యెంకి పాటలు/యెఱ్ఱి నాయెంకి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యెఱ్ఱి నాయెంకి

'యెనక జల్మములోన
యెవరమో' నంటి!
సిగ్గొచ్చి నవ్వింది
సిలక__నా యెంకి!
'ముందు మనకే జల్మ
ముందోలే యంటి!
తెల్ల తెలబోయింది
పిల్ల__నా యెంకి!
'యెన్నాళ్ళొ మనకోలె
యీ సుకము' లంటి!
కంట నీ రెట్టింది
జంట__నా యెంకి!