యెంకి పాటలు/ముద్దుల నా యెంకి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ముద్దుల నా యెంకి

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండ నీదురా కూసింతసేపు!
...................................
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,
యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
.......................................
కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది
దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
..............................................
యీడుండమంటాది యిలుదూరిపోతాది,
యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
.......................................
మందో మాకో యెట్టి మరిగించినాదీ
వల్లకుందామంటె పాణమాగదురా!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
.......................................