యెంకి పాటలు/ముత్యాలపేరు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ముత్యాలపేరు

అద్దములొ, నారాజ,
అంతనీరూపు!
ఇంత ముత్తెములోన
యిరికె నేలాగు?
ఇన్ని పొంకాలున్న యెంకివే నీవు!
ఇంత నాగుండెలో యిమిడిపోలేదా!
వోసూపె, వోరూపె,
వోనవ్వెరాజా
యిన్నింటి వోపాలె
యెటు సెదిరినాదో?
మాటలో, మనసులో, మంచిలో - యెంకి
సొగసు నీ వోసారె అగపడవ నాకూ?
అటు తిరగ విటుమసల
వామరమ మేటో!
ఆణిముత్తెములోన
ఆడిపోతావే?
కునుకల్లె, సినుకల్లె, కూకుండె యెంకీ!
కనబడకె మనసులో గంతు లేయవటే?