యెంకి పాటలు/కను బొమ్మ
Jump to navigation
Jump to search
కనుబొమ్మ
నన్ను తలుసుకు యెంకి కన్ను మూయాలి!
కనుబొమ్మ సూడాలి!
కరిగి పోవాలి!
నన్ను కలలో సూసి నవ్వుకోవాలి!
కనుబొమ్మ సూడాలి!
కరువు దీరాలి!
నిదరలో సిగపూలు సదురుకోవాలి!
కనుబొమ్మ సూడాలి!
కమ్మగుండాలి!
పిలుపేదొ యినగానె తెలివిరావాలి!
కనుబొమ్మ సూడాలి!
కతలు తెలియాలి!