యెంకి పాటలు/గోవుమాలచ్చిమి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గోవుమాలచ్చిమి

గోవుమాలచ్చిమికి కోటి దణ్ణాలు,
మనిసికైనా లేని మంచి పోకిళ్లు!
యెంకితో కూకుండి
యింత సెపుతుంటే,
తనతోటి మనివల్లె
తల తిప్పుతాదీ!
గోవు మాలచ్చిమికి కోటి దణ్ణాలు......
యెంకి సరసాలాడ
జంకుతావుంటే,
సూసిసూడక కన్ను
మూసి తెరిసేదీ!
గోవు మాలచ్చిమికి కోటి దణ్ణాలు......
కోరి కూకుని నేనె
పోరు పెడుతుంటే,
తల్లిడిపు పిల్లల్లె
తెల్లపోతాదీ!
గోవు మాలచ్చిమికి కోటి దణ్ణాలు......