై తరగతులలో సాధన చేయు వారు గంటా కొలది, దినముల కొలది తన శరీరము పై ధ్యాసను విడచి భగవంతుని యందు చిత్తమును లయ పరచి ఉంచవలసి యుండును. అందు కొరకు ఒకటి లేక రెండు సుఖమయిన ఆసనములను సాధకుడు ఎన్నుకొని ఎంత కాలమయినను ఎట్టి బాధను పొందక ఆసనములో నుండు రీతిని ఆసన సిద్ధిని సాధించ వలసి యుండును. వివిధ ఆసనముల సాధన శరీరమునకు స్థిరత్వము, దృడత్వము, బలము, ఆరోగ్యము, చిత్త స్థయిర్యమును సాధించు శక్తిని గల్గియున్నందున ఆసనములను శరీర వ్వాయామమునకును, రోగ నిర్మూలనము కొరకూ సాటిలేని మేటి సాధనమని గుర్తించ బడినది.

ఆసనముల గూర్చి తెలిసి కొన బోవు ముందు మానవ శరీర నిర్మాణము గురించి ఒకింత తెలిసికొనవలసి యున్నది. పర బ్రహ్మ సృష్టి కర్త. సృష్టిని ప్రారంభించుటకు ముందుగా ఆకాశమును సృజియించెను. దాని నుండి వృద్వి, వాయువు, అగ్ని, జలము ఉద్బవించినవని శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ ఐదును పంచ భూతములుగా చెప్పబడినవి. ఇవి ప్రకృతికి మూల పదర్థములు. జడ స్వభావము కల్గినది. ప్రకృతియందు

పంచ భూతములు వివిధ నిష్పత్తులలో సంయోగము పొంది శరీరముల వంటి వివిధ పదార్థములు నిర్మాణము కాగా ఆ శరీరములకు ప్రాణ శక్తి శరీరముల నుండు నిర్గమించగానే ఆ శరీరము నియమము తప్పక విపంచీకృతమై తమ తమ నిష్పత్తుల ప్రకారము ఆయా భూతముల యందు చేరు చున్నవి. కల్పాంతమున పంచ భూతములో యందలి నాల్గు భూతములు ఐదవది యగు ఆకసమున లయమగు చున్నది. విశ్వ మందలి సమస్త శక్తులు, జలశక్తి, వాయు శక్తి, అయస్కాంత శక్తి, ఉష్ణ శక్తి మొదలుగా గల సకల శక్తులు ప్ర్రాణ శక్తి యందు లయమగు చున్నవి. ఈ ప్రణ శక్తి నాలుగు భూతములను ధరించిన ఆకసస్మను పదార్థమున లయమందూ. మరల సృష్టి ప్రారంభమున పర బ్రహ్మము నుండి ప్రాణ శక్తి వెలువడి సృష్టిని కొనసాగించును. ఈ విధముగా ప్రతీ కల్పకమందును ఒక నియమిత మార్గములో స్సృష్టి జరిగి దానిని పోషించి లయము చేయును.

మన స్థూల నేత్రములకగపడని స్థూల దేహములకు వెనుక సూక్ష్మ శరీరము అనునది ఒకటి కలదు. భౌతిక శరీరమున చర్మము, మాంసము, ఎముకలు, మజ్జి, నరములు, గోళ్ళు, వెంట్రుకలు ఇత్యాది భాగములు కాన వచ్చు చున్నవి. సూక్ష్మ శరీరమున 7200 డెబ్బది రెండు వేలు నాడులు శరీరమంతటను వాయు ప్రసరణకు అనువగు నాడులు వ్వాపించి ఉన్నవి. ఇందు అంతఃకరనము లనబడు మనస్సు, బుద్ధి, అహంకారము చిత్తము అను స్థూల నేత్రమునకు కన

పడనివి ఉన్నవి. ఈ సూక్ష్మశరీరమున వున్న నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తి జిహ్వ, కుహు, సరస్వతి, అలంబుష అనునవి ముఖ్యమైనవి. ఈ నాడులన్నియు కంఠము అను స్థానమునుండి శరీర మంతటను వ్వాయించినవి. కందము నాభికిని, లింగ స్థానమునకు మధ్య పొత్తి కడుపు నందు ఉన్నది. ఈ నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అను మూడు నాడులు యోగ విధ్యలలో ఆతి ప్రాముఖ్యమైనవి. ఈ యోగ నాడుల ఉనికిని గురించి నాడీ విజ్ఞానము నందు ఈ క్రింది విధముగా చెప్పబడినది.

శ్లో|| కంఠ మద్వే స్థితానాడి ల్సుషుమ్నేతి ప్రకీర్తితాః
తిష్టంతి పరిత స్సర్వా చక్రేశ్శినాడి కాస్సతః ||

తా|| శరీరమునందలి మూలాధార చక్రమునకు మీదుగను నాభి స్థానము (మణిపూరక చక్రము) నకు మధ్యగను ఉన్న కంద స్థానమందు సుషమ్న అను నాటి యునది. ఇడ, పింగళాది నాడులు ఈ సుషమను చుట్టి యున్నవి.

సార్థత్రి కోల్యూ నాడ్యాహి సూల సూక్ష్మేశ్చ దేహినాం
నాభి కందని బద్దా స్థాస్థిర్య గూర్థ్వ మధస్థతా||

తా|| శరీరము స్థూల, సూక్ష్మములాగు 3 1/2 మూడున్నర కోట్ల నాడులు ఉన్నవి. ఆ నాడులు మూలాధారము నాశ్రయించి కొన్ని ఊర్థ్వముగాను, కొన్ని అధోముఖముగాను కొన్ని ప్రక్కలకు ప్రసరించి యున్నవి.

శ్లో|| ద్వి సప్త సహస్త్రాణీస్స ర్వాయ గోచరా
కర్మ మార్గేణ సుషిరా తిర్యంచ సుషిరాత్మికా||

తా|| పై నాడులలో (72000) డెబ్బది రెండు వేల నాడులు వాయు సంచారమునకు యోగ్యమయినవి. ఆ నాడులు వాయు మార్గమున పునరావృత్తి ప్రాపక కర్మ రూప చిద్ర విశిష్టంబి తిర్వగ్గతరంధ్ర ప్రధాన భూతంబుగా నుండును.

