యెంకి పాటలు/కో, కో కో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కో, కో కో

కొండతిరిగీ
కోనతిరిగీ
చీరచెరుగున
కూరిచితిరా
గరికపూలా కంకమాలా!

  • * *


ఆవునడిగీ
అడివినడిచీ
పూలగిన్నెలు
పొందుపరచితి
గుమ్మపాలు కొమ్మతేనె !

  • * *


చాయవెన్నెలా
లోయబయలా
పచ్చికమత్తల
పానుపుపైన
'కోకో' యందు 'కో' యనరా

   *

62 యెంకి పాటలు