యెంకి పాటలు/సాము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సాము

కత్తి విూదే సాము, కొత్తి విూదే కూడు
సత్తువెరిగిన వారె విస్తుపోయేరు!
ఎన్నడూ నా నోటి
సున్నితము పొనీదు_
కటువైన పలుకంటె
కలివెలవుతాది!
కత్తి విూదే సాము, కొత్తిమీదే కూడు
సత్తువెరిగిన వారె విస్తుపోయేరు!
సూపతో మాటాడి
వూపిరితొ తెనిగించు;
కనుబొమ్మతో నవ్వి
మనసు కరిగించు!
కత్తి విూదే సాము, కొత్తిమిదే కూడు
సత్తువెరిగిన వారె విస్తుపోయేరు!
మనయెంకె యని, కాని
సనువులకు పోరాదు_
తొలిగినా కలిగినా
దూర దూరానే!
కత్తి విూదే సాము, కొత్తిమిదే కూడు
సత్తువెరిగిన వారె విస్తుపోయేరు!