శ్లో|| దే హీధనున్యో ధన్యస్థా పంచేంద్రియ గుణావహా
నాభి కంద స్థితౌస్తాన్తు నాభీ చక్రే ప్రదేష్టితా||

తా|| శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధ, గ్రాహ్యకములగు పంచేంద్రియముల యందున్న నాడులు శ్రేష్ఠములు. ఆ ఐదు నాడులు మూలాధారము నాశ్రయించి నాభి చక్రమున ప్రవేశించి యున్నది.

శ్లో|| ఆపాద ప్రభృతి గాశ్రమ శేల్ష మాసా
మాంస్తకాద పేచ ల్నాభి పుర స్థితేన
ఏ తస్శృ దంగ ఇవ చర్మచక్వ్ ఏవ బద్ధం
కాయం వృణా మిహ సిరా శత సప్తకేన||

తా: మూలాధారము నాశ్రయించి పాదము మొదలు శిరః పర్యంతము వ్వాపించిన (700) ఏడు వందల నాడులు మనుష్య దేహమున మృదంగము చర్మముచే కప్పబడి నట్లు బందించు చున్నవి.

శ్లో: ఇడా పింగళా చైవ సుషుమ్నాచ సరస్వతీ
వారుణీ చైవ పూషాచ హస్తి జిహ్వ య్శ స్వినీ
విశ్వాదరి కూహూచైవ శంఖిణీచ పయస్వినీ
అలంబుషా గాంధారీ ముఖ్యాశ్చై తాశ్చ కుర్థశా:

తా: పై నాడులలో ఇడా, పింగళ, సుషుమ్న, సరస్వతి, వారుణి, పూష, హస్తి జిహ్వ, యశస్విని, విశ్వోదరి, కుహు, సంఖిని, పయస్విని, ఆలంబష, గాంధారి అనునవి 14 ముఖ్య నాడులు. ఈ పదునాలుగు నాడులను ప్రాణవాహిలులును జీర్ణ కోశమున ప్రతిష్టితములైనవి.

శ్లో: తత్ర ప్రథాన నాద్యాన్తు దశవాయు ప్రవాహికా:

తా: పదునారు నాడులలో (ఇడ మొదలు చారణి (గాంధారి) ప్రాణ వాహికలై నందున అచి ప్రధానములు.

శ్లో: ఇడా పింగళా యాశ్రైవ సుషుమ్నా చౌర్థ్వగామినీ
గాంధారీ, హస్తి జిహ్వచ ప్రసార గమ నేన్దిగా:
అలంబుషా యశ స్విన్యా దక్షిణాంగే సమంవి తా
కుహుశ్చ శంఖినీ చైవ వా మంగే చావలంబి తా
ఏతేషు, దశ నాడేషు నానా కార్య ప్రసూతికా:||

తా: ఇడా, పింగళ, సుషమ్న యను మూడు నాడులు ఊర్థ్వ గాములు. గాంధారి, హస్తి జిహ్వ చేతులు మొదలగు నవి చాచుటకు ముడుచుటకు ఉపయోగ పడును. ఆలంబుష, హస్తి జిహ్వ అను రెండు నాడులు దక్షిన భాగమున (కుడి ప్రక్క) ను, కుహూ, గాంధారి అని రెండు నాడులు వామాంగమమునను పది నాడులలో మధ్య నున్న పూషయను నాడి (ప్రసూతికా నాడి) సమస్త కార్యములు చేయు చుండును.

ఇడ యనగా చంద్ర వామ నాడి. పింగళ మనగా సూర్య నాడి యనియు అందురు. శ్వాస క్రియ జరుపు ముక్కున

నున్న ఎడమ రంధ్రమును ఇడానాడి యనియు కుడి రంధ్రమును పింగళా నాడి యనియు అందురు. మరియు కిఉడి నాడిని యమున అనియు ఎడమ నాడిని గంగ యని కూడ అందురు. ఈ ఇడా, పింగళుల మధ్య వెన్నెముక లో నున్న మజ్జ యందలి సన్నని రంధ్రమున సుషుమ్న యను నాడి యున్నది. దీనిని బ్రహ్మ నాడి యనియు సరస్వతి యని కూడ అందురు. వెన్నును బ్రహ్మ దండి అందురు. భారత దేశమున అతి పవిత్రముగా నెంచ బడు గంగా, యమునా, సరస్వతి నదులు మన దేహమున ఉన్న ఇడ (గంగ) పింగళా (యమున) సుషుమ్న (సరస్వతి) నదులకు ప్రతీకలు. సరస్వతీ నది సుషుమ్న నాడి వలెనే పైకి కనబడక అంతర్వాహిని యని చెప్పబడుచున్నది. సృష్టిలో బ్రహ్మాండము ఏ సిద్ధాంతముపై నిర్మించబడెనో అట్టి సిద్ధాంతము పైననే పిండాండము (మానవ శరీరము) కూడ నిర్మించ బడెనని బుధులు చెప్పుదురు. బ్రహ్మాండములోని చంద్ర స్థానము నుండి అమృతము వర్షిచు రీతి పిండాండము చంద్ర స్థానమైన శిరో భాగము నుండి అమృతము వర్షిచునని యోగ సిద్దాంతము. చంద్రుని నుండి కురిసిన అమృతము జీవులకు సస్యములను పోషించు రీతి శరీరము లోని చంద్ర స్థానము నుండి వచ్చిన అమృతము శరీరమున యింద్రియములను పోషించు చున్నది. అటులనే బ్రహ్మాండమున సూర్యుడు అగ్ని స్థానమై సృష్టికి ఉష్ణమును ప్రసాదించు నట్లు శరీరమున నూరవ స్థానమైన మణి పూరైక చక్రము (నాభి) నుండి జఠరాగ్నిని సృష్ఠించి ఆహారమును పచనము చేసి జీర్ణము చేయుట, రక్త ప్రసరణ, వాయు సంచారము వంటి ఉష్టము

