యెంకి పాటలు/యెంకి రాణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యెంకి రాణి

పూలబూరను వేడి
గాలితో నింపి
తేనెగొంతునవింటి
తీరైన పాట

  • * *


గాలిలో యెగరేసి
సీలచుక్కలను
రమ్మంటి చేతిలో
రాలె రతనాలు

  • * *

పూలతోయెంకినే
పూజింపబోతి
యెంకి నిలువన మెరిసె
యెవ్వరో రాణి