యెంకి పాటలు/నీటి చిత్రాలు
స్వరూపం
నీటి చిత్రాలు
కొంటెపటముల విూల గొనిరాసె నేడు
కోనేట కిరణాలకుంచె రేరేడు॥
పరువమగు జతమీలు
పరుగులిడు రతనాలు
ఎదురు సన్నాహాలు
బెదురు బెదురు సుఖాలు
కొంటె......
సరికిసరి బేరాలు
అరకంట సరసాలు
ఆలలగని బింబాలు
పలటీలు, పాశాలు
కొంటె......
నిలువబో కలువ సం
కెలల దగిలిన కాళ్ళు
పూల పయనాలు
కళలు వెలసినవిూలు
కొంటె......
ఎంకి కిడి బహుమతులు
యీ నీటి చిత్రాలు__
అలిసి మునిగెడు విూలు
ఆకాశమున దేలు!
కొంటె......
బొమ్మ వైఖరి కులికి
కొమ్మమాటిడి కంటి!
కొంటె......