చేయు కార్యములను నిర్వర్తించును. శరీరమున వున్న ముఖ్యమయిన సుషుమ్న నాడి మెదడు నుండు వెన్నెముక మధ్య నున్న రంధ్రములో వ్రేలాడి వెన్నెముక చివరి భాగము వరకు వచ్చి యున్నది. ఈ వెన్నెముక పూసల వంటి 33 (ముప్పది మూడు) ఎముకలు ఒక దానిపై ఒకటి అమర్చబడి మెడ నుండి చివర వరకు ఒక గొట్టము వలె తిన్నని రంధ్రముగా ఏర్పడినది. ఈ రంధ్రముననే వెను బాము ప్రేలాడు చున్నది. ఈ వెను బాము మధ్యలో సూక్ష్మ నాడి యగు బ్రహ్మ నాడి వున్నది. మెదడు నుండి స్స్థూల శరీరములకు సంబంధించిన నాడులు వెను బాములోనికి వచ్చి ఇరు ప్రక్కల నుండి శరీర భాగముల లోనికి విస్థరించి ప్రసరించు చున్నది. కంద స్థానమని చెప్పబడిన సూక్ష్మ నాటి మందల కేంద్రము నుండి సూక్ష్మ నాడులు శరీర మంతటను వ్వాపించు చున్నవి. ఈ నాడులు సుషుమ్న నాడిని ఒక్కొక్క చోట కలిసి కేంద్రములు ఏర్పర్చు చున్నది. ఈ కేంద్రములే షట్చక్రములు. ఇటులనే స్థూల దేహమున నున్న నాడులు కూడ ఒకొక్కచోట కలియు చున్నవి. స్థూల శరీరమున ఏర్పడిన నాడీ కేంద్రములను ఆంఘ్ల వైద్య పరి భషలో " ప్లెక్స్ " అని పిలువబడు చున్నవి. ఈ స్థూల నాడి కేంద్రములకు, సూక్ష్మ నాడీ కేంద్రములకు సన్నిహితమైన సంబంధము కలిగి యున్నది. సూక్ష్మ శరీరమున వున్న ఈ నాడి కేంద్రములకు, సూక్ష్మ నాడీ కేంద్రములకు సన్నిహితమైన సంబంధము కలిగి యున్నది. సూక్ష్మ శ్రీరమున వున్న ఈ నాడీ కేంద్రములను మూలాధారము, స్వాధిస్థానము, మణి పూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్త్రారములని ఏడు కేంద్రములు చక్రములని పిలువ బడు చున్నవి. సూక్ష్మ నాడీ మండలమున జరుగు సర్వ వ్వాపారములు స్థూల శరీరముఇనకు సూక్ష్మ శరీర

మునకు గల సంబంధము నీరు, ఆవిరికీ వన్న సంబంధము వంటిది. సూక్ష్మ శరీరమున వున్న ఏడు చక్రములు యోగ శాస్త్రమున అతి ప్రాముఖ్యములైనవి. అన్ని చక్రేములకు పైనున్న ఏడవ చక్రమైన సహస్త్రామున పరమేశ్వరునికి నిలయమని చెప్పబడినది. ఈ విషయము నిరూపించుటకే శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఏడు కొండలపై ప్రతిష్టించిరి. ఏడు కొండల వాడని శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తులెల్లరు కొలుచు చున్నారు. ఈ చక్రముల స్థానములు శరీరమున వున్న నెలవులను మరి కొన్ని వివరణములను తెలిసికొందము.

చక్ర వివరణ

మూలాధార చక్రము:... కంద స్థానమనునది నాభికిని లింగ స్థానమునకు మధ్యగా నున్నదని యిదివరకు చెప్పి యుంటిమి. అట్టి కంద స్థానమునకు దిగువను వెను బామునకు చివరను గుద స్థానమునకు కొంచెము పైగా నున్నది. ఇది నాల్గు దళములు గల పద్మము. వం, శం, షం, సం అను నాలుగు బీజాక్షరములు ఇందు ఉత్పన్నమయినవి. ఇది పృద్వీ (భూమి) తత్వము గలది. ఆకారమున చతురస్త్రముగా నుండును. వాసనతో కూడిన పశుపు రంగుగా నుండును. ఆ చక్రమునకు ఆధి దేవత విఘ్నేశ్వరుడు. దేవత ఢాకిని, భీజాక్షరము "లం " ఇందు బ్రహ్మ గ్రంధి అను నాటీ కేంద్రము యున్నది. దీనిని ఆంగ్ల వైద్య శాస్త్రమున శాక్రల్ ప్లెక్సన్ " అని చెప్ప బడినది.

స్వాధిష్టాన చక్రము

ఇది ఆరు దళములు గల పద్మము. ఈ ఆరు దళముల నుండి, బం, భం, మం, యం, లం అను ఆరు అక్షరములు (శబ్దములు) ఉద్భవించినవి. జల స్థానము. ఇది నెల బాలుని చందమున చల్లని వర్ణముతో నుండును. ఇది రస తత్వము గలది. ఈ చక్రమునకు ఆధి దేవత బ్రహ్మ, దేవత రాకిని. "వం అను బీజాక్షరము ఇందున కల్గినది. అలోపతి వైద్య శాస్త్రమున దీనిని ప్రోస్టేట ప్లెక్సన్ అనబడినది.

మణి పూరక చక్రము

ఇది నాభి స్థానమున కలదు. ఇది పది దళములు గల పద్మము. ఆ పది దళముల యందు డం, ఢం, ణం, తేం, థం, ధం, నం, పం, ఫం, ఇవి అగ్ని మండలము త్రికోణాకృతి గలది. ఎరుపు వర్ణము గలది. రూపము లేక దృష్టి దీని తత్వము. రం అను బీజాక్షరము యందు ఉత్పన్నయయినది. మూడు కన్నులు గల శంకరుడు ఆధి దేవత. దేవత లాకిని. అలోపతి వైద్య శాస్త్రమున ఇది "సోలారు ప్లెక్సన్ " అని పిలువబడినది.

అనాహత చక్రము
....

ఇది హృదయ పద్మమున కలదు. దీనికి పన్నెండు (12) దళములు. దీని దళముల నుండి కం, ఖం, గం., ఘం, చం, జం, ఘం, టం, ఠం, అను పన్నెండు శబ్ధములు కల్గినవి. "యం" అను బీజాక్షరము దీని నుండి ఉత్పన్నమయినది. వాయు మండల ప్రాంతము. ధూమ్ర వర్ణము కలది. ఆరు కోణము కలది. ఆధి దేవత రుద్రుడు. దేవత కాకిని. ఆనాహత శబ్దమును నాదము ఇందుండి విన

నగును. ఇందు విష్ణు గ్రంధి అనబడిన గ్రంధిన గ్రంధి ఒకటి వున్నది. వాయు తత్వము కావున స్పర్శానుభవమును తెలియ జేయును. దీనిని అలోపతి వైద్య శాస్త్రమున "కార్డియాక్ ప్లెక్సన్ అన్నారు.

