Jump to content

యెంకి పాటలు/ఎంకి కల

వికీసోర్స్ నుండి

ఎంకి కల

నిన్న నా కలలోన విన్నావు కాదా
వున్నదున్నటు తెలుపు ఒట్టు నామీద!
బంగారపరెక్కల
పక్షిమనుషులు నన్ను
పైనుంచికని దిగుచు
ప్రశ్నచేసిరి నిన్ను
నిన్న......
వెలుగు చిలికెడు నోట
వింత గొలిపెడు మాట
పాడియాడిన మురువు
పదపదము చిత్తరువు
నిన్న......
ఏళ్ళ కొండలగుళ్ళ
నెగిరి పై గని యనిరి_
'ఎంకీదెదొ ఎదోలోక
మెపుడు ఎమొ ఎమోగాక'
నిన్న......
కల నాదేకద యన్న
గర్వాన విననపుడు
కల దూరమెగుర రె
క్కల నీవు నీవిపుడు
నిన్న......