యెంకి పాటలు/వెలుగు నీడలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వెలుగు నీడలు

కోటి గొంతులు కలిసి
పాట పాడేతీరు
వెలుగునీడల నడుమ
నిలిచి ఆలింత

ఏటి మిలమిల లోన
తోట నవనవలోన
వెలుగు నీడల పొత్తు
తెలిసి పాలింతు

'ఎంకెవ్వ'రని లోక
మెపుడైన కదిపితే
వెలుగు నీడలవైపు
వేలు సూపింతు!
*