విశుద్ధ చక్రము
... కంఠ మూలమున (16)_ పదునారు దళములు గల గుండ్రని పద్మము. దీని దళములనుండి అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, ఋం, ఋం, ఎం, ఐం, ఓం, ఔం, అం, అః అను శబ్దములు ఉత్పత్తి అయినవి. "హం" భీజాక్షరము, ఆకారము గుండ్రనిది. నీలి రంగు గల్గి ఆకాశ తత్వము గలది. దీని కార్యము శబ్దము. మహేశ్వరుడు దీని ఆధి దేవత. శాకిని దేవత. దీనిని అలోపతి వైద్య శాస్త్రమున ఫరింగియల్ అనియు "లంరిగియల్ ప్లెక్సన్ " అని పిలువ బడు చున్నది.

ఆజ్ఞా చక్రము: శిరసు నందలి భృఊమధ్యమున హిందువులు తిలక దారణ చేయు ప్రడేసమున (2) రెండు దళములు గల పద్మము గుండ్రముగా నున్నది. హం, క్షం, అను రెండు శబ్దములు. చక్ర దళము నుండి ఉత్పన్నమయినది. "ఓం" అనునది బీజాక్షరము, పరమ శివుడు హంస రూపమున ఇందున్నాడు. అవ్వక్తము, అహంకారము, మనస్సు అనునది ఈ చక్రము యొక్క తత్వములు. సంకల వికల్పములు దీని కార్యము. అనగా మనస్సునకు స్థానము మనసు మెలకువలో వున్నప్పుడు శరీర మంతయు ప్రసరించి యుండగా నిద్రలో ఈ చక్ర స్థానమున నిలిచి యుండునని చెప్పబడినది. హాకిని " దేవత. ఇందు రుద్ర గంధి వున్నది.

ఇది అలోపతి వైద్య శాస్త్రమున "కేవర్నన్ ప్లెక్సన్ " అని పిలువబడు చున్నది.

సహస్త్రార చక్రము

దీనిని బ్రహ్మ రంద్రమనిరి. ఇది మానవుని ప్రాణ స్థానము. పరబ్రహ్మకు నిలయము శరీరమున నవ ద్వారములున్నవి. మరియు ఇది పదియవ ద్వారముగా యోగ శాస్త్రమున గణించిరి మూలాధారాది షట్చక్రముల నుండి పయనించి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులను చేధించుకొని శక్తి స్వరూపిణి యగు కుండలిని పరబ్రహ్మస్థానమగు సహస్త్రామున చేర యోగి అనిర్వసనీయ నందమును మునిగి నిర్వికల్ప సమాధిని పొందును. ఈ చక్రమందు అనేక యోగ నాడులుండుట చే సహస్రారమని చెప్పబడినది. ఈ చక్రమును లెక్కించకయే మిగిలిన ఆరు చక్రములనే షట్చక్రములని పిలిచిరి. ఇది పీనయల్ గ్లాండ్ అను ప్రదేశమున నడి నెత్తి మీద వున్నది. నిర్గుణ బ్రహ్మను ఈ చర్కమున ధ్యానించుటకు అనుకూల మయినది.

బ్రఃహ్మనాడి యందు ఈ ఏడు చక్రములే గాక గ్రంధిత్రయమను పేర మూడు గ్రంధులున్నవి. అవి బ్రహ్మ గ్రంధి మూలాధార చక్రమునందును, విష్ణు గ్రంధి అనాహత చక్రమందును, రుద్ర గ్రంధి అజ్ఞా చక్రమునందును వున్నవి. సహజముగా సుషుమ్న నాడీ మార్గము మూసికొని వుండును. దానితో బాటు అందున వున్న ఈ మూడు గ్రంధులు కఠినముగా వుండును. కంధ స్థానమని చెప్పబడు సూక్ష్మ నాడీ మండల కేంద్రమున మహా శక్తి స్వరూపణియగు "కుండలిని " సర్పాకృతిని చుట్టలుగా చుట్టుకొని ముఖమును సుషుమ్న

ద్వారమయిన మూలాధారమున వుంచి సదా నిద్రించు చుండు నని యోగ శాస్త్రము చెప్పచున్నది. సుషుమ్న నాడి గుండ్రని పొరలు పొరలుగా వుండును. సుషమ్న యందు వజ్రనాడి యను ఒక నాడి వజ్ర నాడిలో చిత్ర నాడి యని మరొక నాడి, ఈ నాడి యందు అతి సూక్ష్మముగా లాలె పురుగు దారము కన్న సన్నని నాడి యున్నది. ఇదియే బ్రహ్మనాడి సామాన్యముగా సుషుమనే వజ్ర నాడి యనియు చిత్ర నాడి యని, బ్రహ్మనాడి యని అందురు. ఈ నాడి నుండి కుండలిని అని పిలువబడు మహా శక్తి మేల్కొని మూలాధారము నుండి దారిలో నున్న ఆ చక్రములను మధ్య ఓ వున్న మూడు గ్రంధులను చేధించుకొని సహాస్రారమున తక ప్రాణేశ్వరుడగు పరమేశ్వరుని చేరును. ఈ విషయమునే పురాణముల యందు త్రిపురాసుర సంహార మని చక్కని కథను వ్రాసిరి. ఈ మూడు పురములే బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి. సుషుమ్న నాది యందలి చిత్ర నాడి మృత్వును జయించ గల శక్తి గలది. కనుక ధ్యానమున చిత్తమును, చిత్ర నాడి యందు లయ పారచిన సకల రోగములు నివృత్తి యగుటయే గాక ఆయుర్యుద్ధి యగునని చెప్పబడినది.

