యెంకి పాటలు/కుచ్చితాలు
Appearance
కుచ్చితాలు
ఎంకి పులకల కలలు
కెడమీయగోరి
అడగడుగు నిలిచేను
ఆలసించేను
* * *
పెదవి సివురాకులను
కదిలింపగోరి
అడిగిందె అడిగేను
ఆలకించేను
* * *
ఎంకి కళ్ళను జారు
జంకు కనగోరి
పయనాలు నటియించి
బయలు దేరేను
*