యెంకి పాటలు/వనదేవి
Appearance
వనదేవి
మన కేల యెడబాటు
లనచు నా యెంకి
వనదేవి కనబోయి
వరమందెరేయి
... ... ... ..
విడిచింది నన్నింట
నడిచింది ఆడినంత,
అడుగడుగు కనులె త్తి
ఆకసపు తల మొు త్తి. . . మనకేల. . . . .
... ... ...
తొలినాటిమా కతలు
తలపోతలో యేమొు,
పళ్ళెరములో పళ్ళు
తుళ్ళింత వడెనంట మన కెల. . . . . .
70 యెంకిపాటలు
అచటచట మూ నటన
ఆనాలు కాబోలు
కంహారపు వేయి
కళ్లు సుడిపడెనంట మనకేల........
... ... ...
ఆ లోయ లా యేరు
లా లోకమే వేరు
సిగనగను మిన్నంత
దిగి దిగులువదెనంటు మనకేల........
... ... ...
వనదేవితో గుడిని
మని వాయెనే లేదో---
యింతలో యింటిలో
యెటుచూసినా యెంకె ! మనకేల........
మెoకి పాటలు 71