ఇడ, పింగళ ను సూక్ష్మ నాడుల లునికిని తెలిసి కొందము. ఇడా నాడి ఎడమ వృషణము నందును, పింగళా నాడి కుడి వృషణము నందు ప్రారంభమై మూలాధారమున సుషుమ్నతో కలయుచు ఒక కేంద్రము నేర్పరచుచున్నది. ఈ కేంద్రమును ముక్త త్రివేణి అందురు. దీనికీ బ్రహ్మ గ్రంధి యని కూడ అందురు. మరియు ఈ మూడు నాడులు అనా

హత అజ్ఞా చక్రములందు కలియుచున్నవి, ఇడా, పింగళులు సుషుమ్నకు ఇరుప్రక్కలుగా పోయి కేంద్రములందు చక్రముల యందు కుడి ఏడమలు మారి పై చక్రము నందు మరల ఎడమ కుడి ప్రక్కలకు మారు చుండును. అటులనే గాంధారి, హస్తి, జిహ్వ, కుహు, పూష, సరస్వతి, పయస్విని, శంఖిని, వారుణి, ఆలబుష, విశ్వోధరి, యశశ్వని, మొదలుగా గల నాడులు కంద స్థానము నుండి బయలు దేరి సుషుమ్న నాడికి ప్రక్క గానే ప్రసరించుచు శరీర మంతయు విస్తరించుకొని యున్నవి.

మన శరీరమున దశ వాయువులు గలవు, వాయు సంచరమునకు అనువగు సూక్ష్మ నాడుల యందు ఈ వాయువులు వ్వాపించి యుండును. ఇవి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అను ముఖ్యమగు ఐదు వాయువులు. వీనినే పంచ ప్రాణములు అందురు. మారియు ఇవి గాక ఐదు ఉప వాయువులు గలవు. ఇవి నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ అనునవి. ప్రాణ వాయువు హృదయము నందును, అపాన వాయువు మూలాధారమునను సమాన వాయువు నాభి స్థానమునను ఉదాన వాయువు కంఠ స్థానమునను వ్యాన వాయువు స్వాధిష్టాన చక్రమును ఆధారముగా చేసికొని సర్వాంగముల యందును ప్రసరించి యుండును. వాయువు అంతయు ఒకటియే అయినప్పటికీ స్థాన భేధముల చేత వివిధ కార్యములు చేయుచు ప్రవర్తిల్లినవి. నాగ వాయువు వలన ఎక్కిళ్ళు కలుగు చున్నవి. కూర్మ వాయువు కంటి రెప్పలను మూయుటకు తెరచుటకు ఉప యోగ పడు చున్నది. కృకుర వాయువు వలన ఆకలి దప్పులు

కలుగు చున్నవి. దేవ దత్త వాయువు వలన ఆవులింతలు కలుగు చున్నవి. ధనుంజయ వాయువు వలన మారణానంతరము శరీరము విపంచీకృత మగుచున్నది. ఈ విషయము లన్నియు మన స్థూల నేత్రములకు కనబడవు. ఇవి సూక్ష్మ శరీరమునకు సంబంధించిన సూక్ష్మ కార్యములు. వీనిని తెలిసి కొనుటకు యోగచక్షువు అవసరము. మున్ను శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ సూక్ష్మ శరీరమున జరుగు కార్యములను శిష్యుడగు సిద్ధయ్యకు వివారించు చుండగా కక్కయ్య అను నతడు విని వీనిని ప్రత్యక్షముగా చూడ నెంచి రాత్రి యింటికి పోయి గాడ నిద్రావస్థలో నున్న భార్యను చూచి ఆమె శరీరమున ఈ విషయములను చూడ దలచి ఆమె గర్బ కోశమును కత్తితో గోసెను. అంత ఆమె విలవిల తన్నుకొని ప్రాణమూలను వదలెను. కాని అతనికి శ్రీవీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన విషయము లేవియు కాన రాలేదు. అంతట మహా కుపితుడై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామిని చేరి పరుష వాక్కులతో నిందించెను. జరిగిన విషయమును సవిస్తరముగా ఎరిగిన వాడై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కక్కయ్యతో అతని యింటికి వెళ్ళి రక్తపు మడుగులో విగత జీవి యైన అతని భార్యను చూచెను. నీవు తొందర బడితివి. నేను చెప్పిన జ్ఞానము సూక్ష్మ శరీరమునకు సంబంధించినది. దానిని స్థూల నేత్రములతో చూడ ప్రయత్నము చేయుటకు సాద్యపడదు. వానిని యోగ చక్షువుతో మాత్రమే చూడ వీలు పడును. అని చెప్పి తన యోగ శక్తిరో మరణించిన ఆమెను పునర్జీవిగా చేసెనని ఒక ఇతి హాసము బహుళ ప్రచారములో నున్నది.

భౌతిక శరీరమున పీవియల్, పిక్ట్యుటరి, పేంక్రియాన్, ఎడ్రినల్స్ మూత్ర పిండములు, ప్రొస్టేటు వంటి కొన్ని గ్రంధులు కలల్వు. ఈ గ్రంధులు శరీరమున ఒక విధమైన హార్మోనులనబడు ద్రవ్యములను సృష్టించు చున్నవి. ఈ రస ప్రభావము వలన మనము తినిన ఆహారము జీర్ణమయి శరీరమునకు కావలసిన పోషక పదార్థములను సృష్టి చేయుటకు శరీరమునకు హాని కలుగ జేయు పదార్థములను తొలగించుటకు పనికి వచ్చు రసములను తగు పాళ్ళలో ఉత్పత్తి చేయును. మన శరీరము నందలి అవయములు నిత్యము పని చేయుట వలన కలిగిన అరుగుదలను భర్తీ చేయుటకు ఉపకరించు చున్నవి. మాతృ గర్భము నుండి శిశువుగా బయటకు వచ్చిన తరువాత శరీరమున పెరుగుదల పోషణయు చురుకుగా సాగు చుండును. సుమారు 25 లేక 27 సంవత్సరముల వయస్సు వచ్చు వరకు ఈ గ్రంధులన్నియు పని చేసి శరీర నిర్మాణమున పరిపూర్ణత సాధించి నిండు యవ్వనముతో శరీరము లావణ్యము కల్గి తొణికిసలాడు చుండును. అటు పిమ్మట కొన్ని గ్రంధులు డస్సి పోయినట్లు చురుకు తనము తగ్గి మంద గిల్లును. శరీర పోషణకు పనికి వచ్చు రసముల అనగా హార్మోనుల ఉత్పత్తి తగ్గించును. అందు వలన అప్పటి నుండి దేహము పెరుగుట మంద గించును. ఎముకలు పెళుసు బారును. చర్మము ముడతలు పడి లావణ్యము తగ్గును. రాను రాను శరీరము రోగమును పొందును. సామాన్యముగా జనులు శరీర వ్వాయామము చేసి కండరములు ఊపిరి తిత్తులు, హృదయము మొదలగు భాగములకు పని కల్పించి రోగములను దూరము చేయుటకు ప్రయత్నించు చున్నారు.

