యెంకి పాటలు/పూలసేవ
స్వరూపం
పూలసేవ
పోనులే నేనింక పూల చాయలకు
పూల సేవయె ప్రోవలిడె మాకు మాకు
పోనులే......
గోపూజ పూలు నే
కోయగా తడవాయె_
పువుపువు నడుమ నేనె
కవులకెర నవుదునట!
పోనులే......
తనుదలచి పూలె నా
తలనుంచ తప్పాయె_
తనకంటె పూలె నా
తల నేలు శ్రీలంట!
పోనులే......
యీమేని పూతావె
యెడము మా కిడనాయె_
తావితెర వనలక్ష్మి
దాచుకొన్నానంట
పోనులే......
మనును తెలియనివేళ
మంచియే చెడుగాయె!
యీ పూసరులసిరులు
యెంకి కవసరమటే?
పోనులే......