వైద్య శాస్త్రజ్ఞలు కూడ వ్యాయామము చేయమని అందరికి సలహా చెప్పుచున్నారు. ఈ వ్యాయమము అరోగ్యము కొరకు తగు ప్రమాణములోనే చేయ వలయును. అతి సర్వత్ర వర్జియేత్ అను సూక్తిని తప్పక పాటించ వలసి యున్నది. ఉచిత మైన వ్యాయామము వలన రకత ప్రసరణ బాగుగా జరిగి శరీరమున శక్తి విడుదలకు కావలసిన దహన క్రియ ఎక్కువగా జరుగును. ఈ దహన క్రియలో శస్రీరములోని కొంత జీవ పదార్థము ఇందన క్రియలో శరీరము లోని కొంత జీవ పదార్థము ఇందనముగా వినియోగ పడును. ఈ విధముగా ఇంధన రూపమున నష్టమయిన జీవ పదార్థములను భర్తీ చేయుటకు మరింత ఆహారము కావలసియుండును. అందు వలన పోషక పదార్థములు ఎక్కువగా గ్రహింప బడిన అవయవములు ఎక్కువ బలమును పుంజు కొనును. సాధారణముగా మనము తినుచున్న పదార్థములను శరీరము పూర్తిగా వినియోగింపక కొంత భాగము పూర్తిగా జీర్ణమగును. జీర్ణము కాక మిగిలిన పొట్టు పదార్థము క్రమము తప్పక బహిష్కరించ బడును. మితమునకు మించిన వ్వాయామము వలన ఊపిరి తిత్తులలో ఎక్కువ శ్వాస ఖర్చగు చున్నది. అదనము శ్వాసలు ఎక్కువ ఖర్చు చేయుట వలన ఆయు క్షీణించును. అధికముగా పని చేసిన కండరములు కొద్ది కాలమునకే డస్సి తరుగుదల చేత శిధిలావస్థకు దగ్గర పడి ముదిమిని చేరు చుండును. అతి శ్రమకు గురియైన నాడీ మండలమున వాయు సంచారము సరిగా లేక వాయు అనగా వాత రోగములు, హృదయ రోగములు కల్గును

చుండును. మితి మీరిన వ్వాయామము వలన కీళ్ల వ్యాధులు వంటి అనర్థములు వాటిల్లును. అందు చేత వ్యాయామము మితముగానే చేయ వలయును. బలము సంపాదించుట కొరకు 200 కేజీల బరువులను ఎత్తు కోనక్కర లేదు. పాతిక మైళ్ళు పరుగు చేయుట కూడ అవసరముండదు. శరీరము ఎంత వ్యాయామమును సుఖముగా సహించ గలదో అంతకు కొంచెము ఎక్కువగా మాత్రమే చేయవలయును గాని ఎక్కువ చేయుట శరీరమునకు హాని కరము. శరీరము ఒక రాగి పాత్ర వంటిది. దానిని నిత్యము తోమినట్లు వ్యాయామము చేసి చిలుము పట్టకుండా నివారింప వలయును.

అష్టాంగ యోగ మందలి ఆసన ప్రాణాయామముల వలన ఎట్టి విపరీత ఫలములు వుండవని గ్రహించి ప్రపంచ మంటటను వైద్యులు, వైజ్ఞానికులు, సామాన్యుడు కూడ యోగాసనములకు ఎగ బ్రాకు చున్నారు. సనాతన ఋషులు కూడ ఈ ఆసనములు శరీరమును ధృడ పరచున్నియే నిర్దేశించినారు. ఉన్నత యోగ సాధన కొరకు మాత్రము కొన్ని ఆసనములల యందు సిద్ధిని సాధించ వలసి యున్నది. అనగా కొన్ని గంటల పాటు సుఖముగా ఆ ఆసనము నందుండుటను సాధింప వలసి వున్నది. మిగిలిన ఆసనములు శరీర వ్యాయామమునకు ఉపకరించును. ఆసన వ్యాయామము ఇతరములగు అన్ని వ్యాయామముల కన్నా ఉత్తమోత్తమ మయినది. ఇందు శరీరమున వున్న కండరములు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరము లేదు. చెమటలు కార్చి వ్యాయామము చేయ నవసరము

లేదు. ఎక్కువ శ్వాసను ఖర్చు చేయ పని లేదు. ఆసనముల వలన అంతరేంద్రియములగు గ్రంధులు సంధిబంధములు, స్నాయువులు, కదలిక పొందును. అందువలన గ్రంధులు క్రమ బద్దముగా త్రమ వ్యాపారమును చేయుచు హర్మోనులను రసములను ఉత్పత్తి చేసి శరీరమున రోగ వినాశ మొనర్చి పోషక కార్యమును నిర్వహించ గల్గును. కీళ్ళు పని చేసి అందుచేరిన వాయువును ప్రసరింప ఏసి బాగుగా పని చేయుటకు స్థిర పరచును. నరములను నాడులను, హృదయమును క్రమ స్థితిలో నుంచును. ఇట్టి ఘన కార్యములు చేసి ఆధునిక వైద్యుడు చేయ లేని విధముగా రోగ నిర్మూలనము చేయ గల్గు చున్నది. ఆసనములు అభ్యసించుటకు విశాలమగు స్థలము అవసరము లేదు. పనిముట్లు, సాధనములు అవసరము లేదు. స్వల్ప కాలములో తక్కువ్ శ్రమతో ఎక్కువ ఫలితములను ప్రసాదింప గల్గు శక్తిని కలిగి యున్న సాధనము ఇంతకన్ననూ మరియొ9కటి లేదనుట అతిశయోక్తి కానేరదు. ఆసనములను అభ్యసించు వారు వారి వారి నివాస స్థలముల నుండి ఎక్కడో నున్న వ్యాయామ శాలలకు పోనక్కర లేదు. బాలురు, వృద్ధులు, స్త్రీలు అను భేదము అసలే లేదు. జాతి, మత భేదములు లేనిది. యోగాసన సిక్షకుని వద్ద ల్బాగుగా ఆసనములు వేయుట తెలిసికొని తన యింటి వద్దనే అభ్యసింప వచ్చును. ఆసనములు అభ్యసించుట కూడ అతి తేలిక. ప్రతి దినము కొంత సేపు (సుమారు అరగంటకు తక్కువ కాకుండా) వినియోగించిన వైద్యుని అవసరము వుండదు. రోగులు కూడ యోగాసనములు చేయ వచ్చును.

కొందరు వ్యాయామ వేత్తలు. వ్యాపార సరళిలో ఈర్ష్యతో యోగాసనములపై దుష్ప్రచారము చేయు చుండుట కద్దు. శీర్షాసనము వలన శరీరమున వున్న రక్త మంతయు శిరస్సులోని మెదడునకు స్రవించి అచటి రక్త నాళములను త్రెంచు నని వారి కువాదము. మనము నిలబడి నపుడు శరీరములోని రక్త మంతయు పాదముల పైపడునా? ఆ మాత్రము జ్ఞానము లేని వారు ఈ రోజులలో కూడ వున్నారా? శీర్షాసనమనగా శిరస్సును స్థానముగా చేసికొని పాదములను పైకెత్తి వుంచుట. దీని వలన శిరనందు వెన్నెముక ప్రారంభములో దాని పైన వున్న పీనియల్ అను గ్రంధికి వత్తిడి జరుగును. ఆ వత్తిడి చేత బలపడి ఆ గ్రంధి శక్తి వంతముగా పని చేయును. దాని నుండి స్రవించిన రసములోని ఇతర గ్రంధులు చక్కగా పని చేయు నట్లు చేయును. అందు చేత యోగ శాస్త్రమున శీర్షాసనము ప్రశస్తమయినదిగా చెప్పబడినది. శరీరమున వున్న రక్త వాహికలు కవాటములతో కూడు యున్నవి. అందు చేత ఎంతెంత రక్తము కావలసి వుండునో అంతే రక్తమును విడుదల చేయును కాని రక్తమునంతటిని గొట్టములో పోసినట్లు విడిచి పెట్టదు. కాని ఒత్తిడిలలో మార్పు వుండును. ఊర్ద్వ పీడన అధో పీడనగను, అధోపీడన ఊర్ద్వ పీడనగను మారుట వలన దీనికి కొంచెము అలవాటు పడవలసి వుండును. క్రొత్తలొ ఊపిరి బిగించి ఈ ఆసనము చేయరాదు. ఈ విషయము గుర్తుంచుకొని శీర్షాసనము చేయుట నిరపాయకరము. ఆసనములను వారి వారి శరీరములకు, రోగములను దృష్టిలో వుంచుకొని ఎన్నుకొన వలసి యుండును. శీర్షాసనము వలనే

సర్వాంగాసనమని మారొక ఆసనము వున్నది. ఇందు సాధకుడు వెల్లికిల వీపు మీద పరుండి శిరస్సు మెడ భూమి మీద ఆనించి భుజముల నుండి పాదముల వరకు వున్న శరీరమును నిట్టలిలువుగా ఎత్తవలయును. ఇందు గడ్డము రొమ్ముపై భాగమును తాకి వుండవలయును. ఈ మాత్రమునకే సర్వాంగాసనమని ఏల పేరు పెట్టిరి. దీని పేరునకు తగినట్టి ఆసనమే యిది. ఇందు కంఠము నందలి ధయిరాయిడు గ్రంధులు, శిరస్సులో ప్రవేశించి వున్న వెన్నెముక పైభాగమున వున్న పీనియల్ గ్రంధులు మరియు దాని దిగువున వున్న పిట్ట్యుటరి గ్రంధులు చక్కగా పని చేయుట వలన ఆ గ్రంధుల నుండి స్రవించు రసములు (హర్మోనులు) శరీరము వున్న ఆ గ్రంధుల నుండి శ్రవించు రసములు (హార్మోనులు) శరీరమున వున్న యితర గ్రంధులను బాగుగా పని చేయించుట శరీర నిర్మాణము మొదలగు కార్యములు చేయించును. ఇది గాక యోగ శాస్త్ర రీత్యా శరీరమునందు చంద్ర స్థానము శిరస్సు నందున్నది. సూర్య స్థానము నాభి యందున్నది. చంద్ర స్థానము నుండి ఉత్పత్తి అయిన అమృతము క్రిదకి పడగా క్రింద నున్న అగ్నొ స్థానమైన నాభి స్థానమందు పడి భస్మీభూతము అగు చున్నది. ఈ ఆసనము వలన రెండు స్థానములు తారుమారై సూర్య స్థానము (అగ్ని స్థానము) నాభి కమలము పైకిన్నీ చంద్ర స్థానము క్రిందకిన్నీ వచ్చినవి. అపుడు ఉత్పత్తి అయిన అమృతము శరీరమున నిల్చి చిద్రమగుచున్న శరీరమును పునర్జీవన కల్గించు చున్నది. ఇంతటి

ఘనకార్యమును చేయుచు చేయించు చున్న ఆసనమునకు వారి వృత్తికి కించ గల్గునని వ్యాపార దృష్టితో వైషమ్యముతో ప్రచారము చేయుటలో ఎంతయు అర్థ రహితమైనది.

ఈ సృష్టిలో 84 లక్షల వివిధ రకములైన జీవ రాశులున్న వనియు ప్రతీ జీవికి ప్రతీకగా ఒక్కొక్క భంగిమలో 84 లక్షల ఆసనములు ఏర్పాటు చేయబడెను. ఇందు చాల రకములు ఒకదానితో ఒకటి సారూప్యత కల్గి యుండుట చేతను, అన్ని ఆసనములు ఆచరించుటకు విలువగు కాలము వ్యయమగుట వలనను క్లుప్త పరచి ఎనుబది నాలుగు ఆసనములను మాత్రమే ముఖ్యమయినవిగా చెప్పబడినది. ఇందు సిద్ధ, పద్మ, స్వస్తిక, సుఖ అను నాలుగు ఆసనములు మాత్రము ధ్యానమునకు, మిగిలిన ఆసనములు శరీరములోని అన్ని అవయవముల వ్యాపారమును క్రమపరచి ఆరోగ్యమును వృద్ధి చేసి రోగములను నిర్మూలించును.

యోగమును వ్యాయామముగా చేయుటను, ఆయోగమునే అష్టాంగ యోగ సాధనలోను ఉపకరించుటలో కొంచెము తేడా ఉన్నది. అష్టాంగ యోగము కొరకు చాల నియమములు అవసరమై యుండగా శరీర వ్యాయామము కొరకు అట్టి నియమములు పాటించ నవసరము లేదు. ఆసనములు సాధన చేయు వారు తప్పక లంగోటి ధరించ వలయునని నియమము లేదు. కౌపీనమును గానీ, చెడ్డీ (డ్రాయరు) ను గాని ధరించ వచ్చును. ప్రారంభమున అనుభవజ్ఞలైన శిక్షకుల వద్ద ఆసనములు నేర్చుకొనవలయును. ఆసనములను

గురించిన అవసరమగు సామాన్య జ్ఞానముండిన గానీ పుస్తకములను చూచి అభ్యసించుట అంత మంచిది కాదు. ప్రతి ఆసనమందును కనీసము ఒక నిముషము ఉండవలయును. ప్రధమమున స్వేచ్చగా శ్వాసను ఉచ్చానిస్వాసనలు చేయు వచ్చును. కొంచెము అలవాటు పడిన పిదప శ్వాసను బంధించి (కుంభించి) ఆసనములు చేయుట చాల మంచిది. కుంభించి చేయుట వలన రక్త ప్రసరణ చురుకుగా జరుగును. గ్రంధులు పని చేసి పర్మోనులనబడు పోషక రసములు ఉత్పత్తి చేసి శరీరమును మంచి స్థితిలో ఉంచును. కండరములందు ఎక్కువ రక్త ప్రసరణ జరిగినందున కండరములు పుంజుకొని బలకరముగా తయారగును. కీళ్ళ యందలి వాయువులు ప్రసరించి వాత రోగములు నివారణయగును. వ్యాయామము లేని ఎడల శరీరమందు పని లేని భాగముల యందు క్రొవ్వు పేరుకొని నెమ్మదిగా హృదయ కలము చుట్టును వ్యాపించును. ఇట్టి స్థితి వలన దేహమునకు ముప్పు వాటిల్లును. ఈ వ్యాయామము వలన క్రొవ్వు చేరక శరీర మంతటను సర్దుకొని రక్తములో కలసి శక్తి విడుదలకు ఇందనముగా మారును. జఠరాగ్ని వృద్ధి చెంది మనము చినిన ఆహారము బాగుగా సీర్ఫ్నంఅయి రక్తములో కలియుటకునూ, మలమూత్రములను దేహమున నిలువ చేయక విసర్జన చేయుటకున్నూ దోహదము చేయును. ఆసనములను కేవలౌ నేల మీద చేయుటకన్నా దళసరి గుడ్డను గాని, గొంగళిని గాని లేదా చాపను గాని పరచి దానిపై చేయుట మంచిది.

అష్టాంగ యోగము సాధన చేయు వారు నియమములను పాటించి సాధన చేయ వలయును. భగవద్గీత యందు ఈ విధముగా చెప్పబడినది.

శ్లో: శుచే దేశే ప్రతిష్టాప్మ స్థిరమానస యత్మానః
నాత్యుచ్చ్రితం నాతి నీచం చేలా జిన కుశోత్తరం: భ.గీ. అ.అ.. శ్లోకము

తా: పవిత్రమైన స్థలమందు మిట్ట పల్లములు లేకుండా చూచి అందు దర్భ గట్టితో చేసిన చాపను దానిపై జింక చర్మమును దానిపై గుడ్డను పరచి యోగస్థాన చేయవలయును.

ఈ విషయమునే శ్వాతాశ్వతరోపఇషత్తు అందు ఇట్లు చెప్పబడెను.

సమే, శుచౌ శర్కరా వహ్ని తాలుకా
వివర్జతే శబ్ధ జలాశ్రయాధి భి
మనోఽ నుకూలేనతు చక్షు పీడనే
మాహా నివాతా స్రయణే ప్రయోజయేతే: ..... శ్వాతాస్వతరోపనిషత్తు: 2..20

తా: సమతలముగా ఉండు పతిత్ర స్థలమున రాళ్ళు రప్పలు లేనిదియు దగ్గరలో నిప్పుగాని, జలాశ్రయములు గాని, శభ్ధ కాలుష్యము పొందనట్టియు ఎక్కువ గాలి వీచ నట్టి స్థలమును ఎన్నుకొనవలయును.

యోగాభ్యాస సాధన చేయువారు మత్తు పదార్థములను సేవించ రాదు. ప్రాతః కాలమునను సాయంకాలమునను ఆసనములు అభ్యసించుటకు అనుకూలము. గాలిలో తేమె తక్కువగా ఉన్నప్పుడు ఆరుబయట కూడ ఆసనములు వేయ వచ్చును. ఆసనములు వేయుటకు ముందు కడుపు నిండుగా ఉండరాదు. కాని ఆకలితో ఉండ రాదు. వేసవి యందు రెండు మూడు గ్రుక్కలు నీరు త్రాగి ప్రారంభించ వలయును. ఆసనములు వేయు చున్నంత సేపు మనస్సును ఆసనములపై లగ్నము చేసి వాట వలన కల్గు ఉపయోగములను దృష్టిలో ఉంచుకొని మననము చేయ వలయును. పురుషులు శరీరముపై కౌపీనము, లంగోటి, డ్రాయరు వంటి చిన్న వస్త్రములను ధారింప వలయును. స్త్రీలు మాత్రము దేశ కాలములకు అనుకూలముగా, సభ్యతకు భంగము లేని విధముగా వీలయినంత తక్కువ వస్త్రములను ధరించ వలయును. ఆసనములను వేయు నప్పుడు చమటను గుడ్డతో తుడిచి వేయక చేతితో చర్మముపై రుద్ద వలయును. చమటలో శరీరమందు ఉత్పత్తి అయినట్టే బాహ్య వాతావరణములో ఉన్న ఉష్ణమును సరిపెట్టుట మాత్రమే కాక బయట చర్మము పై ఆశ్రయించు సూక్ష్మ జీవులను నాశనము చేయునట్టి పదార్థమును కూడ తయారు చేయును. మరియు చర్మ సౌందర్యమును పోషించ గల్గు పదార్థమును కూడ అందు ఉండును.